అగ్ని పర్వతములు



→ అగ్నిపర్వత ప్రక్రియవల్ల ఏర్పడే అగ్ని పర్వత నిర్మాణంలో '3' ప్రధాన భాగాలు గుర్తించవచ్చు.

1. మాగ్మా చాంబర్ :- భూ అంతర్భాగంలో శిలాద్రవం నిల్వ ఉండే భాగము .

2. VENT: శిలాద్రవం భూ ఉపరితలాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే పైపు లాంటి మార్గము .

3. జ్వాలా బిలలు : అగ్ని పర్వత శిఖర భాగంలోని గరాటు ఆకారంలోగల గుంతలు

→ అగ్నిపర్వత ప్రక్రియ సంభవించినపుడు జ్వాలాబిల ప్రాంతం పేలిపోవడం వలన ఆ ప్రాంతంలో లోతైన విశాలమైన గుంతలు ఏర్పడతాయి.

→ కాలక్రమంలో ఈ గుంతలలో వర్షపు నీరు వచ్చి చేరుటవలన అవి సరస్సులుగా మారతాయి. వీటినే "జ్వాలాబిల సరస్సులు (or) Caldera సరస్సులు అంటారు. లేదా వీటినే CRATER సరస్సులు" అని పిలుస్తారు.

→ భారత్లో జ్వాలాబిల సరస్సుకు ఉదా : లూనార్ సరస్సు (మహారాష్ట్ర)

→ ప్రపంచంలో అతిపెద్ద జ్వాలాబిల సరస్సు : Lake Tobe (ఇండోనేషియా)

→ అగ్నిపర్వత విస్ఫోటనా విరామ కాలాన్ని ఆధారంగా చేసుకొని అవి '3' రకాలు :
i. క్రియాశీలక అగ్నిపర్వతాలు (Active) : చారిత్రక యుగంలో తరచూ విస్ఫోటనం చెందే అగ్ని పర్వతాలు.

→ మధ్య అండమాన్ సముదాయం లోని బారన్ దీవి
→ ఇండోనేషియా - క్రాకటోవా
→ ఇటలీ - వెసూవియస్
→ మధ్యదరా సముద్రం (సిసిలీ దీవి)ల్ని ఎట్నా & స్ట్రంబోలీ
→ హవాయి దీవులు - మౌనలీవా ( అగ్ని పర్వతాల్లో అతి పెద్దది )
→ అలస్కా - కటమాయి
→ వెస్టిండీస్ - పిలి

ii. నిద్రాణ/సుప్తావస్థ అగ్ని పర్వతాలు (Dormant) :
→ "ఒకప్పుడు విస్ఫోటనం చెంది తరువాత చాలాకాలం వరకూ అందులో విస్ఫోటనాలు సంభవించక భవిష్యత్లో విస్ఫోటనం చెందే అవకాశం ఉన్న అగ్ని పర్వతాలు
→ జపాన్ - ఫ్యూజియామా
→ టాంజానియా- కిలిమంజారో [ఆఫ్రికాల ఎత్తైన శిఖరం)

iii. గతించిన/వీలుప్త అగ్నిపర్వతాలు (Ded/Extint) :
→ "చారిత్రక యుగంలో ఎటువంటి విస్ఫోటనాలు చెందని అగ్నిపర్వతాలు
→ Ex: ఉ. అండమాన్ సముదాయంలోని 'నార్కండాను'
→ హవాయి దీవులలోని 'హేల్యాకీలా'

అగ్ని పర్వత ప్రక్రియతో ముడిపడివున్న భూస్వరూపాలు :-
వేడినీటి బుగ్గలు :-
→ అంతర్ భూజలం మాగ్మాతో కలిసినపుడు వేడెక్కి భూపటలంలోని పగుళ్లు, సందులు గుండా బుగ్గల రూపంలో భూమిపైకి విరజిమ్మబడినట్లైతే వాటిని 'వేడినీటి బుగ్గలు' అంటారు.

→ ఈ వేడినీటిలో ఉష్ణోగ్రత దాదాపు 600°C వరకు ఉంటుంది.

→ ఈ వేడినుపయోగించి, మణికరణ్ ప్రాంతం (హి. ప్రదేశ్), పుగాలోయ ప్రాంతం (లడక్ ) లలో రెండు భూతాపిత (వేడి) శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గీజర్స్/ఉష్ణద్రవ నిర్బరాలు :-
→ "నిర్ధిష్ట కాలవ్యవధిలో వేడినీటిని, నీటి ఆవిరిని వెదజల్లే వేడినీటి బుగ్గలు "

→ ప్రపంచంలో కెల్లా ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద గీజర్ :

Old faithful Geyser - Yellow Stone National Park (USA)

3. హ్యూమరల్స్ :
→ నిరంతరమూ వేడినీటినీ, నీటి ఆవిరినే వెదజల్లే వేడినీటి బుగ్గలు '
→ వీటినుంచి వెలువడే నీటిలో సల్ఫర్ సంబంధిత పదార్థాలు ఎక్కువగా ఉన్నందున చిన్న చిన్న వ్యాధులు, గాయాలు ఈ నీటిని తీసుకోవడం వలన నయమవుతాయి .

అగ్నిపర్వతాల విస్తరణ:
ప్రపంచంలో అగ్ని పర్వతాలు & భూకంపాల విస్తరణ :
→ ప్రపంచంలోని అగ్ని పర్వత & భూకంప ప్రాంతాలను 3 ప్రధాన మేఖలులుగా విభజించవచ్చ
పసిఫిక్ సముద్ర పరివేష్ఠిత మేఖల :-
→ ఇది పసిఫిక్ తీరం వెంబడి అభిసరణ & అపసరణ పలక సరిహద్దుల వెంబడి విస్తరించి ఉంది.

→ ప్రపంచంలోని దాదాపు 80% అగ్ని పర్వతాలు, 64% భూకంపాలు ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి.

→ అందుకే "Ring of fire అంటారు.

ఈ ప్రాంతంలో ముఖ్య అగ్నిపర్వతాలు :-
→ అలస్కా- కటమాయి
→ ఈక్వెడార్ కాటోపాక్సీ & చింబరాజీ
→ అర్జెంటీనా - అకాంగ్వా[అగ్నిపర్వతాల్లో అత్యంత ఎత్తయినది]
→ హవాయి దీవులు-మౌనలవా
→ జపాన్- ప్యూజియామా
→ ఇండోనేషియా - తాకటోవా
ట్రాన్స్-అట్లాంటిక్ ఏషియాటిక్ మేఖల
→ ఇది మీడ్ అట్లాంటిక్ రిట్జ్ నుండి ప్రారంభమై ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, టర్కీ, పాలస్తీనా, ఇజ్రాయిల్, జోర్డాన్, సిరియా, ఇరాన్, ఇరాక్, ఆసిన్, పాకిస్థాన్ల గుండా భారతలని హిమాలయ ప్రాంతం వెంబడి అండమాన్ దీవుల వరకు విస్తరించి ఉంది.
→ ఈ ప్రాంతంలో ప్రపంచంలోని దాదాపు 15% అగ్నిపర్వతాలు, 22% భూకంప కేంద్రాలు ఉన్నాయి.
→ ఇక్కడ ముఖ్యమైన అగ్ని పర్వతాలు :
భారత్ - బారన్ & నార్కొండం.
ఇటలీ - వెసూవియస్

ఆఫ్రికా పగులు లోయ ప్రాంతం : - → ఈ ప్రాతంలో మగిలిన అగ్ని పర్వతాలు & భూకంప కేంద్రాలు ఉన్నాయి.
→ ఈ ప్రాంతంలోని ముఖ్యమైన అగ్నిపర్వతం :
టాంజానియా - కిలిమంజారో
కెన్యా- మౌంట్ కెన్యా