భూకంపాలు



→ ఇది ఒక అంతర్ జనిత ప్రక్రియ. అభిసరణ పలక సరిహద్దుల వద్ద ఇవి ఏర్పడతాయి.

→ భూకంపము అనగా భూ అంతర్భాగంలో జనించే ఆకస్మిక చలనాల వలన విడుదలయ్యే శక్తి కంపన తరంగాల రూపంలో భూ ఉపరితలాన్ని చేరే క్రమంలో భూమి ఒక నిమిషం కంటే తక్కువ కాలం కంపిస్తుంది. దీనిని 'భూకంపం' అని పిలుస్తారు.

→ భూకంప నిర్మాణంలో 2 భాగాలు :
భూకంప నాభి :
→ భూ అంతర్భాగంలో భూకంపాలు జనించే ప్రాంతం.

భూకంప అభికేంద్రం :-
→ భూకంపనాభికి క్షితిజ లంబంగా భూ ఉపరితలంపై గల ప్రాంతం,
→ భూకంపాలు సంభవించునపుడు ధన, ప్రాణ నష్టాలు ఈ ప్రాంతంలో అధికం. కారణం భూకంప నాభి లోతు ఇక్కడ తక్కువగా ఉంటుంది.
→ భూకంపాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం : "సిస్మాలజీ



భూకంపాలు సంభవించుటకు కారణాలు:-
1. గనుల పైకప్పులు కూలిపోవడం
2. పెద్ద నీటి పారుదల & జల విద్యుత్కేంద్రాల నిర్మాణాలను చేపట్టడం;
3. భూ అంతర్భాగంలో రేడియోధార్మిక మూలకాలు విష్ణ్ఫుటనం చెందుట;
4. భూపాతాలు & హిమపాతాలు సంభవించుట
5. ద్విరూపాకారక బలాలు (Tectonic forces)

→ పై కారణాలలో విరూపాకారక బలాల వల్ల అతితీవ్ర భూకంపాలు ఆ ఏర్పడతాయి.
→ వీటివల్ల ఏర్పడే భూకంపాల లోతుల ఆధారంగా భూకంపాలు '3' రకాలు

1. గాథ భూకంపాలు :-
→ భూ ఉపరితలం నుంచి 60 km లోతులో ఏర్పడే భూకంపాలు.

2. మాధ్యమిక భూకంపాలు :-
→ భూ అంతర్భాగంలో 60 km నుంచి 300 Km లోతువరకు ఏర్పడేవి.

3. అగాధ భూకంపాలు :-
→ భూ అంతర్భాగంలో 300 KM అంతకన్నా ఎక్కువ లోతులో ఏర్పడేవి.

→ పైన తెలిపిన వాటిలో గాథ భూకంపాలు అత్యంత ప్రమాదం. కారణం ఇందులో భూకంప నాభిలోతు తక్కువగా ఉండటం.

→ భూకంప నాభి నుండి విడుదలయ్యే శక్తి కంపనాతరంగాల రూపంలో భూ ఉపరితలంపైపు కదులుతుంది. వీటినే " భూకంప తరంగాలు" అంటారు.

→ భూకంప తరంగాల తీవ్రత, వేగము 2 అవి పయనించే దిశ ఆధారంగా అవి మూడు రకాలు :

P- ప్రాథమిక తరంగాలు

→ భూకంప తరంగాలన్నిటిలో అత్యంత వేగంగా కదిలే తరంగాలు.
→ భూ ఉపరితలాన్ని ముందుగా చేరే తరంగాలు.
→ ఇది ఘన, ద్రవ, వాయు స్థితిలోని పదార్థాల గుండా పయనించగలవు..
→ ధ్వని తరంగాలను పోలివున్నందున వీటిని 'అనుదైర్ఘ్య తరంగాలు' అంటారు.

S-ద్వితీయ తరంగాలు

→ ఘన పదార్థాల గుండా మాత్రమే పయభిస్తాయి.
→ తరంగం పయనించే దిశకు లంబకోణంలో స్పందిస్తూ కాంతి తరంగాలను పోలివున్నందున వీటిని 'తిర్యక్ తరంగాలు' అని పిలుస్తారు.

L-ఉపరితల/రాతి/ లోవ్ తరంగాలు

→ P&S-తరంగాలు భూ ఉపరితలాన్ని చేరిన తరువాత దీర్ఘతరంగాలు(L)గా రూపాంతరం చెంది భూకంప అభికేంద్ర ప్రాంతాన్ని తీవ్రంగా కంపింపజేస్తాయి. అందువలన L తరంగాలు భూకంప తరంగాలన్నింటికెల్లా ప్రమాదకరమైనవి.

→ భూ అంతర్భాగంలో P&s-తరంగాలు పయనించని ప్రాంతం " భూకంప ఛాయామండలం ఈ ప్రాంతంలోని ఆస్ట్రేలియా, భారత ద్వీపకల్ప పీఠభూమి ప్రాతం భూకంపాల పరం అత్యంత స్థిరమైనవి.

→ భూ అంతర్భాగంలో P&S తరంగాలు జనించే ప్రాంతాన్ని" భూకంపనాభి అంటారు.

→ భూకంపాలు సంభవించినపుడు విడుదలయ్యే శక్తిని కొలిచేందుకు ఉపయోగించే పరికరం : సిస్మోగ్రాఫ్

→ సిస్మోగ్రాఫ్ నమోదు చేసే రేఖాచిత్రాన్ని " సిస్మోగ్రాం" అని పిలుస్తారు.

భూకంప తీవ్రతను కొలిచేందుకు పయోగించే పరికరాలు :-
1. మెర్కల్ స్కేలు
2. రోసిఫారల్ స్కేలు
3. రిక్టర్ స్కేలు
→ ఒక భూకంప తీవ్రుతగల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఐసోసిస్మల్ లైన్స్ " అని పిలుస్తారు.

సునామీ (TSUNAMI)

→ సముద్రాంతర్గత భూకంపాల వలన తీరప్రాంతాలను చేరే ఎక్కువ ఎత్తయిన సముద్ర అలలనే "సునామీలు" అని పిలుస్తారు.