శిలలు



→ భూపటలంలోని ఘనపదార్థ సముదాయాన్నంతటినీ 'శిల' అని పిలుస్తారు. శిలలు అనేవి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాలచే ఏర్పడిన సమ్మేళనాలు. ఖనిజాలు అనగా భూపటలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ రసాయనిక మూలకాలచే ఏర్పడిన సమ్మేళనాలు
→ శిలలను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం - పెట్రాలజీ"
→ శిలలు అనేవి గ్రానైట్ వలె కఠినంగాను, శుద్ధవలె మెత్తగా ఉండవచ్చు.
→ అదేవిధంగా గ్రానైట్ వలె అచ్ఛిద్రం ( నీటిని తనగుండా పోనివ్వని) గాను, శుద్దవలె సచ్ఛిద్రంగాను ఉండవచ్చు.
→ శిలల ఉద్భవ విధానాన్ని అనుసరించి వాటిని '3' ప్రధాన రకాలుగా విభజించడమైనది.
అవి:
1. అగ్ని శిలలు
2. అవక్షేపశిలలు
3. రూపాంతర శిల


అగ్ని శిలలు

→ అగ్నిపర్వత ప్రక్రియ వల్ల భూమిపై ప్రథమంగా ఏర్పడిన శిలలు అయినందున అ వీటిని "ప్రథను శిలలు" అని కూడా పిలుస్తారు.
→ అగ్నిపర్వత ప్రక్రియ అనగా భూ అంతర్భాగంలోని శిలాద్రవం భూపటలంలోని వగుళ్ళు, సందుల గుండా భూ ఉపరితలాన్ని చేరి చల్లారి ఘనీభవించే ప్రక్రియ.
→ మాగ్మా -"భూ అంతర్భాగంలో వాయువులచే ఏర్పడివున్న శిలాద్రవం
→ లావా - "భూ ఉపరితలంపై వాయువులను పోగొట్టుకున్న శిలాద్రవం”
→ లావాలోని సిలికా శాతాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని '2' రకాలుగా విభజించవచ్చు.
→ ఆమ్లలావా - లావాలి సిలికా ఎక్కువగా అనగా 80% వరకూ ఉంటే అది ఆమ్లలావా . ఇది చిక్కగా, జిగటగా ఉంటుంది.
→ అగ్ని పర్వత ప్రక్రియలో ఇది భూ ఉపరితలంపైకి విడుదలైనట్లయితే ఈ శంఖు ఆకారంలోగల ఎత్తయిన పర్వతాన్ని శిలా నిర్మాణాలు ఏర్పడతాయి.

క్షార లావా:-
→ లావాలో సిలికా తక్కువగా అనగా 40% వరకూ ఉంటే అది " క్షారలావా." - ఇది పలుచగా ఉంటుంది.
→ అగ్ని పర్వత ప్రక్రియలో భూ ఉపరితలంపైకి విడుదలయినప్పుడు విశాల ప్రాంతాలలో వ్యాపించి ఘనీభవించుట వలన పీఠభూములు లేదా మైదానాలను పోలినటువంటి భూస్వరూపాలు ఏర్పడతాయి.
→ అగ్నిశిలలు ఏర్పడే ప్రాతాన్ననుసరించి వాటిని '2' రకాలుగా వర్గీకరించవచ్చు.

a) ఉద్గమ అగ్నిశిలలు : -
→ శిలాద్రవం భూ ఉపరితలంపై చల్లారి ఘనీభవించినపుడు ఏర్పడే శిలలు.
Ex: బసాల్ట్, అండిసైట్, రియలైట్, అబ్సీడియన్

b) అంతర్గము అగ్నిశిలలు :-
→ శిలాద్రవం భూ ఉపరితలానికి కొంచెం దిగువభాగంలోని రాతిపొరల మధ్య ఘనీభవించుట వలన ఏర్పడే శిలలు.
Ex: గ్రానైట్, గాబ్రో

అగ్నిశిలలు లక్షణాలు - ఉపయోగాలు :-
→ కఠినమైనవి, స్ఫటికాకృతిలో ఉంటాయి.
→ అచ్ఛిద్రమైన శిలలు.
→ నిర్మాణావసరాలకు & రోడ్డు, రైల్వే లైన్లను ఏర్పాటు చేయడంతో గ్రావెల్ రూపంలో ఉపయోగిస్తారు.
→ విగ్రహాల తయారీలో వినియోగిస్తారు.



అవక్షేప శిలలు :-
→ ఇవి ప్రథమ శిలల నుంచి ఏర్పడినందున వీటిని " అనంతర శిలలు" అని పిలుస్తారు.
→ పొరల రూపంలో ఉన్నందున " స్తంత శిలలు" అనీ పిలుస్తారు.
→ ఇవి మెత్తటి శిలలు, సచ్ఛిద్రమైన శిలలు, శిలాజాలు ఏర్పడటానికి అనువైనవి. వీటిపై నీటి కెరటాల గుర్తులు ఉంటాయి.
Ex: సున్నపురాయి, ఇసుకరాయి, గ్రిట్, కౌంగ్లే మెరేట్ (చిన్న చిన్న గులకరాళ్లు ఒకదానికొకటి )
షేల్, సిల్ట్, సోడియం క్లోరైడ్ (Nacl-సాధారణ ఉప్పు], ఏర్పడే పెద్ద పెద్ద గులకరాళ్లు], జిప్సం, బొగ్గు [హైడ్రోకార్టన్ చే), ముడిచమురు (పెట్రోలియం - రాజీనూనె)

రూపాంతర శిలలు :-
→ అగ్నిశిలలు లేదా అవక్షేపశిలలు అధిక ఉష్ణోగ్రత లేదా అధిక పీడన లోనైనపుడు అవి తమ సహజసిద్ధ ధర్మాలను కోల్పోయి నూతన ధర్మాలను. పొందడం ద్వారా ఏర్పడే శిలతో " రూపాంతర శిలలు".