గ్రహణములు



→ ఏదయినా ఒక వస్తువు నీడ మరొక వస్తువుపై పడటాన్ని" గ్రహణం" అంటారు. గ్రహణాలు ఏర్పడుటకు ప్రధాన కారణం సూర్యుడు, చంద్రుడు, భూమి అనే 3 ఖగోళ వస్తువులు ఒకే సరళరేఖ మీదకు రావడం.

→ భూమి పరంగా ఏర్పడే 'గ్రహణము ' అనే ఖగోళ దృగ్విషయ '2' రకాలుగా విభజించవచ్చు. అవి ;

సూర్యగ్రహణం

→ సూర్యుడు, చంద్రుడు, భూమి ఇదే వరుసక్రమంలో ఒకే సరళరేఖ మీదకు వచ్చినపుడు లేదా సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు అడొచ్చినపుడు లేదా చంద్రుని ప్రచ్ఛాయ భాగంలోకి భూమి వచ్చినపుడు ఏర్పడే దృగ్విషయం".

→ ప్రచ్ఛాయ అనగా చంద్రుని లేదా భూమి యొక్క చీకటి భాగానికి వెనక ఉన్న చీకటి ప్రాంతం.

→ పాక్షికఛాయ/ఉపచ్ఛాయ అనగా ప్రచ్ఛాయకు ఇరువైపులా పాక్షిక వెలుతురు గల ప్రాంతo

→ సూర్య గ్రహణాలు అమావాస్య రోజుల్లో పగటి సమయాలలో ఏర్పడుతాయి. అయితే అన్ని అమావాస్య రోజులలో ఏర్పడవు. కారణం భూకర్ష్య, చంద్రుని క్యులమధ్య 5°9′ కోణీయ దూరం వృత్యాసం ఉండటమే.



చంద్రగ్రహణం

→ సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినపుడు లేదా భూమి యొక్క ప్రచ్ఛాయ భాగంలోకి చంద్రుడు వచ్చినపుడు లేదా సూర్యునికీ, చంద్రునికి మధ్య భూమి వచ్చినపుడు ఏర్పడే దృగ్విషయం

→ చంద్రగ్రహణం పౌర్ణమి రోజులలో రాత్రివేళల్లో సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్బమీ రోజులలో సంభవించదు. కారణం చంద్రుని కర్య, భూకక్ష్యల మధ్య 5°9′ తోణీయ దూరం వ్యత్యాసం ఉండటమే.

సూర్యగ్రహణంతో ముడిపడి వున్న దృగ్విషయాలు :-
a) బెయిలీస్ బీడ్స్ :-
→ సూర్యకాంతి చంద్రుని ఉపరితలంపై గల నదిలోయలపై పడి పరావర్తనం చెందినప్పుడు ఆ నదీలోయలు పూసలతో గుచ్చిన స్థలదండవలె కన్పిస్తాయి..

→ ఈ దృగ్విషయాన్ని తెలిసారిగా ' బెయిలీ ' అను శాస్త్ర వేత్త గుర్తించినందున దీన్ని " బెయిలీస్ బీడ్స్ ' అని పిలుస్తారు.

b) Diamond king : -
→ సూర్యగ్రహణం అంతర్ధానమయ్యే ప్రారంభ సమయంలో కరోనా ప్రాంతం Diamond Ring ఆకారం లో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్నే " Diamond Ring" అని పిలుస్తారు.

చంద్రగ్రహణంతో ముడిపడివున్న దృగ్విషయం :-
Blue Moon :-
→ ఒక నెలలో అరుదుగా ఏర్పడే రెండవ "పౌర్ణమి " బ్లూమూన్ "

→ సాధారణంగా సం. నకు '7' గ్రహణాలు ఏర్పడతాయి. వీటిలో '5'- సూర్యగ్రహణాలు, 2- చంద్ర గ్రహణాలు (లేదా) '4'- సూర్య గ్రహణాలు, '3' - చంద్ర గ్రహణాలుండవచ్చు.

→ ప్రతీ 18 సం|| 10 రోజుల క్రితం గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం తిరిగి పునరావృత మౌతుంది.

→ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదు. కారణం గ్రహణ సమయంలో ప్రమాదకర అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా భూమిని చేరి జీవుల శరీరంపై పడి కంటి చూపు పోవడం, అంగవైకల్యం గల శిశుజననాలు సంభవించు ప్రమాదం కలదు.

పోటుపాటులు

→ సముద్ర నీటి మట్టం సాధారణ స్థాయిల నుండి పైకి పెరగడాన్ని " పోటు" అనీ, సాధారణ స్థాయినుండి క్రిందకు పడిపోవడాన్ని "పాటు" అని పిలుస్తారు.

→ ప్రతిరోజూ '2' పోటులు, 2 పాటులు సంభవిస్తాయి.

పాటు, పాటులు సంభవించుటకు కారణాలు:-

→ సూర్యచంద్రుల గురుత్వాకర్షక శక్తి ప్రభావం భూమిపై పనిచేయుట;

→ సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కన్నా చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై అధికం. కారణం చంద్రుడు భూమిని అతి దగ్గరగా ఉండటమే

→ భూభ్రమణం వల్ల జనించే అపకేంద్రబలాలు (8) కోరియాలిస్ ప్రభావం :

→ అమావాస్య, పౌర్ణమి, విషవత్తుల రోజులలో మామూలు రోజుల్లో ఏర్పడే పోటుల కన్నా మరీ ఎక్కువ ఎత్తయిన పోటులు సంభవిస్తాయి. వీటినే " పర్యవేలా తరంగాలు" అంటారు..

→ అమావాస్యరోజున చంద్రుడు భూమితో కణం చేస్తుండగా, పౌర్ణమి రోజు 180' కోణం చేస్తూ ఉంటాడు.

→ చాంద్రమాన మాసం యొక్క మొదటి (శుద్ధ అష్టమి), మూడవ (బహుళ అష్టమి) వారాల సూర్యుడు, చంద్రుడు భూము లంబకోణం (96) లో ఉండుట వలన వ్యతిరేక గురుత్వాకర్షణ ఏర్పడి భూమిపై సాధారణ రోజుల కన్నా మరి తక్కువ ఎత్తుగల పోటుల సంభవిస్తాయి. వీటినే "లఘువేలా తరంగాలు" అని పిలుస్తారు.

→ ఒక పోటుకి, ఒక పాటుకీ మధ్య కాలవ్యవధి : 6 గం. 13 ని॥లు. ఏ రెండు పోటులు/ఏ రెండు పాటుల మధ్యనైనా కాలవ్యత్యాసం: 12గం, 26 ని,లు,

→ ఈ రోజు వచ్చే పోటుకన్నా రేపు వచ్చే పోటు 53 ని.లు ఆలస్యంగా వస్తుంది. కారణం భూకక్ష్య, చంద్రుని కక్ష్యల మధ్య కోణీయ దూరం 5°9* వ్యత్యాసం ఉండటమే ..

→ భూమిపై అత్యధిక ఎత్తుగల పోటులు సంభవించు ప్రాంతం: [దాదాపు 16-18 మీ॥ ] కెనడా తూర్పుతీరంలోని న్యూఫౌండ్ లాండ్ దీవిలో గల ఫండి అఖాతము.

→ భారత్ లో అత్యధిక ఎత్తుగల పోటులు సంభవించు ప్రాంతం: కాంబే సింధుశాఖ గుజరాత్]

→ పోటు, పాటులలో ఉండే శక్తి : Kinetic Energy