భూచలనాలు



→ భూమికి '2 రకాల చలనాలుంటాయి. అవి :
1. భూభ్రమణము
2. భూపరిభ్రమణము

భూభ్రమణము

→ భూమి తన అక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని పడమర నుండి తూర్పునకు గంటకు దాదాపు 1635 km వేగంతో తన చుట్టూ. తాను తిరుగుటయే భూ భ్రమణము .
→ భూమి ఒక భ్రమణం చేయుటకు పట్టుకాలం: 23గం, 56 రి, 4.09 సె,
→ అక్షము (Axis) అనగా ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమియొక్క కేంద్రం. గుండా పోయే రేఖ.

భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు :
→ రాత్రింబవళ్లు ఏర్పడటం;
→ పోటుపాటులు సంభవించడం;
→ పవనాల దిశలోనూ, సముద్ర ప్రవాహాల దిశలోనూ మార్పులు చోటు చేసుకోవడం;
→ భ్రమణ వల్ల జనించే అపకేంద్ర బలాల ప్రభావం వల్ల సహజసిధ్ధ ఉ.గోళంలో మార్గంలో వీచే పవనాలు కొంత కుడివైపునకు, ద. గోళంలో కొంత ఎడమ వైపునకు అపవర్తనము చెంది ప్రయాణిస్తాయి. ఈ ప్రభావాన్నే "కోరియాలిస్ ప్రభావం " లేదా "ఫెరల్స్ సూత్రం" అంటారు. * సూర్యుడు రోజుల వివిధ సమయాలలో భూమికి వివిధ ఎత్తులలో ఉండటం;



భూపరిభ్రమణం

→ భూమి తన కక్ష్యామార్గంలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కొంత స్థానభ్రంశం చెందుటయే "భూపరిభ్రమణం"
→ భూమి ఒక పరిభ్రమణం చేయుటకు పట్టుకాలం : 3658, 6గం., 10 సె,
→ సాధారణంగా సం. నకు 365 రోజులను లెక్కిస్తారు. మిగిలిన 6 గంటలకు ప్రతీ 4 సం.లకు ఒకసారి కలుపుతారు. 366 రోజులు గల ఆ సంవత్సరాన్ని " లీపు సంవత్సరం" అంటారు.

భూపరిభ్రమణం వల్ల భుమిపై కలిగే మార్పులు :-
→ రాత్రి, పగటి సమయాల్లో తేడాలేర్పడటం
→ ఋతువులు ఏర్పడటం,

పై రెండు రకాల మార్పులు భూ పరిభ్రమం సమయంలో భూమిపై ఏర్పడటానికి కారణం:
i) భూఅక్షం 23 1/2 కోణంతో సూర్యునివైపు లేదా సూర్యునికి దూరంగా వాలి ఉంటుంది. భూఅక్షం తన సమతల కక్ష్యా తలంతో 66 1/2 కోణం చేస్తుంది.
ii) భూమధ్యరేఖ నుండి ధ్రువాలవైపు వెళ్లేకొలదీ భూమి చుట్టుకొలత తగ్గడం, (OR) భూమధ్యరేఖ నుండి అధ్రువాల వైపు వెళ్లే కొలదీ అక్షాంశాల పరిమాణం తగ్గడం.

→ తన కక్ష్యామార్గంలో సూర్యునిచుట్టూ పరిభ్రమించేటపుడు క్రింద తెలిపిన 4. ప్రత్యేక స్థానాలను పరిశీలించులు ద్వారా ఋతువులు ఏర్పడే విధానం తెలుసుకోవచ్చు.

విషవత్తులు

→ వీటి ప్రత్యేకత; ఇవి సంభవించిన రోజున భూమిపై అన్ని ప్రాంతాలలో సూర్య కిరణాలు నిట్ట నిలువుగా పడుటవలన రాత్రింబవళ్లు సమానంగా ఉంటాయి. కారణం ఈ రోజులో భూ అక్షం నీట్ట నిలువు స్థానానికి వస్తుంది.
→ ఇవి సంవత్సరం లో రెండు రోజుల్లో సంభవిస్తాయి. అవి :
a) మార్చి 21:
→ దీన్ని వసంతకాలపు విషవత్తు
b) సెప్టెంబర్ 22/23 శరత్కాలపు విషవత్తు

శీతాకాల ఆయనాంతం

→ ఇది డిసెంబర్ 22న సంభవిస్తుంది.
→ ఈ రోజున సూర్యకిరణాలు మకర రేఖపై నిట్టనిలువుగా పడటం వలన ద. గోళంలో దీర్ఘమైన పగలు, హ్రస్వమైన రాత్రులు ఏర్పడతాయి.
→ ఈ రోజునే " ఉత్తరాయన ప్రారంభం" అని పిలుస్తారు.

వేసవి ఆయనాంతం

→ జూన్ 21 న సంభవించును.
→ ఈ రోజున కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటం వలన. ఉ. గోళంలో దీర్ఘమైన పగలు, హస్యమైన రాత్రులు ఏర్పడుతాయి.
→ ఈ రోజునే " దక్షిణాయన ప్రారంభం" అనీ పిలుస్తారు..
→ ఉ.గోళంలో వేసవి ఋతువు ఉండే కాలం: MAR 21 - SEP 22/23 ఇదే సమయంలో ద. గోళంలో శీతాకాలం ఉంటుంది.
→ ద. గోళంలో వేసవి ఋతువు ఉండే కాలం: SEP 22/23 ఇ సమయంలో ఉ. గోళంలో శీతాకాలం ఉంటుంది. - MAR 21
→ ఉ. ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు : MAR 21
→ అస్తమించే రోజు : SEP 22/23
→ ద. ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు ;
→ Sep 22/23 అస్తమించే రాజు : MAR 21
→ " అర్థరాత్రి సూర్యుడు" (Land A Midnigt Sun) అని నార్వేని పిలుస్తారు.