OCEANOGRAPHY



→ భూ ఉపరితలంపై వున్న మొత్తం జలరాశిలో 97% ఉప్పునీటి స్వభావాన్ని కలిగి ఉండగా, మిగిలిన 3% మంచినీటిలో 2%, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలలో జీవజాతికి వినియోగపడని రీతిలో ఘనస్థితిలో ఉంది. మిగిలిన ఒక్కశాతం మంచినీరు మాత్రమే జీవజాత వినియోగానికి అందుబాటులో ఉంది. మహాసముద్రాలు అనగా ' ఖండ తరాలను ఆనుకొనివున్న విశాలమైన, లోతైన ఉప్పునీటి జలభాగములు, సముద్రాలు అనగా 'ఖండతులకు లోపల విస్తరించివున్న లోతైన ఉప్పునీటి జలభాగాలు .

→ భూమిపై వాస్తవంగా ఉన్న మహాసముద్రాలు '4'. అయితే ఊహాజనితమైన 5వ మ. సముద్రంగా పిలవబడే అంటార్కటికా/దక్షిణ మహాసముద్రం' వాస్తవంగా లేదు. అది ఒక భౌగోళిక ఊహ మాత్రమే.

పసిఫిక్ మహాసముద్రం

→ మహాసముద్రాలలో అతి పెద్దది, అతి లోతైనది.

→ త్రిభుజాకృతిలో ఉంటుంది.

→ "ప్రశాంత సముద్రం " అనీ, " Ring of Fire" అనీ పిలుస్తారు.

→ ఎక్కువ సంఖ్యలో దీవులు గల మహాసముద్రం.

→ మహా సముద్రాలలో అత్యంత లోతైన " మెరియానా ట్రెంచ్" ప్రాంతం ఫిలిప్పీన్స్ దీవుల సమీపంలోని పసిఫిక్ లో కలదు.

→ అత్యంత వెడల్పయిన 'ఎబైసల్ మైదానం' గల మహాసముద్రం,

→ అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే ఎర్ర మట్టి నిక్షేపాలు ఎక్కువగా గల మహాసముద్రం.

అట్లాంటిక్ మహాసముద్రం

→ 2వ అతి పెద్దది.

→ " కల్లోల సముద్రం" అనీ, "హెర్రింగ్ పాడ్ " అనీ పుస్తారు.

→ 'S' ఆకారంలో ఉంటుంది.

→ పొడవైన ఖండతరం గల మహాసముద్రం. (పొడవైన దేశం : చిలీ)

→ పొడవైన ఖండతీరం గల దేశం : కెనడా

→ తక్కువ పొడవైన ఖండతీరం గల దేశం : జోర్డాన్

→ అట్లాంటిక్ అత్యంతలోతైన ప్రాంతం : " ఫ్యూరిటోరికా ట్రెంచ్

→ మహాసముద్రాలలో అతి పెద్దదయిన ఇది ఉ. అట్లాంటిక్ లో కలదు.

→ ప్రపంచంలో ఎక్కువగా వాణిజ్య మార్గాలు గల Ocean.

→ వెడల్పయిన ఖండ తరపు అంచులు గల Ocean .

హిందూ మహాసముద్రం

→ '3'వ అతి పెద్దది. 'M' ఆకారంలో ఉంటుంది.

→ అత్యంత లోతైన ప్రాంతం : " సుందా కందము" (Sunda Trench)

→ అతిపెద్ద దీవి : మెడగాస్కర్

→ హిందూ మహాసముద్రంలో అమెరికా ఏర్పాటు చేసిన నౌకస్థావరం గల దేవి: డిగోగార్షియా

అంటార్కిటికా/దక్షిణ మహాసముద్రం

→ ఇదొక భౌగోళిక ఊహ మాత్రమే. అయితే అంటార్కిటికా ఖండ తరాన్ని, అనుకొని వున్న పసిఫిక్, అట్లాంటిక్ & హిందూ మహాసముద్ర జలరాశినే" అంటార్కిటికా మహాసముద్రం' అంటారు.

→ ఈ ఖండ తీరాన్ని అనుకొనివున్న సముద్ర భూతలంలో మాంగనీస్ నాడ్యూల్స్ ఖనిజాలు అధిక పరిమాణంలో నిక్షిప్తమై ఉన్నాయి. (నాడ్యూల్-చేతివేలి పరిమాణంలో గల మట్టి గుళిక)

ఆర్కిటిక్ మహాసముద్రం

→ చిన్న మహాసముద్రం

→ 'O' ఆకారంలో ఉంటుంది.

→ ఉత్తర ధృవాన్ని ఆవరించివున్న Ocean.

→ ఎల్లప్పుడూ ఘనీభవించి ఉంటుంది.

→ మహాసముద్రాల సగటులు : 3500 మీ

→ సముద్రజలాల ఉపరితల దూరాలను కలవడానికి వాడే ప్రమాణం: నాటికల్ మైలు (NM)

→ సముద్ర జలాల లోతును కొలవడానికుపయోగించే ప్రమాణం: పాథంస్

→ సముద్రజలాల లోతును తెలుసుకోవడానికి వాడే పరికరం : ప్రతిధ్వని గంభీరతా మాపకం

సముద్ర భూతల విభజన

→ సముద్ర భూతలం ఆరు ఆధారంగా అది '4' భాగాలు

1. ఖండ తీరపు అంచు:-
→ ఖండతీరం నుంచి సగటున 200 మీ. లోతువరకు విస్తరించిన సముద్ర భూతల ప్రాంతం.

→ మొత్తం సముద్ర భూతలంలో 7.5% ను కలిగి ఉంది.

→ ముడిచమురు నిక్షేపాలు ఎక్కువగా గల ప్రాంతం.

→ చేపల్లాంటి జలచరాలు ఎక్కువగా నివసించే ప్రాంతం,

2. ఖండతీరపువాలు :
→ ఖండ తీరపు అంచు నుండి సగటున 2000 మీ, లోతువరకూ విస్తరించివున్న సముద్ర భూతలం ప్రాంతం,

→ మొత్తం సముద్ర భూతలంలో దాదాపు 16.5% ఆక్రమించి ఉంది.

3. Abyssal మైదానం(లేదా) అంథ సముద్ర మైదానం :-
→ ఖండతరపు వాలునుండి సగటున 6000 మీ, లోతువరకు విస్తరించివున్న సముద్ర భూతల ప్రాంతం,

→ మొత్తం సముద్ర భూతలంలో దాదాపు 13 శాతాన్ని కలిగివుంది.

→ ఎక్కువ వెడల్పయిన Abyssal మైదానం గల మహాసముద్రం : పసిఫిక్

→ అగ్నిపర్వత ప్రక్రియవల్ల ఏర్పడే ఎర్రమట్టి నిక్షేపాలు, మాంగనీస్ నాడ్యూల్స్ ఎక్కువగా గల ప్రాంతం.

4. Trench/కందకాలు/ అగాథాలు :-
→ సముద్ర భూతలంలోని లోతైన, పాడ) ఇరుకైన లోయల్లాంటి నిర్మాణాలు.

→ మొత్తం సముద్ర భూతలంలో దాదాపు 1.5% ను కలిగి ఉంటాయి.

→ అగ్నిపర్వత & భూకంప ప్రక్రియలు అధికంగా ఈ ప్రాంతంలో సంభవిస్తాయి.

సముద్రాంతర్గత నిమ్నోన్నతాలు :
→ భూ ఉపరితలంపై ఉన్న పర్వతాలు, పీఠభూములు & మైదానాలను పోలినటువంటి సముద్ర భూతలంపై గల భూస్వరూపాలే 'సముద్రాంతర్గత నిమ్నోన్నతాలు ".

అవి:
1. Ridges

2. Trenches

3. గయోట్స్ (Gayaots)

1.రిడ్జెస్:-
→ సముద్ర భూతలంపై వున్న పొడవైన, ఎత్తయిన భూభాగాలే " Ridges".

→ అట్లాంటిక్ మహాసముద్రంలోని Ridges:

i) Mid Atlantc Oceanic Ridge :-

→మహాసముద్రాలన్నింటిలోకెల్లా అతిపెద్ద Ridge.

→ ఉ. అట్లాంటిక్ Ocean లో విస్తరించి దాన్ని నిలువుగా 2 సమానార్ధభాగాలుగా విభజిస్తోంది.

→ దీని ఉత్తర భాగాన్ని " డాల్ఫిన్ రిడ్జ్" అనీ,

→ దక్షిణ భాగాన్ని challenger Ridge" అనీ పిలుస్తారు.

→ ఈ Ridge యొక్క ఉత్తర భాగం పీఠభూమి స్థలాకృతిని కలిగివున్నందున ఆ ప్రాంతాన్ని Telegraph పీఠభూమి అని పిలుస్తారు.

→ ఈ పీఠభూమి గుండా ప్రపంచంలో తొలి సముద్రాంతర్గత కేబుల్ను Europe, ఉ. అమెరికా దేశాలమధ్య నిర్మించడమైనది.

ii) వైవిల్లీ థాంప్సన్ రిడ్జ్ :-
→ ఇది ఐస్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్లను కలిపే Ridge.

→ ప్రపంచంలో అన్నిటికన్నా ఉత్తర సరిహద్దుగా గల రాజధాని నగరం: రెజ్కీమిక్ (ఐస్లాండ్)

→ ప్రపంచంలో చేపలు పట్టడం ప్రధాన ఆర్థికవ్యవస్థగా గల దేశం : ఐస్లాండ్

→ పసిఫిక్ మహాసముద్రంలోని రిడ్జ్ - రమోపా రిడ్జ్ - జపాన్ దీవుల సమీపంలో కలదు.

→ హిందూ మహా సముద్రంలోని రిప్లై సాకొట్రా- చాగోస్ రిడ్జ్ : మెడగాస్కర్ దీవికి ఆగ్నేయ దిశలో దక్షిణ హిందూమహాసముద్రంలో కలదు.

2. Trenches/కందకాలు :-
→ మెరియానా ట్రెంచ్ - ఫిలిప్పీన్స్ దీవులు సవింపంలో పసిఫిక్ సముద్రంలో కలదు. - ఇది Oceans లోకెల్లా అత్యంత లోతైన ప్రాంతం.

→ ప్యూరిటీరికా ట్రెంచ్, అట్లాంటిక్లో అత్యంచే లోతైన ప్రాంతం,

→ సుందాకందము - హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రాంతం. 2004 లో సునామి ఇక్కడే సంభవించింది.

3. గయోట్స్ :-
→ సముద్ర భూతలాలలో 1000 మీ. అంతకన్నా ఎక్కువ ఎత్తుగల ఉపరితలాలు. సమతలంగా ఉన్నట్టి పర్వతాలను పోలిన భూస్వరూపాలు "

→ ఇటువంటి నిర్మాణాలు Pacific Ocean లో అధికంగా కన్పిస్తాయి.

సముద్రజల లవణీయత

→ సముద్ర జలానికున్న ఉప్పదనాన్ని " లవణీయత' అంటారు.

→ సముద్ర జల లవణీయతకు కారణం అందులో కరిగివున్న అనేక ఖనిజలవణాలు.

→ సముద్రజలాల్లో అధికంగా కలిగివున్న ఖనిజ లవణం.

1. సోడియం క్లోరైడ్ (71%).
2. మెగ్నీషియం క్లోరైడ్ (10%, )
→ సముద్ర జలాల్లో అధికంగా లభ్యమయ్యే మూలకం : అయోడిన్

→ సముద్ర జలాల సగటు లవణీయత 35 శాతం. అనగా నిర8/00. = సముద్రజల లవణీయత క్రింది కారణాంశాలచే ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది.

ఉష్ణోగ్రత
→ ఉష్ణోగ్రత అధికంగా గల ప్రాంతాల్లో నీరు ఆవిరయ్యే రేటు ఎక్కువగా ఉండి సముద్రజల లవణీయత కూడా అధికంగా ఉంటుంది.

వర్షపాతం :-
→ అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉoటుంది.

→ కారణం వర్షం ద్వారా మంచినీరు సముద్రాల్లో చేరటం వలన అందులోని లవణాల గాఢత తగ్గుటచేత

సముద్రాలలో కలిసే నదుల్లోని మంచినీరు :-
→ నదీ ముఖద్వారాల వద్ద నదులలోని మంచినీరు సముద్రాలలో కలవడం వలన అక్కడ అవయత తక్కువగా ఉండి, నదీ ముఖద్వారాల నుండి సముద్రాల లోపలికి వెళ్లేకొలదీ లవణీయత పెరుగుతుంది.

సముద్రాల లోతు :-
→ సముద్రజల ఉపరితలం నుండి 200 పాథమ్స్ లోతు వరకు లవణీయత క్రముగా పెరిగి ఆపై లోతులో క్రమంగా తగ్గును. కారణం సూర్యకిరణాలు 200 పాథమ్స్ లోతువరకు మాత్రమే ప్రసరిస్తాయి.

→ భూమధ్యరేఖా ప్రాంతంతో పోలిస్తే ఉపఆయనా రేఖా ప్రాంతంలో లవణీయత అధికంగా ఉండటానికి కారణం అధిక ఉష్ణోగ్రత & అల్ప వర్షపాతం,

→ ఉప ఆయనరేఖా ప్రాంతంతో పోలిస్తే భూ. రేఖా ప్రాంతంలో లవణీయత తక్కువగా ఉండటానికి అధిక వర్షపాతమే కారణo.

→ ఒకే లవణీయత గల ప్రదేశాలను కలుపుతూ గీయబడ్డ ఊహా రేఖలే " ఐసోహెలైన్స్".

→ అత్యంత లవణీయతగల సముద్రం : మృతసముద్రం (228%) Reason :-

- అధిక ఉష్ణోగ్రతా ప్రాంతంలో ఉండడం

- అల్ప వర్షపారంగల ప్రాంతం

- ఈ సముద్రలు కలిసే నదులేవీ లేకపోవడం

→ అక్షాంశాలను బట్టి పరిశీలిస్తే భూరేఖ నుండి ఉప ఆయనరేఖా ప్రాంతం వరకు లవణీయత క్రమంగా పెరిగి ఆపైన ధృవాలవరకు క్రమంగా తగ్గుతుంది.

Reason:-

- అల్ప ఉష్ణోగ్రతా ప్రాంతం

- ఈ సముద్రంలో అనేక నదులు కలవడం

సముద్ర ప్రవాహాలు :
→ సముద్ర జలం అధిక మొత్తంలో ఒకప్రాంతం నుండి మరీ ప్రాంతానికి స్థిరముగా నిర్ణీతదిశలో కదలడాన్ని " సముద్ర ప్రవాహాలు" అని పిలుస్తారు.

→ ఇవి ఏర్పడ భౌగోళిక ప్రాంతాన్ననుసరించి వాటిని '2' రకాలుగా విభజించవచ్చు.

1. ఉష్ణ ప్రవాహాలు (Warm Ocean Current) :-

→ భూమధ్యరేఖా ప్రాంతంలో జనించి ఎల్లప్పుడూ ఖండాల తూర్పుతీరాల వెంబడి ఉపరితల ప్రవాహంగా ధృవాలవైపు కదుతాయి.

→ వీటి కారణంగా ఇండాల తూర్పుతీర ప్రాంత భూభాగాలలో వర్షపాతం పశ్చిమ ప్రాంత భూభాగాల కంటే అధికంగా ఉంటుంది.

2. శీతల సముద్ర ప్రవాహాలు :-
→ ఇవి దృవ ప్రాంతాల్లో జనించి ఎల్లప్పుడూ విండాల పశ్చిమతీరం వెంబడి అంతర ప్రవాహంగా భూరే వైపు కదులుతాయి.

→ వీటి కారణంగా ఈ ప్రాంత భూభాగాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది.