అక్షాంశాలు, రేఖాంశాలు
→ "భూగోళశాస్త్రం" అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది & భూమి చుట్టుకొలతను మొదటగా లెక్కించిన శాస్త్రవేత్త - ఎరట స్థనీస్
→ భూగోళశాస్త్ర పితామహుడు : హెకాటియస్
→ అక్షాంశాలు, రేఖాంశాలను మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త : హిప్పార్కస్
→ అక్షాంశాలను గుర్తించుటకు హిప్పార్కస్ రూపొందించిన పరికరం: ఆస్ట్రలాట్
→ ఉత్తర-దక్షిణ ధృవాలను ఆధారంగా చేసుకొని మానవుడు క్రింద తెలిపిన అనేక ప్రయోజనాలను ఆశించిని అక్షాంశాలు, రేఖాంశాలు అనే ఊహా - జనిత రేఖలను గుర్తించడమైనది. అవిః
1. భూమిపై గల వివిధ శీతోష్ణస్థితుల ప్రాంతాలను అక్షాంశాల ఆధారంగా గుర్తించొచ్చు.
2. వివిధ దేశాల్లోని కాల సమయాలను రేఖాంశాల ఆధారంగా లెక్కించొచ్చు.
3. భూమిపై అక్షాంశాలు ఆ రేఖాంశాలు లంబకోణంలో ఖండిరామకోవడం . వల్ల చతుష్కోణాకృతిలో గల గ్రిడ్ నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ గ్రిడ్ నిర్మాణాల ఆధారంగా ఒక దేశం/రాష్ట్రం/గ్రామా యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు.
అక్షాంశాలు
→ భూమికి అడ్డగా భూమి చుట్టూ గీయబడిన ఊహారేఖలు " అక్షాంశాలు"→ అక్షాంశాలు అనేవి వృత్త రేఖలు. వీటినే " సమాంతర రేఖలు' అనీ పిలవొచ్చు. కారణం ఉత్తర, దక్షిణ ధ్రువాలలో భూమధ్యరేఖకు సమాంతరంగా గుర్తించబడి ఉన్నాయి.
→ భూమిపై గల అక్షాంశాలన్నింటిలోకి అతిపెద్దది : భూమధ్యరేఖ. అందువలన దీన్ని Great Circle అని పిలుస్తారు.
→ ఇది భూమిని అడ్డంగా రెండు సమాన అర్థభాగాలుగా విభజిస్తుంది. దీనికి ఉత్తరంగావున్న అర్థభాగాన్ని 'ఉత్తరార్థ గోళం' అనీ, దక్షిణంగావున్న అర్థభాగాన్ని 'దక్షిణార్ధ గోళం' అనీ పిలుస్తారు .
→ భూమధ్యరేఖతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య - 181 [90+90+1].
→ రేఖ నుండి ధ్రువాలవైపు వెళ్ళేకొలదీ అక్షాంశాల పరిమాణం క్రమంగా తగ్గుతూ వీటి విలువలు క్రమంగా పెరుగుతాయి.
→ ఏ రెండు అక్షాంశాల మధ్య దూరమైనా దాదాపు స్థిరంగా ఉంటుంది [111 km).
→ అయితే భూరేఖాప్రాంతంతో పోలిస్తే ధ్రువాలవద్ద రెండు అక్షాంశాల మధ్యదూరం. కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కారణం ధ్రువాల వద్ద భూమి అణచబడి ఉంటుంది.
→ శీతోష్ణస్థితి ప్రాముఖ్యతననుసరించి కొన్ని అక్షాంశాలను ప్రత్యేక పేర్లతో పిలుస్తున్నారు.
0° - భూమధ్యరేఖ
23 1/2 ° N - కర్కటరేఖ, ఉత్తరాయణ రేఖ (Tropic Of Cancer)
23 1/2 ° S - మకరరేఖ, /దక్షినాయన రేఖ (Tropic of Capricorn)
66 1/2 ° N - అర్కిటిక్ వలయం
66 1/2 ° S - అంటార్కిటికా వలయం
90°N - ఉత్తర ధ్రువం
90°s - దక్షిణ ధ్ర ధ్రువం
→ అక్షాంశాలను ప్రాతిపదికగా తీసుకొని భూగోళాన్ని '3' ప్రధాన శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు. అవి:
1. 0° - 23 1/2° N&S : ఉష్ణమండల/ఆయనరేఖా మండల ప్రాంతం
2. 23 1/2 °- 66 1/2 ° N&S : సమశీతోష్ణ మండల ప్రాంతం
3. 66 1/2° -90° N&S : ధ్రువ/అతిశీతల ప్రాంతాలు
రేఖాంశాలు (Longitudes)
→ భూమధ్యరేఖను ఖండిస్తూ ఉత్తర దక్షిణా ధ్రువాల గుండా భూమికి నిలువుగా భూమి చుట్టూ గీయబడిన ఊహారేఖలే "రేఖాంశాలు". ఇవి అర్థవృత్తాలు.→ మొత్తం రేఖాంశాల సంఖ్య ' 360. ఇందులో లండన్లోని థేమ్స్ నదీతీరాన గల గ్రీన్చ్ ప్రాంతం గుండా వెళ్లీ రేఖాంశాన్ని ' '0' రేఖాంశం ' (లేదా) 'గ్రీనిచ్ రేఖాంశం' (లేదా) 'అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం ' అని పిలుస్తారు.
→ ఇది భూమిని నిలువుగా రెండు సమాన భాగాలుగా విభ జిస్తోంది.
→ దీనికి తూర్పుగా వున్న అర్థభాగం "పూర్వార్ధ గోళం", పశ్చిమంగావున్న అర్థభాగo. పశ్చిమార్థగోళం..
→ పూర్వార్ధగోళంలో 179 తూర్పు రేఖాంశాలు, పశ్చిమార్థగోళంలో 179 పశ్చిమ రేఖాంశాలుంటాయి.
→ 180° తూర్పు & పశ్చిమ రేఖాంశంలు రెండూ ఒక్కటే, దిన దీనినే " International Date Line" అని పిలుస్తారు.
→ భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్ళేకొలది రెండు రేఖాంశాల మధ్య దూరం క్రమంగా తగ్గుతూ ధ్రువాల వద్ద 'O'గా ఉంటుంది.
→ భూమధ్యరేఖ వద్ద రెండు రేఖాంశాల మధ్య దూరం - 111.4 km.
→ గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పు, పశ్చిమ దిశలలో 180° రేఖాంశం వైపు వెళ్ళేకాలడీ రేఖాంశాల పరిమాణం స్థిరంగా ఉండి వాటి విలువలు పెరుగుతాయి.
అంతర్జాతీయ దినరేఖ :-
→ 180° రేఖాంశమే "అంతర్జాతీయ దినరేఖ" గా పిలవబడును. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే 180° రేఖాంశాన్ని అనుసరిస్తూ గీచిన రేఖను " అంతర్జాతీయ దినరేఖ" అంటారు.
→ ఇది పసిఫిక్ సముద్రంలోని బేరింగ్ జలసంధి, ఏలుషియన్, ఫిజి, కిరిబతి, టోంగా దీవుల గుండా పోవుచున్నది.
→ దీన్ని 'IDL' అని పిలవడానికి కారణం, దీనికి ఒకవైపున ఒక రోజు ఉంటే మరోవైపున ఇంకొక రోజు ఉంటుంది.
→ ఎవరైనా ఒక వ్యక్తి తూర్పు రేఖాంశాల నుండి ఆదివారం బయలుదేరి అంతర్జాతీయ దినరేఖ ను దాటి పశ్చిమ రేఖాంశాలలోకి ప్రవేశించగానే తన కాల సమయాన్ని శనివారంగా మార్చుకోవాల్సి ఉంటుంది.
→ ఈ విధంగా చేయుటవల్ల. తన కాలసమయంలో ఒకరోజు లాభాన్ని పొందుతాడు. అతడు బయలుదేరి అదేవిధంగా మరొక వ్యక్తి ఆదివారం పశ్చిమ రేఖాంశాల నుండి IDI ను దాటి తూర్పు రేఖాంశాలలోకి ప్రవేశించగానే తన శాల సమయాన్ని సోమవారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయుట వలన అతను ఒకరోజు నష్టాన్ని పొందుతాడు.
→ అంతర్జాతీయ దినరేఖను పశ్చిమం నుండి దాటినపుడు ఒకరోజు కలుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తూర్పు నుండి దాటినప్పుడు ఒకరోజును తీసివేయాల్సి ఉంటుంది
సానిక సమయము - ప్రామాణిక సమయము :-
స్థానిక సమయం : -
→ ఏదైనా ఒక రేఖాంశంపై సూర్య కిరణాలు నిట్ట నిలువుగా పడే సమయాన్ని మధ్యాహ్నం 12 గం॥ లుగా తీసుకొని లెక్కించుకొనే కాలాన్ని "స్థానిక సమయం" అంటారు.
→ అయితే ఒక దేశ భూభాగం గుండా ఒకటి కంటే ఎక్కువ రేఖాంశాలు పోవుచున్నందున ఎక్కువ కాల స్థానిక సమయాలు నమోదౌతాయి.
→ ఒక దేశ భూభాగంలో ఒకటికంటే ఎక్కువ స్థానక సమయాలు ఉన్నపుడు ఆ దేశం రవాణా పరంగా, పాలనాపరంగా అనేక సమస్యలు ఎదురగును.
→ స్థానిక సమయాల వల్ల ఏర్పడే సమసృత్తి అధిగమించుటకు 1864- న్యూయార్క్ జరిగిన అంతర్జాతీయ భూగోళ సదస్సులో ఒక నూతన భావాన్ని రూపొందించినారు. 'ప్రామాణిక సమయం' అని పిలుస్తారు.
→ ప్రామాణిక సమయం అనగా “ఏదయినా ఒక దేశ భూభాగం గుండా వెళ్లే రేఖాంశాలలో మధ్య రేఖాంశాన్ని తీసుకొని దానిపై గల స్థానిక సమయాన్ని ఆ దేశంలోని అన్ని ప్రాంతాలక అనువర్తించే విధంగా గడియారంలో సవరించుకొనే కాలం".
→ భారతదేశ ప్రామాణిక సమయాన్ని 82 1/2 ° తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఇది దేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత పరిపాలనా విభాగం గుండా పోవుచున్నది.
1. A. P - కాకినాడ
2. ఒరిస్సా - కోరాపుట్
3. ఛత్తీస్ ఘడ్ - రాయపూర్
4. మధ్య ప్రదేశ్ - జబల్ పూర్, రేవా
5. ఉత్తరప్రదేశ్ -అలహాబాద్,వారణాసి,మీర్జాపూర్
6. పాండిచ్చేరీ - యానాం
→ "82 1/2°" తూర్పు రేఖాంశం" ను భారత పాటు నేపాల్ శ్రీలంకలు కూడా ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది.
→ భారతదేశ ప్రామాణిక సమయం గ్రీనిచ్ స్థానక సమయానికి 5 1/2 గం|| ముందుంటుంది.
→ అంతర్జాతీయ ప్రామాణిక సమయాన్ని గ్రీనిచ్ స్థానిక సమయం ఆధారంగా సవరించడం జరుగుచున్నది.
→ ప్రపంచంలో ఎక్కువ ప్రామాణిక సమయాలు గల దేశం :-
1. రష్యా (11) [ ఇటీవల దీన్ని '9'కు తగ్గించారు)
2. U.S.A (6)
3. కెనడా (5)
4. ఆస్ట్రేలియా(3)
→ భూమి తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి అనగా 360 రేఖాంశాల అరగడానికి తిరగడానికి 24గం. సమయాన్ని తీసుకొంటే, ఒక రేఖాంశం దూరాన్ని 4 మిులను తీసుకుంటుంది. దీనిప్రకారం భూగోళాన్ని 15 రేఖాంశాల అంతరంతో మొత్తం 24 కాలమండలాలుగా విభజించడమైనది. ఏ రెండు కాలమండలాల మధ్యనైనా కాలవ్యత్యాసం ఒక గంట ఉంటుంది.
→ ఏదయినా ఒక స్థానిక సమయం నుండి తూర్పునకు వెళ్ళేకొలదీ ఒక రేఖాంశం . కదలడానికి పట్టే 4 min సమయాన్ని 6స్థానిక సమయానికి కలుపుకోవాలి. అదేవిధంగా పశ్చమానికి వెళ్ళేకొలదీ ప్రతీ రేఖాంశం కదలడానికి పట్టే 4 ని.ల సమయాన్ని ఆ స్థానిక సమయం నుండి తీసివేయాలి.