ఉష్ణమండల గడ్డి భూములు/ సవన్నా శీతోష్ణస్థితి



ఉనికి :-
→ 5° - 20° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వస్తరించి ఉంటుంది.

విస్తరణ:
→ దక్షిణ అమెరికా - బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల సరిహద్దులతో కాంపోలు అనీ,

→ దక్షిణ అమెరికా - కొలంబియా, వెనిజులా దేశాల్లో " లానోలు" అనీ,

→ ఆఫ్రికా ఖండంలో భూ రేఖ కిరువైపులా విస్తరించివున్న ఈ గడ్డి భూములను సవన్నాలు / Parklands / ఉద్యానవన భూములు" అనే పిలుస్తారు.

→ ఉష్ణమండల గడ్డి భూములు సూడాన్ లో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నందున సూడాన్ శీతోష్ణస్థితి" అనీ పిలుస్తారు.

వృక్ష సంపద :-
→ ఈ ప్రాంత భూభాగమంతా 1.6 మీ., ఎత్తు పెరిగే లావుపాటి గడ్డి విస్తరించి ఉంటుంది. దీన్ని " ఏనుగు గడ్డి" అని పిలుస్తారు.

జంతు సంపద:-
→ అన్ని రకాల జంతువులకు ఆవాసాన్ని, ఆహార వనరులను కల్పించే భూమిపై గల ఏకైక శీతోష్ణస్థితి ప్రాంతం. అందుకే ఈ ప్రాంతాన్ని' ప్రపంచ వేటగాళ్ల స్వర్గం"గా పిలుస్తారు

ఆదిమ తెగలు :-
→ మసాయి - తూర్పు ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా దేశాల సరిహద్దులలో పశుపోషణ ప్రధానవృత్తిగా జీవించే తెగలు.

→ కికియు - రెనాల్ నివసించే వేట ప్రధాన వృత్తిగా గల ఆదిమ తెగలు.

→ హౌసా - నైజీరియాలో వేట ప్రధానవృత్తిగా నివసించే ఆదిమ తెగ.