మధ్యధరా శీతోష్ణస్థితి మండలం
→ ఆహ్లాదకర శీతోష్ణస్థితికి, అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగానికి, ఘనమైన చరిత్ర, సంస్కృత, నాగరికతలకు నిలయమైన ప్రాంతాలు,
ఉనికి:-
→ 30°-40° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
విస్తరణ:-
→ మధ్యధరా సముద్ర ఉత్తర తీరాన్ని అనుకొనివున్న ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్ మరియు మధ్యధరా సముద్రంలోని సార్డీనియా, సిసిలీ దీవులు,
→ మధ్యధరా సముద్ర దక్షిణ తీరాన్ని ఆనుకొని వున్న మొరాకీ, మునీషియా, అల్జీరియా,
→ మధ్యధరా సముద్ర తూర్పుతీరం - లెబనాన్, పాలస్తీనా, జీర్డాన్, ఇజ్రాయిల్.
→ దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ .
→ కాలిఫోర్నియాలోని తూర్పు ప్రాంతం.
→ చిలీలోని మధ్యప్రాంతం (శాంటియాగో పట్టణం).
→ ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ & దక్షిణ ప్రాంతాలు,
శీతోష్ణస్థితి:-
→ భూమిపై గల అన్ని శీతోష్ణస్థితి ప్రాంతాలలో తడి వేసవిలు, పొడి శీతాకాలాలు ఉంటాయి. కానీ మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో వాటికి భిన్నంగా పొడి వేసవి కాలాలు, కాలాలు ఉంటాయి.
→ కారణం: ఋతువు ననుసరించి పీడన మేఖలలు స్థానాంతర చలనం చెందడం.
→ దీనివల్ల మధ్యధరా ప్రాంతాలు వేసవిలో అసతీర వ్యాపార పవనాల తాకిడికి లోనవడం వలన వాతావరణం పొడిగా ఉండి వర్షాలు సంభవించవ్. కానీ శీతాకాలం లో ఈ ప్రాంతాలు అభితీర (on shore) పశ్చిమ పవనాల తాకిడికి లోనవటం వలన ప్రాంత వాతావరణం తడిగా వుండి వర్షాలు సంభవిస్తాయి.
వక్ష సంపద:
→ మిశ్రమ అరణ్యాలు విస్తరించి వున్నాయి..
→ ఇందులోని సతత హరితారణ్యాలలో పెరిగే వృక్ష జాతులు :
→ ఆలివ్ -సువాసన గల లావెండర్ పాద వృక్షాలు.
→ కార - (ఈ వృక్షాల సమూహమే "మాచేస్" )
→ ఓక్ - వీటిని సుగంధ పరిమళ ద్రవ్యాల తయారీలో వాడుదురు.
→ ఆస్ట్రేలియాలోని మధ్యధరా ప్రాంతాల్లో పెరిగే యూకలిప్టస్ వాణిజ్యపరంగా విలువైన కర్రా, జర్రా వృక్షాలు
→ కాలిఫోర్నియా మధ్యధరా ప్రాంతాల్లో రెడ్ వుడ్, చప్రార వృక్షాలు;
వ్యవసాయరంగం : -
సాంద్ర వ్యవసాయం
ముఖ్య పంటలు:-
→ గోధుమ , ద్రాక్ష , వరి , సిట్రస్ జాతి పండ్ల తోటలు
→ ఈ ప్రాంతాలను "ప్రపంచ పండ్లతోటల ప్రాంతాలు" అంటారు.
→ చిలీలోని పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ' హాషియండాలు "
ఖనిజసంపద :-
→ పాదరసం ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమస్థానం - ఇటలీ
→ పాలరాయి (విగ్రహాలకై) ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమస్థానం : ఇటలీ
పరిశ్రమలు:
→ ఫ్రాన్స్ లోని గ్రాసే అను ప్రాంతంలో పుష్పాల నుండి సుగంధ పరిమళ ద్రవ్యాలను ఉత్పత్తి చేయడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినది .
→ ద్రాక్ష సారాయి ఉత్పత్తిలో ప్రథమస్థానం : ఫ్రాన్స్ , ఎగుమతిలో ప్రథమస్థానం - అల్జీరియా
→ మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంత ప్రజలు అందమైన సూర్యరశ్మిని, సన్నని సముద్రతీరాలను అమ్మకుంటారనే భావన ప్రపంచ ప్రజలలో కలదు.
→ అభివృద్ధి చెందిన నాగరికతలు: గ్రీకు & రోమన్ నాగరికతలు