ఉష్ణమండల ఎడారి శీతోష్టస్థితి



→ ఇసుక పొరచే కప్పబడి అత్యధిక ఉష్ణోగ్రత, అతి తక్కువ వర్షపాతం కలిగి మానవ నివాసానికి అంతగా అనుకూలం లేనటువంటి భౌగోళిక ప్రాంతాలు

→ ఉనికి: 15°-30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ ప్రాంతంలో మాత్రమే విస్తరించి ఉంటాయి.

కారణం:
1. వ్యాపార పవనాలు ఖండాల తూర్పు భాగంలో మాత్రమే వర్షాన్నిచ్చి పశ్చిమ ప్రాంతాల్లో ఇవ్వలేక పోవడం.
2. ఖండాల పశ్చిమ ప్రాంతాల్లో గాలులు నిమజ్జనం చెందడం..
3. ఖండాల పశ్చిమ తీరం వెంబడి శీతల సముద్ర ప్రవాహాలు కదలడం.
4. ఖండాల పశ్చిమ తీరం వెంబడి ఎత్తైన, పొడవైన పర్వతశ్రేణులు విస్తరించడం.

విస్తరణ :
→ ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలో పశ్చిమం నుండి తూర్పునకు 6400 km పొడవున విస్తరించివున్న సహారా ఎడారి. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎండాలి.. ఇది ఏర్పడటానికి కారణమైన సముద్ర ప్రవాహం: కెనరీ సముద్ర ప్రవాహం

→ ఆఫ్రికా నైరుతి భాగం > కలహారి ఎడారి [ఏర్పడుటకు కారణం : బినిగ్వులా శీతల ప్రవాహం)
→ చిలీ, పెరూ దేశాల్లో ఇది అటకామా ఎడారి. ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి.
ఏర్పడుటకు కారణం : పెరూవియన్ / హంబోల్డ్ శీతల ప్రవాహం.
→ కాలిఫోర్నియా, అరిజోనా రాష్ట్రాలు & మెక్సికో వాయువ్య ప్రాంతం సోనారాన్ ఎడారి
→ అరేబియన్ ఎడారి
→ థార్ ఎడారి → ఇండియా(రాజస్థాన్ , దక్షిణ పంజాబ్ , హర్యానా , ఉత్తర గుజరాత్) , పాక్
→ గిబ్బన్ & విక్టోరియన్ ఎడారులు ఆస్ట్రేలియా

శీతోష్ణస్థితి:-
→ సం. అంత అత్యధిక ఉష్ణోగ్రత, అతి తక్కువ వర్షపాతం గల ఏకైక శీతోష్ణస్థితి ప్రాంతం.

→ వేసవిలో సహారా ఎడారి ప్రాంతాల్లో జనించే ఇనుక తుఫానులే " సైమూన్లు" .

వృక్ష సంపద:
→ ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షాల ఆకులు చాలా చిన్నవిగా గానీ లేదా ముళ్ల మాదిరిగా రూపాంతరం చెంది వేళ్లు బలంగా ఎక్కువ లోతుకు విస్తరించి వాటి కాండాల చుట్టూ మైనపు పూతలాంటి బెరడు ఉంటుంది.

→ కారణం భాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించుట కోసం. ఇటువంటి. లక్షణాలు గల వృక్ష జాతులను " Xerophytic వృక్షజాతులు" అంటారు.

జంతు సంపద:-
→ గుంట నక్కలు
→ "ఉష్ణమండల ఎడారి ఓడ "గా పిలవబడే ఒంటె,
→ చీమలు, తొండలు
→ బల్లులు, పాములు
వ్యవసాయరంగం :-
ఒయాసిస్ ప్రాంతాల్లో ప్రత్తి , చెరకు ,వేరుశనగ , ఖర్జూరం
→ పొడుగు గింజ ప్రత్తి (Quality ) ఉత్పత్తిలో
1. ఈజిప్ట్
2. U.S.A
→ ప్రత్తి ఉత్పత్తి (అన్నిరకాలు) లో
1. చైనా
2. భారత్

→ ప్రత్తిని " తెల్ల బంగారం" అంటారు. , జన్మస్థలం భారత్

ఖనిజ సంపద :-
→ ముడిచమురు :- 1. అరీబియన్ ఎడారి (సౌదీ అరేబియా)
→ నైట్రేట్స్ - చిలీలోని అటకామా ఎడారి
→ కాపర్ (రాగి) - చిలీలోని అటకామా ఎడారీ
→ బంగారం →విట్ వాటర్స్ రాండ్ ( దక్షిణాఫ్రికా)
→ కింబర్లీ (దక్షిణాఫ్రికా) - వజ్రాలు

ఆదిమ తెగలు

టౌరేగులు - సహారా ఎడారి[పశు పోషణ]
బిడోనియన్లు - అరేబియన్ ఎడారి
బుష్ మెన్ లు - కలహారి ఎడారి
బిండిబాలు - ఆస్ట్రేలియన్ ఎడారి

→ నైలునదీ పరివాహక ప్రాంతంలో నివసించే వ్యవసాయదారులు ఫెల్లాపాన్స్",