భూమధ్యరేఖా ప్రకృతిసిద్ధ మండలం



→ దీనినే "ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతం " & " డోల్ డ్రంస్ " (ప్రశాంత మండలం) అని పిలుస్తారు

→ ఉనికి: o°-5/10° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.

విస్తరణ:
* ద. అమెరికా- అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతం

* ఆఫ్రికా -కాంగో నదీ పరివాహక ప్రాంతం

* ఆగ్నేయాసియా - ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్,వియత్నం, లావోస్, బ్రూనై, న్యూగినియా

శీతోష్ణస్థితి లక్షణాలు :
→ సంవత్సరమంతా అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం గల ఏకైక శీతోష్ణస్థితి ప్రాంతం,

→ ఇక్కడ సంవత్సర మంతా వేసవి కాలమే ఉంటుంది. శీతాకాలాలు ఉండవు.

→ అయితే ఈ ప్రాంత ప్రజలు రాత్రి సమయాలనే శీతాకాలంగా భావిస్తారు. కారణం ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు 2-3°C వరకూ తక్కువగా ఉండటమే.

→ ఇక్కడ సంభవించే వర్షపాతం సంసహన రకానికి చెందినది.

→ బాగోర్ (ఇండోనేషియా) ప్రాంతంలో సంవత్సరంలో 322 రోజులు ఉరుము శబ్దాలు విన్పిస్తాయి.

→ ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 200 cm కన్నా ఎక్కువ.

వృక్ష సంపద :
→ సతత హరితారణ్యాలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉంటాయి.
→ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలోని ఈ అరణ్యాలను ప్రాంతీయంగా" సైల్వేలు" అని పిలుస్తారు.
→ ఈ అరణ్యాల్లో పెరిగే వృక్షాలు 40-50 మీ. ఎత్తుకలిగి వెడల్పాటి ఆకులతో గట్టి కనిపిస్తాయి
→ ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షాల అగ్రభాగంలోని ఆకులు ఒకదానినొకటి పెనవేసుకొని మల్లె పందిరిలా ఏర్పడి వుంటాయి. దీన్నే " కెనోపీ" అంటారు.
→ దీని కారణంగా ఈ ప్రాంత నేలలపై సూర్యరశ్మి ప్రసరించక పోవడం వల్ల అవి ఎల్లప్పుడు తేమగా, బురదగా ఉంటాయి. దీనివల్ల గడ్డిజాతి మొక్కలు ఈ ప్రాంతాల్లో పెరగవు .
→ ఈ ఈ అరణ్య వృక్షల కాండాల చుట్టూర కాండాల మధ్య అల్లుకొనివున్న (ఊయలలా) తీగ లాంటి మొక్కలు లయనాలు".

జంతు సంపద:-
→ చెట్లపై నివసించే పక్షులు, కోతులు, చింపాంజీలు, గొరిర్థాలు, సరీసృప వర్గానికి చెందిన పాములు, తొండలు, కొండచిలువలు, అనకొండ
→ నీటిలో నివసించే మొసళ్ళు, తాబేళ్ళు, నీటిగుర్రాలు, చేపలు,
→ పెద్దపెద్ద శాకాహార, మాంసాహార జంతు జాతులకు అనువైన శీతోష్ణస్థితి పరిస్థితులు ఇక్కడ లేవు.

వ్యవసాయరంగం:-
→ విస్తాపన వ్యవసాయ విధానం అమలులో ఉంది

దీనిని
→ మలేషియా - లడాంగ్
→ ఫిలిప్పీన్స్ - మిలాప్
→ శ్రీలంక - చిన్నా

భారత్ లోని రాష్ట్రాలు
→ అసోం&ఈశాన్య రాష్ట్రాలు→ జామ్
→ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్- బేవార్, పెండా, పెషా
→ రాజస్థాన్- వాత్రా
→ పశ్చిమ కనుమలు - కుమారీ
→ కేరళ - పోనం
→ A.P & ఒరిస్సా పోడో అనీ పిలుస్తారు

ముఖ్యమైన పంటలు :
→ రబ్బరు (1. థాయిలాండ్ 2. ఇండోనేషియా 3, మలేషియా 4.భారత్)
→ రబ్బరు జన్మస్థలం - బ్రెజిల్

→ కాఫీ :-
→ బ్రెజిల్ (కాఫీ తోటలను " ఫజెండాస్" అని పిలుస్తారు) 2. కొలంబియా 3. ఈక్విడార్ 4. ఇథియోపియా [కాఫీ జన్మస్థలం) 5. ఇండోనేషియా 6. భారత దేశం

కోకో: -
1. ఘనా (కోకో ఎస్టేట్ " గా పిలుస్తారు.)

ఖనిజసంపద :-
→ తగరం (Tin):-
1. మలేషియా
2. ఇండోనేషియా

ఆదిమ తెగలు :-
→అమెజాన్ రెడ్ ఇండియన్స్ → అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం
→ పిగ్మీలు - కాంగో నదీ పరివాహక ప్రాంతం
→ కాబూలు - సుమత్రా దీవులు
→ వెడ్డాలు-శ్రీలంక