వాతావరణ పీడనము



→ ప్రమాణ వైశాల్యం గల భూభాగంపై దానిపై గల వాతావరణపు బరువు కలుగ జేసే ఒత్తడి బలాన్ని " వాతావరణ పీడనం" అంటారు.

→ వాతావరణ పీడనాన్ని భారమితి/బారోమీటర్ అనే పరికరం ద్వారా కొలుస్తారు. దీన్ని రూపొందించిన శాస్త్రవేత్త : ఎవాంజి లె టారిసెల్లీ (ఇటలీ)

→ వాతావరణ పీడనాన్ని cm of hg / mm of hg /mb అనే ప్రమాణాల్తో కొలుస్తారు.

→ సముద్రమట్టం వద్ద సగటు వాతావరణ పీడనం: 76 cm of hg

→ వాతావరణ పీడనం కన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండక క్రింద తెలిపిన కారణాంశాల చేత ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. అవి :

1. ఉష్ణోగ్రత

2. వాతావరణంలోని నీటి ఆవిరి

3. భూభాగాల ఎత్తు

ఉష్ణోగ్రత :
→ ఒక భౌగోళిక ప్రాంతంలోని వాతావరణ పీడనం ఆ ప్రాంత ఉష్ణోగ్రతకు విలోమంగా ఉంటుంది.

నీటి ఆవిరి :
→ తడిగాలి బరువుకన్నా పొడిగాలి బరువు ఎక్కువ కాబట్టి తడిగాలి భౌగోళిక ప్రాంతాల్లో వాతావరణ పీడనం తక్కువగా ఉండి, పాడిగాలి భౌగోళిక ప్రాతాల్లో వాతావరణ పీడనం సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది.

భూభాగాల ఎత్తు :-
→ ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నపుడు సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొలదీ వాతావరణ పీడనం తగ్గును

→ పైన తెలిపిన కారణాల వలన భూమిపై కొన్ని చోట్ల అధిక పీడన ప్రాంతాలు, మరికొన్ని 6 చోట్ల అల్ప పీడన ప్రాంతాలు ఏర్పడి ఉన్నాయి. భూమిపైగల ఈ అధిక పీడన & అల్ప పీడన ప్రాంతాలనే " పీడన మేఖలలు" అని పిలుస్తారు.

→ భూమిపై మొత్తం '4' రకాలకు చెందిన '7' పీడనా మఖలలు ఏర్పడి ఉన్నాయి. అవి :

1) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
2) ఉప ఆయనరేఖా అధికపడన మేఖలలు
3) ఉపధ్రువ అల్పపీడన మేఖలలు
4) ధ్రువ అధిక పీడన మేఖలలు

భూమధ్యరేఖ అల్పపీడన మేఖల

→ భూమధ్య రేఖకు ఇరువైపులా ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతమే "భూమధ్యరేఖా అల్పపీడన మేఖల".

→ ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుటకు కారణం అధిక ఉష్ణోగ్రతల వలన విపరీత సంవహన ప్రక్రియ జరగడం,

→ ఈ ప్రాంతాన్నే "డీల్ డ్రమ్స్ (or) ప్రశాంత మండలం" అని పిలుస్తారు.

→ ఈ ప్రాంతంలో జరిగే విపరీత సంవహన ప్రక్రియవల్ల ప్రతీరోజు సాయంత్ర సమయాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తక్కువ సమయంలో అధిక పరిమాణంలో వర్షపాతం సంభవిస్తుంది.

ఉప ఆయనరేఖా అధిక పీడనా మేఖల :-
→ 25°–35° ఉత్తర, దక్షిణ దీక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతాలు . ఈ ప్రాంతాలలో అధిక పీడనం ఏర్పడుటకు కారణం కోరియాలిస్ ప్రభావతి వలన నిమజ్జనం చెందే గాలులు (Descandi Ates).

→ 25° - 35° మధ్యగల 10 అక్షాంశాలను " అశ్వ అక్షాంశాలు" అని పిలుస్తారు.

ఉపధ్రువ అల్పపీడన మేఖలలు:
→ 45°-65° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతాలు

→ ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుటకు కారణం కీరియాలిస్ ప్రభావం.

ధ్రువ అధిక పీడన మేఖలలు :-
→ 75° -90° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యగల భౌగోళిక ప్రాంతాలు

→ ఈ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడటానికి కారణం సూర్యకిరణాలు ఏటవాలుగా పడటం వలన నమోదయ్యే అల్ప ఉష్ణోగ్రతలు.

→ పైన తెలిపిన వాటిలో భూమధ్యరేఖ అల్పవడనా మేఖలు ధ్రువ అధిక పీడన మేఖల ఉష్ణోగ్రతలో మార్పువలన ఏర్పడగా, ఉపఆయనరేఖా అధిక పీడనా ముఖలలు ఒ ఉపధ్రువ అల్పపీడన మేఖలలు కీరియాలిస్ ప్రభావం/ గతిశీల బలాల వల్ల ఏర్పడుతున్నాయి.

పీడన ప్రవణత:-
→ ప్రమాణ వైశాల్యం గల భూభాగంపై పీడనంలో కలిగే మార్పు రేటుయే " పీడనా ప్రవణత. ఒక భౌగోళిక ప్రాంతంలో పీ ప్రవణత ఎక్కువగా ఉన్నట్లయితే పవనాల వేగం ఎక్కువగాను, పీ. ప్రవణత తక్కువగా ఉన్నట్లయితే పవనాల వేగం తక్కువగా ఉంటుంది.

→ భూమిపై అధిక వాతావరణ పీడనం నమోదయ్యే ప్రదేశం: అగాటా (సైబీరియా)

→ భూమిపై అత్యల్ప వాతావరణ పీడనం నమోదయ్యే ప్రదేశం : టిప్ (ఫిలిప్పైన్స్ దీవుల సమీపం)

సమభార రేఖలు (Isobars) :
→ భూమిపై ఒకే వాతావరణ పీడనం గల ప్రదేశాలను కలుపుచూ గీయబడిన ఊహారేఖలే " సమభార రేఖలు".