సూర్యపుటం - ఉష్ణోగ్రత



సౌరశక్తి :-
→కేంద్రక సంలీన చర్య ద్వారా సూర్యునిలో జనించే శక్తి .

సౌర వికిరణం :-
→ సూర్యునిలో జనించే సౌరశక్తి కాంతి & ఉష్ణం రూపంలో వికిరణ

సూర్యపుటం :-
→ పద్ధతిలో విశ్వాంతరాళంలోకి ప్రసరించడాన్ని " సౌరవికిరణం " అంటారు.

→ 'భూమివైపు ప్రసరించే సౌరవకిరణం" లేదా "భూమి గ్రహించే సౌరవికిరణం" -

→ సూర్యుని నుండి విడుదలయ్యే మొత్తం సౌరవికిరణంలో 1/ 2000 మిలియన్లు మాత్రమే భూ ఉపరితలాన్ని చేరును.

ఇంత తక్కువ పరిమాణంలో సౌరవికిరణం భూమిని చేరడానికి కారణాలు :-
→ సూర్యునికీ, భూమికీ మధ్యగల సగటు ధరారం ఎక్కువగా ఉండటం

→ పరిమాణంతో పోలిస్తే భూమియొక్క పరిమాణం చిన్నదిగా ఉండటం

సౌర స్థిరాంకం :-

→ భూమిని చేరే మొత్తం సౌరవికిరణం భూమ్మీద గల ప్రతీ చ.సెం.మీ. భూ భాగాన్ని నిమిషానికి సగటున 1.94 గ్రా. కేలరీల చొప్పున వేడిచేస్తుంది. దీనినే భూమి యొక్క " సౌర స్థిరాంకం" అని పిలుస్తారు.

ఉష్ణోగ్రత :
→ భూ వాతావరణం పగటి సమయంలో హ్రస్వ తరంగాల ద్వారా భూ ఉపరితలం వైపు ప్రసరించే సౌరవికిరణం వల్ల కొద్దిగా మాత్రమే వేడెక్కి సాయంత్ర సమయం నుంచి భూ ఉపరితలం నుంచి దీర్ఘ తరంగాల/పరారుణ రూపంలో పైకి వెళ్లే ఉష్ణశక్తి భ్రమవికిరణం ) ద్వారా అధికంగా వేడెక్కుతుంది.
→ వాతావరణంలోని ఆ వేడి తవ్రుతనే " ఉష్ణోగ్రత" అని పిలుస్తారు.

→ భూమిపై విస్తరించివున్న ఉష్ణోగ్రతను వివిధ ఉష్ణమాపకాలనుపయోగించి తెలుసుకోవచ్చు.

1. ఒక భౌగోళిక ప్రాంతంలోని కనిష్ట , గరిష్ట ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి " సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఉపయోగిస్తారు.

2. శీతల ప్రాంతాల్లో ఉపయోగించే ఈ ఉష్ణమాపకం ఆల్కహాల్ ను, ఉష్ణ ప్రాంతాల్లో వాడే ఉష్ణమాపకాన్ని పాదరసంతోను నింపుతారు.

ఈ ఉష్ణమాపకంలో '2' రకాల స్కేలున్ను ఉపయోగిస్తారు.

a) సెంటీగ్రేడ్ స్కేల్ -రూపకర్త: ఏండర్స్ సెల్సియస్

b) ఫారన్ హీట్ స్కేల్ - రూపకర్త; ఫారన్ హీట్

2. ఒక భౌగోళిక ప్రాంతంలోని అత్యధిక ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి - పైరో మీటర్

3. ఒక భౌగోళిక ప్రాంతంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి - క్రయో మీటర్

4. నావికులు ప్రయాణిస్తున్న ప్రాంత ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి- బర్దోలీ ట్యూబ్

→ భూమిపై ఉష్ణోగ్రత విస్తరణను '2' అంశాల పరంగా తెలుసుకోవచ్చు. అవి :

i) క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ

ii) ఊర్ధ్వ ఉష్ణోగ్రతా విస్తరణ

క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ :-
→ భూమ్మీద క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండక, క్రింద తెలిపిన అంశాలచే ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

అవి :

1. అక్షాంశాలు / భూమ్మీద సూర్యకిరణాలు పడే కోణం

2. పగటి సమయం

3. సూర్యునికీ, భూమికీ మధ్యగల దూరం

4. వాతావరణ పారదర్శకత

5. సముద్ర సామీప్యత

6. భూభాగాల /పర్వతాల వాలు.

7. భూభాగాల ఎత్తు

8. ఒక భౌగోళిక ప్రాంతంలో విస్తరించివున్న నేలలు, వృక్ష సంపద, వర్షపాతం మరియు ఏ ప్రాంతంలో వీచే పవనాలు;

అక్షాంశాలు :-
→ భూమి గోళాకారంగా ఉన్నందున భూమధ్యరేఖా ప్రాంతాల్లో సూర్యకిరణాలు తక్కువ దూరం ప్రయాణించి ఎక్కువ కోణం (90) లో భూమిపై పడి తక్కువ స్థలాన్ని ఆక్రమించి భూమిని అధికంగా వేడిచేస్తాయి.

→ ధ్రువాలవైపు వెళ్లే కలదీ సూర్యకిరణాలు ఎక్కువడూరం ప్రయాణించి భూమిపై ఏటవాలుగా పడి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి తక్కువగా వేడిచేస్తాయి.

→ దీనివలన భూ.రేఖ నుంచి ధ్రువాలవైపు వెళ్లేకొలదీ అక్షాంశాల పరంగా పరిశీలిస్తే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి.

పగటి సమయం :
→ పగటి సమయం అనేది ఋతువును బట్టి మారుతూ ఉంటుంది.

→ ఉ.గోళంలో వేసవికాలంగా ఉన్నపుడు భూ. రేఖ నుంచి ఉ. ధ్రువంవైపు వెళ్లకొలదీ పగటి సమయం పెరుగు టవల్ల భూమిని చేర సూర్యపుట పరిమాణం కూడా పెరుగుతుంది. అదే సమయంలో ద. గోళంలో పరిస్థితులు భిన్నంగా ఉందే ఉంటాయి.

సూర్యునికి, భూమికీ మధ్యగల దూరం :-
→ భూకక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉన్నందున భూమికీ, సూర్యునికి మధ్యగల దూరం స్థిరంగా ఉ ఉంటుంది.

→ దీని కారణంగా జనవరి నెలలో భూమికి దగ్గరగా ఉన్నందున ఎక్కువ సూర్యపుటం భూమిని చేరి భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. జూలై నెలలో భూమి సూర్యునికి ఎక్కువ దూరంలో ఉన్నందున తక్కువ సూర్యపుటం భూమిని చేరును

→ కారణంగా భూగోళ సగటు ఉష్ణోగ్రతలు జాలైలో తక్కువ.

వాతావరణ పారదర్శకత :-
→ వాతావరణ పారదర్శకత దెబ్బతిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, వాణావరణం పారదర్శకంగా వున్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

సముద్ర సామీప్యత :-
→ ఒక వస్తువుయొక్క ఉష్ణోగ్రతను 1°C మేర పెంచుటకు కావల్సిన ఉష్ణశక్తి 'విశిష్టోష్టం.

→ భూజల భాగాలు ఉష్ణోగ్రతకు విభిన్నంగా స్పందించుట వల్ల ఒక అక్షాంశం మీదవున్న భూజల భాగాలలో ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఏర్పడతాయి.

భూభాగాల ఎత్తు:-
→ సముద్ర మట్టం నుండి ప్రతీ 165 మీ, ఎత్తుకు వెళ్ళేకొలదీ ఉష్ణోగ్రతలు 2°C చొప్పున తగ్గడం వలన ఒక అక్షాంశం మీద ఉన్న రెండు ప్రాంతాలమధ్య ఉష్ణోగ్రతా వ్యత్యాసాలేర్పడతాయి .

→ Ex: ఒకే అక్షాంశం మీద వున్న లుథియానాతో పోలిస్తే సిమ్లాలో వాతావరణం చల్లగా ఉండుటకు కారణం, అది (సిమ్లా) సముద్ర మట్టం నుండి ఎక్కువ ఎత్తులో ఉండటమే.

భూభాగాల/పర్వతాల వాలు :
→ ఉ.గోళంలోని భూభాగాల/పర్వతాల దక్షిణ వాలులు సూర్యునికి ఎదురుగా ఉన్నందున ఆ ప్రాంతంలో ఎక్కువ సూర్యపుటం చేరి అధిక ఉష్ణోగ్రతలు నమోదౌతాయి.

→ అయితే ఉత్తర వాలులు సూర్యునికి వ్యతిరేక దిశలో ఉన్నందున అక్కడ తక్కువ సంర్యపుటం చేరి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అందువల్ల ఉ. గోళంలో కాఫీ, తేయాకు పంటలను పొగమంచు బారినుండి పరిరక్షించుటకు భూ భాగాల దక్షిణ వాలులతో మాత్రమే సాగుచేయడం జరుగుతోంది.

→ అయితే ద. గోళంలో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయి.

ఊర్ధ్వ ఉష్ణోగ్రతా విస్తరణ :-
→ సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళేకొలదీ ఉష్ణోగ్రతల కలిగే మార్పుయ "ఉర్ధ్వ ఉష్ణోగ్రతా విస్తరణ. సాధారణంగా అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఎత్తుకు వెళ్లే కొలదీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనినే "ఉష్ణోగ్రత క్షీణతాక్రమం " అని పిలుస్తారు.

→ కానీ కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాతాల్లో, ప్రత్యేక ఋతువులలో ఎత్తుకు వెళ్ళేకొలదీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

→ ఈ ప్రక్రియనే "ఉష్ణోగ్రతా విలోమం " అంటారు.

→ ఉష్ణోగ్రతా విలోమం జరిగే ప్రాంతాలు :
i) పర్వత నదీలోయ ప్రాంతాలు
ii ) పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు
ఉష్ణోగ్రతా విలోమ ప్రక్రియ జరగడానికి కావల్సిన అనుకూల పరిస్థితులు :

→ శీతకాలమై ఉండాలి.

→ దీర్ఘరాత్రులై ఉండాలి.

→ వాతావరణం లో తేమశాతం తక్కువగా ఉండాలి.

→ గాలుల వేగం తక్కువగా ఉండాలి.

→ పర్వత నదీలోయ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వారి నివాసాలను మరియు పంటల సాగును పర్వత వాలుల వెంబడి చేపడుతారు. కారణం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండటమే.

ఉష్ణ సమతుల్యం

→ హ్రస్వతరంగాల రూపంలో భూమి గ్రహించే సౌరవికిరణానికీ, దీర్ఘ తరంగాల రూపంలో భూమి కోల్పోయ భాను వికిరణానికి గల నిష్పత్తియే" ఉష్ణ సమతుల్యం'.

→ భూమివైపు ప్రసరించే మొత్తం సౌరవికిరణం 100 UNITS అనుకుంటే ఇందులో వాతావరణంలోని మేఘాలు 24 Units : దుమ్ము, ధూళి కణాలు 6 units

→ భూమిపై గల మంచు ప్రాంతాలు 5 Units సౌరశక్తిని భూమిని చేరనీయకుండా పరావర్తనం చెందించగా మిగిలిన 65 యూనిట్ల సౌరశక్తితో 14 లని వాతావరణంలోని నీటి ఆవిరి గ్రహించుకోగా మిగిలిన 51 యూనిట్లు సౌరశక్తి భూ ఉపరితలాన్ని చేరి వివిధ రకాల భౌగోళిక వ్యవస్థలు మరియు జీవ వైవిధ్యత : కొనసాగడానికి వినియోగించబడుతోంది.

→ దీనినే "నిర్వహణా సౌరశక్తి" అని పిలుస్తారు .

→ భూ ఉపరితలం మరియు భూవాతావరణం కలిసి గ్రహించే సౌరశక్తి పరిమాణం; 65 Units

→ భూమి యొక్క సగటు ఆల్బిడో : 35%

→ భూ ఉపరితలంపై ఆల్బిడో పరిమాణం ఎక్కువగా గల ప్రాంతాలు: మంచు ప్రాంతాలు

→ తక్కువగాగల ప్రాంతాలు : జలభాగాలు

→ 'ఆల్బిడో' అనగా, " భూవాతావరణం నుంచి పరావర్తనం చెందించబడే సౌరశక్తి పరిమాణం.

→ భూమిపై ఒకే ఉష్ణోగ్రత గల ప్రదేశాలను కలుపచూ చేయబడిన ఊహారేఖలు : "సమోష్ణోగ్రజ రేఖులు" (Tathermod)

→ భారత్ లో వార్షిక సగటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా గల ప్రాంతాలను తెలియ జేసే ISOTHERM : 24. సమోష్ణోగ్రతా రేఖ.

→ భారత్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం : జైసల్మేర్ (రాజస్థాన్) 56 c

→ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం : అల్ అజీజియా(లిబియ)

→ భారత అతి తక్కువ ఉష్ణోగ్రతలు : డ్రాస్ &కార్గిల్ ప్రాంతాలు (లడఖ్)

→ ప్రపంచంలో : వోస్టాక్ (అంటార్కిటికా) 58°

→ ఉత్తరార్ధగళంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు : వెర్కో యాన్ స్కీ (రష్యా-సైబీరియా ప్రాంతం) అందుకే దీనిని శీతల ధ్రువం (Cold Pole)" అని పిలుస్తారు.