విశ్వము - సౌరకుటుంబం



→ 'విశ్వం' అనగా కొన్నివేల మిలియన్ల గెలాక్సీలు, నీహారికలు [నెబ్బులా ] మరియు శూన్య ప్రదేశాల సమూహం.
→ విశ్వపరిధి అనంతం.
→ విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రం :
-> అమెరికన్ పరిభాష - ఆస్ట్రానమీ
-> రష్యన్ పరిభాష - కాస్మాలజీ

గెలాక్సీలు

→ "విశ్వంలో కన్పించే కొన్ని వేల మిలియన్ల నక్షత్రాల గుంపు.'
→ సూర్యుడు భాగంగావున్న గెలాక్సీయే" పాలపుంత/ఆకాశగంగ" .
→ ఇది సర్పిలాకారం (Spidal shape] లో ఉంటుంది.
→ దీనిని వివిధ పేర్లతో పిలుస్తారు.
-> చైనీయులు- 'ఖగోళనదులు"
-> హిబ్రూలు " కాంతినదులు"
-> ఎస్కిమోలు - " తెల్లని భస్మపటలాలు"
→ పాలపుంత గెలాక్సీకి అతి దగ్గరగా వున్న మరో గెలాక్సీ : ఆండ్రోమెడా
→ విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ : హైడ్రా
→ ప్రతి గెలాక్సీ లో 100 బిలియన్ల వరకు నక్షత్రాలు ఉండవచ్చు.

నక్షత్రాలు

→ స్వయం ప్రకాశక శక్తి కలిగిన ఖగోళవస్తువుల నక్షత్రాలు.
→ ఇవి స్వయం ప్రకాశకాలు కావడానికి కారణం వీటిలోని కేంద్రక సంలీన చర్చ
→ ఇంతవరకూ గుర్తించిన నక్షత్రాల్లో ప్రకాశవంతమైనది - సిరియస్-ఎ
→ అతిపెద్ద నక్షత్రం : బెటిల్ గ్లక్స్
→ భూమికి దగ్గర్లోని నక్షత్రం: సూర్యుడు
→ భూమికి దగ్గర్లోని రెండో నక్షత్రం : ప్రాక్సిమా సెంటారి
→ నక్షత్రాలలో అధిక శాతంలో గల వాయువు :
-> హైడ్రోజన్ [71% ]
-> హీలియం (26.5%. )

నీహారికలు ( నెబ్యులా)

→ విశ్వంలో వేడివాయువులచే ఏర్పడి చలన సహితంగా వున్న మేఘాల్లాంటి ఖగోళ వస్తువులు
→ హ్యూజెన్స్ అను శాస్త్రవేత్త వీటిని మొదటగా గుర్తించాడు.
→ వీటిని నక్షత్రాలకు జన్మస్థలంగా పేర్కొంటారు.

శూన్య ప్రదేశాలు

→ "గెలాక్సీలకు, నీహారికలకు మధ్యగల ఖాళీ ప్రదేశాలు ".
→ దాదాపు 97%. విశ్వం శూన్యపదేశాలచే నిండి ఉంది.
→ ఖగోళ వస్తువుల మధ్యఉన్న అత్యధిక దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు
1. కాంతి సంవత్సరం = 9.3 x 1012 km
2. పార్ సెక్ = 3.26 కాంతి సంవత్సరాలు.
3. AU [ఆస్ట్రనామికల్ యూనిట్ ] = 149.5 మిలియన్ కి.మీ. (ఇది భూమికి, సూర్యునికి మధ్యగల సగటు దూరానికి సమానం)

భూకేంద్రక సిద్ధాంతం

→ 149 A.D లో టాలెమీ అను శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు.
→ దీని ప్రకారం విశ్వానికి భూమి కేంద్రంగా ఉండి దాని చుట్టూ సూర్యుడు & ఇతర గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి.

సూర్యకేంద్రక సిద్ధాంతం

→ 1456 AD లో నికోలన్ కోపర్నికస్ దీన్ని ప్రతిపాదించాడు.
→ దీని ప్రకారం విశ్వానికి సూర్యుడు కేంద్రంగా ఉండి దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు మొ.వి పరిభ్రమిస్తూ ఉంటాయి.

విశ్వ ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతాలు

1. Big Bang Theory(మహా విస్ఫోటనా సిద్ధాంతం ) - అబ్బేలైమెట్రీ
2. Pulse Rating Theory (డోలనా సిద్ధాంతం) - అలెన్ శాండెజ్
3. నిరంతర సృష్టి సిద్ధాంతం - హెర్మన్ బోండీ , థామస్ గోల్డ్

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం

→ దీన్ని ప్రతిపాదించినది - అబ్బేలైమెటీ
→ ఈ సిద్ధాంత నిరూపణకై ఫ్రాన్స్ - స్విట్జర్లాండ్ సరిహద్దులలో నిర్వహిస్తున్న ప్రయోగం : LHC [Large Hadsions Collider]
→ విశ్వం యొక్క వయస్సు దాదాపు 12-15 బిలియన్ సం,లు.
→ సూర్యుడు పాలపుంత కేంద్రకం చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు. కావలసిన 250 మి. సం.ల కాలాన్ని " కాస్మిక్ సంవత్సరము" అంటారు.
→ సూర్యుడు తన చుట్టూ తాను ఒక సారి తిరగడానికి పట్టు కాలం: 25 రోజులు


సౌర కుటుంబం

→ సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ దాని చుట్టూ పరిభ్రమించే 8 గ్రహాలు, పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్ [ ప్లానిటాయిడ్స్] లేదా లఘు గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు & అంతర గ్రహధూళి వంటి అనేక ఖగోళ వస్తువుల సముదాయమే సౌరకుటుంబం".

సూర్యుడు

1. Photosphere (హితమండలం)
2. Chromosphere (వర్ణావరణం )
3. Karonaa
→ సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టుకాలం 8.2 నిమిషాలు
→ సూర్యుడు భూమికన్నా 109 రెట్లు పెద్దది.
→ సూర్యుని దేహంలోని ఉష్ణోగ్రతా వ్యత్యాసాన్ని అనుసరించి '3' భాగాలు గుర్తించవచ్చు.
అవి:
1. కాంతి మండలం :-
→ సూర్యుని ఉపంతలంపై ప్రకాశవంతంగా, ప్రత్యక్షంగా కన్పించే భాగం.
→ ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు: 6000 °C
→ దీనిలోని నల్లటి కాంతవనమైన మచ్చలే " సూర్యాంకాలు/Sunspot/బ్లాక్ స్పాట్స్ "
→ ఈ ప్రాంతం నుండి ప్రతీ 11 సం॥లకు ఒకసారి భూవాతావరణం వైపు వెదకాలబడే విద్యుదావేశష్టంత కణజాల సమూహమే సౌర జ్వాలలు/ సౌర పవనాలు/ సౌరసునామీలు.
→ వీటి కారణంగా భూమ్మీద సమాచార వ్యవస్థకు అంతరాయం కలగడం, బ్యాకింగ్ కార్యకలాపాలు అస్తవ్యస్తం కావడం జరుగుతుంది.

2. వర్ణావరణము :-
→ Photosphere పై భాగంలోని ఎరుపు/ఆరంజ్ వర్ణపు భాగం.
→ ఇది ఉదయం, సాయంత్ర సమయాల్లో మాత్రకు కన్పిస్తుంది.
→ ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు : 52000 °C ఉండొచ్చని అంచనా.
→ ఈ ప్రాంతంలోని నల్లటి రేఖలను ఫ్రాన్పోపర్ రేఖలు' అంటారు.

3. కరోనా :-
→ క్రోమోస్పియర్ పైనగల సూర్యునిలోని భాగం.
→ ఇది గ్రహణ సమయాలలో మాత్రమే కన్పిస్తుంది.
→ ఇక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు 27,00,000°C
→ సూర్యుని కేంద్రక భాగంలోని ఉష్ణోగ్రతలు 15 మిలియన్ డిగ్రీల కెల్విన్ వరకు ఉండవచ్చని అంచనా.
→ సూర్యుని వయస్సు దాదాపు 5 బిలియన్ల సంవత్సరాలు.



గ్రహాలు (Planets)

→ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుని నుండి వెలుతురు, వేడిమిని పొందే ఖగోళ వస్తువులే "గ్రహాలు".
→ ప్రస్తుతం సౌరకుటుంబంలోని గ్రహాల సంఖ్య: '8'
→ అక్టోబర్ 26న ప్రేగ్ లో జరిగిన IAU సమావేశంలో ఫ్లూటకు గ్రహస్థాయి లేదని అందువల్ల క్రింది కారణాల వల్ల గ్రహస్థితి నుండి దానిని తొలగించడమైనదని ప్రకటించారు. అవి :
*దీనికక్ష్యా మార్గం అతి దీర్ఘవృత్తాకారంలో ఉండటం;
* దీనికి తగినంత గురుత్వాకర్షణ శక్తి లేనందున గోళాకృతిని పొందలేక పోవడం
* దీనికి తగినంత అంతర్గత శక్తి లేనందున తన కక్ష్యా మార్గంలోని ప్రవేశించే ఇతర ఖగోళ వస్తువులను తొలగించలేకపోవడం

మరుగుజ్జు గ్రహాలు:-
1.ప్లూటో
2. ఎరిస్
3. సెరీస్

→ భూకక్ష్య ఆధారంగా సౌరకుటుంబంలోని గ్రహలు '2' వర్గాలు :-
నిమ్నత గ్రహాలు (Inferior) :-
→ భూకక్ష్యకు లోపల సూర్యునికి దగ్గరగా ఉండేవి.
ex: బుధుడు, శుక్రుడు

ఉన్నత గ్రహాలు (Superior):-
→ భూకక్ష్యకు వెలుపల సూర్యునికి దూరంగా ఉండేవి.
Ex:- అంగారకుడు(కుజుడు )(Mars), బృహస్పతి/ గురుడు (Jupter), శని (saturn), యురేనస్ /వరుణుడు, నెఫ్ట్యూన్/ఇంద్రుడు

→ గ్రహాల భౌతిక, రసాయనిక లక్షణాల ఆధారంగా 2 వర్గాలు
1. అంతర/భౌమ గ్రహాలు :-
→ శిలానిర్మితమై, అధిక ఉష్ణోగ్రత, అధిక సాంద్రతలను కలిగి, చుట్టూ ఎటువంటి వలయ నిర్మాణం లేకుండా పరిమాణంలో సాపేక్షంగా చిన్నవిగా ఉండే గ్రహాలు
→ అవి : బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు

2. బాహ్య/జీవియన్ గ్రహాలు :
→ విషపూరిత వాయువులు ద్రవీభవించగా ఏర్పడి, అల్ప ఉష్ణోగ్రత, అల్ప సాంద్రతలని కలిగి చుట్టూ వలయ నిర్మాణం కలిగి సాపేక్షంగా పరిమాణంలో పెద్దవిగా ఉండేవి.
→ అవి: బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్

గ్రహాల ప్రత్యేక లక్షణాలు :-

బుధుడు

→ అతిచిన్న గ్రహం.
→ ఉపగ్రహాలు లేని గ్రహం
→ దీన్నే " అపోలో" అనీ, " బ్లూ ప్లానెట్ " అనీ పిలుస్తారు.
→ దీనినే " ఉపగ్రహ గ్రహం"గా కూడా పిలుస్తారు.
→ దీని భ్రమణ [58 days], పరిభ్రమణ [88 days] కాలాలు దాదాపు సమానం.
→ అందువలన సౌరకుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం గ్రహముగా దీనిని పరిగణిస్తారు.

శుక్రుడు

→ భూమికి అతి సమీపంలోని గ్రహం. భూమిని పోలి ఉంటుంది.
→ దీన్నే "ఉదయతార, "సంధ్యాతార" అని పిలుస్తారు.
→ 95% ఈ గ్రహ వాతావరణం CO2 చే ఏర్పడి ఉంటుంది.
→ అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. కాంతి పరావర్తనం చెందడం వలన) ఎక్కువ అత్యంత వేడి/ఉష్ణోగ్రత గల గ్రహం.
→ అత్యంత " Green House Gffect గల గ్రహం.
→ దీనినే " భూమి యొక్క కవల " అంటారు. సాంద్రత, ద్రవ్యరాశి, పరిమాణం అనే '3' లక్షణాలు రెండింటికీ దాదాపు సమానం.
→ దీని ఆతభ్రమణ కాలం(243 days), పరిభ్రమణ కాలం (223 days) కన్నా ఎక్కువ.
→ ఇది మిగిలిన గ్రహాలకు భిన్నంగా తూర్పునుండి పడమరకు (సవ్యదిశలో ] తిరగడం వలన ఈ గ్రహంపై సూర్యుడు పడమర ఉదయించి, తూర్పున అస్తమిస్తాడు.
→ గ్రీకులు దీనిని "అందమైన దేవత " గా పూజిస్తారు. - ఉపగ్రహాలు లేని గ్రహం.

భూమి

→ సూర్యునికీ, భూమికీ మధ్య దూరం స్థిరంగా ఉండరుతుంటుంది. కారణం దీని కక్ష్యా మార్గం దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది.

పరిహేళి :-
→ సూర్యునికీ, భూమికీ మధ్యగల కనిష్ట దూరం (147mkm) ను సూచిస్తుంది.
→ ఇది జనవరి 3న సంభవిస్తుంది.

అపహేళి :-
→ ఇది సూర్యునికీ, భూమికి మధ్యగల గరిష్ట దూరం (152 mkm) ను సూచిస్తుంది.
→ ఇది జూలై 4 న సంభవిస్తుంది.

→ సూర్యునికీ, భూమికి మధ్యగల సగటు దూరం. -149.5 మి.కి.మీ.
→ భూమినే " జీవగ్రహం", "జలయుత గ్రహం", "నీలిగ్రహం" అని పిలుస్తారు.
→ గ్రహాలన్నింటిలోకెల్లా అత్యధిక సాంద్రతగల గ్రహం. [5.2 g/cc ]
→ సూర్యుని నుండి దూరాన్ని బట్టి 3 వ గ్రహం, పరిమాణాన్ని బట్టి 5వ పెద్ద గ్రహం
→ దీనికి గల ఉపగ్రహాల సంఖ్య : '1' (చంద్రుడు)

చంద్రుడు

→ చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టుకాలం : 1.3 Sec.
→ భూమి గురుత్వాకర్షణ శక్తితో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి 6వంతు ఉంటుంది.
→ చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలు (27 1/3 days) పూర్తిగా సమానం. కావున చంద్రుని ఒక అర్ధభాగం ఎల్లపుడూ భూమివైపు, రెండో అర్థ భాగం వ్యతిరేకదిశలో ఉంటుంది.
→ చంద్రుని భ్రమణ లేదా పరిభ్రమణ కాలాలను రెండు విధాలుగా లెక్కించారు.
1. స్థిర నక్షత్రాలను ఆధారంగా చేసుకొని చంద్రుడు తనచుట్టూ తాను లేదా భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే 27 1/3 రోజుల కాలము ను 'చాంద్ర నక్షత్రమాసం [Synatic month]' అంటారు.
2. సూర్యుని సాపేక్షత ద్వారా లెక్కించిన చంద్రుడు తన చుట్టూ తాను లేదా భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే 29 1/2 రోజుల కాలమును "చాంద్రమాన మాసం" అంటారు.
→ భూమికీ, చంద్రునికీ మధ్య దూరం స్థిరంగా ఉండక మారుతుంది. కారణం దీని కక్ష్యామార్గం దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది .
→ భూమికీ, చంద్రునికీ మధ్యగల కనిష్ట దూరం - పెరీజీ.
→ భూమికీ, చంద్రునికీ మధ్యగల గరిష్ట దూరం- అపోజీ.
→ 1969, July 21 న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చంద్రునిపైకి పంపిన వాహక నౌక (Space Crafe) : అపోలో-II.
→ ఈ నౌకలా చంద్రునిపై కాలు మోసిన ఆస్ట్రోనాట్స్ : నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ,మైకెల్ కొలైన్, ఎడ్విన్ ఆల్డ్రిన్
→ ఈ ముగ్గురు ఆగ్రోనాట్స్ పరిశోధనల నిమిత్తం భూమికి తీసుకొచ్చిన మట్టికి పెట్టిన పేరు: "ఆల్గ్మో కొలైట్".
→ అపోలో-II వాహక నౌక చంద్రునిపై దిగిన మారియస్ ప్రాంతాన్ని "ప్రశాంత సముద్రం" [Sea of Tranquilett) గా పిలుస్తారు.
→ చంద్రుని మీద అత్యత ఎత్తయిన శిఖరం: లిబ్నిట్జ్

భూ ఆవిర్భావ సిద్ధాంతాలు :-
1. వాయు పరికల్పనా (Gassies man) సిద్ధాంతం - ఇమ్మాన్యుయల్ కాంట్
2. నీహారికా పరికల్పనా సిద్ధాంతం- లాప్లెస్
3. గ్రహకాల పరికల్పనా సిద్ధాంతం - చాంబర్లీన్ & మౌల్టన్
4. ద్వినక్షత్ర సిద్ధాంతం - లిటిల్టన్ & రస్సెల్
5. తరంగ పరికల్పనా సిద్ధాతం - జీన్స్ & జెఫ్రీస్ (Tidal hypothesis)

అంగారకుడు

→ "ఎరుపుగ్రహం/అరుణ గ్రహం
→ భూమి తర్వాత జీవి ఉండొచ్చని భావించబడుతున్న గ్రహం. - ఉపగ్రహాల సంఖ్య '2''.
* ఫోబస్
* డెమోస్

బృహస్పతి

→ పరిమాణం పరంగా సౌరకుటుంబంలో అతిపెద్దది.
→ దీనికారణంగా ఈ గ్రహాన్ని " నక్షత్రగ్రహం" అని పిలుస్తారు.
→ సౌరకుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం.
→ ఉపగ్రహాల సంఖ్య - '63.
→ ముఖ్యమైనవి : -
* గనిమెడ (సౌరకుటుంబ ఉపగ్రహాల్లో అతిపెద్దది)
*యొరోఫో
* కాలిష్టా
→ ఆత్మ భ్రమణకాలం అతి తక్కువగా [9.45 గం. ని॥లు) గల గ్రహం.
→ దీనిని "ఎర్రటి మచ్చలు గల గ్రహం' అని పిలుస్తారు. -

శని

→ పరిమాణంలో 2 వ అతి పెద్దది.
→ ఉపగ్రహాల సంఖ్య '58'.
→ ముఖ్యమైనది టైటాన్
→ అతి తక్కువ సాంద్రత గల గ్రహం.
→ ఈ గ్రహం చుట్టూ మూడు అందమైన వలయాల కారణంగా దీన్ని "అందమైన గ్రహం" గా పిలుస్తారు.
→ దీన్ని "Cruel Planet " మరియు Golden planet" అంటారు.

యురేనస్

→ శుక్రగ్రహం వలె ఇది కూడా తూర్పునుండి పడమరకు తనచుట్టూ తాను. తిరగడం వల్ల ఈ గ్రహంపై సూర్యుడు పడమర ఉదయించి, తూర్పున అస్తమిస్తాడు.
→ దీని అక్షము ఒక వైపుకు ఎక్కువగా వాలి ఉన్నందున ఈ గ్రహంపై సుదీర్ఘమైన పగలు మరియు రాత్రిళ్ళు ఏర్పడును.
→ అందువలన దీనిని "Lapsicles Planet" అంటూరు.
→ దీన్ని Green Planet " అని పిలుస్తారు.
→ ఉపగ్రహాల సంఖ్య '27
ముఖ్యమైనవి:-
* ఉమబ్రీల్
* మీరండా
* ఏరియల్
* టిటానియా

నెప్ట్యూన్

→ సూర్యునికి అత్యంత దూరంలో గల గ్రహం.
→ సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం.
→ పరిభ్రమణకాలం అధికం(264 yrs).
→ ఉపగ్రహాల సంఖ్య '13'.
→ ముఖ్యమైనవి : ట్రిటాన్

ఆస్టరాయిడ్స్/Planetoids/లఘుగ్రహాలు : [శిలాశకలాలు)

→ "సౌరకుటుంబంలో గురు, అంగారక గ్రహాలమధ్య సూర్యుని చుట్టూ దీర,పత్తాకార మార్గం లో పరిభ్రమించే చిన్నచిన్న శిలాశకలాలు".
→ వీటిలో అతిపెద్ద ఆస్టరాయిడ్: సెరస్
→ చిన్న ఆస్టరాయిడ్ : హెన్సీ

తోకచుక్కలు

→ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార వర్గంలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు & వాయువులచే ఏర్పడివున్న ఖగోళవస్తువులే "తోకచుక్కలు
→ తోకచుక్కలు తమ కక్ష్యా మార్గంలో అపహేళ 'స్థానంలో ఉన్నపుడు వాటి దేహంలో దుమ్ము ధూళి కణాలచే ఏర్పడిన కేంద్రకం, వాయువులచే ఏర్పడిన "తల/క్రమా" అనే రెండు భాగాలు ఉంటాయి.
→ పరిహేళీ స్థానంలో ఉన్నపుడు "తోక" అనే మూడవభాగం కూడా ఏర్పడును.
→ ఇంతవరకూ గుర్తించిన తీక చుక్కల్లో ముఖ్యమైనది: హేలీ తోకచుక్క. ఇది ప్రతీ 76 సం.లకు ఒకసారి భూమిని సమీపిస్తుంది. చివరిసారిగా 1966 లో ఇది భూమికి దగ్గరగా రావడం జరిగింది.

ఉల్కలు

→ తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్ లాంటి చిన్నచిన్న ఖగోళ వస్తువులు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకొని భూవాతావరణంలోని మీసో ఆవరణ ప్రాoతంలోకి ప్రవేశించగానే అక్కడన్న ఘర్షణలలాల కారణంగా ప్రకాశవంతంగా మండిపోతాయి. వీటినే "ఉల్కలు" (meteors) అంటారు.
→ భూ ఉపరితలాన్ని చేరినటువంటి ఉల్కా శిలాభాగాలను "ఉల్కాపాతాలు" అని పిలుస్తారు.
→ వీటి దేహభాగం ప్రధానంగా సికెల్, ఐరన్ మూలకాలచే ఏర్పడి ఉంటుంది. .
→ భూమి అంతర్ నిర్మాణాన్ని తెలుసుకోవడంలో పరీక్ష ఆధారంగా. వీటినుపయోగిస్తారు.