భారత చరిత్ర


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన బోనాలు పండుగను రాష్ట్ర పండుగ గా ప్రకటించింది?
A.జూన్ 2 ,2016
B.ఆగస్టు 15,2015
C.మే 26,2015
D.జూన్ 16 2014


బోనాల పండుగ లో,క్రింది వాటిలో అమ్మవారి సోదరుడు ఎవరు?
A.కాలికుడు
B.పరశు రాముడు
C.పోతురాజు
D.రంగడు


ఒకప్పటి ఏ పూజారి ప్రతిరూపం పోతురాజు?
A.చెంచు
B.గోండా
C.బైండ్ల
D.లంబాడి


పోతురాజు ని భక్తులు ఏ విధంగా భావిస్తారు?
A.భక్త సమూహానికి రక్షకుడిగా
B.గ్రామ భద్రత గా
C.పూజ నిర్వహకుడిగా
D.గ్రామ ప్రజల యోగా క్షేమ సేవకుడిగా


బోనాల పండుగ లో, అమ్మవారి పూనకం లో ఉన్న భక్తురాళ్ళను ఎక్కడికి తీసుకెళ్తారు?
A.పోతురాజు దగ్గరికి
B.అమ్మవారి సమక్షానికి
C.ఊరి అవతలికి
D.ఏదీ కాదు


బోనాల పండుగ లో, భక్తులు పూనకం వచ్చిన పోతురాజు కి దేన్ని అందిస్తారు?
A.దున్నపోతు
B.నాటుకోడి
C.మేక పోతు
D.నైవేద్య,ప్రసాదాలు


పోతురాజు మేకపోతు గొంతు కొరికి తల, మొండి వేరుచేసే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు?
A.బలి ఇవ్వడం
B.గావు పట్టడం
C.అమ్మ బలిదానం
D.మేక బలి


బోనాల పండుగ నాడు పూనకం వచ్చిన శివసత్తులు నిలబడి ఏం చేస్తారు?
A.పూర్వజన్మ విషయాలు
B.అమ్మవారి మహిమలు
C.గ్రామం కి జరిగే సంఘటనలు
D.భవిష్య వాణి


బోనాల పండుగ లో, పూనకం వచ్చిన శివ సత్తులు భవిష్యవాణి చెప్పే తంతుని ఏమని పిలుస్తారు?
A.అలుసుతోక్కుడు
B.రంగమెక్కుడు
C.భవి భవిష్య
D.శివ భవిష్య


బోనాల పండగ లో, రంగంలో చెప్పినవన్నీ జరుగుతాయని ఎవరు నమ్ముతారు?
A.శివ సత్తులు
B.గ్రామ పెద్దలు
C.ప్రజలు
D.ఉపవాస దీక్షకులు

Result: