కమిటీలు

నూతన సహకార విధానం రూపకల్పనకు కమిటీ

నూతన జాతీయ సహకార విధానం రూపకల్పన కోసం కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ ప్రభు ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన 47 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక సహకార సంఘాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులకు ఇందులో స్థానం కల్పిస్తారు. ప్రస్తుత విధానాన్ని 2002లో రూపొందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాల్లో సుమారు 29 కోట్ల మంది సభ్యులున్నారు. సహకారంతో సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అనువైన నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.