ముఖ్యమైన దినోత్సవాలు

రాజ్యాంగ దినోత్సవం

మన రాజ్యాంగమే దేశానికి స్ఫూర్తి అనీ, రాజ్యాంగ పీఠికలో ‘భారతదేశ ప్రజలమైన మేం..’ అనే తొలి మూడు పదాలు ఒక పిలుపు, విశ్వాసం, ప్రతిజ్ఞలాంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు తొలి ప్రాధాన్యం కావాలని, దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడానికి ఇది అవసరమని చెప్పారు.
ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారత్‌వైపు యావత్‌ ప్రపంచం చూస్తోందని ప్రధాని చెప్పారు.