ఆంధ్ర ప్రాంత, ఆంధ్ర జాతి తొలి ప్రస్తావనలు

కాగ్‌ నివేదికల్లోని అంశాల పరిశీలనకు మూడు ఉపసంఘాలు

కాగ్‌ నివేదికల్లోని వివిధ అంశాలపై పరిశీలన జరిపి పార్లమెంటుకు నివేదికలు సమర్పించడానికి వీలుగా ప్రజా పద్దుల కమిటీ మూడు ఉపసంఘాలను ఏర్పాటు చేసింది.
ఈ మూడింటికీ ఛైర్మన్‌గా అధిర్‌రంజన్‌ చౌదరి వ్యవహరించనుండగా, కన్వీనర్లుగా కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్‌ గోహిల్, భాజపా సభ్యుడు సత్యపాల్‌ సింగ్, ఏఐడీఎంకె సభ్యుడు ఎం.తంబిదురై ఉంటారు.
ఒక ఉపసంఘం సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, ప్రోత్సాహం, నగదు నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ ఖాతాల వెలుపల అక్రమంగా నిధులను దాచిపెట్టడం, ప్రావిడెంట్‌ ఫండ్‌కు ఉద్యోగుల అధిక చందా, విద్యుత్తు ఛార్జీల్లో పరిహరించదగ్గ చెల్లింపులు, రైల్వే ఉత్తర్వుల అమలులో వైఫల్యం తదితర అంశాలపై అధ్యయనం చేసింది.
ఒక ఉపసంఘంలో ఏపీకి చెందిన వైకాపా సభ్యుడు బాలశౌరి వల్లభనేని, భాజపా సభ్యుడు సీఎం రమేష్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా బాలశౌరి

లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ చైౖర్మన్‌గా వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి నియమితులయ్యారు.
లోక్‌సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది. కమిటీలో సభ్యుడిగా తెరాస ఎంపీ నామానాగేశ్వరరావు నియమితులయ్యారు.
ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, బాలశౌరి, లోక్‌సభ సభ్యులకు ఇళ్లు కేటాయించే హౌస్‌ కమిటీ సభ్యుడిగా విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించారు.