రాజ్యసభ 70వ ఆవిర్భావ దినోత్సవం
→నవ భారత నిర్మాణంలో పార్లమెంటు ప్రభావశీలమైన పాత్రను పోషించాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
→పార్లమెంటు గ్రంథాలయ భవనంలో నిర్వహించిన ‘రాజ్యసభ 70వ ఆవిర్భావ దినోత్సవ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
→ఎగువసభను ఏర్పాటు చేసి గత ఏప్రిల్ 3వ తేదీకి 70 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. గత 70 ఏళ్ల అమోఘమైన ప్రయాణంలో రాజ్యసభ ఇప్పటి వరకు 256 సెషన్లను నిర్వహించిందని తెలిపారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం - 2022
→భారత్‌లో పొగాకు ఉత్పత్తుల ద్వారా పోగుపడే చెత్తాచెదారం తొలగింపునకు ఏటా అవుతున్న ఖర్చు 766 మిలియన్ డాలర్లు (రూ.5,946.3 కోట్లు) అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ భారం చైనాపై రూ.20,184 కోట్లు కాగా, బ్రెజిల్, జర్మనీలపై రూ.1,552 కోట్ల మేర ఉన్నట్లు వివరించింది. ఈ భారమంతా పన్ను చెల్లింపుదారులపై పడుతోందని పేర్కొంది. భారత్‌లో చెత్త తొలగింపునకు ఏటా అవుతున్న వ్యయంలో పొగాకు ఉత్పత్తుల వాటా 9.57 శాతం ఉన్నట్లు తెలిపింది. ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పొగాకు ఉత్పత్తులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు పైగా మనుషుల ప్రాణాలు, 60 కోట్ల చెట్లు నష్టపోతున్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలతో పాటు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర నగరాల్లో ‘బాధ్యుడే ఖర్చు భరించాలి’ అనే ప్రాతిపదికన కొత్త చట్టాలు చేసినట్లు తెలిపింది. ఫలితంగా ఈ చెత్త తొలగింపు ఖర్చులు పొగాకు ఉత్పత్తుల పరిశ్రమలే భరిస్తున్నట్లు పేర్కొంది.
ఆన్‌లైన్‌లో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ:-
→ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేస్తూ.. ఆన్‌లైన్‌లో మైగవ్ వేదికగా పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
→మే 31 మొదలు జూన్ 21 దాకా గరిష్ఠ సంఖ్యలో ప్రజలు ఈ ప్రతిజ్ఞ చేసేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రోత్సహించాలని కోరింది.
తెలంగాణలో 13 లక్షల మందికి హైబీపీ
→జీవనశైలి వ్యాధుల (ఎన్‌సీడీ)పై ప్రతి ఒక్కరూ అవగాహన, అప్రమత్తతతో ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జీవనశైలి వ్యాధులపై స్క్రీనింగ్ చేపట్టిందని తెలిపారు.
→ ప్రస్తుతం 90 లక్షల మందికి రక్త, మూత్ర ఇతర పరీక్షలు నిర్వహించగా, 13 లక్షల మంది అధిక రక్తపోటుతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలిందన్నారు.
→ ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా గ్లెనిగల్ గ్లోబల్ ఆసుపత్రి, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్), కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అధిక రక్తపోటుపై నిర్వహించిన అధ్యయన ఫలితాలను మంత్రి విడుదల చేశారు.
→ ఈ అధ్యయనంలో భాగంగా భాగ్యనగరంలో 9 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 40.7 శాతం మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు తేలిందన్నారు.
→ మరో 39.8 శాతం మంది లో అధిక రక్తపోటు ముప్పు (ప్రీ హైపర్ టెన్షన్) ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో దేశవ్యాప్తంగా తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.