ఇండియన్ పాలిటీ


రాజ్యాంగంలోని నిబంధన 371 (జి) ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక నిబంధనను గురించి పేర్కొన్నది?
A.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
B.అస్సాం
C.మిజోరం
D.మణిపూర్


భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన గురించి పేర్కొన్నది?
A.నిబంధన 338
B.నిబంధన 343
C.నిబంధన 359(ఎ)
D.నిబంధన 352


ఉమ్మడి జాబితాలో వలె రాష్ట్ర జాబితాలలోని కొన్ని అంశాలకు సంబంధించి చట్టాలు చేయడానికి పార్లమెంటుకు గల తాత్కాలిక అధికారం గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
A.నిబంధన 363
B.నిబంధన 365
C.నిబంధన 368
D.నిబంధన 369


రాజ్యాంగంలోని నిబంధన 356 దేని గురించి పేర్కొన్నది?
A.రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపు
B.ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధలను
C.రాష్ట్రపతి,గవర్నర్ పదవులకు గల రక్షణ
D.జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన


రాజ్యాంగంలోని నిబంధన 343 ప్రకారం కేంద్ర అధికార భాష ఏది?
A.ఆంగ్లం
B.హిందీ
C.మరాఠీ
D.మలయాళం


రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సమయంలో అనుసరించవలసిన నిబంధనల గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది?
A.239 వ నిబంధన
B.239 (ఎ)(బి) నిబంధన
C.239 (బి) నిబంధన
D.241 వ నిబంధన


రాజ్యాంగంలోని నిబంధన 312 దేని గురించి పేర్కొన్నది?
A.అఖిల భారత సర్వీసులు
B.ఆర్థిక సంఘం ఏర్పాటు
C.చట్టం ద్వారా మాత్రమే పన్ను విధింపు
D.కేంద్ర ప్రభుత్వ రుణాలు


రాజ్యాంగ నిబంధన 256 లోని అంశాలు ఏవి?
A.అంతర్ రాష్ట్ర మండలి
B.రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ
C.రాష్ట్రాల మరియు కేంద్రాల యొక్క బాధ్యతలు
D.ఆగంతుక నిధి


రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర ప్రభుత్వ రుణాల గురించి ప్రస్తావించింది?
A.279 (ఎ) నిబంధన
B.280 వ నిబంధన
C.292 వ నిబంధన
D.269(ఎ)నిబంధన


రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర అధికార భాష గురించి పేర్కొన్నది?
A.నిబంధన 324
B.నిబంధన 323
C.నిబంధన 343
D.నిబంధన 338

Result: