భారత దేశం వ్యవసాయం

•భారత వ్యవసాయం అనేది ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది.
•అందువలన భారత వ్యవసాయాన్ని ఋతుపవనాల జూదం అంటారు .
•భారత దేశంలో వ్యవసాయం క్రింద ఉన్న భూమి 155 మి.హెక్టార్లు
భారత దేశం లో పంట కాలాలు
•మన దేశం లో సంవత్సరమును 3 వ్యవసాయ ఋతువులుగా విభజించారు -ఖరీఫ్,రబీ,జయాద్
ఖరీఫ్:-
• ఖరీఫ్ అనగా వేసవి కాలం
•జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది .నైఋతీ ఋతుపవన కాలంతో ఏకీభవిస్తుంది .
•ఈ కాలం లో ప్రధాన పంట వరి .ఇతర పంటలు వేరు శనగ,జనుము,మొక్క జొన్న
•పంట కాలం 5 నెలలు
రబీ
•నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది లో పండించే ప్రధాన పంటలు
•గోధుమ,బార్లీ,పప్పుధాన్యాలు
జయాద్
•వేసవిలో పండించే స్వల్ప కాల పంటలు
•మార్చి నుంచి మే వరకు
•వివిధ రకాల పంటలు
1) ఆహార పంటలు
వరి,గోధుమ,జొన్న,మొక్కజొన్న ,సజ్జ,రాగి
2) నగదు పంటలు
ప్రత్తి,పొగాకు,జనుము,చెరకు
3) తోట పంటలు
కాఫీ,తేయాకు ,సుగంధ ద్రవ్యాలు,కొబ్బరి,రబ్బరు,
4) ఉద్యానవన పంటలు
కూరగాయలు
పండ్లు,పూలు
భారతదేశ పంటల సాగు
1) వరి
•వరి యొక్క శాస్త్రీయ నామం - ఒరైజా సటైవా
•వరి సాగు చేయు వర్షపాతం -100-200
•ఇది ఉష్ణమండల పంట
•2004 సంవత్సరాన్ని UNO అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించారు .
•ప్రపంచ వరి విస్థీర్ణంలో అగ్ర స్థానం భారతదేశం ,వరి ఉత్పత్తిలో అగ్రస్థానం- చైనా
•భారత దేశంలో వరి ఉత్పత్తిలో మొదటి స్థానం -పశ్చిమ బెంగాల్
•వరి ఎగుమతులలో భారత దేశం 4 వ స్థానం లో ఉంది .
•దేశంలో వరి అత్యధికంగా ఉత్పత్తి చేయు జిల్లాలు పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి గోల్డ్ రైస్ లో విటమిన్ ఏ అధికము గా ఉంటుంది .
•వరి పొలాల నుంచి విడుదలయ్యే వాయువు -మీథేన్
గోధుమ:-
•ఇది సమ శీతోష్ణ పంట
•గోధుమల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు
చైనా,భారత దేశం
•భారత దేశంలో
ఉత్తర ప్రదేశ్
పంజాబ్
హర్యానా
మొక్కజొన్న
•ఉష్ణ మండల పంట
•50-100 సెం.మీ వర్షపాతం అవసరం
•మొక్క జొన్న ఉత్పత్తిలో అగ్ర రాస్ట్రాలు కర్ణాటక ,ఆంధ్ర ప్రదేశ్
•తెలంగాణాలో కరీం నగర్ మరియు నిజామబాద్ జిల్లాలు మొక్క జొన్నను అధికం గా పండిస్తాయి.
జొన్న
•ఉష్ణ మండల పంట
•అన్ని ఋతువులలో పండుతాయి .
•ప్రపంచంలో జొన్న పంటను అధికంగా ఉత్పత్తి చేయు దేశాలు- అమెరికా చైనా
•భారతదేశంలో జొన్నను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం -మహారాష్ట్ర
రాగులు
•దీనిలో అధికముగా ఇనుము పోషక పదార్ధము ఉంటుంది .
•ప్రపంచ రాగుల ఉత్పత్తిలో భారత దేశం ప్రధమ స్థానంలో కలదు .
•దీనికి 50-100 సెం.మీ వర్షపాతం అవసరం
•విశాఖపట్నం జిల్లాలో రాగులను అధికంగా పండిస్తున్నారు .
సజ్జ
•సజ్జను అధికముగా భారత దేశం పండిస్తున్నది .
•సజ్జను అధికముగా పండిస్తున్నరాష్ట్రాలు -రాజస్థాన్,మహారాష్ట్ర
పప్పుధాన్యాలు
•పప్పు దినుసులను అధికముగా ఉత్పత్తి చేయు రాష్ట్రం --మధ్య ప్రదేశ్
•పంటమార్పిడికి ఇవిఎంతగానో ఉపయోగం
•శనగల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ ,కందుల ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానం
వేరు శనగ
•220- 28 0 ఉష్ణోగ్రత 50-70 cm వర్షపాతం అవసరం
•వేరు శనగ ఉత్పత్తిలో చైనా,భారత దేశం అగ్ర స్థానాలలో కలవు .
• భారత దేశం లో గుజరాత్
నగదు పంటలు
చెరకు
•100-150 సెం.మీ వర్షపాతం అవసరం
•ప్రపంచంలో చెరకును అధికంగా ఉత్పత్తి చేయు దేశాలు -బ్రెజిల్ ,భారతదేశం
• భారత దేశం లో ఉత్తర ప్రదేశ్ ,మహారాష్ట్ర చెరకు ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి .
ప్రత్తి
•ప్రత్తి జన్మస్థానం సింధూ నది లోయ
•50-100 సెం.మీ వర్షపాతం అనుకూలం .
•ప్రత్తి పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం
•ప్రత్తి ఉత్పత్తిలో మొదటి స్థానం -చైనా రెండవ స్థానం -భారతదేశం
•భారత దేశం లో గుజరాత్
జనుము
•దీనిని గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటారు .
•జనుముని అత్యధికముగా ఉత్పత్తి చేయు దేశాలు -భారత దేశం ,బంగ్లాదేశ్
పొగాకు
•భారత దేశంలో 1508 లో పోర్చుగీసువారు ప్రవేశపెట్టారు.
•వర్షపాతం -100 సెం.మీ కావాలి
•పొగాకును ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశాలు- చైనా భారత దేశం
•భారత దేశంలో పొగాకును అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రాలు గుజరాత్
•ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా వర్జీనియా పొగాకు పండును
తేయకు
•తేయాకు జన్మస్థలం China .
•తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు -భారత్,చైనా
•తేయాకు అధికంగా ఉతపత్తి చేస్తున్న రాష్ట్రాలు -అస్సాం ,పశ్చిమ బెంగాల్
•ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైన సువాసన కల్గిన అరోమాటిక్ టీ పండించే ప్రాంతం -డార్జిలింగ్
కాఫీ :
•కాఫీ జన్మస్థానం అనీబీసియాలోని కప్పా .
•600-1800 మీ.ఎత్తులో పెరుగును
•ప్రపంచంలో కాఫీని ఎక్కువగా పండించు దేశాలు - బ్రెజిల్,వియత్నాం,ఇండియా
•భారతదేశం లో కాఫీని అధికంగా పండించే రాష్ట్రాలు-కర్ణాటక
•ఆంధ్రప్రదేశ్ లోని కాఫీ పండించే ప్రాంతం విశాఖపట్నంలోని అరకు లోయ
కొబ్బరి
•ఈ వృక్షంలోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి .
•ప్రపంచంలో కొబ్బరిని అధికంగా ఉత్పత్తి చేయు దేశాలు -ఇండోనేషియా ఫిలిప్పైన్స్
సుగంధ ద్రవ్యాలు
•సుగంధ ద్రవ్యాలు అధికంగా లభించే దేశాలు .
1.ఇండోనేషియా
2. భారత దేశం
•భారత దేశం లో కేరళను అని పిలుస్తారు .
•సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో కేరళ ప్రధమ స్థానంలో ఉంది.
•యాలకుల ఉత్పత్తిలో భారత దేశం అగ్రస్థానం .
•మిరియాల ఉత్పత్తిలో ఇండోనేషియా అగ్రస్థానం
•పసుపు ఉత్పత్తిలో అగ్రస్థానం భారత దేశం
•భారతదేశం లో ఆలుగడ్డని ఎక్కువగా పండిచే రాష్ట్రం - ఉత్తర ప్రదేశ్
పండ్ల తోటలు
•మామిడి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం.
•మామిడి,జామ ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానం లో ఉంది.
•అరటి పండ్లను అధికంగా సాగు చేస్తున్న రాష్ట్రం తమిళనాడు
•ఆపిల్ పండ్లను అధికంగా పండిస్తున్న రాష్ట్రం - హిమాచల్ ప్రదేశ్
•ఆరంజ్ పండ్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - మహారాష్ట్ర