భారత దేశం-నదులు

•నదుల అధ్యయనం ను పోటమాలజీ అంటారు .బంగాళాఖాతంలో 77% నదులు కలుస్తుండగా ,అరేబియా సముద్రంలో 23% నదులు కలుస్తున్నాయి .
•భారత దేశంలో మొత్తం 3 నదీ వ్యవస్థలు కలవు .
1)హిమాలయ నదీ వ్యవస్థ
2)ద్వీపకల్ప నదీ వ్యవస్థ
3)అంతర్భూభాగ నదీ వ్యవస్థ హిమాలయ నదీ వ్యవస్థ
•ఇవి యవన నదులు .వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు .
•హిమాలయాలు ఏర్పడక ముందు ఉద్భవించిన నదులు పూర్వ వర్తిత లేదా పూర్వ హిమాలయ నదులు అంటారు .
సింధూ, బ్రహ్మపుత్ర ,అలకనంద ,గండక్ ,కోసీ, అరుణ
•హిమాలయాలు ఆవిర్భవించిన తర్వాత ఉద్భవించిన నదులను అంతర్వర్తిత నదులు అంటారు .
హిమాద్రి నదులు - గంగా, గండక్,తీస్థా ,కాళీ
హిమాచల్ నదులు - రావి,బియాస్ ,జీలం,చీనాబ్
శివాలిక్ నదులు- ఇండస్,సోలానీ
సింధూ నది
•టిబెట్ లోని గర్తాంగ్ చూ అనే హిమనీనదం లో జన్మిస్తుంది ఇది మానస సరోవరం కి సమీపంలో ఉన్నది .
•టిబెట్,భారతదేశం ,పాకిస్థాన్ గుండా 2280 కి.మీ.ప్రయాణించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది .
•భారత దేశంలో సింధూ నది పొడవు 709 కి.మీ
•ఈ నది భారత దేశంలోని జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే ప్రవహిస్తుంది
•భారత దేశంలోకి దాంచోక్ అనే చోట ప్రవేశిస్తుంది .
•సింధూ నది లో కుడివైపు నుండీ కలిసే ఉపనదులు - జస్కార్,డ్రాన్,ఫియోక్,షిగర్ ,గిల్గిత్ ,హూంజా తోచీ
•సింధూ నదిలో ఎడమవైపునుండి కలిసే ఉపనదులు - జీలం,చీనాబ్,రావి,బీయాస్ ,సట్లేజ్
జీలం :-
•మొత్తం పొడవు 725 కి.మీ
•దీని ప్రాచీన నామం వితస్థ పిర్ పంజల్ లోని వెరినాగ్ వద్ద జన్మిస్తుంది .
•ఇండియా పాకిస్థాన్ సరిహద్దుగా ప్రవహిస్తుంది .
•భారతదేశంలో తక్కువ ప్రయాణించే ఉపనది .
•ఊలర్ సరస్సుని ఏర్పరుస్తుంది .
చీనాబ్ :-
•హిమాచల్ ప్రదేశ్ లో బార్లాప్ చలా కనుమ వద్ద కలుస్తుంది.
•అత్యధిక నీటిని తీసుకొచ్చే సింధూ ఉపనది .
•నది మొత్తం పొడవు 1800 కి.మీ.భారత దేశంలో 1180 కి.మీ ప్రయాణిస్తుంది .
రావి:-
•రోహ్ తంగ్ కనుమవద్ద జన్మించినది .
•మొత్తం పొడవు 725 కి.మీ.
•లాహోర్ నగరం ఈ నది తీరాన కలదు
సట్లెజ్:-
•ఇది రాకాస్ సరస్సు వద్ద జన్మిస్తుంది .
•మొత్తం పొడవు 1450 కి.మీ. భారత దేశంలో దీని పొడవు 1050 కి.మీ.
•సింధూ నది ఉపనదులలో భారతదేశానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నది .
బియాస్ :-
•రోహతంగ్ కనుమ వద్ద గల బియాస్ కుండ్ వద్ద జన్మించి పాంగ్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.
•ఇది పూర్తిగా భారతదేశంలో ఉన్న ఉపనది .
•దీని మొత్తం పొడవు 465 కి.మీ. సింధూ నది ఉపనదులలో చిన్నది .
బ్రహ్మపుత్ర
•ఇది టిబెట్ లోని కైలాస శ్రేణి లోని మానస సరోవరం సమీపంలో షం యంగ్ డంగ్ అనే హిమనీ నదం నుంచి జన్మిస్తుంది .
•మొత్తం పొడవు 2900 కి.మీ. భారత దేశంలో 885 కి.మీ. గంగా బ్రహ్మపుత్రలు సం యుక్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తున్నాయి .
•అస్సాంలో బ్రహపుత్ర నదిలో ప్రపంచంలో అతి పెద్ద నదీ ఆధార దీవి మజూలీ కలదు .
•ఇది సింధూ నదికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది .
•అసోం లో భయంకరమైన వరదలు ఈ నది ద్వారానే సంభవించుట వలన దీనిని అస్సాం దుఃఖ దాయిని అంటారు .
•పురుషుని పేరుతో వ్యవహరించబడుతున్న ఏకైక నది .
•భారతదేశంలో నీటి పరిమాణంలో పెద్ద నది - బ్రహ్మపుత్ర
•భారతదేశంలో అతి పెద్ద నది -గంగా
•గంగా ,బ్రహ్మపుత్రలు కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను సుందర్బన్స్ ను ఏర్పరుస్తున్నాయి .
గంగానది:-
•గంగానది అలకనందా,భగీరదీ అనే నదుల కలయిక వలన ఏర్పడుతుంది .
•అలకనంద ఉత్తరాఖండ్ లోని అలకాపురి నందు ,భగీరధి గంగోత్రి నందు జన్మించి దేవ ప్రయాగ వద్ద కలుసు కోని గంగా గా మారుతాయి .
•గంగా బరహ్మపుత్రలు కలుసుకునే చోటు -గెలుండో బంగ్లాదేశ్
•దీని మొత్తం 2525 కి.మీ. మనదేశంలో 2415 కి.మీ. ప్రయాణిస్తుంది .
•గంగ యొక్క ఉపనదులు
దక్షిణ దిశగా ప్రవహిస్తూ గంగకు ఉత్తరంలో కలిసే నదులు -గండక్ ,గాగ్రా ,కాళీ, కోసీ,
ఉత్తర దిశగా ప్రవహిస్తూ గంగకు దక్షిణంగా కలిసే నదులు - యమున,చంబల్ , బెట్వా, కెన్,సోన్,దామోదర్,ట్రాన్స్,సింధూ
యమున
•ఇది యమునోత్రి హిమానీ నదం వద్ద జన్మిస్తుంది .
•ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ వద్ద ప్రయాగ వద్ద గంగా నదిలో కలుస్తుంది .
•భారతదేశంలో అతి పొడవైన ఉపనది యమున 1376 కి.మీ
•ఉత్తరాఖండ్ ,ఉత్తరప్రదేశ్ , హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది .
•4 సం|| ఒకసారి కుంభమేళా ,12 సంవత్సరాలకి ఒకసారి మహా కుంభమేళా జరిగే ప్రదేశాలు -నాశిక్ ,ఉజ్జయని ,హరిద్వార్ ,అలహాబాద్
చంబల్
•మధ్య ప్రదేశ్ లోని మౌ అనే చోట జన్మిస్తుంది .
•యమున లో కలుస్తుంది .
•మధ్య ప్రదేశ్ ,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్ ,రాష్ట్రాలగుండా ఉత్తర దిశలో ప్రవహిస్తుంది .
•బెట్వా మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని కైమూర్ కొండలలో జన్మిస్తుంది .
దామోదర్
•ఇది చోటా నాగపూర్ పీఠభూమిలో జన్మించి హుగ్లీ నదిలో కలియును .
•దీనిని బెంగాల్ దుఖః దాయని అంటారు .
కోసీ :-
• నేపాల్,టిబెట్ ,సిక్కిం సరిహద్దులలో జన్మిస్తుంది .
•ఇది కాంచన గంగ శిఖరాన్ని తాకుతూ ప్రవహిస్తుంది .
•దీని వరదల వలన దీనిని బీహార్ దుఖః దాయిని అంటారు .
గంగానది ప్రత్యేకతలు
•భారతదేశంలో పొడవైన నది .
•మనదేశపు జాతీయ నది
•భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది .
ద్వీపకల్ప నదీ వ్యవస్థ:-
•ఈ నదులు అంతర వర్ణిత రకానికి చెందినవి .హిమాలయ నదుల కంటే ఎక్కువ వయస్సు కలవు .
•నదులపై జలపాతాలు అధికం ,నౌకాయానానికి అనుకూలం కాదు తూర్పుకి ప్రవహించే నదులు
గోదావరి
•ద్వీపకల్ప నదులలో అతి పెద్దది .
•మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జన్మిస్తుంది .
•దీని మొత్తం పొడవు 1465 కి.మీ .
•ఆంధ్రా,తెలంగాణలలో 770 కి.మీ ప్రయాణిస్తుంది .
•సముద్రంలో కలిసే ముందు 7 పాయలుగా విడిపోతుంది.
వశిష్ట
వైనతేయ
గౌతమి
కౌశిక
ఆత్రేయ
తుల్య
భరద్వాజ
•గౌతమి, వశిష్ట ల మధ్య గల ప్రాంతాన్ని కోనసీమ అంటారు .
•గోదావరి ఉపనదులు -మంజీరా,ప్రవరమూల,కిన్నెరసాని ,ప్రాణహిత,పెంగంగా,ఇంద్రావతి ,శబరి ,సీలేరు
కృష్ణా :-
•ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది.
•పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది .
•దీని మొత్తం పొడవు 1400 కి.మీ .ఇది మహారాష్ట్ర ,కర్ణాటక,తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల గుండా ప్రవహిస్తుంది .
•కృష్ణానది విజయవాడకు 65 కి.మీ దిగువన పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలుతుంది .
•ఈ పాయల మధ్య గల ప్రాంతమే కోనసీమ
•వివాదాస్పద ఆల్మట్టి డ్యాం కర్ణాటకలో కలదు .
•కృష్ణానదికి తుంగభద్ర ఒక ముఖ్యమైన ఉపనది
•కృష్ణానదిని శిల్పుల నది అని పిలుస్తారు .
మహానది :-
•ఇది చత్తీస్ ఘడ్ లోని దండకారణ్యంలో సిహహ వద్ద జన్మిస్తుంది
•దీని మొత్తం పొడవు 877 కి.మీ
•దీని ముఖ్య ఉపనదులు - హిప్,మండ్,హసుడో ,షియోనాథ్ ,
కావేరీ:-
•కర్ణాటక లోని కూర్గు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాలలో తలైకావెరీ వద్ద జన్మిస్తుంది .
•మొత్తం పొడవు 805 కి.మీ .
•భారత దేశం నదులలో 90% నుంచి 95% నది నీటిని వినియొగించబడుతున్న ఏకైక నది కావేరి
•ఈ నది నైఋతి మరియూ ఈశాన్య రెండు ఋతుపవనాలవలన నీటిని పొందును
•ఈ నదీ పరివాహక ప్రాంతంలో అత్యంత ప్రధానమైన జిల్లా-తంజావూరు తమిళనాడు
•కేరళ,తమిళనాడు ల మధ్య తీవ్ర వివాదమైన మల్లు పెరియార్ డ్యాం ఈ నదిపై కేరళ లో కలదు .
•తమిళనాడు లోని మైదనాలకు ప్రవహించే ముందు శివ సముద్రం జలపాతాన్ని ఏర్పరుస్తుంది..
పెన్నా నది :-
•దీనినే పినాకిని అంటారు .
•మొత్తం పొడవు . 600 కి.మీ.
•ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పొడవు 595 కి.మీ
•ఈ నదిని రాయల సీమ జీవకళ అంటారు .
•పశ్చిమానికి ప్రవహించేనదులు :
నర్మద :
•పశ్చిమానికి ప్రవహిస్తున్న నదులలో పెద్ద నది .
•వింధ్య,సాత్పురా మధ్యగల పగులు లోయ గుండా ప్రవహిస్తుంది .
•మధ్య ప్రదేశ్ లోని అమరకంటక్ వద్ద జన్మిస్తుంది .
•మధ్యప్రదేశ్,మహారాష్ట్ర, గుజరాత్ లలో ప్రవహిస్తుంది .
•భారత దేశం లో ఎక్కువ ఆనకట్టలు ఈ నది పై నిర్మించారు -29
•నర్మదానది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి వేరు చేస్తుంది .
•దీనిని మార్బుల్ నది అంటారు .
తపతి
•పశ్చిమానికి ప్రవహించే రెండవ నది .
•మధ్య ప్రదేశ్ లో జన్మిస్తుంది .
•ఈ నది సాత్పురా అజంతా పర్వతాల మధ్య ప్రవహిస్తున్నది .
•దీని యొక్క ఉపనదులు - పూర్ణ, బేతుల్, పాట్కి, కాప్రా,
సబర్మతి
•రాజస్థాన్ లో జన్మిస్తుంది .
•దీని పొడవు 300 కి.మీ .
•అంతర్భూభాగ నదీ వ్యవస్థ
•కొన్ని నదులు సముద్రాలు చేరక మధ్యలో ఇసుక రేణువులలో ,ఉప్పునీటి సరస్సులలో కానీ అంతమవుతాయి.
•వీటినే అంతర భూభాగ నదులు అంటారు.
•భారత దేశంలో ఈ తరహా నదులు రాజస్థాన్ లో కలవు
K.L. రావు నదుల వర్గీకరణ
ప్రధాన నదులు
•20,000 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం ఆయకట్టు కల నదులు .ఇది 14 నదులతో 85% ఆక్రమిస్తున్నది.సింధూ,బ్రహ్మపుత్ర,గంగ,కృష్ణా,గోదావరి మొదలగునవి
మధ్యతరహా నదులు
2,000 నుంచి 20,000 చ.కి.మీ ఆయకట్టు ప్రాంతం కల నదులను మధ్య తరహా నదులు అంటారు .
దేశంలో 44 నదులు 7% ఆక్రమిస్తున్నది .
చిన్నతరహా నదులు :-
•2,000 చ.కి.మీ. కంటే ఆయకట్టు విస్తీర్ణం గల నదులు .ఇటువంటివి మన దేశంలో సుమారు 196 గలవు.
సరస్సులు
•సరస్సులను అధ్యయనం చేయుటను లిమ్నాలజి అంటారు .
•జమ్మూ కాశ్మీర్ లో సరస్సులను టారెన్స్ అంటారు .
•సిటీ ఆఫ్ లేక్స్ - ఉదయ్ పూర్
•వేయి సరస్సుల దేశం - ఫిన్లాండు
నదులు మారు పేర్లు
సబర్మతి గిరికర్ణిక
తపతి తాపినది
లూని లవణ నది
సోన్ సువర్ణ నది
నాగావళి లాంగుళ్యా
పెన్నా పినాకిని
దిండిమీనాంబరం
బెట్వా నది నేత్రావతి
కెన్ కర్ణావతి
గండక్ నారాయణి
మాచ్ ఖండ్ మత్స్య కుండల
జీలం వితస్త
మహానది మహదాయినది
నదీ తీరాన ఉన్న నగరాలు:-
అయోధ్య సరయూ నది
అలహాబాద్ గంగా & యమున
ఆగ్రా యమున
అహ్మదాబాద్ సబర్మతి
బద్రీనాథ్ అలకనంద
కటక్ మహానది
కోట చంబల్
లక్నో గోమతి
కలకత్తా హుగ్లీ
లూధియాన సట్లేజ్
మధుర యమున నది
నాసిక్ గోదావరి
కర్నూల్ తుంగభద్ర
ఢిల్లీ యమునా నది
గౌహతి బ్రహ్మపుత్ర
హైదరాబాద్ మూసీ నది
జంషెడ్ పూర్ సువర్ణ రేఖ
కాంపూర్ గంగా నది
పాట్నా గంగా నది
వారణాసి గంగానది
శ్రీకాకుళం లాంగుళ్యా నది