మృత్తికలు

•భూ ఉపరితలంలో వదులుగా అదృఢీకరంగా ఉండే పలుచటి పొరను మృత్తిక అంటారు .
•మృత్తికలు ఏర్పడే విధానాన్ని బట్టి ఇవి 2 రకాలు
1)స్థాన బద్ధ మృత్తికలు
2)నిక్షేప మృతికలు
•నేలలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అంటారు .
•సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా 1956 లో ఏర్పడినది .ఇది 8 రకాల నేలలను గుర్తించింది అయితే ప్రధానమైనవి 6 రకాల నేలలు .
1.ఒండ్రుమట్టి నేలలు :-
•ఒండ్రు నేలలు 14 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి .
•నదీ పరివాహక ప్రాంతాలు ,తీరమైదానాలు ,డెల్టాలలో ఇవి విస్తరించి ఉన్నాయి .
•నదుల వరదలచే తీసుకురాబడిన ఒండ్రుచే ఏర్పడ్డాయి .
•భారత దేశంలో అత్యధిక వ్యవసాయ సంపద ఈ నేలలనుంచి లభిస్తుంది .
•ఇవి భారత సాగు భూమి లో 23. 4% కలవు .
•వీటిలో పొటాష్,కాలిష్యం ,లైం ,క్లే,నైట్రోజన్ తక్కువ
•ఈ నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలం .
•కావున వీటిని భారత దేశ ధాన్యాగారాలు అంటారు
•ఈ నేలలు అధికంగా తమిళనాడు ,ఆంధ్ర ప్రదేశ్ ,ఒడిశా లలో కలవు .
•వరి,గోధుమ,జెనుము,చెరకు పంటలు బాగా పండుతాయి .
•ఈ నేలలు లేత గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు ను కలిగి ఉంటాయి .
నల్ల రేగడి నేలలు :-
•ఇవి దేశ సాగు భూమిలో 24.1 %
•వీటినే రేగర్ నేలు,చెర్నోజెం నేలలు అంటారు .
•ఇవి ప్రత్తి పంటకి అత్యంత అనుకూలం
•ఎండాకాలం పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడతాయి .పైన ఉన్న భూమ్మి అంతా ఆ పగుళ్ళలోనికి పోతుంది .
•కావున వీటిని తనను తాను దున్నుకొనే భూములు అంటారు .
•ఈ నేలలో ఇనుము,అల్యూమినియం,కాల్షియం ,మెగ్నీషియం లవణాలు అధికం
•ఈ నేలలు గ్రానైట్ శిలలపై విస్తరించి ఉన్నాయి .
•ఈ నేలలోని నీటి పారు దలవలన నేల లోని లవణాలు నీటిలో కరుగుతాయి . •ఇవి ప్రధానముగా మహారాష్ట్ర,గుజరాత్, మధ్యప్రదేశ్,తెలంగాణా , గుంటూరు జిల్లా, తమిళనాడులోని కో వై (కోయంబత్తూర్ ) లో కలవు .
ఎర్ర నేలలు :-
•దీనిలో గల ఐరన్ వలన ఇవి ఎర్రగా ఉంటాయి .
•ఇవి తక్కువ వర్షపాతంలో ఉన్న ప్రాంతంలో ఏర్పడతాయి.
•ఎర్ర నేలలలో నత్రజని,సేంద్రీయ ఎరువులు ఫాస్పారికాంలం తక్కువగా ఉండి పొటాషియం ,ఇనుము ,మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి .
•అస్సాంలో ఎర్ర నేలల గుండా ప్రవహించుట వలన బ్రహ్మపుత్ర నదిని రెడ్ రివర్ అంటారు .
•ఈ నేలలను ఆంధ్రా, తెలంగాణ లలో చల్కా నేలలు,దుబ్బ నేలలు అని పిలుస్తారు .
•భారత దేశంలో 29.08% శాతం కలవు .
•తమిళానాడు ,ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణా,కర్ణాటక లలో కలవు .
•భారత దేశంలో ఎర్ర నేలలు అధికంగా ఉన్న రాష్ట్రం -తమిళనాడు
లాటరైట్ నేలలు:-
•అధిక ఉష్ణొగ్రతలు,అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఇవి ఏర్పడతాయి .
•ఈ నేలలో అల్యూమినియం ,ఇనుము,ఆక్సైడ్లు రూపంలో ఉండుట వలన వీటికి ఆ రంగు వచ్చింది .
•లాటరైట్ నేలలు తడిసినపుడు మెత్తగాను ,ఎండినపుడు గట్టిగాను మారతాయి .
•ఈ నేలలలో పండే ప్రధాన పంటలు
•రబ్బరు,తేయాకు,కాఫీ,సుగంధ ద్రవ్యాలు
•ఇవి భారత దేశంలో 3.4 % విస్తరించి ఉన్నాయి .
•కేరళ,కర్ణాటక,ఒరిస్సా తెలంగాణ లోని మెదక్ లో కలవు .
ఎడారి నేలలు :-
•దేశంలో 8.49 %కలవు .
•ఇవి ఎరుపు,గోధుమ రంగుని కలిగి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి .
•ఖర్జూరం,బార్లీ,గోధుమలు బాగా పండుతాయి.
•గుజరాత్ ,రాజస్తాన్ లలో ఎక్కువ కలవు .
6.పర్వతీయ మృత్తికలు :-
•ఉత్తర ప్రదేశ్ లోని టెరాయి ప్రాంతంలోని ఈ నేలలు ప్రధానమైనవి
•జమ్మూ-కాశ్మీర్ లలోని ఎత్తైన ప్రాంతాలలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి .
•ఈ నేలలలో హ్యూమస్ ఎక్కువ పొటాష్,పాస్పరస్ తక్కువ .
•ఇవి పంజాబ్ ,హిమాచల్ ప్రదేశ్ ,కేరళ లోని పర్వత ప్రాంతాలలో కలవు .
•దేశంలో వీటి విస్తీర్ణం 10.64%
7. ఆమ్ల క్షార నేలలు :-
•సోడియం , కాల్షియం ,మెగ్నీషియం లవణాలు ఎక్కువగా ఉంటాయి .
•ఇవి సారవంతం అవుటకు జిప్సం వాడాలి .వరి,గోధుమ పండిచవచ్చు.
•దక్షిణ పంజాబ్ ,దక్షిణ గుజరాత్ లలో కలవు .
8 .పీఠి నేలలు
•వీటిని సేంద్రీయ నేలలు అంటారు .
•సేంద్రీయ పదార్ధాలు అధికంగా నిక్షిప్తం కల నేలలు
•వీటినే ఊబి నేలలు అంటారు .
•ఇవి కేరళ లోని అలపీ ,కొట్టాయం లో కలవు .
మృత్తికా క్రమక్షయం :-
•నదులు,పవనాలు శీతోష్ణస్థితి వంటి సహజ కారణాలవలన మెత్తని సారవంతమైన పై పొర కొట్టుకు పోవడానిని మృత్తికా క్రమక్షయం అంటారు .
•మృత్తికా క్రమక్షయాన్ని 3 రకాలుగా విభజించవచ్చు
పటక్రమక్షయం :
•అధిక వర్షాలకు ,వరదలకు మృత్తిక యొక్క పై పొరలు కొట్టుకు పోవటానిని పట క్రమక్షయం అంటారు .
•శివాలిక్ కొండలు ,పశ్చిమ కనుమలు ,తూర్పు కనుమలు ,ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా కలదు .
వంక క్రమక్షయం:-
•పట క్రమక్షయం ఏర్పడినప్పుడు చేతి వేళ్ళ ఆకారంలో గాడులు ఏర్పడతాయి .
•బీహార్ ,ఉత్తర ప్రదేశ్, తెలంగాణా,ఆంధ్ర ప్రదేశ్ లలో అధికం .
అవనాళికా క్రమక్షయం :-
•వంక క్రమక్షయం అధికమయితే అవనాళికా క్రమక్షయం ఏర్పడును .
•పెద్ద పెద్ద లోయలు ఏర్పడును .
•మధ్య ,ఉత్తర ప్రదేశ్ లలో కనిపించును .
4.రైపీరియన్ క్రమక్షయం :-
•నదులు గట్లను కోసివేయటం
•పశ్చిమ బెంగాల్ లోని గంగా నది వలన ఇలాంటి క్రమక్షయం జరుగును .
పవన క్రమక్షయం
•రాజస్థాన్,గుజరాత్,హర్యానా,పంజాబ్ లలో జరుగును .
•మృత్తికా క్రమక్షయ నివారణ చర్యలు :-
•విస్తాపన వ్యవసాయమును నివారించుట
•అవనాళికలను పూడ్చుట
•కాంటూర్ బండింగ్
•కొండ ప్రాంతాలలో సోపాన వ్యవసాయం .