భారత దేశం ప్రజలు

• 1931 లో B.S గుహ గారు భారత దేశం లోని ప్రజలను శారీరక నిర్మాణం ఆధారంగా 6 జాతులుగా విభజించాడు.
1) నీగ్రిటోలు
• భారత దేశం లో అతి ప్రాచీన జాతి .
• దేశానికి మొదటిగా వలస వచ్చిన జాతి .
• నలుపు రంగు దేహం ఉంగరాల జుట్టు వీరి లక్షణాలు .
• ప్రస్తుతం కేరళ,అండమాన్ నికోబార్ దీవులలో కలరు .
2)ప్రోటో అస్ట్రలాయిడ్స్:-
• వీరు నీగ్రిటో తర్వాత వచ్చారు.
• వీరు ద్వీపకల్ప భారత దేశమైన కొండలు దట్టమైన అరణ్యాలలో నివశిస్తున్నారు.
• సింధూ లోయ నాగరికను మొదటి సారిగా నిర్మించినది వీరే .
• వీరు కొద్దిగా అణిగిన ముక్కు , గోధుమ రంగు దేహం ,ఒత్తయిన జుట్టును కలిగి ఉంటారు.
•గోండులు,ముండాలు,బిల్లులు ,సంతాలులు ఈ వర్గానికి చెందినవారు .
• భారత దేశం లో గిరిజనులలో అత్యధిక శాతం కలవారు
3)మధ్య ధరా జాతి:-
• వీరు మధ్య ఆసియా నుంచి భారత దేశం లోకి ప్రవేశించారు.
• సింధూ నాగరికతలో లోహ నాగరికతను ప్రవేశపెట్టారు.
• భారత దేశం లో కాంస్యయుగ నిర్మాతలు .
4)మంగోలాయిడ్ లు :-
•ఈశాన్య భారత దేశం ,పశ్చిమ హిమాలయాలకు చెందిన లడక్ లో నివశించే ప్రజలు.
5) నార్డిక్:-
•భారత దేశానికి చివరిసారిగా వచ్చిన జాతి.వీరికే ఆర్యులని పేరు.
•ఈ జాతి లక్షణాలు హర్యానా,రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ లలోని రాజ్ పూత్ మరియు జాట్ లలో కనిపిస్తాయి.
భారత దేశంలోగల గిరిజన జాతులు
ఆదివాసీలు మధ్యప్రదేశ్
బకర్ వాల్ జమ్మూ కాశ్మీర్
చెంచు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,ఒరిస్సా
భుయా మధ్య ప్రదేశ్
అపటామి అరుణాచల్ ప్రదేశ్
కనికర తమిళనాడు
జయంతియా మేఘాలయ
గుజ్జర్ లు గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్
గల్లాంగ్ ఈశాన్య రాష్ట్రాలు
మోప్లా కేరళ
నిషీ ఈశాన్య రాష్ట్రాలు
బడగ తమిళనాడు
కానీస్ కేరళ
బోటియలు ఉత్తర ప్రదేశ్
అబోర్లు ఈశాన్య ప్రాంతం
భిల్లులు మధ్య ప్రదేశ్
తోడాలు తమిళ నాడు
అంగామీ నాగాలాండ్
చుటియా అస్సాం
నాగాలు నాగాలాండ్
ముండా బీహార్
లుషాయి త్రిపుర
మికిర్ అస్సాం
కుకీ మణిపూర్
జనగణన :-
•జనాభా లెక్కలు కేంద్ర జాబితాకు చెందినవి.
•జనాభా లెక్కల గురించి తెలియచేయు ఆర్టికల్ -243
•ప్రపంచ జనాభా దినోత్సవం - జులై -11
•ప్రపంచంలో అధిక జనాభా కల దేశం -చైనా
రెండవ దేశం - భారత దేశం
•ప్రపంచంలో అతి తక్కువ జనాభా తక్కువ కలిగిన దేశం - వాటికన్ సిటీ
•ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకడు భారతీయుడు .
•భారత జనాభా చైనా జనాభాను 2030 నాటికి దాటుతుందని అంచనా.
భారత దేశం - జనభా గణన
•భారత దేశంలో 1865-1872 మధ్య మొదటి జనగణన జరిగినది .
2011 జనగణన :-
•మొత్తం జనాభా - 1,21,05,69 ,573 (1.21 బిలియన్ లు )
•దేశ జనాభాలో పురుషులు -62 కోట్లు
•స్త్రీలు -58 కోట్లు
•అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం - ఉత్తర ప్రదేశ్ - 20 కోట్లు
•ఉత్తర ప్రదేశ్ జనాభా బ్రెజిల్ జనాభా కంటే ఎక్కువ .
•అతితక్కువ జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం
•స్త్రీ పురుష నిష్పత్తి - 943:1000
•అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రాలు -
బీహార్-1106
పశ్చిమ బెంగాల్- 1028
•తక్కువ జనసాంద్రత కల రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ -17
మిజోరాం- 52
•అత్యధిక అక్షరాస్యత కల రాష్ట్రాలు
కేరళ - 94%