శక్తి వనరులు

దేశం లో శక్తి వనరులను రెండు రకాలుగా విభజించ వచ్చు .
•1)సాంప్రదాయ వనరులు -థర్మల్ విద్యుత్,అణు విద్యుత్
•2)సాంప్రదాయేతర వనరులు- జల విద్యుత్ ,సౌర శక్తి
సాంప్రదాయ శక్తి వనరులు:-
1) థర్మల్ విద్యుత్
•బొగ్గు సహజ వాయువు ,ముడి చమురు ఆధారంగా తయారయ్యే విద్యుత్ ని థర్మల్ విద్యుత్ అంటారు .
•1000 MW సామర్ధ్యం కల విద్యుత్ కేంద్రాలను సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం అంటారు .
•1975 లో నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ ని ఏర్పాటు చేసారు .
•థర్మల్ విద్యుత్ తయారీ లో మహారాష్ట్ర,గుజరాత్ లు అగ్రస్థానం లో కలవు .
•దేశం లో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫాక్టర్ ని అందించిన థర్మల్ విద్యుత్ కేంద్రం -ఇబ్రహీంపట్నం (విజయవాడ )
భారత దేశం లో కల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలు
సిం హాద్రి ఆంధ్ర ప్రదేశ్
రామగుండం తెలంగాణ
కోర్బా చత్తీస్ ఘడ్
తాల్చేర్ ఒడిశా
ఫరక్కా పశ్చిమ బెంగాల్
వింధ్యాచల్ -1 మధ్య ప్రదేశ్
వింధ్యా చల్ -2 మధ్య ప్రదేశ్
రీహాండ్ ఉత్తరప్రదేశ్
దాద్రి ఉత్తర ప్రదేశ్
సింగ్రౌలి మధ్య ప్రదేశ్
కాయంకుళం కేరళ
ఓబ్రా మధ్య ప్రదేశ్
కోటా రాజస్థాన్
సిపట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఛత్తీస్ ఘడ్
భారతదేశం లో కల అల్ట్రా మెగా థర్మల్ పవర్ స్టేషన్ లు
కృష్ణపట్నం ఆంధ్ర ప్రదేశ్
తాద్రి కర్ణాటక
ముంద్రా గుజరాత్
ససన్ మధ్య ప్రదేశ్
గిర్యా మహారాష్ట్ర
అణువిద్యుచ్చక్తి
•అణువిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం ఫ్రాన్స్ అణు విచ్చిత్తి చర్యలద్వారా ,న్యూక్లియర్ రియాక్టర్ ల ద్వారా విద్యుత్ తయారు చేస్తారు .
•భారతదేశం లో మొత్తం విద్యుచ్చక్తిలో అణువిద్యుచ్చక్తి వాటా 3.5%
•భారత దేశం లో మొత్తం 7 చోట్ల అణువిద్యుచ్చక్తి కేంద్రాలు కలవు .
1) తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్ర
•దేశం లో మొదటి అణు విద్యుత్ కేంద్రం .
•1969 లో ఉత్పత్తి ప్రారంభించారు .
•ఇచ్చట గల రియాక్టర్ అప్సర .
•దీనియొక్క సామర్ధ్యం 1400 MW
2) రావత్ భటా అటామిక్ పవర్ స్టేషన్
•రాజస్థాన్ లో కలదు .
•పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో నిర్మించబడినది .
•దీని సామర్ధ్యం 1180 మెగావాట్లు
3)కల్పకం అణువిద్యుత్ కేంద్రం (తమిళనాడు)
•1984 లో స్థాపించారు .
•దీని సామర్ధ్యం 440 MW.
•ఇచ్చట కల రియాక్టర్ కామినీ
4)నరోరా అటామిక్ పవర్ స్టేషన్:-
•ఉత్తర ప్రదేశ్ లో కలదు .
•వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసే ఏకైక కేంద్రం .
•దీని సామర్ధ్యం 440 MW.
•ఢిల్లీకి విద్యుత్ ని అందిస్తుంది .
5) కాక్రపరా అణువిద్యుత్ కేంద్రం
•గుజరాత్ లో కలదు
•1993 లో స్థాపించారు .
దీని సామర్ధ్యం 440 MW
6) కైగా అణువిద్యుత్ కేంద్రం
•కర్ణాటక లో కలదు .
•దీని సామర్ధ్యం 850 MW.
7) కుడం కుళం అణువిద్యుత్ కేంద్రం
•తమిళనాడులో రష్యా సహకారంతో నిర్మించారు .
•దేశం లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం .
•దీని నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి .
భారజల కర్మాగారాలు
•అణు రియాక్టర్ లో మితకారిగా భారజలాన్ని ఉపయోగిస్తారు .
•మన దేశం లో కల భార జల కేంద్రాలు
సాంప్రదాయేతర శక్తి వనరులు:-
జల విద్యుత్ కేంద్రాలు
•భారత దేశం లో మొత్తం విద్యుచ్చక్తి లో జల విద్యుత్ వాటా 13.8 %
•మన దేశం లోని ప్రధాన జల విద్యుచ్చక్తి కేంద్రాలు
రాం గంగా గద్వాల్ (UP)
శారదా ఖతీమా(UP)
మతితిలా ఝాన్సీ(UP)
రిహంద్ పిప్రీ (UP)
మయూరాక్షి పశ్చిమ బెంగాల్
ఫరక్కా పశ్చిమ బెంగాల్
మైసూర్ కర్ణాటక
శరావతి కర్ణాటక
కుందా తమిళనాడు
మెట్టూరు తమిళనాడు
ఇడుక్కి కేరళ
వైతరిణి మహారాష్ట్ర
హీరాకుడ్ ఒరిస్సా
కోసీ బీహార్
భాక్రానంగల్ పంజాబ్
పవన విద్యుచ్చక్తి
•ప్రపంచంలో దీని ఉత్పత్తిలో మొదటి స్థానం - జర్మనీ
•భారత దేశం లో మొదటి స్థానం -తమిళనాడు
•గాలి మరలు త్రిప్పుట ద్వారా విద్యుత్ ని తయారు చేస్తారు .
•మాండవి -గుజరాత్ మ్మొదటి పవన విద్యుత్ కేంద్రం
•ముప్పండాల్ పెరుంగుడి -తమిళనాడు ఎక్కువ గాలిమరలు కల ప్రదేశం
•జోగిమట్టి కర్ణాటక -ఎక్కువ వినియోగిస్తున్న ప్రాంతం .
•ముప్పండాల్ పెరుంగుడి ని నెవెడా ఆఫ్ ఇండియా అంటారు .
సౌర విద్యుత్ కేంద్రాలు
•దేశంలో మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి - 3715 మెగావాట్లు
•భారత దేశం లో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం రాజస్థాన్ లోని సాంబార్ సరస్సు వద్ద కలదు .
•కళ్యాణిపూర్ -మొదటి సౌర విద్యుత్ కేంద్రం
•భుజ్ -అతి పెద్ద సౌర తటాకం
•చోగ్లాం సా సౌర విద్యుత్ ద్వార విద్యుత్ పొందిన మొదటిప్రాంతం .
తరంగ శక్తి కేంద్రాలు
•కాండ్ల గల్ఫ్ ఆఫ్ కంబట్ మొదటి తరంగ విద్యుత్ కేంద్రం
•విజింజం -దేశం లోని మొదటి అలల శక్తి కేంద్రం
ఇతర రకాల శక్తి వనరులు
•దేశం లో మొదటి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వెన్షన్ ను అమెరికా సహాయం తో తూతుక్కూడి లో ఏర్పాటు చేస్తున్నారు .
•దేశంలో మొదటి బయోగ్యాస్ కేంద్రం -జలభారి (పంజాబ్ ).