భారత దేశం -ఉనికి విస్తరణ

• భారతదేశం 8 04' నుండి 37 0 6 ' ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 0 7 ' నుండి 970 25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది .
•దేశం గుండా 30 అక్షాంశాలు ,30 రేఖాంశాలు వెళ్తున్నాయి .
•భారత దేశం మొత్తం విస్తీర్ణం 32, 87, 263 చ.కి.మీ .
•ప్రపంచ విస్తీర్ణంలో భారత దేశంలో 7 వ స్థానంలో ఉంటుంది .
•23 1/2 0 ఉత్తర అక్షాంశ రేఖ అనగా కర్కటరేఖ భారతదేశం గుండా 8 రాష్ట్రాల గుండా పోతుంది .
అవి పడమర నుంచి తూర్పుకి వరుసగా
గుజరాత్
రాజస్థాన్
మధ్య ప్రదేశ్
ఛత్తీస్ ఘడ్
జార్ఖండ్
పశ్చిమ బంగా
త్రిపుర
•కర్కట రేఖ భారత దేశంలోకి మొదట ప్రవేశించే రాష్ట్రం - మిజోరాం
•కర్కట రేఖ గుజరాత్ లోని - గాంధీ నగర్
మధ్య ప్రదేశ్ - భోపాల్
జార్ఖండ్ లోని -రాంచీ నగరాలను తాకుతుంది .
•కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహిస్తున్న నదులు-
గుజరాత్ -మహి ,సబర్మతి
మధ్య ప్రదేశ్- బెట్వా,కెన్
జార్ఖండ్ - దామోదర్
పశ్చిమ బెంగాల్ - హుగ్లీ నది
•82 1/2 0 తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక రేఖాంశం ఇది 5 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతాలద్వారా వెళ్తుంది .
అవి
ఉత్తరప్రదేశ్
మధ్య ప్రదేశ్
ఛత్తీస్ ఘడ్
ఒడిశా
ఆంధ్ర ప్రదేశ్ మరియు పాండిచ్చేరీ
•ఈ రేఖాంశం నాలుగు ప్రధాన నగరాల గుండా ప్రయాణిస్తుంది .
అలహాబాద్-ఉత్తరప్రదేశ్
రాయ్ పూర్ చత్తీస్ ఘడ్
కోరాపుట్-ఒడిశా
కాకినాడ-ఆంధ్ర ప్రదేశ్
జబల్ పూర్-మధ్య ప్రదేశ్
యానాం-పాండిచ్చేరి
•భారతదేశంలోని ప్రామాణిక సమయం ఉత్తర ప్రదేశ్ లో మీర్జాపూర్ నందుగల వింధ్యాచల్ రైల్వేస్టేషన్ లోని గడియారంతో ప్రారంభము అవుతుంది .
•భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్ కంటే 5 1/2 గంటలు ముందు ఉంటుంది .
•భారత తూర్పు మరియు పశ్చిమ కొనల మధ్య వ్యత్యాసం - 2 గంటలు
•సూర్యుడు మొదట ఉదయించే రాష్ట్రం -అరుణాచల్ ప్రదేశ్ (ది డాంగ్ లోయ).
•సూర్యుడు ఆఖరిగా అస్తమించే రాష్ట్రo -గుజరాత్
•భారత దేశం యొక్క చివరి ప్రాంతాలు :-
ఉత్తరాన - ఇందిరాకాల్ (ఇది జమ్మూ కాశ్మీర్ లో లడక్ జిల్లాలోని కిలిక్ ధావన్ కనుమలో కలదు ).
దక్షిణాన -గ్రేట్ నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ పిగ్మాలియన్ పాయింట్
తూర్పున పూర్వాంచల్ పర్వాతాలలోని పాట్కాయ్ కొండలలోని దీపూ కనుమ
పశ్చిమాన -రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్
•భారత దేశానికి చెందిన కొన్ని అంశాలు :-
భారతదేశానికి చెందిన అంతర్జాతీయ సరిహద్దు పొడవు -15200 కి.మీ.
భారతదేశ తీర రేఖ పొడవు - 6100 కి.మీ.
భారత దేశ తీర రేఖ పొడవు దీవులతో సహా - 7516 కి.మీ
తూర్పు పడమర చివరి ప్రాంతాల మధ్య దూరం - 3214 కి.మీ.
ఉత్తర దక్షిణ చివరి ప్రాంతాల మధ్య దూరం - 2933 కి.మీ.
అంతర్జాతీయ భూ సరిహద్దు:-
•భారతదేశం ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది .
•అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు - 17
•అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు - 15,200 కి.మీ
•భారతదేశానికి అతి ప్రాచీన నామం-జంబూద్వీపం
•మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు -త్రిపుర ,సిక్కిం ,జమ్మూ కాశ్మీర్, పశ్ఛిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్
•భారతదేశంతో అతి ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం -బంగ్లాదేశ్ (4096కి.మీ)
•అతి తక్కువ సరిహాద్దు కలిగిన దేశం-ఆఫ్ఘనిస్థాన్(86 k.m)
•బారతదేశంలో తీర రేఖను కలిగిన రాష్ట్రాలు - 9
కేంద్రపాలిత ప్రాంతాలు -2
•సముద్రతీరం కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు - డయ్యూ,డామన్ ,పాండిచ్చేరీ
•మూడు సముద్రాలు తీరరేఖగా కల్గిన రాష్ట్రం - తమిళనాడు
•భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధి 200 నాటికల్ మైళ్ళు .
ఈ ప్రాంతంలో లభించే వనరులన్నీభారత దేశానికి మాత్రమే చెందుతాయి .
•భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు - 5
అవి మధ్య ప్రదేశ్ ,చత్తీస్ ఘడ్
జార్ఖండ్ , హర్యానా,తెలంగాణా
భారతదేశం -అంతర్జాతీయ సరిహద్దులు:-

సరిహాద్దు రేఖ సరిహద్దు దేశాలు
రాడ్ క్లిఫ్ రేఖ 240 ల సమాంతర రేఖ భారత్ పాకిస్థాన్
నియంత్రణ రేఖ భారత్ పాకిస్థాన్
రాడ్ క్లిఫ్ రేఖ భారత్ బంగ్లాదేశ్
డ్యూరాండ్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్థాన్
మెక్ మోహన్ రేఖ -LOAC- వాస్తవాధీన రేఖ భారత్ చైనా
మన్నార్ సింధూ శాఖ భారత్ -శ్రీలంక
సియాచిన్ గ్లేషియర్ భారత్ -పాకిస్థాన్
సర్ క్రిక్( గుజరాత్) భారత్ పాకిస్థాన్
•ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం - సియాచిన్ గ్లేషియర్
•భారత దేశంలో వైశాల్యంలో పెద్ద రాష్ట్రం - రాజస్థాన్
•ఆంధ్రప్రదేశ్ 8 వ ,తెలంగాణ 12 వ స్థానాలలో కలవు
•గోవా విస్థీర్ణంలో చిన్న రాష్ట్రం .
•భారత్ ,బంగ్లాదేశ్ కు 999 సంవత్సరాలకు తీన్ భిఘా ప్రాంతాన్ని లీజుకి ఇచ్చింది .
•భారత్ కు జల సరిహద్దు కలిగిన దేశాల సంఖ్య - 6
1) మాల్దీవులు
2)శ్రీలంక
3)బంగ్లాదేశ్
4)మయన్మార్
5)థాయిలాండ్
6)ఇండోనేషియా
•మన దేశం జలభాగంలో విస్తరించిన దూరం - 1600 కి.మీ
•భారత్,శ్రీలంక ల మధ్యన ఉన్న ద్వీపం -రామేశ్వరం
•1974 ఒప్పందం ప్రకారం కచ్చాతీవు దీవులను శ్రీలంకకు భారతదేశం ఇచ్చింది .
•భారత్ ,మాల్దీవుల మధ్య 8 0 ల చానల్ కలదు .
•భారత్ మయన్మార్ ల మధ్య కోకో చానల్ కలదు .
•భారత్ ,బంగ్లాదేశ్ ల మధ్య గల వివాదాస్పద దీవులు - న్యూమూర్ దీవులు
•తీన్ బిఘా అనే ప్రాంతను బంగ్లాదేశ్ కు 999 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చినది.
•ఈశాన్య భూభాగంలో భారత ప్రధాన భూభాగంతో కలిపే ఏకైక రహదారి మార్గం పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి గుండా వెళ్తుంది . దీనినే చికెన్ నెక్ అంటారు .