‘మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ పుస్తక ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ రూపొందించిన ‘కేసీఆర్ - ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్’ పుస్తకాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది, ప్రత్యేక రాష్ట్రం సాకారానికి అనుసరించిన విధానం, రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఎదురైన చిక్కుముళ్లను ఎలా ఎదుర్కొన్నారనే అంశాలన్నీ ఈ పుస్తకంలో ఆవిష్కృతమయ్యాయని మంత్రి చెప్పారు.