కరోనా మేడ్ ఇన్ చైనాయే!
→యావత్ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 మూలాలపై మూడేళ్లయినా ఇంకా మిస్టరీ వీడలేదు.
→ఈ క్రమంలోనే కరోనా మానవ నిర్మిత వైరస్ అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు సంచలన విషయాన్ని వెల్లడించారు.
→గతంలో వుహాన్ ప్రయోగశాలలో పనిచేసిన ఆయన, అక్కడి నుంచే వైరస్ లీకయ్యిందంటూ పేర్కొన్నారు.
→ఈ మేరకు ఆండ్రూ హఫ్స్ ‘ది ట్రూత్ ఎబౌట్ వుహాన్’ పేరుతో తాజాగా ఓ పుస్తకం రాశారు.
→‘వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే కరోనా వైరస్ లీకయ్యింది’ అంటూ ఆ పుస్తక సారాంశాన్ని బ్రిటన్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక ప్రచురించింది.
→వైరస్‌లపై పరిశోధనలు జరిపే క్రమంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకయ్యిందని ఆండ్రూ హఫ్స్ ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
→ముఖ్యంగా విదేశీ ప్రయోగశాలల్లో బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అవసరమైన నియంత్రణ చర్యలు లేకపోవడం, వుహాన్ ప్రయోగశాల నుంచి వైరస్ లీకవడానికి దారితీసిందని హఫ్స్ చెప్పినట్లు తెలిపింది