డైలీ కరెంట్ అఫైర్స్

భారతీయులకు వీసా అక్కర్లేదు థాయ్ లాండ్ కీలక నిర్ణయం

→పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేం దుకు థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
→భారత్, తైవాన్ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని నిర్ణయిం చింది.
→నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు ఇవ్వ నుంది.
→ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిం చాలనే ఉద్దేశంతో థాయ్లాండ్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని శ్రేట్టా థవిసిన్ తెలి పారు.
→గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్లాండ్ వీసా మినహాయింపును ఇచ్చింది.
→మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్లాండ్ కు వెళ్తుం టారు.
→కొద్దిరోజుల క్రితం శ్రీలంక భారత్ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయించింది.



చిన్నారుల ఇన్ఫెక్షన్లపై చేతులెత్తేస్తున్న యాంటీబయాటిక్స్

→చిన్నారుల్లో సాధారణంగా వచ్చే ఇన్ఫె క్షన్ల చికిత్సకు వాడే ఔషధాలు భారత్ సహా అనేక దేశాల్లో సమర్థంగా పనిచేయడంలేదని తాజా అధ్యయనం పేర్కొంది.
→ భారీ స్థాయిలో ఉత్పన్న మవుతున్న యాంటీబయాటిక్ నిరోధకతే (ఏఎం ఆర్) ఇందుకు కారణమని వివరించింది.
→ ఆస్ట్రేలి యాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
→ మానవాళికి పెను ఆరోగ్య ముప్పుగా పరిణమించిన 10 అంశాల్లో ఏఎంఆర్ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) ఇప్పటికే పేర్కొంది.
→ ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది పిల్లలు సెప్సిస్ బారినపడుతు న్నారు. వారిలో 5.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
→ మొండి బ్యాక్టీరియాకు చికిత్స చేయడానికి సమర్ధ యాంటీబయాటిక్స్ లభించక పోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. తాజా పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి.
→డబ్ల్యూహెచై సిఫార్సు చేస్తున్న యాంటీబయాటిక్స్ అనేకం.. చిన్నత నంలో వచ్చే నిమోనియా, సెప్సిస్, మెనిం జైటిస్ వంటి ఇన్ఫెక్షన్లపై 50 శాతం కన్నా తక్కువ సమర్థతతో పనిచేస్తున్నాయి.
→ముఖ్యంగా సెస్ట్రియాక్సోన్ అనే యాంటీబయా టిక్.. నవజాత శిశువుల్లో వచ్చే సెప్సిస్ లేదా మెనింజైటిస్పై అంతంతమాత్రంగానే పనిచే స్తోంది.
→మూడింట ఒక కేసులోనే ఆ చికిత్స ఫలిస్తోంది. జెంటామైసిన్ అనే మరో యాంటీబయాటికన్ను సెప్సిస్ 'లకు ఇచ్చినప్పుడు సగం కన్నా తక్కువ కేసుల్లోనే ఫలితాన్నిస్తోంది.

ఏబీఈటీ గుర్తింపులో చండీగఢ్ వర్సిటీ రికార్డు

→దేశంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం (సీయూ) అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
→ఈ వర్సిటీ అందిస్తున్న తొమ్మిది రకాల ఇంజినీరింగ్ కోర్సులకు అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజినీ రింగ్ అండ్ టెక్నాలజీ (ఏబీఈటీ) అక్రిడిటేషను మంజూరు చేసింది.
→దీంతో దేశవ్యాప్తంగా గల ప్రైవేటు వర్సిటీల్లో అత్యధిక కోర్సులకు ఏబీఈటీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంగా సీయూ నిలిచింది.
→ఈ మేరకు సీయూ కులపతి సత్నామ్ సింగ్ సంధు ఓ ప్రకటనలో వెల్లడించారు.
→వర్సిటీ అనుసరిస్తున్న ఉత్తమ విద్యా విధా నాలకు తాజా గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు.
→బీఈ లోని 1. ఏరోస్పేస్, 2. కెమికల్, 3. సివిల్, 4. కంప్యూ టర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, 5. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (స్పెషలైజేషన్), 6. ఎలక్ట్రికల్, 7. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, 8. మెకానికల్, 9. మెక ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులకు ఏబీఈటీ అక్రిడిటేషన్ లభించిందని సంధు వివరించారు.
→ఏబీఈటీ అంతర్జాతీ యంగా పేరొందిన అక్రిడిటేషన్ సంస్థ.

'హిరోషిమా' కంటే 24 రెట్ల శక్తిమంతమైన అణుబాంబు తయారు చేసేందుకు అమెరికా సిద్ధo

→రెండో ప్రపంచ యుద్ధం సమ యంలో జపాన్ లోని హిరోషిమా నగరంపై ప్రయోగిం చిన అణుబాంబు కన్నా 24 రెట్లు శక్తిమంతమైన అణు బాంబును తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైంది.
→బీ61-13 పేరుతో ఈ గ్రావిటీ బాంబును రూపొందించ నున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్' తెలిపింది.
→నేషనల్ న్యూక్లియర్ సెక్యూ రిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది.
→ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటా యింపు అంశం చట్టసభ ముందు పెండింగులో ఉన్నట్లు సమాచారం.
→నిరంతరం మారుతున్న ప్రపంచంలో అమెరికా మరింత శక్తిమంతంగా, సురక్షితంగా ఉండాలని కోరు కుంటున్నట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది.
→తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే వారిని ఈ అణు బాంబు నిలువరిస్తుందని పేర్కొంది.
→ఒకవైపు రష్యా దూకుడు, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని వెయ్యికి పైగా పెంచేందుకు చైనా సిద్ధమ వుతోందనే వార్తల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
→రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమాపై ప్రయో గించిన బాంబు సుమారు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేయగా.. నాగసాకిపై విడిచిన బాంబు సామర్థ్యం 25 కిలోటన్నులు.
→కానీ, ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ బీ61-13 అణుబాంబు మాత్రం 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయను న్నట్లు అంచనా.
→అంటే హిరోషిమా పై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ.
→బీ61-13 వంటి గ్రావిటీ బాంబులను యుద్ధవిమానాల నుంచి జారవిడుస్తారు. గురుత్వాకర్షణ శక్తి సాయంతో లక్ష్యంపై పడుతుంది.

ప్రపంచంలోనే అత్యధిక ఫిన్టెక్ యూని కార్న్ సంస్థలున్న దేశాల్లో భారత్ కు మూడో స్థానం

→ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక (ఫిన్టెక్) యూని కార్న్ సంస్థలున్న దేశాల్లో 2023 ఏడాదికి భారత్ కు మూడో స్థానం దక్కింది.
→అమెరికా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్ లను ఈ విభా గంలో కలిగి ఉంది.
→బ్రిటన్ 27 ఫిన్టిక్ యూనికార్న్లు ఉండగా, భారత్లో 17 సంస్థలు ఉన్నట్లు అంతర్జాతీయ రిసెర్చ్ సంస్థ స్టాటిస్ట్ గా పేర్కొంది.
→ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ విలువ ఉన్న 15 ఫిన్దెక్ కంపెనీల్లో 8 అమెరికాలో ఉన్నాయి. ఈ 8 కంపెనీల మొత్తం విలువ 1.2 లక్షల కోట్ల డాలర్లు.
→చైనాలో ఎనిమిది ఫిస్టిక్ యూనికార్న్ లు ఉండగా, వాటి మొత్తం విలువ 338.92 బిలియన్ డాలర్లుగా ఉంది.
→భారత్లో అత్యంత లాభదాయక కంపెనీల్లో జెరోధా, బిల్ డెస్క్, పేటీఎమ్, రాజోర్పే, పైన్ ల్యాబ్ మొదలైనవి ఉన్నాయి.

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో అనీష్ బన్వాలా కు కాంస్యం

→కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో అనీష్ బన్వాలా కాంస్యం గెలుచుకున్నాడు.
→2023, అక్టోబరు 30న పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో 28 పాయింట్లతో అనీష్ మూడో స్థానంలో నిలిచాడు.

BHEL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొప్పు సదాశివ్ మూర్తి

→భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బెల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొప్పు సదాశివ్ మూర్తి 2023, అక్టోబరు 30న నియమితులయ్యారు.
→ప్రస్తుత సీఎండీ నలిన్ షింఘాల్ నుంచి ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు.
→2027 ఫిబ్రవరి 28న పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు, ఏది ముందైతే ఆ పద్ధతిలో సదాశివ్ మూర్తి సీఎండీ హోదాలో కొనసాగుతారు.

యునెస్కో సృజనాత్మక నగరాల్లో 3 గ్వాలియర్, కోజికోడ్

→'యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ' (యూసీసీఎన్) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ (మధ్యప్రదేశ్), కోజికోడ్ (కేరళ)తో పాటు ప్రపం చవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది.
→అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో తెలిపింది.
→అక్టోబరు 31న 'ప్రపంచ నగరాల దినో త్సవం' సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
→సంగీత విభా గంలో గ్వాలియర్ను, సాహిత్యంలో కోజికోడు ఈ జాబితాలో చేర్చారు.
→తాజా జాబితాలో కార్మొండూ, రియో డీ జనీరో వంటి నగరాలు కూడా ఉన్నాయి.
→కొత్తవాటితో కలిపి యూసీసీఎన్ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లయింది.

విజయవంతంగా 'బ్రహ్మోస్ ప్రయోగం'

→బంగాళాఖాతం జలాల్లో భారత నౌకాద ళానికి చెందిన యుద్ధ నౌక పైనుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజ యవంతంగా పూర్తి చేసి నట్లు నేవీ వర్గాలు పేర్కొన్నాయి.
→రక్షణ పరిశోధన సంస్థలు రూపొందించిన క్షిపణి... తన లక్ష్యాలు సాధించడంలో పూర్తిగా సఫలీకృతమైనట్లు వెల్ల డించాయి.

రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం

→గత ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు స్వల్పంగా పెరిగాయి.
→ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 8, మరణాలలో 10వ స్థానంలో నిలిచింది.
→కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ దేశంలో 2023 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నివే దిక విడుదల చేసింది.
→ప్రమాదాలు, కారణాలు తదితర అనేక అంశాలను ఇందులో పేర్కొన్నారు.
→2021లో 21,315 రోడ్డు ప్రమాదాలతో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో ఉండగా 2022లో ఈసంఖ్య 2. పెరిగింది.
→64,105 ప్రమాదాలతో తమిళనాడు. గత ఏడాది దేశంలోనే మొదటిస్థానంలో ఉంది.
→గత ఏడాది దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 47 శాతం రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి.
→గత ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 7,559 మంది మరణించారు.
→ఈ విషయంలో రాష్ట్రం దేశంలో పదోస్థానంలో ఉండగా, 22,595 మరణాలతో ఉత్తరప్ర దేశ్ తొలిస్థానంలో ఉంది.
→రాష్ట్రంలో ఒంపులేని రోడ్లమీద 15,927 ప్రమా దాల్లో 5,689 మంది మరణించగా 14,772 మంది గాయ పడ్డారు.
→ఒంపు ఉన్న రోడ్డుపై 1647 ప్రమాదాల్లో 632 మంది మరణించగా 1703 మంది క్షతగాత్రులయ్యారు.
→రోడ్లపై గుంతల వల్ల 153 ప్రమాదాలు జరగ్గా 40 మంది మరణించారు. 129 గాయపడ్డారు.
→జంక్షన్ల వద్ద 2542 ప్రమాదాలతో రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో ఉంది.
→''టి' జంక్షన్ల వద్ద జరిగిన ప్రమాదాల్లో 801 మర ణాలతో దేశంలో 4వ స్థానంలో రాష్ట్రం ఉంది..
→4012 మంది పాదచారులు ప్రమాదాలకు గురి కాగా 1458 మంది ప్రాణాలు కోల్పోయారు.
→10,657 ద్విచక్రవాహనాల ప్రమాదాలు జరిగాయి. 3977 మంది మరణించారు.
→1075 ఆటో ప్రమాదాల్లో 334 మంది దుర్మరణం పాలయ్యారు.
→3057 కారు ప్రమాదాల్లో 588 మంది. మృతిచెందారు.
→మద్యం మత్తువల్ల 797 ప్రమాదాలు జరగ్గా 190 మంది మరణించారు.
→1278 మంది లైసెన్సు లేనివారు ప్రమాదాలకు కారణమయ్యారు.
→హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 2190 మంది మరణించారు. వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేక పోవడం వల్ల 773 మంది చనిపోయారు.
→సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల 271 మంది డ్రైవర్లు, 364 మంది ప్రయాణికులు మరణించారు.

వాంఖడెలో సచిన్ విగ్రహావిష్కరణ

→సొగసైన బ్యాటింగ్ తో, కళ్లు తిప్పుకోనివ్వని షాట్లతో,బౌలర్లపై ఆధిపత్యంతో.. ప్రపంచ క్రికెట్ ను ఏలిన దిగ్గజం సచిన్ తెందుల్కర్ కు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎప్పటికీ గుర్తుండి పోయే బహుమానాన్ని అందించింది.
→ప్రతిష్టాత్మక వాంఖడె స్టేడియంలో సచిన్ కాంస్య విగ్రహాన్ని ఎంసీఏ ఏర్పాటు చేసింది.
→ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిం చారు.
→స్టేడియంలో సచిన్ పేరుతో ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
→బౌలర్ తల మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడుతున్నట్లుగా, ఎడమ కాలు ముందుండి, శరీరం కాస్త వంగి నట్లు, బ్యాట్ ఆకాశం వైపు ఉన్నట్లుగా సచిన్ భంగిమ ఉంది.
→మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ విగ్రహం లాంటి చిన్న ప్రతిమను సచిన్ కు అందజేశారు.
→ఈ సందర్భంగా తన సొంత మైదానం వాంఖడెతో ఉన్న అనుబంధాన్ని సచిన్ పంచుకున్నాడు.
→1983లో వెస్టిండీస్, భారత్ మధ్య పోరు చూసేందుకు తొలిసారి పదేళ్ల వయసులో వాంఖడెకు వచ్చానని, అది కూడా టికెట్ లేకుండా మ్యాచ్ చూశానని సచిన్ గుర్తుచేసుకున్నాడు.
→ఈ కార్యక్రమంలో సచిన్ కుటుంబ సభ్యులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఐసీసీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

త్రిపుర, బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గం ప్రారంభం

→భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే మూడు ప్రాజెక్టులను ఇరు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనాలు వర్చువల్ ప్రారంభించారు.
→ఇందులో త్రిపురలోని నిశ్చింతపుర్, బంగ్లాలోని గంగాసాగరు కలిపే కీలక రైలు మార్గం ఉంది.
→ఈశాన్యరాష్ట్రాలతో బంగ్లాను కలిపే తొలి రైలు మార్గమిదే కావడం గమనార్హం.
→“భారత్-బంగ్లాదేశ్ మధ్య సహకారం విజయవంతమైంది. కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమా న ఏళ్లలో ఇరు దేశాలు కలిసి చేశాయి" అని మోదీ అన్నారు.
→65 కిలోమీటర్ల కుల్నా- మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గం, బంగ్లాదేశ్లోని రామాల్లో మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా ప్రధానులిద్దరూ ప్రారంభించారు.

ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్య లు

→రాజకీయ పార్టీల నిధుల సమీకర ణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్య లున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రా యపడింది.
→ఈ పథకం గోప్యత, విశ్వసనీ కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది.
→భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధి కారంలో ఉన్న వారు తెలు సుకోగలరని, విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
→అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారద ర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది.
→ఎన్ని కల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు కూడా విచారణ కొనసాగింది.
→ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి. ఆర్. గవాయ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యు లుగా ఉన్నారు.
→ఎన్నికల్లో నల్లధనం ప్రభా వాన్ని అడ్డుకోవాలన్న పథకం లక్ష్యం ఉన్నత మైనదే అయినప్పటికీ నిధులకు సంబంధిం చిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచడం కూడా ముఖ్యమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి

→అమెరికాలో పంది గుండె అమర్చిన మరో వ్యక్తి కన్నుమూశాడు.
→లారెన్స్ ఫౌసెట్ (58) కు సెప్టెంబరు 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి అమర్చారు.
→40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ అక్టోబరు 30న మృతి చెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వెల్ల డించింది.
→తొలుత నెల రోజులపాటు ఆ గుండె మెరుగ్గానే పనిచేసిందని. ఆ తరువాత నుంచి క్షీణించడం మొదలైందని పేర్కొంది.
→గతేడాది ప్రపంచ వైద్య చరిత్రలోనే మొదటిసారిగా డేవిడ్ బెన్నెట్(57) అనే వ్యక్తికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి పంది గుండెను అమర్చారు.
→అతడు సుమారు రెండు నెలలు మాత్రమే జీవించాడు.

సాధారణ రక్తపరీక్షతో క్షయవ్యాధి నిర్ధారణ!

→ సాధారణ రక్త పరీక్షతో చిన్నారుల్లో క్షయవ్యా ధిని కచ్చితంగా నిర్ధారించే ప్రక్రియను తాము కనుగొ న్నట్లు జర్మనీ పరిశోధకులు తెలిపారు.
→ వీరి అధ్యయ నాన్ని ‘లాన్సెట్' జర్నల్ ప్రచురించింది. క్షయ వ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది చిన్నారులు చనిపోతున్నారు.
→ 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో మరణానికి దారితీసే తొలి పది వ్యాధుల్లో ఇదొకటి.
→ ఈ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి.. క్షయవ్యాధిని తరచుగా తప్పుగా నిర్ధారణ చేయడం, లేదా సకాలంలో నిర్ధారణ చేయలేకపోవడం.
→ కఫం లేదా శ్లేష్మం విశ్లేషణల ఆధారంగా క్షయవ్యాధిని నిర్ధా రిస్తారు. చిన్నారుల నుంచి ఈ నమూనాలను తీసుకో వడం చాలా కష్టం.
→ అందుకే జర్మనీకి చెందిన లుడ్వెగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ (ఎల్ఎంయూ) పరిశో ధకులు ఈ సులభమైన, వేగవంతమైన రక్తనమూనా పరీక్షపై అధ్యయనం చేశారు.
→ ఈ పరీక్షలో వేలికొన నుంచి సులభంగా రక్తనమూనాను తీసుకోవచ్చు. ఫలితాలు కూడా త్వరగా లభిస్తాయి.
→ ఈ అధ్యయనాన్ని భారత్ సహా మరికొన్ని దేశాల భాగస్వా ముల సహకారంతో ఎల్ఎంయూ నిర్వహించింది.

జన్యు పరీక్షలతో 'క్షయ' చికిత్స

→ఔషధాలను తట్టుకొనే మొండి క్షయను నయంచేసే ప్రక్రియలో కొత్త విధానాన్ని కనుగొన్నామని ఐఐటీ- బాంబే అనుబంధ అంకుర సంస్థ హేస్టేక్ అనలటిక్స్ తెలిపింది.
→"పూర్తిస్థాయి జన్యు చట్రంతో రోగిలోని జన్యు వులను విశ్లేషించి.. ఏ ఔషధాలను క్షయ బ్యాక్టీరియా నిరోధిస్తుందో సమగ్ర నివేదిక రూపొందిస్తాం.
→దీని వల్ల రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న విషయంలో స్పష్టత ఏర్పడుతుంది" అని ఆ సంస్థ పేర్కొంది.

జలవనరుల సంరక్షణపై విశాఖలో సదస్సు

→90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధుల రాక
→జలవన రుల సంరక్షణపై అంతర్జాతీయ సదస్సు నుంచి విశాఖలో ప్రారంభం కానుంది.
→వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న నీటి కొరతకు పరిష్కార మార్గాలను ప్రధాన అంశంగా చర్చించనున్నారు.
→ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ), ఇండియన్ నేషనల్ కమిషన్ 'ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐఎన్సీఐడీ) ఆధ్వ ర్యంలో ఈ సదస్సు జరగనుంది.
→ సదస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ టుడు, ప్రహ్లాద్సంగ్ పటేల్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొననున్నారు.
→ఈ సదస్సుకు 90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు.

భారత సంతతి రచయిత్రికి బ్రిటన్లో రూ.25 లక్షల పురస్కారం

భారత సంతతి రచయిత్రి నందినీ దాస్ కు '2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్' లభించింది.
→ ప్రపంచంలో సాంస్కృతిక అవగాహ నను పెంపొందిస్తున్నందుకు రూ. 25 లక్షలు) లక్షలు) బహుమతిని ప్రదానం చేశారు.
→ ఆమె రచించిన 'కోర్టింగ్ ఇండియా: ఇంగ్లండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్' అనే పుస్తకం దీనికి ఎంపికయింది.
→ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె ఆంగ్ల ప్రొఫెసర్ గా ఉన్నారు.

W.H.O. లో బంగ్లా ప్రధాని కుమార్తెకు కీలక పదవి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఎన్నికయ్యారు.
→ ఈ పదవికి సైమా వాజెద్, నేపాల్కు చెందిన శంబు ప్రసాద్ ఆచార్య పోటీపడ్డారు.
→ ఢిల్లీలో జరిగిన రీజినల్ కమిటీ సమావే శంలో దీనిపై ఓటింగ్ జరిగింది. వాజెద్ కు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి.
→ బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తరకొరియా, ఇండోనేసియా, మాల్దీ వులు, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్, తైమోర్ లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు

శివ్ నాడార్ విరాళం రోజుకు రూ.5.5 కోట్లు

హెచ్ సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివాడార్ వరుసగా రెండో ఏడాదీ దాతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచారని 'ఎడెల్గావ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా-2023 తెలిపింది.
→ ఆయన ఏడాది వ్యవధిలో రూ.2,042 కోట్ల మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు.. అంటే రోజుకు రూ.5.5 కోట్లని నివే దిక తెలిపింది.
→ 2022 నివేదిక ప్రకారం, అంతకుముందు ఏడాది కాలంలో ఆయన రూ.1161 కోట్లు విరాళమి చ్చారు.
→ దానితో పోలిస్తే ఇది 76 శాతం ఎక్కువ. శివ్ నాడార్ సంపద విలువ రూ.2.28 లక్షల కోట్లని నివేదిక పేర్కొంది.
→ అజీమ్ ప్రేమ్జీ విరాళం ఏడాది వ్యవధిలో 267 అధికమై రూ.1,774 కోట్లకు చేరింది. ఆయన ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
→ ముకేశ్ అంబానీ రూ. 376 కోట్ల విరాళంతో, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
→ గతే డాది దాతృత్వ జాబితాలో ఏడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఈ సారి రెండు స్థానాలు పైకి చేరారు.
→ తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు: దేశంలో రూ.5 కోట్లకు మించి విరాళం ఇచ్చిన వారి సంఖ్య 199 అని నివేదిక తెలి పింది. ఇందులో తెలుగు వారు ముగ్గురున్నారు.
→ డాక్టర్ రెడ్డిస్ కు చెందిన సతీష్ రెడ్డి కుటుంబం రూ.7 కోట్లు, అరబిందో రాంప్ర సాద్ రెడ్డి కుటుంబం రూ.14 కోట్లు, దివీస్ ల్యాబ్స్ అధిపతి దివి మురళి రూ.22 కోట్లు విరాళం ఇచ్చినట్లు నివేదిక తెలిపింది.
→ దేశంలో నాలుగో అతిపెద్ద వితరణశీలిగా కుమార్ మంగళం బిర్లా (రూ.287 కోట్లు) నాలుగో స్థానం నిలబెట్టుకున్నారు.
→ అగ్రగామి-10లోకి బజాజ్ కుటుంబం,సైరస్ పూనావాలా, అదర్ పూనావాలా, రోహిణి నీలేకని వచ్చిచేరారు.
→ మహిళల్లో రోహిణి నీలేకని అగ్రస్థానంలో నిలవగా.. అను అగా, లీనా గాంధీ, తివారీ వంటి వారు జాబితాలో చోటు దక్కించుకున్నారు.
→ జెరోధా అధిపతి నిఖిల్ కామత్ (37) జాబితాలో పిన్న వయస్కుడిగా ఉన్నారు. కామత్ సోదరులు మొత్తంగా రూ.110 కోట్ల విరాళాలు ఇచ్చారు.
→ ఎల్ టీ ఏఎం నాయక్ రూ.150 కోట్ల విరాళంతో 11వ స్థానంలో నిలిచారు.

సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలగిన రష్యా

అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం(సీటీబీటీ) నుంచి రష్యా వైదొలగాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు.
→ అమెరికాతో సమానంగా అణ్వాయుధాల ఉత్పత్తి కోసం ఈ ఒప్పందం నుంచి వైదొలగాల్సిన అవసరం ఉందని రష్యా నిర్ణయించింది.
→ పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లుకు గత నెలలో సమ్మతి తెలుపగా దానిపై అధ్య క్షుడు పుతిన్ సంతకం చేశారు.

ప్రప్రథమ అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు

కృత్రిమ మేధ (ఎఐ) వల్ల మానవాళి మనుగడకు ఎదురయ్యే ముప్పును కట్టడి చేయడానికి కలిసి పని చేయాలని 28 దేశాలు అంగీకరించాయి.
→ ఏఐవల్ల తలెత్తే ప్రమాదాల నివారణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి.
→ బ్రిటన్ లోని బ్లెబ్లీలో బుధ, గురువారాల్లో ప్రప్రథమ అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు జరిగింది.
→ ఈ సందర్భంగా ఏఐ నియంత్రణకు బెబ్లీ డిక్లరేషన్ చేశారు.
→ దీనిపై సంతకం చేసిన దేశాల్లో భారత్, బ్రిటన్, అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్యతో (ఈయూ) సహా ముఖ్య దేశాలున్నాయి.
→ భారత్ తరఫున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొ న్నారు.
→ ఏఐ, ఇంటర్నెట్, ఆధునిక సాంకేతికతలను చట్టపరమైన జవాబుదారీ తనంతో ఉపయోగించాల న్నది భారత్ అభిమతమని మంత్రి చెప్పారు.
→ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ రహస్య సంకేతాలను ఛేదించిన స్థావరం బెబ్లీలోనే ఉంది.
→ ఈ స్థావరమే ఆధునిక కంప్యూటింగ్కు నాంది పలికింది.
→ ఈ సద స్సులో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు శాస్త్రవేత్తలు,ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి టెక్ సంస్థల ప్రతి నిధులు పాల్గొన్నారు.
→ ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంద ర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.
→ అది కొత్త తరహా ఏఐలను ఎప్పటికప్పుడు పరిశీలించి జాతీయ, అంతర్జాతీయ విధానాల రూపకల్పనకు సల హాలిస్తుందని తెలిపారు.
→ ప్రజాహితానికి ఏఐ వినియో గంపై ప్రమాణాల రూపకల్పనకు ఒక ఏఐ భద్రతా సంస్థను నెలకొల్పుతున్నట్లు అమెరికా ప్రకటించింది.

మస్క్ కుమారుడి పేరులో చంద్రశేఖర్:-
→ టెస్లా, ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కుమా రుడి పేరులో చంద్రశేఖర్ ఉంది. ఈ విషయాన్ని తాను లండన్లో గుర్తించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశే ఖర్ తెలిపారు. ఎలాన్ మస్క్ కుమారుడి పేరు షివాన్ జైలిస్ అని ఆ రెండు పేర్ల మధ్యలో చంద్రశేఖర్ అని ఉంటుందని చెప్పారు. నోబెల్ అవార్డు గ్రహీత సుబ్ర మణియన్ చంద్రశేఖర్ పేరులోని చంద్రశేఖర్ను మస్క్ తన కుమారుడికి పెట్టారని వివరించారు.

మధుమేహానికి దారితీస్తున్న వాయుకాలుష్యం

వాయు కాలుష్యం హృదయ, రక్తనాళ సంబంధ వ్యాధులనే కాదు, టైప్ 2 మధుమేహ ప్రమాదాన్నీ పెంచు తుందని మనదేశంలో ప్రప్రథమంగా జరిగిన అధ్యయనం తేల్చింది.
→ ఇంతవరకు వాయు కాలుష్యం తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే ఇలాంటి పరిశోధనలు జరిగాయి.
→ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2010-17 మధ్య కాలంలో దిల్లీ, చెన్నైల్లోని 12,000 మంది స్త్రీపురుషులపై వాయు కాలుష్య ప్రభావాన్ని అంచనా వేశారు.
→ వారి రక్తం నుంచి నిర్ణీత కాలావధిలో రక్త నమూనాలు తీసి చక్కెరపాళ్లు అంచనా వేశారు.
→ మానవ జుత్తు కన్నా 30 రెట్లు సన్నగా ఉండే పీఎం 25 కలుషిత సూక్ష్మ ధూళి కణాలను పీల్చితే టైప్ 2 మధుమేహ ముప్పు పెరుగుతున్నట్లు తేల్చారు.
→ నెల రోజులపాటు పీఎం 25 కణాలను పీలిస్తే రక్తంలో చక్కెర పాళ్లు పెరుగుతున్నాయని, ఏడాదిపాటు వీలిస్తే మధుమేహం వస్తున్నట్లు నిర్ధారించారు.
→ దిల్లీ, చెన్నైలలో వార్షిక సగటు పీఎం 25 స్థాయి ఘనపు మీట రుకు 10 మైక్రోగ్రాముల చొప్పున పెరిగితే మధుమేహ ముప్పు 22 రెట్లు పెరుగుతోందని కనుగొన్నారు.

ఎన్నికల బాండ్లతో క్విడ్-ప్రో-కో చట్టబద్దం కాకూడదు

ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను గణ నీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.
→ అధికార కేంద్రాలకు ఆ అధికారంతో లబ్ది పొందే వారికి మధ్య జరిగే క్విడ్-ప్రో-కోను చట్టబద్ధత చేసే సాధనంగా ఎన్నికల బాండ్ల పథకం మారకూ డదని పేర్కొంది.
→ అధికారికంగా పార్టీలకు ముడు పులిచ్చే సాధనంగా ఇది ఉపయోగపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలి పింది.
→ ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా మూడో రోజు విచారణ సాగించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచు తున్నట్లు ప్రకటించింది.
→ ఎన్నికల బాండ్ల ద్వారా సెప్టెంబరు 30, 2023 వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పిం చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
→ పథకం లోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభు ఉందని పేర్కొంది.
→ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి. ఆర్. గవాయ్, జస్టిస్ జేబీ పార్టీ వాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉన్నారు.
→ తమకు విరాళాలు ఇచ్చేవా రెవరో సంబంధిత పార్టీలకు తెలుసునని వాదనల సందర్భంగా సొలిసిటర్ జన రల్ తుషార్ మెహతా తెలిపారు.
→ మరి అలాగైతే అంతా బహిర్గతం చేయొ చ్చుగా.. అని మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది.
→ “ఎవరికి ఎవరు విరాళాలి స్తున్నారో పార్టీలకు తెలుసు. ఓటరుకు మాత్రమే తెలియదు.
→ మరి ఓటరుకు తెలి యాల్సిన అవసరం లేదంటారా" అని న్యాయస్థానం పేర్కొంది. సీజేఐ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.
→ "ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను తగ్గిం చాలి. అధీకృత బ్యాంకింగ్ ఛానళ్లనే వినియోగించేలా ప్రోత్సహించాలి.
→ గోప్యత కల్పిస్తే బ్యాంకు లావాదేవీలు పెరుగుతాయి. పారదర్శకత పాటించాలి.
→ మరో కీలకాంశమేంటంటే.. రాష్ట్రంలో, కేంద్రంలో అధికార కేంద్రాలకు.. ఆ అధికారంతో లబ్ధి పొందే లబ్ధిదారులకు మధ్య జరిగే క్విడ్-ప్రో-కోను చట్టబద్ధం చేసే సాధ నంగా ఇది మారకూడదు" అని సీజేఐ పేర్కొన్నారు.
→ గతంలో సంస్థలిచ్చే విరా ళాలపై పరిమితులు ఉండేవని, దాన్ని ఎత్తివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
→ షెల్ కంపెనీలు సృష్టికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పరిమితిని ఎత్తి వేశామని కేంద్రం తరపున తుషార్ మెహతా తెలిపారు.
→ పిటిషనర్లలో ఒకరైన స్వచ్ఛందసంస్థ ఏడీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాద నలు వినిపిస్తూ.. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ఎన్నికల బాండ్లన్నీ అధికార పార్టీకే వెళుతున్నాయని.. ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే ప్రమాదాలెక్కువ!

సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్య ధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ తాజా నివేదిక స్పష్టం చేసింది.
→ గతేడాది 94,009 ప్రమాదాలు ఆ మూడు గంటల మధ్యలోనే జరిగాయని వెల్లడిం చింది.
→ ఈ సంఖ్య మొత్తం ప్రమాదాల్లో 20 శాతమని తెలిపింది.
→ అర్ధ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది.

29 దేశాల్లో ఇంకా సిరా చుక్క వేసే పద్ధతి

ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు సహా పలు సాంకేతికతలు వచ్చినా.
→ 60 ఏళ్ల నాడు ఆరంభించిన 'సిరా చుక్క'ది ఇప్పటికీ చెరగని ముద్రే.
→ ఓటరు తన ఓటుహక్కును వినియోగించుకున్నాక సిరా చుక్క వేసే పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశ పెట్టింది.
→ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఫార్ములాతో ఈ సిరాను ఉత్పత్తి చేయడానికి మైసూర్ కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీకి కేంద్రం అదే ఏడాది అనుమతిచ్చింది.
→ ఇందులో 7.25% సిల్వర్ నైట్రేట్ ఉండటంతో 72 గంటలపాటు చెరిగిపోదు.
→ మరో విశేషం ఏమంటే.. 1976 నుంచి 29 దేశాల ఎన్నికల్లో మన దగ్గర తయా రైన సిరానే వాడుతున్నారు.
→ హైదరాబాద్ లోని రాయుడు ల్యాబొరేటరీస్లోనూ దీన్ని తయారు చేసి ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తున్నారు.
→ పోలియో చుక్కలు వేసే సమయంలో చిన్నారులకు సైతం దీన్నే వినియోగిస్తుండడం విశేషం.

హైదరాబాద్ పారిశ్రామికవేత్తకు జపాన్ పురస్కారం

హైదరాబాద్ లోని ఆసా భాను జపాన్ సెంటర్ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్రను జపాన్ ప్రభుత్వం 'ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్' పురస్కారా నికి ఎంపిక చేసింది.
→ భారత్లో జపాన్ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాల పెంపునకు చేసిన లోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది.
→ భారత్, జపాన్ల మధ్య పరస్పర అవగాహన, సంబం ధాల కోసం రామభద్ర 1999లో హైదరాబాద్ లో ఆసా భాను జపాన్ కేంద్రాన్ని ప్రారంభించారు.
→ అప్పటి నుంచి భారత ప్రజలకు ఆయన జపనీస్ సంస్కృతి, సంప్రదాయాలను వివరించడంతో పాటు రెండు దేశాల మధ్య సహకా రాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థిక సంబంధాల మెరుగుదలకు దోహదపడుతున్నారని తెలిపింది.
→ త్వరలోనే ఈ పురస్కా రాన్ని అందజేస్తామని పేర్కొంది.
→ ఇంజినీరింగు పట్టభద్రుడైన రామభద్ర 1975 నుంచి రెండు దశాబ్దాల పాటు జపాన్ లోని మిత్సుబిషితోపాటు ఇతర సంస్థల్లో పనిచేశారు.
→ 1995 హైదరా బాద్ కు వచ్చి ఆసా భాను టెక్నాలజీ సర్వీసును ప్రారంభించారు.

'ఆల్ ఇన్ వన్ యాప్ ను కొనుగోలు చేసిన అమెరికా టెక్ దిగ్గజం

అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు.
→ అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది.
→ ఈ నేపథ్యంలో యూఎస్ నుంచి దిబ్రూగడకు చేరు కున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
→ చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు.
→ ఇటీవలే అతను 'texts.com' అనే ఆల్ ఇన్ వన్ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ ను తయారుచేశాడు.
→ ఇన్స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్లలో ఉన్న కాంటాక్ట్స్ ఈ యాప్ ను ఉపయోగించి మెసేజ్ లు చేసుకోవచ్చు.
→ ఈ యాప్ను అమెరికా టెక్ దిగ్గజం 'ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయ డంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.

వరల్డ్ ఫుడ్ ఇండియా రెండవ సదస్సు

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న ఆహారశుద్ధి పరిశ్రమలోకి గడచిన తొమ్మిదేళ్లలో రూ.50 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ)లు వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర వారం వెల్లడించారు.
→ పంటల కోతల సందర్భంగా ఏర్పడే నష్టాలను, ఆహార వృథాలను తగ్గించాలని పేర్కొన్నారు.
→ గడచిన తొమ్మిదేళ్లలో దేశ ఆహార శుద్ధి సామర్థ్యం గొప్ప వృద్ధితో 12 లక్షల టన్నుల నుంచి 200 లక్షలకు చేరిందన్నారు.
→ ఈ క్రమంలో శుద్ధి చేసిన ఆహార పదార్థాల ఎగుమతులు 150 శాతం పెరిగా యని చెప్పారు.
→ చిరుధాన్యాల వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రధాని వివరిం చారు.
→ చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే ఆహార పదార్థాల్లో వైవిధ్యం ఉండాల న్నారు.
→ ఢిల్లీలో భారత్ మండపంలో ప్రారం భమైన వరల్డ్ ఫుడ్ ఇండియా రెండవ సదస్సును ఉద్దే శించి మోదీ ప్రసంగించారు.
→ ఈ నెల 5వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలు, 200 మంది ప్రతినిధులు, 12 మంత్రిత్వశాఖలు, పలు విభా గాలు, కమోడిటీ బోర్డులు భాగస్వామ్యమవుతున్నాయి.

14 రోజుల్లోనే మధుమేహ నియంత్రణ!

భారత్లో లో మధుమేహ బాధితులు పెరుగు తున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్య యనం ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
→ ఆరోగ్యకర జీవనశైలి, ఆహారం, మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలు కలిగిన బీజీఆర్-34 వంటి మూలికా ఔషధాలతో రక్తంలో చక్కెర స్థాయిని 14రోజుల్లోనే నియంత్రిం చొచ్చని వారు గుర్తించారు.
→ పట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
→ ఇందులో భాగంగా.. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిపై వారు దృష్టి సారించారు.
→ అతడికి రెండు వారాల పాటు బీజీఆర్-34, ఆరోగ్యవర్ధిని వాతి, చంద్రప్రభావతి వంటి ఆయుర్వేద ఔషధాలు, కొలె స్ట్రాల్ను తగ్గించే ఔషధాలు, జీవనశైలిలో సర్దు బాట్లు, నిర్దిష్ట ఆహారాన్ని సూచించారు.
→ 14 రోజుల తర్వాత చికిత్సలో స్వల్ప మార్పు చేశారు. ఈ సమయంలో రోగి పరిస్థితి గణనీయంగా మెరుగు పడింది.
→ చికిత్సకు ముందు అతడిలో చక్కెర స్థాయి.. పరగడుపున 254 ఎంజీ/డీఎల్ గా ఉండేది.
→ చికిత్స తర్వాత అది 124 ఎంజీ/డీఎల్ కు తగ్గింది. గతంలో... అల్పాహారం తీసుకున్నాక అత డిలో చక్కెర స్థాయి 413గా ఉండేది.
→ చికిత్స తర్వాత 150 ఎంజీ/డీఎల్ కు అది తగ్గింది.
→ ఈ ఫలి తాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, అందువల్ల మరింత విశ్లేషణ కోసం విస్తృత అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సౌందర్యలేపనాల్లోని పదార్థంతో జన్యువుల్లో మార్పులు

ఇళ్లలో వాడే కొన్ని నేత్రం ఉండే ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తులు, సౌందర్య లేపనాల్లో అనే రసాయనంతో.. జన్యువులను నియంత్రించే వ్యవస్థల్లో మార్పులు జరిగే ప్రమాదం ఉందని వెల్లడైంది.
→ స్పెయిన్ లోని కారెరాస్ లుకేమియా రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ ఈ అంశంపై పరిశోధన చేసింది.
→ ఫార్మాల్డిహైడ్.. కలుషిత గాల్లో కూడా ఉంటుంది. దీన్ని నిర్మాణ రంగంలో విస్తృ తంగా ఉపయోగిస్తారు.
→ దీని తాకిడి వల్ల క్యాన్సర్, ఉబ్బసం, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
→ శరీరంలో మిథైలేషన్ అనే ప్రక్రియను ఇది అడ్డుకుంటున్నట్లు తాజాగా గుర్తించారు.
→ ఈ విధానంలో 'మిథైల్ గ్రూప్స్' ఉత్పత్తి జరుగుతుంది.
→ అవి జన్యు చర్యలను నియంత్రించే ఎపిజె నిటిక్ ప్రక్రియను నియంత్రిస్తాయి.
→ ఫార్మాల్డిహైడ్ తాకిడి వల్ల హిస్టోన్ల మిథైలేషన్కు నష్టం జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ హిస్టోన్లు.. మన డీఎన్ఏను పట్టి ఉంచు తాయి.
→ అలాగే వేలాది జన్యువుల పనితీ రును నియంత్రిస్తాయి. ఫార్మాల్డిహైడ్.. శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశి స్తుంది.
→ అది నీటిలో సులువుగా కరిగి పోయే గుణాన్ని కలిగి ఉంది. అందువల్ల చాలా తేలికగా అది శరీరంలోని అన్ని కణాలను చేరగలదు.

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘వేరిట్' యాప్

నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు రూపొందించిన 'వేరిట్' యాప్ ను వినియోగించుకోవాలని తెలిపారు.
→ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మద్యం బాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినదా కాదా అనే విషయం తెలుసుకోవచ్చునని ఆమె తెలిపారు.
→ బాటిల్ పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఏ రాష్ట్రానికి చెందిందో తెలియడంతో పాటు ఒరిజినల్ లేక నకిలీనా అనే విషయం కూడా నిర్ధారణ అవుతుందన్నారు.
→ అక్రమ మద్యం నిల్వలపై సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 18004252523కు కాల్ చేయాలన్నారు.

నందినీ దాసు కు బ్రిటిష్ ఆకా డమీ బుక్ ప్రైజ్

భారత సంతతి రచయిత్రి నందినీ దాసు 2023, నవంబరు 1న '2023 బ్రిటిష్ ఆకా డమీ బుక్ ప్రైజ్' లభించింది.
→ ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తు న్నందుకు ఆమెకు 25 వేల పౌండ్ల (సుమారు రూ.25 లక్షలు) బహుమతిని ప్రదానం చేశారు.
→ ఆమె రచించిన 'కోర్టింగ్ ఇండియా: ఇంగ్లండ్, మొగల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకం దీనికి ఎంపికైంది.
→ ప్రస్తుతం ఈమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ప్రొఫెసర్ గా ఉన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచో) ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజినల్ డైరెక్టర్ గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచో) ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజినల్ డైరెక్టర్ గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఎన్నికయ్యారు.
→ ఈ పదవికి సైమా వాజెద్, నేపాలకు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీపడ్డారు.
→ 2023, నవంబరు 1న ఢిల్లీలో జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరి గింది. వాజెర్కు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి.
→ బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేసియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయ్ లాండ్, తైమోర్ లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు.
→ ప్రస్తుత రీజినల్ డైరెక్టర్, భారతికి చెందిన పూనమ్ టేత్రపాల్ సింగ్ నుంచి సైమా వాజెద్ 2024, ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు.

యునెస్కో జాబితాలో గ్వాలియర్,కోజికోడ్

'యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ' (యూసీసీఎన్) జాబితాలో మన దేశం లోని గ్వాలియర్ (మధ్యప్రదేశ్), కోజికోడ్ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది.
→ అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్ద పీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికలను అమలు చేయ డంలో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో తెలి పింది.
→ అక్టోబరు 31న 'ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
→ సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్యంలో కోజి కోడ్ ను ఈ జాబితాలో చేర్చారు.
→ తాజా జాబితాలో కాఠ్ మాండు, రియో డీ జనీరో లాంటి నగరాలు కూడా ఉన్నాయి.
→ కొత్తవాటితో కలిపి యూసీసీఎన్ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు చోటు దక్కించుకున్నాయి.

అక్టోబరులో GST వసూళ్లు 13 శాతం పెరుగుదల

అక్టోబరులో GST వసూళ్లు 13 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి.
→ జీఎస్టీ వసూళ్లపరంగా 2023 ఏప్రిల్లో నమోదైన రూ.1.87 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్య ధికం.
→ 2023, సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లుగా ఉన్నాయి.
→ GST- 2023 అక్టోబరులో వసూ లైన రూ.1,72,003 కోట్ల స్థూల జీఎస్టి ఆదాయంలో, కేంద్ర జీఎస్టీ (సీజీఎస్) రూ.30,062 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.38,171 కోట్లు, ఐజీఎస్టీ 91,315 కోట్లు, సెస్సు రూ.12,456 కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రాజెక్టు కుశ- గగనతల రక్షణ కవచం!

శత్రు విమానాలు, క్షిపణులను అడ్డుకొనే దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకొనే కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది.
→ 'ప్రాజెక్టు కుశ' కింద 2028-29 కల్లా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి దేశం వడివడిగా అడుగులు వేస్తోంది.
→ ఇజ్రాయెలీ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఇది పోలి ఉంటుంది.

ఆత్మకథ ప్రచురణను నిలిపివేసిన ఇస్రో ఛైర్మన్

త్వరలో విడుదల కాబో తున్న తన ఆటోబయోగ్రఫీ పుస్తకంపై వివాదం చెలరేగడంతో దాన్ని ప్రచురణ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
→ సంస్థ మాజీ అధిపతి కె. శివన్ పై ఆ పుస్తకంలో విమర్శలు చేసినట్లు వార్తలు రావడంతో శనివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
→ 'నిలవు కుడిచ సింహంగళ్ (వెన్నెలను తాగిన సింహాలు) పేరుతో రాసిన ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు ఒక మలయాళ పత్రికలో ప్రచురితమయ్యాయి.
→ అందులో సోమనాథ్కు పదోన్నతులు రాకుండా శివన్ అడ్డుకున్నారన్న భావన వ్యక్తమయ్యేలా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది వివాదం సృష్టిం చింది.
→ దీనిపై సోమనాథ్ విలేకరుల వద్ద స్పందించారు.
→ ఒక సంస్థలో ఉన్నత హో దాకు చేరుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కొన్ని జీవితంలోనూ అలాంటి ఉంటుంది. క్లిష్ట పరిస్థితులు ఎదుర య్యాయి. ఒక కీలక పదవి కోసం ఎక్కువ మంది ఉండొచ్చు.
→ ఆ విషయాన్నే నేను పుస్తకంలో ప్రస్తా వించాను. అంతేగానీ.. నేను ఏ వ్యక్తినీ లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయలేదు" అని స్పష్టం చేశారు.
→ తన పుస్తకంలోని అంశాలను ఒకింత తప్పుగా అన్వయించుకున్నట్లు స్పష్టమవుతోంద న్నారు.
→ ఇస్రో చైర్మన్ హోదాకు చేరుకోకుండా శివన్ తనను అడ్డుకున్నట్లు తాను ఎక్కడా చెప్ప లేదని పేర్కొన్నారు.
→ "నా పుస్తకాన్ని ఇంకా అధికా రికంగా విడుదల చేయలేదు. కొన్ని ప్రతులను ప్రచురణకర్త వెలువరించినట్లున్నారు.
→ అయితే తాజా వివాదం నేపథ్యంలో ఆ పుస్తక ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించా" అని తెలిపారు.
→ తన పుస్తకంలో చంద్రయాన్-2 వైఫల్యాన్ని కూడా ప్రస్తావించినట్లు సోమనాథ్ వెల్లడించారు.

నవంబరు 6 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేప కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
→ 29వ విడత ఎన్నికల బాండ్ల విక్రయాలను నవంబరు 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
→ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాకు చెందిన 29 అధీకృత శాఖల్లో నవంబరు 6 నుంచి 20వ తేదీ వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
→ నవంబరు 7 నుంచి 30వ తేదీ వరకు రాజస్థాన్, మధ్యప్ర దేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జర గనున్నాయి.
→ ఈ ఎన్నికలకు ఒక రోజు ముందు ఎన్నికల బాండ్ల విక్రయాలు ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించు కుంది.
→ రాజకీయ పార్టీలకు అందించే విరాళాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను ఓ ప్రత్యామ్నా యంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
→ 2018 మార్చి నుంచి నిర్ణీత కాల వ్యవధుల్లో ఇప్పటి వరకూ 28 విడతల్లో ఎన్నికల బాండ్లను ఎస్బీఐ ద్వారా విక్రయించారు.
→ తాజాగా 29వ విడత విక్రయాలకు కేంద్రం అనుమతినిచ్చింది.అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చా లని భావించే వ్యక్తులు/సంస్థలు/కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.
→ జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి.
→ గడువు తేదీ ముగిసిన తర్వాత బాండ్లను జమ చేసినా.. ఎలాంటి నగదు జమ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ఖాతాలో ఈ బాండ్లను డిపాజిట్ చేసిన రోజే నగదు మొత్తం జమవు తుంది. గత లోక్సభ లేదా శాసనసభ ఎన్నికల్లో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైన రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందే అర్హత ఉంటుంది.
→ ఎన్నికల బాండ్లను విక్రయించే ఎస్బీఐ శాఖలున్న నగ రాలు..: బెంగళూరు, లఖ్ నవూ, శిమ్లా, దేహ్రాదూన్, కోల్ కతా, గువాహటి, చెన్నై, పట్నా, దిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీన గర్, భోపాల్, రాయ్ ్పుర్, ముంబయి.

22వ S.C.O. దేశాధినేతల సమ్మిట్

కిర్గిస్థాన్లోని బిష్కెక్ లో లో జరిగిన 22వ S.C.O దే శాధినేతల సదస్సులో ప్రధాని మోడీ తరఫున భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొని ప్రాంతీయ సుస్థిరత, సుసంపన్నతల కోసం షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) సభ్య దేశాలు కృషి చేయాలని ప్రసంగించారు.
→ ఈ సదస్సులో కిర్గిస్థాన్, కజకిస్థాన్, ఇరాన్, చైనా, రష్యా, తజికిస్థాన్, పాకి స్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

యూనికార్న్ లో భారత్ కు మూడో స్థానం

ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక (ఫిస్టిక్) యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో భారత్కు మూడో స్థానం దక్కింది.
→ అమెరికా, బ్రిటన్ తొలి రెండు స్థా నాల్లో ఉన్నాయి.

పైలట్ల లైసెన్స్ 10 ఏళ్లకు పెంపు

రవాణా, వాణిజ్య విమానాల పైలట్ల లైసెన్స్ కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
→ ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937కి సవరణలు చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

U.N.O. లో ముగ్గురు భారతీయులు

కృత్రిమ మేధ (ఏఐ)తో వచ్చే ప్రమాదాలను నివారించి, మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని యూఎన్ ఓ నియమించింది.
→ ఇందులో ముగ్గురు ప్రముఖ భారతీయ టెక్ నిపుణులు అమన్ దీప్ సింగ్ గిల్, శరద్ శర్మ, నాజ్నీన్ రజనీ చోటు దక్కించుకు న్నారు.

వాణి సర్రాజురావు

ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్ కు చెందిన 1994 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వాణి సర్రాజురావు నియమితులయ్యారు.
→ ప్రస్తుతం విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆమెను ఇటలీలో రాయబారిగా నియమి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మాధవరావు

రక్షణ రంగంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) చైర్మన్, ఎండీగా ఎ.మాధవరావు నియమితులయ్యారు.
→ ప్రస్తుతం ఆయన సంస్థ డైరెక్టర్ (టెక్నికల్)గా ఉన్నారు. మూడు నెలల పాటు లేదా కొత్త వారిని నియమించే వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.

నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు.

ఆరోగ్యస్వామి పాల్ రాజ్

బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందడానికి కీలకమైన మల్టిపుల్ ఇన్. మల్టిపుల్ ఔట్ సాంకేతికత సృష్టికర్త, భారతీయ అమెరికన్ శా స్త్రవేత్త ఆరోగ్యస్వామి పాల్ రాజు లండన్లో ఫారడే అవార్డును ప్రదానం చేశారు.

జి.సంజీవరెడ్డి

ఈ ఏడాది రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును మాజీ ఎంపీ, ఐఎన్టీయూసీ అధ్య క్షుడు డా.జి.సంజీవరెడ్డికి ప్రదానం చేయనున్నారు.

మెక్సికో గ్రాండ్ రేస్

ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్ షిప్ టైటిల్ను సొంతం చేసుకున్న రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్ స్టాపెన్ మెక్సికో గ్రాండ్ రేసులోనూ విజేతగా నిలిచాడు.
→ ఈ సీజన్లో వెర్సొపెన్ కిది 16వ గెలుపు. ఓవరాల్ గా వెర్ స్టాపెన్ కెరీర్లో ఇది 51వ విజయం.

ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్

ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
→ చైనాలోని చాంగ్వాన్లో జరుగుతున్న పోటీల్లో జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో సోనమ్ మస్కర్, గౌతమి, జాస్మిన్ కౌర్ ల బృందం (1891.6) అగ్రస్థానంలో నిలిచింది

అసోచామ్ తెలంగాణ సహ చైర్మన్

అసోచామ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కౌన్సిల్ సహ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి ఎంపికయ్యారు.
→ డేటా కేంద్రాలను నిర్వ హించే కంట్రోల్ఎస్ డేటా సెంటర్స్, క్లౌ డ్ 4సీ వ్యవస్థాపకులు శ్రీధర్ 2023-24 ఏడాదికి ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.

అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ కు ఉస్మానియా గౌరవ డాక్టరేట్

అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ ఉస్మానియా విశ్వవి ద్యాలయం 49వ గౌరవ డాక్టరేటు అందుకున్నారు.

బ్రహ్మోస్ క్షిపణి సక్సెస్

భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
→ బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వం సక నౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.

స్పీకర్ గా మైక్ జాన్సన్

అమెరికా ప్రతినిధుల సభ స్పీకరుగా మైక్ జాన్సన్ ఎన్నికయ్యారు. లూసియానా నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున జాన్సన్ కాంగ్రెస్కు ఎన్నికయ్యారు.
→ ఆయనకు వ్యతిరేకంగా 209 ఓట్లు పడగా, అను కూలంగా 220 ఓట్లు పోలయ్యాయి.

టూరిస్ట్ లు శ్రీలంక వీసా ఫ్రీ ఎంట్రీ

టూరిజం ప్రోత్సహించేందుకు శ్రీలంక భారత్ సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిం చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది.
→ భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇం డోనేషియా, థాయ్లాండ్ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు ఇవ్వనుంది.

ఓటింగ్ కు భారత్ దూరం

గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకం గా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది.
→ మొత్తం 193 దేశాలున్న యూఎన్ ఓ జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి.

యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్ , కోజికోడ్

'యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ (యూసీసీఎన్) జాబితాలో.. మన దేశంలోని గ్వాలి యర్(మధ్యప్రదేశ్), కోజికోడ్ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది.
→ అభివృద్ధి విదానాల్లో సంస్కృతి, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరా భివృద్ధి ప్రణాళికల్ని అమలు చేస్తున్నందుకు వీటిని గుర్తించినట్లు యునెస్కో తెలిపింది.
→ అక్టోబరు 31న "ప్రపంచ నగరాల దినోత్సవం' సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
→ సంగీత విభా గంలో గ్వాలియర్, సాహిత్యంలో కోజికోడ్ ఈ జాబి తాలో చోటు పొందాయి.
→ కొత్తవాటితో కలిపి _యూసీసీఎన్ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లయింది.

సీటీబీటీ నుంచి వైదొలగిన రష్యా

అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేద (సీ టీబీటీ) ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంటు ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలపడంతో రష్యా -సిటీబీటీ నుండి అధికారికంగా వైదొలిగింది.
→ ఇంత కుముందు ఈ తీర్మానానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
→ 198 6లో కుదిరిన సీటీబీటీ ఒప్పందం ప్రపంచంలో ఎక్కడా కూడా ఆణ్వస్త్ర పరీక్ష జరగకూడదని నిర్దేశి స్తోంది.
→ ఎగువ సభ ఆమోదం లభించిన కొన్ని గం టల వ్యవధిలోనే రష్యా సైన్యం.. అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో అణ్వస్త్ర సిమ్యులేషన్ అభ్యాసాలను నిర్వహించింది.
→ శత్రుదేశాలు తమ పైకి అణ్వస్త్రా లను ప్రయోగిస్తే వాటి నెలా ఎదుర్కోవాలనే విష యమై వ్యూహాత్మకంగా శిక్షణ ఇస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఓటింగ్

హమాస్ ఉగ్రదాడితో గాజాపై ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేస్తోంది.
→ ఈ తీవ్ర ఘర్షణ వేళ మానవతా దృక్పథంతో తక్షణమే ఇరువర్గాల మధ్య సంధికి పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశ పెట్టారు.
→ ఎలాంటి అవరోధం లేకుండా గాజాకు మానవతా సాయం అందాలని అందులో పేర్కొ న్నారు.
→ ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.
→ దానిలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడమే భారత్ గైర్హాజరీకి కారణం. వ్యాఖ్యానించారు.
→ మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐరాస అత్య వసర ప్రత్యేక సెషన్లో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
→ "పారుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలను 'సమర్ధించడం' పేరిట తీసుకువచ్చిన ఈ తీర్మానం ఆమోదం పొందింది.
→ 120 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, 14 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి.
→ భారతో పాటు ఆస్ట్రే: లియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే.. ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

భారత్, బంగ్లా సంయుక్తంగా పలు ప్రాజెక్టులకు శ్రీకారం

భారత్, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రులు నరేంద్ర. మోదీ, షేక్ హసీనాలు నవంబర్ 1న సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
→ త్రిపురలోని నిశ్చింతపూర్, గంగాసాగర్ను బంగ్లాదేశ్ కలు పుతూ.. 65 కిలోమీటర్ల ఖుల్నా-మోంగా పోర్ట్ రైల్వే లైన్, బంగ్లాలోని రామా్పూర్లో ఉన్న మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
→ అగర్తలా నుంచి బంగ్లాలోని ఆరా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరుదేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు.
→ రైలులో అగర్తలా నుంచి ఢాకా మీదుగా కోల్కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
→ 'ఈశాన్య భారతం, బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తలా - అబ్రా క్రాస్ బోర్డర్ రైల్వేలింక్ను ప్రారంభించడం చరిత్రాత్మకం. అని ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ అన్నారు

ప్రపంచంలోనే ఫిక్ యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో భారత్

ప్రపంచంలోనే అత్యధిక ఆర్ధిక సాంకేతిక(ఫిన్టెక్) యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో, 2029 ఏడాదికి భారత్ కు మూడో స్థానం దక్కింది.
→ అమెరికా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్ లను ఈ విభాగంలో కలిగి ఉంది.
→ బ్రిటన్ లో 27 ఫిస్టిక్ యూని కార్న్ లు ఉండగా.. భారత్లో 17 సంస్థలు ఉన్నట్లు అంతర్జా తీయ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా పేర్కొంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఎలక పిండాల వృద్ధి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఎలుక పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు.
→ రోదసిలో మానవుల పునరుత్పత్తి సాధ్యప డుతుందా.. అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని వారు పేర్కొన్నారు.
→ 2021 ఆగ స్టులో ఓ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్ కు గడ్డకట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపారు.
→ జపాన్ అంతరిక్ష సంస్థ (జాక్సా) బృందం, యమనాశి అడ్వాన్స్డ్ బయో టెక్నాలజీ సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ తెరుహికో వకయమా ఆ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు భారీగా నమో దయ్యాయి. అక్టోబర్ నెలకు గాను రూ.1.72 లక్షల కోట్లు వసూలయ్యాయి.
→ జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన 1.87 లక్షల కోట్లు అత్యధికం. కాగా తాజా వసూళ్లు రెండో అత్య ధికంగా నిలిచాయి.
→ గతేడాదితో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 13 శాతం మేర పెరిగాయి.

అన్ని ఆహార ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్

ఆహారపదార్థాల ప్యాకింగ్ కవర్లపై క్యూఆర్ కోడ్ ని ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
→ దృష్టిలోపం ఉన్న వ్యక్తులతో పాటు సామాన్యులకు ఇది ఉప యోగకరంగా ఉంటుందని పేర్కొంది.
→ ఆహార పదా ర్థాలు కొనుగోలు చేసే సమయంలో దాని తయా రీలో వినియోగించిన పదార్థాల గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవసరం.
→ అందులోనూ దృష్టి లోపం ఉన్న వారికి ప్యాకింగ్ పై ముద్రించిన సమా చారం అంత స్పష్టంగా కనిపించదు. ఇటువంటి పేర్కొన్నారు.
→ ఇబ్బందులు తలెత్తకుండా పదార్థాల తయారీ దగ్గర నుంచి అందులోని హెచ్చరికల వరకు మొత్తం సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉండేం దుకు క్యూఆర్ కోడ్ని ప్రతి ప్యాకెట్ పై ముద్రించా లని ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫారసు చేసింది.
→ ప్రతి ఆహార పదార్ధంపై క్యూఆర్ కోడ్ను ముద్రించాలి. పోషకాహార వాస్తవాలు, శాకాహారం/మాంసాహార లోగోలు, పదార్థాల జాబితాలు, అలర్జీ కారక సం బంధిత హెచ్చరికలు, తయారు చేసిన తేదీ, ఎక్స్పే యిరీ తేదీ, హెచ్చరికలు, కస్టమర్ కేర్ని ఎలా సంప్ర దించాలో తదితర వివరాలన్నీ అందులో పొందుప రచాలి.

'బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్, ఇం డియన్ స్టూడెంట్ మొబిలిటీ- 2023' నివేదిక

2025 నాటికి 20 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు తెలంగాణ/ ఏపీ, పంజాబ్, మహారాష్ట్ర వారే ఉన్నట్లు ఇటీవల విడుదలైన 'బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్, ఇం డియన్ స్టూడెంట్ మొబిలిటీ- 2023' నివేదిక పేర్కొంది.
→ గతంలో అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదవడానికి విద్యార్థులు ఎక్కువగా వెళ్లేవారని.. ఇప్పుడు కొత్తగా జర్మనీ, కిర్గిజ్ స్థాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లోనూ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. 2019లో దాదాపు 10.9 లక్షల మంది విదేశాల్లో విద్యనభ్యసించారని.. 2022లో ఆ సంఖ్య 13.24 లక్షలకు చేరినట్లు వెల్ల డించింది. ప్రస్తుతమున్న వృద్ధిరేటు 15 శాతం ఇలాగే కొనసాగితే.. 2025 నాటికి అది 20 లక్షలకు. చేరుతుందని అంచనా వేసింది. మొత్తంగా ఏపీ/ తె లంగాణ, పంజాబ్, మహారాష్ట్రల నుంచి 12.5 శాతం చొప్పున.. గుజరాత్, తమిళనాడు, దిల్లీ/దేశ రాజధాని ప్రాంతం నుంచి 8 శాతం చొప్పున.. కర్ణా టక నుంచి 6 శాతం, ఇతర రాష్ట్రాల నుంచి 33 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం. విదేశాలకు వెళ్తున్నట్లు పేర్కొంది.

ఎస్ బీఐ ప్రచారకర్తగా ఎంఎస్ ధోని

దేశంలోని అతిపెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని నియమితులుయ్యారు.
→ ఎస్ బీఐ బ్రాండ్ ప్రచారకర్తగా పలు మార్కెటింగ్, ప్రచార కార్యక్రమాల్లో ధోని కీలక పాత్ర పోషిస్తా రని బ్యాంక్ వెల్లడించింది.
→ ఎస్బీఐ బ్రాండ్ విలు వను తెలియజేసేందుకు ధోనితో భాగస్వామ్యం దోహదపడుతుందని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ భారా పేర్కొన్నారు

ఐరాస ఏఐ సలహా సంఘంలో ముగ్గురు భారతీయులకు చోటు

కృత్రిమ మేధ (ఏఐ)తో వచ్చే ప్రమాదాలను నివారించి, మానవాళి ప్రగతికి అవసరమైన సల హాలు, సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియ మిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు.
→ ఈ సంఘంలో ముగ్గురు ప్రముఖ భారతీయ టెక్ నిపు ణులు సభ్యులుగా ఉన్నారు.
→ టెక్నాలజీకి సంబం ధించి ఐరాస ప్రధాన కార్యదర్శి దూత అయిన అమన్ దీప్ సింగ్ గిల్, ఇండియా స్టాక్, హెల్త్ స్టాక్ డిజిటల్ సంస్థల రూపకర్త శరద్ శర్మ, హగింగ్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకురాలు నాజ్నీన్ రజనీ చోటు దక్కించుకున్నారు.

భారత రాయబారిగా వాణి సర్రాజురావు

ఇటలీలో భారత రాయబారిగా హైదరాబాద్కు చెందిన 1994 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వాణి సర్రాజురావు నియమితులయ్యారు.
→ ప్రస్తుతం విదే శాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆమెను.. ఇటలీలో రాయబారిగా నియమిస్తూ కేం ద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పారాక్రీడల్లో , 111 పతకాలతో సరికొత్త రికార్డు

ప్రతిష్టాత్మక నాలుగో పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు.
→ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 111 పతకాలతో భారత క్రీడా యవనికపై అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
→ చైనా లోని హాంగ్ఝౌలో మన అథ్లెట్లు సంచలన ప్రదర్శ నతో పతకాల సంఖ్య వంద మార్క్ దాటింది.
→ ఈసారి రికార్డు స్థాయిలో 29 బంగారు 31 వెండి, 51 కాం స్య పతకాలు నెగ్గడంతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియాలో ఎన్ఎండీసీ బంగారు గని

ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ అనుబంధ లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్, ఆస్ట్రేలియాలో బంగారు గని మౌంట్ సెల్లా గోల్డ్ కార్యకలా పాలు ఆరంభించింది.
→ ఎన్ఎండీసీ తన గనుల కార్యకలాపాలను పసిడి తవ్వకానికి విస్తరించిం దని ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది.
→ ఎన్ఎం డీసీ ఆధ్వర్యంలోని తొలి బంగారు గని ఇదేనని పేర్కొంది.
→ పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న మౌంట్ సెల్లా గోల్డ్ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు_ ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నరేంద్ర నాధ్ సిన్హా శ్రీకారం చుట్టారు.
→ ఈ గనిలో ముడి బంగారం తవ్వకాలను సంస్థ కొన్ని వారాల్లో ప్రారంభించే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా

అణు వార్ హెడ్ లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజ యవంతంగా పరీక్షించింది.
→ సరికొత్త అణు జలాం తర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది.
→ ఉక్రె యిన్ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం.
→ ఇప్పటికే అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్ ప్రకటించారు.
→ ఈ మేరకు ఒక బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. అమెరికాతో సమాన స్థాయిని సాధించడానికి ఇది అవసరమని రష్యా తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని 'ఇంపరేటర్ అలె గ్జాండర్ -3' అనే జలాంత ర్గామి నుంచి ప్రయోగిం చారు.
→ అస్త్రం.. కంచత్కా ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణశాఖ పేర్కొంది.
→ ఇంపరేటర్ అలెగ్జాండర్ -3.. బొరెయ్ తరగతికి చెందిన జలాంతర్గామి. అది 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగలదు.

కొత్త క్రిమినల్ చట్టాల ముసాయిదా నివేదికకు ఆమోదం!

ప్రస్తుత క్రిమినల్ చట్టాల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను పరిశీలిస్తున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం.. తమ ముసాయిదా నివేదికను ఆమోదించే అవకాశం ఉంది.
→ అయితే కమిటీలోని విపక్ష సభ్యులు ప్రతిపాదిత చట్టా లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
→ సమాజంలోని అట్ట డుగు వర్గాలకు అండగా నిలబడేలా బలమైన చట్టాలు రూపొందాలంటే తగిన అధ్యయనం అవసరం అని పేర్కొంటున్నాయి.
→ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం.. ఈ బిల్లులను బుల్డోజ్ చేయొద్దంటూ స్థాయీ సంఘం ఛైర్మన్ బ్రిజాలాల్ ను విపక్ష సభ్యులు అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
→ భాజపా వర్గాలు మాత్రం నివేదిక ఆమోదం పొందడం ఖాయమని, ఇప్పటికే విస్తృత సంప్రదింపులు జరిగాయని పేర్కొంటున్నాయి.
→ వాస్తవానికి ఈ ముసా యిదా నివేదికను ఆమోదించడానికి గత నెల 27నే కమిటీ సమావేశమైంది.
→ ప్రతిపాదిత చట్టాల అధ్యయనానికి గడువు కావాలని విపక్ష సభ్యుల కోరడంతో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
→ వలస పాలన క్రిమి నల్ చట్టాలను సవరిస్తూ పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఐపీసీ, సీఆర్పీసీ -1973, భారతీయ సాక్ష్య చట్టాల స్థానంలో భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
→ తర్వాత ఆ బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పార్లమెంటు పంపించింది.

వన్డేల్లో శతకాల్లో టాప్-5

కోహ్లి : 49 (277 ఇన్నింగ్స్)
→ సచిన్ : 49 (452 ఇన్నింగ్స్)
→ రోహిత్ : 31 (251 ఇన్నింగ్స్)
→ పాంటింగ్ : 30 (365 ఇన్నింగ్స్)
→ జయసూర్య : 28 (433 ఇన్నింగ్స్)

డా.ఎ.నరేంద్రకుమార్ కు జాతీయ స్థాయి అవార్డు

శిశు శస్త్రచికిత్స వైద్య నిపుణులు డా.ఎ. నరేంద్రకుమార్ భారతీయ పీడియా ట్రిక్ సర్జన్ల సంఘం జాతీయస్థాయి అవార్డును అందు కున్నారు.
→ పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో విశేష సేవ లకుగాను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియా ట్రిక్ సర్జన్స్ ఈ అవార్డును మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందిం చింది.
→ ప్రస్తుతం ఆయన వనపర్తి జిల్లాలోని గవర్న మెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
→ గుంటూరు వైద్య కళాశాలలో 1989లో ఎంఎస్ (జనరల్ సర్జన్) పూర్తి చేసిన డా. నరేంద్రకుమార్.. 1993లో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కెరీర్ ప్రారంభించారు.
→ 2003లో ప్రొఫెసర్గా, 2009లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నియమితులయ్యారు.
→ అనంతరం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్గా బదిలీ అయ్యారు.
→ 2013 నుంచి రెండేళ్లు ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో పనిచేశారు.
→ 2021 డిసెం బరులో మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్గా నియమితులయ్యారు.

సూర్య కాంతం సినీ జీవిత విశేషాలతో రూపొందించిన 'తెలుగింటి అత్తగారు' పుస్తక ఆవిష్కరణ

తెలుగు సినీరంగంలో ప్రత్యామ్నాయం లేని వారిలో అలనాటి మేటి నటీమణి సూర్యకాంతం మొదటి వరుసలో ఉంటారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
→ చెన్నైలో సూర్యకాంతం శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
→ ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
→ సూర్య కాంతం సినీ జీవిత విశేషాలతో రూపొందించిన 'తెలుగింటి అత్తగారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ హీరాలాల్ సామరియా

కేంద్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్గా 1985 బ్యాచ్ కు చెందిన తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సామరియా బాధ్యతలు చేపట్టారు.
→ ప్రస్తుతం సమాచార కమిషనర్ హోదాలో ఉన్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
→ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
→ ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా పాల్గొన్నారు. సమాచార కమిషన్లలో ఖాళీలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. సాధ్యమై నంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం నిర్దేశించింది.
→ ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నియామకం చేసింది. 1960 సెప్టెంబరు 14న జన్మించిన హీరాలాల్ సామ రియా స్వస్థలం రాజస్థాన్. బీఈ (సివిల్) చేశారు.
→ గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తర్వాత తెలంగాణల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నాళ్లు కేంద్ర క్యాడర్ లో పనిచేసి పదవీ విరమణ చేశారు. 2020 నవంబరు 7న కేంద్ర సమాచార కమిషనర్ గా నియమితులై.. ఇప్పుడు పదోన్నతి పొందారు.
→ ఈ బాధ్యతలు చేపడుతున్న తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ గుర్తింపు పొందారు.
→ ఆయన 2025 సెప్టెంబరు 13 వరకూ ఈ పదవిలో ఉంటారు.

ఇద్దరు కేంద్ర సమాచార కమిషనర్ల నియామకం

కేంద్ర సమాచార కమిషనర్లుగా సోమవారం ఇద్దరి నియామకం, బాధ్య తల స్వీకారం వెంటవెంటనే జరిగిపోయాయి.
→ వీరిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీఎండీగా పనిచేసిన ఆనంది రామలింగం, హిమాచల్ ప్రదేశ్ అట విశాఖ హెడ్ ఆఫ్ ఫోర్స్-కం-ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్గా పనిచేసిన ఇండి యన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వినోదక్కుమార్ తివారీ ఉన్నారు.

భారత్ లో పరిస్థితిపై యూఎన్డీపీ నివేదిక

అధికాదాయం ఉన్నప్పటికీ సంపదలో అసమా నతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఉంది.
→ అయితే 2015-16 నుంచి 2019-21 మధ్య దేశంలో తీవ్ర పేదరి కంలో మగ్గుతున్న వారు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గారు.
→ ఈ మేరకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) తాజాగా ఒక నివేదికను వెలువరిం చింది. ఇందులో దీర్ఘకాల వృద్ధిని ప్రస్తావించింది.
→ అస మానతలు, అభివృద్ధి అంశంలో తలెత్తబోయే ఇబ్బంది కర పరిణామాలనూ ఏకరువు పెట్టింది.
→ మానవాభివృద్ధికి ఊతమివ్వడానికి కొత్తగా మార్గదర్శకాలు అవసరమని పేర్కొంది.
→ నివేదికలోని ముఖ్యాంశాలివీ:-
→ 2000 నుంచి 2022 మధ్యలో భారత్లో తలసరి ఆదాయం 442 డాలర్ల నుంచి 2,389 డాలర్లకు పెరి గింది.
→ 2004 నుంచి 2019 మధ్య పేదరిక రేటు 40 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది.
→ పేదల ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల అభద్రత పెరిగిపోయింది. భవిష్యత్లో గందరగోళ పరిస్థితి నెలకొ నవచ్చు. తక్షణం మార్పు దిశగా ప్రయత్నాలు అవసరం.
→ జనాభాలో పేదలు 15 శాతానికి తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సమస్య తీవ్రంగా ఉంది. దేశ జనాభాలో ఆ రాష్ట్రాల వాటా 45 శాతం.
→ అయితే దేశంలోని పేదల్లో మాత్రం 62 శాతం మంది అక్కడే ఉంటున్నారు.
→ ఇంకా అనేక మందికి పేదరికం ముప్పు పొంచి ఉంది. వారు దారిద్ర్యరేఖకు కొంతమేర ఎగువన ఉంటు న్నారు. వారు మళ్లీ పేదరిక కోరల్లో చిక్కుకోవచ్చు.
→ వారిలో మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, అంతర్రాష్ట్ర వలస కూలీలు ఉన్నారు.

భారత సరికొత్త గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఆవిష్కరణ

యుద్ధ నౌక 'సూరత్'కు సంబంధించిన అధికారిక చిహ్నం ఉన్న ఫలకాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆవిష్కరించారు.
→ సూరత్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, సీనియర్ అధికారులు హాజర య్యారు.
→ గుజరాత్లో ఒక నగరం పేరు పెట్టడం, ఆ యుద్ధనౌక ఫలకాన్ని అదే నగరంలో ఆవిష్కరించడం ఇదే మొదటిసారి.
→ ఈ నౌక ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ముంబయిలోని మజ్గావ్ డాక్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది.
→ వచ్చే ఏడాది ఇది నౌకాదళంలో చేరే అవ కాశం ఉంది. దీని చిహ్నంలో స్థానిక లైట్ హౌస్, అసియా సింహం, కెరటాలు ఉన్నాయి.
→ ఈ యుద్ధనౌ కలో అధునాతన పోరాట సామర్థ్యానికి అవసరమైన అన్నిరకాల సాధనసంపత్తిని ఏర్పాటు చేస్తున్నారు.
→ విశాఖపట్నం' తరగతి కింద నిర్మిస్తున్న నాలుగు డిస్ట్రా యర్ యుద్ధనౌకల్లో ఇది నాలుగోది.

సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి పదవులకు సుప్రీంకోర్టు కొలీ జియం కొత్తగా ముగ్గురి పేర్లను సిఫార్సు చేసింది.
→ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఖన్నా, జస్టిస్ బి. ఆర్. గవాయ్, జస్టిస్ సంజీవ్ జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన కొలీజియం సమావేశమై ఈ పేర్లకు పచ్చ జెండా ఊపింది.
→ ఇదివరకు తెలంగాణ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) గా పని చేసి ప్రస్తుతం దిల్లీ హైకోర్టు సీజేగా కొనసా గుతున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్, గువాహటి హైకోర్టు సీజే జస్టిస్ సందీప్ మెహతా ఈ జాబితాలో ఉన్నారు.
→ జస్టిస్ సతీ షచంద్ర శర్మ 2008 జనవరి 18న మధ్యప్ర దేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుల య్యారు.
→ 2021 అక్టోబరు 11న తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. 2022 జూన్ 28న దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
→ న్యాయమూర్తిగా 13 ఏళ్లు. ప్రధాన న్యాయమూర్తిగా 2 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది.
→ జస్టిస్ ఎ.జి. మసీహ్ 2008 జులై 10న పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూ ర్తిగా నియమితులయ్యారు.
→ 2023 మే 30న రాజస్థాన్ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు.
→ ప్రస్తుతం పంజాబ్, హరియాణా హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మైనార్టీ వర్గానికి చెందిన ఈయన పేరును కొలీజియం పరిగణనలోకి తీసుకుంది.
→ జస్టిస్ సందీప్ మెహతా 2011 మే 30న రాజ స్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుల య్యారు.
→ 2023 ఫిబ్రవరి 15న సీజేగా పదోన్న తిపై గువాహటి హై కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రాజస్థాన్ హైకోర్టుకు ప్రాతినిధ్యం లేదన్న కారణంతో కొలీజియం ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంది.
→ ప్రధాన న్యాయమూ ర్తితో సహా 34 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉండాలి. ప్రస్తుతం 31 మంది ఉన్నారు.
→ ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర హైకోర్టు పరంగా ఒకటో స్థానంలో ఉన్నారు. వేస్తే మొత్తం సంఖ్య 34కి చేరుతుంది.

క్యాన్సర్ చికిత్సకు సరికొత్త ఎక్స్ రే డిటెక్టర్

క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేసే ఒక కొత్త ఎక్స్ రే డిటెక్టర్ ను బ్రిటన్లోని సర్రే విశ్వవిద్యా లయ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
→ చౌకైన, సులు వుగా నిర్వహించడానికి వీలైన ఈ పరిజ్ఞానం విమానా శ్రయాల్లో మెరుగైన స్కానర్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుం దని వారు తెలిపారు.
→ ప్రస్తుతమున్న ఎక్స్ డిటెక్టర్లు బరువైన, దృఢ పదార్థాలతో తయారవుతున్నాయి. పైగా అవి విద్యుత్ను ఎక్కువగా వినియోగిస్తాయి.
→ వాటి ఖరీదు కూడా ఎక్కువే. హైడ్రోజన్, కార్బన్ తో తయా రయ్యే ఆర్గానిక్ సెమీకండక్టర్లతో ఈ ఇబ్బందులు దూర మవుతాయి.
→ వాటి నిర్వహణ చాలా సులువుగా ఉంటుంది. అయితే విస్పష్ట చిత్రాలను అందించే విష యంలో అవి సంప్రదాయ డిటెక్టర్లకు సాటిరావడంలేదు.
→ ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు ఆర్గానిక్ సెమీ కండక్టర్లకు కొన్ని పదార్థాలను జోడించారు.
→ ఫలితంగా చౌకలో ఎక్స్రే డిటెక్టర్ సిద్ధమైంది. ఎక్స్ రేలు తాకినప్పుడు ఈ డిటెక్టర్.. మానవ కణజాలంలా వ్యవ హరిస్తుంది.
→ అందువల్ల రేడియోధార్మిక ప్రభావాన్ని అప్పటికప్పుడే కొలిచేందుకు వీలవుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రబోధి నానాయక్కర తెలిపారు.
→ ప్రస్తుత పరిజ్ఞానంలో ఈ వెసులుబాటు లేదన్నారు. స్కాన్ చేయాల్సిన వస్తువుకు తగ్గట్టు తాజా డిటెక్టర్ను తీర్చిదిద్దవచ్చు.
→ దీనివల్ల క్యాన్సర్ రోగులపై నిర్వహించే స్క్రీనింగ్లో కచ్చితత్వం పెరుగుతుంది.
→ అంతిమంగా దీనివల్ల రేడియోథెరపీ, మమోగ్రఫీ వంటి పరీక్షలు సురక్షితంగా నిర్వహించడానికి కొత్త విధానాలు అందు బాటులోకి వస్తాయని పరిశోధకులు అంటున్నారు.
→ కాగా ఈ పరిజ్ఞానాన్ని విమానాశ్రయాల్లో భద్రతా స్కానర్ల లోనూ ఉపయోగించవచ్చు. చరిత్రాత్మక కళాఖండాల స్కానింగూ వాడొచ్చు.

లీప్ ప్రోగ్రాము ప్రారంభించిన ఎస్ టీపీఐ

ప్రభుత్వ రంగ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎన్డీపీఐ) అంకురాలకు నిధుల సాయం చేసేందుకు లీప్ (లాంచ్ ప్యాడ్ ఫర్ టెక్ ఎంటర్ ప్రెన్యూర్స్ టూవార్డ్స్ యాక్సెలరే టెడ గ్రోత్ అండ్ పయనీరింగ్ అహైడ్) ప్రోగ్రా మ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దర ఖాస్తులను ఆహ్వానించింది. వెంచర్ క్యాపిటలి స్టులు, ఇతర ప్రైవేటు పెట్టుబడిదార్ల సహకారంతో ఎంటర్ ప్రెన్యూర్లకు నిధులు సమకూరుస్తామని ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ వెల్లడించారు.
→ లీప్ ప్రోగ్రామ్ కింద ఎస్ఓటీపీఐ ఈ ఏడాది 75 అంకురాలను ఎంపిక చేయనుంది.
→ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఏంజెల్ ఇన్వెస్టర్ల సహకారంతో ఒక్కో అంకురానికి రూ.కోటి వరకు నిధులు సమకూరుస్తుంది.
→ 'ఇప్పటికే మేము ఎన్టీఐఎస్ (నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీం) ద్వారా రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాం.
→ మా దగ్గర ఉన్న మొత్తం నిధి నుంచి సుమారు 100 అంకురాల్లో పెట్టుబడి పెట్టాం.
→ లీప్ ద్వారా 100 అంకురాలకు నిధుల సాయం చేయనున్నామ'ని అరవింద్ తెలిపారు.
→ భువనేశ్వర్, చండీగఢ్, విజ యవాడ వంటి నగరాల్లోని ఎంటర్ ప్రెన్యూర్లు తమ వ్యాపార వృద్ధికి తమ నగరాన్ని విడిచిపెట్ట కుండానే, భిన్న ఆలోచనతో ముందుకొస్తే నిధులు సాయం చేస్తామని ఎస్ పీఐ తెలిపింది.
→ పరి శ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కింద నమోదైన అంకురాలు, బాహ్య పెట్టుబడిదార్ల నుంచి కనీసం రూ.25 లక్షల నిధులు సమీకరించి ఉంటే, లీప్ ప్రోగ్రామ్కు దర ఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు.
→ ఎంపిక చేసిన అంకురాల్లో వెంచర్ క్యాపిటలిస్టులు రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అరవింద్ కుమార్ వివరిం చారు.
→ ఎన్టీఐఎస్ నుంచి లీప్ ప్రోగ్రామ్ కోసం ఎన్డీపీఐ రూ.15 కోట్లు కేటాయించింది.
→ 300 అంకురాల వరకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎస్ టీపీఐకి రూ.95 కోట్లు కేటాయించింది.
→ వీటిలో ఇప్పటికే 100 అంకురాల్లో రూ.25 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టింది.

2023-2027 మధ్య భారత్ వృద్ధి జూమ్

భారత్ మధ్య కాలిక స్థూల దేశీయోత్పత్తి
→ (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ దిగ్గజం- ఫిచ్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది.
→ దీనితో ఈ రేటు 5.5 శాతం నుంచి 6.2 శాతానికి చేరింది. 2023 నుండి 2027 వరకు మధ్యకాలంగా ఫిచ్ నిర్వచించింది.
→ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం, పని చేసే వయస్సులో ఉన్న జనాభా అంచనాలో స్వల్ప పెరుగుదల తమ తాజా అప్గ్రేడు కారణమని పేర్కొంది.

→ ఫిచ్ తాజా అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే :-
→ కరోనా కాలంలో భారత్లో భారీగా పడిపోయిన ఉపాధి అవకాశాలు దేశంలో వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపింది.
→ మహమ్మారి నాటి కాలంలో పోల్చితే కార్మిక సరఫరా వృద్ధి రేటు పెరిగినప్పటికీ, 2019 స్థాయి నాటికన్నా తక్కువ గానే ఉంది.
→ 2000 సంవత్సరం ప్రారంభంలో నమోదయిన స్థాయిలకంటే కూడా తక్కువే. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి అవకాశాల రేటు రేటు చాలా తక్కువగా ఉంది.
→ భారత్ లో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనే ఇయా, పోలాండ్, టర్కీ వృద్ధి రేట్ల అంచనా పెరి గింది.
→ అయితే భారత్ కన్నా తక్కువగా 0.2 శాతం మాత్రమే బ్రెజిల్ టర్కీ, ఇండోనేషియా వృద్ధి రేటు అంచనాలకు ఎగశాయి.
→ 10 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్యకాలిక వృ ద్ధిని 4 శాతంగా అంచనా వేసింది.
→ ఇది మును పటి అంచనా కంటే 30 బేసిస్ పాయింట్లు (ఇం తక్రితం అంచనా 4.3 శాతం) తక్కువ.
→ చైనా వృ ద్ధి అంచనాలో 0.7 శాతం పాయింట్ల కోత వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది.
→ దీనితో చైనా ఎకానమీ సగటు వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది.
→ ఇటీవలి సంవత్స రాలలో చైనా వృద్ధి బాగా మందగించింది.
→ రియ ల్టీ రంగంలో క్షీణత మొత్తం పెట్టుబడుల ఆవుట్లుకు దెబ్బతీసింది.
→ రష్యా వృద్ధి రేటును ఈ కాలంలో చైనా 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
→ దీనితో ఆ దేశం వృద్ధి రేటు మధ్య కాలికంగా 80 బేసిస్ పాయింట్లు గానే (ఒక శాతం కన్నా తక్కువ) ఉంటుంది.
→ 2023-24లో 6.3 శాతం కాగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతమన్న తన అంచనాలను రేటింగ్ దిగ్గజం- ఫిచ్ పునరుద్ఘాటించింది.
→ 2024-25లో వృద్ధి రేటు 6.5 శాతమని అంచనావేస్తున్నట్లు తెలిపింది.
→ ఎల్నీనో ప్రభావంతో ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది .

నాలుగేండ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ 'సరి బేసి’

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
→ పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు మళ్లీ సరి బేసి విధానాన్ని అమలుచేయాలని డిసైడ్ అయింది.
→ దాదాపు నాలుగేండ్ల తర్వాత వెహికల్స్ రాకపోకలపై ఆంక్షలు విధించనుంది.
→ "దీపావళి తర్వాత ఢిల్లీలో ఈ నెల 13 నుంచి 20వ తేదీ మ్యాచ్లు వరకు సరి బేసి విధానం అమల్లోకి వస్తుంది. దీన్ని కాలిస్తే పొడిగించాలా? వద్దా? అనేది 20వ తేదీ తర్వాత ఉందని నిర్ణయిస్తాం" అని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ క్లాసులను రాయ్ ప్రకటించారు.
→ రవాణా శాఖతో చర్చించిన పరీక్షలకు తర్వాత.. మినహాయింపులు సహా ఇతర పూర్తి వివ రాలను వెల్లడిస్తామని చెప్పారు
→ వాయు కాలుష్య ప్రభుత్వం నియంత్రణ కోసం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ చివరి దశ కింద నిర్దేశించిన కఠిన ఆంక్షలను ఎక్కువగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
→ ఏడో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది ఇంటి నుంచే పనికి సంబంధించిన నిర్ణయాన్ని దీపావళి వీధులను తర్వాత తీసుకుంటామని చెప్పారు.
→ ఢిల్లీలో తొలిసారిగా 2016లో సరి బేసి విధానాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ఈ రూల్ అమలు చేయడం ఇది నాలుగో సారి.
→ ఇందులో భాగంగా.. సరి, బేసి .. నంబర్ ప్లేట్ల ఆధారంగా కార్లు, ఇతర వాహనాలు రోడ్లపైకి వచ్చేలా ఆంక్షలు విధి స్తారు.
→ అంటే వెహికల్ నంబర్ల ఆధారంగా కేటాయించిన రోజుల్లోనే బండ్లు తిరిగేం దుకు పర్మిషన్ ఉంటుంది.
→ నంబర్ ప్లేట్ లో చివర్లో సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజున, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాలి.
→ ఈ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ పూలింగ్ ద్వారా ప్రయాణాలు చేయవచ్చు. తద్వారా వాహనాల రద్దీ తగ్గి, గాలి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.

ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి టైమ్ ఔట్

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.
→ ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి టైమ్ ఔట్ గా లంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ పెవిలియన్ చేరాడు.
→ షకీబ్ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తప్పించుకున్నాడు.
→ కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్ రెండు నిమిషాల్లో బాల్ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి.
→ అప్పటికి రెండు నిమిషాలు దాటి పోవడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్లు ఔటి చ్చారు.
→ అసహనానికి గురైన మాథ్యూస్ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిన విషయం చెబుతూ అంపైర్లు, షకీబ్ తో వాదనకు దిగాడు.
→ బంగ్లా తన అప్పీల్ను వెనక్కి తీసుకుంటే నాటౌట్ ఇస్తామని అంపైర్లు చెప్పారు.
→ బంగ్లా విశ్రా చేసుకోకపోవడంతో ఐసీసీ రూల్ 40.1.1 ప్రకారం అంపైర్లు మాథ్యూ సన్ను టైమ్ ఔట్ గా ప్రకటించారు.

పంజాబ్ తొలిసారి ముస్తాక్ అలీ ట్రోఫీ సొంతం

తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. పరుగుల వరద పారిన ఫైనల్లో పంజాబ్ 20 పరుగుల తేడాతో బరోడాపై గెలిచింది.
→ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్మోల్ ప్రీత్ సింగ్ (113; 61 బంతుల్లో 10x4, 6x6) మెరుపు శతకం సాధించడంతో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసింది.
→ నేహాల్ వథెరా (61 నాటౌట్; 27 బంతుల్లో 6x4, 4x6) కూడా చెలరేగాడు.
→ ఛేదనలో గట్టిగా పోరాడిన బరోడా చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరు గులకే పరిమితమైంది.
→ అభిమన్యు సింగ్ (61; 42 బంతుల్లో 3x4, 46), నినాద్ (47; 22 బంతుల్లో 5x4, 3x6), కెప్టెన్ కృనాల్ పాండ్య (45; 32 బంతుల్లో 3x4, 1x6) రాణించారు.
→ 19వ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన అర్షదీప్ సింగ్ (4/23) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
→ గతంలో నాలుగుసార్లు ఈ టోర్నీలో ఫైనల్ చేరిన పంజాబ్.. ఎట్టకేలకు టైటిల్ దక్కించుకుంది.

ఆర్బీఐకి ప్రతిష్టాత్మక 'ఛేంజ్మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిష్టాత్మక ' ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' టైటి ల్ ను గెలుచుకుంది.
→ ది హిందూ బిజినెస్లైన్ ఛాం జేమేకర్ అవార్డ్ 2023కు సంబంధించి గవర్నర్ శక్తికాంత్స్ నేతృత్వంలోని ఆర్బీఐ ఈ గుర్తిం పును పొందినట్లు ఒక ప్రకటన వెలువడింది.
→ ఆరు కేటగిరీను ఛేంజ్ మేకర్ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది.
→ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయ ర్ తో పాటు ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్, ఛేంజ్ మేకర్ - సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేకర్ - డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేకర్ - ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, యంగ్ ఛేంజ్మే కర్స్ అవార్డులు వీటిలో ఉన్నాయి.
→ డెయిరీ సంస్థ అమూలు ఐకానిక్ ఛేంజ్ మేకర్ గుర్తింపు లభిం చింది.
→ హెర్కీ వ్యవస్థాపకుడు నేహా బగారియా, ఎడ్యుకేట్ గరల్స్ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేనక్కు 'ఛేంజ్ మేకర్ - సోషల్ ట్రాన్స్ఫర్మేష న్' అవార్డు లభించింది.
→ స్టెలాప్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఛేంజ్మేకర్- డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ గుర్తింపు లభించింది.
→ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 'ఛేంజ్ మేకర్ - ఫైనా న్షియల్ ట్రాన్స్ఫర్మేషన్' అవార్డు పొందింది.
→ టెక్ ఎడ్యుకేషన్, మెటల్ హెల్త్ ఎవేర్నెస్లో విశేష కృ షి సల్పిన శ్రీనిధి ఆర్ఎస్ కు 'యంగ్ ఛేంజ్మేకర్' గుర్తింపు లభించింది.

కృత్రిమ వర్షాలతో దిల్లీలో వాయు కాలుష్యానికి చెక్!

దేశ రాజధాని దిల్లీ, పరిసర ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యానికి కృత్రిమ వర్షాలతో కళ్లెం వేసేందుకు ఐఐటీ-కాన్పుర్ సిద్ధ మైంది.
→ ఇందుకు అవసరమైన సాంకేతికతను అభి వృద్ధి చేసింది. ఈ ఏడాది జులైలోనే కృత్రిమ వర్షా లకు సంబంధించిన ప్రయోగాలను పరిశోధకులు
→ పూర్తి చేశారు. కృత్రిమ వర్షాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఐఐటీ కాన్పూర్ బృందం ఐదేళ్లు కష్టపడింది.
→ విమానం ద్వారా రసాయనాలను మేఘాలలో చల్లి.. సంబంధిత ప్రాంతంలో వర్షాలు కురిపించేందుకు ప్రయత్ని స్తారు.
→ అమెరికా, చైనా, యూఏఈ వంటి దేశాలు నీటి కొరత ఎదురై నప్పుడు ఇలానే చేస్తున్నాయి. దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాలు కురిపించాలని ఇప్పుడు ప్రభుత్వం, నిపుణులు భావిస్తు న్నారు.

ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఒప్పందం నుంచి రష్యా బయటకు

ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఓ కీలక ఒప్పందం నుంచి రష్యా అధికారికంగా బయటకొచ్చింది.
→ దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది.
→ ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఎనిమిదేళ్ల క్రితమే రష్యా ప్రకటించడం గమనార్హం.
→ ఐరోపాలో సంప్రదాయ సాయుధ దళాల ఒడంబడిక నుంచి వైదొల గేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించిన బిల్లుకు రష్యా పార్లమెంటు ఉభయసభలు ఇప్పటికే ఆమోదం తెలిపాయి.
→ దానిపై పుతిన్ ఈ ఏడాది మేలో సంతకం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా ఆధ్వర్యంలోని 'నాటో', అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలోని 'వార్సా ఒప్పందం'లోని దేశాల మధ్య 'ఐరో పాలో సంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం' కుదిరింది.
→ 1990 నవంబరులో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 22 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి.
→ ఇందులో నాటోకు చెందిన 16 దేశాలు, అప్పటి వార్సా కూటమికి చెందిన ఆరు దేశాలు ఉన్నాయి.
→ ప్రత్యర్థి దేశాలు తమ పరస్పర సరిహద్దుల వద్ద, సమీపంలో ఆయుధ సంపత్తి మోహ రింపును నియంత్రించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుది రింది.
→ రెండేళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. అయితే.. కొన్నేళ్లుగా ఇది నిలిచిపోయింది.
→ ఈ ఒప్పం దంలో భాగస్వామ్యాన్ని 2007లో రష్యా ఉపసంహరించు కుంది. అలాగే దానిని నుంచి బయటకు వచ్చేస్తా మంటూ 2015లో ప్రకటించింది.
→ తాజా పరిణామం నేప ధ్యంలో ఈ కీలక ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు మంగళ వారం నాటో కూటమి ప్రకటించింది.
→ ఈ క్రమంలో ఆ ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఇకపై దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది.
→ ఈ నేప థ్యంలో ఐరోపాలో ఆయుధ నియంత్రణ ఒప్పందాల భవి ష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సౌరజ్వాలను క్లిక్ మనిపించిన ఆదిత్య-ఎల్1

సూర్యుడిపై లోతైన పరిశోధ నల కోసం భారత్ ప్రయో గించిన ఆదిత్య- ఎల్1 వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని క్లిక్ మనిపించింది.
→ వ్యోమనౌకలోని 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్ స్పెక్ట్రోమీటర్ (హెచ్ఐస్ఈఎల్1ఓఎస్) ఘనత ఈ సాధించింది.
→ ఈ మేరకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక ప్రకటన చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని జ్వాలగా పేర్కొంటారు.
→ హెచ్ఎల్ ఓఎస్ను గత నెల 27న ఇస్రో ఆన్ చేసింది. ప్రస్తుతం ఈ పరి కరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నారు.
→ ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చర్య లను శరవేగంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్లో చిత్రాలను అందిస్తుంది.
→ తాజాగా అది సౌర జ్వాల లకు సంబంధించిన ఇంపల్సివ్ దశను నమోదు చేసింది.
→ దీని ద్వారా.. సూర్యుడిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్ త్వరణం గురించి మరిన్ని వివరా లను అందుబాటులోకి తీసుకురావొచ్చు.
→ ఈ పరిక రాన్ని బెంగళూరులో ఇస్రోకు చెందిన స్పేస్ ఆస్ట్రో నమీ గ్రూప్ అభివృద్ధి చేసింది.

ప్రళయ్' పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి 'ప్రళయ్' ను భారత్ విజయవంతంగా పరీక్షిం చింది.
→ ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9.50 గంటలకు ఈ ప్రయోగం జరి గింది.
→ ఈ క్షిపణి గమనాన్ని తీరం వెంబడి ఉన్న ట్రాకింగ్ పరికరాలు నిశితంగా గమనించాయి.
→ ప్రయో గానికి సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరాయని అధికారులు తెలిపారు.
→ ప్రళయ్.. 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
→ 500- 1,000 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఘన ఇంధనంతో పనిచేస్తుంది.
→ చైనా, పాకిస్థాన్ వెంబడి సరి హద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందిం చింది.
→ ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగి స్తున్న 'ఇస్కాండర్' క్షిపణి తరహాలో ఇది ఉంటుంది.

బేరియం ఉన్న బాణసంచాపై నిషేధం

బేరియం కలిసి ఉన్న సంప్రదాయ రకాల బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ 2018లో ఇచ్చిన ఉత్తర్వు.. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
→ దీపావళి బాణసంచా విషయంలో ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని రాజస్థాన్ సర్కారును ఆదేశించింది.
→ "బాణసంచా దుష్ప్రభావాల గురించి సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కీలకం.
→ ప్రస్తుత రోజుల్లో పిల్లల కంటే పెద్ద వారే బాణసంచా కాలుస్తుండడం విచారకరం.
→ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ అనేవి న్యాయస్థానాలు చూసుకోవాల్సిన విధి అనేది తప్పుడు భావన.
→ వాయు, ధ్వని కాలుష్యాలకు అడ్డుకట్ట వేయడం ప్రతిఒక్కరి కర్తవ్యం" అని జస్టిస్ ఎ. ఎస్.బోపన్న, జస్టిస్ ఎం. ఎం. సుందరేశ్ ధర్మాసనం పేర్కొంది.
→ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది.

అవినీతి ఆరోపణలతో పోర్చుగల్ ప్రధాని రాజీనామా

అవినీతి ఆరోపణల కారణంగా పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా మంగళవారం రాజీనామా చేశారు.
→ తనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆశ్చ ర్యానికి గురయ్యానని, అయినప్పటికీ విచారణకు సహ కరిస్తానని ఆయన చెప్పారు.
→ దేశాధ్య క్షుడు మార్సెలో రెబెలో డిసౌసాను కలిసిన అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని 62 ఏళ్ల ఆంటోనియో కోస్టా వెలువరించారు.
→ పోర్చుగల్ లో లిథియం మైనింగ్, హైడ్రోజన్ ప్రాజెక్టుల నిర్వహణలో అక్రమాలకు సంబం ధించిన విచారణలు జరుగుతున్న నేపథ్యంలో కోస్టా ప్రభుత్వం గద్దె దిగాలంటూ అంతకుముందు ప్రతి పక్షాలు డిమాండు చేశాయి.
→ విచారణలో భాగంగా ప్రధాని, మంత్రుల నివాసాల్లో సుమారు 140 మంది డిటెక్టివ్లు తనిఖీలు నిర్వ హించారు.
→ కోస్టా భారత మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి ఓర్లాండో డ కోస్టా గోవాకు చెందినవారు.
→ అవినీ తిపై దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ఆస్తులపై పలుమార్లు దాడులు జరిపిన పోలీసులు.. ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ను అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.
→ సోషలిస్టు పార్టీ సారథ్యంలో పోర్చుగల్ ప్రధానిగా ఆంటోనియో కోస్టా 2015 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.

బిహార్లో రిజర్వేషన్లు 65%

బిహార్ లోని నీతీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
→ విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజ ర్వేషన్లను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 65 శాతానికి పెంచనున్నట్లు ప్రక టించింది.
→ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరుగనున్నాయి.
→ ఇటీవల రాష్ట్రంలో నిర్వ హించిన కులగణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వెల్లడిండం గమనార్హం.
→ తాజా కులగణన లెక్కలు కొత్త రిజర్వేషన్లకు ప్రాతిపదిక కానున్నాయి.
→ ఈ నెల 9న ప్రతిపాదిత రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
→ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

దేశీయ ఉక్కు సామర్థ్యం 161 మిలియన్ టన్నులు

మన దేశంలో ఉక్కు తయారీ సామర్థ్యం 161 మిలియన్ టన్నులను అధిగమించిందని, ఈ పరిశ్రమ వృద్ధి నిర్విరామంగా కొనసాగుతుందని ఉక్కు కార్యదర్శి నాగ్రేంద నాథ్ సిన్హా వెల్లడిం చారు. జాతీయ ఉక్కు విధానం ప్రకారం, 2030 నాటికి మన దేశం 300 మి. టన్నుల ఉక్కు సామ ర్థ్యానికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 'బ్లాస్ట్ ఫర్నేస్-బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్ (బీఎఫ్ -బీఓ ఎఫ్) ద్వారా 67 మి. టన్నులు, విద్యుత్ ఆర్క్ ఫర్నేస్ (ఈఏఎఫ్) ద్వారా 36 మి. టన్నులు, ఇండ క్షన్ ఫర్నేస్ (ఐఎఫ్) ద్వారా 58 మి. టన్నుల చొప్పున మొత్తం 161 మి. టన్నుల సామర్థ్యాన్ని మన దేశం ఇప్పటికే చేరుకుంద'ని 4వ భారతీయ ఉక్కు సమాఖ్య (ఐఎస్ఏ) స్టీల్ కాంక్లేవ్ సిన్హా వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఈ పరిశ్రమ వృద్ధి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
→ ప్రపంచంలో నాలుగో అతి పెద్ద వాహన విపణి మన దేశంలోనే ఉందని, వచ్చే 10 ఏళ్లలో 8-10 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో ముందుకెళుతుందని తెలిపారు. తయారీ రంగం కూడా 7-8 శాతం సీఏజీఆర్ సాధిస్తుందన్నారు. ఈ రెండు రంగాల నుంచి వచ్చే గిరాకీ, ఉక్కు పరిశ్రమకు కలిసొస్తుందని వివరించారు.
→ ఉక్కు రంగానికి ప్రకటించిన రూ.29,500 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎలస్ఐ) పథకంతో ఈ రంగంలో పురోగతి బాగా కనిపిస్తోందని, ఇప్ప టికే సుమారు రూ.10,000 కోట్ల నూతన పెట్టుబ డులు లభించినట్లు సిన్హా వెల్లడించారు. కర్బన ఉద్గారాలు, అంతర్జాతీయ విపణిలో గిరాకీ వంటి విషయాల్లో ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోం దని సిన్హా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ లక్ష్యాల కోసం, దీర్ఘకాల స్థిరత్వం సాధించడం కోసం తక్కువ ఉద్గారాల సాంకేతిక తను వినియోగించడం, హరిత విధానాలను అను సరించడం ఎంతైనా అవసరమని వివరించారు.
→ యూరోపియన్ యూనియన్ (ఈయూ) 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురా బోయే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజమ్ (సీబీఏఎం) లేదా ఉద్గార పన్ను (కార్బన్ ట్యాక్స్) ఉక్కు పరిశ్రమకు గట్టి సవాలు విసురుతోందని పేర్కొన్నారు. పరిశ్రమ దిగ్గజాలు కర్బన ఉద్గా రాలు తగ్గించుకునేలా, అంతర్జాతీయ విపణులకు తగ్గట్లుగా వ్యూహాలను మార్చుకుంటాయన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

కేంద్ర సమాచార కమి షన్ ముఖ్య కమిషనర్ హీరాలాల్ సామరియా

కేంద్ర సమాచార కమి షన్ ముఖ్య కమిషనర్ హీరాలాల్ సామరియా 2023, నవంబరు 6న బాధ్యతలు స్వీకరించారు.
→ ప్రస్తుతం సమాచార కమిషనర్ హోదాలో ఉన్న ఆయనకు కేంద్రం పదోన్నతి కల్పించింది. 2025, సెప్టెంబరు 13 వరకూ హీరాలాల్ ఈ పదవిలో ఉంటారు.
→ ఈయన 1985 బ్యాచ్ కు చెందిన తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి. హీరాలాల్ స్వస్థలం రాజస్థాన్.
→ 2020 నవంబరు 7న కేంద్ర సమాచార కమిషనర్ నియమితులయ్యారు.
→ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీఎండీగా పనిచేసిన ఆనంది రామలింగం, హిమాచల్ ప్రదేశ్ అటవీశాఖ హెడ్ ఆఫ్ ఫోర్స్-కం-ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ పనిచేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వినోద్కుమార్ తివారీ కేంద్ర సమాచార కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు.

కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా శ్రీకాంత్ నాగులాపల్లి

కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా 1998 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ నాగులాపల్లి నియమితులయ్యారు.
→ ప్రస్తుతం ఈయన కేబినెట్ సెక్రెటేరియట్లో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు.
→ శ్రీకాంత్ గతంలో ఏపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ కమిషనర్ గా, ఇంధనశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఫిచ్ రేటింగ్స్ 6.2

భారతదేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాల వృద్ధి అంచనాలను ఫిచ్ రేటింగ్స్ 6.2 శాతానికి పెంచింది.
→ ఉద్యోగ రేటులో మెరుగుదల, పని చేసే జనాభా వయసు మోస్తరుగా పెరగొచ్చనే అంచనాల మధ్య భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.
→ మొత్తం 10 వర్ధమాన ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు అంచనాను 4.3 శాతం నుంచి 4 శాతానికి ఫిచ్ తగ్గించింది.
→ చైనా వృద్ధి రేటులో 0.7 శాతం కోత వేసి, 5.3 శాతం నుంచి 4.6 శాతానికి పరిమితం చేసింది.
→ రష్యా వృద్ధి అంచనాలను సైతం 0.8 శాతానికి పరిమితం చేసింది. భారత్ తో పాటు బ్రెజిల్, మెక్సికో,ఇండోనేసియా, తుర్కియే దేశాల అంచనాలను ఫిచ్ పెంచింది. II మధ్యకాలం అంటే 2023 నుంచి 2027 సంవత్సరాలుగా ఫిచ్ పరిగణించింది.

కార్బన్ డయాక్సైడ్ ఇంధనం

వా తావరణ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ ను వెలికి తీయటం మీద ముమ్మరంగా కృషి చేస్తున్నారు.
→ దీన్ని ఉపయోగించుకునే విధంగా మలచే పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు.
→ ఈ దిశగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు.
→ కార్బన్ డయాక్సైడ్ ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాన్ని కనుగొన్నారు.
→ ఇది కార్బన్ డయాక్సైడ్ ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్ లేదా మెథనాల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.
→ ఫ్యూయెల్ కణాలకు శక్తిని అందించటానికి, విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవచ్చు.
→ ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్దఎత్తున కూడా అమలు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
→ ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్తు, వేడిని అందించొచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం.
→ ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్ డయాక్సైడ్ను మాధ్యమిక రూపంలోకి.. అంటే ద్రవ లోహ బైకార్బోనేట్ గా మారుస్తారు.
→ అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తుతో పనిచేసే ఎలక్ట్రోలైజర్లో విద్యుత్లాసాయన పద్ధతిలో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్గా మారుస్తారు. దీన్ని ఎండించి ఘన పొడిగా చేస్తారు.
→ దీంతో ఇది స్థిరంగా ఉంటుంది. చాలాకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా. ఈ పొడిని ఇళ్ల దగ్గరి నుంచి పరిశ్రమల వరకూ ఇంధనంగా వాడుకోవచ్చు.

భారత్ నుంచే అత్యధిక వర్సిటీలు క్యూఎస్ ఆసియా ర్యాంకుల విడుదల

ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక క్యూఎస్(క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ 2024 ఏడాదికి గాను ర్యాంకులను విడుదల చేసింది.
→ మన దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ అగ్రశ్రేణి-50 వర్సిటీల జాబి తాలో నిలిచాయి.
→ బాంబే ఐఐటీ 40, ఐఐటీ-ఢిల్లీ 46వ ర్యాంకులతో మెరిశాయి.
→ మొత్తం 856 విశ్వ విద్యాలయాలతో కూడిన ఈ ర్యాంకింగ్స్ జాబి తాలో భారత్ నుంచే అత్యధికంగా 148 విద్యా సంస్థలు ఉండటం విశేషం. దీంతో చైనా (133), జపాన్ (96)లను వెనక్కి నెట్టినట్లయ్యింది.
→ మయ న్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
→ క్యూఎస్ ఆసియా యూనివర్సిటీల ర్యాంకిం గ్స్ లో గత ఏడాది మాదిరిగానే ఐఐఎస్సీ(బెంగ ళూరు), ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ-బాంబే, దిల్లీ, మద్రాస్, ఖరగ్పుర్, కాన్పూర్ అగ్రస్థాయి 100 విద్యా సంస్థల జాబితాలో నిలిచాయి.
→ గత ఏడాది భారత్ నుంచి 111 వర్సిటీలు క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకోగా ఈసారి ఆ సంఖ్య 148కి చేరింది.
→ అదే సమ యంలో చైనా నుంచి 133 వర్సిటీలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్ జాబితాలో ఉన్నాయి.

భారత్ లో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్ లు నిబంధనలు విడుదల చేసిన యూజీసీ

విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్లో తమ క్యాంప స్ లను ఏర్పాటు చేసేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలను విడుదల చేసింది.
→ జాతీయ విద్యా విధానం (ఎన్ ఈపీ) సిఫార్సులకు అనుగుణంగా విదేశీ ఉన్నత విద్యాసంస్థలు భారత్లోకి ప్రవేశించేందుకు వీలు కల్పించింది.
→ నిబంధనల ప్రకారం మన దేశంలో క్యాంపస్లను ఏర్పాటుచేసే విదేశీ సంస్థలు ఎప్పటికప్పుడు యూజీసీ నిర్ణయిం చిన విధంగా అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో టాప్ 500లో ఉండాలి.
→ నిర్దిష్ట రంగంలో అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉండాలి.
→ విదేశీ విశ్వవిద్యాలయాలు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ), పీహెచ్ ల్లో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమాలు, పరిశోధన, ఇతర ప్రోగ్రామ్లను నిర్వహిం చేందుకు యూజీసీ అనుమతించింది.
→ క్యాంపస్ లో కొత్త ప్రోగ్రామ్ ను ప్రారం భించాలంటే తప్పనిసరిగా వారి అనుమతి పొందాలి.
→ ఆన్లైన్, దూరవిద్య విధానంలో కోర్సులను అందించడానికి క్యాంపస్లు ఏర్పాటుచేసిన విదేశీ విద్యాసంస్థలకు అనుమతి ఉండదు.
→ ఒక కోర్సు అవసరాల్లో పది శాతానికి మించకుండా ఆన్లైన్లో బోధనకు అనుమతి ఉంటుంది.
→ ప్రతి విదేశీ విశ్వ విద్యాలయం మన దేశంలో ఒకటికి మించి క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని యూజీసీ కల్పించింది.
→ అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు యూజీసీ పేర్కొంది.
→ ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటుచేసే విదేశీ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు లభించవని వెల్లడించింది.

2024 లో కూడా ఎల్ నినో ప్రభావం

ప్రస్తుతం నడుస్తున్న ఎల్నినో 2024 ఏప్రిల్ వరకు కొనసాగి.. భూమ్మీద, సముద్రా ల్లోనూ ఉష్ణోగ్రతలను పెంచేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది.
→ ఎల్ నినో వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ నెలారం భంలో తెలిపింది.
→ ఈ ఏడాది మాత్రం ఎల్నినో వల్ల నైరుతి రుతుపవనాల కాలంలో సగటుకన్నా తక్కువ వర్షపాతం నమోదైంది.
→ దీర్ఘకాల సగటు 868.6 మిల్లీ మీటర్లయితే వాస్తవంలో 820 మి. మీ వర్షపాతం నమోదైంది.
→ జులై-ఆగస్టులో మొదలై సెప్టెంబరుకల్లా ఒక మోస్తరు బలం పుంజుకున్న ఎల్నినో ఈ నెల నుంచి 2024 జన వరి మధ్య గరిష్ఠ స్థాయిని అందుకుంటుందని డబ్ల్యూఎంవో తెలిపింది.
→ మధ్య పసిఫిక్ మహా సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల సంభవించే ఎల్నీనో ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి ఏర్పడి తొమ్మిది నుంచి 12 నెలలపాటు ప్రభావం చూపుతుంది.

స్వతంత్ర భారతంలో తొలిసారి బస్తర్ లో పోలింగు

వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డివి జనులో జరి గిన తొలిదశ పోలింగులో అపూర్వ ఘటన చోటుచేసుకొంది.
→ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలోని 126 గ్రామాల ఓటర్లు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటుచేసిన పోలింగు బూత్లలో ఓటుహక్కును వినియోగించుకొన్నారు.
→ 2018 ఎన్నికల దాకా వీరంతా దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు ఎక్కుతూ, నదీనదాలు దాటి.. ఓటు వేసేందుకు బహుదూరం నడవాల్సి వచ్చేది.
→ ప్రతిసారీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే మావోయిస్టుల భయం నడుమ బిక్కుబిక్కుమంటూ గిరిజనులు 'ఓటు యాత్ర' సాగించే వారు.
→ ఈ నేపథ్యంలో తగిన సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియ మించి, మారుమూల గిరిజన ఓటర్ల ఇళ్ల చెంతకు పోలింగు స్టేష న్లను తీసుకువస్తామని ఆగస్టు 26న ఎన్నికల సంఘం సీఈసీ రాజీ వుమార్ ఛత్తీస్గఢ్ ప్రకటించారు.
→ సీఈసీ ప్రకటన కార్యరూపం దాల్చడం ద్వారా అన్ని ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేలా చూశామని ఈసీ సీనియర్ అధికారి తెలిపారు.
→ ఛత్తీస్ గఢ్ 20 నియోజకవర్గాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో 78 శాతం పోలింగు నమోదైంది.

97 ఏళ్ల వయసులోనూ కేసులు వాదిస్తు గిన్నిస్ రికార్డుకెక్కిన కేరళ న్యాయవాది

ఆయన వయసు 97 ఏళ్లు. ప్రశాంతంగా విశ్రాంతి తీసు కోవాల్సిన ఆ వయసులో ఆయన ఇప్పటికీ కోర్టుకు హాజరై కేసుల్ని వాదిస్తు న్నారు.
→ అత్యధికంగా 73 ఏళ్ల 60 రోజులు నాయ్యవాదిగా పనిచేసి, ఏకంగా గిన్నిస్ రికార్డుల కెక్కారు.
→ ఈ రికార్డును సెప్టెంబరు 11న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది.
→ కేరళకు చెందిన ఈ న్యాయవాది పేరు పి. బాలసుబ్రమణి యన్ మీనన్.
→ మద్రాసు న్యాయ కళాశాలలో లా కోర్స్ పూర్తిచేసిన ఆయన 1950లో న్యాయవాద వృత్తిలో చేరారు. నేటికీ అదే వృత్తిలో కొనసాగుతున్నారు.

లాఫింగ్ గ్యాస్'పై యూకే నిషేధం

లాఫింగ్ గ్యాస్గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.
→ ఆ డ్రగ్ ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం వంటివి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది.
→ ఆరోగ్య సంరక్షణతోపాటు పరిశ్రమల్లో చట్టబ ద్ధంగా నైట్రస్ ఆక్సైడ్ను వినియోగించడాన్ని నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
→ బ్రిట న్ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. యూకేలో 16-24 ఏళ్ల వయసువారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో డ్రగ్ నైట్రస్ ఆక్సైడ్.
→ దీనిని ఎక్కువగా ఉపయో గించడంవల్ల రక్తహీనత బారిన పడే అవకాశమున్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
→ దీని తీవ్రత ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతోపాటు పక్షవాతం వచ్చే ప్రమాద ముందని హెచ్చరిస్తున్నారు.

గతేడాది 75 లక్షల మందిలో టీబీ గుర్తింపు

గతేడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందిలో టీబీ(ట్యూబర్ క్యులోసిస్) వ్యాధిని గుర్తించి నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఎ) నివేదిక వెల్లడించింది.
→ డబ్ల్యూహెచ్ వో 1995 నుంచి టీబీ వ్యాధి గ్రస్థుల గణాంకాలు నమోదు చేస్తుండగా.. 2022లోనే రికార్డు స్థాయి కేసులు బయటపడినట్లు వెల్లడించింది.
→ 192 దేశాలు, ఆయా ప్రాంతాల్లో సేకరించిన నమూనాలు పరీక్షించిన అనంతరం వెల్లడైన వివరాల ఆధారంగా 'గ్లోబల్ ట్యూబర్ క్యులోసిస్-2023' నివేదికను డబ్ల్యూ హెచ్ విడుదల చేసింది.
→ దీని ప్రకారం.. 2021లో 1. 3 కోట్ల మంది, 2022లో 1.6 కోట్లు, టీబీతో బాధపడు తున్నట్లు అంచనా.
→ కొవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి 2022లో రోగులకు వైద్య చికిత్స అందించడంతో కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది.
→ 2020, 2021లో భారత్, ఇండోనే సియా, ఫిలిప్పీన్స్లో 60 శాతానికి పైగా కొత్త కేసులు తగ్గాయి.
→ 2019తో పోల్చితో 2022లో ఎక్కువ బాధి తులు కోలుకున్నట్లు నివేదిక పేర్కొంది.

వ్యాధి నిర్ధారణకు తోడ్పడే గ్రాఫీన్ మిశ్రమం

గ్రాఫీన్ ఆక్సైడ్ కు సిస్టైన్ అనే ఎమైనో ఆమ్లాన్ని కలపడం ద్వారా దాని స్థిరత్వాన్ని పెంచడంలో ఐఐటీ గువాహటి పరిశోధకులు విజయం సాధించారు.
→ వ్యాధులను ముందుగానే గుర్తించే బయోమార్కర్ల రూపకల్పనకు ఈ మిశ్రమం తోడ్పడుతుందని రాజీవ్ కర్ నాయకత్వంలోని పరిశోధకుల బృందం తెలిపింది.
→ వైద్య రంగంతోపాటు సెమీకండక్టర్లు, నానో ఎలక్ట్రానిక్స్, క్వాంటమ్ సాంకేతికతల అభివృద్ధికీ తాజా ఆవిష్కరణ ఉపకరిస్తుందని వివరించింది.

సెక్సీయెస్ట్ మ్యాన్-2023గా ప్యాట్రిక్ డెంసే

అమెరికా నటుడు, రేసింగ్ డ్రైవర్ ప్యాట్రిక్ డెంసేను సెక్సీయెస్ట్ మ్యాన్-2023గా పీపుల్స్ మేగజీన్ ఎంపికచేసింది.
→ మార్వెల్ సిరీస్ నటుడు క్రిస్ ఎవాన్స్ గతేడాది ఈ గౌరవం దక్కింది.

అంకుర సంస్థల కోసం టి-హబ్ 'ల్యాబ్ 32' కార్యక్రమం హెక్సాగాన్ తో భాగస్వామ్యం

అంకుర సంస్థల కోసం 'కోహార్ట్ 12 'ఆఫ్ ల్యాబ్32' కార్యక్రమాన్ని టి-హబ్ చేపట్టింది.
→ దీనికోసం సెన్సార్, సాఫ్ట్వేర్, అటానమస్ సొల్యూషన్స్లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న హెక్సాగాన్తో భాగస్వామ్యం కుదుర్చు కుంది.
→ అంకుర సంస్థల వృద్ధి, నూతన ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని టి-హబ్ పేర్కొంది.
→ ల్యాబ్32 కార్యక్రమంలో భాగంగా మార్కెట్ అవసరాలకు అంకుర సంస్థలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయనే అంశాన్ని విశ్లేషిస్తారు.
→ అవసరమైన దిద్దుబాట్లు, వ్యూహాల్లో మార్పులు సూచిస్తారు. ఈ విషయంలో హెక్సాగాన్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
→ ఎంపిక చేసిన అంకుర సంస్థలకు ఈ సేవలు లభిస్తాయి.
→ అంకుర సంస్థల విషయంలో తమ నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శనమని టి-హబ్ సీఈఓ ఎం. శ్రీనివాసరావు పేర్కొన్నారు.
→ ల్యాబ్ 32 కార్యక్రమం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై 100 రోజులు పాటు జరుగుతుంది.
→ దీనికి ఎంపిక కావడానికి అంకుర సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు.

2 భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్ లు

బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపించిన ఎర్త్ షాట్ బహుమతిని ఈ ఏడాది గెలిచిన అయిదు సంస్థలలో భారత్కు చెందిన రెండు సంస్థలు ఉన్నాయి.
→ పర్యావరణ ఆస్కార్లుగా వ్యవహరించే ఈ బహుమతులను 10 లక్షల పౌండ్ల నగదుతో సింగపూ ర్లో ప్రదానం చేశారు.
→ ఆ కార్యక్రమం ఈ వారాంతంలో ప్రసారమవుతుంది.
→ భారతదేశంలో ఆహార వృథాను అరికట్టడానికి కృషి చేస్తున్న ఎస్ఎస్ (సైన్స్ ఫర్ సొసైటీ) టెక్నాలజీస్ సంస్థతోపాటు ప్రపం చవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధికి పాటుపడు తున్న భూపుత్ర సంస్థకూ ఎర్త్ షాట్ బహుమతి లభిం చింది.
→ ఈ రెండు భారతీయ సంస్థలతోపాటు యాక్షన్ ఆండినా (దక్షిణాఫ్రికా), బ్యాటరీ పునర్వినియోగ ప్రాజెక్టు జి.ఆర్.ఎస్.టి (హాంకాంగ్), అక్రమ చేపల వే టపై పోరాడుతున్న వైల్డ్ ఎయిడ్ మెరీన్ సంస్థ (అమె రికా)లను కూడా ఈ ఎకో ఆస్కార్లు వరించాయి

తెలంగాణ వేలిముద్రల విభాగం మరో ఘనత

తెలంగాణ వేలిము ద్రల విభాగం(ఫింగర్ ప్రింట్ బ్యూరో) మరో ఘనత సాధించింది.
→ ఢిల్లీలో జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) 'స్మార్ట్ యూజ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సైన్స్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంశంపై ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన 24వ జాతీయ సదస్సులో ఈ విభాగానికి 'రెండో అత్యుత్తమ కేసు' పురస్కారం లభించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని అజయ్ తండాలోని ఓ ఇంట్లో 2020 ఫిబ్ర వరి 24వ తేదీ రాత్రి జరిగిన చోరీని చాకచక్యంగా ఛేదించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నందుకు ఈ ఘనత దక్కింది. దంపతులకు మాదకద్రవ్యాలు కలిపిన ప్రసాదం ఇచ్చిన నిందితుడు యోగీందర్.. ఇంట్లోని నగలు, నగదు, ఇతర వస్తువులను అపహరించుకుపోయాడు.
→ మాదకద్రవ్యాల ప్రభావంతో దంపతులు సైతం మరణించారు.
→ ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసు దర్యాప్తునకు తొలుత ఆటంకాలు ఎదురుయ్యాయి.
→ ఈ క్రమంలో సీఐడీ ఆధ్వర్యంలోని ఖమ్మం ఫింగర్ ప్రింట్ బ్యూరో నిపుణుడు బి. నరేశ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది.
→ నేరం జరిగిన చోట సేకరిం చిన పాక్షిక ఛాన్స్ ప్రింట్లను మెరుగుపరిచి డేటాబే స్లోని పాత నేరస్థుల వేలిముద్రలతో పోల్చిచూ డటంతో నిందితుడి వివరాలు లభ్యమయ్యాయి.
→ దీంతో యోగీందరు స్వల్ప వ్యవధిలోనే పట్టుకో గలిగారు.
→ అనంతరం ఖమ్మం రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన విచారణ లోనూ ఈ ఆధారాలే కీలకంగా నిలిచాయి.
→ గతే డాది అక్టోబరు 31న నిందితుడికి ఏడేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించేందుకు దోహదపడ్డాయి.
→ వేలిముద్రల విభాగాన్ని డీజీపీ అంజనీకుమార్ అభినందించారు.
→ సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ సమక్షంలో బ్యూరో డైరెక్టర్ తాతారావును, ఇతర నిపుణులను సత్కరించారు.

జపాన్ సముద్రంలో కొత్త ద్వీపం

మూడు వారాల కిందట జపాన్లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది ఓ కొత్త ద్వీపం(ఐలాండ్) ఏర్పడింది.
→ అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడి నిపు ణులు పేర్కొంటున్నారు.
→ ఐవో జిమా దక్షిణ కోస్తా తీరానికి కిలోమీటరు దూరంలో అక్టోబరు 21న అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని, అనంతరం పదిరోజుల్లోనే బూడిద, రాళ్లు పేరుకొని 100 మీటర్ల వ్యాసంతో.. సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్లు జపాన్ వాతావ రణ సంస్థకు చెందిన యుజి ఉసుయ్ అనే విశ్లేష కుడు తెలిపారు.
→ దాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నా రని, అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని వారు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

కేంద్రం ఆమోదిస్తే దిల్లీలో 20న కృత్రిమ వాన

దేశరాజధాని దిల్లీలో వాయు కాలుష్య సూచీ(ఏక్యూఐ) వరుసగా రెండో రోజూ 400 దాటింది.
→ అయితే ఈ పరిస్థితి దీపావళి ముందు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావ రణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
→ దిల్లీలో ఏక్యూఐ 437గా నమోదైంది.
→ దిల్లీ చుట్టుపక్కల నగరాలైన గాజియాబాద్ (391), గురుగ్రామ్ (404), నోయిడా (394), గ్రేటర్ నోయిడా (439), ఫరీదాబాద్ (410) ల్లోనూ ఇదే పరిస్థితి.
→ తీవ్రస్థాయికి చేరుకున్న ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వానల అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలి స్తోంది.
→ కేంద్రం ఆమోదం తెలిపితే ఈ నెల 20న ఐఐటీ కాన్పూర్తో కలిసి మేఘమథనం జరిపి వానలు కురిపిస్తామని అధికారులు చెబు తున్నారు.
→ ఇందుకయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభు త్వమే భరించనుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
→ “చదరపు కిలోమీటర్కు రూ. లక్ష ఖర్చవుతుంది. ప్రయోగాత్మకంగా 300 చదరపు కిలోమీటర్లలో ఇది చేపట్టే అవకాశం ఉంది" అని ఆ అధికారి పేర్కొన్నారు.

ఈవీఎంలను ధ్వంసం చేస్తే కటకటాలే

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
→ గతంలో పోలింగ్ను ఆపాలనే ఉద్దేశంతో బ్యాలెట్ బాక్సుల్లో ఇంకును, నీళ్లను పోయడం, బాక్సులను ఎత్తుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడేవారు.
→ ప్రస్తుతం ఈవీఎంలు, వీవీప్యాట్ తో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలి సిందే. వీటిని ధ్వంసం చేసినా, పని చేయకుండా చేసినా, టేపులు అతికించినా, నీళ్లుపో సినా... ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 136 ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే జరిమానాతోపాటు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తారు.

కన్నును సమూలంగా మార్చిన న్యూయార్క్ వైద్యులు

అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచే యడానికి కార్నియా మార్పిడి వంటివి చేస్తున్నా న్యూయార్క్ లోని వైద్యులు మాత్రం అత్యంత సంక్లిష్ట మైన శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని మార్చి వేసి రికార్డు సృష్టించారు.
→ ఇలాంటిది ప్రపంచంలోనే తొలిసారి అని చెబుతున్నారు.
→ అయితే ఆ కన్నుద్వారా దృష్టి వస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది.
→ అధిక వోల్టేజీ ఉన్న విద్యుత్తు తీగలు తగిలిన కారణంగా ఆరన్ జేమ్స్ అనే వ్యక్తి ముఖం చాలావరకు కాలిపోగా ఒక కన్ను మొత్తం పోయింది.
→ కుడి కంటిని రెప్పతో సహా సమూలంగా మారిస్తే ఆయన ముఖానికి కొత్తరూపు ఇచ్చినట్లవుతుందని న్యూయార్క్ సిటీలోని లాంగోనె హెల్త్ ఆసుపత్రి వైద్యులు భావించారు.
→ ఆ ప్రకారం మే నెలలో 21 గంటలసేపు చేసిన శస్త్రచికిత్స విజయవంతమై కొత్త కన్ను ఆరోగ్యంగా ఉందని వారు ప్రకటిం చారు.
→ కన్నును మూసి, తెరవడం సాధ్యం కాకపోయినా కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని జేమ్స్ చెప్పారు.
→ భవిష్యత్తులో ఇది ఎన్నో నూతన మార్గాలకు ద్వారం తెరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.

బలమైన వృద్ధి దిశగా భారత్

దేశ ఆర్ధిక వృద్ధి బలంగా ఆడుగులు వేస్తోందని.. ద్రవ్యోల్బణం కూడా నియం త్రణలోకి వస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
→ అయినా అంతర్జాతీయ పరి స్థితుల నేపథ్యంలో, ద్రవ్యోల్బణంపై ఓ కన్నేసి ఉంచుతూ, వృద్ధికి ఊతమిచ్చేలా పరపతి విధానం రూపొందిస్తున్నట్లు గవర్నర్ అన్నారు.
→ టోక్యోలో ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి దాస్ మాట్లాడుతూ 'ఒక స్వయం నియంత్రిత సంస్థ(ఎస్ఆర్డీ) ద్వారా ఫిన్టెక్ సంస్థలు సొంతంగా నియంత్రణ విధానాలను పాటించా లని ప్రోత్సహిస్తున్నాం.
→ సుపరిపాలన, నైతిక విలువలు, నష్టభయ నిర్వహణను కలిగి ఉండ డంపై దృష్టి సారించమని చెబుతున్నా'మని వెల్ల డించారు.
→ ఆయన ఇంకా ఏమన్నారంటే.. గత కొన్నేళ్లుగా, అంతర్జాతీయ అనిశ్చితులు చేసే మన వృద్ధి రేటు 6.7% 2023పై అంచనాలు కొనసాగించిన మూడీస్ 2023 ఏడాదికి భారత ఆర్ధిక వృద్ధి అంచనాలను 6.7 శాతంగానే మూడీస్ కొనసాగిస్తున్నట్లు ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది.
→ దేశీయంగా బలమైన గిరాకీ వల్ల సమీప కాలంలో వృద్ధి స్థిరంగా ఉండగలదని ఆ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ పేర్కొంది.
→ అంత ర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఉన్నా కూడా.. భారత ఆర్ధిక వ్యవస్థకు దేశీయ గిరాకీ మధ్య కూడా భారత ఆర్ధిక వ్యవస్థ స్థిరమైన ప్రగతిని కనబరచింది.
→ విశ్వసనీయ విధానాల మద్దతుతో వృద్ధి బలో పేతం కావడంతో పాటు, ద్రవ్యోల్బణమూ నియంత్రణలోకి వస్తోంది.
→ 2023-24 తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. ఈ ధోరణి కొన సాగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
→ సెప్టెంబరులో సీపీఐ ద్రవ్యోల్బణం 3 నెలల కని ష్ఠమైన 5 శాతానికి చేరింది.
→ టోకు ద్రవ్యోల్బణం మాత్రం 2023 జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయి కంటే 170 బేసిస్ పాయింట్ల మేరే తగ్గింది.
→ ఈ పరిస్థితుల మధ్య పరపతి విధానం విషయంలో జాగ్రత్తగా ఉంటాం.
→ వృద్ధికి మద్దతు ఇస్తూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం.
→ ఇతర దేశాల్లోని వేగవంత చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానం ప్రక్రియ జరుగుతోంది.
→ కలిసివస్తుందని తన 'గ్లోబల్ మాక్రోఎకనామిక్ అవుట్ లుక్ 2024-25' నివేదికలో పేర్కొంది.
→ '2023లో భారత వాస్తవ జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగలదని మేం అంచనా వేస్తున్నాం.
→ 2024లో 6.1 శాతం, 2025లో 6.3 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చ'ని మూడీస్ పేర్కొంది.
→ 2023 మార్చి త్రైమాసి కంలో 6.1 శాతంగా ఉన్న భారత వాస్తవ జీడీపీ, జూన్ త్రైమాసికానికి 7.8 శాతంగా నమోదైంది.
→ జూన్ త్రైమాసికంలోని సాను కూల సంకేతాలు.. జులై-సెప్టెంబరులోనూ కొనసాగాయని మూడీస్ పేర్కొంది.

ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది అని అమెరికా జనగణన సంస్థ వెల్లడి

ఈ ఏడాది సెప్టెంబరు 26 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని అమెరికా జనగణన సంస్థ ప్రకటించింది.
→ ఐక్యరాజ్యసమితి అయితే ప్రపంచ జనసంఖ్య 2022 నవంబరు 22 నాడే 800 కోట్లకు చేరినట్లు ప్రకటించింది.
→ 1960-2000 మధ్య రెట్టింపైన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తర వాత నుంచి తగ్గుముఖం పడుతోందని తెలిపింది.
→ ప్రతి మహిళ 2.1 మందిని కంటేనే పాతతరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయి. దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు.
→ ప్రస్తుతం మూడు వంతుల ప్రపంచ జనాభా 2.1, అంతకు తక్కువ భర్తీ రేటు ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు.
→ 2.1కి దరిదాపుల్లో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా ఉన్నాయి.
→ 2.1కన్నా తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, స్వీడన్ ౯లు ఉండగా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ లలో అంతకన్నా తక్కువ భర్తీ రేటు కనిపిస్తోంది.

ప్రపంచంలో తొలిసారిగా గన్యాకు టికా

ప్రపంచంలోనే తొలిసారి గన్యా జ్వరాల నివారణకు తయారు చేసిన టీకాకు అమెరికా ఆరోగ్య సంస్థ.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మి నిస్ట్రేషన్ (ఎఫీఏ) ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయడానికి మార్గం సుగమమైంది.
→ ఈ వ్యాక్సిన్ కు ఇక్ స్ చిక్ అనే పేరుపెట్టారు.
→ ఐరోపా కంపెనీ 'వాల్ నెవా' దీనిని తయారు చేసింది.

దేశంలోనే ఏకైక ఎన్నికల ప్రదర్శన శాల

మన ఎన్నికలకు ప్రపంచంలోనే విశిష్ఠ స్థానం ఉంది.
→ మహిళ లందరికీ ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఓటుహక్కు కల్పిం చిన మొదటి దేశం మనదే.
→ అయితే... తొలిసారి ఓటరు జాబితాలు తయారు చేస్తున్నప్పుడు మహిళల్లో అత్యధికులు తమ పేర్లను చెప్పడానికి ఇష్టపడలేదు.
→ ఫలితంగా 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో వారి భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.
→ చదువు, చైతన్యం పెరగడంతో మార్పు వచ్చింది.
→ దిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో 2016లో ఏర్పాటు చేసిన 'ఎన్నికల మ్యూజియం'లో అడుగు పె డితే దేశ ఎన్నికల ప్రయాణంలోని ఇలాంటి అనేక ఘట్టాలను తెలుసుకోవచ్చు.
→ దీన్ని భారత ఎన్నికల అధ్యయన కేంద్రం గానూ పిలుస్తారు.
→ స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల నాటి ఛాయాచిత్రాలు, వినియోగించిన బ్యాలెట్ పెట్టెలు, పత్రాలతోపాటు ఇప్పటి ఈవీఎంలు, వీవీ ప్యాట్ పరి కరాలనూ ఇక్కడ భద్రపరిచారు.
→ ఒక ప్రత్యేక ప్రదర్శన శాలలో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు.
→ ఇందులో ఒక గ్రంథాలయమూ ఉంది.

శ్రీలంక బోర్డుపై సస్పెన్షన్ విధించిన ఐసీసీ

ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శన చేసిన శ్రీలంకకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.
→ ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం లంక క్రికెట్ బోర్డును రద్దు చేయగా ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లంక సభ్యత్వంపై ఐసీసీ సస్పెన్షన్ విధించింది.
→ తాత్కాలిక నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది.
→ శ్రీలంక క్రికెట్ (SLC)ను రద్దు చేయాలన్న తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
→ ఈ నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన ఐసీసీ లంక సభ్య త్వంపై నిర్ణయం తీసుకుంది.
→ సస్పెన్షన్ తొలగే వరకు లంక ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే అవకాశం లేదు.
→ గత నాలుగేళ్లలో శాశ్వత సభ్య దేశంపై ఐసీసీ సస్పెన్షన్ విధించడం ఇది రెండో సారి.
→ 2021లో ప్రభుత్వ జోక్యం కారణంగా జింబాబ్వే వేటుకు గురైంది.
→ ప్రపంచకప్ లో జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో ఎస్ఎల్సీని రద్దు చేసిన క్రీడల మంత్రి రోహన్ రణసింఘే మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల మధ్యంతర కమిటీకి బాధ్యతలు అప్పగించారు.
→ రద్దయిన కార్యవర్గం ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ కోర్టును ఆశ్రయించగా క్రీడల మంత్రి నిర్ణయంపై స్టే విధించింది.
→ ఆ తర్వాత పార్లమెంటు శ్రీలంక క్రికెట్ కార్యవర్గం రద్దు తీర్మానానికి ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది.

వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు

వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధాని దిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేప థ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ హెల్త్ హెచ్చరికలు పంపింది.
→ శీతాకాలంలో వాయుకా లుష్యం పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల దీని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ సూచించారు.
→ ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రా లకు లేఖలు రాశారు. "ఇటీవలి కాలంలో వాయుకాలుష్యం తీవ్రమైన ఆరోగ్య సవాల్ గా శాఖ మారింది.
→ శీతాకాలంలో గాలి నాణ్యత సూచి దారుణంగా పడిపోతోంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
→ అంతేకాకుండా దీర్ఘకాలిక శ్వాశకోశ, హృదయ, నాడీ సంబంధ ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
→ ఈ పరిణా అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తు న్నాయి.
→ పాఠశాల విద్యార్థులు అధికంగా వాయు కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.
→ నేషనల్ ప్రోగ్రాం ఫర్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ ' కింద దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు, మానవ ఆరోగ్యంపై రాష్ట్రస్థాయి ప్రణాళికలు రూపొందించారు.
→ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జిల్లా, నగర స్థాయి ప్రణా తయారు చేయాలి.
→ వాయుకాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే ఆసుపత్రులను విస్తరించాలి" అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈ లేఖలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో దివ్యాంగుల కెఫే

అందరికీ సమాన అవకాశాలు కల్పించ డంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి. వై. చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పూర్తిస్థాయిలో దివ్యాంగులు నిర్వహించే 'మిట్టి కెఫే'ను ప్రారం భించారు.
→ "మిట్టి కెఫేను నడిపే వారంతా ప్రత్యేక అవసరాలున్నవారు.
→ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 'మిట్టి కెఫే' 38 బ్రాంచీలు నిర్వ హిస్తోంది. కరోనా సమయంలో 60 లక్షల భోజనాలు అందించారు.
→ బార్ కౌన్సిల్ వీరికి మద్దతుగా ఉంటుందని ఆశిస్తున్నాను" అని సీజేఐ పేర్కొన్నారు.

37వ జాతీయ క్రీడలు

గోవా ఆతిథ్యమిచ్చిన 37వ జాతీయ క్రీడలు 2023, అక్టోబరు 25న ప్రారంభమై 2023, నవంబరు 9న ముగిశాయి.
→ ఈ క్రీడల్లో మహారాష్ట్ర (80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో 228) అగ్రస్థానంలో నిలిచింది.
→ ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పత కాలతో పట్టికలో 19వ స్థానంలో నిలిచింది.
→ తెలంగాణ 4 స్వర్ణాలు, 10 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 25 పతకాలతో 22వ స్థానాన్ని దక్కించుకుంది.

ప్రపంచ రికార్డు సృష్టించిన అయోధ్య దీపోత్సవం

దివ్వెల పండగకు ఒక్క రోజు ముందుగానే అయోధ్య నగరం దివ్య తేజో వర్ణ రంజితమైంది.
→ సరయూ నదీ తీరంలో లక్షల దీపాల వెలుగులు దివిని భువిని ఏకం చేశాయి. సరికొత్త ప్రపంచ రికార్డునూ సృష్టిం చాయి.
→ రామనగరి శోభాయ మానమైంది. రామ మందిరం త్వరలో ప్రారంభం కానుందనే సంరంభం నగర మంత కనిపించింది.
→ ఉత్తర్ ప్రదేశ్లోని. అయోధ్యలో సరయూ నదీ తీరాన గత ఏడే ళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్నారు.
→ ఈసారి దీపోత్సవం ప్రత్యేక తను సంతరించుకుంది.
→ సరయూ తీరంలోని 51 ఘాట్' లలో 22లక్షలకు పైగా దీపాలను అందంగా తీర్చిదిద్దారు.
→ వనవాసాన్ని ముగించుకుని సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన శ్రీరామునికి ఆయన సోదరులు భరత శతృ ఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పుర స్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, గవర్నర్ అనందీబెన్ పటేల్ పాల్గొన్నారు.
→ అనంతరం నదీ తీరంలో యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి నిర్వహించి, 'దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
→ 25 వేల మంది వాలంటీర్లు 22లక్షలకు పైగా దీపాలను వెలి గించారు.
→ ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల బృందం హాజరై.. డ్రోన్ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కిం చారు.
→ ప్రపంచ రికార్డును ధ్రువీకరిస్తూ ముఖ్యమంత్రికి సర్టిఫికేట్ను అందించారు.
→ 54 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
→ దీపోత్సవ్ కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు.
→ రామాయణం, రామచరిత మానస్తో పాటు వివిధ సామాజికాంశాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.
→ వేల మంది ప్రజలు ఆయా కార్యక్రమాలను వీక్షించారు. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు.

→ 2017లో యూపీలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ఈ దీపో త్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
→ గతేడాది 15 లక్షల దీపాలను వెలిగించగా ఈ ఏడాది ఆ రికార్డును బద్దలుకొట్టారు.

3,26,18,205 రాష్ట్రంలో ఓటర్లు

రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 326,18,205కు చేరుకుంది.
→ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో వీరు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
→ వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు.
→ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరు నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను ఎన్నికల సంఘం చేపట్టింది. షెడ్యూలు విడుదలకు ముందు అక్టోబరు 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది.
→ దాని ప్రకారం.. మొత్తం 3,17,32,727 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది.
→ అక్టోబరు 31 వరకు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
→ వచ్చిన దరఖాస్తులను నవంబరు 10 వరకు పరిష్కరించారు.
→ తాజాగా జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాలను కలెక్టర్లు ప్రకటించారు.
→ వీటి ప్రకారం... అక్టోబరు 4న ప్రకటించిన జాబితాతో పోలిస్తే 8,85,478 మంది ఓటర్లు పెరిగారు.
→ అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో మహిళల కన్నా పురుషులు 28,154 మంది ఎక్కువగాఉండగా.. తాజాగా దాన్ని మహిళలు అధిగమించారు.
→ పురుష ఓటర్ల కన్నా 3,287 మంది మహిళలు ఎక్కువగా నమోదయ్యారు.
→ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 75 స్థానాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
→ 44 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు. ఆది కంగా ఉన్నారు.
→ 230 జిల్లాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం విశేషం.
→ ఏడు జిల్లాలు- కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైద రాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తిలలో మాత్రమే పురుష ఓటర్లది పైచేయిగా ఉంది.
→ మిగి లిన అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
→ రాష్ట్రంలో నవ ఓటర్లు రికార్డుస్థాయిలో 9,99,667 మంది నమోదయ్యారు.
→ అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో 18-19 సంవత్సరాల ఓటర్లు 8,11,648 మంది ఉన్నారు.
→ అక్టోబరు 31 తర్వాత మరో 1,88,019 మంది నమోదు కావటం విశేషం.
→ మొత్తం ఓటర్లలో ట్రాన్స్ జెండర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406 మంది నమోదయ్యారు.

అధిక ఉద్గారాలకు కారణమవుతున్న సంస్థలపై భారీ జరిమానా

నిర్దేశించిన ప్రమాణాల కంటే అధికంగా ఉద్గా రాలను వెలువరిస్తున్న కార్లను తయారు చేస్తున్న కంపెనీలను ప్రభుత్వం గుర్తించింది.
→ నిబంధనలు ఉల్లంఘించిన ఆయా సంస్థలపై భారీ అపరాధ రుసుములు విధించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ) ప్రతి పాదించింది.
→ తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలు లేదా హరిత వాహ నాల వైపు మళ్లాల్సిందిగా ఆయా కంపె నీలకు సూచించినట్లు ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది.
→ ఎందుకంటే.. ఈ ఏడాది జనవరిలో కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకా సమీ(సీఏఎఫ్ఎస్ఈ) నిబంధనలు సవరిం చారు.
→ ఈ నిబంధనల కింద కార్బన్ . డయాక్సైడ్ ఉద్గారాలకు పరిమితి విధిం చారు.
→ ఆయా మోడళ్ల బరువు, విక్ర యాల సంఖ్య ఆధారంగా ఉద్గారాలను లెక్కిం చారు.
→ ఎనర్జీ కన్జర్వేషన్(సవరణ) బిల్లు 2022 ప్రకారం.. ఏదైనా కంపెనీ కర్బన ఉద్గార పరి మితికి మించి వెలువరిస్తే భారీ అపరాధ రుసుములు విధించొచ్చు.
→ ఈ బిల్లుకు డిసెంబరులో పార్లమెంటు ఆమోదం లభించింది.
→ ఎంతంటే..: 2022-23 తొలి తొమ్మిది నెలల్లో అపరాధ రుసుములు తక్కువగానే ఉన్నాయి.
→ ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలు అమ ల్లోకి రావడంతో భారీగా పెరిగాయి.
→ ఏదైనా కంపెనీ కార్ల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నిర్దేశించిన స్థాయిల కంటే 0-4.7 గ్రాము/కి.మీ. మేర అధికంగా ఉంటే, విక్ర యించిన ఒక్కో కారుపై రూ.25,000 అప రాధ రుసుము పడుతుంది.

జానపద గాయని స్నేహలత కన్నుమూత

తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ముని మనవరాలు, జానపద గాయని, స్వరకర్త స్నేహలతా మురళి (59) ఇక లేరు.
→ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె కన్నుమూశారు.
→ నాగార్జునసాగర్ జన్మించిన స్నేహలత హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
→ స్నేహలత మూడు దశాబ్దాలుగా ఆకాశవాణి, దూరద ర్శన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా అనేక ప్రద ర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు. అనేక పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
→ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పెళ్లిళ్ల సందర్భంగా పాడుకునే పాటలను వెలు గులోకి తెచ్చి తెలుగువారి పూర్వ వైభవాన్ని ఈ తరానికి పరిచయం చేశారు.
→ స్నేహలత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఆంధ్ర విశ్వవిద్యా లయం నుంచి ఎంఏ సోషియాలజీ పూర్తిచేశారు.
→ ప్రస్తుతం ఆమె తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.
→ స్నేహలత 2009లో విశిష్ట ఉగాది పురస్కారం, ప్రతిభా రాజీవ్ పుర స్కారాలు సహా పలు అవార్డులు అందుకున్నారు.
→ 2012లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శనలిచ్చారు.

గ్రీన్ ల్యాండ్ తగ్గిపోతున్న ధ్రువ ఎలుగుబంట్లు

గడిచిన 20వేల సంవత్సరాల్లో గ్రీన్ ల్యాండ్లో ధ్రువ ఎలుగుబంట్ల సంఖ్య తగ్గిపో తున్నట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది.

→ ఈ జీవుల జన్యు పదార్థం, ఆహార పుటలవాట్లు, ఆవాస ప్రాంతం, వాతావరణ డేటా తదితర అంశాలను విశ్లేషించిన శాస్త్రవే త్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.
→ పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు ఈ పరిస్థితికి దారితీస్తు న్నట్లు వారు పేర్కొన్నారు.
→ "సాగరం వేడెక్కి నప్పుడు అందులో హిమం తగ్గిపోతుంది. ఫలి తంగా సీల్ జంతువులూ తగ్గిపోతాయి. ధ్రువ ఎలుగుబంట్లకు ఇవే ప్రధాన ఆహారం" అని పరిశోధనకు నాయకత్వం వహించిన మైఖేల్ వెస్ట్బరీ పేర్కొన్నారు.
→ పర్యావరణపరంగా చిన్నపాటి మార్పులు జరిగినా అది ధ్రువ ఎలు గుబంట్ల సంఖ్యపై ప్రభావం పడుతోందని చెప్పారు.
→ గడిచిన 20వేల సంవత్సరాల్లో గ్రీన్ ల్యాండ్ చుట్టుపక్కల సముద్ర ఉష్ణోగ్రతలు 0.2 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరి గాయని వివరించారు.
→ దీనివల్ల ధ్రువ ఎలుగు బంట్ల సంఖ్య 20 నుంచి 40 శాతం మేర తగ్గి పోయిందని తెలిపారు.

గులాబీ రంగులోకి మారిన చెరువు

అమెరికాలోని ఓ చెరువు నీరు ఒక్కసారిగా గులాబీ లోకి మారేసరికి అందరూ ఆశ్చర్యపోతు న్నారు. గత రెండు వారాలుగా ఇలాగే కనిపిస్తోంది.
→ ఇలా ఎందుకు దన్న దానిపై అధ్యయనం అమెరికాకు చెందిన 'ఫిష్ అండ్ సర్వీస్' తెలిపింది.
→ అధిక నీటిలో కనిపించే బాక్టీరియా రంగు మారిపోయి ఉంటాయని హవాయిలో భావిస్తున్నారు.
→ కరవు కారణంగా జూన్ రంగు నుంచి చెరువులో నీరు ఆవిరి కావడం వల్ల లవణీయత పెరిగిందని చెబుతున్నారు.
→ నీరు ఈ నీరు విషపూరితం కాలేదని, రంగు మార్పుపై స్పష్టత కోసం నమూనాలు సేకరించి చేస్తున్నామని హవాయీ విశ్వవిద్యాలయానికి పంపించా వైల్డ్ లైఫ్ మని అధికారులు తెలిపారు.
→ స్థానికుడొకరు లవణీయత ఉన్న డ్రోన్ సాయంతో తీసిన చెరువు చిత్రాలు కారణంగా నీళ్లు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చి చెరువును అధికారులు చూసేందుకు అనేకమంది తరలి వస్తున్నారు.

ఓటు.. కనిపించేది ఏడు సెకన్లే!

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితే ఓటరు తాను ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా తెలుస్తుంది.
→ ఈవీఎంలు వచ్చాక ఆ వెసులుబాటు పోయింది.
→ అనంతరకాలంలో ఓటరు తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికే పడిందా లేదా తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం... వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)ను ప్రవేశపెట్టింది.
→ ఓటరు ఓటు వేయగానే వివిప్యా ట్లో చూసుకోవాలి. ఇది అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తును ముద్రిస్తుంది. ఆ పేపరు ఏడు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది.
→ తర్వాత దానంతటదే వీవీప్యాట్లోని డ్రాబ్బాకాలో పడిపో తుంది.
→ దీన్ని తొలిసారిగా 2018 సెప్టెంబరులో నాగాలాండ్ లోని నోక్సెన్ అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు.
→ తర్వాత అదే ఏడాది మిజోరం అసెంబ్లీ ఎన్ని కల్లో 10 నియోజకవర్గాల్లో వాడారు.
→ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది లోక్సభ స్థానాల్లో, 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఉపయోగించారు.
→ ఈ యంత్రాలను సీల్ చేసే పేపర్, స్ట్రిప్ సీల్ తదితరాలను నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే తయారు చేస్తుంది.

25వేల మందితో త్రివిధ దళాల 'త్రిశక్తి ప్రహార్' భారీ యుద్ధవిన్యాసాలు రాజస్థాన్ లో ప్రారంభం

భారత త్రివిధ దళాలు 'త్రిశక్తి ప్రహార్' పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను రాజ స్థాన్ లోని జైసల్మేర్ లో ప్రారంభించాయి.
→ 25 వేల మంది పాల్గొనే ఈ కార్యక్రమం ఈ నెల 25 వరకూ కొనసాగుతుంది.
→ భారత సైన్యం, వైమానిక, నౌకాద ళాలు పూర్తి సమన్వయంతో వీటిని నిర్వహిస్తాయి.
→ వేగంగా బలగాల తరలింపు, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.
→ ఈ విన్యాసాల్లో టి- 90, అర్జున్ యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, అపాచీ పోరాట హెలికాప్టర్లు, చినూక్ రవాణా హెలి కాప్టర్లు, భారత నౌకాదళానికి చెందిన వివిధ విమా నాలు పాలుపంచుకుంటాయి.

ఈ ఏడాది చివరికలా రెండు రాకెట్ ప్రయోగాలు

ఈ ఏడాది చివరికల్లా రెండు పెద్ద రాకెట్ ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్లో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ-ఎంకే. ప్రయోగాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
→ పీఎస్ఎల్పీ ఎక్స్పోశాట్ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్రే మూలాలకు సంబంధించిన వివిధ డైనమిక్ లను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి మిషన్. జీఎస్ఎల్వీ ద్వారా ఇన్ శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
→ ఇది వాతావరణ సేవలను అందించనుంది. జీఎస్ఎల్వీ-ఎంకే. ప్రయోగం చాలా ముఖ్య మైంది.
→ నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీతో కలిసి దీనిని అభివృద్ధి చేయ నున్నారు.
→ వైబ్రేషన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఫిన్లాండ్ కు 'డేవిడ్స్ స్లింగ్' ఆయుధ వ్యవస్థ

ఒక వైపు హమాస్ తో యుద్ధం కొన సాగుతున్నా మరోవైపు రక్షణరంగంలో ఇజ్రాయెల్ మరో ఆయుధాల విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
→ నాటో నూతన సభ్య దేశం ఫిన్లాండ్కు తమ 'డేవిడ్స్ స్లింగ్' గగనతల రక్షణ వ్యవస్థను విక్రయించనున్నట్లు ప్రకటించింది.
→ 34 కోట్ల డాలర్లకు ఈ ఒప్పందం కుది రిందని పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో 'డేవిడ్స్ స్లింగ్' కీలక పాత్ర పోషిస్తోంది.
→ గగనతలంలో శత్రు వుల బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు, యుద్ధవిమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేసే సామర్థ్యం దీనికి ఉంది.
→ ఈ ఆయుధ వ్యవస్థను అమెరికా కంపెనీలతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది.

నగరాల్లో సరకు రవాణాకు సులువైన 3 యాప్

నగరాల్లో సరకులను మరింత సమర్థంగా, సులువుగా రవాణా చేయడానికి మద్రాస్ ఐఐటీ పరి శోధకులు ఒక మొబైల్ యాప్ ను అభివృద్ధి చేశారు.
→ ఇది మధ్యవర్తుల ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు.
→ 'ఆప్ట్ రూట్' అనే ఈ యాప్.. డ్రైవర్ తో వినియోగదారుడిని అనుసంధానిస్తుంది. ఈ లావాదే వీల్లో కమీషన్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
→ చెల్లింపులు కూడా వినియోగదారుడి నుంచి నేరుగా డ్రైవర్కు వెళతాయి.
→ ఈ యాపనకు సంబంధించిన మొదటి వెర్షన్.. మద్రాస్ ఐఐటీలో ఏర్పాటైన ఆప్ట్ రూట్ లాజిస్టిక్స్ అనే అంకురపరిశ్రమ అభివృద్ధి చేసి,వాణిజ్య ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చింది.
→ 'సరకు రవాణా విషయంలో డ్రైవర్లు, వినియోగదారు లకు మధ్య ఉన్న సంధానత సమస్యను ఈ యాప్ పరిష్కరిస్తుంది.
→ తిరుగుప్రయాణంలో లోడ్ లేకపో వడం, వాహనం పూర్తి సామర్థ్యంతో తిరగకపోవడం వంటి సమస్యలను ప్రస్తుతం రవాణాదారులు ఎదు ర్కొంటున్నారు.
→ ఈ రంగంలోని మార్కెట్ వ్యవస్థీకృ తంగా, సమర్థంగా కూడా లేదు. సాంకేతిక పరిజ్ఞా నంతో ఈ ఇబ్బందులను పరిష్కరించొచ్చు" అని మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ ఎన్. ఎస్. నారాయణస్వామి తెలిపారు.
→ ప్రస్తుతం ఈ యాప్ సేవలను హైదరా బాద్, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని పలు నగ రాల్లో అందుబాటులోకి తెచ్చారు.

మాజీ ఎంపీ, సీఐటీయూసీ నేత బాసుదేవ్ ఆచార్య కన్నుమూత

సీపీఎం మాజీ లోక్సభ సభ్యుడు, సీఐటీయూసీ అఖిల భారత నేత బాసుదేవ్ ఆచార్య (81) మృతిచెందారు.
→ కొంతకా లంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగ రంలోని మెడికేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
→ 1942 జులై 11న పశ్చి మబెంగాల్లోని పురూలియా జిల్లా బెరో గ్రామంలో బాసుదేవ్ జన్మించారు.
→ పురూలియా జిల్లా బంకుర లోక్సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు.
→ 1980 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్నారు. సీపీఎం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగానూ పనిచేశారు.
→ ఉపా ధ్యాయ వృత్తి నుంచి కార్మిక ఉద్యమంలోకి, ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించారు.
→ 2014లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన తరువాత ఎన్ని కల్లో పోటీకి దూరంగా ఉన్నారు.

6 బంతుల్లో 6 వికెట్లు గారెత్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
→ గోల్డ్ కోస్ట్ ప్రిమియర్ లీగ్ డివిజన్- 3 టోర్నీలో నెరాంగ్ క్లబ్ కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్... సర్ఫర్స్ పారడైజ్ సీసీపై ఈ ఘనత సాధించాడు.
→ 40 ఓవర్ల మ్యాచ్లో 178 పరుగుల ఛేదనలో 39 ఓవర్లకు 174/4తో విజయానికి చేరు వైన పారడైజ్ జట్టుకు గారెత్ (7/16) షాకిచ్చాడు.
→ ఆఖరి ఓవర్లో 6 బంతు లకు 6 వికెట్లు తీసి నెరాంగ్ క్లబ్ ను గెలిపించాడు.
→ ఈ 6 బంతుల్లో తొలి నాలుగు క్యాచ్ లు, ఆ తర్వాత రెండు బౌల్డ్. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒక ఓవర్లో అయిదు వికెట్లు తీసిన అభిమన్యు మిథున్ (భారత్, 2019), వాగ్నర్ (న్యూజి లాండ్, 2011), అమీన్ (బంగ్లాదేశ్, 2013)లను గారెత్ అధిగమించాడు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సెహ్వాగ్, ఎడుల్జీ

భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ , శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కింది.
→ తమ కెరీర్లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
→ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించిన భారత తొలి మహిళా క్రికెటర్ గా ఎడుల్జీ రికార్డు సృష్టించింది.
→ 1976- 1993 మధ్యలో ఎడుల్జీ 54 మ్యాచ్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది.
→ తన ఎడమచేతి వాటం స్పిన్తో వందకు పైగా వికెట్లు తీసింది.
→ 1999-2013 మధ్యలో సెహ్వాగ్ టెస్టుల్లో 8,586, వన్డేల్లో 8,273 పరుగులు సాధించాడు.
→ వన్డేల్లో 96, టెస్టుల్లో 40 వికెట్లు తీసుకున్నాడు.
→ 1984-2003 మధ్యలో డిసిల్వా టెస్టుల్లో 6,361 వన్డేల్లో 9,284 పరుగులు రాబట్టాడు.
→ టెస్టుల్లో 29, వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టాడు.
→ 1996లో డిసిల్వా. 2011లో సెహ్వాగ్ ప్రపంచకప్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.

ఐఐఎం డైరెక్టర్లు కావాలంటే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి

ఐఐఎం డైరెక్టర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది.
→ ఇక నుంచీ డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు డిగ్రీ, పీజీల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
→ అంతేకాకుండా ప్రఖ్యాత విద్యా సంస్థల్లో పీహెచీ గానీ, దానికి సమానమైన అర్హత ఉన్న పరిశోధనగానీ చేసి ఉండాలి.
→ ఇటీవల ఐఐఎం రోహతక్ డైరెక్టరుగా ధీరజ్ శర్మ నియమితులయ్యారు. ఆయన డిగ్రీలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. దీనిపై వివాదం తలెత్తింది.
→ దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొ చ్చింది.
→ వీటి ప్రకారం.. 'విజిటర్' హోదాలో రాష్ట్రపతి. ఐఐఎంలపై అధికారం కలిగి ఉంటారు. ఐఐఎంల బోర్డు ఆఫ్ గవర్నర్ల ఛైర్పర్సన్ను నియమిస్తారు.
→ బోర్డు సిఫార్సుల మేరకు డైరెక్టర్లను నియమించే, తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది.
→ అవసరమైతే బోర్డును రద్దు చేసే అధికారమూ రాష్ట్రపతికే ఉంటుంది. గతంలో డైరెక్టర్లను నియమించే అధికారం బోర్డుకే ఉండేది.

'సీ గార్డియన్స్' పేరుతో అరేబియా సముద్రంలో చైనా-పాక్ విన్యాసాలు

చైనా, పాకిస్థాన్లు అరేబియా సముద్రంలో భారీ నౌకాదళ విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి.
→ ఇందులో భాగంగా తొలిసారి ఉమ్మడిగా సాగర గస్తీని నిర్వహిస్తున్నాయి. ఈ నెల 17 వరకూ కొనసాగుతాయి.
→ 'సీ గార్డియన్స్' పేరుతో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు కరాచీలోని నౌకా స్థావరంలో ప్రారంభ మయ్యాయి.
→ ఇందులో భాగంగా గగనతలంలోనూ యుద్ధ క్రీడలు నిర్వహిస్తున్నారు.
→ హెలికాప్టర్ల ల్యాండింగ్, సహాయ, గాలింపు చర్యలు, జలాంతర్గా ముల వేట, పరస్పర పర్యటనలు వంటివి ఈ విన్యా సాల్లో ఉంటాయి.
→ ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం, సంప్రదాయ స్నేహాన్ని బలోపేతం చేయ డంతోపాటు ఇరు సైన్యాల శిక్షణను మరింత సానబెట్టే క్రమంలోనే మూడోసారి ఈ తరహా విన్యాసాలు నిర్వ హిస్తున్నామని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి రూ.24వేల కోట్లతో పథకం

అత్యంత దుర్బల గిరిజన బృందాల (పీవీటీజీ) పరిపూర్ణ సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న ఝార్ఖండ్లో రూ. 24,000 కోట్లతో పథకాన్ని ప్రారంభించనున్నారు.
→ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలు ఉన్నాయి. వారి సంఖ్య 28 లక్షలు.
→ వీరు అడవుల్లో, పర్వతాల్లో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు.
→ ఇప్పటికే 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 11 రకాల సంక్షేమ కార్యక్రమా లను కలగలపి పీవీటీజీలకు వర్తింపజేస్తారు.

బికనేర్ వాలా ఛైర్మన్ 'కాకాజీ' కన్నుమూత

స్వీట్లు, చిరుతిళ్ల బ్రాండ్ బికనేర్వాలా ఛైర్మన్ లాలా కేదార్నాథ్ అగర్వాల్(86) కన్ను మూశారు.
→ ఒక ప్పుడు పాత దిల్లీ ప్రాంతంలో బకెట్లో భుజియా, రస గుల్లాలు పెట్టుకుని విక్రయించిన ఈయన ఆ తర్వాత వ్యాపారాన్ని భారీగా విస్తరించారు.
→ పరిశ్రమ వర్గాల వారు ఈయన్ను కాకాజీ అని ప్రేమగా పిలుస్తుంటారు.
→ 'అగర్వాల్ మృతితో అందరి జీవితాలను రుచితో తట్టిన ఒక శకం ముగిసింద'ని కంపెనీ పేర్కొంది.
→ భారత్లో 60 అవుట్లెట్లతో పాటు అమెరికా, న్యూజిలాండ్, సింగ పూర్, నేపాల్, యూఏఈల్లోనూ కంపెనీకి శాఖలున్నాయి.
→ ఆయన మృతి బికనేర్వా లాకే కాదు.. చిరుతిళ్ల ప్రపంచానికి తీరని లోటు.
→ ఆయన నాయకత్వం, దార్శనికత మాకు ఎప్పటికీ మా వ్యాపార ప్రయాణంలో తోడుంటుందని గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ పేర్కొన్నారు.
→ పెద్ద లక్ష్యంతోనే ఈ స్థాయికి..: బికనేర్లో ఆయన కుటుంబం 1905లో మిఠాయి దుకాణం పెట్టుకున్నారు.
→ పెద్ద లక్ష్యాలున్న అగర్వాల్ తన సోదరుడు సత్యనారాయణ్ అగర్వాల్ తో కలిసి దిల్లీకి వచ్చారు.
→ తొలుత బకెట్లలో ఢిల్లీ వీధుల్లో రసగుల్లాలు, భుజియా అమ్మారు.
→ ఈ రుచులకు ప్రాచుర్యం లభించ డంతో, దిల్లీలోని చాందినీ చౌక్ లో షాపు తెరిచారు.
→ అప్పటి నుంచే బికనేర్ వాలా షాపుగా పేరు పొంది.. ఇప్పటి స్థాయికి ఎదిగారు.
→ కేదార్నాథ్ విలువ లను కొనసాగిస్తామని కాకాజీ పెద్ద కుమారుడు, గ్రూప్ డైరెక్టర్ అయిన మోహన్ అగర్వాల్ పేర్కొన్నారు.

వాహనాలకూ సైబర్ భద్రత

కొన్ని నిర్దిష్ట విభాగాలకు చెందిన నాలుగు చక్రాల వాహనాలు, ప్రయాణికుల వాణిజ్య వాహనాల్లో చిప్ సెట్ల వాడకం, ఇంటర్ నెట్ అనుసంధానత పెరిగింది.
→ ఈ నేపథ్యంలో వాహనాలు కూడా సైబర్ ప్రమాదాలకు గురి కాకుండా చూడడం కోసం ఏకరూప సైబర్ భద్రత, మేనేజ్మెంట్ వ్యవస్థల (సీఎస్ఎమ్ఎస్)ను తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదా రుల మంత్రిత్వ శాఖ (ఎమ్ ఆర్ హెచ్) ప్రతిపాదించి.. ముసాయిదా పత్రాన్ని విడుదల చేసింది.
→ ఈ ప్రకారం.. వాహన తయారీదారు లేదా సంబంధిత ప్రతినిధి సదరు వాహన సైబర్భద్రతకు సంబంధించిన విభాగాన్ని పేర్కొంటూ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది జులై 14న జరిగిన ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండ ర్డ్స్ కమిటీ(ఏఐఎస్సీ) 66వ సమావేశంలో సీఎస్ఎమ్ఎస్ ఉన్న వాహనాలకు అనుమతులు మంజూరు చేయడానికి ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్(ఏఐఎస్)కు రూపక ల్పన చేయడానికి కమిటీ అంగీకరించింది.
→ ఎమ్, ఎన్ విభాగాలకు చెందిన మోటార్ వాహనాలకు ఏకరూప నిబంధనలను తీసుకురావడమే ఈ ప్రమా ణాల లక్ష్యమని ముసాయిదా తెలిపింది.
→ వాహనం విక్రయం తర్వాత కూడా సాఫ్ట్వేర్, సర్వీసులు, అప్లి కేషన్లు లేదా డేటా స్టోరీజీ, మార్పులకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
→ సైబర్ దాడుల నుంచి రక్షించే ఉద్దేశంతో ప్రతిపాదించిన ఈ ముసా యిదాను ప్రజల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం నోటిఫై చేస్తారు.

పొగలేని 'ఈ-క్రాకర్'! ను అభివృద్ధి చేసిన ఐఐఐటీహెచ్ పరిశోధకులు

పండుగైనా... పబ్బమైనా పటాకులు పేలిస్తే గానీ మజా ఉండదు.. అదే ఇక దీపావళి పండుగైతే సాయంత్రం మొదలెడితే తెల్లారే దాకా క్రాకర్స్ కాల్చేవారున్నారు.
→ అయితే పటా కులు కాలిస్తే వచ్చే ఆనందం సంగతెలా ఉన్నా పర్యావరణంపై దాని ప్రభావం మాత్రం పడు తుంది.
→ ఈ నేపథ్యంలోనే కాలుష్యం వెలువడని బాణాసంచా తయారీపై ఇంటర్నేషనల్ ఇన్ని ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐఐటీహెచ్) పరిశోధకులు దృష్టి సారించారు.
→ కాలుష్యం వెదజల్లకుండా బాణాసంచా కాల్చిన వైర్ అనుభవాన్ని కలిగించే ఎలక్ట్రానిక్ క్రాకర్ ప్రొటోటై ఎను రూపొందించారు.
→ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్తాబ్ హుస్సేన్ సారథ్యంలో పీహెచీ విద్యార్థి అద్వైత సక్సేనా పర్యావరణహిత 'ఈ-క్రా కర్ ను అభివృద్ధి చేశారు.
→ దీనిపై అఫ్తాబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. 'బాణాసంచా కాల్చిన ఎప్పుడు కాంతి, వెలుగు వెలువడి మనకు ఓ అను భూతి కలుగుతుంది.
→ ఎల్ఎస్ఈడీ మాట్రిక్స్ లైట్లు, స్పీకర్లు, బ్యాటరీ, సర్క్యూట్ను 10 సెంటీమీటర్ల వైశాల్యం గల బాక్సులో అమర్చి లైటింగ్, శబ్దా లను సృష్టించి అదే అనుభూతిని కలిగించే చిన్న లెస్ పరికరాన్ని రూపొందించాం.
→ దీని ద్వారా నిప్పు, పొగ రాని కారణంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పటాకులకు ప్రత్యామ్నాయంగా వినియోగించ వచ్చు.
→ పటాకులు కాల్చినపుడు 1,000 నుంచి 5,000 లక్స్ వెలుగు, 100 నుంచి 140 డెసిబెల్స్ వరకు శబ్దం వెలువడుతుంది.
→ ఈ క్రాకర్లో అమర్చిన ఎల్డీ లైట్ల ద్వారా వెలుగు, వైర్లెస్ స్పీకర్ ద్వారా శబ్దాలు వస్తాయి.
→ వీటి విని యోగం ద్వారా గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది' అని వివరించారు.

భూతాపం పై ఐరాస నివేదిక

భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఐరాస నివేదిక పేర్కొంది.
→ పారిశ్రామికీక రణకు ముందు నాటితో పోలిస్తే అది 2.5 నుంచి 2. 9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే దిశగా పయనిస్తోం దాని వివరించింది.
→ దీన్ని 1.5 డిగ్రీల సెల్సియసు పరి మితం చేయాలన్నది 'పారిస్ ఒప్పంద' లక్ష్యం.
→ ఇందుకు అనుగుణంగా ఈ దశాబ్దం చివరి నాటికి తమ కర్బన ఉద్గారాలను 42 శాతం మేర కుదించు కోవడానికి దేశాలు అంగీకరించాయి.
→ అయితే బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగం వల్ల గత ఏడాది గ్రీన్ హౌస్ వాయువులు 1.2 శాతం మేర పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది.
→ ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబరు చివరి నాటికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్ర తల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ ను దాటేసిన సందర్భాలు 86 రోజుల్లో చోటుచేసుకున్నాయని వివ రించింది.
→ ఆ తర్వాత అక్టోబరు మొత్తం, నవంబరులో మొదటి రెండు వారాల్లో ప్రతి రోజూ ఇదే పరిస్థితి నెలకొందని వివరించింది.
→ దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ 40 శాతం రోజుల్లో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్ర తల్లో పెరుగుదల ఆ స్థాయికి చేరిందని తెలిపింది.
→ శుక్రవారం అది 2 డిగ్రీల సెల్సియసు పెరిగిందని పేర్కొంది.
→ భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరి మితం చేయాలనే లక్ష్యాన్ని.. అనేక సంవత్సరాల లెక్కల ఆధారంగా నిర్దేశించారని శాస్త్రవేత్తలు తెలి పారు.
→ అయితే ఉద్గారాల్లో పెద్దగా పెరుగుదల లేకుం డానే ఆ పరిమితిని 2029లోనే చేరుకోవచ్చని అంత కుముందు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి.
→ దీన్ని నివారించడానికి మరింత కఠినంగా తమ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు లక్ష్యాలను నిర్దేశించు కోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఢిల్లీలో '2+2 మంత్రిత్వశాఖ చర్చలు

రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడా నికి, కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడులు వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచుకోవ డానికి భారత్, ఆస్ట్రేలియా ఢిల్లీలో '2+2 మంత్రిత్వశాఖ చర్చల'ను నిర్వహించాయి.
→ దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లు హాజరయ్యారు.
→ భారత్, ఆస్ట్రేలియా సంబం ధాలను బలోపేతం చేసుకోవడానికి మంత్రులు పర స్పరం తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగీ.. అంతకుముందు 'ఎక్స్'లో పేర్కొన్నారు.
→ వాంగ్.. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సంద ర్శించి, అమర సైనికులకు నివాళులర్పించారు.
→ భారత్,ఆస్ట్రేలియా మధ్య దీర్ఘకాల సైనిక సంబంధాలు ఉన్నా యని ఆయన తెలిపారు.
→ అనేక యుద్ధాల్లో ఇరు దేశాల బలగాలు కలిసి పోరాడాయన్నారు.
→ భారత్, ఆస్ట్రేలియాల రక్షణ మంత్రులు విడిగా సమా వేశమయ్యారు.
→ రెండు దేశాల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం ఉంటే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతకు మేలు చేస్తుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
→ నౌకల నిర్మాణం, విమానాల నిర్వహణ, మరమ్మతుల రంగంలో భాగస్వామ్యానికి అవకాశాలు ఉన్నాయని రాజ్ నాథ్ సూచించారు.
→ కృత్రిమ మేధ, జలాంతర్గాములు, డ్రోన్ల వేట, సైబర్ రంగాల్లో సహకారంపై రెండు దేశాల సైన్యాలు దృష్టి సారించాలన్నారు.
→ హైడ్రోగ్రఫీపై సహ కారం, గాల్లో విమానాలకు ఇంధనం నింపడం వంటి అంశాల్లో భాగస్వామ్యం కోసం జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రమాదపుటంచుల్లోకి బ్రిటన్ అణు జలాంతర్గామి

సాగరంలో సబ్మెరైన్ ఎంత లోతులో ఉందో తెలియజేసే గేజ్ ఒకటి మొరాయించడంతో బ్రిటన్ అణు జలాంతర్గామి అట్లాంటిక్ మహాసాగ రంలో ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది.
→ నిర్దేశిత స్థాయి కన్నా దిగువకు డైవ్ చేసింది. దీంతో అందులోని 140 మంది సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
→ ఈ మేరకు 'ద సన్' పత్రికలో ఒక కథనం ప్రచురిత మైంది. భద్రతా కారణాలరీత్యా ఆ జలాంతర్గామి పేరును, అది ఎంత లోతులోకి వెళ్లిందన్నది వెల్లడిం చలేదు.
→ సబ్మెరైన్ వెనుక భాగంలో పనిచేస్తున్న కొందరు ఇంజినీర్లు రెండో గేజ్ సాయంతో వాస్తవ లోతును గుర్తించి, అప్రమత్తం చేసేవరకూ దాని పయనం కొనసాగింది.
→ అయితే అది జలాంతర్గామి కార్యకలాపాలు సాగించదగ్గ లోతేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
→ మరింత దిగువకు వెళితే మాత్రం అత్యవసర పరిస్థితి ఉత్పన్నమయ్యేదని వివరించాయి.
→ ఈ సబ్ మెరైన్ లో ట్రైడెంట్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇది దశాబ్దాల నాటి వాన్ గార్డ్ తరగతి జలాంతర్గామి అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అర్జెంటీనా నూతనాధ్యక్షుడిగా జేవియర్ మిలి

అర్జెంటీనాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత జేవియర్ మిలి ఘనవిజయం సాధించారు.
→ మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు.
→ ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు.
→ ఈ మేరకు అర్జెంటీనా ఎన్ని కల సంఘం తెలిపింది. 1983 తరువాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం ఇదే తొలి సారి.
→ తాను అధికారంలోకి వస్తే దేశంలో సమూల మార్పులు తీసుకొస్తానని, ఎగబాకుతున్న ద్రవ్యోల్బ ణాన్ని అదుపు చేస్తానని మిలి ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రజలు విశ్వసించడంతో ఆయన తిరుగు విజయం పొందారు.

క్రిస్ గోపాలకృష్ణన్కు 'ఐఎస్బీ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డు

'ఐఎస్బీ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డు'కు ఇన్ఫోసిస్ సహ వ్యవ స్థాపకులు, యాగ్జిలార్ వెంచర్స్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ను ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ఎంపిక చేసింది.
→ 24న మొహాలీ కేంపస్లో జరిగే 'ఐఎస్బీ ఇన్ సైట్స్ ఫోరమ్' లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
→ ఈ సందర్భంగా క్రిస్ గోపాలకృ ష్ణన్, రాకేష్ భారతీ మిత్తల్, జాన్ రీడ్ (ఫైనాన్షియల్ టైమ్స్ దక్షిణాసియా ఎడిటర్) తో ప్రత్యేక చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశారు.
→ మనదేశంలో పరిశోధనా కార్యకలాపాలు విస్తృతం కావడానికి, ముఖ్యంగా అంకుర సంస్థల అభివృద్ధికి క్రిస్ ఎంతగానో కృషి చేశారని ఐఎస్బీ పేర్కొంది.

త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించిన NMDC

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్, త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించబోతోంది.
→ ఇప్పటికే ఉన్న గనుల్లో ఆధికో త్పత్తి సాధించే అవకాశాలు ఉండటం, కొత్తగా 2 గనుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 మిలి యన్ టన్నుల ఇనుప ఖనిజం లక్ష్యాన్ని చేరుకో... వచ్చని సంస్థ ఆశిస్తోంది.
→ కొత్త గనుల్లో బచేలి మైనింగ్ ప్రాజెక్టు ఒకటి. ఛత్తీస్గఢ్ ఈ నుంచి అదనంగా 2 మితి యన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయొచ్చని, కర్ణాటకలోని కుమార స్వామి గని నుంచి 2.2 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభిస్తుందని ఎన్ఎండీసీ లిమిటెడ్ సీఎండీ అమితవ్ ముఖర్జీ వెల్లడించారు.
→ ఈ కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైతే, ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాబోదని తెలిపారు.
→ కనీసం 47- 43 మిలి యన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తామని అన్నారు.
→ ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేయడాన్ని ప్రస్తావించారు.
→ రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడి అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు పెద్దఎత్తున మూల పూర్తి దన పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
→ గనుల అభివృద్ధితో పాటు రవాణా, సాంకేతిక పరి జ్ఞానం, ఆధునాతన యంత్ర సామగ్రి సమకూర్చు కోడానికి మూలధన పెట్టుబడి అవసరమని అన్నారు.
→ ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1600 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టాలనే లక్ష్యం ఉండగా, ఇప్పటికే రూ.1,000 కోట్లు వెచ్చించినట్లు వెల్లడిం చారు.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టు బడి రూ.1,800 - రూ.2000 కోట్లకు చేరుకునే అవకా శాలు లేకపోలేదని వివరించారు.
→ వచ్చే 3- 4 ఏళ్లలో ఏటా మూలధన పెట్టుబడి రూ.4,000- 5,000 కోట్లకు చేరుకుంటుం దని అన్నారు.
→ ఇనుప ఖనిజానికి దేశీయ మార్కెట్లో తక్కువ ధర లభిం చడం, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలుకుతూ ఉండటంపై స్పందిస్తూ, తమ వరకూ దేశీయ మార్కెట్లో విక్రయించడం లకు వల్ల అధిక లాభాలు వస్తున్నాయని తెలిపారు.
→ రవాణా ఛార్జీలు, పోర్టు ఛార్జీలు, పన్నులు కలు పుకొని లెక్కిస్తే దేశీయ మార్కెట్లో ఇనుప ఖనిజం అమ్మకాలపై లాబాలు ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతుందని తెలిపారు.
→ ఆస్ట్రేలియాలో ఒక బంగారం గనిలో తవ్వకాలు మొదలు పెట్టినట్లు అమితవ్ ముఖర్జీ తెలి పారు.
→ దీని నుంచి వచ్చే 12- 15 నెలల వ్యవధిలో ఒక టన్ను బంగా రాన్ని ఉత్పత్తి చేయగలమన్నారు.
→ ఇది చిన్నదే అయినప్పటికీ దాని పక్కనే 10 బంగారం గనులు ఉన్నాయని, వాటిని కూడా తీసుకుని, నిర్వ హించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
→ కేవలం ఇనుప ఖనిజం ఉత్పత్తికే పరిమితం కాకుండా అన్ని రకాల ఖనిజాల తవ్వకాన్ని చేపట్టా అనేది తమ ఉద్దేశమని అన్నారు.
→ ఆస్ట్రేలియాలో అక్కడి ఒక కంపెనీ భాగస్వామ్యంతో లిథియమ్ గనుల్లో తవ్వకాలు చేపట్టాలనే ఆలోచన ఉందని తెలిపారు.

2030 నాటికి తగ్గేది 2% ఉద్గారాలే!

హానికారక ఉద్గారాలకు కళ్లెం వేయాలని ఘనంగా లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తే వాటిని సాధించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
→ 2019 నాటితో పోలిస్తే 2030 నాటికి వీటికి 43 శాతం మేర కళ్లెం వేస్తే గానీ తీవ్ర దుష్ప్రభావాలను అడ్డుకోవడం సాధ్యం కాదు.
→ కానీ 2 శాతం మాత్రమే అడ్డుకట్ట సాధ్యమవుతుందని ఐరాస తాజా నివేదిక పేర్కొంది.
→ ఈ శతాబ్దం చివరినాటికి భూతాపంలో పెరు గుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలని 'పారిస్ ఒప్పందం' సూచిస్తోంది.

ఇగ్లా-ఎస్ క్షిపణి వ్యవస్థ!

భుజంపై నుంచి పేల్చే ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది.
→ సరిహద్దుల్లో మోహరించిన సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి దోహదపడతాయని సంబంధిత వర్గాలు తెలి పాయి.
→ ఈ ఆయుధ వ్యవస్థలను దేశంలో ఉత్పత్తి చేయాలని కూడా తలపోస్తున్నట్లు వివరించాయి.
→ భారత త్రివిధ దళాల వద్ద ఇప్పటికే ఇగ్లా గగన తల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
→ శత్రు విమానాలు, హెలికాప్టర్లను కూల్చడానికి అవి ఉపయోగపడ తాయి.
→ ఈ అస్త్రాల పరిధి 5-6 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. వీటిని 1990ల ప్రారంభంలో భారత్ కొనుగోలు చేసింది.
→ తాజాగా సమీకరించనున్న ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక వ్యవస్థ మరింత అధునాతనమైంది. పాత వెర్షన్ స్థానంలో వీటిని ప్రవేశ పెడతారు.

ధూమపానాన్ని వదిలేస్తే మధుమేహ ముప్పు దూరం!

ధూమపానానికి స్వస్థి పలకడం ద్వారా టైప్-2 మధుమేహం ముప్పును 30-40 శాతం మేర తగ్గించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్), అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడీఎఫ్), ఆస్ట్రేలి యాలోని న్యూక్యాజిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొ న్నారు.
→ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ధూమ పానం ప్రభావితం చేస్తుందని ఆధారాలు సూచిస్తున్నట్లు డబ్ల్యూహెచో ఒక ప్రకటనలో పేర్కొంది.
→ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో టైప్-2 మధుమేహం ఒకటి.
→ ఊబకాయం, తగిన స్థాయిలో వ్యాయామం చేయకపోవడం, జన్యుకారణాలు ఇందుకు దోహద పడుతున్నాయి.
→ ప్రపంచవ్యాప్తంగా 53.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు ఐడీఎఫ్ అంచనా. అకాల మరణాలకు కారణమవుతున్న రుగ్మ తల్లో ఇది 9వ స్థానంలో ఉంది.
→ మధుమేహంతో ముడిపడిన గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు సన్నగిల్లడం వంటి సమ స్యలు ధూమపానంతో పెరిగిపోవచ్చని డబ్ల్యూహెచ్త్వో పేర్కొంది.
→ దీనికి తోడు గాయాలు ఆలస్యంగా మానడం, ఇన్ఫెక్షన్ల కారణంగా కాళ్లను తొల గించాల్సి రావడం వంటివి ఉత్పన్నం కావొచ్చని తెలిపింది.
→ అందువల్ల ధూమపానాన్ని మానేయాలని ఐడీఎఫ్ కోరింది.

2030 నాటికి తగ్గేది 2 శాతం ఉద్గారాలే!

హానికారక ఉద్గారాలకు కళ్లెం వేయాలని ఘనంగా లక్ష్యాలు పెట్టు కున్నప్పటికీ ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తే వాటిని సాధించడం కష్ట మేనని నిపుణులు చెబుతున్నారు.
→ 2019 నాటితో పోలిస్తే 2030 నాటికి వీటికి 43 శాతం మేర కళ్లెం వేస్తే గానీ తీవ్ర దుష్ప్రభావాలను అడ్డుకో వడం సాధ్యం కాదు.
→ కానీ 2 శాతం మాత్రమే అడ్డుకట్ట సాధ్యమవుతుం దని ఐరాస తాజా నివేదిక పేర్కొంది.
→ ఈ శతాబ్దం చివరినాటికి భూతా పంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని 'పారిస్ ఒప్పందం' సూచిస్తోంది.
→ లేకుంటే వాతావరణ మార్పుల తీవ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచూ కరవులు, తీవ్ర వడగాల్పులు, భారీ వర్షాలు వంటివి తప్పవు.
→ భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరి మితం చేయాలంటే 2030 నాటికి గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 43 శాతం కోత పడాలి.
→ పారిస్ ఒప్పందానికి అనుగుణంగా ఈ వాయువులు తగ్గింపునకు ప్రపంచ దేశాలు ఎన్ సీల రూపంలో హామీలు ఇచ్చాయి.
→ వీటిని విశ్లేషిం చిన శాస్త్రవేత్తలు.. తాజా నిర్ధారణకు వచ్చారు.

ఎవరెస్ట్ శిఖరం ముందు 21,500 అడుగు ఎత్తు నుంచి దూకిన భారతీయ మహిళా స్కైడైవర్

ప్రముఖ భారతీయ మహిళా స్కైడైవర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్ మహాజన్ (41) తన సాహసోపేత రికార్డు సృష్టించారు.
→ సుప్రసిద్ధ ఎవరెస్ట శిఖరం ముందు... 21,500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి కిందకు దుమికారు.
→ కాలాపత్తర్ లోని ఎత్తైన ప్రదేశం(17,444 అడుగులు) పై విజయవంతంగా ల్యాండయ్యారు.
→ ప్రపంచంలోనే ఈ తరహా భారీ విన్యాసం చేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు.
→ ఎత్తైన ప్రదేశాల్లో స్కైడైవింగ్ తో ఇప్పటికే పలు రికార్డు లను సొంతం చేసుకున్న ఆమె తాజాగా మరో ఘన తనూ సాధించారు.
→ భారీ విన్యాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఫేస్ బుక్ ద్వారా శీతల్ మహాజన్ వెల్లడించారు.

ఏఐజీలో బయో బ్యాంకు ప్రారంభం

ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) లో అతి పెద్ద బయో బ్యాంకు అందుబాటులోకి వచ్చింది.
→ అమెరి కాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు డాక్టర్ లెరోయ్ హుడ్, ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరె డ్డితో కలిసి ఈ బ్యాంకును ప్రారంభిం చారు.
→ వచ్చే పదేళ్లలో అమెరి కాలో 10 లక్షలు, ఏఐజీలో లక్ష మానవ డీఎన్ఏ నమూనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
→ ఇందులో భాగంగా 4పీ (ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, పర్సనలైజ్డ్, పార్టిసిపేటరీ) మెడిసిన్ ప్రధాన భాగం కానుంద న్నారు.
→ దక్షిణ భారతదేశంలోనే తొలిసారి ఏఐజీలో బయో బ్యాంకు ప్రారంభించినట్లు తెలి పారు.
→ ఇందులో 3 లక్షల కంటే ఎక్కువ బయో నమూనాలను 15 ఏళ్లకు పైనే నిల్వ ఉంచవచ్చ

ఉత్తమ అథ్లెట్ రేసులో నీరజ్

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ అథ్లెట్ తుది జాబి తాలో చోటు దక్కిం చుకున్నాడు.
→ కుదిం చిన ఈ లిస్టులో ర్యాన్ క్రూసెర్ (షాట్పుట్, అమెరికా), డుప్లాంటిస్ (పోల్వాల్ట్, స్వీడన్), కెల్విన్ కిష్టామ్ (మారథాన్, కెన్యా), నోవా లేల్స్ (స్ప్రింట్, అమెరికా)తో పాటు నీరజ్ అవార్డు కోసం పోటీపడుతున్నాడు.
→ డిసెం బర్ 11న విజేతను ప్రకటించనున్నారు

సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ కన్నుమూత

సహారా గ్రూప్ వ్యవ స్థాపకులు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ (75) మరణించారు.
→ 1948 జూన్ 10న బిహార్ లోని అరారియాలో జన్మించిన రాయ్.. గోరఖ్ పూర్ లోని గవర్న్ మెంట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
→ ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్ ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్ను 1976లో కొనుగోలు చేసిన రాయ్ 1978 కల్లా దానిని సహారా ఇండియా పరివార్ తీర్చిదిద్దారు.
→ ఆ తర్వాత ఆర్థిక, స్థిరాస్తి, మీడియా, ఆతిథ్య రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిం చారు.
→ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ గ్రూప్ 2014 నుంచి సవాళ్లను ఎదుర్కొంది.
→ మదుపర్ల నుంచి సేకరించిన కోట్ల కొద్దీ నగదును రిఫండ్ చేయాల్సిందిగా సెబీ కోరినప్పటికీ.. అందులో విఫలం కావడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మధ్య రాయ్ తిహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్థానం పొందిన సెహ్వాగ్, డయానా ఎడుల్జీ

భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాకు 2023, నవంబరు 13న ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది.
→ తమ కెరీర్ లో సాధించిన అద్భుత విజయా లకు ఈ ముగ్గురికీ ప్రతిష్టాత్మక గౌరవం ఈ దక్కింది.
→ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్థానం పొందిన భారత తొలి మహిళా క్రికెటర్ గా ఎడుల్జీ రికార్డు సృష్టించింది.

మదుపర్ల సంపద విలువ దాదాపు రూ.276 కోట్లు

ఒక దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు ట్రేడింగ్ కాలాన్ని మన దేశంలో సంవత్ గా వ్యవహరిస్తారు.
→ 2079 సంవత్ ట్రేడింగ్ 2023, నవంబరు 10న పూర్తె ఈ దీపావళి నుంచి 2080 సంవత్ ఈ ప్రారంభమైంది.
→ 2022-23 కాలంలో సెన్సెక్స్ 5,07302 పాయింట్లు (8.47%), నిఫ్టీ 1,694.6 పాయింట్ల (9.55%) చొప్పున లాభాలు నమో దుచేశాయి.
→ ఇదే సమయంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.43.81 లక్షల కోట్లు పెరిగి రూ. 320.29 లక్షల కోట్లకు చేరింది.
→ 2022, అక్టోబరు 24న సంవత్ 2079 ప్రారంభ సమయంలో మదుపర్ల సంపద విలువ దాదాపు రూ.276 కోట్లుగా ఉంది.

భారత్-అమెరికాల రక్షణ, మంత్రుల అయిదో విడత '2+2 చర్చలు' 2023

భారత్-అమెరికాల రక్షణ, మంత్రుల అయిదో విడత '2+2 చర్చలు' 2023, నవంబరు 10న ఢిల్లీలో జరిగాయి.
→ ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
→ ఈ భేటీలో భారత్, అమెరికాలు స్ట్రైకర్ సాయుధ శకటా లను సంయుక్తంగా ఉత్పత్తి చేసే అవకాశంపై చర్చ జరిగింది.
→ స్ట్రైకర్ అనేది 8 చక్రాలతో నడిచే సాయుధ పోరాట శకటం. జన రల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తోంది.
→ రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా సైనికుడు స్టువార్ట్ ఎస్ స్ట్రైకర్, వియత్నాం పోరులో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రాబర్ట్ ఎఫ్ స్ట్రైకర్ ల పేరును ఈ శకటానికి పెట్టారు.
→ దీని వేగం గంటకు 100 కి.మీ.; పరిధి: 480 కి.మీ.; బరువు: 19 టన్నులు.

న్యూయార్క్ పాఠశాలల్లో ఇక దీపావళికి సెలవు

అమెరికాలోని న్యూయార్క్' రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు తీపి కబురు అందించింది.
→ ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసు కుంది.
→ ఈ మేరకు గవర్నర్ కేథీ హోచుల్ తాజాగా చట్టంపై సంతకం చేశారు.
→ తద్వారా ఇక నుంచి భారతీయ కేలండర్ ప్రకారం పాఠ శాలలు దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది.

అంతరిక్షంలో బ్యాగ్ ను పోగొట్టుకొన్న వ్యోమగాములు

అంతరిక్షంలో బ్యాగ్ ను పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
→ ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చోటు చేసుకుంది.
→ నవంబరు 1వ తేదీన ఐఎస్ఎస్ వ్యోమగా ములు మేజర్ జాస్మిన్ మోఘ్బలి, లోరాల్ ఓహార తొలిసారి స్పేస్ వాక్ నిర్వహించారు.
→ వీరు ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో దాదాపు 6.42 గంటలు గడిపారు.
→ ఈ సమయంలో వారు అంతరిక్ష కేంద్రం హ్యాండ్లింగ్ బార్ను తొలగించి దానిలో బేరింగ్ను రీప్లేస్ చేశారు.
→ అనంతరం వారు తిరిగి స్పేస్ స్టేషన్కు వచ్చేశారు. కొద్దిసేపటికి వారు ఏదో వస్తువును అంతరిక్షంలోనే మర్చిపోయినట్లు గుర్తించారు.
→ ఆ తర్వాత అది టూల్ బ్యాగ్ అని తేలింది. ఈ ఘటనపై నాసా స్పందిస్తూ.. 'మా కార్యకలాపాల్లో ఓ టూల్ బ్యాగ్ పోగొట్టుకున్నాం' అని పేర్కొంది.
→ ఈ బ్యాగ్ అన్ని స్పేస్ వాక్ లకు అవసరం లేదని వెల్లడించింది.
→ ఈ బ్యాగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొనే ముప్పు అతి స్వల్పంగా ఉందని మిషన్ కంట్రోల్ వెల్లడించినట్లు వివరించింది.
→ ప్రస్తుతం ఈ బ్యాగ్ భూమికి 250 మైళ్ల ఎత్తున అంతరిక్షంలో తిరుగుతోంది.
→ ఈ ఘటనపై అంతరిక్షంలో కార్యకలాపాలను గమనించే 'ఎర్త్ స్కై' అనే వెబ్ సై ట్ స్పందించింది.
→ ఆ కాంతివంతమైన టూల్ బ్యాగ్ అంతరిక్షంలో కొన్ని నెల లపాటు తిరిగి ఆపై మెల్లగా విచ్ఛిన్నమవుతుందని పేర్కొంది.
→ ఆ బ్యాగ్ ఎటువంటి టూల్స్ ఉన్నాయన్న విషయాన్ని నాసా బహిర్గతం చేయలేదు.
→ ఐఎస్ఎస్ టూల్ బ్యాగ్ పోగొట్టుకున్న ఘటన ఇదే మొదటిది కాదు.
→ 2008 లోనూ వ్యోమగాములు స్పేస్ వాక్కు వెళ్లిన సమయంలో టూల్ బ్యాగ్ను పోగొట్టుకున్నారు.
→ ప్రస్తుతం అంతరిక్షంలో సెప్టెంబరు నాటికి దాదాపు 35,000కు పైగా వ్యర్థాలు ఉన్నాయని ఐరోపా స్పేస్ సంస్థ వెల్లడించింది.

ఘన ఇంధన క్షిపణుల తయారీలో ఉత్తర కొరియా ముందంజ

మధ్యశ్రేణి క్షిపణుల కోసం ఘన ఇంధనంతో నడిచే రెండు ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా ప్రక టించింది.
→ ఈ క్షిపణుల కోసం మొదటి దశ ఇంజిన్ను శనివారం, రెండో దశ ఇంజిన్ను పరీక్షించినట్లు అధికార వార్తాసంస్థ ప్రకటిం చింది.
→ ఉత్తర కొరియా వద్ద ఉన్న మధ్యశ్రేణి క్షిపణులు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి.
→ ప్రయోగించేముందు మాత్రమే వాటిలో ద్రవ ఇంధనాన్ని నింపాల్సి ఉంటుంది.
→ క్షిపణుల్లో దీర్ఘకాలం ఈ తరహా ఇంధనాన్ని నిల్వ ఉంచడం సాధ్యం కాదు.
→ ద్రవ ఇంజిన్ క్షిపణులను ఒకచోట నుంచి మరో చోటకు తేలిగ్గా తరలించడమూ కుదరదు.
→ ఘన ఇంధన క్షిపణులతో ఈ సమస్య ఉండదు. వీటిని వేగంగా ప్రయోగించవచ్చు, తరలించవచ్చు. శత్రువు కంటపడకుండా దాచి పెట్టవచ్చు.

రష్యా సాంకేతికత కోసం ప్రయత్నించారా!

ఉత్తర కొరియా వద్దనున్న మధ్యశ్రేణి క్షిపణులలో హ్వాసాంగ్-12 క్షిపణి.. పసిఫిక్ మహా సముద్రంలో అమెరికా ఆధీనంలోని గ్వామ్ దీవిని తాకగలదు. కానీ అది ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది.
→ ఈ ఏడాది మొదట్లో నేరుగా ఆమె రికా ప్రధాన భూభాగాన్ని తాకగల హ్వాసాంగ్-18 క్షిపణినీ ఉత్తర కొరియా పరీక్షించింది.
→ అది ఘన ఇంధనంతో ఎగిరే దూరశ్రేణి ఖండాంతర క్షిపణి.. ఇది భూమ్మీద నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లి, అక్కడినుంచి మళ్లీ భూమి పైకి, అంటే అమెరికాపైకి విరుచుకుపడగలదు.
→ అయితే అంతరిక్షం నుంచి కిందికి వచ్చేటప్పుడు భూ వాతావరణం వల్ల క్షిపణి వేడెక్కిపోతుంది.
→ దూర శ్రేణి ఖండాంతర క్షిపణి ఈ ప్రమాదాన్ని అధిగమించి, గురితప్పకుండా ఆమె రికా స్థావరాలను ఢీకొనడానికి ఉపకరించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉత్తర కొరియా వద్ద ఉందా అని నిపుణులు సందేహిస్తున్నారు.
→ ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా వెళ్లినపుడు ఆ దేశ సాంకే తికత కోసం ప్రయత్నించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
→ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణుల ముప్పును కల సికట్టుగా, సమర్థంగా ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఒప్పందంపై ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, దక్షిణ కొరియా రక్షణ మంత్రి షిన్ వాన్ సిక్ సంతకం చేశారు.

అధిక వేడితో మరణాల పై లాన్సెట్ నివేదిక వెల్లడి

వాతావరణ మార్పులు తెచ్చిపెడుతున్న భూతాపం వల్ల ఏటా మృతుల సంఖ్య ఈ శతాబ్ది మధ్యకాలానికల్లా అయిదు రెట్లు పెరగనున్నది.
→ వడదెబ్బతోపాటు అధిక వేడితో తెచ్చిపెట్టే ఇతర ప్రతికూల పరిస్థితుల వల్ల మరణాలు పెరగనున్నాయని విఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్ లో ప్రచు రితమైన నివేదిక హెచ్చరించింది.
→ మానవ ఆరోగ్యం, వాతావరణ మార్పు లపై లాన్సెట్ ఏటా ఈ నివేదికను వెలువరిస్తోంది.
→ ఈసారి దాని రూపక ల్పనలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, 52 పరిశోధనా సంస్థలకు చెందిన 114 మంది శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు.
→ ప్రస్తుతం సెకనుకు 1,337 టన్నుల బొగ్గు పులుసు వాయువు వాతావరణంలోకి విడుదలవు తోంది.
→ ఈ పరిస్థితిని మార్చకపోతే మానవుల ఆరోగ్యం, మనుగడ ప్రమా దంలో పడతాయి.
→ అధిక ఉష్ణోగ్రతల వల్ల 50 శాతం కార్మిక పని దినాలను కోల్పోవాల్సి వస్తుంది. 2041-60 మధ్యకాలానికల్లా 52.49 కోట్ల మంది ఆహార భద్రతను కోల్పోతారు. నీటి ద్వారా వ్యాపించే అంటు వ్యాధులూ విజృంభిస్తాయి.
→ 1990-2000 కాలంతో పోలిస్తే 65 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పటికే వడ దెబ్బ మరణాలు 85 శాతం పెరిగాయి.
→ 2022తో పోలిస్తే 2040లో కర్బన ఉద్గారాలు 173 శాతం పెరగనున్నాయని నివేదిక తెలిపింది.
→ పరిస్థితి ఇలానే సాగితే 2100 కల్లా భూ ఉష్ణోగ్రత 2.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతుందని హెచ్చరించింది.

పీవీటీజీ పథకం ప్రారంభం

అణగారిన గిరిజనులకు న్యాయం చేసేందుకు దృఢ సంకల్పంతో కృషి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. తద్వారా వారి రుణం తీర్చుకుంటాన న్నారు.
→ దేశాభివృద్ధికి మహిళలు, రైతులు, యువత మధ్యతరగతి, పేదలను బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
→ దేశంలోని ఏ పౌరుడూ ఎటువంటి వివక్షకు గురయ్యే అవకాశం లేకుండా చేసినప్పుడే నిజమైన లౌకికవాదం సాక్షా త్కరిస్తుందని తెలిపారు.
→ ఝార్ఖండ్ లో పర్యటి స్తున్న ప్రధాని మోదీ ఆదివాసీ నాయ కుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా బంటీలో రూ. 24 వేల కోట్లతో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి అత్యంత వెను కబడిన ఆదివాసీ బృందాలకు చేయూత (పీఎం పీవీటీజీ) పథకాన్ని ప్రారంభించారు.
→ దీని ద్వారా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లోని అడవులు, పర్వతాల్లోని 22 వేల మారు మూల గ్రామాల్లో నివసిస్తున్న లక్షల మంది ఆది వాసీల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టనున్నారు.
→ 'పీఎం జన్జతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్', 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' సహా పలు పథకాలను ఆయన ఆరంభిం చారు.
→ ఝార్ఖండ్లో రూ.7,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
→ 1971 బంగ్లాదేశ్ ముక్తి పోరాటంలో పాల్గొని, ప్రస్తుతం సేవల నుంచి తప్పుకున్న మిగ్-211 యుద్ధవిమానాన్ని రాంచీలోని రాజభవన్ వద్ద ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల

రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత కింద రూ.18 వేల కోట్ల నిధులను ప్రధాని మోదీ భూంటీలో విడుదల చేశారు.
→ ఈ పథకం ద్వారా 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున నగదు జమ అవుతుంది.

ఉలిహాతును సందర్శించిన మోదీ:- ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా స్మారక పార్కు, మ్యూజియం ఆవరణలో గల 25 అడుగుల బిర్సా విగ్రహానికి ప్రధాని మోదీ నివా కులర్పించారు.
→ గిరిజనుల ఆత్మగౌరవం కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటాన్ని కొని యాడారు. బిర్సా జన్మస్థలమైన ఉలిహాతును ప్రధాని సందర్శించారు.
→ ఆ ప్రాంతాన్ని సందర్శిం చిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.
→ బిర్సా ముండా జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు నివాళుల ర్పించారు.
→ పార్లమెంటు ఆవరణలో గల బిర్సా ముండా విగ్రహానికి అంజలి ఘటించారు.

గిరిజనుల అభ్యున్నతికి 'పీఎం జనమ్’ పథకం ప్రారంభం

దుర్భల స్థితిలో ఉన్న గిరిజన తెగల (పీవీటీజీ) ఆవాసాలకు రోడ్లు, కరెంటు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి కనీస సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూ.24 వేల కోట్లతో 'పీఎం జనాజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్' (పీఎం జనమ్) పథకాన్ని ప్రారంభించారు.
→ దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న 28 లక్షల మంది పీవీ టీజీలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గిరిజన విముక్తి వీరుడు బిర్సాముండా జయంతి సందర్భంగా జార్ఖండ్ లోని కుంతిలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
→ కేంద్రప్రభుత్వ పథకాలనుఅర్హులైన లబ్ధిదారులకు చేరవేసేందుకు 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర'ను కూడా మోదీ ఇదే వేదికగా ప్రారంభించారు. ఈ మేరకు ఐదు వ్యాన్లకు పచ్చజెండా ఊపారు.
→ 2018లో గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకం కింద వెయ్యి మంది ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పథ కాల గురించి అవగాహన కల్పించారని, ఇదే తరహాలో ప్రస్తుత సంకల్ప్యాత్ర కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
→ ఇదిలాఉండగా, పీఎం- కిసాన్ పథకం 15వ విడత నిధులను మోదీ బుధవారం విడుదల చేశారు.
→ ఈ మేరకు దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికిపైగా రైతులకురూ.18 వేల కోట్ల మొత్తం బదిలీ అయ్యింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ చైనాలో ఆవిష్కరణ

ప్రపంచంలోనే అత్యంత వేగ వంతమైన ఇంటర్నెట్ నెట్వర్కున్న చైనా కంపెనీలు ఆవిష్కరించాయి.
→ ఇది సెకనుకు 1.2 టెరాబైట్స్ వేగంతో డేటాను ట్రాన్స్మిట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు పత్రిక వెల్లడించింది.
→ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన నెట్వర్క్లు సెకనుకు 100 గిగాబైట్ల డేటాను మాత్రమే ట్రాన్స్మి ట్ చేస్తుండగా, నూతన వ్యవస్థ దాదాపు 10 రెట్లు వేగంగా పనిచేస్తోందని పేర్కొంది.
→ ఇటీవల అమెరి కాలో ప్రారంభించిన 5వ జనరేషన్ ఇంటర్నెట్-2 కూడా అత్యధికంగా సెకనుకు 400 గిగాబైట్ల వేగం తోనే డేటాను ప్రసారం చేయగలుగుతోంది.
→ తాజా ప్రాజెక్టును సింఘా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సమష్టిగా అభివృద్ధి చేశాయి.
→ ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ సాయంతో ఈ నెట్వర్క్ను 3 వేల కి.మీ. దూరం ఏర్పాటు చేశారు.
→ ఇది బీజింగ్, వుహా న్, గ్వాంగ్జూ నగరాలను కలుపుతుంది. ఈ నెట్వర్క్ అన్ని రకాల ఆపరేషనల్ టెస్ట్లను పూర్తి చేసుకొని సమర్థంగా పనిచేస్తోంది.
→ ఈ నెట్ వర్క్ పనితీరును హువావే టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ వివ రిస్తూ.. 150 హైడెఫినెషన్ (హెచ్ఐ) సినిమాలకు సమానమైన డేటాను కేవలం ఒక్క సెకనులో పంపిం చగలదని పేర్కొన్నారు.

అంతరిక్షంలోకి రోబో పాము ఎగ్జోబయోలజీ ఎక్స్టెంట్ లైఫ్ సర్వేయర్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఓ వినూత్న రోబోను పరీక్షిస్తోంది. ఇది పామును పోలి ఉండడం గమనార్హం.
→ చంద్రుడు, అంగా రక గ్రహంపై పలు ప్రదేశాలను అన్వేషించడానికి దీన్ని ఉపయోగించనున్నారు.
→ భారత్లో కనిపించే కొండచి లువ ఆకారం, అది కదిలే తీరును స్ఫూర్తిగా తీసుకొని దీన్ని రూపొందించారు.
→ దీని వెనుక భారత మూలా లున్న ఓ ఇంజినీర్ ఆలోచన ఉండటం విశేషం.
→ నాగ్ పుర్లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో 'జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ’ లో పనిచేస్తున్నారు.
→ 'ఎగ్జోబయోలజీ ఎక్స్టెంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్)' పేరుతో పిలుస్తున్న ఈ పాము తరహా రోబో ఆలోచన ఈయనదే.
→ ఎట్లాంటి గరుకు ప్రదేశాల్లోనైనా దూసుకుపోయే సామర్థ్యం దీనికి ఉందని రోహణ్ చెప్పారు.
→ పగుళ్లు, గుహలు, చివరకు నీటి లోపల కూడా ఇది ప్రయాణించగలదని వెల్లడిం చారు.
→ ఇతర గ్రహాలపై జీవాన్వేషణలో ఇది తోడ్పాటు నందిస్తుందని తెలిపారు.
→ ఈఈఎల్ఎస్ ను ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసిన కొండ ప్రదేశాలు, మంచు కొండలపై పరీక్షించినట్లు రోహణ్ చెప్పారు.
→ దీన్ని విప త్తుల సమయంలో సహాయ చర్యల్లోనూ ఉపయోగించు కునే వెసులుబాటు ఉందని వివరించారు.

సుప్రీంకోర్టు ప్రాంగణంలో దివ్యాంగుల మిట్టీ కెఫే

భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రాంగణంలో దివ్యాంగులు నిర్వహించే 'మిట్టీ కెఫే'ను ఈనెల 10న ప్రారంభిం చారు.
→ అందరికీ సమాన అవకాశాలు. కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కెఫే ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
→ బార్ కౌన్సిల్ వారికి మద్దతుగా ఉండాలని ఆయన కోరారు. మిట్టీ కెఫే దేశ వ్యాప్తంగా 38 బ్రాంచీలను నిర్వహి స్తుంది.
→ ఈ కెఫే ఆధ్వర్యంలో కరోనా సమయంలో 60 లక్షల భోజనాలు సరఫరా చేశారు.

మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ

ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్ వెల్ అఫ్గానిస్థాన్ తో నవంబ్ 7న జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు.
→ 128 బంతుల్లో 201 (నాటౌట్) పరుగులు చేసి చరిత్ర సృష్టిం చాడు. వన్డేల్లో ఆరో నంబర్ బ్యాటర్కు ఇదే అత్యధిక స్కోర్.
→ దీంతో కపిల్ దేవ్ (175) రికార్డు బద్దలైంది. వన్డే ప్రపంచ కప్లో ఇది మూడో డబుల్ సెంచరీ. క్రిస్ గేల్ (215). మార్టిన్ గప్తిల్ (237) ఇతడి కంటే ముందు న్నారు.
→ ఈ మ్యాచ్లో మ్యాక్స్ వెల్-కమిన్స్ భాగస్వామ్యం 202. వన్డేల్లో ఎనిమిదో వికె టు ఇదే అత్యుత్తమం.

రీతిక రికార్డు

భారత రెజ్లర్ రీతిక అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియ న్షిప్ విజేతగా నిలిచిన భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
→ అమన్ సెహ్రావత్ (2022-పురు షుల విభాగం చాంపియన్) తర్వాత ఈ ఘనత సాధిం చిన రెండో రెజ్లర్గా నిలిచింది.
→ అల్బేనియాలోని టిరా నాలో జరిగిన ఈ టోర్నీలో మహిళల 76 కేజీల ఫైనల్లో రీతి 9-2 తో కెనెడీ బ్లేడ్స్ (అమెరికా)ను ఓడించింది.

2+2 చర్చలు

భారత్-అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల ఐదోవిడత '2+2 చర్చలు' నవంబర్ 10న ఢిల్లీలో జరిగాయి.
→ (2+2 అంటే ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు) ఈ చర్చల్లో ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యహార శైలి, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఉగ్రవాదం అణచివేత వంటి కీలక అంశాలపై ప్రముఖంగా చర్చించారు.
→ అదేవిధంగా కెనడాలో ఖలిస్థానీ కార్యకలాపాలు, ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్స్ జరిగే నవంబర్ 19న ఎయిరిండియా విమానాలపై దాడులు నిర్వహిస్తామని గురుపత్వంత్ సింగ్ పన్నూ అనే ఖలిస్థానీ తీవ్రవాది విడుదల చేసిన వీడియో గురించి చర్చించారు.
→ ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.

డబ్ల్యూటీఏ విజేత స్వియాటెక్

డబ్ల్యూటీఏ (ఉమెన్స్ టెన్సిస్ అసోసియేషన్స్) ఫైనల్ టోర్నీలో పోలెండ్ స్టార్ ఇగా స్వియాటెక్ విజేతగా నిలిచింది.
→ ఏక పక్షంగా సాగిన ఫైనల్లో 6-1, 6- 0తో జెస్సికా పెగులా (అమెరికా) పై విజయం సాధించింది. ఈ విజయంతో స్వీయాటెక్ నంబర్ వన్గా నిలిచింది.
→ గత పదకొండు మ్యాచ్లలో ఈమె వరుసగా విజయం సాధించింది.

భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్

బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపించిన ఎర్త్ షాట్ బహుమతిని ఈ ఏడాది రెండు భారతీయ సంస్థలు గెలుచుకున్నాయి.
→ ఈ బహుమతిని పర్యావరణ ఆస్కార్గా వ్యవహరిస్తారు. భారత్లో ఆహార వృథాను అరికట్టడానికి కృషి చేస్తున్న ఎస్ఎస్ (సైన్స్ ఫర్ సొసైటీ) టెక్నాలజీస్ సంస్థతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధికి పాటుపడుతున్న భూమిపుత్ర సంస్థకు ఈ బహుమతి లభించింది.
→ వీటితో పాటు యాక్షన్ అండినా (దక్షిణాఫ్రికా), బ్యాటరీ పునర్వినియోగ ప్రాజెక్ట్ జి.ఆర్.ఎస్.టి (హాంకాంగ్), అక్రమ చేపల వేటపై పోరాడుతున్న వైల్డ్ ఎయిడ్ మెరైన్ సంస్థ (అమెరికా)లను కూడా ఈ ఎకో ఆస్కార్లు వరించాయి.

నటుడు చంద్రమోహన్ మృతి

సినీ నటుడు చంద్రమోహన్ (82) నవంబర్ 11న మరణించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్ర శేఖర్.
→ కృష్ణా జిల్లా పమిడిముక్కల స్వగ్రామం. భార్య జలంధర ప్రముఖ నవలా రచయిత్రి. ఇద్దరు కుమార్తెలున్నారు.
→ ఆయన హీరో, సహాయ నటుడు, హాస్య నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నారు.
→ తెలుగు, తమిళం, మలయాళంలో 900 పైగా చిత్రాల్లో నటించారు. 'రంగుల రాట్నం' (1966) చంద్రమోహన్ తొలి చిత్రం.
→ ఆయన రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు.

ఏఐ సలహా సంఘంలో భారతీయులు

కృత్రిమ మేధతో వచ్చే ప్రమాదాలను నివారించి, మాన వాళికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటిం చారు.
→ ఈ సంఘంలో ముగ్గురు భారతీయ ప్రముఖ టెక్ నిపుణులు సభ్యులుగా ఉన్నారు.
→ ఐరాస ప్రధాన కార్యదర్శి దూత అయిన అమన్ దీప్ సింగ్ గిల్, iSPIRT సహ వ్యవస్థాపకుడు శరద్ శర్మ, హరిసింగ్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకురాలు నాజ్నీన్ రజనీ చోటు దక్కించుకున్నారు.

ఫైనల్ ముంగిట వాయుసేన విన్యాసాలు

నవంబర్ 19న అహ్మదాబాద్ లో జరిగే ప్రపంచకప్ ఫైనల్ ముంగిట భారత వాయు సేనకు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు చేయబోతోంది.
→ ఫైనల్ ఆరంభమయ్యే పది నిమిషాల ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
→ సూర్యకిరణ్ తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్ల సమ్మేళనం. గతంలోనూ వివిధ సందర్భాల్లో విన్యాసాలు ప్రదర్శించింది.

భూ వాతావరణంలోకి చంద్రయాన్-3 రాకెట్ భాగం

శ్రీహరికోట నుంచి జులై 14న చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్పీఎం - ఎండి వాహకనౌక పైభాగం భూ వాతావరణంలోకి ప్రవే శించింది.
→ ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో పడి పోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
→ ప్రయోగం జరిగిన 14 రోజుల తరువాత ఈ భాగం భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేలా ఇస్రో ముందే వ్యవస్థను రూపొందించింది.
→ అంతర్జాతీయ సంస్థల మార్గదర్శ కాల ప్రకారం అంతరిక్షంలో వ్యర్థాలు, ప్రమాదాల తీవ్ర తను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
→ అంత రిక్ష ప్రయోజనాలను కాపాడటంలో భారత్ కు ఉన్న నిబద్ధతను ఈ ప్రక్రియ చాటుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సికిల్ సెల్, తలసీమియాలకు జన్యు చికిత్స

సికిల్ సెల్, తలసీమియా వ్యాధులకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యు చికిత్సను ప్రవేశపెట్టిన దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది.
→ క్రిస్పర్ థెరాప్యుటిక్స్, వెర్టెక్స్ ఫార్మస్యూటికల్స్ కలసి సృష్టించిన ప్రప్రథమ జన్యు ఔషధం కాస్ గెవీని పై రెండు వ్యాధుల చికిత్సకు అను మతిస్తున్నట్లు బ్రిటన్ ఔషధ, ఆరోగ్య నియంత్రణ సంస్థ ప్రకటించింది.
→ ఎర్ర రక్త కణాల్లోని హీమోగ్లో బిన్ అనే ప్రోటీన్కు కారణమైన జన్యువుల్లోని లోపాలు సికిల్ సెల్, తలసీమియా వ్యాధులకు దారి తీస్తాయి.
→ రోగి ఎముక మజ్జలోని మూల కణాలను తీసి జన్యులో పాలను సరిచేసి తిరిగి మూలుగలోకి పంపుతారు. దీనికి కాస్ గెవీ మందును ఉపయోగిస్తారు.
→ ఈ చికిత్స చేయిం చుకున్న సికిల్ సెల్ రోగులు ఏడాదిపాటు నొప్పి నుంచి ఉపశమనం పొందారు.
→ తలసీమియా రోగులకు ఏడాది పాటు రక్తం ఎక్కించాల్సిన అగత్యం తప్పింది.

నూతన ఆవిష్కరణలకు టీహబ్ కృషి ఆరు సంస్థలతో ఒప్పందం

రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికి టీహబ్ విశేషంగా కృషి చేస్తోందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
→ గత ఎనిమిదేళ్లలో టీహబ్ స్టార్టప్లకు 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని, 600 కార్పొరేట్ భాగస్వామ్యాలు, 3 వేలకు పైగా స్టార్టప్లకు సహకారం అందించిందని వివరించారు.
→ టీహబ్ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం సోషల్ బిజినెస్, డిజైన్ థింకింగ్, అంతర్జాతీయ సహకారం, భౌగోళిక, స్పేస్ టెక్నాలజీల్లో ఆవిష్కరణ లకు గాను కేర్, కెరీర్ గ్లోబల్, సిడ్బీ, ఫాల్కాన్ ఎక్స్, కేపీఎంజీ, ఏజీఐ సంస్థ లతో వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
→ ఈ సందర్భంగా టీ-బ్రిడ్జ్, టీ-స్కేల్ పేరిట రెండు కార్యక్రమాలు రూపొందించినట్లు టీహబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ తెలిపారు. టీ-బ్రిడ్జ్ అంతర్జాతీయ విభాగమని, అంతర్జాతీయ మార్కెట్లు స్టార్టప్లకు అనుసం ధానం లక్ష్యమన్నారు.
→ టీ-స్కేల్ కింద 25 స్టార్టప్లకు సహకారం అందిస్తా మన్నారు.
→ ఈ కార్యక్రమంలో టీహబ్ వ్యవస్థాపక డైరెక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, సీఐవో సుజిత్, సీడీవో అనిష్ తదితరులు పాల్గొన్నారు.

ఆచార్యులకు పరిశోధన నిధి!

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏర్పాటుకు కసరత్తు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనను పెంచి... ఆసక్తి ఉన్న ఆచార్యులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా పరి
→ శోధన నిధి(రీసెర్చ్ ఫండ్)ని సమకూర్చాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది.
→ గత అయిదారు నెలలుగా ఈ దిశగా కసరత్తు సాగుతుండగా తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆధ్వర్యంలో వర్సిటీల ఉపకులపతులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు.
→ సాధారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్ఓ), యూజీసీ, ఏఐసీటీఈ, డీఆర్డీఏ, బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ ఎస్ఆర్) తదితర విభాగాలు పరిశోధన ప్రాజెక్టులు మంజూరు చేస్తుం టాయి.
→ తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని పరిశోధన కోసం కేటాయించాలనుకొంటోంది.
→ దీనికోసం రూ.25 కోట్ల పరిశోధన నిధిని సమకూర్చేందుకు కసరత్తు చేస్తోంది.
→ ఇందుకు ఎంపిక చేసిన అంశా లపై పరిశోధనలకు ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులను దరఖా స్తుల ద్వారా ఎంపిక చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర అవసరాలకు అనుగు ణంగా ఆయా అంశాలపై పరిశోధన జరపాలని భావిస్తోంది.
→ ఇప్పటికే విధి విధానాల రూపకల్పనకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, ఐఐటీ డైరెక్టర్ ఆచార్య మూర్తి, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, హెచ్సీయూ ఉపకులపతి ఆచార్య బీజే రావు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) డిప్యూటీ డైరెక్టర్ అసీమ్ ప్రకాశ్తో సలహా కమి టీని కూడా నియమించింది.
→ పరిశోధనకు నిధులు అందించడంతోపాటు ఐఐటీ హైదరాబాద్ తదితర సంస్థలతో కలిసి లోతైన పరిశోధనలు ఎలా చేయాలనే అంశంపై ఆచార్యులకు శిక్షణ ఇప్పించాలని, ఆయా వర్సిటీల్లో కావాల్సిన కేంద్రీకృత ల్యాబ్లను నెలకొల్పాలని విద్యాశాఖ భావిస్తోంది.

బిహార్ లో రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బిహార్ అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది.
→ దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65శాతానికి పెరిగింది.
→ ఈ బిల్లు ఆమోదంతో ఈడబ్ల్యూఎస్ వారికి కేంద్రం 10శాతం రిజర్వేషన్ ఇస్తుండగా.. బిహార్ ప్రభుత్వం అందిస్తున్న కోటాతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 75శాతానికి పెరిగాయి.

యునెస్కో సృజనాత్మక నగరాలు

'యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ' (యూసీ సీఎన్) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ (మ ధ్యప్రదేశ్), కోజికోడ్ (కేరళ)తో పాటు ప్రపంచవ్యా ప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది.
→ సంస్కృతి, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నందుకు వీటిని గుర్తించినట్లు యునెస్కో తెలిపింది.

54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటిం చారు.
→ అంతర్జాతీయ విభాగంలో 198 సినిమాలు ప్రదర్శించనున్నారు.

హీరాలాల్ సమారియా

కేంద్ర సమాచార కమిషనర్గా ఉన్న తెలంగాణ కేడరు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ హీరాలాల్ సమారియా ప్రధాన సమాచార కమిషనర్ ప్రమాణ స్వీకారం చేశారు.
→ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 63 ఏండ్ల హీరాలాల్ తో ప్రమాణస్వీకారం చేయించారు.

కేరళకు టూరిజం అవార్డ్

కేరళ రాష్ట్రంలోని పర్యాటక శాఖ సమష్టిగా పనిచేసి ప్రపంచ అవార్డులు సొంతం చేసుకుంది.

వెంకటనాగేశ్వర్ చలసాని

మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని నియమితులయ్యారు.
→ వరుసగా రెండు సార్లు సీఈవోగా వ్యవహరించిన ఎన్ఎస్ వెంకటేష్ స్థానంలో ఆయన బాధ్యతలు చే పడతారు.
→ బ్యాంకింగ్, ట్రెజరీ విభాగంలో చలసానికి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది.

చాముండేశ్వరీ నాథ్

ఆంధ్ర క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ చాముండేశ్వరీ నాథ్ ఐపీఎస్ పాలకమండలి సభ్యుడిగా ఎన్నిక య్యాడు.
→ భారత క్రికెటర్ల సంఘం నిర్వహించిన ఎన్నికల్లో గెలిచి ఐసీఏ ప్రతినిధిగా చోటు దక్కిం చుకున్నాడు.

డబ్ల్యూటీఏ ఫైనల్స్ విజేత

మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) తొలిసారి విజేతగా నిలిచి మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
→ ఫైనల్లో ఆమె జెస్సికా పెగూలాపై విజయం సాధించింది.

ఆసియా మహిళల హాకీ చాంపియన్

ఝార్ఖండ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.
→ ఫైనల్లో 4-0 గోల్స్ తేడాతో జపాన్ జట్టును చిత్తు చేసింది. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ ల్లోనూ భారత్ గెలిచింది.

ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిష్టాత్మక 'ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' టైటిల్ గెలుచుకుంది.

ప్రళయ్ పరీక్ష సక్సెస్

డీఆర్డీవో షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 'ప్ర ళయ్'ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ప్రళయ్ 150 కిలో మీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలు. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు.

అమెరికా సూపర్ అణు బాంబు

ఏడాదిన్నర దాటినా ఆగని రష్యా-ఉక్రే యిన్ యుద్ధంతో పాటు తాజాగా పాలస్తీనా- హమాస్ పోరు.
→ ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అణ్వాయుధ పోటీ మరింత పెంచే దిశగా అమెరికాశక్తివంతమైన సూపర్ అణు బాంబు తయారు చేసినట్టు ప్రకటించింది.

భారతీయ సంస్థలకు ఎర్త్ Oscars

షాట్ బహుమతిని ఈ ఏడాది భారత్ కు చెందిన రెండు సంస్థలతో పాటు మరో మూడు దక్కించుకున్నాయి.
→ పర్యావరణ ఆస్కార్లుగా వ్యవహరించే అవార్డులను ఇండియాకు చెందిన ఎస్ ఎస్ (సైన్స్ ఫర్ సొసైటీ) టెక్నా లజీస్ సంస్థతో పాటు భూపుత్ర సంస్థకు ఎర్త్ షాట్ బహుమతి లభించింది.

ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియా ఆగ్నేయ ప్రాంతంలో భూ కంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది.
→ కుపంగ్ కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

ధూమపానంతో ఏటా భారత్ సహా ఏడు దేశాల్లో 13 లక్షల క్యాన్సర్ మరణాలు!

ధూమపానం కారణంగా క్యాన్సర్ బారినపడి భారత్ సహా ఏడు దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్ల డైంది.
→ ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్స్ ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురిత మయ్యాయి.
→ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపం చుకున్నారు.
→ ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో సగానికి పైగా.. భారత్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశా లోనే సంభవిస్తున్నాయని ఈ కథనం తెలిపింది.
→ ధూమపానం, మద్యపానం, ఊబకాయంతోపాటు పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ ఫెక్షన్లు వంటి ముప్పు అంశాల వల్ల ఏటా 20 లక్షల మందికి పైగా బలవుతు న్నట్లు వివరించింది. ఇవి నివారించదగ్గ కారణాలేనని పేర్కొంది.
→ వీటితో చోటుచేసుకుంటున్న అకాల మర ణాల వల్ల ఏటా 3 కోట్ల ఏళ్ల జీవన కాలానికి గండి పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
→ కేవలం ధూమ పానం వల్లే 2.08 కోట్ల సంవత్సరాల జీవనకాలాన్ని ప్రజలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
→ ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్స ర్ ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నారు.
→ ఇందులో 90 శాతం మరణాలు అల్ప, మధ్యాదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి.
→ సమగ్ర స్క్రీనింగ్, హెచ్పీవీ టీకా కార్యక్రమాలతో వీటిని బాగా తగ్గించొచ్చు.
→ భారత్ లో పురుషుల్లో తల, మెడ క్యాన్సర్తో ఎక్కువ మంది చనిపోతున్నారు.
→ మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థల్లో సంభవించే క్యాన్సర్లతో అధికశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
→ మిగతా దేశాలు. ధూమపానం కారణంగా సంభవిస్తున్న క్యాన్సర్లతోఎక్కువ జీవనకాలాన్ని నష్టపోతున్నాయి.
→ అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్, దక్షిణాఫ్రికాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ తక్కువగా జరుగుతోంది.

సుప్రీంకోర్టు న్యూస్ లెటర్ ను ప్రారంభించిన సీజేఐ

సుప్రీంకోర్టు విధివిధానాలు, చరిత్ర, కోర్టులో కొనసాగుతున్న కేసుల వివరాల్ని తెలియపరిచే ఓ న్యూస్ టర్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ప్రారంభించారు.
→ సుప్రీం కోర్టు క్రానికల్' పేరుతో విడుదలవనున్న ఈ మాస సంచిక కోర్టులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలు స్తుందని సీజేఐ వ్యాఖ్యనించారు.
→ కీలక కేసుల తీర్పు లను, రాత్రి పగలూ కష్టపడి న్యాయవ్యవస్థను కాపా డుతున్న వ్యక్తుల గాథలను ఈ సంచిక ద్వారా తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
→ ఇది కోర్టు పారదర్శక త్వాన్ని, పురోగతిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియప రుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

టైమ్ హరిత వ్యాపారుల జాబితా

కర్బన ఉద్గారాలకు తావు లేకుండా వ్యాపారాలను నిర్వహిస్తున్న హరిత వ్యాపారవేత్తలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నాయకుల జాబితాలో ఎనిమిది మంది భారతీయులు, భారత సంతతికి చెందిన వారు చోటు సాధించారు.
→ ప్రపంచమంతటా వాతావరణ మార్పుల నిరోధానికి తోడ్పడే విధంగా వ్యాపారం చేస్తున్న 100 మంది జాబితాను అమెరికన్ పత్రిక ది టైమ్ మొట్టమొదటిసారిగా ప్రచురించింది.
→ ఈ హరిత యోధుల జాబితాలో బిల్ గేట్స్ దంపతులతో పాటు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, ఓలా ఎలక్ట్రిక్ సహ సంస్థాపకుడు భవీశ్ అగర్వాల్ కూడా ఉన్నారు.
→ ఇంకా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షా, బోస్టన్ కామన్ ఎసెట్ మేనేజ్ మెంట్ సంస్థాపకురాలు గీతా అయ్యర్, అమెరికా ప్రభుత్వ ఇంధన శాఖ రుణ మంజూరు కార్యాలయ సంచాలకుడు జిగర్ షా, హస్క్ పవర్ సిస్టమ్స్ సీఈఓ మనోజ్ సిన్హా, కైజర్ పర్మనెంట్ సంస్థ పర్యావరణ విభాగ ఉన్నతాధికా రిణి సీమా వాధ్వా, మహింద్రా లైఫ్ సైన్సెస్ సీఈఓ అమిత్ కుమార్ సిన్హా కూడా టైమ్ హరిత వ్యాపారవే త్తల జాబితాలో చోటు పొందారు.
→ వాతావరణ మార్పుల నివారణపై అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక దూత జాన్ కెర్రీ పేరు ఈ జాబితాలో ప్రముఖంగా కనిపించింది.

75% 'ప్రైవేటు'లో స్థానికులకు రిజర్వేషన్ల కోటా రాజ్యాంగ విరుద్ధం

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం కోటా అంశంలో హరియాణా ప్రభుత్వా నికి ఎదురుదెబ్బ తగిలింది.
→ దీనిపై రాష్ట్ర సర్కారు 2020లో తెచ్చిన చట్టాన్ని పంజాబ్, హరియాణా హైకోర్టు కొట్టేసింది.
→ ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ జి.ఎస్. సంధావా లియా, జస్టిస్ హర్ ప్రీత్ కౌర్ జీవన్ ల ధర్మాసనం స్పష్టంచేసింది.
→ ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచే ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది.
→ నియామకాల విషయంలో ప్రైవేటు సంస్థలపై నియంత్రణలు విధిస్తూ చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.
→ భారత పౌరుల మధ్య కృత్రిమ అంత రాన్ని సృష్టించి, వివక్ష చూపడం ఆ చర్య ఉద్దే శంగా కనపడుతోందని వ్యాఖ్యానించింది.
→ "రాష్ట్రా నికి చెందినవారు కాదంటూ కొందరు వ్యక్తులపై ప్రభుత్వం వివక్ష చూపడానికి వీల్లేదు.
→ ఉదాహర ణకు.. నిపుణుడైన ఒక కార్పెంటర్ను రాష్టేత రుడు కావడం వల్ల పనిలోకి తీసుకోకుండా ఓ ప్రైవేటు బిల్డర్ను నిలువరించజాలరు.
→ ఉద్యోగాల విషయంలో జనన, నివాస ప్రాంతాల ప్రాతిపది కన వ్యక్తులపై వివక్ష చూపరాదని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది.
→ అయినా స్థానికులకే ఉద్యోగాలివ్వాలని ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వం ఎలా ఒత్తిడి చేయగలదు? ఇలాంటి చర్యల వల్ల దేశ వ్యాప్తంగా ఈ తరహా చట్టాలను తెచ్చి, కృత్రిమ గోడలను నిర్మించే అవకాశం ఉంది.
→ రాజ్యాంగ నిర్మాతలు ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు" అని వ్యాఖ్యానించింది.
→ ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 2020లో నూతన చట్టాన్ని తీసు కువచ్చింది.
→ హరియాణాలో 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు కలిగిన ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్టుల్లో నెలకు రూ.30వేల కన్నా తక్కువ వేతనం కలిగిన ఉద్యోగాలకు ఇది వర్తి స్తుంది.
→ 2022 జనవరి నుంచి ఈ చట్టం అమ లోకి వచ్చింది. దీనిపై ప్రైవేటు రంగం, పారిశ్రా మికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
→ సంబంధిత చట్టాన్ని సవాల్ చేస్తూ పారిశ్రామిక సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
→ ప్రభుత్వ చర్య రాజ్యాంగంలోని 14, 19 అధికరణల్లో పేర్కొన్న హక్కులకు భంగం కలిగి స్తోందని వాదించాయి.
→ ఈ నేపథ్యంలో సంబం ధిత చట్టం అమలుపై స్టే విధిస్తూ గత ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
→ దీన్ని సవాలు చేస్తూ హరియాణా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
→ ఈ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధిం చింది. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.
→ ఈ నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది.

ప్రపంచకప్ ఫైనల్ కు మోదీ, మారెస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మరింత ప్రత్యేకంగా నిలవబోతోంది.
→ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ పోరును స్టేడియానికి వచ్చి వీక్షిం చనున్నారు.
→ ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యం లోని సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ బృందం విన్యాసాలు చేయనుంది.
→ సూర్యకిరణ్ టీమ్ నరేంద్ర మోదీ స్టేడియంలో సాధన చేసింది.
→ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్, గాయని గాయకులు జోనితా గాంధీ, ఆదిత్య నేతృ త్వంలో ఓ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది.
→ టాస్ కు ముందు ముంబ యికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.
→ స్టేడియంలో కనీసం లక్షా 30 వేల మంది అభిమానులు మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉంది.

చిత్రకళా విశ్లేషకుడు గోస్వామి కన్నుమూత

విఖ్యాత చిత్రకళ చరిత్రకారుడు, రచయిత బ్రిజేందర్ నాథ్ గోస్వామి (90) కన్నుమూశారు.
→ చండీ గఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ ఎడ్యుకేషన్- రీసెర్చ్ సంస్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోస్వామి మృతి చెందారు.
→ నెల రోజులుగా ఆయన శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కుటుంబ మిత్రురాలు, రంగస్థల కళా కారిణి నీలం మాన్సింగ్ చెప్పారు.
→ 1933 ఆగస్టు 15న జన్మించిన గోస్వామి పహాడీ శైలి చిత్రకళపై విశ్లేషణలో ప్రసిద్ధుడు. ఆయన్ను పద్మశ్రీ, పద్మభూ షణ్ సత్కారాలూ వరించాయి.
→ ఆయన భార్య కూడా కళా చరిత్రకారిణే. ఆమె 2020లో మరణించారు. గోస్వామికి ఒక కుమార్తె ఉన్నారు.

ఎస్పీజీ అధిపతిగా ఆలోక్ శర్మ

ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతలను చూసే 'ప్రత్యేక భద్రతా దళం' (ఎస్పీజీ) డైరె క్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధి కారి ఆలోక్ శర్మ నియమితులయ్యారు.
→ ఈ మేరకు క్యాబినెట్ నియామ కాల కమిటీ ఆమోదం తెలి పింది.
→ శర్మ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవ హారాల శాఖ పేర్కొంది.
→ ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎస్ పీజీలో అదనపు డైరెక్టర్ జనర ల్గా వ్యవహరిస్తున్నారు.
→ ఈ దళానికి నేతృత్వం వహించిన అరుణ్ కుమార్ సిన్హా సెప్టెంబరు 6న కన్ను మూయడంతో ఆలోక్ శర్మ నియామకం అవసరమైంది.

దేశ ఎగుమతులు అక్టోబరు 2023 లో 33.57 బిలి యన్ డాలర్లు

దేశ ఎగుమతులు 2023, అక్టోబరులో 33.57 బిలి యన్ డాలర్లుగా నమోద య్యాయి.
→ గతేడాది అక్టో బరు ఎగుమతులతో పోలిస్తే ఇవి 6.21 శాతం ఎక్కువ.
→ దిగుమతులు కూడా 57.91 బిలియన్ డాలర్ల నుంచి 12.3 శాతం అధికమై 65.03 బిలి యన్ డాలర్లకు పెరిగాయి.
→ ఫలితంగా దేశ వాణిజ్య లోటు రికార్డు గరి ష్ఠంగా 31.46 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్- అక్టోబరులో ఎగుమ తులు, 2022-23 ఇదే కాలంతో పోలిస్తే 7 శాతం తగ్గి 244.89 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.
→ ఇదే సమయంలో దిగుమతులు కూడా 8.95% తగ్గి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
→ వాణిజ్య లోటు 167.14 బి. డాలర్ల నుంచి 147.07 బి. డాలర్లకు చేరింది.

వన్డే క్రికెట్లో 50 సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి

వన్డే క్రికెట్లో 50 సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.
→ వాంఖడే (మహారాష్ట్ర)లో 2023, నవంబరు 15న న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో కోహ్లి 117 పరుగులు చేసి తన 50వ సెంచరీ నమోదుచేశాడు.
→ మొత్తం ఇన్నిం నే విరాట్ ఈ సాధించాడు. సచిన్ తెందూల్కర్ 452 ఇన్నింగ్స్లో 49 సెంచరీలు చేశాడు.
→ అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరు గులు (13,794) చేసిన ఆటగాళ్లలో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు.
→ సచిన్ (18,426), సంగక్కర (14,234) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Start up ల మధ్య సహకారం కోసం ఒప్పందం

అంకురాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా వినూత్నతను ప్రోత్సహించేందుకు భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది.
→ శాన్ ఫ్రాన్సిస్ కోలో ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో 2023, నవంబరు 15న సంతకాలు జరిగాయి.
→ నియంత్రణ పరమైన ఇబ్బం దులు, ఎంటర్ ప్రెన్యూర్ల నిధుల సమీకరణకు ఉత్తమ విధానాలు వంటివి ఈ ఒప్పందం ద్వారా సరళతరం అవుతాయని భారత ప్రభుత్వం

ఆర్బీఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత

రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ (92) కన్నుమూశారు.
→ చెన్నైలోని ఆయన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. భార్య గిరిజా వైద్యనాథన్.
→ గతంలో ఈయన తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.
→ పూర్వ ట్రావెన్ కోర్ స్టేట్ లోని నాగర్ కోయల్ లో 1931లో జన్మించిన రమణన్.. 1990 నుంచి 1992 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించారు.
→ దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్న కాలంలో గవర్నర్ గా ఉన్నారు.
→ ఆర్బీఐకి గవర్నర్ కాక ముందు 1985 నుంచి 1989 వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
→ భారత్ క్లిష్ట సమయం ఎదుర్కొన్న సమయంలో ఆయన ఆర్బీఐకి గవర్నర్ గా వ్యవహరించారని, ఆయన కాలంలోనే సరళీకరణ ఆర్థిక విధానా లను భారత్ అవలంబించడం ప్రారంభించిందని ఆర్బీఐ తన వెబ్ సైట్ లో పేర్కొంది.

→ 1991 ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిన వెంకిటరమణన్ ఇక లేరు
→ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నటైమ్ లో రూపాయి వాల్యూని తగ్గించి ఎగుమ తులను ప్రోత్సహించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ (92) శనివారం తుది శ్వాస విడిచారు.
→ తన మూడు దశాబ్దాల ఐఏఎస్ కెరీర్లో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు.
→ వెంకిటరమణన్ డిసెంబర్ 1990 డిసెంబర్ 1992 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా పని చేశారు.
→ ఈ టైమ్ లోనే దేశ ఆర్థిక వ్యవస్థ వరస్ట్ క్రైసిస్ ను ఎదుర్కొంది. ఆయిల్ కొనుక్కునే స్థాయిలో కూడా లేదు.
→ మన రూపాయికి వాల్యూ పడిపోవడంతో గోల్డ్ ను తనఖా పెట్టి వివిధ దేశాల నుంచి ఫండ్స్ సేకరిం చాల్సి వచ్చింది.
→ ఈ టైమ్ లోనే పీవీ నరసింహ రావు. నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఎకానమీని లిబరలైజ్ చేసింది.
→ ప్రభుత్వం రిస్ట్రిక్ష న తగ్గించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహిం చింది.
→ వెంకటరమణన్ నాయకత్వంలోని ఆర్ బీఐ రూపాయి విలువను తగ్గించి ఎక్స్పోర్టింగ్ కంపెనీలను ప్రోత్సహించింది.

చంద్రయాన్ -3 మిషన్ భాగస్వామికి పారీకర్ యువ శాస్త్రవేత్త అవార్డు

యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం 'మనోహర్ పారీకర్ యువ శాస్త్రవేత్త' అవార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే.
→ తొలిసారి ఆ అవార్డును ఇస్రో అనుబంధ యూఆర్ రావు శాటి లైట్ సెంటర్ కు చెందిన డా. ఎస్. మాధవరాజ్ కు ఇవ్వ నున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్కుమార్ సావంత్ ఎక్స్ (ట్విటర్)లో ప్రకటించారు.
→ డిసెంబరు 13న మనో హర్ పారీకర్ విజ్ఞాన్ మహోత్సవ్ పేరుతో జరిగే కార్య క్రమంలో అవార్డు ప్రదానం జరుగుతుందని తెలిపారు.
→ చంద్రయాన్-3 మిషన్కు సంబంధించి ఉపగ్రహ పథాన్ని మాధవరాజ్ రూపొందించినట్లు అవార్డు కమిటీ వెల్లడించింది.
→ ఈ అవార్డు గ్రహీతకు నగదు ప్రోత్సాహ కంగా రూ.5 లక్షలు లభిస్తాయి.

జాతీయ ఫార్మసీ కమిషన్

ముసాయిదా బిల్లును విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
→ దేశంలో ఫార్మా విద్య నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
→ దీనికి సంబంధించిన ముసా యిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది.
→ ఇప్పుడున్న ఫార్మసీ యాక్ట్-1948ని రద్దుచేసి, ప్రస్తుతం మను గడలో ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ ను తీసుకురా నుంది.
→ ఫార్మసీ విద్య ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపు ల లభ్యమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
→ దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు తెలిపింది.
→ ఆధునిక పరిశో ధనల దిశగా ఫార్మసీ వృత్తి నిపుణులను ప్రోత్స హించేందుకు ఈ కొత్త బిల్లు బాటలు వేస్తుం దని పేర్కొంది.

కమిషన్ -విధులు:-
→ కొత్తగా ఏర్పడే జాతీయ ఫార్మసీ కమిషన్.... ఫార్మసీ విద్యా సంస్థలను క్రమం తప్పకుండా పరి శీలించి పారదర్శకంగా వాటి పని తీరును అంచనా వేస్తుంది.
→ ఫార్మసీ రిజిష్టర్ నిర్వహిం చేలా నిబంధన విధిస్తారు. ఫార్మసీ సేవల్లో నైతిక ప్రమాణాలను పెంపొం దిస్తారు.
→ ఫిర్యాదుల పరిష్కారం కోసం పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతారు. కమిషన్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది.
→ దీనికి ఒక చైర్మన్, 13 మంది ఎక్స్అఫీషియో సభ్యులు, 14 మంది పార్ట్ టైమ్ సభ్యులు ఉంటారు.
→ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్-2019 తర హాలోనే కేంద్ర ప్రభుత్వం... జాతీయ ఫార్మా కమి షన్ బిల్లు-2023ని రూపొందించింది.
→ వైద్య ఆరోగ్య విద్యను నియంత్రించే సంస్థలను సంస్క రించి దేశంలో నాణ్యమైన వైద్య సేవలను అందు బాటులోకి తేవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
→ ఈ బిల్లుపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ మెయిల్ కు (hrhcell-mohfw@nic.in) పంపొచ్చు.

అతిపెద్ద రాకెట్ ప్రయోగం ‘స్టార్ షిప్' రెండోసారీ విఫలం

మానవులను అంగారకుడు,చంద్రుడిపైకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందిం చిన మెగా రాకెట్ స్టార్షిప్' మళ్లీ నిరాశపరి చింది.
→ రెండోసారి కూడా దీని ప్రయోగం విఫ లమైంది. శనివారం నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్తో సంబంధాలు తెగిపో యాయి. అది పేలిపోయింది.
→ అయితే, విస్ఫోటానికి ముందు అది విజయవం తంగా అంతరిక్షంలోకి ప్రవేశించగలిగింది. అదొ క్కటే ఊరట కలిగించే అంశం.
→ స్టార్షిప్ బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ అనే రెండు దశలు ఉన్నాయి.
→ నిర్దేశిత ప్రణాళిక ప్రకారం.. యింది నింగిలోకి పయనమయ్యాక ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయి.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దిగాలి.
→ బూస్టర్ నుంచి విడిపోయాక స్పేస్ క్రాఫ్ట్ తన పయనాన్ని కొనసాగించి, కక్ష్యలోకి చేరుకోవాలి.
→ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్ర మణం సాగించి, పసిఫిక్ మహాసముద్రంలో పడి పోవాలి.
→ దక్షిణ టెక్సాస్ తీరం నుంచి స్టార్షిప్ నింగిలోకి విజయవంతంగా దూసుకె ళ్లింది.
→ అందులోని 33 రాప్టర్ ఇంజిన్ల ప్రజ్వలన శక్తికి ఆ ప్రాంతంలో ప్రకంపనలు తలెత్తాయి.
→ నిర్దేశిత రీతిలో రాకెట్ సాఫీగానే నింగిలోకి దూసుకెళ్లింది.
→ 2.48 నిమిషాల తర్వాత బూస్టర్ విడిపోయింది. కానీ, ఆ వెంటనే అది పేలిపో యింది.
→ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు దూసుకెళ్లినా.. కొన్ని నిమిషాలకే దానితో కమ్యూనికేషన్ తెగిపోయింది .
→ ఈ నేపథ్యంలో అందులోని ఆటోమేటిక్ వ్యవస్థ దాన్ని పేల్చేసినట్లు సమాచారం.
→ అప్పటికే అది 150 కిలో మీటర్ల ఎత్తుకు చేరింది.
→ ఈ ఏడాది ఏప్రిల్లో స్టార్షిప్ మొదటి ప్రయోగం జరిగింది. నాడు గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అది కూలిపో యింది.
→ స్టార్షిప్ రాకెట్ పొడవు ఏకంగా 121 మీటర్లు (400 అడుగులు) కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ గా పేరుపొం దింది.
→ నాసాకు చెందిన స్పేస్ లాంచ్ సిస్టమ్ కన్నా రెట్టింపు శక్తి దీని సొంతం.

2+2 భేటీలకు ఆస్ట్రేలియా మంత్రుల రాక

ఆస్ట్రేలియా- భారత్ రక్షణ శాఖ, విదేశాంగ మంత్రుల సమావేశాలు సోమ జరగనున్నాయి.
→ ఈ 2+2 సమావే శాల నిమిత్తం ఆస్ట్రేలియా మంత్రులిద్దరూ దిల్లీకి రానున్నారు.
→ ఆస్ట్రేలియా ఉప ప్రధాని రక్షణమంత్రి రిచర్డ్ మార్లెస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ముందుగా అహ్మదాబాద్ కు వెళ్లి రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య జరిగే ప్రపంచ కప్ ఫైనల్ పోటీలు వీక్షిస్తారు.
→ రక్షణ, వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవ హారాల మంత్రి ఎస్. జైశంకర్ తో ఈ నెల 20న చర్చిస్తారు.

టీకాలపై డబ్ల్యూహెచ్ వో నివేదికను తప్పుబట్టిన కేంద్రం

భారత్లో 2022 సంవత్సరంలో 11 లక్షల మంది చిన్నారులు తట్టు తొలిడోజు టీకాలను పొందలే దన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్) నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది.
→ WHO అమెరికా రోగనిరోధక నియంత్రణ కేంద్రం(సీడీసీ) సంయుక్తంగా వెలువరించిన ఈ నివేదిక వాస్తవానికి విరుద్ధంగా ఉందని, నిజానిజాలను ప్రతిబిం బించేలా లేదని పేర్కొంది.
→ 2022-23 ఆర్థిక సంవత్స రంలో 2,63,84,580 మంది చిన్నారుల్లో 2,63,63, 270 మందికి తట్టు తొలిడోజు టీకాలు వేశామని, కేవలం 21,310 మందికి మాత్రమే వేయలేదని ఆరోగ్యశాఖ వివ రించింది.
→ టీకాల విషయంలో ప్రతి రాష్ట్రాన్ని అనుసం ధానం చేసుకుంటూ.. ఎందరు చిన్నారులు టీకాలను పొందారు, ఎంతమంది పొందలేదు అన్న విషయాలపై అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపింది.
→ విస్తృత కార్యాచరణ కార్యాక్రమం ఇంద్రధనుష్ (ఐఎంఐ) 3.0, 4.0లో భాగంగా 2021, 2022 సంవత్సరాల్లో చిన్నారు లకు భారీగా టీకాలు అందించామని వెల్లడించింది.
→ 2023లోనూ ఐఎంఐ 5.0 కార్యక్రమం ద్వారా అయిదేళ్ల లోపు పిల్లలకు టీకాలను ఇచ్చామని తెలిపింది.
→ ఇంద్రధ నుష్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల చిన్నారు లకు టీకాలు అందించామని ప్రకటించింది.

బ్రిటిష్ కాలపు తుపాకులకు చెల్లుచీటీ

ఎన్నడో మూలనపడేసిన బ్రిటిష్ కాలంనాటి తుపాకులను శాశ్వతంగా ధ్వంసం చేయడానికి దిల్లీ పోలీ సులు సన్నద్ధమయ్యారు.
→ మొదట.... పాయింట్ త్రీ నాట్ త్రీ (.303 లీ ఎన్ ఫీల్డ్) రైపి ళ్లను, ఆపైన స్టైన్గాన్లను ముక్కలు చేసి లోహ భాగా లను కరిగిస్తారు.
→ రెండు ప్రపంచ యుద్ధాలలో, 1962 చైనాతో యుద్ధంలో భారత సైన్యం పాయింట్ త్రీ నాట్ త్రీ రైఫిళ్లను వాడింది.
→ ఆపైన వాటిని వదిలేసి ఆధునిక రైఫిళ్లు, మర తుపాకు లను చేపట్టింది. సైన్యం పక్కన పడేసిన ఈ రైఫిళ్లను రాష్ట్ర పోలీసు దళాలకు ఇచ్చారు.
→ 26/11 దాడిలో పాక్ ఉగ్రవాదులు ఆధునిక ఏకె 47లను వాడగా ముంబయి పోలీసులు కాలం చెల్లిన పాయింట్ త్రీ నాట్ త్రీ రైఫి ళ్లతో వారిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు.
→ ఆ దాడి తరువాత మహారాష్ట్ర పోలీసులు పాత తుపాకులను వదిలి ఆధునిక ఆయుధాలు చేపట్టారు.
→ ఢిల్లీ, ఉత్తర్ ప్రదే శీతో సహా పలు రాష్ట్రాల పోలీసు శాఖలు ఇదే పనిచే శాయి.
→ కేంద్ర హోం శాఖ నియ మించిన కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త కమిషనర్ స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణలో త్వరలో 7వేల పాయింట్ త్రీ నాట్ త్రీ రైఫిళ్లను దిల్లీ పోలీ సులు ధ్వంసం చేయనున్నారు.
→ ఈ రైఫిల్ ఒక్కోటీ అయిదు కిలోల బరువు ఉంటుంది. వాటిని ముక్కలుగా విడదీసి, లోహ భాగాలను కరిగిస్తారు. ఇతర భాగాలను ధ్వంసం చేస్తారు.

కొవిడ్ వారియర్లకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం- 2022ను భారత కొవిడ్ వారియర్లు గెల్చుకున్నారు.
→ వారి ప్రతినిధులుగా భారత వైద్య సంఘం (ఐఎంఏ) అధ్యక్షుడు శరద్ కుమార్ అగర్వాల్, భారత ట్రైన్డ్ నర్సుల సంఘం ప్రెసిడెంట్ రాయ్ కె జార్జ్ దీన్ని అందు కున్నాయి.
→ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ పురస్కారాన్ని అంద జేశారు.

ప్రపంచ సరాసరికి మించి భారత్ లో సైబర్ నేరాలు

భారత్ లో సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ సరాసరితో పోలిస్తే ఇవి రెట్టింపు స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.
→ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డి నేటర్ ఎం.యు. నాయర్ శనివారం ఇక్కడ జరిగిన ఒక సదస్సులో మాట్లాడారు.
→ గడిచిన 10 నెలల్లో సరాసరిన 154 కోట్ల డాలర్ల మేర 'ర్యాన్సమ్వేర్ దాడి' చెల్లింపులు జరిగాయని ఆయన చెప్పారు.
→ 2022తో పోలిస్తే ఇది రెట్టింపు అని పేర్కొన్నారు. వెలుగులోకి రాని ఉదంతాలు అనేకం ఉండొచ్చన్నారు.
→ గడిచిన ఆరు నెలల్లో సరాసరిన 2,127 సార్లు సైబర్ ఉల్లంఘనలు జరిగాయని చెప్పారు. ప్రపంచ సరాసరి 1,108గా ఉందని తెలిపారు.
→ ఇలాంటి ఘటనలను నివారించడానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలని కోరారు.

మిస్ యూనివర్స్ 2023 గా పలాసియోస్

మిస్ యూనివర్స్ 2023 టైటిల్స్ఈ ఏడాది నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ సొంతం చేసుకుంది.
→ మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్.. ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించారు.
→ ఈ పోటీల్లో థాయ్లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ , ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండో రన్నరప్ గా నిలిచారు.
→ శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు.
→ మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శార్దా.. టాప్ 20లో నిలిచారు.

భారత ఆర్థిక వృద్ధి 2024-26 ఆర్థిక సంవ త్సరాల్లో ఏటా 6-7.1 శాతం మేర నమోద వుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.
→ 'గ్లోబల్ బ్యాంక్స్ కంట్రీ- బై-కంట్రీ అవుట్లుక్ 2024' పేరిట ఎస్ అండ్ పీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.
→ భారత వాస్తవ జీడీపీ మార్చి త్రైమాసికం నాటి 6.1 శాతంతో పోలిస్తే, జూన్ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరిగింది.

→ ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతలను చూసే 'ప్రత్యేక భద్రతా దళం' (ఎస్ పీజీ) డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ శర్మ 2023, నవంబరు 17న నియమితులయ్యారు.
→ ప్రస్తుతం ఈయన ఎస్పీజీలో అదనపు డైరెక్టర్ జనర ల్గా వ్యవహరిస్తున్నారు. అలోక్ శర్మ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

→ మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మయిజ్జు, ఉపాధ్యక్షుడిగా హెచ్. ఈ హుస్సేన్ మహ్మద్ లతీఫ్ 2023, నవంబరు 17న ప్రమాణస్వీకారం చేశారు.
→ మాలెలోని ప్రఖ్యాత రిపబ్లిక్ స్క్వేర్ వద్ద ఉన్న హుసేన్సెంబేలో ఈ కార్యక్రమం జరిగింది.
→ దీనికి భారత్ తరఫున కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు.

→ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ (92) 2023, నవంబరు 18న మరణించారు.
→ ఈయన 1990 - 92 మధ్య ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. వెంకటరమణన్ పూర్వ ట్రావెన్కోర్ స్టేట్ లోని నాగర్ కోయల్లో 1931లో జన్మించారు. ఆర్బీఐకి గవర్నర్ కాకముందు 1985 నుంచి 1989 వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఈయన తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఈయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న కాలంలోనే భారత్ సరళీకరణ ఆర్థిక విధానాలను అవలంబిం చడం ప్రారంభించింది.

వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఏఐ

ఏఐ(కృత్రిమ మేధ) అనే పదానికి ఇప్పుడున్న అర్థం వేరు.
→ తన మేధస్సుతో మనిషి నిర్వర్తించే విధులకు సరికొత్త మాడల్...'ఏఐ' అంటూ.. కొలిన్స్ డిక్షనరీ నిర్వచించింది.
→ 'ఏఐ' అన్న పదాన్ని 2023 వర్డ్ ఆఫ్ ఇయర్గా ఎంపిక చేసింది.
→ టెక్నాలజీ, డిజి టల్ కల్చర్ను 'ఏఐ' ప్రభావితం చేసినంతగా మరోటి చేయలేదని పేర్కొన్నది.
→ గత ఏడాది నవం బర్లో 'Chat GPT'ని కనుగొన్నాక... ఏఐ పదం పెద్దఎత్తున ప్రచారంలోకి వచ్చింది.
→ ఆన్ లైన్ లో కోట్ల మంది 'ఏఐ' గురించి తెలుసుకుంటున్నారు.

భారత కు ఇగ్లా- ఎస్ యాంటీ

భారత్, రష్యా మిత్రదేశాలుగా కొనసాగుతు న్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగాయి.
→ తాజాగా రష్యా ఇగ్లా- ఎస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ను భారత్కు సర ఫరా చేయనుంది. ఈ విషయాన్ని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
→ హ్యాండ్ హెల్డ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్స్ సరఫరా కోసం ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
→ ఇగ్లాను భారత్లో ఉత్పత్తి చేసేందుకు సైతం అనుమతి ఇచ్చింది.

ముగిసిన భారత్ -బంగ్లాదేశ్ నౌకాదళ విన్యాసాలు

రక్షణ సంబంధాలు మరింత బలపడేలా ఏటా నిర్వహించే ద్వైపాక్షిక విన్యాసాల్లో భారత్-బంగ్లా దేశ్ నౌకాదళాలు సంయుక్తంగా సత్తా చాటాయి.
→ నవంబర్ నెల 7వ తేదీ నుంచి 'బొంగోసాగర్-20 23' పేరుతో ద్వైపాక్షిక విన్యాసాల నాలుగో ఎడి షన్, కార్పాట్-23 పేరుతో సమన్వయ గస్తీ ఐదో ఎడిషను నిర్వహించారు.
→ ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ (ఐఎంబీఎల్) పరిధిలో జరిగిన ఈ విన్యాసాలు నవంబర్ 10న విజయవంతంగా ముగిశాయి.
→ కమ్యునికేషన్ డ్రిల్స్, సముద్ర ఉపరిత లంపై గన్ షూట్స్, యుద్ధ సమయంలో అనుసరిం చాల్సిన వ్యూహాత్మక విన్యాసాల్లో భారత్ నౌకాదళం సత్తా చాటింది.
→ కార్పాట్లో భాగంగా.. విపత్తు సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై రెం డు దేశాలు ఎలా అడుగులు వేయాలన్న అంశాలపై విన్యాసాలు నిర్వహించారు.

జపాన్ సముద్రంలో కొత్త ద్వీపం

జపాన్ దేశ సముద్రం లో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది.. ఓ కొత్త ద్వీపం (ఐలాండ్) ఏర్పడింది.
→ అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడి నిపుణులు పేర్కొంటు న్నారు.
→ ఐవో జిమా దక్షిణ కోస్తా తీరానికి కిలోమీ టరు దూరంలో అక్టోబరు 21న అగ్నిపర్వతం విస్పోటం చెందిందని, అనంతరం పదిరోజుల్లోనే బూడిద, రాళ్లు పేరుకొని 100 మీటర్ల వ్యాసంతో.. సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

75 శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం

ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ.. హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసింది.
→ నవంబర్ 17న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలకు 75 శాతం.. రిజర్వేషన్ ను తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది.
→ హర్యానా స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్- 2020)ను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఈ చట్టానికి అనేక మార్పులు చేశారు.
→ నెలవారీ జీతం రూ.30,000 కంటే తక్కువ ఉండే ప్రైవేట్ రంగం లో.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయిం చాలని ఇందులో పేర్కొన్నారు.

భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 377పై సిఫార్సు

వలస పాలన నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రాతిపాదించిన భారతీయ న్యాయ సం హిత (బీఎన్ఎస్) లో.. మైనర్లతో శారీరక సంబంధా లను, జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగ ణించే ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని పార్ల మెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.
→ వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించేందుకు గాను వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధన లనూ బీఎన్ఎస్ కొనసాగించాలని తెలిపింది.
→ స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తిం చే నిబంధనల్ని చేర్చాలని పేర్కొంది.
→ భాజపా ఎం పీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ (అంతర్గత వ్యవహారాలు) ఈ మేరకు తన నివేది కను నవంబర్ 9న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు అందజేసింది.
→ ఐపీసీ 1860, క్రిమినల్ ప్రాసీ జర్ కోడ్-1898, భారతీయ సాక్ష్యాల చట్టం- 187. 2ల స్థానంలో తీసుకురాదలచిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భార మూడు వారాల కిందట జపాన్లోని సముద్రం తీయ సాక్ష్య అధినియం బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది.
→ అత్యాచారం, సామూహిక దీపావళి పండుగను పురస్కరించుకొని అత్యధిక అత్యాచారం, హత్య తదితర నేరాలకు విధించే శిక్షల విషయంలోనూ కమిటీ పలు సిఫార్సులుచారు.
→ వ్యాధులను ముందుగానే గుర్తించే బయో మార్కర్ల రూపకల్పనకు ఈ మిశ్రమం తోడ్పడుతుం దని పరిశోధకుల బృందం తెలిపింది.
→ వైద్య రంగం తోపాటు సెమీ కండక్టర్లు, నానో ఎలక్ట్రానిక్స్, క్వాం టమ్ సాంకేతికతల అభివృద్ధికి తాజా ఆవిష్కరణ ఉపకరిస్తుందని వివరించింది.

'APt Route - ఐఐటీ మద్రాస్

→మధ్యవర్తులతో పనిలేకుండా, సరుకు రవాణా చేసే వాహనం డ్రైవర్తో నేరుగా మాట్లాడుకునే విధంగా సరికొత్త యాప్ను ఐఐటీ-మద్రాస్ పరిశో ధకులు అభివృద్ధి చేశారు.
→'ఆప్ట్ూట్' అనే యాప్ ద్వారా వినియోగదారుడు ఎలాంటి కమీషన్లు చెల్లిం చకుండానే, డ్రైవర్తో నేరుగా మాట్లాడుకొని సరు కు రవాణా సేవల్ని పొందేందుకు అవకాశముంది..

అయోధ్యలో ఒకేసారి 22.23 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు

→దీపాలు వెలిగించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
→ ఒకేసారి 2.23 లక్షలకు పై గా దీపాలు వెలిగించి.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుంది.
→ సరయూ నదీ తీరంలో దీపా వళికి ఒకరోజు ముందు 'దీపోత్సవ్' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
→ గత ఏడా ది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికా ర్డును ఈ ఏడాది యూపీ ప్రభుత్వం బద్దలుకొట్టింది.
→ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మం దికి పైగా వాలంటీర్లు భాగస్వాములయ్యారు.

జీడీపీ వృద్ధి 6.5 శాతం అంచనా

→ప్రస్తుత 2023-24, వచ్చే 2024-25 ఆర్ధిక సంవ త్సరాల్లో భారత్ జీడీపీ 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాం క్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
→ పటిష్టమైన కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగం బ్యాలెన్స్ షీట్స్ కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థపై అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం పెద్దగా లేదంటూ మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ విడుదల చేసిన 2024 ఇండియా ఎక నామిక్ అవుట్లుక్ లో వివరించింది.
→ దేశీయ డిమాం డ్ భారత వృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం భారత జీడీపీ 6.7 శాతం పెరుగుతుందని అంచనా వేయగా, ఐఎంఎఫ్ 6.3 శాతం వృద్ధి అంచనాల్ని ప్రకటించిం డి. రిజర్వ్ బ్యాంక్ అంచనా 6.5 శాతంగా ఉంది.

స్పెయిన్ ప్రధానిగా పెట్రో ఎన్నిక

→స్పెయిన్ ప్రధానిగా పెడ్రో కాంచెజ్ ఎన్నిక య్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక ప్రధానిగా -వ్యవహరిస్తున్నారు.
→ అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్ జరిగింది.

అవయవ దానంలో అతివల ఔదార్యం

→ఆవయవ దానంలో మహిళలు తమ కుటుంబ సభ్యుల పట్ల అంతులేని ఔదార్యం చూపుతున్నారు.
→ భర్త, తల్లిదండ్రులు, తమ పిల్లలకు అవయ వదానం చేయటానికి వెనుకాడటం లేదు.
→ ఇదే విధ మైన స్పందన మహిళల విషయంలో కుటుంబం లోని ఇతర సభ్యుల నుంచి ఉండటం లేదని.. మన దేశంలో అవయవదానంలో లింగ అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
→ 'నేషనల్ ఆర్గాన్, టిష్యూ ట్రాన్ ప్లాంట్ ఆర్గనైజేషన్'(ఎన్ వోటీటీవో) గణాంకాల్ని ఉటంకిస్తూ.. అవయవదానం చేస్తున్న వారిలో 80. శాతం మంది మహిళలుంటే.. గ్రహీతల్లో 80శాతం పురుషులున్నారని పేర్కొంది.
→ మన దేశంలో 1995 నుంచి 2021 వరకు మొత్తం 38,640 అవయవ మార్పిడి ఆపరేషన్లు జరగ్గా.. ఇందులో 29,000 మంది గ్రహీతలు పురుషులు కాగా, మహిళలు 6,945 మంది మాత్రమే ఉన్నారు.
→ సగటున 5 శస్త్ర చికిత్సల్లో ఒక్కదాంట్లో మాత్రమే మహిళ గ్రహీతగా ఉన్నారని నిపుణులు తెలిపారు.
→ మహిళలపై సామా జిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రభావం, శస్త్ర చికిత్సలంటే వారిలో నెలకొన్న భయం.. లింగ అసమానతలకు దారితీసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

'సెంచరీ'ల రికార్డును బద్దలుకొట్టిన కోహ్లి

అత్యధిక శతకాలు(49) చేసిన దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ను కోహ్లి (50) అధిగమిం చాడు.
→ కోహ్లి 279 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు సృష్టిం చగా.. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్ 49 వన్డే సెంచరీలు నమోదు చేశాడు.
→ ఈ రికార్డును కోహ్లి బద్దలు కొట్టడం ద్వారా అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లి పేరున నమోదైంది.
→ అయినప్పటికీ అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు (టెస్టులు, వన్డేలు కలిపి) మాత్రం సచిన్ పేరుమీదే ఉంది.

2 భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్లు


→బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం స్థాపించిన ఎర్త్ షాట్ బహుమతిని ఈ ఏడాది గెలిచిన అయిదు సంస్థలలో భారత్కు చెందిన రెండు సంస్థలు ఉన్నా యి. పర్యావరణ ఆస్కార్లుగా వ్యవహరించే ఈ బహు మతులను 10 లక్షల పౌండ్ల నగదుతో సింగపూర్ లో ప్రదానం చేశారు. భారతదేశంలో ఆహార వృథాను అరికట్టడానికి కృషి చేస్తున్న ఎస్ఎస్(సైన్స్ ఫర్ సొసై టీ) టెక్నాలజీస్ సంస్థతోపాటు ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధికి పాటుపడుతున్న భూపుత్ర సంస్థకూ ఎర్త్ షాట్ బహుమతి లభించిం ది. ఈ రెండు భారతీయ సంస్థలతోపాటు యాక్షన్ అండినా (దక్షిణాఫ్రికా), బ్యాటరీ పునర్వినియోగ ప్రాజెక్టు జీఆర్ఎస్ఓటీ(హాంకాంగ్, అక్రమ చేపల వేటపై పోరాడుతున్న వైల్డ్ ఎయిడ్ మెరీన్ సంస్థ (ఆ మెరికా)లను కూడా ఈ ఎకో ఆస్కార్లు వరించాయి.

షమి ప్రపంచ రికార్డు

→వన్డే ప్రపంచకప్లో ప్రత్యర్థులపై నిప్పులు చెరు గుతూ భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న టీమిండియా వెటరన్పేసర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు.
→ వరల్డ్ కప్ లో అత్యంత వేగం గా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
→ న్యూజిలాండ్లో వాంఖడే వేదికగా జరుగుతున్న సెమీ ఫైనల్లో కేన్ విలియమ్సన్ వికెట్ తీయడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు.
→ గతంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ పేరిట ఈ రికార్డు ఉండేది.
→ స్టార్క్ 19 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించగా.. షమి కేవలం 17 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు సృష్టించి చరిత్ర లిఖించాడు.

గ్రామీ అవార్డుల్లో నామినేట్ అయిన ప్రధాని పాట

→తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు పాల్గుణి షా(పాలు) రూపొందిం చిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
→ గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయి నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
→ 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' అనే ఈ పాటను ముంబయిలో జన్మిం చిన పాల్గుణి షా రాసి ఆలపించారు.
→ గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా సైతం ఈ పాటలో భాగం పంచుకున్నారు. ఆయన కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
→ ఈ ఏడాది జూన్లో అంతర్జా తీయ తృణధాన్యాల సంవ త్సరం వేడుకల్లో ఈ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.

పరిమితిని దాటిపోనున్న భూతాపం ఐరాస నివేదిక

భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఐరాస నివేదిక పేర్కొంది.
→ పారిశ్రామికీక రణకు ముందు నాటితో పోలిస్తే అది 2.5 నుంచి 2. 9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే దిశగా పయనిస్తోం దాని వివరించింది.
→ దీన్ని 1.5 డిగ్రీల సెల్సియసు పరి మితం చేయాలన్నది 'పారిస్ ఒప్పంద' లక్ష్యం.
→ ఇందుకు అనుగుణంగా ఈ దశాబ్దం చివరి నాటికి తమ కర్బన ఉద్గారాలను 42 శాతం మేర కుదించు కోవడానికి దేశాలు అంగీకరించాయి.
→ అయితే బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగం వల్ల గత ఏడాది గ్రీన్ హౌస్ వాయువులు 1.2 శాతం మేర పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది.
→ ఈ ఏడాది ఆరంభం నుంచి సెప్టెంబరు చివరి నాటికి ప్రపంచ సరాసరి ఉష్ణోగ్ర తల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ ను దాటేసిన సందర్భాలు 86 రోజుల్లో చోటుచేసుకున్నాయని వివ రించింది.
→ ఆ తర్వాత అక్టోబరు మొత్తం, నవంబరులో మొదటి రెండు వారాల్లో ప్రతి రోజూ ఇదే పరిస్థితి నెలకొందని వివరించింది.
→ దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ 40 శాతం రోజుల్లో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్ర తల్లో పెరుగుదల ఆ స్థాయికి చేరిందని తెలిపింది.
→ శుక్రవారం అది 2 డిగ్రీల సెల్సియసు పెరిగిందని పేర్కొంది.
→ భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరి మితం చేయాలనే లక్ష్యాన్ని.. అనేక సంవత్సరాల లెక్కల ఆధారంగా నిర్దేశించారని శాస్త్రవేత్తలు తెలి పారు.
→ అయితే ఉద్గారాల్లో పెద్దగా పెరుగుదల లేకుం డానే ఆ పరిమితిని 2029లోనే చేరుకోవచ్చని అంత కుముందు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి.
→ దీన్ని నివారించడానికి మరింత కఠినంగా తమ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు లక్ష్యాలను నిర్దేశించు కోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

'2+2 చర్చ' ల్లో భారత్, ఆస్ట్రేలియా

→రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడా నికి, కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడులు వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచుకోవ డానికి భారత్, ఆస్ట్రేలియా సోమవారం ఢిల్లీలో '2+2 మంత్రిత్వశాఖ చర్చల'ను నిర్వహించాయి. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్లు హాజరయ్యారు. భారత్, ఆస్ట్రేలియా సంబం ధాలను బలోపేతం చేసుకోవడానికి మంత్రులు పర స్పరం తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగీ.. అంతకుముందు 'ఎక్స్'లో పేర్కొన్నారు.
వాంగ్.. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సంద ర్శించి, అమర సైనికులకు నివాళులర్పించారు.
భారత్,ఆస్ట్రేలియా మధ్య దీర్ఘకాల సైనిక సంబంధాలు ఉన్నా యని ఆయన తెలిపారు.
అనేక యుద్ధాల్లో ఇరు దేశాల బలగాలు కలిసి పోరాడాయన్నారు.
భారత్, ఆస్ట్రేలియాల రక్షణ మంత్రులు విడిగా సమా వేశమయ్యారు.
రెండు దేశాల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం ఉంటే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతకు మేలు చేస్తుందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
నౌకల నిర్మాణం, విమానాల నిర్వహణ, మరమ్మతుల రంగంలో భాగస్వామ్యానికి అవకాశాలు ఉన్నాయని రాజ్ నాథ్ సూచించారు.
కృత్రిమ మేధ, జలాంతర్గాములు, డ్రోన్ల వేట, సైబర్ రంగాల్లో సహకారంపై రెండు దేశాల సైన్యాలు దృష్టి సారించాలన్నారు.
హైడ్రోగ్రఫీపై సహ కారం, గాల్లో విమానాలకు ఇంధనం నింపడం వంటి అంశాల్లో భాగస్వామ్యం కోసం జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

అర్జెంటీనా నూతనాధ్యక్షుడిగా జేవియర్ మిలి


→40 ఏళ్ల తరువాత అత్యంత భారీ మెజారిటీ ఇదే అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత జేవియర్ మిలి ఘనవిజయం సాధించారు.
మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు.
ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు.
ఈ మేరకు అర్జెంటీనా ఎన్ని కల సంఘం తెలిపింది. 1983 తరువాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం ఇదే తొలి సారి.
తాను అధికారంలోకి వస్తే దేశంలో సమూల మార్పులు తీసుకొస్తానని, ఎగబాకుతున్న ద్రవ్యోల్బ ణాన్ని అదుపు చేస్తానని మిలి ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రజలు విశ్వసించడంతో ఆయన తిరుగు విజయం పొందారు. ఫలితాల అనంతరం బ్యూనస్ ఎయిర్స్లో వాహనచోదకులు హార నన్ లు మోగించి తమ వెలిబు మరికొందరు తెచ్చారు.
జాతీయ పతాకాలు, పసుపురంగు గాడ్సే డెన్ జెండాలను చేతబూని పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి సంబరాలు చేసుకున్నారు.

క్రిస్ గోపాలకృష్ణన్ కు 'ఐఎస్బీ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డు


→ 'ఐఎస్బీ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డు'కు ఇన్ఫోసిస్ సహ వ్యవ స్థాపకులు, యాగ్జిలార్ వెంచర్స్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ను ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ఎంపిక చేసింది.
24న మొహాలీ కేంపస్లో జరిగే 'ఐఎస్బీ ఇన్ సైట్స్ ఫోరమ్' లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
ఈ సందర్భంగా క్రిస్ గోపాలకృ ష్ణన్, రాకేష్ భారతీ మిత్తల్, జాన్ రీడ్ (ఫైనాన్షియల్ టైమ్స్ దక్షిణాసియా ఎడిటర్) తో ప్రత్యేక చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశారు.
మనదేశంలో పరిశోధనా కార్యకలాపాలు విస్తృతం కావడానికి, ముఖ్యంగా అంకుర సంస్థల అభివృద్ధికి క్రిస్ ఎంతగానో కృషి చేశారని ఐఎస్బీ పేర్కొంది.

2 కొత్త గనుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలు NMDC


→ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్, త్వరలో రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించబోతోంది.
ఇప్పటికే ఉన్న గనుల్లో ఆధికో త్పత్తి సాధించే అవకాశాలు ఉండటం, కొత్తగా 2 గనుల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నందున, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 మిలి యన్ టన్నుల ఇనుప ఖనిజం లక్ష్యాన్ని చేరుకో... వచ్చని సంస్థ ఆశిస్తోంది.
కొత్త గనుల్లో బచేలి మైనింగ్ ప్రాజెక్టు ఒకటి. ఛత్తీస్ గఢ్ ఈ నుంచి అదనంగా 2 మితి యన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయొచ్చని, కర్ణాటకలోని కుమార స్వామి గని నుంచి 2.2 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభిస్తుందని. ఎన్ఎండీసీ లిమిటెడ్ సీఎండీ అమితవ్ 'ముఖర్జీ 'కాన్ఫెరెన్స్ కాల్'లో మదుపరు లకు ఇటీవల వెల్లడించారు.

ఎమ్మీ అవార్డు అందుకున్న తొలి భారతీయ హాస్య నటుడు


→బాలీవుడ్ హాస్యనటుడు వీర్ దాస్ ఉత్తమ కమెడియన్ గా అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
ఇటీవల న్యూయార్క్ లో జరిగిన 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవా ర్డ్స్, వరల్డ్ టెలివిజన్ ఫెస్టి వల్ 2023 వేడుకలో 'వీర్' దాస్: ల్యాండింగ్' అనే వెబ్ షోకు గానూ ఈ పురస్కా రాన్ని అందుకున్నారాయన. అంతర్జాతీయ ఎమ్మీ అవా ర్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్గా గుర్తింపు పొందారు వీరా దాస్.
బాలీవుడ్లో ఎన్నో విజయ వంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏక్తాకపూర్ 'ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్ట రేట్' అవార్డును సొంతం చేసుకున్నారు.

అడ్వాణీ 26వ సారి


→భారత స్టార్ ఆటగాడు పంకజ్ అడ్వాణీ ప్రపంచ బిలియర్డ్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు.
ఐబీఎస్ ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ లో అడ్వాణీ విజేతగా నిలిచాడు.
ఫైనల్లో ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ కైవసం విజయం సాధించాడు.
ఈ భారత్ కే చెందిన సౌరభ్ కొఠారిపై టోర్నీలో 2003లో తొలిసారిగా విజేతగా నిలిచిన అడ్వాణీ.. టైటిల్ నెగ్గడం ఇది 26వసారి.
అంతకుముందు సెమీస్ లో అడ్వాణీ 900-273తో రూపేశ్ షాపై తిరుగులేని ఆధిపత్యంతో గెలిచాడు.

వన్డే ప్రపంచకప్ ప్రేక్షకుల సంఖ్య పరంగా కొత్త రికార్డు


→భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్ ప్రేక్షకుల సంఖ్య పరంగా కొత్త రికార్డు సృష్టించింది.
ఈ మెగా టోర్నీకి 12 లక్షల 50 వేల 307 మంది ప్రేక్షకులు హాజరయ్యారని ఐసీసీ ప్రకటించింది.
2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకపన్ను 10,16,420 మంది స్టేడియాలకు వచ్చి వీక్షించారు.
అదే 2019 ప్రపంచకప్ చూసుకుంటే ఆ సంఖ్య 7,52,000 మాత్రమే. ఈ సారి టోర్నీ భారత్లో జరిగింది కాబట్టే ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తారు.
ఇక్కడ క్రికెట్ కు ఉండే ఆదరణ అందుకు కారణం. మొత్తం 48 మ్యాచ్లు జరగగా.. ఒక్కో మ్యాచ్కు సగటున 26 వేల మంది హాజరయ్యారు.

వ్యాక్సిన్ తో తగ్గిన ఆకస్మిక మరణాల ముప్పు


→ కొవిడ్-19 వ్యాక్సి స్క్రీన్ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీ ఎంఆర్) అధ్యయనం వెల్ల డించింది.
కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా... ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేల్చింది.
దీనికి సంబంధించిన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రచురితమైంది.
యువతలో ఆక స్మిక మరణాలకు గల కారణాలను విశ్లేషించేందుకు అక్టోబరు 1, 2021 నుంచి మార్చి 31, 2023 మధ్య కాలంలో ఐసీఎంఆర్ ఒక అధ్యయనాన్ని చేపట్టింది.
దీని కోసం ఆకస్మికంగా మరణించిన 18-45 ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను అధ్యయనం చేసింది.
ఇందులో భాగంగా 729 కేసులు, 2,916 కంట్రోల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.
ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసు కున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని తెలిపింది.
కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసు కున్నా... ఈ ముప్పు తగ్గుతుందని నివేదికలో పేర్కొంది.
ఈ ఆకస్మిక మరణాలకు ధూమపానం, తీవ్ర శ్రమ మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం వంటి వాటితోపాటు, కొవిడ్ చికిత్స తర్వాత జీవనశై లిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి కూడా కారణాలు కావచ్చని తెలిపింది..

భారీగా పెరగనున్న కీళ్లు, కండరాల రుగ్మతలు


→2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కీళ్లు, కండ రాలు, ఎముకలు, లిగమెంట్లు, టెండన్లు, వెన్నుపూ సకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారి సంఖ్య వంద కోట్లకు చేరుకోవచ్చని ఓ పరిశోధన తెలిపింది.
2020 నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 115 శాతం పెరుగుదల అని పేర్కొంది.
ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్ రుమటాలజీ'లో ప్రచురిత మయ్యాయి.
2020 నుంచి 2050 మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో కనీసం 50 శాతం మేర ఈ రుగ్మ తలు పెరగొచ్చని వివరించింది.
వాషింగ్టన్ విశ్వవి ద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
కండ రాలు, ఎముకల సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా వైకల్యాలు పెరుగుతున్నాయని వారు తెలిపారు.
పురుషులతో పోలిస్తే మహిళల్లో అవి 47.4 మేర ఎక్కువగా ఉన్నాయని వివరించారు.
వయసుతో పాటు ఆ సమస్యలు పెరుగుతున్నాయని, 65-69 ఏళ్ల మధ్య వయసులో అవి తారస్థాయికి చేరుకుం టున్నాయని తెలిపారు.

కక్ష్యలోకి ఉత్తర కొరియా గూఢచర్య ఉప్రగహం


→ గూఢచర్య ఉపగ్రహం మల్లిగ్యాంగ్-1ను ఉత్తర కొరియా కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది.
ఈ మేరకు ఆ దేశ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారని తెలిపింది.
ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ముందే జపాన్కు తెలియజేసింది.
రాకెట్ శకలాలు జపాన్ తీరంలో కానీ, తూర్పు ఆసియా సముద్ర జలాల్లో కానీ పడతాయేమోనని హెచ్చరించింది.
ఉపగ్రహ ప్రయోగ యత్నాన్ని మానుకోవాలని దక్షిణ కొరియా సూచించినా ఉత్తర కొరియా లెక్కచేయలేదు.
ఈసారి రష్యా లోపాయికారీ సహకా రంతో గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం చేపట్టిందని అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
వీటిని రష్యా, ఉత్తర కొరియాలు తోసిపుచ్చాయి.

సముద్ర గర్భ అన్వేషి వాల్ష్ కన్నుమూత


→మహాసముద్రాలలో అత్యంత లోతైన ప్రాంతానికి ప్రప్రథమంగా చేరుకున్న అమెరికా నౌకాదళ మాజీ అధికారి డాన్ వాల్ష్ (92) ఈ నెల 12న స్వగృహంలో కన్నుమూశారు.
1960లో వాల్ష్, స్విట్జర్లాండ్ ఇంజినీర్ జాక్ పికార్డ్ కలసి 150 టన్నుల ఉక్కు జలాం తర్గామి ట్రియెస్ట్లో పసిఫిక్ మహాసముద్రంలోని అతి లోతైన మేరియానా ట్రెంచ్ ను చేరుకున్నారు.
అది సముద్ర ఉపరితలం నుంచి 11 కిలోమీటర్ల లోతులో ఉంది. ట్రియెస్ట్ అయిదు గంటలసేపు కిందకు దిగుతూ నిర్దేశిత ప్రాంతాన్ని చేరింది.
అక్కడ 20 నిమిషాలసేపు గడిపిన వాల్ష్, పికార్డ్ అంత లోతులో కూడా చేపలు తిరుగుతున్నాయని కనిపెట్టారు.
తరవాత మూడున్నర గంటలు ప్రయాణించి సముద్ర ఉపరితలంపైకి చేరుకున్నారు.

బ్రిక్స్ వర్చువల్ సమావేశం


→ ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణకు తెరదించి, దాడులకు విరమణ పాటించాలని చైనా పిలు పునిచ్చింది.
బందీలుగా ఉన్న పౌరులందరినీ విడిచిపెట్టా లని, కల్లోలిత ప్రాంతంలో దీర్ఘకాల శాంతి కోసం రెండు దేశాలుగా గుర్తించాలని సూచించింది.
పాలస్తీనా ఇజ్రా యేల్ అంశంపై మొదలైన బ్రిక్స్ అసాధా రణ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు.
పాలస్తీనా వాసులకు న్యాయబద్ధమైన హక్కుల్ని పునరుద్ధరించి, స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడం ద్వారా ఘర్షణలకు తెర దించవచ్చని ఆయన చెప్పారు.
పాలస్తీనా అంశానికి సముచితమైన పరిష్కా రాన్ని చూపనిదే పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత సాధ్యం కావన్నారు.
ఆటంకాలు లేనిరీతిలో సురక్షితమైన మానవతా కారిడార్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
తాగు నీరు, విద్యుత్తు, ఇంధనం వంటి సరఫరాలు నిలిపివేసి మొత్తం గాజా ప్రజల్ని శిక్షించడాన్ని తప్పుబట్టారు.
పశ్చి మాసియా స్థిరత్వంపై ప్రభావం చూపిస్తున్న ఘర్షణల్ని నివారించడంలో అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టా లని పిలుపునిచ్చారు.
పౌరులపై దాడుల్ని ఖండించిన ఆయన ఎక్కడా హమాస్ అనే మాట మాత్రం వాడలేదు.
బ్రిక్స్ వర్చువల్ సమావేశానికి హాజరు కాకూడదని భారత ప్రధాని మోదీ నిర్ణయించుకొన్నారు.
ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ కు భారత్ మద్దతు ప్రకటించినా, గాజాలో అమాయకులు బలికావడాన్ని కూడా వ్యతిరేకి స్తోంది.
ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుకు ప్రధాని బదులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు.
గాజాలో ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ తరపున సాయం కొనసాగుతుందని చెప్పారు.
మానవతా సాయం పెద్ద ఎత్తున అందించాల్సిన ఆవసరం ఉందన్నారు.
పౌరుల ప్రాణనష్టాన్ని భారత్ ఖండి స్తోందని, చర్చల ద్వారానే ఘర్షణల్ని పరిష్కరించుకోవా అని చెప్పారు.
దాడుల్ని ఇజ్రాయెల్ ఆపాలని ఐరాస భద్రతా మండలిలో తీర్మానానికి డిమాండ్లు వస్తున్న సమయంలో బ్రిక్స్ బేటీ జరగడం గమనార్హం.

వాణిజ్య శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు వన్ వెబ్ కు అనుమతులు


→దేశంలో వాణిజ్య బ్రాడ్ బ్యాండ్ సేవలకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్- స్పేస్ నుంచి అవసరమైన అనుమతులను భారతీ గ్రూప్ నకు చెందిన ఇండియా పొందింది.
ఆ అను మతులు పొందిన తొలి ప్రైవేటు కంపెనీ తమదేనని ఫ్రాన్స్కు చెందిన యూటెల్ శాట్ గ్రూప్ తో భాగస్వామ్యం అనంతరం యూటెల్ శాట్ వన్ ్వబ్ గా మారిన సంస్థ శాట్ వన్ పేర్కొంది.
కమ్యూనికేషన్ సేవలు అందించడానికి యూటెల్ వెబ్కు అనుమతులు ఇచ్చినట్లు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) వెల్లడించింది. అయిదేళ్ల పాటు ఈ అనుమతులు అమల్లో ఉంటాయి. టెలికాం విభాగం(డాట్) నుంచి స్పెక్ట్రమ్ కేటాయింపులకు లోబడి ఈ కాలవ్యవధి ఉంటుంది. మనదే శంలో అందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావా లన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఇది ఒక కీలక అడుగు అని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. అవసరమైన తుది స్పెక్ట్రమ్ అనుమతులు లభించిన వెంటనే వాణిజ్య సేవలను ప్రారంభిం చడానికి యూటెల్
యూటెల్ శాట్ వన్వెబ్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
శాట్ వన్వెబ్(అంతక్రితం వన్వెబ్)కు 648 శాటిలైట్లు ఉన్నాయి.
ఇవి భూమి చుట్టూ 1200 కి.మీ. ఎత్తులో తిరుగుతూ దేశ వ్యాప్తంగా 21 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించగలవు.
ట్రాయ్ ఛైర్మన్ పదవి అక్టోబరు 1 నుంచి ఖాళీగా ఉంది. ఈ నియామకం తర్వాతే కంపెనీకి స్పెక్ట్రమ్ కేటాయింపు జరగడానికి అవ కాశం ఉంది.

'శంకర్ నేత్రాలయ' బద్రీనాథ్ కన్నుమూత


→ శంకర్ నేత్రా లయ వ్యవస్థాపకులు డాక్టర్ సెంగమేడు శ్రీని వాస బద్రీనాథ్ (83) వృద్ధాప్యం, ఆరోగ్య సమ స్యలతో మంగళవారం చెన్నైలో తుదిశ్వాస విడి చారు.
చెన్నై ట్రిప్లికేన్ లో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన తండ్రి మరణానంతరం అందిన ఇన్సూ రెన్స్ సాయంతో వైద్య విద్య అభ్యసించారు.
డాక్టర్ వసంతి అయ్యంగార్ను 1967 జూన్ 3న వివాహ మాడారు. హెచ్ఎం ఆసుపత్రి, విజయ ఆసుపత్రిలో ఆఫ్తల్మాలజీ సర్జరీ ప్రైవేటు ప్రాక్టీసు చేశారు.
1974లో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సహకారంతో 1978లో మెడికల్ రీసెర్చి ఫౌండేషన్ను స్థాపించారు.
అదే ప్రస్తుతం శంకర నేత్రాలయ మెడికల్ రీసెర్చి ఫౌండేషన్గా ప్రసిద్ధికెక్కింది.
ఆయన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ తోపాటు డాక్టర్ బీసీ రాయ్ జాతీయ పురస్కారం అందుకున్నారు.

ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా నొవాక్ జకోవిచ్


→ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా సెర్బియాకి చెందిన నొవాక్ జకోవిచ్ నిలిచాడు.
ఇతడు ఏడోసారి ఈ ట్రోఫీ అందుకున్నాడు. 2023, నవంబరు 20న ట్యూరిన్ (ఇటలీ)లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జకోవిచ్ జానిక్ సినర్ (ఇటలీ)ని ఓడించాడు.
ఇప్పటి వరకు రోజర్ ఫెదరర్ ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా నిలవగా, జకోవిచ్ దాన్ని అధిగమించి రికార్డు సృష్టించాడు.
2023 ప్రారంభంలో పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడం ద్వారా జకోవిచ్ రికార్డు స్థాయిలో 23వ సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
ఈ ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ నెగ్గాడు.
ఏటీపీ ఫైనల్స్ టోర్నీ గెలవడంతోపాటు, ఏటీపీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
400 వారాలు నంబర్ వన్ గా కొనసాగిన ఆటగాడిగా జకో రికార్డు సృష్టించాడు.
300 వారాల పైన నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన ఆటగాళ్ల జాబితాలో ఒకో తర్వాతి స్థానం రోజర్ ఫెదరర్ (310 వారాలు).

ఇపి 54వ వేడుకలు


→కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (ఇపి) 54వ వేడుకలను 2023, నవంబరు 20న ! గోవాలో ప్రారంభించారు.
పనాజీలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం దీనికి వేదికగా నిలిచింది.
బ్రిటిష్ దర్శకుడు స్టూవర్ట్ గాట్ తీసిన 'క్యాచింగ్ డస్ట్' చిత్ర ప్రదర్శనతో ఇది మొదలైంది.

ఐసీసీ ప్రపంచకప్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ


→ఐసీసీ ప్రపంచకప్ జట్టు కెప్టెన్ గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపిక య్యాడు.
ప్రపంచకప్ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
భారత్ నుంచి విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి ఐసీసీ జట్టులో స్థానం పొందారు.
ఆస్ట్రేలియా నుంచి మ్యాక్స్వెల్, ఆడమ్ జంపాలకు స్థానం లభించింది.

భారత్, ఆస్ట్రేలియా 2-2 మంత్రి త్వశాఖ చర్చలు'


→భారత్, ఆస్ట్రేలియా 2-2 మంత్రి త్వశాఖ చర్చలు' 2023, నవంబరు 120న ఢిల్లీలో జరిగాయి.
దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ లు హాజరయ్యారు.
రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడం, కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడులు ! వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచుకోవడంపై ఇందులో చర్చించారు. కృత్రిమ మేధ, జలాంతర్గాములు, డ్రోన్ల వేట, సైబర్ రంగాల్లో సహ కారంపై రెండు దేశాల సైన్యాలు దృష్టి సారించాలని సమావేశంలో పేర్కొన్నారు.

అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలి


→అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలి ఎన్నికయ్యారు.
2023, నవంబరు 19న జరిగిన ఎన్నికల్లో మొత్తం 30.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు.
ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు.
1983 తరువాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం ఇదే తొలిసారి.

అక్రమ దారులలో భారత్ మూడో స్థానం


→మెక్సికో, ఎల్సాల్వడార్ దేశాల తర్వాత అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు ప్యూ పరిశోధన కేంద్రం వెల్లడిం చింది.
2021 నాటికి 7.25 లక్షల మంది భార తీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నట్లు తెలిపింది.
2007-2021 మధ్యకాలంలో అమెరికాలోకి 1.05 కోట్ల మంది విదేశీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారంది.
వీరిలో అత్యధికంగా మెక్సికన్లు 41 లక్షల మంది ఉన్నారు. ఎల్సాల్వడార్ నుంచి మరో 3 లక్షల మంది వచ్చారు.

అరుణాచల్ 'సంగీత మండూకం'!


→ అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మ పుత్ర (స్థానిక నామం దిహంగ్) నదీతీరంలో శాస్త్రవేత్తలు 'మ్యూజిక్ ఫ్రాగ్' అనే కొత్తజాతి కప్ప లను కనుగొన్నారు.
వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఆడ, మగ కప్పలు రెండూ చప్పుడు చేస్తాయి.
'ఈ కొత్తజాతి కప్పలు రెండు మూడు రకాల చప్పుళ్లతో ప్రత్యేకమైన శబ్ద వ్యవస్థను కలిగి ఉంటాయి.
బ్రహ్మపుత్ర నదీతీరంలో మొదటిసా రిగా వీటి చప్పుళ్లు విన్నాం.
అడవి బాతుల శబ్దాన్ని పోలి ఉన్న ఆ చప్పుడును గతంలో ఎప్పుడూ వినలేదు" అని సైన్స్ పత్రిక జూటా క్సాలో శాస్త్రవేత్తలు రాశారు.
అరుణాచల్ రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తాము సర్వే నిర్వహించామని, ఆ సందర్భంగా ఈ కొత్తజాతి కప్పలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు బిటుపన్ బోరువా, వి. దీపక్, అభిజిత్ దాస్ తెలి పారు.
6 సెం.మీ. మేర పెరిగే ఈ కప్పలకు దేహం మధ్యలో లేత క్రీం రంగులో గీత ఉంటుందన్నారు.

జీ20 వర్చువల్ సమావేశం


→ పశ్చిమాసియాలో నెలకొన్న అభద్రత, అస్థిరతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రాంతీయ ఘర్షణగా రూపాం తరం చెందకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని జీ20 నేతలతో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా సమస్యను రెండు దేశాల విధానం ద్వారా పరిష్కరించాల్సిన అవసరముందన్నారు.
హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు వెలు వడిన ప్రకటన ఆహ్వానించదగిన పరిణామంగా అభివర్ణించారు.
ప్రధాని జీ20 నేతల వర్చువల్ భేటీని ప్రారంభించి ప్రసంగించారు.
ఉగ్ర వాదం ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యమైనది కాదని, అలాగే సాధారణ పౌరులు ఎక్కడ మరణించినా అది ఖండించదగిన అంశమని పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా కొత్త సమస్యలు తలెత్తాయని,పశ్చిమాసియాలో ద్రత, అస్థిర పరి స్ధితులు ఆందోళ నకరమన్నారు.
ఈ వర్చువల్ సమావేశంలో ఐరోపా కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లుల డ సిల్వా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జివా తదిత రులు పాల్గొన్నారు. అన్ని సమస్యలను మనం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వాటి పరిష్కారా నికి కట్టుబడి ఉన్నామని మన కలసికట్టుతనం చెబుతోంది. గతేడాది కాలంగా 'ఒకే భూమి, ఓకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే భావనపై మన మంతా విశ్వాసాన్ని వ్యక్తీకరించాం. వివాదాలకు దూరంగా జరుగుతూ ఐక్యత, సహకారంపై మనం కలిసి కృషి చేశాం" అని మోదీ వ్యాఖ్యానించారు.
కృత్తిమ మేధ (ఏఐ) తో తలెత్తుతున్న ఆందోళ నల నేపథ్యంలో దాని నియంత్రణకు అంతర్జా తీయ నిబంధనలు అవసరమని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఏఐతో ఎదురయ్యే భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు జీ20 దేశాలు కలిసి -పనిచేయాలని పిలుపునిచ్చారు.
"డీప్ ఫేకన్ను నేర గాళ్లు దుర్వినియోగం చేయకుండా నియంత్రించాలి" అని ప్రధాని తెలిపారు.

IMDB మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ 2023 లిస్టు


→ఈ ఏడాది 'పఠాన్, 'జవాన్' సినిమాలతో బాక్సాఫీ సును షేక్ చేశారు బాలీవుడ్ కథానాయకుడు షారుక్ ఖాన్.
సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా కూడా అభిమానులతో సరదాగా ముచ్చ టిస్తూ ఉంటారాయన.
ఈ ఏడాది పాపులర్ ఇండి యన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలి చారు షారుక్.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్ డీబీ) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ 2023 లిస్టు విడుదల చేసింది.
ఈ ఏడాది తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన షారుక్ ఖాన్ ఇందులో అగ్రస్థానంలో నిలిచారు.
ఇక రెండో స్థానంలో ప్రముఖ కథానాయిక అలియా భట్, మూడోస్థానంలో దీపికా పదుకొణె ఉన్నారు.

జస్టిస్ ఫాతిమా బీవి కన్నుమూత


→సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి (96) కన్ను మూశారు.
కొల్లంలో ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.
గతంలో ఆమె తమిళనాడు గవర్నర్ కూడా పనిచేశారు.
జస్టిస్ ఫాతిమా బీవి.. 1927, ఏప్రిల్ 30న కేరళలోని పథనంథి ట్టలో జన్మించారు.
తండ్రి ప్రోత్సాహంతో ఆమె న్యాయవాద విద్య అభ్యసించారు.
1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచే శారు.
1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

భారతీయుడికి పాక్ అత్యున్నత పౌర పురస్కారం

ముంబయి కేంద్రంగా పని చేసే దావూదీ బొహ్ర ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్నా మఫద్దాల్ సైఫుద్దీన్ కు పాకిస్థాన్ అత్యు న్నత పౌర పురస్కారమైన నిషాన్-ఇ-పాకిస్తాన్ లభించింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారం అందుకోనున్న నాలుగో భారతీ యుడు సైఫుద్దీన్.
40 దేశాల్లో విస్తరించి ఉన్న దావూదీ బొహ్ర ఇస్లామిక్ సమాజానికి సైఫుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

పార్లమెంటు సభ్యుల పోర్టల్ లాగిన్ గోప్యతను పాటించాల్సిందే

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తాను వ్యక్తిగతంగా వినియోగించాల్సిన పార్లమెంటు సభ్యుల పోర్టల్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారనే వివాదం నేపథ్యంలో లోక్సభ సచివాలయం కీలక ఆదేశాలు వెలువరించింది.
లాగిన్, పాస్వర్డ్ల విషయంలో సభ్యులు గోప్యత పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
సభ్యులు మాత్రమే వాటిని వినియోగించాలని తెలిపింది.
మహువా తన అధికారిక పాస్వర్డ్ ను బయట వ్యక్తులకు షేర్ చేయడాన్ని నేరంగా పరిగణించాలంటూ నైతిక విలువల కమిటీ నివేదిక సమర్పించిన మరుసటి రోజే లోక్సభ సచివాలయం ఈ మేరకు ఓ బులెటిన్ వెలువరించింది.
సభలో మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా సమాధానంవచ్చే వరకూ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జవాబులు బహిర్గతం కాకూడదని పేర్కొంది.
సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయ్యేవరకూ గోప్యత పాటించాల్సిందేనని నొక్కిచెప్పింది.
దీని పర్యవసానంగా ఇక నుంచి ఎంపీల వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు డిజిటల్ సంసద్ పోర్టల్, యాప్లను వినియో డానికి వీలు ఉండదు.

త్రీడీ ముద్రణకు చౌకైన పరిజ్ఞానం

త్రీడీ ముద్రణను మరింత సమ ర్థంగా, చౌకగా చేపట్టేందుకు ఎక్స్ ట్రూషన్ ఆధారిత మెటల్ ఎడిటివ్ తయారీ ప్రక్రియ ఉపయోగపడు తుందని భారత పరిశోధకులు హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటీ- మండీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
మెటల్ ఎడిటివ్ తయారీ (మెటల్ ఏఎం)లో నున్నటి లోహపు పొడిని వినియోగిస్తారు.
ఈ విధా నంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ) ప్రోగ్రామ్ లు లేదా త్రీడీ స్కానిం గ్ ను ఉపయోగించి పొరలు పొరలుగా సంక్లిష్టమైన విడిభాగాలను తయారుచే స్తారు.
ఏరోస్పేస్, ఆటోమొబైల్, బయోమె డికల్ సాధనాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన పదార్థాలను దీని సాయంతో తయారు చేయవచ్చని పరిశోధనలో పాలు పంచుకున్న నవీన్ కుమార్ బంకపల్లి చెప్పారు.
ప్రత్యేకంగా ఈ పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి, వినియో గంలోకి తీసుకురావడానికి తమ ఆవిష్క రణ దోహదపడుతుందని చెప్పారు.
తద్వారా లోహపు భాగాలను పెద్ద సంఖ్యలో, తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేయ డానికి వీలవుతుందని తెలిపారు.
ముఖ్యంగా తేలికపాటి సాధనాలు అవసర మయ్యే ఏరో స్పేస్ రంగానికి బాగా ఉప యోగపడుతుందని వివరించారు.

శబ్దాలతో రేఖా చిత్రాలను చూడగలిగిన అంధులు

మెదడులోని ఫ్యూజిఫామ్ అనే భాగం ముఖాలను గుర్తించడానికి తోడ్పడుతుంది.
కంటిచూపు కోల్పోయినవారు శబ్దం వంటి వాటి ద్వారా పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలోనే జార్జిటౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇంద్రియ స్పందన ప్రత్యామ్నాయ పరికరాన్ని రూపొందించారు.
మౌలిక దృశ్య సంకేతాలను ఆ పరికరం సాయంతో శ్రవణ సంకేతాలుగా మార్చారు.
ప్రయోగాలలో దాన్ని ఉపయోగించిన అంధులు కార్టూన్ మాదిరి రేఖాచిత్రాలను చూడగలిగారు.
ఈ మార్పు మెదడులో ఏ భాగంలో జరుగుతోందో కనుగొనడానికి ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఎస్ఐ) ని ఉపయోగించారు.
అంధుల మెదడు ఎడమ ప్రాంతంలోని ఫ్యూజిఫామ్ భాగం శబ్దాలను రేఖామాత్ర దృశ్యాలుగా మారుస్తుంటే, సాధారణ వ్యక్తుల్లో అది కుడి ప్రాంతంలో జరుగుతోందని గుర్తించారు.

ఎస్టీల ప్రాతినిధ్యంపై తాజాగా డీలిమిటేషన్ కమిషన్ వేయండి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి సరైన ప్రాతినిధ్యానికి భరోసా కల్పించేలా తాజాగా డీలిమిటేషన్ కమిషన్ను వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
అయితే ఆ కమిషన్ ఇతర వర్గాలకు సరైన ప్రాతినిధ్యం ఆ కల్పించేలా చట్టాలను సవరించాలని పార్లమెంటుకు సూచించకూడదని, చట్టసభల్లో ఎస్టీలకు సంబంధించిన అంశాన్నే పరిశీలించాలని ఆదేశించింది.
ఇతర వర్గాల రిజ ర్వేషన్లపై చట్టం చేసే అధికారం పార్లమెంటుదేనని అభి ప్రాయపడింది.
సిక్కిం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీల్లో లింబు, తమాంగ్ తెగలకు రిజర్వేషన్లను కల్పించాలని దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జె.బి. పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ ఆదేశాలిచ్చింది.
'డీలిమిటేషన్ కమి షన్ ను వేయాలని కేంద్రానికి మేం స్పష్టం చేస్తున్నాం. వాస్తవానికి పార్లమెంటు చేసిన చట్టంపై న్యాయ సమీక్ష మాత్రమే చేయగలం. కానీ ఈ అంశంలో దానిని దాటి వెళ్తున్నాం' అని ధర్మాసనం పేర్కొంది.

ఆసియాన్-ఇండియా మిల్లెట్స్ ఫెస్టి వల్

ఇండోనేసియా రాజధాని జకార్తాలో అయిదు రోజుల తృణధాన్యాల పండగను భారత్ ప్రారంభించింది.
రైతు అనుకూల చిరు ధాన్యాలపై అవగాహన పెంచేందుకు, సుస్థిర ఆహార ఎంపిక, సిరిధాన్యాలతో తయారు చేసే ఆహారోత్ప త్తులకు 10 దేశాల సభ్యత్వం గల ఆసియాన్లో వ్యాపార అవకాశాలు కల్పించేందుకు దీనిని చేప ట్టారు. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి త్వశాఖ, ది ఇండియన్ మిషన్ టూ ఆసియన్
సంయుక్తంగా 'ఆసియాన్-ఇండియా మిల్లెట్స్ ఫెస్టి వల్ ను అయిదు రోజులపాటు నిర్వహిస్తున్నాయి.
ఇందులో భారతకు చెందిన ఎఫ్పీవోలు, అంకుర సంస్థలు, చెఫ్ లు పాల్గొననున్నట్లు అధికారులు వెల్ల డించారు.
సెప్టెంబరు 7న నిర్వహించిన ఇండియన్- ఆసియన్ సదస్సులో 'ఆహార భద్రత'కు పెద్ద పీట వేసినట్లు ఆసియన్ కు భారత రాయబారి జయంత్ భోబ్రగాడే వెల్లడించారు.
ఆసియాన్ లో ఇండోనే సియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్ లాండ్, బ్రునై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా సభ్యదేశాలుగా ఉన్నాయి.

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి కన్నుమూత

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి 2023, నవంబరు 23న మరణించారు. వయసు 96 ఏళ్లు.
1927, ఏప్రిల్ 30న కేర శలోని పథనంథిట్టలో జన్మించారు.
1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
గతంలో ఆమె తమిళనాడు గవర్నర్ కూడా పనిచేశారు.

సైన్నా మఫద్దాల్ సైపుద్దీన్ కు నిషాన్-ఇ- పాకిస్థాన్

ముంబయి కేంద్రంగా పని చేసే దావూదీ బొహ్ర ఇస్లా మిక్ సంస్థ అధిపతి సైన్నా మఫద్దాల్ సైపుద్దీన్ కు పాకి స్థాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్-ఇ- పాకిస్థాన్ లభించింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ 2023, నవంబరు 22న ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ఈ పురస్కారం అందుకోనున్న నాలుగో భారతీయుడు నైపుద్దీన్.
40 దేశాల్లో విస్తరించి ఉన్న దావూదీ బొహ్ర ఇస్లామిక్ సమాజానికి సైపుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

'ఆసియాన్-ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్

'ఆసియాన్-ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్'ను ఇండోనే సియా రాజధాని జకార్తాలో భారత్ 2023, నవంబరు 22న ప్రారంభించింది.
అయిదు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్ను భారత వ్యవసాయ, రైతు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, ది ఇండియన్ మిషన్ టూ ఆసియన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
రైతు అనుకూల చిరుధాన్యాలపై అవగాహన పెంచేం దుకు, సుస్థిర ఆహార ఎంపిక, సిరిధాన్యాలతో తయారు చేసే ఆహారోత్పత్తులకు 10 దేశాల సభ్యత్వం గల ఆసియాన్ వ్యాపార అవకాశాలు కల్పించేందుకు దీనిని చేపట్టారు.
ఆసియాన్ లో ఇండో నేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్ లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా సభ్యదేశాలుగా ఉన్నాయి.

వెలుపలి గెలాక్సీ నుంచి దూసుకొచ్చిన కాస్మిక్ కిరణం

మన పాలపుంత గెలాక్సీకి వెలుపలి నుంచి వచ్చిన ఒక కాస్మిక్ కిరణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే ఇది నిర్దిష్టంగా ఎక్కడి నుంచి దూసుకొచ్చిందన్నది అంతుచిక్కకుండా ఉంది.
వేరే నక్షత్రమండలాల నుంచి వచ్చిన శక్తిమంతమైన కాస్మిక్ కిరణాల్లో ఇదే రెండో స్థానంలో నిలిచింది.
దీనికి 'అమతేరసు' (జపాన్ ఇతిహాసాల్లో సూర్య భగవానుడి పేరు) అని నామకరణం చేశారు.
కాస్మిక్ కిరణాల్లో ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్లు వంటి ఆవేశిత రేణువులు ఉంటాయి. అవి విశ్వంలో కాంతివేగంతో పయని స్తాయి.
ఈ రేణువులు అంతరిక్షంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలకు సంబంధించిన అవశేషాలై ఉండొచ్చని భావిస్తున్నారు.
భూమిని చేరే క్రమంలో అవి మార్గమధ్యంలో ఎక్కడా అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి లోనై ఉండవని, అందువల్ల వాటి మూలా లను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలి పారు.
అమెరికాలోని ఉతా విశ్వవిద్యాలయంలో ఉన్న టెలిస్కోపు ఈ రేణువులను గుర్తించింది.
1991లో వెలుగు చూసిన 'ఓ మై గాడ్ కిరణం.. ఇప్పటివరకూ శక్తిమంతమైన కాస్మిక్ కిరణంగా గుర్తింపు పొందింది.

ఎట్టకేలకు కదిలిన అతిపెద్ద మంచుఫలకం

దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన 'ఎ-23ఎ'.. 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది.
1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడి పోవడం ద్వారా ఎ-23ఎ ఏర్పడింది.
ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. దాని విస్తీర్ణం 4 వేల చదరపు కిలోమీటర్లు.
దుబాయ్ విస్తీర్ణం 4,114 చదరపు కిలోమీ టర్లు. ప్రస్తుతం మంచుఫలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడి.. వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచంలోని చాలా పెద్ద మంచుఫలకాలకు భిన్నంగా.. ఎ-23ఎ తన ఆవి ర్భావం నాటి నుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని వారు పేర్కొన్నారు.

ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ పంకజ్ అడ్వాణీ గ్రాండ్ డబుల్

భారత క్యూ స్టార్ పంకజ్ అడ్వాణీ ప్రపంచ టైటిళ్ల వేట కొనసాగిస్తున్నాడు.
జోరు ప్రదర్శిస్తూ అతడు రోజుల వ్యవధిలో ఒకే వేదికలో మరో బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకుని గ్రాండ్ డబుల్ సాధించాడు.
అంతేకాదు తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను 27కు పెంచుకున్నాడు.
లాంగ్ ఫార్మాట్ లో జరిగిన టైటి ల్ను ఇప్పటికే నెగ్గిన పంకజ్ పాయింట్ ఫార్మాట్ తుది పోరులో 5-0తో సహచర ఆటగాడు సౌరబ్ కొఠారిని ఓడించాడు.
లాంగ్ ఫార్మాట్ లోనూ సౌర ఖ్ నే ఓడించి పంకజ్ టైటిల్ నెగ్గడం విశేషం.
ఈ ఫార్మాట్ లో పంకజ్ కు ఇది అయిదో ప్రపంచ టైటిల్.
గతంలో 2005, 2008, 2014, 2018లో కూడా నెగ్గాడు.
2003లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన పంకజ్.. మొత్తం మీద 17 బిలియర్డ్స్, 10 స్నూకర్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఆసియా స్థాయిలో 10. టైటిళ్లను (7 బిలియర్డ్స్, 3 స్నూకర్) పంకజ్ గెలుచుకు న్నాడు.
బిలియర్డ్స్, స్నూకర్ ఫార్మాట్లలో అడ్వాణీ గెలిచి నన్ని టైటిళ్లు మరే ఆటగాడూ నెగ్గలేదు.

ఎక్స్-50 అమెరికా సూపర్ సోనిక్ జెట్ కు తుదిమెరుగులు

'కంకార్డ్' విమానం తర్వాత ప్రయాణికులను శరవేగంగా గమ్యస్థానాలకు చేర వేసేందుకు మరో సూపర్సోనిక్ లోహవిహంగం సిద్ధమవుతోంది.
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా రూపొందిస్తున్న 'ఎక్స్-50' అనే ఈ విమా నంలో న్యూయార్క్ నగరం నుంచి లండన్ కు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఇది సైద్ధాంతికంగా గంటకు 2,400 కిలోమీటర్ల నుంచి 4,900 కిలోమీ టర్ల వేగాన్ని అందుకోగలదు. పైగా కంకార్డ విపరీతమైన శబ్దం చేయదు.
సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉత్పన్నమయ్యే కర్ణకఠోర 'సోనిక్ బూమ్ 'ను కలిగించకపో వడం దీని ప్రత్యేకత.
ప్రస్తుతం ఈ విమానం పెయింటింగ్ పనుల కోసం ఇటీ వల కాలిఫోర్నియాలోని లాక్ హీడ్ మార్టిన్ కర్మాగారంలో పెయింటింగ్ కేంద్రానికి వెళ్లింది.
అమెరికా జాతీయ జెండాలో కని పించే ఎరుపు, శ్వేత, నీల వర్ణాలతో ఇది దేశానికి గర్వకారణంగా నిలవబోతోందని అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక పెయింట్.. తేమ, తుప్పుపట్టడం వంటి ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు.

ఏడాది చివరిలోగా పీఎస్ఎల్వీ ప్రయోగం

ఏడాది చివరిలోగా పీఎస్ ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
ఈ ఏడాది నవంబరు 21తో తుంబా నుంచి రాకెట్ ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 60వ పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం షార్ లోని మొదటి ప్రయోగ వేది కలో పీఎస్ఎల్వీ వాహకనౌక అనుసంధాన పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
డిసెంబరులో ప్రయోగించ నున్న పీఎస్ఎల్వీ రాకెట్లో పేలోడ్గా ఎక్స్-రే పొలారి మీటర్ (ఎక్స్పోశాట్)ను పంపనున్నారు.
ప్రకాశవంతమైన కాస్మిక్ ఎక్స్-రేలను ఎక్స్పోశాట్ అధ్యయనం చేయనుంది.

తుది దశకు చేరుకుంటున్న ఆదిత్య-ఎల్1

సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన 'ఆదిత్య- ఎల్ తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంటోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
ఈ ఉపగ్రహాన్ని లగ్రాంజ్ పాయింట్-1 (ఎల్1)లో ప్రవేశపెట్టేందుకు నిర్వహిం చాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయన్నారు.
భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరు వనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు.
"ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక తన మార్గంలో దూసుకెళుతోంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో అది దాదాపుగా తుది దశకు చేరుకుంది.
దాన్ని 'ఎల్1 పాయింట్ 'లోకి ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి" అని ఆయన వివరిం చారు.
సూర్యుడిని శోధించేందుకు భారత్ చేపట్టిన తొలి మిషన్ ఇదే. ఎల్-1 పాయింట్.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.

దేశంలోని కొత్త ప్రాంతాలకూ డెంగీ విస్తరణ

జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి రుగ్మతలతో ఇబ్బంది పెట్టే డెంగీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రాణాంతక వ్యాధిగా మారింది.
ఏడిస్ ఈజిప్ట్ దోమల ద్వారా సంక్రమించే డెంగీ వైరస్ కొత్త ప్రాంతాలకూ వేగంగా విస్తరిస్తోంది.
ముఖ్యంగా దేశం లోని ఈశాన్య రాష్ట్రాల వారికి కొన్నేళ్ల క్రితం వరకూ ఈ వ్యాధి గురించి అంతగా తెలియదు.
కానీ వాతావర ణంలో వచ్చిన మార్పులు ఈ వైరస్ విస్తరణకు అను కూలమైన పరిస్థితులను కల్పిస్తున్నాయని ప్రముఖ వైద్య పత్రిక పేర్కొంది.
భౌగోళిక పరిస్థితులను నిర్దే శించే వర్షపాతం, గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వైరస్ వ్యాప్తికి, కొత్త వేరియంట్లు రావడానికి దోహదపడుతున్నాయని తెలిపింది.
దీనివల్ల మన దేశంలో ఒక ఏడాదిలో ఏడిస్ ఈజిఫ్లై దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉండే నెలల సంఖ్య 5,6కి పెరిగిందని వివరించింది.
1951-1960; 2012- 2021 మధ్య కాలంలో ఇటువంటి అనుకూల పరిస్థితుల వృద్ధి 16శాతంగా ఉందని విశ్లేషించింది.
నాగాలాండ్, మణిపుర్, ఉత్తరా ఖండ్లలో పెరుగుతున్న డెంగీ కేసులను దీనికి నిదర్శ నంగా పేర్కొంది.
అకాల వర్షాలు, పట్టణీకరణ, భవన నిర్మాణ కార్యకలాపాలు అధికం కావడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కూడా డెంగీ వైరస్ వ్యాప్తికి కారణమవు తున్నాయని నిపుణులు తెలిపారు.
మణిపుర్ లో తొలి డెంగీ కేసు 2007లో నమోదైంది.
నాగాలాండ్ లో తొలి డెంగీ కేసు 2015 జూన్లో నమోదైంది.
అప్పటి నుంచి దీని బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది.
అత్యధికంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 2900 మందికి ఈ వైరస్ సోకింది.
అయితే, వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ గానే ఉంటుందని అంచనా..
ఈ ఏడాది అక్టోబరు 13 వరకూ 1,338 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 2022లో బాధితుల సంఖ్య కంటే ఇది 835 అధికం.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఏడాది డెంగీ బాధితులు సంఖ్య 3వేలకు చేరింది.
సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల డెంగీ కార ణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య ఈ రాష్ట్రాలలో అధికమవుతోందని నిపుణులు వెల్లడించారు.

మెదడుకు రీవైరింగ్ సామర్థ్యం లేదు అని శాస్త్రవేత్తల వెల్లడి

దృష్టి లోపం, కాలు లేదా చేయి తొలగింపు, పక్షవాతం బారినప డటం వంటి సందర్భాల్లో నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మెదడు రీవైరింగ్ చేసుకుంటుందన్న భావన తప్పని శాస్త్రవేత్తలు తేల్చారు.
మన బుర్రకు ఆ సామర్థ్యం లేదని తేల్చారు.
గాయం లేదా ఏదైనా లోపం తలెత్తినప్పుడు మెదడు తనను తాను పునర్వ్యవస్థీకరించుకుంటుందని, మారిన పరిస్థితు లకు అనుగుణంగా కొత్త విధులు నిర్వర్తించేందుకు నిర్దిష్ట భాగాల తీరుతె న్నులను మార్చుకుంటుందన్న అభిప్రాయం ఇప్పటివరకూ ఉంది.
సైన్స్ పాఠ్యపుస్తకాల్లోనూ ఇలాగే రాశారు. "కంటి చూపులేని ఒక వ్యక్తికి అద్భుత సామర్థ్యాలు ఉన్నాయి, పక్షవాతం బారినపడ్డ వ్యక్తి అనూహ్యంగా కాళ్లు, చేతులు కదిలించగలుగుతున్నాడు.. వంటి కథనాల గురించి విన్నప్పుడు ఇది నిజమేనని భావిస్తుంటాం" అని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ మోటార్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ రిపెయిర్ సంస్థ డైరెక్టర్ జాన్ క్రాకేర్ తెలిపారు.
నిజానికి ఇలాంటి సంద ర్భాల్లో సంబంధిత వ్యక్తి మెదడు.. అప్పటికే అంతర్లీనంగా ఉన్న సామర్థ్యాలను వినియోగించుకునేలా శిక్షణ పొందుతుందని చెప్పారు.

2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ

భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుతుం దని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
ఈ మొత్తం 100 బిలియన్ డాలర్ల వరకు వెళ్లే అవకాశమూ ఉందని కొన్ని విదేశీ సంస్థలు అంచనా వేసినట్లు పేర్కొ న్నారు.
భవిష్యత్ లో శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతా వరణమూ ఏర్పడుతుందని తెలిపారు.
"ప్రస్తుతం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత ఆశాజనకంగా లేదు. అది 8 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది.
కానీ, వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నాం. ఐరోపా ఉపగ్రహాల ప్రయోగాల వల్ల 230- 240 మిలియన్ యూరోలు, అమెరికా శాటిలైట్ల ప్రయోగం నుంచి 170- 180 మిలియన్ డాలర్లు ఆర్జించాం" అని వివరించారు.
ఇస్రో తొలి రాకెట్ ను ప్రయోగించి 60 వసంతాలు పూర్తయిన వేళ జితేంద్ర సింగ్ 'పీటీఐ' వార్తా సంస్థతో మాట్లాడారు.
అమెరికా తరహాలో భారత్ లోనూ ఏర్పాటు చేసిన 'అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండే షన్ వంటి సంస్థల వల్ల అంతరిక్ష రంగ అభివృద్ధికి బలమైన పునాదులు పడతాయని జితేంద్ర సింగ్ ఆకాం క్షించారు.
ఇలాంటి చర్యల వల్ల మన అంతరిక్ష రంగం వస్తాయని తెలిపారు. భారత అంతరిక్ష రంగం వనరుల కొరతను ఎదుర్కొన్నది నిజమేనని చెప్పారు.
అయితే, విజ్ఞాన శాస్త్రంలో మనకున్న అపార అనుభవం ద్వారా దాన్ని అధిగమించామన్నారు.
ఈ రంగంలో ఇతర దేశా లనూ అధిగమించే సత్తా మనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రుడిపైకి ఇతర దేశాలు వ్యోమనౌకలు పంపినప్పటికీ.. అక్కడ నీటి జాడలను కనుగొన్నది. మాత్రం మనమేనని గుర్తుచేశారు.
అంతరిక్ష రంగం లోకి ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కీలక మైలురాయిగా జితేంద్ర సింగ్ అభి వర్ణించారు.
దీని వల్ల ఇటు నిధులతో పాటు అటు విజ్ఞానం పరంగానూ అదనపు వనరులు చేతికందా. యని పేర్కొన్నారు.
ఫలితంగా దేశంలో అంతరిక్ష రంగానికి ఆదరణ లభించిందన్నారు.
చంద్రయాన్ ప్రాజెక్టులో ప్రతి వ్యక్తి తమకు తాము భాగస్వాము భావించారని తెలిపారు.
భారత అంతరిక్ష రంగంలో గగన్యాన్ మరో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని జితేంద్ర సింగ్ అన్నారు.
దీనికింద 2025 నాటికి భారత్ ఓ వ్యోమగామిని రోదసీలోకి పంపి సురక్షితంగా తీసుకొస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అంతకంటే మూడు నెలల ముందు ఓ రోబోను పంపుతామని తెలిపారు.
అది పూర్తిగా లోకి 70 శాతం వనరులు ప్రభుత్వేతర రంగాల నుంచే వ్యోమగామిలాగే వ్యవహరిస్తుందని వెల్లడించారు.

దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు మధ్యప్రదేశ్లో ఏర్పాటుకు కేంద్రం చర్యలు

వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో 2,300 చదరపు కి.మీ విస్తీ ర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఏర్పాటు కానుంది.
ఇందుకోసం మధ్యప్రదేశ్లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గా వతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపేయను న్నారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ రెండు అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సిం గప్పర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సుకు మోదీ

దుబాయ్ వేదికగా జరగ నున్న ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సద స్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనను న్నారు.
ఇందుకోసం ఆయన దుబాయ్ లో పర్యటించను న్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్-28) సదస్సులో భాగంగా ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించ నున్నారు.
కర్బన ఉద్గారాల తగ్గింపుతో పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవ డంలో వర్ధమాన దేశాలకు చేయూత అందించ డంపై ఇందులో దృష్టిపెట్టనున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు, అబు ధాబీ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు సదస్సుకు మోదీ హాజరవుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
భారత పర్యావరణ ఎజెండాను అందులో ప్రధాని ప్రముఖంగా ప్రస్తావిస్తారని పేర్కొంది.
యూఏఈ అధ్యక్షతన కాప్-28 సదస్సు ఈ నెల 28 నుంచి డిసెంబరు 12 వరకు జరగనుంది.

కన్హ శాంతివనంలో ప్రధాని మోదీ

దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లను మనం ప్రపంచ దేశాలకు అందించి కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అండగా నిలబడిన విధానంతో భారత్ విశ్వ మిత్రగా మారి పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
భావితరాలను దృష్టిలో పెట్టు కొని ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఆయన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హ శాంతివనాన్ని సందర్శించారు.
రామచంద్ర మిషన్ వ్యవస్థా పకుడు బాబూజీ మహారాజ్ 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాజ్ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు.
రామచంద్రమిషన్ గ్లోబల్ గైడ్ కమలేశ్ డి పటేల్.. ప్రధాని మోదీని సత్కరించారు.
తర్వాత అతిపెద్ద ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.

సాంస్కృతిక వారసత్వ బలోపేతానికి కృషి "బాబూజీ మహారాజ్ బోధనలు ఆదర్శప్రాయం. యోగులు, సాధువుల పరంపరను శాంతివనం ముందుకు తీసుకెళ్తుంది.
నిజమైన సాధకుడికి కావాల్సిన యోగ, ధ్యానాలను శాంతివనం అందిస్తోంది.
గతంలో దేశ ప్రజ లను బానిసలు చేసి పాలించిన వారు యోగా, విజ్ఞానం, ఆయుర్వేదం వంటి సంప్రదాయాలపై దాడి చేశారు.
దీంతో దేశానికి అపార నష్టం వాటిల్లింది. ఇప్పుడు పరిస్థితి మారింది.
ప్రపంచ ఆర్థిక, సాంస్కృతిక పురోభివృద్ధి వంటి అంశాల్లో భారత్ పురోగమిస్తోంది.
గత పది సంవత్సరాలుగా దేశ సాంస్కృ తిక వారసత్వాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన యువత ప్రతికూల ఆలోచ నలకు, మత్తుకు దూరంగా ఉండాలి.
దృఢమైన, అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణానికి మహిళాశక్తి, యువశక్తి, శ్రమశక్తి, ఉద్యమశక్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
మానవత్వం పెంపొందించడంలో రామచంద్రమిషన్ గ్లోబల్ గైడ్ కమ లేశ్ డి పటేల్ కృషి అద్భుతం.
ఆయనను పద్మ అవార్డుతో సత్కరించిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది.
160 కంటే ఎక్కువ దేశాల ప్రజలు యోగాను ఆచరిస్తున్నారు.
కన్హ శాంతివనాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యానమందిరంగా తీర్చిదిద్దడంలో దాజీ కృషి అనిర్వచనీయం.
లక్ష మంది కలిసి ధ్యానం చేసేలా ఉన్న మందిరంలో ఉత్పన్నమయ్యే శక్తి అసామా న్యమైనది" అని ప్రధాని మోదీ అన్నారు.

వెల్ నెస్ సెంటర్ల పేరును మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేర్లను కేంద్రం మార్చింది. ఇక నుంచి వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పిలవాలని పేర్కొంది.
ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది. పేర్ల మార్పిడి ప్రక్రి యను ఈ ఏడాది చివరిలోపు ముగించాలని ఆదే శించింది.
హెల్త్ సెంటర్ల ముందు బోర్డుల పేర్లను మార్చి, వాటిని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పోర్టల్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది.
'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' అని రాసి 'ఆరోగ్యం పరమం ధనం' అనే ట్యాగ్ లైన్ కూడా జత చేర్చాలని తెలిపింది.

ఆదిమ కాలంలో అతివలూ వేటాడేవారు

వేట పూర్తిగా పురుష లక్షణమన్న భావన తప్పవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఆదిమ కాలంలో మహిళలు కూడా వేటాడేవారని తాజాగా తేల్చారు. వారి శరీర నిర్మాణం ఇందుకు చక్కగా తోడ్పడిందని పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన పలు యూనివర్సి టీల నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు.
నాటి చరిత్రలో మహిళల పాత్రను విస్మరించారని శాస్త్రవే త్తలు తెలిపారు. దాన్ని తాము సరిచేస్తున్నామని చెప్పారు.
అప్పట్లో శ్రమకు సంబంధించి స్త్రీ, పురుష విభజన ఉండేది కాదని తెలిపారు. మనుగడ కోసం అందరూ చెమటోడ్చేవారని వివరించారు.
నాటి మహి ళల శిలాజాలపై జరిపిన పరిశీలనల్లో కొన్ని గాయాలు కనిపించాయని తెలిపారు. వేటాడే క్రమంలో తగిలిన దెబ్బలూ ఇందులో ఉన్నాయి.
హోలో సీన్ కాలంలో (దాదాపు 12వేల ఏళ్ల కిందట).. వేటకు ఉపయోగించే ఆయుధాలతో అతివలను ఖననం చేశారని పెరూలో లభించిన ఆధారాలు సూచిస్తున్నాయి.
"ఓ వ్యక్తి తన జీవితంలో ఎక్కువగా ఉపయోగించిన వస్తువులనే వారితో కలిపి ఖననం చేస్తారు" అని పరిశోధనలో పాల్గొన్న కారా ఒకోబాక్ చెప్పారు.
దీన్నిబట్టి ఆదిమ కాలంలో మహిళలు పురుషులతో సమానంగా వేటాడి, ఆహారాన్ని సంపాదించేవారని స్పష్టమవుతున్నట్లు చెప్పారు.
గర్భిణిగా ఉన్నప్పుడు కానీ బాలింతగా ఉన్నప్పుడు కానీ మహిళలు వేటకు దూరంగా ఉండే వారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
వేటలో ఎక్కువసేపు పాల్గొనేంత శక్తి.. నాటి అతి వల్లో ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
వారిలో ఈస్ట్రోజన్, అడిపొనెక్టిన్ హార్మోన్లు ఎక్కువగా ఉండే వని, దానివల్ల శక్తి కోసం కొవ్వును మెరుగ్గా కరిగించ గలిగేవారని వివరించారు.
కండరాలకూ మంచి సంరక్షణ ఉండేదని తెలిపారు. "ఈ హార్మోన్ల కారణం అప్పట్లో అతివలు ఎక్కువసేపు వేట సాగించ గలిగేవారు.
జంతువును వెంటాడినప్పుడు అది అలిసి పోయేవరకూ పరుగులు తీస్తుంది. అప్పుడు దానికి చేరువై ఆయుధంతో చంపగలిగేవారు.
అప్పటివరకూ వేటగాళ్లు దాన్ని వెంటాడేవారు" అని పేర్కొన్నారు.
అప్పట్లో మహిళల తుంటి ఆకృతి కూడా విశాలంగా ఉండేదని, పెద్ద అంగ వేయగలిగేవారని తెలిపారు.
అంతిమంగా దీనివల్ల వారు తక్కువ సమయంలో ఎక్కువ దూరం పరుగెత్తగలిగేవారని వివరించారు.

భారతీయులకు వీసా అక్కర్లేదు: మలేసియా

పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేసియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులు డిసెంబరు 1 నుంచి వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది.
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
వీసా లేకుండా వచ్చి 30 రోజులపాటు ఉండొచ్చని తెలిపారు.
వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కల్పించాయి..

చైనాలో శ్వాసకోశ సమస్యపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

ఉత్తర చైనాలో ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో శ్వాసకోశ సంబంధ సమ స్యలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్ర మత్తమైంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఈ సమస్యను గమనించి తగు చర్యలు తీసుకోవా లని హెచ్చరిస్తూ అడ్వయిజరీ జారీ చేసింది.
ఇప్పటికే దేశంలో ఇన్ఫ్లుయెంజా విస్తరిస్తోందని, దానికి శీతాకాలం తోడైతే సమస్య మరింత జటి లమయ్యే అవకాశం ఉందని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
ప్రజారోగ్య పరిస్థితులను వెంటనే సమీక్షించి భవి ష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడా నికి సిద్ధం కావాలని నిర్దేశించింది.
'మానవ వన రులు, పడకలు, మందులు, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీ బయాటిక్స్, టెస్టింగ్ కిట్లు, రీజెంట్స్ సమకూర్చుకోవాలి. ఆక్సి జన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు పనిచేసేలా చూసుకో వాలి' అని లేఖలో కేంద్రం సూచించింది.

రాకెట్ దశను గాల్లోనే పేల్చేసిన ఉ.కొరియా

ఇటీవల ఉత్తర కొరియాలోని కిమ్ సర్కార్ ఒక నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
దీనిని ప్రయోగించే సమయంలో ఎలాంటి ఆధారాలు, పరికరాలు.. అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంది.
ఇందులో భాగంగా.. ఈ ఉపగ్రహ ప్రయోగానికి వాడిన రాకెట్ తొలి దశను గాల్లోనే పేల్చినట్లు గుర్తించారు.
ఉల్కలను గమనించేందుకు దక్షిణ కొరియాలోని ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కెమెరాలో ఉత్తర కొరియా శాటిలైట్ ప్రయోగం నిక్షిప్తమైంది.
ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న చోలీమా-1 రాకెట్ గాల్లోకి ఎగిరిన తర్వాత తొలి దశ విడిపోయి గాల్లోనే పేలిపోయినట్లు గుర్తించారు.
దాని శకలాలు చెల్లాచెదురైపోయాయి. దీనిని ఉద్దేశపూర్వకం గానే గాల్లో ధ్వంసం చేసినట్లు దక్షిణ కొరియా నిపుణుడు ప్రొఫెసర్ యంగ్ ఇక్ పేర్కొన్నారు.
గత ప్రయోగాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించలేదని ఆయన చెప్పారు.
ఈ రాకెట్ తొలి దశ సముద్రంలో కూలితే అమెరికా, దక్షిణ కొరియా నౌకాదళాలు అక్కడి నుంచి రాకెట్ శకలాలను సేకరించి వాటి ఆధారంగా తమ టెక్నాలజీని గుర్తిస్తారనే భయంతో.. ఉత్తర కొరియా ఈ పనిచేసినట్లు యంగ్ విశ్లేషించారు.
ఉత్తరకొరియా ఉపగ్రహం కక్ష్యకు చేరినట్లు మరో ఖగోళశాస్త్రవేత్త జోనాథన్ మెక్ డోవెల్ వెల్లడించారు.
ఒక వస్తువు కొత్తగా కక్ష్యలోకి వచ్చినట్లు అమెరికా వాయుసేన బృందాలు గుర్తించాయని వెల్లడించారు.
గతంలో ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి విఫల యత్నాలు చేసింది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ ఇటీ వల రష్యాలో పర్యటించారు.
ఈ సందర్భంగా తాము ఉత్తరకొరియా ఉప గ్రహ ప్రయోగానికి సాయం చేస్తామని రష్యా అధినేత పుతిన్ హామీ ఇచ్చారు.
అయితే.. అది ఎలాంటి సాయమో వెల్లడించలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఉత్తరకొరియా విజయవంతంగా నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.
ఇది.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రాజేసింది. నవంబరు చివరినాటికి తామూ ఓ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది.
అమెరికా కంపెనీ స్పేస్ఎక్స్ సాయంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్సీ)

సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పి కొడదా మని, హిందూ సంస్థల మధ్య ఐక్యతను బలోపేతం చేద్దామని ప్రపంచ హిందూ కాంగ్రెస్ (డబ్ల్యూహెచ్సీ) నిర్ణయించింది.
విదేశాల్లో ఎన్నికైన హిందూ ప్రజా ప్రతి నిధులకు మద్దతుగా నిలుద్దామని, వారికి వ్యతిరేకంగా జరిగే రాజకీయ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి వారిని సంఘటితం చేసి పరస్పరం మాట్లాడుకునేలా చర్యలు తీసుకుందామని తీర్మానించింది.
మూడు రోజులపాటు థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగిన డబ్ల్యూ హెచ్సీ సమావేశాలు ముగిశాయి.
సమావే శాలను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగ వత్ ప్రారంభించగా ఆధ్యాత్మిక గురువు అమృతానందమయి దేవి ముగించారు.
సమావే శాలకు 61 దేశాల నుంచి దాదాపు 2,100 మంది ప్రతి నిధులు హాజరయ్యారు.
తదుపరి సమావేశాలను 2026లో ముంబయిలో నిర్వహించాలని ఈ సంద ర్భంగా నిర్ణయించారు.

ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ విజేతగా పంకజ్ అడ్వాణీ

భారత క్యూ స్టార్ పంకజ్ అడ్వాణీ బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకుని గ్రాండ్ డబుల్ సాధించాడు.
2023, నవంబరు 24న దోహాలో జరిగిన పాయింట్ ఫార్మాట్ తుది పోరులో సహచర ఆటగాడు సౌరభ్ కొఠా రిని ఓడించాడు.
లాంగ్ఫార్మాట్లోనూ సౌరభ్నే ఓడించి పంకజ్ టైటిల్ నెగ్గాడు.
ఈ విజయాలతో పంకజ్ తన ప్రపంచ టైటిళ్ల సంఖ్యను 27కు పెంచుకున్నాడు.
ఈ ఫార్మాట్లో పంకజ్కు ఇది అయిదో ప్రపంచ టైటిల్. గతంలో 2005, 2008, 2014, 2018లో కూడా నెగ్గాడు.
2003లో తొలిసారి ప్రపంచ ఛాంపియ న్గా నిలిచిన పంకజ్, మొత్తం మీద 17 బిలియర్డ్స్, 10 స్నూకర్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు.
ఆసియా స్థాయిలో 10 టైటిళ్లను (7 బిలియర్డ్స్, 3 స్నూకర్) పంకజ్ గెలుచుకున్నాడు.
బిలియర్డ్స్, స్నూకర్ ఫార్మాట్లలో అడ్వాణీ గెలిచినన్ని టైటిళ్లు మరే ఆటగాడూ నెగ్గలేదు.

ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనై జేషన్ (ఐఎస్ఓ) చైర్మన్ గా భారత్

పంచదార, అనుబంధ ఉత్పత్తుల అత్యున్నత సంఘం ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనై జేషన్ (ఐఎస్ఓ) చైర్మన్షిప్ ను 2024 సంవత్సరానికి భారత్ మళ్లీ చేపట్టనుంది.
2023, నవంబరు 24న లండన్లోని ఐఎస్ ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన 63వ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి భారత్ తర పున కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా హాజరయ్యారు.
ప్రపంచంలో అతి పెద్ద పంచదార వినిమయ దేశంగా, రెండో అతిపెద్ద ఉత్పతిదారుగా భారత్ ఉంది.

అనీష్ భన్వాలా కు కాంస్యం

షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో అనీష్ భన్వాలా కాంస్యం నెగ్గాడు.
2023, నవంబరు 24న దోహాలో జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ తరఫున తొలి పతకంతో చరిత్ర సృష్టించాడు.
ఫైనల్లో అనీష్ 27 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. పీటర్ ఫ్లోరిన్ (జర్మనీ, 35) పసిడి నెగ్గగా, లీ యులిహోంగ్ (చైనా, 33) రజతం గెలిచాడు.

'ప్రొఫెట్ సాంగ్' నవలకు బుకర్ ప్రైజ్

ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకు న్నారు.
ఆయన రాసిన 'ప్రాఫెట్ సాంగ్' నవలకు ఈ అవార్డు లభించింది. ఐర్లాండ్ దేశం నిరంకుశత్వంలోకి జారిపోతున్న సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టా లను ఇందులో లించ్ వివరించారు.

మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు

అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడే టర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

ఈ ఏడాది అన్ లైన్ లో అత్యధికులు వెతికిన పదం 'అథెంటిక్'

సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో 'డీప్ ఫేక్ అనే పదం బాగా వెలు గులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరి మితం కాదు.
2003లో ప్రపంచం ఆన్లైన్లో వెతికిన పదాల్లో డీప్ ఫేక్ ఒకటని మెరియం వెబర్ నిఘంటు కంపెనీ వెల్లడించింది.
ఒక వ్యక్తి ఫొటో, వీడియో, ఆడి యోలను మార్చి, ఆ వ్యక్తి చేయని పనిని చేసినట్లుగా, పలకని మాటలను పలికినట్లుగా చూపడమే డీప్ ఫేక్ అని నిఘంటు నిర్మాతలు నిర్వచించారు.
అయితే 2023లో అత్యధికులు అన్వేషించిన పదం మాత్రం 'అథెంటిక్' అని మెరియం వెబ్ స్టర్ నిఘంటు కంపెనీ ప్రకటించింది.
దీనికి 'నిజమైన, విశ్వసనీయ 'మైన, ప్రామాణికమైన' అని అర్థం. ప్రస్తుత కృత్రిమ మేధా జనిత డీప్ ఫేక్ ప్రపంచంలో విశ్వసనీయత సంక్షోభంలో పడింది.
అందుకే జనం తమ ఆన్లైన్ నిఘంటువులో నిజమైన వంటలు, నిజమైన స్వరం, నిజస్వరూపం కోసం వెతుకులాటను ముమ్మరం చేశా రని నిఘంటు సంపాదకుడు పీటర్ సోకొలోవ్ స్కీ వివ రించారు.
ఈ సమాధాన పత్రాన్ని నిజంగా విద్యార్థి రాశాడా, రాజకీయ నాయకుడు నిజంగానే ఈ ప్రకటన చేశాడా అనే ప్రశ్నలు నేడు మార్మోగుతున్నాయనీ, కొన్నిసార్లు మన కళ్లను, మన చెవులను మనమే నమ్మ లేకపోతున్నామని ఆయన గుర్తుచేశారు.
మెరియం వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువులో 5 లక్షల పదాలు ఉండగా, వాటిలో లవ్ అనే పదానికి అర్థం అన్వేషిం చేవారు ఎప్పుడూ అత్యధికంగా ఉంటారు.
అది రివాజు కూడా. మరోవైపు.. ఈ సంవత్సరం అథెంటిక్ అనే పదం అగ్రాసనం అందుకొందని సోకొలోవ్ స్కీ చెప్పారు.
2023లో జనం చాలా ఎక్కువగా అన్వేషిం చిన పదాలలో రిజ్ (రొమాంటిక్ ఆకర్షణ, సమ్మోహన శక్తి), కబుట్స్ (ఇజ్రాయెలీ సాముదాయిక వ్యవసాయ క్షేత్రం, జనావాసం), ఇంప్లోడ్ (అంతఃస్పోటనం), కొరొ నేషన్(పట్టాభిషేకం) వంటివీ ఉన్నాయి.

న్యూజిలాండ కు కొత్త ప్రధానిగా లక్సన్

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ (53) ప్రమా ణస్వీకారం చేశారు.
తరం దేశర్థికాన్ని మెరుగుపర చడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు.
గత నెల పార్ల మెంటు ఎన్నికల తరువాత రెండు చిన్న పార్టీల మద్ద తుతో లక్సన్ కు చెందిన నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
100 రోజుల పాలన, ఆర్థిక ప్రణాళికను ప్రకటి స్తాననీ, పొరుగుదేశం ఆస్ట్రేలియాను క్రిస్మస్ కు ముందే సందర్శిస్తానని లక్సన్ తెలిపారు.

14 రోజుల్లోనే పడిపోయే అవకాశం పోలండ్ ప్రభుత్వం!

పోలండ్ లో ప్రమాణ స్వీకారం చేసే మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి 14 రోజుల్లోనే ఆయుష్షు తీరిపోనుంది.
అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 460 స్థానాల్లో పార్టీకి 194 మాత్రమే వచ్చాయి.
అయితే రాజ్యాంగం ప్రకారం.. లా అండ్ జస్టిస్ పార్టీ ప్రభుత్వం 14 రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
ఇందుకు ఇతర పార్టీలు సహకరించడం లేదు. దీంతో ఈ ప్రభుత్వం 14 రోజుల్లోనే పడిపోనుంది.
అక్టోబరు ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన మూడు ఐరోపా సమాఖ్య (ఈయూ) అనుకూల పార్టీలకు కలిపి 248 సీట్లు వచ్చాయి.
ఆ మూడు పార్టీలూ కలసి ఈయూ నాయకుడు, 2007-2014లో పోలండ్ ప్రధానిగా పనిచే సిన డొనాల్డ్ టస్క్ ను ప్రధానమంత్రిగా ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నాయి.

బ్యాక్టీరియాకు నాలుగుతరాల జ్ఞాపకాలు!

ఏకకణ జీవులైనప్పటికీ బ్యాక్టీరియాకు జ్ఞాపక శక్తి సామర్థ్యం ఉంటుందని, ఆ జ్ఞాపకాలను తమ వారసు లకూ చేరవేయగలవని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
యాంటీబయాటిక్స్ నిరోధకతను సాధించి, మానవుల్లో ప్రమా దకరమైన ఇన్ఫెక్షన్లను కలిగించడం వంటి వ్యూహాలను ఎప్పుడు రచించాలన్న అంశానికి సంబంధించి ఇవి జ్ఞాపకా లను ఏర్పర్చుకోగలవని వివరించారు.
ఒకే ఉపరితలంపై ఇవి లక్షల సంఖ్యలో గుమికూడిన సందర్భాల్లో.. సమూహాలుగా ఏర్పడటానికి కూడా ఈ వ్యూహాలు దోహదపడతాయని తెలి పారు.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, యాంటీబయాటిక్ నిరోధక మొండి బ్యాక్టీరియా వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఆస్టిన్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
బ్యాక్టీరియాకు మెదడు ఉండ దని పరిశోధనకు నాయకత్వం వహించిన సౌవిక్ భట్టాచార్య తెలిపారు.
అయితే, అవి తమ పరి సరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిం చగలవు. తరచూ అదే వాతావరణం తారసప డితే, ఆ సమాచారాన్ని నిల్వ చేసుకోగలవు. ఆ తర్వాత స్వీయ ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించుకోగలవు" అని పేర్కొన్నారు. ఈ సూక్ష్మజీవులు తమలోని ఐరన్ నన్ను ఆధారంగా చేసుకొని జ్ఞాపకశక్తిని ఏర్పర్చుకోగలవని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ జీవుల్లో ఐరన్ స్థాయి విభిన్న రీతుల్లో ఉంటోందని గుర్తించారు. ఈ మూలకం తక్కువగా ఉన్న బ్యాక్టీరియా కణాలు చాలా మెరుగ్గా సమూహాలు కట్టగలుగుతున్నట్లు తేల్చారు. ఘన ఉపరిత లాలపై జిగురులాంటి పదార్థంతో పొరలను ఏర్పాటు చేయగల బ్యాక్టీరియాలో ఐరన్ స్థాయి ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. యాంటీబయాటిక్స్న తట్టుకోగల సామర్థ్యం ఉంటోందని పరిశోధకులు వివరించారు. ఈ 'ఐరన్ జ్ఞాప కాలు కనీసం నాలుగు తరాల పాటు కొనసాగుతాయన్నారు. ఏడో తరం నాటికి అంతర్థానమవుతాయని వెల్లడించారు.

భారత్ వృద్ధి స్పీడ్ 6.4 శాతం

భారత్ 2023-24 స్థూల దేశీయోత్పత్తి
(జీడీపీ) వృద్ధి అంచనాలను ఎస్అండ్ గ్లోబల్ రేటింగ్స్ భారీగా 40 బేసిస్ పాయింట్లు (0.4%) పెంచింది.
దీనితో ఈ అంచనా 6 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది.
అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా పటిష్టంగా లుక్ ఫర్ ఉన్నాయని తన తాజా ఎకనమిక్ అవుట్ ఆసియా పసిఫిక్ నివేదికలో పేర్కొంది.
తమ అంచ నాల అప్డ్ కు ఈ అంశాలు కారణాలుగా వివరిం చింది.
అయితే 2024-25 అంచనాలను మాత్రం. క్రితం 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎండీ పేర్కొంది.
అధిక బేస్ ఎఫెక్ట్, గ్లోబల్ వృద్ధిపై బలహీన అంచనాలు, వడ్డీరేట్ల పెంపు ప్రతికూలతలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడిం ది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఏడీబీ, ఫిచ్ అంచనాలకన్నా (6.3 శాతం) ఎస్అండ్ తాజా అంచనాలు కొంచెం అధి కంగా ఉండడం గమనార్హం.
2023 మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
కాగా, భారత్తో పాటు ఇండోనేషియా, మలే షియా, ఫిలిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని ఎండీ నివేదిక పేర్కొంది.

కొన్ని సంస్థల అంచనా ఇలా..
2023-24 - (వృద్ధి %ల్లో)
RBI- 6.5
World Bank - 6.3
I.M.F-6.3
FITCH - 6.3
ADB-6.3
OECD-6.3
UBS-6.3
GOLD MAN Sacks-6.2
ఇండియా రేటింగ్స్-6.2
మూడీస్-6.1


గిర్నార్ పర్వతం చుట్టూ పారామోటార్ తో నిఘా

గుజరాత్ పోలీసులు వినూత్న ప్రయో గానికి శ్రీకారం చుట్టారు.
లక్షలాది మంది భక్తులు పాల్గొనే జునాగఢ్ లోని ఐదు రోజుల 'లిలి పరి క్రమ'ను పర్యవేక్షించడానికి పారామోటార్ను పా రాగ్లైడర్ లాగా ఉపయోగిస్తున్నారు.
దాని సాయంతో గాలిలోకి ఎగిరి గిర్నార్ పర్వతం చుట్టూ చక్కర్లు కొ డుతున్నారు.
ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసు కుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
గిర్నార్ పర్వతం హిమాలయాల కంటే పురాతనమైనది. దీని చుట్టూ వందల సంఖ్యలో హిందూ, జైనా దేవాల యాలు ఉన్నాయి.
మహాభారతంలోనూ ఇది పవిత్ర స్థలంగా పేర్కొన్నారు. గుజరాతీ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా గిర్నార్ పరిక్రమ జరుగుతుంది.
పచ్చదనంతో నిండి ఉన్న ఈ పరిక్రమ మొత్తం మార్గం 36కి.మీ. కాగా.. దాన్ని చుట్టిరావడా నికి యువకులకు ఒక రోజు పడుతుంది.
వృద్ధులకు 2 రోజులు పడుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది 'లిలి పరిక్రమ'లో పాల్గొంటారు.
భక్తులు లక్షల సంఖ్యలో వస్తుండటంతో నిఘా ఏర్పాట్లు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
ఈ క్రమంలో నిఘా కోసం పారామోటర్ను ఉప యోగిస్తున్నారు.
ఓ పారామోటార్ గిర్నార్ పర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఇంప్లిమెంటేషన్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
మరింత సమ ర్థవంతమైన పర్యవేక్షణ కోసం డ్రోన్లను కూడా ఉప యోగించాలని సూచించారు.

600కు పైగా జీఆర్బీలను గుర్తించిన అంతరిక్ష టెలిస్కోపు ఆస్ట్రోశాట్

భారత్ ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోపు 'ఆస్ట్రోశాట్' ఒక అద్భుత మైలురాయిని సాధించింది.
విశ్వంలో 600కు పైగా గామా కిరణ విస్ఫోటాల (జీఆర్బీ)ను గుర్తించింది.
ప్రయోగించి 8 ఏళ్లు గడిచినా ఇందులోని క్యాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ (సీజడ్ టీఐ) చక్కగా పనిచేస్తోందనడా నికి ఇది నిదర్శనమని ఈ పరికరానికి సంబంధించిన ముఖ్య శాస్త్రవేత్త దీపాం కర్ భట్టాచార్య తెలిపారు.
భారీ నక్షత్రం పేలిపోయినప్పుడు లేదా న్యూట్రాన్ తారలు పరస్పరం విలీనమైన సందర్భాల్లో జీఆర్బీలు వెలువడుతుంటాయి.
అవి విశ్వంలో చాలా శక్తిమంతమైన విస్ఫోటాలు. సూర్యుడు తన జీవితకా లంలో వెలువరించేంత శక్తిని ఇవి కొన్ని సెకన్ల వ్యవధిలోనే విడుదల చేస్తాయి.
జీఆర్బీలు సెకను కన్నా తక్కువ సమయం లేదా కొన్ని నిమిషాల పాటు మనుగడ సాగిస్తాయి.
ఈ విస్ఫోటం తర్వాత ఆ ప్రాంతంలో కృష్ణబిలం ఏర్పడుతుంది.
ఆస్ట్రో శాట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. 2015లో రోదసిలోకి ప్రయోగించింది.
నిజానికి ఐదేళ్ల పాటు మాత్రమే పనిచే సేలా దీన్ని రూపొందించారు. అయితే, ఇప్పటికీ అది అద్భుతంగా సేవలు అందిస్తోంది.
ఖగోళశాస్త్రానికి సంబంధించి కీలక పరిశీలనలు సాగిస్తోంది.

2024 చివర్లోగా ఐఎస్ఎస్ కి భారత వ్యోమగామి పంపేందుకు కసరత్తు

అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భారత్ కు సాయం చేయడానికి తాము సిద్ధమని అమెరికా రోదసి సంస్థ-నాసా అధిపతి బిల్ నెల్సన్ తెలి పారు.
మన దేశంలో పర్యటిస్తున్న ఆయన మంగ ళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
వచ్చే ఏడాది చివర్లో భారత వ్యోమగామిని అంతర్జా ఓ తీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్)కి పంపేం దుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు.
అర్హత కలిగిన వ్యోమగామిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంపిక చేస్తుందన్నారు.
2040 నాటికి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలని భారత్ అనుకుంటోంది.
దాని సాకారంలో మా భాగస్వామ్యాన్ని కోరితే.. సానుకూలంగా స్పందిస్తాం" అని తెలిపారు.
అంతకుముందు ఆయన.. కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలు శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా.. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకునే అశంపై చర్చ జరిగింది.
"భారత వ్యోమగామిని రోదసిలోకి పంపేందుకు ఇస్రో ప్రయోగించే గగన్ యాన్ మాడ్యూల్కు సంబంధించిన రక్షణ కవచా లను నాసా హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్ టెస్ట్ (హెచ్ వీఐటీ) కేంద్రంలో పరీక్షించే అంశాన్ని పరిశీలి స్తున్నాం" అని శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ప్రకటనలో పేర్కొంది. 2024లో ఐఎస్ఎస్లోకి భారత వ్యోమగామిని పంపుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనపై జితేంద్ర సింగ్, నెల్సన్లు తాజాగా చర్చించారు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నెల్సన్.. భారతన్ను కోరారు.

నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబో తోంది.
స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవా హక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబో తోంది.
దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు రక్షణ కొనుగోళ్లు బోర్డు (డీపీబీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని వివరించాయి.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో గురువారం జరిగే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ అంశం పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
దీనికితోడు రూ.1.15 లక్షల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధ వి మానాల కొనుగోలు కోసం భారత వైమానిక దళం తెచ్చిన ప్రతిపాదనపైనా డీఏసీలో చర్చ జరిగే వీలుందని తెలిపాయి.
ప్రతిపాదిత రెండో స్వదేశీ విమానవాహక నౌక (ఐఏసీ-2) బరువు 45 వేల టన్నులు ఉండొచ్చు. దీన్ని కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించ నుంది. అది కూడా విక్రాంత్ తరహాలోనే ఉండొ చ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
97 తేజస్ మార్క్- 1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం లభిస్తే భారత వాయుసేన అమ్ముల పొదిలో ఈ జెట్ల సంఖ్య 180కి పెరగనుంది.

నౌకాదళానికి సూపర్ ర్యాపిడ్ గన్ వ్యవస్థ సరఫరా చేయనున్న బీహెచ్ఎస్ఈఎల్

భారత నౌకాదళం కోసం 16 ఆధునిక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ (ఎస్ఆర్ఆఎం), ఇతర సాధనాలను సరఫరా చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్ ఈ ఎల్ సంస్థ రూ.2,956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటిని నేవీలోని యుద్ధనౌకలకు అమరుస్తారు. ఎస్ఆర్ జీఎం అనేది మధ్యశ్రేణి ఆయుధ వ్యవస్థ. ఇది శత్రు క్షిప ణులు, విమానాలను నేలకూల్చగలదు. అత్యంత కచ్చిత త్వంతో, శరవేగంగా తూటాలను పేల్చగలదు. హరిద్వా ర్ బీహెచ్ఎల్ కు చెందిన కర్మాగారంలో ఈ ఆయు ధాలను తయారుచేస్తారు.

శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్

భూకక్ష్య లోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేత సౌధం, పెంటగాన్ సహా అమెరి కాకు చెందిన నౌకాస్థావ రాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడిం చింది.
ఈ చిత్రాలను అధ్య క్షుడు కిమ్ జోంగ్ ఉన్ వీక్షిం చినట్లు ప్రభుత్వ ఆధ్వ ర్యంలో నడుస్తున్న మీడియా సంస్థ తెలిపింది.
నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం గతంలో రెండుసార్లు విఫలయత్నాలు చేసింది.
ఈసారి రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజ యవంతం చేసింది. గత వారం ఈ ప్రయోగం జరగ్గా. కిమ్ దీన్ని వీక్షించారు.
ప్రయోగంలో పాలుపంచు కొన్న శాస్త్రవేత్తలు, సిబ్బందికి విందు ఇచ్చారు.
ఈ నిఘా ఉపగ్రహం రాత్రి తీసిన అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు చిత్రాలను కిమ్ వీక్షించారని కథనం పేర్కొంది.
అమెరికా నౌకాస్థావరం, విమాన వాహక నౌకలు, షిప్యార్డు, వర్జీనియా లోని ఎయిర్ఫేల్డ్ చిత్రా లను ఉపగ్రహం తీసి నట్లు తెలిపింది.
అలాగే దక్షిణ కొరియాలోని సైనిక స్థావరాల చిత్రా లను సైతం తీసినట్లు ప్రకటించింది.
అయితే, నిఘా ఉపగ్రహం ప్రయోగించిన వారంలోనే సరైన పని తీరును ప్రదర్శిస్తుందని చెప్పడం తొందరపాటే అవుతుం దని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దానికి అంతరిక్షం నుంచి ఫొటోలు తీసి పంపే సామర్థ్యం ఉందని అప్పుడే చెప్పలేమన్నారు.
అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను గమనించడంతోపాటు అణ్వస్త్ర సామర్ధ్యాలను మెరుగుపర్చుకునేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు చేస్తోందని 'న్యూయార్క్ టైమ్స్' ఇదివరకే పేర్కొంది.

ఉత్తరాఖండ్ సొరంగంలో 17 రోజులు సహాయక చర్యలు కొనసాగాయిలా

నవంబరు 12 :-
ఉత్తరాఖండ్ లో చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్క్ యరా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎసీఆర్ ఎఫ్, బీఆర్ వో, ఐటీబీపీ తదితర బలగాలు, కూలీలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు చురుగ్గా సాగిన ఏర్పాట్లు.

నవంబరు 13 :-
సొరంగంలో చిక్కుకున్న కూలీలతో చిన్న పైప్ ద్వారా ఏర్పడిన అనుసంధానత. క్షేమంగా ఉన్నారని నిర్ధారణ

నవంబరు 14:-
కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అడ్డంగా తవ్వకాలు జరిపి 800-900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ ప్లు వేసేందుకు ఏర్పాట్లు. లోపల మట్టి పెళ్లలు విరిగిపడటంతో ఇద్దరు కూలీలకు గాయాలు

నవంబరు 15:-
సహాయక చర్యలను ముమ్మరం చేసేం దుకు ఢిల్లీ నుంచి అత్యాధునిక ఆగర్ యంత్రం తరలింపు

నవంబరు 16:-
సొరంగం వద్ద డ్రిల్లింగ్ యంత్రం మోహరింపు

నవంబరు 17:-
57 మీటర్ల మేర తవ్వకం లక్ష్యం కాగా. అందులో 24 మీటర్ల మేర పని పూర్తి.. పైపులు వేసిన అనంతరం అయిదో వైపు వేస్తుం డగా అడ్డంకి ఎదురవడంతో డ్రిల్లింగ్ నిలిపివేత

నవంబరు 18:-
ఆగర్ యంత్రం వల్ల ఉత్పత్తయ్యే ప్రకంప నలతో సొరంగంలో మట్టిపెళ్లలు మరిం తగా విరిగిపడే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు. నిలువుగా తవ్వడం సహా 5 విధాల ప్రత్యామ్నాయ సహాయక చర్యలను ఏకకాలంలో చేపట్టాలని ఉన్నతాధికారుల నిర్ణయం

నవంబరు 19:-
పునఃప్రారంభమవని డ్రిల్లింగ్. సహా యక పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష

నవంబరు 20:-
ఉత్తరాఖండ్ సీఎం ధామీతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, సహాయక చర్యలపై ఆరా.

పెద్ద బండరాయి అడ్డుగా ఉండటంతో ఇంకా పునఃప్రారంభమవని డ్రిల్లింగ్ నవంబరు 21 :-
లోపల చిక్కుకున్న కూలీలకు సంబంధిం చిన తొలి వీడియో విడుదల. అడ్డంగా (హారిజాంటల్) తవ్వే పనులు పునఃప్రారంభం. ప్రత్యామ్నాయంగా సొరంగానికి మరోవైపు నుంచీ తవ్వకాలు మొదలు.

నవంబరు 22:-
45 మీటర్ల మేర సమాంతర డ్రిల్లింగ్ పూర్తి, మరో 12 మీటర్ల మేర మాత్రమే. మిగిలి ఉన్న పనులు కూలీల కోసం సిద్ధమైన అంబు లెన్సులు ఇంతలో అనూహ్యంగా ఇనుప రాడ్లు అడ్డురావడంతో నిలిచిపోయిన డ్రిల్లింగ్

నవంబరు 23:-
ఆరు గంటల శ్రమ తర్వాత ఇనుప రాడ్ల తొలగింపు. అయితే డ్రిల్లింగ్ యంత్రాన్ని నిలిపి ఉంచిన వేదికకు పగుళ్లు రావడంతో పనులు నిలిపివేత

నవంబరు 24:-
పునఃప్రారంభమైన డ్రిల్లింగ్. లోహ గడ్డర్ అడ్డుగా రావడంతో మళ్లీ పనుల నిలిపివేత

నవంబరు 25:-
విరిగిపోయిన ఆగర్ బ్లేడ్లు. మిగిలిన దూరాన్ని మనుషులతో తవ్వించడం. 863 మీటర్ల మేర నిలువు డ్రిల్లింగ్ అనే రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల మల్లగుల్లాలు

నవంబరు 26:-
ప్రత్యామ్నాయ మార్గంగా... నిట్టనిలు వున 19.2 మీటర్ల మేర తవ్వకం పూర్తి

నవంబరు27 :-
నిలువుగా 36 మీటర్ల తవ్వకం పూర్తి. హారిజాంటల్ డ్రిల్లింగ్లో సహాయం చేసేందుకు సొరంగం వద్దకు చేరుకున్న ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు

నవంబరు 28:-
ర్యాట్ హోల్ మైనింగ్ నిప్పు ణుల సాయంతో హారిజాంటల్ డ్రిల్లింగ్ పూర్తి. సొరంగం నుంచి సురక్షితంగా బయటకొచ్చిన కార్మికులు,

ర్యాట్ హోల్ మైనింగ్

ఎలా తవ్వుతారంటే:-
మేఘాలయలో బొగ్గును వెలికితీయడానికి ఎక్కువగా ర్యాట్ హోల్ మైనింగ్ పై ఆధారపడతారు.
నాలుగు అడుగుల కంటే తక్కువ లోతున గోతులు తవ్వి, అక్కడ బొగ్గుపొరలు కనిపిస్తే దానిని బయటకుతెచ్చేందుకు పక్కన సన్నని మార్గాలను ఈ పని తెలిసిన కార్మికులు సిద్ధం చేస్తారు.
ఒకరు తవ్వు తుంటే, మరొకరు దానిని అందుకుని పైకి తీసు కువచ్చి కుప్పగా పోస్తారు.
తర్వాత జాతీయ రహదారుల మీదుగా తరలించుకువెళ్తారు.
చిన్న చిన్న గోతుల్లోకి దిగి, చేతి పనిముట్లతో తవ్వుతూ పని పూర్తి చేయడంలో వీరు అనుభ వజ్ఞులు.
అశాస్త్రీయంగా ఉండడం, ఇది సురక్షితం కాకపోవడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్టీజీటీ) 2014లోనే నిషేధం విధిం చింది.
తక్కువ స్థాయిలో లభ్యమయ్యే బొగ్గును ఇతరత్రా మార్గాల్లో తవ్వి తీసుకురావడం ఆర్ది కంగా లాభదాయకం కాకపోవడంతో అనధికారి కంగా పని కొనసాగుతూ వస్తోంది.
ఇరుకైన దారుల్లో వెళ్లడానికి పిల్లలైతే సరిపోతారని వారినే అక్రమంగా వాడుతున్నారు.

మైఖేల్ డగ్లస్ కు సత్యజిత్ రే పురస్కారం

ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటుడు మైఖేల్ డగ్లస్ ను సత్యజిత్ రే లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ పురస్కారం వరించింది.
గత 10రోజులుగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు రంతో ముగి శాయి.
ఇందులో భాగంగానే చివరి రోజున హాలీవుడ్ నటుడు మైఖే సీఎం డా. సావంత్ ఈ అందజేశారు.
ఈ సందర్భంగా మైఖేల్.. సత్య జిత్ రే సినీ ప్రపంచానికి చేసిన సేవలను కొని యాడుతూ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు.
జర్మనీ చిత్రం 'ఎండ్ లెస్ బోర్డర్స్' ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పీకాక్ పురస్కారం గెలుచుకుంది.
'కాంతార చిత్రానికి గానూ రిషబ్ శెట్టికి స్పెషల్ జ్యూరీ పురస్కారం దక్కింది.

రూ.2000కు మించిన తొలి ఆన్ లైన్ లావాదేవీ 4 గంటల తర్వాతే

ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటిక ప్పుడు చర్యలు తీసు కుంటోంది.
ఈ నేప థ్యంలో కొత్తగా మరో నిబంధనను తీసుకొచ్చే ఆలోచ నలో ఉంది.
ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పద్దతిలో లావాదేవీ జరగాలంటే.. రూ.2,000 లోపు అయితేనే వెంటనే వీలవుతుంది.
తొలి లావాదేవీలో అంతకు మించిన మొత్తాన్ని పంపాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని యోచిస్తున్నట్లు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారని ఒక ఆంగ్ల వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన నివేదికలో మొత్తం 13,530 ఆన్లైన్ మోసాలు నమోదైనట్లు తెలిపింది.
వీటి మొత్తం విలువ రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం మోసాలు ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించినవే.
భారీ మొత్తం కోల్పోకుండా.. ఆన్లైన్ మోసాలను మరింత సమర్థంగా అడ్డుకునేందుకు.. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి విడతలోనే రూ.2,000కు మించి ఆన్లైన్లో
నగదు బదిలీ చేయాలంటే.. కనీసం 4 గంటల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
యూపీఐ లావాదేవీలకే కాకుండా.. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీ ఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్జీఎస్) లావాదేవీలకూ ఈ షరతును వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
ప్రస్తుతం ఇలా... ఇప్పుడున్న నిబంధనల ప్రకారం తొలిసారిగా యూపీఐ లావాదేవీని నిర్వ హించే వారు 24 గంటల వ్యవధిలో రూ.5,000 మించి చేయడానికి వీలుకాదు.
అదే విధంగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) లావాదేవీల్లో ఒకసారి అవతలి వ్యక్తిని రిజిస్ట్రే షన్ చేసిన తర్వాత, 24 గంటల పాటు రూ.50,000 వరకే బదిలీ చేసుకునే వీలుం టుంది. దీన్ని ఒకేసారి పంపొచ్చు. లేదా విడతల వారీగా పంపించొచ్చు.
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే... ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి ఆన్లైన్ లావాదేవీని రూ.2000 వరకే అనుమతిస్తారు.
అంతకు మించి చెల్లించినప్పుడు.. నాలుగు గంటల వ్యవధిలో వినియోగదారుడు ఆ లావాదే వీని రద్దు చేసుకోవచ్చు.
లేదా మార్చు కునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసాలను సులభంగా అడ్డుకోవ చ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

టీకాలపై సంయుక్త పరిశోధనకి యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీతో భారత్ బయోటెక్ భాగస్వామ్యం

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ (సిడ్నీ ఐడీ)తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదు ర్చుకుంది.
టీకాలపై పరిశోధనలో ఉమ్మడిగా ముందుకు సాగాలనేది ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం.
భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే అంటువ్యాధులు, మహమ్మారిని పోలిన వ్యాధుల నుంచి రక్షణ కోసం అవసరమైన టీకా లను ఆవిష్కరించాలని భారత్ బయోటెక్ లక్ష్యంగా పెట్టుకుంది.
దీనికి ప్రస్తుత భాగ స్వామ్య ఒప్పందం ఉపకరిస్తుందని ఆశిస్తోంది.
టీకాల అభివృద్ధికి అవసరమైన నూతన సాంకే తిక పరిజ్ఞానాన్ని, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ తో కలిసి అభివృద్ధి చేస్తామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
తద్వారా ప్రజారోగ్యానికి తమ వంతు చేయూత ఇవ్వాలనేది తమ ఆలోచనగా వివరించారు.
యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ జేమీ ట్రిక్కాస్ స్పందిస్తూ, కొత్త టీకాలు, బయోథెరప్యూ టిక్న ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నామని, అందుకు భారత్ బయోటెక్ భాగస్వామ్యం ఉపకరిస్తుందని అన్నారు.
టీకాల ఉత్పత్తిలో మనదేశం ! అగ్రగామిగా ఉన్న విషయం విదితమే.
'కొవిడ్’ సంక్షోభంలో, టీకాల ఆవిష్కరణ, ఉత్పత్తిలో మన దేశానికి ఉన్న సత్తా ప్రపంచానికి తెలిసింది.
ప్రపంచ అవసరాల్లో 60 శాతం మేరకు కొవిడ్ టీకాలను మన కంపెనీలు సరఫరా చేశాయి. ఇందులో భారత్ బయోటెక్ క్రియాశీలక పాత్ర పోషించింది.

ఇండియా పారా ఆర్చర్ శీతల్ దేవి కి టాప్ ర్యాంక్

పారా ఆసియా గేమ్స్ రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గిన ఇండియా పారా ఆర్చర్ శీతల్ దేవి పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
తాజా జాబితాలో విమెన్స్ కాంపౌండ్ ఓపెన్ కేటగి రీలో రెండు స్థానాలు ఎగబాకి వరల్డ్ నంబర్ వన్ గా నిలిచింది.
మరోవైపు పారా ఆసియా చాంపియన్షి ప్లో మూడు బంగారు పతకాలు సాధించిన రాకేష్ కుమార్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానం సాధించాడు.
ఆసియా చాంపియన్ షిప్ బ్రాంజ్ గెలిచిన సరిత ఏడు స్థానాలు మెరుగై ఆరో ర్యాంక్ అందుకుంది.

ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ కు బుకర్ ప్రైజ్

ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు.
ఆయన రాసిన ప్రాఫెట్ సాంగ్ నవలకు ఈ అవార్డు లభించింది.
ఐర్లాండ్ దేశం నిరంకుశత్వం లోకి జారిపోతున్న సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టాలను ఇందులో లించ్ వివరించారు.

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ (53) 2023, నవంబరు 27న ప్రమాణస్వీకారం చేశారు.
అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత రెండు చిన్న పార్టీల మద్దతుతో లక్సన్కు చెందిన నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

(2023-24)లో భారత వృద్ధి రేటు 6.4 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్ధి రేటు 6.4 శాతంగా నమోదు కావొచ్చని అమెరికాకు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.
గతంలో భారత వృద్ధిపై సంస్థ అంచనా 6 శాతం కాగా, ఇప్పుడు పెంచింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) లో వృద్ధి రేటు అంచనాను 6.9 శాతం నుంచి 6.4 శాతానికి సంస్థ కుదించింది.
అంతర్జా తీయ వృద్ధి మందగించడం, వడ్డీ రేట్ల పెంపు ప్రభావం లాంటివి దేశీయ వృద్ధికి సవాళ్లుగా నిలుస్తాయని సంస్థ అభిప్రాయపడింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, ఫిచ్ సంస్థలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 6.3 శాతంగా అంచనా వేశాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ 6.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.
2022-23లో దేశ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది.

ధూమపాన రహిత దేశంగా స్వీడన్!

స్వీడన్ అతి త్వరలో తనకు తాను ధూమ పాన రహిత దేశంగా ప్రకటించు కునే స్థాయికి చేరింది.
→ ప్రస్తుతం రోజూ పొగతాగే వారి సంఖ్య ఆ దేశ జనాభా (1.05 కోట్లు)లో 5% కంటే తక్కువకు తగ్గిపోవడమే ఇందుకు కారణం.
→ ఈయూలో సిగరెట్ల వాడకం అతి తక్కువ ఉన్నది స్వీడన్లోనే.
→ దేశంలో పొగాకుకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు, నిపుణులు దశా బాల ప్రచారం ఇందుకు దోహదం చేసింది.

అహ్మద్ నగర్ జిల్లా పేరు అహిల్యాదేవి హోల్కర్ జిల్లాగా మార్పు

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా పేరును ఇకపై అహి ల్యాదేవి హోల్కర్ జిల్లాగా మార్చి పిలవనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రకటించారు.
→ 18వ శతాబ్దానికి చెందిన ఇందౌర్ రాజ్య దిగ్గజ పాలకురాలే అహిల్యాదేవి (అహిల్యాబాయి).
→ అహ్మద్ నగర్ జిల్లాలోని అహి ల్యాదేవి జన్మస్థలమైన చోండీ పట్టణంలో జరిగిన 298వ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ శిందే ఈ ప్రకటన చేశారు.
→ శిందే సర్కారు ఇదివరకే ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్, ఉస్మా నాబాద్ పేరును ధారాశివ్ గా మార్చిన విషయం తెలిసిందే.

సీవీసీగా ప్రవీణ్ శ్రీవాస్తవ

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ నియ మితులయ్యారు.
→ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుత విజి లెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను సీవీసీగా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
→ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారని, కార్యక్ర మంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారని తెలిపింది.
→ సీవీసీ సురేశ్ ఎన్ పటేల్ పదవీ కాలం గత ఏడాది డిసెంబర్ పూర్తయింది. అప్పటి నుంచి శ్రీవాస్తవ తాత్కాలిక సీవీసీగా కొనసాగుతున్నారు.
→ సీవీసీగా 65 ఏళ్లు వచ్చే వరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు.
→ 1988 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన శ్రీవాస్తవ అస్సాం-మేఘాలయ కేడర్ కు చెందిన వారు.
→ గత ఏడాది జనవరి 31న కేబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా పదవీ విరమణ పొం దారు.
→ సీవీసీ సారథ్యంలో విజిలెన్స్ కమిషన్ గరి ష్టంగా ఇద్దరు కమిషనర్లు ఉండొచ్చు.
→ ఐబీ మాజీ చీఫ్ అర్వింద్ ఒక్కరే ప్రస్తుతం కమిషనర్గా ఉన్నారు. మరో కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది.


ఈశాన్య భారతంలో తొలి వందేభారత్

ఈశాన్య భారతంలో తొలి వందే భారత్ రైలు పరుగులు ప్రారంభించింది.
→ అస్సాం లోని గువా హటి నుంచి పశ్చిమబెంగాల్ లోని న్యూ జల్పాయు రిల మధ్య తిరిగే ఈ రైలును ప్రధానిమోదీ వర్చువల్ విధానంలో పచ్చజెండా ఊపి ప్రార ంభించారు. గువాహటి రైల్వేస్టేషన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటా రియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తదితరులు రైలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

వర్చువల్ విధానంలో షాంఘై సహకార సంస్థ సదస్సు

మన దేశం నేతృత్వం వహిస్తున్న 'షాంఘై సహకార సంస్థ' (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు జులై 4న వర్చువల్ విధానంలో జరగనుంది.
→ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రి త్వశాఖ.. దీనికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
→ సభ్యదేశాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసు కున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
→ గత ఏడాది ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్ నగరంలో నిర్వహించిన ఎస్సీవో సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్య క్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈసారి వర్చువల్గా జరిగే సదస్సుకు మోదీ అధ్యక్షత వహిస్తారు. సభ్య దేశాలైన చైనా, రష్యా, కజఖాన్, కిర్గిజ్ఞాన్, పాకి స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్లను సదస్సుకు ఆహ్వా నించారు.
→ పరిశీలక దేశాలు హోదాలో ఇరాన్, బెలారస్, మంగోలియాలను ఆహ్వానిస్తున్నారు.

అత్యంత విలువైన భారత బ్రాండ్ టీసీఎస్

అత్యంత విలువైన భారత బ్రాండ్ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిలిచింది.
→ అత్యుత్తమ 50 బ్రాండ్లతో ఈ జాబితాను ఇంటర్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది.
→ ఈ జాబితాలో రూ.. 1,09,576 కోట్ల బ్రాండ్ విలువతో టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది.
→ రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 65,320 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.53,324) రెండు, మూడు స్థానాలు దక్కిం చుకున్నాయి.
→ గత దశాబ్ద కాలంలో ఇతర రంగాలను అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో నిలిచింది.
→ ఈ జాబితాలోని అగ్రగామి 5 బ్రాండ్లలో 3 స్థానాలను టెక్నాలజీ కంపెనీలే సాధించాయి.
→ ఆర్థిక సేవల రంగం నుంచి 9 సంస్థలు జాబితాలో చోటు పొందాయి.
→ హోమ్ బిల్డింగ్, ఇన్ఫ్రా రంగం నుంచి 7 కంపెనీలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి.
→ గత పదేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎస్ఎమ్సీజీ అగ్ర స్థానంలో నిలిచింది.
→ ఈ రంగం 25 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీ ఆర్) నమోదుచేస్తోంది.
→ హోమ్ బిల్డింగ్, ఇన్ఫ్రా (17 శాతం), టెక్నాలజీ (14 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
→ హోమ్ బిల్డింగ్, ఇన్ఫ్రా రంగం రూ. 6900 కోట్ల నుంచి రూ.34,400 కోట్లకు వృద్ధి చెందగా, టెక్నాలజీ రూ. 69,300 కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.
→ అగ్రగామి 10 బ్రాండ్ మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్ల వాటా 46 శాతంగా ఉంది.
→ మొత్తం జాబితాలో అగ్రగామి 5 బ్రాండ్ ల వాటా 40 శాతంగా ఉంది.

నూతన పార్లమెంట్ రూపశిల్పి బిమల్ హస్ముఖ్ పటేల్

ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు.
→ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ భవనాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా... ఆయనే ప్రముఖ అర్కిటెక్ట్ బిమల్ హస్ముఖ్ పటేల్.
→ పార్లమెంట్ కొత్త భవన రూపాన్ని డిజైన్ చేసిన గుజరాత్ కు చెందిన హెచ్సీపీ డిజైన్స్ సంస్థ యజ మానే బీమాల్ పటేల్, గుజరాత్లోని అహ్మదాబాదు చెందిన పటేల్ 1961 ఆగస్టు 31న జన్మించారు.
→ ఆయన తండ్రి హస్ముల్ చందూలాల్ పటేల్ వాస్తు, కల్పి ఆయన నుంచే ఆర్కిటెక్చర్ కళ బిమల్ కు అబ్బింది.
→ 1960లో చందూలాల్ హెచ్సీపీ సంస్థను ప్రారంభించారు. తండ్రికి తగ్గ వారసుడిగా బిమల్ పటేల్ కూడా ఇదే రంగంలోకి అడుగుపెట్టారు.
→ అహ్మ రాబాద్లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ -గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
→ ఆ తర్వాత కాలిఫో ర్నియా యూనివర్సిటీ నుంచి రీజినల్ ప్లానింగ్లో పీహెల్డీ సాధించారు.
→ అదే యూనివర్సిటీకి 2012లో ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.

త్రికోణ ఆకారం అందుకే:-
→ 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్ట్ హెచ్ సీపీ డిజైన్స్ సంస్థ కన్సల్టెన్సీ బీడ్ ను దక్కించుకుంది.
→ అలా పార్లమెంటు డిజైన్ చేసే బాధ్యత బిమల్ కు దక్కింది.
→ దేశ అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష లకు చిహ్నంగా సరికొత్తగా పార్లమెంట్ భవనాన్ని ఆయన డిజైన్ చేశారు.
→ రైజింగ్ ఇండియా'ను ప్రతి బింబించేలా దీన్ని తీర్చిదిద్దామని బిమల్ తెలిపారు.
→ పార్లమెంట్ కొత్త భవనాన్ని త్రికోణాకృతిలో తీర్చిది డ్డారు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట.
→ 'దేశంలోని అన్ని సంస్కృతుల్లో త్రిభుజాలకు పవిత్ర ప్రాముఖ్యత ఉంటుంది.
→ ఉదాహరణకు శ్రీయంత్రం, త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందుకే ఆ నిర్మాణాన్ని ఎంచుకున్నాం.
→ ఇక, లోక్ సభ, రాజ్యసభ, సెంట్రల్ లాన్ ఇలా మూడు ప్రధాన బాగాలుగా పార్లమెంట్ను డిజైన్ చేశాం" అని బిమల్ పటేల్ ఓ సందర్భంలో తెలిపారు..


2019లో వరించిన పద్మశ్రీ :-
పార్లమెంట్ తో పాటు బిమల్ పటేల్ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు డిజైన్ చేశారు.
→ అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వారణాసిలోని కాశీ విశ్వనాధ్ ధాం పూరీ లోని జగన్నాధ ఆలయ బృహత్తర ప్రణాళిక ను రూపొందించింది కూడా ఆయన సంస్థే తన ప్రతిభతో ఎన్నో అవార్డులు పొందారు.
→ ఆయన సేవలకు గానూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం బిమల్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

పార్లమెంట్లో ఆసక్తికర మ్యాప్
పార్లమెంట్ నూతన భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్ ఆసక్తికరంగా మారింది. అది పురాతన భారతదేశాన్ని సూచించే విధంగా ఉంది.
→ అందులో ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి.
→ ఈ మ్యాప్ ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్లో షేర్ చేశారు. సంకల్పం సుస్పష్టం.. అఖండ భారత్ అంటూ " జోషి ట్వీట్ చేశారు.
→ ఈ అంశంపై కర్ణాటక బాజపా కూడా స్పందించింది. 'ఇది మనం గర్వించదగిన గొప్ప నాగరికతకు చిన్నఅని తన ట్విటర్ హ్యాండిల్ పేర్కొంది.
→ ఆవిండ భారత్ భావన అనేది ప్రస్తుత ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లా దేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్లాండ్ లతో కూడిన భౌగో శిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతదేశాన్ని సూచిస్తుంది.

స్వదేశీ ఎన్వీఎస్-01 ప్రయోగం సక్సెస్

ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం చేరింది.
→ అంతరిక్ష ప్రయోగాల్లో మరోసారి సత్తాచాటిన ఇస్రో. స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహం. ఎన్వీఎస్-1ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరవేసింది.
→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి చేపట్టిన జీఎస్ఎల్వీఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
→ కౌంట్ డౌన్ పూర్తికాగానే... జీఎస్ఎల్వీ రాకెట్ స్వదేశీ నావిక్ ఉపగ్రహం ఎన్వీఎస్-01తో షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకె ళ్లింది.
→ మూడు దశల్లోనూ సునాయాసంగా ప్రయా ణించి 2,212 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 18.45 నిమిషాల్లోనే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో) భూ బదిలీ కక్ష్యలోకి చేర్చింది.
→ మిషన్ కంట్రోల్ సెంటర్లో సూపర్ కంప్యూటర్ల ద్వారా ప్రయోగాన్ని వీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్య లోకి చేర్చిన వెంటనే ప్రయోగం విజయవంతమైం దని ప్రకటించారు.
→ అనంతరం ఆయన మాట్లాడుతూ.. నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ బలోపేతం కోసం ఎన్వీఎస్-01 ఉప గ్రహాన్ని ప్రయోగించామని, ఇది విజయవంతం కావ డంతో స్వదేశీ నావిగేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
→ ఈ రెండో తరం ఉపగ్రహంలో ఎల్ ఎల్, ఎస్ బ్యాండ్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన రుబీడియం అణు గడియారం కూడా ఏర్పాటు చేశారు.
→ ఇప్పటికే రోదసీలో ఉన్న 7 ఉపగ్రహాల తో భారత్కు నావిగేషన్ సేవలు అందుతు న్నాయి.
→ వాటిలో మొదట ప్రయోగించిన ||ఐఆర్ఎన్ఎస్-1 జీ ఉపగ్రహ కాలపరిమితి. ముగియడంతో దాని స్థానంలో ఎన్పీఎస్-01 ను ప్రయోగించారు.
→ ఈ ఉపగ్రహంలోని ఎల్ బ్యాండ్ : భారత్ చుట్టూ 1,500 కిలోమీటర్ల పరిధిలో జీపిఎస్ సేవలు అందించనుంది.
→ రెండోతరం నావిక్ ఉపగ్ర హాలు 12ఏళ్లు సేవలందించనున్నాయి.
→ ప్రస్తుతం అంతరిక్షంలో ఐఆర్ఎన్ఎస్ ఉపగ్రహాల కాలంచెల్లిపో తున్న తరుణంలో వాటి స్థానంలో 6నెలల్లో మరో 4 నావిక్ ఉపగ్రహాలను పంపనున్నట్టు ఇస్రో తెలిపింది.

జూలైలో చంద్రయాన్-3 ప్రయోగం

చంద్రుడిపై అధ్యయనం కోసం చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం జూలైలో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
→ జిఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగానంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్ ప్రయోగానికి ఉపయోగించే ఎల్వీఎం రాకెట్ను రూపొందిస్తున్నామన్నారు.
→ చంద్రయాన్ -2 లో పంపిన ఆర్బిటర్ ఇప్పటికీ పనిచేస్తోందని, చంద్రుని చుట్టూ తిరుగుతూ హై రిజల్యూషన్ ఫొటో లను అందిస్తోందని తెలిపారు.
→ అలాగే గగన్యోన్ ప్రయోగం ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది గానీ ఉంటుందని, దీనికి సంబంధించిన క్రూ మాడ్యూల్ పరీక్ష ఈ ఏడాది జూలైలో ఉంటుందన్నారు.
అణు గడియారం వాడే ఎలైట్ క్లబ్లోకి ఇస్రో :-
→ జీపీఎస్ ఉపగ్రహాల్లో రుబీడియం అణు గడి యారం వంటి అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిక రాన్ని వినియోగించే అంతరిక్ష సంస్థల ఎలైట్ క్లబ్ - భారత్ కు చెందిన ఇస్రో కూడా చేరింది.
→ ఇప్ప టివరకు నాసా (అమెరికా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈయూ), సీఎన్ఎస్ఏ (చైనా), ఆరోవోఎస్ సీవోఎస్ఎంవోఎస్ (రష్యా) అంతరిక్ష సంస్థలు మాత్రమే అటామిక్ క్లాక్లను వినియోగిస్తున్నాయి. ఈ జాబితాలో ఐదోదిగా ఇస్రో చేరింది.
→ సాంకేతికం గా ఎన్వీఎస్-1లోని ప్రతి భాగం ఓ ఇంజనీరింగ్ అద్భుతం, దీనిలో ప్రత్యేకమైనది రుబీడియం అణుగడియారం, ఈ అరుదైన గడియారం తయారీ చాలా కష్టం.
→ దీనిలోని అదునాతన సాంకేతికత, అత్యంత కచ్చితత్వం చాలా అంతరిక్ష యాత్రలకు అనివార్యంగా మారింది.
→ నావిక్ ఉపగ్రహంలో ఇస్రో ఏర్పాటు: చేసిన రుబీడియం అటామిక్ క్లాక్ ను దేశీయంగా తయారు చేశారు.
→ అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికే షన్ సెంటర్ దీన్ని రూపొందించింది. పరమాణువు ల్లోని శక్తుల వ్యవస్థతో అత్యంత కచ్చితత్వంతో పని చేసే గడియారం ఇది.
→ న్యూక్లియస్, ఎలక్ట్రాన్ వంటి శక్తుల ఆధారంగా, అణుపుల చలనశీలతను బట్టి ఇది పనిచేస్తుంది.
→ ఈ గడియారంలో 10 కోట్ల సంవత్సరాలకు ఒక సెకను తేడా కనిపిస్తుంది.

కక్ష్యలోకి నావిక్-01 ఉపగ్రహం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రెండో తరం నావిక్ ఉపగ్రహ శ్రేణిలో మొదటిది అయిన ఎన్వీఎస్- 01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవే శపెట్టింది.
→ ఆంధ్రప్రదేశ్ లోని షార్ నుంచి ఉపగ్రహంతో కూడిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
→ 19 నిమిషాల వ్యవధిలో 2232 బరువు గల ఎస్వీఎస్-01ను 251 కి.మీ.ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ప్రకటించారు.
→ ఎన్వీ ఎ.ఎస్-01 ఉపగ్రహం ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్ లలో పనిచేసే నావిగేషన్ పేలోడ్లను కలిగి ఉంది.
→ ఉపగ్రహం రెండు సౌర పలకల శ్రేణుల ద్వారా శక్తిని పొందుతుంది. తద్వారా 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఇది పని చేయనుంది.
→ దేశీయంగా అభివృద్ధి చేసిన రుబిడియం అటా మిక్ క్లాక్ను ఉపగ్రహంలో అమర్చారు.
→ వైమానిక సేవలు, నావిగేషన్, వ్యవసాయం, సర్వేయింగ్, అత్యవసర సేవలు, సముద్ర చేపల పెంపకం మొదలైన రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్టమైన సమాచారాన్ని అంది స్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

విడిభాగాలు అందించిన అనంత్ టెక్నాలజీస్

రాకెట్ కు, ఎన్వీఎస్-01 ఉప గ్రహ తయారీకి తాము కీలక విడిభాగాలను అందించినట్లు హైదరాబాద్, బెంగళూరు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అనంత్ టెక్నాలజీస్ వెల్లడించింది.
→ ఈ సంద ర్భంగా సంస్థ సీఎండీ డాక్టర్ సుబ్బారావు పావులూరి స్పందిస్తూ.. తాము సరఫరా చేసిన సిస్టమ్, ప్యాకేజ్లు సమర్థంగా పనిచేశాయన్నారు.

తెలంగాణ అమరుల ఆడిటోరియం

సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న తెలంగాణ అమరుల ఆడిటోరియం నిర్మించారు.
→ రెండో అంతస్తులో 700 మందికి స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతోంది.
→ సుమారు సరిపోయేలా కన్వెన్షన్ హాల్, మూడో అంతస్తులో, 3.20 ఎకరాల్లో దాదాపు రూ.179 కోట్ల వ్యయంతో దీనిని రెస్టారెంట్, నాలుగో అంతస్తులో సందర్శకుల వ్యూపాయింట్ చేపట్టిన విషయం తెలిసిందే.
→ ప్రమిద ఆకారంలో నాలుగు ఏర్పాటుచేస్తున్నారు.
→ అమెరికా షికాగోలోని క్లౌడ్ గేట్ ను పోలి అంతస్తుల భవనంతో పాటు పైన నిరంతరం వెలిగే జ్యోతి ఉండే ఈ స్మృతి చిహ్నాన్ని.. దశాబ్ది ఉత్సవాల్లో చిహ్నాన్ని ఏర్పాటుచేశారు.
→ మొదటి అంతస్తులో తెలుగా రా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అమరుల జ్ఞాపకాలతో మ్యూజియం, 100 మంది కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పదవీ విరమణ తర్వాత జడ్జీలకు రెండేళ్ల విరామం ఉండాలి

సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలకు పద వీవిరమణ తర్వాత రెండేళ్ల పాటు 'కూలింగ్ ఆఫ్' కాలం ఉండేలా ఆదేశాలివ్వా లని బాంబే న్యాయవా దుల సంఘం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
→ ఈ విరామం ముగిశాకే వారు గవర్నర్ వంటి రాజకీయ పదవులను చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
→ న్యాయ మూర్తులు ఇలాంటి పదవులను స్వీకరించడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొంటున్నాయని పేర్కొంది.
→ బాంబే న్యాయవాదుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అహ్మద్ మెహ్దీ అల్జీ సోమవారం ఈ పిటిషన్ వేశారు.
→ ఆంధ్రప్ర దేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ ఏడాది ఫిబ్రవరి 12న నియమితులయ్యారని ఆయన గుర్తుచేశారు. అందువల్లే తాము పిటి 'షన్ వేసినట్లు తెలిపారు.
→ గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ పి.సదాశివం కూడా కేరళ గవర్నర్ గా పనిచేశారని పేర్కొన్నారు.

న్యూయార్క్ కు ముంపు ముప్పు!

అగ్రరాజ్యం అమెరికాలో ఖరీదైన కలల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్క ముంపు ముప్పు పొంచి ఉంది.
→ పెరుగుతున్న సముద్ర మట్టం, ఆకాశహర్మ్యాలు, జనాభాతో ఒత్తిడి తీవ్రమై భూమి క్రమక్రమంగా కూరుకుపోతోంది.
→ వీటి ప్రభావంతో న్యూయార్క్ నగరం ఏటా 1 నుంచి 2 మిల్లీమీటర్ల మేరకు ముంపునకు గురవుతోందని తాజా అధ్య యనం ఒకటి కుండబద్దలు కొట్టింది.
→ తక్షణమే అ మత్తమై నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ముంపు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది.
→ భూమి ఒత్తిడికి గురయ్యే ప్రాంతాల్లో ఇది సహజ సిద్ధంగా చోటుచేసుకునే ప్రక్రియే అయినా.. న్యూయార్క్ నగరంలో మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉందని 'ఎర్త్ ఫ్యూచర్' జర్నల్ ఈ నెలలో అధ్యయనాన్ని ప్రచురించింది.
→ ఇప్పటికే న్యూయార్క్ నగరంలో 10 లక్షల భవంతులు ఉండగా.. వీటికి వాడిన 1.7 ట్రిలియన్ టన్నుల కాంక్రీట్, ఇతర సామగ్రి ద్వారా ఒత్తిడి పెరిగి భూమి గిపోతోందని అధ్యయనం పేర్కొంది.
→ న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నేల కుంగి పోతూ నీరు పైకి వస్తోందని, ఏదో ఒక సమయంలో ఈ రెండూ సమాంతరంగా కలిసే ప్రమాదముందని అమెరికా జియోలాజికల్ సర్వేకు చెందిన ప్రముఖ పరిశోధకుడు టామ్ పర్సన్ తెలిపారు.

ఇంటి నుంచే ఓటు...!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణలోనూ దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
→ దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. కరోనా నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో స్పందన ఆశాజనకంగా ఉండటంతో ఆ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
→ మరింత చైతన్యాన్ని తీసుకురాగలిగితే రానున్న కాలంలో ఎక్కువ మంది. ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
→ ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో ఈ విధానాన్ని అమలు చేశారు.
→ ఆ రాష్ట్రంలో దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటిన ఓటర్లు 18.02 లక్షల మంది ఉన్నారు. అందులో 99,529 మంది పోస్టల్ బ్యాలెట్ను ఎంచుకున్నారు.
→ వారిలో సుమారు 97 శాతం మంది వినియోగించుకోవటం విశేషం.
→ రాష్ట్రంలో 4,99,536 మంది దివ్యాంగ ఓటర్లు. 80 ఏళ్లు పైబడిన వృద్ధ ఓటర్లు 4,86,257 మంది ఉన్నారు.
→ మొత్తంగా " 9,85,793 మంది అర్హులు ఉన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికలో ఈ విధానాన్ని అమలు చేశారు.
→ ఆ నియోజకవర్గంలో 8,131 మంది అర్హులు ఉండగా.. 739 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ను ఎంచుకున్నారు. వారిలో 686 మంది ఓటు వేశారు.
→ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి అయిదు రోజుల్లోగా ఆయా ఓటర్లు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు.

కొత్త ఓటర్ల నమోదుపై 5 రాష్ట్రాలకు ఆదేశం

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టో బరు 1వ తేదీలోపు 18 ఏళ్లకు చేరుకొనే వారందర్నీ ఓటర్లుగా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలం గాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను ఆదేశించింది.
→ జూన్ 23 వరకు ఇంటింటి తనిఖీ చేపట్టాలని, సబం ధిత అన్ని విధివిధానాలను పాటించి అక్టోబరు 4వరకు ఓటర్ల తుది జాబితా ముద్రించాలని స్పష్టంచేసింది.
→ ఎన్నికల సంఘం రూపొందించిన 12-డి దరఖాస్తును భర్తీ చేసి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయాలి.
→ వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.
→ అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు.
→ రహస్య విధానంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. రహస్య ఓటు మినహా మిగతా ప్రక్రియనంతా అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తారు.
→ పోస్టల్ బ్యాలెట్ను ఎంచుకున్న వారు ఏ కారణంతోనైనా ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేని పక్షంలో ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే అవకాశం ఉండదు..

ఎక్కువ చెట్లు.. పొడవైన భవనాలతో నగరాల్లో తగ్గనున్న వేడి

గుబురైన మహావృక్షాలను పెంచడం, పరావర్తన సామర్థ్యం కలిగిన పేవ్మెంట్లు, సన్నటి వీధుల వెంబడి పొడవైన భవనాల నిర్మాణం ద్వారా నగ రాల్లో ఉష్ణ ప్రభావాన్ని తగ్గించొ చ్చని తాజా పరిశోధన పేర్కొంది.
→ అమెరికాలోని పెన్సి ల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. నగరాల్లోని పరిస్థితుల దృష్ట్యా అవి తీవ్రస్థాయిలో వేడిని ఒడిసిపడుతుంటాయి. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్(యూహెచ్ఎస్ఐ) ఎఫెక్టా పిలుస్తుంటారు.
→ దీనివల్ల వేసవిలో ప్రమాదకర స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
→ అయితే కొన్ని మార్పుల వల్ల ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా. తేల్చారు.
→ భవనాలు, ఇతర మౌలిక వస తుల నుంచి వెలువడే వేడి వల్ల ఆరుబ యట గాలి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. దీన్ని తగ్గించే శక్తి చెట్లకు ఉంది. సన్నటి వీధుల పక్కనే ఎత్తైన భవనాలను నిర్మించాలని కూడా వారు సూచించారు. దీనివల్ల వీధులకు నీడ లభిస్తుందని పేర్కొన్నారు.
→ సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందించే పేవ్మెంట్ల వల్ల ఆరుబయట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ప్రజ లకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరిం చారు.
→ యూహెచ్ఎస్ఐ వల్ల ఉష్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.

దిల్లీ చేరిన కంబోడియా రాజు

కంబోడియా రాజు నరోదమ్ సిహ మోని మన దేశ పర్యటనకు గాను దిల్లీ చేరుకున్నారు.
→ విదేశాంగ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఆయనకు పాలం వాయు సేన స్థావరంలో ఘనంగా స్వాగతం చెప్పారు.
→ 1952లో మొదలైన భారత్-కంబో డియా దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్త యిన సందర్భంగా సిహమోని భారత సందర్శ నకు వచ్చారు.
→ 1963లో సిహమోని తండ్రి నరో దమ్ సిహనౌక్ భారత న్ను సందర్శించిన తర వాత కంబోడియా రాజు మళ్లీ భారత్కు రావడం ఇదే మొదటిసారి.
→ సిహ మానికి భారత రాష్ట్రపతి భవనంలో అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతారు.
→ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలతో ఆయన చర్చలు జరుపుతారు.
→ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖడ్, విదేశాంగమంత్రి ఎస్. జైశంక ర్లు కంబోడియా రాజును కలుసుకొంటారు.

అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన చైనా తొలి పౌర వ్యోమగామి

చైనా విజయవం తంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది.
→ వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి కూడా ఉన్నారు.
→ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని తమ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశిం చారు.
→ ఇది చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక ముందడుగు.
→ ముగ్గురు వ్యోమగాములు షెంజౌ-16 వ్యోమనౌకలో రోదసిలోకి పయనమయ్యారు.
→ లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ దీన్ని మోసుకె ళ్లింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఇది దూసుకెళ్లింది.
→ ప్రయోగించిన 10 నిమిషాల తర్వాత షెంజౌ-16.. రాకెట్ నుంచి వేరైంది. నిర్దేశిత కక్ష్యలోకి చేరింది.
→ ముగ్గురు వ్యోమగాములు ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష కార్యక్రమ సంస్థ (సీఎం ఎస్ఏ) పేర్కొంది.
→ కొద్దిగంటల తర్వాత ఈ వ్యోమనౌక.. 'తియాంగాంగ్' అంతరిక్ష కేంద్రం లోని కోర్ మాడ్యూల్ 'తియానే'తో అనుసంధా నమైంది.
→ అనంతరం ముగ్గురు వ్యోమగాములు ఆ రోదసి కేంద్రంలోకి ప్రవేశించారు.
→ గత నవంబరు నుంచి అక్కడే ఉంటున్న మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లను వారు కలుసుకు న్నారు.
→ తియాన్హేలో ఆరుగురు వ్యోమగాములు ఉండటం ఇది రెండోసారి. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఆఫ్రో నాట్లు త్వరలో భూమికి తిరిగొస్తారు.
→ కొత్తగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వారు ఐదు నెలల పాటు అక్కడే ఉంటారు.
→ వీరిలో గుయ్ హచాయో.. చైనా తొలి పౌర వ్యోమగామిగా గుర్తింపు పొందారు.
→ ఆయన బీజింగ్ లోని బెయ్ హాంగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పనిచేస్తున్నారు.
→ తాజా యాత్రలో ఆయన పేలోడ్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వర్తిస్తారు.
→ చైనా తరుపున ఇప్పటివరకూ రోదసిలోకి వెళ్లిన వారంతా సైనికదళాల నుంచి వచ్చినవారే.

దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు

దేశ రాజధాని దిల్లీలోని పురానా ఖిల్లాలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో 2500 ఏళ్ల కిందటి ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.
→ మౌర్యుల కాలానికి ముందు, తర్వాత 9 సాంస్కృ తిక తరాలకు (కల్చరల్ లెవల్స్క) సంబంధిం చిన ఆనవాళ్లు దొరికినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ తవ్వ కాలను కేంద్ర మంత్రి పరిశీలిం చారు.
→ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురానా ఖిల్లా ప్రాంతంలో తవ్వకాలు జరుపు తున్న చోటును 'ఇంద్రప్రస్థ స్థలం' గా గుర్తించి ముందు కాలం నుంచి మొగలుల వరకు చారి నట్లు వెల్లడించారు.
→ మౌర్యులకు ముందు, నని కేంద్ర మంత్రి వెల్లడించారు.
→ 2,500 ఏళ్ల మౌర్యుల కాలం, శుంగులు, కుషాణులు, గుప్తులు, క్రితం నాటి మానవ నివాస ప్రాంతాలు, జీవన గుప్తుల తర్వాత రాజ్పుత్లు, సుల్తానులు, అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లు ఇందులో మొగలుల కాలం వరకు మొత్తం 9 తరాల ఆన స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
→ వాళ్లు లభించాయన్నారు. ఢిల్లీ రాజధాని తవ్వకాలు జరిపిన ఓ చిన్న ప్రాంతం నుంచి 136 ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో మౌర్యులకు నాణేలు, 35 ముద్రలు, పరికరాలు లభించడం వల్ల ఈ ప్రాంతం ఒకప్పుడు వాణిజ్యానికి ముఖ్య త్రక ఆనవాళ్లు బహిర్గతమైన ఏకైక ప్రాంతం ఇదే మైన కేంద్రమని అర్థమవుతోందన్నారు.

ఐటీ శాఖ నుంచి ‘ఈ-అప్పీల్స్ ' పథకం

ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారుల సమస్యల పరిష్కారం కోసం ఐటీ శాఖ మరో వినూత్న పథకం తీసుకొచ్చింది.
→ ఐటీ అధికారుల అసెస్మెంట్ ఆదేశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, పన్ను చెల్లింపుదారులు ఇక నేరుగా ఆన్ లైన్లో ఫిర్యాదులు చేయవచ్చు.
→ ఈ-అప్పీల్స్ స్కీమ్, 2023 పేరుతో ఐటీ శాఖ ఈ పథకం తీసుకొచ్చింది.
→ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ పథకానికి సంబంధించిన వివరాలను నోటిఫై చేసింది.
→ పన్ను చెల్లింపుదారులకు అత్యంత మేలు చేసే ఈ పథకం విజయం దాని అమలుపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

వరంగల్ చాయ్ వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి లకు పీఎం స్వనిధి ఉత్సవాలకు పిలుపు

కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం ప్రారం భించి మూడు సంవత్సరాలు విజ యవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో జూన్ 1 నుంచి 3 వరకు ఉత్సవాలు నిర్వ హిస్తోంది.
→ దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఉత్సవా లకు రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు, ఇద్దరు వీధి వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
→ ఎంపికైన అధికారుల్లో మెప్మా కేంద్ర కార్యాలయా నికి చెందిన కృష్ణచైతన్య, శివకుమార్. ఎంపికైన ఇద్దరు వీధి వ్యాపారుల్లో ఒకరు వరంగల్ నగరానికి చెందిన మహ్మద్ మహబూబ్ పాషా కాగా, మరొ కరు సిరిసిల్లకు చెందిన గడ్డం కృష్ణయ్య ఉన్నారు.
→ వరంగల్ ఎంజీఎం ఆసు పత్రి గేటు వద్ద టీస్టాల్ నిర్వహిస్తున్న మహబూబ్ పాషా కొవిడ్-19 కార ణంగా వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు.
→ పీఎం స్వనిధి పథకంతో తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ. 50 వేల రుణం తీసుకుని వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు.
→ కార్పొ రేషన్ అధికారుల సలహాలతో పీఎం స్వనిధిని సద్వినియోగం చేసుకున్నానని, ఢిల్లీ ఉత్సవాలకు పిలుపు రావడం సంతోషంగా ఉందని పాషా తెలిపారు.

'అమృత్ భారత్'లో మరో 105 స్టేషన్లకు ఆధునిక హంగులు

రాష్ట్రంలోని కాచిగూడ, బేగంపేట రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు సమకూరనున్నాయి.
→ వీటితో పాటు ద.మ. రైల్వే జోన్ పరిధిలో రాజమహేంద్రవరం, గూడూరు, నాందేడ్ రైల్వే స్టేషన్లను కూడా తీర్చిదిద్దను న్నారు.
→ ఈ స్టేషన్ల పునరభివృద్ధి పనులకు సంబం దించి అధ్యయనం చేయించాలన్న రైల్వే జోన్ సూచన మేరకు.. ద.మ. రైల్వే కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.
→ ఇందులో భాగంగా ఆయా స్టేషన్ల మాస్టర్ ప్లాన్లు తయారు చేయనున్నారు. భవిష్యత్తులో పెరిగే రైళ్లు, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేలా. కసరత్తు చేస్తున్నారు.
→ హైదరాబాద్ లోని కాచిగూడ స్టేషను నుంచి వివిధ ప్రాంతాలకు అనేక ప్రధాన రైళ్లు బయల్దేరుతుంటాయి.
→ బేగంపేట ముఖ్య మైన రైళ్లకు హాల్టుగా ఉంది. సికింద్రాబాద్ రద్దీ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు బేగం పేటలో ఎక్కుతుంటారు.
→ ఏపీలోని రాజమహేంద్ర వరం, గూడూరు రైల్వే స్టేషన్లకు ప్రాధాన్యం ఉంది. ఈ రెండు స్టేషన్లను కూడా పునరభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
→ జోన్ పరిధిలోని రైల్వే స్టేషన్లను ప్రాధాన్యాన్ని బట్టి దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
→ తొలిదశలో సికింద్రా బాద్, తిరుపతి, నెల్లూరు స్టేషన్ల పునరభివృద్ధి పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
→ రూ. 699, 77 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులను 2025 నవంబరు నాటికి పూర్తిచేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు.
→ రూ.299.29 కోట్లతో చేపట్టిన తిరుపతి స్టేషన్ పనులను 2025 ఫిబ్రవరి నాటికి, రూ.102.04 కోట్లతో చేప ట్టిన నెల్లూరు స్టేషన్ పనులను 2024 మే నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యం.
→ మహారాష్ట్ర లోని జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.
→ మరోవైపు ద మ. రైల్వేలో మరో 105 రైల్వే స్టేషన్లనూ పునర భివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత్ భారత్ పథకంలో వీటిని చేర్చారు.

రూ.లక్ష కోట్లతో గిడ్డంగులు

ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడమనే బహుళ ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది.
→ దేశంలో ఆహార ధాన్యాల నిల్వల సామ ర్ధ్యాన్ని భారీగా పెంచేందుకు రూ. లక్ష కోట్లను వెచ్చించాలన్న ప్రతిపాదనకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
→ వచ్చే అయిదేళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాల నిల్వలకు ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది.
→ దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాది అవకాశాలు వస్తాయని భావిస్తోంది. సంబంధిత వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ రాకుర్ మీడియాకు వెల్లడించారు.
→ మన దేశంలో ప్రస్తుత గిడ్డంగుల సామర్ధ్యం 1,450 లక్షల టన్నులు మాత్రమే.
→ రాబోయే ఐదే ళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాల న్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా మంత్రి దీనిని అభివర్ణించారు.
→ ప్రతి బ్లాకులో 2 వేల టన్నుల సామర్ధ్యంతో కొత్తగా గోదాములు ఏర్పాటు చేస్తాం.
→ అందుబాటులోకి వస్తే తమ ఉత్పత్తులను విక్రయించాల్సిన అవసరం ఉండదని మంత్రి తెలిపారు.
→ ఆహార ధాన్యాల వృథాను అరికట్టేందుకు ఇది ఉపయోగపడు తుందన్నారు.
→ సుదూర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించాల్సిన అవసరం ఉండదు కనుక రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు భరోసా ఏర్పడు తుందని చెప్పారు.
→ ప్రజాపంపిణీ వ్యవస్థతోనూ ఈ గోదాములను అనుసంధానిస్తామన్నారు.
→ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వల బాధ్యతలను ప్రాత మిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)కు సహకార రంగంలో గోదాముల నిర్మాణ నిర్ణయం సక్రమంగా అమలయ్యేలా చూడటానికి, అందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం అంతర్ మంత్రిత్వ కమిటీ ఏర్పాటుకూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.


నేపాల్ ప్రధాని పర్యటన

నాలుగురోజుల పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ దిల్లీ చేరుకున్నారు.
→ విదేశీ వ్యవహా రాల సహాయమంత్రి మీనాక్షి లేఖి ఆయనకు స్వాగతం పలికారు.
→ ఆయన నేతృత్వంలోని ప్రతి నిధి బృందం ప్రధాని మోదీతో బేటీ కానుంది.
→ నేపాల్ నుంచి మిగులు విద్యుత్తు సరఫరా, వాణిజ్యం, అనుసంధానత తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
→ గత డిసెంబరులో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రచండకు ఇదే తొలి విదేశీ ద్వైపాక్షిక పర్యటన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితోనూ ఆయన భేటీ కానున్నారు. శుక్ర వారం ఇందౌర్కు వెళ్లనున్న ప్రచండ. శనివారం కార్మొండూకు బయల్దేరతారు.

నగరాల అభివృద్ధికి విదేశీ నిధులు

దేశంలోని వివిధ నగరాల అభివృద్ధి కోసం సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ - అండ్ సస్టైన్ (సీఐటీఐఐఎస్) 2.10 అనే కొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రి వర్గం.
→ ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని సమా చార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.
→ ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ(ఏఎఫ్), ఐరోపా సమాజం(ఈయూ), కేఎఫ్ డబ్ల్యూ, జాతీయ అంతర్ మంత్రిత్వ కమిటీ ఏర్పాటు పట్టణ వ్యవహారాల సంస్థ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు.
→ రూ. 1,760 కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.880 కోట్ల రుణంతో పాటు ఈయూ రూ.102 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి వివరించారు.
→ 2018లో రూ.933 కోట్లతో చేపట్టిన సీఐటీఐఐఎస్ 1.0 పథకానికి ఇది కొనసాగింపు.

భూగర్భాన్వేషణకు లోతైన రంధ్రం

చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలు మొదలు పెట్టారు.
→ దీంతో భూగర్భాన్వేషణలో కీలక ముందడుగు పడినట్లయింది.
→ సుమారు 10 వేల మీటర్ల లోతు వరకు ఈ రంధ్రాన్ని తవ్వుతారని అంచనా.
→ భూమి అడు గున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకుంటూ ఈ ప్రక్రియ సాగనుంది.
→ దాదాపు 14.5 కోట్ల ఏళ్ల వయసున్న క్రెటేషియస్ పొరను చైనా శాస్త్రవేత్తలు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
→ ఖనిజ సంపద, ఇంధన వనరులను గుర్తించ డంతో పాటు భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటం ముప్పును ముందే పసిగట్టేందుకు వారి కృషి దోహదపడనుంది.
→ ఇప్పటివరకు ప్రపంచంలో మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్ డీప్ బోర్ హోల్ గా దీన్ని వ్యవహరిస్తారు.
→ దాని లోతు 12,262 మీటర్లు. 20 ఏళ్లపాటు బోర్ వేయగా 1989లో ఆ లోతుకు శాస్త్రవేత్తలు చేరుకోగలిగారు.

జీడీపీ 7.2 శాతం

భారత ఆర్ధిక వ్యవస్థ గత ఆర్ధిక సంవత్సరంలో అంచ నాలకు మించి వృద్ధిని సాధించింది.
→ ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న వర్ధమాన దేశంగా తన హవాను కొనసాగించింది.
→ 2022-23 జనవరి-మార్చి త్రైమాసి 6.1% వృద్ధి చెందడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2 శాతానికి చేరింది.
→ వ్యవసాయం (5.5%. తయారీ 45%, గనులు 4.3%, నిర్మాణ రంగం 10.4% రాణించడం ఇందుకు ఉపకరించింది.
→ విడుద లైన అధికారిక గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ 3.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.272 లక్షల కోట్ల) స్థాయికి చేరింది.
→ కొన్నేళ్లలో మన ఆర్ధిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యానికి ఇది దన్నుగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
→ 2021-2లో భారత జీడీపీ 9.1% రాణించగా.. అదే ఆర్థిక సంవ త్సరం జనవరి-మార్చిలో వృద్ధిరేటు 4 శాతంగా ఉంది.

మరుగుజ్జు నక్షత్రాల వద్ద ఆవాసయోగ్య గ్రహాలు

మన పాలపుంత గెలాక్సీలో చాలా సర్వసా ధారణంగా కనిపించే ఎం డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న మూడో వంతు గ్రహాల్లో ద్రవ రూపంలో నీరు ఉండొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది.
→ అక్కడ జీవుల మనుగడకు అనువైన వాతావరణం ఉండొచ్చని తెలిపింది. స్కోపు డేటా ఆధారంగా వర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్ర వేత్తలు ఈ నిర్ధారణ చేశారు.
→ ఎం డ్వార్ఫ్ నక్షత్రాలు ఒకింత చిన్నగా ఉంటాయి. వీటికి వేడి తక్కువగా ఉంటుంది.
→ సూర్యుడితో పోలిస్తే ఈ తారల ద్రవ్యరాశి దాదాపు సగం మేర మాత్రమే ఉంటుంది.
→ ఈ మరు గుజ్జు నక్షత్రాల చుట్టూ వందల కోట్ల గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి.
→ వీటిలో మూడింట రెండొంతుల గ్రహాల్లో అత్యంత ప్రతి కూల పరిస్థితులు ఉంటాయని శాస్త్రవే త్తలు తాజాగా పేర్కొన్నారు.
→ మూడో వంతు గ్రహాలు మాత్రం ఆవాసయోగ్య ప్రాంతం (గోల్డీలాక్స్ జోన్)లో ఉండొ చ్చని తెలిపారు. అవి కూడా కోట్లలో ఉంటాయని చెప్పారు.

అధిక రక్తపోటుతో విషయగ్రహణ లోపాలు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే అధిక రక్తపోటుకు భావోద్వేగ సమ స్యలు, విషయ గ్రహణ సామర్థ్యంలో లోపాలతో సంబంధం ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
→ ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 'రోజుకు 5 గ్రాముల కన్నా తక్కు వగా ఉప్పును తీసుకోవాలని వారు సూచి స్తున్నారు.
→ ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణ వ్యవస్థకు కొన్నిరకాల లిపిడ్ పదార్థాలకు మధ్య అవాంఛిత సిగ్నలింగ్ మొదలవుతుం దని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ దీనివల్ల మెదడు పనితీరులో ఇబ్బందులు తలెత్తుతాయని వివ రించారు. రక్తపోటు, ద్రవాల సమతౌల్యతను కాపాడటంలో యాంజియోటెన్సిన్-2 (ఏఎన్టీ-2) కీలక పాత్ర పోషిస్తుంది
→ ఏటీ1 అనేది దీని గ్రాహకం. శరీరానికి చాలా ముఖ్యమైన లిపిడ్ పదార్థం ప్రోస్టాగ్లాండిన్ ఈ2 (పీజీఈ2), దాని గ్రాహకం ఈపీ1కు - ఏటీ 1కు అధికరక్తపోటుతో సంబంధం ఉందని మునుపటి పరిశోధనల్లో వెల్లడైంది.
→ ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల తలెత్తే అధిక రక్తపోటు కారణంగా ఈ రెండు వ్యవస్థల మధ్య అనవసరంగా సంకే తాల మార్పిడి జరుగుతుందని తాజాగా జపాన్ పరిశోధకులు తేల్చారు. దీనివల్ల భావోద్వేగపరమైన విషయ గ్రహణ సామ ర్ధ్యంలో లోపాలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు.
→ తీవ్ర మతిమరుపు కూడా తలె త్తుతున్నట్లు వివరించారు.

అర్చకులకు గౌరవ భృతిని పెంచుతున్నట్లు సీఎం ప్రకటన

రాష్ట్రంలోని అర్చకులకు గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
→ ఈ భృతిని అం దుకునేందుకు అర్హత వయస్సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
→ శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపనపల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన 'విప్రహిత' బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
→ ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
→ ప్రస్తుతం 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 గుడులకు కూడా ఈ పథకం వర్తింపజే స్తామని సీఎం ప్రకటించారు.

ఉ.కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించా లన్న ఉత్తర కొరియా ప్రయత్నం విఫలమయింది.
→ మల్లిగ్యాంగ్ - 1 ఉపగ్రహంతో.. కొత్తగా అభివృద్ధి చేసిన చొల్లిమా-1 రాకెట్ ఉదయం 6:37 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
→ అయితే రెండు దశల అనంతరం ఇంజిన్లు థ్రస్ట్ను కోల్పో వడంతో సముద్రంలో రాకెట్ కూలిపోయిందని ఉ. కొరియా అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.
→ ప్రయోగం విఫలమైనప్పటికీ ఉ.కొరియా పెంపొందించుకుం టున్న సాంకేతికతపై సరిహద్దు దేశాలు దక్షిణ కొరియా, జపాన్ ఆందోళన వ్యక్తం చేశాయి.

దక్షిణ కొరియాలో గందరగోళం:-
→ ఉ.కొరియా ప్రయోగం నేపథ్యంలో ద. కొరియా రాజధాని సియోల్ లో గందరగోళం ఏర్పడింది.
→ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా.. సుమారు 14 నిమిషాల అనంతరం సియోల్ ప్రజల సెల్ఫోన్లకు అధికా రులు అత్యవసర సందేశాలు పంపించారు.
→ కారణాన్ని పేర్కొనకుండా.. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.
→ కాసే పటికే భద్రత మంత్రిత్వ శాఖ ఆ సందేశాలు ఓ పొరపాటని ప్రకటించింది.
→ ఉ.కొరియా ప్రయోగిం చిన ఏదైనా క్షిపణుల శకలాలు దక్షిణ కొరియా భూభాగంలో పడే ప్రమాదముందని భావిస్తేనే ఇలాంటి అలెర్ట్ లు పంపాలని సూచించినట్లు సైన్యం వెల్లడించింది. అదీ కూడా 5 నిమిషాల లోపే పంపాలని తెలిపింది.
→ జపాన్ సైతం ఇదే తరహా హెచ్చరిక సందేశాలను తమ ప్రజలకు పంపించింది. మరోవైపు ఉ.కొరియా ప్రయోగాన్ని అమెరికా ఖండించింది.
→ బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక తను వినియోగించకుండా నిషేధం ఉన్నప్పటికీ కిమ్ ఇలాంటి ప్రయోగాలు చేపడుతుండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.

ఇస్రో హెచ్ఎస్ఎఫ్ సీ డైరెక్టర్ గా మోహన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం(హెచ్ఎస్ఎఫ్ సీ) డైరె క్టర్ గా మోహన్ ను నియమిస్తూ ఇస్రో అధిపతి డా. సోమనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
→ ఇప్పటి వరకు అక్కడ సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న ఉమామహేశ్వరన్ ఉద్యోగ విరమణ మోహన్ చేయడంతో ఆయన స్థానంలో ను నియమించారు.
→ ఆయన తిరువనంత పురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదో న్నతి పొందారు.
→ గగన్యాన్ ప్రాజెక్టు పనులు ఇక మోహన్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.

ఆర్ సీఐకి కొత్త డైరెక్టర్

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో)కు చెందిన హైదరాబాద్ లోని క్షిపణులు, ప్యూహాత్మక వ్యవ స్థల (ఎంఎస్ఎస్) డైరెక్టర్ జనర ల్ గా విశిష్ట శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు.
→ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా ఉన్న ఆయన పదోన్న తిపై డీజీ అయ్యారు.
→ జూన్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుందని డీఆర్డీవో బుధవారం ఒక ప్రకట నలో తెలిపింది.
→ మే 31న డీజీగా పదవీ విరమణ చేసిన డాక్టర్ బీహెచ్పీఎస్ నారాయణమూర్తి స్థానంలో రాజాబాబును నియమించారు.

నేటి నుంచి పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు

యువతను పొగాకు వినియోగానికి దూరం చేసే లక్ష్యంతో 60 రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
→ మే 31వ తేదీ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 'మాకు ఆహారం కావాలి - పొగాకు వద్దు' అన్న నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
→ విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, హాట్స్పాట్లు, గ్రామ పంచాయతీల్లో ప్రచార కార్యక్రమాలు జరుపుతామని పేర్కొంది.
→ పొగాకు వినియోగంతో క్యాన్సర్, కరోనరీ అర్టెరీ, ఊపిరితిత్తుల సమస్యలు బాధితులను చుట్టుముడుతున్నాయి.
→ దేశంలో ఏటా 13.5 లక్షల మంది ధూమపానం, పరోక్ష ధూమపానం వల్ల మరణిస్తున్నారు' అని పేర్కొంది.

మహారాష్ట్ర రైతుల కోసం కొత్త పథకం

మహారాష్ట్రలో కోటి మంది రైతులకు ఏటా రూ.6,000 చొప్పున నగదు సహాయం అందించడానికి ఉద్దేశించిన నమో షెట్ కారీ మహాసమ్మాన్ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అధ్య క్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది.
→ రైతులకు ఇప్పటికే ఏటా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అందిస్తున్న రూ.6,000లకు ఇది అదనమని శిందే చెప్పారు.

విశాఖలో అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవ్

విశాఖ వేదికగా 'అంతర్జాతీయ సేంద్రియ మహోత్సవ్ -2023 జూన్ 2వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరుగనుంది.
→ ఏపీ వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థలు సంయుక్తంగా విశాఖ బీచ్ రోడ్డు లోని గాదిరాజు ప్యాలెస్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
→ రాష్ట్రంలో ప్రకృతి వ్యవ సాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించడం, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వినియోగ దారులను ఒక వేదికపైకి తీసుకురావాలన్న సత్సం కల్పంతో దేశంలోనే తొలిసారి ఈ మహోత్సవ్ నిర్వహిస్తున్నారు.
→ వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, మిల్లెట్ ఉత్పత్తిదారు లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కొను గోలుదారులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొ ననున్నారు.
→ ఈ మహోత్సవ్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా 123 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.
→ ఈ సందర్భంగా రూ.100 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు జరుగుతాయని అం చనా వేస్తున్నారు.
→ మూడు రోజుల పాటు ప్రత్యేకం గా ఆర్గానిక్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. 50 వేల మందికిపైగా సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. సెమినార్లు, వర్క్ షాప్ లు కూడా నిర్వహించనున్నారు.
→ సాగర తీరంలో తొలిసారి నిర్వహిస్తోన్న అంతర్జాతీయ ఆర్గానిక్ సదస్సును విజయవంతం చేయాలని మంత్రి కాకాణి ఈ సం దర్భంగా పిలుపు నిచ్చారు.

రాజభవన్ లో గోవా రాష్ట్ర అవతరణ వేడుకలు

గోవాలోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కారణంగా 'ప్రాచ్య ముత్యం'గా ప్రత్యేక గుర్తింపు సాధించిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
→ ఆ రాష్ట్ర సంస్కృతి, బీచ్ లు, ఆతిథ్య రంగంలో దేశంలోనే ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయన్నారు.
→ ఆతిథ్య రంగం ద్వారా జాతీయ అభివృద్ధికి రాష్ట్రం దోహదపడుతోందని అభి ప్రాయపడ్డారు.
→ గోవా రాష్ట్ర 36వ అవతరణ దినోత్స వాన్ని రాజభవన్ లోని దర్బార్ హాల్లో వారం ఘనంగా నిర్వహించారు.
→ ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
→ ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. "గోవా అందాలు, సంపద, లాభదాయకమైన పోర్టులు పశ్చిమ దేశాలను ఆకర్షించడంతో.. ఆయా దేశాలతో వాణిజ్యం సులభతరమైంది. ఈ కారణంగా గోల్డెన్ గోవాగా పిలిచేవారు...' అని పేర్కొన్నారు.
→ ఈ సందర్భంగా ప్రదర్శించిన గోవా సంప్రదాయ నృత్యాలు ఆహుతులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కంబోడియా రాజుతో మోదీ చర్చలు

భారత్ లో పర్యటిస్తున్న కంబోడియా రాజు నరోదమ్ శిహమోనితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
→ ఈ సంద ర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు.
→ రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరి గింది. కంబోడియాతో ద్వైపాక్షిక బంధాన్ని బలో పేతం చేసుకోవాలని భారత్ గట్టిగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు.
→ రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
→ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కూడా శిహమోనితో భేటీ అయ్యారు.
→ రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య సహకరించుకునే అంశంపై చర్చించారు.
→ అంతకుముందు శిహమోనికి రాష్ట్ర పతి భవన్లో ద్రౌపదీ ముర్ము లాంఛనంగా ఘన స్వాగతం పలికారు.
→ శిహమోని.. రాజ్ ఘాట్ వెళ్లి, మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

FDI లో రాష్ట్రానికి 11వ స్థానం

గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ 7వ, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానాల్లో నిలిచాయి.
→ 2022-23 ఆర్థిక సంవత్స రంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ. 3,67,435 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ ఐలు) రాగా.. అందులో తెలంగాణకు రూ.10,319 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.2,252 కోట్ల వాటా దక్కింది.
→ ఈ విషయంలో రూ.1,18,422 కోట్ల వాటాతో మహా రాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది.
→ దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 32.22% ఆ రాష్ట్రానికే వెళ్లాయి.
→ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, ఉత్త రప్రదేశ్, పశ్చిమబెంగాల్లు నిలిచి టాప్-10లో స్థానం దక్కించుకున్నాయి.
→ ఆ తర్వాతి స్థానానికి ఆంధ్రప్రదేశ్ పరిమితమైంది.
→ గత మూడేళ్లలో తెలంగాణకు మొత్తం రూ.35,766 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబ డులు వచ్చాయి.
→ ఇదే సమయంలో ఆంధ్రప్రదే రూ.4,572 కోట్లు వచ్చాయి.
→ ఇది తెలంగాణ కంటే రూ. 31,194 కోట్లు తక్కువ.
→ డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం తాజాగా విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది.
→ రాజస్థాన్ దేశంలోకి అత్యధిక విదేశీ ఉత్తర్ ప్రదేశ్ పెట్టుబడులు మారిషస్, సింగపూర్, అమెరికా, నెద ర్లాండ్స్, జపాన్, యూకే, యూఏఈ, కేమన్ ఐలాండ్స్ నుంచి వచ్చాయి.

కేరళ సీజేగా జస్టిస్ భట్ ప్రమాణ స్వీకారం

కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్. వి. భట్ పూర్తిస్థాయి సీజేగా బాధ్యతలు చేపట్టను న్నారు.
→ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయన చేత ప్రమాణం చేయిస్తారని అధి కారిక ప్రకటన వెలువడింది.
→ 1987లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్న ఆయన హైదరా బాద్ లోని ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు.
→ అక్కడే 2013లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
→ రాష్ట్ర విభజన అనంతరం తెలం గాణ, ఏపీ హైకోర్టుల్లో జడ్జిగా సేవలందించి.. 2019లో కేరళకు బదిలీ అయ్యారు.

ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ఒప్పందంపై పారిస్ లో చర్చలు

అంతర్జాతీయంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అంతం పలికేందుకు ఎటువంటి ఒప్పందాన్ని రూపొం దించాలన్న విషయమై కసరత్తు ఊపందుకొంది.
→ ఇందుకోసం ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రత్యేక కమిటీ భేటీ అయ్యింది.
→ ప్లాస్టిక్ కాలుష్యం, సముద్ర పర్యావరణంపై తొలి అంతర్జాతీయ, ఒప్పంద రూపకల్పనకు అంతర ప్రభుత్వాల చర్చల కమిటీకి అధికారం అప్పగించారు.
→ 2024 చివరి నాటికి చర్చలను పూర్తి చేసేందుకు మొత్తం అయిదు సమావేశాలను నిర్వహించాల్సి ఉండగా తాజా భేటీ రెండవది.
→ ఆర్నెళ్ల క్రితం ఉరుగ్వేలో తొలి సమావేశం జరిగింది.
→ ఈ సంద ర్భంగా కొన్ని దేశాలు ప్రపంచ స్థాయి నిబంధనలు సూచిం చగా, మరికొన్ని జాతీయ స్థాయి పరిష్కారాలను, ఇంకొన్ని రెండు రకాల మార్గా లను ప్రతిపాదించారు.

2030లో చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు

చంద్రుడిపై పరిశోధనలు చేయడా నికి 2030లో తమ వ్యోమగాములను పంపను న్నట్లు చైనా ప్రకటించింది.
→ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అంతరిక్ష ప్రణాళికను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆ దేశం తన సొంత అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను పంప నుంది.
→ వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్ హైపెంగ్, జూయాంగ్జూ, పౌర వ్యోమగామి గుయ్ హైచావో అయిదు నెలల వరకూ అక్కడ ఉండనున్నారు.
→ వీరిని తీసుకెళ్లనున్న షెంజావో -16 వ్యోమనౌకను ప్రయోగించేందుకు ఇన్నర్ మంగోలియాలోని జ్యూకాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశారు.
→ ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లినవారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగా ములే. గుయ్ తొలి పౌర వ్యోమగామి.
→ ఈ సందర్భంగా చైనా 'మానవ సహిత అంతరిక్ష సంస్థ' డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికి యాంగ్ మాట్లాడుత చైనా ఇటీవల మానవ సహిత చంద్రమండల అన్వేషణ కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. 2030 కల్లా జాబి పైకి మనిషిని పంపించడం, అక్కడ పరిశోధ నలు, వాటికి సంబంధించిన ప్రయోగాలు చేయ డమే మా లక్ష్యం" అని చెప్పారు.

22 శాతం తగిన ఎఫ్ డీఐ పెట్టుబడులు

గత ఆర్ధిక సంవత్సరం (2022-23)లో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ) 22% తగ్గి 46 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.80 లక్షల కోట్ల)కు పరిమితమ యాయి. 2021-22 ఎఫ్ డీఐలు 58,77 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి.
→ కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, వాహన రంగాలకు గత ఆర్థిక సంవత్సరంలో FDI తగ్గాయి.
→ ఈక్వి టీతో కలిపి మొత్తం ఎఫ్ డీఐ పెట్టుబడులు 84.83 బిలియన్ డాలర్ల నుంచి 16% తగ్గి 70.97 బిలి యన్ డాలర్లకు చేరాయి.

అగ్రగామి దేశాలు:-
→ మన దేశంలోకి వచ్చిన ఎఫ్ డీఐలో 17.2 బిలియన్ డాలర్లతో సింగపూర్ అగ్రస్థా నంలో నిలిచింది.
→ మారిషస్ (6.13 బి.డాలర్లు), ఆమె రికా (6 బి. డాలర్లు), యూఏఈ (3.35 బి. డాలర్లు),నెదర్లాండ్స్ (2.5 బి.డాలర్లు), జపాన్ (1.8 బి. డాలర్లు), సైప్రస్ (1.27 బి. డాలర్లు), కేమన్ ఐలాండ్ (772 మి.డాలర్లు), జర్మనీ (547 మీ.డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
→ 2022-22లో మారిషస్, అమెరికా, నెదర్లాండ్స్, కేమన్ ఐలాండ్స్, జర్మనీ నుంచి FDIలు తగ్గాయి..
→ కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలు అత్యధిక పెట్టుబడులను (9.4 బి.డాలర్లు) ఆకర్షించాయి.
→ 2021-22లో ఈ రంగంలోకి 14.5 బి. డాలర్లు. వచ్చాయి. వాహన పరిశ్రమలోకి పెట్టుబడులు 7.బి. డాలర్ల నుంచి 1.9 బి. డాలర్లకు పడిపో యాయి.
→ సేవల రంగం (8.7 బి.డాలర్లు). ట్రేడింగ్ (4.8 బి. డాలర్లు), ఔషధ (8.7 బి. డాలర్లు) రసాయనాలు (1.85 బి. డాలర్లు), వాహన పరిశ్రమ (1.27 బి. డాలర్లు), టెలికాం (713 మి.డాలర్లు) ఆకర్షించాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే:-
→ మహారాష్ట్ర 14.8 బి.డాలర్లు ఆకర్షించింది. 2021-22లో ఈ రాష్ట్రం లోకి 15.44 బి. డాలర్లు వచ్చాయి.
→ కర్ణాటక పెట్టుబడులు 22 బి. డాలర్లు నుంచి 10.42 బి. డాలర్లకు తగ్గిపోయాయి.
→ దిల్లీ, తమిళనాడు, హరియాణా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్కు వచ్చిన పెట్టుబడులూ తగ్గాయి.
→ గుజరాత్లోకి మాత్రం పెట్టుబడులు 2.7 బి.డాలర్ల నుంచి 4.71 బి.డాలర్లకు పెరిగాయి.

భారత నూతన పార్లమెంటు ప్రారంభం

→ అడుగడుగునా అద్భుత దృశ్యాలు. ప్రకృతి రమణీయతను పరిచయం. చేసే పలు అంశాలు.
→ ఇలా భారత నూతన పార్లమెంటు ఆధునికత మేళవించిన అద్భుత కట్టడంగా నిలిచింది.
→ ప్రధాని మోదీ నూతన పార్లమెంటును ప్రారంభిం చిన తర్వాత దానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రు లతో కలిసి వీక్షించారు.
→ 9.26 నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రం. నూతన భవనం విశే షాలను ఆవిష్కరింపజేసింది.

ప్రకృతికి వందనం:-
→నూతన పార్లమెంటుకు ఉన్న ఆరు ప్రవేశ మార్గాల్లో... గరుడ (గ్రద్ద ), గజ(ఏనుగు), అశ్వ (గుర్రం), మొసలి, హంస, శార్దూల (పులి) ప్రతిమలను తీర్చిదిద్దారు.
→ప్రతి జంతువు కూడా వివిధ అంశాల్లో ప్రకృతికి ప్రతిరూపమని లఘు చిత్రంలో పేర్కొన్నారు. మొసలి, హంసలు నీటికి, గరుడ ఆకాశానికి ప్రతీకలని తెలిపారు.

ఇరు సభల ప్రత్యేకత ఇదే:-
→లోక్సభను జాతీయ పక్షి నెమలి, రాజ్యసభను జాతీయ పుష్పం కమలానికి ప్రతీకగా తీర్చిది. డ్డారు.
→ నెమలి పింఛాన్ని పోలిన విధంగా గోడలపై నిర్మాణాలు చేశారు. అదేవిధంగా లోపలి పైకప్పు కూడా నెమలి పింఛాన్ని పోలిన విధంగా నిర్మిం చారు.
→ పాత లోక్సభ ప్రాంగణం కంటే కూడా కొత్తది రెండు రెట్లు పెద్దది. పెద్దల సభను.. కమ లం థీమ్తో, పాత సభ కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదిగా నిర్మించారు.
→ యూపీకి చెందిన 900 మంది కళాకారులు 10 లక్షల పనిగంటలు "శ్రమించి చేతితో నేసిన ప్రీమియం కార్పెట్లు కొత్త లోక్సభ, రాజ్యసభను అలంకరించాయి.
→ లోక్స భలో నెమలి పింఛం, రాజ్యసభలో కమలం ఆకృ తులను కార్పెట్లపై సుందరంగా తీర్చిదిద్దారు.
→ ఉభయ సభల కోసం చెరో 150కి పైగా కార్పెట్లను కార్మికులు వేర్వేరుగా రూపొందించి.. సభలకు తగ్గట్టుగా వాటిని అతికించారని ఓబీటీ కార్పెట్స్ సంస్థ చైర్మన్ రుద్ర చటర్జీ వివరించారు.

విశాలమైన సీటింగ్
→ఉభయ సభల్లో సభ్యులు కూర్చొనేందుకు విశాల మైన సీటింగ్ ఏర్పాటు చేశారు. సభ్యుల ముందు భాగంలో ఏర్పాటు చేసిన డెస్క్ లపై టచ్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు.
→దీంతో కాగిత రహిత కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది. ఓటింగ్ కోసం బయోమెట్రిక్ సౌకర్యాన్ని కల్పించారు.
→ఉభయ సభల్లోనూ ప్రత్యక్ష ప్రసారాల కోసం పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక, మొత్తం పార్లమెంటు భవనం ఆటోమేటిక్ కెమెరాల నిఘా నీడలో ఉంటుంది..

త్రిభుజాకృతిలోనే ఎందుకు?:-
→పార్లమెంటు నూతన భవనం త్రిభుజాకృతిలో ఉండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
→దీనిపై ఆర్కి టెక్ట్ బిమల్ పటేల్ స్పందిస్తూ.. వివిధ మతాలలోని పవిత్ర రేఖాగణితానికి ప్రతీకగా భవనాన్ని త్రిభుజాకృతిలో తీర్చిదిద్దినట్టు తెలిపారు.
→వివిధ విశ్వాసాల్లో త్రిభుజాలు, త్రిమూర్తులు, త్రికోణాలకు ప్రాముఖ్యం ఉందన్నారు.
→ఇక, ఈ విషయంపై సెంట్రల్విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా స్పందించింది.
→త్రిభుజాకృతి నిర్మాణాల కారణంగా స్థల వినియోగం తగ్గుతుందని, స్థలాన్ని సంపూ ర్థంగా వినియోగించుకోవచ్చని వివరించింది.

పెండ్యులం క్లాక్ ప్రత్యేక ఆకర్షణ:-
→పార్లమెంటు లోపలి భాగం పైకప్పును త్రిభుజాకృ తిలో తీర్చిదిద్దారు. దీనిలో పెండ్యులం (లోలకం) గడి యారాన్ని ఏర్పాటు చేశారు.
→ఇది పైకప్పు నుంచి ప్రసరించే సూర్యకిరణాల ద్వారా ప్రకాశిస్తుందని. లఘుచిత్రంలో వివరించారు.
→ఇక, పార్లమెంటు భవ నంలో రాజ్యాంగ మందిరం ఏర్పాటు చేశారు.
→దీనిలో భారత ప్రజాస్వామ్య వారసత్వానికి సంబంధించిన విశేషాలను పొందుపరిచారు.
→ఇక్కడే రాజ్యాంగం డిజిటల్ కాపీని కూడా ఉంచారు..

జ్ఞాన, శక్తి, కర్మ.. మూడు ద్వారాలు:-
→మొత్తం 64,500 చదరపు మీటర్లలో నిర్మించిన నూతన పార్లమెంటుకు మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.
→వాటికి జ్ఞాన ద్వారం, శక్తి ద్వారం, కర్మ ద్వారం అని పేర్లు పెట్టారు.
→వీఐ పీలు, ఎంపీలు, అతిథులకు వేర్వేరు ద్వారాలు నిర్మించారు.


రూ.75 నాణెం విడుదల

→పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా లోక్ సభ చాంబర్లో ప్రధాని మోదీ ప్రత్యేక స్మారక తపాలా స్టాంపు, రూ.75 నాణేన్ని విడుదల చేశారు.
→ఇక నాణెం బరువు కొంచెం అటుఇటుగా 35 గ్రాములు.
→ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమంతో తయారు చేశారు. ఇది 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటుంది.
→నాణేనికి ఒకవైపు జాతీయ చిహ్నం ఉండగా.. మరో వైపు పార్లమెంట్ కాంప్లెక్సు భవనాన్ని మధ్యలో ముద్రించారు.

పార్లమెంటు కొత్త భవన విశేషం ప్రజాస్వామ్య సంప్రదాయాలు.. ఆధునికతల మేళవింపు

→ దేశ రాజధానిలో ఆదివారం ఆవిష్కృతమైన పార్లమెంటు కొత్త | భవనం దేశ ఘన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆధునికతలను అద్దుకుని రాజసంగా అలరారుతోంది.
→ వేదకాలం నుంచి ఈ నాటి వరకూ దేశంలో | అమలైన ప్రజాస్వామ్య విధానాలను, అవి పరిఢవిల్లిన విశిష్టతలను చాటిచె బుతోంది.
→ పార్లమెంటు భవనంలో ప్రత్యేకంగా నిలిచిన రాజ్యాంగ మంది రంలో ఏర్పాటు చేసిన వరుస చిత్రాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.
→ అలాగే ఈ రాజ్యాంగ మందిరాన్ని హిందూ సంప్రదాయాల్లో ఆరాధించే, స్వచ్ఛ శక్తికి నిదర్శనంగా భావించే శ్రీయంత్రం స్ఫూర్తిగా రూపొందించారు.
→ ఇక్కడే ఆధు నికతకు ప్రతిరూపంగా డిజిటల్ రూపంలోకి మార్చిన భారత రాజ్యాంగాన్ని ఉంచారు.
→ ఇంకా భూభ్రమణానికి ప్రతీకగా ఫుకో వెండ్యులమ్ను త్రికోణాకా రపు హాలు పై భాగంలో అమర్చారు.
→ పార్లమెంటు వ్యవహారాలను ప్రభావ శీలంగా నిర్వహించేందుకు లోక్సభ, రాజ్యసభల్లో సుస్పష్టమైన ధ్వని-దృశ్య, ఆధునిక ఓటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
→ భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికలపై మహాత్మాగాంధీ, చాణక్య, గార్గి, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి.ఆర్. అంబేడ్కర్, కోణార్క్ సూర్యదేవాలయ రథ చక్రం ఇత్తడి చిత్రాలను అలంకరించారు.
→ సంగీత, స్తపత్య, నిర్మాణ, శిల్ప గ్యాలరీలు ఆయా శాస్త్రాలను ప్రతిబింబిస్తున్నాయి. కొత్త భవనంలో పెయిం టింగ్స్, రాతి విగ్రహాలు, కుడ్య చిత్రాలు, లోహ ప్రతిమలు మొదలైన 5,000 ఆర్ట్వర్కున్న అమర్చారు.
→ దేశంలోని ప్రఖ్యాత కళాకారులైన ఉస్తాద్ అంజాద్ | అలీ ఖాన్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, పండిత్ రవిశంకర్.. వారి కుటుంబ సభ్యులు వారి సంగీత వాద్యాలను సంగీత గ్యాలరీ కోసం వితరణ చేశారని అధికారులు వెల్లడించారు.

చరిత్ర పుటలో పార్లమెంటు భవనం

→ అటు వృత్తాకారంలో ఉన్న పార్లమెంటు పాత భవనం, ఇటు త్రికోణాకారంలో ఉన్న కొత్త భవనం. దేనికవే ప్రత్యేకమైనవి.
→ స్వాతంత్య్రం రాకముందు నుంచీ ఉన్నది ఒకటైతే, అమృతోత్సవాల తరుణంలో ఠీవిగా కొలువుదీరిన భవనం రెండోది.
→ ఇప్పటికి శతాబ్దానికంటే ముందు పాత భవనానికి పునాదులు పడ్డాయి.
→ 1921 ఫిబ్రవరి 12: కౌన్సిల్‌ హౌస్‌గా పిలిచే పార్లమెంటు హౌస్‌కు శంకుస్థాపన
→ 1927 జనవరి 18: పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌
→ 1927 జనవరి 19: పార్లమెంటు సముదాయంలో ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’ మూడోవిడత తొలి సమావేశం
→ 1946 డిసెంబరు 9: రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం
→ 1947 ఆగస్టు 14/ 15: రాజ్యాంగ పరిషత్తు అర్ధరాత్రి సమావేశంలో బ్రిటిషర్ల నుంచి అధికారాల బదిలీ
→ 1952 మే 13: ఉభయ సభల తొలి సమావేశాలు
→ 1970 ఆగస్టు 3: పార్లమెంటు అనుబంధ భవనానికి పునాది వేసిన అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి
→ 1975 అక్టోబరు 24: ఈ అనుబంధ భవనాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.
→ 1987 ఆగస్టు 15: పార్లమెంటు గ్రంథాలయానికి అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ శంకుస్థాపన
→ 2002 మే 7: పార్లమెంటు గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌
→ 2009 మే 5: మరో అనుబంధ భవనానికి అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, అప్పటి స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ శంకుస్థాపన
→ 2017 జులై 31: పార్లమెంటు అనుబంధ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
→ 2019 ఆగస్టు 5: అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఉపరాష్ట్రపతి హోదాలో ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సమర్పించారు.
→ 2020 డిసెంబరు 10: కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన
→ 2023 మే 28: మోదీ చేతుల మీదుగా కొత్త భవనం ప్రారంభం

నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం

→ రాష్ట్రాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలి. దుబారా చేయొద్దు. నిధులను న్యాయబద్ధంగా ఉపయోగించాలి. భవిష్యత్తు తరాలు తలకు మించిన భారాన్ని మోసే పరిస్థితి రాకుండా చూడాలి.
→ ఆర్థిక క్రమ శిక్షణ అమలు పరచని చాలా దేశాలు ఇప్పుడు ఆ పరిణామాలను అనుభవిస్తున్నాయి.
→అందువల్ల మనం ఏం చేసినా.. ఏ ప్రణాళిక రూపొందించినా భవిష్యత్తు తరాలపై భారం పడకూడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
→మనమంతా బాధ్యతాయు తంగా వ్యవహరించాలి' అని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు.
→ 2047 నాటికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా ప్రతి రాష్ట్రం వచ్చే 25 ఏళ్లకు విజన్ ను చుకోవాలని పిలుపునిచ్చారు.
→శనివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో ఆయన ముఖ్య మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పాలనాధికారులను ఉద్దేశించి మాట్లా డారు.
→ఈ సమావేశానికి 11 మంది ముఖ్యమం త్రులు గైర్హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రులు రాకపోవడం ఇదే ప్రథమం.
→ ప్రధాని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభ, ముగింపోపన్యాసాలు చేశారు.
→ ఈ సంద ర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావిం చారు. 'ప్రజల ఆకాంక్షలను నెరవేర్చా ల్సిన బాధ్యత ఈ సమావేశంలో పాల్గొన్న అందరిపైనా ఉంది.
→ అందుకోసం మనం ఉమ్మడి విజన్ వ్యూహంతో వెళ్లాలి. వికసిత్ భారత్ లక్ష్యం ఉన్నది. వ్యక్తులకో, కొన్ని సమూహా లకో కాదు.
→ఇది 140 కోట్ల మంది భారతీయుల లక్ష్యం కాబట్టి దాని సాధనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి.
→అందుకు ఉదాహ... రణ ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమమే.
→దేశవ్యాప్తంగా వివిధ సూచికల్లో వెనుకబడిన 112 జిల్లాలను ఎంపిక చేసి వాటిని ముందుకు నడిపించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి.
→అలాగే అత్యంత వెనుకబడిన 500 బ్లాక్ లను పైకి తీసుకురావడానికి చేపట్టిన ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమంపై రాష్ట్రాలు మంచి దృష్టి పెట్టి పని చేస్తున్నాయి.
→ఈ బ్లాక్ లను వివిధ కొలమానాల్లో రాష్ట్ర సగటుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయి. తద్వారా జాతీయ సగటు పెరుగుతుంది.
→ఇప్పటివరకూ 50 వేల అమృత్ సరోవర్లను నిర్మించారు. మిగిలిన 50వేల సరోవర్ల పని పూర్తి చేయాలి. జిల్లాకు 75 కాకుండా ఒక్కో బ్లాక్లో 75 సరోవర్లను నిర్మించేందుకు ప్రయత్నించాలి.
→రాష్ట్రాలు అంతర్గత పోటీతత్వంతో పని చేయాలి. జిల్లాలు, బ్లాక్ ల మధ్య పోటీ ఉండాలి. బాగా పని చేసే వాటిని ప్రోత్సహించాలి.
→కేవలం జాతీయ స్థాయిలో విజన్ ఉంటే సరిపోదు. రాష్ట్ర, జిల్లా స్థాయి విజన్ ఉండాలి. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో బలమైన టీమ్ లను ఏర్పాటు చేసి నీతి ఆయోగ్తో కలిసి పని చేసేలా చూడాలి.
→ప్రతి రాష్ట్రం వచ్చే 25 ఏళ్లకు విజన్ను రూపొందించుకుని కేంద్రంతో కలిసి పని చేయాలి. దూకుడు ప్రదర్శించాలి. కార్మిక శక్తికి గౌరవమివ్వాలి. అప్పుడే అది నాణ్యమైన ఉత్పత్తినిస్తుంది.
→2025కల్లా టీబీని నిర్మూలించాలి. రాష్ట్రాలు గతిశక్తి పోర్టలు ఉప యోగించుకోవాలి. ఏ లక్ష్యం సాధించాలన్నా సుపరి పాలన ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఒక నెల ముందుకు జరిపింది కాబట్టి కేంద్రం నుంచి ఏం వస్తా యన్నది రాష్ట్రాలకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి బడ్జెట్లను సరిగా ఉపయోగించుకోవాలి.
→తొలి మూడు నెలల్లోనే పనులు మంజూరు చేసి మొదలు పెట్టాలి. లేదంటే వర్షాకాలం 3 నెలల సమయం వృధా అవు తుంది' అని ప్రధాని పేర్కొన్నారు.

నేపాల్ నుంచి భారత్ కు విద్యుత్తు సరఫరా

→నేపాల్లో జల విద్యుదుత్పత్తి పెరగ డంతో ఈ ఏడాది కూడా మిగులు నమోదైంది. దీంతో పొరుగుదేశమైన భారత్కు కరెంటు సరఫరాను ప్రారం భించింది.
→ఈ మేరకు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అధి కార ప్రతినిధి సురేశ్ భట్టరాయ్ వెల్లడించారు.
→ భారత్కు 600 మెగావాట్ల విద్యుత్ విక్ర. యాలు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
→ నేపాల్ లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో అత్యధిక శాతం.. నదు లపై ఆధారపడినవే. సాధారణంగా ఈ దేశంలో శీతా కాలంలో విద్యుత్కు డిమాండ్ ఎక్కువగా ఉండగా.. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
→ వేసవిలో డిమాండ్ తగ్గ డంతో పాటు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మిగులు విద్యుత్ నమోదవుతుంది.
→ గతేడాది కూడా నేపాల్ ఇలాగే జూన్ నుంచి నవంబరు వరకు భారత్కు జల విద్యుత్ను సరఫరా చేసింది. తద్వారా దాదాపు రూ.1200 కోట్లను ఆర్జించింది.
→నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ 'ప్రచండ' మే 31 నుంచి నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు.
→గతేడాది డిసెంబరులో ప్రధా నిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విదేశీ పర్య టన చేపట్టడం ఇదే తొలిసారి.

శ్వేతసౌధం సలహాదారుగా నీరా టాండన్

→ అమెరికా అధ్యక్ష భవనంలో డొమె స్టిక్ పాలసీ సలహాదారు పదవిని భారతీయ అమె రికన్ మహిళ నీరా టాండన్ (52) శనివారం చేప ట్టారు.
→ వైట్ హౌస్ లో కీలకమైన మూడు సలహా దారు పదవుల్లో ఇది ఒకటి.
→ మిగతా రెండు జాతీయ భద్రతామండలి, జాతీయ ఆర్థికమండలి పదవులు. ఈ మూడింటిలో ఒకదాన్ని ఓ భారత సంతతి వ్యక్తి చేపట్టడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి.
→ ఈ పదవిలో ఆమె వలస వ్యవహా రాలతోపాటు పోలీసు సంస్కరణలు, నేరాల నిరోధక బాధ్యతలనూ నిర్వ హిస్తారు.
→ బిల్ క్లింటన్ హయాంలో నీరా వైట్ హౌస్ లో డొమెస్టిక్ పాలసీ మండలికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు.

బ్రహ్మోస్

→బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు నేవీ అధికారులు మే 14న వెల్లడించారు.
→నేవీకి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోరు గావ్పై నుంచి దీన్ని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని బ్రహ్మోస్ అత్యంత కచ్చితత్వంతో ఛేదిం చింది.
→భారత్- రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడు ఏర్పాటు చేశాయి. ఈ క్షిపణిని శబ్ద వేగం కంటే దాదాపు 3 రెట్లు అధిక వేగంతో ప్రయోగించవచ్చు.
→ఈ క్షిపణులను భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది.

పహల్

→ ఉత్తరప్రదేశ్లో ఆన్లైన్ గ్రామీణ విద్యా కార్యక్రమం 'పహల్'ను మే 15న ప్రారం భించారు.
→ సరోజినీ నగర్లోని యూపీ సైనిక్ ఇంటర్ కాలేజీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
→ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్, ఐఐటీ కాన్పూర్ ఆఫ్ సెకండరీ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు.
→ దీని లక్ష్యం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా గ్రామీణ వర్గాల వారికి విద్యను అందిం చడం.
→ ప్రారంభ దశలో ఉత్తరప్రదేశ్లోని 10 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత ఆన్లైన్ విద్యను అందిస్తాయి.

స్కైవాక్ బ్రిడ్జి

→దేశంలోనే అతిపెద్ద స్కైవాక్ బ్రిడ్జిని తమిళ నాడు సీఎం ఎంకే స్టాలిన్ మే 16న ప్రారం భించారు.
→తమిళనాడులోని మాంబళం, టీ నగర్ బస్ టెర్మినస్ ను కలు పుతుంది. ఈ బ్రిడ్జిని 570 మీ. పొడవు, 4.2 మీ. వెడల్పుతో నిర్మించారు.
→దీన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) స్మార్ట్ సిటీ నిధుల కింద రూ.28.45 కోట్లతో నిర్మించారు.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్

→76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 16న ప్రారం భమైంది. 27న ఈ ఫెస్టివల్ ముగుస్తుంది.
→ఫ్రాన్స్ లోని కేన్స్ గల ప్రఖ్యాత పలైస్ డెస్ ఫెస్టివల్స్ ఎట్ డెస్ కాంగ్రెస్లో జరుగు తున్న ఈ ఫెస్టివల్కు ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులు హాజరయ్యారు.
→ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురు గన్ ప్రారంభించారు.
→ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ పాల్గొన్నారు. ఈ కేన్స్ ఫెస్టివల్న 1946లో ప్రారంభించారు.

ఇరాన్

→ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారి డార్ (ఐఎన్ఎస్ఓసీ)లో భాగంగా నిర్మిం చనున్న రైల్వే లైన్ ఒప్పందాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా, ఇరాన్ మే 17న కుదుర్చుకున్నాయి.
→ఈ మార్గం కాస్పియన్ సముద్రం వద్ద గల ఇరాన్ లోని రాష్త్ర నుంచి అజర్బైజాన్లోని అస్తారా వరకు విస్తరించి ఉంటుంది.
→ఈ రైల్వే లింక్లో భారతదేశం, ఇరాన్, రష్యా, అజర్బైజాన్, ఇతరదేశాల రైలు, సముద్ర మార్గాలను అనుసంధానిస్తారు.
→రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ నాయకుడు ఇబ్రహీం రాయిసీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఎల్పీ 791-18డి

సౌర కుటుంబానికి వెలుపల సుమారు భూమి పరిమాణంలో ఉన్న ఆవాసయోగ్య గ్రహాన్ని గుర్తించినట్లు అమెరికా సైంటి స్టులు మే 17న వెల్లడించారు.
→ దీనికి 'ఎల్ పీ791 - 18డి' అని పేరు పెట్టారు.
→ సుమారు 90 కాంతి సంవత్సరాల దూరం లోని క్రేటర్ అనే నక్షత్ర మండలంలో ఓ ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఇది పరి భ్రమిస్తుంది.
→ భూమితో పోలిస్తే ఈ గ్రహ పరిమాణం స్వల్పంగా ఎక్కువుంటుంది. ద్రవ్యరాశి మాత్రం చాలా అధికంగా ఉంటుంది.
→ ఇది ఒకవైపు మాత్రమే నక్షత్రా నికి అభిముఖంగా ఉంటుంది. దీంతో వేడి ఎక్కువగా ఉండొచ్చు.
→ రెండో వైపున జీవం మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశా లున్నాయని అంచనా వేశారు.

ఇంటర్నేషనల్ మ్యూజియం డే

ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మే 18న నిర్వహించారు.
→ సాంస్కృతిక మార్పిడి, విభిన్న సంస్కృతులను పెంపొందించడం, వివిధ వర్గాల మధ్య పరస్పర సహకారం, శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే మ్యూజియాల గురించి అవగా హన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.
→ ఈ దినోత్సవాన్ని 1977లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దీని థీమ్ 'మ్యూజియమ్స్, సస్టెయినబిలిటీ అండ్ వెల్ బీయింగ్' .

బుచ్చిరెడ్డి

ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అను బంధ సంస్థ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డ బ్ల్యూసీఎల్) డైరెక్టర్ (పర్సనల్ గా పల్లె బుచ్చిరెడ్డి మే 15న నియమితులయ్యారు.
→ ఈయన తెలంగాణలోని హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందినవారు.
→ నాగ్ పూర్ ఇంజినీ రింగ్ పూర్తిచేసిన ఆయన వెస్ట్రన్ ఉద్యోగ ప్రస్థా నాన్ని ప్రారం భించి అ 'సంస్థకు డైరెక్ట ర్ ఎంపిక కావడం గమనార్హం.

రాబర్ట్ ఈ లూకాస్

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త రాబర్ట్ ఈ లూకాస్ మే 15న మరణించారు.
→ ఈయన చికాగో యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు.
→ ఈయనకు 1995లో ఆర్థికశా స్త్రంలో నోబెల్ లభించింది.
→ స్థూల ఆర్థిక శాస్త్రం, స్థూల ఆర్థికాంశాల అభివృద్ధిపై అత్యంత ప్రభావం చూపిన ఆర్థికవేత్త రాబర్ట్ లూకాస్

ప్రణీత్

చెస్లో భారత 82వ గ్రాండ్ మాస్టర్ (జీఎం) హోదా ఉప్పల ప్రణీతకు మే 14న లభించింది.
→ తెలంగాణలోని నల్ల గొండ జిల్లాకు చెందిన ప్రణీత్ స్పెయి న్లో జరిగిన సన్వే ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో మూడో జీఎం నార్మ్ దక్కించు కున్నాడు.
→ బాకు ఓపెన్ తొమ్మిదో రౌండ్లో టాప్ సీడ్ అమెరికాకు చెందిన గ్రాండ్ మాస్టర్ హన్స్ నేమాన్పై గెలిచి 2500.5 ప్రత్యక్ష రేటింగ్కు చేరుకు న్నాడు.
→ గ్రాండ్ మాస్టర్ కావాలంటే మూడు జీఎం నార్మ్ లతో పాటు 2500 ఎలో రేటింగ్ ఉండాలి. ఆ అర్హత ప్రమా ణాలను ప్రణీత్ సాధించాడు.

శుభమాన్ గిల్

గిల్ ఒకే ఏడాది టెస్టు, వన్డే, T20, సెంచరీలు చేసిన తొలి గా INDIA క్రికెటర్ మే 16న రికార్డు సృష్టించాడు.
→ ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో హైదరాబా ద్ లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు.
→ అదే జట్టుపై అహ్మదాబాద్ వన్డేలో 128 పరుగులు తీశాడు. అహ్మదా బాద్లోనే మార్చిలో ఆస్ట్రేలియాతో జరి గిన చివరి టెస్టులో సెంచరీ సాధించాడు.
→ ఇలా ఒకే ఏడాది నాలుగు విభాగాల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా గిల్ రికార్డు సృష్టించాడు.

టీ హబ్

దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ టీ హబ్క జాతీయ అవార్డు లభించింది.
→ నేషనల్ టెక్నాలజీస్ డేని పుర స్కరించుకొని ఢిల్లీలో మే 14న జరిగిన నేష నల్ టెక్నాలజీ వీక్-2023 కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా. జితేంద్రసింగ్ ఈ అవార్డును టీ హబ్ సీఈవో ఎంఎస్ రావుకు అందజేశారు.
→ ఫిబ్ర వరిలో దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యు బేటర్ అవార్డు టీ హబ్క లభించింది.

ఏఎసీసీఐ, టీ హబ్

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎసీసీఐ), టీ హబ్ మధ్య మే 16న అవ గాహన ఒప్పందం కుదిరింది.
→ దీనిలో భాగంగా ఆవిష్కరణల ప్రోత్సాహం, టెక్నా లజీ ఆధారిత స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వనున్నాయి.
→ ఈ ఒప్పందం ద్వారా మేనే జ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఇన్నోవేషన్ చాలెంజ్లు, హ్యాకథాన్లు, ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ ప్రోగ్రామ్లు నిర్వహిస్తారు.
→ ఈ ఒప్పందంపై ఏఎసీసీఐ డైరెక్టర్ జనరల్ డా. నిర్మల్య బాగ్చి, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు సంతకాలు చేశారు.

ఫాక్స్ కాన్

దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నా లజీ (ఎఫ్ఎస్ఐటీ) సంస్థ ఏర్పాటుకు మే 15న మంత్రి కేటీఆర్, ఎఫ్ఎస్ఐటీ చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లియూ భూమి పూజ చేశారు.
→ 500 మిలియన్ డాలర్ల (రూ.4,114 కోట్లు)తో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్ను రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో 200 ఎకరాల్లో నిర్మించనున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్

శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆసియాపసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ గోల్డ్ రికగ్నిషన్ అవార్డు మే 18న లభించింది.
→ పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా 15-35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో ఆసియా పసి ఫిక్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేసినందుకు ఈ అవార్డు దక్కింది.
→ 2018 నుంచి శంషాబాద్ ఎయి ర్పోర్ట్ వరుసగా ఆరోసారి ఈ అవార్డును గెలుచుకుంది.

సాహస్

తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన 'సాహస్' కార్యక్ర మ లోగోను మే 19న ఆవిష్కరించారు.
→ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దేశంలో ఇదే తొలి సారి. దేశంలోనే ఎక్కువ శాతం మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న తెలంగాణలో వారి భద్రత కోసం సాహస్ ఎంతో ఉపయోగప డుతుంది.
→ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాలు, పరిశ్రమల్లో మహిళలపై జరుగు తున్న వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీలుంటాయి.
→ అక్కడ సరైన న్యాయం జరగకుంటే సాహస్ అండగా నిలుస్తుంది.

ఏమిటీ ఐపీడీఆర్?

ఐపీడీఆర్ అంటే.. ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) డిటైల్ రికార్డ్స్, ఇంటర్నెట్ను ఉపయోగించి ఫోన్లో జరిగే ప్రతి చర్య దీనిలో రికార్డవుతుంది.
→ ఐపీ ఆధారంగా చేసే టెలిగ్రామ్, వాట్సప్ ఆడియో/వీడియో కాల్స్ వివరాలు దీనిలో భద్రంగా ఉంటాయి.
→ దీని ఆధారంగా వినియోగదారు ఏయే సమయాల్లో ఇంటర్నెట్ ఉప యోగించారో తెలుసుకోవచ్చు.
→ ఐపీడీఆర్ సహాయంతో నేరాల్లో అనుమానితులను ట్రాక్ చేయొచ్చు.
→ ఫోరెన్సిక్ దర్యాప్తులో ఇది కీలకంకావడంతో దర్యాప్తు సంస్థలకు ఉపయుక్తంగా ఉంటోంది.

ఎవరెస్టును అధిరోహించిన తొలి తమిళ మహిళ

ప్రపం చంలోనే ఎత్తైన శిఖరం ఎవరె స్టును అధిరోహించిన తొలి తమిళ మహిళగా విరుదునగ ర్ కు చెందిన ముత్తమిళ్ సెల్వి నిలిచారు.
→ విరుదునగర్ జిల్లా జోగిలపట్టి గ్రామానికి చెందిన నారాయణన్ - మూర్తియమ్మా ళ్ల కుమార్తె ముత్తమిక్ సెల్వి. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
→ చెన్నైలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యా యురాలిగా పని చేసే సెల్వి... ఎవరెస్ట్ శిఖరం అధిరోహించా లనే లక్ష్యంతో శిక్షణ తీసుకు న్నారు.
→ దీనికి తమిళనాడు ప్రభుత్వ సాయం కోరగా.. ముఖ్యమంత్రి స్టాలిన్ రూ.15 లక్షలు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ.10 లక్షలు అందజేశారు.
→ ముత్త మిక్ సెల్వి ఏప్రిల్ 5న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించారు. 51 రోజుల అనంతరం మే 23న శిఖరంపైకి చేరుకున్నారు.

మిగ్ 29కే నైట్ ల్యాండింగ్ విజయవంతం

భారత నౌకాదళం మరో ఘనతను సాధించింది. స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మిగ్ 201 నైట్ ల్యాండింగ్ విజయవంతమైంది.
→ ఈ విష యాన్ని ఇండియన్ నేవీ ప్రకటించింది. మిగ్ 29 మొదటిసారిగా రాత్రి సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పై ల్యాండింగ్ చేపట్టిన నేవీ.. మరో చరి త్రాత్మక మైలురాయిని సాధించింది.
→ ఇది ఆత్మని ర్బర్ భారత్ పట్ల నౌకాదళం ప్రోత్సాహాన్ని సూచి స్తుంది' అంటూ నేవీ ట్వీట్ చేసింది.

3.5 లక్షల కోట్ల డాలర్లకు భారత్ జీడీపీ

202లో భారత జీడీపీ 3.5 లక్షల కోట్ల డాల ర్లను అధిగమించిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది.
→ వచ్చే కొన్నేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న జీ-20 దేశంగా భారత్ నిలవనుందని... అయితే సంస్కరణలు, విధానపరమైన అడ్డంకుల వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది.
→ లైసెన్సులు పొందడం, వ్యాపార ఏర్పాటు చేసే ప్రక్రియ నెమ్మదించే అవ కాశం ఉందని అంచనా వేసింది.
→ 'భారత్ లో నిర్ణ యాలు తీసుకోవడంలో అధికారుల పాత్ర అధికం గా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ఐ )ను ఆకట్టుకోవడంలో ఇది అడ్డంకిగా మారొచ్చు.
→ ముఖ్యంగా ఇండోనేషియా, వియత్నాం వంటి అభి వృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడటానికి సవా లుగా నిలవొచ్చు' అని మూడీస్ పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్లో కొత్త వృక్షజాతి

ఆరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త వృక్ష జాతిని పరి శోధకులు కనుగొన్నారు. దీనికి 'మయోజైన్అరుణా చలెన్సిస్' అని పేరు పెట్టారు.
→ ఈ రాష్ట్రంలోని ఆది జాతిలో హిల్స్ లో ఇది వెలుగు చూసింది. మయోజైన్ ఇది ఉపజాతి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ ఆ జాతిలో ఈ వృక్షమే అతి పెద్దదని వివరించారు.

జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది.
→ ఈ నెల 29న ఉదయం 10.42 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావస్పేస్ సెంటర్(షార్) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ను ప్రయోగించనుంది.
→ దీనిద్వారా 2.232 కిలోల బరువు ఉన్న ఎన్వీఎస్1 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంటోంది.
→ దేశ సరిహద్దులో 1,500 కిలోమీటర్ల మేర నావిక్ కవరేజ్ ఉండే విధంగా ఉప గ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
→ ఇప్పటికే 7 ఉప- గ్రహాలను ఇస్రో ప్రయోగించి నావిగేషన్ వ్యవస్థను పటిష్టపరిచింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయ వంతమైతే 12 ఏళ్ల పాటు సేవలందించనుంది.

విపత్తులతో దేశంలో 1.3 లక్షల మంది మృతి

దేశంలో 1970 నుంచి 2021 మధ్య సంభవిం చిన 573 ప్రకృతి విపత్తులతో.. 1,98,377 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ వాతావరణ సం. స్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.
→ ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన 12 వేల విపత్తుల కార ణంగా.. సుమారు 20 లక్షల మంది చనిపోయా రని, రూ.35 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిం దని డబ్ల్యూఎంవో వెల్లడించింది.
→ నాలుగేళ్లకోసారి జరిగే డబ్ల్యూఎంవో సదస్సు ప్రారంభమైన సంద ర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది.
→ 2027 లోపు విపత్తుల రాకపై హెచ్చరికల వ్యవస్థను మెరు గుపరుచుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేసింది.

2030కల్లా పక్షవాతంతో ఏటా 50 లక్షల మరణాలు

పక్షవాతం కారణంగా చోటుచేసు కునే మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో మరింత పెరిగే ముప్పుందని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
→ ముఖ్యంగా మెదడుకు రక్త సరఫ రాలో అవాంతరాలు ఏర్పడే 'ఇషిమిక్ స్ట్రోక్' రకం. పక్షవాతం కారణంగా.. 2030 కల్లా ఏటా దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ఆస్కార ముందని తెలిపారు.
→ ఈ తరహా పక్షవాతంతో 199 0 20.1 లక్షల మంది మరణించగా.. 2019లో 32.9 లక్షల మంది మృత్యువాతపడ్డారని వెల్లడిం చారు.
→ ఆహారంలో సోడియం అధికంగా ఉండటం, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మూత్రపిండాల వైఫల్యం, రక్తంలో చక్కెరల స్థాయి. ఎక్కువగా ఉండటం, ఊబకాయం వంటివి ఇషి మిక్ స్ట్రోక్తో మరణాలు పెరుగుతుండటానికి

100 కోట్ల మందిపై కలరా పంజా

ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉం దని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
→ 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడించింది.
→ ప్రపంచ -వ్యాప్తంగా కలరా పునరాగమనం భయంకరంగా ఉండబోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచో) తెలిపింది. ఇప్పటికే 24 దేశాల్లో కేసులు.. నమోదైనట్టు ఆ సంస్థకు చెందిన గ్లోబల్ కలరా రెస్పాన్స్ మేనేజర్ హెన్రీ గ్రే వెల్లడించారు.

అల్పాదాయ దేశాల్లోనే 91 శాతం శిశు మరణాలు

నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో 91 శాతం మరణాలు ఆల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే నమో దవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహె చ్ ), యునిసెఫ్ నివేదిక వెల్లడించింది.
→ దీనికి ప్రధాన కారణం వాయు కాలుష్యమేనని తెలిపింది. వాతావరణ మార్పులు, శిశువుల ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని ఈ నివేదిక మదింపు చేసింది.
→ శిశు జననాలు, వారి ఆరోగ్యంపై వేడిగాలులు, తుపా నులు, వరదలు, కరవులు, కార్చిచ్చులు, వాయు కాలుష్యం, వలసలు మొదలైన వాటి ద్వారా వాతా వరణ మార్పులు ప్రభావం చూపుతాయని తెలిపిం ది.
→ 'అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
→ బరువు తక్కువున్న శిశువుల్లో 15.6 శాతం మరణాలు, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో 35.7 శాతం మరణాలకు ఇళ్లల్లో పెరుగుతున్న వాయు కాలుష్యమే కారణం.
→ గాంబి యాలో జరిపిన పరిశోధన ప్రకారం - ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకు పిండంపై 17 శాతం ఒత్తిడి అధికంగా పడుతోంది.
→ భారత్లోనూ పర్యావ రణ మార్పులకు ఎక్కువగా గురవుతున్న జిల్లాల్లో బాలింతలు, శిశువుల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బ తింటోంది” అని నివేదిక పేర్కొంది..

2050 నాటికి 80 కోట్ల మందికి వెన్నునొప్పి

జనాభాలో వృద్ధులు పెరగనున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 84 కోట్ల మంది ప్రజలు వెన్నునొప్పితో బాధపడతారని ఓ పరిశో ధన వెల్లడించింది.
→ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ సంఖ్యలో ఈ కేసులు నమోదవుతాయని పేర్కొంది. లాన్సెట్ రుమటాలజీ జర్నల్లో ఈ పరి శోధనా పత్రం ప్రచురితమయింది.
→ 2017 నుంచి వెన్ను లేదా నడుము నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య 50 కోట్లు ఉండగా.. 2020 నాటికి అది 80 కోట్లకు చేరింది.
→ ఉద్యోగ పరిసరాలు, ధూమ పానం, ఊబకాయం వెన్నునొప్పికి ప్రధాన కార ణాలు, వృద్ధుల్లో ఇది ఒక సాధారణ సమస్యలా మారిపోయింది.
→ 1990 నుంచి 2020 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ పోకడను అంచనా వేశారు.

విశాఖ వేదికగా మిలాన్... మెరుపులు

అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖ మరోసారి వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవ . రిలో మిలాన్-2024 నిర్వహణకు తూర్పు నౌకా దళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
→ 50 దేశాలతో భారీ స్థాయిలో విన్యాసాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

కణ స్వీయ నాశనంలో 'నింజురిన్ 1' ప్రోటీన్ కీలక పాత్ర

దెబ్బతిన్న ఇన్ ఫెక్షన్ సోకిన కణాలు తమను తాము నాశనం చేసుకుంటాయి.
→ ఈ అంతర్గత 'ఆ 'త్మాహుతి' వ్యవస్థ గురించి కీలక వివరాలను పరిశో ధకులు తాజాగా వెలుగులోకి తెచ్చారు.
→ కణ రక్షణ పార ఛిద్రం కావడంలో నింజురిన్ 1 అనే ప్రొటీన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తేల్చారు.
→ స్విట్జర్లాండ్ లోని బాసెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరి శోధన చేశారు.

అండగా నిలిచే ఆప్త మిత్రులం

పసిఫిక్ దీవుల్లోని దేశాల అభివృద్ధికి భారత్ అన్ని విధాలా తోడ్పడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
→ భారత్ అంటే అవ సరమైనప్పుడు అండగా నిలిచే విశ్వసనీయమైన స్నేహితుడే తప్ప.. కష్టకాలంలో మొండి చేయి చూపే మిత్ర దేశం కాదన్నారు.
→ పపువా న్యూగిని యాలో పర్యటించిన ఆయన మూడో ఇండియా-ప సిఫిక్ ద్వీప దేశాల సహకార వేదికనుద్దేశించి ప్రసం గించారు.
→ పసిఫిక్ సముద్రంలోని 14 దేశాల సమా హారమైన ఈ వేదిక భౌగోళికంగా వ్యూహాత్మకంగా కీలకమైంది. చైనా ఈ దీవులపై పట్టుబిగించాలని చూస్తోంది.
→ ఈ నేపథ్యంలో జపాన్లో జీ-7 శిఖ రాగ్ర సదస్సు నుంచి మోదీ నేరుగా పపువా న్యూగి నియాలో అడుగుపెట్టారు.
→ 14 దీవుల్లోనూ సముద్ర అంబులెన్స్, జన ఔషధ కేంద్రాలు, సముద్రనీటిని మంచినీటిగా మార్చే నిర్లవణీకరణ కేంద్రాలను భారత్ ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు.
→ ఫిజిలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభిస్తామన్నారు. పపువా న్యూగినియాలో జై పూర్ కృత్రిమ అవయవాల కేంద్రం ఏర్పాటు చేస్తా మన్నారు.
→ సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక ఇం ధనం తదితర రంగాల్లో సహకారంపై 12 సూత్రాల అభివృద్ధి ప్రణాళికను మోదీ ఆవిష్కరించారు..

సీఐఐ అధ్యక్షుడిగా ఆర్. దినేశ్

2023 - 24 సంవత్సరానికి సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) అధ్యక్షుడిగా టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. దినేశ్ బాధ్యతలు స్వీకరించారు.
→ బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు

నీరజ్ కు తొలిసారి టాప్ ర్యాంక్

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు.
→ ఈ టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ పురుషుల జావెలిన్ త్రోలో ప్రపంచ నెం.1 ర్యాంక్ దక్కించుకున్నాడు.
→ ఈ మేరకు వరల్డ్ అథ్లెటిక్స్ ఇటీవల ర్యాంకులను ప్రకటించింది.
→ ప్రపంచ చాంపియన్ ఆండర్సన్ పీట ర్స్ (1433పాయింట్లు)ను నీరజ్ (1455 పాయిం ట్లు) వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ చేజిక్కించుకున్నాడు.

అర్జున్ కు షార్జా టైటిల్

భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ మరో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
→ ఈ తెలంగాణ గ్రాండ్ మాస్టర్ షార్జా మాస్టర్స్ టైటిల్ను సొంతం చేసు కున్నాడు.
→ ఇటీవల చివరిదైన తొమ్మిదో రౌండ్లో నొదిర్బిక్(ఉజ్బెకిస్థాన్)ను ఓడిం చిన అర్జున్.. 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలి చాడు. చివరి 5 రౌండ్లలో అతడు 4.5 సాధించడం విశేషం.

చైనాకు ఆల్టర్నేటివ్ ఇండియా

చైనాను వీడుదామనుకుంటున్న కంపెనీలకు మన దేశం ఆల్టర్నేటివ్ గా కనిపిస్తోంది.
→ మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్సీల) సీఈఓలు ఓ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు.
→ చైనాకు జియోపొలిటికల్ సమస్యలు పెరగడంతో బిజినెస్, ట్రేడు ఇబ్బంది కలుగుతుందని వారు తెలిపారు.
→ ఐఎంఏ ఇండియా 100 మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన సీఈఓలతో చేసిన సర్వే ప్రకారం, 88 శాతం మంది సీఈఓలు ఇండియాను చైనాకు ఆల్టర్నేటివ్ చూస్తున్నారు.
→ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియా వాటా 24.9 శాతానికి పెరగడాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
→ మరోవైపు థాయ్లాండ్, వియత్నాం, తమ సొంత ప్రాంతాలను కూడా ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

భారీగా పెరగనున్న యూపీఐ వాడకం

యూనిఫైడ్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా (యూపీఐ) వాడకం రాబోయే రోజుల్లో గణనీయం గా పెరుగుతుందని ఎక్స్ పర్టులు చెబుతున్నారు.
→ 2026-27 నాటికి యూపీఐ లావాదేవీలు రోజుకు వందకోట్లకు చేరుకునే అవకాశం ఉందని, దేశంలోని రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా వీటికే ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా రిపోర్ట్ తెలిపింది.
→ 2022-23లో రిటైల్ విభాగంలో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐకి 75 శాతం వాటా ఉందని 'ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్ బుక్ 2022-27 పేరుతో విడుదల చేసిన రిపోర్ట్లో పీడబ్ల్యూసీ పేర్కొంది.
→ వచ్చే ఐదేళ్లలో రిటైల్ డిజిటల్ చెల్లింపు యూపీఐకి 90 శాతం వాటా ఉంటుంది.
→ భారతీయ డిజిటల్ చెల్లిం పుల మార్కెట్ ఏటా 50 శాతం (వాల్యూమ్ వారీగా) స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది.
→ 2022-23 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల సంఖ్య 103 బిలియన్లు కాగా, 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి వీటి సంఖ్య 411 బిలియన్లను చేరుకునే అవకాశం ఉంది.

తుర్కియే ఎన్నికల్లో ఎర్డోగాన్ విజయం

తుర్కియే ఎన్ని కల్లో అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి విజయం సాధించారు.
→ మలి విడత కౌంటింగ్ లో ఆయన 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్ ఏజెన్సీ ఆదివారం రాత్రి ప్రకటించింది.
→ ప్రత్యర్థి కెమల్కు 48 శాతం ఓట్లు వచ్చినట్లు పేర్కొంది. ఎర్డోగాను 52 శాతం ఓట్లు వచ్చినట్లు ప్రతిపక్ష అనుకూల మీడియాలో కూడా పేర్కొంది. దీంతో ఆయన విజయం ఖాయమైంది.
→ రెండు దశాబ్దా లుగా ఎర్డోగాన్ తుర్కియే పాలకుడిగా కొనసాగు తున్నారు. ప్రధానిగా, అధ్యక్షుడిగా ఆయన పని చేశారు.
→ మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశిస్తారు.

కక్ష్యలోకి ఎన్వీఎస్-01 ఉపగ్రహం

తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.
→ జీఎస్ఎల్వీ-ఎఫ్12 వాహకనౌక ద్వారా ఎన్వీఎస్-01 ఉప గ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
→ ప్రయో గానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
→ ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
→ జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 పొడవు 517 మీటర్లు. బరువు 420 టన్నులు. రాకెట్ బయలు దేరిన తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కి. మీ. ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపె ట్టనుంది.
→ భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది. 2232 కిలోల బరు వున్న దీని జీవితకాలం 12 ఏళ్లు.
→ ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరి ధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.

సబ్ స్టేషన్లకు నిర్వహణకు అధునాతన 'రిమోట్ కంట్రోల్' టెక్నాలజీ వినియోగం

విద్యుత్ సరఫరా ప్రక్రియ నంతా ఆటోమేషన్ పరిజ్ఞానంతో నిర్వహించేందుకు తెలు గాణ ట్రాన్స్కో అదునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది.
→ సుదూర ప్రాంతాల్లోని విద్యుత్కేంద్రాల్లో ఉత్ప త్తయ్యే కరెంటు ట్రాన్స్కో ఆధ్వరంలో తొలుత రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న 400, 220 కేవీ సబ్ స్టేషన్లకు సరఫరా అవు తుంది.
→ అక్కడున్న సిబ్బందితో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీతో వీటి నిర్వహణకు ట్రాన్స్కో ఉపక్రమించింది.
→ తొలుత కొన్ని సబ్ స్టేషన్లలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మరికొన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయించింది.
→ దీని వల్ల కరెంటు సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తగ్గ డంతో పాటు మానవ, ఆర్ధిక వనరులు ఆదా కాను న్నాయి.
→ ఇటీవల కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు హైదరాబాద్ వచ్చి కొన్ని సబ్ స్టేషన్లలో ఈ విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు.
→ తెలంగాణలో కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను ఎలా అభివృద్ధి చేశారో పరిశీలించడానికి ఈ అధికారుల బృందం వచ్చింది.
→ ఆర్ధికభారం పెరగకుండా సబ్ స్టేషన్ల నిర్వహణలో సంస్కరణలు తేవాలని ట్రాన్స్కో సంకల్పించింది.
→ ఉదా హరణకు సిద్దిపేటలో 132, 220 కేవీ సబ్ స్టేషన్లు ఒకే ఆవరణలో ఉండేవి.
→ వీటి కంట్రోల్ రూములు విడివి డిగా ఉన్నందున 10 మందికి పైగా సిబ్బంది పనిచేసే వారు.
→ రెండు సబ్ స్టేషన్లకు కలిపి ఒక కంట్రోల్ రూం చాలని అక్కడున్న వారిలో ముగ్గురు ఉద్యోగులను బదిలీ చేశారు.
→ సిరిసిల్ల, వికారాబాద్ జిల్లా పరిగి, నాగర్క ర్నూల్ జిల్లా కల్వకుర్తి, హైదరాబాద్ లోని గచ్చిబౌలి, ఇమ్లీబన్, ఎర్రగడ్డలలో రెండేసి సబ్స్టేషన్ కంట్రోల్ రూములను ఒకటిగా చేశారు.
→ హైదరాబాద్లో ఫీవర్. ఆసుపత్రి వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్ కంట్రోల్ రూంను తొలగించి అక్కడున్న ముగ్గురు సిబ్బందిని బదిలీ చేశారు.
→ దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ సబ్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా డిండి 400 కేవీ సబ్స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నారు.
→ వన పర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లోని మరి కొన్ని సబ్స్టేషన్లను ఈ విధానంలోకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు.
→ హైదరాబాద్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి నగరం చుట్టూ ఏర్పాటు చేసిన 400 కేవీ సబ్ స్టేషన్ల విద్యుత్ వలయాన్ని (పవర్ రింగ్) చూసి కర్ణాటక, కేరళ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
→ బెంగళూరు, తిరువనంతపురం నగరాలకు ఇలాంటి పవర్ రింగ్ పూర్తిగా నిర్మించలేకపోయినట్లు వారు తెలిపారు.
→ తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంపై శ్రద్ధతో నిరంతర సరఫరాకు పూర్తి స్వేచ్ఛని వ్వడం వల్ల పవర్ రింగ్ నిర్మాణం వేగంగా పూర్తిచేసి నట్లు ట్రాన్స్కో అధికారులు వారికి తెలిపారు.

సావర్కర్ నేటికీ స్పూర్తిదాయకం 'మన్కీ బాత్'లో మోదీ

సావర్కర్ త్యాగం, ధైర్యం ఈ రోజుకీ మనకి స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ అన్నారు.
→ ఆయనకు ఉన్న నిర్భయత్వం, స్వాభిమానం బానిస మనస్తత్వాన్ని అంగీకరించదని వ్యాఖ్యానించారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా మన్ కీ బాత్ ఎపిసో డ్లో మోదీ ఆయన గురించి మాట్లాడారు.
→ అండమాన్ లోని కాలాపానీ కారాగారంలో సావర్కర్ బందీగా ఉన్న గదిని దర్శించిన రోజుని ఇప్పటికీ మరచిపోలేనని మోదీ పేర్కొన్నారు.
→ జూన్ 4న సంత్ కబీర్ జయంతి సంద ర్భంగా ఆయన సమాజంలో తీసుకొచ్చిన మార్పును మోదీ గుర్తుచేశారు.
→ ప్రజల్ని విభజించే ప్రతి చర్యనూ కబీర్ అడ్డుకున్నారని, సమాజాన్ని జాగృతం చేశార న్నారు. మన్ కీ బాత్ ఎపిసోడ్లో విద్యాశాఖ కార్యక్రమం 'యువ సంగం'లో భాగ మైన విద్యార్థు ముచ్చటించారు.
→ ఈ మంలో భాగంగా దేశంలోని భిన్న త్వాన్ని తెలుసుకునేందుకు సుమారు 1200 మంది విద్యార్థులు 22 రాష్ట్రాల్లో పర్యటించారని తెలిపారు.
→ ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్ డబుల్ సెంచరీకి తొలి అడు గని ప్రధాని వ్యాఖ్యానించారు.
→ అంతకుముందు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమం త్రులు, ఎంపీలు పాత పార్లమెంటులోని సెంట్రల్ ల్లో ఉన్న సావర్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఆరేళ్ల తర్వాత మలేసియా మాస్టర్స్ సింగిల్స్ టైటిల్ ప్రణయ్ సొంతం

హెచ్.ఎస్. ప్రణయ్ సాధించాడు. ఆరేళ్లుగా టైటిల్ కరవుతో ఉన్న అతడు ఎట్టకేలకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రపంచ టూర్ టైటిల్ను పట్టేశాడు.
→ మలేసియా మాస్టర్స్ సూపర్-500 టోర్నీలో అత్యుత్తమ ఆటతో అదరగొట్టిన భారత స్టార్ షట్లర్ విజేతగా నిలిచాడు.
→ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18తో వెంగంగ్ యంగ్ (చైనా)ను ఓడించాడు.
→ తొలి గేమ్ ఆరంభంలో వాంగ్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లినా.. పుంజుకున్న ప్రణయ్ స్కోరు సమం చేశాడు. ఇద్దరూ తగ్గకపోవడంతో పోటీ హోరా హోరీగా సాగింది.
→ కానీ విరామ సమయానికి ప్రణయ్ 1-10తో స్వల్ప ఆధిక్యంలో నిలిచాడు. బ్రేక్ తర్వాత కూడా భారత స్టార్కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.
→ స్కోరు 19-19తో సమంగా ఉన్నప్పుడు.. వరుసగా రెండు పాయింట్లు సాధించిన ప్రణయ్ గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లోనూ ఆట నువ్వానేనా అన్నట్లే సాగింది.
→ సుదీర్ఘ ర్యాలీలు నడిచాయి. అయితే ఒక దశలో విజృంభించిన యంగ్.. వరుస పాయింట్లతో 17-11తో ఆధిక్యం సాధించడమే కాక అదే ఊపులో గేమ్ గెలిచి మ్యాచ్లో నిలిచాడు.
→ మూడో గేమ్ ఆరంభంలో వెనుకబడినా.. బ్రేక్ సమయానికి ప్రణయ్ 11-10తో ఆధిక్యం సాధించాడు.
→ విరామం తర్వాత యంగ్ నుంచి పోటీ ఎదురైనా.. మెరుపు క్రాస్కోర్టు షాట్లు, స్మాష్ తో భారత షట్లర్ 20-18తో విజయానికి చేరువయ్యాడు.
→ అదే జోరుతో మరో పాయింట్ గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.
→ గతేడాది చరిత్రాత్మక థామస్కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రణయ్క 2017 యుఎస్ ఓపెన్ తర్వాత దక్కిన తొలి సింగిల్స్ విజయమిదే.

లోక్సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!

దేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణన వచ్చే లోక్సభ ఎన్నికల్లోపు చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
→ ఈసారి 2020 ఏప్రిల్ 1 - సెప్టెంబరు 30 మధ్య ఈ లెక్కింపును చేపట్టాల్సిన లెక్కింపు కోవిడ్ కారణంగా ఆ కార్యక్రమం నిర వధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.
→ ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ప్రభుత్వం ఇంకా ప్రక టించలేదు.
→ 2024 ఏప్రిల్-మే మధ్య లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
→ ఇందుకు సంబంధించిన ప్రక్రి యను ఎన్నికల సంఘం చేపట్టనుంది.
→ వచ్చే అక్టోబరు నుంచి ఈసీ చేపట్టే కార్యక్రమాల్లో, జనాభా గణన ప్రక్రి యలోనూ ఒకే సిబ్బంది పాల్గొనాల్సి ఉంటున్నందున ఆ సమయంలో జనాభా లెక్కింపును చేపట్టడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.
→ ఈ నేపథ్యంలో ఎన్ని కల తర్వాతే జనాభా లెక్కింపు ఉండే అవకాశం ఉందని చెప్పారు.
→ ఈసారి చేపట్టే కార్యక్రమం తొలి డిజిటల్ జనాభా గణనగా ఉంటుంది. పౌరులు సొంతంగా వివ రాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు.
→ ఇందుకు సంబంధించిన స్వీయగణన పోర్టల్ ను సంబంధిత యంత్రాంగం రూపొందించింది. ఈ ప్రక్రియలో ప్రజలు ఆధార్ లేదా మొబైల్ నంబరును అందించాల్సి ఉంటుంది.
→ అలాగే పౌరులను అడిగే 31 ప్రశ్నల్లో.. ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు? యజమాని ఎవరు? టెలిఫోన్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ లేదా స్మార్ట్ఫోన్, సైకిలు, ద్విచక్రవాహనాలు, కారు, జీపు, వ్యాను వంటివి ఏమైనా ఉన్నాయా? తినడానికి వినియో గించే ప్రధాన ఆహార ధాన్యాలేమిటి? వంటివి ఉంటాయి.

సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్

అమెరికాలో ఫంగల్ మెనింజైటిస్ మర ణాలు కలవర పెడుతున్నాయి. సౌందర్య చికిత్సలే దీనికి కారణమని భావిస్తున్నారు.
→ ఈ నేపథ్యంలో అమెరికా, మెక్సికో దేశాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రక . టించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూ హెచ్) విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
→ తాజాగా అమెరికాలోని ఇద్దరు వ్యక్తులు ఫంగల్ మెనింజైటిస్ కారణంగా ప్రాణాలు కోల్పో యారు.
→ వీరిద్దరూ మెక్సికోలో లైపోసక్షన్ చికిత్స చేయిం చుకున్నట్లు తెలుస్తోంది.
→ ఈ చికిత్స ద్వారా చర్మం దిగు వున పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. ఈ సమయంలో ఫంగస్ వాళ్ల శరీరంలోకి చొరబడుతుంది.
→ కొన్నిరోజులకు కణాలను ఉబ్బిపోయేలా చేస్తుంది. దీని వల్ల మరణం ముప్పు తలెత్తవచ్చు.
→ జనవరి నుంచి మే 13 మధ్యలో దాదాపు 200 మంది అమెరికన్లు ఈ చికిత్స కోసం మెక్సికో వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్ల తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) హెచ్చరికలు జారీ చేసింది.
→ వందలాది మంది ఈ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని తెలిపింది.
→ మెనింజైటిస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మెడ పట్టేయడం, వాంతులు, కాంతి వైపు చూడలేకపోవడం, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
→ ఇది అంటు వ్యాధి కాదని సీడీసీ పేర్కొంది.

పాత పార్లమెంటులో తొలి అడుగు తెలుగు ఎంపీదే

ఏడు దశాబ్దాల కుపైగా మన దేశ ప్రజాస్వా మ్యానికి పట్టుగొమ్మగా నిలి చిన పాత పార్లమెంటు భవ నంలో ఎన్నో తెలుగు వెలుగు లున్నాయి.
→ స్వాతంత్ర్యం వచ్చాక ఎంపీగా ఆ భవనం లోకి తొలి అడుగు పెట్టే అవకాశం తెలుగుబిడ్డ రావి నారాయణరెడ్డికి దక్కడం విశేషం.
→ ఈ నెల 28 ఆది వారం)న పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
→ స్వాతంత్ర్యానంతరం 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నెహ్రూ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
→ తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న రావి నారాయ ణరెడ్డి అప్పట్లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి పీడీ ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగి 3,09,162 ఓట్లు సాధిం చారు.
→ ఆయన సమీప అభ్యర్థి వి భాస్కర్ రా వు(కాంగ్రెస్) కు 86,882 ఓట్లు వచ్చాయి.
→ రావి నారాయ ణరెడ్డికి 2,22,280 ఓట్ల మెజారిటీ దక్కింది.
→ ఉత్తర్ ప్రదే శ్లోని జాన్ పూర్ (పూల్ పూర్ నుంచి పోటీ చేసిన నెహ్రూకు 2,33,571 ఓట్లు వచ్చాయి.
→ ఆయన సమీప ప్రత్యర్థి కేఎంపీపీకి చెందిన బన్సీలాల్కు 59,642 ఓట్లు వచ్చాయి.
→ నెహ్రూకు 1,73,929 ఓట్ల మెజారిటీ వచ్చింది.
→ దాంతో నెహ్రూ చొరవతో... రావి నారా యణరెడ్డి నాడు పార్లమెంట్లోకి తొలి అడుగుపె ట్టారు.
→ ఈ ఘనతను పొందిన రావి నారాయణరెడ్డి సొంతూరు యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామం.
→ ప్రస్తుత లోక్సభలో మెజారిటీ పరంగా చూస్తే.. 2019 ఎన్నికల్లో గుజరాత్లోని నవారి స్థానంలో భాజపా అభ్యర్ధి సీఆర్ పాటిల్ అత్యధికంగా 6,89,668 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
→ పాటిల్ కు 9,72,739 ఓట్లు రాగా కాంగ్రెస్కు చెందిన డి. బి. పటేల్ కు 2,83,071 వచ్చాయి.

భారత్ కు నేపాల్ విద్యుత్

భారత్ కు నేపాల్ గంటకు 600 మెగావాట్ల విద్యుత్ను ఎగుమతి చేసేం దుకు అంగీకరించింది.
→ ఇందులో భాగంగానే శనివారం విద్యుత్ సరఫరాను ప్రారంభించింది.
→ త్వరలోనే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్పై ఇరుదేశాల ప్రధానులు సంతకం చేయనున్నారు.
→ ఈ నెల 31 నుంచి నాలుగు రోజుల పాటు నేపాల్ ప్రధాని ప్రచండ భారత్లో పర్యటించనున్నారు.
→ ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన, ఆ దేశ అధికార బృందంతో కలిసి ఢిల్లీకి రానున్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ వెల్ల డించింది.
→ గతేడాది నేపాల్లో అధికారం చేపట్టిన తర్వాత ప్రచండ మొదటిసారిగా భారత్లో పర్యటించ నున్నారు. ఈ సంద సంబంధించిన ఆరు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.
→ వర్షాకాలంలో నేపాల్లో జలవిద్యుత్ డిమాండ్కు మించి ఉత్పత్తి అవుతుండగా.. భారత్ దిగుమతి చేసు సుకుంటుంది.
→ గతేడాదిలోనూ జూన్ నుంచి సెప్టెం బరు వరకు నేపాల్, భారత్కు విద్యుత్ను సరఫరా చేసింది. ఈ డీల్ నేపాల్ రూ.1200 కోట్లను ఆర్జిం చింది.
→ కొంత కాలం క్రితం దేశీయ డిమాండ్ దృష్యా నేపాల్, భారత్ నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ను దిగుమతి చేసుకుంది.

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం

దేశ రాజధాని నడిబొడ్డున అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
→ ఈ వేడుకను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిపించకపోవడానికి నిరసనగా దాదాపు 20 విపక్షాలు దీనిని బహిష్కరించా లని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
→ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
→ న్యూదిల్లీ మొత్తాన్ని నియంత్రిత ప్రాంతంగా ప్రకటించి, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
→ ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపుర్ నుంచి తీసుకువ చ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్ధం చేసిన గచ్చు, రాజస్థాన్లో రూపుదిద్దుకున్న శిలాకృతులు.. ఇలా దేశంలో భిన్న సంస్కృ తుల మేళవింపుగా భవనాన్ని తీర్చిదిద్దారు.
→ బ్రిటిష్ పాలకుల నుంచి అధికారం బదలా పునకు చిహ్నంగా తొలి ప్రధాని నెహ్రూ. స్వీకరించిన చారిత్రక 'ఉత్సవ రాజదండం' (సెంగోల్)ను నూతన లోక్సభలో స్పీకర్ స్థానానికి సమీపంలో నెలకొల్పుతారు.
→ ప్రత్యే కంగా రూపొందించిన రూ.75 నాణేన్ని విడు దల చేస్తారు.
→ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన కొత్త భవనంలో భారీస్థాయి 'కాన్ స్టిట్యూషన్ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, గ్రంథాలయం, కమిటీ హాళ్లు, విశాల మైన పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి.
→ త్రికోణా కారంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు, వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.
→ నూతన భవనంలో వాడిన టేకును మహారాష్ట్రలోని నాగ్ పుర్ నుంచి రప్పిం చారు.
→ రాజస్థాన్ లోని సర్మధుర నుంచి ఎర్ర చలువరాయిని తీసుకువచ్చారు.
→ తెల్ల చలువరాయిని రాజస్థాన్లోని అంబాజీ నుంచి, కేసరియా ఆకుపచ్చరాయిని ఉదయ్ పుర్ నుంచి, ఎర్ర గ్రానైట్ను అజ్మేర్ సమీ పంలోని నుంచి, ఫర్నిచర్ను ముంబయి నుంచి రప్పించారు.
→ అశోక చిహ్నం కోసం సామగ్రిని ఔరంగాబాద్ నుంచి, ఉభయసభల్లో భారీ గోడలపై ఆశోక చక్రం రూపొందించడానికి ఇందౌర్ నుంచి సామగ్రి తీసుకువచ్చారు.
→ ఏకా భారత్.. శ్రేష్ఠ భారత్ స్పూర్తి పరిఢవిల్లేలా యావద్దేశానికీ ఏదో ఒక రూపంలో ఈ భవన నిర్మాణంలో ప్రాతినిధ్యం లభించిం దని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు.

అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ సి.క్యూ.బ్రౌన్

వైమానిక దళాధికారి జనరల్ సి. క్యూ. బ్రౌన్ జూనియర్ ను తదుపరి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేశారు.
→ ఈ మేరకు ఆయన లాంఛనంగా ప్రకటన చేయ నున్నారు.
→ ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యా లయం 'పెంటగాన్'లో అత్యున్నత పదవి. నల్లజాతీయు డైన బ్రౌను చైనాకు సంబంధించి విస్తృత అవగాహన ఉంది.
→ ఈ నియామకంతో పెంటగాన్లో అత్యున్నత పౌర (రక్షణ మంత్రి), మిలటరీ పదవులను ఏకకాలంలో ఆఫ్రికన్ అమెరికన్ సంతతి వారు నిర్వహించినట్లవు తుంది.
→ ఇలా జరగడం ఇదే మొదటిసారి. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా నల్లజాతీయుడే. v ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లే పదవీకాలం ఈ ఏడాది అక్టోబరులో ముగియ నుంది. ఆ తర్వాత బ్రౌన్ ఆ బాధ్యతలు చేపడతారు.
→ ఆయన వాయుసేనలో పలు కీలక పదవులు నిర్వర్తిం చారు. ఐరోపా, పశ్చిమాసియా, ఆసియాలో పనిచేశారు.
→ ఆయన ఎఫ్-16 యుద్ధవిమాన పైలట్గా కెరీర్ ప్రారంభించారు.

2047 నాటికి అందరికీ బీమా!

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి, దేశంలోని ప్రజలందరికీ బీమా సదుపాయం కల్పించేలా పని చేస్తున్నామని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్ దేవాశిష్ పాండా వెల్లడించారు.
→ గత 10-12 నెలల్లో జీవిత బీమా పథకాలను పెంచేందుకు ఐఆర్డీఏఐ అనేక చర్యలు తీసు కున్నట్లు సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ పాండా వివరించారు.
→ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఎంత సంచ లనం సృష్టించిందో, బీమా రంగంలో జీవిత, సాధారణ బీమా పథకా ల్లోనూ భారీ కదలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని దేవాశిష్ తెలిపారు.
→ బీమా సుగమ్, బీమా విస్తార్, మహిళల బీమా వాహక్ (బీమా ట్రినిటీ) ద్వారా ప్రజలందరికీ బీమా ప్రతిపాదనను ముందుకు తీసుకెళుతున్నామన్నారు.
→ నియమాల ఆధారిత నుంచి అత్యధికులకు బీమాను చేరువ చేసే విధానంలోకి ఐఆర్డీఏఐ మారుతోందన్నారు.

డబ్ల్యూహెచ్ ఓ ప్రాధాన్య జాబితాలో డిసీజ్ ఎక్స్ కి చోటు

కరోనా మహమ్మారి విలయాన్ని మించిన వినాశనాన్ని సృష్టించగలిగే తర్వాతి మహమ్మారి ఎలా ఉండబోతోంది..?
→ వైరస్, బ్యాక్టీ రియా లేదా ఫంగస్.. వీటిలో ఏ రూపంలో అది ప్రపంచంపైకి విరుచుకుప డుతుంది.?
→ 'డీసీజ్ ఎక్స్' అనే ఒక అంతుచిక్కని రోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) అత్యంత ప్రమాదకర రోగాల జాబితాలో చేర్చడం బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
→ ఇటీవలే డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్ సైతం కరోనా భయం లేదని నిర్లక్ష్యంగా ఉండొద్దని, తర్వాతి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చ రించిన సంగతి తెలిసిందే.
→ ఈ క్రమంలో డిసీజ్ ఎక్స్ గురించి ప్రపంచ ఆరోగ్య వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
→ డబ్ల్యూహెచ్ కీ వెబ్సైట్ లోని ప్రమాదకర రోగాల జాబితాలో ఎబోలా, సార్స్, జికా వంటివన్నీ మని షికి తెలిసినవే.
→ ఇలా ఏ పేరు లేకుండా కేవలం ఎక్స్ అన్న ఆంగ్లపదంతో ఉన్న డిసీజ్ ఎక్స్ మాత్రం భయాందోళనలకు కారణమవుతోంది.
→ 2018 నుంచీ డబ్ల్యూహెచ్ ఓ ఈ పదాన్ని వాడుతోంది.
→ ఇది ప్రస్తుతానికి మానవాళికి ఇంకా తెలియని వ్యాధి అని, ఏ రూపంలోనైనా భవిష్యత్తులో విరుచుకుపడవ చని పరిశీలకులు చెబుతున్నారు.
→ ఇటీవలే కంబోడియాలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన హెచ్ఎస్ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ ను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
→ "ఈ డిసీజ్ ఎక్స్ అనేది వైరసా లేక బ్యాక్టీరి యానా అంటే ఇప్పుడే చెప్పలేం. ఇది మానవ తప్పిదం వలన రావచ్చు.
→ లేదా మంచులో గడ్డకట్టిన వేల సంవత్సరాల నాటి వైరస్. కరిగిపోతున్న హిమానీనదాల ద్వారా తిరిగి మనుషులపై విజృంభించవచ్చు.
→ ఎటునుంచి ఎటు.. ఎలా, ఎప్పుడు వస్తుందన్నది చెప్పలేం కానీ.. త్వరగా దానికోసం అందరూ సిద్ధంగా ఉండటం మంచిది" అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ బాధ్యతల స్వీకరణ

సీబీఐ నూతన డైరెక్టర్గా కర్ణాటక కేడర్కు చెందిన సీని యర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ బాధ్యతలు స్వీకరించారు.
→ ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
→ సీబీఐ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన సుబోధ్ కుమార్ జైశ్వాల్.. ప్రవీణ్ సూద్కు బాధ్య తలు అప్పగించారు.
→ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
→ ఆయన 37 ఏళ్ల సర్వీసులో కర్ణాటకలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.

విక్రాంత్ పై మిగ్-29కే నైట్ ల్యాండింగ్ సక్సెస్

భారత నౌకాదళం మరో మైలురాయిని అందుకుంది.
→ నేవీకి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై తొలిసారిగా రాత్రి వేళ విజయవంతంగా ల్యాండ్ అయింది.
→ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఇదో కీలక ముందడుగు అని నౌకాదళం పేర్కొంది.
→ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయాణిస్తుండగా.. ఈ మైలురాయిని చేరుకున్నట్టు భారత నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మద్వాల్ తెలిపారు.

ఎన్ వీఎస్ -01 ఉపగ్రహ ప్రయోగం

మరో మూడు రోజుల్లో ఇస్రో చేపట్టనున్న నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 29న జీఎస్ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-01 (నావిక్-01) ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించ నుంది.
→ ఈ రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను పూర్తిచేసిన శాస్త్రవేత్తలు.. దాన్ని రెండో ప్రయోగ వేదికకు తరలించి. తుది పరీక్షలు నిర్వహించారు.
→ దేశీయ నావిగేషన్ అవసరాల నిమిత్తం, దేశంలో దిక్సూచి వ్యవస్థ కోసం 2,232 కిలోల బరువున్న ఎన్ వీఎస్-01 ఉపగ్రహాన్ని ఇస్రో ప్ర యోగిస్తోంది.
→ వాతావరణం అను కూలిస్తే ఈ నెల 29 ఉదయం 10:42 గంటలకు షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ- ఎఫ్12 నింగిలోకి ఎగరనుంది.

మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ

యూరోప్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది.
→ 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి- మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాం కాలు పేర్కొన్నాయి.
→ 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్-డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది.
→ వరుసగా రెండు త్రైమా సికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది.
→ అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతు న్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రి ల్లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉం ది.
→ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రూ.75 ప్రత్యేక నాణెం విడుదల

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 విలువ గల ప్రత్యేక నాణాన్ని విడుదల చేయనున్నారు.
→ ఈమేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
→ భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సంద ర్భంగా.. అందుకు స్మారకంగా ఈ నాణాన్ని ప్రధాని మోదీ విడు దల చేస్తారు.
→ ఈ నాణానికి ఒకవైపు అశోక స్తంభంలోని సింహ తలాటం ఉంటుంది.
→ దానికి దిగువన 'సత్యమేవ జయతే' అక్షరాలు ఉంటాయి... ఎడమ వైపున దేవనాగరి లిపిలో 'భారత్' అని.. కుడివైపున 'ఇండియా' అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.
→ అలాగే దిగువన నాణెం విలువ అయిన 75 ముద్రించి ఉంటుంది. నాణానికి మరోవైపు పార్లమెంటు భవన సముదాయం ముద్రించి ఉంటుంది.
→ దీనికి పైన.. సంసద్ సంకుల్ అని దేవనాగరి లిపిలో దిగువన పార్లమెంటు కాంప్లెక్స్.. అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.

రూ.75 స్మారక నాణెం విడుదల!

ఈ నెల 28న ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భా నికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.75 విలువైన స్మారక నాణెంను విడుదల చేయనుంది.
→ ఆర్ధిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన అధికారిక సమాచారం మేరుకు నాణెం 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల బరువు ఉండనుంది.
→ నాణేనికి ఒకవైపున మూడు సింహాల గుర్తు, మధ్యలో దేవనాగరి లిపిలో 'భారత్ ' అని.. ఇంగ్లిష్ లో 'ఇండియా' అని ఉంటాయి.
→ అలాగే రూపాయి గుర్తు 3. నాణెం విలువను సూచిస్తూ '75' సంఖ్య అడుగు భాగాన ముద్రిస్తారు.
→ నాణెం రెండో వైపున పార్లమెంటు భవనం బొమ్మ, సంవత్సరాన్ని సూచిస్తూ '2023’'ను ముద్రిస్తారు.

వచ్చే మార్చిలోగా 3రకాల వందేభారత్ రైళ్లు

న్యూఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభం
→ వచ్చే ఏడాది మార్చిలోగా మూడు రకాల ( వందే చైర్ కార్, వందే మెట్రో, వందే స్లీపర్) వందే భారత్ రైళ్లను నడుపుతా. మని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
→ ప్రస్తుతం ఉన్న శతాబ్ది, రాజధాని, లోకల్ రైళ్ల స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు తెలి పారు.
→ ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయని చెప్పారు.
→ డెహ్రాడూన్ లో ఢిల్లీ-డెహ్రా దూన్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
→ వంద కిలోమీటర్లలోపు వందే మెట్రో, 100-550 కిలోమీటర్ల మధ్య వందే చైర్ కార్, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి వందే స్లీపర్ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
→ జూన్ మధ్యకల్లా ప్రతి రాష్ట్రానికి ఓ వందేభారత్ రైలును అందిస్తామని చెప్పారు.
→ ఫ్యాక్టరీలో ప్రతి ఎని మిది, తొమ్మిది రోజుల్లోగా ఓ కొత్త ట్రైన్ తయారవుతోందని, మరో రెండు ఫ్యాక్టరీల్లోనూ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
→ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఈ వందే భారత్: రైళ్లను తయారు చేస్తున్నామని, కానీ ట్రాక్ సామర్థ్యం మేరకు వాటిని 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నామని చెప్పారు.
→ 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లను నడిపేలా పాత ట్రాక్ లను తయారు చేశారని, గంటకు 110 కిలోమీటర్లు, 130 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా దాదాపు 35 వేల కిలోమీటర్ల ట్రాక్ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
→ వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ పనులు పూర్తవుతాయన్నారు.

5 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

దేశంలోని అయిదు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియ మిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
→ వీరిలో ఇద్దరు తెలుగువారున్నారు.
→ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్ర పతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ఎంఎస్ రామ చంద్రరావు, కేరళ హైకోర్టులకు జస్టిస్ సరసా వెంక నారాయణ భట్, మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ సంజయ్ విజయ్కుమార్ గంగాపురా ్వలా, బాంబే హైకోర్టుకు జస్టిస్ రమేశ్ దేవకీనందన్ ధనూకా, రాజస్థాన్ హైకోర్టుకు జస్టిస్ అగస్టీన్ జార్జ్ మషిహ్ లను ప్రధాన న్యాయమూర్తులుగా నియమిస్తూ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది.

→ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ మామిడన్న సత్యరత్న శ్రీరా మచంద్రరావు తెలంగాణకు చెందినవారు.
→ 1966 ఆగస్టు 7న హైదరాబాద్లో జన్మించిన ఆయన 1989లో ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేశారు.
→ 1991లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎల్ ఎల్ఎం చేశారు.
→ 2012 జూన్ 29న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియ మితులయ్యారు.
→ 2013 డిసెంబరు 4న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
→ 2021 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 11 వరకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవ లందించారు.
→ ఆ తర్వాత పంజాబ్-హరియాణా న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. ఇప్పటివరకూ ఆయన అక్కడే సేవలందిస్తూ వచ్చారు.

→ * కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎస్. వెంకట నారాయణ భట్ ఇది వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
→ ఆయన స్వస్థలం అన్నమయ్య జిల్లా మద నపల్లి.
→ 1962 మే 6న జన్మించిన జస్టిస్ భట్ బెంగ ళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజ్ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు.
→ 1987లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2013 ఏప్రిల్ 12న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమి తులయ్యారు.
→ 2014 జూన్ 1న ఆంధ్రప్రదేశ్-తెలం గాణ ఉమ్మడి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
→ హైకోర్టు విభజన సమ యంలో 2019 జనవరి 1న అమరావతిలోని ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2019 మార్చి 19న కేరళ హైకోర్టుకు వెళ్లారు.
→ 2023 ఏప్రిల్ 24న అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియ మితులయ్యారు.
→ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
→ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రమేశ్ దేవకీనందన్ ధనూకా ఈనెల 30న పదవీ విరమణ చేస్తారు.
→ ఈ స్థానంలో ఆయన కేవలం నాలుగురోజులు మాత్రమే ఉంటారు.

ఐఎన్బీకి దేశంలో మొదటి స్థానం

ఎల్టీ (ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యు కేషన్ కస్టమ్ ర్యాంకింగ్- 2023లో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మనదేశంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
→ అలాగే ప్రపంచ వ్యాప్తంగా 29వ ర్యాంకు సంపాదించింది.
→ గతేడాది ప్రపంచ ర్యాంకిం గ్స్ లో 38వ స్థానంలో ఉన్న ఐఎస్బీ, ఈసారి తన ర్యాంకును బాగా మెరు గుపరచుకుంది.
→ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు అందిస్తున్న విలువకు ఈ ర్యాంకులు అద్దం పడుతున్నాయని ఐఎసీబీ డిప్యూటీ డీన్ (ఎగ్జి క్యూటివ్ ఎడ్యుకేషన్, డిజిటల్ లెర్నింగ్) ప్రొఫెసర్ దీపా మణి పేర్కొన్నారు.

అంతరిక్షంలోకి సౌదీ వ్యోమగాములు

సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళా వ్యోమగామి సహా ఇద్దరు వ్యోమగాములు స్పేస్ఎక్స్ సంస్థ ఛార్టెర్డ్ ఫ్లైట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆదివారం కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరారు.
→ వారికి ప్రస్తుతం స్పేస్ఎక్స్ తరపున పనిచేస్తున్న నాసా మాజీ వ్యోమగామి నేతృత్వం వహించనున్నారు.
→ స్పోర్ట్స్ కార్ రేసింగ్ టీమ్ యజమాని అయిన అమెరికా వ్యాపారవేత్త కూడా వారి బృందంలో ఉన్నారు. ఆ నలుగురు సోమవారం ఉదయానికి గమ్యానికి చేరుకున్నారు.
→ వారికి అంతరిక్ష కేంద్రంలోని సభ్యులు స్వాగతం పలికారు. వీరంతా వారం రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపి తిరిగి ఫ్లోరిడా తీరంలో కిందకి దిగుతారు.

27వ సారి ఎవరెస్టు అధిరోహించిన షెర్పా

పాసర్గ్ (పర్వతారోహకుల గైడ్) సారి ఎవరెస్ట ఎక్కడం ద్వారా కామి రీటా పేరు మీద ఉన్న రికార్డును సమం చేశారు.
→ 46 ఏళ్ల పాసన్గ్ సోమవారం ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని 27వ సారి అధిరో హించారని ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.
→ ఇదే సీజన్లో 28వ సారి ఎవ రెస్టును ఎక్కడం ద్వారా నూతన రికార్డును స్థాపిం చాలని పాసన్గ్ ప్రయత్నిస్తున్నారు.

తుర్కియే అధ్యక్షుడిగా మళ్లీ ఎరోగాన్!

తుర్కియే అధ్యక్షుడిగా మళ్లీ తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది.
→ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచి.. కింగ్ మేకర్గా మారిన ఓగాన్ ఎర్డోగాను మద్దతు ప్రకటించారు.
→ దీంతో ఈ నెల 28న జరగనున్న మలి విడత కౌంటింగ్ ఇక లాంఛనమే కానుంది.
→ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరికీ పూర్తి మద్దతు దక్కకపోవడంతో 28న మలి విడత ఓట్ల లెక్కింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
→ ఈలోగా ఎర్డోగాన్ కు ఓగాన్ మద్దతిచ్చారు.

60 కోట్ల మంది భారతీయులపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం

ప్రపంచంలోని అన్ని దేశాలు తాము ఇచ్చిన హామీలకనుగుణంగా ఉద్గారాలను కట్టడి చేసినప్పటికీ అధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో 60 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతారని నూతన అధ్యయనమే కటి తెలిపింది.
→ ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య 200 కోట్లు పైబడి ఉంటుందని పేర్కొంది.
→ భయంకరమైన పరిస్థితుల్లో 44 డిగ్రీల సెల్సియస్ భూతాపం ఏర్పడితే ప్రపంచ జనాభాలో 50 శాతం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని అధిక ఉష్ణోగ్రతలను చవిచూస్తారని పేర్కొంది.
→ ప్రస్తుత వాతావరణ విధానాలు ఈ శతాబ్దపు అంతానికి (2080-2100) భూతాపాన్ని 2.7 డిగ్రీ లకు పరిమితం చేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
→ ఈ మేరకు ఎర్త్ కమిషన్ తో భాగ స్వామ్యం గల యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్కు చెందిన గ్లోబల్ సిస్టమ్స్ ఇన్స్టిట్యూట్, నాన్జింగ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

స్థూలకాయుల్లో మధుమేహం ఎందుకంటే

స్థూలకాయులు మధుమేహం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువని తెలి సినా, దానికి కారణాలేమిటో ఇంతవరకు తెలి యరాలేదు.
→ వాషింగ్టన్ వర్సిటీ వైద్య కళాశాల పరిశోధకులు ఎట్టకేలకు ఆ ప్రక్రియను కని పెట్టారు.
→ ఒక వ్యక్తి శరీరంలో కొవ్వు మరీ ఎక్కువగా ఉంటే క్లోమ గ్రంథిలోని బీటా కణాలు ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి.
→ ఇన్సులిన్ స్థాయి మితిమీరితే శరీ రంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.
→ దీనిని ఉత్పత్తి చేసే బీటా కణాలు పనిచేయడం మానేస్తాయి.
→ ఇన్సులిన్ పాళ్లు మితిమీరినప్పుడు పాల్మిటేట్ అనే కొవ్వు ఆమ్లం కణాల్లోని ప్రోటీ న్లకు అతుక్కుపోతుంది.
→ దీనిని తొలగించకపోతే మధుమేహం వస్తుంది. పాల్మిటేట్ను బీటా కణాల నుంచి తొలగించే ఏపీటీ 1 అనే ఎంజైమ్ మధుమేహుల్లో చాలా తక్కువగా ఉంటుంది.
→ ఈ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచగల రసాయన మిశ్రమాలను తాము గుర్తించినట్లు పరిశోధక బృందం సారథి కోవిచ్ చెప్పారు.

బీసీజీ టీకాతో బ్లాడర్ క్యాన్సర్ నుంచి రక్షణ

క్షయను నిరోధించే బీసీజీ టీకా ఒక తరహా బ్లాడర్ క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వగలదని అమెరికన్ శాస్త్రవే త్తల పరిశోధనలు పేర్కొంటున్నాయి.
→ పరిశోధ కులు బీసీజీ టీకా తీసుకున్న 3,388 మంది రోగుల బృందాన్ని, టీకా తీసుకోని 3,079 మంది కంట్రోల్ బృందాన్ని 15 సంవత్సరాలపాటు అధ్య యనం చేశారు.
→ ఈ క్రమంలో బీసీజీ టీకా తీసు కున్నవారికి అల్జీమర్స్, ఇతర మానసిక వ్యాధులు వచ్చే అవకాశం 20 శాతం తక్కువని తేల్చారు. మరణ ప్రమాదమూ 25 శాతం తక్కు వగా ఉంది.
→ 70 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా ఎక్కువ రక్షణని స్తోందని తేలింది.
→ టీకా వల్ల శరీరంలోని రక్షణ వ్యవస్థ బలోపేతమవుతోం దని పరిశోధనలు సూచిస్తు న్నాయి.
→ ఇది తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాన్ని అందించగలదని తేలింది.

193 ఎన్నికల గుర్తులు విడుదల

వాకింగ్ స్టిక్, బేబీ వాకర్, ఏసీ, బెలూన్, గాజులు సహా మొత్తం 193 ఫ్రీ గుర్తు లను ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది.
→ గుర్తింపులేని రాజకీయ పార్టీలవారు, స్వతం త్రులు ఈ గుర్తులను ఎన్నికల సమయంలో ఎంపిక చేసుకోవచ్చు.
→ ఈనెల 15న ఈ గుర్తు లను ఈసీ విడుదల చేసింది. కొత్తగా విడుదల చేసిన గుర్తుల్లో లాగుడు బండి, విజిల్, కిటికీ, వూల్, నీడిల్, పుచ్చకాయ, వాల్నట్, వాలెట్, వయొలిన్, వ్యాక్యూమ్ క్లీనర్, ట్రంపెట్ ఉన్నాయి.
→ ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమయ్యే చర్యల్లో భాగంగా ఈసీ ఈ గుర్తులను విడుదల చేసింది.

కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత

ప్రముఖ రచయిత, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. కేతు విశ్వ నాథరెడ్డి (84) అనారోగ్యంతో కన్ను మూశారు.
→ కేతు విశ్వనాథరెడ్డి వైయస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగశాయిపురంలో 1939, జులై 10న కేతు వెంకట రెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు.
→ 1963లో ఆయన రాసిన తొలి కథ 'అనాదివాళ్లు' ప్రచురితమ యింది.
→ అప్పటి నుంచి రాయలసీమ కథా సాహిత్యం లోనూ, సమాజంలో ఆధునిక ప్రగతిశీల భావాల వ్యాప్తికి, రాయలసీమ సాహిత్య, ఉద్యమ కార్యాచరణలోనూ కేతు ఇతోధికంగా కృషి చేశారు. కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధన, మాండలికాలు, ఆధునిక తెలుగు వచనం, పత్రికల భాష, నిఘంటువులు, పాఠ్యపుస్తకాల రూపకల్ప నకు ఎంతో సమయాన్ని వెచ్చించారు. తెలుగు సాహి త్యంలో కథకునిగా, విద్యావే త్తగా, పరిశోధకునిగా పేరు తెచ్చుకున్నారు.
→ విశ్వనాథరెడ్డి రాసిన సాహితీ వ్యాసాలు 'దృష్టి' పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. 'వేర్లు', 'బోధి' అనే నవలలూ రాశారు. తాను పుట్టిన నేల, పెరిగిన సమాజాన్ని ప్రధాన వస్తువుగా చేసుకుని గొప్ప కథలను రాశారు.
→ పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన.. కడప, తిరుపతి, హైదరాబాద్ లలో అధ్యాపకు డిగా పనిచేశారు.
→ బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యా లయంలో డైరెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు.
→ పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్టీ సంపాదకుడిగానూ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యు దయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగానూ ఉన్నారు.

ఇంగ్లాండ్ లో నగరానికి మేయర్ గా సిక్కు

మధ్య ఇంగ్లాండ్ లోని కవెంట్రీ నగ రానికి సిక్కు వ్యక్తి మొదటిసారి మేయర్ గా ఎన్ని కయ్యారు.
→ పంజాబ్లో జన్మించి 60 ఏళ్ల క్రితం కవెంట్రీకి వలస వచ్చి 16 ఏళ్ల నుంచి స్థానిక కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న జశ్వంత్ సింగ్ బిర్డి ఇటీవల నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
→ ఆయన ఈ పదవిని ఏడాదిపాటు నిర్వ హిస్తారు. ఒక సిక్కుగా పదవీ లాంఛనాలతో పాటు సగర్వంగా తలపాగా కూడా ధరిస్తానని ఆయన తెలిపారు.
→ ఇంతకుముందు నగర కౌన్సి లర్ గా వ్యవహరిస్తూనే అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు.

ఆస్ట్రేలియాలో మేయర్ గా భారత సంతతి వ్యక్తి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్రమట్ట నగరానికి భారత సంతతికి చెందిన సమీర్ పాండే మేయర్ గా ఎన్నికయ్యారు.
→ 2017లో తొలిసారిగా పాండే కౌన్సిలర్ గా ఎంపికయ్యారు. 2022లో పర్ర మట్ట డిప్యుటీ మేయర్ గానూ వ్యవహరించారు.

చరిత్ర సృష్టించిన నీరజ్ ప్రపంచ నం.1 ర్యాంకు సొంతం

ప్రపంచ జావెలిన్ అద్భుత విజయాలు సాధిస్తోన్న భారత స్టార్ నీరజ్ చోప్రా. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
→ జావె లిన్ త్రోలో నంబర్ వన్ ర్యాంకు సాధించిన తొలి భారతీయుడిగా ఈ ఒలింపిక్ చాంపియన్ చరిత్ర సృష్టించాడు.
→ ప్రపంచ అథ్లెటిక్స్ తాజా ర్యాంకింగ్స్లో నీరజ్ (1455 పాయింట్లు).. ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ ( గ్రెనెడా, 1433)ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరు కున్నాడు.
→ ట్రాక్ అండ్ ఫీల్డ్లో నంబర్ వన్ అయిన తొలి భారత అథ్లెట్గా నీరజ్ నిలిచాడు.
→ గత సీజన్లో డైమండ్ లీగ్ ఫైనల్స్ విజేతగా నిలిచిన నీరజ్.. ఈ ఏడాది దోహాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలోనూ టైటిల్ సొంతం చేసుకున్నాడు.
→ ఈ క్రమంలో జావెలిన్ న్ను 88.67 మీటర్ల దూరం విసిరాడు. నెదర్లాండ్స్లో జూన్ 4న జరిగే ఫానీ బ్లాంకర్స్ కొయెన్ (ఎఫ్బకే) ఈవెంట్లో చోప్రా బరిలో దిగబోతున్నాడు.
→ ఈ ఏడాది ఎలాగైనా 90 మీటర్ల దూరాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్.. ఎఫ్బీకే టోర్నీలో అయినా ఆ లక్ష్యాన్ని సాధిస్తాడో లేదో చూడాలి.

విపత్తులతో దేశంలో 1.3 లక్షల మంది మృతి

దేశంలో 1970 నుంచి 2021 ఉందని స్పష్టం చేసింది.
→ డబ్ల్యూఎంవో సెక్రటరీ మధ్య సంభవించిన 573 ప్రకృతి విపత్తులతో జనరల్ పెట్టేరీ టాలస్ మాట్లాడుతూ.. విపరీత 1,38,377 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ వాతావరణ పరిస్థితుల వల్ల 1970-2021 మధ్య వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.
→ కాలంలో ఒక్క అమెరికాలోనే రూ.14 లక్షల కోట్ల ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన 12 వేల నష్టం వాటిల్లింది.
→ 10 మరణాల్లో 9 మరణాలు విపత్తుల కారణంగా సుమారు 20 లక్షల మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదయ్యాయి.
→ చనిపోయారని, రూ.35 లక్షల కోట్లకు పైగా నష్టం. ఇలాంటి విపత్తులకు బలహీన వాటిల్లిందని డబ్ల్యూఎంవో వెల్లడించింది
→ . నాలుగేళ్లకోసారి జరిగే డబ్ల్యూఎంవో మయన్మార్లను వణికించిన సదస్సు ప్రారంభమైన సందర్భంగా ఈ గణాంకా నిరూపించింది.
→ అయితే ఒకప్పుడు లను ప్రకటించింది. 2027 లోపు విపత్తుల రాకపై న్లకు అక్కడ వందల మంది హెచ్చరికల వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్న హెచ్చరికల వ్యవస్థ మెరుగుపడటంతో లక్ష్యాన్ని చేరుకోవాలంటే చేయాల్సింది చాలా పదుల సంఖ్యకు దిగి వచ్చింది

→ సమూహాలే ణాలకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణమవు బంగ్లాదేశ్, తుండగా, వరదల వల్ల ఎక్కువగా ఆస్తి నష్టం మోచా తుపాను సంభవిస్తోంది' అని పేర్కొన్నారు.
→ ఆసియాలో ఇలాంటి తుపా గత 50 ఏళ్ల కాలంలో 3,600 విపత్తులు ఏర్పడగా9,84,263 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.11 లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. . మనుషుల మర అని డబ్ల్యూహెచ్ పేర్కొంది.

మోదీకి గినియా, ఫిజి అత్యున్నత పురస్కారాలు

పపువా న్యూ గినియాలో నరేంద్ర మోదీకి అపూర్వ ఆదరణ లభించింది.
→ ఈ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని ఆయనే.
→ ఈ సందర్భంగా పపువా న్యూగినియాతో పాటు ఫిజి దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి.
→ విదే శీయులకు ఈ అవార్డులు ఇవ్వటం చాలా అరుదు.
→ ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ నియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే 'గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు' అవార్డును మోదీకి బహూకరిం చారు.
→ ఈ పురస్కారం అందుకున్న వారిని గినియా వాసులు... చీఫ్ బిరుదుతో పిలు స్తారు.
→ అంతకుముందు ఫిజి ప్రధాని సిటివేని రెబుకా... తమ దేశ అత్యున్నత పౌర పుర స్కారం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 'ఫిజి'ని మోదీ మెడలో వేసి గౌరవించారు.

జులై 12న చంద్రయాన్-3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగానికి తేదీ ఖరారైంది.
→ తిరుపతి జిల్లాలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ఏడాది జులై 12న వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
→ ఆగస్టు 23 లోపు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ కాలుమోపే అవకాశముంది.
→ 2019లో చంద్ర యాన్-2 విఫలమైన తర్వాత చంద్రయాన్-3 మిషన్కు ఇస్రో శ్రీకారం చుట్టింది.
→ కొవిడ్-19 నేపథ్యంలో కొంత ఆలస్యమైనా.. గత అనుభవాల నేప థ్యంలో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తాజా ప్రయోగానికి సిద్ధ మయ్యారు.
→ ఎల్బీఎం-3 వాహకనౌక చంద్రయాన్-3 ల్యాండర్ ను జాబిల్లి పైకి మోసుకెళ్లనుంది.
→ వంద కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలోకి దీన్ని ప్రవేశ పెట్టాక జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు.

గృహ్ హూరూన్ ఇండియా నివేదిక

స్థిరాస్తి రంగంలో అపర కుబేరుడిగా డీఎల్ఎప్ చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.
→ ఈయన నికర సంపద' రూ.59,330 కోట్లు. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మాక్రోటెక్ డెవ ఆపర కు చెందిన మంగళ ప్రభాత్ లోథా. ఆయన కుటుంబం రూ. 12,270 కోట్ల సంప దతో రెండో స్థానం పొందింది.
→ బెంగళూరు. సంస్థ ఆర్ఎండ్ కార్నొకు చెందిన అర్జున్ మెండా, కుటుంబం రూ.37,000 కోట్ల సంప దతో జాబితాలో తొలిసారి చోటు సంపాదించు కోవడమే కాకుండా మూడో స్థానంలో నిలిచారు.
→ స్థిరాస్తి వ్యాపారాలకు సంబంధించి 16 నగరాల్లోని 67 కంపెనీలకు చెందిన అగ్రగామి 100 మంది శ్రీమంతులతో గృహ్ హురున్ ఇండియా- 2023 జాబితా మంగళవారం విడుదు లైంది.
→ 2023 మార్చి నాటికి ఉన్న సంపదను లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించారు.
→ డీఎల్ఎప్ చైర్మన్ రాజీవ్ సింగ్ నికర సంపద ఏడాది కాలంలో 4 శాతం తగ్గినప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగారు.
→ రాష్ట్రాలపరంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 37 మంది చోటు దక్కించుకున్నారు.
→ ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (23 మంది), కర్ణాటక (18) ఉన్నాయి.
→ నగరాల విషయానికొస్తే ముంబయి (29 మంది) ఢిల్లీ (23 మంది), బెంగళూరు (18 మంది) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
→ 100 మంది అత్యంత కుబేరుల మొత్తం సంపద రూ.4,72,330 కోట్లు 5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఏడాదిక్రితంతో పోలిస్తే 1 శాతం పెరిగింది.
→ అలాగే ఇందులో 60 శాతం సంపద తొలి 10 మంది వద్దే ఉండటం గమనార్హం.
→ ఏడాదిక్రితంతో పోలిస్తే జాబితాలో 61 నుంది సంపద పెరిగింది. వీళ్లలో 25 మంది జాబితాలో కొత్తగా అడుగుపెట్టిన వాళ్లే. మరో 36 మంది సంపద తగ్గింది
→ స్థిరాస్తి రంగంలో అత్యంత ధనిక మహి కలుగా పియా సింగ్, రేణుకా తల్వార్ (డీఎల్ఎఫ్) నిలిచారు.
→ అత్యంత 10 మంది శ్రీమంతుల్లో చోటు సంపాదించేందుకు 2017లో కనీస సంపద రూ.3.350 కోట్లుగా ఉండగా... 2029 నాటికి అది రూ.15,000 కోట్లకు పెరిగిందని హురున్ ఇండియా ఎండీ. ప్రధాన పరిశోధ కులు అనాస్ రహమాన్ జునైద్ తెలిపారు.
→ అలాగే అగ్రగామి 50 మంది శ్రీమంతుల్లో ఒకరిగా నిలిచేందుకు కనీస నికర సంపద 2017లోని రూ.560 కోట్ల నుంచి రూ.1,300 కోట్లకు పెరిగిందని తెలిపారు.
→ జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్న వాళ్ల సంఖ్య 25ు పెర గడం. స్థిరాస్తి రంగంలో వర్ధమాన వ్యాపారవేత్తల సంపద వేగంగా. పెరుగుతోందనే విషయాన్ని సూచిస్తోంది..
→ పిరమాల్ రియాల్టీని నిర్వహిస్తున్న అజయ్ పిరమాల్ కుటుంబం (రూ. 1,870 కోట్లు) 18వ ర్యాంకు పొందగా.. గోద్రేజ్ ప్రొపర్టీస్గు చెందిన ఆది గోద్రేజ్ రూ. 1,200 కోట్ల సంపదతో 28వ స్థానం పొందారు..

3.5 లక్షల కోట్ల డాలర్లకు భారత్ జీడీపీ

2022లో భారత జీడీపీ 3.5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది.
→ వచ్చే కొన్నేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న జీ-20 దేశంగా భారత్ నిలవనుందని, అయితే సంస్కరణలు, విధా నపరమైన అడ్డంకుల వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది.
→ లైసెన్సులు పొందడం, వ్యాపార ఏర్పాటు చేసే ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని, ఫలితంగా ప్రాజెక్టుల పూర్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
→ 'భారత్లో నిర్ణయాలు తీసుకోవడంలో అధికారుల పాత్ర అధికంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ఐ) ఆకట్టుకో వడంలో ఇది అడ్డంకిగా మారొచ్చు.
→ ముఖ్యంగా ఇండోనే షియా, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడటానికి సవాలుగా నిలవొచ్చు' అని మూడీస్ పేర్కొంది.
→ యువ ఉద్యోగులు, పట్టణీకరణ, చిన్న కుటుంబాల కారణంగా గృహాలు, సిమెంట్, కొత్త కార్లకు గిరాకీ పెరగొచ్చని వెల్లడించింది.
→ ప్రభుత్వం మౌలిక సదుపాయాల వ్యయాలతో ఉక్కు, సిమెంట్ రంగాలు బలోపేతం కానున్నాయని, సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యంతో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు జోరందుకోవచ్చని వివరించింది.
→ మిగిలిన దశాబ్ద కాలం పాట తయారీ, మౌలిక రంగాలు ఏడాదికి 3-12 శాతం వృద్ధి చెందొచ్చని, అయినప్పటికీ 2030కి చైనా కంటే వెనుక స్థానంలోనే ఉండొచ్చని తెలిపింది.
→ ఆర్థిక సంస్క రణలు పరిమితంగా ఉండటం, విధాన పరమైన నిర్ణ యాల అమలు నెమ్మదించడంతో భారత తయారీ, మౌలిక రంగాల్లో పెట్టుబడులకు కొంత ముప్పు ఉందని మూడీస్ అభిప్రాయపడింది.

ముగ్గురు భారతీయులకు మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు భారతీయ శాంతి పరిరక్షకులకు ఐరాస పురస్కారం ప్రకటించింది.
→ ఐరాస తరపున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మొత్తం 103 మంది సైనికులకు 'డగ్ హమరోస్కోల్డ్ పతకాల'ను ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదానం చేయను న్నారు.
→ వీరిలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు శిశుపాల్సింగ్, సన్వాలా రామ్ విష్ణోయీ (వీరిద్దరూ కాంగోలో పనిచేశారు); వృత్తి నిపుణుల హోదాలో పని చేసిన షాబెర్ తహెర్ ఆలీ (ఇరాక్ లో సేవలు) ఉన్నారు.
→ ఐరాస తరఫున శాంతి పరిరక్షక దళాల్లో పనిచేసేందుకు భారత్ 6,000 మందికి పైగా సైనిక, పోలీసు సిబ్బందిని వివిధ దేశాలకు పంపించింది.

మోదీ ఆస్ట్రేలియా పర్యటన

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి విశేష ఆదరణ లభిస్తోంది.
→ ప్రవాస భార తీయులు ఆయనను కలుసుకునేందుకు భారీగా తరలిరాగా... ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల నీస్.... 'మోదీ ఈజ్ ద బాస్' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
→ చిరకాలంగా కొనసాగుతున్న రెండు దేశాల మైత్రీ బంధాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాలన్న అభిలాషను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.
→ బ్రిస్బేన్ నగరంలో భార తీయ కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు వెల్లడిం చారు.
→ ప్రపంచంలోనే అతిపెద్ద యువ ప్రతిభా వంతుల కర్మాగారం (టాలెంట్ ఫ్యాక్టరీ) భారత్ అని పేర్కొన్నారు.
→ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంగళవారం సిడ్నీలోని కుదోస్ బ్యాంక్ అరెనాలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, ఆస్ట్రేలియాల వ్యూహాత్మక భాగస్వామ్యం రోజు రోజుకీ మరింత బలోపేతం అవుతోందని తెలిపారు. -వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటి కన్నా రెండింతలకు పైగా వృద్ధిచెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
→ గత ఏడాది కుదిరిన ఆర్ధిక సహకార వాణిజ్య ఒప్పందం ఇందుకు దోహదపడనుందని తెలిపారు.
→ ఇరు దేశాల బంధాన్ని దృఢతరం చేస్తున్న పలు అంశాలను ప్రధాని మోదీ విశ్లేషణాత్మకంగా వివరించారు.
→ '3సీ'లు.. (కామన్వెల్త్, క్రికెట్, కర్రీ); 'డీ'లు... (డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ); 'ఈ'లు.. (ఎనర్జీ, ఎకనామీ, ఎడ్యుకేషన్) రెండు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని కొన్ని తరాలుగా అనుసంధానిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు టెన్నిస్, సినిమాలు, యోగా తదితరాలు మన బంధం మరింత బలోపేతం కావడానికి ఉపకరి స్తున్నాయన్నారు.
→ 'వాస్తవానికి వీటన్నింటి కన్నా ఆస్ట్రేలియాతో భారత్ బంధం దృఢతరమవడానికి కారణం పరస్పర నమ్మకం, గౌరవం... ఇక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు' అని ఆహూ తుల కరతాళ ధ్వనుల మధ్య మోదీ వెల్లడిం చారు.
→ భౌగోళికంగా రెండు దేశాల మధ్య చాలా దూరం ఉన్నప్పటికీ హిందూ మహాసముద్రం. భారత్, ఆస్ట్రేలియాను కలిపిందని చెప్పారు.

'లిటిల్ ఇండియా'కు శంకుస్థాపన

ఇరు దేశాల మైత్రి, ప్రవాస భారతీ య సేవలకు గుర్తుగా.. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్... 'లిటిల్ ఇండియాకు శంకుస్థాపన చేశారు.
→ పారామాట నగరంలోని హారిస్ పార్క్ లో 'లిటిల్ ఇండియా' గేట్వే నిర్మించనున్నారు.
→ ఈ పార్క్ వద్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా డే వంటి వేడుకలను నిర్వహిస్తుంటారు.
→ హారిస్ పార్కు పేరును 'లిటిల్ ఇండియా'గా మార్చినందుకు ఆల్బ నీస్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలి పారు.
→ భారతీయ ఉత్పత్తులు లభించే దుకాణాలు ఇక్కడ ఉన్నాయి.

భారత్ 3.5 ట్రిలియన్ డాలర్లు

భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లను 60 దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది.
→ రానున్న కొన్ని సంవత్సరాల్లో జీ-20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుం దన్న అంచనాలనూ వ్యక్తం చేసింది.
→ అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) ఆకర్షణ విషయం లో కొంత వెనుకబాటుకు గురయ్యే వీలుందని అం చనా వేసింది.
→ సంస్కరణలు అమల్లో వేగం లేకపోవ డం, బ్యూరోక్రసీ నిర్ణయాల్లో నెమ్మది వంటి అం శాలు తమ ఈ అంచనాలకు కారణంగా పేర్కొంది.

→ అమెరికా కేంద్రంగా పనిచేసే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనాల్లో ముఖ్యాంశాలు:-
→ బ్యూరోక్రసీ స్థాయిలో లైసెన్సులను పొందడం లో ఆలస్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాపా రాలు నెలకొల్పడం, ఇందుకు సంబంధించి ఆమోద ప్రక్రియలో నెమ్మది చోటుచేసుకునే వీలుంది.
→ ప్రాజెక్టుల అమలూ ఆలస్యం కావచ్చు. ఆయా అంశాలు దేశానికి ఎఫ్ డీఐ ఆక ర్షణను కొంత తగ్గించవచ్చు.
→ అదే సమయంలో ఈ విషయంలో ఇండోనేషియా, వియత్నాం వం టి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుంది.
→ పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, చిన్న కుటుంబాల పెరుగుదల, పట్ట ణీకరణ వంటి అంశాలు దేశంలో సిమెంట్, గృ హ నిర్మాణం, కొత్త కార్ల కోసం డిమాండ్ ను పెంచుతుంది.
→ 'ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం... ఉక్కు, సిమెంట్ రంగాలకు కలిసి వచ్చే అంశం.
→ కాలుష్యం కట్టడికి, పునరుత్పాదకత రంగానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనీయాంశం.
→ ఇది పునరుత్పాదక ఇంధ నంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది.
→ తయారీ, మౌలిక రంగాలకు సంబంధించిన డిమాండ్ వచ్చే దశాబ్ద కాలంలో వార్షికంగా 3 నుంచి 12 శాతం మేర నమోదుకావచ్చు.
→ అయతే 2030 నాటికి భారతదేశ సామర్ధ్యం చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుంది.
→ ఎకానమీ పటిష్టంగా కొనసాగే అవకాశాలు ఉన్న ప్పటికీ, కీలక తయారీ, మౌలిక రంగాల్లో పెట్టు బడులు బలహీనంగానే కొనసాగే వీలుంది.
→ ఎకా నమీ సంస్కరణల విషయంలో పరిమితులు. విధాన నిర్ణయాల్లో అమలు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు.
→ భూసేకరణ నిర్ణయాల్లో ఆమోదాలు, నియంత్ర ణా పరమైన క్లియరెన్స్లు, లైసెన్సులు పొంద డం, వ్యాపారాలను స్థాపించడం వంటి వాటి కోసం ఎంత సమయం అవసరమో ఖచ్చితంగా తెలియకపోవడం భారత్ విధాన పరమైన అం శాల్లో ప్రధాన లోపం. ఇది ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యాలకు కారణం అవుతోంది.
→ ఆయా అంశాలతో పాటు ప్రాంతీయ వాణిజ్య ఒప్పం దాలకు సంబంధించి వేగంలేకపోవడం విదేశీ అవినీతిని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపా లను వేగవంతం చేయడానికి, పన్నుల వసూళ్లు బేస్ పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయ త్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
→ అయితే వీటిలోనూ అవరోధాలు కనబడుతున్నాయి.
→ కార్మిక చట్టాల్లో సౌలభ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయ రంగం సామర్ధ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను విస్తరించడం, తయారీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంసహా గత కొన్ని సంవత్సరాలుగా పలు రంగాల పురోగతికి చేపట్టిన చర్యలు పటిష్టవం తంగా అమలు జరిగితే అది దేశ పటిష్ట అధిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశం జింబాబ్వే

ప్రపంచంలోనే అత్యంత దయ నీయ దేశంగా జింబాబ్వే నిలిచింది.
→ ప్రముఖ అంతర్జా తీయ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే 'వార్షిక దయనీయ సూచీ' ప్రకారం.. అక్కడి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
→ యుద్ధాలతో అతలాకుతలం అవు తున్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ దేశాల కంటే ఇక్కడి పరిస్థితులు దయనీయంగా ఉండటం గమ నార్హం.
→ ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది.
→ 'అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అత్యధిక వడ్డీ రేట్లు, బలహీనమైన జీడీపీ వృద్ధి.. ఇలా అన్నీ కలిపి జింబాబ్వేని ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశాల జాబితాలో నిలిపాయి.
→ ఈ జాబితాలో వెనెజువెలా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, తుర్కి యే, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు తొలి 15 స్థానాల్లో ఉన్నాయి.

16% తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ఐ) దశాబ్దంలోనే తొలి సారిగా 2022-23లో తగ్గాయి.
→ 2021-22తో పోలిస్తే 2022-23లో ఎఫ్ఐ 16.3% తగ్గి 71 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
→ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగ మనం ఇందుకు కారణం. 2021-22లో స్థూల ఎఫ్ డీఐలు 81.97 బి. డాల ర్లుగా ఉన్నాయి.
→ 2019-20తో పోలిస్తే ఇవి 10 శాతం అధికం. 2012- 13లో ఎఫ్ డీఐలు 26% క్షీణించి 34.298 బి. డాలర్లకు పరిమితమ య్యాయి.
→ తర్వాత ఎఫ్ డీఐలు మళ్లీ గత ఆర్థిక సంవత్సరంలోనే తగ్గాయి. 2022-23లో నికర ఎఫ్ డీఐలు 27% తగ్గి 28 బి. డాలర్లకు పరిమితమ య్యాయి.
→ 2021-22లో ఇవి 38.6 బి. డాలర్లుగా ఉన్నాయి. తయారీ, కంప్యూటర్ సేవలు, కమ్యూనికేషన్ సేవల్లో అత్యధికంగా ఎఫ్ డీఐలు తగ్గాయి.
→ అమెరికా, స్విట్జర్లాండ్, మారిషస్ దేశాల నుంచి ఎక్కువ ఎఫ్ డీఐలు రాకపోవడం గమనార్హం.
→ అమెరికా (33.8 బి. డాలర్లు) తర్వాత సెమీ కండక్టర్ పరిశ్రమలో అత్యధిక ఎఫ్ డీఐలు అందుకున్నది మన దేశమే (26.2 బి. డాలర్లు) కావడం విశేషం.

2023 అత్యుత్తమ హోటల్ రాంబాగ్ ప్యాలెస్

ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్గా రాజ లోని రాంబాగ్ స్థాన్ జైపూర్ ప్యాలెస్ ఎంపికైంది. ప్రయాణ వెబ్సైట్ ట్రిప్ అడ్వైజర్ అందించే 2023 ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డుల్లో రాంబాగ్ ప్యాలెస్ ఈ ఘనత సాధించింది.
→ విలాస హోటళ్ల విభాగంలో ఇది అగ్రస్థానంలో నిలి చింది. 1835లో ఏర్పాటైన ఈ ప్యాలెస్ ను 'జువెల్ ఆఫ్ జైపూర్ పిలు స్తారు.
→ ప్రస్తుతం ఈ హోటల్ను ఇండియన్ హోటల్స్ కంపెనీ నిర్వహి స్తోంది.
→ మాల్దీవుల్లోని బొలిపుషి ద్వీపంలో ఉన్న ఓజెన్ రిజర్వ్ బొలిఫుషి హోటల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవగా, హోటల్ కొలిన్ డి ఫ్రాన్స్ (గ్రమాడో, బ్రెజిల్) మూడో స్థానం పొందింది.
→ షాంఘై-లా ది షార్డ్, లండన్ (4వ స్థానం), ది రిట్జ్-కార్ల్టన్, హాంకాంగ్ (5వ), జేడబ్ల్యూ మారియటల్ మార్కిస్ హోటల్ దుబాయ్ (6వ), రొమాన్స్ ఇస్తాంబుల్ హోటల్-తుర్కియే (7వ), ఐకాస్ దస్సియా, గ్రీస్ (8వ), ఐకాస్ అండాలు సియా-స్పెయిన్ (9వ), పద్మా రిసార్ట్ ఉబడ్-ఇండోనేషియా (10వ) తర వాతి స్థానాల్లో నిలిచాయి.
→ 2022 జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య ట్రిప్ అడ్వైజర్ ప్లాట్ఫామ్ ్ప పర్యాటకులు ఇచ్చిన విశ్లేషణల ఆధారంగా ఈ అవార్డులను ప్రకటిస్తోంది.

విక్రాంత్ పై రాత్రిపూట దిగిన మిగ్-29కే

భారత నౌకాదళం అద్భుత ఘనత సాధించింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకపై మిగ్-29కే యుద్ధ విమానాన్ని రాత్రి పూట విజయవంతంగా దింపింది.
→ ఈ ప్రక్రియను 'చరిత్రాత్మక మైలు రాయి'గా పేర్కొంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా భారత నౌకాదళానికి అభి నందనలు తెలియజేశారు.

అరుణాచల్ ప్రదేశ్లో కొత్త వృక్షజాతి

అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త వృక్ష జాతిని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి మయోజైన్ అరుణాచలెన్సిస్ అని పేరు పెట్టారు.
→ ఈ రాష్ట్రంలోని ఆది హిల్స్లో ఇది వెలుగు చూసింది. మయోజైన్ జాతిలో ఇది ఉప జాతి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ ఆ జాతిలో ఈ వృక్షమే అతిపెద్దదని వివరించారు.

ఆర్కిటిక్ హిమాన్ని కాపాడిన ఓజోన్ ఒప్పందం

భూ వాతావరణంలోని ఓజోన్ పొరను కాపాడటానికి 1987 కుదిరిన మాంట్రియెల్ ఒప్పందం వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో విపరిణామాలు కనీసం కొన్నేళ్లయినా వాయిదా పడ్డాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ మాంట్రియెల్ ఒప్పందాన్ని ఐరాసలోని ప్రతి సభ్య దేశం ఆమోదించింది. ఓజోన్ ను దెబ్బ తీస్తున్న దాదాపు 100 కృత్రిమ రసాయనా లను నియంత్రించడం దీని ఉద్దేశం.
→ ఓజోన్ పొరను క్షీణింపచేసే రసాయనాలను ఓజోన్ డిప్లీటింగ్ పదార్థాలు (ఓడీఎస్) గా పిలుస్తారు. వీటిని శీతల యంత్రాలు, ఇంధ నాల్లో వాడుతుంటారు.
→ వెయ్యి టన్నుల ఓడీ ఎస్లను నివారించడం వల్ల ఏడు చదరపు కిలోమీటర్ల మేర ఆర్కిటిక్ సముద్ర ఐస్ను కాపాడినట్లవుతుందని శాస్త్రవేత్తలు వివరిం చారు.
→ ఈ లెక్కన వారు వాతావరణ నమూనా సిమ్యులేషన్లను ఉపయోగించి. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు లేని తొలి వేసవి సీజన్ ఎప్పుడనేది విశ్లేషించారు.
→ అది ఈ శతాబ్దం మధ్య నాటికి జరుగుతుందని తొలుత అంచనావేశారని, ఒప్పందం అమలు వల్ల కనీసం 15 ఏళ్ల మేర వాయిదా పడిందని గుర్తించారు.

హరిత ఇంధనం కొనుగోలుకు అనుమతి

'స్వేచ్ఛాయుత విధానం' (ఓపెన్ యాక్సెస్)లో హరిత ఇంధనం నేరుగా కొనాలంటే షరతులు పాటించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులిచ్చింది.
→ ఈ మేరకు విద్యుత్ చట్టంలో సవరణలు చేసి.. కొత్త నిబంధనలను చేర్చి గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
→ వీటి ప్రకారం ఎవరైనా ఓపెన్ యాక్సెస్ బయటినుంచి సౌర, పవన విద్యుత్ వంటి హరిత ఇంధనం నేరుగా కొనుగోలు చేయాలంటే వారి ఇల్లు లేదా కార్యాలయం, వాణిజ్య సంస్థకు కనీసం 100 కిలోవాట్ల లోడుతో సాధారణ కరెంటు కనెక్షన్ ఉండాలి.
→ లేదా ఒక విద్యుత్ డివిజన్లో ఒక వ్యక్తికి లేదా సంస్థకు ఎక్కువ కనెక్షన్లు ఉండి.. వాట న్నింటి లోడు కలిపి 100 కిలోవాట్లు.. అంతకుమించి ఉంటే హరిత ఇంధనం కొనవచ్చు.
→ దానిపై 'విద్యుత్ పంపిణీ సంస్థ' (డిస్కం) అదనపు సర్చార్జిని వసూలు చేయరాదు.
→ ఓపెన్ యాక్సెస్ సదుపాయం అధికంగా కరెంటు విని యోగించే వ్యాపార, వాణిజ్యసంస్థలు, పరిశ్రమలకు లాభదాయకం.
→ వీటికి విని యోగించే కరెంటుకు యూనిట్కు రూ.10 దాకా డిస్కంలు వసూలు చేస్తు న్నాయి. అదే ఈ పద్ధతిలో సౌరవిద్యుత్ కొంటే యూనిట్ రూ.4 నుంచి రూ. 5కే వస్తుంది.
→ అధికంగా కరెంటు ఛార్జీలు చెల్లించే పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలంతా ఇలా కొంటే తమ వ్యాపారం, ఆదాయం తగ్గిపోయి నష్ట పోతామని రాష్ట్ర డిస్కంలు ఆందోళన చెందుతున్నాయి.

కణ స్వీయ నాశనంలో ఈ ప్రొటీన్ కీలక పాత్ర

దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్ సోకిన కణాలు తమను తాము నాశనం చేసుకుంటాయి.
→ ఈ అంతర్గత 'ఆత్మాహుతి' వ్యవస్థ గురించి కీలక వివ రాలను పరిశోధకులు తాజాగా వెలుగులోకి తెచ్చారు.
→ కణ రక్షణ పొర ఛిద్రం కావడంలో నింజురిన్-1 అనే ప్రొటీన్ ముఖ్య పాత్ర పోషిస్తుం దని తేల్చారు.
→ స్విట్జర్లాండ్లోని బాసెల్ విశ్వవిద్యా లయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
→ కణాలు తమ జీవన చరమాంకంలో బుడగలా పగిలిపోతుంటాయని ఎక్కువ మంది భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ బ్యాక్టీరియాకు చెందిన కొన్ని భాగాల రూపంలో వచ్చే సంకేతాలు.. చివరి దశలో ఈ ప్రక్రియను ప్రేరేపిస్తాయని వివరించారు.
→ ఈ క్రమంలో కణంలోని రక్షణాత్మక పొరకు రంధ్రాలు ఏర్పడతాయని, వాటిగుండా కణంలోకి అయాన్లు చొచ్చుకొస్తాయని పేర్కొన్నారు.
→ "ఈ దశలో కణం ఉబ్బిపోయి చివరకు పగిలిపోతుందని అందరూ అనుకుంటుంటారు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంద లా పగిలి న్నది మేం వెలుగులోకి తెచ్చాం.
→ బెలూన్ పోవడానికి బదులు.. నింజిరిన్-1 ప్రొటీన్ సంబం ధిత కణ పొరలో విచ్ఛిన్న ప్రదేశాలను సృష్టిస్తుంది. దీనివల్ల ఆయా చోట్ల అది ఛిద్రమవుతుంది." అని పరిశోధకుడు సెబాస్టియన్ హిల్లర్ తెలిపారు.
→ తొలుత ఈ ప్రొటీన్లు ఒక్కచోటుకు చేరుతాయని పేర్కొన్నారు. అవి జిప్పర్లా పనిచేస్తూ కణ పొరను తెరుస్తాయని వివరించారు. అంతిమంగా ఆ ప్రక్రియ కణ విచ్ఛిన్నానికి దారితీస్తుందని పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం

నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం ఢిల్లీలో కొత్తగా తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్ సమ్మిట్ మీటింగ్ రూంలో జరుగనుంది.
→ సాధారణంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగే ఈ సమావేశ వేదికను ఈసారి ప్రగతి మైదాన్కు మార్చారు.
→ వచ్చే నవంబరులో జరిగే జీ-20 సదస్సు కోసం అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ నూతన కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అత్యున్నత స్థాయి పాలకమండలి సమావేశాన్ని నిర్వహిస్తు న్నారు.
→ ఈ సమావేశాన్ని వికసిత్ భారత్-2047 ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.
→ ఇందులో పాల్గొ నడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకుంటు న్నారు.
→ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంలేదని తెలిసింది.

సరికొత్త క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్

ఇరాన్ గురు వారం తన సరికొత్త బాలి స్టిక్ క్షిపణిని ఆవిష్కరిం చింది. ద్రవ ఇంధనంతో నడిచే ఖొర్రమషహర్ క్షిప ణికి ఇది ఆధునిక వెర్షన్ అని పేర్కొంది.
→ తన అణు కార్యక్రమంపై పశ్చిమ దేశా లతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇరాన్ చేపట్టిన తాజా చర్య ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.
→ ఖొర్రమ్ షహర్ -4 అనే ఈ క్షిపణిని టెహ్రాన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు విలేకరులకు ప్రదర్శిం చారు.
→ చాలా స్వల్ప సమయంలోనే ఈ అస్త్రాన్ని ప్రయోగానికి సిద్ధం చేయవచ్చని రక్షణ మంత్రి జన రల్ మహ్మద్ రెజా అష్టియాని పేర్కొన్నారు.
→ ఇది 2వేల కిలోమీటర్ల దూరం పయనించగలదని, 1500 కిలోల వార్డ్ను మోసుకెళ్లగలదని అధికారులు తెలిపారు.
→ దీని ప్రయోగాత్మక పరీక్షకు సంబంధించిన వీడియోనూ వారు విడుదల చేశారు.

సియెర్రా లియోన్లో నేలకొరిగిన శతాబ్దాల నాటి వృక్షం

పశ్చిమాఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ జాతీయ సంపదగా గుర్తింపు పొందిన శతాబ్దాల నాటి ఓ వృక్షం నేలకొరిగింది.
→ రాజ ధాని డాకర్లో 70 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వృక్షం తుపాను ధాటికి బుధవారం కూలిపోయింది.
→ 400 ఏళ్ల నాటి ఈ వృక్షరాజ చిత్రం దేశ కరెన్సీ నోట్లపై కనిపిస్తుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సహా ఎందరో ప్రముఖులు దీన్ని సందర్శించారు.
→ ఈ వృక్షం కూలిపోవడంపై అధ్య | క్షుడు జులియస్ మాడ బయో విచారం వ్యక్తం చేశారు.

అంగారకుడి నుంచి సందేశం

అంగారక గ్రహం నుంచి కోడ్ భాషలో వచ్చిన సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ భూమికి చేర వేసింది.
→ ఇలా ఇతర గ్రహాల నుంచి కోడ్ సమాచారం రావడం ఇదే తొలిసారి.
→ కేవలం భూమి మీదనే జీవ జాలం ఉందా? ఈ సువిశాల అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ గ్రహాంతరవా సులు జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగి స్తూనే ఉన్నారు.
→ గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమా చారం లేకున్నా.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన ఈ సమాచార చేరవేత.
→ ఈ సమాచారాన్ని స్వీకరించిన జీటీవో 16 నిమిషాల్లో దాన్ని ఎర్త్ స్టేషన్కు అందించింది. ఇందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రూ.2000 నోట ఉపసంహరణ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చలామణి నుంచి రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది.
→ మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, 'క్లీ 'న్ నోట్ పాలసీ' కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

'ఆసియా పసిఫిక్ గ్రీన్' అవార్డు

పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా శం షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) 2023 ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గోల్డ్ పురస్కారం దక్కింది.

ఎంఆర్ శామ్ పరీక్ష సక్సెస్

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యా లను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్ శామ్)ని భారత నౌకాదళం తన యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి విజయవం తంగా పరీక్షించింది.

'లిటిల్ ఇండియా'కు శంకుస్థాపన

ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి 'లి టిల్ ఇండియా'కు శంకుస్థాపన చేశారు.
→ పారామాట నగరంలోని హారిస్ పార్క్ 'లి టిల్ ఇండియా' గేట్ వే నిర్మించనున్నారు.

'సముద్ర శక్తి' విన్యాసాలు

'సముద్ర శక్తి' పేరుతో భారత్, ఇండోనే సియా నౌకాదళాలు సంయుక్త విన్యా సాలు చేస్తున్నాయి.
→ భారత్ తరఫున ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం డోర్నియర్, ఒక చేతక్ హెలికాప్టర్ పాలుపంచుకుంటున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే

ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది.
→ ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే 'వార్షిక దయనీయ సూచీ' ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పరిశీలిం చిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బ ణంతో జింబాబ్వే తొలి స్థానంలో ఉంది.
→ భార త్ 103వ స్థానంలో నిలిచింది.

టాప్ ప్లేస్ లో నీరజ్ చోప్రా

భారత స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ జా వెలిన్ త్రోలో నంబర్వన్ ర్యాంకు సాధించాడు.
→ తాజా ర్యాంకింగ్స్లో నీ రజ్ (1455 పాయింట్లతో) అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఐహెచ్ఎఫ్ ఛాలెంజర్ ట్రోఫీ

అంతర్జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) ఛాలెంజర్ ట్రోఫీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది.
→ ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్ ఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్ పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.

కార్టూనిస్టు సత్యమూర్తి కన్నుమూత

వ్యంగ్య చిత్రకళాజగ తిలో సత్యమూర్తిగా సుపరిచితులైన భావరాజు వెంకట సత్యమూర్తి (84) కన్నుమూశారు.
→ సత్యమూర్తి 1939 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ లోని రామచంద్రపురంలో జన్మించారు. ఆయన తండ్రి సత్యనారాయణరావు 'రావు సాహెబ్ బిరుదాంకితులు.
→ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి. పట్టాభిరామ్క సత్యమూర్తి పెద్దన్నయ్య. సత్యమూర్తి కార్టూన్, కమర్షియల్ ఆర్ట్ రంగాల్లో విశేష ఖ్యాతిని గడించారు.
→ డిజైనింగ్ స్టూడియో స్థాపించి, సత్య సాయిబాబా చెప్పిన నీతి కథలకు బొమ్మలు వేసేవారు. తెలుగులోనూ, ఆంగ్లం లోనూ అనేక బొమ్మల కథల పుస్తకాలు తీసుకొచ్చారు.
→ ఫార్మా, అనుబంధ ప్యాకేజింగ్ రంగాల్లో ఆయన రూపొందించిన డిజైన్లకు చక్కటి ఆదరణ ఉండేది.
→ స్టేట్ బ్యాంక్ వంటి సంస్థలకు కార్టూన్ కాలమానినిలను రూపొం దించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పత్రికల్లో ఆయన కార్టూన్లు ప్రచురితమయ్యాయి.
→ చలనచిత్ర పబ్లిసిటీ విభాగం లోనూ సేవలు అందించారు. అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన 'సుడిగుం డాలు' చిత్రానికి సత్యమూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
→ రాష్ట్ర ప్రభుత్వ లలిత కళా అకాడమీకి అయిదేళ్ల పాటు కౌన్సిల్ సభ్యునిగా సేవలందించారు. 'చదువుల్రావ్' పేరిట ఆయన సృష్టించిన కార్టూన్ పాత్రకు మంచి పేరు వచ్చింది.

వాన రాకడను చెప్పే కృత్రిమమేధ

మబ్బులు ఏర్పడే తీరును కృత్రిమమేధ సాయంతో పరిశీ లించి వర్షపాతాన్ని అంచనా వేసే పద్దతిని అమెరికన్ శాస్త్ర జ్ఞులు కనిపెట్టారు.
→ కొలంబియా విశ్వవిద్యాలయానికి జాన చెందిన కృత్రిమమేధ, భౌతిక, భూశాస్త్ర పరిశోధన కేంద్ర డైరె క్టర్ పియెర్ జెంటైన్, పీహెచ్ డీ విద్యార్థిని శారా షామెఖ్ రూపొందించిన న్యూరల్ నెట్వర్క్ అల్గారిథమ్ మేఘాల కూర్చునుబట్టి వర్షపాతాన్ని అంచనా వేయగలదు.
→ వాతావ రణ మార్పుల వల్ల తరచూ అతివృష్టి, అనావృష్టి వస్తున్నం దున వర్షాల రాకడను మరింత కచ్చితంగా కనిపెట్టాల్సిన అవసర మేర్పడింది. కృత్రిమమేధ ఇందుకు తోడ్పడుతుంది.

సరికొత్త ఆండ్రాయిడ్ వైరస్ 'దామ్'

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ప్రవేశించి ఫోన్ నంబర్లను, కాల్ రికార్డులను, కెమెరాలను హ్యాక్ చేస్తున్న 'దామ్' అనే మాల్వేర్ దేశంలో వేగంగా వ్యాపిస్తోందని జాతీయ సైబర్ భద్రతా సంస్థ 'సెర్టిన్' హెచ్చరించింది.
→ దామ్ ను ఆండ్రాయిడ్ బాట్ నెట్ గా వర్ణించింది. మొబైల్ ఫోన్లలోని యాంటీ వైరస్ ప్రోగ్రా మ్లను తప్పించుకుని ర్యాన్సమ్వర్ ను చొప్పించే సత్తా దీనికి ఉంది.
→ థర్డ్ పార్టీ వెబ్సైట్లు, నమ్మదగని, అజ్ఞాత సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ల ద్వారా ఈ మాల్వేర్ వేగంగా వ్యాపిస్తోంది.
→ ఇలాంటి వైరస్లు, మాల్వేర్ నుంచి రక్షణకు సెర్టిన్ కొన్ని సూచనలు చేసింది. నమ్మదగ్గని వెబ్సైట్లను బ్రౌజ్ చేయవద్దనీ, అలాంటి లింకులపై క్లిక్ చేయవద్దనీ కోరింది.
→ అడగ కుండా వచ్చే ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లను తెరవద్దనీ, ఎప్పటికప్పుడు యాంటీ వైరస్, యాంటీ స్పైవేర్ సాఫ్ట్ వేర్ను అప్డేట్ చేసుకోవాలని సలహా ఇచ్చింది.

జీవం పుట్టుక రహస్యం

440 కోట్ల సంవత్సరాల క్రితం ఉల్కల నుంచి, అగ్నిపర్వత విస్ఫోటాల నుంచి వెలువడిన రేణువులు భూమిపై జీవం పుట్టుకకు ఆధారభూతమైన సేంద్రియ అణువులు (మాలిక్యూల్స్) ఏర్పడటానికి దారితీశాయని తాజా పరిశోధనలు ప్రతిపాదిస్తున్నాయి.
→ ఆ ప్రకారం ఉల్కలు తీసుకొచ్చిన ఇనుము రేణువులు, అగ్నిపర్వతాలు వెదజల్లిన బూడిద బొగ్గుపులుసు వాయువును హైడ్రోకా ర్బన్లు, ఆల్కహాల్, ఆల్డిహైడ్లుగా విచ్ఛేదనం చేసి ఉండా లని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
→ భూమి తొలిదశలో క్రమంగా చల్లబడుతూ ఉన్నప్పుడు వాతావరణంలో ఆల్క హాల్, ఆల్డిహైడ్ ఉత్పత్తి పెరిగింది.
→ అవి రసాయన చర్యలకు లోనై డీఎన్ఏ, ఆర్ఎస్ఏ, అమినో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, చక్కెరలుగా రూపాంతరం ఉండాలి.
→ అవన్నీ జీవం పుట్టుకకు అనువైన పరిస్థితులను కల్పించాయని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.

తగ్గిన వేసవి పంటల 'సాగు విస్తీర్ణం

ఈ ఏడాది వేసవి పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకూ 1.69 లక్షల హెక్టార్లు తగ్గింది.
→ గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 71.99 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, ఈసారి అది 70.30 లక్షల హెక్టార్లకు తగ్గినట్లు శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటన ద్వారా వెల్లడైంది.
→ ఇది క్రితం ఏడా దికంటే 2.34% తక్కువ. గత ఏడాదితో పోలిస్తే వరి, నూనెగింజల సాగు తగ్గగా, పప్పుదినుసులు, తృణధా న్యాల సాగు విస్తీర్ణం పెరిగింది.

కాప్28 సలహా సంఘంలో అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సలహా కమిటీలో సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు.
→ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28వ సెషన్(కాప్ 28) ప్రెసిడెన్సీకి మార్గదర్శకత్వం, సలహాలను ఇచ్చే కాప్ 28 యూఏఈ అడ్వైజరీ కమిటీ 6 ఖండాల్లోని దేశాలకు చెందిన పర్యావరణ నాయకుల అనుభవాన్ని వినియోగించుకుంటుంది.
→ సంప్ర దాయ ముడి చమురు రిఫైనరీ, పెట్రో రసా యనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు రిలయన్స్ అడుగులు వేస్తున్న సంగతి తెలి సిందే.
→ ఈ కమిటీలో ప్రపంచంలోని నలు మూలల నుంచి ప్రభుత్వ, పరిశ్రమ, ఇంధన, ఆర్థిక, పౌర సమాజం, యువత వంటి వర్గాల నుంచి మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు.
→ ఈ కమిటీకి యూఏఈ పరిశ్రమల మంత్రి సుల్తాన్ అహ్మద్ అల్ జబీర్ ప్రెసి డెంట్ డిజిగ్నేట్ ఉంటారని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(యూఎన్ఎఫ్సీసీసీ) సెక్రటేరియట్ జన వరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
→ ఇపుడు ఆ సలహా బోర్డులోని 31 మంది పేర్లను ప్రకటించారు. ఇందులో బ్లాక్ క్ సీఈఓ లారీ ఫింక్, సీమెన్స్ బోర్డు చైర్మన్ జో కేసర్, బీపీ మాజీ అధిపతి బాబ్ డూడ్లే తది తరులున్నారు.
→ భారత్ నుంచి ప్యానెల్లో ముకేశ్ అంబానీతో పాటు సభ్యత్వం ఉన్న ఇంకో వ్యక్తి పర్యావరణ ప్రచారకులు సునీతా నారాయణ్ మాత్రమే.

టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్

టీమ్ ఇండియా పురుషుల, మహిళల, అండర్-19 క్రికెట్ జట్ల కిట్ స్పాన్సర్గా అడిడాస్ వ్యవహరించనుంది.
→ క్రికెటర్ల జెర్సీలు, కిట్లు, ఇతర దుస్తుల తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీసీసీఐ, అడిడాస్ ప్రకటించాయి.
→ వచ్చే నెల నుంచి 2028 మార్చి వరకూ అయిదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది.
→ వచ్చే నెల 7న లండన్లోని ఓవల్లో ఆరంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్స్ ఫైనల్ నుంచే టీమ్ ఇండియా కొత్త జెర్సీలో కనిపించనుంది.
→ ఈ ఒప్పందం విలువ రూ.350 కోట్లు ఉండొచ్చని తెలిసింది.

త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా గంగూలీ

త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు.
→ ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ "పర్యాటక రంగానికి క్రీడలు కూడా అత్యంత ముఖ్యమైనవి" అని చెప్పారు.
→ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయమని, ఆయన భాగస్వామ్యం రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊపునిస్తుందని తాను నమ్ముతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సాహా తెలిపారు.

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో తొలిసారి రజత, కాంస్య పతకాలు

ప్రపంచకప్ షాట్ గన్ షూటిం గ్ టోర్నీ మహిళల స్కీట్ ఈవెంట్లో భారత్కు తొలిసారి రజత, కాంస్య పతకాలు లభించాయి.
→ ఆరుగురు షూటర్ల మధ్య జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గనీమత్ 'షూట్ ఆఫ్'లో గురితప్పి రజత పతకం సాధించగా... దర్శన కాంస్య పతకాన్ని సంపాదించింది.
→ 60 షాట్ల ఫైనల్లో అసెమ్ ఒరిబ్బీ (కజకిస్తాన్), గనీమత్ 50 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. స్వర్ణ, రజత పతకాల కోసం రెండు షాట్ల 'షూట్ ఆఫ్'ను నిర్వ హించారు.
→ ఒరినే రెండు పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకోగా... గనీమత్ ఒక పాయింట్ సాధించి రజతం దక్కించుకుంది.
→ దర్శన 39 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలి చింది.
→ అంతకుముందు క్వాలిఫయింగ్ లో దర్శన 120 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్లో, గనీ మత్ 117 పాయింట్లు స్కోరు చేసి నాలుగో ర్యాం రా క్లో నిలిచి ఫైనల్కు అర్హత పొందారు.
→ పురుషుల స్కీట్ ఈవెంట్లో భారత్ నుంచి ముగ్గురు షూటర్లు మేరాజ్ అహ్మద్ ఖాన్, గుర్జోత్ ఖాంగురా, అనంత్ జీత్ సింగ్ వరుసగా 17వ, 19వ, 23వ స్థానాల్లో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు.

ముగ్గురు భారతీయులకు మరణానంతరం ప్రతిష్టాత్మక పురస్కారం

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ముగ్గురు భారతీయ శాంతి పరిరక్షకులకు ఐరాస పురస్కారం ప్రకటించింది.
→ ఐరాస తరపున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మొత్తం 103 మంది సైనికులకు 'డగ్ హమరో స్కోల్డ్ పతకాల'ను ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదానం చేయను న్నారు.
→ వీరిలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు శిశుపాల్సింగ్, సన్వాలా రామ్ విష్ణోయీ (వీరిద్దరూ కాంగోలో పనిచేశారు);
→ వృత్తి నిపుణుల హోదాలో పని చేసిన షాబెర్ తహెర్ ఆలీ (ఇరాక్లో లో సేవలు) ఉన్నారు.
→ ఐరాస తరఫున శాంతి పరిరక్షక దళాల్లో పనిచేసేందుకు భారత్ 6,000 మందికి పైగా సైనిక, పోలీసు సిబ్బందిని వివిధ దేశాలకు పంపించింది.

ఎంఆర్ శామ్ పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్ శామ్) ని భారత నౌకా దళం తన యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి విజ యవంతంగా పరీక్షించింది.
→ సముద్ర ఉపరితలానికి చేరు వగా వెళుతున్న (సీ స్కిమింగ్) ఒక లక్ష్యాన్ని ఇది దిగ్వి జయంగా ఛేదించింది.
→ శత్రు రాడార్ల కళ్లుగప్పడానికి కొన్ని రకాల క్షిపణులు, యుద్ధవిమానాలు ఈ వ్యూహాన్ని అను సరిస్తుంటాయి.
→ వీటిని ఛేదించడం కష్టం. వాటిని కూడా నేలకూల్చగల సత్తాను ఎంఆర్ శామ్ చాటింది.

మరో మహమ్మారి ముప్పు: డబ్ల్యూహెచ్

కరోనా కంటే ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
→ "కొవిడ్-19 మహమ్మారి కథ ముగిసిపోయినట్లు కాదు. వ్యాధి వ్యాపించేందుకు కారణమయ్యే మరో వేరి యంట్ రావచ్చు.
→ మరింత ప్రాణాంతకమైన వైరస్ ఉద్భవించే ముప్పు ఉంది" అని జెనీవాలో జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొ న్నారు.
→ దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండా లని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

ఝార్ఖండ్ హైకోర్టు కొత్త భవనం ప్రారంభం

165 ఎకరాల్లో నిర్మించిన ఝార్ఖండ్ కొత్త హైకోర్టు భవనాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు.
→ ఈ సందర్భంగా మాట్లాడుతూ.."అనుకూలంగా తీర్పు వచ్చినా కొన్ని సందర్భాల్లో ఆ సంతోషం ప్రజల్లో ఎక్కువ సేపు ఉండటం లేదు. ఇందుకు కారణం కోర్టు ఉత్తర్వులు
→ అమలు కాకపోవడమే. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్, సీనియర్ జడ్జీలు ఉన్నారు.
→ వారందరికీ నా విన్నపం ఒకటే.. నిజమైన అర్ధంలో న్యాయం ప్రజల దగ్గరకు వెళ్లేలా చూడండి" అని తెలిపారు.
→ సీజేఐ తన ప్రసంగాన్ని హిందీలో చేయడాన్ని అభినందించిన రాష్ట్రపతి న్యాయస్థానాల భాష అందరినీ కలుపు కొని వెళ్లేలా ఉండాలని అన్నారు.
→ "అందుబా ఉండటం అనేదా చాలా ఉంటాయి. ఖర్చు - ఒకటి, కోణాలు అందులో దావాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలా మంది పౌరులకు న్యాయం చేరడం లేదు.
→ దీనిపై అందరూ ఆలోచించాలి. కొత్త మార్గాలు అన్వే షించాలి. న్యాయస్థానాల భాష కూడా అందరినీ కలు పుకొనే వెళ్లేలా ఉండాలి" అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

త్రిపుర పర్యాటక శాఖ ప్రచారకర్తగా గంగూలీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ త్రిపుర పర్యాటక శాఖకు ప్రచారకర్తగా నియమితుల య్యారు.
→ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ మేరకు ప్రకటించారు. త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌధరీ మంగళవారం కోల్కతాలోని గంగూలీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమ య్యారు.
→ అటు సీఎం మాణిక్ సాహా కూడా గంగూ లీతో ఫోన్ లో మాట్లాడారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
→ ఈ నేపథ్యంలో గంగూలీ రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. గంగూలీ భాజపాలో చేరుతారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.
→ 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షు డిగా నియమితులైన సమయంలోనూ ఆయన రాజకీ యాల్లోకి రానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
→ దాదా భాజపా తరపున మమతా బెనర్జీపై పోటీకి దిగ నున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
→ 2021లో గంగూలీ అనారోగ్యానికి గురైనప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిం చడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.

ముగిసిన ప్రధానమంత్రి 3 దేశాల పర్యటన

అరుదైన ఖనిజాలు, పునరుత్పా దక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పర స్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి.
→ రెండు దేశాల మధ్య విద్యార్థులు, పరి శోధకుల రాకపోకలు, వలసలకు సంబంధించి కీలక ఒప్పందాలు అక్షరరూపం దాల్చాయి.
→ సిడ్నీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రధాని మోదీ బుధవారం వివిధ అవగాహనా ఒప్పందాలపై చర్చలు జరి పారు.
→ ఈ ఏడాది చివరికి సమగ్ర ఆర్ధిక సహ కార ఒప్పందాన్ని సాకారం చేయాలన్న నిర్ణయా నికి వచ్చారు.
→ పునరుత్పాదక రంగంలో భారీ అవకాశాలను సృష్టించే గ్రీన్ హైడ్రోజన్ కార్యద శంపై విధివిధానాల రూపకల్పనకు గాను ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
→ ఈ సందర్భంగా మోదీ, ఆల్బనీస్ లు మీడియాతో మాట్లాడారు. "పరస్పర విశ్వాసం, గౌరవంతో పాటు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భార తీయులు రెండు దేశాల మధ్య సజీవ వారధు లుగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు.
→ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు. 'టీ20 మోడ్లోకి ప్రవేశించాయంటూ క్రికెట్ పరి భాషలో వివరించారు. ఏడాది వ్యవధిలో ఆస్ట్రే లియా ప్రధాని ఆల్బనీస్లో ఆరుసార్లు భేటీ కావ డాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
→ 'గత ఏడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం కుదిరింది.
→ ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై దృష్టి సారించాం. ఇది రెండు దేశాల ఆర్థిక భాగ స్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సహ కారంలో బాటలు వేస్తుంద'ని పేర్కొన్నారు.

→ ఆల్బనీస్ కు మోదీ ఆహ్వానం:-
→ ఈ ఏడాది భారత్లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను వీక్షించేందుకు రావాల్సిందిగా ఆల్బ నీస్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను మోదీ ఆహ్వానించారు.
→ అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను చూడొచ్చని చెప్పారు.
→ బెంగళూరులో త్వరలో తమ దేశ కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బ నీస్ వెల్లడించారు.
→ సిడ్నీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లే, విపక్ష లిబరల్ పార్టీ నేత పీటర్ డ్యూటన్, ఇతర ప్రముఖులతోనూ విడివి డిగా భేటీ అయ్యారు.

కొత్త లోక్ సభలో రాజదండం ప్రతిష్ఠించనున్న ప్రధానమంత్రి మోదీ

త్వరలో ప్రారంభమవుతున్న పార్లమెంటు నూతన భవనం చారిత్రక ప్రాధాన్య తను సంతరించుకుంటోంది.
→ ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్బాటన్ నుంచి జవహర్ లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం (సెంగోల్)ను లోక్సభలో ప్రతిష్ఠించనున్నారు.
→ ఇది అయిదు అడుగులకు పైగా పొడవు(162 సెం.మీ)తో, పైభాగంలో నంది చిహ్నంతో, బంగారుపూత కలిగిన వెండి దండం.
→ పార్ల మెంటు నూతన భవన ప్రారంభంతో పాటు రాజ దండం ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న నిర్వహించను న్నారు.
→ ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమి తో వెల్లడించారు. పరిపాలనలో నీతి, న్యాయం, కర్తవ్యపథంలో సాగాలన్న సందేశాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దీనిని లోక్సభలో ప్రతిష్టిస్తున్నట్లు చెప్పారు.
→ దీన్ని రాజ కీయాలతో ముడిపెట్టొద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని పురాతన సంప్ర దాయాలతో నవభారతాన్ని జోడించడానికి చేస్తున్న ప్రక్రియగా చూడాలని పిలుపునిచ్చారు.
→ ఆయన ఢిల్లీలో తన సహచర కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, అనురాగ్సింగ్ ఠాకుర్ లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
→ ప్రస్తుతం ఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న సెంగోల్ను తమిళనాడులోని తిరువడు తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితుల ఆధ్వ ర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు.
→ అంతకు ముందు వరకూ ఈ రాజు దండం గుజరాత్ లోని అలహాబాద్ మ్యూజి యంలో ఉండేది. గతేడాది నవంబరు 4న అక్కడ నుంచి శాశ్వత ప్రాతిపదికన దిల్లీ జాతీయ మ్యూజియానికి తీసుకొచ్చారు.
→ "ప్రధానమంత్రి ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఈ కొత్త భవనం ప్రధానమంత్రి దార్శనికతకు సాక్ష్యం. నవ భారత నిర్మాణంలో మన సంస్కృతి, వారసత్వాన్ని జోడిం చేందుకు చేసిన సరికొత్త ప్రయత్నం.
→ ఈ భవ నాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయడానికి దాదాపు 60 వేల మంది కార్మికులు శ్రమించారు.
→ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ఈ శ్రామికులందర్నీ సన్మానించనున్నారు. దాంతోపాటు రాజదండ ప్రతిష్టాపన అనే మహ త్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది.
→ ఆ దండాన్నే తమిళంలో సెంగోల్ అంటారు. దాని అర్ధం. సంపద నుంచి సంపన్నం అని. దీని మూలాలు దేశ వారసత్వపరంపరతో ముడిపడి ఉన్నాయి.
→ రాజదండం ప్రతిష్ట భారతీయ సంస్కృతితో ముడిపడిన మహత్తర క్షణంగా చరిత్రలో మిగిలి పోతుంది.
→ మరోసారి 1947 నాటి భారతీయుల భావనలను గుర్తుచేస్తుంది. అమృతకాల ప్రతిబిం మారుతుంది.
→ 1947 ఆగస్టు 14న నెహ్రూకు దీన్ని అందించే కార్యక్రమంలో పాల్గొన్న 96 ఏళ్ల ఉమ్మిడి బంగారు చెట్టి కూడా ఇందులో పాల్గొంటారు" అని అమిత్ పేర్కొన్నారు.

రాజదండం విశేషాలు.. చరిత్ర

భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో అధికార మార్పిడి క్రతువును పూర్తిచేయడానికి ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని అనుసరించా లంటూ బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ తొలుత నెహ్రూను అడిగారు.
→ ఈ క్రమంలో రాజ గోపాలాచారి (రాజాజీ)కి క్రతువు నిర్వహణ విధాన ఎంపిక బాధ్యతలు అప్పగించారు.
→ అధికార మార్పిడి కోసం రాజదండం (సెంగోల్) తయారీకి తమిళనాడులోని తిరువడు త్తురై ఆధీనాన్ని సంప్రదించారు.
→ రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు.. చెన్నైలోని స్వర్ణ కారుడి చేత దానిని సిద్ధం చేయించారు.
→ స్వాతంత్ర్య ప్రకటన సమయంలో సెంగోల్ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది.
→ ప్రఖ్యాత టైం మేగజీన్ తోపాటు, పలు పత్రికలు గ్రాఫిక్స్ దీనిపై కథనాలు ప్రచు రించాయి.

ఏమిటీ ధర్మదండం?
→ సెంగోల్.. 1947లో బ్రిటిషర్లు మనకు స్వాతంత్ర్యం ప్రకటించి భారతదేశాన్ని వీడి వెళ్లి పోయే సమయంలో అధికార మార్పిడికి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు ఇచ్చిన దండం ఇది. ఇన్నాళ్లుగా ఇది అలహాబాద్ లోని పురావస్తుప్రద ర్శన శాలలో ఉంది.
→ దాన్ని ప్రధాని మోదీ మే 28న కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్టించబో తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రక టించారు.
→ భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటిం చాక. నాటి వైస్రాయ్ మౌంట్ బాటెన్. "బ్రిటిషర్ల నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతోంది కదా? దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నారు?" అని నెహ్రూను అడిగారు.
→ దీనిపై రాజగోపాలాచారి ( రాజాజీ) దీనిపై కొంత పరిశోధన చేసి. అధికార మార్పిడికి సంబంధించి చోళరాజులు పాటించిన విధానాన్ని ఎంచు కున్నారు.
→ చోళుల్లో ఒకరాజు నుంచి మరొక రాజుకు అధికారమార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని కొత్త రాజుకు బహూకరిస్తారు.
→ దీంతో ఆయన మద్రాసులో అప్పటికి ప్రముఖ నగల వర్తకులైన 'వుమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ దండాన్ని తయారుచేసే బాధ్యత అప్పగించారు.
→ దాన్ని తయారుచేసిన వుమ్మిడి ఎత్తిరాజులు (96), సుధాకర్ (88) ఇప్పటికీ చెన్నైలో నివసిస్తున్నారు.
→ ఐదు అడుగుల ఎత్తు ఉండే ఈ బంగారు పోతపోసిన వెండి దండంపైన.. పవిత్ర తకు, న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను వారు చెక్కారు.

→ అప్పగింత ఇలా:-
→1947 ఆగస్టు 14న. రాజదండ మార్పిడి తమిళ సంప్రదాయ పద్ధతిలో సాగింది.
→తమిళనాడులోని శైవ మఠం తిరువావడుదురై. ఆధీనం ప్రధాన పూజారి అంబలవాన దేశిక స్వామి, అదే ఆధీనానికి చెందిన గాయకుడు (ఒడువర్) ఆ రోజు మద్రాసు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
→తొలుత పూజారి ఆ రాజదండాన్ని రాత్రి 10.45 గంటల సమయంలో మౌంట్బాటెనక్కు అప్పగించి.. మళ్లీ ఆయన చేతుల నుంచి తీసుకుని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగిం పుగా తీసుకెళ్లి.. 7వ శతాబ్దినాటి తమిళ సాధువు జ్ఞాన సంబంధర్ రాసిన 'కోలారు పదిగం' అనే కవితను ఒడువర్ పాడుతుండగా... రాత్రి 11.45 గంటల సమయంలో నెహ్రూకు అప్పగించారు.

మోదీకి ఫిజీ అత్యున్నత పురస్కారం

→పసిఫిక్ దేశమైన పపువా న్యూ గినియా(Papua New Guinea) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi)కి అపూర్వ ఆదరణ లభించింది.
→ పపువా న్యూ గినియా, ఫిజీ నుంచి అత్యున్నత పురస్కారాలను పొందారు.
→ఫిజీ(Fiji) తన దేశ అత్యున్నత పౌర పురస్కారం(Fiji's Highest Civilian Honour) ‘ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్‌ ఆఫ్ ఫిజీ’ని ఇచ్చి సత్కరించింది.
→ఆయన గ్లోబల్ లీడర్‌షిప్‌కు గుర్తుగా దీనిని అందజేసింది.
→ఆ తర్వాత గినియా నుంచి అరుదైన గౌరవాన్ని పొందారు.
→పపువా న్యూ గినియా(Papua New Guinea)లో పర్యటించిన మోదీ.. ఇండియా-పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో పాల్గొన్నారు.
→ఈ సందర్భంగా ఫిజీ ప్రధాని సిటివేని రెబుకా.. మోదీకి పౌర పురస్కారాన్ని అందించారు.
→ఇప్పటివరకు ఫిజీయేతరులైన అతికొద్ది మందికి మాత్రమే దీనిని అందుకొన్నారు.
→అనంతరం గినియా ప్రభుత్వం ‘కంపానియన్‌ ఆఫ్ ఆర్డర్‌ ఆఫ్‌ లొగొహు’ను ఇచ్చి గౌరవించింది.
→గతంలో పలుదేశాలు మోదీకి అత్యున్నత పురస్కారాలను అందించాయి.
→అంతర్జాతీయ వేదికపై మోదీ నాయకత్వంతో భారత్‌కు పెరుగుతోన్న ప్రాబల్యం, ఇతర దేశాలతో మెరుగవుతున్న సంబంధాలకు గుర్తుగా ఈ గౌరవాలు దక్కుతున్నాయి.

మరోసారి ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ బ్లూ జాకెట్‌ ధరించిన మోదీ

→వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలపై చూపిస్తోన్న పెను ప్రభావం విషయంలో అందరినీ చైతన్యం చేసేందుకు ప్రధాని మోదీ ముందుంటారు.
→దానిలో భాగంగా ఆయన పర్యావరణ హితమైన నీలం రంగు జాకెట్‌లో కన్పించారు.
→గినియాలో తొలిసారి పర్యటించిన ఆయన రోజు మొత్తం ఈ వస్త్రధారణలోనే ఉన్నారు.
→ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైకిల్‌ చేసి దానిని తయారు చేశారు.
→ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ బహూకరించిన ఈ జాకెట్‌ను ధరించి ఇంతకుముందు మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే.

ఎత్తైన పర్వతాన్ని 27 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా

ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవ అరుదైన రెస్ట్ పర్వతాన్ని ఒక్కసారి అధిరోహించడమే విషయం.
అలాంటిది నేపాల్ కు చెందిన ప్రముఖ పర్వ తారోహకుడు కమీ రీటా (53) 27 సార్లు అధిరోహించి తన రికార్డును తానే తిరగరాశారు.
తూర్పు నేపాల్ లోని సోలుబుంబు జిల్లాకు చెందిన కమీరీటా పర్వతా రోహకులకు గైడ్గా పనిచేస్తున్నారు.
తన తోటి షెర్పా అయిన పసంగ్ దేవా(46) 26 సార్లు ఎక్కి తన పూర్వ రికార్డును సమం చేసిన మూడు రోజుల్లోనే కమీరీటా ఈ ఘనతను సాధించారు.
కమీరీటా బుధవారం ఉదయం 8,848.46 మీటర్ల ఎత్తున ఉన్న శిఖర భాగా నికి చేరుకున్నట్లు నేపాల్ పర్యాటక విభాగం వెల్లడిం చింది.
ఈయన 1994 మే 13న మొదటి సారి ఎవరె స్టును అధిరోహించారు.
సెవెన్ సమ్మిట్ ట్రెక్లో సీని యర్ పర్వతారోహకుడిగా ఉన్న కమీరీటా కాట్మాండు కి చెందిన కమర్షి యల్ అడ్వెంచర్ ఆపరే టర్ ఆధ్వర్యంలో ఈ పూర్తి చేశారు.
సాహసాన్ని నేపాల్లోని 8వేల మీటర్ల ఎత్తున్న చాలా పర్వతాల తోపాటు ప్రపంచంలో పేరొందిన కే-2 వంటి శిఖ రాలను అధిరోహించారు.
ప్రపంచంలోనే ఏడో ఎత్తైన పర్వతంగా పేరొందిన నేపాల్లోని దౌలాగిరి (8,167 మీటర్లు) శిఖరాన్ని భార త్ కు చెందిన జితేందర్ రామాస్ గవారెతోపాటు వివిధ దేశాలకు చెందిన ఏడుగురు అధిరోహించారు.

హైదరాబాద్ కు డిస్కవరీ గ్రూప్

→అంతర్జాతీయ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ హైదరాబాద్ లో పెట్టు బడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
→నగ రంలో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం(ఐడీసీ) ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
→అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) అలెగ్జాండ్ర కార్టర్ తో సమావేశమయ్యారు.
→మీడియా, ఎంటర్ టైన్మెంట్ రంగంలో ఇన్నోవేషన్ పై చర్చిం చారు.
→తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివ రించారు.
→“హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఐడీసీ.. వార్నర్ బ్రదర్స్ డిస్క వరీ కార్యకలాపాలకు వ్యూహాత్మక హబ్ ఉంటుంది.
→ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
→తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాలు విస్తరణ ఉంటుంది" అని మంత్రి కేటీఆర్ వివరించారు.

అంతర్జాతీయ ఎక్స్ పోలో గంగపటం

అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో ఖమ్మం జిల్లాకు చెందిన 85 ఏళ్లనాటి గంగపటం ప్రదర్శించనున్నారు.
భారీ వస్త్రంపై బండారు కలంకారీ కళాకారులు గంగపటం వేశారు.
ఈ వస్త్రంపై 12వ శతాబ్దానికి చెందిన యాదవ వీరుడు కాటమరాజు కథను పొందుపరిచారు.
యాదవ చరిత్ర, కాటమరాజు చరిత్ర, పౌరాణిక ఘట్టాల చిత్రాలతో వేసిన ఈ పటంలో గంగమ్మ ప్రధాన పాత్రగా ఉంటుంది.
ఈ పటాల్లోని బొమ్మలక్రమం ఆధారంగా కథాగానం చేసేవారని, తిత్తివాద్యం వాయిస్తూ కాటమరాజు చరిత్రను కథాగానం చేసేవారని ఆద్యకళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తెలిపారు.

గ్లూకోజ్ ను నియంత్రించే యాంటీబాడీలు

మధుమేహ బాధితులకు సాంత్వన కలిగించే ఓ సరికొత్త పరిశోధనను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, రియాజీన్ ఇన్నోవేషన్ ప్రైవేటు సంస్థ సంయుక్తంగా ఆవిష్క రించాయి.
మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్న కనిష్ట స్థాయికి తగ్గించేందుకు హెచ్సీయూలోని ఆస్పైర్ - బయోనెస్ట్, రియాజీన్ ఇన్నోవేషన్ అంకుర సంస్థ కలిసి ఏడాదిన్నరగా పరిశోధన చేశాయి.
చిన్న పేగు ద్వారా గ్లూకోజు రక్తంలోకి వెళ్లకుండా నిరోధించడంతో చక్కెర స్థాయి తగ్గుతుందని శాస్త్రవేత్తలు డాక్టర్ ఉదయ్ సక్సేనా, క్రాంతి మెహర్, వారి సహాయకులు అర్పితారెడ్డి, శరణ్య, గోపి కడియాల రుజువు చేశారు.
వీరి పరిశోధన పత్రాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ బయో ఆర్కైవ్ తాజాగా! ప్రచురించింది.

కోళ్లపై ప్రయోగాలతో యాంటీబాడీల వృద్ధి:-
వేగంగా ఉత్పత్తయ్యే గ్లూకోజ్ను తగ్గించేందుకు వందల సంఖ్యలో పరిశోధనలు చేశారు.
కోడిగుడ్డు ద్వారా ఒక యాంటీబాడీని అభివృద్ధి చేసి.. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించవచ్చని రుజువు చేశారు.
ఇందుకోసం శాస్త్రవేత్తలు కొన్ని కోళ్లను ఎంచుకున్నారు. మధుమేహాన్ని నియంత్రించే యాంటీబాడీలను అభివృద్ధి చేయగల మందును వాటికి వేశారు. ఆరునెలల పాటు పరీక్షించాక.... యాంటీబాడీలు పనిచేస్తున్నట్లు గుర్తించారు.
ఆ కోళ్ళ గుడ్ల నుంచి యాంటీ బాడీలను వెలికి తీసి ఎలుకలు, ఇతర జంతువుల శరీరాల్లో ప్రవేశపెట్టారు.
వాటిలో మధుమేహం నియంత్రణలోకి వచ్చిందని నిర్ధారించుకున్నారు. ఈ పరిశోధన పత్రాలను బయో ఆర్కైవ్ జర్నల్కు పంపించారు.
ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పరిశోధన బృందం ప్రతినిధి డాక్టర్ ఉదయ్ సక్సేనా తెలిపారు.
18 నెలల్లో ఈ మందును మార్కెట్లోకి తీసుకు రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆస్పైర్ బయోనెస్ట్ సంచాలకుడు ప్రొఫెసర్ ఎస్. రాజగోపాల్, జేఎస్ ప్రసాద్ తెలిపారు.

రాబోయే సంవత్సరాలలో భారీ ఉష్ణోగ్రతలు

వచ్చే అయిదేళ్లలో ప్రపంచం తాప మానం పెరుగుదల పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరించింది.
భూ ఉష్ణో గ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ (2.7 డిగ్రీల ఫారెన్హీట్) వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరి ల్లుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్నారు.
కానీ, ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలే కపోతున్నందున 2030 తర్వాత భూఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవే త్తలు హెచ్చరిస్తూ వచ్చారు.
అయితే, అంతకంటే ముందే ప్రమాదం ముంచుకు వస్తోందని.. ఎల్ని నో, లానినా సయ్యాట వల్ల ఇప్పటినుంచి 2027 లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవ కాశముందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక హెచ్చరించింది.
వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని సారాంశం.
ఎల్నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు వివరించారు.

నైట్ ఫ్రాంక్ ఇండియా 2022 నివేదిక

మనదేశం లో రూ.8.2 కోట్లు అంతకంటే నికర ఆస్తి గల ధనికుల సంఖ్య 2027 నాటికి 16.57 లక్షలకు చేరుకోనుంది .
స్థిరాస్థి కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా 2022 పై రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది
2022లో మనదేశంలో ఈ స్థాయి ధనికులు 7.97 లక్షల మంది ఉన్నారు. అంటే అయిదేళ్లలో ఈ సంఖ్య రెట్టిం పునకు మించనుంది.
రూ.250 కోట్లు.. అంతకు మించిన ఆస్తులు గల అత్యంత సంపన్నులు దేశంలో 12,069 మంది ఉండగా, 2027 నాటికి ఈ సంఖ్య 58.4% పెరిగి 19,119కు చేరుతుందని ఈ నివే దిక స్పష్టం చేసింది.
మనదేశంలో ప్రస్తుతం 161 మంది బిలియనీర్లు (రూ. 8200 కోట్లు-అంతకు మించి ఆస్తులున్నవారు) ఉన్నట్లు, 2027 నాటికి ఈ సంఖ్య 195 కు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
2021తో పోల్చితే 2022లో ధనికుల సంఖ్య పెరిగినప్పటికీ, అత్యంత సంపన్నుల సంఖ్య మాత్రం 7.5% తగ్గింది. అదే సమ యంలో బిలియనీర్ల సంఖ్య 4.5% పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, అత్యంత సంప న్నుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదికి 3.8 శాతం తగ్గింది.
ఆర్థిక మాంద్యం, కేంద్రీయ బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆస్తుల విలువ తగ్గిపోవడమే ఇందుకు కార ణమని ఈ నివేదిక విశ్లేషించింది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సంపద సృష్టి కేంద్రా లుగా ఉన్న అగ్రశ్రేణి-10 ప్రదేశాల్లో 3 ఆసియా ఖండంలో ఉండటం గమనార్హం.
అవి సింగపూర్, మలే షియా, ఇండోనేషియా, ఈ మూడు దేశాల్లో అత్యంత సంపన్నుల సంఖ్య 5% నుంచి 7% వరకు పెరిగింది.
వచ్చే అయిదేళ్లలో ఆసియా దేశాల నుంచి అత్యంత సంపన్నుల సంఖ్య 2.10 లక్షలకు పెరుగుతుందని.. తద్వారా అత్యంత సంపన్నుల సంఖ్యలో ఆసియా దేశాలు ఐరోపాను మించిపోతాయని ఈ నివేదిక వివ రించింది.

టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

→ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం 'షువాలె డి లా లీజియన్ దోనర్ ను ప్రకటించారు.
→ భారత్-ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖరన్ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందించారు.
→ ఫ్రాన్స్ అధ్యక్షుడి తరఫున ఐరోపా, విదేశీ వ్యవహారాలు ఫ్రాన్స్ మంత్రి కాథరీన్ కోలోన్నా ఈ పురస్కారాన్ని చంద్రశేఖరన్ కు అందజేశారు.

ఐటీ హార్డ్వేర్ తయారీకి రూ.17,000 కోట్ల ప్రోత్సాహకాలు

పీఎల్ ఐ 2.0 పథకానికి మంత్రిమండలి ఆమోదం
→ఐటీ హార్డ్వేర్ తయారీని ప్రోత్స హించేందుకు రూ.17,000 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఉత్పత్తి ఆధా రిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం 2.0కి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలి పింది. దేశీయంగా గత 8 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ. స్థిరంగా 17% సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధించింది.
→ఈ ఏడాది ఐటీ హార్డ్వేర్ పరి కరాల ఉత్పత్తి కీలకమైన 105 బి. డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్ల)ను అధిగమించనుంది.
→'ఐటీ పీఎల్ కు రూ.17,000 కోట్ల బడ్జెట్ వ్యయం కేటాయించాం.
→ఈ పథకానికి ఆరేళ్ల కాల వ్యవధిని నిర్ణయించామ'ని ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్లకు వెల్లడించారు.
→భారీగా పరికరాలు తయారు చేసే యాపిల్, హెచ్పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి సంస్థలు ఈ పథకాన్ని ఆసక్తిగా పరిశీలి స్తున్నాయని పేర్కొన్నారు.
→ఐటీ హార్డ్ వేర్ PLI 2.0 పథకం ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు, ఆల్ ఇన్ వన్ పీసీలు, సర్వర్లు, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలకు వర్తిస్తుంది.
→పీఎల్ఐ 2.0 పథకం కింద కంపెనీలు 5 శాతం వరకు ప్రోత్సాహకాలు అందుకోనున్నాయి.
→అలాగే వస్తువుల ఉత్పత్తి కోసం దేశీ యంగా తయా రైన విడి భాగాలను వినియోగించుకుంటే మరో 4 శాతం ఆద నపు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. పాత PLI పద కంలో ఇది 2 శాతం.
→ పీఎల్ఎస్ఐ పథకాన్ని 2020 ఏప్రిల్ నుంచి ప్రారంభించారు.
→ ప్రధానంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఫలితాన్నిచ్చింది.
→ మొబైల్ ఫోన్ల తయారీ/అసెంబ్లింగ్లో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఉత్పత్తిదారుగా మన దేశం నిలిచింది.
→ ఈ ఏడాది మార్చిలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు 11 బి. డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్ల మైలురాయిని అధిగమిం చాయి.
→ చైనాతో పాటు మరో దేశంలోనూ తయారీ చేపట్టేందుకు చూస్తున్న అంతర్జా తీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు.. అందుకు మన దేశాన్ని ఎంచుకోవడం కలిసి వస్తోంది.

హిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత

→ హిందూజా గ్రూప్ చైర్మన్, హిందూజా నలుగురు సోదరుల్లో పెద్దవారైన శ్రీచంద్ పర్మా నంద్ (ఎస్పీ) హిందూజా (87) లండన్లో మరణించారు.
→ దార్శ నికులైన ఎస్పీ హిందూజా కన్ను మూశారని వెల్లడించేందుకు హిందూజా గ్రూప్ విచారిస్తోం దని సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
→ భారత, బ్రిటన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు పటిష్టం చేసేందుకు ఎస్పీ హిందూజా ఎంతో కృషి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆయన బ్రిటిష్ జాతీయుడిగా ఉన్నారు.
→ 1964లో బాలీవుడ్ సూపర్హిట్ సినిమా అయిన సంగము అంతర్జాతీయంగా పంపిణీ చేసిన హిందూజా, తదుపరి బ్రిటన్లోని అగ్రగామి కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు.
→ 1993లో అశోక్ లేలాండ్లో వాటా తీసుకున్న హిందూజా సోదరులు, షెవ్రాన్ గ్రూప్ నుంచి గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషనల్ కంపెనీ నియంత్రణనూ స్వీకరించారు.
→ 1993లో ఇండస్ఇండ్ బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించారు.
→ తదుపరి భారతీయుల నేతృత్వంలోని ఒకే ఒక స్విస్బ్యంక్ ఎస్. పి. హిందూజా బాంక్వీ ప్రైవీని జెనీవా కేంద్రంగా నెలకొల్పారు.
→ బోఫోర్స్ కమీషన్ల వివాదంలో చిక్కుకున్నా, కేసు నిరూపితం కాలేదు.

అల్జీమర్స్ ను జాప్యం చేసే జన్యువు గుర్తింపు

→అల్జీమర్స్ లక్షణాలను జాప్యం చేసే ఒక కీలక జన్యు ఉత్పరివర్తనను ఓ వ్యక్తిలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
→అతడిలో ఈ వ్యాధి ముప్పును పెంచే జన్యువులు ఉన్న ప్పటికీ వాటిని ఈ ఉత్పరివర్తన అధిగమించినట్లు వివరిం చారు.
→ఫలితంగా.. 67 ఏళ్లు వచ్చినప్పటికీ ఆయనలో విషయగ్రహణ సామర్థ్యం ఏ మాత్రం తగ్గలేదని పేర్కొ న్నారు.
→అమెరికా శాస్త్రవేత్తల నేతృత్వంలో అంతర్జాతీయ బృందం ఈ ఘనత సాధించింది.
→సంబంధిత వ్యక్తి. అతడి రక్త సంబంధీకుల్లో 'పైసా' (ప్రెజెనిలిన్-1 6280ఏ) అనే | ఉత్పరివర్తనను శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు.
→ఇది ఉన్నవాళ్లలో సరాసరిన 44 ఏళ్ల వయసులోనే విషయ గ్రహణ సామర్ధ్యం స్వల్పంగా తగ్గుతుంది.
→49 ఏళ్ల వయ "సులో తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) రావొచ్చు.
→ఆరు పదుల వయసుకొచ్చేసరికి ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమై, వారు మరణించే అవకాశం ఉంటుంది.
→అయితే ఈ కుటుంబంలోని ఒక మహిళకు 70 ఏళ్లు వచ్చేవరకూ విష యగ్రహణ సామర్థ్యం తగ్గలేదని 2019లో గుర్తించారు.
→ఆ తర్వాత పైసా ఉత్పరివర్తన కలిగిన ఒక పురుషుడు.. 67 ఏళ్ల వయసు వచ్చేవరకూ మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉండటాన్ని గమనించారు.
→అతడికి 72 ఏళ్ల వయ సులో స్వల్ప డిమెన్షియా వచ్చింది.
→ఆ తర్వాత రెండేళ్లకు చని పోయాడు. పైసా ఉత్పరివర్తన ఉన్న ఇతరులతో పోలిస్తే అతడు చాలా సంవత్సరాలు ఎక్కువగా జీవించాడు.
→గతంలో పైసా ఉత్పరివర్తన కలిగిన కుటుంబానికి అధునాతన న్యూరో ఇమేజింగ్, బయోమార్కర్, జన్యు పరిశీలన పరీక్షలను చేప ట్టారు.
→డిమెన్షియా లక్షణాలు లేని ఇద్దరిలో రీలిన్-కొలబోస్ అనే ఒక అరుదైన జన్యు రకాన్ని గుర్తించారు.
→సాధారణంగా రీలిన్ ఉత్పరివర్తనల కారణంగా మెదడులో టాప్ ప్రొటీన్ తగ్గిపో తుంది.
→ఆది ఆటిజమ్, స్కిజోఫ్రీనియా, మూర్ఛ వంటి రుగ్మతలకు దారితీయవచ్చు.
→అయితే రీలిన్ కొలబోస్ ఉన్నవారిలో టాప్ ప్రొటీన్ పనితీరు మెరుగుపడుతుందని, ఫలితంగా మానసిక రుగ్మ తలు ఆలస్యమవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పగడపు దిబ్బలకు నగర కాంతుల ముప్పు

→ సముద్ర తీర నగరాల్లో 'కాలుష్యం పగడపు దిబ్బల పునరు త్పత్తి క్రమాన్ని దెబ్బతీస్తుందని అంతర్జా తీయ శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.
→ సముద్రాల్లో తీరానికి సమీపంలో కనిపించే ఈ దిబ్బలు.. పాలిప్స్ అనే సూక్ష్మజీవుల నుంచి ఉత్పన్నమ వుతాయి.
→ మృత పాలిప్స్ నుంచి వెలువడే క్యాల్షియం కార్బొనేట్ పగడపు దిబ్బలుగా ఏర్పడుతుంది.
→ సంవత్స రంలో కొన్ని రాత్రుల్లోనే పాలిప్స్ అండాలను విడుదల చేస్తాయి. సాధారణంగా పౌర్ణమి రాత్రులు ఈ ప్రక్రి యను ప్రభావితం చేస్తాయి.
→తీరం వెంబడి ఉన్న నగ రాల దీప కాంతుల వల్ల అండం విడుదల.. పౌర్ణమికి ఒకటీ రెండు రోజుల ముందే జరిగిపోతోంది.
→నగర కాంతులు లేని చోట ఇలాంటి మార్పు కనిపించలేదు. వేర్వేరు రాత్రుల్లో అండాల విడుదల.. పగడపు దిబ్బల పెరుగుదలను దెబ్బతీస్తుంది.
→ఎర్ర సముద్రం, పర్షియ 'న్ గల్ఫ్ తీరాల్లో నగరాలు వేగంగా వృద్ధి చెందడం వల్ల, అక్కడ పగడపు దిబ్బలు ఎక్కువగా దెబ్బతింటు న్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

సౌర కుటుంబం ఆవల ఆవాసయోగ్య గ్రహం!

→ సౌర కుటుంబానికి వెలుపల సుమా రుగా భూమి పరిమాణంలో ఉన్న ఓ ఆవాస యోగ్య గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
→ 'ఎల్పీ791-18 డి'గా దానికి నామక రణం చేశారు.
→ భూగోళం నుంచి దాదాపు 90 కాంతి సంవత్సరాల దూరంలోని క్రేటర్ అనే నక్షత్ర మండలంలో.. ఓ ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమణం చెందు తోంది.
→ దానిపై క్రియాశీల అగ్నిపర్వతాలు విస్త రించి ఉన్నట్లు అమెరికా పరిశోధకుల బృందం తెలిపింది.
→ భూమితో పోలిస్తే 'ఎల్పీ791-18 డి పరిమాణం స్వల్పంగానే ఎక్కువుంటుందని, ద్రవ్య రాశి మాత్రం చాలా అధికంగా ఉంటుం దని పేర్కొంది.
→ ఈ గ్రహం ఎప్పుడూ ఒక వైపు మాత్రమే నక్షత్రానికి అభిముఖంగా ఉంటుందని వెల్లడించింది.
→ ఫలి తంగా ఆ ప్రాంతంలో వేడి మరీ ఎక్కువగా ఉండొచ్చని.. రెండో వైపున పరిస్థితులు జీవం మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

కేంద్ర మాజీ మంత్రి రతన్ లాల్ కటారియా కన్నుమూత

→కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ రతన్లాల్ కటా రియా(71) కన్నుమూ రు.
→ 1951 డిసెంబరు 19న పంజాబ్ లోని యమునానగర్ జిల్లా సంధాలీ గ్రామంలో కటా రియా జన్మించారు.
→ ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కటారియా ప్రస్తుతం హరియాణాలోని అంబాలా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.
→ 2019 నుంచి 2021 వరకు కేంద్ర జలశక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖల సహాయ మంత్రిగా పనిచే శారు.
→ 2000 నుంచి 2003 వరకు హరియాణా భాజపా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. 1999, 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
→ 1985లో రాడౌర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దేశంలో కొత్తగా 8 నగరాలు!

→ దేశంలో కొత్తగా ఎనిమిది నగరా లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలి పారు.
→ పట్టణ కేంద్రాలపై నానాటికీ పెరుగు తున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగ రాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.
→ మధ్యప్రదేశ్ ఇందౌ ర్ లో గురువారం 'అర్బన్ 20 సమావేశం తర్వాత కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ మీడియాతో మాట్లాడారు.
→15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభి వృద్ధి చేయాలని సిఫార్సు చేసిందని తెలిపారు.
→"ఆర్థిక సంఘం సిఫార్సు తర్వాత.. పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతి పాదనలు పంపాయి.
→ఆ తర్వాత ఎనిమిది కొత్త నగరాల ఏర్పాటు అంశాన్ని అధికారులు పరిశీలి స్తున్నారు" అని ఎంబీ సింగ్ చెప్పారు.

పోషకాహారంగా అందజేయడంపై విద్య, వైద్య, సంక్షేమ శాఖల దృష్టి

→ సూక్ష్మ పోషకాలను అందించే చిరుధాన్యాలకు రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోంది.
→ ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖలు వీటితో చేసిన ఆహార పదార్థాలను పౌష్టికాహారంగా సరఫరా చేయడానికి ముందుకు వస్తు ఉన్నాయి.
→ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖలు ఏజెన్సీ ప్రాంత అంగన్వాడీ కేంద్రాల్లోని మహిళలు, చిన్నారులకు రెండేళ్ల నుంచి గిరిపోషణ పేరిట చిరుధాన్యాలతో కూడిన పౌష్టికా హారం అందజేస్తున్నాయి.
→ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహా రంగా చిరుధాన్యాల ఆహారాన్ని అందించా లని విద్యాశాఖ నిర్ణయించింది.
→ఎస్సీ, బీసీ, వర్గాల శాఖలు, వైద్య ఆరోగ్య, శాఖ సైతం చిరుధాన్యాల ఆహారాన్ని అందించేందుకు ముందుకొస్తున్నాయి.
నీతిఆయోగ్ ప్రశంసలు
→2021 జులై నుంచి రాష్ట్రంలో గిరిపోషణ పథకం అమ లోకి వచ్చింది.
→ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో ఈ పథ కాన్ని ప్రవేశపెట్టారు.
→ఆయా ప్రాంతాల్లోని పిల్లలు (3 నుంచి 5 ఏళ్లు), గర్భిణులు, బాలింతలు, కౌమార దశలో ఉన్న బాలికలకు చిరుధాన్యాల ఆహార పదార్థాల సరఫరా ప్రారంభించారు.
→టీఎస్ఫుడ్స్ సంస్థ రైతుల నుంచి చిరుధా న్యాలను కొనుగోలు చేసి వివిధ ఆహారప దార్థాలను తయారు చేసి ఐటీడీఏలకు పంపిణీ చేస్తోంది.
→వీటి పరిధిలోని అంగన్ వాడీలతో పాటు వసతిగృహాలు, గురుకులాలు, పాఠశాలల్లో అందజేస్తున్నారు.
→గిరిపోషణతో మహిళలు, పిల్లల్లో రక్తహీ నత సమస్య పరిష్కారమైందని నీతిఆయోగ్ సైతం ప్రశం సించింది.
→ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంగా రాగి జావ ఇవ్వాలని విద్యా శాఖ తాజాగా నిర్ణయించింది.
→వారంలో ఒక రోజు మధ్యాహ్న భోజనంలో విధిగా తృణధాన్యాల ఆహారం ఇవ్వ నుంది. ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాసంస్థలు సైతం చిరుధాన్యాల ఆహారంపై దృష్టిసారించాయి.
→వైద్యఆరో గ్యశాఖ సైతం రోగులు, వారి సహాయకులకు అందించే ఆహా రంలో చిరుధాన్యాలను జోడించనున్నట్లు తెలిసింది.

న్యూయార్క్ పోలీసుశాఖలో భారత సంతతి మహిళ రికార్డు

→ అమెరికాలోని న్యూయార్క్ పోలీసు శాఖ (ఎన్వై పీడీ)లో భారత సంతతి మహిళ ప్రతిమా భుల్లార్ మల్డోనాడో రికార్డు సృష్టించారు.
→ ఆ శాఖలో అత్యున్నత ర్యాంకు పొందిన దక్షిణాసియా వనితగా గుర్తింపు పొందారు.
→ గత నెలలో కెప్టెన్ గా పదోన్నతి పొందిన ఆమె.. క్వీన్స్లోని దక్షిణ రిచ్మండ్ హిల్ లోని 102వ పోలీస్ ప్రాంగణ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తి స్తున్నారు.
→ ప్రస్తుతం నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమా భుల్లార్ పంజాబ్ లో జన్మించగా.. తన తొమ్మిదో ఏటనే న్యూయార్క్ లోని క్వీన్స్క చేరుకున్నారు.
→ దేశంలోని అతి పెద్ద సిక్కు కమ్యూనిటీల్లో దక్షిణ రిచ్ మండ్ హిల్ ప్రాంతం కూడా ఒకటి.
→ తన బాల్యం అంతా ఇక్కడే గడిచిందని, 25 ఏళ్లకు పైగా పెరిగిన ప్రాంతంలోనే బాధ్యతలు నిర్వర్తించడం పుట్టింటికి వచ్చినంత సంతో షంగా ఉందంటూ విలేకరులతో తన ఆనందాన్ని పంచు కున్నారు ప్రతిమ.

అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

→ దేశ వారసత్వ సంపదను సంరక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
→ 'అంతర్జా' తీయ మ్యూజియం డే' సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పోను ఆయన ప్రారంభించారు.
→అనంతరం సందర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రాచీన భారత్ నుంచి విదే శాలకు తరలిపోయిన చారిత్రక, వారసత్వ కళాఖండా లను ప్రస్తావించారు.
→ ప్రస్తుతం ప్రపంచ యవనికపై భారత్ ప్రతిష్ఠ పెరుగుతున్నందున చాలా దేశాలు వాటిని తిరిగి ఇవ్వడాన్ని ప్రారంభించాయని తెలిపారు.
→ అలా మన దేశానికి తిరిగివచ్చిన అన్నపూర్ణా దేవి, మహిషాసుర మర్దిని విగ్రహాలు, చోళుల కాలం నాటి నటరాజ మూర్తులు, గురు హరగోబింద్ సింగ్ పేరున్న ఖడ్గం మొదలైనవాటిని ఉదాహరించారు.
→ గిరిజన వార సత్వ సంపదను అజరామరం చేయడానికి దేశవ్యా ప్తంగా 10 ప్రత్యేక మ్యూజియంలను నిర్మిస్తున్నామని మోదీ తెలిపారు.
→అలాగే ప్రతి కుటుంబం తమ ఇంట్లోనే చిన్న మ్యూజియం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
→తమ పూర్వీకులు, పెద్దలు వాడిన అపు రూపమైన వస్తువులను అక్కడ భద్రపరచాలని తెలి పారు.
→కార్యక్రమంలో దేశంలో ఉన్న మ్యూజియంల వివరాలు పొందుపరిచిన గ్రాఫిక్ నవల 'ఏ డే ఎట్ మ్యూజియం', కర్తవ్యపథ్ పాకెట్ మ్యాప్, మ్యూజియం కార్డులను ప్రధాని విడుదల చేశారు.

ప్రకృతి విపత్తులతో దేశంలో నిర్వాసితులైనవారి సంఖ్య 25 లక్షలు

→తుపాన్లు, వరదల వంటి ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో నిరుడు దాదాపు 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు.
→ఈ తరహా బాధి తుల సంఖ్య దక్షిణాసియావ్యాప్తంగా 1.25 కోట్లుగా నమోదైంది.
→జెనీవాలోని 'అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణ కేంద్రం (ఐడీఎంసీ)' తాజా నివేదిక ఈ మేరకు గణాంకాలను బయటపెట్టింది.
→అందులోని వివరాల ప్రకారం- ప్రకృతి విపత్తుల కారణంగా గతేడాది దక్షిణాసియాలోని అన్ని దేశాల్లో ప్రజలు అంతర్గతంగా నిర్వాసితులయ్యారు.
→అయితే వారి సంఖ్య పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. అంతర్గత వలసలు నిరుడు జూన్-సెప్టెంబరు మధ్య ఎక్కువగా నమోదయ్యాయి.
→ 2022లో భారత్, బంగ్లాదేశ్లో వర్షాకాలం ప్రారంభానికి ముందే వరదలు సంభవించాయి. అస్సాంలో మేలోనే వరదలు వచ్చాయి.
→ జూన్ లో మళ్లీ జల విలయం చోటు చేసుకుంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది ఆ వరదల ప్రభావానికి గురయ్యారు.
→ తుపాన్ల వల్ల నిరుడు దక్షిణాసియాలో 11 లక్షల మంది అంత ర్గతంగా వలసబాట పట్టాల్సి వచ్చింది.
→ అసని తుపాను కారణంగా ఆంధ్ర ప్రదేశ్లో 1,500 మంది నిర్వాసితులయ్యారు.
→ మరోవైపు - భారత వాతావ రణ శాఖ వెలువరించిన నివేదిక ప్రకారం.. 2022లో అసాధారణ వాతావ రణ పరిస్థితుల కారణంగా దేశంలో 2,227 మంది మృత్యువాతపడ్డారు.
→ ఆ తరహా మృతుల సంఖ్య 2021లో 1,750గా, 2020లో 1,338గా నమోదైంది.

వృద్ధిరేటు 6 శాతం

→ ఆర్ధిక వ్యవస్థలో వేగవంత వృద్ధి, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భారత్కు స్థిరత్వంతో కూడిన 'బీబీబీ' సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమె రికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఎండ్పీ వెల్లడించింది.
→ ద్రవ్యలోటు పరంగా బలహీనతలు, తక్కువ తలసరి జీడీపీ ప్రతికూల అంశాలుగా పేర్కొంది.
→ అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ.. 2023లో భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి 6 శాతంగా నమోదుకావచ్చని పేర్కొంది.
→ పెట్టుబడులు, వినియోగం రాబోయే 3-4 ఏళ్లలో బలమైన వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది.
→2024లో 6%, 2025, 2026లలో 6.9 శాతం చొప్పున వృద్ధిరేటు నమోదయ్యే అకవాశం ఉందని తెలిపింది.
→ 'భారత్ కు దీర్ఘకాలానికి బీబీబీ-, విదేశీ, స్థానిక కరెన్సీలకు సంబంధించి స్వల్పకాలానికి ఏశి సార్వభౌమ క్రెడిట్ రేటింగ్లను కొనసాగించనున్నట్లు ఎస్ఆండ్్ప వెల్లడిం చింది.
→ బీబీబీ.. తక్కువ పెట్టుబడుల గ్రేడ్ రేటింగ్. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బలంగా ఉండటం, ఆదాయాల్లో మెరు గైన వృద్ధి వల్ల ద్రవ్యలోటు సమస్యను ఎదుర్కోగలదనే భావనతో.. భారత్కు దీర్ఘకాలానికి స్థిరమైన అంచనాను ఎండే కొనసాగించింది.
→ మరో రేటింగ్ సంస్థ ఫిచ్ కూడా ఇటీవలే భారత్కు స్థిరత్వంతో కూడిన బీబీబీ-" సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
→ఎస్ఆండ్ పీ కూడా ఇదే తరహా వైఖరిని వ్యక్తం చేయడం గమనార్హం.
→మూడు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు- ఫిచ్, ఎండీ, మూడీస్ భారత్కు తక్కువ పెట్టుబడులు రేటింగ్ను కొనసాగిస్తున్నాయి.
→ఒక దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు.. ఈ రేటింగ్ను పెట్టుబడిదార్లు ఒక కొలమా నంగా భావిస్తుంటారు.

2030 కల్లా పక్షవాతంతో ఏటా 50 లక్షల మరణాలు

→ పక్షవాతం కారణంగా చోటుచేసు కునే మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో మరింత పెరిగే ముప్పుందని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిం చారు.
→ ముఖ్యంగా మెదడుకు రక్త సర ఫరాలో అవాంతరాలు ఏర్పడే 'ఇషిమిక్ ' స్ట్రోక్' రకం పక్షవాతం కారణంగా 2030 కల్లా ఏటా దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నా యని తెలిపారు.
→ ఈ తరహా పక్షవాతంతో 1990లో 20.4 లక్షల మంది మరణించగా. 2019లో 32.9 లక్షల మంది మృత్యువా తపడ్డారని వెల్లడించారు.
→ఆహారంలో సోడియం అధికంగా ఉండటం, ధూమ పానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మూత్రపిండాల వైఫల్యం, రక్తంలో చక్కె రల స్థాయి ఎక్కువగా ఉండటం, ఊబ కాయం వంటివి ఇషిమిక్ స్ట్రోక్తో మర ణాలు పెరుగుతుండటానికి ప్రధాన కారణా లని వివరించారు.

2000 Note: రూ.2వేల నోట్లు వెనక్కి.. RBI కీలక నిర్ణయం

రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. (RBI to withdraw Rs 2000 currency note) ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది.

రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ.20వేల వరకు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్‌ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందీ లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. 

ఆర్‌బీఐ ప్రకటన ఇదీ..

వాగీర్ జలాంతర్గామి ట్రయల్స్ ప్రారంభం

→ భారత నౌకాదళానికి చెందిన కలవరి శ్రేణి జలాంతర్గామి వాగ్నేర్ ట్రయల్స్ ప్రారం భమయ్యాయి.
→ వచ్చే ఏడాది తొలినాళ్లలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్ట్-75 కింద ఈ జలాంతర్గామిని తయారు చేశారు.
→ హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ ఆరో జలాంతర్గామి నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని అధి కారులు భావిస్తున్నారు.

100 గంటల్లో 100 కి.మీ రహదారి నిర్మాణం

→ ఉత్తర్ ప్రదేశ్లోని గాజియాబాద్-అలీగఢ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం రికార్డు సృష్టించింది.
→ కేవలం 100 గంటల్లో 100 కి.మీ పొడవైన రహ దారిని నిర్మించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
→ రహదారి నిర్మాణంలో పాలు పంచుకున్న వారిని అభినందించేందుకు నిర్వహించిన కార్య క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు.
→ ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎన్ హెచ్4లో గాజియాబాద్- అలీగఢ్ మధ్య 118 కి.మీ పొడవైన మార్గం ఎంతో కీలక మని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతా లను అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
→ ఉత్తర్ ప్రదేశ్లోని దాద్రి, గౌతమ్ బుద్ధనగర్, సికందరాబాద్, బులందెహర్, కుర్జా తదితర పట్టణాలను కలుపుతూ ఈ రహదారి వెళ్తుండటం కలిసొచ్చే అంశమని గడ్కరీ తెలిపారు.
→ఈ రహదారి నిర్మాణంలో వినూ త్నంగా గ్రీన్ టెక్నాలజీని వినియోగించినట్లు చెప్పిన గడ్కరీ.. దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్ను ఉపయోగించినట్లు తెలిపారు.

రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనం లభ్యం

→నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని జాల్ తండా వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనం లభ్యమైందని ఏపీ పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్ తెలిపారు.
→ఓ వ్యవసాయ భూమిలో లభిం చిన ఈ శాసనం 9వ శతాబ్దపు రాష్ట్ర కూటులకు సంబంధించినదని, ఇది సంస్కృతం, తెలుగు, కన్నడం భాషల్లో ఉందని పేర్కొన్నారు.

'పెన్' సెంటినరీ కరేజ్ అవార్డు అందుకున్న రచయిత సల్మాన్ రష్దీ

→ అంతర్జాతీయ రచయిత సల్మాన్ రషీ మళ్లీ జనం మధ్యకు వచ్చారు.
→ గతే డాది ఆగస్టు 12న న్యూయార్క్ లో సాహితీ కార్య క్రమ వేదికపై మాట్లాడుతున్న ఆయనపై ఓల్డ్ న్యూజెర్సీకి చెందిన ఓ యువకుడు (24) కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన విషయం తెలి సిందే. ఈ దాడి కారణంగా రద్దీకి ఒక కంటి చూపు పోయింది.
→ బుకర్ ప్రైజ్ విజేత అయిన రద్దీ న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్ గల అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్ట రీలో రాత్రి జరిగిన 2023 లిటరరీ హాజరయ్యారు.
→ఈ సందర్భంగా 'పెన్' సెంటి సరీ కరేజ్ అవార్డుతో ఆయ నను సత్కరించారు.
→ 'పెన్' అమెరికా సంఘానికి పూర్వం అధ్యక్షుడిగా పని చేసిన రద్దీ ఈ కార్యక్ర మంలో మాట్లాడుతూ.. "మళ్లీ మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.
→ ఉగ్రవాదం, హింస మనల్ని భయపెట్టలేవు. పోరాటం కొనసాగు తుంది.
→ నాపై దాడి జరిగినపుడు పరుగున వేదిక మీదకు వచ్చి ఆ దుండగుణ్ని ఎదుర్కొన్న హీరోల తరపున ఈ అవార్డు స్వీకరిస్తున్నా, వారు లేకపోతే నేను లేను. ఆ హీరోలకు జీవి తాంతం రుణపడి ఉంటా" అని అన్నారు.

'ఐఎన్ఎస్ కోల్ కతా'పై విజయవంతంగా దిగిన ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్

→బహుళ ప్రయోజనకర హెలికాప్టర్ ఎంహెచ్- 60ఆర్.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్-కోల్కతా పై తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఈ పరిణామం ఇండియన్ నేవీ యాంటీ సబ్ మెరైన్ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలో పేతం చేస్తుందని నేవీ అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా తయారు చేసిన ఈ ఎంహెచ్ - 60ఆర్ హెలికా ప్టర్ జలాంతర్గాములపై దాడి చేయడంతోపాటు, నిఘా, యాంటీ షిప్పింగ్, పరిశోధన, సహాయక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే సామర్థ్యమున్నట్లు నౌకాదళం తెలిపింది.
→భారత నౌకాదళంలోకి ఈ హెలికాప్టర్ను ప్రవేశపెట్టడం ద్వారా రక్షణ రంగంలో భారత్ మరింత శక్తిమంతం అవుతుందని పేర్కొంది.

బ్రిటన్ ధనవంతుల జాబితాలో 53 స్థానాలు కోల్పోయిన ప్రధాని సునాక్ దంపతులు

→ బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు... నిరుటితో పోలిస్తే 53 స్థానాలు కిందికి దిగజారారు.
→ ఇన్ఫోసిస్లో అక్షత షేర్ల విలువ తగ్గిపోవ డంతో వారి ఆస్తిలో రూ.2,069 కోట్లు కోల్పో వడమే ఇందుకు కారణమని "ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023" ప్రకటిం చింది.
→ నిరుటి జాబితాలో రూ.7,104 కోట్లతో 275వ స్థానంలో ఉన్న రిషి, అక్షత దంపతులు ఈ ఏడాది రూ.5,448 కోట్లతో 222వ స్థానానికి పడిపో యారు.
→ ఈ జాబితాలో ఎప్పటిలాగానే హిందూజా సోదరులు తొలిస్థానాన్ని నిలబెట్టుకున్నారు.
→ గత ఏడాది వారి ఆదాయం భారీగా పెరగడంతో ఆస్తి మొత్తం ఏకంగా రూ.36.04 లక్షల కోట్లకు చేరింది.
→ ఈ జాబి తాలో భారత మూలాలున్న డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు రూ.25.11 లక్షల కోట్లతో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు.
→ ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిత్తల్ రూ. 16.46 లక్షల కోట్ల ఆస్తితో 6వ స్థానంలో నిలి చారు.
→ వేదాంత రిసోర్సెస్ అధిపతి అనిల్ అగర్వాల్ రూ.8.27 లక్షల కోట్లతో 22వ స్థానం దక్కించుకు న్నారు.
→ వీరితో పాటు వస్త్ర వ్యాపారి ప్రకాశ్ లోహియా (33వ స్థానం), రిటైల్ వ్యాపారి మొహిసిన్-జుబెర్ ఇస్సా(40), ఫార్మా దిగ్గ జాలు నవీన్ ఇంజినీర్-వర్ష ఇంజినీర్(61), లార్డ్ స్వరా జాపాల్ కుటుంబం(68), సైమన్, బాబీ, రాబిన్ అరోడాల కుటుంబం(71) సైతం ఈ జాబితాలో ఉన్నారు.
→ ఫ్యాషన్ వ్యాపారి సుందర్ జెనోమల్(78), హోటళ్ల వ్యాపారంలో ఉన్న జస్మిందర్సింగ్ కుటుంబం (89) తొలిసారి చోటు దక్కించుకున్నారు.
→ బ్రిటన్ రాజు హోదాలో తొలిసారి కింగ్ ఛార్లెస్-3 రూ.6,176 కోట్ల ఆస్తితో ధనవంతుల జాబితాలో చేరారు.

భారత షూటర్ వరల్డ్ రికార్డ్

→షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ నయా ప్రపంచ రికార్డు సృష్టించింది.
→మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో క్వాలిఫికేషన్లో 595 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

పారితోషికాల్లో రొనాల్డో టాప్

→సౌదీ అరేబియా క్లబ్ అల్నాసర్ ప్లేయర్ రొనాల్డో 136 మిలియన్ డాలర్ల సంపాదనతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా నిలిచినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
→ మెస్సీ, ఎంబాపె తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

→కూరగాయలు, వంట నూనెల ధరలు తగ్గడంతో ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టమైన 4.7 శాతానికి దిగొచ్చింది.
→వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతంగా ఉండగా, 2022 ఏప్రిల్లో 7.79 శాతంగా ఉంది.
→సీఎస్ఓ ప్రకారం ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బ ణం 3.84 శాతంగా నమోదైంది.

మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్

→రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా తారిఖ్ అన్సా రీని సీఎం కేసీఆర్ నియమించారు. →రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తారిఖ్ అన్సారీ ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగను న్నారు.

హరిత్ సాగర్

→'హరిత్ సాగర్' గ్రీన్ పోర్ట్ గైడ్లైన్స్- 2023ని పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ న్యూఢిల్లీలో మే 10న ప్రారంభించారు.
→జీరో కర్బన ఉద్గారాలను సాధించే లక్ష్యంతో ఈ గైడ్లైన్స్న రూపొందిం చారు.
→ఇది పోర్ట్ డెవలప్మెంట్, ఆపరే షన్, మెయింటెనెన్స్లో పర్యావరణ వ్యవస్థ గతిశీలతను అంచనా వేస్తుంది.
→‘వ ర్కింగ్ విత్ నేచర్' కాన్సెప్ట్ పనిచేయా లని నిర్దేశిస్తుంది. గ్రీన్ ఇంధనాలు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ ఇథనాల్ తదితరాలను వినియోగించాలని సూచిస్తుంది.

ఇండో-థాయి కార్పాట్

→" అండమాన్ లోని సముద్రం వద్ద నిర్వహిం చిన 35వ భారత్-థాయిలాండ్ నేవీ ఎక్స ర్సైజ్ ఇండో-థాయి కార్బాట్ మే 10న ముగిసింది.
→ఎనిమిది రోజులు సాగిన ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ కేసరి, హిజ్ థాయి మెజిస్టీస్ షిప్ (హెచీఎంఎస్) సాయిబురి పాల్గొన్నాయి.
→ ఇరుదేశాల మధ్య సముద్ర బంధాలు బలోపేతం చేయడం, హిందూ మహాసముద్రంలో అంతర్జాతీయ వాణిజ్య మార్గం భద్రతను పెంపొదించడం ఈ ఎక్స ర్సైజ్ లక్ష్యం.
→ ఇండియన్ నేవీ, రాయల్ థాయి నేవీ 2005 నుంచి ఈ కార్పాట్ను నిర్వహిస్తున్నాయి.

ఆర్చరీ ప్రపంచకప్ లో భారత్ కు రెండు స్వర్ణాలు

→ ప్రపంచ నంబర్వన్ ఒకవైపు.. కేవలం రెండో ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 19 ఏళ్ల కుర్రాడు మరోవైపు, అందరి ఫేవరెట్ నం.1 ఆటగాడే! కానీ అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ ఆర్చర్ ప్రథమేశ్ జవాల్కర్ మేటి ఆర్చర్కు షాకిస్తూ పసిడి కొల్లగొట్టాడు.
→ ఆర్చరీ ప్రపంచకప్లో తొలి సారి స్వర్ణం ముద్దాడాడు. మరోవైప అద్భుత ఫామ్లో ఉన్న భారత జంట జ్యోతి సురేఖ, ఒజన్ దేవతలె వరుసగా రెండో ప్రపంచ కప్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
→టాప్ సీడ్ దక్షిణ కొరియా టీమ్ను మట్టికరిపిస్తూ మిక్స్డ్ డ్ డబుల్స్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
→కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలతో భారత్ టోర్నీని ముగించింది.
→మిక్స్డ్ డబుల్స్ తెలుగమ్మాయి జ్యోతి, ఒజన్ దేశానికి తొలి స్వర్ణం అందించారు.
→అంటల్యాలో ప్రపంచకప్ స్టేజ్-1లో సురేఖ జోడీ స్వర్ణం సాధించి నప్పటికీ.. ఈసారి ఫైనల్ ప్రత్యర్ధి టాపీసీడ్ కొరియాకు చెందిన కిమ్ జాంగో, ఒ యూహున్ కావడంతో వారిపై పసిడి అంచనాలు తక్కువే ఉన్నాయి.
→ నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఫైనల్లో జ్యోతి ఓజస్ 156-155 తో కొరియా జోడీకి షాకిచ్చింది. జ్యోతి అసాధారణ ప్రదర్శన చేసింది.
→ ఓజస్ కంటే ఎక్కువ సార్లు పది పాయింట్ల మార్క్ను అందుకుంది.
→ రెండు దేశాల ఆర్చర్లు పోటా పోటీగా పది పాయింట్లు స్కోరు చొప్పున వచ్చాయి. స్కోరు 117- జ్యోతి పది స్కోర్ చేయగా.. ఒ స్వర్ణం భారత్ సొంతమైంది.
→ ఈ మాత్రం ప్రథమేశ్ ఘనతే. ఆతరు 149-148తో మూడుసార్లు ప్రపంచ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. పది పాయింట్లు స్కోర్ చేశాడు.

హిరోషిమాలో మహాత్ముడి విగ్రహావిష్కరణ

→హరిత హైడ్రోజన్, సెమీకండక్టర్, విద్య, నైపుణ్యం, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి.
→జపాన్ ప్రధాని కిషిదతో మోదీ దాదాపు 50 నిమి షాల పాటు సమావేశమయ్యారు.
→జపా లో భారతీయ సంస్కృతిని చాటిచెబు తున్న జపనీస్ ప్రముఖులను ప్రధాని మోదీ కలుసుకున్నారు.
→హిరోషిమాలో అణుబాంబు స్మారక స్తూపానికి సమీపం లోనే శాంతిదూత మహాత్మాగాంధీ విగ్ర హాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
→ ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధి, నవకల్పనలకు ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంజిన్ వంటిదని ప్రధాన మంత్రి మోదీ తెలి పారు.
→ ఈ ప్రాంత భద్రత ప్రపంచమంతటికీ ప్రాధాన్యమైన అంశమేనని స్పష్టం చేశారు. జపాన్లోని హిరోషిమా నగరంలో నిర్వహిం చిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
→ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని పమియో కిషి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ లు ఈ సదస్సులో పాల్గొన్నారు.
→యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావని, దౌత్యపరమైన చర్చలను ప్రారంభించాలని రష్యా-ఉక్రెయిన్లకు క్వాడ్ శిఖరాగ్ర సదస్సు పిలుపునిచ్చింది.
→ఇది యుద్ధాల యుగం కాదన్న భారత ప్రధాని మోదీ హితవును గుర్తు చేస్తూ సదస్సు తీర్మానం చేయడం గమనార్హం.

జీ-7లో దేశాధినేతలతో మోదీ భేటీ

→ జపాన్లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 సదస్సుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు.
→ ద్వైపాక్షిక అంశాలు, రక్షణ, ఇంధన రంగాల్లో వాణిజ్య, పెట్టుబడులు, ప్రపంచ సవాళ్లపై చర్చించారు.
→ అమె రికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్ట్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని కిషిద, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూస్బుక్ యోల్, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోలతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తో మోదీ భేటీ అయ్యారు.
→ జపాన్ ప్రధాని కిషిద ఆహ్వానంపై ప్రత్యేక అతిథిగా జీ-7 సదస్సుకు వచ్చిన నరేంద్రమోదీని అమె రికా అధ్యక్షుడు బైడెన్ పలకరించారు.
→ మోదీ వద్దకు వచ్చిన ఆయన ఆత్మీయంగా మాట్లాడారు. ఇరువురు నేతలూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలూ గాఢాలింగనం చేసుకున్న ఫొటోను సునాక్ ట్విటర్లో ఉంచారు. జపాన్ పత్రిక షింబూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... దేశాల సార్వభౌ మత్వాన్ని గౌరవించాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టేప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత్ గైర్హాజరు గురించి, రష్యా నుంచి చమురు దిగుమతిపై ప్రశ్నించగా ఉక్రెయిన్లో శాంతికి భారత్ కృషిచేస్తుందని మోదీ చెప్పారు. "ఐక్యరాజ్యస మితి తీర్మానానికి మేం గైర్హాజరైనా... ఐరాస విధానా లకు, అంతర్జాతీయ చట్టాలకు మేం కట్టుబడే ఉంటాం. దేశాల భౌగోళిక సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. ఉక్రె యిన్ సమస్యకు ఐరాస పరిధిలోనే కాకుండా... ఆవల కూడా శాంతియుత పరిష్కారానికి మావంతు పాత్ర పోషిస్తున్నాం" అని మోదీ వివరించారు.

మిగ్-21 యుద్ధ విమానాల తాత్కాలిక నిలిపివేత

→ భారత వాయుసేన (ఐఏఎఫ్) తన అమ్ములపొదిలోని యాభై మిగ్-21 యుద్ధ విమానాల సేవలను తాత్కాలి కంగా నిలిపివేసింది.
→ రెండు వారాల కిందట రాజస్థాన్ లోని హనుమాన్ఢ్ వద్ద ఈ విమానం ఓ ఇంట్లోకి దూసు కుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.
→ మే 8న సూరత్ లోని వాయుసేన స్థావరం నుంచి సాధారణ శిక్షణ నిమిత్తం విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
→ దీంతో మిగ్- 21 విమానాలు అన్నింటినీ నిలిపివేసి, అధికారులు సాంకేతిక పరీక్షలు నిర్వ హిస్తున్నారు.
→ నిపుణుల బృందం నుంచి ఆమోదం లభించిన తర్వాతే ఈ విమానాలు మళ్లీ ఎగురుతాయని సంబంధిత అధికారులు వెల్ల డించారు.
→ సోవియట్ రూపొందించిన ఈ యుద్ధ విమానాలను 1960ల ప్రారంభంలో ప్రవేశపెట్టగా, ఇప్పటివరకు దాదాపు 400 ప్రమాదాలు జరి గాయి.
→ తాజా ఘటన నేపథ్యంలో మిగ్-21 యుద్ధ విమానాల సామర్థ్యంపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
→ ఈ ఎయిర్ క్రాప్టు సుదీర్ఘకాలం భారత వాయుసేనకు ప్రధాన ఆధారంగా నిలిచాయి.
→ ఐఏఎఫ్ తన పోరాట పటి మను పెంచుకోడానికి ఇప్పటిదాకా 870 మిగ్-21 ఫైటర్లను కొనుగోలు చేసింది.
→ ప్రస్తుతం భారత వాయుసేన వద్ద ఈ యుద్ధ విమానాలు 50 వరకు ఉండగా.. వీటిని దశలవారీగా మూడేళ్లలో తొలగించాలని గతేడాదే ఓ నిర్ణయానికి వచ్చారు.
→ తన వద్ద ఉన్న మూడు దళాల మిగ్-29 యుద్ధ విమానాలను సైతం వచ్చే అయిదేళ్లలో తొలగించాలని ఐఏఎఫ్ ప్రణాళిక రూపొందించింది.
→ భారత వాయుసేన ఆధునికీకరణలో భాగంగా రక్షణశాఖ 2021 ఫిబ్రవరిలో 83 తేజస్ జెట్ల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తో రూ.48,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది.
→ మరోవైపు.. 36 రఫేల్ విమానాలను సైతం ఇప్పటికే సేకరించిన వాయుసేన 114 మీడియం రోల్ ఫైటర్ విమానాల సేకరణ ప్రయత్నాలనూ కొనసాగిస్తోంది.

హిరోషీమాలో 49 వ జి7 శిఖరాగ్ర సమావేశాలు

→జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. మే 19 నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరిగాయి.
→జీ7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్లకు చెందిన అధి నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
→జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ సమావేశాల కో సం హిరోషిమాకు వెళ్లారు.
→ఈసారి జీ7 దేశాల శిఖ రాగ్ర సమావేశానికి జపాన్అధ్యక్షత వహించింది.

కర్ణాటక 24వ సీఎంగా సిద్ధ రామయ్య

→కర్ణాటకలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది.
→రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరా మయ్య(75). ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
→బెంగళూర్లోని కంఠీరవ స్టేడియంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

3 నెలల శిశువుకు మూత్ర పిండాల సర్జరీ

→ మూడు నెలల మగ శిశువుకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ల్యాప్రోస్కోపిక్ సర్జరీతో రెండు మూత్రపిండాల్లో ఏర్పడిన అవరోధా లను తొలగించారు.
→ ఇంత చిన్న వయసులో ఉన్న రోగికి ఈ తరహా ప్రక్రియతో చికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.
→ ఈ సర్జ రీని గత ఏడాది డిసెంబరులో పీడియాట్రిక్ విభాగం నిర్వహించిందని, చిన్నారిని మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేశామని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
→ మూడు నెలల తర్వాత రినోగ్రామ్ పరీక్షతో ఆపరేషన్ విజయవంతమైన విషయాన్ని ధ్రువీకరించుకున్నామని తెలిపింది.

91 శాతం శిశు మరణాలు వాయుకాలుష్యమే ప్రధాన కారణం

→నెలలు నిండకుండా పుట్టిన పిల్లలో 91 శాతం మరణాలు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతు న్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూ హెచ్), యునిసెఫ్ నివేదిక వెల్ల దీనికి ప్రధాన కారణం వాయుకాలుష్యమేనని తెలిపింది.
→వాతా వరణ మార్పులు, శిశువుల ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని ఈ నివేదిక మదింపు చేసింది.
→శిశు జననాలు, వారి ఆరోగ్యంపై వేడిగాలులు, తుపానులు, వరదలు, కరవులు, కార్చిచ్చులు, వాయు కాలుష్యం, వలసలు మొదలైన వాటి ద్వారా వాతావరణ మార్పులు ప్రభావం చూపుతాయని తెలిపింది.
→ఈ పరి స్థితిని మార్చాలంటే ఆర్థిక వనరులు అవసరం చాలానే ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
→ 'వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన అధికాదాయ దేశాల్లో అల్పాదాయ దేశాల్లోనే కంటే అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
→ బరువు తక్కువున్న శిశువుల్లో 15.6 శాతం మరణాలు, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో 35.7 శాతం మరణాలకు ఇళ్లల్లో పెరుగుతున్న వాయుకా లుష్యమే కారణం.
→ గాంబియాలో జరి పిన పరిశోధన ప్రకారం.. ప్రతి ఒక్క ఉష్ణోగ్రత పెరుగుదలకు పిండంపై 17 శాతం ఒత్తిడి అధికంగా పడుతోంది.
→ భారత్లోనూ పర్యావరణం మార్పులకు ఎక్కువగా గురవుతున్న జిల్లాల్లో బాలింతలు, శిశువుల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటోంది' అని నివేదిక పేర్కొంది.
→ ఈ సమస్యపై డబ్ల్యూహెచోకు చెందిన డాక్టర్ అన్షు బెనర్జీ మాట్లా డుతూ.. పర్యావరణ మార్పులు బాలింతలు, శిశువు లపై చూపిస్తున్న దుష్పరిణామాలను నియంత్రించడా నికి ప్రభుత్వాలు వెంటనే మహిళలు, సామాజిక సంస్థ లతో చర్చలు ప్రారంభించాలని సూచించారు.

జూలైలో చంద్రయాన్-3

→ చంద్రునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్.
→ జూలైలో 'చంద్ర యాన్-3' ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇది చంద్రుడిపై అధ్య యనం కోసం ఇస్రో ప్రయోగించే మూడో మిషన్.
→ 2019లో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టగా అది విఫలమైంది. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్త కుండా పకడ్బందీగా సన్నాహాలు చేస్తోంది.
→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి జూలై మొదటి లేదా రెండో వారంలో ప్రయోగం చేపడతామని, తేదీ ఇంకా ఖరారు కాలేదని ఇస్రో సీని యర్ అధికారి ఒకరు తెలిపారు.
→ దీనికి బాహుబలి రాకెట్ లాంచ్ వెహికిల్ మార్క్ (ఎల్వీఎం) - (జీఎస్ఎల్వీ మార్క్-3) ని ఉపయోగించనున్నారు.
→ బెంగ ళూరులోని యాఆర్ రావు శాటిలైట్ సెంటర్లో దీని పేలోడ్ల అసెంబ్లింగ్లో ఇస్రో బిజీగా ఉంది.
→ ఈ పేలోడ్ల చివరి దశ పరీక్షలు విజయవంతంగా పూర్త య్యాయి. ఈ వ్యోమనౌకలో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్తో కూడిన మూడు వ్యవస్థలు ఏర్పాటు చేశారు.
→ ల్యాండర్ సాయంతో దీన్ని చంద్రునిపై దింపను న్నారు. ఆ తర్వాత రోవర్.. చంద్రునిపై కలియ తిరుగుతూ విలువైన సమా చారం సేకరిస్తుంది.
→ చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలు, కంపనలు, ఉపరితల వాతావరణాన్ని పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.

పర్యావరణ పరిరక్షణ కోసమే 'లైఫ్' అమలు

→ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) అమలుకు క్లైమెట్ ఛేంజ్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
→ లైఫ్ కింద కేంద్రం గుర్తించిన 75 అంశాలను అమలు చేయడానికి పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని (ఎకో సిస్టం బేస్డ్) అనుసరించి సెల్ పనిచేస్తుందని పేర్కొంది. "ప్రధానంగా ఇంధన, నీటి సంరక్షణ, ఒకసారే వినియోగించే ప్లాస్టిక్, వృథా అరికట్టడం, ఈ- వేస్ట్ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నాం.
→ లైఫ్ ద్వారా 22.5 బిలియన్ కిలోవాట్ల ఇంధనం, 9 ట్రిలియన్ లీటర్ల నీరు, 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది.
→ లైఫ్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, పట్టణ స్థానిక సంస్థల్లో సైకిల్ ర్యాలీ.. ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించడానికి వర్క్షాప్లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రాంలు వంటి వాటిని నిర్వహిస్తాం" అని ప్రకటనలో ఇంధన శాఖ పేర్కొంది.

రూ.1 లక్ష కోట్లు మించిన ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు

→గత ఆర్థిక సంవత్సరంలో 12 (PSB)ల నికర లాభాలన్నీ కలిపి రూ.1 లక్ష కోట్లను అధిగమించాయి.
→ ఇందులో దాదాపు సగం వాటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)దే. 2017-18లో పీఎస్బీలన్నీ కలిపి రూ.85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేశాయి.
→ 2022-23లో ఇవి రూ. 1,04,649 కోట్ల నికరలాభాన్ని ప్రకటించడం గమనార్హం. 2021-22లో వీటి లాభం రూ.66,539.98 కోట్ల కంటే, ఇది 57% అధికం.
→ 2021-22లో రూ. 3457 కోట్ల లాభాన్ని ఆర్జించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 2022 23లో 27% తక్కువగా రూ.2507 కోట్లే నమోదు చేసింది.
→ నిరర్ధక ఆస్తులను పారదర్శకంగా గుర్తించి, రికవరీకి చర్యలు తీసుకో వడం, పీఎస్బీలకు మూల ధనం సమకూర్చడం, సంస్కరణలే పీఎసీ బీల కారణమని 2022-23 త్రైమాసికంలో చెబుతున్నారు. మార్చి పీఎస్బీల లాభాలు రూ. 34,483 కోట్లుగా ఉన్నాయి.
→ 2021-22 ఇదేకాల లాభాలు రూ. 17,666 కోట్ల కంటే ఇవి 95% అధికం కావడం గమనార్హం.

గంగా నది ఒడ్డున ప్రవహించే కాలువలకు జియో ట్యాగింగ్

→ గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాల నుంచి వ్యర్థాలతో ప్రవహించే అన్ని కాలువలనూ జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయను న్నారు.
→ ఘన వ్యర్థాలు గంగా నదిలో కలవ కుండా నిరోధించేందుకు ఈ చర్యను చేపట్టను న్నారు. ఓ అధికారిక పత్రంలో ఈ మేరకు సమాచారం వెల్లడైంది.
→ దీని ప్రకారం.. వ్యర్థా లపై తక్షణ చర్యలు చేపట్టేందుకుగానూ జియో ట్యాగింగ్ ఉన్న అన్ని కాలువలకు సంబంధించిన సమాచారాన్ని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణా భివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్లకు పంపిస్తారు.
→గంగా నది ఒడ్డున శిథి లాలు, ఘన వ్యర్థాలను పారబోస్తున్న కారణంగా అవి నదిలో కలుస్తున్నాయని, దీనివల్ల ప్లాంట్లలో నీటిశుద్ధి ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతున్నా యని ఇటీవల అధికారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
→ ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను అడ్డుకోవడానికి తెరల ఏర్పాటుకు అమృత్ 2.0 ద్వారా నిధులను అందించనున్నట్లు జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు.


సురేఖ జోడీకి స్వర్ణం

→వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ -2 (కాంపౌండ్ విభాగం)లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది.
→మిక్స్ డ్ డబుల్స్లో ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది.
→సురేఖ ఓజస్ ప్రవీణ్ దేవ్ జోడి ఫైనల్లో 156-155 స్కోరు తేడాతో కొరియా జంట కిమ్ జోంగో-ఓహ్ యూ హ్యూను ఓడించింది.
→తొలి మూడు ఎండ్ లో ఇరు జట్లు సమంగా పోటీ పడుతూ వరుసగా 39, 39. 39 చొప్పున పాయింట్లు సాధించడం తో స్కోరు 117-117తో సమంగా నిలిచింది.
→ చివరి ఎండ్లో భారత ద్వయం 39 పాయింట్లు నమోదు చేయగా...కొరియా 38కే పరిమితమైంది. దాంతో సురేఖ-ఓజస్ కు పసిడి దక్కింది.
→ పురుషుల వ్యక్తి గత కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ జౌకర్ సంచలనం సృష్టించాడు.
→ ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో నెదర్లాండ్స్క చెందిన వరల్డ్ నంబర్ వన్ మైక్ స్కోసర్పై విజయం సాధించాడు.
→ 19 ఏళ్ల ప్రథమేశ్ కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే.
→మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం లో భారత్కు చెందిన అవనీత్ కౌర్ కాంస్యం గెలుచు కుంది.
→మూడో స్థానం కోసం జరిగిన పోరులో అవ నీత్ 147-144తో ఐపెక్ తోమ్రుక్ (తుర్కియే)ను ఓడించింది.

జీ-7లో దేశాధినేతలతో మోదీ భేటీ

→ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 సదస్సుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు.
→ ద్వైపాక్షిక అంశాలు, రక్షణ, ఇంధన రంగాల్లో వాణిజ్య, పెట్టుబడులు, ప్రపంచ సవాళ్లపై చర్చించారు.
→ అమె రికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్స్ల్సర్ ఒలాఫ్ షోల్ట్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని కిషిద, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూస్సుక్ యోల్, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోలతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తో మోదీ భేటీ అయ్యారు.
→ జపాన్ ప్రధాని కిషి ఆహ్వానంపై ప్రత్యేక అతిథిగా జీ-7 సదస్సుకు వచ్చిన నరేంద్రమోదీని అమె రికా అధ్యక్షుడు బైడెన్ పలకరించారు.
→ మోదీ వద్దకు వచ్చిన ఆయన ఆత్మీయంగా మాట్లాడారు. ఇరువురు నేతలూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
→బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలూ గాఢాలింగనం చేసుకున్న ఫొటోను సునాక్ ట్విటర్ లో ఉంచారు.
→జపాన్ పత్రిక షింబూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... దేశాల సార్వభౌ మత్వాన్ని గౌరవించాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు.
→రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేపట్టేప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత్ గైర్హాజరు గురించి, రష్యా నుంచి చమురు దిగుమతిపై ప్రశ్నించగా ఉక్రెయిన్లో శాంతికి భారత్ కృషిచేస్తుందని మోదీ చెప్పారు.
→"ఐక్యరాజ్యస మితి తీర్మానానికి మేం గైర్హాజరైనా... ఐరాస విధానా లకు, అంతర్జాతీయ చట్టాలకు మేం కట్టుబడే ఉంటాం.
→దేశాల భౌగోళిక సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. ఉక్రె యిన్ సమస్యకు ఐరాస పరిధిలోనే కాకుండా... ఆవల కూడా శాంతియుత పరిష్కారానికి మావంతు పాత్ర పోషిస్తున్నాం" అని మోదీ వివరించారు.

ముగిసిన 'సముద్రశక్తి' విన్యాసాలు

→ భారత్, ఇండోనేసియా దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక విన్యాసా లు ముగిశాయి.
→సముద్రశక్తి-2023 పేరుతో నాలుగో ఎడిషన్ విన్యాసాలు ఇండోనే సియాలోని బాటమ్ తీరంలో ఈ నెల 14న మొదలయ్యాయి.
→ఇందులో ఐఎన్ఎస్ కవరత్తి, డోర్నియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్ భారత్ తరఫున పాల్గొనగా.. కేఆర్ సుల్తాన్ ఇస్కందర్, సీఎన్ 235 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, ఏఎస్ 565 పాంథర్ హెలికాప్టర్ ఇండోనేసియా తరఫున పాల్గొన్నాయి.
→శనివారం నిర్వహించిన సీ ఫేజ్ విన్యాసాల్లో వెపన్ ఫైరింగ్, హెలికాప్టర్ ఆపరే షన్స్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ విన్యాసాలు, బోర్డింగ్ కార్యకలాపాలు నిర్వహించారు.

ఉక్రెయిన్ కు ఎఫ్-16 లపై ఒత్తిడి!

→ రష్యాను రెచ్చగొట్టినట్లవుతుందనే కారణంపై ఇంతకాలం ఉక్రెయిన్కు అధునాతన ఆయుధాలను సరఫరా చేయడానికి నిరాకరిస్తూ వచ్చిన అమెరికా ఎట్టకేలకు ఐరోపా దేశాల ఒత్తిడికి అంగీకరించినట్లే కనిపి స్తోంది.
→ ఉక్రెయిన్ కు అత్యంత ఆధునాతన ఆయుధాల సరఫరాకు ముందు కొచ్చినట్లు తెలుస్తోంది. అయితే అవి ఎఫ్-16లేనని సమాచారం.
→ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు సందర్భంగా అత్యా ధునిక ఆయుధాల సరఫరా ఒప్పందం గురించి నేతలకు అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ వివరించినట్లు అధికారులు తెలిపారు.
→ ఎప్పుడు.. ఎక్కడ. ఎవరు.. ఎన్ని ఎఫ్-16లను ఉక్రెయిన్కు అమెరికా అందించనుందనే వివ రాలను వారు పేర్కొనలేదు.
→ ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని, ఈ ఫైటర్ల సరఫరాకు కొన్ని నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
→ ఉక్రెయిన్ వద్ద పాత సోవియట్ కాలపు యుద్ధ విమానాలున్నాయి. అవి ఆధునిక రష్యన్ విమానాలను ఎదుర్కోలేకపోతున్నాయి.
→ దీంతో తమకు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపాలని జెలెన్స్కీ పదేపదే కోరుతున్నారు.
→ మార్చిలో ఇద్దరు ఉక్రెయిన్ పైలట్లను అమెరికాకు తీసుకొచ్చి ఎఫ్-16ల పై శిక్షణ ఇచ్చారు. మరింతమంది పైలట్లను అమెరికాకు తెచ్చే అవకాశముంది.

కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్

→ భారీగా తరలివచ్చిన విపక్ష నేతలు, జనం మధ్య కర్ణాటక కొత్త ముఖ్య మంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
→ బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తోపాటు 8 మంది కేబినెట్ మంత్రులతో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు.
→ ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, మిత్ర పక్ష రాష్ట్రాల ముఖ్యమం త్రులు, భాజపాయేతర పక్షాల నేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, వేణుగోపాల్ తదితరులు హాజర య్యారు.
→ ప్రమాణ స్వీకార వేదికపై సీఎం సిద్ధరా మయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతులు కలిపి సమన్వయాన్ని చాటగా విపక్ష నేత లంతా ఒక్కటై రానున్న పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంటామని సంఘీబావం వ్యక్తం చేయడం విశేషం.
→ 75 ఏళ్ల సిద్ధరామయ్య కర్ణాటకకు రెండో సారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
→ 2013లో బాధ్యతలు చేపట్టిన ఆయన పూర్తి కాలం పదవిలో కొనసాగారు.
→ 61ఏళ్ల డీకే శివకుమార్ గతంలో మంత్రిగా పని చేశారు.

ప్రకృతి వ్యవసాయానికి మోదీ పిలుపు

→పర్యావరణ మార్పులు, నీటి ఎద్దడి, పౌష్టికా హార లోపం, ఆహార అభద్రత వంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే తృణ ధాన్యాల విని యోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మోదీ జీ7 దేశాలకు సూచించారు.
→రసా యన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యామ్నాయ విధానంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు.
→ జీ7 దేశాల సద స్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
→ ప్రపంచ వ్యాప్తంగా పేదలందరికీ ఆహార భద్రతను కల్పిం చడానికి సమీకృత విధానాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.
→ వ్యవసాయ ఉత్పత్తుల అధిక దిగుబడికి ఉపయోగపడే ఎరువులపై గుత్తాధిప త్యాన్ని నిలుపుకోవాలన్న మనస్తత్వం తగదని పేర్కొన్నారు.
→ అయితే, ఏ దేశం పేరునూ మోదీ నేరుగా ప్రస్తావించలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తే అది ప్రజాస్వామ్యం, అభివృద్ధికి మధ్య వారధిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ముగ్గురు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు వీడ్కోలు

→ పదవీ విరమణ చేయనున్న జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వి. రామసుబ్ర మణియన్ సేవలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియా డారు.
→ జూన్ 16న జస్టిస్ కేఎం జోసెఫ్, జూన్ 17న జస్టిస్ అజయ్ రస్తోగి, జూన్ 29న జస్టిస్ వి. రామసు బ్రమణియన్ పదవీ విరమణ చేయనున్నారు.
→ ఈ నెల 22 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నందున వీరికి చివరి పనిదినం అయింది.
→ 2018 ఆగస్ట్ లో సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోసెఫ్ బాధ్యతలు చేపట్టారు.
→1958లో జన్మించిన జస్టిస్ రస్తోగి 2018 నవంబర్లో సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు
→ 2006 నుంచి మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుబ్రమణియన్ 2016లో ఉమ్మడి ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
→ అనంతరం తెలంగాణ హైకోర్టు జడ్జిగా కొన సాగారు. 2019లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా పదోన్నతిపై వెళ్లారు.
→ అదే ఏడాది సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులయ్యారు.

ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్

→2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది.
→2021-22కు చెల్లించిన రూ.30,307 కోట్ల డివిడెండ్ పోలిస్తే ఈ మొత్తం దాదాపు 3 రెట్లు అధికం కావడం గమనార్హం.
→గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ బోర్డు డైరెక్టర్ల 602వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
→2022-23 సాధారణ బడ్జెట్లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వం అంచనా వేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ.

రూ.1 లక్ష కోట్ల రక్షణ ఉత్పత్తుల తయారీ

→దేశీయంగా రక్షణ ఉత్పత్తుల విలువ తొలిసారి రూ.1 లక్ష కోట్లను మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
→2021-22లో వీటి విలువ రూ.95,000 కోట్లుగా ఉండగా.. 2022-23లో 12 శాతానికి పైగా పెరిగి రూ. 1,06,800 కోట్లుగా నమోదైందని పేర్కొంది.
→ దేశీయ రక్షణ ఉత్పత్తుల పరిశ్ర మను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పలు రకాల చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే.
→ ఆ ప్రయత్నాల ఫలితంగానే ఈ ఘనతను సాధిం చామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
→ కాగా.. ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి కూడా వివరాలు అందితే ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని తెలి పింది.
→ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా రక్షణ పరిశ్రమలు, వాటి అనుబంధ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు వాటితో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించింది.
→ సరఫరా వ్యవస్థలో ఎంఎస్ఎమ్ఎస్ఈలు, అంకుర సంస్థలను అనుసంధానం చేయడం సహా వ్యాపార సరళీకరణ కోసం పలు రకాల విధాన సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టిం దని తెలిపింది.
→ రక్షణ రంగ హార్డ్వేర్ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధి, డిజైన్ కోసం ఎంఎస్ఎమ్ఎస్ఈలు, అంకుర సంస్థలు సహా పలు రక్షణ సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మధ్య ఆసియా దేశాల నేతలతో జిన్ పింగ్ భేటీ

→ జీ-7 సదస్సు ప్రారంభమైనవేళ చైనా తమ దేశంలోని షియాన్ నగరంలో మధ్య ఆసియా దేశాలతో ప్రత్యేక సదస్సును ఏర్పాటుచే యడం ప్రాధాన్యం సంతరించుకుంది.
→ కజకిస్థాన్, కిర్గిజైన్, తజికిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఉజ్బెకి స్థాన్ల నేతలతో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ సమావేశమయ్యారు.

ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేషసాయి

→ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా (ఏసీజే) జస్టిస్ ఏవీ శేషసాయి నియమితులయ్యారు.
→ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకానికి ఆమోద ముద్ర వేయ డంతో.. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.
→ ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే.
→ ఈ నేప థ్యంలో హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసా యిని ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది.

→ జస్టిస్ ఏవీ శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో 1962లో జన్మించారు.
→ ప్రాథమిక విద్య భీమవరం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, పాఠశాల ఉన్నత విద్యను లూథరన్ హైస్కూల్లో చదివారు.
→ కేజీఆర్ఎల్ కళాశాలలో ఇంటర్మీడి యట్, డీఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎల్ అభ్య సించారు.
→ 1987 జులై 3న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని ప్రముఖ న్యాయవాదులు పి. రాజగోపాలరావు, పి. రాజారావు ఆఫీసులలో చేరి వృత్తి మెల కువలు నేర్చుకున్నారు.
→ సివిల్, క్రిమినల్, సర్వీసు, రాజ్యాంగ సంబంధ చట్టాలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీసు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు.
→ సంస్కృతి, విద్యా, సంగీతం, ఫిలాసఫీ తదితర అంశాలపై ఆయనకు ఆసక్తి ఉంది.
→ హైద రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్టాండింగ్ కౌన్సిల్గా, బార్ కౌన్సిల్క ప్యానల్ న్యాయవాదిగా పనిచేశారు.
→ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు.
→ ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా 2013 ఏప్రిల్ 12న ప్రమాణం చేశారు.
→ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శాశ్వత న్యాయమూ ర్తిగా 2014 సెప్టెంబర్ 8న నియమితులయ్యారు.
→ 2019 జనవరి 1న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి సీనియర్ న్యాయ మూర్తిగా సేవలు అందిస్తున్నారు.
→ హైకోర్టు పరిపాలనా సంబంధ వ్యవహారాలు, న్యాయ సేవాధికార సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

నూతన న్యాయశాఖమంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్

→కేంద్ర మంత్రివర్గంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకు న్నాయి.
→న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆ మంత్రిత్వశాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తప్పించారు.
→ఆయనకు భూవిజ్ఞానశాస్త్ర శాఖను అప్పగించారు.
→రిజిజు స్థానంలో రాజస్థాన్ దళిత నేత, మాజీ ఐఏఎస్ అధికారి, మంత్రిమండలిలోని పార్లమెంటరీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను న్యాయ శాఖ నూతన మంత్రిగా నియమించారు.
→ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీముర్కు ఉత్తర్వులు జారీచే శారు. మేఘ్వాల్ స్వతంత్ర హోదాలో న్యాయ శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తారని తెలిపారు.
→మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మేఘ్వాల్ మాట్లా డుతూ న్యాయవ్యవస్థకు, కేంద్రానికి మధ్య ఎలాంటి ఘర్షణ లేదని పేర్కొన్నారు.
→"కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య సుహృద్భావ సంబంధాలు. ఉన్నాయి. ఉంటాయి.
→'అవి అలానే రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఇప్పటికే సరిహద్దులు ఉన్నాయి" అని పేర్కొన్నారు.
→ మేఘ్వాల్ నియామ కంతో ప్రస్తుతం న్యాయశాఖ సహాయమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్ నేత ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
→ ఆయనకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి బాధ్యతలను అప్పగించారు.
→ మేఘ్వాల్.. 2000 నుంచి వరుసగా రాజస్థాన్ లోని బీకానేర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నిక వుతూ వస్తున్నారు.
→ త్వరలో రాజస్థాన్ శాసనస భకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దళిత నేతను కీలక మంత్రి పదవిలో నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కొత్త న్యాయశాఖ మంత్రి.. మాజీ ఐఏఎస్ అధికారి

→న్యాయశాఖ మంత్రిగా నియమితులైన మేఘ్వాల్ రాజస్థాన్లోని బీకానేర్లో 1953 డిసెంబర్ 20న జన్మించారు.
→ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశారు. ఎనిమిదో తరగతి చదు వుతుండగా ఆయనకు వివాహమైంది.
→అప్పుడు ఆయన వయస్సు 14 సంవత్సరాలే. పెళ్లి తర్వాత ఉన్నత విద్య కొనసాగించారు. 1977లో న్యాయశా ంలో పట్టా పొందారు.
→1979లో పీజీ పూర్తిచేశారు. 1982లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు ఎంపి కయ్యారు. 1999లో ఐఏఎస్కు పదోన్నతి పొందారు.
→రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచే శారు. తర్వాత రాజకీయాలవైపు మళ్లారు.
→2009లో బీకానేర్ నుంచి భాజపా టికెట్పై పోటీ చేసి లోక్ సభలో అడుగుపెట్టారు.
→ పార్లమెంట్ సభ్యుడిగా పలు కమిటీల్లో భాగమయ్యారు.
→ లోక్సభలో చీఫ్ విప్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. మేఘ్వాల్ తాను పనిచేసే ప్రదేశానికి సైకిల్ మీద వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.


→నరేంద్ర మోదీ హయాంలో న్యాయశాఖ మంత్రుల బదిలీ ఆకస్మాత్తుగా జరుగుతూ వస్తోంది.
→తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మోదీ ఈ శాఖను సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కు అప్పగించారు.
→తర్వాత ఆయన్ను తొలగించి కర్ణాటక నేత సదానందగౌ డకు కట్టబెట్టారు.
→గౌడను తప్పించి మళ్లీ రవిశం కర్ ప్రసాద్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు.
→2021 జులైలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఊహించని విధంగా 'రవిశంకర్ ప్రసాద్ను మంత్రివర్గం నుంచే తొలగించి ఆ స్థానంలోకి రిజి జును తీసుకొచ్చారు.
→ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన్ను తప్పించి మేఘ్వాల్ ను నియమించారు.
→అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి బాధ్యతలను 2021 జులైలో చేపట్టారు.
→అంతకుముందు ఆయన మోదీ ప్రభుత్వంలో సహాయమంత్రిగా హోం, క్రీడాశాఖలను నిర్వ హించారు.
→స్వతంత్ర హోదాలో మైనారిటీ వ్యవ హారాలనూ చూశారు. న్యాయశాఖతో ఆయనకు కేబినెట్ హోదా లభించింది.
→అయితే ఈ పద విలో ఆది నుంచీ వివాదాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కొలీజియం వ్యవస్థ పారదర్శకతను రిజిజు ప్రశ్నిస్తూ వచ్చారు.
→రాజ్యాంగపరంగా ఈ వ్యవస్థ సరైంది కాదన్న అభిప్రాయాన్ని ఆయన పలు వేదికలపై ప్రస్తావించారు.
→ భారత్ వ్యతిరేక మురా అంటూ కొంతమంది విశ్రాంత న్యాయమూర్తుల పైనా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
→ దీంతో పాటు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు ఆమోదముద్ర వేయకుండా కేంద్రం ఆలస్యం చేయడంపై వివాదం చెలరే గిన సమయంలోనూ కాస్త తీవ్రంగానే స్పందిం చారు.
→"దస్త్రాలపై ప్రభుత్వం కూర్చుందని ఎప్పుడూ అనకండి. వారే తమ దస్త్రాలను పంపడం లేదు. మీకు మీరే నియమించు కుంటే అంతా మీరే నడుపుకోండి" అని న్యాయ వ్యవస్థను ఉద్దేశించి విమర్శించారు.
→ రిజిజు వ్యాఖ్యలపై ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
→ ఇందులో న్యాయశాఖమంత్రి పదవి నుంచి ఆయన్ను తొలగించాలని బాంబే లాయర్స్ అసోషియేషన్ డిమాండ్ చేసింది.
→ దీనికి తోడు ఇటీవల సుప్రీంకోర్టులో కొన్ని తీర్పులు కేంద్రానికి ప్రతికూలంగా రావడం కూడా రిజిజు ఉద్వాసనపై ప్రభావం చూపా యన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

భారత్ కు ముంబయి దాడుల నిందితుడు తహవ్వుర్ రాణా

→ ముంబయి దాడు (26/11)ల కీలక నిందితుల్లో ఒకడైన తహవ్వుర్ రాణాను అప్పగిం చాలని భారత్ చేసిన అభ్యర్థనకు ఆమోదం లభించింది.
→ రాణా విడుదలకు అంగీకరిస్తూ అమె రికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు న్యాయ మూర్తి జాక్వెలిన్ చూజన్ ఈ నెల 16న 48 పేజీల తీర్పు వెలువరించారు.
→ భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా 62 ఏళ్ల రాణాను భారత్ కు అప్ప గించవచ్చని తీర్పులో పేర్కొన్నారు.
→పాకిస్థాన్ మూలాలున్న, కెనడా వ్యాపారవేత్త తహవ్వుర్ రాణా ముంబయి దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటు న్నాడు.
→2008లో జరిగిన ముంబయి దాడుల్లో అతడి పాత్ర పై ఎన్ఎస్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
→దీనిలో భాగంగా అతడిని అప్పగించాలని జూన్ 10, 2020న అమెరికాను భారత్ కోరింది.
→రాణా అప్పగింత వ్యవహారంలో బైడెన్ సర్కార్ భార త్ కు సానుకూలంగా వ్యవహరించింది.
→కింద గతంలోనే షికాగో కోర్టు రాణాకు 14 సంవత్స రాల జైలు శిక్ష విధించింది.
→ప్రస్తుతం రాణా డౌన్ టౌన్ లాస్ఏంజెలెస్ ఫెడరల్ లాకప్ లో ఉన్నాడు. జిల్లా కోర్టు తీర్పును అతను సర్క్యూట్ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.
→ అమెరికా చట్టం ప్రకారం నిందితుడి అప్పగింత పై తుది నిర్ణయం ఆ దేశ విదేశాంగ మంత్రిదే కావడం గమనార్హం.
→2008 నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పో యిన విషయం తెలిసిందే.
→ ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి తహవ్వుర్ అత్యంత సన్నిహితుడు.
→అలాగే దాడు లకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వ హించింది కూడా తహవ్వురేనని విచారణలో ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు.

జల్లికట్టు క్రీడ చట్ట సమ్మతమే: సుప్రీం

→తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.
→ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత చట్టానికి చేసిన సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.
→దీంతో పాటు.. దున్నలతో కర్ణాటక నిర్వహించే కంబళ పోటీకి, మహారాష్ట్ర సంప్రదాయ ఎడ్ల పందేలకు కూడా పచ్చజెండా ఊపింది.
→ ఈ మేరకు ఆయా రాష్ట్రాలు చేసిన చట్ట సవరణలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ జస్టిస్ కె.ఎం. జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.
→ జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ లు ధర్మాసనంలోని ఇతరసభ్యులు. 2017లో జంతు క్రూరత్వ నిరోధక చట్టాలకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర చేసిన సవరణలకు రాష్ట్రపతి అనుమతి కూడా లభించిందని ధర్మాసనం. తన తీర్పులో పేర్కొంది.
→తమిళనాడులో పొంగల్ సమయంలో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు.
→కంబళ దున్నల పందేలను నవంబరు, మార్చి మధ్య కర్ణాటకలో జరుపుతారు.
→"మా ముందు ప్రవేశ పెట్టిన ఆధారాలతో సంతృప్తి పొందాం.
→జల్లికట్టు తమిళనాడులో శతాబ్దాల సంప్రదాయం. మా పరిశీలనలో మూడు రాష్ట్రాలు చేసిన సవరణలు కూడా చెల్లుబాటయ్యే శాసనాలే" అని 56 పేజీల తీర్పులో న్యాయమూర్తులు పేర్కొన్నారు.
→జల్లికట్టు సంప్రదాయ క్రీడ కాదని పశువులను హింసకు గురిచేసే జల్లికట్టు, కంబళ తదితర క్రీడలనూ నిషేదించాలని 2014లో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది.
→దీంతో తమ రాష్ట్ర జంతు క్రూరత్వ చట్టాలకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక సవరణలు చేశాయి. వీటిని జంతు సంక్షేమ సంస్థలు సవాల్ చేశాయి.
→దీంతో పాటు 2014 తీర్పును అమలుచేయాలని పిటిషన్లు వేశాయి. దీనిపై రాజ్యాగం ధర్మాసనం ప్రస్తుత తీర్పు వెలువరించింది.
→కాదనడాన్ని జల్లికట్టు సంప్రదాయ క్రీడ ధర్మాసనం తప్పుపట్టింది. "తమిళనాడు చేసిన సవరణలోని నిబంధనల ప్రకారం.. పశువుల నొప్పిని గణనీయంగా తగ్గించి ఈ సంప్రదాయ క్రీడ కొనసాగేలా ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తుంది.
→సవరణకు రాష్ట్రపతి అనుమతి కూడా లభించింది. కాబట్టి రాష్ట్ర చర్యల్లో లోపం ఉందని మేం అనుకోవడం లేదు" ధర్మాసనం పేర్కొంది.

అమెరికాలో భారతీయ మహిళ ఘనత

→భారత సంతతికి చెందిన ప్రతిమా భుల్లార్ మక్డొనాడో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్(ఎన్ఎ్వ్ప డీ)లో అత్యున్నత స్థాయి అధికారిగా బాధ్య తలు చేపట్టారు. →ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. గత నెలలో ఆమెకు కెప్టెన్గా పదోన్నతి లభించింది. →క్వీన్స్ లోని సౌత్ రిచ్మం డ్ హిల్ 102వ పోలీస్ ప్రిసింక్కు ఆమె నేతృ త్వం వహిస్తున్నారు. →కమ్యూనిటీ పోలీసింగ్ ఇదే అతిపెద్ద హోదా. పంజాబ్లో జన్మించిన ప్రతిమ కుటుంబం ఆమెకు తొమ్మిదేళ్ల వయస ప్పుడు న్యూయార్క్లోని క్వీన్స్క వలసవెళ్లింది.

ఆపరేషన్ కరుణ

→అంతర్జాతీయ విపత్తు ప్రతిస్పందన కార్యక లాపాల్లో భాగంగా ఆపరేషన్ కరుణ పేరుతో నౌకాదళ సేవలు చురుగ్గా సాగుతున్నాయి.
→ఈ మేరకు భారతీయ నౌకాదళ నౌకలు శివాలిక్, కమోర్తా, సావిత్రి సహాయ సామగ్రితో మయన్మార్ లోని యాంగోనక్ కు చేరుకున్నాయి.
→భారతీయ నావికాదళం వృద్ధిని, భద్రతను నిర్ధారించడంతో మొదటి నౌకాదళ నౌకలుగా ఇవి పేరుగాంచాయి.
→విపత్తుల సమయంలో పొరుగు వారికి సహాయాన్ని అందించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిలాన్ - 2024 నిర్వహణకు ఏర్పాట్లు

→ అంతర్జాతీయ విన్యాసాలకు మరోసారి వేదికగా నిలిచేందుకు విశాఖ సన్నద్ధమ వుతోంది.
→ 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ ను సైతం వరుసగా నిర్వహించి సత్తా చాటిన తూర్పు నౌకాదళం.. వచ్చే ఏడాది ఫిబ్రవ రిలో మరోసారి మిలాన్ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతోంది.
→ నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్ కోసం భారీ ఏర్పాట్లు చేసేందుకు ఇండి యన్ నేవీ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోం ది.
→ ఈసారి గత రికార్డును తిరగరాసేలా.. భారత నౌకాదళం 50 దేశాలతో భారీ స్థాయిలో విన్యాసా లు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
→ 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను ఘనంగా నిర్వహించగా అని ప్రపంచ దేశా లు కీర్తించాయి.
→2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో సత్తా చాటింది. నెల రోజుల వ్యవధిలోనే నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలాన్-2022ను నిర్వహిం చి.. ప్రపంచ దేశాలకు భారత రక్షణదళ సత్తాను చాటింది.
→ఇప్పుడు మరోసారి మిలాన్ కు విశాఖ ఆతిథ్యమిచ్చేందుకు ముస్తాబవుతోంది.
→మిలాన్- 2024 పేరుతో ఈ విన్యాసాల్ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన స్థావరంలో వచ్చే ఏడాది ఫిబ్రవ రిలో నిర్వహించనున్నారు.
→2018 అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొనగా.. 2022లో విశాఖలో నిర్వహించిన మిలాన్లో 39 దేశాల నౌకాదళాలు పాల్గొని విన్యాసాలు నిర్వహించాయి.
→ఇదే అతిపెద్ద మిలాన్ గా రికార్డు సృష్టించింది.
→అతిపెద్ద మిలాన్ గా రికార్డుకు అవకాశం మిలాన్-2024ను 2022 నాటికంటే భారీగా నిర్వ హించేలా తూర్పు నౌకాదళం సమాయత్తమవుతోం ది.
→ఇప్పటికే భారత నౌకాదళం ఏయే దేశాలకు ఆహ్వానాలు పంపించాలనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
→దక్షిణాసియా, ఆగ్నేయా సియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు పంపించారు.
→భారత్ తో పాటు యూఎస్ఏ, రష్యా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రి కా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, వియ త్నాం, మోజాంబిక్, సూడాన్, ఇజ్రాయెల్, ఖతర్, థాయ్లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమ రోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరే బియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రె యిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్ మొదలైన 50 దేశాలకు ఆహ్వానం పంపించ నుంది.
→మొత్తం అన్ని దేశాలు హాజరైతే అతి పెద్ద మిలాను వేదికగా విశాఖ రికార్డు సృష్టించనుంది.
→ఇప్పటికే స్థానిక అధికారులతో తూర్పు నౌకాద ళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమా వేశమై.. ఏర్పాట్లు, భద్రతా అంశాలపై ప్రాథమికం గా చర్చించారు.
→మిలాన్- 2024ను సీ ఫేజ్, హార్బర్ ఫేజీలో విన్యాసాలు నిర్వహించనున్నారు.

బైడెన్ గైర్హాజరుతో క్వాడ్ సదస్సు రద్దు

→ అమెరికా రుణపరిమితి పెంపు సమస్యను అత్యవసరంగా చక్కదిద్దాల్సిన నేపథ్యంలో 24వ తేదీన ఆస్ట్రేలియాలో జరగాల్సిన క్వాడ్ సదస్సుకు హాజరు కాలేనని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. దాంతో సదస్సు రద్దయింది.
→ అందులో చర్చించదలచిన కీలకాంశాలను జపాన్లోని హిరోషిమాలో జరగబోయే జీ7 సదస్సు సందర్భంగా క్వాడ్ దేశాలు చర్చించే అవకాశముందని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు.
→ అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా యథాతథంగా జరగనుంది. ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలతో పాటువాణిజ్య సంబంధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
→ మే 19- 21 మధ్య మోదీ జపాన్ జీ7 సదస్సులో పాల్గొంటారు.
→ 22న పపువా న్యూ గినియాలో ఇండో-పసిఫిక్ ద్వీపాల సహకార సదస్సులో పాల్గొంటారు.
→ 23న ఆస్ట్రేలియాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
→ జీ7 భేటీ మోదీ, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో బైడెన్ చర్చిస్తారని శ్వేతసౌధం ప్రకటించింది.

భారతీయ కళా చరిత్ర సమాఖ్య జనరల్ ప్రెసిడెంట్గా డి. కిరణ్ క్రాంత్ చౌదరి

→ భారతీయ కళా చరిత్ర సమాఖ్య (ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్) జన రల్ ప్రెసిడెంట్ గా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆర్కియాలజీ విశ్రాంతాచార్యులు డి. కిరణ్ క్రాంత్ చౌదరి నియమితులయ్యారు.
→ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తి ఆయనే. ఈ మేరకు ఆ సంఘ జాతీయ కార్యాలయం నియామకపత్రాన్ని వెలువరించింది.
→ 2024 ఫిబ్రవరిలో జరగబోయే సమాఖ్య 31వ వార్షిక సదస్సుకు ఆయన జన రల్ ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నారు.
→ కిరణ్ క్రాంత్ చౌదరి శిల్ప, వాస్తుక ళల్లో అరుదైన పరిశోధనలు చేసి దేశ, విదేశాలలో గుర్తింపు పొందారు.
→ అనేక దేశాల్లో శిల్పకళలపై ఉపన్యాసాలు ఇచ్చారు. పరిశోధన రంగంలో వందకు పైగా వ్యాసాలు, 16 గ్రంథాలను వెలువరించారు.
→ 'స్ల్పెండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్: ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ పెయింటింగ్స్' గ్రంథాన్ని వెలువరించారు.
→ యూజీసీ శాప్ సమన్వయకర్తగా వ్యవహరించారు. పలు అవార్డులు అందుకున్నారు.

కొత్త జాతి జీవి... మిజోరంకు ఎగిరొచ్చింది!

→ అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతి బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్ లో తొలిసారిగా మిజోరం లో గుర్తించారు.
→ చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజో రమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యే కత.
→ 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంది. 'వీటి డీఎన్ఏ 21 శాతం వేరుగా ఉంది.
→ ఇది నిజం గా కొత్త జాతి' అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశో ధకులు తెలిపారు.
→ మిజోరం ప్రజలు వీటిని అత్యం త ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట.

యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ బాధ్యతలు

→ యూపీఎస్సీ చైర్మన్ గా ప్రముఖ విద్యావేత్త మనోజ్ సోనీ బాధ్యతలు చేపట్టారు.
→ 2017, జూన్ 28న కమిషన్ సభ్యుడిగా నియమితుడైన ఆయన... గతేడాది ఏప్రిల్ 5 నుంచి చైర్మన్ విధుల్ని అనధికారి కంగా నిర్వర్తిస్తున్నారు.
→ సీనియర్ సభ్యురాలు స్మితానాగరాజు కమిషన్ చైర్మన్ గా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఫోన్లను వెతికే సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభం

→ చోరీ అయిన, పోగొట్టుకున్న ఫోన్లను ట్రాక్ చేసేలా కేంద్ర ప్రభుత్వం 'సంచార్ సాథీ' పేరుతో ఓ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువ చ్చింది.
→ ఈ పోర్టల్ లో పోయిన / చోరీ అయిన ఫోన్లను యూజర్లు బ్లాక్ చేసుకోవచ్చని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్ల డించారు.
→ మొబైల్ యూజర్లు https://www.sancharsaathi.gov.in/ పోర్టల్లో లాగిన్ అవ్వాలని ఆయన వివరించారు.

ఏపీలో వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్

→ స్థానిక ఉత్ప త్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రి త్వశాఖ వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ పథకాన్ని ప్రవేశపె ట్టింది.
→ అందులో భాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 రైల్వే స్టేషన్లలో 37 వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ అవు ట్లెట్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలి పారు.
→ రాష్ట్రంలో విజయవాడ స్టేషన్తో పాటుగా నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేసిన అవుట్లెట్ స్టాల్స్ ద్వారా స్థానిక చేతి వృత్తుల వారి జీవనోపాధి, సంక్షేమానికి ప్రధాన ప్రోత్సాహం కల్పించారు.
→ సంప్రదాయ కలంకారి చీరలు, జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తక ళలు, గిరిజన ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా తెలిపారు.
→పొడులు, అప్పడాలు వంటి స్థానిక వంటకాలు, షేల్ పెయింటింగ్స్, రైస్ ఆర్ట్స్ తదితర ఉత్పత్తులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంద న్నారు.

'మూన్ కింగ్'గా మళ్లీ శని గ్రహం

→ సౌర కుటుం బంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం 'మూన్ కింగ్' కిరీటాన్ని తిరిగి చేజిక్కిం చుకుంది.
→ ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు.
→ దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది.
→ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్ కింగ్ కొనసాగుతోంది.
→ అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు.
→ హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్ 2019-21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు.
→ సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో 'మూన్ కింగ్' కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు.

రాజభవన్లో సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

→భిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలకు నెలవైన రాష్ట్రం సిక్కిం అని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు.
→ఏక్ భారత్ - శ్రేష్ఠి భారత్లో భాగంగా విజయవాడలోని రాజ్భవ న్లో నిర్వహించిన సిక్కిం రాష్ట్ర 48వ అవతరణ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
→'దేశంలోనే పరిశుభ్రమైన, జీవ వైవిధ్యం, సుంద రమైన సరస్సులతో నిండిన రాష్ట్రం సిక్కిం. ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం కంచెంగా అక్కడి ప్రధాన ఆకర్షణ' అని పేర్కొన్నారు.
→సిక్కిం రాష్ట్ర గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మేఘన, రిజ్వాన్, అన్ ఫెర్డోస్, సిరి మహాలక్ష్మిలు ఆ రాష్ట్ర సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
→సిక్కిం గొప్ప తనాన్ని తెలిపే వీడియోను సందర్శకులు వీక్షించారు.
→సిక్కిం రాష్ట్రానికి చెందిన అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉజెన్ భూటియా, విట్ విశ్వవిద్యాలయం విద్యార్థి అభిషేక్ అగర్వాల్ లు ప్రసం గిస్తూ సిక్కిం రాష్ట్ర అవతరణను ఏపీలో నిర్వహించినందుకు గవర్నర్కు ధన్య వాదాలు తెలిపారు.
→ఏపీలో నివసిస్తున్న ఆ రాష్ట్ర వాసులు పంకజ్ బల్వేరియా, ప్రాచి ఆచార్య, రోషన్ షా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జలజీవన్ మిషన్ అమలులో 18వ స్థానంలో ఏపీ

→గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కొళాయి నీటి సౌకర్య కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ పథకం అమలులో ఏపీ 18వ స్థానంలో నిలిచింది.
→ఇప్పటి వరకు గోవా, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్హివేలీ దామన్ దయ్యూ, హరియాణా, గుజరాత్, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణలు గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లకు కొళాయినీటి సౌకర్యం కల్పించి తొలి 8 స్థానాల్లో నిలిచాయి.
→ఆ తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ (98.35%), బిహార్ (96.05%), మిజోరం (85.57%), సిక్కిం (83.95%), అరుణాచల్ ప్రదేశ్ (77.53%), ఉత్తరాఖండ్ (77.19%), మణిపుర్ (76.58%), మహా రాష్ట్ర (75.84%), లద్ధాఖ్ (72.29%), ఆంధ్రప్రదేశ్ (69.74%) ఉన్నాయి.
→రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 95,54,758 ఇళ్లకు గాను ఇప్పటి వరకు 66,63,121 ఇళ్లకు కొళాయినీటి సౌకర్యం కల్పిం చినట్లు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
→ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి సగటున 61.71% ఇళ్లకు ఈ పథకం చేరుకుందని తెలిపింది.

నిపుణులైన ప్రొఫెసర్లను గుర్తించేందుకు పోర్టల్

→విశ్వవిద్యాలయాల్లో సంస్కర ణలు, వ్యూహాత్మక కార్యక్రమాల అమలును సమర్థవం తంగా పరిశీలించేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) రెండు పోర్టళ్లను ప్రారంభించింది.
→ ఉన్నత విద్యలో పరివర్తన వ్యూహాలు, తీసుకునే చర్యలు (ఉత్సాహ్), ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ పథకం(పీవోపీ) పేరుతో వీటిని తీసుకొచ్చింది.
→ జాతీయ విద్యా విధానం-2020 అమలులో సాధించిన పురోగతిని పంచుకోవడానికి ఉత్సాహ్ వేదికగా ఉంటుంది.
→ ఉన్నత విద్యా సంస్థల్లో బోధించేందుకు అనుభవజ్ఞులైన ప్రొఫెస ర్లను గుర్తించేందుకు పీవోపీని తీసుకొచ్చింది.
→ ఏదైనా విభాగంలో నిపుణుల కోసం వెతికే ఉన్నత విద్యా సంస్థలు ఈ పోర్టల్ నమోదు చేసుకోవచ్చు.
→ అలాగే నిపు ణులు తమ ప్రొఫైళ్లను ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు.

40 మంది జడ్జీల పదోన్నతులు రద్దు

→గుజరాత్ లో వివాదానికి దారితీసిన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవ హారంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసు కుంది.
→మొత్తం 68 మంది జడ్జీలకు ఇచ్చిన పదో న్నతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మందికిచ్చిన పదోన్నతులను కొనసాగిస్తూనే వారికి స్థాన చలనం కల్పించింది.
→ ఈ మేరకు రెండు నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది.
→ మిగతా ఏడుగురు జడ్జీల విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
→ ఈ నెల 12న జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రక్రియపై నిలుపు దల(స్టే) ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
→ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హసుఖాబాయ్ వర్మకు ఇచ్చిన పదోన్నతిని హైకోర్టు కొనసాగించింది.
→ అయితే, తొలుత ఆయ నకు రాజ్ కోట్ లోని 16వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ ఇవ్వగా ఇప్పుడు 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించింది.
→గుజరాత్ లో వివాదాస్పదమైన దిగువ కోర్ట్ జడ్జీల పదోన్నతుల వ్యవహారంపై జులైలో విచా రణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
→వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నర సింహ, జస్టిస్ జె. బి. పార్దీవాలతో కూడిన ధర్మా సనం తెలిపింది.
→ప్రతిభ-సీనియారిటీ ఆధారం గానే పదోన్నతి కల్పించా లన్న సర్వీసు నిబంధన లను గుజరాత్ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 12న ఉత్తర్వులు చేసింది.
→ప్రమోషన్లు పొందిన వారంతా తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. జస్టిస్ ఎం. ఆర్. షా సోమవారం పదవీ విరమణ చేశారు.
→అయితే, పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పిదమేమీ లేకున్నా అవమానాలకు గురి కావాల్సి వచ్చిందంటూ కొందరు జడ్జీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును జులైలో విచారణకు చేపడతామని సీజేఐ

పార్లమెంటు కొత్త భవంతి నెలాఖరులో ప్రారంభం

→పార్లమెంటు నూతన భవనానికి తుది మెరుగులు దిద్దే పనులు ముమ్మరంగా సాగుతు న్నాయి.
→దీనిని ఈ నెలాఖరునాటికి అన్ని విధా లుగా సిద్ధం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
→ఈ నెల 30నాటికి కేంద్రంలో భాజపా సర్కారు రెండోసారి అధికా రంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతుంది.
→ఆరో జుకు కాస్త అటూఇటూగా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభోత్సవాన్ని జరిపించవచ్చని సమాచారం.
→భవనం లోపల శుభ్రత పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
→దిల్లీలోని సెంట్రల్ విస్టా పునరభివృద్ధిలో భాగంగా రాష్ట్రపతిభవన్ నుంచి ఇండియా గేట్ వరకు మొత్తంగా మూడు కిలోమీటర్ల మేర వివిధ పనులను రెండేళ్ల క్రితం చేపట్టిన విషయం విదితమే.
→పార్లమెంటుతో పాటు కేంద్ర సచివాలయం, ప్రధాని కార్యాలయం, ప్రధాని నివాసం, ఉప రాష్ట్రపతి భవనం వంటివి కొత్తగా నిర్మిస్తున్నారు.
→ముందు అనుకున్న ప్రకారమైతే ఇవన్నీ గత ఏడాది నవంబరుకు పూర్తికావాలి.

గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు ఏపీలో 2, తెలంగాణలో 4

→దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
→దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది.
→ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలున్నాయి.
→తెలంగాణలో ఎంఐఎం, భారాసతోపాటు తెలు గుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొంది నట్లు వెల్లడించింది.
→వీటికి ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేయనున్నట్లు పేర్కొంది.
→ఈ నాలుగు పార్టీల చిరునామాలూ హైద రాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. వీటికి అతీతంగా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీసింబల్స్ ను విడుదల చేసింది.
→అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ (గ్లాస్ టంబ్లర్) ఉంది.
→దీన్ని ఇదివరకే జనసేనకు కేటాయించి నప్పటికీ తాజా ఉత్తర్వుల్లో మాత్రం దాన్ని ఫ్రీ సింబల్ గానే ఉంచింది.
→ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మాత్రం ఏపీ, తెలంగాణల్లో ఇవ్వడం లేదని పేర్కొంది.
→ఇవి కారు గుర్తును పోలి ఉండటంతో వాటిని తెలుగు రాష్ట్రాల జాబితానుంచి మినహాయించింది.
→జాతీయ పార్టీల జాబి తాలో ఆప్, బీఎస్పీ, భాజపా, సీపీఐ(ఎం), కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర

→ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ పేర్లను సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది.
→ఇప్పటివరకు న్యాయమూర్తు లుగా ఉన్న జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా పదవీవిర మణ చేసిన నేపథ్యంలో ఆ స్థానాల భర్తీ కోసం కొలీజియం వెంటనే పేర్లు సిఫార్సు చేసింది.
→ వీరిద్దరు నియమితులైతే సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరుతుంది.
→ఇందులో కేవీ విశ్వనాథన్ 2030 ఆగస్టు 12న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య తలు చేపట్టి పది నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
→ ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలంది స్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న చత్తీస్గఢ్లోని రాయగఢ్ లో జన్మించారు.
→బిలాస్పూర్ లోని గురు ఘసిదాస్ యూనివర్సి టీలో బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివారు. 1967 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
→రాయ్ గఢ్ జిల్లా కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు, ఛత్తీస్ గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.
→ 2005 జనవరిలో చత్తీస్గఢ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా హోదా పొందారు.
→ 2009 డిసెంబరు 10న ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితు లయ్యారు.
→ 2021 అక్టోబర్ 13న ఏపీ హైకోర్టు ప్రధాన యుమూర్తిగా పదోన్నతి పొందారు.
→ చత్తీస్ గఢ్ హైకోర్టు నుంచి ఎవ్వరికీ ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈయన పేరును సిఫార్సు చేసినట్లు కొలీజియం పేర్కొంది.
→ జస్టిస్ మిశ్ర హైకోర్టు 13 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా 13 పనిచేశారు.
→ అఖిల భారత స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తుల సీనియా జాబితాలో 21వ స్థానంలో ఉన్నారు.
→ చత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన న్యాయపరంగా విభిన్న అనుభవం సాధించినట్లు కౌలీజియం అభిప్రాయపడింది.
→ న్యాయానికి సంబంధించి విస్తృతస్థాయిలో తీర్పులు ఇచ్చినట్లు పేర్కొంది.
→ ఇప్పుడు ఈయన నియామకం ద్వారా చత్తీస్గఢ్ హైకోర్టుకు ప్రాతినిధ్యం కల్పించ పాటు ఆయనకున్న విజ్ఞానం, అనుభవం సుప్రీంకోర్టుకు అదనపు విలువను జోడిస్తాయని తెలి పింది.
→ జస్టిస్ మిశ్ర చిత్తశుద్ధి గల న్యాయమూర్తి అని పేర్కొంది.
→ ప్రస్తుత అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (జస్టిస్ ప్రీతింకర్ దివాకర్) 2000 మార్చి 31న ఛత్తీస్గఢ్ మాతృహైకోర్టు నుంచి న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
→ఆయన జస్టిస్ ప్రశాం త కుమార్ మిశ్ర కంటే సీనియర్.
→అయినా అన్ని విష యాలన పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు
→న్యాయమూర్తిగా నియమించేందుకు జస్టిస్ మిశ్రయే అర్హులన్న అభిప్రాయానికి వచ్చినట్లు కాలీజియం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

కేవీ విశ్వనాథన్... సీజేఐ అయ్యే అవకాశం

→ప్రస్తుతం బార్ నుంచి నేరుగా ఎంపికైన న్యాయ మూర్తి (ఆస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ) ఒక్కరే ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది.
→న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్ట దానికి ఆయన సరిగ్గా సరిపోతారని పేర్కొంది.
→దీని వల్ల సుప్రీంకోర్టులో బార్కు ప్రాతినిధ్యం పెరుగుతుం విస్తృతమైన ప్రాయపడింది.
→బోర్డుకు అదనపు అనుభవం, లోతైన జ్ఞానం "పేర్కొంది. విలువను జోడిస్తాయని ర్కొంది.
→ఈయన భారతీ యార్ యూనివర్సిటీ పరిధిలోని కోయంబత్తూరు న్యాయ కళాశాలలో అయిదేళ్ల లా డిగ్రీ చేశారు.
→1988లో తమిళనాడు బార్ కౌన్సిల్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
→రెండు దశాబ్దాలు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన తర్వాత పొందారు.
→2009లో సీనియర్ అడ్వొకేట్ హోదా న్యాయవాదిగా ఆయన కాన్స్టిట్యూషన్, క్రిమినల్, కమర్షియల్, ఇన్సాల్వెన్సీ, ఆర్బిట్రేషన్ లాకు సంబంధించిన కేసులు వాదించారు.
→ వివిధ కేసుల్లో అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టుకు సాయం చేశారు.
→ న్యాయశాస్త్రం గురించి సంపూర్ణ అవగాహన, సహచర న్యాయవాదుల్లో ఈయనకు నిబద్దత, నిజాయితీ కలి గిన సీనియర్ న్యాయవాదిగా పేరున్నట్లు కొలిజియం పేర్కొంది.
→ కేవీ విశ్వనాథన్ 1966 మే 26న జన్మించారు. 2031 మే 25 వరకు ఆయన సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు.
→ 2030 ఆగస్టు 11న జస్టిస్ జేబీ. పర్దివాలా వీవిరమణ ప్రధా న్యాయమూర్తి హోదాలో పదవీ విరమణ చేసిన తర్వాత ఈయన ఆ బాధ్యతలు చేపట్టి 2031 మే 25 వరకు CJIగా కొనసాగుతారు.
→ న్యాయమూర్తిగా నియమితులైనవారిలో జస్టిస్ ఎస్ఎం సిక్రీ (1971), జస్టిస్ (2022), జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ (2027) ని తర్వాత న్యాయమూర్తిగా నియమితులయ్యే యర్ వ్యక్తిగా కేవీ విశ్వనాధనక్కు గౌరవం దక్కుతుంది.
→ జులై రెండో వారానికల్లా జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, కృష్ణ మురారి పదవీవిరమణ చేయబోతున్నందున మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి..
→అప్పటికి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరు తుంది.
→ఖాళీలను వేగంగా భర్తీచేయడానికి ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లను కొలిజియం ఏకగ్రీవంగా సిఫార్సు. చేసింది.
→వివిధ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయమూర్తుల పేర్లపై చర్చించినట్లు 30 తెలిపింది.
→పేర్లను సిఫార్సు చేసే సమయంలో పేరెంట్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయ మూర్తుల సీనియారిటీ, హైకోర్టు న్యాయమూర్తుల్లో మొత్తమ్మీద సీనియారిటీని పరిగణనలోకి కాలీజియం పేర్కొంది.
→అలాగే ప్రతిభ, పనితీరు, నిబ ద్ధతనూ చూసినట్లు తెలిపింది.
→సుప్రీంకోర్టులో వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని కల్పించడానికి ఇప్పటివరకు లేని హైకోర్టులకు ప్రాతినిధ్యం లేని "ప్రాతినిధ్యం కల్పించడా నికి, లింగ వైవిధ్యం, మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పరిగ జనలోకి తీసుకున్నట్లు ప్రతిభ, ప్రధాన న్యాయమూర్తులుగా, న్యాయమూర్తులుగా ఉన్న యోగ్యత, విభిన్న వర్గాలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పేరును ఏకగీవ్రంగా సిఫార్సు. చేసినట్లు కొలీజియం పేర్కొంది.
→సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా నియమితులు కావడానికి ఆయనకు అన్ని అర్హతలు, యోగ్యతలు ఉన్నట్లు తెలిపింది.

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ గా రవ్ నీత్ కౌర్

→ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్పర్సన్ గా రవ్ నీత్ కౌర్ ను ప్రభుత్వం నియమించింది.
→ సీసీఐకు పూర్తి స్థాయి చైర్పర్స న్గా ఓ మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే మొద టిసారి.
→ 1988 పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రవ్ నీత్ కౌర్ నియామకానికి నియామకా లపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపిందని అధికారిక ఆదేశాల ఆధారంగా తెలు స్తోంది.
→ రవ్ నీత్ కౌర్ సీసీఐ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఐదేళ్ల పాటు, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు, తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు వీటిలో ఏది ముందయితే అప్పటివరకు కొనసాగుతారని అధికారిక ఆదేశాలు చెబు తున్నాయి.
→ కాగా.. 2022 అక్టోబరు నుంచి సీసీఐకు పూర్తి స్థాయి చైర్పర్సన్ ఎవరూ లేరు.
→ సీసీఐ మెంబర్ సంగీతా వర్మ తాత్కాలిక చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
→ ప్రస్తుతం రవ్ నీత్ కౌర్.. పంజాబ్ ప్రభుత్వంలో కోఆపరేషన్ విభాగానికి ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

మట్టి నాణ్యతను పరీక్షించే పరికరం

→ కృత్రిమ మేధ పరి జ్ఞానంతో మట్టి నాణ్యతను పరీక్షించే పరికరం భూపరీక్షలను తీసుకొచ్చినట్లు ఏరీస్ ఆగ్రో వెల్లడించింది.
→ ఐఐటీ ఖరగ్ పూర్ బిజినెస్ ఇంక్యుబే షన్ సహకారంతో రూపొందించిన ఈ పరిక రాన్ని సంస్థ చైర్మన్, ఎండీ రాహుల్ మిర్చందానీ హైదరాబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.
→ 250 గ్రాముల బరువుతో ఉండే ఈ పరికరం ద్వారా ఎలాంటి రసాయనాల అవసరం లేకుండానే కేవలం రెండు నిమిషాల్లోనే మట్టి నాణ్య తను తెలుసుకోవచ్చని వివరించారు.
→ మొబైల్ ఫోనులో ఉన్న యాప్ తో భూపరీక్షక్ అనుసంధానమై ఉంటుందని తెలిపారు.
→ కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ తదితర సాంకేతికతలను ఇది ఉపయోగిస్తుందని పేర్కొ న్నారు.
→ పంటలకు అవసరమైన పోషకాలను అందించి, మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
→ దీంతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులనూ ఏరీస్ ఆగ్రో తెలుగు రాష్ట్రాల విపణిలోకి విడుదల చేసింది.

సంచార్ సాధీ పోర్టల్ పై మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయొచ్చు

→దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సంచార్ సాధీ పోర్టల్ పై ప్రజలు బ్లాక్ చేయ డంతో పాటు ట్రాక్ చేసుకోవచ్చని టెలికాం విభాగం (డాట్) వెల్లడించింది. మంగళవారం ఈ పోర్టల్ను డాట్ ప్రారంభిం చింది.
→ వాడిన మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేయకముందే ఆ ఫోన్ వివరాలను ఈ పోర్టల్లో తనిఖీ చేసుకునే సదుపాయం ఉందని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
→ 'మొదటి విడత సంచార్ సాధీ పోర్టల్ను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)గా రూపొందించాం.
→ ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఈ పోర్టల్ను సందర్శించొచ్చు. కొంత ధ్రువీకరణ తనిఖీల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించే సదుపాయం ఉంటుంది.
→ అనంతరం మీ ఫోన్లను బ్లాక్ చేయొచ్చు' అని వైష్ణవ్ తెలిపారు.
→ వ్యక్తులు ఏ మొబైల్ నంబరుతో అయినా మోసపూరిత కార్యకలాపా లకు పాల్పడితే, ఆ సేవలను నిలిపివేయడానికి మెటాకు చెందిన వాట్సాప్ అంగీకరించినట్లు వైష్ణవ్ స్పష్టం చేశారు.
→వాట్సాప్ కాల్స్ ద్వారా మోసాలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు.
→అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు సైతం ఇందుకు సహకరిస్తున్నాయన్నారు.
→మోసాలు చేసినందుకు ఇప్పటివరకు 36 లక్షల మొబైల్ కనెక్షన్లను నిలిపివేశామని, దీంతో వాటి వాట్సాప్ ఖాతాలు కూడా ఆగిపోయినట్లు వెల్లడించారు.

చక్కెర ప్రత్యామ్నాయాలు వాడొద్దు: డబ్ల్యూహెచ్

→బరువు తగ్గడం కోసం చక్కెర లేని తీపి పదార్థాలు (నాన్ షుగర్ స్వీట్నర్-ఎన్ఎస్ ఎస్) వాడకాన్ని నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) స్పష్టంచే సింది.
→పిల్లలు, పెద్దల్లో కొవ్వును తగ్గించే విష యంలో ఈ పదార్థాలతో ఎలాంటి దీర్ఘకాల ప్రయోజనం ఉండదని పరిశోధనల్లో వెల్లడై నట్లు తెలిపింది.
→పైగా వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల దుష్ప్రభావాలు తలెత్తవచ్చని పేర్కొంది.
→టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, అకాల మరణం ముప్పును అవి పెంచొచ్చని హెచ్చరించింది.
→సహజసిద్ధ చక్కెర్లు కలిగిన పండ్లు తదితరాలను తీసుకో వాలని సూచించింది.
→లేదా తీపి పదార్థాలు లేని ఆహారం, పానీయాలను ఎంచుకోవడం మంచిదని పేర్కొంది.
→ఇప్పటికే మధుమే హంతో బాధపడుతున్నవారికి మినహా మిగతా వారికి ఈ సిఫార్సు వర్తిస్తుందని తెలిపింది.

నవజాత శిశు సంరక్షణ లక్ష్యసాధనకు చేరువలో భారత్

→నవజాత శిశు మరణాలను తగ్గించడానికి సమర్ధ చర్యలు తీసుకున్న భారతదేశం ఈ విషయంలో ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని 2030కల్లా సాధిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్)కు చెందిన డాక్టర్ అన్షు బెనర్జీ తెలిపారు.
→ఆయన మే 8-11 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగిన అంతర్జాతీయ మాతా, నవజాత శిశు ఆరోగ్య సదస్సులో ప్రసంగించారు.
→భారత్ లో ఏర్పాటు చేసిన 1,000 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ప్రతి జిల్లాలో నవజాత శిశువులకు, నెలలు నిండకమునుపే జన్మించిన చిన్నారులకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి.
→వారికి అస్వస్థత కలిగితే వెంటనే చికిత్స అందిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నవజాత శిశు ఆరోగ్య స్థిరీకరణ యూనిట్లను నెలకొల్పారు.
→శిశు జననం తర్వాత ఆరేడుసార్లు ఆశా వర్కర్లు నేరుగా පුයි ఇళ్లకు వెళ్లి మాతాశిశు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.
→తల్లి పాలు శిశువుకు శ్రీరామ రక్ష అనీ, దీన్ని ప్రోత్సహించడా నికీ, తల్లీబిడ్డల మధ్య ఆత్మీయ స్పర్శను పెంచడానికీ వచ్చేవారం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కంగారూ. మదర్ కేర్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.
→ముఖ్యంగా నెలలు నిండక ముందే పుట్టిన శిశువుల సంరక్షణకు తోడ్పడుతుంది.
→పట్టణాల విస్త రణ వల్ల అనేక దేశాల్లో బాలలు పోషకాహార లోపానికీ, స్థూలకాయానికీ గురవుతున్నారు.
→ఈ రెండు సమస్యల పరిష్కారంపై ఆరోగ్య కార్యక్రమాలు, కార్యక ర్తలు దృష్టి కేంద్రీకరించాలని బెనర్జీ సూచించారు.
→శిశు వులు ఎదుగుదలకు తల్లి పాలు అత్యంత అవసరం.
→కొవ్వు, చక్కెర లేని పౌష్టికాహారాన్ని అందించడమూ సమస్యకు పరిష్కారమవుతుంది.
→కేరళలో ప్రతి లక్ష జననాలకు మాతా మరణాల రేటును 19కి తగ్గించిందనీ, మరికొన్ని రాష్ట్రాలు కూడా లక్ష్యాన్ని అందుకుంటున్నాయని బెనర్జీ తెలిపారు.
→భారత్ సుమన్ కార్యక్రమం కింద ప్రతి తల్లికి, నవజాత శిశువుకు ఉచితంగా మేలైన ఆరోగ్య సేవలు అంది స్తోంది.
→కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్య కార్యక్రమం కింద ప్రసవ గదులు, శస్త్రచికిత్స గదులను విస్తరిస్తోంది.
→గర్భి ణులు, బాలింతలు, శిశువుల సంరక్షణలో డిజిటల్ సాంకే తికతలను ఉపయోగిస్తోందని బెనర్జీ వివరించారు.

జీ-7 సమావేశాలకు మోదీ

→ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ నుంచి 24 వరకు 3 దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 19వ తేదీన జపాన్ కు వెళ్తారు. → 21వ తేదీ వరకూ హిరోషిమాలో జరిగే జీ-7 సమావేశాల్లో పాల్గొంటారు.
→ ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర కీలక దేశాధినేతలు పాల్గొంటున్నారు.
→ శాంతి, స్థిరత్వం, సమగ్రత, ఆహారం, ఇంధనం, భద్రత వంటి అంశాలపై వారు చర్చిస్తారు.
→ జపాన్ నుంచి పపువా న్యూగినియాలోని పోర్టు మోర్సిబై వెళ్లి అక్కడ 22వ తేదీన జరిగే ఇండియా, పసిఫిక్ ద్వీపాల సహకార ఫోరం సమావేశంలో పాల్గొంటారు.
→ 22 నుంచి 24 వరకూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే క్వాడ్ సమ్మిట్కు మోదీ హాజరవుతారు.
→ ఈ సమ్మి ట్ కు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అధ్యక్షత వహిస్తారు. జో బైడెన్, జపాన్ ప్రధాని కిషిద పాల్గొంటారు.

72 రైల్వేస్టేషన్లలో 'వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్'

→ స్థానిక, స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన 'వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్'కు మంచి స్పందన వస్తోందని, జోన్ పరిధిలో 72 రైల్వేస్టేషన్లలో 77 స్టాళ్లు(విక్రయ కేంద్రాలు) ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
→ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్ర దేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఉత్పత్తులకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.
→ తెలంగాణ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వరం గల్, నిజామాబాద్, గద్వాల సహా 26 రైల్వేస్టేషన్లలో 29 స్టాళ్లు ఉన్నాయని జోన్ సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
→ వీటిల్లో ప్రత్యేకంగా నారాయణ పేట, గద్వాల, పోచంపల్లి చీరలు, వస్త్రాల కోసం ఆరు ఔట్లెట్లు కేటాయిం చినట్లు తెలిపారు.
→ ఏడు రైల్వేస్టేషన్లలో చిరుధాన్యాల ఆహార ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే జీఎం అరుణ్ కుమార్ తెలిపారు.
→ స్థానిక కళాకారులు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించుకోవడానికి వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్ మంచి అవకాశమని పేర్కొన్నారు.

గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు ఆంధ్రప్రదేశ్లో 2 తెలంగాణలో 4

→ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
→ దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది.
→ ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్(వైకాపా), తెలుగుదేశం పార్టీలున్నాయి.
→ తెలంగాణలో ఎంఐఎం, భారాసతోపాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది.
→ వీటికి ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేయనున్నట్లు పేర్కొంది.
→ ఈ నాలుగు పార్టీల చిరునామాలూ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. వీటికి అతీ తంగా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీసింబల్స్ ను విడుదల చేసింది.
→ అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ (గ్లాస్ టంబ్లర్) ఉంది.
→ దీన్ని ఇదివరకే జనసేనకు కేటాయించినప్పటికీ తాజా ఉత్తర్వుల్లో మాత్రం దాన్ని ఫ్రీసింబల్గానే ఉంచింది.
→ ఆటోరిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మాత్రం ఏపీ, తెలంగాణల్లో ఇవ్వడం లేదని పేర్కొంది.
→ ఇవి కారు గుర్తును పోలి ఉండటంతో వాటిని తెలుగు రాష్ట్రాల జాబితానుంచి మినహాయించింది.
→ జాతీయ పార్టీల జాబితాలో ఆప్, బీఎస్పీ, భాజపా, సీపీఐ(ఎం), కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లకు తాగునీరు

→ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం ఇళ్లకు కుళాయి ద్వారా నీటి సౌకర్యం కల్పించిందని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.
→ ఇప్పటివరకు తెలంగాణతో పాటు గోవా, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హివేలీ దమన్ దీవ్, హరియాణా, గుజరాత్, పుదుచ్చేరి, పంజాబ్ లు గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లకు కొళాయినీటి సౌకర్యం కల్పించి తొలి 8 స్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది.
→ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్జీ జీవన్ మిషన్ పథకం అమలులో ఏపీ 18వ స్థానంలో నిలి చినట్లు వెల్లడించింది.
→ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 69.74% ఇళ్లకు కుళాయినీటి సౌకర్యం 3 కల్పించినట్లు పేర్కొంది.
→ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి సగటున 61.71 % ఇళ్లకు ఈ పథకం చేరుకుందని తెలిపింది.

ఉపరాష్ట్రపతిపై చర్యలకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ

→న్యాయ వ్యవస్థ, కొలీజియంలపై వ్యతి వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లను బాధ్యతల నుంచి తప్పించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచా రించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
→ఇప్ప టికే ఈ పిటిషన్ను బొంబాయి హైకోర్టు కొట్టే యగా పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.
→హైకోర్టు తీర్పును బొంబాయి న్యాయవా దుల సంఘం (బీఎల్) సుప్రీంలో సవాలు చేసింది.
→ఈ పిటిషన్ జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లాల ధర్మాసనం ఎదుటకు రాగా.. 'ఏమిటిదంతా? మీరు ఇక్కడకు ఎందు కొచ్చారు? హైకోర్టు నిర్ణయం సరైనదేనని మేము భావిస్తున్నాం.
→అనుచిత వ్యాఖ్యల విష యంలో సుప్రీం కోర్టు విశాల దృక్పథంతో వ్యవ హరిస్తుంది' అని స్పష్టం చేసింది.
→బీఎల్ఎ పిటి షన్ 226వ రాజ్యాంగ అధికరణ కింద విచారిం చాల్సినది కాదని ఫిబ్రవరి 9న బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది.

ఐరోపాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

→ఐరోపాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బ్రిటన్ చేరుకున్నారు.
→ ఆ దేశ ప్రధాని రిషి సునా క్తో సమావేశమయ్యారు. ఆయుధాలు.. ముఖ్యంగా ఫైటర్ యుద్ధ విమానాలు తక్షణమే కావాలని జెలెన్స్కీ కోరారు.
→ సునాక్ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని, యుద్ధం మధ్యలో ఆ దేశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
→ మందుగుండు, ట్యాంకులు, సైనిక వాహనాలతో బ్రిటన్ తమకు నిరంతర సాయం అంది స్తూనే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు.
→ త్వరలో వందల సంఖ్యలో గగనతల రక్షణ వ్యవస్థలు, సుదీర్ఘ శ్రేణి డ్రోన్లు (200 కిలోమీటర్ల దూరం) అందివ్వనున్నట్లు సునాక్ ప్రకటించారు.
→ ఐరోపా పర్యటనలో భాగంగా జెలెన్ స్కీ ఇటలీ ప్రధానిని, పోప్ ప్రాన్సిస్ ను కలిశారు.

'గ్రాండ్ మాస్టర్' ప్రణీత్ కు కేసీఆర్ అభినందన

→భారత్ నుంచి 82వ చెస్ గ్రాండ్మాస్టర్ గా నిలిచిన తెలంగాణ కుర్రాడు ఉప్పల ప్రణీతన్ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు.
→ప్రణీత్ తన తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మిలతో కలిసి సోమవారం సచివాలయంలో సీఎంను కలిశాడు.
→ప్రణీత్ ప్రద ర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్... అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
→భవిష్యత్తులో ప్రణీత్ ఇతర టోర్నీల కోసం సన్నద్ధమయ్యేందుకు, మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ. 2 కోట్ల 50 లక్షలను తెలంగాణ సీఎం ప్రకటించారు.
→రాష్ట్రం తరఫున గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన ఐదో ఆటగాడిగా ప్రణీత్ గుర్తింపు పొందాడు. మరోవైపు మహిళా క్యాండిడేట్ మాస్టర్ (డబ్ల్యూసీఎం) హోదా పొందిన చెస్ ప్లేయర్ వీర్లపల్లి నందినికి రూ. 50 లక్షల ప్రోత్సా హకాన్ని సీఎం ప్రకటించారు.
→ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

ఐరాస వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్

→ఐక్యరాజ్యసమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజే షన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) డైరెక్టర్ జనర అమెరికాకు చెందిన యామీ పోప్ ఎంపికయ్యారు.
→ఈ సంస్థకు డైరెక్టర్ జనర ల్గా గా ఓ మహిళ ఎంపిక వ్వడం ఇదే తొలిసారి.
→ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న యామీ ఎన్నికలో పోర్చుగీసు ప్రభుత్వ మాజీ మంత్రి ఆంటోనియోను ఓడించారు.

సాఫ్ట్ సిగ్నల్'కు వీడ్కోలు

→క్రికెట్లో క్యాచ్ ఔట్ల విషయంలో వివాదాస్పదంగా మారిన 'సాఫ్ట్ సిగ్నల్కు ఐసీసీ మంగళం పాడింది.
→క్రికెట్ నుంచి ఈ నిబంధనను తొలగించింది.
→ఇన్ని రోజులు బంతి ఆటగాళ్లు సరిగ్గా అందుకున్నారా? లేదా నేలకు తాకిందా? అనే అనుమానం ఉన్న క్యాచ్ల విషయంలో మైదానంలోని అంపైర్లు ఔట్ లేదా నాటౌట్ను 'సాఫ్ట్ సిగ్నల్' చూపిస్తూ.. టీవీ అంపైర్ను తుది నిర్ణయం తీసుకోవాలని అడిగేవాళ్లు. రీప్లేలో పరిశీలించిన తర్వాత స్పష్టత లేకుంటే, గందరగోళ పరిస్థితుల్లో మైదానంలోని అంపైర్ తీసుకున్న 'సాఫ్ట్ సిగ్నల్ను సమర్థిస్తూ టీవీ అంపైర్ నిర్ణయం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
→నాటౌట్ కనిపించినప్పటికీ మైదానంలోని అంపైర్ 'సాఫ్ట్ సిగ్నల్ ఔట్గా ఇవ్వడం, టీవీ అంపైర్ దీన్ని సమర్థించడం చాలా సార్లు వివాదాస్పదమైంది.
→ఇకపై ఇలాంటి సాఫ్ట్ సిగ్నల్ ఉండదు. రనౌట్ మాదిరే నేరుగా టీవీ అంపైర్ను క్యాచౌట్ నిర్ణయం తీసుకోమని అడగొచ్చు.
→సౌరభ్ గంగూలీ సారథ్యంలోని పురుషుల క్రికెట్ కమిటీతో పాటు మహిళల క్రికెట్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఈసీ ఆమోదం తెలపడంతో ఐసీసీ ఈ మార్పు చేసింది.
→"సాఫ్ట్ సిగ్నల్ను తొలగించడమే ప్రధాన మార్పు. టీవీ అంపైర్ను నిర్ణయాలు కోరేటప్పుడు ఇకపై మైదానంలోని అంపైర్ల సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
→నేరుగానే టీవీ అంపైర్ను సంప్రదించొచ్చు" అని ఐసీసీ ప్రకటించింది. "కొన్నేళ్లుగా క్రికెట్ కమిటీ సమావేశాల్లో సాఫ్ట్ సిగ్నల్ గురించి చర్చించాం.
→ఈ విధానం అనవసరమని కమిటీ అభిప్రాయపడింది. కొన్ని సార్లు రిప్లేలో స్పష్టత లేకపో వడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి" అని గంగూలీ తెలిపాడు.
→మరోవైపు ఫాస్ట్, బౌలర్లను ఎదుర్కొనే బ్యాటర్లు, వికెట్లకు సమీపంలో ఉండే వికెట్ కీపర్, బ్యాటర్కు అత్యంత సమీపంలో ఉండే ఫీల్డర్లు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఐసీసీ సూచించింది.
→అంతే కాకుండా ఫ్రీ హిట్ బంతి స్టంప్స్న తాకి వెళ్తే అప్పుడు పరుగులు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఈ మార్పులు వచ్చే నెల 1న ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య ఆరంభమయ్యే టెస్టుతో అమల్లోకి వస్తాయి

జస్టిస్ ఎం.ఆర్.షా పదవీ విరమణ

→జస్టిస్ ఎం.ఆర్. షాను సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ 'టైగర్ షా'గా అభివర్ణించారు.
→జస్టిస్ ముకేశ్ కుమార్ రసిక్బాయ్ షా.. 1958 మే 16న జన్మించారు.
→2004 మార్చి 7న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005 జూన్ 22న శాశ్వత న్యాయమూర్తిగా, 2018 ఆగస్టు 12న పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
→2018 నవంబరు 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
→జస్టిస్ ఎం. ఆర్. షా పదవీ విరమణతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు తగ్గింది.

నిజాంపట్నానికి సీఎం మత్స్యకార భరోసా నిధుల పంపిణీ

→బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాం పట్నంలో సీఎం జగన్ పర్యటించనున్నారు.
→వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల్ని ఆయన పంపిణీ చేస్తారని అధికారులు తెలి పారు.
→రాష్ట్రంలో మత్స్యకార భరోసా పథకంలో భాగంగా 1,22,859 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తారు.
→సీఎం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 9.30కు నిజాంపట్నం చేరుకుంటారు.
→9.55కు సభావేదిక వద్దకు చేరుకుని, మత్స్యశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. లబ్ధిదారులతో మాట్లా డతారు. అనంతరం ప్రసంగిస్తారు.
→11.35కు బటన్ నొక్కి మత్స్యకార భరోసా నిధుల్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

అంటార్కిటికాను వణికిస్తున్న చిన్న కీటకం

→ అంటార్కిటికాలోని సిగ్నీ ద్వీపం సగం మంచుతో నిండి ఉంటుంది. కొన్నేళ్ల కిందట ఆ ద్వీపానికి ఓ కీటకం వచ్చింది.
→ అది ఏళ్ల తరబడి తిష్ఠ వేయడంతో దాని సంతతి బాగా అభివృద్ధి చెందింది. ఆ కీటకమే ఇప్పుడు ఓ సమస్యలా మారింది.

ఏమిటీ కీటకం? :-
→ఆ కీటకం పేరు ఎరెట్ స్టేరా మర్పీఐ. ఇది ద్వీపంలోని నేల స్వభావాన్ని మారుస్తోందని తాజాగా బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే తేల్చింది.
→ఎరెట్ స్టేరా మర్పీఐ మృత సేంద్రియ పదార్థాలను ఆరగిస్తుంది. అలా చేయడం వల్ల మొక్కలు వేగంగా కుళ్లిపోతు న్నాయి.
→తద్వారా నేలలో నైట్రేట్ స్థాయి మూడు నుంచి ఐదు రెట్లు పెరుగుతోంది. ఫలితంగా కొన్ని మొక్క జాతులు ప్రమాదంలో పడుతున్నాయి.
→భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీటిలో నైట్రేట్ అధికంగా కలవడం వల్ల ఆల్గో కూడా పెరుగు తోంది.
→దాంతో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాలకు హాని కలుగుతోంది. వేగంగా పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
→ఈ కీటక సంచారం లేని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి అసాధారణ మార్పులు లేవని పరిశోధనలో వెల్లడైంది.

ఈ కీటకం మర్ఫీఐ.. దక్షిణ జార్జియాకు చెందినది.
→ 1960లలో జరిపిన ఓ వృక్షశాస్త్ర సంబంధ నైట్రేట్ శాతం పెరుగుదల పరిశోధన కారణంగా అంటార్కిటికా ద్వీపంలో అడుగు పెట్టింది.
→ దాని జాతి విస్తరణ 1980 నాటికి స్పష్టంగా కనిపిం చింది.
→అదే ఇవాళ సిగ్నీ ద్వీపంలో నైట్రేట్ పెరుగు దలకు కారణమైంది.
→గతంలో పెద్ద జంతువులైన పెంగ్విన్లు, సీల్స్ సంచరించే ప్రాంతాల్లో మాత్రమే నైట్రేట్ పెరుగుదల నమోదయ్యేదట.
→కానీ, మర్ఫీఐ సంతతి గణనీయంగా పెరగడం వల్ల నైట్రేట్ శాతం కూడా అధికమవుతున్నట్లు సమాచారం.

మానవుల వల్లే వ్యాప్తి..!:-
→ఇంత ప్రమాదకరమైన కీటకం ఈ ద్వీపంలో ఇంత విస్తృతంగా ఎలా ఉంటుందనే విషయంపై నిపుణులు కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు.
→ పరిశోధకులు, పర్యాటకులు ఈ జాతి కీటకాలపై నడిచి ఉంటారని అనుమానిస్తున్నారు.
→ అవి వారి అరికాళ్లకు లేదా బూట్లకు అతుక్కొని ద్వీపం మొత్తం వ్యాపించి ఉంటా యని చెబుతున్నారు.
→ మరో కొత్త భయం ఏమి టంటే.. ఈ కీటకాలు నీటిలోనూ మనుగడ సాగించ గలవు.
→ దాంతో అవి ఇతర ద్వీపాలకు ప్రయాణిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది.
→ అంటా ర్కిటికాలో చాలా తక్కువ జీవజాతులు నివసిస్తు న్నాయి. ప్రపంచ పర్యావరణ సమతౌల్యతను కాపాడ టంలో ఈ ఖండానికి ప్రత్యేక స్థానం ఉంది.
→ మర్పీఐ తరహాలో మరిన్ని జీవజాతులు ప్రవేశిస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు

→ అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు.
→ స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్ లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది.
→ డెన్మార్క్క చెం దిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్ కు విదేశీయులు క్యూ కడ తారు, అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొం దుతూ.. సురక్షితమైన బీచ్ల జాబితాలో భారత్కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతు న్నాయి.
→వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది.
→ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు.
→ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్ కు విశేష ఆదరణ తోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు.
→ ఈ సర్టిఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరి శుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
→ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యా దేశంలో బీచ్ గురించి శోధించిన ప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు.
→బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్లు ఉంటే.. ఆ ప్రాం తాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటి స్తారు.
→బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీన్ని అభివృ ద్ధి చేయాలి.
→మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి.
→అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు.
→సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి.
→నీటిలో బ్యాక్టీరియా ఉండకూ దు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి.
→ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఎస్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీ లించి సంతృప్తి చెందితే సర్టిఫికెట్ ఇస్తారు.

మన దేశంలో 2018లో తొలిసారిగా:-
→భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టిఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని 'చంద్రబాగ్' బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది.
→ఆ తర్వాత ఇం డియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
→ఈ పనిని పర్యావ రణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇం టిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్ కు అప్పగించింది.
→ తొలి సారిగా భారత్కు చెందిన 13 బీచ్ లు ఇం దుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది.


ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్లు:-
→మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్ లు ఉండగా.. ఇం దులో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క తీరంలో నీలి జెం డా రెపరెపలాడుతోంది.
→2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఎస్ఈఈ రుషికొం డకు బ్లూ ఫ్లాగ్ను రెన్యువల్ చేస్తోంది.
→ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్లోని శివ రాజ్ పూర్, డయ్యూలోని ఘోమ్లా, కర్ణాటకలోని | కసర్ కోడ్, పడుబిద్రి బీచ్లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికాయ్ తుండి, కర్మత్ బీచ్ లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కించుకున్నాయి.

బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు?
→1985లో డెన్మార్క్ ప్రారంభించిన 'ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్'(ఎఫ్ఎస్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లను అంది స్తోంది.
→ ప్రపంచంలో తొలిసారి ఈ సర్టిఫికెట్ పొం దిన దేశం స్పెయిన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అం దిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ను సొంతం చేసుకున్నాయి.
→ స్పెయిన్లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్లు ఈ సర్టిఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రాన్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి.
→ మొత్తం 50 దేశాల్లో 4,831 కు ఈ సర్టిఫికెట్ లభించింది.

భారత్ గౌరవ్ రైలుకు విశేష స్పందన

→ భారతదేశంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో గల ముఖ్యమైన చారి త్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదే శాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సందర్శించేందుకు వీలుగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడుపు తున్న భారత్ గౌరవ్ యాత్ర రైలుకు విజయవాడ పరిసర ప్రాంతాల సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోం దని విజయవాడ డివిజన్ అధికారులు తెలిపారు.
→ మొదటి భారత్ గౌరవ్ రైలు మార్చి 18న సికింద్రాబాద్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.
→ తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సందర్శకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు 4వ పర్యాటక రైలును నడిపారు.
→ 8 రాత్రులు, 9 పగలు సాగే ఈ ప్రయాణంలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకు నేందుకు ఈ రైలు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది.
→ ఈ ప్రయాణ సమయంలో అల్పాహారం, భోజనం, వసతి, పర్యాటక ప్రదేశాలను దర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా, టూర్ గైడ్, ఎస్కార్ట్స్, ప్రయాణ బీమా తదితర ఏర్పాట్లు చేశారు.
→ ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డీఆర్ఎమ్ షివేంద్రమోహన్ మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యక్షేత్రాలను, చారిత్రక ప్రదేశా లను సందర్శించే యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.
→ ప్రయాణికుల డిమాండ్ మేరకు మరిన్ని రైళ్లను నడపనున్నట్టు తెలిపారు.

అమెరికాలో "టైటిల్ 42" ఎత్తివేత

→ అమెరికాలో ఆశ్రయం కోరేవారిపై 'టైటిల్ 42 పేరుతో ఇప్పటివరకు కొనసాగిన ఆంక్షలు ముగిశాయి.
→ దీని స్థానంలో కొత్త శరణార్ధి విధానాన్ని అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
→ మెక్సికోతోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు శరణార్థుల తాకిడి గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
→ వీటిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిరం తరం చర్యలు చేపడుతూనే ఉంది.
→ ఈ క్రమంలో కొవిడ్-19 విజృంభణ సమ యంలో శరణార్థులపై 'టైటిల్ 42' పేరుతో అమెరికా విధించిన ఆంక్షల గడువు మే 11తో ముగిసింది.
→ దీని స్థానంలో బైడెన్ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంతో అమెరికా సరిహద్దుకు భారీసంఖ్యలో వలసదారులు తరలివస్తున్నారు.
→ కరోనా వేళ అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో అమెరికా ప్రభుత్వం 'టైటిల్ 42' నిబంధనను తీసుకొ చ్చింది.
→2020 మార్చి నెలలో ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఈ విధానం ప్రకారం.. అమెరికా - మెక్సికో సరిహద్దుకు వచ్చే వలసదారులను తిరిగి వెనక్కి పంపించడంతోపాటు శరణు కోరడాన్ని తిరస్కరించ వచ్చు. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుమారు 28 లక్షల మంది వలసదారులను తిరస్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, శరణార్ధులను నిలువరించినప్పటికీ చట్టపరమైన చర్యలు లేకపోవడం. వచ్చినవారే మళ్లీ మళ్లీ వచ్చేందుకు కారణమయ్యింది.
→టైటిల్ 42 స్థానంలో కొత్త నిబంధ నలు అమలు చేయనుండటంతో ఆమె రికా సరిహద్దుకు శరణార్ధుల తాకిడి పెరి గింది.
→వలసదారులతో సరిహద్దు ప్రాంతంలోని శిబిరాలు కిక్కిరిసిపోతు న్నాయి.
→ మార్చి నెలతో పోలిస్తే ఈ వారం ఇప్పటికే వేల మంది సరిహద్దుకు చేరుకున్నారు. వీరి పరిశీలనకు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
→ అందరూ వెనక్కి వెళ్లి పోవాలని అమెరికా అధికారులు మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు.

కొత్త నిబంధనలు మరింత కఠినం:-
→బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా అమెరికాకు వచ్చి శరణు కోర వచ్చు.
→ఇలా వచ్చేవారంతా ముందస్తుగా ఆన్లైనులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
→వివిధ దేశాల నుంచి వచ్చేవారిని అమెరికా మెక్సికో సరిహద్దులో పరీక్షిస్తారు.
→జాతి, మతం తదితర కారణాలతో స్వదే శంలో వేధింపుల భయం ఉందని చెప్పి ఆశ్రయం కోరే వారిని సరిహద్దులోనే ఇంటర్వ్యూ చేసి వారి అర్హతను తేల్చుతారు.
→రోవైపు వెనెజువెలా, హైతీ, నికరాగువా క్యూబా దేశాలకు చెందినవారిని నెలకు 30 వేల మందికి అనుమతి ఇస్తామని అమెరికా వెల్లడించింది.
→గ్వాటెమాలా, ఎల్ సాల్వెడార్, హోండూరస్ దేశాలకు చెందినవారినైతే లక్ష మందిని అనుమతిస్తామని తెలి. పింది.
→ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది.
→ వీటితోపాటు సీబీపీ వన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇతర వలసదారు లనూ అనుమతిస్తారు.
→ యాప్ లో ప్రస్తుతం రోజుకు 750 మందిని అనుమతిస్తున్నారు.

బహుభార్యత్వం నిషేధం దిశగా అస్సాం

→ బహుభార్యత్వంపై నిషేధం దిశగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
→ ఇందుకోసం నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పరిచింది.
→ బహుభార్య త్వాన్ని నిషేధించే శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనస భకు ఉందా లేదా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించ నుంది.
→ ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
→ అధికరణం 25లోని ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ఆదేశిక సూత్రాల రాజ్య విధానంతో పాటు.
→ ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ చట్టం- 1937 నిబంధనలనూ ఈ కమిటీ పరిశీలించనుంది.

ఉప రాష్ట్రపతి కొత్త నివాసానికి బుల్లెట్ ప్రూఫ్ కిటికీ వ్యవస్థ

→సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూత నంగా నిర్మిస్తున్న ఉపరాష్ట్రపతి నివాసాని(వీపీ ఎన్ క్లేవ్)కి బుల్లెట్ ప్రూఫ్ కిటికీ వ్యవస్థలను ఏర్పాటు చేయ నున్నారు.
→వీటితోపాటు ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు కోసం రూ.6.19 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
→ఈ పనులు చేసేందుకు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) టెండర్లు పిలిచింది.
→అందులో జీత్-జీత్ లేదా వెట్రోటెక్ - సెయింట్ గోబియన్ లేదా ఎఫీ గ్లాస్ ఉత్పత్తులనే వాడాలని నిబంధన విధించింది.
→అలాగే కలప ఫర్నీచర్ పని కూడా చేయాలని పేర్కొన్నారు. ఈ పనులన్నింటినీ మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు.
→ఎంపికైన కాంట్రాక్టర్ వినియోగించబోయే బుల్లెట్ ప్రూఫ్ విండో వ్యవస్థను గుజరాత్లోని గాంధీ నగర్లో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో పరీక్షిస్తారు.
→అనంతరం అది సీపీడబ్ల్యూడీ వద్దకు చేరుతుంది.

విశ్వంలో అతిపెద్ద విస్ఫోటం

→ విశ్వంలో అతిపెద్ద విస్ఫోటాన్ని కనిపెట్టామని, దాని కాంతి మూడేళ్ల నుంచి కనిపిస్తోందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
→ విశ్వం వయసు 600 కోట్ల సంవత్సరాలుగా ఉన్నప్పుడు సంభవించిన ఈ విస్పోటపు కాంతి కిరణాలు 2020 నుంచి మన వరకు చేరుతు న్నాయి.
→ భూమికి 800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ విస్ఫోటం జరిగింది.
→ ఈ బృహత్తర విస్ఫో టానికి శాస్త్రవేత్తలు ఏటీ 2021ఎల్ డబ్ల్యూఎక్స్ అని నామ కరణం చేశారు.
→ సూపర్ నోవా కానీ, పేలిపోతున్న నక్షత్రం కానీ వెదజల్లే కాంతికి 10 రెట్లు ఎక్కువ కాంతిని ఈ విస్ఫోటం విరజిమ్ముతోంది.
→ ఏదైనా తార కృష్ణబి లంలో పడిపోయినప్పుడు వచ్చే కాంతికి మూడు రెట్లు ఎక్కువ కాంతిని అది ప్రసరిస్తోంది.
→ సాధారణంగా సూపర్ నోవా వెలుగు కొన్ని నెలల్లోనే ముగిసిపోతుంది. కృష్ణబిలంలో తారపతనం కూడా కొన్ని నెలలే వెలుగు విరజిమ్ముతుంది.
→ కానీ ఏటీ 20 21ఎల్ డబ్ల్యూఎక్స్ అసా ధారణ రీతిలో మూడేళ్లుగా కాంతిని చిమ్ముతోంది.
→ సూర్యుడి కన్నా వెయ్యిరెట్లు ఎక్కువ విస్తీర్ణంలోని వాయు మేఘాన్ని ఏదైనా బృహత్తర కృష్ణ బిలం విచ్ఛిన్నం చేయ డమే ఈ మహా విస్ఫోటానికి కారణమని అంచనా.

కుల వివక్షను నిషేధించే బిల్లుకు కాలిఫోర్నియా సెనెట్ ఆమోదం

→ కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా సెనెట్ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది.
→ అమెరి కాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియానే కావడం గమనార్హం.
→ అఫ్గానిస్థాన్ సం తతికి చెందిన సెనేటర్ అయిషా వాహబ్ గత నెలలో ఈ బిల్లును (ఎస్బీ403) ప్రవేశపెట్టారు.
→ 34-1 ఓట్ల తేడాతో దానికి ఆమోద ముద్ర లభించింది.
→ ఇది గవ ర్నర్ ఆమోదం పొంది చట్ట రూపం దాల్చే ముందు ఇదే తరహా బిల్లును రాష్ట్ర ప్రతినిధుల సభలోనూ ప్రవే శపెడతారు.
→ కుల వివక్షకు గురవుతూ తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొనే వర్గాలకు ఈ చట్టం రక్షణనిస్తుంది.
→ సియాటిల్ నగరంలో కూడా కుల వివక్షను నిషేధిస్తూ ఈ ఏడాదే తీర్మానం ఆమోదించిన సంగతి గమనార్హం.

నానాటికీ ప్రమాదకరంగా తుపాన్లు

→ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుపాన్లు నానాటికీ తీవ్రమవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ చాలా ఎక్కువకాలం పాటు అవి కొనసాగు తున్నాయని వివరించారు.
→ వాతావరణ మార్పులే దీనికి కారణమని తెలిపారు.
→ ముఖ్యంగా ప్రపంచ సరాసరి ఉష్ణో గ్రతల పెరుగుదల ఎక్కువగా దోహదపడుతున్నట్లు వివ రించారు.
→ అరేబియా సముద్రంలో 1982 నుంచి 2019. మధ్య తుపాన్లు, పెను తుపాన్ల నిడివి, తీవ్రత, సంఖ్య పెరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
→ 2001-2019 మధ్య తుపాన్ల సంఖ్య 52 శాతం పెరిగినట్లు తెలిపారు. బంగా ళాఖాతంలో వాటి సంఖ్య 8 శాతం తగ్గిందన్నారు.
→ "నేడు తుపాన్లు చాలా ఎక్కువకాలం పాటు బలంగా ఉంటు న్నాయి. అంఫన్ తుపాను ఇందుకు ఉదాహరణ. అది తీరం దాటాక కూడా బలంగానే కొనసాగింది. ఫలితంగాపెను విధ్వంసం చోటుచేసుకుంది. సాగరాలు వేడిగా ఉండి, గాలుల్లో అనుకూలత కొనసాగినంతకాలం తుపాన్లు శక్తిమంతంగానే ఉంటాయి" అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ పేర్కొన్నారు.
→ ప్రస్తుతం మోచా తుపాను.. చాలా వేగంగా తీవ్ర రూపం దాల్చడాన్ని కూడా నిపుణులు ప్రస్తా విస్తున్నారు.
→ అది బంగ్లాదేశ్, పశ్చిమ మయన్మార్ తీరం దాటొచ్చని నిపుణులు చెబుతున్నారు.
→ దీనివల్ల ఆ రెండు దేశాల్లో పెను నష్టం తప్పదని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది.
→ బంగ్లాదేశ్లో పెను గాలులు, వరదలు, కొండచరియలు విరిగిపడటం మయన్మార్ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరుగుతుందని పేర్కొంది.
→ తుపాన్లకు దారితీసే పరిస్థితుల్లో మార్పు లేదని, వాతావరణ స్థితిగతులే మారుతున్నాయని శాస్త్రవే త్తలు వివరించారు.
→ దీనికి కారణం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలకు తోడు మహాసముద్రంలో వేడి జలాల వాటా కూడా పెరుగుతోందన్నారు.

రాజస్థాన్ లో లిథియం నిక్షేపాలు

→రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు వెల్లడించారు.

భారత వృద్ధి రేటు 6 శాతం

→ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీ యంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్ కు స్థిరత్వంతో కూడిన 'బీబీబీ' సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది.
→ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధిరేటు

ప్రాచీ దహబల్ దేబ్

→మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ కేకులతో అద్భుతమైన ఆకృతులు రూ పొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుం టుంది.
→ తాజాగా రాయల్ ఐసింగ్ విధానంలో 200 కిలోల భారతీయ రాజభవనం నమూనా కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డు బద్దలు

→ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు.
→హవానా (క్యూబా) లో జరుగుతు న్న ఈవెంట్లో ప్రవీణ్ 17.37 మీటర్లతో అగ్రస్థా. నంలో నిలిచాడు.
→రెంజిత్ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు (17.30 మీ., 2016)ను అతడు బద్దలు కొట్టాడు.

అన్ని భాషల్లోనూ ఆకాశవాణే

→రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
→ఇంగ్లీష్ ప్రసారాల సమయంలోనూ ఈజ్ ఆల్ ఇండియా రేడియో' అనికాకుండా 'దిస్ ఈజ్ ఆకా శవాణి' అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.

కీర్తిచక్ర శౌర్యచక్ర అవార్డులు

→విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినం దుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండ ర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డులు, 29 శౌర్యచక్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అందజేశారు.

నీరజ్ చోప్రా

→రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ చరిత్ర సృష్టించి, నిరుడు డైమండ్ లీగ్ ఫైనల్లో నూ విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ కొత్త సీజన్లో తొలి అంచె జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరి మరోసారి విజేతగా నిలిచాడు.

భారత హాకీ స్పాన్సర్ గా ఒడిశా

→భారత పురుషులు. హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్ను 2033 వరకు పొడిగించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణ యించింది.
→ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది.
→ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్) స్పాన్సర్ గా ఉంటోంది.

లారెస్ గ్లోబల్ అవార్డులు

→అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ, జమైకా స్ప్రింటర్ షెల్లిఆన్ ఫ్రేజర్ ప్ రైస్ ఆయా విభాగాల్లో లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నారు.

ప్రపంచ కప్ షూటింగ్

→ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్ లో భారత్ కు తొలి స్వర్ణ పతకం లభించింది.
→10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో సరబోత్ సింగ్-దివ్య థడిగోల్ సుబ్బరాజు (భార త్) ద్వయం విజేతగా నిలిచింది.

'ఓడీఎఫ్ ప్లస్' గ్రామాల్లో టాప్

→స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఓడీఎ ఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
→ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది.

ప్రధాన సలహాదారుగా సోమేశ్ కుమార్

→మాజీ సీఎస్ సోమేశ్కుమార్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు.
→మూడేళ్ల పాటు క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

'ఐఎన్ఎస్ మగర్' వీడ్కోలు

→నీటిలోనే కాదు.. నేలపైనా దాడిచేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) యుద్ధనౌక 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ మే 7వ తేదీన తన విధులకు స్వస్తి పలికింది.
→చార్లెస్ డికెన్స్ రచించిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్ రచించిన 'డీమన్ కా పర్ ఫీల్డ్' నవలతో పాటు 1920 నాటి న్యూ యార్క్ నగరంలో మోసాల గురించి హెర్నన్ డియాజ్ రచించిన 'ది ట్రస్ట్' నవలకు పులిట్జర్ బహుమతులు ప్రకటించారు.

అరబ్ లీగ్ లోకి సిరియా

→అరబ్ లీగ్ లోకి సిరియా అధికారికం గా ఎంట్రీ ఇచ్చింది.
→ లీగ్ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
→ 2011లో సిరియా లో జరిగిన ఆందోళ నలతో సభ్యత్వం రద్దైంది.

ముగ్గురి డీఎన్ఏతో శిశువు

→బ్రిటన్ శాస్త్రవేత్తల ప్రయోగంతో ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్ఏలతో జన్మించింది.
→ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రులదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది, వినాశకరమైన మైటోకాం డ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా ఈ సాంకేతికత ఉయోగిస్తున్నారు.

ఇన్నోవేషన్ సర్వేలో తెలంగాణ

→నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే - 2021 - 22ని ఏప్రిల్ 30న విడు దల చేశారు.
→నవకల్పనలు అమలు చేయ డంలో కర్ణాటక తరువాత తెలంగాణ, తమి ళనాడు, మహారాష్ట్ర, హర్యానా టాప్ ప్లేస్ లో ఉన్నాయి.
→కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ మొదటి స్థానాల్లో నిలిచాయి.
→ఈ సర్వేలో 6 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాల్లోని 8074 కంపెనీల అభిప్రాయా లను సేకరించారు.
→దేశంలోని ఎంఎస్ఎం ఈల్లో నవకల్పన (ఇన్నోవేషన్) విధానా లపై సర్వే నిర్వహించారు.

దేశంలో ఎగిరే జాతికి చెందిన రెండు సాలె పురుగులు

→దేశంలో ఎగిరే జాతికి చెందిన రెండు సాలె పురుగులను కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జర్ఎస్ఐ) మే 1న వెల్లడిం చింది.
→ ఇందులో ఫింటెల్లాద్రితియే అనే సాలెపురుగును కర్ణాటకలోని మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీలో కనుగొన్నారు.
→ ఫింటెల్లాప్లాట్నికి అనే సాలెపురుగును తమి ళనాడులోని సేలం జిల్లాలో గుర్తించారు.
→ జర్ఎస్ఐకి తొలి మహిళా డైరెక్టర్గా పని చేసిన ద్రితి బెనర్జీ, ప్రముఖ అరాక్నాలజిస్ట్ నార్మన్ ప్లాట్నిక్ పేర్లను ఈ కొత్త జాతులకు పెట్టారు.

అరోరా

→లఢక్ లోని పర్వత ప్రాంతంలో అరుదుగా కని పించే అరోరాను సరస్వతి పర్వత శ్రేణుల్లోని ఖగోళ అబ్జర్వేటరీ కెమెరా మే 1న బంధిం చింది.
→భూ అయస్కాంత తుఫాన్, భూ అయ స్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్ప డుతుంది.
→సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి.
→సాధార ణంగా ఇవి అలస్కా, నార్వే తదితర విదేశా ల్లోని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. భార త్ లో అరోరా ఏర్పడటం ఇదే మొదటిసారి.

రిటర్న్ టు రూట్స్

→ లడక్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు ఆస్ట్రేలి యన్ ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేసిం దని భారత్లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హాన్ బేరీ ఓ ఫారెల్ ప్రకటించారు.
→ దీనికి సంబంధించిన సమావేశం శ్రీనగర్లో మే 2న ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు 'రిటర్న్ టు రూట్స్' అని పేరు పెట్టారు.
→ సంప్రదాయ జ్ఞానాన్ని పాఠశాల సైన్స్ పాఠ్యప్రణాళికతో అనుసంధానించా లనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
→ దీనిద్వారా విద్యా ర్థులు తమ సంస్కృతి, వారసత్వం గురించి లోతైన అవగాహన పొందుతారు.

గ్రీన్ బిల్డింగ్ అవార్డు

→డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రతిష్ఠాత్మక 'ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్' లభించింది.
→దేశంలోనే మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరి యట్ బిల్డింగ్ కాంప్లెక్స్ రికార్డుల్లోకె క్కింది.
→గోల్డ్ రేటింగ్ అవార్డు, సర్టిఫికెట్ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సభ్యులు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ డ్డికి మే 1న అందజేశారు.

ట్విటర్కు కొత్త సీఈఓగా లిండా యాకరినా

→సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియ మితులయ్యారు.
→సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె ఈ తీసుకోనున్నారు.
→ ప్రధానంగా ట్విటర్ వ్యాపార కార్య కలాపాలపైనే లిండా దృష్టి సారి స్తారని ట్విటర్ ద్వారా మస్క్ తెలియజేశారు.
→ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీఓ హోదాలో ప్రోడక్ట్ డిజైన్, కొత్త సాంకేతి కతల బాధ్యతలను తానే నిర్వహిస్తానని అందులో ఆయన పేర్కొన్నారు.
→ కాగా.. గతేడాది ట్విటర్లో మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలి సిందే.
→ ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్కు ఛార్జీలు లాంటివి వీటిల్లో ప్రముఖంగా చెప్పొచ్చు. మరోవైపు కంపెనీల ఆదాయాలూ తగ్గాయి.
→ ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన లిండా.. ఈ సవాళ్లను అధిగమించి ఆదాయపరంగా సంస్థను ఎలా గాడిన పెడతారో వేచిచూడాల్సిందేననే అభిప్రా యాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

వెలుగులోకి 'పాండ్య' శాసనం

→ శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో శివాలయాల వద్ద పురాతన కాలం నాటి శిలాశాసనాలు, రాతి విగ్రహాలు వెలుగుచూశాయి.
→ ఈ శాసనం ప్రకారం 13వ శతాబ్దం వరకు ఈ ప్రదేశం పాండ్య వంశీయుల ఆధీనంలో ఉంటూ వచ్చిందని తెలుస్తోంది.
→ 11వ శతా బ్దంలో పాండ్య రాజు సుందరపాండ్య హయాంలో ఈ శాసనం జారీ చేసినట్లు నిర్ధా రణ అయిందని ఆర్డీవో రామారావు తెలి పారు.
→ తొండైమానరూర్ నివాసి అయిన తిరువెంకాడైయూర, అవ్వయ్యన్ కుమా రులు అక్కనాయక్, తిక్కనై వంద పనములకు భూమిని విక్రయించినందుకు సంబంధించి శాసనమని పురావస్తుశాఖ ఉన్నతాధికారి మునిరత్నం రెడ్డి స్పష్టం చేసినట్లు వివరించారు.
→ తిరువెంకడకోట్టములోని అరియూర్ నాడు తొండమ నాడులో తొండైలస్వామి కోయిల్, తిరుక్కళతియార్సోమ పాండిన్ అనే వేర్వేరు ప్రదేశాల్లో ఈ తరహా శాసనాలు గుర్తించామన్నారు.
→ అక్కడే లభ్య మైన చిత్రాలు యుద్ధవీరులకు సంబంధించినవిగా భావిస్తున్నట్లు తెలిపారు.

నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం

→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 29న జీఎస్ఎల్వీ-మార్క్ 2 ద్వారా ఎన్వీఎస్-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
→ 2016లో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహ స్థానంలో ఇది పనిచేయనుంది.
→ ఎన్వీఎస్-01 జీవితకాలం 12 ఏళ్లు. దేశంలోని పొజి షనింగ్, నావిగేషన్, టైమింగ్ అవసరాలను తీర్చడానికి నావిగేషన్ విత్ ఇండి యన్ కాన్స్టలేషన్ (నావిక్) ను ఇస్రో ఏర్పాటు చేసింది.
→ ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపగా తాజా ప్రయోగంతో ఆ వ్యవస్థను ఇస్రో మరింత స్థిరీకరించనుంది.

లండన్ లో జరిగిన 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సు

→దేశంలో రైతులు, యువత సమస్యలను పరిష్కరించి, ఆవిష్కరణ లకు పెద్దపీట వేయడం ద్వారా నాలుగో పారి శ్రామిక విప్లవంలో భారతదేశాన్ని నాయకత్వ స్థానానికి చేర్చవచ్చని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సరైన నిర్ణయాలతో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంద న్నారు.
→యువతకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సృష్టించేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని... తద్వారా వచ్చే 20 ఏళ్లలో ప్రజల తలసరి ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు పెంచ వచ్చని అభిప్రాయపడ్డారు.

ఏకతా హార్బర్ నిర్మాణం

→భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ 2023, మే 13 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించి రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకార వృద్ధికి అంగీకారం కుదుర్చుకున్నారు.
→ఉమ్మడిగా నౌకా, సైనిక అభ్యాసాలను నిర్వహించాలని రెండు దేశాలు నిశ్చయించుకున్నాయి.
→2021లో మాల్దీవుల్లో తీర రక్షణ దళ స్థావరం ఏర్పాటుకు అయిదు కోట్ల డాలర్ల రుణం అందిస్తామని భారత్ వాగ్దానం చేసింది.
→'ఏకతా హార్బర్ పేరుతో చేపట్ట నున్న ఈ నిర్మాణానికి రాజ్నాథ్ సింగ్, మాల్దీవుల రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీలు శంకుస్థాపన చేశారు.
→ఒప్పందాల ప్రకారం రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.
→మాల్దీవుల రక్షణ దళాలకు 70 శాతం శిక్షణ సదుపా యాలను భారత్ కల్పిస్తోంది.
→భారత్, మాల్దీవులు 2009, 2016 నాటి హిందూ మహాసముద్రంలో పటిష్ట నిఘా ద్వారా మాల్దీవుల ప్రత్యేక ఆర్ధిక మండలాన్ని రక్షించడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్) రాడార్లను అందించింది.

చార్లెస్-3 పట్టాభిషేకం

→ 2023, మే 6న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో బ్రిటన్ రాజు చార్లెస్ - 3 పట్టాభిషేకం జరిగింది.
→ ఈయన బ్రిటన్ 40వ రాజుగా అధికారిక బాధ్యతలు స్వీకరిం చారు.
→ ఈయన వయసు 74 సంవత్సరాలు. చార్లెస్-3కి కాంటర్ బరీ ఆర్చిబిషప్ జస్టిస్ వెల్బీ కిరీటధారణ చేశారు.
→ 2022, సెప్టెంబరులో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణించాక బ్రిటన్ రాజుగా చార్లెస్ -3 బాధ్యతలు స్వీకరిం చారు.
→ 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2 కు పట్టాభిషేకం జరిగింది. 70 ఏళ్ల తర్వాత లో పట్టాభిషేక క్రతువు జరి మళ్లీ బ్రిటన్ గింది.
→ చార్లెస్-3 పట్టాభిషేక కార్యక్రమానికి భారత దేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ఆయన సతీమణి సుదేష్ హాజరయారు.
→ ఛార్లెస్-3 1948, నవంబరు 14న జన్మిం చారు. అత్యంత పెద్ద వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టిన ఘనతను సాధించారు.
→ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 1970లో డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ అందుకున్న తొలిరాజు చార్లెస్-3.

2027 నాటికి డీజిల్ వాహనాలను నిషేధించండి

→దేశవ్యాప్తంగా పది లక్షల జనాభా దాటిన నగ రాల్లో 2027 నాటికి డీజిల్ తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేదం విధించాలని కేంద్ర చమురు శాఖ నియమించిన ఒక కమిటీ ప్రభుత్వా నికి నివేదిక ఇచ్చింది
→ఆయా నగరాల్లో డీజిల్ వాహనాలకు బదులు విద్యుత్తు లేదా గ్యాస్తో నడిచే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిం చింది.
→అలాగే, రానున్న పదేళ్లలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో డీజిల్తో నడిచే సిటీ బస్సులను కొను గోలు చేయకూడదని.. 2035 నాటికల్లా దేశవ్యాప్తం గా ఇంటర్నల్ కంబషన్(అంతర్గత దహన) ఇంజ న్లతో నడిచే మోటార్సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్రవాహ నాలను కూడా దశలవారీ గా వినియోగం నుంచి తప్పించాలని పేర్కొంది.
→ఇందుకు విద్యుత్తు వాహ నాలను ప్రత్యామ్నాయ పరిష్కారంగా ప్రోత్సహిం చాలని అభిప్రాయపడింది.

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్

→నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత సాహిత్య కారుడు రవీంద్రనాధ్ ఠాగూర్ నడయాడిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్ భూమ్ జిల్లాలో ఉన్నశాం తినికేతనకు ఆరుదైన గౌరవం దక్కనుంది.
→యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్ ను చేర్చాలని సలహా మండలి అయిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీవోఎమ్వోఎస్) ప్రతిపాదించింది.
→ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.
→ఠాగూర్ 162వ జయంతి రోజున(మే 9, 2023) భారత్ కు ఈ శుభవార్త అం దినట్లు ఆయన పేర్కొన్నారు.

దిది యోజన స్కీం బీహార్

→ఆడపిల్లలకు ఎన్నో కలలు.. బాగా చదవాలని,, మంచి ఉద్యోగం చేయాలని ఆశిస్తారు.
→ ఆ స్వప్నా లకు పరిస్థితులు సంకెళ్లు వేస్తుంటాయి. అందునా బీహార్లాంటి చోట మరీ కష్టం. అందుకే అక్కడ ఊరికో కమ్యూనిటీ లైబ్రరీ ఏర్పాటవుతున్నది.
→ ఫిబ్ర వరిలో మొదలుపెట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే వం ద గ్రామాలను చేరింది. వాటి పేరు 'దీదీ కీ లైబ్రరీ', రెండు గదులు, ఒక హాల్ ఉంటాయి.
→ ఇప్పటికే 12 వేల మందికిపైగా సభ్యత్వం తీసుకున్నారు. వాళ్లలో 80 శాతం బాలికలే. ఒక గదిలో డిజిటల్ లైబ్రరీ, ఆఫీస్ ఉంటాయి.
→ మరో గదిని స్టడీ రూమ్లో ఉప యోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు.
→ ఇ-బుక్స్ అందుబాటులో ఉంచుతు న్నారు, గ్రామీణ బాలికలు పోటీ పరీక్షలకు సిద్ధం.. కావడానికి ఇదో మంచి వేదిక అవుతున్నది.
→ బాగా చదువుకోవాలనుకునే పేదింటి ఆడపిల్లలకు దీదీ కి లైబ్రరీ ఓ వరం.

డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగుల రవాణా

→నోయిడాలో డ్రోన్ల సాయంతో బ్లడ్ బ్యాగుల రవాణా చేసి ఐసీఎంఆర్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
→గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల నుంచి పది. శాంపిళ్లను జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్టెక్నా లజీకి డ్రోన్ల ద్వారా పంపించారు.

వ్యర్థాలను ప్రయోజనకర రసాయనాలుగా మార్చే సూక్ష్మ జీవులు

→వ్యవసాయ, కాగిత వ్యర్థాల్లో కీలకమైన సెల్యు భోజ్ను ప్రయోజనకర రసాయనాలుగా మార్చే సూక్ష్మజీవులను హిమాచల్ ప్రదేశ్లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
→అవి ఈ వ్యర్థా లను జీవ ఇంధనాలుగా, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే కార్బన్ గా మారుస్తాయని వివరిం చారు.
→మొక్కలకు సంబంధించిన ఎండు వ్యర్థా లను లిగ్నోసెల్యులోజ్ గా పిలుస్తారు.
→పుడమిపై పుష్కలంగా ఉన్న పునరుత్పాదక పదార్థాల్లో ఇవి ఒకటి, పొలాలు, అడవులు, పరిశ్రమల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను బయోఇథనాల్, బయోడీజిల్, ల్యాక్టిక్ ఆమ్లం, ఫ్యాటీ ఆమ్లాలు వంటి ప్రయోజన కర రసాయనాలుగా మార్చేవీలుంది.
→ ఈ నేపథ్యం లో శాస్త్రవేత్తలు కన్సాలిడేటెడ్ బయోప్రాసెసింగ్ అనే వినూత్న విధానంపై దృష్టిసారించారు.
→ దీని కింద శాకారిఫికేషన్(సెల్యులోజ్న సాధారణ చక్కె రలుగా మార్చడం), ఫెర్మెంటేషన్(సాధారణ చక్కె రలను ఆల్కహాల్ గా మార్చడం) అనే రెండు విధా నాలను ఒకే అంచెలోకి తీసుకురావాల్సి ఉంటుంది.
→ ఇందుకు ఉపయోగపడే రెండు రకాల సూక్ష్మజీవు లను ఐఐటీ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీకి 5వ స్థానం

→పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో 5వ స్థానంలో నిలిచింది.
→ 2011-12 నాటి స్థిర ధరల ప్రకారం ఈ రెండింటి దిగుబడిలో ఏపీ వాటా 5.8% మేర ఉండగా.. 2020-21 నాటికి అది 8.3%కి చేరింది.
→ ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రం 7 నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. కేంద్ర గణాం కాల శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
→ ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ (11.7%), మధ్యప్రదేశ్ (10.8%), ఉత్తర ప్రదేశ్ (9.7%), మహారాష్ట్ర (9.6%).. ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయి.
→ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల స్థూల విలువ 2011-12లో రూ.16,500 కోట్ల మేర ఉండగా.. 2020 - 21 నాటికి రూ.32,900 కోట్లకు చేరింది.
→ లైవ్ స్టాక్ ఉత్పత్తిలోనూ 7.9% వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల్లో దేశంలో 40% వాటా సాధించి టాప్లో నిలిచింది.
→ ఈ రంగంలో 2015- 16 నుంచి రాష్ట్రం ప్రధమ స్థానంలో కొనసాగుతోం ది.
→ పదేళ్లలో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 17.7% నుంచి 40%కి ఎగబాకింది.
→ అరటి ఉత్పత్తిలోనూ 2014-15 నుంచి ఏపీ ప్రథమ స్థానంలో నిలుస్తోం ది.
→ జాతీయస్థాయిలో మొత్తం స్థూల అదనపు విలు వలో(జీవీఏ) వ్యవసాయం, ఆటవీ, మత్స్య ఉత్ప |త్తుల వాటా 2011-12లో 18.5% మేర ఉండగా, 2020-21 నాటికి అది 20.3 శాతానికి పెరిగింది.

ప్రసూతి మరణాల్లో భారత్ టాప్

→ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాలు, పిండస్థ మరణాలు అధిక శాతం ఉన్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
→కేప్ టౌన్ వేదికగా జరిగిన "అంతర్జాతీయ ప్రసూతి నవజాత శిశు ఆరోగ్య సద 'స్సు' సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
→2020-2 021లో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు (2.9లక్షలు, పిండ మరణాలు(19 లక్షలు), నవ జాత శిశు మరణాలు (23 లక్షలు) కలిపి మొత్తం 45 లక్షల మరణాలు సంభవించాయని ఈ నివేదిక వెల్లడించింది.
→2020లో ప్రసూతికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నమోదైన 45 లక్షల మరణాల్లో ఒక్క భారత్లోనే 7.78 లక్షల మరణాలు సంభవిం చాయి. పిండస్థ మరణాలు 17% ఉన్నాయి.

సీబీఐకి కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్

→ కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (59) ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్గా కేంద్రం నియమించింది.
→ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వెల్లడించింది.
→ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం వివరిం చింది.
→ మే 25న జైశ్వాల్ పదవీ కాలం ముగు స్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
→ సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే ప్యానల్.. ప్రవీ ణ్ సూద్ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది.
→ ఈ ప్యాన ల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్ర చూడ్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
→దిల్లీ ఐఐటీ, బెంగళూరు ఐఐఎం విద్యార్థి 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ప్రవీణ్ సూద్ గత మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
→ఢిల్లీ ఐఐటీలో, బెంగళూరులో చదువుకున్నారు. దాంతో పాటు న్యూయార్క్ లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేశారు.
→నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు విజేత ప్రవీణ్ సూద్ కర్ణాటకలోని బళ్లారి, రాయ చూర్ జిల్లాలకు సూపరింటెండెంట్గా పనిచే శారు.
→ బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిష నర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) గాను సేవలు అందించారు.
→ అదనపు పోలీసు కమిష నర్ (ట్రాఫిక్), మైసూర్ సిటీ పోలీసు కమిషన ర్ గా బాధ్యతలు నిర్వహించారు.
→ మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగాను ప్రవీణ్ సూద్ పనిచేశారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహ ణకు సాంకేతికతను ఉపయోగించడం, పౌరు లకు సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో.. ప్రవీణ్ సూద్కు 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు వచ్చింది.
→ 2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు సైతం ఆయన అందుకున్నారు.

జాతీయ విద్యా విధానం అమలుకు 'ఉత్సాహ్'

→ నూతన జాతీయ విద్యార్థి విధానానికి అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాలు అమలుచేస్తున్న సంస్కరణలను గుర్తిస్తూ నిరంతరం పర్యవేక్షించేందుకు యూజీసీ నడుం కట్టింది.
→ అందుకు ప్రత్యేకంగా యూజీసీ ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఉత్సాహ్) పేరిట ఓ పోర్టల్ను ప్రారంభించింది.
→ దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జాతీయ విద్యావిధానం లోని విద్యార్థి కేంద్రంగా విద్య, డిజిటల్ అభ్యసనం, పరి శ్రమలు-విద్యాసంస్థల అనుసంధానం, పరిశోధన, అంత ర్జాతీయీకరణ, భారతీయ వైజ్ఞానిక వ్యవస్థ తదితర అంశాల అమలు, ఫలితాలను ఈ పోర్టల్ ద్వారా పర్య వేక్షిస్తారు.
→ఆయా విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు తమ ప్రాంగణాల్లో అమలుచేస్తున్న పది అంశాలపై వివరా లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
→దాన్నిబట్టి యూజీసీ నెలవారీ నివేదికలను రూపొందించి విడుదల చేస్తుంది.
→మరోవైపు వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ) పేరిట నియ మించుకునేలా కొత్త టీచింగ్ పోస్ట్ను సృష్టించిన యూజీసీ తాజాగా అందుకు పోర్టలు రూపొందిం చింది. నిపుణులకు, విద్యాసంస్థలకు మధ్య ఈ పోర్టల్ అనుసంధానంగా ఉంటుంది.
→యూజీసీకి కూడా కొత్త వెబ్సైట్ను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది, విద్యాసంస్థలు... ఇలా విభాగాల వారీగా పూర్తి సమాచారం కొత్త వెబ్సైట్లో ఉంచుతామని యూజీసీ ఛైర్మన్ ఆచార్య మామిడాల జగదీశ్కుమార్ తెలిపారు.

టీ-హబ్ జాతీయ సాంకేతిక పురస్కారం

→ రాష్ట్రంలోని టీ-హబ్ మరో అరుదైన ఘనత సొంతం చేసు కుంది.
→ దేశంలోనే అత్యుత్తమమైన 'జాతీయ సాంకేతిక పురస్కారాన్ని' కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ చేతుల మీదుగా టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు అందుకున్నారు.
→ అవార్డు పట్ల మంత్రి కేటీఆర్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు.
→ టీ-హబ్ దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్ గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

రిఫ్లెక్షన్స్ ఆన్ ఇండియాస్ పబ్లిక్ పాలసీస్ పుస్తకావిష్కరణ

→ దేశాభివృ ద్ధిలో బ్యూరోక్రసీ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు.
→ 1984వ బ్యాచ్కు చెందిన 10 మంది ఐఏఎస్ అధికారులు రాసిన 'రిఫ్లెక్షన్స్ ఆన్ ఇండియాస్ పబ్లిక్ పాలసీస్' పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ధన్ ఖడ్ మాట్లాడారు.
→ "స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ విధానాల రూపక ల్పనలో నిరంతరం మార్పు కనిపిస్తూ వస్తోంది. తొలుత మనుగడ సాగించడంపై దృష్టి సారించిన ప్రభుత్వాలు ఆ తర్వాత సుస్థిరత, స్వావలంబన, వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా పంచడానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
→ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ విధానాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ దూరదృష్టితో తీసుకున్న విధానాలు భారతన్ను ప్రపంచ పెట్టుబడులు, అవకాశాల కేంద్రంగా మార్చింది.
→ ఈ విషయంలో బ్యూరో క్రసీ కీలకపాత్ర పోషించింది. దశాబ్దాల సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత 2014లో దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది.
→ దానివల్ల ప్రభుత్వం వేగ వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలైంది." అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
→ ఈ కార్యక్ర మంలో పుస్తక రచయితలు అశోక్ దళ్వాయ్ (రైతుల ఆదాయ రెట్టింపు సాధికార సమితి చైర్మన్), అరవింద్ మెహతా (15వ ఆర్థిక సంఘం కార్యదర్శి), అలోక్ శ్రీవాత్సవ (సిక్కిం మాజీ ప్రధాన కార్యదర్శి), అజయ్ త్యాగి (సెబీ మాజీ ఛైర్మన్), రినారే (కేంద్ర విద్యాశాఖ మాజీ కార్య దర్శి), రాజేష్ సింగ్ (ఓహియో స్టేట్ యూనివ ర్శిటీ ప్రొఫెసర్), శైలేంద్ర జోషి (తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి), శ్రీమంత్ పాండే (రాజస్థాన్ సీఎం ముఖ్యకార్యదర్శి), సతీష్ తివారీ (పశ్చిమ బెంగాల్ ఆహార కమిషన్ చైర్మన్), తరుణ్ శ్రీధర్ (కేంద్ర పశుసంవర్ధకశాఖ మాజీ కార్యదర్శి) పాల్గొన్నారు.

మెదడులోని గామా కంపనాలతో కుంగుబాటుకు చికిత్స

→ మెదడులోని వాసన ప్రక్రియను నిర్వహించే భాగంలో కొన్ని కీలక లయ లను పునరుద్ధరించడం ద్వారా కుంగుబాటుకు చికిత్స చేయొ చ్చని ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది.
→ ఈ అధ్యయనాన్ని హంగేరీకి చెందిన యూనివ ర్సిటీతో కలిసి న్యూయార్క్ యూనివర్సిటీ (ఎన్ వైయూ) గ్రాసమన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ నిర్వ హించింది.
→మెదడులోని వాసన ప్రాంతాల మధ్య నిర్దిష్ట లయను గామా కంపనాలు అని పిలుస్తారు.
→ఇవి సెకనుకు 30 అంత కంటే ఎక్కువ సార్లు పున రావృతమవుతాయి.
→భావో ద్వేగాలు లాంటి సంక్లిష్ట సమాచారం విశ్లేషించ డానికి ఇదొక కీలక సమయ నమూనా.
→ఈ కంపనాల్లో మార్పులు మెదడు ప్రాంతాల్లో వ్యాధి గుర్తులుగా పని చేస్తాయని అధ్యయన కర్తలు తెలిపారు. దీన్ని 'జర్నల్ న్యూరాన్' ప్రచురిం చింది.
→ఈ పరిశోధనల్లో మెదడు ప్రాంతంలో వాసన సంబంధిత ప్రక్రియను నిర్వహించే ఓల్ఫాక్టరీ బల్బ్ విభాగాన్ని మూసివే శారు.
→దీంతో ఎలుకల్లో కుంగుబాటు లక్షణాలు పెరగడం గమనించారు. గామా కంపనాలు పెంచిన తర్వాత ఆ లక్షణాలు వెనక్కి మళ్లడం గమ నార్హం.
→దీన్ని బట్టి గామా కంప నాలు.. కుంగుబాటుపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

ప్లాస్టిక్ ను తినేసే శీతల సూక్ష్మజీవులు

→ శీతల ప్రాంతాలైన ఆల్ప్స్, ఆర్కిటిక్ లలో శాస్త్రజ్ఞులు ప్లాస్టిక్ను తినివేయగల బ్యాక్టీరియా, ఫంగస్లను గుర్తించారు.
→ స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత శిఖరాల్లో, ఆర్కిటిక్ సముద్రంలో గ్రీన్లాండ్ స్వాల్బార్డ్ ప్రాంతాలలో చెల్లాచె దురుగా పడి ఉన్న లేదా ఉద్దేశ పూర్వకంగా మంచులో పాతిన ప్లాస్టిక్ అవశేషాలపై పెరుగుతున్న 19 జాతుల బ్యాక్టీరియాను, 15 జాతుల ఫంగ స న్నూ గుర్తించారు.
→తర్వాత వాటిని 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చీకటిగా ఉన్న ప్రయోగశాలలో పెంచారు. సూక్ష్మజీ వుల వల్ల హరించుకుపోని నాన్ బయోడి , గ్రేడబుల్ పాలీఎథిలీన్ (పీఈ), సూక్ష్మ జీవుల వల్ల శిథిలమయ్యే బయోడిగ్రేడబుల్ పాలెస్టర్ పాలీయురెథేన్ (పీయూఆర్), దుకాణాల్లో దొరికే బయోడిగ్రేడబుల్ పీబీ ఏటి, పీఎల్దలపై ఈ బ్యాక్టీరియా, ఫంగస్ లను ప్రయోగించారు.
→126 రోజుల తర్వాత ఈ ఫంగస్ రకాలు, బ్యాక్టీరియా రకాలు జీవశైథిల్యానికి లోనయ్యే బయోడిగ్రేడబుల్ పీయార్, పీబీఏటి, పీఎల్ఎలను తినివే శాయి.
→జీవ శైథిల్యానికి లొంగని నాన్ బయోడిగ్రేడబుల్ పాలీఎథిలీన్ (పీఈ)ను మాత్రం అవి హరించలేకపోయాయి.
→ముఖ్యంగా నియోడెవ్రియేసియా, లాక్నె లులా ఫంగస్ లు పీఈని తప్ప మిగతా జీవశైథిల్య ప్లాస్టిక్ లన్నింటినీ నశింపజే శాయి.
→ఇప్పటివరకు పరీక్షించిన బ్యాక్టీ రియా, ఫంగస్ రకాలన్నింటికన్నా ఇవే అత్యంత శక్తిమంతమైనవి.

మన్ కీ బాత్ స్ఫూర్తితో కళాప్రదర్శన ఏర్పాటు సందర్శించిన ప్రధాని మోదీ

→ మన్ కీ బాత్ కార్యక్రమం 100వ భాగం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఓ కళా ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
→ 'జనశక్తి- ఒక సమ్మిళిత శక్తి' పేరుతో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో దీనిని ఏర్పాటు చేశారు.
→ 13 మంది కళా కారులు మన్ కీ బాత్ ఎపిసోడ్ల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన పెయింటింగ్లను జనశక్తి ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు పెట్టారని సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
→ ఈ ఎగ్జిబిషన్కు వచ్చిన మోదీ.. గ్యాలరీలో నడుస్తూ ఒక్కొక్క కళాఖం ని పరిశీలించారు.
→ కళాకారులు తమ తమ పెయింటింగ్స్ గురించి ఆయనకు వివరించారు.
→ నారీ శక్తి, జల నిర్వహణ, కొవిడ్-19ను ఎదుర్కో వడం, స్వచ్ఛ భారత్, పర్యావరణం తదితర అంశాలపై వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకున్నాయి.

నాలుగో 'స్వదేశీ జాబితా'! 928 విడిభాగాల దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించిన కేంద్రం

→ రక్షణ రంగంలో స్వదేశీ ఆయుధాల వాటాను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
→ దేశీయ కంపెనీల నుంచి మాత్రమే సేకరించాల్సిన 928 ఉపకరణాలు, విడి భాగాలతో ఒక జాబితాను రక్షణ శాఖ తాజాగా వెలువరించింది.
→ రానున్నకాలంలో వీటి దిగుమ తులపై నిషేధం విధించనుంది. ఇందుకోసం ఉత్పత్తులవారీగా గడువును నిర్దేశించింది.
→ గరి ష్ఠంగా ఐదున్నరేళ్లలోపు వీటన్నింటి దిగుమతు లపై నిషేధం అమల్లోకి వస్తుంది.
→ రక్షణ రంగంలో 'ఆత్మనిర్భరత'ను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
→ 'పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్' (పిల్) పేరుతో కేంద్రం ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసింది. వీటిలో 1,238 విడిభాగాలు ఉన్నాయి.
→ అందులో 310 వస్తువులను పూర్తిగా స్వదేశీ వనరులు నుంచే సేకరిస్తున్నారు. తాజాగా నాలుగో జాబితా వెలువడింది.
→ వచ్చే ఐదేళ్లలో భారత సైనిక దళాలు ఆయుధ కొనుగోళ్ల కోసం 130 బిలియన్ డాలర్లను వెచ్చించే అవకాశం ఉందని అంచనా.
→ అందులో స్వదేశీవాటాను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

భారత 82వ గ్రాండ్ మాస్టర్ గా ప్రణీత్ ఘనత

→ తెలంగాణ యువ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ సాధించాడు. చదరంగంలో ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ మాస్టర్ (జీఎం) హోదా అందుకున్నాడు.
→ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన 82వ ఆటగాడిగా నిలిచాడు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం నుంచి జీఎంగా అవతరించిన అయిదో క్రీడాకారుడతను.
→తెలుగు గడ్డ నుంచి మరో గ్రాండ్మాస్టర్ వచ్చాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఉప్పల ప్రణీత్ ఈ ఘనత సాధించాడు.
→ ఇప్పటికే మూడు జీఎం నార్మ్ లు సాధించిన ప్రణీత్... తాజాగా బాకు ఓపెన్ ఎనిమిదో రౌండ్లో టాప్ సీడ్ హాన్స్ నీమన్ (అమెరికా)కు షాకిచ్చి 2500.5 ప్రత్యక్ష రేటింగ్ను చేరుకున్నాడు.
→గ్రాండ్మాస్టర్ కావాలంటే మూడు జీఎం నార్మ్ లతో పాటు 2500 ఎలో రేటింగ్ ఉండాలి. ఆ అర్హత ప్రమాణాలను సాధించిన అతను జీఎంగా ఎదిగాడు.
→అయితే బాకు ఓపెన్ చివరి రౌండ్లో ప్రణీత్ సహచర ఆటగాడు ల్యూక్ మెండోంకా చేతిలో ఓడిపోయాడు.
→ఈ టోర్నీలో 6 పాయింట్లతో అతను ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిరుడు మార్చిలో ప్రణీత్ తొలి జీఎం నార్మ్ సాధించాడు. రెండో జీఎం నార్మన్న గతేడాది జులైలో సొంతం చేసుకున్నాడు. మూడో నార్ని గత నెలలో ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అవసరమైన రేటింగన్నూ సంపాదించాడు.

ఎవరెస్టుపైకి 26వ సారి... నేపాల్ షెర్పా గైడ్ ఘనత

→ నేపాల్కు చెందిన పసంగ్ దవా అనే షెర్పా గైడ్ ఎవరెస్టు శిఖరాన్ని తాజాగా 26వ సారి అధిరోహించారు. → తద్వారా ఇప్పటికే తమ దేశా నికి చెందిన కమి రీటా అనే గైడ్ పేరుతో ఉన్న రికా ర్డును సమం చేశారు. → పసంగ్ పర్వతారోహకులకు గా ఉంటూ 1998 నుంచి దాదాపు ఏటా ఈ శిఖ రాన్ని అధిరోహిస్తున్నారు.

యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం

→సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణిని భారత నౌకాదళం విజయ వంతంగా పరీక్షించింది.
→ అధునాతన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎస్ఎస్ మోర్ముగావ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.
→ సాగరంలో భారత నౌకాదళ అస్త్ర సామర్థ్యాన్ని ఈ పరీక్ష చాటిందని అధికారులు ఆదివారం పేర్కొన్నారు.
→ ఈ క్షిపణి.. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని వివరించారు. భారత్, రష్యాలు సంయుక్తంగా స్థాపించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఈ క్షిపణిని రూపొందించింది.
→ దీన్ని జలాంతర్గా ములు, యుద్ధనౌకలు, విమానాలు, నేల నుంచి ప్రయో గించే వీలుంది.
→ ఇది ధ్వని కన్నా దాదాపు మూడు రెట్లు వేగంగా దూసుకెళ్లగలదు. బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఎగుమతి కూడా చేస్తోంది.
→ ఫిలిప్పీన్స్కు ఈ అస్త్రాల విక్రయానికి గత ఏడాది జనవరిలో 37.5 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది.

పాక్ ఉగ్రవాది రవూఫ్ ను వెనకేసుకొచ్చిన చైనా

→ పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ ను బ్లాక్ లిస్టులో చేర్చాలంటూ భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది.
→ ఐరాస భద్రతా మండలి 1267 ఐఎస్ఎస్ఐఎల్, అల్ ఖైదా ఆంక్షల జాబితా కింద భారత్ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి అడ్డుపుల్ల వేసింది.
→ గతంలోనూ పాక్ ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలు విధించకుండా అడ్డుకున్న చరిత్ర చైనాకు ఉంది.
→ రవూఫ్ గతంలో భారత్ లో జరిగిన పలు దాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
→ 1999లో జరిగిన ఐసీ 814 విమాన హైజాక్లో అతడి హస్తం ఉంది.
→ దీంతోపాటు 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి వంటి ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది.
→ అతడిపై అమెరికా 2010 డిసెంబరు నుంచే ఆంక్షలు విధించింది.

సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

→ తన వాహకనౌకలను భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా మార్చుకునే ప్రణాళికల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2000 కిలోన్యూటన్ల సామర్థ్యమున్న సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది.
→తమిళనాడు లోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీ ఆర్సీ) లో ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

కర్ణాటకలో రికార్డు స్థాయి పోలింగ్

→ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది.
→ రాష్ట్రంలో 73.19% ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
→ అత్యధి కంగా చిక్కబళ్లాపురలో 85.56% పోలింగ్ నమోదైంది.
→ తర్వాతి స్థానంలో బెంగళూరు గ్రామీణ (85.05%) నిలిచింది.
→ కన్నడనాట గత రెండు ఎన్నికల్లోనూ చిక్కబళ్లాపురలోనే అత్యధిక పోలింగ్ నమోదవడం గమనార్హం.
→ బెంగళూరులోని నాలుగు జిల్లాల్లో మాత్రం సగ 54. 53% మందే ఓటేశారు.
→ లెక్కింపు శనివారం జరగనుంది.
→ కర్ణాటకలో 2018లో 7.4%, 2013లో 71.83% పోలింగ్ నమోదైంది.
→ మరోవైపు- కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో వినియోగించారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

దేశంలోనే తొలిసారి కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్

→ దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో పోలీసుల ద్వారా డ్రోన్ నిఘావ్య వస్థను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ న్ ప్రారంభించారు.
→ ఈ సంద ర్భంగా రాష్ట్రంలోని 20 జిల్లాల పోలీసులకు ఒక్కో డ్రోన్ను అందించారు.
→ ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్ పైలట్లకు లైసెన్సులు పంపిణీ చేశారు.
→ దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సాఫ్ట్వేర్న ఆవిష్కరించారు.
→ ఈ సంద ర్భంగా విజయన్ మాట్లాడుతూ.. పోలీసు బల ఆధునికీకరణలో దేశంలోనే ముందంజలో ఉందన్నారు.
→ డ్రోన్ ఆపరేషన్పై ప్రత్యేక శిక్షణ కోసం 25 మంది పోలీసు సిబ్బం దీని మద్రాస్ ఐఐటీకి పంపారు.
→ మరో 20 మందికి కేరళలోని డ్రోన్ ల్యాబ్లో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ 5 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోగలదని, ప్రత్యర్థుల డోమ్ డ్రోన్లను నాశనం చేయగలదని సైబర్ నోడల్ అధికారి, ఐజీ ప్రకాశ్ తెలిపారు.

ప్రపంచకప్ సరబో జ్యోత్, దివ్యలకు స్వర్ణం

→ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ లో భారత క్రీడా కారులు టీఎస్ దివ్య, సరబ్ జ్యోత్ సింగ్ శుభారంభం చేశారు.
→ ఈ జోడీ పోటీల రెండో రోజు, గురువారం మిక్స్డ్ టీమ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది.
→ 55 జట్లు పాల్గొన్న అర్హత రౌండ్లో 581 పాయింట్లతో అగ్రస్థానం సాధించిన దివ్య, సరబ్ జ్యోత్ జంట పోరులో 16-14తో డామిర్ మికెచ్-జొరానా అరునోవిచ్ (సెర్బియా) జోడీని ఓడించింది. ప్రపంచకప్లో సరబ్ జ్యోత్ కిది వరుసగా రెండో స్వర్ణం.
→మార్చిలో భోపాల్లో జరిగిన టోర్నీలో అతను ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గాడు.

18 నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

→ కూరగాయలు, వంటనూనెల ధరలు తగ్గడంతో ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగొచ్చింది.
→ వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యో ల్బణం ఈ ఏడాది మార్చిలో 5.66 శాతంగా ఉండగా, 2022 ఏప్రిల్లో 7.79 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యం (2.6%) పరిధిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం నమో దైంది. వరుసగా రెండో నెలా 6 శాతం లోపే రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ గణాంక కార్యాలయం ప్రకారం ఏప్రిల్ లో ఆహార ద్రవ్యోల్బణం 3.84 శాతంగా నమోదైంది.
→ఏడాది ఈ మార్చిలో ఇది 4.95 శాతంగా, 2022 ఏప్రిల్ లో 8.31 ఉంది. నూనెలు 12.33%, కూరగాయలు 6. 5%, మాంసం, చేపల ధరలు 1.23% చొప్పున తగ్గాయి.
→సుగంధ ద్రవ్యాలు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు మాత్రం ప్రియమ యాయి.
→2022 డిసెంబరు 5.7 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. తర్వాత పప్పుధాన్యాలు, పాలు, పండ్ల ధరలు పెరగడంతో ఫిబ్రవరికి 6. 4 శాతానికి చేరింది.
→ ద్రవ్యోల్బణం శాంతించడం శుభ పరిణామ మని, ద్రవ్యపరపతి నిర్ణయాలు ఫలిస్తున్నాయనే విశ్వాసాన్ని ఇస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వెల్లడించారు.

5 నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

→మార్చిలో భారత పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి 5 నెలల కనిష్ఠమైన 11 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 5.8 శాతం కావడం గమనార్హం.
→విద్యుత్, తయారీ రంగాలు మార్చిలో పేలవ పనితీరు కనబరచాయి.
→ ఇంతకు ముందు 2022 అక్టోబరులో కనిష్ఠంగా 4.1 శాతం ప్రతికూల వృద్ధి నమోదైంది.
→ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధా రంగా పారిశ్రామికోత్పత్తిని లెక్కగడతారు.
→ 2022 మార్చిలో ఇది 2.2 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం విడు దల చేసిన గణాంకాల ప్రకారం..
→ మార్చిలో తయారీ రంగ ఉత్పత్తి 0.5% పెరిగింది. 2022 మార్చిలో ఇది 1.4 శాతంగా ఉంది.
→విద్యుదుత్పత్తి 6.1 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది. * గనుల రంగ ఉత్పత్తి 6.8 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇది 3.9 శాతంగా ఉంది.
→యంత్ర పరికరాల రంగం ఉత్పత్తి 2.4 శాతం నుంచి 8.1 శాతా నికి చేరింది.
→మన్నికైన వినియోగ వస్తువుల తయారీ 8.4 శాతం తగ్గితే, సాధారణ ఉత్పత్తుల తయారీ 3.3 శాతానికి పెరి గింది.
→మౌలికం/ నిర్మాణ రంగ ఉత్పత్తి 6.7 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి తగ్గింది. 2021-22లో ఇది 11.4% కావడం గమనార్హం.

పోష్ చట్టం అమలు తప్పనిసరి

→పనిచేసేచోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం కోసం చేసిన 'ప్రివె న్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (పోష్) చట్టం 2013ను కచ్చితంగా అమలు చేసి తీరాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చట్టం అమలు తీరుపై తీవ్ర అస హనం వ్యక్తం చేసింది. అమల్లోకి వచ్చిన దశాబ్దం తర్వాత కూడా ఈ చట్టం అమలు సరిగా జరగడంలేదని జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంద ర్భంగా దీని అమలు కోసం తీసుకోవాల్సిన చర్య లను సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1. పోష్ చట్టం-2013లోని నిబంధనలను కఠి నంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం లోని అధికారులంతా నిర్ణీత కాలావధిలో చర్యలు తీసుకోవాలి. తమ ఆధీనంలోని ప్రభు త్వరంగ సంస్థలు, ఇతర వ్యవస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి.
2. రాష్ట్ర స్థాయిలోనూ ఇదే తరహా కసరత్తు చేపట్టాలి. యూనివర్సిటీలు, కమిషన్లు, ఇతర సంస్థల్లో ఇలాంటి అంతర్గత ఫిర్యాదు స్వీకరణ కమిటీలు నెలకొల్పాలి.
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, యజమానులకు పోష్ చట్టం-2013 లోని నిబంధనల గురించి స్పష్టమైన అవగా హన కల్పించాలి.
4. సంస్థలకు నేతృత్వం వహించే అధికా రులు/యజమానులు తమ పరిధిలోని సభ్యులకు పోష్ చట్టం-2013కున్న ప్రాధాన్యాన్ని తెలియజే సేలా అవగాహన కార్యక్రమం నిర్వహించాలి.
5. పనిచేసే చోట ఎదురయ్యే లైంగిక వేధిం పులను ఎదుర్కొనే విషయంలో స్పందించాల్సిన తీరుపై మహిళలకు అవగాహన కల్పించడానికి వీలుగా యూనివర్సిటీలు, పాఠశాలలు, ఇతర సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా జాతీయ న్యాయసేవా ప్రాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవల కమిటీలు కలిసి పోష్ చట్టం-2013 పై మాడ్యూల్ను రూపొందించాలి.
6. జాతీయ జ్యుడిషియల్ అకాడమీ, రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీలు నిర్వహించే తరగ తుల్లో పోష్ చట్టం-2013ను చేర్చి న్యాయాధికా రులకు దీని గురించి అవగాహన పెంపొందిం చాలి. కోర్టుల్లో అంతర్గత ఫిర్యాదుల స్వీకరణ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన ప్రాధాన్యం గురించి చెప్పాలి అని ధర్మాసనం ఆదేశించింది.
→తీర్పు ప్రతులను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు పంపాలని, వారు తమతమ విభాగాల్లో చట్టం అమలుకు చర్యలు తీసుకో వాలని సూచించింది.

త్వరలో ఐదుగురు న్యాయమూర్తుల పదవీ విరమణ

→ సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ముగిసేలోపు ఐదుగురు న్యాయమూర్తులు పదవీ కాలం పూర్తికానుంది.
→ ప్రస్తుతం 34 మంది న్యాయ మూర్తులతో సర్వోన్నత న్యాయస్థానం పూర్తి సామ ర్థ్యంతో పనిచేస్తోంది.
→ అయితే ఆదివారం నుంచి జూన్ 29 మధ్య (సుప్రీంకోర్టుకు ఈ నెల 22 నుంచి జులై 2 వరకు వేసవి సెలవులు) వారిలో ఐదుగురు పదవీ విరమణ చేయనున్నారు.
→ జస్టిస్ దినేశ్ మహేశ్వరి పదవీకాలం ఈ నెల 14న ముగి యనుంది. శని, ఆదివారాలు సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో శుక్రవారమే ఆయనకు వీడ్కోలు పలి కారు.
→ మే 15న జస్టిస్ ఎం. ఆర్. షా, జూన్ 16న జస్టిస్ కె.ఎం. జోసెఫ్, 17న జస్టిస్ అజయ్ రస్తోగి, 29న జస్టిస్ వి. రామసుబ్రమణియన్ వరుసగా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

సుప్రీంకోర్టులో ఈ-ఫైలింగ్ 2.0 సేవలు

→న్యాయవాదులిక 24 గంటలూ కేసులు దాఖలు చేసుకోవచ్చు.
→ ఇందుకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ 'ఈ-ఫైలింగ్ 2.0' విధానాన్ని అమల్లోకి తీసుకొ చ్చారు.
→ కోర్టు ప్రాంగణంలో ఈ-సేవా కేంద్రాన్నీ ప్రారంభించారు. "న్యాయవాదులకు 'ఈ-ఫైలింగ్ '2.0' సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
→ సాంకేతికతపై అవగాహన లేని వారు.. ఈ-సేవా కేంద్రాలను వినియోగించుకొని తమ కేసులు " దాఖలు చేసుకోవచ్చు" అని సీజేఐ పేర్కొన్నారు.

మంత్రి మండలి సలహాలను ఎల్బీ పాటించాలి ఎంసీడీ నామినేటెడ్ సభ్యుల నియామక వివాదంలో సుప్రీం ఆదేశం

→ జాతీయ రాజధాని దిల్లీలోని రోజువారీ పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్(LG) చెలాయిస్తున్న అధికారాలకు కత్తెర వేసిన సర్వో న్నత న్యాయస్థానం మరో కీలక ఆదే శాలిచ్చింది.
→ ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకు LG నడచుకో వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
→ దిల్లీ మున్సి పల్ కార్పొరేషన్(ఎంసీడీ)కు పది మంది నామినే టెడ్ సభ్యులను LG నియమించడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.
→ "మంత్రి మండలి సలహాలు, సూచనల మేరకే ఎంసీడీకి నామినేటెడ్ సభ్యులను నియ మించాల్సి ఉంటుందని లెఫ్టినెంట్ గవర్నర్కు మీరెందుకు తెలియజేయడంలేద"ని అదనపు ను సీజేఐ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ప్రశ్నించారు.

→ ఈ కేసులో LG కార్యాలయం తాజా వాదనలను సమర్పించేందుకు అనుమతిం చారు.
→ ఇదే అంశంపై ఎలీ కార్యాలయం ఇదివ రకటి సమాధానాన్ని ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం సమ్మతించింది.
→ తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదాపడింది. ఎంసీడీ చట్టం లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ సిఫార్సు మేరకే నామినేటెడ్ సభ్యులను lg నియమిం చాల్సి ఉంటుందని ఆప్ ప్రభుత్వం తన పిటిష న్లో పేర్కొంది.
→ LG సొంతంగా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలని కోరింది.

భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక విన్యాసాలు సముద్రశక్తి- 2023 ప్రారంభం

→ భారత్, ఇండోనేషియా దేశాల మధ్య ద్వైపాక్షిక విన్యాసాలు ప్రారంభ మయ్యాయి.
→ సముద్ర శక్తి-2023 పేరుతో నాలుగో ఎడిషన్ విన్యాసాలు ఇండోనేషి యాలోని బాటమ్ తీరంలో మొదలయ్యాయి.
→ ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ కవరత్తి, డోర్నియర్ మారీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలి కాఫ్టర్ భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తుం డగా.. కేఆర్ సుల్తాన్ ఇస్కందర్, సీఎన్ 235 మారీటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎఎస్565 పాంథర్ హెలికాఫ్టర్ ఇండోనేషియా తరఫున విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
→ రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో సముద్రశక్తి నిర్వహిస్తున్నారు.
→ హార్బర్ దశలో క్రాస్ఓడెక్ విజిట్స్, ప్రొఫెషనల్ ఇంటరాక్షన్, క్రీడా పోటీలు జరగనుండగా, సీ ఫేజ్లో వెపన్ ఫైరింగ్, హెలికాఫ్టర్ ఆపరేషన్స్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ విన్యాసాలు, బోర్డింగ్ కార్యకలాపాలు నిర్వ హించనున్నారు.
→ ఈ నెల 19 వరకూ సముద్ర శక్తి-2023 విన్యాసాలు జరగనున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజి త్స్ గుప్తా తెలిపారు.

కశ్మీర్ కు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం

→ కేంద్ర పర్యాటక, సాంస్కృతి కశాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అధ్యక్షతన జీ-20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈనెల 14-17 వరకు ఒడి శాలోని భువనేశ్వర్లో జరగనున్నాయి.
→ ఆ తర్వాత 22- 24 వరకు కశ్మీర్ లోని శ్రీనగర్లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది.
→ దీనికి జీ-20 లోని అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్ వంటి సభ్య దేశాలతో పాటు బంగ్లాదేశ్, సింగపూర్ తదితర తొమ్మిది అతిథిదేశాల ప్రతినిధులు సహా ఆహ్వానం పొందిన సంస్థలు, బృందాలు హాజరుకానున్నాయి.
→ శ్రీనగర్లో జరిగే ఫిల్మ్ టూరిజం సమావేశానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
→ 'నాటు నాటు..' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రబృందానికి ఆహ్వానం అందింది.
→ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కశ్మీర్లో జర గనున్న తొలి అంతర్జాతీయ కార్యక్రమంగా జీ-20 సమా వేశం నిలవనుంది.
→ దేశంలో సినిమా టూరిజాన్ని, షూటింగ్లను ప్రోత్సహించడం.. విదేశీ చిత్రాల షూటిం గ్లు మన దేశంలో జరిగేలా చూడడం.. విదేశీ పర్యాట కుల్ని ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర పర్యాటకశాఖ సమా వేశాన్ని శ్రీనగర్లో నిర్వహిస్తోంది.
→ దేశ, విదేశీ ప్రతినిధు లను, అతిథులను శ్రీనగర్ తో పాటు, గుల్మార్గ్ తీసుకెళ్లి అక్కడి సుందర ప్రదేశాలను చూపించనున్నట్లు సమా చారం.
→ భువనేశ్వర్ లో జరిగే సమావేశంలో సంస్కృతి- సంప్రదాయలు, పండుగలు, వారసత్వ సంరక్షణ అంశా లపై చర్చించనున్నారు.

గగన్ యాన్.. క్రూ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం

→భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది చివరి నాటికి గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని భావి స్తున్న సంగతి తెలిసిందే.
→ఈ నేపథ్యంలో తమిళనా డులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లో క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది.
→ఈ మేరకు ఇస్రో శనివారం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. క్రూమాడ్యూల్ సిస్టంను 602.94 సెకన్ల పాటు మండించి పరీక్షించారు.
→ఈ పరీక్ష సమయం లో క్రూమాడ్యూల్ లోని పారామీటర్లు అన్నీ శాస్త్రవే త్తలు ఊహించిన విధంగా పనిచేశాయి.
→దీంతో గగన్ యాన్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టైంది. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టంలో భాగంగా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించారు.
→వీటిని విజయ వంతంగా పరీక్షించడంతో గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న గగన్మోన్ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవుతోంది.
→అయితే ముందుగా రెండు, మూడుసార్లు మానవ రహిత గగనాన్ ప్రయో గాన్ని నిర్వహించాకే మానవ సహిత ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో పేర్కొంది.
→ఇందులో భాగం గా పలు రకాల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉం దని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రేపటి తరం కోసం 'మిషన్ లైఫ్'

→ 2028కి దేశంలో 80% గ్రామాలు, పట్టణ స్థానిక సంస్థలను పర్యావరణ అనుకూల మైనవిగా మార్చాలని కేంద్ర విద్యుత్, పర్యావరణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సెక్రటరీ మిలింద్ దేవర్ తెలిపారు.
→ అన్ని రాష్ట్రాల డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్ఓఏ)లతో శనివారం జరిగిన వెబినార్లో ఆ యన మాట్లాడారు.
→ పర్యావరణ దినోత్సవం సం దర్భంగా జూన్ 5 వరకూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బీఈఈ మిషన్ లైఫ్ (పర్యా వరణానికి జీవనశైలి) నినాదాన్ని విస్తృతంగా ప్రచా రం చేయడానికి ఎన్డీఏలకు లక్ష్యాలను నిర్దేశించి నట్లు చెప్పారు.
→ విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఆహార వ్యవస్థ, స్వచ్ఛ త, ఆరోగ్యకర జీవనశైలి, ఈ వ్యర్థాల తగ్గింపు వంటి 7 కేటగిరిల్లో అవగాహన కార్యకలాపాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక తయా రు చేస్తున్నామన్నారు.
→గృహా లు, వ్యవసాయ రంగాల్లోనే కాకుండా,విద్యార్థులతో ఎనర్జీ క్లబ్ ద్వారా విద్యుత్ సామ ర్థ్యం, విద్యుత్ పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించాలని నోడల్ ఏజెన్సీగా ఎంపికైన ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి సూచించారు.
→భవిష్యత్ తరాల కు లైఫ్ లైన్ లైఫ్ ఉద్యమాన్ని పరిగణిస్తున్నామని, రైతుల కోసం నిర్వహణ కార్యక్రమం, మునిసిపాలి టీల కోసం డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, ప్రజల కో సం ఎలక్ట్రిక్ వెహికల్ ప్రచారం, ఉపకరణాల రిటై లర్ల కోసం రిటైలర్ల శిక్షణ కార్యక్రమాలు జరపా లని కోరారు.
→ఇందుకు 'మేరీ లైఫ్ట్' అనే యాప్, పోర్టల్ని రూపొందించామని, ఇక్కడ ఎన్డీఏలు తమ కార్య క్రమాల వివరాలు నమోదు చేయాలన్నారు.

ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకే అందలం

→ వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు.
→ పంజాబ్ లోని జలంధర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు సమీప కాంగ్రెస్ అభ్యర్థి కరమ్ జీత్ కౌర్ చౌదరిపై 58,691 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
→ 2019 ఎన్నికల్లో ఆప్ తరఫున సంగ్రూర్ నుంచి భగవంత్ మాన్ ఒక్కరే గెలుపొందారు.
→ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ స్థానానికి రాజీనామా చేశారు.
→"ఉత్తరప్రదేశ్లోని ఛన్ద్బె, స్వార్ శాసనసభ నియో జకవర్గాల ఉప ఎన్నికల్లో భాజపాకు మిత్రపక్షంగా ఉన్న అప్నా దళ్ (సోనేలాల్) పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
→సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) పెట్టనికోట లాంటి స్వార్ నుంచి గత ఎన్నికల్లో ఆ పార్టీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ గెలుపొందారు.
→ఓ కేసులో అబ్దుల్లాకు కోర్టు రెండేళ్ల శిక్ష వేయడంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.
→ఉప ఎన్నికల్లో అప్నాదళ్ అభ్యర్థి షఫీక్ అహ్మద్ అన్సారీ ఎస్పీ అభ్యర్థి అనురాధ చౌహాన్పై 8,724 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
→ఛన్బైలో రాహుల్ ప్రకాష్ కోల్ (అప్నా దళ్) మృతి చెంద డంతో ఆయన భార్య రింకీ కోల్ పోటీ చేశారు.
→ఆమె తన సమీప ఎస్పీ అభ్యర్థి కీర్తి కోల్పై 9,587 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
→ ఒడిశాలోని ఝార్సుగుడలో జరిగిన ఉప ఎన్ని కలో బీజద (బిజు జనతాదళ్) అభ్యర్థి దీపాలి దాస్ విజయం సాధించారు.
→ఈమె ఏఎస్ఐ కాల్పుల్లో మరణించిన దివంగత మాజీ మంత్రి నబకిశోర్ దాస్ కుమార్తె. దీపాలి భాజపా ప్రత్యర్థి టంకధర్ త్రిపాఠిపై 48,721 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
→మేఘాలయలోని సొహిఒంగ్ స్థానానికి జరి గిన ఎన్నికలో ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి ఎస్క్వేర్ లింగ్డ ఢాబా అధికార నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) అభ్యర్థి శామిలీన్ మాలింగ్ యాంగ్పై 3,422 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

శివకుమార్ కు 1.22 లక్షల మెజారిటీ

→ కన్నడ నాట కాంగ్రెస్ సత్తా చాటింది. విధాన సభ పోరులో 50 వేలకు పైగా మెజారిటీతో 12 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు సొంతం చేసు కోవడం విశేషం.
→ భారీ విజయం సాధించిన వారిలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకు మార్ ఉన్నారు.
→ ఆయన కనకపుర స్థానం నుంచి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి బి. నాగరాజు పై 1,22,392 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
→ ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. శివకుమా ర్కు 1,43,023 ఓట్లు, నాగరాజుకు 20,631, ఆర్.అశోక(భాజపా)కు 19,753 ఓట్లు వచ్చాయి.
→చిక్కోడి-సడల్గా నియోజకవర్గంలో గణేశ్ ' హుక్కేరి (78,509), అతాణి నియోజకవర్గంలో సంగప్ప సావడి (76,122), పులకేశినగర్లో ఎ. సి. శ్రీనివాస్ (62,133), కొల్లెగల్లో ఎ. ఆర్. కృష్ణ మూర్తి (59,519), యెంకనమర్దిలో సతీష్ జర్కి హొళి (57211), బెల్గాం రూరల్లో లక్ష్మీ హెబ్బాల్కర్ (56,016), సర్వజ్ఞాన నగర్లో కెల చంద్ర జోసెఫ్ జార్జి (55,768), కుడిల్లీలో ఎన్. టి. శ్రీనివాస్ (54,350), చామరాజపేటలో బి. జడ్. జమీర్ అహ్మద్ ఖాన్ (53,953), కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఎం. రూప కళ (50,467), చిత్రదు ర్గలో కె.సి. వీరేంద్ర (53,300) భారీ మెజారిటీ లతో విజయం సాధించారు.
→మరోపక్క భాజపా కూడా నాలుగు స్థానాల్లో 50 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది.

ఆహార నాణ్యత సూచీలో తెలంగాణకు 15వ ర్యాంకు

→రాష్ట్రంలో ఆహార పదార్థాల నాణ్యత గాలిలో దీపంలా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు, తిను గుతున్నా ఆ మేరకు తనిఖీ వ్యవస్థ బలోపేతం ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించాయి. ఫుడ్ గిరాకీ పెరిగింది. హైదరాబాద్ దల చేసిన ఆహార నాణ్యత సూచీలో తెలంగాణకు
→బండారాల విక్రయ కేంద్రాలు భారీ సంఖ్యలో పెరు కొవిడ్ సమయంలో రాష్ట్రంలో కార్యకలా పాలు ఆగిపోయాయి. కాకపోవడమే దానికి కారణం. ఫలితంగా తనిఖీలు ప్రస్తుతం పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థి నామమాత్రంగా ఉంటున్నాయి. ఆహార కల్తీలు తులు నెలకొన్నాయి. బయటి ఆహారానికి తోపాటు నగ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాలు, పట్టణాల నుంచి ఒక మోస్తరు గ్రామా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) 2021-22 సంవత్సరానికి విడు ల్లోనూ ఆహార పదార్థాల విక్రయాలు భారీగా పెరిగాయి. వాటి తయారీ ప్రదేశాల్లో శుభ్రత, దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో 15వ స్థానం దక్కడం పదార్థాల్లో నాణ్యతపై పర్యవేక్షణ ఉండటం పరిస్థితికి నిదర్శనం. ఈ సూచీలో వంద మార్కు లేదు. పైగా కల్తీలకు అదుపే లేకుండా లకుగాను తెలంగాణకు 34.5% మార్కులే పోయింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని వచ్చాయి. అంటే మన రాష్ట్రంలో ఆహార నాణ్యతా ప్రాంతాలు కల్తీ ఆహార పదార్ధాల తయారీ ప్రమాణాలు 34.5% ఉన్నట్లు లెక్క తొలి కేంద్రాలుగా మారాయి.
→మూడు స్థానాల్లో తమిళనాడు (82%), గుజ రాత్(77.5%), మహారాష్ట్ర (70%) నిలిచాయి.

తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్

→ "భారత్లో రోబో టిక్స్ రంగంలో అపార అవకాశాలున్నాయి. రోబో టిక్స్ సాంకేతికత ఆరోగ్య రంగం, సరకుల రవాణా, వ్యవసాయం తదితర రంగాల్లో ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది.
→ ఈ క్రమంలో రాష్ట్రంలో బలమైన రోబోటిక్స్ వ్యవస్థను స్థాపిం చేందుకు, ఇతర పారిశ్రామిక రంగాలను మరింత ప్రోత్సహించేందుకు రోబోటిక్స్ విధానానికి శ్రీకారం చుట్టాం.
→ ఈ విధానం రూపొందించిన తొలిరాష్ట్రం మనదే. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా ఈ విధానం దోహదం చేస్తుంది" అని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.
→ రాయదుర్గం టీ హబ్ లో 'తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ (రోబో టిక్స్ విధానం)ను ఆయన ప్రకటించారు.
→స్టార్టప్ స్టేట్ సాంకేతిక ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకుని ప్రజల జీవితాలను మెరుగు పరుస్తోంది. 2017లో ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగాన్ని ప్రారం భించాం.
→4వ పారిశ్రామిక విప్లవంలో కీలకమైన ఏఐ (కృత్రిమ మేధ), బ్లాక్బైన్, డ్రోన్స్ తయారీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్, క్లౌడ్, రోబోటిక్స్ రంగాలను అభివృద్ధి పరచడంపై దృష్టి సారించాం. పాలసీ, పార్ట్ సర్షిప్, ప్రాజెక్ట్స్ (పీపీపీ) కార్యక్రమాన్ని చేపట్టి ఈ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
→మరో వైపు పారిశ్రామిక రంగం భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఆడిటివ్ మాన్యుఫ్యా క్చరింగ్ (ఎన్సీఏఎం), సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ వంటి కేంద్రాలను ఏర్పాటు చేశామ న్నారు.
→ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం రెండు దశాబ్దాల్లో రోబోల వినియోగం మూడు రెట్లు పెరి గింది.
→ చైనా, జపాన్, అమెరికా రోబోల వాడకంలో ముందంజలో ఉండగా పదో స్థానంలో ఉన్న భార త్లో రోబోటిక్స్ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
→ కొద్దికాలంలోనే అయిదో స్థానానికి చేరు కుంటాం" అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
→ ఈ కార్య క్రమంలో అయిదు సంస్థలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనుబంధ ఒప్పందాలు చేసుకుంది.

రోబోటిక్స్ విధానం.. విధివిధానాలు :-
→ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రోబోటిక్స్ విధానం అమలు. సుస్ధిర రోబోటిక్స్ వ్యవస్థ అభివృద్ధి
→ వ్యవసాయం, ఆరోగ్య, రంగం, ఇండస్ట్రియల్ ఆటోమే షన్, కన్స్యూమర్ రోబోటిక్స్పై దృష్టి
→ప్రయోగశాలలతో కూడిన రోబో పార్కుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, ఇంక్యుబేటర్లు, పరి శ్రమ, భాగస్వామ్యాలతో ఉత్పత్తి కేంద్రాలు, పని ఎమర్జింగ్ టెక్నాలజీ (ఈటీ) విభాగం అవగాహన ప్రదేశాల ఏర్పాటు
→రోబోటిక్స్ అంకురాలు, వాటికి పెట్టుబడులు, మార్కె టింగ్ సహకారం

భారత వృద్ధి వృద్ధి బలంగానే

→ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్ కు స్థిర త్వంతో కూడిన 'బీబీబీ' సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ పిచ్ వెల్లడించింది.
→ అయితే అధిక ద్రవ్యలోటు, రుణాల రూపంలో భారత క్కు సవాళ్లు ఎదురుకా వచ్చని వివరించింది.
→ తక్కువ పెట్టుబడుల గ్రేడ్ అయిన 'బీబీబీ' రేటింగ్ను 2006 ఆగస్టు నుంచి భారత్కు ఫిచ్ కొనసాగిస్తోంది.
→ అంతర్జాతీ యంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది.
→ పెట్టుబడులు పుంజుకో వడం కలిసి వస్తున్నందున, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 6% వృద్ధి రేటును భారత్ నమోదు. చేయొచ్చని పేర్కొంది.
→2022-23లో 7%, 2024- 25లో 6.7 శాతం వృద్ధిని ఫిచ్ అంచనా వేసింది.
→అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరగడం, అంత ర్జాతీయంగా గిరాకీలో స్తబ్దత లాంటివి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది.
→అయితే ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో బలమైన వృద్ధి, కొన్నేళ్లుగా భారత కార్పొరేట్, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు మెరుగవ్వడం, ప్రభుత్వం మౌలిక రంగంపై అధిక మూలధన వ్యయాలు వెచ్చిస్తుండటం.. ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేసే అంశాలుగా ఫిచ్ అభిప్రాయపడింది.
→సేవల రంగ ఎగుమతులూ భారత్కు దన్నుగా నిలుస్తాయని... మూలధన సమర్ధ నిర్వహణ ద్వారా రుణాల్లో బలమైన వృద్ధిని నమోదు చేసే స్థితిలో బ్యాంకులు కనిపిస్తున్నాయని వివరించింది.
→ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం మొత్తంమీద రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత (2-6%) ఎగువ లక్ష్యానికి సమీ పంలో కొనసాగి, 5.8 శాతంగా నమోదుకావచ్చని పేర్కొంది.
→గత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.7 శాతంగా ఉంది. 2025-26 కల్లా ద్రవ్యోలోటును జీడీపీలో 4.5 శాతానికి తీసుకు రావడం సవా లుతో కూడుకున్నదేనని పేర్కొంది.
→భారాన్ని తగ్గించుకునే విషయంలో స్థిరత్వం లోపించిందని.. భవిష్యత్లో భారత్ రేటింగ్కు ఇది ఇబ్బందిని తెచ్చిపెట్టే పరిణామంగా మారొ చ్చని ఫిచ్ వివరించింది.

కీర్తిచక్ర, శౌర్యచక్ర అవార్డుల ప్రదానం

→విధి నిర్వహణలో అద్వితీయమైన ధైర్య సాహసాలు ప్రదర్శించినందుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము మంగళవారం అవార్డులు ప్రదానం చేశారు.
→8 కీర్తిచక్ర అవార్డులు (అయిదు గురికి మరణానంతరం), 29 శౌర్యచక్ర అవార్డులు (అయిదుగురికి మరణానంతరం) ఈ సందర్భంగా అందజేశారు.
→రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
→ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల పరిష్కార సూచికలో అగ్రస్థానంలో యూఐడీఏఐ

→ ఫిర్యాదుల పరిష్కార సూచికలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ), కేంద్ర కార్మిక, ఉపాధి శాఖలు అగ్రస్థానంలో నిలిచాయి.
→ ఈ సూచిక కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజీఆర్ఎంఎస్) నెలవారీ నివేదిక ఏప్రిల్ 2023లో భాగం.
→ దీనిని పరిపాలనా సంస్కర ణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం విడుదల చేసింది.
→ ఏప్రిల్లో మొత్తం 1,06,847 ఫిర్యాదు లను కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు పరిష్క రించాయి.
→ ఇందుకు సగటున 17 రోజుల సమ యాన్ని తీసుకున్నాయి. గ్రూప్ 'ఏ'లో యూఐడీ ఏఐ, కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ అగ్రస్థానంలో నిలవగా, గ్రూప్ 'బీ'లో ఆర్థిక సేవల విభాగం, నీతి ఆయోగ్లు ఆధిక్యం కనబరచాయి.

'వివాహం'లో ఎన్నో మార్పులొచ్చాయ్

→ వివాహ తీరుతెన్నుల్లో ఎన్నో మార్పులొచ్చాయనే వాస్తవంతో పాటు.. దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందనే అంశంపై స్పృహ కలిగి ఉండాల్సిన అవసరముందని, వివాహమనేది చట్టపరంగా లభించే గుర్తింపు నకే పరిమితం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
→ సంప్రదాయాలను ఉల్లంఘించి చేసుకునే వివాహాలకు రాజ్యాంగం ప్రకారం హక్కులుండవనే వాదన సరికాదని అభిప్రాయపడింది.
→ స్వలింగ వివాహాలపై వరుసగా 8వ రోజూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి.
→ 'ఆర్టికల్ 14, 15, 17ద్వారా రాజ్యాంగమే సంప్రదా యాలను బ్రేక్ చేసింది.
→ ఆర్టికల్ 14 ప్రకారం.. చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం.. మతం, జాతి, కులం, లింగ, పుట్టిన ప్రదే శాల ఆధారంగా వివక్ష చూపడానికి వీల్లేదు.
→ ఆర్టికల్ 17 ప్రకారం.. అంట రానితనం నిషేధం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే కదా' అని జస్టిస్ భట్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
→ పెళ్లి అనేది ఇద్దరు కలిసి ఉండటానికి హక్కు కల్పిస్తుందని, పునరుత్పత్తి అనేది వివాహంలో అత్యంత ముఖ్యమైన అంశమేనని, అయితే అదే వివాహానికి చట్టబద్ధత, సామాజిక అంగీకారం అందిస్తుందన్నది కండిషన్ కాదనే వాస్తవాన్ని గ్రహిం చాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

డికెన్స్ నవల కొత్త రూపానికి పులిట్జర్

→ వర్గ భేదాలు ఇతివృత్తంగా కలిగిన రెండు నవలలకు సోమవారం కాల్పనిక సాహిత్యంలో పులిట్జర్ బహుమతులను ప్రకటించారు.
→ చార్లెస్ డికెన్స్ రచించిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్ రచించిన 'డీమన్ కాపర్ ఫీల్డ్' నవలతో పాటు 1920ల నాటి న్యూయార్క్ నగరంలో సంపద, మోసాలే ఇతివృత్తంగా హెర్నన్ డియాజ్ రచించిన 'ది ట్రస్ట్' నవలకు పులిట్జర్ బహుమ తులు ప్రకటించారు.
→ జీవిత కథ విభాగంలో ఎఫ్.బి.ఐ పూర్వ అధిపతి జె. ఎడ్గార్ హూవర్ జీవిత కథ 'జి- మ్యాన్'కు పులిట్జర్ లభించింది. దీన్ని బెవర్లీ గేజ్ రచిం చారు.
→నాటక విభాగంలో ఇరానీ అమెరికన్ సనాజ్ టూసి రాసిన 'ఇంగ్లిష్'కు, చరిత్ర విభాగంలో జెఫర్సన్ కోవీ విరచిత 'ఫ్రీడమ్స్ డొమినియనక్కూ పులిట్జర్లు దక్కాయి.
→ఆత్మ కథా విభాగంలో హువా సు రచించిన 'స్టే ట్రూ' కు, కవిత్వ విభాగంలో కార్ల్ ఫిలిప్స్ సంకలనా నికీ, సంగీత విభాగంలో రియానన్ గిడెన్స్, మైకేల్ ఏబెల్స్ ల గీతం ఓమార్కు పులిట్జర్లు వరించాయి.

కోటికి అరుదైన గౌరవం

→ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు కోటి అరుదైన గౌరవం అందుకోనున్నారు.
→ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్ల మెంట్లో గౌరవ జీవిత సాఫల్య పుర స్కారం స్వీకరించనున్నారు.
→తెలుగు సినిమా సంగీతానికి కోటి అందించిన సేవ లకు గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ (ఏఐఎస్ఈసీఎస్) ఈ పుర స్కారం అందించనుంది.
→ఈ వేడుక ఈ నెల 26న జరగనుంది. ఈ సంద ర్భంగా మహిళా సాధికారతపై కోటి స్వరపరిచిన ఓ గీతాన్ని గాయని సుస్మిత రాజేష్ వేదికపై ఆలపించనున్నారు.
→ఈ సందర్భంగా ఏఐఎస్ఈసీ ఎస్ ప్రతినిధి రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. "4వేల పాటల మైలురాయిని దాటిన కోటి గారిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్కు గెస్ట్ ఆఫ్ హానర్గా పిల వడం ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృ తిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయి" అన్నారు.

200 కిలోల రాజభవనం కేక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు

→మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ అద్భుతమైన ఆకృతు లను రూపొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటు న్నారు.
→ తాజాగా రాయల్ ఐసింగ్ విధానంలో ఆమె తయారు చేసిన 200 కిలోల భారతీయ రాజభవనం నమూనా కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించింది.
→ వీగన్ రాయల్ ఐసింగ్లో ఆరితేరిన ప్రాచీ పుణెలోని పింప్రి చించాడ్లో నివాసం ఉంటున్నారు.
→ గతంలో మిలాన్ కేథడ్రల్ నమూనాలో 100 కిలోల కేకును రూపొందించి ఆమె రికార్డును నెలకొల్పారు.
→ అత్యధిక వీగన్ రాయల్ ఐసింగ్ ఆకృతులను రూపొందించిన ప్రపంచ రికార్డు కూడా ఆమె పేరు మీదే ఉంది.
→ బ్రిటన్ రాజకుటుంబం కోసం తయారు చేసే కేకులను అలంకరించడానికి రాయల్ ఐసింగ్ను ఉపయోగిస్తారు.
→ ఇది ప్రతిష్టాత్మకమైన కళ. 11 ఏళ్ల క్రితం కేకు ఆర్టిస్ట్గా జీవితం ప్రారంభించిన ఆమె రాయల్ ఐసింగ్ గురించి తెలుసుకుని లండన్ లో ఈ కళను నేర్చుకున్నారు.

మన పొడవాటి ముక్కు మూలాలు నియాండర్తల్ జాతిలో!

→ఆధునిక మానవుల్లో పొడవాటి ముక్కులు.. నియాండర్తల్ అనే ఆదిమ జాతి నుంచి సంక్రమించాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
→ఇందుకు సంబంధిం చిన ఒక జన్యువును వారు గుర్తించారు. లండ న్లోని యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
→ ఆదిమ మానవజాతి ఆఫ్రికా నుంచి శీతల ప్రదేశాలకు వలస వెళ్లి, అక్కడి వాతావరణానికి సర్దుబాటు అయ్యే క్రమంలో వారికి ఈ పొడవాటి ముక్కులు వచ్చి ఉండొ చ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→15 ఏళ్ల కిందట నియాండర్తల్ జాతి జన్యుక్రమాన్ని పరి శోధకులు ఆవిష్కరించారు.
→నాటి నుంచి అనేక కొత్త విషయాలను వారు వెలుగులోకి తెచ్చారు.
→ఆధునిక మానవుడి పూర్వీకులు.. నియాండర్తల్ జాతితో సహజీవనం చేశారని వారు వివరించారు.
→ఫలితంగా ఆ జాతికి సంబంధించిన డీఎన్ఏ స్వల్పంగా నేటి మాన వుల్లోనూ ఉందని పేర్కొన్నారు.
→వివిధ దేశా లకు చెందిన 6వేల మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చారు. ముఖ ఆకృతికి సంబంధించిన 33 జన్యు ప్రదే శాలను శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తిం చారు.
→అందులో ఏటీఎఫ్ 3 అనే జన్యువు పొడవైన ముక్కుకు కారణమవు తోందని తేల్చారు. అది నియాండర్తల్ జాతి నుంచే సంక్రమించిందని పేర్కొన్నారు.

వ్యర్థాలను ప్రయోజనకర రసాయనాలుగా మార్చే సూక్ష్మజీవులు

→వ్యవసాయ, కాగిత వ్యర్థాల్లో కీలక ల్యులోజ్ మైన సెల్యులోజ్ను ప్రయోజనకర రసా యనాలుగా మార్చే సూక్ష్మజీవులను ఐఐటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
→అవి ఈ వ్యర్థాలను జీవ ఇంధనాలుగా, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే కార్బన్ గా మారుస్తాయని వివరించారు.
→ మొక్క లకు సంబంధించిన ఎండు వ్యర్థాలను లిగ్నోసెగా పిలుస్తారు. పుడమిపై పుష్కలంగా ఉన్న పునరుత్పాదక పదార్థాల్లో ఇవి ఒకటి.
→ పొలాలు, అడవులు, పరిశ్రమల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను బయోఇథనాల్, బయోడీజిల్, ల్యాక్టిక్ ఆమ్లం, ఫ్యాటీ ఆమ్లాలు వంటి ప్రయోజనకర రసాయనాలుగా మార్చే వీలుంది.
→ ఇందుకోసం బయోప్రాసెసింగ్ అనే ప్రక్రియను ఉపయోగి స్తారు.
→ ఇందులో అనేక అంచెలు ఉంటాయి. వాటివల్ల అవాంఛిత రసాయనాలూ వెలువడే అవకాశం ఉంది.
→ ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కన్సాలిడేటెడ్ బయోప్రాసెసింగ్ అనే వినూత్న విధానంపై దృష్టిసారించారు.
→ దీనికింద శాకారిఫికే షన్ (సెల్యులోజు సాధారణ చక్కెరలుగా మార్చడం), ఫెర్మెంటేషన్ (సాధారణ చక్కెరలను ఆల్కహాల్ మార్చడం) అనే రెండు విధానా లను ఒకే అంచెలోకి తీసుకురావాల్సి ఉంటుంది.
→ ఇందుకు ఉపయోగపడే రెండు రకాల సూక్ష్మజీవు లను ఐఐటీ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

మాతాశిశు మరణాలు భారత్లోనే అత్యధికం

→ప్రపంచవ్యాప్తంగా 2020లో మాతాశిశు మర ణాలు, నవజాత శిశువుల మరణాలు అధికంగా చోటుచే సుకున్న 10 దేశాల జాబితాలో భారత్ ముందుంది.
→ఈ తరహా మరణాల్లో 60 శాతం ఈ పది దేశాల్లోనే సంభ వించాయి. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో ఈ నెల 8 నుంచి అంతర్జాతీయ మాతాశిశు ఆరోగ్య సదస్సు ప్రారం భమైన సందర్భంగా ఐరాసతో అనుబంధమున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, యుఎన్ఎఫ్పీఏ విడుదల చేసిన నివేదికలో పై వివరాలు ఉన్నాయి.
→ 2020-21లో ప్రపంచమంతటా 2.9 లక్షల గర్భిణి మరణాలు, 19 లక్షల గర్భస్థ శిశు మరణాలు, 23 లక్షల నవజాత శిశు మర ణాలు సంభవించాయని నివేదిక వెల్లడించింది.
→ 2020- 21లో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మరణాలు 45 లక్షలు నమోదు కాగా, వాటిలో 7.88లక్షల మరణాలు భారత్ లోనే సంభవించాయి.
→ ప్రపంచవ్యాప్తంగా సంభవిం చిన జననాల్లో 17 శాతం భారత్లోనే చోటుచేసుకు న్నాయి.
→ ఈ తరహా మరణాలు భారత్లో అధికంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం అయ్యుండొచ్చని నివే దిక తెలిపింది.
→ కాలుష్య ప్రభావం, ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు తగ్గడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తర ణకు తగు పెట్టుబడులు పెట్టకపోవడమే ఈ దుస్థితికి కారణమని నివేదిక తెలిపింది.
→ 2020లో ప్రపంచవ్యాప్తంగా నెలలు నిండకముందే పుట్టిన శిశువుల సంఖ్య 1.34 కోట్లు.
→ అందులో 45 శాతం మంది పాకిస్థాన్, భారత్, చైనా, నైజీరియా, ఇదియోపియాలలోనే జన్మించారు.

'ఓడీఎఫ్ ప్లస్' గ్రామాల్లో తెలంగాణ టాప్

→స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
→ఈమేరకు గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జలశక్తి శాఖ బుధవారం వెల్లడించింది.
→స్వచ్ఛభారత్ మిషన్లో భారత్ మరో మైలురా యిని దాటినట్లు పేర్కొంది.
→మిషన్ రెండో దశలో దాదాపు 50% గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయికి చేరాయని.. ఇందులో 100% ఫలితాలు సాధించి తెలంగాణ టాప్ లో నిలిచినట్లు వెల్లడించింది.
→బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందిన ఈ గ్రామాల్లో ఘన లేదా ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటే వాటిని ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా పిలు స్తారు.
→మే 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
→ఇందులో అన్ని గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్ గా కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలం గాణ (100%) తొలిస్థానంలో నిలిచింది.
→తర్వాతి స్థానాల్లో కర్ణాటక (99. 5%), తమిళనాడు (97.8%), ఉత్తర్ ప్రదేశ్ (95.2%)లు ఉండగా చివరి స్థానంలో గుజరాత్ ఉంది.
→చిన్న రాష్ట్రాల్లో గోవా (95.3%), సిక్కిం (69. 2%)లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
→కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, దామన్ దయ్యూ, లక్షద్వీప్లలో 100% గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ హోదా పొందినట్లు తెలిపింది.
→ఓడీఎఫ్ ప్లస్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తంచేశారు.

ముగ్గురి డీఎన్ఏలతో ముద్దుల చిన్నారులు! బ్రిటన్ చరిత్రలో తొలిసారి జననం

→వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు.
→తమ దేశ చరిత్రలో తొలి సారిగా.. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏను పంచుకుంటూ శిశువులు జన్మించేలా చేశారు.
→'మైటోకాండ్రియా దానం' అనే వినూత్న విధా నాన్ని ఇందుకు ఉపయోగించారు.
→బ్రిటన్ లోని 'మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి ప్రాధికార సంస్థ' బుధవారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
→ఈ విధానంలో ఎంతమంది శిశు వులు పుట్టారన్న సంగతిని స్పష్టంగా వెల్ల డించలేదు.
→వారి సంఖ్య 5 కంటే తక్కువ అని మాత్రమే పేర్కొంది.
→ఆయా కుటుంబాల గోప్యతను పరిరక్షిం చేందుకే పూర్తి వివరాలు బయటపె ట్టడం లేదని తెలిపింది.
→కణాల్లోని అత్యంత కీలక భాగాల్లో మైటోకాండ్రియా ఒకటి. దాన్ని 'కణ శక్తి భాండాగారం' అని పిలుస్తారు.

ఏమిటీ ప్రయోగాత్మక విధానం? :-
→ఫార్టీ మైటోకాండ్రియాతో బాధపడుతున్న మహి శల సంతానానికి ఇబ్బందులు తలెత్తకుండా నివా రించేందుకు పరిశోధకులు వినూత్న విధానాన్ని ఆవిష్కరించారు.
→ఇందులో తొలుత బాధిత మహిళ అండం నుంచి జన్యుపదార్థాన్ని సేకరి స్తారు. ఆ పదార్థాన్ని దాత అండంలో ప్రవేశ పెడ తారు.
→అంతకుముందే దాత అండం నుంచి కీలక జన్యుపదార్థాన్ని తొలగిస్తారు.
→ఆరోగ్యవంత మైన మైటోకాండ్రియాను (ఇందులోనూ దాత డీఎన్ఏ కొంత ఉంటుంది) మాత్రం అందులోనే ఉంచుతారు.
→ఆపై అండాన్ని ఫలదీకరణం చెందించి.. తల్లి గర్భంలో ప్రవేశ పెడతారు.
→ ఈ విధానంలో జన్మించే శిశువులో దాతకు సంబంధిం చిన జన్యుపదార్థం 1% కంటే తక్కువే ఉంటుంది. తండ్రితో కలిపితే మొత్తంగా ముగ్గురి డీఎన్ఏ శిశువులో ఉంటుందన్నమాట.
→ మైటోకాండ్రియా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు ఈ విధానం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందొచ్చు.
→అయితే వంశపారంపర్యంగా వచ్చే లోపాలను అధిగమించేందుకు ఇతర మార్గాలేవీ అందుబా టులో లేనప్పుడు మాత్రమే బాధితులకు ఈ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశం కల్పి స్తామని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.
→ఈ విధానంలో జన్మించే పిల్లలకు భవిష్యత్తులో తిరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదని పలువురు నిపుణులు పేర్కొన్నారు. మైటోకాం డ్రియా దానం విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించినట్లు 2016లోనే అమెరికా ప్రకటిం చడం గమనార్హం.

స్వలింగ సంపర్కులైనా దత్తత తీసుకోవచ్చు: సుప్రీంకోర్టు తీర్పు

→ వైవాహక స్థితితో సంబంధం లేకుండా వ్యక్తులెవరైనా పిల్లల్ని దత్తత తీసుకునేందుకు మన చట్టాలు అనుమతిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
→ స్వలింగ సంపర్కులైనా ఇలా దత్తత తీసుకోకుండా నిరోధించలేమని తెలిపింది.
→ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తిం పునివ్వడంపై విచారణను తొమ్మిదో రోజైన బుధ వారం కొనసాగించింది.
→ 'జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్), 'కారా' తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాద నలు వినిపించారు.
→ 'అన్నింటికన్నా పిల్లల సంక్షేమం ముఖ్యం. పిల్లల్ని దత్తత తీసుకోవడం ప్రాథమిక హక్కు కిందికి రాదని గతంలో పలు తీర్పులు పేర్కొన్నాయి.
→ సహజంగా స్త్రీ పురుషులకు పుట్టిన పిల్లల సంక్షేమం మీద, వారి ప్రయోజనాల పరిరక్షణమీదే మన చట్టాలన్నీ దృష్టి సారించాయి.
→ వేర్వేరు లింగాల జంటలను, స్వలింగ సంపర్కు లను భిన్నంగా పరిగణిస్తూ వస్తున్నారు' అని ఆమె తెలిపారు.
→ పిల్లల సంక్షేమమే పరమావధి అనే విష యంలో సందేహమేమీ లేదని ధర్మాసనం స్పందిం చింది.
→ వేర్వేరు కారణాలతో పిల్లల్ని దత్తత తీసు కోవడాన్ని మన చట్టాలు గుర్తిస్తున్నాయి.
→ ఒంటరి వ్యక్తులు కూడా ఇలా దత్తత తీసుకోవచ్చు. జీవసంబంధంగా జన్మను ఇచ్చే అవకాశం ఉన్నవారూ ఈ మార్గాన్ని అనుసరిం చవచ్చు.
→ పేగుబంధంతోనే పుట్టుక ఉండాలన్నది తప్పనిసరేమీ కాదు.
→ జీవిత భాగస్వాముల్లో ఒకరు మర ణించినప్పుడు మిగిలినవారొక్కరే పిల్లల సంరక్షణ చూసుకోవాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి?' అని సీజేఐ ప్రశ్నించారు.
→దత్తత తీసుకునేందుకు వ్యక్తు లకు ఉన్న హక్కులు.. సహజీవన భాగస్వా మ్యంలో ఉన్నవారికి ఉండవా అని అన్నారు.
→ఈ కేసు విచారణ నుంచి సీజేఐ జస్టిస్ డి. వై. చంద్రచూడ్ వైదొలగాలని కోరుతూ ఒకవ్యక్తి దాఖలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్క రించింది.
→సీజేఐ వైదొలగాలని కోరుతున్న వ్యక్తి దానికి చూపిన కారణాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు.
→స్వలింగ వివాహాల కోర్టు ఎలాంటి రాజ్యాంగ ప్రకటన చేసినా అది సరైన చర్య కాబోదనీ, కోర్టు ఇచ్చే తీర్పును పాటించేందుకు వివిధ ఆచారాల్లో ఆయా మత పెద్దలు నిరాకరిస్తే వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి వస్తుందని చెప్పారు.
→ఇలాంటి వివాహాలను అనుమతిస్తే దాని పర్యవసానాలు, తదనంతర పరిణామాలు అనూహ్యంగా ఉండవచ్చన్నారు.

ఊబకాయ సమస్యకు ఆయుర్వేద పరిష్కారం

→ఊబకాయానికి ఆయు ర్వేద పరిష్కారాన్ని తాము కనుగొన్నట్లు పతంజలి పరి శోధన బృందం తెలిపింది.
→'దివ్య వెయిట్ గో' అనే ఈ ఔషధం ఊబకాయులకు అమృత సమానంగా పనిచే స్తుందని పేర్కొంది.
→నిత్యం వ్యాయామంతోపాటు వ్యాయామం లేకుండా కూడా ఈ ఔషధాన్ని స్వీకరిస్తే శరీరం బరువు త్వరితగతిన తగ్గుతుందని ఆచార్య బాల కృష్ణా జీ తెలిపారు.
→దీనివల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని స్పష్టం చేశారు. 'దివ్య వెయిట్ గో' ఔషధంతో కొలె స్ట్రాల్, గ్లూకోజ్ సాధారణ స్థాయికి చేరి రోగ నిరోధకత పెరుగుతుందన్నారు.
→ఈ అధ్యయన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'బయోమెడిసిన్ అండ్ ఫార్మాకోథెరపీ'లో ప్రచురితమైనట్లు వెల్లడించారు.

జాతీయ సాంకేతిక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ

→ సాంకేతికత అనేది ఆధిపత్యాన్ని చూపించుకో వడానికి కాదని దేశంలో అభివృద్ధిని ఉరకలెత్తించడానికి మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
→ పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన 1998 మే 11.. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఆయన అభివర్ణించారు.
→ మే 11ను జాతీయ సాంకేతిక దినంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే. 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్ర మంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
→ తమ ప్రభుత్వం టెక్నాలజీని సమానత్వ సాధనకు, సామాజిక న్యాయ కల్పనకు ఉపయోగిస్తోం దని వెల్లడించారు.
→ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ పేయీ ఆధ్వర్యంలో జరిగిన పోఖ్రాన్ పరీక్షలు... దేశ సత్తాను చాటడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారత్ పలుకుబడిని పెంచాయని మోదీ అన్నారు.
→ఈ సందర్భంగా ఆయన లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వే టరీ-ఇండియా (ఎల్ఐజీవో-ఇండియా)తో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేశారు.
→దేశ ఫిజన్ మోలీబ్ది నమ్-99 ఉత్పత్తి కేంద్రం, విశాఖపట్నంలో ఉన్న హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ తో పాటు కొన్ని సంస్థలను జాతికి అంకితం చేశారు.
→భారతదేశం శాంతికాముక దేశం అయితే అవ్వొచ్చు కానీ.. తన ఆత్మాభిమానానికి భంగం కలిగితే చేతులు ముడుచు కుని కూర్చోదని పోఖ్రాన్ అణు పరీక్షలు ప్రపంచానికి చాటి చెప్పాయని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు.
→జాతీయ సాంకేతిక దినోత్సవ కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు.

2022లో వలస పోయినవారు 7.1 కోట్ల మంది

→ ప్రపంచవ్యాప్తంగా గతేడాది సాయుధ సంఘర్షణలు, ప్రకృతి ఉత్పా తాలతో తమ దేశాల్లోని ఇతర ప్రాంతాలకు వలసపోయిన ప్రజల సంఖ్య సుమారు 7.1 కోట్లుగా తేలింది.
→ వీరిలో సాయుధ సంఘర్షణల వల్ల నిర్వాసి తులైనవారే 6.2 కోట్ల మంది ఉన్నారు.
→ వరదలు, కరవు బాధితులు 87 లక్షల మంది. నార్వే శరణార్థి మండలికి చెందిన అంతర్గత నిర్వాసితుల నిఘా కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం నిర్వాసితుల సంఖ్య 2021కన్నా 2022లో 20 శాతం పెరిగింది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ 2022 చివరకు 59 లక్షల మంది ఇళ్లూవాకిళ్లూ వదలి స్వదేశంలోనే సురక్షిత ప్రాంతా లకు తరలిపోయారు.
→ సిరియాలో దశాబ్ద కాలంగా సాగుతున్న అంతర్యుద్ధం 68 లక్షల మందిని నిర్వాసితులను చేసింది.

చేర్యాలలో శాతవాహన కాలం ఆనవాళ్లు

→ సిద్దిపేట జిల్లా చేర్యాలలోని చతురస్రాకారపు దిబ్బ లాంటి పాటిగడ్డ మీద పలు శాతవాహన, ఇక్ష్వాకుల కాలాల ఆన వాళ్లను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు ఒక ప్రకటనలో తెలిపారు.
→ అమ్మదేవత, యక్షిణి, బొమ్మ పాదం, టెర్రకోట బొమ్మలు, పూసలు, చిత్తుడు బిళ్లలు, పెద్ద కాగులు పెంకులు, పగిలిన కంచుళ్లు, ఒక దంపుడు రాయి, పెద్ద ఇటుకలను కను గొన్నామన్నారు.
→ 'పాటిగడ్డ మీద కొత్త రాతియుగానికి చెందిన మూడు రాతి గొడ్డళ్లు దొరికాయి.
→ టెర్రకోట బొమ్మల్లో విరిగిన బొమ్మపాదం, పగి లిపోయిన యక్షిణి తల, తల లేని అమ్మదేవతలున్నాయి. ఇవి ఇక్ష్వాకుల శైలికి చెందినవి.
→ ఇది చారిత్రక సంపదగల ప్రదేశం. తెలంగాణ పురావ స్తుశాఖ ప్రత్యేక శ్రద్ధవహించి తవ్వకాలు చేపట్టాలి' అని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, క్షేత్ర పరిశోధన సభ్యులు వేముగంటి ముర ళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు కోరారు.

సింగరేణి సంచాలకుడికి జియోమైన్ టెక్ అవార్డు

→ సింగరేణి సంస్థ ఫైనాన్స్ సంచాలకులు ఎన్. బలరాంకు జియోమైన్టిక్ గ్లోబల్ రేయిన్బో అవార్డు లభించింది.
→ జాతీయ స్థాయిలో అత్యు త్తుమ ఖనిజ సంస్థల అధికారులను ప్రోత్సహించేందుకు జియోమైన్టెక్ సంస్థ ఈ అవార్డు ప్రకటించినట్లు సింగ రేణి యాజమాన్యం వెల్లడించింది.
→ భువనేశ్వ ర్లో నిర్వహించిన జాతీయ సాంకేతిక దినోత్సవ కార్యక్ర మంలో ఒడిశా రాష్ట్ర పర్యావరణ అటవీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ అమత్ ఈ అవార్డును అంద జేశారు.
→ సింగరేణి హెస్ఆర్డీ జీఎం వెంకటేశ్వర్లు, నైనీ ఏజీఎం మజుందార్, ఎస్ఈ రాజశేఖర్ లు ప్రతినిధులుగా ఈ అవార్డు అందుకున్నారు.
→ గడిచిన ఆర్థిక సంవత్స రంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా, సీఎస్సాఆర్, పర్యావరణ చర్యలకు గుర్తింపుగా విల్జియార్ గోల్డెన్ రేయిన్బో అవార్డును సైతం సంస్థకు అందజేశారు.

మహారాష్ట్రలో పరిణామాలివీ.. తిరుగుబాటు నుంచి తీర్పు వరకు..

శివసేనలో ఏన్నాధ్ శిందే తిరు గుబాటు కారణంగా గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. చివరకు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడం.. శిందే నేతృ త్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఆ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు, తిరుగు బాటు ఎమ్మెల్యేల అనర్హత వంటి అంశాలపై అటు ఉద్ధవ్ రాత్రే, శిందే వర్గాలు దాఖలు చేసిన పలు పిటిష న్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
జూన్ 20, 2022: మహారాష్ట్రలో జూన్ 20న శాసన 'మండలి ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటింగ్ జరిగిన ఆ వెంటనే శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ శిందే కనిపిం చకుండా పోయారు. ఆయనతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు గుజరాత్లోని సూరత్లో ఉన్నట్లు తేలింది.
జూన్ 21: మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరి గిందని అనుమానించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ రాత్రే... శివసేన ఎమ్మెల్యేలతో బేటీ అయ్యారు. అనంతరం అసెంబ్లీలో శివసేన పార్టీ నేత బాధ్యతల నుంచి శిందేను తొలగించారు.
జూన్ 22: అదే సమయంలో ఇందే నేతృత్వంలోని 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి అస్సాంలోని గువాహటికి మకాం మార్చారు. గుజరాత్, అస్సాంలు.. రెండూ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలే.
జూన్ 23: శివసేన అసెంబ్లీ వ్యవహారాల పార్టీ. నేతగా శిందేను రెబల్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అదే రోజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నా స్వీకారం చేశారు. ' టీసులు జారీ చేశారు. అదే రోజు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం వర్ష నుంచి మాతో శ్రీకి మకాం మార్చారు.
జూన్ 26: డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడాన్ని శిందే వర్గం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 27న విచారిం చిన సుప్రీంకోర్టు.. అనర్హత అంశాన్ని నిలిపివేయడంతో ఎమ్మెల్యేలకు ఊరట కలిగింది.
జూన్ 29: ఎంవీఏ ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కో వాలన్న మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాలను నిలిపేసేం దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో 9 రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదిం చుతూ అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండానే ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ రాత్రే రాజీనామా చేశారు.
జూన్ 30: రాక్రే రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే.. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే. ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ
జులై 3-4: అసెంబ్లీ ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశమైంది. స్పీకర్గా భాజపా ఎమ్మెల్యే రాహుల్ సర్వేకర్ను ఎన్నుకున్నారు. జులై 4న నిర్వ హించిన అవిశ్వాస తీర్మానంలో శిందేకు మద్దతుగా 164 ఓట్లు.. వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి.
ఆగస్టు 23: పార్టీ ఫిరాయింపులు, విలీనం, అనర్హత అంశాలపై శివసేనతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సంబంధించి దాఖ లైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మా సనానికి బదిలీ చేసింది.
అక్టోబరు 8: అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఎన్నికకు ముందు శివసేన పార్టీ ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్ని కల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా ఆ రెండు వర్గాలకు వేర్వేరు గుర్తులను కేటాయించింది.
ఫిబ్రవరి 17, 2023: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గమే అసలైన శివసేన పార్టీ అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ వర్గానికే 'బాణం విల్లంబులు గుర్తును || కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 21: రాజ్యాంగపరమైన అంశాలను సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్ల తుది విచారణను సుప్రీం ధర్మాసనం మొద పెట్టింది.
మార్చి 16: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనలోని ఇరు వర్గాలు వేసిన పిటిషన్ల విచారణను పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం.. వాటి తీర్పును వాయిదా వేసింది.
మే 11: బల పరీక్షను ఎదుర్కోకుండా ఉద్ధవ్ ఠాక్రే స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించలేమని పేర్కొంది. గవర్నర్, స్పీకరు నిర్ణయాలను తప్పుబట్టింది.

సరబో జ్యోత్, దివ్యలకు స్వర్ణం

→ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ లో భారత క్రీడా కారులు టీఎస్ దివ్య, సరబో జ్యోత్ సింగ్ శుభారంభం చేశారు.
→ఈ జోడీ పోటీల రెండో రోజు, గురువారం మిక్స్డ్ టీమ్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది.
→55 జట్లు పాల్గొన్న అర్హత రౌండ్లో 581 పాయింట్లతో అగ్రస్థానం సాధించిన దివ్య, సరబ్ జ్యోత్ జంట. పసిడి పోరులో 16-14తో డామిర్ మికెచ్-జొరానా అరునోవిచ్ (సెర్బియా) జోడీని ఓడించింది.
→ప్రపంచకప్ లో సరబో జ్యోతికిది వరుసగా రెండో స్వర్ణం.
→మార్చిలో భోపాల్లో జరిగిన టోర్నీలో అతను ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గాడు.

త్వరలో దేశమంతటా డ్రోన్లతో రక్తం రవాణా

→ డ్రోన్లతో రక్తాన్ని సరఫరా చేసే సాంకే తిక పరిజ్ఞానాన్ని త్వరలోనే దేశమంతటా విస్త రించనున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు.
→ 'ఐడ్రోన్' కార్య క్రమం కింద ఈ మేరకు ప్రయోగాత్మకంగా చేప ట్టిన ట్రయల్ రన్ తాజాగా విజయవంతమైం దని చెప్పారు.
→రక్తం, దాని సంబంధిత ఉత్పత్తు లను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద, ఎలాంటి ఇబ్బం దులూ లేకుండా డ్రోన్ ద్వారా రవాణా చేయగల సామర్థ్యాన్ని సముపార్జించుకున్నట్లు వెల్లడిం చారు.
→ట్రయల్ రన్లో భాగంగా- గ్రేటర్ నోయి డాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్, దిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ మధ్య ఓ డ్రోన్ 10 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేయడం గమనార్హం.

సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

→ తన వాహకనౌకలను భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా మార్చుకునే ప్రణాళికల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2000 కిలోన్యూటన్ల సామర్థ్యమున్న సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది.
→ తమిళనాడు లోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీ ఆర్సీ)లో ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రముఖ న్యాయవాది రాజీవ్ లూథ్రా కన్నుమూత

→ దేశంలోని అతిపెద్ద న్యాయ సంస్థల్లో ఒకటైన లూథ్రా అండ్ లూథ్రా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్ నర్ అయిన రాజీవ్ లూథ్రా (67) కన్నుమూశారు.
→ స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆకస్మి కంగా మరణించినట్లు కుటుంబానికి సన్నిహితుడైన ఓ న్యాయవాది తెలిపారు.

హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వే రియం

→ హైదరాబాద్ మహా నగర సిగలోకి మరో కలికితురాయి చేరనుంది. నగర శివారులో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వే రియం నిర్మించనున్నారు.
→ ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యంతో రూ.350 కోట్లతో దీన్ని తీర్చిదిద్దను న్నారు.
→ ఈమేరకు హైదరాబాద్ మహానగరాభి వృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.
→బిడ్ను దక్కించుకున్న సంస్థకే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్(డీబీఎఫ్ ఓటీ) పద్ధతిలో 30 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టును అప్పగిం చనున్నారు.
→ ఇప్పటికే హిమాయత్సాగర్ సమీపంలో కొత్వాల్గూడ వద్ద 150 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏకో పార్కును అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
→ ఇందులోనే అయిదు ఎకరాల్లో భారీ టన్నెల్ అక్వేరి యాన్ని నిర్మించనున్నారు.
→ప్రస్తుతం చెన్నై మెరైన్ పార్కు, అహ్మదాబాద్ లోని సైన్స్ సిటీలో ఈ తరహా అక్వేరియంలు ఉన్నాయి.
→వాటిని పరిశీ లించిన అధికారులు వాటి కంటే భిన్నంగా ప్రపంచస్థాయి హంగులతో కొత్వాల్ గూడలో ఏర్పాటు చేయనున్నారు.
→ఈ నెలాఖరులోగా టెండర్లు సమర్పించాలని గడువు విధించారు.
→అక్వేరియంలో 180 డిగ్రీల కోణంలో 100 మీటర్ల పొడవు, 3.5 అడుగుల వెడల్పులో వివిధ రకాల టన్నెళ్లు నిర్మిస్తారు.
→వీటి లోపలికి వెళ్లే పర్యాటకు లకు సముద్రం అంతర్భాగంలోకి వెళ్లిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దుతారు.
→సముద్రం, నదుల నుంచి తెచ్చే నీటిని నింపేందుకు 3వేల మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వీటిలో వేయి రకాల సముద్ర జీవులను పెంచుతారు.
→అక్వేరియం లోపల రెస్టారెంట్, డోమ్ థియేటర్, 7డీ, వీఆర్ థియేటర్లు ఇతర ఆధునిక హంగులను కల్పిస్తారు.
→పుట్టిన రోజు, పెళ్లిరోజు ఇతర వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక హాళ్లు అందుబాటులో ఉంటాయి.
→పర్యాటకులు ఇక్కడే ఒకట్రెండు రోజులు గడిపేందుకు వీలుగా సమీపంలోనే చెక్కతో కాటేజీలను నిర్మించనున్నారు.
→కొండ ప్రాంతం కావడంతో బంగీజంప్, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ అంశా లను అదనంగా జోడించనున్నారు.

హైదరాబాద్ లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సాంకేతిక కేంద్రం

→ హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని (టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేసేందుకు 'లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ముందుకొచ్చింది.
→ ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందిని ఈ సంవత్సరాంతానికి నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది.
→ మంత్రి కేటీఆర్ తో లండన్లో 'లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్' గ్రూప్ సీఐఓ ఆంథోనీ మెక్ కార్తీ భేటీ అయ్యారు.
→ అనంతరం హైదరాబాద్లో తమ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు మెకార్తీ ప్రకటించారు.
→ మంత్రి కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో ఆంథోనీ మెక్ కార్తీ కుదుర్చుకు న్నారు.
→ తెలంగాణలో ఈ సంస్థ సాంకేతిక కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ నగరం లోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు అద్భుతమైన ఊతం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
→ ఆయా రంగాల్లో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నా యని పేర్కొన్నారు.
→ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ దాదాపు 190 దేశాల్లో ఖాతాదారులకు సేవ లను అందిస్తోంది.
→ తన విస్తృతమైన కార్యకలాపా లతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ సేవా రంగంలో దిగ్గజ సంస్థగా ఒకటిగా నిలిచింది.

జైళ్ల చట్టాల్లో సంస్కరణలు

→వలస పాలకులు రూపొందిం చిన 130 ఏళ్లనాటి 'ప్రిజన్స్ యాక్ట్ 1894'ను సంస్కరించాలని కేంద్రం నిర్ణయించింది.
→వర్త మాన అవసరాలను అనుసరించి సంస్కరణలను ప్రతిపాదించింది.
→కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవ లప్మెంట్ సంస్థ వివిధ రాష్ట్రాల జైళ్ల అధికా సంస్కరణల అభిలాషులతో సంప్రదింపులు జరిపి 'ప్రిజన్స్ యాక్ట్ 1894' స్థానంలో 'నమూనా ప్రిజన్స్ యాక్ట్ 2023'ని రూపొందించింది.
→ఖైదీ లను సంస్కరించి చట్టానికి కట్టుబడి నడుచుకొనే పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు, సమాజంలో వారికి పునరావాసం కల్పించే లక్ష్యంతో ఇందులో మార్పులను ప్రతిపాదించినట్లు కేంద్రహోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
→ప్రస్తుత చట్టంలోని లోపా లను సరిదిద్ది సరి మార్గద 'మోడల్ ప్రిజన్స్ యాక్ట్ -2023'లో సమ్మిళితం ర్శనం చేసేలా కొత్త నమూనా నిబంధనలను అవసరమైన మేరకు రాష్ట్రాలు చట్టాన్ని రూపొం చినట్లు పేర్కొంది.
→జైళ్ల నిర్వహణలో సాంకేతికత విని యోగం, ఖైదీల్లో సత్ప్రవర్తనను ప్రోత్సహించడా నికి పెరోల్, స్వల్పకాలిక సెలవులు, జైలు శిక్ష నుంచి ఉపశమనం కల్గించే నిబంధనలను ఇందులో పొందుపరిచినట్లు తెలిపింది.
→మహి ళలు, ట్రాన్స్ జెండర్ ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం కాపాడేందుకు ప్రత్యేక నిబంధనలు ప్రతి పాదించినట్లు పేర్కొంది.
→హోంమంత్రి అమిత్ షా మార్గదర్శనం మేరకు ఈ నమూనా చట్టాన్ని ఖరారు చేసినట్లు పేర్కొంది.
→ఇది రాష్ట్రాలకు మార్గసూచికగా పనిచేస్తుందని, దీన్ని తమ పరి ధిలో అవి స్వీకరించవచ్చని అభిప్రాయపడింది.
→'ప్రిజన్స్ యాక్ట్ 1894 తోపాటు ప్రిజన్స్ యాక్ట్ 1900,ట్రాన్సఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950లను కూడా సమీక్షించి, వాటిలోని అవసరమైన నిబంధనలను చేసినట్లు తెలిపింది.
→ఈ నమూనా చట్టంలోని స్వీకరించి, ఇప్పుడు తమ పరిధిలో అమల్లో ఉన్న మూడు చట్టాలను రద్దు చేయొచ్చని పేర్కొంది.
→ఇప్పటివరకు అమల్లో ఉన్న 'ప్రిజన్స్ యాక్ట్ 1894 ఖైదీలను జైళ్లలో ఉంచడానికే ప్రాధాన్యం ఇస్తోం దని, అందులో సంస్కరణలు, పునరావాస కల్ప నకు వీలు లేదని తెలిపింది.
→రాజ్యాంగ నిబంధ నల ప్రకారం జైళ్లు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ఇందుకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నట్లు పేర్కొంది.
→ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో పలు లోపాలున్నట్లు తాము గమ నించినట్లు హోంశాఖ తెలిపింది.
→ఏవో కొన్ని రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాలు పాత చట్టాన్ని అనుసరించే వెళ్తున్నట్లు పేర్కొంది.

'ది సోల్స్ ఫ్యూయెల్' పుస్తకం విడుదల చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ

→ జీవితంలో 'నో' చెప్పడం కీల కమని, కష్టమైనా అలవాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు.
→ ఆయన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అమి కస్ క్యూరీ విజయ్ హన్సారియా కోడలు అనూషా హన్సారియా రాసిన 'ది సోల్స్ ఫ్యూయెల్' పుస్త కాన్ని విడుదల చేశారు.
→ ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ "జీవితంలో 'నో' అని చెప్పడం ఎంత ముఖ్యమో ఈ పుస్తకంలో పేర్కొ న్నారు. 'నో' చెప్పడం అలవాటు చేసుకున్న వారి జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది.
→ కష్టమైనప్ప టికీ దాన్ని అలవాటు చేసుకోవాలి" అని తెలి పారు.
→ న్యాయమూర్తిగా ఉన్నంతకాలం కేసులు, తీర్పులతోనే గడిచిపోయిందని, ఇప్పుడిప్పుడే నిదా నంగా పుస్తకాలు చదవడం ప్రారంభించానని చెప్పారు.
→ "నా వ్యక్తిగత గ్రంథాలయంలో వేల పుస్తకాలు ఉన్నాయి. న్యాయానికి సంబంధించినవే కాకుండా అన్నిరకాల రచనలూ చదువుతాను.
→ ఈ పుస్తకం చదివిన తర్వాత యువత ఆలోచనాశక్తి ఎంత బలంగా ఉందో తెలిసి వచ్చింది.
→ యుక్తవ యసులో ఉన్న రచయిత రాబోయే సమస్యలను ముందే గ్రహించి భవిష్యత్తును ఊహించడం గొప్ప విషయం.
→ పదవీవిరమణ తర్వాత పరిస్థితి, వృద్ధాప్యంలో మనుగడ సాగించడం ఎలా అన్న విషయాలను ఈ పుస్తకంలో స్పృశించారు.
→ పదవీ విరమణ చేసిన నాలాంటి వారికి ఇవి చాలా ముఖ్యం.
→ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడటం సమాజంలో సమస్యగా మారింది.
→ ఇప్పుడు కేవలం తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు.
→ చివరకు పిల్లలు ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎక్కడికో వెళ్లిపోతే తల్లిదం డ్రులు మాత్రమే మిగిలిపోతున్నారు.
→ ఈ పుస్త కంలో జీవితాన్ని అర్ధంచేసుకొని సౌకర్యవంతంగా జీవించడం ఎలాగో వివరంగా చెప్పారు.
→ మనం జీవితంలో ఎవర్ని కలిసినా వారి నుంచి నేర్చుకో వడానికి ఎంతో కొంత ఉంటుంది.
→ ఎదుటి వారి నుంచి నేర్చుకొనే సామర్థ్యం మనం మనిషిగా ఎలా రూపాంతరం చెందామన్నది చెబుతుంది" అని జస్టిస్ ఎన్. వి. రమణ అన్నారు.

మానవ పాన్జీనోమ్ ముసాయిదా సిద్ధం

→భిన్న వంశ మూలాలకు చెందిన 47 మంది జన్యుపదార్థాలను కలగలపడం ద్వారా రూపొందించిన మానవ తొలి 'పాన్జీనోమ్' ముసాయిదాను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జన్యు వైవిధ్యంపై మరింత లోతైన, స్పష్టమైన అవగాహన కల్పి తెస్తుందని వారు వివరించారు.
→హ్యూమన్ పాన్జీనోమ్ రిఫరెన్స్ కన్సా ర్షియం (హెచ్పీ ఆర్సీ) దీన్ని రూపొందించింది.
→ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో అమెరికా, ఐరోపాలోని డజనుకుపైగా పరిశో ధన సంస్థలు పాలుపంచుకున్నాయి.
→ప్రస్తుత జన్యుక్రమానికి అదనంగా 11.9 కోట్ల 'అక్షరాల' ను జోడించడం ద్వారా దీన్ని సిద్ధం చేశారు.. ఇది మానవుల్లో జన్యు వైవిధ్యానికి అద్దంపడు తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ప్రస్తుతం మానవ జీనోమ్ ప్రాజెక్టు కింద దాదాపు 20 ఏళ్ల కిందట తొలిసారిగా ఆవిష్కరించిన జన్యుక్రమంపై ఆధారపడుతున్నాం.
→అయితే ఆ డేటాలో 70 శాతం.. ఆఫ్రికన్ - యూరోపి యన్ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తికి సంబంధించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
→అందువల్ల భూమి మీదున్న దాదాపు 700 కోట్ల మందికి ప్రత్యేకమైన జన్యుక్రమాలతో పోల్చిన ప్పుడు ఇది 0.2 నుంచి 1 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.
→మానవ జనాభాలోని జన్యు వైవి ధ్యాలకు ఇది దర్పణం పట్టడంలేదని పేర్కొ న్నారు.
→అందువల్ల పాన్ జీనోమ్ చాలా కచ్చిత మైందని, జన్యువుల్లో వైరుధ్యాలను ఇది సులు వుగా గుర్తించగలదని తెలిపారు.

మొండి మలేరియాను మట్టికరిపించే మొక్క

→ అమెరికా, కెనడాలో కనిపించే ఒక సంప్ర దాయ ఔషధ మొక్క ఆకులో అద్భుత పదార్థాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
→ మలేరియా కారక పరాన్నజీవిపై ఇది సమర్థ పోరాటం చేయగలదని వారు తేల్చారు. లాబ్రాడర్ టీ అనే ఈ మొక్క చాలా చిన్నగా ఉంటుంది. పచ్చగా ఉంటుంది.
→ ఈ మొక్క ఆకు లను హెర్బల్ టీ తయారీకి వాడుతుం టారు. దీని నుంచి సేకరించిన నూనె లకు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని, మొండి బ్యాక్టీరియాపై పోరుకు అవి అక్కరకొస్తా యని ఇప్పటికే వెల్లడైంది.
→తాజాగా కెనడాలోని లావాల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై లోతుగా పరిశోధన జరిపారు.
→ఇందు కోసం ఉత్తర క్యూబెక్ ప్రాంతంలో "ఎంచుకున్నారు.
→దాని ఆకుల నుంచి సేకరించిన నూనెలను గ్యాస్ క్రొమోటో గ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ, ఫ్లేమ్ అయనైజే షన్ డిటెక్షన్ విధానాలతో పరిశీలించారు.
→తద్వారా అందులో 53 పదార్ధాలను గుర్తించారు. ఈ నూనెలో 64.7 శాతం మేర ఆస్కారిడోల్, 211 శాతం పి-సైమిన్ ఉన్నట్లు తేల్చారు.
→ఈ పదార్థా లతో కూడిన మిశ్రమాలను గతంలో ఎన్నడూ ఉత్తర అమెరికా లాబ్రాడర్ టీ రకాల్లో చూడలేదు.
→ ఇందులోని ఆస్కారిడోల్ ను మలేరియా కారక పరాన్నజీవికి సంబంధించిన రెండు వేరియంట్లపై ప్రయోగించారు.
→ ఇందులో ఒకటి.. ఔషధాలకు లొంగని మొండి జీవిగా గుర్తింపు పొందింది.
→ ఆస్కారిడోల్.. రెండు వేరియంట్లపై సమర్థంగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

తెలంగాణలో 18 చోట్ల 'ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి' స్టాళ్లు

→స్థానిక ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 728 రైల్వే స్టేష న్లలో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి (వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్) విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
→ఇందులో ఏపీలో 34, తెలంగాణలో 18 నెలకొల్పినట్లు వెల్లడించింది.
→స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ప్రోత్సాహం అందించి అణగారిన వర్గా లకు అదనపు ఆదాయం సమకూర్చడానికి ఈ కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొంది.
→గత ఏడాది మార్చి 25న ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 728 స్టేషన్లకు విస్తరించి నట్లు తెలిపింది.
→ఈ స్టాళ్లన్నీ ఒకే విధంగా ఉండేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ద్వారా రూపకల్పన చేసినట్లు వివరించింది.
→వీటి ద్వారా ఇప్పటివరకు 25,109 మంది ప్రత్యక్షంగా లబ్ధిపొంది నట్లు పేర్కొంది.
→ రాష్ట్రంలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట, గద్వాల, హైదరాబాద్, కాచిగూడ, కామా రెడ్డి, కాజీపేట, ఖమ్మం, లింగంపల్లి, మహబూబ్న గర్, మహబూబాబాద్, మల్కాజిగిరి, నల్గొండ, నిజా మాబాద్, సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, వరం గల్ స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (AO) లభించింది. ఇండియా-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డుతో సత్కరించారు. ఇది వరకు 2020లో, బయోకాన్ వ్యవస్థాపకరాలు కిరణ్ మజుందార్-షా కూడా ఈ గౌరవంతో సత్కరించబడ్డారు.

ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది అత్యుత్తమ విజయాలు లేదా సేవలు అందించిన ఆస్ట్రేలియన్ పౌరులు మరియు ఇతర దేశాల వ్యక్తులకు అందించబడుతుంది. ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వ సలహా మేరకు ఆస్ట్రేలియా రాణి ఎలిజబెత్ II చేత 14 ఫిబ్రవరి 1975న స్థాపించబడింది. ఈ అవార్డు ఏడాదికి దాదాపు 140 మంది పౌరులకు అందజేస్తారు. ఇకపోతే రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 ఏడాదిలో పద్మ భూషణ్ అవార్డుతో, 2008లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

గోవా హెరిటేజ్ ఫెస్టివల్ 2023

గోవా హెరిటేజ్ ఫెస్టివల్ 2023ని ఏప్రిల్ 28 నుండి 30 మధ్య సాలిగావో అనే గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆ రాష్ట్రంలోని సంప్రదాయాలు, సంస్కృతి మరియు కళలను ప్రదర్శించడం ద్వారా సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ ఈ వేడుకను ఏటా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాన్ని ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు.

అన్నపూర్ణ 1 పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తిగా అర్జున్ వాజ్‌పేయ్

భారతీయ ప్రొఫెషనల్ పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పేయ్, సముద్ర మట్టానికి 8,091 మీటర్లు ఎత్తులో ఉన్న ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వతం అయిన అన్నపూర్ణ 1 పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తిగా అవతరించాడు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 8000 మీటర్ల పైన ఉన్న మొత్తం 7 పర్వతాలను అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తిగా కూడా నిలిచాడు.

ఈ ఏడాది మొదటిలో ఫిట్ ఇండియా ఛాంపియన్‌గా బిరుదు పొందిన అర్జున్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా రికార్డు కలిగివున్నారు. అలానే ప్రపంచ వ్యాప్తంగా 8000 మీటర్ల పైన ఉన్న మొత్తం 14 పర్వతాలను (14 సమ్మిట్ మౌంటయిన్స్) అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ 14 శిఖరాలు హిమాలయాలు లేదా ఆసియాలోని కారకోరం శ్రేణులలోనే ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కేవలం 39 మంది పర్వత అధిరోహకులు మాత్రమే చేరుకున్నారు.

8000 మీటర్ల పైన ఉన్న ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వత శిఖరాలు

పర్వతం ఎత్తు (మీటర్లలలో) దేశం/ప్రాంతం
ఎవరెస్ట్ 8,849 మీటర్లు నేపాల్ & చైనా
K2 పర్వతం 8,611 మీటర్లు పాకిస్తాన్ & చైనా
కాంచన్‌జంగా 8,586 మీటర్లు నేపాల్ & ఇండియా
లోట్సే శిఖరం 8,516 మీటర్లు నేపాల్ & చైనా
మకాలు శిఖరం 8,481 మీటర్లు నేపాల్ & చైనా
చో ఓయు శిఖరం 8,188 మీటర్లు నేపాల్ & చైనా
ధౌలగిరి I శిఖరం 8,167 మీటర్లు నేపాల్
మనస్లు శిఖరం 8,163 మీటర్లు నేపాల్
నంగా పర్బత్ 8,125 మీటర్లు పాకిస్తాన్
అన్నపూర్ణ I 8,091 మీటర్లు నేపాల్
గషెర్‌బ్రమ్ I (K5 / హిడెన్ పీక్) 8,080 మీటర్లు పాకిస్తాన్ & చైనా
బ్రాడ్ పీక్ 8,034 మీటర్లు పాకిస్తాన్ & చైనా
గాషెర్‌బ్రమ్ II (K4) 8,034 మీటర్లు పాకిస్తాన్ & చైనా
శిషాపంగ్మా (గోసైంతన్) 8,027 మీటర్లు చైనా

అటామిక్ ఎనర్జీ కమిషన్ నూతన చైర్మన్‌గా ఎకె మొహంతి

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అజిత్ కుమార్ మొహంతి, అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క కొత్త చైర్మన్‌గా మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యొక్క నూతన సెక్రటరీగా నియమితులయ్యారు. అజిత్ కుమార్ ప్రస్తుతం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( బార్క్) డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1959లో ఒడిశాలో జన్మించిన మొహంతీ 1979లో బరిపడలోని ఎంపీసీ కళాశాల నుండి భౌతికశాస్త్రంలో ఆనర్స్‌ పొందారు. కటక్‌లోని రావన్‌షా కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు.

అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని ఒక శాస్త్రీయ అణు పరిశోధన విభాగం. ఇది 03 ఆగష్టు 1948 లో ఏర్పాటు చేయబడింది. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు ప్రధానమంత్రి ప్రత్యేక్ష కనుసన్నలలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అటామిక్ ఎనర్జీ కమిషన్ దేశంలో అణు పరిశోధనలను నిర్వహించడం, అణు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం మరియు భారతదేశంలోని అణు ప్రయోగశాలలలో అణు పరిశోధనలను ప్రోత్సహించడం వంటి కీలక సేవలు అందిస్తుంది. దీనికి భారతదేశంలో ఐదు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.

  1. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) - ముంబై
  2. ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (IGCAR), - కల్పక్కం (తమిళనాడు)
  3. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (RRCAT) - ఇండోర్
  4. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (VECC) - కోల్‌కతా
  5. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) - హైదరాబాద్.

లక్షద్వీప్‌లో సైన్స్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ మీటింగ్

భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీలో సైన్స్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశంను, లక్షద్వీప్‌లోని బంగారం ద్విపంలో మే 1మరియు 2వ తేదీల్లో నిర్వహించారు. యూనివర్సల్ హోలిస్టిక్ హెల్త్‌ అనే అంశంపై నిర్వహించ ఈ సమావేశంలో మానవ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపే వ్యవసాయ పద్ధతులు, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు పర్యావరణ స్పృహ విభాగాలపై చర్చలు నిర్వహించారు.

సార్వత్రిక సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, దేశీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని గుర్తించడం, సాంప్రదాయ వైద్య పద్ధతులను ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోకి చేర్చడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, అందరికీ నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా ఒక బలమైన మానసిక ఆరోగ్య విధానాన్ని రూపొందించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ శర్మ సహాధ్యక్షత వహించారు.

మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌ యొక్క క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ పునరుద్ధరణ

మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అదనంగా 2 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీని అందించడానికి దాని పూర్వపు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో & స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) పథకాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పునరుద్దించిన పథకాన్ని కేంద్రమంత్రి నారాయణ్ రాణే, ఏప్రిల్ 27న ముంబైలో ప్రారంభించారు. ఇది సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు మరియు అడ్వాన్సులకు హామీనిస్తుంది.

మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (MSE) విభాగానికి మెరుగైన రుణాలను అందించడానికి ఈ పథకాన్ని పునరుద్ధరించారు. దీని అమలు కోసం 2023-24 కేంద్ర బడ్జెట్‌లో 9,000 కోట్ల అదనపు కార్పస్ సపోర్టును అందుబాటులో ఉంచింది. ఈ నూతన పధకంలో 1 కోటి వరకు రుణాలకు గ్యారెంటీ రుసుములను 50% తగ్గించింది. అలానే కనీస హామీ రుసుమును సంవత్సరానికి 0.37% స్థాయికి తీసుకొచ్చింది. అదే సమయంలో గ్యారెంటీ సీలింగ్‌ను 2 కోట్ల నుండి 5 కోట్లకు పెంచడం ద్వారా చట్టపరమైన చర్య తీసుకోకుండానే క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం థ్రెషోల్డ్ పరిమితిని ₹10 లక్షలకు పెంచినట్లు చేసింది.

ఈ సంధర్బంగా ఈ క్రెడిట్ హామీ పథకాన్ని ఉత్తమంగా వినియోగించుకున్న బ్యాంకులను కేంద్ర మంత్రి సత్కరించారు. తాజా పునరుద్ధరణ పథకం దేశంలోని ఎంఎస్‌ఇలకు కొలేటరల్ ఫ్రీ లెండింగ్‌ను సులభతరం చేయడంలో పాటుగా పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించడంలో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ పథకం అధికారికంగా ఆగస్ట్ 30, 2000 న ప్రారంభించబడింది. సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు అనుషంగిక రహిత క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించబడింది. దీని కోసం ప్రత్యేకంగా క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. రెండేళ్ల కోవిడ్ సంక్షోభం వలన దేశంలోని ఎంఎస్‌ఇలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) వంటి చర్యలను చేపట్టినా, మెజారిటీ నిపుణులు CGTMSE పథకాన్ని పునరుద్ధరించాలని కోరుకున్నారు.

హైదరాబాద్‌లో ఫుడ్ కాన్‌క్లేవ్ 2023

తెలంగాణ ప్రభుత్వం, ఏప్రిల్ 28 మరియు 29 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫుడ్ కాన్‌క్లేవ్ 2023ను విజయవంతంగా ముగించింది. దీనిని వ్యవసాయ ఆహార రంగానికి సంబంధించిన వార్షిక మేధోమథనం కార్యక్రమంగా ఏటా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మొదటి ఎడిషన్ ద్వారా తెలంగాణలోని వ్యవసాయ ఆహార పరిశ్రమలో 58,458 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా 7217.95 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సదస్సును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. వ్యవసాయంలో సరికొత్త పోకడలు, ఆవిష్కరణలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రముఖులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగాన్ని కోర్ థ్రస్ట్ ఏరియాగా రాష్ట్రం గుర్తించిందని వెల్లడించారు.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌ల క్రింద అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో, మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌లను ఎలా ప్రోత్సహించవచ్చో తెలంగాణ ప్రభుత్వంను చూసి దేశంలోని మిగిలిన వారు నేర్చుకోవచ్చు అని అన్నారు. తెలంగాణ ఉత్పత్తి పరంగా విప్లవాలకు నాంది పలకడమే కాదు, పరిశ్రమల ప్రయోజనాల కోసం టాలెంట్ పూల్‌ను ఉత్పత్తి చేసే పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తోందని పేర్కొన్నారు. తాజాగా ఆక్వా, డెయిరీ, ఆగ్రో ప్రాసెసింగ్ మరియు అనుబంధ రంగాలలో వచ్చిన పెట్టుబడులు ఆయా రంగాల్లో నూతన ఉత్తేజం రానుందని అన్నారు.

ఇ-రూపాయి (e₹)ని ఆమోదించిన మొదటి బీమా కంపెనీగా రిలయన్స్

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ఇ-రూపాయి (e₹)ని ఆమోదించిన మొదటి బీమా కంపెనీగా అవతరించింది. దీని కోసం ఈ సంస్థ ఎస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఖాతాదారులు తమ ప్రీమియం చెప్పింపు కోసం ఇ-రూపాయిని ఉపయోగించుకోవచ్చు.

సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అనేది దేశం యొక్క సాధారణ భౌతిక కరెన్సీ యొక్క డిజిటల్ రూపం. దీనిని ఇ-రూపాయి (e₹) అంటారు. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ప్రస్తుతం ఇది ఆర్‌బిఐ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ మరియు ఎంచుకున్న బ్యాంకులలో హోల్‌సేల్ మరియు రిటైల్ లావాదేవీల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది.

ఇ-రూపాయిని 2022-23 బడ్జెట్‌లో ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 7 అక్టోబర్ 2022 న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)పై కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. 01 డిసెంబర్ 2022న డిజిటల్ రూపాయి-రిటైల్ సెగ్మెంట్ (e₹-R) యొక్క మొదటి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది.

రాజస్థాన్‌లో మూడు కొత్త యానిమల్ కన్జర్వేషన్ పార్కులు

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు యానిమల్ కన్జర్వేషన్ పార్కులను నోటిఫై చేసింది. ఈ జాబితాలో బరన్‌లోని సోర్సన్, జోధ్‌పూర్‌లోని ఖిచాన్ మరియు భిల్వారాలోని హమీర్‌ఘర్ ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అటవీ శాఖ ఈ జాబితాను ఏప్రిల్ 22న, ఎర్త్ డే సందర్భంగా ప్రకటించింది. దీనితో ఈ రాష్ట్రంలో యానిమల్ కన్జర్వేషన్ పార్కుల సంఖ్య 26కి చేరుకుంది.

హైదరాబాద్ లో తొలి సైక్లింగ్ ఉద్యానం

→రాష్ట్ర రాజధానిలో తొలి సైక్లింగ్ ఉద్యానం అందుబాటులోకి రానుంది.
→సైక్లింగ్ తో శారీరక వ్యాయామంతో పాటు కాలుష్య నియంత్రణకు తోడ్పడవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ప్రతినిధులు 'పాలపిట్ట సైక్లింగ్ పార్కు' పేరుతో దీనిని రూపొందించారు.
→కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్కు ఎదు రుగా అటవీశాఖకు చెందిన 47 ఎకరాల స్థలం లీజుకు తీసుకొని, అందులో మూడు కి.మీ. ట్రాక్ను సిద్ధం చేశామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
→హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ఉద్యా నంలో సైకిల్ ట్రాక్ను అందుబాటులోకి తీసు కొస్తున్నారు.
→ఇప్పటి వరకూ నెక్లెస్ రోడ్, కేబీ ఆర్ పార్కు చుట్టూ మాత్రమే సైకిల్ ట్రాక్లు .
→ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వృద్ధులు, యువతీ, యువకులను సైకిల్ తొక్కేలా ప్రేరేపించేందుకు పచ్చదనం నడుమ ఆహ్లాదకర వాతావరణంలో సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
→అటవీశాఖ స్థలం అనుకూలంగా ఉందని ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో అధికారులు నిబంధనలు, షరతులు విధించి మూడేళ్ల పాటు లీజుకు కేటాయించారు.
→ఆరోగ్యం, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించేందుకు సైక్లింగ్ ఉద్యానాన్ని అందుబాటు లోకి తీసుకొస్తున్నాం.
→500 మంది ఒకేసారి తొక్కేందుకు వీలుగా సిద్ధం చేశాం. ఉదయం, సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉంటుంది.
→ ప్రవేశ రుసుంతో పాటు గంటకు రూ.50 చెల్లిం చాలి. నెలకు ఒకేసారి రూ.800 చెల్లించినా సరి పోతుంది.
→ ఈ సొమ్మును ఉద్యానాభివృద్ధికి, సైకిళ్ల మరమ్మతులకు వినియోగిస్తాం.

తెలంగాణలో వరి విలువ రెట్టింపు

→కేంద్ర గణాంకాల శాఖ తాజా లెక్కలు ఈనాడు, దిల్లీ: తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది.
→పుష్కల వర్షాలు, సాగునీటి లభ్యత కారణంగా రైతులు వరి వైపే మొగ్గుచూపుతు న్నారు.
→కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
→తెలంగా ణలో ఉత్పత్తవుతున్న వరి విలువ పదేళ్లలో దాదాపు రెట్టింపైంది.
→2011-12లో రూ.8,291.06 కోట్ల విలువ ఉండగా, 2020-21 నాటికి రూ. 16,533.50 కోట్లకు చేరింది.
→ఈ పదేళ్లకాలంలో 99.41 శాతం మేర వృద్ధి నమోదైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ స్థాయిలో విలువ వృద్ధి నమోదు కాలేదు.
→వరి ఉత్ప త్తిలో ప్రథమస్థానంలో ఉండే పంజాబ్లో ఈ పదేళ్ల కాలంలో 28.34 శాతం మాత్రమే పెరిగింది.
→ఇదే సమ యంలో తెలంగాణ రాష్ట్రంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తి విలువ 46శాతం తగ్గిపోయింది.
→పత్తి పంటలో మహారాష్ట్ర, గుజరాత్ల తర్వాతి స్థానంలో, మిరపలో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది.

రాజస్థాన్ లో భారీస్థాయిలో లిథియం నిక్షేపాలు

→దేశంలో మరోచోట భారీ స్థాయిలో లిథియం నిక్షేపాలు వెలుగు చూశాయి.
→రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో వీటిని గుర్తించి నట్లు రాజస్థాన్ అధికార వర్గాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) అధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
→ఇటీవల జమ్మూకశ్మీర్ లో గుర్తించిన 59 లక్షల టన్నుల లిథియం నిల్వల కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్లు వెల్లడించాయి.
→80 శాతం వరకు దేశీయ అవసరాలను ఈ నిల్వలు తీర్చగలవని సమాచారం.
→మొబైల్ ఫోన్లు, ల్యాప్టా ప్లు, విద్యుత్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.
→ఈ విషయంలో భారత్ ప్రస్తుతం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.

భారతమాల–2లో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం

→హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) అవతలి నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం 'భారతమాల-2' ప్రాజె క్టులో చేర్చింది.
→ఏడాదిన్నర క్రితం నుంచి ఈ ప్రతి పాదన కేంద్రం పరిశీలనలో ఉండగా.. ఇటీవల జరి గిన సమావేశంలో దీనికి ఆమోదం లభించింది.
→పూర్తిస్థాయి సవివర నివేదిక(డీపీఆర్)కు కూడా అధి కారులు తుది కసరత్తు పూర్తి చేశారు.
→కేంద్రం ఆర్ ఆర్ఆర్ ను 347.80 కిలోమీటర్ల మేర ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలి సిందే.
→ఈ రెండు భాగాలను రూ.22 వేల కోట్లతో పూర్తిచేయాలని తొలుత అధికారులు అంచనా వేశారు.
→తాజా అంచనాల ప్రకారం రెండు భాగాలకు కలిపి రూ.25 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
→దీంతో గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది.
→ఇప్పటికే ఉత్తర భాగం భూ సేకరణ తుదిదశకు చేరుకోగా.. తాజాగా దక్షిణ భాగం రహ దారి ప్రతిపాదనలూ ముందుకు సాగుతున్నాయి.
→ చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్ నగర్, చేవెళ్ల, సంగారెడ్డి వరకు 189.20 కిలో మీటర్ల మేర దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
→దీని నిర్మాణానికి రూ.13 వేల కోట్ల నుంచి రూ.14.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఈ మార్గంలో ప్రైవేటు భూములతోపాటు ప్రభుత్వ స్థలాలు ఉండటంతో భూ సేకరణ వ్యయం కొంత తగ్గినా.. నిర్మాణ వ్యయం మాత్రం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భాగం ప్రతి పాదనలను కేంద్రం ఏడాది క్రితమే సిద్ధం చేసినా.. ఉత్తర భాగం భూ సేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చిన తరువాత దీన్ని 'భారత్మల -2' లో చేర్చాలని వేచి చూసింది. కేంద్రం తాజా నిర్ణయంతో దీనికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
→ఒప్పందం లాంఛనమే: భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. ఉత్తర భాగం వ్యయంలో సగం మొత్తాన్ని దశ లవారీగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సుమారు రూ.1,200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా.. తొలుత రూ. వంద కోట్లను విడుదల చేసింది. తరువాత అవసరం మేరకు విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్రం రూపొందించిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఒప్పందం ఇక లాంఛనమేనని ఓ ఉన్నతాధికారి 'ఈనాడు'కు తెలిపారు. ఉత్తర భాగంలో తొలివిడత నిర్మించ నున్న సుమారు 60 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదనలను అధికారులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

40 ఏళ్ల రికార్డు వర్షపాతం నమోదు

→ ఈ ఏడాది మండు వేసవి కూడా కుంభవృష్టితో వర్షాకాలమైంది.
→ ఏప్రిల్, మే నెలల్లో (5వ తేదీ నాటికి) కురిసిన వానలు ఈ ఏడాది వర్షపాతం రికార్డులను మార్చేశాయి.
→ గత 40 ఏళ్ల చరిత్రలో లేనివిధంగా రికార్డు స్థాయి వర్షాలు పడ్డాయి. 2022-23లో (జూన్-మే) నమోదైన వర్ష పాతం గత రికార్డులను తుడిచిపెట్టేసింది.
→ సాధారణ వర్షపాతం కన్నా 54 శాతం అధికంగా నమోదైంది.
→ రాష్ట్ర సాధారణ వర్షపాతం 908,3 మిల్లీమీటర్లు కాగా గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే 5 నాటికి 1359.7 మిల్లీ మీటర్లు కురిసింది.
→ 1983-84లో సాదా రణం కన్నా 51 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి.
→ ఆ సంవత్సరంలో సాధారణ వర్షపాతం 892,8 మిల్లీ మీటర్లకు 1351.1 మిల్లీమీటర్లు కురిసింది.
→ ఆ తరు వాత 2022-23 సంవత్సరంలో 54.4 శాతం వర్షాలు నమోదయ్యాయి.
→ 1951-52 నుంచి వివరాలను పరిశీలిస్తే 1989-90లో మే నెలలో మాత్రమే 577 శాతం వర్షపాతం నమోదైంది.
→ అప్పుడు సాధారణ వర్షపాతం 25.8 మి.మీ.కుగాను 174.7 మి.మీ కురిసింది.
→ దీనికి భిన్నంగా ఈ ఏడాది మే నెలలో సాధారణ వర్షపాతం 2.6 మి.మీ. కుగాను ఇప్పటికే 39.3 మి.మీ. కురిసి 1412 శాతం నమోదైంది.
→ గతేడాది జులైలో 121 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. ఈ మార్చిలో 413 శాతం, ఏప్రిల్లో 338 శాతం అధికంగా నమోదయ్యాయి.
→ఈ నీటి సంవత్సరంలో (జూన్ 22- మే 23) ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
→15 జిల్లాల్లో ఆ జిల్లా సాధారణ వర్షపాతాల కన్నా 60 శాతానికిపైగా నమోదయ్యాయి.
→అత్యధికంగా నారాయ ణపేటలో 77 శాతం, కరీంనగర్, వనపర్తిలలో 75, మహబూబ్ నగర్ 74, జగిత్యాల 70, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లిల్లో 69 శాతానికి పైగా నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మాత్రం 13 శాతం మాత్రమే అధికంగా నమోదైంది.

మయన్మార్-బంగ్లాదేశ్ తీరానికి మళ్లిపోనున్న మోచా తుపాను

→ యెమెన్ లోని మోచా (మోఖా) నగరం పేరును ఈ తుపానుకు పెట్టిన విషయం తెలిసిందే.

భారతీయుల సగటు జీతం రూ.46,861

→ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం. విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబ డించిన వివరాల డిందని 'ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొంది.
→భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్న ప్రాంతం మీదుగా వెళుతుంది. దని తెలిపింది.
→అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న సగటు నెల వారీ జీతాలకు సంబంధించిన గణాంకాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది.
→ఈ డాటా ప్రకా రం-మన కరెన్సీలో లక్ష రూపాయాల కంటే అధిక సగటు నెల వేతనం 23 దేశాల్లో ఉంది.
→ఈ జాబి తాలో రూ.50 వేల కంటే తక్కు వ సగటు వేతనం తో భారత్ 65వ స్థానంలో ఉంది. రూ.4,98,567 సగటు వేతనంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో లక్సెంబర్గ్, సింగ పూర్, అమెరికా ఉన్నాయి.
→చైనాలో సగటు నెల వేతనం రూ.87,426గా ఉన్నది. భారత్ కంటే వెను కబడిన దేశాల జాబితాలో బ్రెజిల్, అర్జెంటీనా, బం గ్లాదేశ్, పాకిస్థాన్ వంటివి ఉన్నాయి.
→సగటు నెల జీతంలో టాప్ 5 దేశాలు (రూ.ల్లో) స్విట్జర్లాండ్ - రూ.4.98,567, లక్సెంబర్గ్ - రూ.4,10,156 సిం గపూర్ - రూ.4,08,030, అమెరికా- రూ. 3,47,181, ఐస్లాండ్ రూ.3,27,716

మహారాష్ట్రలో తొలి మరాఠీ భాషా వర్సిటీ

→ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాల యాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు.
→మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.

పర్యావరణహితంగా హరిత హైడ్రోజన్ ఉత్పత్తి

→హరిత హైడ్రోజన్ ఇంధనాన్ని పర్యావరణహిత పద్ధతిలో ఉత్పత్తి చేసే ఒక ఉత్ప్రేరకాన్ని గువాహటి లోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→మిథైల్ ఆల్కహాల్ నుంచి దీన్ని తయారుచేస్తారు. ఈ ప్రక్రి యలో పార్మిక్ ఆమ్లం కూడా ఉత్పత్తి కావడం విశేషం.
→శుద్ధ ఇంధనమైన హైడ్రోజన్ ను ప్రస్తుతం విద్యుత్ రసాయన పద్ధతిలో నీటిని విడగొట్టడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.
→అలాగే... ఆల్కహాల్ వం టి రసాయనాల ద్వారా కూడా తయారుచేస్తారు.
→రెండో విధానంలో ఎక్కువగా మిథైల్ ఆల్కహాల్ను ఉపయోగిస్తుంటారు.
→ఈ ప్రక్రియలో ఒక ఉత్ప్రేరకాన్ని వాడుతుం టారు.
→ఈ పద్ధతిలో రెండు సమస్యలు ఉన్నాయి.
→ఒకటి... అధిక ఉష్ణోగ్రతలు (300 డిగ్రీల సెల్సియ స్), అధిక పీడనం (20 అట్మాస్పియర్ అవసరం.
→రెండోది.. ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉత్ప వుతుంది. అది గ్రీన్ హౌస్ వాయువు.
→తాము అభివృద్ధి చేసిన ఉత్ప్రేరకం ఈ ఇబ్బందులను దూరం చేస్తుందని ఐఐటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

శ్వాస, జన్యు రుగ్మతలను త్వరగా పసిగట్టే ఏఐ

→కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే మెడికల్ ఇమే జింగ్ సాధనాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ఇది శ్వాసకోశ వ్యాధులు, జన్యు రుగ్మత లను చాలా త్వరగా గుర్తించడంలో సహాయపడు తుంది.
→హిమాచల్ ప్రదేశ్ మండీలోని ఐఐటీ శాస్త్రవే త్తలు ఈ ఘనత సాధించారు.

కరోనా వ్యాప్తికి కారణమవుతున్న అక్లూడిన్ ప్రొటీన్

→మానవుల్లో కణాల మధ్య కరోనా వ్యాప్తికి కారణ మవుతున్న కీలక ప్రొటీన్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
→మన శరీరంలో ఉండే ఆక్లూడిన్ అనే ప్రొటీన్ ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొ న్నారు.
→భవిష్యత్లో కొత్త యాంటీవైరల్ ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుం దని వివరించారు.
→ఒక కణంలోని ఆక్లూడిన్ ప్రాటీ నన్ను కరోనా నాశనం చేయగలిగితే.. ఆ వైరస్ వేగం గా తన ప్రతులను సృష్టించుకోగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

గర్భస్థ శిశువుకు బ్రెయిన్ సర్జరీ

→వైద్యరంగంలో అద్భుతం జరిగింది. అమెరికా లోని బోస్టన్ వైద్యులు సరికొత్త శస్త్రచికిత్సకు నాంది. పలికారు.
→శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్రచికిత్స చేసేందుకు నూతన విధానాన్ని ఆవిష్కరించారు.
→బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్,బ్రిఘం,మహిళల దవాఖాన ఆధ్వర్యం లో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
→గర్భస్థ శిశువుల్లో అరుదుగా వచ్చే వాస్కులర్ వైక ల్యానికి సర్జరీ చేసి తల్లీబిడ్డలను రక్షించారు.

స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమగామి

→యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెం దిన సుల్తాన్ అల్ నెయాదీ అంతరిక్షంలో నడచిన మొట్టమొదటి అరబ్ గా చరిత్రకెక్కారు.
→భూకక్ష్యలో ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వెలుపలికి వచ్చిన ఆయన రోదసిలోని శూన్య స్థితిలో 7.01గంటల సేపు విధులు నిర్వహిం చారు.
→అమెరికా అంతరిక్ష సం స్థ-నాసా ఫ్లైట్ ఇంజనీర్ స్టీఫెన్ బోవెన్తో కలసి ఐఎస్ఎస్ బయ ట విద్యుత్ లైన్లను అమర్చారు.

జీడీపీలో దక్షిణాది వాటా 30 శాతం

→మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకెళ్తున్నా యి.
→వీటి తలసరి ఆదాయం భారీగా పెరుగుతోంది. అప్పులు తక్కువగా ఉన్నాయి.
→ఆర్ బీఐ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
→రాష్ట్రాల ఆర్థిక సర్వేల ప్రకారం, ఐదు దక్షిణ భారత రాష్ట్రాలు భారతదేశ . జీడీపీకి 30 శాతానికి పైగా వాటాను ఇస్తున్నా యి.
→దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రా ష్ఠాల జాబితాలో కర్నా తమిళనాడు, ఆంధ్రా, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ముం దున్నాయి.
→ప్రస్తుతం తమిళనాడు. రూ.24.8 లక్షల కోట్ల జీఎల్డీపీతో (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉంది.
→కర్నాటకకు రూ.22.4లక్షల కోట్లు, తెలంగాణకు రూ.13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.13.2 లక్షల కోట్లు, కేరళకు రూ.10 లక్షల కోట్ల జీఎస్ డీపీ ఉంది.
→ఒక రాష్ట్రంలోని సేవలు, ఉత్పత్తుల మార్కెట్ విలువను జీఎస్డీపీ అంటారు.
1. తలసరి ఆదాయం ఈ పరామితి ప్రకారం. 2023 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ అత్యధికంగా రూ.2,75,443 తలసరి ఆదా యాన్ని సాధించింది. దాని తర్వాత కర్నాటక రూ.2,65,623, తమిళనాడు రూ.2,41,131, కేరళ రూ.2,30,601, చివరగా ఆంధ్రప్రదేశ్ రూ.2,07,771 ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలకు ఉన్నాయి. జాతీయ సగటు రూ.1,50,007 కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉంది.
2. తక్కువ డెట్-జీడీపీ నిష్పత్తి తెలంగాణకు డెట్ టూ జీఎస్డీపీ నిష్పత్తి కేవలం 25.3శాతమే ఉంది. కర్నాటక (27.5శాతం), తమిళనాడు (27.7శాతం), ఆంధ్రప్రదేశ్ (32.8శాతం), కేరళకు 37.2శాతం డెట్ జీడీపీ నిష్పత్తి ఉంది.
3. రాష్ట్ర పన్ను ఆదాయాలు: ఈ పరామితి ప్రకారం, తమిళనాడు అత్యధికంగా రూ.1,26,644 కోట్ల పన్ను రాబడుల తో మొదటిస్థానంలో ఉండగా, మిగతా స్థానాల్లో కర్నాటక (రూ.1,11,494 తెలంగాణ (.92,910 కోట్లు), ఆంధ్రప్రదేశ్ రూ.85,265 కోట్లు). కేరళ (రూ.71,833 కోట్లు) ఉన్నాయి.
4. స్థూల ఆర్థిక లోటు (జీఎఫ్): ఆర్ధిక క్రమశిక్షణ విషయంలో కర్నా టక మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. దీనికి కేవలం 2.8 శాతం ఆర్థిక లోటు ఉంది. మిగతా స్థానాల్లో ఆంధ్రప్ర దేశ్ (3.2శాతం), తమిళనాడు (3.8శాతం), తెలంగాణ (3.9శాతం), కేరళ (4.2శాతం) ఉన్నాయి.
5. వడ్డీలకు ఆదాయ వనరుల నిష్పత్తి: ఈ విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. దీనికి కేవలం 11.3 శాతం వడ్డీ చె ల్లింపుల నిష్పత్తి ఉంది. ఆ తర్వాత కర్నాటక (14.3శాతం), ఆంధ్రప్రదేశ్ (14.3శాతం), కేరళ (18.8శాతం), తమిళనాడు (21శాతం)

ట్రిపుల్ జంప్ ప్రవీణ్ జాతీయ రికార్డు

→ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ అర్హత ప్రమాణాలను కూడా అందుకున్నాడు.
→హవానా (క్యూబా)లో జరుగుతున్న ఈవెంట్లో ప్రవీణ్ 17.37 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
→రెంజిత్ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు (17.30మీ, 2016)ను అతడు తుడిచిపెట్టాడు.
→ఇదే ఈవెంట్లో 16.58మీ ప్రదర్శనతో సెల్వ బాబు నాలుగో స్థానం సాధించాడు.
→అతడు అండర్-20 జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
→లాస్ ఏంజిలెస్ లో జరిగిన ట్రాక్ ఫెస్టివల్లో అవినాష్ సబ్లే పురుషుల 5000మీ స్టీపుల్ చేజ్ జాతీయ రికార్డు (13:19.30) నెలకొల్పాడు.
→రేసులో అతడు 12వ స్థానం సాధించాడు. మహిళల స్టీపుల్ చేజ్ పారుల్ చౌదరి (15:10:35) జాతీయ రికార్డు సృష్టించింది.
→రేసులో ఆమె 9వ స్థానం సాధించింది.

లోక్ సభలో 35 ఏళ్లలో 42 మందిపై అనర్హత

→ వేర్వేరు కారణాల వల్ల 1988 నుంచి (గత 35 ఏళ్ల కాలంలో) 42 మంది పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు పడింది.
→ వీరిలో అత్య ధికంగా 19 మంది ఎంపీలు 14వ లోక్సభలోనే తమ పదవులు కోల్పోయారు.
→ ప్రశ్నలు అడగడా నికి ముడుపులు తీసుకోవడం, పార్టీ ఫిరాయిం పులు దీనికి ప్రధాన కారణాలు.
→ క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు, అంతకుమించి శిక్షపడిన ప్రజా ప్రతినిధు లపై 'ప్రజా ప్రాతినిధ్య చట్టం' ప్రకారం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
→ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్, బీఎస్పీ నేత అఫ్ఘాల్ అన్సారీలు ఇదే కారణంతో తమ పదవుల్ని కోల్పో వాల్సి వచ్చింది. దానిపై వారు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. తనకు విధించిన శిక్షపై లక్ష ద్వీప్ ఎంపీ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందడంతో సస్పెన్షన్ను రద్దుచేశారు.
→పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మిజోరం లోక్సభ సభ్యుడు లాలు హోమా (కాంగ్రెస్) పై వేటు పడింది.
→అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ యూని యన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
→విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిదో లోక్ సభలో తొమ్మిదిమంది లోక్సభ సభ్యులపై పార్టీ ఫిరాయింపుల చట్టంకింద వేటు పడింది.
→అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని కుదు ర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష కూటమి యూపీయే-1 సర్కారుకు 2008 జులైలో మద్దతు ఉపసంహరించుకుంది.
→సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు క్రాస్ ఓటింగుకు పాల్పడినందుకు 9 మందిపై, ప్రశ్నలు అడగడా నికి ముడుపులు స్వీకరించినందుకు మరో 10 మందిపై.. వెరశి 19 మందిపై 14వ లోక్సభ కాలంలో వేటు పడింది.
→ ప్రశ్నలకు ముడుపుల ఆరోపణలపై 2005 లో భాజపా నుంచి ఆరుగురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్కరు చొప్పున లోక్సభ నుంచి బహిష్కృతులు య్యారు.
→రాజ్యసభ నుంచి బీఎస్పీ సభ్యుడొక రిపై వేటు పడింది.
→వేటు వేయడానికి చట్టం ఉన్న కారణంగా వీటిని సుప్రీంకోర్టు సమర్థిం చిందని, ఏ కేసునూ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సిన అవసరం రాలేదని లోక్సభ మాజీ అదనపు కార్యదర్శి దేవేంద్రసింగ్ 'పీటీఐ' వార్తాసంస్థకు తెలిపారు.
→ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 10వ లోక్సభలో నలుగురు సభ్యులపై వేటు పడింది.
→పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై రాజ్యసభలోనూ ముత్తీ మహ్మద్ సయీద్, సత్యపాల్ మాలిక్ 1989లో, శరద్ యాదవ్, ఆలీ అన్వర్లు 2017లో అనర్హతకు గుర య్యారు.
→లాభదాయక పదవుల అంశంలో శిబుసోరెన్, జయాబచ్చన్లపై ఇలాంటి చర్యలు తీసుకున్నారు.

ప్రమాదంలో జపొరిజియా అణువిద్యుత్ కేంద్రం

→ఉక్రెయిన్ లోని జపొరిజియా అణువిద్యుత్కేంద్ర పరిస్థితిపై అంతర్జా తీయ ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది.
→“జపొరిజియా దగ్గర పరిస్థితి అనూ హ్యంగా, ప్రమాదకరంగా ఉంది. భద్రతా పర మైన సమస్యలు తలెత్తుతున్నాయి.
→ప్లాంట్ అణు భద్రతపై నేను చాలా ఆందోళనగా ఉన్నాను" అని ఐఏఈఏ అధిపతి రఫెల్ గ్రాసీ తెలిపారు.
→జపొ రిజియా నుంచి పౌరులు ఖాళీ చేయాలని ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన రష్యా ప్రకటించిన నేప థ్యంలో గ్రాసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమ నార్హం.
→ప్లాంట్ కు సమీపంలోనే ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

ఈసారి గణతంత్రం.. మహిళకు పట్టం!

→వచ్చే ఏడాది దిల్లీలోని కర్తవ్య పథ్ పై జరిగే గణతంత్ర వేడుకలు దేశ మహిళా సాధి కారతకు దర్పణం పట్టనున్నాయి.
→ఈ దఫా కవాతు, వాయిద్య బృందాల్లో పూర్తిగా అతివలకే అవకాశం దక్కే వీలుంది. ఈ మేరకు ఒక ప్రతి పాదనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
→2024 గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పనకు రక్షణ మంత్రిత్వశాఖ మార్చిలో త్రివిధ దళాలకు, పలు మంత్రిత్వశాఖలకు ఒక ఆఫీస్ మెమోరాండాన్ని పంపింది.
→ఇందులో 'పూర్తి మహిళా బృందాల ప్రతిపాదన ఉంది. అంతకుముందు ఫిబ్రవరిలో రక్షణ శాఖ కార్యదర్శి నాయకత్వంలో జరిగిన సమావేశంలోనూ అంశం ప్రస్తావనకు ఈ వచ్చింది.
→విస్తృత చర్చల తర్వాత 2024 గణ తంత్ర దినోత్సవ కవాతు బృందాలు, వాయిద్య బృందాలు, శకటాలు, ఇతర కార్యక్రమాల్లో పూర్తిగా మహిళలకే చోటు కల్పించాలని నిర్ణ యించారు.
→నిజానికి పూర్తిగా అతివలతో కూడిన కొన్ని కంటింజెంట్లు, మహిళా అధికారులు, పురుష సిబ్బందితో కూడిన బృందాలు గతంలో అనేకసార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.
→ఈ ఏడాది జనవరి 26న జరిగిన 74వ గణతంత్ర దినోత్సవంలో 'నారీశక్తి' ప్రధాన ఇతివృత్తంగా ఉంది.
→సైనిక దళాలు, పారామిలటరీ బలగాల్లో పెరుగుతున్న మహిళా ప్రాతినిధ్యానికి అనుగు ణంగా ఈ దఫా కవాతులో పూర్తిగా అతివలకు అవకాశం ఇవ్వాలని కేంద్రం తలపోస్తోంది.

12 ఏళ్ల తర్వాత మళ్లీ అరబ్ లీగ్ కి సిరియా

→ అరబ్ లీగ్ కి సిరియా అధికారికంగా ఆది వారం ప్రవేశించింది.
→ లీగ్ విదేశాంగమంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
→ 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలు అణచివే యడం.. అంతర్యుద్ధానికి దారి తీసింది.
→ ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం రద్దైంది. మళ్లీ సిరియాను కూటమి లోకి తీసుకోవడానికి ఆదివారం జరిగిన సమావేశానికి ఖతార్ సహా కొన్ని దేశాలు గైర్హాజరవ్వడం గమనార్హం.

వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్ డే పరేడ్

→ భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ అంటే మన దేశ త్రివిధ బలగాల శక్తిని ప్రపంచానికి చాటడమే.
→ యుద్ధ శకటాలు, విమానాల విన్యా సాలు, కొత్త ఆయుధాల ప్రదర్శన ఇలా పరేడ్ అంటే కదనరంగంలో మన సత్తా ఎంతో ప్రదర్శించడమే.
→ అలాంటి పరేడ్ ను వచ్చే ఏడాది మహిళా శక్తితో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
→ నింగి నేలా నీరు అంతా మాదే అంటూ నినదిస్తున్న మహిళల భాగస్వామ్యం ఇటీవల కాలంలో త్రివిధ బలగాల్లో పెరుగుతోంది.
→ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడానికి కూడా మహిళలు సై అంటున్నారు.
→ కేంద్ర బలగాల్లో మహిళల భాగస్వా మ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం 2024 జనవరి 26న కర్తవ్యపద్లో జరగనున్న రిపబ్లిక్ డే పరేడు కేవలం మహిళలతో నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో ప్రతిపాదించింది.
→ దీనిపై ఫిబ్రవ రిలో రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో త్రివిధ బల గాల అధిపతులతో ఒక సమావేశం కూడా జరిగిం దని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
→త్రివిధ బలగాల్లోని మహిళా అధికారులే రిపబ్లిక్ డే కవాతుని నడిపిస్తారని ఆ సమావేశం నిర్ణయించిం ది.
→ఈ విషయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకి కూడా సమాచారం అందించారు.
→రక్షణ, హోం సంస్కృతి పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా దీనిని ఎలా అమలు చేయాలో చర్చిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
→ఈ ఏడాది రిపబ్లిక్ డేలో నారీ శక్తి థీమ్ను ప్రధానంగా చేశారు.
→కేరళ, కర్ణాటక, తమిళ నాడు, మహారాష్ట, త్రిపుర రాష్ట్రాలు నారీశక్తి థీమ్ తో శకటాలు రూపొందించాయి.
→ఇక వచ్చే ఏడాది అందరూ మహిళలతోనే పరేడ్ సాగనుంది.

ఇంధన పొదుపును ప్రోత్సహించడమే 'లైఫ్' లక్ష్యం

→ ఇంధన పొదుపు చర్యల గురించి ప్రజల్లో అవగా హన కల్పించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డైరెక్టర్ జన రల్ అభయ్ బాక్రే.. రాష్ట్ర ఇంధన శాఖ అధికారులకు సూచించారు.
→ ఇంధన పొదుపు చర్యలపై ఆదివారం వివిధ రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన వెబి నార్లో ఆయన మాట్లాడుతూ.. "పర్యావరణ హితం కోసం కేంద్ర ప్రభుత్వం 'లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్- లైఫ్' పేరిట చేపట్టే కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.
→ వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఇది 50 శాతం వరకు దోహదం చేస్తుంది.
→ లైఫ్ ద్వారా చేపట్టే కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి రాష్ట్రంలో ఒక నోడల్ అధికారిని నియమించాలి.
→ 2028 నాటికి 80 శాతం గ్రామాలు, పట్టణాలను పర్యావరణ హిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నదే లైఫ్ లక్ష్యం.
→ దీనికోసం బీఈఈ రూపొం దించిన 19 సమగ్ర అంశాలను పరిశీలించాలి.
→ ఇంధన పొదుపు కార్యక్రమాల్లో సుమారు కోటి మంది పొదుపు సంఘాల మహిళలను (ఎస్ హెచ్సీ) ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది.
→ అలాగే, ఈ అంశంపై రైతులు, ప్రజల్లో అవ గాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాలి" అని సూచించారు.

రెవెన్యూ డివిజన్ గా తాడేపల్లిగూడెం

→ పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
→ దీంతో జిల్లాలో డివిజన్ల సంఖ్య మూడుకు పెరిగింది. నూతనంగా ఏర్పడిన తాడేపల్లి గూడెం డివిజన్ లో తణుకు, తాడేపల్లిగూడెం నియోజక వర్గాల పరిధిలో ఐదు మండలాలు .. నరసాపురం డివి జన్ ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవ ర్గాల పరిధిలోని 8 మండలాలు ఉంటాయి.
→ భీమవరం డివిజన్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధి లోని ఆరు మండలాలతో పాటు ఇటీవల జిల్లాలో విలీనం చేసిన గణపవరాన్ని చేర్చారు.

6 మండలాల విభజనపై తుది నోటిఫికేషన్ల జారీ

→రాష్ట్రంలోని ఆరు మండలా లను విభజిస్తూ తుది నోటిఫికేషన్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ జారీ చేశారు.
→విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనం తపురం, ఒంగోలు మండలాలను పట్టణ, గ్రామీణ మండలాలుగా నోటిఫై చేశారు.
→మచిలీపట్నం మండ లాన్ని సౌత్, నార్త్ మండలాలుగా ప్రకటించారు.
→పశ్చి మగోదావరి జిల్లా తాడేపల్లిగూడేన్ని కొత్త రెవెన్యూ డివి జన్ గా ప్రకటిస్తూ తుది నోటిఫికేషన్ ఇచ్చారు.

నేటి నుంచి 'జగనన్నకు చెబుదాం'

→ 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛ నంగా ప్రారంభిస్తారు.
→ ప్రజా సమస్యలు పరిష్కరిం చేందుకు దీనిని చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు టోల్ ఫ్రీ నంబరు 1902 ను ఏర్పాటు చేసింది.
→ నంబరుకు ఫోను చేసి సమస్యలు తెలియజేస్తే వాటిని నమోదు చేసుకొని పరిష్కరిస్తారు.
→ వాటి పరిష్కార క్రమాన్ని ఎప్పటి కప్పుడు ఫిర్యాదుదారుడికి తెలియజేస్తారు.

ఏమిటీ కార్యక్రమం:-
→సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలకు సంబం ధించి వ్యక్తిగత స్థాయిలో ఎవరికైనా సమస్యలు ఎదు రైతే వాటిని మెరుగ్గా పరిష్కరించాలనే ఉద్దేశంతో 'జగ నన్నకు చెబుదాం' కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
→సంక్షేమ పథకాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక లేదా రేషన్ కార్డు పొందడం వంటి విషయాల్లో సమస్యలు ఎదురైనా లేదా ప్రభుత్వ పథకాలు అందుకో వడంతో ఇబ్బందులు కలిగినా టోల్ ఫ్రీ నంబరు 1902కు ఫోను చేయవచ్చు.
→ఇవే కాదు రెవెన్యూ సమస్యలు లేదా ప్రభుత్వ సేవ లకు సంబంధించిన సమస్యలూ తెలియజేయవచ్చు.
→టోల్ ఫ్రీ నంబరు 1902కు ఫోన్ చేసి కాల్ సెంట ర్లో ప్రతినిధికి సమస్యను చెబితే వారు దానిని రాసు కొని ఒక నంబరు (యువర్ సర్వీసు రిక్వెస్టు ఐడీ . వైఎస్సార్ ఐడీ) ఇస్తారు.
→ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారానికి ఏమేం ప్రయత్నాలు జరుగుతున్నా యన్న వివరాలతో ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు సమాచారం పంపుతారు.
→ సమస్య పరిష్కరించిన తర్వాత వారు అభిప్రాయం తెలియజేయవలసి ఉంటుంది.
→ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
→ నేరుగా సీఎం కార్యాలయం నుంచే ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు.

చాటీజీపీటీ దుర్వినియోగంపై చైనాలో తొలి అరెస్టు

→ రైలు ప్రమాదంపై తప్పుడు వార్తను సృష్టించి, దాన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో ఆన్లైన్లో వ్యాప్తి చేసిన ఒక వ్యక్తిని చైనాలో పోలీసులు అరెస్టు చేశారు.
→ చాటే జీపీటీ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి నందుకు ఈ దేశంలో నమోదైన తొలి అరెస్టు ఇదేనని అధికారులు తెలి పారు.
→ నిందితుడి పేరును హాంగ్ గా వారు వెల్లడించారు.
→ఏప్రిల్ 25న ఒక లోకల్ రైలు ప్రమాదానికి గురైందని, అందులో 9 మంది చనిపోయారని హాంగ్ ఒక తప్పుడు వార్తను సృష్టించాడు.
→బైజి యాహో అనే ఆన్లైన్ వేదికలో 20 ఖాతాల ద్వారా ఈ కథనాన్ని పోస్ట్ చేశాడు.
→ దీన్ని గన్సు ప్రావిన్స్లోని సైబర్ విభాగం పోలీసులు గుర్తించారు. అప్పటికే ఈ కథనానికి 15 వేల క్లిక్ లు వచ్చాయి.
→ బైజియాహోలోని డూప్లి కేషన్ తనిఖీ వ్యవస్థను ఏమార్చి, బహుళ ఖాతాల ద్వారా తాను ఈ నకిలీ వార్తను వ్యాప్తి చేసినట్లు హాంగ్ అంగీకరించాడు.
→ చాటీపీటీ సాయంతో ఒకే నకిలీ వార్తకు సంబంధించి భిన్న వెర్షన్లను అతడు సృష్టించినట్లు అధి కారులు తెలిపారు.
→ సమాజంలో ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నించా డన్న అభియోగం కింద అతడిపై కేసు నమోదు చేశారు.
→ సాధారణంగా ఇలాంటి నేరాలకు ఐదేళ్ల జైలు శిక్ష పడొచ్చు. తీవ్రస్థాయి కేసుల్లో పదేళ్ల కారాగార శిక్షనూ విధించే అవకాశం ఉంది.

పారిస్ లో 'బాస్టిల్ డే'లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రధాని మోదీ

→ పారిస్ లో జులై 14న జరగనున్న బాస్టిల్ డే కవాతులో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య పాల్గొననున్నారని భార విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.
→ ఫ్రాన్స్ అధ్య క్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని.. ఫ్రాన్స్ వెళ్లనున్నారని తెలి పింది.
→ కవాతులో ఫ్రెంచ్ సైన్యంతో పాటు, భారత్ సాయుధ బలగాలూ కదం తొక్కను న్నాయి.
→ ఆహ్వానాన్ని మన్నించిన మోదీకి మెక్రాన్ ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు.

ఎన్ పీపీలో పీడీఎఫ్ విలీనం

→మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ)లోకి తమ పార్టీని విలీనం చేస్తున్నట్లు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ప్రకటిం చింది.
→ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్పీపీ కూటమిలో పీడీఎఫ్ కూడా ఉంది. పీడీఎఫ్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
→వీరి చేరికతో ఎన్ పీపీ బలం 28కి పెరిగింది.
→జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు విలీన నిర్ణయం తీసుకున్నట్లు పీడీఎఫ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గావిన్ ఎం. మైలీమ్ వెల్లడించారు.

కొవిడ్ ఇకపై ప్రపంచ విపత్తు కాదు

→కొవిడ్-19 ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
→ప్రపంచ విపత్తుగా పరిగణిం చేంతటి స్థాయిలో దాని ప్రభావం లేదని వెల్లడించింది.
→ ఆరోగ్య నిపుణలతో సమావేశం నిర్వహించి చర్చించిన తర్వాత డబ్ల్యూహెచ్ ఈ ప్రకటన చేసింది.
→ అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రంచవ్యాప్తంగా ఆరోగ్యానికి ముప్పుగా ఉందని తెలిపింది.
→ దాని బారిన పడి ప్రతివారం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది.
→ఆగ్నేయా సియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఇటీవల కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది.
→ “మన ప్రపంచాన్ని కొవిడ్ మళ్లీ ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా అన్న విషయంపై నిపుణులతో మరోసారి సమీక్ష జరిపించడానికి నేను వెను కాడను" అని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొ న్నారు.
→ ఏడాది కాలంగా కొవిడ్ ప్రభావం తగ్గుతూ వస్తోందని, చాలా దేశాల్లో ఇప్పటికే మహమ్మారి ముందునాటి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
→ కొత్త వేరియంట్ల ప్రమాదం ఇంకా ఉందని హెచ్చరించారు.

సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్ మూసివేత

→ సి కింద్రాబాద్ 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పా టైన ప్రింటింగ్ ప్రెస్ ఇక గత చరిత్రగా మిగిలి పోనుంది.
→ రైల్వే రిజర్వుడు, అజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ప్రింటింగ్ చేసే ఈ ప్రెస్ని మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణ యించింది.
→ సికింద్రాబాద్ (ద.మ. రైల్వే)తో పాటు బైకులా-ముంబయి (మధ్య రైల్వే), హౌరా (తూర్పు రైల్వే), శకుర్బస్తీ-దిల్లీ (ఉత్తర రైల్వే), రాయపురం-చెన్నై (దక్షిణ రైల్వే).. మరో నాలుగు ప్రింటింగ్ ప్రెస్లను మూసివేయనుంది.
→ ఈమేరకు ఉత్తర్వులను ఆయా రైల్వేజోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు డైరెక్టర్ (గౌరవ కుమార్) పంపించారు.
→ ప్రింటింగ్ ప్రెస్ల మూసివేతకు సంబంధించిన మార్గదర్శకాలను జీఎంలకు పంపిన లేఖలో పొందుపరిచారు.
→ రిలీవ్ చేసే ఉద్యోగులను ఇతర విభాగాల్లో నియమించాలని.. ఆయా ప్రింటింగ్ ప్రెస్ ని యంత్రాలు, ప్లాంట్ల ద్వారా ఆయా జోన్లకు గరిష్ఠ ఆదాయం వచ్చేలా చూడాలని రైల్వేబోర్డు స్పష్టం చేసింది.
→ రైలు ప్రయాణ టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యేం తవరకు రిజర్వుడు, అన్ రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్సోర్సింగ్కు ఇవ్వాలని పేర్కొంది.
→ రైల్వేబోర్డు తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

త్వరలో పెంపుడు జంతువులకు రైలు టికెట్

→ ఇకపై రైలు ప్రయాణాల్లో తమతో పాటు పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
→ ఈ మేరకు టీటీఈలు పెంపుడు జంతువులకు టికె ట్ కేటాయించే అధికారాన్ని రైల్వేశాఖ పరిశీలి స్తోంది.
→ ఇప్పటివరకు పెంపుడు జంతువులు కలి గిన ప్రయాణికులు ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతించే వారు.
→ ఇందుకోసం ప్రయాణ తేదీ రోజున స్టేష న్లోని పార్సిల్ కౌంటర్కు వెళ్లి పెంపుడు జంతువుల కోసం టికెట్ బుక్ చేసుకోవాలి.
→ అలానే, సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్వ్యాన్
→ ఒక బాక్స్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేం అనుమతించేవారు.
→ ఈ వ్యవహారం మొత్తం ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండ టంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా పెంపుడు జంతువులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపా యాన్ని పరిశీలిస్తోంది.
→ ఈ మేరకు ఐఆర్ సీటీసీ వెబ్సైట్లో మార్పులు చేయాలని రైల్వేశాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కు సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిం చాయి.
→ ఈ నిబంధన ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు పక్షులు వంటి పెంపుడు జంతువులకు వర్తిస్తుందని సమాచారం.

బిహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల జరిమానా విధించిన జాతీయ హరిత ట్రైబ్యునల్

→బిహార్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్టీ) గట్టి షాకిచ్చింది.
→ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణలో విఫలమైనం దుకు గానూ రూ.4,000 కోట్ల జరిమానా విధిం చింది.
→ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు జమ చేయాలని నీతీశ్ సర్కారును ఆదేశించింది.
→వ్యర్థాల నిర్వహణ లో బిహార్ ప్రభుత్వం అల సత్వంపై ఎన్టీటీ అసహనం వ్యక్తం చేసింది.
→"ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైంది.
→సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ తీర్పుల ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘనే. అందువల్ల ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల పర్యావరణ పరి హారాన్ని విధిస్తున్నాం.
→ఈ మొత్తాన్ని రెండు నెలల్లోపు రింగ్ ఫెన్స్ అకౌంట్కు (అత్యవసర పరిస్థితుల్లో నిధులను సంరక్షించేందుకు ఉప యోగించే ఖాతాలు) డిపాజిట్ చేయాలి" అని జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఏకే గోయల్ నేతృ త్వంలోని ధర్మాసనం నీతీశ్ కుమార్ సర్కా రును ఆదేశించింది.
→పరిహార డబ్బుతో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ సదుపాయాలు, మురుగు నీటి నిర్వహణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

డైమండ్ లీగ్ లో తొలి అంచెలో నీరజ్ కి స్వర్ణం

→ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత వేదికలపై భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు.
→రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్ చరిత్ర సృష్టించి.. నిరుడు డైమండ్ లీగ్ ఫైనల్లోనూ విజేతగా నిలిచిన నీరజ్.. మరో మేటి విజయం సాధించాడు.
→డైమండ్ లీగ్ కొత్త సీజన్లో తొలి అంచె టోర్నీలో అదిరే ప్రదర్శనతో టైటిల్ సాధించాడు.
→ జావె లిన్ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరిన నీరజ్ విజేతగా నిలి చాడు.
→ తొలి త్రోలోనే 88.67 మీటర్ల దూరాన్ని అందుకుని అగ్రస్థానం సాధించిన చోప్రా ఈ సీజన్లో ఉత్తమ త్రో వేసిన ఆటగాడిగా 86.04 మీ. 85.47 మీ. జావెలిన్ ను విసిరాడు.
→ నాలుగో ప్రయత్నంలో ప్రయత్నాల్లో 84.37 మీ, 86.52 మీటర్లు విసిరి స్వర్ణాన్ని ఖాయం చేసు కున్నాడు.
→టైటిల్ నిలబెట్టుకున్నా నీరజ్ తను అనుకున్న 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయాడు.
→చోప్రాకు గట్టిపోటీ ఇచ్చిన టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ వాచ్ ఉత్తమంగా 88.63 మీటర్లు విసిరి రెండో స్థానం సాధించాడు.
→అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 85.88 మీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ప్రాజెక్ట్ సంజయ్

→అధునాతన పరిజ్ఞానం సాయంతో సమూల మార్పులకు భారత సైన్యం సిద్ధమవుతోంది.
→ఇందులో భాగంగా యుద్ధక్షేత్ర నిఘా వ్యవస్థ (బ్యాటిల్ ఫీల్డ్ సర్వై లెన్స్ సిస్టమ్) ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
→దీనిద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నతస్థాయి కమాండర్లకు ఎప్పటికప్పుడు విస్పష్ట అవగాహన ఏర్పడుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
→ఫలితంగా వారు సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని వివ రించాయి. సైనిక పోరాట సన్నద్ధతనూ ఇది మెరుగుప రుస్తుందని వెల్లడించాయి.
→'ప్రాజెక్ట్ సంజయ్' కింద ఈ వ్యవస్థను సైన్యం చేపట్టింది. దీనికింద పెద్దసంఖ్యలో సెన్సర్లను అనుసంధానిస్తారు.
→ క్షేత్రస్థాయికి సంబంధించి బహుళ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
→ కదనరం గంలో జరుగుతున్న పరిణామాలను కమాండర్ల కళ్ల ముందు ఇవి ఆవిష్కరింపజేస్తాయి.
→ సైన్యం ఈ ఏడా దీని పరివర్తన సంవత్సరం'గా పరిగణిస్తోందని సంబం ధిత వర్గాలు పేర్కొన్నాయి.
→ ఇందులో భాగంగా ఆధు నిక సాంకేతికతను సమకూర్చుకొని.. భవిష్యత్ పోరా టాలను సమర్థంగా ఎదుర్కోగల శక్తిమంతమైన దళంగా అవతరించాలని భావిస్తున్నట్లు వివరించాయి.
→ 'ప్రాజెక్ట్ సంజయ్ తోపాటు అనేక సాంకేతిక ప్రాజెక్టు లను సైన్యం చేపట్టినట్లు తెలిపాయి.

ధ్రువ్ హెలికాప్టర్ నిలిపివేత

→ భారత సైన్యం తేలికపాటి హెలికాప్టర్ ఏఎల్ హెచ్ ధ్రువ్ వినియోగాన్ని మరోసారి నిలిపేసింది.
→ ఈ విషయాన్ని మిలటరీ వర్గాలు వెల్లడించాయి.
→ వీటి వినియోగాన్ని నిలిపేయడం రెండు నెలల వ్యవ ధిలో ఇది రెండో సారి.
→ జమ్మూ-కశ్మీర్లోని కిన్తివాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ధ్రువ్ కుప్పకూలిన విషయం తెలిసిందే.
→ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా దింపేం దుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం సంభవించింది.
→ ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపు ణుడు పబ్బల్ల అనిల్ (29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.
→ గత మార్చి 8న మన నౌకా దళానికి చెందిన ఓ ఏఎల్ హెచ్ ధ్రువ్ ప్రమాదానికి గురవగా.. అందులోని సిబ్బందిని నేవి పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో రక్షించారు.
→ ఈ ఘటన తర వాత భారత త్రివిధ దళాల్లో ధ్రువ్ హెలికాప్టర్ల విని యోగాన్ని నిలిపివేశారు.
→ సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. మరో హెలికాప్టర్ కూలిపోవడం గమనార్హం.
→ ముందు జాగ్రత్త చర్యగా ధ్రువ చాపర్ల వినియోగాన్ని నిలిపివే సినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి.

వెబ్ బ్రౌజర్ ఆవిష్కరించిన జోహో

→మన దేశానికి చెందిన అంతర్జాతీయ టెక్ కంపెనీ జోహో కార్పొరేషన్, ఒక వెబ్ బ్రౌజర్ ను ఆవి ష్కరించింది.
→ప్రీబిల్ట్ సామర్థ్యాలతో వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో 'ఉలా'' పేరిట దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
→తమిళంలో ఉలా అంటే ప్రయాణం అని అర్థం. గోప్య తకు పెద్ద పీట వేయాలన్న జోహో లక్ష్యంలో ఇది మరొక అడుగు అని కంపెనీ పేర్కొంది.
→ఆన్లైన్ గోప్యత విషయంలో 92% దేశీయ ఆన్లైన్ వినియోగదార్లు ఆందోళనతో ఉన్నారని ఒక నివేదికను ఉటం కిస్తూ జోహో తెలిపింది.
→ఇంటర్నెట్ కంపెనీలు ఆ సమస్యకు ఒక కారణమని అందులో 85% మంది భావిస్తున్నారని తెలిపింది.
→'మార్కెట్లో వినియోగదారు గోప్యతను రక్షించేలా పెద్దగా బ్రౌజర్లు లేవు.
→ఆయా కంపెనీల వ్యాపార ప్రకటనల ఆధారిత వ్యాపార నమూనాలకు రక్షణ ఇచ్చేలా వాటిని సృష్టించారు.
→దీని వల్ల వినియోగదారుల ప్రాధాన్యతలకు, బ్రౌజర్ల వ్యాపార నమూనాలకు మధ్య సంఘర్షణలో వినియోగదా ర్లకే నష్టం కలుగుతోంద'ని జోహో కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.
→'ఉలా'తో వినియో గదార్లు తమ గోప్యత విషయంలో రాజీ పడనక్కర్లేదని తెలిపారు.

బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుగా నీరా టండన్ నియామకం

→అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ సలహామండ లిలో మరో భారతీయ అమెరిక న కు చోటు దక్కింది.
→బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుగా 52 ఏళ్ల నీరా టండన్ నియమి తులయ్యారు.
→స్వదేశీ విధానం, ఆర్థిక, రక్షణ విధానాల రూపకల్పనలో అధ్యక్షుడికి మూడు ఉన్నత మండళ్లు సాయపడతాయి.
→అందులో ఒక దానికి భారతీయ అమెరికన్ సారథ్యం వహించడం ఇదే ప్రథమం.
→2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్వదేశీ విధాన రూపకల్పనకు నీరాను నియమించడం కీలక పరి ణామం.
→ఆర్థికాభివృద్ధి, జాతుల మధ్య సమానత్వం, ప్రజారోగ్యం, విద్య, వలస వ్యవహారాలపై ఆమె తనకు సహకరిస్తారని బైడెన్ ప్రకటించారు.
→నీరా ముగ్గురు దేశాధ్యక్షుల (ఒబామా, బిల్ క్లింటన్, బైడెన్) నాయక త్వంలో పనిచేశారని గుర్తుచేశారు.

కొవిడ్ కు కొత్త ఔషధం

→కొవిడ్-19 చికిత్సకు ఉపకరించే కొత్త ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), ఇజ్రాయెల్ లోని డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీడీఆర్ అండ్ డీ) సంస్థలు చేతులు కలిపాయి.
→ఈ మేరకు ఇజ్రాయెల్లోని 101 థెరప్యూట్రిక్స్ లిమిటెడ్తో ఐఐసీటీ అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది.
→ఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కలైసెల్విల సమక్షంలో ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త (బిజినెస్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ చైర్) డాక్టర్ డి.శైలజ, థెరప్యూట్రిక్స్ లిమిటెడ్ ప్రతి నిధి అలెక్ గోల్డ్బెర్గ్ లు ఒప్పందాలపై సంతకం చేశారు.
→వర్చువ ల్గా ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిస్ట్గా రామకృష్ణ హాజరయ్యారు.
→కొవిడ్ చికిత్సలో ప్రభావవం తంగా పని చేస్తున్నట్లు గుర్తించిన ఔషధాన్ని తదుపరి దశకు తీసు కెళ్లేందుకు క్లినికల్ ట్రయల్స్ అధ్యయనంలో ఇజ్రాయెల్ సంస్థ విజ్ఞాన భాగస్వామిగా తోడ్పాటు అందిస్తుంది.
→మూడేళ్లలో క్లినికల్ ట్రయల్స్ ముగించాలని ఇరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
→అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని ఎదుర్కోవడంలో కొత్త ఔషధం సహాయపడుతుంది.

హకుటో ఆర్

→చందమామపైకి మూన్ ల్యాండరు పంపేందుకు జపాన్కు చెందిన 'ఐస్పేస్' అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల కంపెనీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
→ఈ సంస్థ అభివృద్ధి చేసిన 'హకుటో ఆర్' ల్యాండర్ చంద్రుడిపై దిగడానికి కొద్ది క్షణాల ముందు దానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఆ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయి ఉండవచ్చని సైంటిస్టులు ఏప్రిల్ 25న వెల్లడించారు.
→ఈ ల్యాండర్ను ఎలాన్ మస్క చెంది స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా గత డిసెంబర్లో చంద్రుడిపైకి పంపింది.
→ఆరడుగుల ఎత్తు, 340 కిలోల బరువుండే హకుటో ఆర్ చంద్రుడిపై పరిశోధనలు చేసే రషీద్ అనే రోవర్, బేస్ బాల్ పరిమాణంలో ఉండే ఒక రోబో ఉన్నాయి.
→హకుటో అంటే జపాన్ భాషలో కుందేలు అని అర్థం.

ప్రపంచ మలేరియా దినోత్సవo

→ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏప్రిల్ 25న నిర్వహించారు.
→ మలేరియా నివారణ, నియంత్రణపై అవగాహన పెంచడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
→ ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని 2001 నుంచి ఆఫ్రి కన్ దేశాలు నిర్వహిస్తున్నాయి.
→ 2007లో ప్రపంచ హెల్త్ అసెంబ్లీ 60వ సెషన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిం చాలని ప్రతిపాదించింది.
→ ఈ ఏడాది దీని థీమ్ 'టైమ్ టు డెలివర్ జీరో మలేరియా: ఇన్వెస్ట్, ఇన్నోవేట్, ఇంప్లిమెంట్',

జీటెక్స్

→ గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిబిషన్ (జీఈటీఈఎక్స్)ను దుబాయ్ లో ఏప్రిల్ 26 నుంచి 28 వరకు నిర్వహించారు.
→ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను 30 ఏండ్లుగా నిర్వ హిస్తున్నారు. విదేశీ విద్యలో అడ్మిషన్ల కోసం ప్రముఖ విద్యాసంస్థలు ఇందులో పాల్గొం టాయి.
→ ఈ ఎగ్జిబిషన్ ఏటా 25,000 మంది స్థానిక, ప్రవాస విద్యార్థులను ఆకర్షిస్తుంది.
→ ఇక్కడ భారత పెవిలియన్ను దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ అమన్ పురి ప్రారం భించారు.
→వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు.

వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే

→వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే (ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం) ని ఏప్రిల్ 26న నిర్వహించారు.
→ పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్మార్క్లు, డిజైన్లు దైనందిన జీవి తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై అవగాహన పెంపొందించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
→ దీన్ని 1988లో 33వ జనరల్ అసెంబ్లీ సెషన్లో ప్రతిపాదించారు. 1999, ఆగస్ట్ 9న ఏర్పాటు చేశారు. దీని ప్రారంభ వేడుక 2000లో నిర్వహించారు.
→ ఈ ఏడాది దీని థీమ్ 'ఉమెన్ అండ్ ఐపీ: యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ".

రాజస్థాన్ ప్రభుత్వం మూడు సంరక్షణ కేంద్రాలు

→రాజస్థాన్ ప్రభుత్వం మూడు కన్జర్వేషన్ రిజర్వ్ ను ఏప్రిల్ 24న ప్రకటించింది.
→బరన్ ని సోర్సాన్, జోధ్పూర్ లోని భిచాన్, భిల్వారాలోని హమీర్ఢ్ ప్రాంతా లను వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా గుర్తించింది.
→సోర్సాన్ గడ్డిభూములు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కు చాన్ డెమోయిల్లే అనే జాతి కొంగలకు, హమీర్ గఢ్ జింకలు, దుప్పులు, పులులు తదితర జంతువులకు నివాసంగా ఉన్నాయి.
→ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ -1990 ప్రకారం వీటిని సంరక్షణ . కేంద్రాలుగా గుర్తించారు.

భార తదేశపు మొదటి గ్రామం మాణా

→ వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంట ఉన్న 'మాణా' గ్రామ ప్రవేశ ద్వారం వద్ద భార తదేశపు మొదటి గ్రామం అని రాసి ఉన్న బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 25న ఏర్పాటు చేసింది.
→ భారత్-చైనా సరిహ ద్దులో ఉన్న ఈ గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రం, చమోలి జిల్లాలోని బద్రీనాథ్ సమీ పంలో ఉన్న పర్యాటక ప్రాంతం.
→ దీన్ని 'టూరిజం విలేజ్'గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుర్తించింది.
→ మాణా దేశపు చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర ్సంగ్ థామీ పేర్కొన్నారు.
→ ఉత్తరాఖండ్ టూరిజం వెబ్ సైట్ ప్రకారం ఈ గ్రామం సరస్వతి నది ఒడ్డున సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో ఉంది.

పశ్చిమ కనుమల్లో అరుదైన కప్పజాతులు

→అడవులను నరికి వ్యవసాయం, తోటల పెంపకానికి అనువుగా మార్చడంతో ఉభయచరాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోందని తాజా అధ్యయనంలో మరోసారి నిరూపితమైంది.
→అడవులు జీవవైవిధ్యానికి -నెలవని.. వాటిల్లో ఏ చిన్న మార్పు జరిగినా మొదట ప్రభావితమయ్యేవి కప్పలేనని పరిశోధకులు నిర్ధారిం చారు.
→మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని సింధుదుర్గ ప్రాంతం : 250కి పైగా కప్పజాతులకు నిలయంగా ఉందని, ప్రపంచంలోనే అరుదైన అంబోలి బుష్, క్రికెట్ గోవా వంటి అరుదైన జాతులు ఇక్కడ నివసి స్తున్నాయని గుర్తించారు.
→ఈ ప్రాంతంలోని చిన్న రైతులు తమ జీవనోపాధి కోసం అడవుల స్థానంలో క్రమంగా జీడితోటల పెంపకం చేపట్టారు. భవిష్యత్తులో వీటి సాగు మరింత పెరిగే అవకాశం ఉంది.
→ఈ తోటల ప్రభావం జీవవైవిధ్యంపై ఎలా ఉందనే దానిపై హైదరాబాద్ లోని సీసీఎంబీకి చెందిన అంత రించిపోతున్న జంతు జాతుల సంరక్షణ, పరిశోధన సంస్థ(లాకోన్స్), సోనిపట్లోని అశోక విశ్వవిద్యా లయ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి.
→పశ్చిమ కనుమల్లోని అటవీ అంతర్భాగం, అడవి అంచుల్లో, జీడితోటల్లో.. ఇలా మూడు ఆవాసాల్లో ఏక కాలంలో అధ్యయనం చేపట్టారు.
→జీవ వైవిధ్యానికి నెల వైన కప్పుల మనుగడను పరిశీలించారు. వాటికి ఆహా రమైన కీటకాలను సంగ్రహించడానికి చిన్న చిన్న ఉచ్చులు ఏర్పాటు చేశారు.
→అక్కడ ఉష్ణోగ్రత, తేమను రికార్డు చేసే డేటా లాగర్ను పొందుపరిచారు. అందులో నమోదైన వివరాల ఆధారంగా విశ్లేషించారు.
→అటవీ, అంతర్భాగంలో, అంచుల్లోని జీడితోటల్లో కప్పలు సమృద్ధిగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
→ఈ తోటలు అడవుల వెంటే ఉండటం, వృక్షసంపద కార ణంగా వాటి ఆవాసానికి అనువుగా ఉన్నట్లు తేలింది.
→వీటిని పరిరక్షించుకోవాలంటే ఈ ప్రాంతంలో జీడితోటల సాగును కప్పలకు స్నేహపూర్వకంగా ఉండేలా ప్రోత్సహిం చాలని వారు అంటున్నారు.
→పురుగు మందులు విని యోగం, అడవుల నరికివేత వంటి వాటిపై ఆంక్షలు విధించాలని సూచిస్తున్నారు.
→సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలంటున్నారు.
→డాక్టర్ కార్తికేయ వాసుదేవన్ నేతృత్వంలో కృష్ణపవనకుమార్, గాయత్రి శ్రీధరణ్ బృందం చేపట్టిన ఈ అధ్యయన ఫలి తాలు ఇటీవల అసోసియేషన్ ఫర్ ట్రాఫికల్ బయోలజీ అండ్ కన్జర్వేషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.

తెరపైకి 'ప్రాజెక్ట్ సంజయ్'

→ అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ.. భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
→ అత్యాధునిక డిజిటల్ యుద్ధ క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధిం చేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
→ 'ప్రాజెక్ట్ సంజయ్' పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది.
→ ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి.
→ దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుం టుంది.
→ 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది.
→ తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది.
→ ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్ లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
→ ఇందులో భాగంగా, పర్వత ప్రాం తాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి.
→ పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది.
→ భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ 'ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్ కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి.
→ ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్ (ఆర్టిలరీ కంబాట్ కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్గ్రేడ్ చేపట్టారు.
→ దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్ తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఆర్మీలో ఎలక్ట్రిక్ జిప్సీలు

→ఇండియన్ ఆర్మీ సెల్ కొత్తగా ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది.
→ఐఐటీ ఢిల్లీ, ట్యాడోపోల్ ఈవీ స్టార్టప్లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్ జిప్సీలుగా మార్చేస్తుంది.

SCO సమ్మిట్

→భారత్ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా జరిగింది.
→ఈ కార్యక్రమంలో దాయాది పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొన్నారు.

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కు నవరత్న హోదా

→రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది.
→ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. ఈ సంస్థ ఆథరైజ్డ్ షేర్ కేపిటల్ రూ. 3వేల కోట్లు ఉంది.

(LIC) చైర్మన్ గా సిద్ధార్థ మొహంతి

→లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్మన్ గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది.
→2024 జూన్ వరకు మొహంతి. ఈ పదవిలో కొనసాగుతారు.
→ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు.

మల్లికార్జున ప్రసాద్

→మహారత్న సంస్థ కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగు వ్యక్తి పోలవరపు మల్లి కార్జున ప్రసాద్ నియమితులయ్యారు.
→ ప్రస్తుతం సెంట్రల్ కోలీ ఫీల్డ్స్ సీఎండీగా ప్రసాద్ ఉన్నారు.

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

→68వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు 2023లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి: (ఆలియా భట్), ఉత్తమ దర్శకుడు (సంజయ్ లీలా భన్సాలీ) సహా 9 విభాగాల్లో 'గంగూబాయి కాఠియావాడి' అవార్డులు సొంతం చేసుకుంది.
→ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ రావు (బదాయి దో) పురస్కారం దక్కింది.

మణిపూర్ లో అల్లర్లు

→ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మెజారిటీ ప్రజలైన మైతై వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్తో గిరిజనులు, గిరిజనేతరులు (మైతై) మధ్య హింసాత్మక ఘర్షణలు నెలకొన్నాయి.
→ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు, ఘర్షణ జరిగే ప్రాంతంలో 'కని పిస్తే కాల్చివేత'కు ఉత్తర్వులు జారీ చేశారు.

అరుణ్ గాంధీ

→ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త. జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మహా రాష్ట్రలోని కొల్హాపూర్లో అనారోగ్యంతో మరణించా రు.
→1934, ఏప్రిల్ 14న ద క్షిణాఫ్రికాలోని డర్బన్లో మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ జన్మించారు.
→ఈయన జర్నలిస్టుగా. ఎక్కువ కాలం పని చేశారు.

అజయ్ బంగా

→ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు.
→ ప్రపంచ బ్యాంకు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్ ఆయన నిలిచారు.
→ జూన్ 2 నుంచి అయిదేళ్లు బంగా పదవిలో కొ నసాగుతారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.

కుల గణనకి బ్రేక్

→కులగణనపై నీతీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు పట్నా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
→ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేను తక్షణం నిలిపివే యాలని, ఇప్పటివరకు సేకరించిన డేటాను భద్రంగా ఉంచాలని,ఎవరితోనూ ఆ సమాచారం పంచుకోరా దని పేర్కొంది.

76 కోట్ల మంది భారతీయుల చేతిలో ఇంటర్నెట్

భారత జనాభాలో ఇంటర్నెట్ క్రియాశీలక విని యోగదారుల సంఖ్య తొలిసారిగా 50 శాతం దాటింది.
→ 2022 నాటికి దేశ జనాభాలో 75.9 కోట్ల మంది (నగర, గ్రామీణ ప్రాంతాలు కలిపి) నెలలో కనీసం ఒక్కసారైనా ఇంటర్నెట్ వాడుతున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది.
→ 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా - 2022' పేరిట ఐఏఎంఏఐ, కాంటార్ సంస్థలు సంయుక్తంగా ఈ నివే దిక రూపొందించాయి.
→ డిజిటల్ చెల్లింపులు 2021తో పోలిస్తే 2022లో 13 శాతం వృద్ధి నమోదై.. 33.8 కోట్ల మంది వినియోగదారులకు చేరాయి.
→ ఇందులో 36 శాతం మంది గ్రామీణ భారతానికి చెందినవారు.

మణిపూర్ లో నిరసనలు

మణిపూర్ జనాభాలో 53% ఉన్న గిరిజనే తరులైన మైతై వర్గం వారిని ఎస్టీల్లో చేర్చాలని కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
→ దీంతో తమకు అన్యాయం జరుగుతుంద ని గిరిజన వర్గాలు ఆందోళన చెందుతు న్నాయి.
→ ఆల్ టైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నేతృత్వంలో వేలాది మంది గిరిజనులు భారీ ర్యాలీలు నిర్వహించారు.
→ అయితే, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా మణిపూర్ లోకి వలస వచ్చిన వారి వల్ల తమకు విద్య, ఉద్యోగాల్లో నష్టం జరుగుతోందని ఎస్టీ హోదాను కోరుతున్నామని మైతై లు వాదిస్తున్నారు.

‘రాయల్' సైబర్ దాడిపై అప్రమత్తంగా ఉండండి

కీలక డేటాను బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ద్వారా సొమ్ము కాజేసేందుకు ప్రయత్నించే 'రాయల్ రాన్సమ్వేర్' సైబర్ దాడిపై దేశ ప్రజలను భారత కంప్యూటర్ అత్యవసర ప్రతిస్పందన బృందం (సెర్ట్-ఇన్) అప్రమత్తం చేసింది.
→ ప్రధానంగా కమ్యూనికేషన్లు, ఆరోగ్యసేవ, విద్యారంగాలను ఈ వైరస్ తో సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకునే ముప్పుం దని హెచ్చరించింది.
→ వ్యక్తులనూ వారు దాడి లక్ష్యాలుగా ఎంచుకునే అవకా శాలు లేకపోలేదని తెలిపింది.
→ నకిలీ ఈ-మెయిళ్లు, హానికర డౌన్లోడ్ల వల్ల 'రాయల్' వైరస్ చొరబడుతుందని పేర్కొంది.
→ బాధితుల సిస్టమ్లలోని సమా చారాన్ని అది తస్కరిస్తుందని వివరించింది.

భూతాపంపై 54% భారతీయుల్లో ఆందోళన

వాతావరణ మార్పుల వల్ల భూతాపం పెరిగిపోవడంపై భారతీయుల్లో అత్యధికులు భయాందోళనకు గురవుతున్నారని యేల్ విశ్వవి ద్యాలయం, సీ-ఓటర్ ఇంటర్నేషనల్ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది.
→ 2021 అక్టోబరు 18 నుంచి 2022 జనవరి 9 వరకు 4,619 మంది భారతీయు లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
→ వారంతా 18 ఏళ్లు పైబడినవారే. వారిలో 54 శాతం మంది భూతాపంపై ఆందోళన చెందుతున్నారు. 20 శాతం మంది కలవరపడుతున్నారు.
→ ఆచితూచి స్పందిం చినవారు 11 శాతమైతే, వాతావరణం గురించి పట్టించుకోనివారు కేవలం 7 శాతమే. ఈ నాలుగు గ్రూపులలో అత్యధికులు గ్రామీణులే.

ఛార్లెస్కు డబ్బావాలాల 'పునెరీ పగఢీ'

లండన్లో పట్టాభిషి క్తుడవుతున్న బ్రిటన్ రాజుకు ముంబయి డబ్బా వాలాలు 'పునెరీ పగఢీ'ని (సంప్రదాయ తల పాగా) పంపారు.
→ దీంతోపాటు మెడలో ధరించే కండువానూ (ఉపర్నీ) ఆయనకు పంపారు.
→ మహారాష్ట్రలోని పుణె నగరంలో 19వ శతాబ్దం నుంచి హోదాకు, గౌరవానికి ప్రతీకగా పునెరీ పగడిని ధరిస్తారు.
→ సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఉపర్నీని పురుషులు ధరి స్తారు.
→ రాజు పట్టాభిషేకానికి తమను ఆహ్వా నించలేదని, ఇటీవల ముంబయిలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తమలో కొందరిని బ్రిటన్ దౌత్య అధికారులు పిలిచా రని, ఈ సందర్భంగా వారికి పునెరీ పగఢీని, ఉపర్నీని అందజేశామని డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు రాందాస్ కరం తెలిపారు.
→ బ్రిటన్ ముంబయి డబ్బావాలాలకు బ్రిటన్ రాజ కుటుంబంతో సుదీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగుతున్నాయి.
→ 2003లో ఛార్లెస్ - 3 భారత్ పర్యటనకు వచ్చినప్పుడు వారిని కలిసి సేవలను ప్రశంసించారు.

వడగళ్లకు వెరవని వరి వంగడం జేజీఎల్-24423

ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నా.. వరి వంగడం జేజీ ఎల్-24423 మాత్రం నేల రాలలేదు.
→ కరీంనగర్ జిల్లా రామడుగు, దత్తోజిపేట, శ్రీరాములపల్లి, షానగర్ తది తర గ్రామాల్లో 3 వేల ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఎకరానికి సుమారు 33 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి సాధించారు.
→ వీరికి ఇటీవల వర్షాలకు ఎకరానికి 10 శాతం మాత్రమే నష్టం వాటిల్లింది.
→ జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన జేజీఎల్-24423(జగిత్యాల రైస్) వరి రకానికి గింజరాలే గుణం తక్కువగా ఉంటుందని వరి విభాగం శాస్త్రవేత్త బి. శ్రీనివాస్ తెలిపారు.

గజగిరిగుట్ట కింద భూగర్భంలో చారిత్రక అవశేషాలు

శాతవాహనుల ఆవాస ప్రాంతంలో బౌద్ధ చారిత్రక ఆధారాలు కని పిస్తున్నాయని చర్రిత పరిశోధకుడు రెడ్డి రత్నాక ర్రెడ్డి తెలిపారు.
→ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గజగిరిగుట్ట దిగువన మట్టి దిబ్బల కింద శాతవాహన కాలంనాటి ఇటుక గోడల నిర్మాణాలను ఆయన గుర్తిం చారు.
→ ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లా డుతూ రైతులు ఆ ప్రాంతాన్ని సాగు కోసం తవ్వ డంతో ఇటుక గోడల వరుసలు వెలుగు చూశా యని చెప్పారు.
→ ఉపరితలంలో బౌద్ధ స్తూప నిర్మా ణానికి సంబంధించిన శిలలు, సున్నపురాయి, మట్టితో చేసిన టైల్స్ అధిక సంఖ్యలో కనిపిం చాయి.
→ రంగురంగుల రాతి పూసలు, దంతపు పూసలు, మట్టిపూసలు, రాతి గోళీలు, మట్టి గోళీలు శివ లింగ ఆకృతిలో ఉన్న పనిముట్లు లభించాయి.
→ గజ్జగిరిగుట్ట పక్కన 2 వేల వరకు వివిధ రకాల సమాధులు ఉన్నాయని తెలిపారు.

రూ.2 లక్షల కోట్లకు మీడియా, వినోద పరిశ్రమ

భారత మీడియా, వినోద పరిశ్రమ 2022లో 19.9% వృద్ధి చెంది రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది.
→ కొవిడ్ సంక్షోభం కారణంగా 2020, 2021లో 23% ఆదాయాన్ని కోల్పోయిన పరిశ్రమ.. గతేడాది బలంగా పుంజు కుంది.
→ 2025 నాటికి 10.5 శాతం వార్షిక సమ్మి ళిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో పరిశ్రమ విలువ రూ.2.83 లక్షల కోట్లకు చేరుతుందని ఫిక్కీ అధ్యక్షుడు శుభ్రకాంత పాండా పేర్కొన్నారు.
→ ముంబయిలో జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ కార్యక్ర మంలో విండోస్ ఆఫ్ ఆపర్చ్యునిటీ: ఇండియాస్ ఎం అండ్ ఈ సెక్టర్ నివేదికను ఆయన విడుదల చేశారు.
→ మీడియా, వినోద పరిశ్రమ సామర్థ్యం, సత్తాలను తాజా వృద్ధి గణాంకాలు తెలియజేస్తున్నాయని, కొత్త అవ కాశాలను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు.
→ ఈ ఏడాది మీడియా, వినోద పరిశ్రమ 11.5 శాతం వృద్ధి చెంది రూ.2.34 లక్షల కోట్లకు చేరొచ్చు.
→ 2030కు భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిస్తే.. దేశీయ మీడియా, వినోద పరిశ్రమ ప్రపం చంలోనే అతిపెద్దదిగా అవతరించే అవకాశం ఉంది.
→ 2022లో పరిశ్రమ ప్రకటనల ఆదాయం రూ. లక్ష కోట్లు దాటింది. ఇందులో సింహభాగం డిజిటల్ ప్రకటనల నుంచి వచ్చింది.
→ 2022లో సంప్రదాయ మీడియా కూడా వృద్ధి సాధించింది. భవిష్యత్లో మూడింట రెండొంతుల వృద్ధి కొత్త తరం మీడియా నుంచి రానుండగా, ఒక వంతు సంప్రదాయ మీడియా నుంచి వస్తుందని నివే దిక తెలిపింది.

12 ఏళ్ల తర్వాత భారత్ కు పాక్ విదేశాంగ మంత్రి

పాకి స్థాన్ విదేశాంగ మంత్రి 12 ఏళ్ల తర్వాత భారత్లో కి అడుగుపెట్టారు.
→ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గోవా చేరుకున్నారు.
→ ఈ సమావేశం సందర్భంగా భారత్, పాక్ విదేశాంగ మంత్రుల మధ్య భేటీకి ప్రణాళికలు ఏమీ లేవని నిర్వాహ కులు స్పష్టం చేశారు.
→ 2011 తర్వాత ఓ ఉన్న తస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పాక్ విదే శాంగ మంత్రి భారత్ రావడం ఇదే తొలిసారి.
→ ఇదిలా ఉండగా ఎస్సీవో సదస్సుకు హాజరయ్యేం దుకు గోవా చేరుకున్న రష్యా, చైనా విదేశాంగ మంత్రులు సెర్గే లవ్రోవ్, చిన్ గ్యాంగ్లతో మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
→ చిన్ తో తూర్పు లద్దాల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వివాద పరిష్కారంపై, లవ్రోవ్తో ఎస్సీవో, జీ20, బ్రిక్స్ అంశాలపైనా జైశంకర్ సమాలోచనలు జరిపారు.

'ఆల్ ఇండియా రేడియో' అన్ని భాషల్లోనూ ఆకాశవాణే

రేడియో ప్రసారాల సమ యంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశ వాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
→ రేడి యోల్లో ప్రకటనల సమయంలో కానీ, ఇతర అధి కార వర్తమానాల్లో కానీ కేవలం ఆకాశవాణి పేరు మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు.
→ ఇంగ్లిష్ ప్రసారాల సమయంలో కూడా 'దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో' అని కాకుండా 'దిస్ ఈజ్ ఆకాశవాణి' అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
→ అన్ని భాషలు, మాండలికాల్లోనూ ఇదే నిబంధనను అనుసరించాలని నిర్దేశించారు.

దేశవ్యాప్తంగా 100 ‘ఫుడ్ స్ట్రీట్'లు

చిరుతిండిని అమితంగా ఇష్టపడే ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 100 'ఫుడ్ స్ట్రీట్'లకు ఆర్థికసాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది.
→ ఈ మేరకు సంబంధిత ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్టు కార్యాచరణపై కేంద్ర ఆరోగ్య మంత్రి మనస్సుఖ్ మాం డవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు.
→ ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ, భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు పాల్గొన్నారు.
→ మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 100 చోట్ల ఫుడ్ఆట్లను అక్కడి వ్యాపార సంస్థలు/వ్యాపారులతో కలిసి ప్రారంభిస్తారు.
→ ఈ 100 ఫుడ్ స్ట్రీట్స్లో ఆంధ్ర ప్రదేశ్లో నాలుగు, తెలం గాణలో నాలుగు ఏర్పాటుకానున్నాయి. ఒక్కో ఫుట్కు రూ.1 కోటి ఆర్థిక సాయం అందిస్తారు.
→ ఈ ఫుడ్ స్ట్రీట్ లలో ఆహారం ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతోపాటు ఆయా వ్యాపారులు సొం త బ్రాండింగ్ చేసుకోవాలి.

డాక్టర్ శిల్పకు అంతర్జాతీయ ఫెలోషిప్

హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండ మెంటల్ రీసెర్చ్ (టీఐఎస్ఆర్) లో డాక్టరేట్ చేసిన శిల్ప పోతాప్రగడకు 2023కి ప్రతిష్ఠాత్మక చుమిద్ అంతర్జాతీయ సైన్స్ ఫెలోషిప్ లభించింది.
→ ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెలోషిప్నకు 30 మందిని ఎంపిక చేయగా భారత దేశం నుంచి శిల్ప ఒక్కరికే అవకాశం దక్కడం విశేషం.
→ ఈ ఫెలోషిప్నకు జాతీయ పరిశోధనా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎంపికైన తొలి వ్యక్తి శిల్ప అని టీఐఎస్ఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.
→ ఫెలోషిప్ కింద ఏడా దికి లక్ష డాలర్ల ఉపకార వేతనంతో పాటు అంతర్జాతీయ నిపుణులతో కలిసి పనిచేసే చక్కటి అవకాశం లభించనుంది.
→ క్యాన్సర్ కారక కణాలపై డాక్టరేట్ చేసిన శిల్ప తాజాగా మహిళల ఆరోగ్యంపై అధ్యయనం సాగిస్తున్నారు.
→ మహిళల్లో పునరుత్పాదకతను అధ్యయనం చేసేందుకు బయో ఇంజనీరింగ్ సాంకేతికతతో మెరుగైన సాధనాలు అభివృద్ధి చేయడంతో పాటు మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఆధునిక పరికరాలు, థెరపీలు అభివృద్ధి చేసేందుకు డాక్టర్ శిల్ప కృషి చేయనున్నారు.

కప్పలను కబళిస్తున్న వైరస్ను కనిపెట్టే టెస్ట్ అభివృద్ధి

సైబ్రిడియో మోకోసిస్ అనే వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కప్పలు తదితర ఉభయచరాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.
→ ఆ వైరస్ ను కనిపెట్టే సాధనంపై శాస్త్రవేత్తలు చాలాకా లంగా పరిశోధనలు చేస్తున్నారు.
→ మొత్తానికి సైబ్రిడియో మోకోసిస్ ను కను గొనే పరీక్షను హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యు లర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.
→ ఆస్ట్రే లియా, పనామాకు చెందిన శాస్త్రవేతలతో కలిసి సీసీఎబీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ సారథ్యంలోని బృందం వైరసు కనిపెట్టే ఈ టెస్ట్ అభివృద్ధి చేసింది.
→ ఈ పరీక్ష వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉభ యచరాల్లో నైట్రిడియో మోకోసిస్ వ్యాప్తిని కనిపెట్టి నివారించే అవకాశం ఉందని డాక్టర్ వాసుదేవన్ పేర్కొన్నారు.
→ తద్వారా ఉభయచరాలు అంతరిం చకుండా కాపాడవచ్చని, ఈ పరిశోధన తాజాగా ట్రాన్స్ బౌండరీ అండ్ ఎమ ర్జింగ్ డిసీస్ మాగజైన్లో ప్రచురితమైందని సీసీఎంబీ వెల్లడించింది.

ఆల్ ఇండియా రేడియో ఇకపై ఆకాశవాణి

పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ ప్రసార భారతి ఇంత కాలం 'ఆల్ ఇండియా రేడియో' పేరుతో అందిస్తున్న రేడియో సేవలు ఇకపై ఆకాశ వాణి పేరుతో ప్రసారం కానున్నాయి.
→ ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలంటూ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ వసుధా గుప్తా బుధవారం అంత ర్గత ఉత్తర్వులు జారీ చేశారు.

కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం తల్లి ఖాతాలోకి

వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని వధువు తల్లి ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
→ కులాంతర వివాహాల విష యంలో వధువు ఖాతాలోకి ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.
→ ఈ మేరకు పథకాల మార్గ దర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను సాంఘిక సంక్షేమశాఖ బుధవారం విడుదల చేసింది.
→ ఎస్సీ, ఎస్టీలకు రూ. లక్ష, కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, మైనారిటీలకు రూ. లక్ష, బీసీలకు రూ.50 వేలు, వీరి కులాంతర వివాహానికి రూ. 75 వేలు, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సాయం అందించనుంది.
→ అర్హులు గ్రామ వార్డు సచివాల యాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వధూ వరులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండా లని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్సైట్ ఉండగా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడిం చారు.
→ కర్నూలు నగరం సంతోష్ నగర్లోని కార్యాల యంలో ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta. ap.gov.in ను ఆయన ప్రారంభించారు.
→ అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకాయుక్త సేవ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు.
→ లోకాయుక్తకు సంబంధించి నియమ నిబంధ నలు, ఇతర వివరాలు ఇందులో ఉంటాయన్నారు.
→ కార్య క్రమంలో రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి, సెక్రటరి అమరేం దర్, అధికారులు పాల్గొన్నారు.

బలగాలకు మిల్లెట్స్ వంటలు

అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవ త్సరాన్ని పురస్కరించుకొని సాయుధ బలగా లకు ఇచ్చే ఆహారంలో కేంద్ర హోం శాఖ మార్పులు చేసింది.
→ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), జాతీయ విపత్తు సహాయ బలగం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందికి మిల్లెట్ వంటకాలను అందించనుంది.
→ ఇకపై వారి ఆహారంలో 30% అవే ఉంటాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.
→ ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్స రంగా ఐరాస ప్రకటించడం తెలిసిందే.

కోల్ ఇండియా సీఎండీగా పోలవరపు మల్లికార్జున ప్రసాద్

ప్రభుత్వరంగ మహారత్న సంస్థ కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగు వారైన పోలవరపు మల్లికార్జున ప్రసాద్ పేరును, ప్రభుత్వరంగ సంస్థల ఎంపిక బోర్డు సిఫార్సు చేసింది.
→ ప్రస్తుతం కోస్ఇండియా అనుబంధ సెంట్రల్ కోల్ఫీల్డ్స్ సీఎండీగా ప్రసాద్ ఉన్నారు.
→ మొత్తం ఏడుగురిని ఇంటర్వ్యూ చేశాక, ప్రసాద్ పేరును ఖరా రుచేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
→ ఈయన ఉస్మానియా యూనివర్శిటీలో మైనింగ్ విభాగంలో బీఈ 1984లో పూర్తి చేశాక, కోల్ ఇండియాలో ఉద్యోగజీవితం ప్రారంభించారు.
→ తర్వాత వెస్ట్రన్ కోల్పీల్డ్, మహానది కోల్ఫీల్డ్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నుంచి జనరల్ మేనేజర్ వరకు | వివిధ హోదాల్లో పనిచేశారు.
→ భారత్ కోకింగ్ కోల్, నార్తన్ కోల్ ఫీల్డ్స్ లిమి టెడ్లోనూ పనిచేశారు. ప్రస్తుతం జియలాజికల్ అండ్ మెటలర్జికల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గానూ సేవలందిస్తున్నారు.
→ గనుల తవ్వకాల సమయంలో, ప్రసాద్ తీసుకున్న భద్రతా ప్రమాణాలకు గుర్తింపుగా - కేంద్ర ప్రభుత్వం వివిధ అవార్డులు ఇచ్చి గౌరవించింది.

13 ఏళ్ల గరిష్ఠానికి సేవల రంగం

భారత సేవల రంగం దూసుకెళ్లింది. గిరాకీ పరిస్థితులు సానుకూలంగా ఉండడం, కొత్త వ్యాపారాల్లో లాభాలు నమోదు కావ డంతో ఏప్రిల్లో ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎమ వ్యాపార కార్యకలాపాల సూచీ 62.0కు చేరింది. ఇది 13 ఏళ్ల గరిష్ఠ స్థాయి.
→ మార్చిలో సేవల పీఎమ్ఐ 57.8గా నమోదైంది. వరుసగా 21వ నెలా 50 పాయింట్ల పైన అంటే ప్రగతి బాటలోనే సేవల రంగం కొనసాగుతోంది.
→ పీఎమ్స్ఐ సూచీ 50కి పైన ఉంటే వృద్ధిగా, కింద నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు. ధరల ఒత్తిళ్లున్నా, గిరాకీ పుంజుకోవడం విశేషం.
→ 'ఏప్రిల్లో భారత సేవల రంగం అద్భుత పనితీరు కనబరిచింది. కొత్త వ్యాపారాల దూకుడుతో 2010 జులై తర్వాత వేగవంతమైన వృద్ధి సాధించింది.
→ ఫైనాన్స్, బీమా రంగాలు జోరందుకున్నాయి' అని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డి లిమా పేర్కొన్నారు.

మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు భారత్

మీడియా స్వేచ్ఛలో భారత్ మరింత దిగు వకు పడిపోయింది. ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచి 2023లో 161వ స్థానానికి పరిమితమైంది.
→ గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 11 ర్యాంకులు పడిపోయి 161కి చేరింది.
→ రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే గ్లోబల్ మీడియా వాచాగ్ ప్రతి ఏడాది ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురిస్తుంటుంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంటుంది. ఈ ఏడాది ప్రకటిం చిన ర్యాంకుల్లో భారత్ మరింత పడిపోవడం గమ నార్హం. బుధవారం ప్రకటించిన ఈ ర్యాంకుల్లో సమ స్యాత్మకం నుంచి అత్యంత దారుణ పరిస్థితికి తుర్కియే, భారత్, తజికిస్థాన్ చేరుకున్నాయని ఆర్ ఎస్ఎఫ్ పేర్కొంది. రాజకీయ నేతలకు సన్నిహి తంగా ఉండే వ్యక్తులు మీడియా సంస్థలను కొను గోలు చేసి వార్తల స్వేచ్ఛా ప్రసారాలను అడ్డుకుంటు న్నారని ఆరోపించింది. మీడియా స్వేచ్ఛా సూచీలో భారత్ ర్యాంకు మరింత పడిపోవడంపై ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మీడియా పాత్రను తక్కువ చేయడం సరికాదని, అభద్రతా భావంతో కూడిన పని పరిస్థితులు ఎప్ప టికీ మీడియాకు స్వేచ్ఛను ఇవ్వలేవని ఒక సంయుక్త ప్రకటనలో అవి వ్యాఖ్యానించాయి.

రైల్ వికాస్ నిగమ్ కు నవరత్న హోదా

రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది.
→ ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. రైల్వే సామర్థా ్యన్ని పెంచే మౌలిక వసతులను వేగవంతంగా అమలు చేయడంతోపాటు, స్పెషల్ పర్పస్ వెహికిల్ ప్రాజెక్టులకు బడ్జెటేతర మార్గాల్లో నిధుల సమీకరణ చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
→ 2005 నుంచి ఇది తన కార్య కలాపాలను ప్రారంభించింది. 2013లో దీనికి మినీరత్న హోదా దక్కింది.
→ ప్రస్తుతం ఈ సంస్థ ఆథరైజ్డ్ షేర్ కేపి టల్ రూ. 3వేల కోట్లు, పెయిడ్ అప్ షేర్ కేపిటల్ రూ. 2,085 కోట్ల మేర ఉంది.
→ ఆర్వీఎన్ఎల్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసిన తర్వాత వాటి నిర్వహణ, మరమ్మ తుల బాధ్యతలను సంబంధిత రైల్వేజోన్లు చూస్తూ వస్తు న్నాయి.
→ ప్రస్తుతం దీనికి నవరత్న హోదా కట్టబెట్టడం వల్ల నిర్ణయాధికారాలు పెరుగుతాయి. నిర్వహణ స్వతం త్రత, ఆర్థిక స్వయంప్రతిపత్తి పెరుగుతాయి.
→ దీనివల్ల ఈ సంస్థ పనితీరు మరింత వేగాన్ని పుంజుకోనుంది. ఇప్పటి వరకు దేశంలో 14 నవరత్న సంస్థలున్నాయి.

ప్రపంచ బ్యాంక్ అధిపతిగా అజయ్ బంగా

ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షు డిగా అజయ్ బంగా బుధవారం నియమితుల య్యారు.
→ ప్రపంచబ్యాంక్కు నాయకత్వం వహిం చనున్న తొలి భారతీయ అమెరికన్గా ఆయన నిలిచారు.
→ ఈ ఏడాది జూన్ 2 నుంచి అయి దేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
→ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభి వృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.
→ ఫిబ్రవ రిలో బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అమె రికా నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ ప్రకటిం చిన విషయం తెలిసిందే.
→ బంగా ఇప్పటివరకు మాస్టర్ కార్డ్, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల్లో అత్యున్నత హోదాల్లో పనిచేశారు.

సచివాలయానికి గోల్డెన్ రేటింగ్

రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో పర్యావరణహితంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయానికి గోల్డెన్ రేటింగ్ లభించింది.
→ గోల్డెన్ రేటింగ్ పురస్కారం, ధ్రువపత్రాన్ని నూతన సచివాలయంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి భారతీయ హరిత భవన మండలి (ఇండి యన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్-ఐజీబీసీ) ప్రతినిధుల బృందం అందజేసింది.
→ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే గోల్డెన్ రేటింగ్ పొందిన తొలి సచివాలయం తెలంగాణదే కావటం గర్వకారణమని అన్నారు.
→ దీంతో ఆగేది లేదని, సోలార్ విద్యుత్ కోసం త్వరలో ప్యానళ్లు అమర్చాలని నిర్ణ యించామని తెలిపారు.
→ ఆ తర్వాత ప్లాటినం రేటింగ్ దక్కించుకుంటామని పేర్కొన్నారు.

తెలంగాణ పల్లె ప్రకృతివనాలు మెచ్చుకున్న నీతి ఆయోగ్

వివిధ రాష్ట్రాల్లోని 14 ప్రధాన సామాజిక విభాగాల్లో అమ లవుతున్న 75 ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ నివేదిక రూపంలో విడుదల చేసింది.
→ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఉపాధ్య క్షుడు సుమన్ బేరి, సీఈఓ బీఆర్ సుబ్రహ్మణ్యం, ఆయోగ్ సభ్యులు వీకేసార స్వత్, వీకేపాల్, అరవింద్ విరుమాణి కలిసి దీన్ని విడుదల చేశారు.
→ ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రకృతివనం, విద్యుత్తు సంరక్షణ బిల్డింగ్ కోడ్, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలకు చోటు దక్కింది. నివేదికలో ఏముందంటే....
→ "తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రకృతి వనాల ప్రాజెక్టు గ్రామాల్లో చిన్నపాటి దట్టమైన అడవులను సృష్టిస్తోంది.
→ రాష్ట్రంలో పచ్చదనం విస్తరణను 24% నుంచి 33%కి పెంచాలన్న ఉద్దేశంతో తెలంగాణకు హరితహారం ప్రాజె క్టును చేపట్టింది.
→ దీని కింద రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 19,472 గ్రామ పంచా యతీల్లో పల్లె ప్రకృతివనాలను అభివృద్ధి చేస్తోంది.
→ యాదాద్రి మోడల్ ఫారెస్ట్ విధానాన్ని అనుసరించి ఒక ఎకరాలో నాలుగు వేల మొక్కలు నాటుతున్నారు.
→ రాష్ట్రంలోని 545 మండలాల్లో 5-10 ఎకరాల విస్తీర్ణంలో 2,725 బృహత్ ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
→ తెలంగాణ విద్యుత్తుశాఖ విద్యుత్తు సంరక్షణ బిల్డింగ్ కోడ్ను సమర్థంగా అమలు చేస్తోంది.
→ దీనివల్ల సంప్రదాయ భవనాల్లో 40% నుంచి 60% వరకు తక్కువ వినియోగం జరుగుతుంది.
→ ఇప్పటివరకు ఈ కోడ్ కింద 430 వాణిజ్య భవనాలకు ధ్రువీకరణపత్రం ఇచ్చారు.
→ వీటిద్వారా యేటా 336 మిలి యన్ కిలోవాట్ల విద్యుత్తు ఆదా అవుతుంది.

విడాకుల కోసం 6 నెలలు ఆగక్కర్లేదు

విడాకులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
→ పరస్పర సమ్మతితో విడాకులు కోరుకునే దంపతులు హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం ఆరు నెలల దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
→ ఏళ్లుగా నలుగుతున్న ఈ అంశంపై సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం తీర్పును ప్రకటించింది.
→ చక్కదిద్దలేనంతగా విఫ లమైన వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాం గంలోని 1421 అధికరణం కింద తమకు విశే షాధికారం ఉందని స్పష్టంచేసింది.
→ విడాకుల కోసం మొదటిసారి కోర్టుకు వచ్చిన దంపతులు ఆరు నెలల నుంచి 18 నెలల్లోగా దానిని ఉప సంహరించుకోకుండా రెండోసారి కూడా వస్తే విడాకులు మంజూరు చేయవచ్చని హిందూ వివాహ చట్టంలోని 13-బి సెక్షన్ చెబుతోందని పేర్కొంది.
→ విడాకులు మంజూరు చేయడం తమ హక్కులకు సంబంధించిన విషయం కాదని, ఉభయ పక్షాలకూ పూర్తి న్యాయం జరిగేలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని.. ఎంతో జాగ్రత్తగా ఆచితూచి దీనిని వినియోగించుకోవా లని ధర్మాసనం తెలిపింది.
→ ఇదివరకు సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన రెండు తీర్పుల్లో పేర్కొన్న అంశాలను గమనంలో పెట్టుకోవా లంది.
→ ఈ మేరకు జస్టిస్ ఎస్. కె. కౌల్ నేతృత్వం లోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం 61 పేజీల తీర్పును వెలువరించింది.

సింగరేణి లో ఫ్లోటింగ్ సోలార్

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక రంగంతో పాటు విద్యుత్ ఉత్పత్తిరంగంలోనూ మరో ముంద డుగు వేసింది.
→ దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టింది. బొగ్గు పరి శ్రమల్లో ఫ్లోటింగ్ సోలార్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్న తొలి సంస్థగా చరిత్రకెక్కింది.
→ మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో దేశం లోనే తొలిసారిగా నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించింది.
→ ఇప్ప టికే 5 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో మల్లన్నసాగర్ కూడా మరో ఫ్లోటింగ్ యూనిటు ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపా దనలు సిద్ధం చేశారు.
→ ఏటా విద్యుత్ వినియోగం పెర గడంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక ప్రాంతాల్లో సోలార్ పవర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
→ 2018లో సోలార్ పవర్తో ముందుకు వచ్చిన సింగ రేణి ఏడాదికి 700 మిలియన్ యూనిట్ల అవసరాన్ని గుర్తించింది.
→ దీనికి అనుగుణంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందు కుగానూ 1,612.26 కోట్లు ఖర్చవుతున్నది..

కేశవానంద తీర్పునకు ప్రత్యేక వెబ్ పేజీ

చారిత్రక "కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం' కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 50 ఏళ్లు పూర్తయ్యింది.
→ భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యా త్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో చేశారు.
→ ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారించింది.
→ ఇప్పటివరకు 13 మంది సభ్యుల ధర్మాసనం విచారించిన ఏకైక కేసు ఇదే.
→ 1972, అక్టోబర్ 31న విచారణ ప్రారంభం కాగా.. 1973, ఏప్రిల్ 24న 7 : 8 మెజారిటీతో ధర్మాసనం తీర్పు వెలువరించింది.
→ ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సమాఖ్య వ్యవస్థ వంటి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు సవరించలేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
→ రాజ్యాంగ మౌలిక స్వరూ పానికి సుప్రీంకోర్టు సంరక్షణదారుగా ఉంటుందని పేర్కొంది.
→ కేశవానంద భారతి తీర్పు వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ తీర్పు వివరాలతో సుప్రీంకోర్టు వెబ్ సైట్లో ప్రత్యేక వెబ్ పేజీని ఏర్పా టుచేసింది.
→ తీర్పు హిందీ అనువాదాన్ని కూడా వెబ్ పేజీలో అందుబాటులో ఉంచారు..

మెడికల్ డివైసెస్ పాలసీకి కేంద్రం ఆమోదం

వైద్య పరికరాల తయారీ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం నేష నల్ మెడికల్ డివైసెస్ పాలసీకి ఆమోదం తెలిపిం ది.
→ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ ప్రకటన ప్రకారం-ఆరు వ్యూహాలపై ఈ పాలసీ దృ ష్టిని సారించి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని తెలిపారు.
→ ప్రస్తుతం 11 బిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ రంగాన్ని.. రానున్న ఐదేళ్లలో 50 బిలియన్ యూఎస్ డాలర్లకు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమన్నారు.
→ దేశంలో వైద్య పరికరాలకు ఎంతో డిమాండ్ ఉందని, దేశీ యంగానే తయారీని చేపడితే.. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడమే కాక.. విదేశీ _మారక ద్రవ్యం ఆదా అవుతుందని తెలిపారు.

కేరళ కలల ప్రాజెక్టు... కొచ్చిన్ వాటర్ మెట్రో

దేశంలో తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానుంది.
→ కొచ్చిన్ వాటర్ మెట్రో సర్వీస్ పేరుతో కేరళ ప్రభుత్వం ఈ రవాణా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తోంది.
→ ప్రధాని మోదీ ఏప్రిల్ 25న ఈ వాటర్ మెట్రోను జాతికి అంకితం చేశారు.
→ దక్షిణాసియాలో. తొలి వాటర్ మెట్రో ఇదేనని కేరళ సీఎం పినరయి విజ యన్ పేర్కొన్నారు.
→ కొచ్చిన్ మెట్రో రైల్ లిమిటెడ్ దీని నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. ఈ మెట్రో సర్వీస్లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఉంటాయి.
→ వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కొచ్చిన్ చుట్టుపక్కల ఉండే 10 ద్వీపా 'లను కలుపుతూ.. ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది.
→ రూ.1,136.83 కోట్ల వ్యయంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్ డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేప ట్టాయి.
→ ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం ఉంటాయి. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణిం చవచ్చు.
→ ఇవి గంటకు 15 నుంచి 2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

81 ఏళ్ల తర్వాత నౌక ఆచూకీ లభ్యం

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యి మం దికి పైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగి పోయిన జపాన్ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైం ది.
→ దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్లో ని లుజోన్ ద్వీప తీరంలో 4వేలకుపైగా మీటర్ల లోతున 'ఎస్ఎస్ మాంటవీడియో మారు' నౌక ఆచూకీ లభించినట్లు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఏప్రిల్ 22న వెల్లడించారు.
→ రెండో -ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సమీపం లోని పపువా న్యూగినియాలో పట్టుబడిన వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలు, పౌరులతో కూడిన జపాన్ నౌక. 1942, జూన్ 22న అప్పటి జపాన్ ఆక్రమిత హైనాన్ ద్వీపానికి బయల్దేరింది.

'మన్ కీ బాత్'కు 23 కోట్ల శ్రోతలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్'కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది.
→ ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది.
→ మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేం దుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది.
→ ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- రోహతక్ ఈ సర్వే నిర్వహించింది.
→ సర్వే ప్రకారం- 100 కోట్ల మందికిగా పైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటు న్నారు.
→ 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటు న్నారని ఐఐఎం- రోహతక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ. చెప్పారు.
→ 22 భారతీయ భాషలు, 29 యాసలతో పాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవు తోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది. పేర్కొన్నారు.

సూడాన్ బాధితుల కోసం ఆపరేషన్ కావేరి

సూడాన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.
→ ఇందుకోసం పోర్ట్ సుడాన్ వద్ద ఐఎన్ఎస్ సుమేధా నౌకను, ఎయిర్పో ర్కు చెందిన సీ-130కే విమానాన్ని సిద్ధం చేసిం ది.
→ సూడాన్లో చోటు చేసుకున్న అంతర్గత పరిస్థితి లను దృష్టిలో పెట్టుకొని.. ఈ ఆపరేషన్ని ప్రారం బించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ తెలిపారు.

120 శాతం పెరిగిన ప్రవాసుల సంపాదన

విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు బాగానే సంపాదిస్తున్నారు.
→ దేశీయ వలసదారులు ఆదాయం లో 40 శాతం వృద్ధి నమోదు కాగా, విదేశాల్లో పని చేసే భారతీయుల ఆదాయంలో 120 శాతం పెరు గుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక( డబ్ల్యూడీఆర్) - 2023 వెల్లడించింది.
→ అమెరికాకు వలస వెళ్లిన తక్కువ నైపుణ్యాలు గల భారతీయుల ఆదాయంలో 500 శాతం వృద్ధి నమోదైందని, ఈ వృద్ధి యూఏఈలో 300 శాతంగా ఉన్నదని నివేదిక తెలిపింది.
→ గల్ఫ్ లో భారతీయుల ఆదాయంలో తక్కువ వృద్ధి నమోదైందని నివేదిక వెల్లడించింది.
→ నైపుణ్యాలు, వయసు, పని చేసే దేశం, భాషా సామర్ధ్యాలు వ్యక్తుల ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని డబ్ల్యూడీఆర్ తెలిపింది.

పీఎస్ఎల్ వీ-సి55 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో) ఏప్రిల్ 22న చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహి కల్(పీఎస్ఎల్ వీ) సి55 ప్రయోగం విజయవంత మైంది.
→ సింగపూర్కు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
→ ఏపీలోని తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో మధ్యాహ్నం 2.20 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది..
→ పీఎస్ఎల్వీ శ్రేణిలో 57వది అయిన ఈ వాహకనౌక తేలికపాటి రకం.
→ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన 19 నిమిషాల తర్వాత 596 కిలోమీ టర్ల ఎత్తున నిర్దేశిత కక్ష్యలో మొదటి 741 కిలోల బరువున్న టెలియోస్-2 ను, తర్వాత 50 సెకన్లకు 18 కిలోల బరువున్న లూమ్ లైట్-4ను ప్రవేశపె ట్టింది.
→ సింగపూర్ ఉపరితలాన్ని నిరంతరం పర్యవే క్షించడం, ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెం పొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం వీటి లక్ష్యం.

చంద్రుడిపై కూలిన జపాన్ 'కుందేలు'

చందమామపైకి మూన్ ల్యాండర్ను పంపేం దుకు టోక్యో(జపాన్)కు చెందిన 'ఐస్పేస్' అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల కంపెనీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
→ ఆ సంస్థ అభివృద్ధి చేసిన 'హకులో- ఆర్ ల్యాండర్.. చంద్రుడిపై దిగడానికి కొద్ది క్షణాల ముందు దానికి భూమితో సంబం ధాలు తెగిపోయాయి.
→ బహుశా ఆ ల్యాండర్ చం ద్రుడిపై కూలిపోయి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రా యపడుతున్నారు.
→ ఐస్పేస్ సంస్థ తమ ల్యాండర్ను ఎలాన్ మస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' రాకెట్ ద్వారా డిసెంబరులో చంద్రుడిపైకి పంపింది.
→ దాదాపు ఆర డుగుల ఎత్తు, 340 కిలోల బరువు ఉండే 'హకుటో -ఆర్.. చంద్రుడిపై పరిశోధనలు చేసే 'రషీద్' అనే రోవర్ను.
→ బేస్ బాల్ పరిమాణంలో ఉండే ఒక రోబోను పంపారు. వాటిలో రషీద్ రోవర్ యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందింది.
→ కాగా.. 2019లో మన ఇస్రో పంపిన విక్రమ్, ఇజ్రాయెల్కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ పంపిన ల్యాండర్ కూడా ఇలాగే చివరి క్షణాల్లో విఫలమయ్యాయి.
→ హ అం టే.. జపాన్ భాషలో కుందేలు' అని అర్థం. చంద మామపై కుందేలు కథలు మనకున్నట్టే జపాన్ వాళ్లకే ఉన్నాయి.
→ అందుకే ఐస్పేస్ కంపెనీ తమ ల్యాండర్కు ఆ పేరు పెట్టింది.

దేశంలోనే తొలి ఏఐ న్యూస్ యాంకర్

ఆజేక్ న్యూస్ చానల్ సరికొత్తగా దేశంలోనే మొదటిసారిగా ఏఐ యాంకర్ను ప్రవేశపెట్టింది.
→ ఏఐ టెక్నాలజీతో పనిచేసే దీని పేరు సనా. సనా న్యూస్ చదువుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
→ దాని విశేషాలను ఇండియా టుడే వైస్ట్ చైర్పర్సన్ కాలిపూరీ వివరించారు.
→ వయసు మీదపడని, అలసట తెలియని, తడబ డని, బహుళ భాషలను మాట్లాడే యాంకర్ను టీవీ, రంగంలోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.
→ గూగుల్ టెక్ను స్పీచ్ ఇంజిన్ను ఉపయోగించి సనా పని చేస్తుంది. స్మార్ట్ఫోన్లలో ఉండే ఫీచర్లు ఇది అప్డేట్ వెర్షన్ గా చెప్పవచ్చు.
→ 2018లో చైనాలోనూ ఇటువం టి యాంకర్ను తీసుకొచ్చారు. బహుళ భాషలు మాట్లాడే హ్యూమనాయిడ్లోబో రూపమే సన్నా

తెల్ల వెంట్రుకల గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు

తెల్లవెంట్రుకలు రావడానికి కారణం మెలనో సైట్ మూల కణాలు అని చెబుతున్నారు. అమెరి కాకు చెందిన శాస్త్రవేత్తలు.
→ మెలనోసైట్ మూల కణాలు కుదుళ్లలోని గ్రోత్ కంపార్ట్మెంట్ల మధ్య చురుగ్గా కదులుతూ ఉంటే జుట్టు నల్లగా ఉంటుం దని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ వయసు మీద పడటం వల్ల ఇవి కదిలే సామర్థ్యాన్ని కోల్పోయి జుట్టు కుదుళ్లలో చిక్కుకు పోతాయని తెలిపారు.
→ ఫలితంగా వర్ణద్రవ్యం చేసే కణాలు పరిపక్వం చెం డలేవని, జుట్టు నెరసిపోతుందని పేర్కొన్నారు.
→ ఈ కణాల కదిలే సామర్థ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా మనుషుల్లో జుట్టు తెల్లబడకుండా అడ్డుకోవ చ్చని తెలిపారు.

సిడ్నీ మైదానంలోని గేటుకు సచిన్ పేరు

సచిన్ టెండూల్కర్ 50వ పుట్టిన రోజును పుర స్కరించుకుని ఏప్రిల్ 24న ప్రముఖ సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లోని ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు.
→ భారత్ వెలుపల నచిన క్కు అత్యంత ఇష్ట మైన మైదానం ఆస్ట్రేలియాలోని ఎస్సీజీనే. ఇక్కడ అయిదు టెస్టుల్లో 157 సగటుతో అతను 785 పరు గులు చేశాడు.
→ అందులో అత్యధిక స్కోరు 241 నాటౌట్ సహా మూడు శతకాలు న్నాయి..

ఒడిశా 2033 వరకు భారత హాకీ స్పాన్సర్

హాకీ మీద ఒడిషా ప్రభుత్వం మరోసారి తన ప్రేమను చాటుకుంది.
→ భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్ను 2033 వరకు పొడిగించా అని నిర్ణయించింది.
→ ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది.
→ గత కొన్నేళ్లుగా ఒడిశా భారత హాకీకి మంచి ప్రోత్సాహాన్నిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో హాకీ అంటే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆ రాష్ట్రమే.
→ రాష్ట్రంలో హాకీ అభి వృద్ధి కోసం అనేక వసతులు కల్పించిన ఒడిశా... ప్రపంచకప్లతో పాటు మరికొన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చింది.
→ ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీని యర్, జూనియర్) స్పాన్సర్ గా ఉంటోంది.

సింగరేణి సోలార్, థర్మల్ కేంద్రాలకు అవార్డులు

రెన్యువబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి సింగరేణి సోలార్ ప్లాంటుకు ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు వచ్చింది.
→ పర్యావరణహిత చర్యగా 224 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను అతి తక్కువ సమయంలో నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు ఈ గుర్తింపు లభించింది. సోలార్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా నుంచి శనివారం ఇక్కడ జరి గిన కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ డి. సత్యనారాయణ ఈ అవార్డు అందుకున్నారు.
→ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.

మరో రెండు మండలాలు

రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ మండలా లను ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 18న ఉత్త ర్వులు జారీ చేసింది.
→ జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలాన్ని, కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది.
→ ఇటిక్యాల మండలంలోని 9. గ్రామాలను కలిపి ఎర్రవల్లిని మండలంగా,మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలు, రామారెడ్డి మండలం నుంచి ఒక గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలంగా ప్రభుత్వం ప్రకటించింది.

నీటి బ్యాటరీ

నీటి ఆధారిత బ్యాటరీలను అభివృద్ధి చేసి నట్లు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన జోడి లుట్కిన్స్ ఏప్రిల్ 16న వెల్లడించారు.
→ నీటి ఆధారిత ఎలక్ట్రోడ్స్. ఈ బ్యాటరీని తయారు చేశారు. ఇవి లిథి యం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే వెయ్యి శాతం మెరుగైనవి.
→ ఈ నీటి బ్యాట రీల వల్ల లిథియం-అయాన్, కోబాల్ట్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.

వరల్డ్ హెరిటేజ్ డే

ఆ ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరి టేజ్ డే)ను ఏప్రిల్ 18న నిర్వహించారు.
→ చారిత్రక, వారసత్వం, సాంస్కృతిక స్మారక చిహ్నాల ప్రాముఖ్యతను భవిష్యత్తరాలకు అందించడానికి, వాటిని రక్షించడానికి అవ సరమైన చర్యల గురించి అవగాహన కల్పిం చడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తు

గుకేశ్ కు ఆర్మగెడాన్ టైటిల్

ఇండియన్ చెస్ స్టార్ గుకేశ్ ఆర్మగెడాన్ ఆసియా, ఓసియానియా టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
→ ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ నొడిర్బెక్ అబ్దుసతొరోవ్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు.

టీ20 క్రికెట్లో ధోని రికార్డు

మహేంద్ర సింగ్ ధోని టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు.
→ 208 క్యాచ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డికాక్ (207), దినేశ్ కార్తీక్ (205) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

కందూరు చోళుల శాసనం

900 ఏళ్ల నాటి శిలా శాసనం నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్లో లభ్య మైంది.
→ దీన్ని కందూరు చోళుల నాటి వైద్య శాసనంగా పురావస్తు నిపుణులు చెబుతు న్నారు.
→ 12వ శతాబ్దానికి చెందిన కందూరు చోళుల శాసనంగా వారు గుర్తించారు..

' జ్యూస్' ప్రయోగం సక్సెస్

గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 'జ్యూస్' వ్యోమ నౌకను విజయవంతంగా ప్రయోగించింది.
→ దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియాన్ రాకెట్ ద్వారా పయనమైంది.

నేరాల్లో వెనుజులా టాప్

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం-అత్యధిక నేరాలతో వెనుజులా మొదటి స్థానంలో నిలిచింది.
→ ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో ఉంది.
→ టర్కీ, జర్మనీ, జపాన్ తక్కువ నేరాలతో 92, 100, 135 స్థా నాల్లో నిలిచాయి.

తొలి 3డీ పోస్టాఫీస్

దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న అల్పూర్ బజార్ పోస్టాఫీస్..
→ బెంగళూరులోని కేంబ్రిడ్జి లే అవుట్ వాసులకు త్వరలోనే సేవలు అందించనుం ది.
→ ఎల్ అండ్ టీ కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నెల రోజుల్లో పూర్తి కానుంది.

జైపూర్ విద్యుత్తు కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు

సింగరేణికి చెందిన మంచిర్యాల జిల్లా జైపూర్ థర్మల్ విద్యుత్తు కేంద్రానికి నీటి పొదుపులో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
→ ఇక్కడ అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా దక్షిణాది రాష్ట్రాల విభాగంలో ముంబయికి చెందిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఉత్తమ బహుమతికి ఎంపిక చేసింది.
→ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు ఎస్. దాల్వి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏజీఎం కె.ఎస్.ఎన్.ప్రసాదు బహుమతి అందించారు.

అభ్యసన సామర్థ్యాల పెంపునకు 'లిప్'

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2023 - 24)లో ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ (లిప్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయిం చింది.
→ ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురు వారం అధికారులతో చర్చిం చారు.
→ అవసరమైన కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీ ఈఆర్టీ)ని ఆదేశించారు.
→ లిప్ అమలుకు కొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.

ఆంద్రీవా 15 ఏళ్ల వయసులో రికార్డ్

రష్యా అమ్మాయి ఆంద్రీవా.. 15 ఏళ్ల వయసు మ్యాచ్ గెలిచింది.
→ మాడ్రిడ్ ఓపెన్ తొలి రౌండ్లో ఆమె 6-3, 6-4తో యుఎస్ ఓపెన్ ఫైనలిస్ట్ లా ఫెర్నాం |డజ్పై విజయం సాధించింది.
→ కొకో గాఫ్, సిసి బెలిస్ తర్వాత డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్లో మెయిన్ డ్రా మ్యాచ్ గెలిచిన మూడో అతి పిన్న వయస్కురాలిగా ఆంధ్రీవా ఘనత సాధించింది.
→ మాజీ ఛాంపియన్ ఎమారదుకాను గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది.

కొత్త గ్రహాన్ని కనుగొన్న ఏఐ

కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి అమెరికా శాస్త్రవేత్తలు.. సౌర కుటుంబం వెలుపల ఒక గ్రహాన్ని కనుగొన్నారు.
→ గతంలో సాధారణ విధానంతో సాగించిన పరిశీలనల్లో ఇది వెలుగు చూడలేదు.
→ ఆ డేటాకు ఇప్పుడు మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను జోడించినప్పుడు ఈ గ్రహం ఆచూకీ లభించింది.
→ కొత్తగా ఏర్పడ్డ నక్షత్రాల చుట్టూ ధూళి, గ్యాస్తో కూడిన ప్రొటోప్లానెటరీ వల యాల్లో గ్రహాల ఉనికిని నిర్దిష్టంగా కనుగొనడానికి ఈ విధానాన్ని వాడొచ్చని స్పష్టమవుతోంది.
→ గతంలో సాగించిన పరిశీలనల్లో వెలుగు చూడని అనేక గ్రహా లను ఇప్పుడు గుర్తించడానికి ఇప్పుడు మార్గం సుగమమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ అంతిమంగా గ్రహాల అన్వేషణలో కచ్చితత్వం పెరుగుతుందని, పరి శ్రీశోధకులు సమయం కూడా ఆదా అవుతుందని వివరించారు.

అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణు ఒప్పందం

అమెరికా-దక్షిణ కొరియా మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది.
→ దీని కింద ఉత్తర కొరియాను అదుపు చేసేందుకు అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణకొరియా తీరంలో అమె రికా మోహరించనుంది.
→ దీంతోపాటు సియోల్ నూక్లియర్ ప్లానింగ్ ఆప రేషన్స్లో భాగం కానుంది.
→ దీనికి బదులుగా దక్షిణ కొరియా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలనుకొన్న ప్రణాళికలను వదులుకో నుంది. దీనిని 'వాషింగ్టన్ డిక్లరేషన్'గా వ్యవహరిస్తున్నారు.
→ దీనిపై అమె రికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ "ఈ ఒప్పందం వల్ల ఉత్తరకొ రియాను నిలువరించే క్రమంలో భాగస్వాముల మధ్య సమన్వయం పెరు గుతుంది" అని వ్యాఖ్యానించారు.
→ ఈ సందర్భంగానే ఉత్తర కొరియా గనుక అణు దాడికి దిగితే.. కిమ్ వంశ పాలనకు అది ముగింపేనని అమె రికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రోబో సాయంతో ఐవీఎఫ్.. కవల పిల్లల జననం

ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది.
→ ఎంఐటీ టెక్నాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పెయిన్లోని బార్సిలోనాకి చెందిన ఓ ఇంజినీర్ల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
→ మానవ అండం లోకి రోబో సాయంతో శుక్రకణాలను ప్రవేశపెట్టింది. రెండు పిండాలు అభివృద్ధి చెంది.. 9 నెలల తర్వాత కవలలు జన్మించారు.
→ ఈ ప్రయోగానికి న్యూయార్క్ సిటీలోని న్యూహోప్ ఫెర్టిలిటీ సెంటర్ వేదికైంది.
→ ఈ |ప్రయోగం చేపట్టిన ఇంజినీర్లకు ఫెర్టిలిటీ అంశంపై పెద్దగా అనుభవం ఏమీ లేదు.
→ సూదిలాంటి సన్నని రోబోను ఉంచేందుకు.. వీళ్లు సోనీ ప్లే స్టేషన్ 5 కంట్రోలర్ను ఉపయోగించారు.
→ అందులో శుక్రకణా లను నింపి ఉంచారు.
→ కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై శుక్రకణాలను జారవిడిచింది.
→ రెండు రోజుల వ్యవధిలో అవి ఫలదీకరణం చెంది.. పిండాలుగా మారినట్లు ఇంజినీర్ల బృందం వెల్లడిం చింది.
→ 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించి నట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది.
→ ప్రసుత్తం అవలంబిస్తున్న ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలై జేషన్)తో పోల్చితే, దీనికయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
→ ఈ రోబోను ఓవర్ ట్యూర్ లైఫ్ అనే స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది.
→ అతి తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్ ఐవీఎఫ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ ప్రయోగం ప్రారంభం మాత్రమే నని, భవిష్యత్లో అందరికీ అందుబాటులోకి తెచ్చేం దుకు కృషి చేస్తామని ఓవర్ ట్యూర్ లైఫ్ చెబుతోంది.

'వాజ్పేయీ' జీవితచరిత్ర పుస్తకావిష్కరణ

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జీవితంలోని అపోహలు, తెలియని నిజాలను వెల్లడిస్తూ “వాజ్ పేయీ హిందూ హక్కుల ఆరో హణ" పేరిట కొత్త పుస్తకం ఆవి ష్కృతం కానుంది.
→ భారతీయులకు ఆరాధ్యుడైన ప్రధానిగా గుర్తింపు పొందిన వాజ్పేయీ జీవితం గురించి పాఠకులకు ఈ పుస్తకం మరిన్ని విశేషాలు తెలియజేస్తుందని ప్రచురణకర్తలు తెలిపారు.
→ న్యూ ఇండియా ఫౌండేషన్ సాయంతో పికడోర్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అభిషేక్ చౌదరి రచించిన ఈ జీవితచరిత్ర రెండు భాగాల్లో ఇది మొదటిది.
→ రెండోభాగం వాజ్పేయీ శతజయంతి సందర్భంగా డిసెం బర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
→ "ఎనిమిదేళ్ల లోతైన పరిశోధ నతో ఈ పుస్తకం రూపొందింది. వ్యక్తిగా వాజ్పేయీ జీవితం, ప్రారంభ దశలో సంఘ్ పరివార్ తో ఆయన అనుబంధం, భారత్ సహా పలు దేశాల్లో ఇచ్చిన పాత ఇంటర్వ్యూల సారాంశం ఇందులో ఉంటాయి" అని ప్రచురణ కర్తలు ఓ ప్రకటనలో తెలిపారు.

30 సంవత్సరాల లీజుకు ఓఆర్ఆర్

హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన బాహ్యవలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు-ఓఆర్ఆర్) దీర్ఘ కాల లీజు గురువారం ఖరారైంది.
→ టోల్ ఆప రేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో 30 ఏళ్ల పాటు లీజుకు అప్పగించారు.
→ తొలుత నాలుగు కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక, ఆర్థిక బిడ్ల పరిశీ లన తర్వాత ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది.
→ మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్ ఖరారైంది. ఈ మొత్తం ఒకేసారి ప్రభు త్వానికి అందించాల్సి ఉంటుంది.
→ లీజు కుదర డంతో ఇక నుంచి నిర్వహణ నుంచి టోల్ వసూలు వరకు ప్రైవేట్ సంస్థ పరిధిలోకి వెళ్ల నున్నాయి.
→ ఓఆర్ఆర్ను మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధా నమై ఉన్నాయి.

పొగాకు బోర్డు ఇన్ ఛార్జి ఛైర్మన్ గా డి.వి. స్వామి

గుంటూరు(జిల్లాపరిషత్తు), న్యూస్టుడే: భారత పొగాకు బోర్డు ఇన్ఛార్జి చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డి. వి. స్వామిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
→ ప్రస్తుతం కొచ్చిలోని ఎంపెడా చైర్మన్ గా పని చేస్తున్న ఆయన.. అక్కడే పొగాకు బోర్డు ఇన్ఛార్జి చైర్మన్గా బాధ్య తలు స్వీకరించినట్లు ఈడీ అద్దంకి శ్రీధర్ బాబు ఓ సర్క్యులర్లో తెలిపారు.
→ ఇప్పటి వరకు స్పైసెస్ బోర్డు ఛైర్మన్ రాఘవన్ ఈ పదవిలో ఉండగా.. ఆయన స్థానంలో డి.వి.స్వామిని నియమించారు.

లోక్సభ అంచనాల కమిటీ సభ్యులుగా కేశినేని, మాగుంట

లోక్సభ అంచనాల కమిటీ సభ్యు లుగా ఆంధ్రప్రదేశ్కు చెందిన తెదేపా, వైకాపా ఎంపీలు కేశి నేని నాని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎన్నికయ్యారు.
→ మొత్తం 29 మంది సభ్యులుండే కమిటీకి భాజపా ఎంపీ సంజయ్ జైశ్వాల్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.
→ 2023-24 సంవత్సరానికిగాను వీరు ఎన్నికైనట్లు లోక్సభ సచివా లయం విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది.

జస్టిస్ నాగేశ్వరరావుకు ఏఐఎఫ్ఎఫ్ రాజ్యాంగ బాధ్యత

అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాన్ని ఖరారు చేసే బాధ్యతను రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించింది. ఏ ఐఎఫ్ఎఫ్ భాగస్వాములు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని జులై 31లోపు ముసాయిదా పత్రాన్ని సిద్ధం చేయాలని సూచించింది.
→ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కేసును సమర్థంగా నిర్వహించిన జస్టిస్ నాగేశ్వర రావుకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ డి. వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పర్దివాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అద్భుతంగా పనిచేస్తున్న ఇస్రో స్టార్ సెన్సర్

ఉపగ్రహ గమనాన్ని తెలుసుకోవడానికి షార్ నుంచి గత నెల 22న పీఎస్ఎల్వీ-సి55 వాహకనౌక ద్వారా ప్రయోగించిన స్టార్ సెన్సర్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ) ద్వారా ఆఫ్-ది-షెల్ఫ్ కాంపోనెంట్ల నుంచి అభివృద్ధి చేసిన 'స్టార్ బెర్రీ సెన్స్' సెన్సర్.. ఉపగ్రహం గమనాన్ని కనిపెడుతుంది. దాని మొదటి ప్రయోగంలో భాగంగా పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్ పెరిమెం టల్ మాడ్యూల్ (పీవోఈఎం) పై ఈ సెన్సర్ను అమర్చి ప్రయోగించారు. అది తాజాగా పంపిస్తున్న డేటా ఆధారంగా ఉపగ్రహం దిశను ఇది స్పష్టంగా అంచనా వేయగలదని కనుగొన్నట్లు దీని తయారీలో పాలుపం చుకున్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సెన్సర్ తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, దీనిని ఉపయోగించి విభిన్నమైన ఉపగ్రహాల గమనాన్ని పరిశీలించొచ్చని వారు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పులూ చట్టాలే

తాను వెలువరించే తీర్పులు ఈ దేశ చట్టాల వంటివేనని, వాటి నిబంధనలను ఎవరూ ఉల్లంఘించ డానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
→ గత ఏడాది జులైలో వెలువరించిన ఓ తీర్పు అమలుకు సంబంధించి దాఖలైన కేసులో జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
→ కోర్టు తీర్పులు అమలుకావడంలేదనే కేసులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి వస్తున్నాయని కోర్టు పేర్కొంది.
→ తమ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచడం సముచితమని భావిస్తున్నట్లు తెలిపింది.
→ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలేదని దాఖలు చేసే కేసులను స్వీకరించబో మని పేర్కొంది.
→ అలాంటి కేసులను తమ ముందుకు తీసుకురావద్దని కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం స్పష్టం చేసింది.
→ సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు సక్రమంగా అమలుకాని పరిస్థితుల్లో హైకోర్టులు అందుకు తగిన చర్యలు ఉంటుందని తీసుకోవాల్సి తెలిపింది.
→ తమ పర్యవేక్షణలోని సబ్డి ర్డినేట్ కోర్టులు... చట్ట నిబంధనల ప్రకారం పనిచే సేలా చూడాల్సిన బాధ్యత హైకోర్టులపైనే ఉంటుందని "ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.
→ మేజిస్ట్రేట్లు ఇచ్చే ఆదేశాలు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను అతి క్రమించేలా ఉంటే వాటిని ఉపసంహరించుకునేలా చేయాలని, అటువంటి మేజిస్ట్రేట్లను మెరుగైన శిక్షణ కోసం జ్యుడీషియల్ అకాడమీకి పంపించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

పెరుగుతున్న పప్పుధాన్యాల సాగు

ప్రస్తుత సీజన్లో దేశవ్యాప్తంగా అన్ని పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే తగ్గినా పప్పుధాన్యాల సాగు మాత్రం పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.
→ గతేడాది ఇదే కాలంలో 66.02 లక్షల హెక్టార్లలో వేసవి పం టలు వేయగా, ఈసారి 65.29 లక్షల హెక్టార్లలో సాగు చేశారని వ్యవసాయ శాఖ తాజా గణాంకాల్లో పేర్కొంది.
→ పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గతేడాది 16.23 లక్షల హెక్టార్లు కాగా ఈసారి 17.57 లక్షల హెక్టార్లని తెలి పింది.
→ పెసర గతేడాది 12.83 లక్షల హెక్టార్లలో ఉండగా అనూహ్యంగా 14.27 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపింది.
→ పెసరకు జాతీయంగా పెరి గిన డిమాండ్ దృష్ట్యానే సాగు పెరిగిందని వెల్లడించింది.
→ మినుముల సాగు గతేడాది మాదిరే 3 లక్షల హెక్టార్ల వరకు ఉందని తెలిపింది.
→ వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి నూనె పంటలు గతేడాది 10.46 లక్షల హెక్టార్లలో సాగవగా ఈ ఏడాది 9.40 లక్షల హెక్టార్లకు తగ్గిందని తెలిపింది.

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఏకీకృత పోర్టల్

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విశ్వ విద్యాలయాల్లోని బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి యూజీసీ... సేయూ-చయన్ పేరుతో ఏకీకృత వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ దీన్ని ప్రారంభించారు.
→ నియామక ప్రక్రియలో భాగస్వాములయ్యే వాళ్లు సుల -భంగా ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించినట్లు. ఆయన తెలిపారు.
→ అటు కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇటు దరఖాస్తుదారులకు ఈ వెబ్ పోర్టల్ ఉభయతా రకంగా ఉంటుందన్నారు.
→ ఇప్పటివరకు నియామక ప్రక్రియను యూనివర్శిటీలు వాటి వాటి వెబ్ పోర్టల్స్ ద్వారా నిర్వహించుకుంటున్నాయి.
→ ఇకమీదట ఈ ఏకే కృత పోర్టల్ను ఉపయోగించుకొని విడివిడిగానే అవి నియామకాలు చేపట్టుకోవచ్చని ఆయన వివరించారు.
→ దరఖాస్తుదారు ఒకసారి లాగిన్ అయితే చాలు అన్ని -కేంద్ర విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ పోస్టుల ఖాళీల వివరాల సమాచారం 'సీయూ-చయన్ ద్వారా ఎప్ప టికప్పుడు అందుతుంది.
→ ఈ పోర్టల్ ద్వారానే దర "ఖాస్తు పంపుకోవచ్చు.
→ ఏదైనా విశ్వవిద్యాలయం ఇప్ప టికే అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువ తరించి ఉంటే... అది యథాతథంగా కొనసాగుతుందని జగదీష్ కుమార్ స్పష్టం చేశారు.

జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. మధ్యశ్రేణి బ్యాంక్ అయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాలాకు సిద్ధమైంది.
→ దాంతో వెంటనే అప్రమత్తమైన అమెరికా రెగ్యులేటరీ సంస్థలు ఈ బ్యాంకు జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్తో కొనిపించి డిపాజిటర్లను ఆదుకున్నాయి.
→ ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలుతున్న బ్యాంకులను అమెరికా రెగ్యులేటరీ సంస్థలు ఆదుకోవడం గత రెండు నెలల్లో ఇది మూడో సారి.
→ సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకు లనీ ఇలానే ఆదుకున్నాయి.
→ అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ పతనాన్ని రెండో అతి పెద్ద పతనంగా భావిస్తున్నారు.
→ తాజా పరిణామాలతో అమెరికాలో ఇంకెన్ని బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు సాలె పురుగు జాతులను కనుగొన్న ZSOI

కోల్కతా: భారత్లో ఎగిరే సాలె పురుగుల కుటుంబంలో రెండు కొత్త జాతులను కనుగొన్నట్లు జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.
→ ఇందులో ఫింటెల్లాద్రితీ అనే సాలె పురుగును కర్ణాటకలోని మూకాంబిక వైల్డ్ లైఫ్ సాంక్చుయరీలో కనుగొ నగా.. ఫింటెల్లాప్లాట్నికీ జాతిని తమిళనాడులోని సేలం జిల్లాలో గుర్తిం చారు.
→ ZSOIకి తొలి మహిళా డైరెక్టర్గా పని చేసిన ద్రితి బెనర్జీ, ప్రముఖ అరాక్నాలజీ శాస్త్రవేత్త నార్మన్ ప్లాట్నిక్ పేర్లను కొత్త జాతులకు పెట్టారు.
→ ఫింటెల్లా కుటుంబానికి చెందిన ఈ సాలెపురుగులు ఓ మాదిరి సైజు వరకు పెరిగి, రంగు రంగులుగా ఉంటాయని జెర్ఎస్ఐ తెలిపింది.
→ డొప్పతో వీటి శరీరం కప్పబడి ఉంటుందని పేర్కొంది.

అఫ్జల్ లోక్సభ సభ్యత్వం రద్దు

ఉత్తరప్రదేశ్కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ అఫ్జల్ అన్సారీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.
→ కిడ్నాప్, హత్య కేసులో కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తు న్నట్లు లోక్సభ సచివాలయం ఉత్త ర్వులు జారీచేసింది.
→ దీంతో ఇప్పటికే జైలు శిక్ష పడి అనర్హత వేటును ఎదుర్కొన్న రాహుల్ గాంధీ తరహాలోనే అన్సారీ కూడా ఎంపీ పదవిని కోల్పోయారు.
→ 2019 ఎన్నికల్లో అన్సారీ.. ఉత్తర్ ప్రదేశ్లోని గాజీపుర్ లోక్సభ స్థానం నుంచి బీఎస్సీ తరఫున ఎంపీగా నెగ్గారు.
→ గాజీపుర్ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య, వారణాసి వ్యాపారి నందకిషోర్ రుంగా కిడ్నాప్, హత్య కేసులో శనివారం యూపీలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు.. గ్యాంగ్స్టర్ చట్టం కింద ఆన్సారీకి నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.
→ ఇదే కేసులో అతని సోద రుడ నేర చరిత్ర ఉన్న రాజకీయ నేత ముఖ్తర్ అన్సారీకి కూడా న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది.
→ శిక్ష పడిన శనివారం (ఏప్రిల్ 29) నుంచే ఆఫ్టల్ లోక్సభ సభ్యత్వం రద్దు అమ వచ్చింది.
→ భారత రాజ్యాంగం లోని అధికరణం 102(1)(ఈ) ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 కింద రద్దు నిర్ణయం తీసుకున్నట్లు లోక్సభ సచివాలయం తెలిపింది.
→ పరువునష్టం కేసులో గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే సెక్షన్ కింద మార్చి 24న లోక్సభ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలి సిందే.
→ ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం. అన్సారీ పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూ డదని చెబుతున్నారు.
→ ఎందుకంటే ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. చట్టంలో నిబంధన విస్తృత ధర్మాసనానికి ప్రతిపాదించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
→ పార్లమెంటు వర్షాకాల సమా వేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నందున తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేయాలని కోరడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అంగీకరిం చారు.
→ రాజద్రోహం సెక్షన్ను సవాల్చేస్తూ ఎడి టర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ అస్సాం, అరుణ్ శౌరి తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై. చంద్ర చూడ్, జస్టిస్ జె.బి. పార్టీవాలతో కూడిన ధర్మా సనం విచారణ కొనసాగించింది.

14 ‘ఉగ్ర' యాప్లపై కేంద్రం నిషేధం

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు వినియోగి స్తున్న 14 మొబైల్ మెసెజ్ యాప్లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది.
→ పాకిస్థాన్ నుంచి ఈ యాప్ల ద్వారా కశ్మీర్లోని తీవ్రవాదులకు ఆదే శాలు అందుతున్నాయన్న నిఘావర్గాల సమాచారం మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసు కుంది.
→ క్షేత్రస్థాయిలో కొందరు ముష్కరుల మద్ద తుదారుల ఫోన్ను ట్రాక్ చేయడానికి యత్నించి నప్పుడు ఈ యాప్లు వినియోగిస్తున్నట్లు తేలిం దని ఓ అధికారి తెలిపారు.

జనజీవన స్రవంతిలోకి డీఎన్ఎల్ఎ

అస్సాంలోని ప్రధాన గిరిజన తిరుగుబాటు సంస్థల్లో ఒకటిగా పేరున్న 'దిమాసా నేషనల్ లిబరే షన్ ఆర్మీ (డీఎన్ఎల్ఎ) విప్లవ బాటను వీడి జనజీ వన స్రవంతిలో కలిసేందుకు సమ్మతించింది.
→ ఈ మేరకు కేంద్రం, అస్సాం ప్రభుత్వాలతో గురువారం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.
→ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వశ ర్మల సమక్షంలో దిల్లీ వేదికగా దానిపై డీఎన్ఎల్ఎ ప్రతినిధులు దానిపై సంతకాలు చేశారు.
→ తాజా ఒప్పందం నేపథ్యంలో ఈ సంస్థకు చెందిన దాదాపు 168 మంది తిరుగుబాటుదారులు హింసను విడనాడ నున్నారు.
→ తమ శిబిరాలను ఎత్తివేసి.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రభుత్వానికి సమర్పించను న్నారు. సాధారణ ప్రజల్లా జనజీవనం కొనసాగించను న్నారు.
→ అస్సాంలోని దిమా హసావో జిల్లాలో డీఎన్ ఎల్ఎ కార్యకలాపాలు ఎక్కువగా కనిపించేవి.

మహిళా పారిశ్రామికవేత్త సుధారెడ్డికి అరుదైన గౌరవం

మేఘా గ్రూప్ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవ స్థాపకురాలు, మహిళా పారి శ్రామికవేత్త సుధారెడ్డికి అరు దైన గౌరవం దక్కింది.
→ అమెరికాలోని వైట్ హౌస్ కర స్పాండెంట్స్ డిన్నర్ వీకెం డ్కు ఆహ్వానం అందింది.
→ ఎంతోమంది ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమంలో భారత్ నుంచి మొదటిసారి ఆమెకు ఆహ్వానం అందిం దని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
→ ఈ సందర్భంగా ఆమె అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస న్ను కలవనున్నారు.

ఆస్ట్రేలియా వేదికగా మే 24న క్వాడ్ సదస్సు

ఆస్ట్రేలియా వేదికగా మే 24న క్వాడ్ సదస్సు జరగనుంది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియాలు భాగస్వాములుగా ఉన్నాయి.
→ ఈ సమ్మిట్లో భారత ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, ఆసీస్ ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిదా పాల్గొని పలు అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు.
→ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఈ నాలుగు దేశాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

ఎస్ఐసీ కొత్త చైర్మన్ సిదార మొహంతి

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎలఐసీ) ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది.
→ ఈయన ప్రస్తుతం ఎలఐసీ ఎండీ, తాత్కాలిక ఛైర్మ న్గా ఉన్నారు. ఆయనకు 62 ఏళ్లు నిండే (2025 జూన్ 7) వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
→ ఎల్ ఐసీ మాజీ ఎండీ బి.సి. పట్నాయకన్ను బీమా నియం త్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సభ్యుడి(లైఫ్) గా నియమించారు.
→ ఐఆర్డీఏఐ సభ్యుడిగా బి.సి. పట్నాయక్ సైతం 62 ఏళ్ల వయసు వరకు బాధ్యతలు నిర్వహిస్తారు.
→ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులు, డైరెక్టర్ల పదవులకు ఎంపికలు జరిపే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో (ఎఫ్సీఐబీ) మార్చి చివర్లో మొహంతిని ఎల్ఐసీ చైర్మన్గా సిఫారసు చేసింది.
→ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని నియామకాల మంత్రివర్గ సంఘం అనుమతుల అనంతరం ఈ రెండు నియామకాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

కార్వీ స్టాక్ బ్రోకింగ్ పై సెబీ వేటు

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్ బీఎల్)పై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కొరడా ఝళిపించింది.
→ ఆ సంస్థతో పాటు ఆ సంస్థ ప్రధాన ప్రమోటర్ సీ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు నిర్వ హించకుండా నిషేధించింది.
→ దీనికి తోడు రూ.21 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇందులో రూ.13. కోట్లు కేఎస్ బీఎల్, రూ.8 కోట్లు కంపెనీ ప్రమోటర్, ఎండీ పార్థసారథి చెల్లించాలని స్పష్టం చేసింది.
→ ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
→ ఖాతాదారుల నుంచి తీసుకున్న పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ)ని అడ్డుపెట్టుకుని కేఎస్ బీఎల్.. వారి నిధులను దుర్వినియోగం చేసినందుకు సెబీ ఈ చర్యలు తీసు కుంది.
→ పీఓఏల ద్వారా ఖాతాదారులు షేర్లను కుదువ పెట్టి తీసుకున్న రూ.1,442.95 కోట్ల రుణాలను కేఎస్బీ ఎల్ తన గ్రూప్ కంపెనీలైన కార్వీ రియల్టీ (ఇండియా) లిమిటెడ్, కార్వీ క్యాపిటల్ లిమిటెడ్ (కేసీఎల్) కంపెనీ లకు అక్రమంగా దారి మళ్లించిందని సెబీ తన తుది ఆదేశాల్లో తెలిపింది.
→ ఈ రెండు కంపెనీలు ఈ మూడు నెలలో కేఎస్బీఎలు బదిలీ చేయాలని కోరింది. లేక పోతే ఎన్ఎస్ఈ ఈ రెండు సంస్థల ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆ నిధులు వసూలు చేసేందుకు అనుమతించింది.

కర్ణాటకలో 'ఇంటి నుంచే ఓటు' మొదలు

దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటేసే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మే 6 వరకు ఈ ఓటింగ్ కొనసాగనుంది.
→ ఎన్నికల సిబ్బంది, పోలీసులు, విలేకర్ల సమక్షంలో వృద్ధులు, దివ్యాంగులు బ్యాలెట్ కాగి తంపై రహస్యంగా ఓటు నమోదు చేసి, బ్యాలెట్ పెట్టెలో వేశారు.
→ మొత్తం ప్రక్రి యను సిబ్బంది వీడియో తీశారు. కొందరు ఓటర్లకు వారు ఉన్న మంచం పైనే ఓటు వేసేందుకు అనుమతించారు.
→ కర్ణాటకలో తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది ఇంటి నుంచే ఓటు వేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు.

స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమగామి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన సుల్తా న్ అల్ నెయాదీ అంతరిక్షంలో నడచిన మొట్టమొదటి అరబ్ గా చరిత్రకె క్కారు.
→ భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వెలుపలికి వచ్చిన ఆయన.. రోదసిలోని శూన్య స్థితిలో 7.01 గంటల సేపు విధులు నిర్వహించారు.
→ అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఫ్లైట్ ఇంజనీర్ స్టీఫెన్ బోవెన్ తో కలసి ఐఎస్ఎస్ బయట విద్యుత్ లైన్లను అమర్చారు.
→ ఈ కేంద్రానికి నాలుగో సౌర ఫలకాల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ కసరత్తు వీలుకల్పిస్తాయి.
→ ఐఎస్ఎస్ బయట బిగించి వున్న రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ (ఆర్ఎఫ్ఎ) యూనిట్ను తొలగించే ప్రయత్నాన్ని అల్ నెయాదీ, బోవెన్లు కొన్ని సమస్యల వల్ల ప్రస్తుతానికి విరమించాల్సి వచ్చింది.
→ వీరి ద్దరూ ఐఎస్ఎస్ బయటకు వెళ్లినప్పుడు ఉష్ణోగ్రతలో విపరీతమైన హెచ్చుత గ్గులను, రేడియోధార్మికతనూ ఎదుర్కోవలసి ఉంటుంది.
→ సూర్యకాంతి పడే చోట ఉష్ణోగ్రతలు 120 డిగ్రీల సెల్సియస్కు చేరొచ్చు. ఆ వెలుగులు పడని చోట అది మైనస్ 150 డిగ్రీలకు పడిపోతుంది.
→ ఈ తీవ్ర వ్యత్యాసాల నుంచి వ్యోమగాములను స్పేస్ సూట్ కాపాడుతుంది.
→ తాము అరబ్ ప్రతినిధు లుగా అంతరిక్ష అన్వేషణలో పురోగమిస్తామని యూఏఈ ప్రకటించింది.

దేశంలో తొలి తీగల రైల్వే వంతెన సిద్ధం

రైల్వేశాఖ మరో ఘనతకు చేరువైంది. జమ్మూలోని రైసీ జిల్లాలో చేపట్టిన దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది.
→ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
→ 11 నెలల వ్యవధిలో ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు.
→ వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానిం చినట్లు వివరించారు. మొత్తం తీగల పొడవు 653 కిలో మీటర్లు ఉందని వెల్ల డించారు.
→ తీగల అమరిక పనులకు సంబంధించిన వీడియోను ఆయన పోస్టు చేశారు. ఈ ట్వీట్పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్టెంట్' అని ప్రశంసించారు.
→ సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు.
→ ఈ అంజీఖడ్ తీగల రైల్వే వంతెన.. జమ్మూ- బారాముల్లా మార్గంలోని కాట్రా- రైసీ సెక్షన్లను కలుపుతుంది.
→ హిమాలయ పర్వతాల మధ్య అంజీఖడ్ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.
→ ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులనూ తట్టుకోగలదని అధికారులు చెబుతున్నారు.

బీఓబీ ఎండీగా దేవదత్తా చంద్

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మేనేజింగ్ డైరెక్టరుగా దేవదత్తా చంద్ను ప్రభుత్వం ఎంపిక చేసింది.
→ ప్రస్తుతం ఈయన ఇదే బ్యాంకులో ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
→ మూడేళ్ల కాలానికి ఎండీగా నియమిస్తూ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) నోటిఫికేషన్ జారీ చేసింది.
→ ప్రస్తుతం బీఓబీ ఎండీగా ఉన్న సంజీవ్ చద్దా జూన్ 30న పదవీ విరమణ చేయ నున్నారు. జులై 1న దేవదత్తా ఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు.

‘నావిక్-01' ఉపగ్రహ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే 24వ తేదీన జీఎస్ఎల్వీ-ఎఫ్ఎ12 రాకెట్ ద్వారా నావిక్-01 (ఐఆర్ఎన్ఎస్ఎస్-1జే) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.
→ షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీనిని నిర్వహించేందుకు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్ రాకెట్ను అను సంధానం చేసే పనులు ప్రారంభించారు.
→ షార్ లో లాంచింగ్ వసతులు పెరిగిన తర్వాత నెలకు ఒక ప్రయోగం చేయాలని ఇస్రో శాస్త్రవే త్తలు నిర్ణయించారు.
→ ఇందులో భాగంగా ఏప్రిల్ 22న పీఎస్ఎల్వీ సీ55ని ప్రయోగిం చారు. ఆ ప్రయోగం పూర్తయిన వెంటనే మే 24న జీఎస్ఎల్వీ ఎఫ్ 12 ద్వారా నావిక్-01 ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవు తున్నారు.
→ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటి లైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్)ను బలోపేతం చేయడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు.

మాల్దీవులకు భారత్ 'రక్షణ' కానుకలు.!

పొరుగు దేశమైన మాల్దీవులతో బంధాన్ని పెంపొందించుకొనే దిశగా భారత్ చర్యలు తీసుకొంటోంది.
→ ఈ క్రమంలో ఆ దేశానికి గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాప్ట్ను బహూకరించనుంది. ఈ విష యాన్ని రక్షణమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
→ మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్ ఆహ్వానం మేరకు రాజ్నాథ్ మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు.

రాజభవన్లలో ఇతర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు

ఇతర రాష్ట్రాల అవతరణ దినోత్సవా లను దేశవ్యాప్తంగా అన్ని రాజభవన్ల (గవ ర్నర్ల అధికారిక నివాసాలు) లో నిర్వహించా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ సాంస్కృతిక వైవిధ్యం, భిన్న సంప్రదాయాలను విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో దీన్ని చేపట్టింది.
→ ఇందులో భాగంగా సోమ వారం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవత రణ దినోత్సవాలను నిర్వహించనున్నట్లు దాదాపు 20 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని రాజభవన్ల నుంచి సమాచారం అందింది.
→ ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఉంటున్న మహారాష్ట్ర, గుజరాత్ మూలాలున్న వ్యక్తులను ఆహ్వానిస్తారు.
→ ఆ రెండు రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా కార్యక్ర మాలను నిర్వహిస్తారు. అక్కడి వంటకాలనూ వడ్డిస్తారు.
→ మహారాష్ట్ర, గుజరాత్ సంప్రదాయ దుస్తులనూ ప్రదర్శిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
→ 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కార్య క్రమంలో భాగంగా ప్రతి రాష్ట్రానికి సంబంధిం చిన వారసత్వ, సంప్రదాయాలకు సంబంధిం చిన వేడుకలను నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరుచూ చెబుతున్న విషయాన్ని వారు ప్రస్తావించారు.

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ లో స్వర్ణం నెగ్గిన భారత జోడీగా సాత్విక్-చిరాగ్ జోడీ

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది.
→ 1965లో పురుషుల సింగిల్స్ దినేశ్ ఖన్నా విజేతగా నిలిచి భారత్కు తొలిసారి పసిడి పతకం అందించాడు.
→ 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ భారత్ పసిడి లోటు తీర్చింది.
→ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు.
→ 67 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ ఫైనల్లో ప్రపం చ ఆరో ర్యాంక్ సాత్విక్-చిరాగ్ ద్వయం 16-21, 21-17, 21-19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ ఒంగ్ యె సిన్-తియో ఈ యి (చైనీస్ తైపీ) జోడీని ఓడించి చాంపియన్గా అవతరించింది.
→ తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది.
→ 1971లో దీపూ ఘోష్ - రమణ్ ఘోష్ ద్వయం భారత్కు కాంస్య పతకం అందించింది.

ప్రపంచ చెస్ టైటిల్ లిరెన్ కైవసం

ప్రపంచ చెస్ తెరపై మరో కొత్త ఛాంపియన్. చైనా ఆటగాడు డింగ్ లిరెన్ సరికొత్త విజేతగా నిలిచాడు.
→ చెస్ ప్రపంచ ఛాంపియన్ అనగానే దశాబ్ద కాలంగా గుర్తు కొస్తున్న పేరు.. మాగ్నస్ కార్ల్సన్దే. ఇక ఆ పేరు చరిత్రే. ఇకపై రెండేళ్ల పాటు ఆ కిరీటం డింగ్ లిరెన్దే.
→ ఈ చైనా గ్రాండ్ మాస్టర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ నెపోమ్నిషిని టైబ్రేక్లో ఓడించి నయా ఛాంపియన్గా అవతరించాడు.
→ 14 గేమ్ పాటు సాగిన ఈ సమరంలో ఇయాన్ నెపోమ్నిషి (రష్యా)ని టైబ్రేక్లో 2.5-1.5తో ఓడించాడు.
→ పద్నాలుగు గేముల్లో లిరెన్-ఇయాన్ చెరో ఏడు గేమ్లు నెగ్గడంతో విజేతను తేల్చడానికి టైబ్రేక్ నిర్వ హించారు.
→ టైబ్రేక్లో ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన నాలుగు గేమ్లతో తొలి మూడు గేమ్లు డ్రా అయ్యాయి. నాలుగో గేమ్ను సొంతం చేసుకున్న లిరెన్ టైటిల్ ఎగరేసుకుపోయాడు.
→ ప్రపంచ విజేత అయిన తొలి చైనా ఆటగాడిగా 30 ఏళ్ల లిరెన్ ఘనత సాధించాడు.
→ మహిళల ప్రపంచ ఛాంపియన్ టైటిల్ (వెన్జువాన్) కూడా చైనా ఖాతాలోనే ఉండడం విశేషం.
→ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆసియా నుంచి ప్రపంచ విజేత అయింది లిరెన్ మాత్రమే.

మనకీ బాత్ పై యునెస్కో ప్రశంసలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న రేడియో ప్రసారం మన్కో బాత్ కార్యక్ర మంపై యునెస్కో డైరెక్టర్ జన రల్ ఆడ్రీ అజౌలే ప్రశంసలు కురి మించి భాషలు, మాండలికాల్లో కోట్లాది ప్రజలు విన్న ఈ కార్యక్రమం 100% అత్యంత వేడుకగా చేసుకోతగిన దని అభివర్ణించారు.
→ ఈ కార్యక్ర మంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు ప్రధాని మోదీకి అజౌలే కృతజ్ఞతలు తెలిపారు.
→ ఉత్తరప్రదేశ్లోని 300లకు పైగా మదర్సా లలో ఆదివారం ప్రసారం చేశారు.
→ 100 మదర్సాలలో ప్రసారానికి ప్రణాళిక వేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా 300 మదర్సాలో ప్రసారమైం దని భాజపా మైనారిటీ మోర్చా ఉత్తర్ ప్రదేశ్ విభాగం అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ వెల్లడించారు.

ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రసారం

అమెరికాలోని న్యూయార్క్ లో గల ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ట్రస్టీ షిప్ కౌన్సిల్లో మన్కో బాత్ కార్యక్రమం ప్రసారమై చరిత్ర సృష్టించింది.
→ ఈ విష యాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ ట్విటర్ ద్వారా తెలిపారు.

ఏప్రిల్లో రూ.1.87 లక్షల కోట్లు జీఎస్ టీ వసూళ్లు

ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమో దయ్యాయి.
→ మొత్తంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైం దని ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతు న్నాయి.
→ వసూళ్ల పరంగా ఇది జీవనకాల గరిష్ఠం. 2022 ఏప్రిల్లో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం ఎక్కువ.
→ ఏప్రిల్ లో వసూలైన రూ.1,87,035 కోట్ల స్థూల జీఎస్ టీలో సీజీ ఎన్డీ రూ.38,440 కోట్లు కాగా.. ఎస్జీఎస్టి రూ.47,412 కోట్లు, ఐజీఎస్టి రూ. 89,158 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలైన రూ.34,972 కోట్లతో కలిపి), సెస్సు రూ.12,025 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలైన రూ. 901 కోట్లతో కలిపి) చొప్పున నమోదైంది.
→ దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టి ఆదాయం 2022 ఏప్రిల్తో పోలిస్తే 17 శాతం పెరిగిందని ఆర్థిక శాఖ వెల్లడించింది.
→ ఏప్రిల్ 20న వసూలైన రూ. 68,228 కోట్లు.. ఇప్పటివరకు ఒక రోజులో అత్యధికంగా వసూలైన జీఎస్టీగా నిలిచింది.
→ ఆ రోజున మొత్తంగా 9.8 లక్షల లావాదేవీలు జరిగాయి. కిందటేడాది అత్యధిక ఒక రోజు జీఎస్టీ వసూళ్లు కూడా ఇదే తేదీన నమోదైంది.
→ ఆ రోజు 9.6 లక్షల లావాదేవీల ద్వారా రూ.57,846 కోట్లు వసూలయ్యాయి. 2023 మార్చిలో మొత్తంగా 3 కోట్ల ఇ-వే బిల్లులు తీసుకున్నారు.
→ 2023 ఫిబ్రవరిలోని 8.1 కోట్లతో పోలిస్తే ఈ సంఖ్య 11 శాతం ఎక్కువ. గత నెలలో ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.45,864 కోట్లు; ఎన్డీఎసీకి రూ.37,959 కోట్లను ప్రభుత్వం సెటిల్ చేసింది.

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఏప్రిల్ 22న చేపట్టిన ఇస్రో యొక్క పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంను ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) చెప్పట్టింది. ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సింగపూర్‌కు చెందిన అగిల్ స్పేస్ యొక్క టెలీయోస్-2 మరియు లుమెలైట్-4 అనే రెండు భూ పరిశీలన ఉపగ్రహను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది పీఎస్‌ఎల్‌వీ యొక్క 57వ ప్రయోగం, అలానే పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ కాన్ఫిగరేషన్ (PSLV-CA) వేరియంట్ యొక్క 16వ మిషన్.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) భారతదేశం యొక్క మూడవ తరంకు చెందిన ఉపగ్రహ ప్రయోగ వాహనం. అక్టోబర్ 1994లో మొదటి విజయవంతమైన ప్రయోగం తర్వాత, పీఎస్‌ఎల్‌వీ భారతదేశం యొక్క విశ్వసనీయ మరియు బహుముఖ ప్రయోగ వాహనంగా ఉద్భవించింది. పీఎస్‌ఎల్‌వీ లిక్విడ్ మరియు సాలిడ్ ఇందనలతో 4 దశలలో ప్రయోగించబడుతుంది.

మొదటి దశ ఘన ఇంధనంతో ఆరు స్ట్రాప్-ఆన్ సాలిడ్ రాకెట్ బూస్టర్‌లను చుట్టి ఉంటుంది. రెండవ దశ ద్రవ ఇంధనంతో ఉంటుంది, అయితే మూడవ దశలో ఘన ఇంధనంతో కూడిన రాకెట్ మోటారు ఉంటుంది. నాల్గవ దశలో లాంచర్ బాహ్య అంతరిక్షంలో బూస్ట్ చేయడానికి ద్రవ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగిస్తుంది.


గ్యాలంట్రీ అవార్డు అందుకున్న మొదటి ఐఎఎఫ్ మహిళా అధికారిగా దీపికా మిశ్రా

వింగ్ కమాండర్ దీపికా మిశ్రా, భారత వైమానిక దళంలో గ్యాలంట్రీ అవార్డును అందుకున్న మొదటి మహిళా అధికారిగా అవతరించారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఆమెకు ఈ వాయు సేవా పతకాన్ని ప్రకటించారు. ఆ అవార్డును భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఆమెకు అందజేశారు. 2021 ఆగస్టులో ఉత్తర మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక వరదల సమయంలో వింగ్ కమాండర్ దీపికా మిశ్రా చేసిన మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలకు ఈ గౌరవం లభించింది. ఆ సమయంలో ఆమె దాదాపు 47 మంది ప్రాణాలను కాపాడారు.


జు-జిట్సు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సబ్‌కత్ మాలిక్

కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలోని విజ్జారా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బాలిక సబ్‌కత్ మాలిక్ ఈ ఏడాది మంగోలియాలో జరగనున్న జు-జిట్సు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక అయ్యింది. దీనితో మార్షల్ ఆర్ట్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి కాశ్మీరీ మహిళగా అవతరించనున్నారు. సబ్‌కత్ మాలిక్ ఇదివరకు నేషనల్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో 9 సార్లు పాల్గొనగా 6 సార్లు గోల్డ్ మెడల్ మరియు 3 సార్లు సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.


ఢిల్లీలో ఈయూ-ఇండియా ఏవియేషన్ సమ్మిట్ 2023

యూరోపియన్ కమిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏప్రిల్ 20-21 తేదీలలో ఈయూ-ఇండియా ఏవియేషన్ సమ్మిట్‌ను ఢిల్లీలో నిర్వహించాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య మరియు యూరోపియన్ కమిషనర్‌ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ శ్రీమతి ఆదినా వాలియన్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇండియా-ఈయూ దేశాల మధ్య కోవిడ్ అనంతర ఎయిర్ ట్రాఫిక్ పునరుద్ధరణ, వైమానిక రంగంలో సుస్థిరత & భద్రత, మానవ రహిత విమాన వ్యవస్థల అభివృద్ధి మరియు ఇరు ప్రాంతాల పరస్పర భాగస్వామ్య సవాళ్లు మరియు అవకాశాలపై దృష్టి సారించారు.

అలానే ఈ సమ్మిట్ సందర్భంగా యూరోకంట్రోల్‌తో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఇంటెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేసింది. అదే సమయంలో ఇరు ప్రాంతాల సన్నిహిత సహకారం మరో ఇంటెంట్ మెమోరాండం లెటర్‌పై కూడా యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంతకం చేసింది.


వ్యవసాయ భూవివాదాల పరిష్కారం కోసం మహారాష్ట్రలో సలోఖ యోజన పథకం

మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూవివాదాల పరిష్కారం కోసం కొత్తగా సలోఖ యోజన పథకంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులు నామమాత్రపు రిజిస్ట్రేషన్ రుసుము 1,000/- మరియు స్టాంప్ డ్యూటీ 1,000/- చెల్లించి తమ భూములను ఇతర రైతులతో మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది, వ్యవసాయేతర, నివాస మరియు వాణిజ్య భూములకు వర్తించదు. ఈ పథకం భూ వివాదాలను పరిష్కరించడంలో పాటుగా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడంలో రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.


స్పేస్‌ఎక్స్ మొదటి స్టార్‌షిప్ రాకెట్ టెస్ట్ ప్రయోగం విఫలం

స్పేస్‌ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణంతో విఫలమైంది. ఏప్రిల్ 20, 2023న టెక్సాస్‌లోని బోకా చికాలోని స్టార్‌బేస్ నుండి ప్రయోగించిన ఈ రాకెట్, పైకి ఎగిరిన కొద్దీ సమయంలోనే పేలుడు సంభవించి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో నేలకూలింది. ఇది స్పేస్‌ఎక్స్ ఇప్పటివరకు నిర్మించబడిన అత్యంత శక్తివంతమైన రాకెట్ వాహనంగా పరిగణించబడింది. ఈ ప్రయోగం వాహనంకి సంబంధించి ఇది మొదటి టెస్ట్ ఫ్లైట్‌గా గుర్తించబడింది.

స్టార్‌షిప్ అనేది ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న సూపర్ హెవీ-లిఫ్ట్ స్పేస్ లాంచ్ వెహికల్. ఇది 120 మీటర్ల ఎత్తుతో 5,000 మెట్రిక్ టన్నుల లిఫ్ట్‌ఆఫ్ చేసే సామర్థ్యం కలిగిఉంది. ఈ వాహక నౌకలో 33 సూపర్ హెవీ ఇంజిన్లు అమర్చబడి ఉంటాయి. స్టార్‌షిప్ ఇప్పటివరకు ఎగురవేయబడిన అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనంగా ఉండనుంది. అదే సమయంలో ఇది పూర్తి పునర్వినియోగపరచడానికి ఉద్దేశించినది. దీనిని మానవసహిత అంతరిక్ష పర్యటనల కోసం స్పేస్‌ఎక్స్ రూపొందిస్తుంది.


అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌కు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఉక్రేనియన్‌లో మారియుపోల్ ఆసుపత్రి దాడికి సంబంధించిన అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ తీసిన చిత్రానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ చిత్రం మార్చి 9, 2022లో మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై రష్యా యొక్క క్రూరమైన దాడి తర్వాత ప్రాణాంతకంగా గాయపడిన ఒక మహిళను రెస్క్యూ చేసిన సంధర్బంలోనిది.

ఈ చిత్రంలోని ఇరినా కాలినినా అనే 32 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ, నిర్జీవమైన శరీరానికి జన్మనిచ్చిన అరగంట తర్వాత ఆమె గాయాలతో మరణించింది. ఈ చిత్రాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ అయినా ఎవ్జెనీ మలోలెట్కా తన కెమెరాలో బంధించారు. ఈ దాడిలో 600 మంది పౌరులు మృతి చెందారు.


గ్రీస్ బహుపాక్షిక-వ్యాయామంలో పాల్గొన్న భారత వైమానిక దళం

భారత వైమానిక దళం ఏప్రిల్ 24 నుండి మే 4 మధ్య గ్రీస్‌లో జరిగే మెగా బహుపాక్షిక వ్యాయామం 'ఇనియోచోస్-2023 ఎక్సర్‌సైజ్‌' యందు పాల్గొంది. ఈ వ్యాయామం గ్రీసులో ఆండ్రావిడ వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భారత వైమానిక దళానికి చెందిన నాలుగు సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, రెండు బోయింగ్ C-17 ఫైటర్ ఫ్లయిట్స్ పాల్గొన్నాయి.

దీనితో పాటుగా ఏప్రిల్ 17 నుండి మే 05 మధ్య ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ యొక్క వైమానిక దళ స్థావరం అయిన మోంట్-డి-మార్సన్‌లో నిర్వహిస్తున్న ఓరియన్ వ్యాయామంలో కూడా భారత వైమానిక దళం భాగస్వామ్యం అయ్యింది. ఈ వ్యాయామంలో ఇండియాతో పాటుగా జర్మనీ, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వైమానిక దళాలు కూడా పాల్గొన్నాయి.


హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2023లో భారత్‌కు మూడో స్థానం

హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం 68 యునికార్న్‌లతో 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా దేశాలు టాప్ రెండు స్థానాలలో ఉన్నాయి. భారతదేశం మొత్తం 138 యునికార్న్‌లను కలిగి ఉన్నప్పటికీ ఇందులో కేవలం 68 మాత్రమే భారతదేశంలోనే ఉన్నాయని వెల్లడించింది. మిగతా 70 భారతీయ సహ వ్యవస్థాపకులచే స్థాపించబడినవి వీటి ప్రధాన కార్యాలయాలు భారతదేశం వెలుపల ఉన్నాయని నివేదించింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన నాన్-స్టేట్-నియంత్రిత వ్యాపారాల జాబితా అయిన హురున్ గ్లోబల్ 500 కంపెనీల ర్యాంకింగులో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. అలానే యునికార్న్ పెట్టుబడిదారుల పరంగా సీక్వోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ మరియు సాఫ్ట్‌బ్యాంక్ వరుసగా 238, 179 మరియు 168 యునికార్న్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.


అస్సాం, అరుణాచల్ సరిహద్దుల పరిష్కార ఒప్పందంపై సంతకాలు

అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తమ 50 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏప్రిల్ 20వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రామాలకు సంబంధించిన వివాదానికి ముగింపు పలకనుంది.

1971 యొక్క ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్ వేరుపడింది. 1972లో అరుణాచల్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. ఈ సమయంలో అనేక ఆదివాసీ గ్రామాలు, వ్యవసాయ మైదానాలు అస్సాంలో కలపబడ్డాయి. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న దాదాపు 700 కిలోమీటర్ల సరిహద్దు వెంబడీ ఉంది. 2018 నుండి ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం బిఆర్‌యు, బోడో, కర్బీ ఆంగ్లోంగ్ మరియు గిరిజన శాంతి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకం చేయిస్తూ వస్తుంది.


ఛత్తీస్‌గఢ్ పంచాయితీలకు ఫెస్టివల్ గ్రాంట్స్

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పంచాయితీల పరిధిలో స్థానిక పండుగలను జరుపుకోవడానికి గ్రాంట్లు అందించే పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 6,000 నాన్-షెడ్యూల్డ్ పంచాయితీల కోసం 'ముఖ్యమంత్రి ఛత్తీస్‌గఢి పరబ్ సమ్మాన్ నిధి యోజన' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద స్థానిక పండుగలను జరుపుకోవడానికి, ప్రతి గ్రామ పంచాయతీకి రెండు విడతలుగా రూ. 10,000 మొత్తం ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక పండుగలు, సంస్కృతి మరియు గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను పరిరక్షించే మరియు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.


కర్ణాటక ఎన్నికలలో 'ఓట్ ఫ్రమ్ హోమ్' అవకాశం

భారత ఎన్నికల కమిషన్ మొదటిసారిగా ఇంటి నుండి ఓటు ఎంపికను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. పట్టణ ప్రాంతాల్లో పౌరుల ఎన్నికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎంపికను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఎంపిక ప్రస్తుతం వయస్సు కారణంగా (80 ఏళ్ళు మించి) లేదా అంగవైకల్యం కారణంగా పోలింగ్ బూత్‌ను సందర్శించలేని వారి కోసం మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ఆప్షన్ పొందేందుకు ఓటర్లు 12డి ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న ఓటర్ల ఓటును నమోదు చేసేందుకు ఎన్నికల తేదికి 4 రోజుల ముందుగానే అధికారులు వారి ఇళ్లను సందర్శిస్తారు. ఈ గ్రూపులో స్థానిక ప్రిసైడింగ్ అధికారి, బూత్ స్థాయి అధికారి, పోలీసు సిబ్బంది మరియు వీడియోగ్రాఫర్ ఉంటారు. సంబంధిత అధికారి ఓటరుకు బ్యాలెట్ పేపర్‌తో కూడిన కవరు అందించి గోప్యత విధానంలో తిరిగి దానిని స్వీకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడుతుంది.


సినర్జీ గ్రూపుకు ప్రతిష్టాత్మక ట్యాంకర్ ఆపరేటర్ అవార్డు

ప్రముఖ షిప్పింగ్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సినర్జీ గ్రూప్, గ్లోబల్ ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌లో లీడర్‌షిప్ రోల్‌కి గాను ప్రతిష్టాత్మక గ్రీన్4సి ట్యాంకర్ ఆపరేటర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును ఏప్రిల్ 20 న ఏథెన్స్‌లో జరిగిన హైబ్రిడ్ ఈవెంట్‌లో సొంతం చేసుకున్నారు. సినర్జీ గ్రూప్‌ను 2006లో కేరళకు చెందిన కెప్టెన్ రాజేష్ ఉన్ని స్థాపించారు.

ప్రస్తుతం ఈ గ్రూపు ఇది 13 దేశాలలో 22 కార్యాలయాల నుండి పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 21,000 మందికి పైగా నావిక సిబ్బందిని కలిగి ఉంది. 560 కంటే ఎక్కువ నౌకల యొక్క సాంకేతిక నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మెర్స్క్ ట్యాంకర్ల తయారీలో నిమగ్నమయ్యి ఉంది.


ఏంజెలా మెర్కెల్‌కు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం

జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆ దేశ అత్యున్నత గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ ఆమెకు అందజేశారు. ఏంజెలా మెర్కెల్ దాదాపు 16 సంవత్సరాలకు పైగా ఆ దేశానికి ఛాన్సలర్‌గా పనిచేశారు. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో మరియు 2015 శరణార్థుల సంక్షోభంతో సహా అనేక క్లిష్ట సమయాల్లో జర్మనీని విజయవంతంగా నడిపించిన మెర్కెల్‌ అపూర్వమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు.


ఆశా భోంస్లేకు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించబడ్డారు. గత ఏడాది ఫిబ్రవరి మరణించిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఆమె కుటుంబం మరియు ట్రస్ట్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును ఏప్రిల్ 24న వారి తండ్రి మరియు ప్రముఖ థియేటర్-సంగీత కళాకారుడు దీనానాథ్ మంగేష్కర్ స్మారక దినం నాడు అందుకున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం దేశం మరియు సమాజం కోసం మార్గనిర్దేశం చేసిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. గత ఏడాది ప్రారంభించిన ఈ అవార్డు తోలి గ్రహీతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు.


బ్యాంకాక్‌లో 8వ భారత్-థాయ్‌లాండ్ డిఫెన్స్ డైలాగ్

8వ ఇండియా-థాయ్‌లాండ్ డిఫెన్స్ డైలాగ్ బ్యాంకాక్‌లో ఏప్రిల్ 20న నిర్వహించబడింది. థాయిలాండ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు. గత దశాబ్ద కాలంగా భారతదేశం & థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య నెలకొన్న రక్షణ సహకార అంశాలను సమీక్షించడంతో పాటుగా ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు.


ఏపీలో 27 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు అందించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 9 అంశాల యందు ఉత్తమ పనితీరు కనబర్చిన మూడేసి పంచాయితీలకు అవార్డులు అందించారు.

గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంధర్బంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందిస్తుంది.

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 9 విభాగాల్లో అవార్డులు అందుకోగా, ఏపీ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా లభించలేదు. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉత్తమ పంచాయితీలను ఎంపిక చేసి అవార్డులు అందించింది.

అవార్డు థీమ్ పంచాయతీ జిల్లా
పేదరిక నిర్మూలన - ఉపాధి అవకాశాలు కల్పన గంగిరెడ్డిపల్లి
రాచర్ల
మల్లూరు
వైఎస్ఆర్ జిల్లా
ప్రకాశం జిల్లా
నెల్లూరు జిల్లా
హెల్దీ పంచాయతీ తరువ
భీమవరం
నడింపాలెం
అనకాపల్లి జిల్లా
అల్లూరి సీతారామరాజు
గుంటూరు
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ కసిపాడు
నేలమూరు
కుంతముక్కల
పల్నాడు జిల్లా
పశ్చిమ గోదావరి
ఎన్టీఆర్ జిల్లా
వాటర్ సఫిషియెంట్ పంచాయతీ ఇల్లూరు కొత్తపేట
వి.వి కండ్రిక
ధూపాడు
నంద్యాల
అన్నమయ్య
ఎన్టీఆర్ జిల్లా
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ కడలూరు
బిళ్ళనందూరు
జోగింపేట
తిరుపతి
కాకినాడ
మన్యం
సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ నందిగాం
కట్టకిందపల్లి
సూరప్పగూడెం
శ్రీకాకుళం
అనంతపురం
ఏలూరు
సోషియాల్లీ సెక్యూర్డ్ పంచాయతీ పశ్చిమ పెద్దవారిపాలెం
మందగేరి
రామభద్రాపురం
బాపట్ల
కర్నూలు
విజయనగరం
పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ సఖినేటిపల్లి లంక
నగరపాలెం
చోరగుడి
కోనసీమ
విశాఖపట్నం
కృష్ణ
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ మేడాపురం
జేగురుపాడు
మార్టూరు
శ్రీసత్యసాయి
తూర్పు గోదావరి
అనకాపల్లి

తెలంగాణకు 12 జాతీయ పంచాయతీ అవార్డులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏప్రిల్ 17న దేశ వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలకు జాతీయ పంచాయితీ అవార్డులను అందించారు. ఇదే వేదిక ద్వారా న్యూఢిల్లీలో పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. పంచాయితీల సమగ్ర అభివృద్ధికి పిలుపునిస్తూ, ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద నిర్దేశించబడిన తొమ్మిది ఇతివృత్తాల ఆధారంగా ఈ అవార్డులు అందించారు.

గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంధర్బంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 12 విభాగాల్లో అవార్డులు అందుకోగా, ఏపీ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా లభించలేదు. ఈ అవార్డులను నాలుగు కేటగిరిల వారీగా వివిధ థీమ్స్ ఆధారంగా చేసుకుని అందిస్తారు.

  1. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్
  2. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్
  3. గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్
  4. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌

దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరిలో మొత్తం 9 రకాల థీమ్ అవార్డులు ఉండగా అందులో 8 అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పంచాయితీలు సొంతం చేసుకున్నాయి.

అవార్డు థీమ్ పంచాయతీ (బ్లాక్) జిల్లా
పేదరికం లేని & మెరుగైన జీవనోపాధి పంచాయితీ మండొడ్డి (రాజోలి) జోగులాంబ గద్వాడ్
హెల్దీ పంచాయతీ గౌతంపూర్ (చుంచుపల్లి) భద్రాద్రి కొత్తగూడెం
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ - -
వాటర్ సఫిషియెంట్ పంచాయతీ నెల్లుట్ల (లింగాలఘనపూర్) జనగాం
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ సుల్తాన్‌పూర్ (ఎలిగైడ్) పెద్దపల్లి
సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల
సోషియాల్లీ సెక్యూర్డ్ పంచాయతీ కొంగట్‌పల్లి (హన్వాడ) మహబూబ్ నగర్
పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ చీమల్దారి (వికారాబాద్) మోమిన్‌పేట
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ ఐపూర్ (ఆత్మకూర్) సూర్యాపేట

నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగంలో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ ఉత్తమ బ్లాక్ పంచాయత్ అవార్డు చేజిక్కించుకుంది. అలానే తెలంగాణలోని ములుగు జిల్లా ఉత్తమ డిస్ట్రిక్ బ్లాక్ పంచాయత్ అవార్డు అందుకుంది.

గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కె) పంచాయతీ స్పెషల్ కేటగిరిలో అవార్డు పొందింది. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లాలోని కన్హా గ్రామ పంచాయితీ స్పెషల్ కేటగిరిలో అవార్డు పొందింది.


న్యూఢిల్లీలో మొద‌టి గ్లోబ‌ల్ బౌద్ధ స‌మిట్‌

అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు శ్రీమతి మీనాక్షి లేఖి అలానే అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్ డాక్టర్ దమ్మపియా కూడా పాల్గొన్నారు.

రెండు రోజుల నిడివితో నిర్వహించిన ఈ సమ్మిట్ 'రెస్పాన్సేస్ టు కాంటెంపరరీ ఛాలెంజెస్ : ఫీలోసోఫీ టూ ప్రాక్సిస్' అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా బౌద్ధమతం మరియు వారి జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమకాలీన పరిస్థితులలో బుద్ధ ధర్మం యొక్క ప్రాథమిక విలువలు ఎలా స్ఫూర్తిని మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాయో ఈ వేదిక ద్వారా తెలియజేశారు.


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు రోజుల మిల్లెట్ మహోత్సవ్

ఏప్రిల్ 20,21 తేదీల్లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు రోజుల మిల్లెట్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ మిల్లెట్స్ కాన్ఫరెన్స్‌ను కేంద్ర ఫుడ్ మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ఫుడ్ పరిశ్రమ నిపుణులు మరియు ఫుడ్ ప్రాసెసింగ్‌లో నిమగ్నమైన మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ల మధ్య ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు. దీనిలో ప్రధానంగా వ్యవసాయ ఆహార ప్రాసెసింగ్ వ్యాపార అవకాశాలు, వివిధ పథకాలు, ప్రోత్సాహకాలు, మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు మరియు వివిధ మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులపై చర్చలు నిర్వహించారు.


జాతీయ క్వాంటం మిషన్‌కు క్యాబినెట్ ఆమోదం

దేశీయ క్వాంటం టెక్నాలజీలో సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్‌ను పెంపొందించడానికి సంబంధించి నేషనల్ క్వాంటం మిషన్‌కు ఏప్రిల్ 19న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 నుండి 2030-31 వరకు ఈ నేషనల్ క్వాంటం మిషన్ అమలులో ఉండనుంది. దీని కోసం దాదాపు 6003.65 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది. క్వాంటం టెక్నాలజీస్ & అప్లికేషన్స్ అభివృద్ధిలో భారతదేశాన్ని ప్రముఖ దేశాలలో ఒకటిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం దీనిని రూపొందించింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌తో సహా ఆరు దేశాలు క్వాంటం టెక్నాలజీలో రంగంలో ముందు వరుసలో ఉన్నాయి.

ఈ మిషన్ అటామిక్ సిస్టమ్స్‌లో అత్యంత సున్నితత్వంతో కూడిన మాగ్నెటోమీటర్‌లు మరియు ఖచ్చితమైన టైమ్, కమ్యూనికేషన్‌, నావిగేషన్ సమాచారం అందించే అటామిక్ క్లాక్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలానే సూపర్ కండక్టర్స్, సెమీకండక్టర్ స్ట్రక్చర్‌లు మరియు క్వాంటం పరికరాల తయారీ కోసం టోపోలాజికల్ మెటీరియల్స్ వంటి క్వాంటం పదార్థాల రూపకల్పన మరియు సంశ్లేషణకు కూడా మద్దతు ఇస్తుంది.

ఇందులో భాగంగా దేశంలోని క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ & మెట్రాలజీ మరియు క్వాంటం మెటీరియల్స్ & డివైజెస్ డొమైన్‌లలోని టాప్ అకడమిక్ మరియు నేషనల్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో నాలుగు థీమాటిక్ హబ్‌లు (T-హబ్‌లు) ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌లు నిర్దేశించబడిన రంగాలలో పరిశోధనలను ప్రోత్సహిస్తాయి.

క్వాంటం టెక్నాలజీ అనేది ఫిజిక్స్ మరియు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఆధునిక సాంకేతిక విభాగం, ఇది క్వాంటం మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించడం ద్వారా పనిచేసే సాంకేతికత. క్వాంటం మెకానిక్స్ ముఖ్యంగా క్వాంటం ఎంటాంగిల్మెంట్, క్వాంటం సూపర్‌పొజిషన్ మరియు క్వాంటం టన్నెలింగ్ లక్షణాలపై ఆధారపడే సాంకేతికతలను కలిగి ఉంటుంది. మొదటి తరం క్వాంటం టెక్నాలజీ మనకు ట్రాన్సిస్టర్‌, లేజర్‌, సెమీకండక్టర్ మరియు జీపీఎస్ వంటి ఉత్పత్తులను ఇచ్చి ఆధునిక సాంకేతికతకు పునాది వేసింది. ప్రస్తుతం ఈ రంగంలో అత్యున్నత పరిశోధనలు జరుగుతున్నాయి.


సీడ్ ట్రేసిబిలిటీ పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్‌ ప్రారంభం

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏప్రిల్ 19న SATHI (సీడ్ ట్రేసిబిలిటీ, ఆథెంటికేషన్ అండ్ హోలిస్టిక్) అనే వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్ విత్తనోత్పత్తి, విత్తన నాణ్యత సవాళ్లను ఎదుర్కోవటం కోసం రూపొందించారు. ఇవి క్యూఆర్ కోడ్ ఆధారిత సాంకేతిక ద్వారా సంబంధిత విత్తన ప్యాకేజీకి సంబందించిన సమాచారాన్ని అందిస్తాయి.

సతి యాప్ విత్తన నాణ్యత హామీ వ్యవస్థను నిర్ధారిస్తుంది, విత్తన ఉత్పత్తి గొలుసులో విత్తన మూలాన్ని గుర్తిస్తుంది. ఈ గొలుసులో విత్తన పరిశోధన సంస్థ, విత్తన ధృవీకరణ సంస్థ, విత్తన లైసెన్సింగ్, సీడ్ కేటలాగ్, డీలర్ టు ఫార్మర్ సేల్స్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ వంటి సమాచారం ఉంటుంది.


సోనమ్ వాంగ్‌చుక్‌కి ప్రతిష్టాత్మక సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డు

లడఖ్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యా సంస్కరణవాది సోనమ్ వాంగ్‌చుక్ ప్రతిష్టాత్మక సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు.ఈ అవార్డు దివంగత పారిశ్రామికవేత్త సంతోక్‌బా ధోలాకియా గౌరవార్థం స్థాపించబడింది. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 10న ఈ అవార్డు అందజేస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్, మరియు సామజిక రంగంలో సేవలు అందించే వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. విజేతకు కోటి రూపాయల నగదు బహుమతి, జ్ఞాపికను అందిస్తారు.

లడఖ్‌లోని స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL) వ్యవస్థాపక-డైరెక్టరుగా ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌, విద్య మరియు అభ్యాస రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా గుర్తింపు పొందారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం '3 ఇడియట్స్‌' ఈయన కాల్పనిక పాత్ర ఆధారంగానే రూపొందించబడింది. మెగససే అవార్డు గ్రహీత అయినా సోనమ్ వాంగ్‌చుక్, తన పేరుతో 400 కంటే ఎక్కువ పేటెంట్లను కలిగి ఉన్నాడు.


ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌కు అర్జెంటీనా ఆతిధ్యం

ఈ ఏడాది మే, జూన్ నెలలలో జరగాల్సిన ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌కు ఇండోనేషియా స్థానంలో అర్జెంటీనా ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రీడా ఈవెంట్ అధికారికంగా ఇండోనేసియాలో జరగాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండోనేషియా గవర్నర్ నిరాకరించడంతో పాటుగా బాలిలో జరగాల్సిన ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ డ్రాను రద్దు చేయడంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.

గత కొద్దీ ఏళ్లుగా ఇండోనేషియాకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని ఇండోనేషియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతి కుదిరిన తర్వాత మాత్రమే ఇజ్రాయెల్‌తో పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడం సాధ్యమవుతుందని 2005లో ఇండోనేషియా పేర్కొంది. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెంపొందించేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకుల చర్యలు ప్రతిసారీ బెడిసికొట్టాయి.


జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించిన జి20 ప్రతినిధులు

పనాజీలో నిర్వహించిన జి 20 ఆరోగ్య కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జి20 ప్రతినిధులు. దగ్గరలో ఉన్న జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా వీరికి జనౌషధి పరియోజన దేశంలోని ప్రతి మూల మరియు మూలలో ప్రజలకు నాణ్యమైన మరియు సరసమైన మందులను ఎలా అందజేస్తుందో వివరించారు. ఈ సంధర్బంగా ఆరోగ్య సూచికల పరంగా ఆఫ్రికాలో అత్యంత అధ్వాన్నంగా ఉన్న నైజీరియా, జన్ ఔషధి కేంద్రాల తరహాలో స్టోర్లను తమ దేశంలో ఏర్పాటు చేయడానికి భారతదేశ సహాయాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దేశంలో అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన జెనరిక్ ఔషధాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెంట్రల్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌తో కలిసి ఫార్మాస్యూటికల్స్ మంత్రిత్వ శాఖ వీటిని నిర్వహిస్తుంది.


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డేటా ప్రకారం, చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. చైనా కంటే భారత్ దాదాపు 3 మిలియన్ల అధిక జనాభాను కలిగివున్నట్లు నివేదించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తన దీర్ఘకాల హోదాను త్వరలో వదులుకోనుందని పేర్కొంది. ఏప్రిల్ 14, 2023 నాటికి భారతదేశ జనాభా 1,425,775,850కి చేరుకుంటుందని నివేదించింది.

2023 మరియు 2050 మధ్య, 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి సంఖ్య చైనా కంటే భారతదేశంలో రెండింతలు పెరుగుతుందని అంచనా వేయబడింది. అయితే మొత్తం జనాభా నిష్పత్తితో పోల్చుకుంటే భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుదల చైనా కంటే చాలా నెమ్మదిగా ఉండనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరిది 2021లో ప్రారంభం కాగా కోవిడ్-19 కారణంగా వాయిదా వేయబడింది.

ఈ నివేదికను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రూపొందించింది. ఇది ప్రపంచ జనాభా అభివృద్ధి, లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై పనిచేసే అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ. దీనిని 1969లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.


తమిళనాడు కంబమ్ ద్రాక్షకు జిఐ గుర్తింపు

తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కంబమ్ పన్నీర్ త్రాట్‌చై లేదా కుంబమ్ ద్రాక్ష ఇటీవలే భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ దక్కించుకుంది. దీనిని కొన్నిసార్లు మస్కట్ హాంబర్గ్ అని కూడా పిలుస్తారు. దాదాపు 2వేల ఎకరాలలో పండించే ఈ ద్రాక్షను వైన్, స్పిరిట్స్, జామ్‌లు, క్యాన్డ్ ద్రాక్ష రసం మరియు ఎండుద్రాక్షలను తయారు చేయడానికి విరివిగా ఉపయోగిస్తారు. తమిళనాడులోని పశ్చిమ కనుమల పరిధిలో కనిపించే కుంబమ్ లోయను దక్షిణ భారతదేశం యొక్క ద్రాక్ష నగరంగా పరిగణిస్తారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు

ప్రభుత్వ శాఖల్లో 100 శాతం ఈవీలను కలిగి ఉన్న దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించింది. యూపీ ప్రభుత్వం గత ఏడాదే 2030 నాటికీ అన్ని ప్రభుత్వ వాహనాలను ఎలెక్టిక్ వాహనాలతో భర్తీ చేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇకపోతే దేశంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించబడే మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ ఇప్పటికే ఈ గుర్తింపు పొందింది.


బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఐకాన్‌గా ట్రాన్స్‌జెండర్ మోనికా దాస్

బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఐకాన్‌గా ట్రాన్స్‌జెండర్ మోనికా దాస్‌ను నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనితో మోనికా తోలి ట్రాన్స్‌జెండర్ 'స్టేట్ ఐకాన్ ఆఫ్ బీహార్'గా ఘనతను సొంతం చేసుకుంది. గతంలో 2020లో జరిగిన బీహార్ ఎన్నికలలో మోనికా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు.

పాట్నా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పీజీ చేసిన ఈమె దేశ చరిత్రలో మొదటి ట్రాన్స్‌జెండర్ బ్యాంకు ఉద్యోగిగా గుర్తింపు పొందారు. లింగమార్పిడి వ్యక్తులకు సంబందించిన మంగళముఖి కమ్యూనిటీ ఎన్నికలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


అరుణాచల్ ప్రదేశ్‌లోని జెమితాంగ్ గ్రామం బౌద్ధ సదస్సుకు ఆతిధ్యం

అరుణాచల్ ప్రదేశ్‌లోని జెమితాంగ్‌ గ్రామం ఒక ప్రధాన బౌద్ధ సదస్సుకు ఏప్రిల్ 17న ఆతిధ్యం ఇచ్చింది. ఈ సదస్సును ఇండియన్ హిమాలయన్ కౌన్సిల్ ఆఫ్ నలంద బుద్దిస్ట్ ట్రెడిషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టిబెటన్ ఆధ్యాత్మిక నాయకులతో సహా భారతదేశం అంతటా 600 పైగా బౌద్ధ సన్యాసులు హాజరయ్యారు. అలానే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా హాజరయ్యారు. నలంద బౌద్ధమత మూలాన్ని తిరిగి పొందడం అనే ప్రధాన అంశంపై ఈ జాతీయ సదస్సును నిర్వహించారు.

జెమితాంగ్ గ్రామం అంటే "ఇసుక లోయ" అని అర్ధం. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో న్యామ్‌జాంగ్ చు నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు అని పిలువబడే పాంగ్‌చెన్పా ప్రజలకు నిలయం. ఈ ప్రాంతం 1959లో 14వ దలైలామా, చైనా-ఆక్రమిత టిబెట్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన చివరి మరియు మొదటి భారత సరిహద్దుగా గుర్తింపు పొందింది.


జైశంకర్ నాలుగు లాటిన్ అమెరికా దేశాల పర్యటన

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఏప్రిల్ 21 నుండి 29 మధ్య నాలుగు మధ్య మరియు లాటిన్ అమెరికా దేశాలలో పర్యటించారు. ఆయన పర్యటించిన దేశాల జాబితాలో గయానా (ఏప్రిల్ 21-23), పనామా (ఏప్రిల్ 24-25), కొలంబియా (ఏప్రిల్ 25-27) మరియు డొమినికన్ రిపబ్లిక్ (ఏప్రిల్ 27-29) ఉన్నాయి.

విదేశాంగ మంత్రిగా జైశంకర్ ఈ దేశాలను పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ప్రధానంగా వ్యాపార, వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధిత అంశాలలో సంబంధాలను ప్రోత్సహించడంతో పాటుగా సాంకేతికతతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా సాగింది.


మణిపూర్‌లో హున్-థాడౌ కల్చరల్ ఫెస్టివల్ 2023

5వ వార్షిక మణిపూర్ హున్-థాడౌ సాంస్కృతిక ఉత్సవాలను ఏప్రిల్ 17, 18వ తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభ వేడుకను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ప్రారంభించారు. ముగింపు వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు.

హున్-తాడౌ పండుగ అనేది మణిపూర్ యొక్క థాడస్ (థాడౌ) కమ్యూనిటీ యొక్క వార్షిక సాంస్కృతిక ఉత్సవం. ఈ పండుగలో థాడౌ తెగకు చెందిన సాంప్రదాయ ఆచార ప్రదర్శనలు, జానపద నృత్యాలు మరియు వారి సాంప్రదాయ ఆటలు, వారి పురాతన వస్తువుల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జి20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గాదరింగ్ కాన్ఫరెన్స్

రెండు రోజుల జి20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గాదరింగ్ ( RIIG) యొక్క 2వ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 19 మరియు 20వ తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో జి-20 సభ్యదేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సైంటిఫిక్ కమ్యూనిటీకి చెందిన నిపుణులు పాల్గొన్నారు.

సమతౌల్య సమాజానికి పరిశోధన మరియు ఆవిష్కరణ అనేదే నినాదంతో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. దీనికి సంబందించిన మొదటి సమావేశం గత మార్చి 23న అస్సాంలోని దిబ్రూఘర్‌లో జరిగింది.


ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో స్టేట్‌గా సిరియా

పశ్చిమాసియా దేశమైన సిరియా ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో-స్టేట్‌గా ప్రకటించబడింది. ప్రస్తుతం సిరియా నిషేదిత మారకద్రవ్యాలను ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఎగుమతి చేస్తున్న దేశంగా అవతరించింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దీనిపైనే మనగడ సాధిస్తుందని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యంత వ్యసనపరమైన క్యాప్టాగన్ డ్రాగ్, ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక జీవనాధారంగా మారింది. దాని విదేశీ కరెన్సీలో 90% దీని ద్వారే ఆర్జిస్తుంది.

2021లో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) చే గుర్తించబడిన ఈ నిషేధిత డ్రగ్ అయిన క్యాప్‌గాన్, యాంఫేటమిన్ మరియు కెఫిన్‌లతో మిళితమై ఉంటుంది. ఈ సింథటిక్ ఉద్దీపన ఔషధం 1961లో జర్మన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ద్వారా ఉత్పత్తి చేయబడింది. అప్పటిలో దీనిని అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, నార్కోలెప్సీ మరియు డిప్రెషన్ వంటి వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వారు.

అయితే తర్వాత కాలంలో క్యాప్టాగన్ అత్యంత వ్యసనపరమైన మరియు మానసిక, శారీరక ఆరోగ్యానికి హానికరమైన ఔషధంగా గుర్తించబడింది. తద్వారా ఇది ప్రపంచ వ్యాప్తంగా నిషేదించబడింది.


యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

1960 జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద, కేంద్ర ప్రభుత్వం కొత్తగా యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023ని నోటిఫై చేసింది. ఈ రూల్స్ గతంలో నోటిఫై చేసిన 2001 యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ స్థానంలో భర్తీ చేసింది. ఈ కొత్త రూల్స్‌ను 2009 నాటి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు పీపుల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ స్ట్రే ట్రబుల్స్ యొక్క రిట్ పిటీషన్ నెం. 691లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుగుణంగా రూపొందించింది. అదే సమయంలో కుక్కల తరలింపుకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా నూతన నియమాలు చేర్చింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ & ఇమ్యునైజేషన్ సంబంధించి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను సంబంధిత స్థానిక సంస్థలు/మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు మరియు పంచాయతీలు నిర్వహించాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా నిర్వహించకపోవడం వలన ఇటు మానవులకు, అటు కుక్కలకు భౌతిక నష్టం జరుగుతుంది. దీనిని నివారించేందుకు కొత్తగా ఈ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.

మనుషులు మరియు వీధికుక్కల సంఘర్షణను అధిగమించేందుకు ఒక ప్రాంతంలోని కుక్కలను తరలించకుండా, యాంటీ రేబీస్ ప్రోగ్రామ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కరించాలని సూచించింది. అదే విధంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థలే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వరించాలనే నిబంధనను చేర్చింది.

స్థానిక సంస్థలు ఈ నియమాలు స్ఫూర్తితో అమలు చేయడం ద్వారా జంతు జనన నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించవచ్చు అని పేర్కొంది. ఈ నూతన రూల్స్ జంతు సంక్షేమ సమస్యలను పరిష్కరించడానికి అలానే వీధి కుక్కల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తుంది.


గ్రామీణ మహిళల కోసం 'సంగతన్ సే సమృద్ధి' పథకం

అట్టడుగున ఉన్న గ్రామీణ మహిళలను స్వయం సహాయక గ్రూపుల (ఎస్‌హెచ్‌జి) నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'సంగతన్ సే సమృద్ధి' పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబందించిన ప్రచార కార్యక్రమాన్ని ఏప్రిల్ 18న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు.

ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న తొమ్మిది కోట్ల మంది మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దీనిని రూపొందించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న ప్రతి మహిళ ఏడాదికి లక్ష రూపాయలు సంపాదించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీర్చిదిద్దింది.


ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023కి చెన్నై ఆతిథ్యం

ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023కి చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఈ ఏడాది ఆగస్టు 3 నుండి 12 వ తేదీల మధ్య జరగనుంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ టోర్నీలో భారత్‌తో పాటు మూడుసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత మరియు డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా, మలేషియా, పాకిస్థాన్, జపాన్, చైనా జట్లు పాల్గొంటాయి.

భారత్ ఈ టోర్నీలో 2011, 2016 ఏడాదిలో విజేతగా నిలిచింది. ఈ వేదిక ఖరారు సంబంధించి చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరియు హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ (హెచ్‌ఐ) భోలా నాథ్ సింగ్ పాల్గొన్నారు.


మహిళా సమ్మాన్ పొదుపు పథకంపై ప్రత్యేక కవర్‌ను విడుదల చేసిన పోస్టల్ శాఖ

తెలంగాణలో మహిళా సమ్మాన్ పొదుపు పథకంపై తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జెసింగ్‌భాయ్ చౌహాన్ ఈ కవర్‌ను విడుదల చేశారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 2023 నుండి మార్చి 2025 వరకు రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే వన్-టైమ్ స్కీమ్. ఇది స్థిరంగా రెండేళ్లపాటు మహిళలు లేదా బాలికల పేరిట గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిని ఈ ఏడాది ఫిబ్రవరి 2023 బడ్జెట్‌ సమయంలో ప్రకటించారు. మహిళా పెట్టుబడిదారులలో పెట్టుబడి ఆలోచనను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రారంభించబడింది. 18 ఏళ్ళు నిండిన మహిళలు అందరూ అర్హులు. సేవింగ్స్ పై 7.50 శాతం వడ్డీని అందిస్తారు.


ఉత్సా పట్నాయక్‌కు మాల్కం ఆదిశేషయ్య అవార్డు

జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ ఈ ఏడాది మాల్కం ఆదిశేషయ్య అవార్డుకి ఎంపికయ్యారు. మాల్కం & ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును సామాజిక రంగంలో అత్యుత్తమ సేవలు అందించే వ్యక్తులకు అందజేస్తారు. మాల్కం & ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఆర్థిక శాస్త్రం మరియు అభివృద్ధి అధ్యయనాలలో ప్రాథమిక మరియు అనువర్తిత బోధన పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేయబడింది.

మాల్కం సత్యనాథన్ ఆదిశేషయ్య ప్రముఖ భారతీయ ఆర్థిక మరియు విద్యావేత్త. ఈయన 1976లో భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను పొందారు. 1998లో యునెస్కో విద్య మరియు అక్షరాస్యతకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈయన పేరున యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత బహుమతిని సృష్టించింది. ఆదిశేషయ్య గతంలో మద్రాసు యూనివర్శిటీ వైస్ ఛాన్సలరుగా సేవలు అందించారు.


కార్బన్ రహిత విద్యుత్ ఉత్పత్తి దిశగా జీ7 దేశాలు

ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు అయినా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌, 2035 నాటికి కార్బన్ రహిత విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేయాలని ప్రతిజ్ఞ చేశాయి. ఏప్రిల్ 15-16 తేదీలలో జపాన్‌లో వాతావరణం, ఇంధనం మరియు పర్యావరణంపై జరిగిన రెండు రోజుల జి7 మంత్రుల సమావేశం తర్వాత, సభ్య దేశాల మంత్రులు మరియు దూతలు ఈ ప్రకటన చేశారు.

వచ్చే నెలలో హిరోషిమాలో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందస్తూ సమావేశంగా దీనిని నిర్వహించారు. ప్రస్తుతం జపాన్ జీ7 దేశాల అధ్యక్ష హోదాలో ఉంది. ఈ సమావేశానికి ప్రస్తుతం జీ20 అద్యక్షతలో ఉన్న ఇండియాకు అతిధిగా హాజరయ్యేందుకు ఆహ్వానం అందగా, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ హాజరయ్యారు.


ఫిన్‌లాండ్‌లో అతిపెద్ద అణు రియాక్టర్ ప్రారంభం

ఐరోపాలో అత్యంత శక్తివంతమైన ఓల్కిలువోటో 3 అణు రియాక్టర్ ఫిన్లాండ్‌లో ప్రారంభమైంది. 1,600 మెగావాట్ సామర్థ్యం కలిగిన ఈ రియాక్టర్ గత మార్చి 2022లో ఫిన్నిష్ నేషనల్ పవర్ గ్రిడ్‌కి కనెక్ట్ చేయబడింది. తాజాగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో ఫిన్‌లాండ్ యొక్క ఇంధన భద్రతకు డోకా లేకుండాపోయింది. ఇది రాబోయే 60 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఫిన్లాండ్ ప్రస్తుతం రెండు పవర్ ప్లాంట్లలో ఐదు అణు రియాక్టర్లను కలిగి ఉంది. ఇవి 60% దేశీయ విద్యుత్‌ అవసరాన్ని తీర్చుతున్నాయి.


గుజరాత్‌లో సౌరాష్ట్ర - తమిళ సంగమం కల్చరల్ ఈవెంట్

గుజరాత్‌లోని సోమనాథ్‌లో సౌరాష్ట్ర తమిళ సంగమం సాంస్కృతిక మహోత్సవంను ఏప్రిల్ 17న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. పది రోజుల పాటు జరిగే ఈ సాంస్కృతిక మహోత్సవంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య పాల్గొన్నారు.

గుజరాత్ మరియు తమిళనాడు మధ్య పురాతన సాంస్కృతిక బంధాన్ని పెంపొందించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సంగమంలో భాగంగా, ప్రతినిధులు సోమనాథ్, ద్వారక మరియు ఐక్యతా విగ్రహం వంటి వివిధ వారసత్వ మరియు పర్యాటక ప్రదేశాలను సందర్శించి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.


బీహార్‌లో థావే మహోత్సవం 2023

బీహార్ పర్యాటక శాఖ మరియు కళ మరియు సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఏప్రిల్ 15 మరియు 16 తేదీలలో గోపాల్‌గంజ్‌లో వార్షిక థావే ఉత్సవాన్ని నిర్వహించింది. దీనిని థావే దుర్గ దేవాలయ వార్షిక ఉత్సవాలలో భాగంగా జరుపుకుంటారు. దీనిని 2012 లో మొదటిసారి జరుపుకున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. గోపాల్‌గంజ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు తావే దుర్గా ఆలయానికి సందర్శకులను ఆహ్వానించడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యం.


వారణాసిలో జీ20 అగ్రికల్చరల్ చీఫ్ సైంటిస్ట్స్ సమావేశం

భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం వారణాసిలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఏప్రిల్ 17- 19 తేదీలలో వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ (DARE) మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంను 'సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్తీ పీపుల్ అండ్ ప్లానెట్' అనే థీమ్‌తో నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆహార భద్రత మరియు పోషకాహారం, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ అగ్రికల్చర్, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ వంటి వాటితో సహా వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు.


బెంగళూరులో మొదటి జీ20 ఆర్థిక మంత్రులు & సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం

జీ20 ఇండియన్ ప్రెసిడెన్సీలో మొదటి జీ20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (FMCBG) సమావేశం 2023 ఏప్రిల్ 23 నుండి 24 వ తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించబడింది. ఈ రెండు రోజుల సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి జీ20 సభ్యు దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యారు. 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయడమనే అంశంపై చర్చలు నిర్వహించారు.


సుడాన్‌ నుండి భారత పౌరుల తరలింపు కోసం ఆపరేషన్ కావేరి

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి 'ఆపరేషన్ కావేరి' పేరుతొ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సూడాన్ అంతటా ఉన్న దాదాపు 3,000 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నౌకలు, విమానాలను ఉపయోగించింది. గత కొన్ని రోజులుగా సూడాన్‌ సైన్యం మరియు పారామిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్నా ఆధిపత్య యుద్ధంలో దాదాపు వందల మంది సాధారణ పౌరులు మరణించారు.

1956 లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన సుడాన్, ఏనాడూ సుస్థిరంగా, ప్రశాంతంగా ఉన్నా దాఖలాలు లేవు. 2019 లో సుడాన్ ప్రజలు30 ఏళ్ళ దుర్మార్గ ఒమర్ అల్-బషీర్‌ పాలనను అంతమొందించి, దేశంలో మధ్యంతర ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2021లో అప్పటి సైనిక అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, సైనిక కుట్రతో ఈ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడంతో మళ్ళీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీనికి రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అనే మరో పారామిలిటరీ దళ నాయకుడు మొహమ్మద్ హమ్దాన్ కూడా సహకరించారు.

మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత వీరిద్దరి మధ్య సైనిక ఏకీకరణకు సంబందించిన ప్రతిపాదనలో వివాదం తలెత్తి యుద్దానికి దారి తీసింది. సైనిక అధ్యక్షుడుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న బుర్హాన్, ఇప్పుడు పారామిలిటరీ దళాన్ని కూడా సైన్యంలో విలీనం చేస్తే, తన భవిష్యత్తు అంధకారం అవుతుందనే భయంతో ఆర్ఎస్ఎఫ్ నాయకుడు మొహమ్మద్ హమ్దాన్ ఈ యుద్దానికి బీజం పోశారు. ఈ ఇరు దళాల మధ్య వైర్యం ఇప్పుడు సుడాన్ ప్రజల చావుకి వచ్చింది.

ఇకపోతే భారత్ గతంలో వివిధ పేర్లతో ఇటివంటి ఆపరేషన్లు నిర్వహించింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భూకంపంతో స్వర్వం కోల్పోయిన టర్కీ మరియు సిరియా దేశాలకు సహాయం చేయడానికి భారత్ 'ఆపరేషన్ దోస్త్' పేరుతొ శోధన మరియు రెస్క్యూ బృందాలను పంపింది.

2021 లో తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో భారత్ పౌరులను తరలింపు కోసం ఆపరేషన్ దేవి శక్తి పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కోవిడ్-19 సమయంలో విదేశాల నుండి భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే జాతీయ ప్రయత్నంలో భాగంగా మే 2020లో ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించబడింది. 2021లో భారత నౌకాదళం భారతదేశానికి ఆక్సిజన్ నింపిన కంటైనర్‌లను రవాణా చేయడానికి ఆపరేషన్ సముద్ర సేతు-II ని నిర్వహించింది.

2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్ లో ఇరుక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. 2015 లో నేపాల్ లో సంభవించిన భయంకర భూకంపములో సర్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సహాయ సహకారాలు అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ మైత్రిని నిర్వహించింది.

పంజాబ్ రాజకీయ దిగ్గజం బాదల్ కన్నుమూత

→ పంజాబ్ రాజకీయ దిగ్గజం, శిరో మణి అకాలీదళ్ అగ్ర నేత, 5 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు.
→ బాదలు కుమారుడు సుబ్బీర్ సింగ్, కుమార్తె పర్నీత్ కౌర్ ఉన్నారు.
→ సుబ్బీర్ ఆయనకు రాజకీయ వారసుడురాగా.. పర్నీత్ మాజీ మంత్రి ఆదేశ్ ప్రతాప్ సింగ్ కైరాన్ సతీ మణి.
→ సుబ్బీర్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ బఠిండా ఎంపీగా ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం :-
→ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ రాజకీయాల్లో చెరగని ముద్ర.
→ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
→ పంజాబ్ కు 5 సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
→ ప్రకాష్ సింగ్ బాదల్ 1927 డిసెంబరు 8న పంజా బ్లోని అబుల్ ఖురానా అనే గ్రామంలో జన్మిం చారు.
→ లాహోర్లోని ఫార్మన్ క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ చదివారు. గ్రామీణ నేపథ్యమున్న ఆయన ఎన్నికల చరిత్రలో అనేక రికార్డులను నెలకొ ల్పారు.
→ 1947లో బాదల్ అనే గ్రామానికి సర్పం చిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అత్యంత చిన్న వయసులో సర్పంచి పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
→ ఆ తర్వాత బ్లాక్ అధ్యక్షుడిగా పని చేశారు.
→ 1957 జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాలౌత్ నుంచి మొదటిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
→ 1969లో మరోసారి ఎస్ఏడీ తరఫున అసెంబ్లీకి ఎన్నిక య్యారు.
→1970లో తొలిసారిగా పంజాబ్ ముఖ్య మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
→ఎస్ఏడీ ప్రభుత్వాన్ని చీల్చి అప్పటి ముఖ్యమంత్రి గుర్నాం సింగ్ కాంగ్రెస్ లో చేరారు.
→దీంతో మిగిలిన ఎస్ఏడీ నేతలతో కలిసి జనసంఘ్ మద్దతుతో బాదల్ సీఎం పదవిని చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 43 ఏళ్లు.
→అప్పట్లో పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఆయన అత్యంత పిన్న వయస్కుడుగా ఆయన నిలిచారు.
→2012లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయస్సు 84 ఏళ్లు. సీఎం పదవిని చేప ట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగానూ ఆయనే రికార్డు సృష్టించారు.
→కేంద్ర మంత్రిగా వ్యవసాయం, నీటి పారుదలశాఖ బాధ్యతలను నిర్వర్తించారు.
→గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాంబి నుంచి ఆయన పోటీ చేశారు.
→దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అతిపెద్ద వయస్కుడిగా నిలి చారు. ఆయన ఆ ఎన్నికలో ఓడిపోయారు.

రూ.801 కోట్లు పొదుపు చేసిన 17వ లోక్ సభ

→ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడంతో పాటు కాగితరహిత కార్యాలయంగా పనిచేయడం ద్వారా స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలోని 17వ లోక్ సభ ఇప్పటి వరకు రూ. 801.46 కోట్లను పొదుపు చేసింది.
→ పార్ల మెంటు వర్గాలు ఈ వివరాలను వెల్లడిం చాయి.
→ లోక్ సభ నిర్వహణకు ఈ నాలుగేళ్లలో కేటా యించిన బడ్జెట్లో పొదుపు భాగం దాదాపు నాలుగో వంతు అని వివరించింది.
→ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.258.47 కోట్లు, 2022-23లో రూ.132.60 కోట్లను లోక్సభ పొదుపు చేసింది.
→ ఖర్చు తగ్గించే మార్గాలను అనుసరించడంతో పాటు కొవిడ్ నేపథ్యంలో సమావే శాలు తగ్గడమూ ఆదాకు కారణమైంది.

నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాలు

→ ఆజాదీ కా అమృత్ మహో త్సవ్ లో భాగంగా డాక్టర్ నటరాజ రామకృష్ణ శతజ యంతి ఉత్సవాలు, అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు.
→ వీటికి సంబంధించి రాష్ట్ర సృజ నాత్మక, సంస్కృతి సమితి ప్రచురించిన గోడపత్రికను ఉప ముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారా యణ సచివాలయంలో ఆవిష్కరిం చారు.
→ దేవాదాయ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి సీఈవో ఆర్.మల్లి కార్జున తదితరులు పాల్గొన్నారు.

మన్ కీ బాత్ 100 జాతీయ సదస్సు నేడు

→ ప్రధానమంత్రి మోదీ మాసాం తపు 'ఆలిండియా రేడియో ప్రాసంగిక కార్యక్రమం మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ జాతీయ సదస్సు నిర్వహించనుం ది.
→ దీన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉపరాష్టపతి జగదీప్ ధన్డ్ ప్రారంభించను న్నారు. సదస్సులో నాలుగు ప్రత్యేకచర్చా కార్య క్రమాలుంటాయి.
→ వీటిలో నటులు అమీర్ ఖాన్, రవీనాటాండన్, తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, పూర్ణ మలావత్లతో పాటు మన్ కీ బాత్ ప్రధాని ప్రస్తావించిన 100 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకాను న్నారు.
→ 'మన్ కీ బాత్' 100 ఎపిసోడ్లకు గుర్తుగా పోస్టల్ స్టాంప్, నాణేలను హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.

దలైలామా చేతికి రామన్ మెగసెసె అవార్డు

→ టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రక టించిన రామన్ మెగసెసె అవార్డును ఫౌండేషన్ సభ్యులు 64 ఏళ్ల తర్వాత బుధ వారం ధర్మశాలలో వ్యక్తిగతంగా అందజేశారు.
→ ఈమేరకు ఆయన కార్యాలయం ప్రకటించింది. టిబెట్ వాసులు తమ పవిత్రమైన మతాన్ని పరిరక్షించుకొనేందుకు చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహించినందుకు ఈ అవార్డును ప్రకటించింది.

ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి

→ రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ సూచించారు.
→ ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భార త్ గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు.
→ దీని వల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంద న్నారు.
→ ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారం భించి, మాట్లాడారు.
→ ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్ను రూ.600కు విక్రయించను న్నారు.
→ అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది.
→ సాగులో ద్రవరూప ఉత్ప త్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్ షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు.
→ద్రవ రూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవ రూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం.
→ ద్రవరూప ఎరువులు భారతన్ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు.
→ 2021-22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసు కున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
→ ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్ తెలిపారు.

మళ్లీ ఢిల్లీ మేయర్గా ఆప్ నేత షెల్లీ

→ప్రత్యర్థి పార్టీ బీజేపీ మహిళా అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరిం చుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేత, ప్రస్తుత ఢిల్లీ మున్సిపాలిటీ(ఎంసీడీ) మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఈ ఆర్థిక సం వత్సరానికీ మరోమారు మేయర్గా ఎంపికయ్యారు.
→ ఎంసీడీ నిర్ణాయక మండలి అయిన స్టాండిం గ్ కమిటీకి ఇంతవరకు ఎన్నికలు నిర్వహించనందుకు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు శిఖా రాయ్ చెప్పారు.
→ డెప్యూటీ మేయర్ పదవికి బీజేపీ మహిళా అభ్యర్థిగా సోనీ పాల్ తన నామినేషన్ను ఉపసంహరిం చుకోవడంతో ప్రస్తుత డెప్యూటీ మేయర్ ఆలీ మొహమ్మద్ ఇక్బాల్క మరోసారి పదవి దక్కింది.
→ ఓటింగ్లో ఓటమి భయాలతోనే వీరిద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారని ఆప్ ఎద్దేవాచేసింది.
→ ' కనీసం పోటీచేసే సత్తాలేక బీజేపీ కౌన్సిలర్లు ఆప్ నేతృత్వంలోని కేజీవాల్ ఎదుట సరెండర్ అయ్యారు' అని పార్టీ ఎమ్మెల్యే, పార్టీ ఎంసీడీ ఇన్చార్జ్ దుర్గేశ్ పాఠక్ వ్యాఖ్యానించారు.
→ కాగా, స్టాండింగ్ కమిటీలు, వార్డ్ కమిటీలను ఏర్పాటుచేయకుండా ఎంసీడీని ఆప్ నిర్వీర్యం చేస్తోందని ఢిల్లీ బీజేపీ విభాగం ఆరోపించింది.
v → ఎంసీడీ మేయర్ పదవీకాలం ఏడాది. ఎంసీడీ ఎన్నికలయ్యాక ఐదేళ్ల కోసం ప్రతిఏటా మేయర్ను రిజర్వేషనల పరంగా రొటేషన్ పద్ధతిలో ఎన్నుకుంటారు.
→ మొదటి సంవత్సరం మహిళలకు, రెం డో ఏడాది జనరల్ కేటగిరీ, మూడో ఏడాది రిజర్వ్ కేటగిరీ, చివరి రెం డేళ్లూ ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తారు.
→ ఆర్థిక సంవత్సరం ముగియగానే కొత్త మేయర్ను ఎన్నుకుంటారు.
→ గత ఆర్థిక సంవత్సరానికి ఓటింగ్ పలుమార్లు వాయిదాపడ్డాక చివరకు ఆప్ అభ్యర్థి గెలవడం తెల్సిందే.

భారత సంతతి వ్యక్తికి సింగపూర్లో ఉరి

→ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవహారంలో నేరం రుజువు కావడంతో సింగ పూర్లో భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య (46) కు ఉరిశిక్ష అమలు చేశారు.
→ ఉరిశిక్ష ఆపాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల కార్యక ర్తలు, ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినప్పటికీ సిం గపూర్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
→ క్షమాభిక్ష పటిషన్ ను మంగళవారం న్యాయస్థానం తిరస్క రించడంతో చాంగీ జైలులో బుధవారం తెల్లవా రుజామున శిక్షను అమలు చేశారు.
→ ఈ విష యాన్ని సింగపూర్ ప్రిజన్ సర్వీసు ప్రతినిధి వెల్ల డించారు. తంగరాజు డెత్ సర్టిఫికెట్ను అధికా రులు తమకు అందజేశారని అతని సోదరి చెప్పారు.
→ సింగపూర్ జాతీయుడైన తంగరాజు 2014లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల కింద అరెస్టయ్యాడు.

సూడాన్ నుంచి స్వదేశానికి 360 మంది భారతీయులు

→కల్లోలిత సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన 'ఆపరేషన్ 'కావేరి' వేగంగా కొనసాగుతోంది.
→అక్కడి నుంచి 360 మంది బుధవారం సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
→సూడాన్ నుంచి 278 మంది భార తీయులను ఐఎన్ఎస్ సుమేధ నౌక ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి భారత్ తరలించిన సంగతి తెలిసిందే.
→తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరో 256 మందిని రెండు విమానాల్లో జెడ్డాకు చేర్చింది.
→సైనిక రవాణా విమానాలైన సీ130జెలను ఇందుకోసం ఉపయోగించారు. తొలుత ఓ విమానంలో 121 మంది జెడ్డా చేరుకున్నారని, ఆపై మరో విమా నంలో 135 మంది వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ట్విటర్ వేదికగా వెల్లడిం చారు.
→ మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో దిల్లీకి వచ్చేశారు.
→ మరికొంతమందితో సీ-17 సైనిక రవాణా విమానం గురువారం ఉదయం ముంబయి చేరుకునే అవకాశాలున్నాయి.
→ మరోవైపు- సూడాన్లో కాల్పుల విరమణకు సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య కుదిరిన గడువు (72 గంటలు) ముగుస్తుం డటంతో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
→ సూడాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
→ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలు తమవారి కోసం ఇప్పటికే హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశాయి.

స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటుకు వదిలేయండి

→ మన దేశంలో స్వలింగ సంపర్కుల వివా హాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని, దానికి సంబంధించి పిటిషనర్లు ప్రస్తావించిన పలు ప్రశ్న లను పార్లమెంటుకు వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
→ ఈ కేసు అయిదవ రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
→ స్వలింగ వివాహాలకు గుర్తింపునిచ్చే అంశం చాలా సంక్లిష్టమైనదని, సమాజం పై లోతైన ప్రభావాన్ని చూపుతుందని మెహతా తెలిపారు.
→ పలు ఇతర చట్టాల్లోని 160కి పైగా నిబంధనలతోనూ ఇది ముడిపడి ఉంటుంద న్నారు.
→ వీటన్నిటినీ పరిశీలించి పునర్నిర్వ చించడం భారీ కసర త్తుతో కూడిన వ్యవహా రమని పేర్కొన్నారు.
→ రాష్ట్రాల చట్టసభలతో పాటు పౌర సమాజంలోనూ దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
→ 'వివాహం ఎవరి మధ్య జరగాలి, ఆ బంధాన్ని గుర్తించాల్సిందెవరు... ఈ ప్రశ్నలకు సమాధానమి వ్వాల్సిందెవరు అనేదే కీలకాంశమ'ని మెహతా పేర్కొన్నారు.
→ చట్టసభల అధికారాలను న్యాయవ్య వస్థ తన చేతిలోకి తీసుకోజాలదని చెబుతూ మన దేశంతో పాటు వివిధ దేశాలు కోర్టులు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు.
→ రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎస్. ఆర్. భట్, జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ పి. ఎస్. నరసింహ సభ్యులుగా ఉన్నారు..

వెయ్యి రేడియో కేంద్రాల్లో మన్‌కీ బాత్‌ ప్రసారం

→ ‘మన్‌కీ బాత్‌’ ఈ నెల 30వ తేదీతో 100వ భాగాన్ని పూర్తి చేసుకోబోతోంది.
→ఈ క్రమంలో బుధవారం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు.
→దీనికి హాజరైన అమిత్‌ షా.. 100వ మన్‌కీ బాత్‌ కార్యక్రమానికి గుర్తుగా రూ.5 ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు.
→రూ.100 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు.
→ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు ఆమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ‘మన్‌కీ బాత్‌’ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలతో నమ్మకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు.
→సినీ నటి రవీనా టాండన్‌ స్పందిస్తూ.. స్త్రీ పురుషుల వేతన అసమానతలను ప్రస్తావించారు.

కొత్తగా 157 నర్సింగ్‌ కళాశాలలు

→ కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రాలకు మంజూరుచేసిన 157 వైద్యకళాశాలలకు అనుబంధంగా 157 నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
→ఇందుకోసం రాష్ట్రాలకు ఒక్కో కాలేజికి రూ.10 కోట్ల చొప్పున సాయం చేయనుంది.
→ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది.
→ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌(ఏపీ)లోని పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నాల్లో ఇప్పటికే మంజూరైన వైద్యకళాశాలలకు అనుబంధంగా మూడు నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
→కేంద్ర నిర్ణయంతో ఒక్కో కళాశాలలో వంద సీట్ల చొప్పున మొత్తం 15,700 నర్సింగ్‌ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి.
→వైద్యరంగంలో ఉన్న మానవ వనరుల కొరతను అధిగమించడానికి ఇది పనికొస్తుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇక్కడ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
→కేంద్రం తన వాటా కింద రూ.10 కోట్లవరకు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు నిధులు సమకూర్చుకొని ఈ కాలేజీల పరిధిని విస్తరించుకోవచ్చని వెల్లడించారు.
→ఈ కాలేజీలతో జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌కూడా అనుబంధంగా పనిచేసి విదేశాలకు వెళ్లే నర్సులకోసం జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల సంస్థలతో కలిసి నైపుణ్యశిక్షణ ఇస్తుంది.
→ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,324 నర్సింగ్‌ సంస్థలు ఉన్నా అవసరమైనంత మానవ వనరులను అందించలేకపోతున్నాయన్న ఉద్దేశంతో ఈ కొత్త కాలేజీలను ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
→దేశంలో ప్రస్తుతం 1.06 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే, బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు 1.18 లక్షలకే పరిమితమైనట్లు వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులు లభించడంలేదని, ఆ కొరత తీర్చడానికి ఈ కొత్త నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

వైద్యపరికరాల రంగానికి కొత్త విధానం ఖరారు

దేశంలో వైద్యపరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్‌ కొత్త విధానాన్ని ప్రకటించింది. దీని ద్వారా ఈ రంగాన్ని వచ్చే అయిదేళ్లలో ఇప్పుడున్న 11 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఈ విధానం దేశంలో వైద్యపరికరాల ఉత్పత్తిరంగం క్రమంగా వృద్ధిచెందడానికి దోహదపడుతుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. దీనివల్ల ప్రజారోగ్యానికి అవసరమైన నాణ్యమైన పరికరాలు తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ఈ రంగంలో భారత్‌వాటాను 10-12%కి తీసుకెళ్లాలన్నది లక్ష్యమని వెల్లడించారు.


పర్యావరణ ఉత్తర్వులు సవరించిన సుప్రీంకోర్టు

→ జాతీయ ఉద్యానాలు, వన్యమృగ అభయా రణ్యాల చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలో పర్యా వరణ సున్నిత ప్రాంతాలు (ఇ.ఎస్.జడ్) నెలకొ ల్పాలని 2022లో తాము ఇచ్చిన ఉత్తర్వులో సుప్రీంకోర్టు బుధవారం మార్పులు చేసింది.
→ఈ మార్పులు చేయకపోతే ఇ.ఎస్. జడ్. లలో నివసి స్తున్న లక్షల మంది ప్రజలు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటారన్న కేంద్ర ప్రభుత్వ వాదాన్ని పుర స్కరించుకొని సుప్రీంకోర్టు ఈ చర్య తీసుకుంది.
→జాతీయ ఉద్యానాలు, వన్యమృగ అభయారణ్యాల లోపల, వాటి చుట్టూ కిలోమీటరు పరిధిలో గనుల తవ్వకం వన్యజీవులకు చేటు తెస్తుంది కాబట్టి, దాన్ని నిషేధిస్తున్నామని 2022 జూన్ 3న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
→దీన్ని సవరిస్తూ.. వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న లేదా ఉమ్మడి సరిహద్దులు కలిగిన జాతీయ ఉద్యానాలు, వన్యమృగ అభయారణ్యాలకు తన ఉత్తర్వు వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది.
→జాతీయ ఉద్యానాలు, వన్యమృగ అభయారణ్యాల ఇ.ఎస్.జడ్.లపై కేంద్ర పర్యావరణశాఖ జారీచేసిన ముసాయిదా, అంతిమ నోటిఫికేషన్లకు కూడా 2022 నాటి ఉత్తర్వు వర్తించదని తెలిపింది.
→కేంద్ర, రాష్ట్రాలు ఇ.ఎస్. జడ్. లలో, రక్షిత స్థలాల వెలుపల వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమ తులు ఇచ్చేటప్పుడు నిరుడు పర్యావరణశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.
→ఇ. ఎస్. జడ్ లలో శాశ్వత కట్టడాలను నిర్మించకూడదనీ, ఒకవేళ ఇ.ఎస్. జడ్. పరిధి కిలో మీటరు కన్నా ఎక్కువగా ఉన్నా వాటికీ అదే ఉత్తర్వు వర్తిస్తుందని తెలిపింది.
→రాజస్థాన్లోని జమువా రాంగఢ్ వన్యమృగ అభయారణ్య ఇ.ఎస్.జడ్. పరిధిని 500 మీట ర్లుగా సుప్రీంకోర్టు నిర్ణయించింది.
→1995లో దాఖ లైన ప్రజాహిత వ్యాజ్యం లేవనెత్తిన రెండు అంశాల్లో ఒకటి జమునా రాంగఢ్ అభయా రణ్యం లోపల, వెలుపల గనుల తవ్వకానికి సంబంధించినది.
→ రెండో అంశం- ఇతర జాతీయ ఉద్యానాల చుట్టూ ఇ.ఎస్. జడ్. పరిధికి సంబం ధించినది.
→ ఇ.ఎస్. జడ్ లలో నిర్మించిన కట్టడాల జాబితాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అటవీ సంరక్షణాధికారులు మూడు నెలల్లో తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వందితరావు, రామ్మోహన్రావులకు యుధ్ వీర్ పురస్కారం

→రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్కు చెందిన వందిత రావు, రామ్మోహన్రావులకు ప్రతిష్ఠాత్మక 30వ యుధీవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డును ప్రకటించారు.
→1996 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ, నాణ్య మైన విద్య అందించేందుకు హైదరాబాద్కు చెందిన ఈ ఫౌండేషన్ అంకితభావంతో కృషి చేస్తోందని అవార్డుకు ఎంపిక చేసినట్లు యుధ్ వీర్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
→ అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అంద జేయనున్నారు.
→ 1992 నుంచి ఏటా ఈ పురస్కారాలను అందజేస్తున్నారు.

ప్రవాసాంధ్ర మహిళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

→ ఉన్నత విద్యలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకుగాను ప్రవా సాంధ్ర మహిళ నీలి బెండపూడి అమెరికాలో ప్రతిష్ఠాత్మక 'ఇమ్మిగ్రెంట్ అఛీవ్ మెంట్ అవార్డు'కు ఎంపికయ్యారు.
→ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన ఆమె.. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేశారు.
→ 1986లో అమెరికాకు చేరుకొని.. కన్సాస్ విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్లో డాక్టరేట్ పట్టా సాధించారు.
→ పలు కీలక హోదాల్లో పనిచేసి.. గతేడాది పెన్సిల్వే నియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
→ ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి అధ్యక్షురాలిగా ఎన్ని కైన తొలి మహిళ ఆమే.
→ గత 30 ఏళ్లలో ఉన్నత విద్యలో విద్యార్థులు విజయం సాధించడానికి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభివృద్ధి చెందడానికి అవస రమైన నైపుణ్యాలను పెంపొందించడానికి నీలి బెండపూడి కృషి చేశారని అమె రికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు జెరెమీ రాబిన్స్ పేర్కొన్నారు.
→ ఈ నెల 28న ఆమె 'ఇమ్మిగ్రెంట్ అఛీవ్మెంట్ అవార్డు' అందుకోనున్నారు.

భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ

→ చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగు తున్న నేపథ్యంలో భారత్, చైనా రక్షణ శాఖ మంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది.
→ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు రానున్న చైనా రక్ష ణశాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ూ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కాను న్నారు.
→ ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపను న్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
→ లీ షాంగ్ర్పూ భారత పర్యటనను చైనా ధ్రువీకరించింది.
→ 2020 నాటి గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రక్షణమంత్రి భారత్ను సందర్శించడం, ఇరు పక్షాల నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.
→ ఏప్రిల్ 27, 28 తేదీల్లో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది.
→ భారత్, చైనాలతోపాటు రష్యా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి.
→ పరిశీలక దేశాలుగా బెలారస్, ఇరాన్ ప్రతినిధులు సైతం హాజరవుతారు. పాక్ రక్షణ మంత్రి వీసీ ద్వారా హాజరుకానున్నట్లు విశ్వసనీయ సమా చారం.
→ ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, అఫ్గానిస్థాన్ పరిస్థి తుల వంటి అంశాలపై చర్చించనున్నారు.

తూర్పు లద్దాఖ్ వివాదానికి సత్వర పరిష్కారం!

→తూర్పు లద్దాబ్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలను వేగంగా పరిష్కరించుకునేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి.
→ఈ మేరకు ఇటీవలి సైనిక చర్చల్లో అంగీకారం కుదిరినట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
→సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పరిరక్షించాలని కూడా నిర్ణయించి నట్లు తెలిపింది.
→రెండు దేశాల సైనిక చర్చలు ఈ నెల 23న తూర్పు లద్దాల్లోని చుషుల్-మోల్డో ప్రాంతంలో జరిగాయి.

చందమామపై కూలిన జపాన్ వ్యోమనౌక!

→ చంద్రుడిపై ల్యాండర్ను దించేందుకు జపా న్కు చెందిన ప్రైవేటు సంస్థ ఐస్పేస్ మంగళవారం చేసిన ప్రయత్నం విఫలమైనట్లు భావిస్తున్నారు.
→ జాబి లిపై ఆ వ్యోమనౌక కాలుమోపడానికి కొద్ది క్షణాల ఆ ముందు దానితో భూకేంద్రానికి సంబంధాలు తెగిపో యాయి.
→ ఆ సమయంలో అది చంద్రుడి ఉపరితలానికి 10 మీటర్ల ఎత్తులో ఉంది. ఏం జరిగిందో తేల్చేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నారు. అది కూలిపోయి ఉంటుం దని భావిస్తున్నారు.
→ ఒకవేళ ఈ ల్యాండింగ్ విజయవం తమైతే.. చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేటు కంపెనీగా ఐస్పేస్ చరిత్ర సృష్టిస్తుంది.
→ ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన ప్రభు త్వరంగ అంతరిక్ష సంస్థలు మాత్రమే జాబిల్లిపై ల్యాండ ర్ల ను దించాయి.

బెంగళూరులో 'జీరో షాడో డే'

→బెంగళూరులో కొద్దిసేపు నీడ కనిపించలేదు.
→మధ్యాహ్నం 12.18 గంటల నుంచి 3 నిమిషాల పాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన నీడ కొన్ని క్షణాలపాటు కనిపించకుండా పోయింది.
→నెహ్రూ నక్షత్రశాలతో పాటు కళాశాలలు, కూడళ్ల వద్ద విద్యార్థులు నీడ మాయమయ్యే క్రమాన్ని పరిశీలిం చారు.
→'జీరో షాడో డే'గా పిలిచే అరుదైన ఘటన ఆగస్టు 18న మరోసారి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
→'కర్కాటక మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతా ల్లోనే ఇది కనిపిస్తుంది. సూర్యకిరణాలు వస్తువుపై నిటారుగా పడటం వల్ల నీడ ఏర్పడదు' అని వివరించారు.

సూడాన్ నుంచి భారతీయులు తిరుగుపయనం

→ అంతర్యుద్ధంతో అట్టుడుకు తున్న సూడాన్ నుంచి భారతీయుల తొలి బృందం బయలు దేరిందని భారతీయ నౌకాదళ వర్గాలు తెలిపాయి.
→ అక్కడి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం 'ఆపరేషన్ కావేరి' పేరిట బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
→ తొలి విడతగా 278 మంది భారతీ యులు సూడాన్లోని జెడ్డా పోర్టు నుంచి ఐఎన్ఎస్ సుమేధ నౌకలో బయ లుదేరారు.
→ నౌక డెక్ పైకి ఎక్కిన భారతీయులంతా జై భారత్ అంటూ నినా దాలు చేశారని నేవీ వర్గాలు వెల్లడించాయి.

చంద్రుడిపై కూలిన జపాన్ మూన్ ల్యాండర్

→ చివరి క్షణాల్లో విఫలమైన 'హకుటో-ఆర్' ల్యాండర్
→ చందమామపైకి మూన్ ల్యాండర్ ను పంపేందుకు టోక్యో (జపాన్)కు చెందిన 'ఐస్పేస్' అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల కంపెనీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
→ ఆ సంస్థ అభివృద్ధి చేసిన 'హకుటో-ఆర్ ల్యాండర్.. చంద్రుడిపై దిగడానికి కొద్ది క్షణాల ముందు దానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి.
→ బహుశా ఆ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
→ ఐస్పేస్ సంస్థ తమ ల్యాండర్ను ఈలన్ మస్క క్కు చెందిన 'స్పేస్ ఎక్స్' రాకెట్ ద్వారా డిసెంబరులో చంద్రుడిపైకి పంపింది.
→ దాదాపు ఆరడుగుల ఎత్తు, 340 కిలోల బరువు ఉండే 'హకుటో-ఆర్.. చంద్రుడిపై పరిశోధనలు చేసే 'రషీద్ అనే రో వర్ను, బేస్ బాల్ పరిమాణంలో ఉండే ఒక రోబోను పంపారు.
→ వాటిలో రషీద్ రోవర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందింది. కాగా.. 2019 లో మన ఇస్రో పంపిన విక్రమ్, ఇజ్రాయెల్కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ పంపిన ల్యాండర్ కూడా ఇలాగే చివరి క్షణాల్లో విఫలమయ్యాయి.
→ అన్నట్టు అంటే.. జపాన్ భాషలో 'కుందేలు' అని అర్థం. చందమామపై కుందేలు కథలు మనకు న్నట్టే జపానావాళ్లకీ ఉన్నాయి.
→ అందుకే ఐస్పేస్ కంపెనీ తమ ల్యాండరు ఆ పేరు పెట్టింది.

నాస్కామ్ చైర్ పర్సన్గా అనంత్ మహేశ్వరి

→ ఐటీ పరిశ్రమ అత్యు న్నత సంఘమైన నాస్కామ్ చైర్ పర్సన్ 2023-24 సంవత్సరా నికి అనంత్ మహేశ్వరి ఎంపి కయ్యారు.
→ మహేశ్వరి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేస్తు న్నారు. అంతేకాదు నాస్కామ్ వైస్ చైర్మన్ గానూ ఇప్పటి వరకు సేవలు అందించారు.
→ టీసీఎస్ బిజి నెస్, టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్ అయిన కృష్ణన్ రామానుజం ఇప్పటి వరకు నాస్కామ్ చైర్ పర్స న్గా సేవలు అందించగా, ఆయన స్థానంలో అనం త్ మహేశ్వరి పని చేయనున్నారు.
→ కాగ్నిజంట్ ఇం డియా చైర్మన్, ఎండీగా ఉన్న రాజేష్ నంబియార్ను నాస్కామ్ వైస్ చైర్మన్గా నియమించారు.

దీపికా మిశ్రకు వాయుసేన శౌర్య అవార్డు

→ మధ్యప్రదేశ్ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్య అవార్డు అందుకున్నారు.
→ ఈ అవార్డు అందుకొన్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. రాజస్థాన్కు చెందిన దీపిక హెలికాఫ్టర్ పైలట్గా భారత వాయుసే నలో పనిచేస్తున్నారు.
→ ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వి. ఆర్. చౌధరి చేతుల మీదుగా దీపిక వాయు సేన పతకం అందుకొ న్నారు.
→ స్థానిక ఎయిర్పోర్స్ ఆడిటోరి యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అధికారులకు పతకాలు ప్రదానం చేశారు.


స్టార్షిప్ ప్రయోగం విఫలం

→ స్పేస్ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్టార్షిప్ ప్రయోగ పరీక్ష విఫల మైంది.
→ అమెరికాలో గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్.. కేవలం 4 నిమిషాలకే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కూలిపోయింది. స్టార్షిప్ పొడవు 120 మీటర్లు. ఇందులో 33 ఇంజిన్లు ఉంటాయి.
→ ప్రపంచంలో కెల్లా అతి పెద్ద రాకెట్గా ఇది పేరు గాంచింది. తొలి ప్రయోగ పరీక్షలో భాగంగా ఈ రాకెట్ దక్షిణ టెక్సాస్ లోని బొకా చికా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి ఎగిరింది.
→ భూ ఉపరితలం నుంచి 39 కిలో మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అప్ప టికే దానిలోని పలు ఇంజిన్లు పనిచేయడం మానే శాయి.
→ వ్యోమనౌక నుంచి బూస్టర్ విడిపోవాల్సి ఉన్నా.. అది కూడా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జరగలేదు. కొద్ది సేప టికే రాకెట్ కూలిపో యింది.
→చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్టార్ షిప్ ను స్పేస్ఎక్స్ రూపొందించింది. యోగ పరీక్ష మాత్రమే కావడంతో గురువారం ఈ రాకె ట్లో ఉపగ్రహాలను ఉంచలేదు.
→భూమి చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేసేలా దాని వ్యోమనౌ కను సిద్ధం చేశారు.
→ తాజా ప్రయోగ ఫలితాల నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి భవన్లో నెల్లుట్ల సర్పంచి స్వరూపారాణి ప్రసంగం

నీటి సమృ ద్ధిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారంలో జాతీయస్థాయి ప్రథమ అవార్డు అందుకున్న జనగామ జిల్లా లింగాలఘన పురం మండలం నెల్లుట్ల సర్పంచి చిట్ల స్వరూపా రాణి రాష్ట్రపతి భవన్లో ప్రసంగించారు.
గ్రామాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమకూరిన నిధులు, విరాళాల సేకరణ తదితరాలను వివరించిన తీరు ఆకట్టుకుంది.
"నా పేరు చిట్ల స్వరూ పారాణి. నేను నెల్లుట్ల సర్పంచిని. నీటి వృథాను తగ్గించడం, పునర్వినియోగిం చడం, రీఛార్జ్ చేయడం... అనే మూడు సూత్రాలే మా ఊరి ప్రగతి మంత్రం.
మా గ్రామంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ కుళాయిల ద్వారా నీటిని అంది స్తున్నాం. 'పల్లె ప్రగతి'లో భాగంగా 17 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటాం.
ఉపాధి హామీలో చేపట్టిన ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, ఫాంపాండ్లతో భూగర్భ జలమట్టం పెరిగింది. మురుగునీటి నిర్వహణకు 745 మ్యాజిక్, కమ్యూనిటీ సోఫ్ఫెట్లు నిర్మించాం.
వాననీటి సంరక్షణకూ ఏర్పాటు చేసుకున్నాం. మురుగు కాల్వల చివర్లో ఇంకుడు గుంతలను నిర్మించి దోమల బెడదను, కాలా నుగుణ వ్యాధుల వ్యాప్తిని తగ్గించాం.
ప్రతి శుక్రవారం తాగునీటి ట్యాంకుల పరి శుభ్రత, క్లోరినేషన్లతోపాటు నాణ్యత పరీక్షలను చేస్తున్నాం. వీటన్నింటి నిర్వ హణకు ప్రజలకు చైతన్యం చేశాం.
ఈ కార్యక్రమాలే నీటి సమృద్ధిని సాధించ డానికి దోహదపడ్డాయి. మా పంచాయతీని జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిపాయి' అని స్వరూపారాణి వివరించారు.

మనసు, శరీరాల బంధం నిజమే శాస్త్రీయంగా నిరూపించిన శాస్త్రవేత్తలు

మనసు, శరీరాల మధ్య బంధం నిజమేనని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు.
మెదడులో శారీరక చలనాన్ని నియంత్రించే భాగాలకు గ్రహణ, జ్ఞాన కేంద్రాలతో సంబంధం ఉందని వారు కనుగొన్నారు.
చాలా మంది ఆదుర్దా తగ్గించుకోవడానికి అటూఇటూ పచార్లు చేయడా కారణమిదే. వ్యాయామం చేసే వారికి జీవితం మీద సానుకూల దృక్పథం ఏర్పడటానికీ ఇదే మూలం.
మెదడులో శారీ రక చలనాన్ని నియంత్రించే భాగాలు అసంకల్పిత చర్య లైన రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్నీ నియంత్రిస్తాయి.
బ్రిటన్ లో 50,000 మంది మెద ళ్లను స్కాన్ చేసి, పరిశీలించి తమ అధ్యయనాన్ని శాస్త్రవే త్తలు నిగ్గు తేల్చారు.
మెదడులో శారీరక కదలికలను నియంత్రించే భాగాలతోపాటు మనసుకే పరిమితమైన భాగాలూ ఉన్నాయి.
అవి ఆలోచన, కార్యాచరణ పథక రచన, రక్తపోటు, గుండె వేగాల వంటి వాటిని నియంత్రి స్తాయి.
అయితే వ్యక్తి లేచి కదలాలని ఆలోచించగానే ఈ మనో నియంత్రణ కేంద్రాలూ కార్యశీలమవుతాయి. తమ అధ్యయనాన్ని నేచర్ పత్రికలో శాస్త్రవేత్తలు ప్రచురించారు.

భారత్ లో వ్యాక్సిన్కు దూరంగా 27 లక్షల మంది చిన్నారులు

ప్రపంచంలో సాధారణ వ్యాక్సిన్ పొందని 27 లక్షల మంది చిన్నారులకు భారతదేశం నిలయంగా మారిందని యునిసెఫ్ ప్రకటించింది.
కరోనా-19 తరు వాత వ్యాక్సిన్ల ప్రాముఖ్యతపై అవగాహన స్థిరపడిన లేదా మెరుగుపడిన 55 దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉండటంపై యుని సెఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇలా వ్యాక్సి పొందని చిన్నారుల్లో సగం మంది 11 రాష్ట్రాల్లోని 143 జిల్లాల్లో ఉన్నారని యునిసెఫ్ వైద్య నిపుణుడు వివేక్ వీరేంద్ర సింగ్ వెల్లడించారు.
ఇటువంటి చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందని దాంతో వారు భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారన్నారు.
అదే ఆఫ్రికాలో 2019-2021 మధ్య కాలంలో కోటి 27 లక్షల మంది చిన్నారులు ఇదే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపింది.

మన్కీ బాత్కు 'వంద'నం

ప్రధాని మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించే ప్రసంగించే మన్కీ బాత్ ఈ నెల 30వ నాటికి 100వ ఎపిసోడు చేరుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 ప్రత్యేక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నాణెంపై ఒక వైపు అశోక స్థూపం, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. మరో వైపు 'మన్కి బాత్ 100' అని ఉంటుంది.

22 సంవత్సరాల వయసులో నైనా జైస్వాల్ పీహెచ్ డీ పూర్తి

అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీరన్ను విజయవా డలోని రాజ్భవన్లో కలిశారు.
22 సంవత్సరాల వయసులో రాజమహేంద్ర వరంలోని నన్నయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ పూర్తి చేసినందుకు ఆమెను గవర్నర్ అభినందించారు. పీహెచ్ పట్టా అందజేశారు.
ఈ సంద ర్భంగా నైనా మాట్లాడుతూ భారతదేశంలో అతిచిన్న వయసులో డాక్టరేట్ పొందిన మొదటి అమ్మాయిని కావడం ఆనందంగా ఉందన్నారు.

2025 కల్లా కర్బన తటస్థంగా 121 విమానాశ్రయాలు: సింధియా

ప్రస్తుతం దేశంలో 25 విమానాశ్రయాలు 100% స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగి స్తున్నాయని, 2025 కల్లా మరో 121 విమానాశ్రయాలను కర్బన తటస్థంగా మారుస్తా మని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ఐరోపా సమాఖ్య- భారత్ విమానయాన సదస్సు సందర్భంగా, దృశ్య- మాధ్యమ పద్ధతిలో మంత్రి ప్రసం గించారు.
సింధియాకు కొవిడ్-19 సోకడంతో.. ఆయన ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకాలేదు. విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల స్థితిపై తీవ్రంగా దృష్టి సిన సారించాం.
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టామ'ని మంత్రి తెలిపారు. '2024 కల్లా 100% స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించాల్సిందిగా విమానా శ్రయాలను మేం ప్రోత్సహిస్తున్నాం.
2030 కల్లా కర్బన తటస్థాన్ని సాధించాలి. లేదా.. విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) నేతృత్వంలోని విమానాశ్రయాలు ఇప్ప మొత్తాన్ని మంది టికే 100 శాతం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయి.
మరో 121 విమానాశ్ర యాలు ఈ దిశగా అడుగులు వేయించాలన్నది మా లక్ష్యమ'ని చెప్పారు.

ధ్రువాల్లో ద్రవీభవిస్తున్న మంచుతో ఉపద్రవం

ఉత్తర, దక్షిణ ధ్రువాలతోపాటు లో మంచు వేగంగా కరిగిపోతోంది.
గ్రీన్ లాండ్ 1992-2020 మధ్య కాలంలో ధ్రువాల్లోని మంచు పలకలు 7,56,000 టన్నుల మంచును కోల్పోయా యని 65 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది.
ఈ మంచును ఒక్కచోట కుప్పగా పోస్తే 20 కిలోమీటర్ల ఎత్తయిన మంచు కొండ ఏర్పడుతుంది.
ఉత్తర ధ్రువంలోని ఆర్కి టిక్ మహా సముద్రంలో ప్రచండమైన ఎండలు కాయడంతో గ్రీన్ లాండ్ లో మంచు కరిగిపో తోంది.
గ్రీన్లాండ్ మంచు మరీ ఎక్కువగా ద్రవీ కరించి సముద్రం పాలవుతోందని 50 ఉపగ్రహాల ద్వారా చేసిన పరిశీలన నిర్ధారించింది.
ఇదంతా మానవ కార్యకలాపాలవల్ల సంభవిస్తున్న ఉపద్ర వమే. ప్రపంచంలో 99 శాతం మంచి నీరు గ్రీన్ లాండ్, అంటార్కిటికాలలో మంచు రూపంలో పోగుపడి ఉంది.
1992 నుంచి ఈ మంచు కరు గుతున్నందున 8.3 లక్షల కోట్ల టన్నుల మంచి నీరు ఉప్పు సముద్రాల పాలైంది.
ఈ నీటిని అమెరికా పరిస్తే 33.6 అంగుళాల ఎత్తున దేశ మంతటా అలుముకుంటుంది. ఇదే నీరు ఫ్రాన్స్ ను 49 అడుగుల లోతులో ముంచేస్తుంది.

సృజనాత్మకతను వెలికితీసేలా 'టీ-ఇన్నొవేషన్ మహోత్సవ్'

ప్రపంచ సృజనాత్మకత, నవ కల్పనల దినోత్సవం (వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నొవే షన్ డే) సందర్భంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలు, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ ఇన్నొవేషన్ సెల్ (టీఎస్ఐసీ) టీ-ఇన్నొవేషన్ మహోత్సవ్ను నిర్వహించింది.
పంచాయతీరాజ్ శాఖ సహకారంతో 33 జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో 'అవర్ ఫర్ ఇన్నొవేషన్' పేరిట వెబినార్ నిర్వహిం చింది.
ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలతో అంద రికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల గురించి తెలియజేయ డంతో పాటు గ్రామాల్లో సమస్యలను ఏవిధంగా పరిష్క రించాలన్న విషయమై అందరికీ వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆవిష్కరణ కర్తలను ప్రోత్సహిస్తా మని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలి పారు.
ప్రజలు.. సమస్యలకు పరిష్కారాలు వెతికేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీఎస్ఐసీ సీఈవో శాంత తౌటం తెలిపారు.
విద్యార్థులకు నవకల్పనల ప్రాధా న్యాన్ని వివరిస్తూ యూతాబ్ (వై-హబ్), ఇంక్విలాబ్ ఫౌండేషన్తో కలిసి టీఎస్ ఐసీ వెబ్నర్ నిర్వహించింది.
ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించింది. 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

అత్యంత ప్రతికూల వాతావరణ ఏడాది.. 2022

2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది.
యూఎన్ నేతృత్వంలో స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమెట్ 2022' నివేదికను శుక్ర వారం విడుదల చేసింది.
లానినా పరిస్థితులున్నప్పటికీ ఇది 'అయిదో లేదా ఆరో" వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిందని తెలిపింది. 2015 నుంచి ఎనిమిదేళ్లు అత్యంత వెచ్చగా ఉన్నాయి.
గతేడాది తీవ్ర వరదలు, రికార్డు స్థాయి వేడి గాలులు, కరవు పరిస్థితుల కార ణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందని తెలి పింది.
2022 ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందు (1850-1900) సరా సరి కంటే 1.15 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని వెల్లడించింది.
అలాగే సముద్ర జలాల వేడి, ఆమ్లత్వ స్థాయిలు రికార్డు స్థాయిలో పెరిగాయి.. అంటార్కిటిక్ సముద్ర మంచు, యూరోపియన్ ఆల్ప్స్ హిమానీనా: చాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
వాతావరణంలోని మూడు ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ 2021లో రికార్డు స్థాయిని తాకడం ఈ ప్రతికూల పరి స్థితులకు కారణమని పేర్కొంది.

ఆహార ఉత్పత్తుల తగ్గుదల :-
2022 వేసవిలో భారత్, పాకిస్థాన్లో అత్యధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయని.. పాకిస్థాన్లో మార్చి, ఏప్రి ల్లో లో రికార్డుస్థాయి ఎండలున్నాయని డబ్ల్యూఎంవో తెలిపింది.
ఈ రెండు నెలలు జాతీయ సగటు ఉష్ణో గ్రతలు.. దీర్ఘకాలిక సగటు కంటే నాలుగు డిగ్రీల టాలాస్ హెచ్చరించారు.
సెల్సియస్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. భార క్లో విపరీతమైన వేడిమి కారణంగా ధాన్యం దిగుబ డులు తగ్గిపోగా, ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో అనేక చోట్ల కార్చిచ్చులు రేగాయని పేర్కొంది.
ఈ తరహా ప్రతికూల వాతావరణం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతోందని.. అందువల్ల భారత్లో గోదు మలు, వరి ఎగుమతులపై ఆంక్షలు విధించారని గుర్తుచేసింది.
భారత్లో వరదల వల్ల సుమారు 700 మంది మృత్యువాత పడగా, మరో 300 మంది పిడు గుల బారినపడి మృతి చెందారని డబ్ల్యూఎంవో తెలి పింది.
పాకిస్థాన్లోనూ ఇదే విధంగా నష్టం వాటిల్లిం దని పేర్కొంది. బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, న్యూజి లాండ్ దేశాల్లో 2022లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నివేదిక గుర్తుచేసింది.
తూర్పు ఆఫ్రి కాలో కరవు పరిస్థితులు, చైనా, యూరప్ ల్లో వేడి గాలుల తీవ్రత వల్ల అనేకమంది ప్రజలు కష్టాలు పడ్డా రని వివరించింది.

పొట్టి చేతుల మనిషి

• ఇరాన్వాసి ప్రపంచ రికార్డు టెహ్రాన్: పురుషుల్లో అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా ఇరాన్కు చెందిన అఫ్ఘాన్ గదేర్దే తాజాగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన వయసు 20 ఏళ్లు.
అఫ్ఘాన్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అతడి ఎడమ చేయి 6.7 సెంటీ మీటర్లు, కుడి చేయి 6.4 సెంటీమీటర్ల మేర పొడవును కలిగి ఉన్నారు.
సగటు పురుషుడితో పోలిస్తే ఇతడి చేతులు దాదాపు మూడోవంతు కురచగా ఉన్నాయి.

అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు

అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్స్ దక్కింది. హెల్త్ ద్వారా న్నందుకు ఈ ఘనత దక్కింది.
'హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్' విభాగంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ప్రథమ, ఏపీలోని అనకాపల్లి జిల్లా రెండో బహుమతి పొందాయి.
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకా పల్లి జిల్లా వైద్యఆరోగ్య సిబ్బంది అక్కడున్న 576 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించారు.
గ్రామస్థాయిలో 105 రకాల మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సేవలకు గుర్తింపుగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన 'సివిల్ సర్వీసెస్ డే' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లా కలె క్టర్ రవి పత్తశెట్టికి అవార్డు అందజేశారు.

అప్రెంటీస్లు అత్యధిక నియామకాలు హైదరాబాద్

ఐటీ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్లోని సంస్థలు అప్రెంటీస్ల నియామకంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.
ఐటీ సంస్థలు కేంద్రీకృతమైన దిల్లీ, బెంగళూరుల్లోనూ ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయని టీమ్జ్ అప్రెంటిస్ షిప్ నివేదిక వెల్లడించింది.
జనవరి- మార్చి మధ్య అప్రెంటీస్ నియామకంపై ఈ నివేదికను విడుదల చేసింది.
14 నగరాలు, 24 రంగాల్లోని 597 సంస్థలను ఈ సర్వేలో భాగస్వామ్యం చేసినట్లు టీమ్జ్ వెల్లడించింది.
హైదరాబాద్ లో నికర అప్రెంటీస్ షిప్ ఔట్లుక్ (ఎన్ఏఓ) 78 శాతంగా ఉంది. ఢిల్లీలో ఇది 74%, బెంగళూరులో 68%.
* భవిష్యత్తులో అప్రెంటీస్లను పెంచుకోవాలని భావిస్తున్న సంస్థలు హైద రాబాద్లో 83% కాగా, ఢిల్లీలో 82 శాతం, బెంగళూరులో 80 శాతం సంస్థలు అప్రెంటీస్లను పెంచుకునే లక్ష్యంతో ఉన్నాయి.
చెన్నైలో 81%, ముంబయిలో 77% సంస్థలు ఈ నియామకాల గురించి ఆలోచిస్తున్నాయి.
+ 2022 ద్వితీయార్ధంలో 77% సంస్థలు అప్రెంటీస్లను నియమించుకోగా, ఈ ఏడాది జనవరి-మార్చిలో 79 శాతానికి పెరిగింది.
* నియామకాలు చేపట్టే విషయంలో కోయంబత్తూర్, నాగ్పూర్, పుణె, అహ్మదాబాద్ నగరాల్లోని సంస్థలూ ఆశాజనకంగానే ఉన్నాయి.
* ఇంజినీరింగ్ పరిశ్రమల్లో ఎన్ఎఓ 90% కాగా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 88%, బ్యాంకింగ్-ఆర్థిక సేవలు-బీమా రంగంలో 74% ఉంది.
హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలు ఐటీ, టెక్ పరిశ్రమలకు కేంద్రాలుగా ఉండటం వల్ల అప్రెంటీస్ లకు మెరుగైన అవకాశాలు లభిస్తు న్నాయని టీమ్జ్ డిగ్రీ అప్రెంటీస్ షిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ తెలిపారు.
స్థానికంగా జీవనోపాధి మెరుగుపర్చడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, నైపుణ్యాలను పెంచడం లాంటివి అప్రెంటీస్ షిప్ నే సాధ్యమ వుతాయని పేర్కొన్నారు.
ఒక సంస్థ తన మానవ వనరుల్లో 2.5- 15% లీజ్ డిగ్రీ వరకు అప్రెంటీస్ లను నియమించుకోవాల్సి ఉంటుందని టీమ్ అప్రెంటీస్ షిప్ బిజినెస్ హెడ్ ద్రితి ప్రసన్న మహంత తెలిపారు.

పీఎస్ఎల్వీ-సి55 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో) శనివారం చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సి55 ప్రయోగం విజయవంతమైంది.
సింగపూర్కు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవే శపెట్టింది.
ఏపీలోని తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్ఎల్వీ | శ్రేణిలో 57వది అయిన ఈ వాహకనౌక తేలికపాటి రకం.
ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదే రిన 19 నిమిషాల తర్వాత 596 కి. మీ. ఎత్తున నిర్దే శిత కక్ష్యలో మొదటి 741 కిలోల బరువున్న టెలి యోస్-2 ను, తర్వాత 50 సెకన్లకు 16 కిలోల బరువున్న లూమ్ లైట్-4ను ప్రవేశపెట్టింది.
పర్యవేక్షించడం, ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం వీటి లక్ష్యం.
ప్రయోగం అనంతరం ఇస్రో అధిపతి డా. సోమనాథ్ మీడి యాతో మాట్లాడుతూ... పీఎస్ఎల్వీ ఎగువదశలో ఏడు పేలోడ్లు అమర్చామని, పీఎస్ 4లో సౌర నిరంతరం ప్యానెల్ అమర్చడం ఇదే మొదటిసారి అన్నారు.
యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ సంచాలకులు డా. శంకరన్ మాట్లాడుతూ పీఎస్ సాయంతో శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నట్లు చెప్పారు.

ప్రపంచ ఏఐ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా కేటీఆర్

మంత్రి కె. తారక రామారా వుకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమా నికి ఆహ్వానం అందింది.
దుబాయ్ లో జరిగే ప్రపంచ న్స్ (ఏఐ) ప్రదర్శన ప్రారం భోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు.
జూన్ 7, 8 తేదీల్లో ఈ ప్రదర్శన దుబాయ్ జుమేరా ఎమిరేట్స్ టవర్లో జరుగుతుంది.
'మీ సారథ్యంలో తెలం గాణ ఐటీ, దాని అనుబంధ రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించింది.
మీలాంటి నాయకులు పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుంది.
దుబాయ్ లో ఉన్న ప్రవాస భార తీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది" అని నిర్వాహకులు మంత్రికి పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్యం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.
ఏఐ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవా లను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శి స్తారు.
ఈ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

సముద్రం నుంచి బీఎండీ క్షిపణి పరీక్ష విజయవంతం

సముద్రతలం నుంచి తొలిసారిగా ఇంటర్ సె ప్టర్ క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహిం చింది.
ఇది శత్రు దేశాల అణు క్షిపణులు, యుద్ధవిమా నాలను భూవాతావరణంలో (ఎండో అట్మాస్ఫియరిక్) కూల్చేయగలదు. ఒడిశా తీరానికి చేరువలో బంగాళా ఖాతం నుంచి ఈ పరీక్ష జరిగింది.
తద్వారా నౌకాదళ క్షిపణి రక్షణ వ్యవస్థ (బీఎండీ) కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. నేల నుంచి ప్రయోగించే బీఎండీ వ్యవస్థను మన దేశం ఇప్పటికే దిగ్విజయంగా పరీక్షించింది.
తాజా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో), నౌకాదళం, ప్రైవేటు పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
అత్యంత సంక్లిష్ట మైన, నెట్వర్క్ ఆధారిత బాలిస్టిక్ క్షిపణి నిరోధక వ్యవస్థ విషయంలో భారత్ స్వయంసమృద్ధి సాధించిం దన్నారు.
భూవాతావరణానికి వెలుపల (ఎక్సో అట్మాస్పి యరిక్) కూడా శత్రు క్షిపణులను కూల్చేయగల అస్త్రా లను భారత్ అభివృద్ధి చేస్తోంది.
పుడమి చుట్టూ 100 కిలోమీటర్ల వరకూ వాతావరణం ఆవరించి ఉంటుంది.

మరణించిన పక్షులతో డ్రోన్లు!

వాషింగ్టన్: మృత పక్షుల (టాక్సిడెర్మీ)ను డ్రోన్లుగా మార్చే ప్రక్రియ గురించి అమెరికాలో విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు.
సాధారణ డ్రోన్లకు హెలికా స్టర్ తరహాలో అమర్చిన రెక్కలు తిరుగుతూ ఉంటాయి. కానీ, తాజాగా పరిశోధకులు రూపొందిస్తున్న డ్రోన్లకు పక్షిలాంటి రెక్కలు ఉంటాయి.
వాటిని అల్లా. ర్చుతూనే ఈ డ్రోన్ ఎగరాల్సి ఉంటుంది. సజీవ పక్షి తన రెక్కల సహాయంతో సులభంగా గాల్లో ప్రయాణి స్తుంది. అదే విధానంలో డ్రోన్ను ఎగరేయడం అసాధ్యం.
అమెరికాలోని 'న్యూ మెక్సికో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ టెక్నాలజీ'లో కొందరు పరిశోధకులు బృందంగా ఏర్పడి ఇందుకోసం నిరంతరం శ్రమిస్తు న్నారు.
చనిపోయిన పక్షులను డ్రోన్లుగా మారిస్తే అది విమానాల అధ్యయనానికీ ఉపకరిస్తుందని వారు చెబు తున్నారు. దీనివల్ల ఎంతో శక్తిని, ఇంధనాన్ని ఆదా చేయవచ్చని భావిస్తున్నారు.
వీరు తొలుత కృత్రిమ, యాంత్రికంగా తయారు చేసిన పక్షులతో పరిశోధన చేశారు. అవి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో నిజమైన పక్షుల శరీరాలపై దృష్టిపెట్టారు.
ఈ ఆలోచన ఫలిస్తుం దని వారు ధీమాగా ఉన్నారు. టాక్సిడెర్మీ పక్షులను శాస్త్ర వేత్తలు పంజరంలో ఉంచారు. రెక్కలు కొట్టుకునే తీరు,ఎగిరే ఎత్తు, వేగం అన్నింటినీ అక్కడ రికార్డు చేస్తు న్నారు. పక్షి డ్రోన్ రంగులు, ఎగిరే సామర్థ్యంపై కూడా పరిశోధన సాగిస్తున్నారు.
పక్షుల రంగులు వాటి సహ చరులను ఆకర్షించడానికి, శత్రువుల నుంచి తప్పించుకో వడానికి ఉపయోగపడతాయన్న అభిప్రాయం ఉంది అయితే విహంగాలు ఎగిరే సామర్థ్యంలో రంగుల పాత్రే ఎంత వరకు ఉంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు అడ యనం చేస్తున్నారు.
ప్రస్తుతం టాక్సిడెర్మీ నమూనా పక్షులు 20 నిమిషాలు ఎగురుతున్నాయి.

జీ-20 సదస్సులో పాల్గొననున్న అమెరికా అధినేత

అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ భారత పర్య టనకు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా జరిగే జీ-20 శిఖ రాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు.
బైడె ప్రభుత్వంలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవ హారాల ప్రతినిధి డొనాల్డ్ లూ ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్, అమెరికాల బంధానికి 2023 గొప్ప ఏడాది కానుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబరులో భారత్లో పర్యటించేందుకు అధ్యక్షుడు బైడెన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారని చెప్పారు.
"ఇది చాలా గొప్ప ఏడాది. ఈ సంవత్సరం.. అమెరికా అపె క్కు, జపాన్ జీ-7కు, భారత్ జీ-20కి నాయకత్వం వహిస్తున్నాయి. క్వాడ్ కూటమి సభ్య దేశాలు నాయకత్వ పాత్ర చేపట్టడం హర్షణీయం.
ఇది క్వాడ్ కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక, జీ-20కి భారత్ నాయకత్వం వహించడం ప్రపంచ శ్రేయస్సుకు మరింత శక్తిని స్తుంది" అని డొనాల్డ్ లూ పేర్కొన్నారు.

కేరళ కలల ప్రాజెక్టు.. కొచ్చిన్ వాటర్ మెట్రో

దేశంలో తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొచ్చిన్ వాటర్ మెట్రో సర్వీస్ పేరుతో కేరళ ప్రభుత్వం ఈ రవాణా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తోంది.
ప్రధాని మోదీ ఏప్రిల్ 25న ఈ వాటర్ మెట్రోను జాతికి అంకితం చేయనున్నారు. దక్షి ణాసియాలో తొలి వాటర్ మెట్రో ఇదేనని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
కొచ్చిన్ మెట్రో రైల్ లిమిటెడ్ దీని నిర్వహణ బాధ్యత లను చూస్తుంది. ఈ మెట్రో సర్వీస్ బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఉంటాయి.
వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కొచ్చిన్ చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలు పుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది.
1,136.83 కోట్ల వ్యయంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్ డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టాయి. ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం ఉంటాయి.
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 15 నుంచి 22 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

మానవరహిత జలాంతర్గామితో చైనాకు కళ్లెం!

పక్కలో బల్లెంలా తయారైన చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ అధునాతన ఆయుధాల తయారీ, నూతన రక్షణ మార్గాలపై దృష్టి సారించింది.
అందులో భాగంగా మానవర హిత జలాంతర్గామి నిర్మాణం చేపట్టింది. ఇది చైనా దాడుల నుంచి తైవాన్ ను కాపాడగలదని నిపుణులు అంటున్నారు.
ఈ నెల 5న తైవాన్ అధ్యక్షురాలు త్సాయి-ఇంగ్ వెన్ కాలిఫోర్నియాలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్తో భేటీకి ప్రతీ కారచర్యగా చైనా భారీ సైనిక విన్యాసాలు చేప ట్టింది.
తైవాన్ పాలకులు, వారి విదేశీ మద్దతు దారులకు తీవ్ర హెచ్చరిక చేసేందుకే ఈ చర్య చేపట్టినట్లు డ్రాగన్ స్పష్టంచేసింది.
భవిష్యత్తులో చైనా నుంచి తీవ్ర సంఘర్షణ ఎదురుకావొచ్చని గ్రహించిన తైవాన్.. నూతన ఆయుధాల తయారీ, కొత్త రక్షణ మార్గాలను అన్వేషిస్తోంది.
ఇందులో భాగంగా థండర్ టైగర్ గ్రూప్.. మాన వరహిత జలాంతర్గామిని తయారుచేస్తోంది. దీనికి 'సీ వుల్ఫ్-400' అని నామకరణం చేశారు.
దశాబ్దం క్రితం నుంచే దీని అభివృద్ధికి వనరుల సమీకరణలో థండర్ టైగర్ సంస్థ నిమగ్న మైంది. పౌరుల వినియోగానికీ ఉపయోగపడేలా దీన్ని సిద్ధం చేస్తోంది.
ఈ జలాంతర్గామి తయా రీకి తైవాన్ ప్రభుత్వంతోపాటు భావసారూప్యం కలిగిన దేశాలు సాయం అందిస్తున్నాయి.

దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం

భారతదేశంలోనే అతి పెద్ద అక్వేరియాన్ని హైద రాబాద్ ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న కొత్వాల్ గూడలో నిర్మిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

ఐఐటీలో డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీ లోని డీఆర్డీఓ రీసెర్చ్ సెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సును ఇటీవల ప్రారంభించారు.
ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక ప్రధాన ముందడుగుగా ప్రముఖులు అభివర్ణిం చారు.

జ్వాలలను శోధించే మల్టీస్పెక్ట్రల్ కెమెరా

అమెరికా, స్వీడన్ శాస్త్రవేత్తలతో కలిసి భారత పరిశోధకులు ఒక వినూత్న కెమెరాను అభివృద్ధి చేశారు.
మంటల్లో నాలుగు రకాల రసాయనాల జాడకు సంబంధించిన మల్టీస్పెక్ట్రల్ చిత్రాలను ఇది అందిస్తుంది. డీఎస్ఎస్ఆర్ కెమెరా సాయంతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు.
గతంలో ఇలాంటి అంశాల చిత్రీకరణకు నాలుగు కెమెరాలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అవసరమయ్యేది. ఇండోర్లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు.
ఇంద నాల ప్రజ్వలన గురించి శోధించడానికి ఇది ఉప యోగపడుతుంది. తద్వారా కంబషన్ ఇంజన్లను మెరుగుపరుచొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతి మంగా దీని ద్వారా హానికర ఉద్గారాలను తగ్గించొ చ్చని వివరించారు. ఇంధనాన్నీ పొదుపుగా వాడ టానికి వీలు కల్పిస్తుందన్నారు.
పారిశ్రామిక దహన యంత్రాలు, వాహనాలు, విమానాలు, వ్యోమనౌ కల ఇంజిన్ల నుంచి వెలువడే మూలకాలపై పరిశోధ నలు సాగించొచ్చని పేర్కొన్నారు.
ఈ సాధనానికి 'సీఎల్ - ఫ్లేమ్' అని పేరు పెట్టారు.

నావిగేషన్ సేవలకు దేశీయ చిప్

పాఠశాల బస్సుల వంటి వాహనాలతోపాటు ఆయుధ వ్యవస్థల కదలికలనూ పక్కాగా తెలుసుకు నేందుకు వీలు కల్పించే సరికొత్త దేశీయ చిపన్ను బెంగళూరుకు చెందిన ఎలీనా జీయో సిస్టమ్స్ అనే అంతరిక్ష సాంకేతిక కంపెనీ ఆవిష్కరించింది.
భార తీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాయంతో ఇది పనిచేయగలదు. పౌర, రక్షణ రంగాల్లో ఇది అత్యం త ప్రయోజనకరంగా మారే అవకాశాలున్నాయి.
నావిక్' పేరుతో పిలుస్తున్న ఈ చిప్ పొడవు కేవలం 12 నానోమీటర్లు, మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి వేరబుల్ డివైజ్లలోనైనా దాన్ని వినియో చొచ్చు.

రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు

భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరం లో సుమారు రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2021-22 సంవత్సరం కంటే ఇది 25 శాతం ఎక్కువ అని రైల్వేశాఖ వెల్లడించింది.
మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో సరకు రవా ణా ద్వారా రూ.1.62 లక్షల కోట్ల ఆదాయం వచ్చిం దని, అది క్రితం సంవత్సరం కంటే 15శాతం అధిక మని పేర్కొంది.
ప్రయాణికుల నుంచి రూ.63 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది. ఇందులో 61శాతం వృద్ధి నమోదైందని, గతంలో ఎన్నడూ ఇంత భారీస్థాయి వృద్ధి కనిపించలేదని తెలిపింది.
నిర్వహణ వ్యయ నిష్పత్తి (ఆపరేటింగ్ రేషియో) 8. నమోదైందని, సవరించిన అంచ నాలకు లోబడే ఉందని రైల్వేశాఖ తెలిపింది.

సంతన్ సే సమృద్ధి

18 ఏప్రిల్ 2023న కేంద్ర మంత్రి గిరిరాజ్ సిం గ్... 'సంగతన్ సే సమృద్ధి' అనే ప్రచారాన్ని ప్రారం భించారు. ఇది తీసుకురావడం ద్వారా అట్టడుగున ఉన్న గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తుం ది.
అర్హులైన గ్రామీణ మహిళలందరూ స్వయం సహాయక బృందాల్లోకి ప్రవేశం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ఎలక్ట్రిక్ జిప్సీ

ఇండియన్ ఆర్మీ సెల్ కొత్తగా ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది.
ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్ పోల్ ఈవీ స్టార్టప్లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్ జిప్సీ వాహ

గురుడి గుట్టు విప్పనున్న జ్యూస్

గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చం దమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ).. 'జ్యూస్' అనే వ్యోమనౌకను ప్రయోగించింది.
దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియాన్ రాకెట్ ద్వారా ఇది నిం లోకి పయనమైంది. గురు గ్రహాన్ని చేరుకోవడా నికి ఈ వ్యోమనౌకకు 8 ఏళ్లు పడుతుంది. అక్కడికి చేరాక ఇది ఆ గ్రహం గురించి నిశితంగా శోధిస్తుం. ది. గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, లిస్ట్లో, గానీ మీడ్ చందమామల పైనా పరిశోధనలు సాగించ నుంది. హిమమయంగా ఉండే వీటి ఉపరితలాల కింద సముద్రాలు ఉండొచ్చని, జీవుల మనుగ డకూ అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ యాత్రలో జ్యూస్.. గానీమీడ్ చుట్టూ పరిభ్రమిస్తుం ది. మరో గ్రహానికి చెందిన చందమామ చుట్టూ ఒక వ్యోమనౌక తిరగడం అదే మొదటిసారి.

ప్రపంచంలోనే అత్యధిక జనసంఖ్య కలిగిన దేశంగా భారత్

జనాభా విషయంలో కొన్ని దశాబ్దాలుగా రెండో స్థానంలో ఉన్న భారతదేశం మొదటి స్థానంలో ఉన్న చైనాను దాటేసింది.
'ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) తాజా గణాం కాల ప్రకారం- 142.86 కోట్ల జనాభాతో ప్రపంచం లోనే అత్యధిక జనసంఖ్య కలిగిన దేశంగా అవత రించింది.
నిజానికి జనసంఖ్యలో భారత్.. చైనాను అధిగమించిందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించింది. తాజాగా.. ఐక్య రాజ్యసమితి విభాగమైన యూఎన్ఎఫ్పీఏ ఈ గణాంకాలను అధికారికంగా వెల్లడించింది.

అగ్నిపర్వత ఉద్గారాల పర్యవేక్షణకు సరికొత్త కెమెరా

అగ్నిపర్వతాలకు సంబంధించిన ఉద్గారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఓ సరి కొత్త కెమెరాను బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యా లయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్వో2) వాయువును గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది.
ఎస్ 2 స్థాయిలను నిర్ధా రించు కోవడం ద్వారా అగ్నిపర్వతాల లోపలి భాగంలో ఎలాంటి ప్రక్రియలు చోటుచేసుకుంటు న్నాయో పసిగట్టొచ్చు.

మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా

ఫెమినా మిస్ ఇండియా-2023 కిరీటాన్ని రాజ స్థాన్లోని కోటాకు చెందిన 19 ఏళ్ల అందాల రాశి నందిని గుప్తా కైవసం చేసుకొన్నది. ఈ నెల 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అట్టహాసంగా జరి గిన ఫైనల్స్లో ఢిల్లీ సుందరి శ్రేయ పూంజా మొదటి రన్నరప్ గా, మణిపూ ర్కు చెందిన అందాల భామ తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ రెం డో రన్నరప్ గా నిలిచారు.

సూడాన్ లోని భారతీయుల తరలింపునకు ఆపరేషన్ కావేరి

హింసాత్మక ఘటనలతో అట్టుడుకు తున్న సూడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు 'ఆపరేషన్ కావేరి'ని చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
సూడాన్ ఓడ రేవుకు 500 మంది వరకు భారతీయులు చేరు కున్నారని, మరింతమంది అక్కడకు వస్తున్నా రని ట్వీట్ చేశారు.
నౌకలు, విమానాలను అక్క డకు ఇప్పటికే పంపించిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారికి అన్నివిధాలా సాయపడేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
సూడాన్ నుంచి ప్రజల తరలింపులో భాగంగా 28 దేశాలకు చెందిన 388 మందిని ఆదివారం రాత్రి తమ దేశానికి తీసుకువెళ్లినట్లు ఫ్రాన్స్ తెలిపింది.
వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. స్నేహపూర్వక దేశాలకు చెందిన 66 మందిని తమ దేశానికి తీసుకువెళ్లినట్లు సౌదీ అరేబియా తెలిపింది.
వీరిలో ముగ్గురు భారతీయ విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
సూడాన్ నుంచి తమ ప్రజల్ని, దౌత్యవేత్తల్ని తీసుకువెళ్లేందుకు ప్రపంచదేశాల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
వీరంతా వెళ్లి పోతే దేశంపై ఆధిపత్యం కోసం పోరు మరింత తీవ్రతరం అవుతుందని సూడాన్వాసులు భయప డుతున్నారు.
తమ పౌరులను తరలించేందుకు ఫ్రాన్స్, జోర్డాన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, గ్రీస్, జపాన్, బ్రిటన్ వంటి అనేక దేశాలకు చెందిన విమానాలు సూడాన్కు పెద్దఎత్తున చేరుకున్నాయి.

'కేశవానంద భారతి' 1 తీర్పునకు 50 ఏళ్లు

రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్ల మెంటుకు ఉన్న విస్తృత అధికారాలను కత్తిరిస్తూ, అదే సమయంలో ఎలాంటి సవరణనైనా సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు కట్టబె డుతూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంపై 1973లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక "కేశ వానంద భారతి తీర్పునకు 50 ఏళ్లు పూర్త య్యాయి.
దీంతో దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక్క సారిగా మళ్లీ వెలుగులోకి వచ్చింది.
"కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో ఏప్రిల్ 24, 1973న అసాధా రణ రీతిలో 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 7.6 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
ఈ తీర్పునకు 50 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో వాదనలు ఇతర ప్రతులతోపాటు, కోర్టు తీర్పుతో ప్రత్యేక వెబ్ పేజీని రూపొందించింది.
"యావత్ ప్రపంచ పరిశోధకులు చూసేందుకు వీలుగా 'కేశవానంద భారతి' కేసుకు సంబంధించి ఉన్న లిఖిత పూర్వక దస్త్రాలతో పాటు అన్ని వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ పేజీని ఏర్పాటు చేశాం.
50 ఏళ్ల క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 24, 1973) దీనికి సంబంధించిన తుది తీర్పు వెలువడింది" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
దీంతో కోర్టు హాలులో ఉన్న న్యాయ వాదులు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధకులు, విద్యార్ధులు, న్యాయ వాదులకు ఇది ఎంతగానో దోహ దపడుతుందన్నారు.
అసలేమిటీ కేసు?:- కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి సుప్రీంకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో భాగంగా పార్లమెంటు చేసిన 24, 25. 20వ రాజ్యాంగ సవరణల చెల్లుబాటును ఆయన సవాలు చేశారు.
ఈ సవరణలు న్యాయవ్యవస్థ అధికారాలతోపాటు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నా యని పేర్కొన్నారు.
September 31న ప్రారంభ మైన వాదనలు 1973 మార్చి 23న ముగిశాయి. ఒక కేసు విచారణ కోసం 13 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో అదే తొలిసారి.
రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు, మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు ఉందా? లేదా? అన్న ప్రశ్న విచారణ సందర్భంగా తెరమీదకు వచ్చింది.
68 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం. రాజ్యాంగం మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు. , అని 703 పేజీల తీర్పు వెలువరించింది.
రాజ్యాం గంలోని ఏ విషయంలోనైనా సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ.. మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కులను మార్చలేదని తెలిపింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం వాటి సంరక్షణ బాధ్యత చూస్తుందని స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, చట్టం ముందు అందరూ సమానం వంటి రాజ్యాంగ ప్రాధమిక సూత్రాల మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని దీనర్థం.
ఈ కేసులో ఏడుగురు న్యాయమూర్తులు మద్దతు పలికిన రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం.. ఆ తర్వాత కాలంలో అనేక రాజ్యాంగ సరవణలను కొట్టివేయడానికి వీలు కల్పించింది.
ఉన్నత న్యాయవ్యవ స్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన రాజ్యాంగ సవరణను, ఎన్ జేఏసీ చట్టం చెల్లుబాటు కాదంటూ కొట్టి వేయడం ఇందుకు తాజా ఉదాహరణ.
న్యాయవ్యవస్థ స్వతంత్రత రాజ్యాంగం మౌలిక స్వరూపంలో భాగమని, అందువల్ల దానిని సవ రించలేమని రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పేర్కొంటున్నారు.
'మౌలిక స్వరూపం' అనే దానిని సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులు సంద ర్భంగా విస్తరిస్తూ వస్తోంది.

సిడ్నీ మైదానంలోని గేటుకు సచిన్ పేరు

సచిన్ తెందుల్కర్ 50వ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమ వారం ప్రముఖ సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లోని ఓ గేటుకు అతని పేరు పెట్టారు.
భారత్ వెలుపల సచిన్కు అత్యంత ఇష్టమైన మైదానం ఆస్ట్రేలియాలోని ఎస్సీ జీనే. ఇక్కడ అయిదు టెస్టుల్లో 157 సగటుతో అతను 785 పరుగులు చేశాడు.
అందులో అత్యధిక స్కోరు 241 నాటౌట్ సహా మూడు శతకాలు న్నాయి.
మరోవైపు సిడ్నీలో 277 పరుగుల లారా ఇన్నింగ్స్కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరో గేటుకు ఈ వెస్టిండీస్ దిగ్గజం పేరు పెట్టారు.
దీంతో ఇప్పటికే అక్కడి గేట్లకు తమ పేర్లున్న బ్రాడ్మన్, అలన్ డేవిడ్సన్, ఆర్థర్ మోరిస్ సరసన వీళ్లు చేరారు.
ఎస్సీజీ ఛైర్మన్ రాడ్ మెక్ యాక్, సీఈవో కెర్రీ మాథర్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాకీ సమక్షంలో ఈ కొత్త గేట్లను ఆవిష్కరించారు.
ఈ సచిన్, లారా గేట్ల నుంచి పర్యాటక జట్టు క్రికె మైదానంలోకి ప్రవేశించనున్నారు. లారా, సచిన్ ఘనతలు, ఎస్సీజీలో వీళ్ల గణాంకాలతో కూడిన ఓ శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు.
"భారత్ వెలుపల నాకిష్టమైన మైదానం ఎస్సీజీనే. ఆస్ట్రేలియాలో నా తొలి పర్యటన (1991-92) నుంచి అక్కడ నాకు గొప్ప జ్ఞాపకాలు న్నాయి.
పర్యాటక క్రికెటర్లు మైదానంలోకి ప్రవేశించే గేట్లకు నాది, లారా పేరు పెట్టడం మాకు దక్కిన గౌరవం. ఎస్సీజీ, క్రికెట్ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు.
త్వరలోనే ఎస్సీజీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తా" అని సచిన్ తెలిపాడు.

జెమిని సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ కన్నుమూత

జెమిని సర్కస్ సంస్థ వ్యవస్థాపకుడు, భారత సర్కస్ దిగ్గజం జెమినీ శంక రన్(99) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా కన్నూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. జన్మించిన శంకరన్ ప్రఖ్యాత సర్కస్ కళాకారుడు కీలెరి కున్హికన్నన్ దగ్గర మూడేళ్లపాటు శిక్షణ పొందారు. తర్వాత అప్పటి సైన్యంలో చేరి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉద్యోగ విర మణ పొందారు. అనంతరం వివిధ సర్కస్ కంపెనీల్లో పనిచేశాక, 1951లో విజయ సర్కస్ ను కొనుగోలు చేసిన శంకరన్, దాని పేరును 'జెమిని'గా మార్చారు. తర్వాత జంబో సర్కస్ ను సైతం ప్రారంభించారు. సర్కసక్కు చేసిన సేవ లకు గాను శంకరన్ను కేంద్ర ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

ఒడిశా 2033 వరకు భారత హాకీ స్పాన్సర్

హాకీ మీద ఒడిషా ప్రభుత్వం మరోసారి తన ప్రేమను చాటుకుంది. భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్ను 2033 వరకు పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. గత కొన్నేళ్లుగా ఒడిశా భారత హాకీకి మంచి ప్రోత్సాహాన్నిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో హాకీ అంటే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆ రాష్ట్రమే. రాష్ట్రంలో హాకీ అభివృద్ధి కోసం అనేక వసతులు కల్పించిన ఒడిశా.. ప్రపంచకప్లతో పాటు మరికొన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చింది. ఒడిశా 2018 నుంచి భార హాకీ (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్) స్పాన్సర్గా ఉంటోంది.

'ఈ-శ్రమ్'కు సరికొత్త ఫీచర్లను జతచేసిన కేంద్రం

అసంఘటిత రంగంలోని కార్మికులకు లబ్ధి చేకూరేలా 'ఈ-శ్రమ్' పోర్టల్ కు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఫీచర్లను జత చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వాటిని సోమవారం లాంఛనంగా ప్రారం భించారు. తాజా ఫీచర్లతో పోర్టల్ వినియోగం మరింత సులువవుతుందని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. అసంఘటిత రంగంలోని కార్మికుల రిజిస్ట్రే షన్ ప్రక్రియ ఇంకా సులభతరమవుతుందని తెలిపింది. వలస కార్మికుల కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు కూడా అవి దోహదపడ తాయని వెల్లడించింది. ఫలితంగా వారికి విద్య, సంక్షేమ పథకాల ప్రయోజ నాలను మెరుగ్గా అందజేయవచ్చని పేర్కొంది. ఈ శ్రమ్ లో నమోదు చేసు కున్న కార్మికులు ఉపాధి అవకాశాలు, పింఛను పథకం, నైపుణ్యాల పెంపు సంబంధిత కార్యక్రమాలతో ఇకపై మెరుగ్గా అనుసంధానమయ్యేందుకు వీలు కలుగుతుందని వివరించింది. భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డులతో కార్మికుల వివరాలను పంచుకునేందుకూ ఓ ఫీచర్ను అందుబాటు లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ-శ్రమ్ డేటాను పంచుకునేందుకు డేటా షేరింగ్ పోర్టల్ (డీఎస్పీ)'ని కూడా భూపేం దర్ యాదవ్ తాజాగా ప్రారంభించారు.

మనీ బాత్ శ్రోతలు 23 కోట్లు

ప్రధాని నరేంద్రమోదీ ప్రతినెలా చివరి ఆదివారం 'మన్కో బాత్' పేరుతో నిర్వహించే కార్యక్రమానికి శ్రోతలు 23 కోట్ల మంది ఉన్నారని, వారిలో 65% మంది హిందీలో వింటున్నారని రోహతక్ లోని 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అధ్యయనంలో వెల్లడైంది. 44.7% మంది దీనిని టీవీ ఛానళ్లలో వింటున్నారు. వచ్చే ఆదివారంతో ఈ కార్యక్రమం 100 నెలలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైనా ఈ కార్య క్రమాన్ని విన్నారని, 41 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని ఐఐఎం రోహ్ తక్ డైరెక్టర్ ధీరజ్ పి శర్మ సోమవారం విలేకరులకు తెలిపారు. 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ వంటి 11 విదేశీ భాషల్లోనూ కార్యక్రమం ప్రసారమవుతోందని ప్రసారభారతి సీఈవో గౌరవ్ ద్వివేది తెలిపారు. దాదాపు 10వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పనితీరు, దేశ పురోగతిపై వీరిలో 73% మంది ఆశాభావంతో ఉన్నారు. ప్రభు త్వంపై విశ్వాసం పెరిగిందని 59 % మంది చెప్పారు. శాస్త్రసాంకేతిక రంగంలో దేశ పురోగతి, సామాన్య పౌరుల విజయాలు, సైనిక బలగాల శౌర్యం వంటి అంశాలపై సాగిన కార్యక్రమాలు బాగా ఆదరణ పొందాయని తేలింది.

శతాబ్దాంతానికి 100కోట్ల లోపే చైనా జనాభా: ఐరాస

ఈ శతాబ్దాంతానికి చైనా జనాభా 100 కోట్ల కంటే తక్కువకు పడిపోతుందని, భారత్ జనాభా కొన్ని దశాబ్దాలపాటు పెరుగుతూనే ఉంటుందని ఐక్యరాజ్య సమితి సోమవారం వెల్లడిం చింది. ఈ నెలాఖరు నుంచి అధికారికంగా భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని పేర్కొంది. చైనా అధికారికంగా ఆ హోదాను కోల్పో నుందని వివరించింది. ఐక్యరాజ్య సమితి జనాభా డాష్ బోర్డు భారతన్ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిన వారం తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ ప్రకటన విడుదల చేసింది. 2050 నాటికి భారత్లో వృద్ధుల సంఖ్య రెట్టింపు అవుతుందని, చైనాలోనూ ఆ స్థాయిలోనే పెరుగుతుందని వెల్లడించింది.

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఏప్రిల్ 22న చేపట్టిన ఇస్రో యొక్క పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంను ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) చెప్పట్టింది. ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సింగపూర్‌కు చెందిన అగిల్ స్పేస్ యొక్క టెలీయోస్-2 మరియు లుమెలైట్-4 అనే రెండు భూ పరిశీలన ఉపగ్రహను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది పీఎస్‌ఎల్‌వీ యొక్క 57వ ప్రయోగం, అలానే పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ కాన్ఫిగరేషన్ (PSLV-CA) వేరియంట్ యొక్క 16వ మిషన్.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) భారతదేశం యొక్క మూడవ తరంకు చెందిన ఉపగ్రహ ప్రయోగ వాహనం. అక్టోబర్ 1994లో మొదటి విజయవంతమైన ప్రయోగం తర్వాత, పీఎస్‌ఎల్‌వీ భారతదేశం యొక్క విశ్వసనీయ మరియు బహుముఖ ప్రయోగ వాహనంగా ఉద్భవించింది. పీఎస్‌ఎల్‌వీ లిక్విడ్ మరియు సాలిడ్ ఇందనలతో 4 దశలలో ప్రయోగించబడుతుంది.

మొదటి దశ ఘన ఇంధనంతో ఆరు స్ట్రాప్-ఆన్ సాలిడ్ రాకెట్ బూస్టర్‌లను చుట్టి ఉంటుంది. రెండవ దశ ద్రవ ఇంధనంతో ఉంటుంది, అయితే మూడవ దశలో ఘన ఇంధనంతో కూడిన రాకెట్ మోటారు ఉంటుంది. నాల్గవ దశలో లాంచర్ బాహ్య అంతరిక్షంలో బూస్ట్ చేయడానికి ద్రవ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగిస్తుంది.

గ్యాలంట్రీ అవార్డు అందుకున్న మొదటి ఐఎఎఫ్ మహిళా అధికారిగా దీపికా మిశ్రా

వింగ్ కమాండర్ దీపికా మిశ్రా, భారత వైమానిక దళంలో గ్యాలంట్రీ అవార్డును అందుకున్న మొదటి మహిళా అధికారిగా అవతరించారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఆమెకు ఈ వాయు సేవా పతకాన్ని ప్రకటించారు. ఆ అవార్డును భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఆమెకు అందజేశారు. 2021 ఆగస్టులో ఉత్తర మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక వరదల సమయంలో వింగ్ కమాండర్ దీపికా మిశ్రా చేసిన మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలకు ఈ గౌరవం లభించింది. ఆ సమయంలో ఆమె దాదాపు 47 మంది ప్రాణాలను కాపాడారు.

జు-జిట్సు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సబ్‌కత్ మాలిక్

కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలోని విజ్జారా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బాలిక సబ్‌కత్ మాలిక్ ఈ ఏడాది మంగోలియాలో జరగనున్న జు-జిట్సు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక అయ్యింది. దీనితో మార్షల్ ఆర్ట్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి కాశ్మీరీ మహిళగా అవతరించనున్నారు. సబ్‌కత్ మాలిక్ ఇదివరకు నేషనల్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో 9 సార్లు పాల్గొనగా 6 సార్లు గోల్డ్ మెడల్ మరియు 3 సార్లు సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.

ఢిల్లీలో ఈయూ-ఇండియా ఏవియేషన్ సమ్మిట్ 2023

యూరోపియన్ కమిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏప్రిల్ 20-21 తేదీలలో ఈయూ-ఇండియా ఏవియేషన్ సమ్మిట్‌ను ఢిల్లీలో నిర్వహించాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య మరియు యూరోపియన్ కమిషనర్‌ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ శ్రీమతి ఆదినా వాలియన్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇండియా-ఈయూ దేశాల మధ్య కోవిడ్ అనంతర ఎయిర్ ట్రాఫిక్ పునరుద్ధరణ, వైమానిక రంగంలో సుస్థిరత & భద్రత, మానవ రహిత విమాన వ్యవస్థల అభివృద్ధి మరియు ఇరు ప్రాంతాల పరస్పర భాగస్వామ్య సవాళ్లు మరియు అవకాశాలపై దృష్టి సారించారు.

అలానే ఈ సమ్మిట్ సందర్భంగా యూరోకంట్రోల్‌తో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఇంటెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేసింది. అదే సమయంలో ఇరు ప్రాంతాల సన్నిహిత సహకారం మరో ఇంటెంట్ మెమోరాండం లెటర్‌పై కూడా యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంతకం చేసింది.

వ్యవసాయ భూవివాదాల పరిష్కారం కోసం మహారాష్ట్రలో సలోఖ యోజన పథకం

మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూవివాదాల పరిష్కారం కోసం కొత్తగా సలోఖ యోజన పథకంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులు నామమాత్రపు రిజిస్ట్రేషన్ రుసుము 1,000/- మరియు స్టాంప్ డ్యూటీ 1,000/- చెల్లించి తమ భూములను ఇతర రైతులతో మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది, వ్యవసాయేతర, నివాస మరియు వాణిజ్య భూములకు వర్తించదు. ఈ పథకం భూ వివాదాలను పరిష్కరించడంలో పాటుగా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడంలో రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్ మొదటి స్టార్‌షిప్ రాకెట్ టెస్ట్ ప్రయోగం విఫలం

స్పేస్‌ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణంతో విఫలమైంది. ఏప్రిల్ 20, 2023న టెక్సాస్‌లోని బోకా చికాలోని స్టార్‌బేస్ నుండి ప్రయోగించిన ఈ రాకెట్, పైకి ఎగిరిన కొద్దీ సమయంలోనే పేలుడు సంభవించి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో నేలకూలింది. ఇది స్పేస్‌ఎక్స్ ఇప్పటివరకు నిర్మించబడిన అత్యంత శక్తివంతమైన రాకెట్ వాహనంగా పరిగణించబడింది. ఈ ప్రయోగం వాహనంకి సంబంధించి ఇది మొదటి టెస్ట్ ఫ్లైట్‌గా గుర్తించబడింది.

స్టార్‌షిప్ అనేది ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న సూపర్ హెవీ-లిఫ్ట్ స్పేస్ లాంచ్ వెహికల్. ఇది 120 మీటర్ల ఎత్తుతో 5,000 మెట్రిక్ టన్నుల లిఫ్ట్‌ఆఫ్ చేసే సామర్థ్యం కలిగిఉంది. ఈ వాహక నౌకలో 33 సూపర్ హెవీ ఇంజిన్లు అమర్చబడి ఉంటాయి. స్టార్‌షిప్ ఇప్పటివరకు ఎగురవేయబడిన అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనంగా ఉండనుంది. అదే సమయంలో ఇది పూర్తి పునర్వినియోగపరచడానికి ఉద్దేశించినది. దీనిని మానవసహిత అంతరిక్ష పర్యటనల కోసం స్పేస్‌ఎక్స్ రూపొందిస్తుంది.

అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌కు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఉక్రేనియన్‌లో మారియుపోల్ ఆసుపత్రి దాడికి సంబంధించిన అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ తీసిన చిత్రానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ చిత్రం మార్చి 9, 2022లో మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై రష్యా యొక్క క్రూరమైన దాడి తర్వాత ప్రాణాంతకంగా గాయపడిన ఒక మహిళను రెస్క్యూ చేసిన సంధర్బంలోనిది.

ఈ చిత్రంలోని ఇరినా కాలినినా అనే 32 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ, నిర్జీవమైన శరీరానికి జన్మనిచ్చిన అరగంట తర్వాత ఆమె గాయాలతో మరణించింది. ఈ చిత్రాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ అయినా ఎవ్జెనీ మలోలెట్కా తన కెమెరాలో బంధించారు. ఈ దాడిలో 600 మంది పౌరులు మృతి చెందారు.

గ్రీస్ బహుపాక్షిక-వ్యాయామంలో పాల్గొన్న భారత వైమానిక దళం

భారత వైమానిక దళం ఏప్రిల్ 24 నుండి మే 4 మధ్య గ్రీస్‌లో జరిగే మెగా బహుపాక్షిక వ్యాయామం 'ఇనియోచోస్-2023 ఎక్సర్‌సైజ్‌' యందు పాల్గొంది. ఈ వ్యాయామం గ్రీసులో ఆండ్రావిడ వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భారత వైమానిక దళానికి చెందిన నాలుగు సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, రెండు బోయింగ్ C-17 ఫైటర్ ఫ్లయిట్స్ పాల్గొన్నాయి.

దీనితో పాటుగా ఏప్రిల్ 17 నుండి మే 05 మధ్య ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ యొక్క వైమానిక దళ స్థావరం అయిన మోంట్-డి-మార్సన్‌లో నిర్వహిస్తున్న ఓరియన్ వ్యాయామంలో కూడా భారత వైమానిక దళం భాగస్వామ్యం అయ్యింది. ఈ వ్యాయామంలో ఇండియాతో పాటుగా జర్మనీ, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వైమానిక దళాలు కూడా పాల్గొన్నాయి.

హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2023లో భారత్‌కు మూడో స్థానం

హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం 68 యునికార్న్‌లతో 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా దేశాలు టాప్ రెండు స్థానాలలో ఉన్నాయి. భారతదేశం మొత్తం 138 యునికార్న్‌లను కలిగి ఉన్నప్పటికీ ఇందులో కేవలం 68 మాత్రమే భారతదేశంలోనే ఉన్నాయని వెల్లడించింది. మిగతా 70 భారతీయ సహ వ్యవస్థాపకులచే స్థాపించబడినవి వీటి ప్రధాన కార్యాలయాలు భారతదేశం వెలుపల ఉన్నాయని నివేదించింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన నాన్-స్టేట్-నియంత్రిత వ్యాపారాల జాబితా అయిన హురున్ గ్లోబల్ 500 కంపెనీల ర్యాంకింగులో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. అలానే యునికార్న్ పెట్టుబడిదారుల పరంగా సీక్వోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ మరియు సాఫ్ట్‌బ్యాంక్ వరుసగా 238, 179 మరియు 168 యునికార్న్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.

అస్సాం, అరుణాచల్ సరిహద్దుల పరిష్కార ఒప్పందంపై సంతకాలు

అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తమ 50 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏప్రిల్ 20వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రామాలకు సంబంధించిన వివాదానికి ముగింపు పలకనుంది.

1971 యొక్క ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్ వేరుపడింది. 1972లో అరుణాచల్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. ఈ సమయంలో అనేక ఆదివాసీ గ్రామాలు, వ్యవసాయ మైదానాలు అస్సాంలో కలపబడ్డాయి. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న దాదాపు 700 కిలోమీటర్ల సరిహద్దు వెంబడీ ఉంది. 2018 నుండి ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం బిఆర్‌యు, బోడో, కర్బీ ఆంగ్లోంగ్ మరియు గిరిజన శాంతి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకం చేయిస్తూ వస్తుంది.

ఛత్తీస్‌గఢ్ పంచాయితీలకు ఫెస్టివల్ గ్రాంట్స్

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పంచాయితీల పరిధిలో స్థానిక పండుగలను జరుపుకోవడానికి గ్రాంట్లు అందించే పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 6,000 నాన్-షెడ్యూల్డ్ పంచాయితీల కోసం 'ముఖ్యమంత్రి ఛత్తీస్‌గఢి పరబ్ సమ్మాన్ నిధి యోజన' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద స్థానిక పండుగలను జరుపుకోవడానికి, ప్రతి గ్రామ పంచాయతీకి రెండు విడతలుగా రూ. 10,000 మొత్తం ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక పండుగలు, సంస్కృతి మరియు గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను పరిరక్షించే మరియు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

కర్ణాటక ఎన్నికలలో 'ఓట్ ఫ్రమ్ హోమ్' అవకాశం

భారత ఎన్నికల కమిషన్ మొదటిసారిగా ఇంటి నుండి ఓటు ఎంపికను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. పట్టణ ప్రాంతాల్లో పౌరుల ఎన్నికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎంపికను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఎంపిక ప్రస్తుతం వయస్సు కారణంగా (80 ఏళ్ళు మించి) లేదా అంగవైకల్యం కారణంగా పోలింగ్ బూత్‌ను సందర్శించలేని వారి కోసం మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ఆప్షన్ పొందేందుకు ఓటర్లు 12డి ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న ఓటర్ల ఓటును నమోదు చేసేందుకు ఎన్నికల తేదికి 4 రోజుల ముందుగానే అధికారులు వారి ఇళ్లను సందర్శిస్తారు. ఈ గ్రూపులో స్థానిక ప్రిసైడింగ్ అధికారి, బూత్ స్థాయి అధికారి, పోలీసు సిబ్బంది మరియు వీడియోగ్రాఫర్ ఉంటారు. సంబంధిత అధికారి ఓటరుకు బ్యాలెట్ పేపర్‌తో కూడిన కవరు అందించి గోప్యత విధానంలో తిరిగి దానిని స్వీకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడుతుంది.

సినర్జీ గ్రూపుకు ప్రతిష్టాత్మక ట్యాంకర్ ఆపరేటర్ అవార్డు

ప్రముఖ షిప్పింగ్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సినర్జీ గ్రూప్, గ్లోబల్ ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌లో లీడర్‌షిప్ రోల్‌కి గాను ప్రతిష్టాత్మక గ్రీన్4సి ట్యాంకర్ ఆపరేటర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును ఏప్రిల్ 20 న ఏథెన్స్‌లో జరిగిన హైబ్రిడ్ ఈవెంట్‌లో సొంతం చేసుకున్నారు. సినర్జీ గ్రూప్‌ను 2006లో కేరళకు చెందిన కెప్టెన్ రాజేష్ ఉన్ని స్థాపించారు.

ప్రస్తుతం ఈ గ్రూపు ఇది 13 దేశాలలో 22 కార్యాలయాల నుండి పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 21,000 మందికి పైగా నావిక సిబ్బందిని కలిగి ఉంది. 560 కంటే ఎక్కువ నౌకల యొక్క సాంకేతిక నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మెర్స్క్ ట్యాంకర్ల తయారీలో నిమగ్నమయ్యి ఉంది.

ఏంజెలా మెర్కెల్‌కు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం

జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆ దేశ అత్యున్నత గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ ఆమెకు అందజేశారు. ఏంజెలా మెర్కెల్ దాదాపు 16 సంవత్సరాలకు పైగా ఆ దేశానికి ఛాన్సలర్‌గా పనిచేశారు. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో మరియు 2015 శరణార్థుల సంక్షోభంతో సహా అనేక క్లిష్ట సమయాల్లో జర్మనీని విజయవంతంగా నడిపించిన మెర్కెల్‌ అపూర్వమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు.

ఆశా భోంస్లేకు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించబడ్డారు. గత ఏడాది ఫిబ్రవరి మరణించిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఆమె కుటుంబం మరియు ట్రస్ట్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును ఏప్రిల్ 24న వారి తండ్రి మరియు ప్రముఖ థియేటర్-సంగీత కళాకారుడు దీనానాథ్ మంగేష్కర్ స్మారక దినం నాడు అందుకున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం దేశం మరియు సమాజం కోసం మార్గనిర్దేశం చేసిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. గత ఏడాది ప్రారంభించిన ఈ అవార్డు తోలి గ్రహీతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు.

బ్యాంకాక్‌లో 8వ భారత్-థాయ్‌లాండ్ డిఫెన్స్ డైలాగ్

8వ ఇండియా-థాయ్‌లాండ్ డిఫెన్స్ డైలాగ్ బ్యాంకాక్‌లో ఏప్రిల్ 20న నిర్వహించబడింది. థాయిలాండ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు. గత దశాబ్ద కాలంగా భారతదేశం & థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య నెలకొన్న రక్షణ సహకార అంశాలను సమీక్షించడంతో పాటుగా ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు.

ఏపీలో 27 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు అందించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 9 అంశాల యందు ఉత్తమ పనితీరు కనబర్చిన మూడేసి పంచాయితీలకు అవార్డులు అందించారు.

గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంధర్బంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందిస్తుంది.

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 9 విభాగాల్లో అవార్డులు అందుకోగా, ఏపీ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా లభించలేదు. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉత్తమ పంచాయితీలను ఎంపిక చేసి అవార్డులు అందించింది.

అవార్డు థీమ్ పంచాయతీ జిల్లా
పేదరిక నిర్మూలన - ఉపాధి అవకాశాలు కల్పన గంగిరెడ్డిపల్లి
రాచర్ల
మల్లూరు
వైఎస్ఆర్ జిల్లా
ప్రకాశం జిల్లా
నెల్లూరు జిల్లా
హెల్దీ పంచాయతీ తరువ
భీమవరం
నడింపాలెం
అనకాపల్లి జిల్లా
అల్లూరి సీతారామరాజు
గుంటూరు
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ కసిపాడు
నేలమూరు
కుంతముక్కల
పల్నాడు జిల్లా
పశ్చిమ గోదావరి
ఎన్టీఆర్ జిల్లా
వాటర్ సఫిషియెంట్ పంచాయతీ ఇల్లూరు కొత్తపేట
వి.వి కండ్రిక
ధూపాడు
నంద్యాల
అన్నమయ్య
ఎన్టీఆర్ జిల్లా
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ కడలూరు
బిళ్ళనందూరు
జోగింపేట
తిరుపతి
కాకినాడ
మన్యం
సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ నందిగాం
కట్టకిందపల్లి
సూరప్పగూడెం
శ్రీకాకుళం
అనంతపురం
ఏలూరు
సోషియాల్లీ సెక్యూర్డ్ పంచాయతీ పశ్చిమ పెద్దవారిపాలెం
మందగేరి
రామభద్రాపురం
బాపట్ల
కర్నూలు
విజయనగరం
పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ సఖినేటిపల్లి లంక
నగరపాలెం
చోరగుడి
కోనసీమ
విశాఖపట్నం
కృష్ణ
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ మేడాపురం
జేగురుపాడు
మార్టూరు
శ్రీసత్యసాయి
తూర్పు గోదావరి
అనకాపల్లి

తెలంగాణకు 12 జాతీయ పంచాయతీ అవార్డులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏప్రిల్ 17న దేశ వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలకు జాతీయ పంచాయితీ అవార్డులను అందించారు. ఇదే వేదిక ద్వారా న్యూఢిల్లీలో పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. పంచాయితీల సమగ్ర అభివృద్ధికి పిలుపునిస్తూ, ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద నిర్దేశించబడిన తొమ్మిది ఇతివృత్తాల ఆధారంగా ఈ అవార్డులు అందించారు.

గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంధర్బంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 12 విభాగాల్లో అవార్డులు అందుకోగా, ఏపీ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా లభించలేదు. ఈ అవార్డులను నాలుగు కేటగిరిల వారీగా వివిధ థీమ్స్ ఆధారంగా చేసుకుని అందిస్తారు.

  1. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్
  2. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్
  3. గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్
  4. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌

దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరిలో మొత్తం 9 రకాల థీమ్ అవార్డులు ఉండగా అందులో 8 అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పంచాయితీలు సొంతం చేసుకున్నాయి.

అవార్డు థీమ్ పంచాయతీ (బ్లాక్) జిల్లా
పేదరికం లేని & మెరుగైన జీవనోపాధి పంచాయితీ మండొడ్డి (రాజోలి) జోగులాంబ గద్వాడ్
హెల్దీ పంచాయతీ గౌతంపూర్ (చుంచుపల్లి) భద్రాద్రి కొత్తగూడెం
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ - -
వాటర్ సఫిషియెంట్ పంచాయతీ నెల్లుట్ల (లింగాలఘనపూర్) జనగాం
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ సుల్తాన్‌పూర్ (ఎలిగైడ్) పెద్దపల్లి
సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల
సోషియాల్లీ సెక్యూర్డ్ పంచాయతీ కొంగట్‌పల్లి (హన్వాడ) మహబూబ్ నగర్
పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ చీమల్దారి (వికారాబాద్) మోమిన్‌పేట
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ ఐపూర్ (ఆత్మకూర్) సూర్యాపేట

నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగంలో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ ఉత్తమ బ్లాక్ పంచాయత్ అవార్డు చేజిక్కించుకుంది. అలానే తెలంగాణలోని ములుగు జిల్లా ఉత్తమ డిస్ట్రిక్ బ్లాక్ పంచాయత్ అవార్డు అందుకుంది.

గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కె) పంచాయతీ స్పెషల్ కేటగిరిలో అవార్డు పొందింది. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లాలోని కన్హా గ్రామ పంచాయితీ స్పెషల్ కేటగిరిలో అవార్డు పొందింది.

భారతీయ అమెరికన్‌ రాధా అయ్యంగార్‌కు కీలక పదవి!

అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ అమెరికన్‌ రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌ నియామకాన్ని అమెరికా సెనెట్‌ 68-30 ఓట్లతో ఆమోదించింది. రక్షణ శాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఈ పదవికి రాధా అయ్యంగార్‌ను అధ్యక్షుడు జో బైడెన్‌ 2022 జూన్‌లో నామినేట్‌ చేశారు. రక్షణ శాఖ ఉప మంత్రికి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్న రాధకు పదోన్నతి ఇచ్చారు. అంతకుముందు రాధా అయ్యంగార్‌ గూగుల్, ఫేస్‌బుక్‌లలో కీలక పదవులు నిర్వహించారు.

స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం

స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్‌ ప్రయోగ పరీక్ష విఫలమైంది. అమెరికాలో గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్‌ కేవలం 4 నిమిషాలకే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో కూలిపోయింది. స్టార్‌షిప్‌ పొడవు 120 మీటర్లు. ఇందులో 33 ఇంజిన్లు ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాకెట్‌గా ఇది పేరుగాంచింది. తొలి ప్రయోగ పరీక్షలో భాగంగా ఈ రాకెట్‌ దక్షిణ టెక్సాస్‌లోని బొకా చికా తీరం నుంచి నింగిలోకి ఎగిరింది. భూ ఉపరితలం నుంచి 39 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అప్పటికే దానిలోని పలు ఇంజిన్లు పనిచేయడం మానేశాయి. వ్యోమనౌక నుంచి బూస్టర్‌ విడిపోవాల్సి ఉన్నా అది కూడా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జరగలేదు. కొద్దిసేపటికే రాకెట్‌ కూలిపోయింది. చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా స్టార్‌షిప్‌ను స్పేస్‌ఎక్స్‌ రూపొందించింది. ప్రయోగ పరీక్ష మాత్రమే కావడంతో ఈ రాకెట్‌లో ఉపగ్రహాలను ఉంచలేదు. భూమి చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేసేలా దాని వ్యోమనౌకను సిద్ధం చేశారు.

కక్ష్యలోకి కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం

కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం తైఫా-1ను విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. అమెరికాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదాపడింది. తైఫా-1 నాలుగు రోజులకోసారి కెన్యాకు ఎగువన పరిభ్రమిస్తుంది. వ్యవసాయం, నేల, పర్యావరణానికి సంబంధించిన డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా, ప్రైవేటు కంపెనీలకు తక్కువ ధరకు అందించనున్నట్లు కెన్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.

చైనా గగనతల రక్షణ పరీక్ష విజయవంతం

శత్రు క్షిపణులను మార్గమధ్యంలో నేలకూల్చే అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది. ఆ ఆయుధాన్ని నేలమీద నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. దీంతో అంతరిక్షం నుంచి దూసుకొచ్చే అస్త్రాలను ధ్వంసం చేసే సామర్థ్యం విషయంలో డ్రాగన్‌ పురోగతి సాధించినట్లు స్పష్టమవుతోంది. తమ భూభాగంలోనే ఈ పరీక్షను నిర్వహించామని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది పూర్తిగా ఆత్మరక్షణకు ఉద్దేశించిన ప్రయోగమని తెలిపింది. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని దీన్ని నిర్వహించలేదని వివరించింది. సాధారణంగా ఇలాంటి వ్యవస్థల్లో నేల మీద నుంచి ప్రయోగించే క్షిపణులు, రాడార్లు, నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి. ఇవి అణు లేదా ఇతర వార్‌హెడ్‌లు కలిగిన ఖండాంతర క్షిపణులను మార్గమధ్యంలోనే పేల్చేస్తాయి. అమెరికాలో ఈ తరహా వ్యవస్థను గ్రౌండ్‌ బేస్డ్‌ మిడ్‌ కోర్స్‌ డిఫెన్స్‌ (జీఎండీ)గా పిలుస్తారు. ఇది చాలా సంక్లిష్ట వ్యవస్థ. దీన్ని నిర్మించడం, పరీక్షించడం, నిర్వహించడం చాలా కష్టం, వ్యయభరితం.

ఫ్రాన్స్‌లో పదవీ విరమణ వయసు పెంపునకు ‘మండలి’ అమోదం

ఫ్రాన్స్‌ను కుదిపేస్తున్న వివాదాస్పద పెన్షన్‌ బిల్లుకు ఇక్కడి రాజ్యాంగ మండలి ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో పదవీ విరమణ వయసును 62 నుంచి 64 ఏళ్లకు పెంచేందుకు మార్గం సుగమమైంది. ఇది అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌కు ఊరటనిచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా ఫ్రాన్స్‌లో భారీగా ఆందోళనలు జరిగాయి. అవి మెక్రాన్‌ ప్రతిష్టను దిగజార్చాయి. రాజ్యాంగ మండలి తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు తమ ఆందోళనలను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. పెన్షన్‌ బిల్లులోని కొన్ని ప్రతిపాదనలను రాజ్యాంగ మండలి తిరస్కరించింది. అయితే ప్రధానాంశమైన పదవీ విరమణ వయసు పెంపునకు ఆమోదం లభించింది. ఈ బిల్లును మెక్రాన్‌ 15 రోజుల్లోగా చట్టంగా మార్చొచ్చు.

ఐరాస మహిళా సిబ్బందిపై తాలిబన్‌ నిషేధం

అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) పరిధిలో అఫ్గాన్‌ మహిళలు ఎవరూ పనిచేయకూడదని తాలిబన్‌ సర్కారు నిషేధం విధించింది. ముందుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోని మహిళలపై నిషేధం విధించిన తాలిబన్లు ఈ మేరకు ఐరాస మహిళా సిబ్బందికీ దాన్ని వర్తింపజేశారు. అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితికి 3,900 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 600 మంది అఫ్గాన్‌ మహిళలు, 200 మంది విదేశీ మహిళలూ ఉన్నారు.

సౌదీ, ఇరాన్‌ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ

పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏళ్ల పాటు శత్రు దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ తమ మధ్య దౌత్య సంబంధాలను లాంఛనంగా పునరుద్ధరించుకున్నాయి. చైనా మధ్యవర్తిత్వంతో ఇటీవలే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరిన సంగతి తెలిసిందే. దౌత్య సంబంధాల పునరుద్ధరణపై సౌదీ, ఇరాన్‌ విదేశాంగ మంత్రులు తాజాగా బీజింగ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఐరాస గణాంక కమిషన్‌కు ఎన్నికైన భారత్‌

వచ్చే జనవరి 1వ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంక కమిషన్‌ సభ్యురాలిగా భారత్‌ ఎన్నికైంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జై శంకర్‌ వెల్లడించారు. గణాంకాలు, వైవిధ్యం, జనాభా అంశాల్లో గల నైపుణ్యాలు, ఐరాస గణాంక కమిషన్‌లో భారతదేశం సభ్యత్వం పొందడానికి దోహదపడ్డాయని తెలిపారు.

నాటోలోకి ఫిన్లాండ్‌

ఐరోపా సమాఖ్యలోని కీలక దేశం ఫిన్లాండ్‌ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. ఇందుకు సంబంధించిన చేరిక పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌కు అందజేశారు. అంతకు ముందు ఫిన్లాండ్‌ చేరికను బ్లింకెన్‌ ప్రకటించారు. నాటో సభ్యత్వానికి సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరుస్తుంటుంది. నాటోలో ఫిన్లాండ్‌ చేరేందుకు చివరగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది. ఇక నాటోలో చేరిక కోసం స్వీడన్‌ చేసిన దరఖాస్తు ఇంకా పెండింగులో ఉంది. దీనికి రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కి.మీ. సరిహద్దు కలిగి ఉండటమే కారణం. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌తో తమకు ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేవని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు.

నాటో కూటమిలోకి ఫిన్లాండ్‌

నాటో కూటమిలోకి 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్‌ చేరనుందని కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టొల్టెన్‌బర్గ్‌ అధికారికంగా ప్రకటించారు. ఫిన్లాండ్‌ చేరికకు తొలుత అభ్యంతరం చెప్పిన తుర్కియే, తర్వాత సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ఐరోపా దేశానికి మార్గం సుగమమైంది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్య అనంతరం భవిష్యత్తులో తమపైనా దాడులు జరగొచ్చన్న భయంతో ఫిన్లాండ్, స్వీడన్‌లు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. స్వీడన్‌ సభ్యత్వ ప్రక్రియ కూడా రానున్న నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

రష్యాకు యూఎన్‌ఎస్‌సీ బాధ్యతలు

ఐరాస భద్రతామండలి (యూఎన్‌ఎస్‌సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఏప్రిల్‌ నెలకుగానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెరీన్‌ జీన్‌ పెర్రీ తెలిపారు.

మన్‌కీ బాత్‌ 100వ ప్రసంగం

ప్రధాని మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్‌కీ బాత్‌ ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి 100వ ఎపిసోడ్‌కు చేరుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 ప్రత్యేక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నాణెంపై ఒకవైపు అశోక స్థూపం, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. మరోవైపు ‘మన్‌కీ బాత్‌ 100’ అని ఉంటుంది.

అస్సాం - అరుణాచల్‌ సరిహద్దు ఒప్పందంపై సంతకాలు

దాదాపు 50 ఏళ్ల పైబడి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం - అరుణాచల్‌ప్రదేశ్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రామాల సమస్య పరిష్కారానికి ఈ ఒప్పందం దోహదపడనుంది. ఇది చరిత్రాత్మక ఘట్టమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ పేర్కొన్నారు. రెండు గ్రామాల మధ్య 804 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. దీనిపై 1972 నుంచి వివాదం కొనసాగుతోంది. తాజా ఒప్పందంతో ఈ వివాదాస్పద గ్రామాలపై రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ కూడా ఇకపై కొత్త వాదనలు వినిపించడానికి వీలుండదు. సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ సవివర సర్వే ద్వారా కచ్చితమైన సరిహద్దుల్ని నిర్ణయిస్తుంది.

వయసుల వారీగా సినిమాల వర్గీకరణ

ఏ చలన చిత్రాలను ఏయే వయసుల వారు చూడవచ్చో వర్గీకరించేందుకు ఉద్దేశించిన సినిమాటోగ్రఫ్‌ (సవరణ) బిల్లు - 2023ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార - ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఇప్పటివరకు సినిమాలను యూ, ఏ, యూఏ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి సెన్సార్‌ బోర్డు అనుమతి మంజూరు చేస్తోంది. ఇది కాకుండా వైద్యులు, శాస్త్రవేత్తలు వంటి ప్రత్యేక విభాగ వీక్షకులకు ఉద్దేశించిన చిత్రాలకు ఎస్‌ వర్గం కింద ధ్రువీకరణను ఇస్తోంది. యూఏ చిత్రాలను 12 ఏళ్లలోపు పిల్లలు చూడాలంటే అది వారి తల్లిదండ్రుల పర్యవేక్షణకు లోబడి జరగాలనేది నిబంధన. ఇకపై 12 ఏళ్లలోపు వారికి బదులు యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ అనే వర్గీకరణ తీసుకురానున్నారు. ఆయా వయసుల వారు వాటిని చూడవచ్చని అర్థం. పైరసీని అడ్డుకోవడం, ఏయే వయసు వారు ఏయే సినిమాలు చూడవచ్చో వర్గీకరించడం, కాలం చెల్లిన నిబంధనల్ని రద్దు చేయడంపై వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లకు బిల్లులో చోటు కల్పించినట్లు వివరించారు. క్వాంటమ్‌ మిషన్‌కు ఆమోదం :- క్వాంటమ్‌ సాంకేతకతలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన - అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘జాతీయ క్వాంటమ్‌ మిషన్‌’కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023 - 31 మధ్య రూ.6,003 కోట్లను దీని కింద ఖర్చు చేస్తారు.

50 వేల వజ్రాలతో ఉంగరం రూపకల్పన

పొద్దుతిరుగుడు పువ్వుపై సీతాకోకచిలుక వాలిన ఆకృతిలో గుజరాత్‌లోని ఓ నగల సంస్థ తయారు చేసిన ప్రత్యేకమైన ఉంగరం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సాధించింది. సూరత్‌కు చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ సంస్థ 50,907 వజ్రాలతో దీన్ని రూపొందించింది. రూ.6.44 కోట్ల విలువ చేసే ఈ ఉంగరం తయారీకి 460.55 గ్రాముల రీసైకిల్‌ చేసిన బంగారాన్ని ఉపయోగించారు. దీన్ని తయారు చేసేందుకు 9 నెలలు పట్టింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశంతోనే ఈ డైమండ్‌ రింగును ఆ ఆకృతిలో చేశాం. త్వరలోనే 50,907 మొక్కలు కూడా నాటుతామని హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ ఘనశ్యాం భాయ్‌ ధోలాకియా తెలిపారు.

కేరళ హైకోర్టు సీజేగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భట్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావును హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని కూడా సిఫార్సు చేసింది. ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు న్యాయమూర్తిగా ఉంటూ విభజన తర్వాత తెలంగాణ హైకోర్టును ఎంచుకున్నారు. ప్రస్తుతం పంజాబ్‌ - హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. మొత్తం ఐదు హైకోర్టులకు సీజేల పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. రాజస్థాన్‌కు జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మాసీ, మద్రాస్‌ హైకోర్టుకు జస్టిస్‌ ఎస్‌.వి.గంగాపుర్‌వాలా, బొంబాయి హైకోర్టుకు జస్టిస్‌ రమేష్‌ డి ధనూకాను ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సూచించింది.

భారత్‌ అధ్యక్షతన 100వ జీ-20 సదస్సు

జీ-20 అధ్యక్ష హోదాలో భారత్‌ కీలక మైలురాయిని దాటిందని, 100వ జీ-20 సమావేశాలు నిర్వహించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ దేశంలోని 41 నగరాల్లో ఈ సమావేశాలు జరిగాయని వివరించింది. వారణాసిలో గత డిసెంబరు 1న వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (ఎంఏసీఎస్‌) ప్రారంభమైందని తెలియజేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 2 సమావేశాలు జరిగాయని తెలిపింది. ఆరోగ్య సేవలపై గోవాలో వర్కింగ్‌ గ్రూప్‌-2 సమావేశం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై హైదరాబాద్‌లో వర్కింగ్‌ గ్రూప్‌-2 సమావేశం జరిగాయని పేర్కొంది. జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా హాజరవుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రసంగిస్తుండటం, భారత్‌ అధ్యక్షతన పెద్ద ఎత్తున సమావేశాలు కొనసాగుతున్నాయనడానికి నిదర్శనమని వెల్లడించింది. ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా ఉన్న జీ-20 సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగి ఉన్నాయని, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జీ-20 దేశాల్లోనే నివసిస్తున్నారని వివరించింది.

కృత్రిమ మేధ సాయంతో సత్వర న్యాయం: ప్రధాని మోదీ

ప్రజలకు న్యాయ సేవలను వేగంగా అందించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు దీని ఆవశ్యకత అధికంగా ఉందన్నారు. గువాహటి హైకోర్టు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈశాన్య భారతంలో అందుబాటులోకి వచ్చిన మొదటి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) ప్రాంగణాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.1,123 కోట్ల వ్యయంతో దీనిని గువాహటిలో నిర్మించారు.

అంబేడ్కర్‌ సర్క్యూట్‌ భారత్‌ గౌరవ్‌ రైలు ప్రారంభం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బోధనల స్ఫూర్తిని కొనసాగించడమే ఆ మహనీయుడికి ఇచ్చే ఘనమైన నివాళి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ టూరిజం సర్క్యూట్‌ను అనుసంధానం చేసే భారత్‌ గౌరవ్‌ రైలును దిల్లీలోని హజరత్‌ నిజాముద్దీన్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంబేడ్కర్‌ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని మౌ, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ముంబయి, దేశ రాజధాని దిల్లీ సహా ఆయన జీవితంతో ముడిపడిన ప్రాంతాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా నది లోపల మెట్రో రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతం

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మెట్రో రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా నది లోపల మైట్రో రైలును విజయవంతంగా నడిపింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్‌ స్టేషన్‌ నుంచి హావ్‌డా మైదాన్‌ స్టేషన్‌ వరకు రైలు పరుగులు తీసింది. ఈ ట్రయల్‌ రన్‌లో కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్‌ మేనేజర్‌ పి.ఉదయ్‌కుమార్‌ రెడ్డితో పాటు మరికొందరు ఇంజినీర్లు, అధికారులు నదీ గర్భంలో మెట్రో ప్రయాణం చేశారు. అనంతరం ఇదే మార్గంలో మరో రైలు కూడా హావ్‌డా మైదాన్‌ స్టేషన్‌కు చేరుకుంది. హావ్‌డా మైదాన్‌ - ఎస్ప్లెనేడ్‌ స్టేషన్ల మధ్య 4.7 కి.మీ. మార్గంలో ట్రయల్‌ రన్‌ను 7 నెలల పాటు కొనసాగిస్తాం. ఇది భూఉపరితలానికి 33 మీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

విమానయాన భద్రతలో కేటగిరీ-1 హోదాను నిలబెట్టుకున్న భారత్‌

విమానయాన భద్రతా ప్రమాణాల్లో భారత్‌ కేటగిరీ-1 హోదాను నిలబెట్టుకుంది. అమెరికాకు చెందిన జాతీయ విమానయాన సంస్థ (ఎఫ్‌ఏఏ) ఈ హోదాను మరోసారి ఇచ్చింది. దీంతో మన దేశం నుంచి విదేశాలకు మరిన్ని విమాన సేవలను విస్తరించడానికి అవకాశం కలగనుంది. కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) జరిపిన ఆడిట్‌లో మన విమానయాన భద్రత భారీగా మెరుగుపడినట్లు తేలిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) పేర్కొంది.

దేశంలోనే తొలిసారిగా రీట్స్, ఇన్విట్స్‌ సూచీ ఆవిష్కరణ

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్‌ లిమిటెడ్, దేశంలోనే తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ ఇండెక్స్‌ (ఇన్విట్స్‌) సూచీని ఆవిష్కరించింది. ఎన్‌ఎస్‌ఈలో నమోదై, ట్రేడవుతున్న రీట్స్, ఇన్విట్స్‌ల పని తీరును ఈ సూచీ ప్రతిబింబిస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఆదాయాన్ని అందించే స్థిరాస్తి లేదా మౌలిక వనరుల ఆస్తులను కలిగి ఉన్న ఒక పెట్టుబడి సంస్థనే రీట్‌ లేదా ఇన్విట్‌ అని అంటారు. స్థిరాస్తి ప్రాజెక్టుల్లో రీట్స్‌; మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్విట్స్‌ పెట్టుబడులు పెడతాయి. మదుపర్లు సాధారణంగా ఈక్విటీ, డెట్, పసిడి వంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్థిరాస్తి, మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే ఈ రీట్స్, ఇన్విట్స్‌ల వైపు దృష్టి సారించడం ద్వారా మదుపర్లు, నష్ట భయాలను వైవిధ్యీకరించుకోవడానికి వీలవుతుందని ఎన్‌ఎస్‌ఈ ఇండిసెస్‌ సీఈఓ ముకేశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ సూచీలోని సెక్యూరిటీల వెయిటేజీని మార్కెట్‌ విలువ ఆధారంగా లెక్కిస్తారు. ఒక్కో సెక్యూరిటీ వెయిటేజీ పరిమితి 33 శాతం; అగ్రగామి 3 సెక్యూరిటీల వెయిటేజీ పరిమితి 72 శాతంగా ఉంది.

సీపీఐ, తృణమూల్, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు

సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీలు జాతీయ పార్టీల హోదాను కోల్పోయాయి. వీటి హోదాను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఉపసంహరించుకుంది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను దక్కించుకుంది. పార్టీల హోదాలను మారుస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులను వెలువరించింది. సమగ్ర విశ్లేషణ, ఆయా పార్టీలతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
ముఖ్యాంశాలు :-
‣ దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉండటంతో పాటు గుజరాత్, గోవాల్లో భారీగా ఓట్లు సాధించడంతో ఆప్‌నకు జాతీయ హోదా ఇస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
‣ ప్రస్తుతం భాజపా, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ఆప్‌లు జాతీయ పార్టీలుగా ఉంటాయి.
‣ ఆంధ్రప్రదేశ్‌లో భారాస, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ, మణిపుర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ్‌ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌పీ, మిజోరంలో ఎంపీసీలు రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయాయి.
‣ ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధించిన ఓట్ల ఆధారంగా ఎన్సీపీ, తృణమూల్‌లు నాగాలాండ్, మేఘాలయల్లో రాష్ట్ర పార్టీలుగా ఉంటాయి.
‣ నాగాలాండ్‌లో లోక్‌ జన్‌శక్తి పార్టీకి (రాంవిలాస్‌) రాష్ట్ర పార్టీ హోదా లభించింది.
‣ మేఘాలయలో వాయిస్‌ ఆఫ్‌ ద పీపుల్‌ పార్టీకి, టిప్రా మోతాకు త్రిపురలో రాష్ట్ర పార్టీ హోదాలు లభించాయి.
‣ కేజ్రీవాల్‌ నేతృత్వంలో 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పాటైంది. 2015లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లోనూ ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 2022లో పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించి రెండో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. దీంతో ఇప్పుడు జాతీయ హోదా దక్కింది.
‣ కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ 1998లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. 2011లో ఆ పార్టీ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్, మణిపుర్, త్రిపురల్లో విస్తరించింది. దీంతో 2016లో తృణమూల్‌కు జాతీయ పార్టీ హోదా దక్కింది. గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓట్లను సాధించలేకపోవడంతో ఇప్పుడు జాతీయ హోదాను కోల్పోయింది.
‣ 2000లో ఎన్సీపీ.
‣ 1999లో ఏర్పాటైన ఎన్సీపీ 2000 సంవత్సరంలో జాతీయ పార్టీ హోదా సాధించింది.
‣ 1989లో సీపీఐ.
‣ 1925లో ఏర్పాటైన సీపీఐ ఆ తర్వాత సీపీఐ, సీపీఎంలుగా విడిపోయింది. 1989లో జాతీయ పార్టీ హోదాను సీపీఐ సాధించింది. పశ్చిమ్‌ బెంగాల్, ఒడిశా ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు సాధించలేకపోవడంతో ఇప్పుడు జాతీయ హోదాను కోల్పోయింది.

జాతీయ హోదా ప్రయోజనాలు:-
‣ జాతీయ పార్టీ హోదా ఉన్న పార్టీలకు దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికల గుర్తు లభిస్తుంది. ఎక్కువ మంది స్టార్‌ ప్రచార తారలను నియమించుకోవచ్చు.
‣ జాతీయ ప్రసార మాధ్యమాల్లో ఎక్కువ సమయం కేటాయిస్తారు.
‣ దిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తారు.

భారాసకు ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు రద్దు:-
ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ రాష్ట్ర సమితి (గతంలో తెరాస)కి ఉన్న రాష్ట్ర పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. 2014, 2019లలో నిర్వహించిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పరిధిలో భారాస పోటీ చేయని కారణంగానే దానికున్న గుర్తింపును తెలంగాణకే పరిమితం చేసినట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలో తొలి డిజిటల్‌ కోర్టు ప్రారంభం

దేశంలో మొదటి సారి కాగితపు రహిత డిజిటల్‌ న్యాయస్థానం మహారాష్ట్రలో అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబయిలోని వాశీ కోర్టు ఈ విశిష్టతను సొంతం చేసుకుంది. ఇక్కడ ఏర్పాటైన జిల్లా, అడిషనల్‌ సెషన్స్‌ కోర్టును బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కాగితం వినియోగించాల్సిన అవసరం లేని, పూర్తిస్థాయి డిజిటల్‌ కోర్టు ఏర్పాటులో స్థానిక న్యాయవాదులు అందించిన సహకారం అమోఘమని ప్రశంసించారు.

లోక్‌సభ ఉత్పాదకత 34%, రాజ్యసభది 24%

అధికార, విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు కొట్టుకుపోయాయి. లోక్‌సభ ఉత్పాదకత 34 శాతానికి, రాజ్యసభ ఉత్పాదకత 24 శాతానికి పడిపోయింది. మొత్తం 25 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో ఆరు బిల్లులు మాత్రమే ఎలాంటి చర్చ లేకుండా సభ్యుల ఆందోళనల మధ్యే ఆమోదం పొందాయి. జనవరి 31న మొదలైన తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు సజావుగానే సాగాయి. మార్చి 13 నుంచి మొదలైన మలి విడత సమావేశాలు ఆందోళనలతో అట్టుడికాయి. ‣ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ఉభయసభల్లో 12 గంటల చొప్పున సమయం కేటాయించినా లోక్‌సభలో 13.44 గంటలు, రాజ్యసభలో 12.42 గంటల పాటు చర్చ జరిగింది. బడ్జెట్‌పై లోక్‌సభలో 12 గంటలకు గానూ 14.45 గంటల పాటు చర్చించగా, రాజ్యసభలో 2.21 గంటలు మాత్రమే సాగింది. బడ్జెట్‌ పద్దులపై చర్చ జరగలేదు. ద్రవ్య వినిమయ బిల్లులను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. ఆర్థిక బిల్లు - 2023కి ప్రభుత్వం సూచించిన సవరణను ఆమోదించి రాజ్యసభ మార్చి 27న తిప్పి పంపగా, ఆ సవరణకు లోక్‌సభ అదే రోజు ఆమోదముద్ర వేసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మొత్తం అంశాలు మార్చి 31కి ముందే పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది.

స్పేస్‌ పాలసీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించిన ‘భారత అంతరిక్ష విధానం - 2023’కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆధునిక అంతరిక్ష సాంకేతికతలపై ఇస్రో దృష్టిసారించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. సహజవాయువుకు ధర నిర్ణయించే సూత్రాన్ని సవరించేందుకు, ధరకు పరిమితి విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సంపీడన సహజ వాయువు (సీఎన్‌జీ), గొట్టపు మార్గాల ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ (పీఎన్‌జీ) ధరను 10% వరకు తగ్గించేందుకు ఈ నిర్ణయం వీలు కల్పిస్తుంది. విదేశాల్లోని సహజవాయువు ధర ఆధారంగా కాకుండా దిగుమతి చేసుకునే ముడి చమురు ధరను బట్టి ఇకపై వీటి ధరలు నిర్ణయించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. మహారాష్ట్రలోని హింగోలిలో రూ.2,600 కోట్ల ఖర్చుతో ‘లేజర్‌ ఇంటెర్‌ఫెరోమీటర్‌ గ్రావిటేషనల్‌ వేవ్‌ అబ్జర్వేటరీ’ని ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్‌ సమ్మతించింది.

జియో ట్యాగింగ్‌లో కేరళకు అగ్రస్థానం

జియో ట్యాగింగ్‌లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022 - 23 సంవత్సరానికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియో ట్యాగ్‌లు లభించాయి. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) రికార్డుల ప్రకారం.. కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్‌లు లభించాయి.
‣ బిహార్‌కు చెందిన మిథిలా మఖానా, మహారాష్ట్రకు చెందిన అలీబాగ్‌ తెల్ల ఉల్లిపాయలు జియో ట్యాగ్‌లను సాధించాయి.
‣ తెలంగాణలోని తాండూర్‌ కందిపప్పునకూ 2022 - 23లోనే జియో ట్యాగ్‌ లభించింది.
‣ లద్దాఖ్‌కు చెందిన రాక్సే కాప్రో ఆప్రికాట్, అస్సాంలోని గమోసా హస్తకళలు జియో ట్యాగ్‌లను సాధించాయి.
‣ 2022 - 23లో మొత్తం 12 ఉత్పత్తులు జియో ట్యాగ్‌లను సాధించగా అందులో రెండు విదేశాలకు చెందినవి ఉన్నాయి.
‣ 2021 - 22లో మొత్తం 50 ఉత్పత్తులు జియో ట్యాగ్‌లను సాధించాయి. ఆ ఏడాదిలో ఉత్తర్‌ ప్రదేశ్‌ 7 ట్యాగ్‌లను సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో తాజాగా ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’కు చోటు లభించింది. సామాజిక సేవా విభాగంలో ఒక గంటలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు కల్పించినట్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ వత్సాల కౌల్‌ బెనర్జీ తెలిపారు. సంతోష్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఈ విభాగంలో ఇంతవరకు ఇదే అత్యుత్తమమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ 21 చొప్పున మొక్కలు నాటినట్లు సంస్థ వివరించింది. ఒక గంటలోనే మూడున్నర లక్షలు మొక్కలు నాటించినట్లు చెప్పారు. సంబంధిత పత్రాన్ని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు అందజేశారు.

బీడీఎల్‌ సీఎండీగా రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు

రక్షణ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా పి.రాధాకృష్ణ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన బీడీఎల్‌కు డైరెక్టర్‌ (ప్రొడక్షన్‌)గా ఉన్నారు. బీడీఎల్‌ సీఎండీ సిద్ధార్థ్‌ మిశ్రా పదవీ విరమణ చేయడంతో రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. క్షిపణి ఉత్పత్తితో పాటు, ఇతర విభాగాల్లో దాదాపు 35 ఏళ్ల అనుభవం రాధాకృష్ణకు ఉంది. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్, జేఎన్‌టీయూ నుంచి ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేశారు.

హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో అంబేడ్కర్‌ స్మారకం

తెలంగాణలో హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఆవిష్కరించిన అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహానికి అరుదైన గౌరవం లభించింది. హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఈ స్మారకం నమోదైంది. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్, సుమన్‌ శనివారం స్మారకం వద్ద అందజేశారు. ఈ విగ్రహం హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందడం అందరికీ గర్వకారణమని, రానున్న రోజుల్లో ప్రపంచస్థాయిలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా మారుతుందని వివరించారు.

దేశంలోనే అత్యంత ఎత్తైన బాబాసాహెబ్‌ విగ్రహావిష్కరణ

అంబేడ్కర్‌ విశ్వమానవుడని, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం సార్వజనీనమని, అణగారిన వర్గాల ఆశాదీపమని, ఆయన స్ఫూర్తిని విస్తరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్మించిన దేశంలోనే అత్యంత ఎత్తైన (125 అడుగుల) అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో సీఎం తన ప్రసంగాన్ని జై భీమ్‌ నినాదంతో ప్రారంభించారు. అంబేడ్కర్‌ జీవితగాథపై దృశ్యరూపం అంబేద్కర్‌ విగ్రహాన్ని నిలబెట్టిన పీఠం భవనాన్ని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ చేతుల మీదుగా సీఎం ఆవిష్కరింపజేశారు. అనంతరం ఫొటో ప్రదర్శనను, ఎస్సీ కార్పొరేషన్‌ రూపొందించిన ‘ఆత్మబంధువు అంబేడ్కరుడు’ దృశ్యరూపాన్ని వీక్షించారు. అంబేడ్కర్‌ జీవితగాథను, దేశానికి ఆయన చేసిన సేవలను, విజయాలను, వాటితో పాటు అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం దళితాభ్యున్నతికి అమలు చేస్తున్న దళితబంధు వంటి పథకాల వివరాలతో కూడిన డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌ తిలకించారు.

దక్షిణ డిస్కంకు రెండు అవార్డులు

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ (డిస్కం)కు ఉత్తమ పంపిణీ సంస్థ కేటగిరీలో ప్రథమ, వినియోగదారులకు అవగాహన కల్పించే విభాగంలో ద్వితీయ అవార్డు లభించింది. ఇండిపెండెంట్‌ పవర్‌ పర్చేజ్‌ అసోసియేషన్‌ కర్ణాటకలో నిర్వహించిన ‘నియంత్రణ మండళ్లు, విధానకర్తల సదస్సు’లో ఈ అవార్డులు అందజేసింది. సౌర విద్యుత్‌ వినియోగ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఏడాదికి దాదాపు 122 మిలియన్‌ యూనిట్ల కరెంటును ఆదా చేయడం, 246.98 మెగావాట్ల రూఫ్‌టాప్‌ సౌర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధానం, స్మార్ట్‌ టెక్నాలజీ అమలు తదితర వినూత్న కార్యక్రమాలతో సంస్థకు ప్రథమస్థానంలో అవార్డు లభించిందని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. సంస్థ పరిధిలోని 91 వినియోగదారుల సేవ కేంద్రాలను అనుసంధానించి నిర్ణీత సమయంలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం, 100 శాతం ఆన్‌లైన్‌ బిల్లింగ్‌ వంటి సేవలకు రెండో స్థానంలో అవార్డు లభించిందని వివరించారు.

తెలంగాణలో 64,056 జలవనరులు

తెలంగాణలో మొత్తం 64,056 జలవనరులు ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా విడుదల చేసిన తొలి వాటర్‌ బాడీస్‌ సెన్సస్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు జల సంరక్షణ పథకాలు, చెక్‌డ్యాంల నిర్మాణంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2017 - 18 సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకొని నిర్వహించిన ఈ గణన ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జలవనరుల్లో 98.5% గ్రామీణ ప్రాంతాల్లోను, 1.5% పట్టణ ప్రాంతాల్లోను ఉన్నాయి. వీటిలో అత్యధికం కుంటలు కాగా తర్వాతి స్థానాల్లో నీటి సంరక్షణ పథకాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, చెక్‌డ్యాంలు, చెరువులు ఉన్నాయి. మొత్తం జలవనరుల్లో 10,170 సహజసిద్ధంగా ఏర్పడగా; 53,886 మానవ నిర్మితాలు. వీటిలో 20.3% యేటా, 41.9% సాధారణంగా, 29.8% అరుదుగా నిండుతుంటాయి. 8% ఎప్పుడూ నిండవు.

ముఖ్యాంశాలు..
‣ జలవనరుల్లో 80.5% ప్రభుత్వ, 19.5% ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్నాయి.
‣ మొత్తం జలవనరుల్లో 80.8% ఉపయోగంలో ఉండగా, 19.2% నిరుపయోగంగా మారిపోయాయి. అందుకు కారణాలు అవి ఎండిపోవడం, పూడిక చేరడం, మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా ధ్వంసం కావడం, ఉప్పు శాతం అధికంగా ఉండటం.
‣ అందుబాటులో ఉన్న జలవనరుల్లో అత్యధికంగా 58.2% సాగునీటి అవసరాలకు, 37.1% భూగర్భజలాల రీఛార్జికి ఉపయోగపడుతున్నాయి.
‣ ఈ గణాంకాలు సేకరించినప్పుడు 43,695 జలవనరుల్లోని నీటి నిల్వలను లెక్కించారు. 2017 - 18 నాటి లెక్కల ప్రకారం అందులో 22.1% పూర్తిగా, 26.1% మూడోవంతు, 19.3% సగభాగం, 19.3% నాలుగోవంతు నీటితో నిండి ఉన్నాయి. 13.2% జలవనరులు ఖాళీగా కనిపించాయి.
‣ మొత్తంగా 24.4% జలవనరుల్లో 10 వేల ఘనపు మీటర్లకు మించి నీటినిల్వ సామర్థ్యం ఉంది.

తెలంగాణలోని మూడు పీహెచ్‌సీలకు జాతీయ గుర్తింపు

గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మెరుగైన సేవలందిస్తూ ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలోని 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నాణ్యత ధ్రువీకరణను పొందాయి. యాదాద్రి జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నిజామాబాద్‌ జిల్లా నందిపేట, మేడ్చల్‌ జిల్లా నారపల్లి ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాలు క్వాలిటీ సర్టిఫైడ్‌ స్టేషన్లుగా గుర్తింపు దక్కించుకున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తూ జీవన ప్రమాణ స్థాయిని మెరుగు పరిచినందుకు నేషనల్‌ క్యాలిటీ ఎష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్యూఏఎస్‌) కార్యక్రమంలో భాగంగా ఈ సర్వే నిర్వహించారు. రోగులకు అందించే ప్రాథమిక చికిత్స నుంచి గర్భిణులకు కాన్పుల వరకు ఈ పీహెచ్‌సీల్లో అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకున్నారు. గత నెలలో జాతీయ వైద్య బృందం సభ్యులు రాష్ట్రంలో పలు పీహెచ్‌సీలను సందర్శించి వాటిలో అందుతున్న సేవలు, ఫార్మసీ, ల్యాబ్‌ సౌకర్యం, ప్రసూతి గది, ఓపీ, వైద్యుల పనితీరు, వ్యాక్సినేషన్‌ అంశాలను పరిశీలించి ఈ ధ్రువీకరణనిచ్చారు. ఏడాది పాటు ఈ గుర్తింపు అమల్లో ఉండనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా గంగాపూర్‌ పీహెచ్‌సీకి నిబంధనలతో కూడిన సర్టిఫికేషన్‌ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం పంపింది.

పని చేయడానికి అత్యుత్తమం ‘టీసీఎస్‌’

‘భారతదేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పొందింది. సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్‌ఇన్‌ భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితాను వెలువరించింది. ఇ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ - ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. గతేడాది జాబితాలో టెక్‌ కంపెనీలు ఆధిపత్యం ప్రదర్శించగా ఈసారి ఆర్థిక సేవలు, చమురు - గ్యాస్, నిపుణుల సేవలు, తయారీ, గేమింగ్‌ కంపెనీలు జాబితాలో ఎక్కువగా చోటు సాధించాయి. ‣ అగ్రగామి 25 కంపెనీల్లో 10 ఆర్థిక సేవలు/బ్యాంకింగ్‌/ఫిన్‌టెక్‌ రంగాలకు చెందినవే. మెక్వారీ గ్రూప్‌ (5వ స్థానం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (11), మాస్టర్‌కార్డ్‌ (12), యుబీ (14) స్థానాల్లో ఉన్నాయి. తొలిసారిగా ఇ-స్పోర్ట్స్, గేమింగ్‌ రంగాల కంపెనీలు డ్రీమ్‌11 సంస్థ 20వ స్థానంలో, గేమ్స్‌ 24+7 సంస్థ 24వ స్థానంలో నిలిచాయి. ఈ అంశాల ఆధారంగా: రాణించే సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, కంపెనీ స్థిరత్వం, విదేశీ అవకాశాలు, కంపెనీ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి అంశాల ఆధారంగా, కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది. ‣ ఈ జాబితాలోని కంపెనీల్లో అత్యధికం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ముంబయి, హైదరాబాద్, దిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో అగ్రగామి 10 కంపెనీలివే..
1) టీసీఎస్‌
2) అమెజాన్‌
3) మోర్గాన్‌ స్టాన్లీ
4) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
5) మెక్వారీ గ్రూప్‌
6) డెలాయిట్‌
7) ఎన్‌ఏవీ ఫండ్‌
8) ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌
9) వయాట్రిస్‌
10)రాయల్‌ కరేబియన్‌

అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడం ఇందుకు నేపథ్యం. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం.. భారత్‌ - అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2021 - 22లో ఇది 119.5 బి.డాలర్లు, 2020 - 21లో 80.51 బి.డాలర్లుగా నమోదైంది. ‣ భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 78.31 బి.డాలర్లకు చేరాయి. 2021 - 22 నాటి 76.18 బి.డాలర్ల కంటే ఇవి 2.81% అధికం. అమెరికా నుంచి దిగుమతులు 16% పెరిగి 50.24 బి.డాలర్లుగా నమోదయ్యాయి. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం 115.42 బి.డాలర్ల నుంచి 1.5% తగ్గి 113.83 బి.డాలర్లకు పరిమితమైంది. భారత్‌తో యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యం 76.16 బి.డాలర్లతో మూడో స్థానం పొందింది. తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా (52.72 బి.డాలర్లు), సింగపూర్‌ (35.55 బి.డాలర్లు) ఉన్నాయి.

‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా’ జాబితాలో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌కు స్థానం

బ్యాంకింగ్‌ - ఆర్థిక సేవలు - బీమా విభాగంలో ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా’ జాబితాలో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ లిమిటెడ్‌ (బీఎఫ్‌ఐఎల్‌) స్థానం సంపాదించింది. వరుసగా తొమ్మిదో సంవత్సరం బీఎఫ్‌ఐఎల్‌ ఈ గుర్తింపు అందుకుందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ జె.శ్రీధరన్‌ తెలిపారు. ఉద్యోగుల కీలక భాగస్వామ్యంతో వినూత్న సేవలను ఆవిష్కరిస్తుండటమే ఇందుకు కారణమన్నారు. ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ జాబితాను తయారు చేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల నుంచి 10,000కు పైగా సంస్థలను పరిశీలించారు. అన్ని కోణాల్లో విశ్లేషించి తుది జాబితా రూపొందించారు.

భారత్‌ వృద్ధి 6 శాతమే!

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2023లో 6 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) అంచనా వేసింది. 2022లో వృద్ధి 6.6 శాతంగా నమోదైందని ఐక్యరాజ్యసమితి ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌ (యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. 2023లో ప్రపంచ వృద్ధి 2.1 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. 2022 సెప్టెంబరులో అంచనా వేసిన 2.22 శాతం కంటే ఇది తక్కువేనని వివరించింది. అధిక వడ్డీ రేట్ల వల్ల బ్యాంకింగ్‌ రంగంపై పడే ప్రభావం, ఇటీవల చోటు చేసుకున్న దిగ్గజ బ్యాంకుల సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా మందగమనం కారణంగా వర్థమాన చెందిన దేశాలకు ఇబ్బందులు కొనసాగొచ్చని హెచ్చరించింది. ప్రపంచంలో చాలా దేశాల వార్షిక వృద్ధి కొవిడ్‌-19 ముందు కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. 2008లో అంతర్జాతీయ సంక్షోభానికి ముందు, దశాబ్దకాలం పాటు నమోదైన వృద్ధి కంటే కూడా బాగా తక్కువగా నమోదు కావచ్చని వివరించింది.

వృద్ధి రేటు 5.9 శాతమే!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023 - 24) భారత వృద్ధి రేటు అంచనాలను 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిస్తున్నట్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి సాధించే దేశంగా భారత్‌ నిలుస్తుందని పేర్కొంది. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు 6.8 శాతాన్ని 6.3 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో 6.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా 7 శాతం కంటే ఇది తక్కువ. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి రేటును ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2022 - 23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి గణాంకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

2023 - 24కు ద్రవ్యోల్బణ సూచీ 348: సీబీడీటీ

దీర్ఘకాలిక మూలధన లాభాలను గణించేందుకు ఉపయోగించే ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (సీఐఐ)ని ఈ ఆర్థిక సంవత్సరానికి 348గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. స్థిరాస్తి, షేర్లు, ఆభరణాలు తదితరాలను విక్రయించినప్పుడు ద్రవ్యోల్బణ సూచీకి సర్దుబాటు చేసి, మూలధన రాబడిని లెక్కిస్తారు. 2024 - 25 మదింపు సంవత్సరానికి (2023 - 24 ఆర్థిక సంవత్సరం) పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు ఈ సూచీని ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా సీబీడీటీ ఈ వివరాలను జూన్‌లో తెలియజేస్తుంది. ఈసారి ఏప్రిల్‌లోనే దీన్ని ప్రకటించింది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో సీఐఐ 331 ఉండగా, 2021 - 22లో 317 పాయింట్లుగా ఉంది. సాధారణంగా ఒక ఆస్తిని 36 నెలలకు మించి అట్టేపెట్టుకున్నప్పుడు (స్థిరాస్తులు), నమోదు కాని షేర్లు 24 నెలలు, నమోదైన షేర్లు 12 నెలలకు పైగా ఉన్నప్పుడు అవి దీర్ఘకాలిక మూలధన లాభాల పరిధిలోకి వస్తాయి.

అయిదేళ్ల పాటు 3% వృద్ధి!

ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేయొచ్చని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలీనా జార్జియేవా అంచనా వేశారు. ఇందులో సగం భారత్, చైనాల నుంచే ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది వృద్ధి రేటు అయిన 3.4 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం పెరిగే ముప్పు ఉన్నట్లు ఐఎంఎఫ్‌ చీఫ్‌ వెల్లడించారు. వచ్చే అయిదేళ్ల పాటు వృద్ధి దాదాపు 3 శాతం దరిదాపుల్లోనే ఉండొచ్చని అన్నారు. 1990 తర్వాత మధ్యకాల వ్యవధిలో ఇది అత్యల్ప వృద్ధి అంచనా అని, గత రెండు దశాబ్దాల సగటు 3.8 శాతం కంటే చాలా తక్కువని వివరించారు. ఈ మేరకు వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తక్కువ వృద్ధి చాలా తీవ్రమైన పరిణామమని, తక్కువ ఆదాయ దేశాలకు ఇది చాలా ఇబ్బందకరమని క్రిస్టలీనా తెలిపారు.

భారత వృద్ధి 6.3 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023 - 24) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. 6.3 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇదే ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. వినియోగంలో క్షీణత, బాహ్య పరిణామాలు, వృద్ధి నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొంది. రుణ రేట్లు పెరగడం, ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించడంతో ప్రైవేటు వినిమయం తగ్గుముఖం పట్టనుంది. కొవిడ్‌ కాలంలో ప్రకటించిన ఆర్థిక మద్దతును క్రమంగా ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వ వ్యయాలు కూడా వృద్ధి చెందనున్నాయని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. ‣ గత ఆర్థిక సంవత్సరం అక్టోబరు - డిసెంబరు త్రైమాసికంలో భారత్‌ 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 - 26 మధ్య 7 శాతం సగటు వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.

సీసీఐ సీఎండీగా లలిత్‌కుమార్‌ గుప్తా

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా లలిత్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సుల మేరకు జౌళి శాఖ ఈయన్ను నియమించింది. ఈ మేరకు వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా సేవలందిస్తున్నారు. కొత్త బాధ్యతల్లో అయిదేళ్ల పాటు కొనసాగుతారు.

సీఆర్‌పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ ఐజీగా చారుసిన్హా

సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సదరన్‌ సెక్టార్‌ ఐజీగా చారుసిన్హా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సెక్టార్‌లో ఐజీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన మహేష్‌చంద్ర లడ్హా జమ్మూ సెక్టార్‌కు బదిలీ అయ్యారు. చారుసిన్హా ఐజీపీగా జమ్మూ సెక్టార్‌లో ఉగ్రవాద నిర్మూలన బృందానికి సంవత్సరం పాటు, శ్రీనగర్‌ సెక్టార్‌లో దాదాపు రెండున్నరేళ్ల పాటు విధులు నిర్వహించారు. గతంలో నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆమె బిహార్‌లోనూ పనిచేశారు. సీఆర్‌పీఎఫ్‌కు డిప్యుటేషన్‌పై రాకముందు చారుసిన్హా తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వహించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, చిత్తూరు, తూర్పు గోదావరి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. అల్బేనియన్‌ ముస్లింలు, క్రిస్టియన్‌ సెర్బ్‌ల మధ్య సంఘర్షణతో నలిగిపోయిన ప్రాంతంలో శాంతి పరిరక్షణకు డిప్యుటేషన్‌పై కొసావాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగస్వాములై సేవల విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.

అనకాపల్లి, లాతూర్‌ జిల్లాలకు ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డు దక్కింది. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నందుకు ఈ ఘనత దక్కింది. ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌’ విభాగంలో మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా ప్రథమ, ఏపీలోని అనకాపల్లి జిల్లా రెండో బహుమతి పొందాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది అక్కడున్న 576 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించారు. గ్రామస్థాయిలో 105 రకాల మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలకు దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన ‘సివిల్‌ సర్వీసెస్‌ డే’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా కలెక్టర్‌ రవి పత్తన్‌శెట్టికి అవార్డు అందజేశారు.

దీపికా మిశ్రకు వాయుసేన శౌర్య అవార్డు

మధ్యప్రదేశ్‌ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్య అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకొన్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. రాజస్థాన్‌కు చెందిన దీపిక హెలికాప్టర్‌ పైలట్‌గా భారత వాయుసేనలో పనిచేస్తున్నారు. ఐఏఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి చేతుల మీదుగా దీపిక వాయుసేన పతకం అందుకొన్నారు. స్థానిక ఎయిర్‌ఫోర్స్‌ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు అధికారులకు యుధ్‌సేవా పతకాలు ప్రదానం చేశారు.

సీఆర్‌ రావుకు అత్యున్నత పురస్కారం

ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, భారతీయ - అమెరికన్‌ అయిన కల్యంపూడి రాధాకృష్ణారావుకు (సీఆర్‌ రావు) స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన గణాంక బహుమతిని 2023 సంవత్సరానికి ఆయన అందుకోనున్నారు. 75 సంవత్సరాల క్రితం రావు చేసిన కృషి, ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది. వచ్చే జులైలో కెనడాలోని అట్టావాలో జరిగే కార్యక్రమంలో సీఆర్‌ రావు ఈ అవార్డును అందుకుంటారు. 102 ఏళ్ల సీఆర్‌ రావుకు అవార్డుతో పాటు 80వేల అమెరికన్‌ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. 5 ప్రముఖ అంతర్జాతీయ గణాంక సంస్థల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ బహుమతిని అందజేస్తారు. ‣ సీఆర్‌ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన 2020 సెప్టెంబరు 10న వందో పుట్టినరోజు జరుపుకొన్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఏమిటీ పరిశోధనలు సీఆర్‌ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతో పాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి. ఈ మూడింటిలో మొదటిది క్రామెర్‌-రావు లోయర్‌ బౌండ్‌. ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తుమ విధానాన్ని సూచించింది. రెండవది రావు-బ్లాక్‌వెల్‌ సిద్ధాంతం. ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్థంగా సేకరించేందుకు సహాయపడుతుంది.

జాతీయ స్థాయిలో తెలంగాణకు 13 పురస్కారాలు

జాతీయ పంచాయతీ పురస్కారాల కింద 48 అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రానికి 13 లభించాయి. దేశవ్యాప్తంగా అత్యధిక అవార్డులతో రాష్ట్రం నం.1 స్థానంలో నిలిచింది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాల కింద తొమ్మిది కేటగిరీల్లో గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రకటించింది. ఇందులో ఎనిమిది కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలకు అవార్డులు (నాలుగు కేటగిరీల్లో మొదటి ర్యాంకు) వచ్చాయి. ఈ పురస్కారాల కింద జాతీయ స్థాయిలో 27 అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణ 8 అవార్డులతో తొలిస్థానం దక్కించుకుంది. నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ కింద ఉత్తమ మండల, జిల్లా స్థానిక సంస్థలకు అవార్డులను ప్రకటించారు. మొత్తం 21 అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు అయిదు లభించాయి. ‣ కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్‌ 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా ఆన్‌లైన్లో పంచాయతీల నుంచి తొమ్మిది అంశాల్లో నామినేషన్లు తీసుకుంది. ఉత్తమ గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తోంది. ప్రతి అంశానికి కేంద్రం వంద మార్కులు ప్రకటించింది. వచ్చిన మార్కుల ఆధారంగా అత్యుత్తమ పంచాయతీలకు అవార్డులు అందజేస్తోంది. ఈ మేరకు తొమ్మిది కేటగిరీల్లో రాష్ట్రానికి ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. తెలంగాణకు నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలు అయిదు లభించాయని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఆర్థిక సలహాదారు బిజయకుమార్‌ బెహ్రా ప్రకటించారు. నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ - 2023 ఉత్తమ బ్లాక్‌ (మండల) పంచాయతీల విభాగం: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ ఎల్‌ఎండీ ఉత్తమ జిల్లా పరిషత్‌ విభాగం: ములుగు జిల్లా ప్రత్యేక కేటగిరీ అవార్డుల్లో గ్రామ ఊర్జా స్వరాజ్‌ విశేష్‌ పంచాయతీ పురస్కారం: ఆదిలాబాద్‌ జిల్లా ముఖరా కె.గ్రామం కార్బన్‌ న్యూట్రల్‌ విశేష్‌ పంచాయతీ పురస్కార్‌ విభాగం: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం. నాన్‌ ఫైనాన్షియల్‌ ఇన్సెంటివ్‌ సర్టిఫికెట్ల విభాగం: గ్రామ ఊర్జాస్వరాజ్‌ విశేష్‌ పంచాయత్‌ పురస్కార్‌ కింద సిద్దిపేట జిల్లా మర్కూక్‌ ఎర్రవెల్లి గ్రామం.

చినజీయర్‌కు పద్మభూషణ్‌ ప్రదానం

దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా 53 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను అందించారు. తెలుగు వారైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్‌ స్వామి పద్మభూషణ్‌ను అందుకోగా, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, చిరుధాన్యాల ప్రచారకర్త దూదేకుల ఖాదర్‌ వలి (కర్ణాటక నుంచి), డాక్టర్‌ అబ్బారెడ్డి నాగేశ్వరరావు పద్మశ్రీలను స్వీకరించారు. ‣ ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ (మరణానంతరం), ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌) సృష్టికర్త, పశ్చిమబెంగాల్‌కు చెందిన దిలీప్‌ మహలనబిస్‌తో పాటు, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ వర్ధన్‌లకు రాష్ట్రపతి పద్మవిభూషణ్‌ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ గాయనీమణి వాణీ జయరాం (మరణానంతరం), నవలా రచయిత ఎస్‌ఎల్‌ భైరప్ప, సామాజికవేత్తలు దీపక్‌ ధర్, సుధామూర్తిలకు పద్మభూషణ్‌ పురస్కారాలు అందించారు. వీరు కాకుండా మరో 45 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. వీరిలో తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐసీఆర్‌) వ్యవస్థాపక డైరెక్టర్, శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ నాగప్ప గణేష్‌ కృష్ణరాజనగర్‌ (ఆంధ్రప్రదేశ్‌ నుంచి) ఉన్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ తరఫున ఆయన తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్, వాణీజయరాం తరఫున ఆమె సోదరి ఉమామణి రాష్ట్రపతి నుంచి పురస్కారాలను స్వీకరించారు. ‣ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారాలను రెండు విడతలుగా ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మార్చి 22న 53 మందికి అందించిన రాష్ట్రపతి రెండో విడతలో అంతే మందికి ప్రదానం చేశారు.

కిరణ్‌ నాడార్‌కు ఫ్రెంచ్‌ అత్యున్నత పౌర పురస్కారం

సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవిరళ కృషి చేస్తున్న కిరణ్‌ నాడార్‌కు ఫ్రెంచ్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లీనన్‌ ఆ పురస్కారాన్ని కిరణ్‌ నాడార్‌కు అందజేసి సత్కరించారు. జాతీయ, అంతర్జాతీయ కళాకృతులు సేకరిస్తున్న నాడార్‌ ఇండో-ఫ్రాన్స్‌ సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గాను ఫ్రాన్స్‌ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కిరణ్‌ నాడార్‌ మ్యూజియం ఆర్ట్‌ (కేఎన్‌ఎంఏ) ఛైర్‌పర్సన్, శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ అయిన నాడార్‌ పలు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వర్తిస్తున్నారు.

పురుషుల్లో అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా అఫ్షాన్‌

పురుషుల్లో అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా ఇరాన్‌కు చెందిన అఫ్షాన్‌ గదేర్‌జాదే తాజాగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన వయసు 20 ఏళ్లు. అఫ్షాన్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అతడి ఎడమ చేయి 6.7 సెంటీమీటర్లు, కుడి చేయి 6.4 సెంటీమీటర్ల మేర పొడవును కలిగి ఉన్నారు. సగటు పురుషుడితో పోలిస్తే ఇతడి చేతులు దాదాపు మూడో వంతు కురచగా ఉన్నాయి.

22 ఏళ్లకే పీహెచ్‌డీతో నైనా జైస్వాల్‌ రికార్డు

అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ 22 సంవత్సరాల వయసులో రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌లో నైనా జైస్వాల్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేశారు. భారతదేశంలో అతిచిన్న వయసులో డాక్టరేట్‌ పొందిన మొదటి అమ్మాయి కావడం విశేషం. ‘మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళల సాధికారతలో సూక్ష్మరుణాల పాత్ర’ అనే అంశంపై నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మార్గదర్శకంలో పరిశోధన చేశారు. లండన్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎనిమిదేళ్ల వయసులో 10వ తరగతి పూర్తి చేసి ఆసియాలో అతిపిన్న వయస్కురాలిగా నమోదయ్యారు. పదేళ్ల ప్రాయంలో ఇంటర్మీడియట్, 13 సంవత్సరాల వయసులో పట్టభద్రులయ్యారు. అనంతరం ఎంఏ పూర్తి చేసి ఆసియాలోనే పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. నన్నయ విశ్వవిద్యాలయంలో 16 సంవత్సరాల వయసులో ప్రవేశం పొంది, 22 ఏళ్లకే విజయవంతంగా పీహెచ్‌డీ పూర్తి చేశానని, అఖిల భారత సర్వీసులకు వెళ్లాలనేది ఆశయమని నైనా జైస్వాల్‌ వివరించారు.

ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా రుమేసా గెల్గీ

తుర్కియేకు చెందిన రుమేసా గెల్గీ (26) ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అరుదైన వ్యాధి బారిన పడిన ఈమె నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటూ జీవన పోరాటంలో విజేతగా నిలుస్తోంది. తుర్కియేలోని సఫ్రన్‌బోలు జిల్లాలో జన్మించింది. ఎత్తు ఏడడుగుల పైచిలుకు. కేవలం ఎత్తయిన మహిళగానే కాకుండా పెద్ద చేతులు, పొడవైన వేళ్లు, వెన్నెముక కలిగిన మహిళగా ఆమె పేరిట మొత్తం 5 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. నాలుగు నెలల చిన్నారిగా ఉండగానే ఆమె ‘వీవర్స్‌ సిండ్రోమ్‌’ బారిన పడింది. ఈ జన్యుపరమైన సమస్యతో ఎముకల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. ముఖం, పాదాలు ఎక్కువగా సాగిపోతాయి. గొంతు కూడా సాగి బొంగురుగా వినిపిస్తుంది. ఈ వ్యాధి మెదడుపైనా ప్రభావం చూపిస్తుంది. కండరాలు వదులుగా ఉంటాయి. రుమేసాకు ఆరేళ్లు వచ్చేసరికే 5.8 అడుగుల ఎత్తు పెరిగింది. ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారు 50 మంది మాత్రమే ఉన్నారట.

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా నందినీ గుప్తా

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల నందినీ గుప్తా ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ - 2023గా ఎంపికయ్యారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఆమె భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన తుది పోటీల్లో దిల్లీకి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్‌గా, మణిపుర్‌కు చెందిన స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. ‣ ఈమెది రాజస్థాన్‌లోని కోటా. చిన్నప్పటి నుంచీ స్కూలు, కాలేజీలో కార్యక్రమాలను నిర్వహించే అలవాటు తనకు. హోస్ట్‌గానూ వ్యవహరించింది. ఆ అనుభవంతో డిగ్రీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ను ఎంచుకుంది. ఓవైపు చదువుతూనే మోడల్‌గానూ రాణిస్తోంది. నలుగురికీ ఉపాధి కల్పించాలన్నది నందిని లక్ష్యం. కోటాకి దగ్గర్లో ‘కైతూన్‌’ అనే ప్రాంతముంది. అక్కడి మహిళలు కోటా డోరియా అనే వస్త్రాన్ని నేస్తారు. కానీ వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా తక్కువ మొత్తంలో చెల్లించి, బయట ఎక్కువ ధరకు ఆ వస్త్రాన్ని అమ్మడం గమనించిన నందిని వారిని ఓ తాటి మీదకు తేవడమే కాదు వారి కళకు ప్రచారాన్నీ కల్పిస్తోంది. ‣ ఎన్నో వడపోతల తర్వాత 30 మంది తలపడిన తుది పోరులో నందిని కిరీటాన్ని దక్కించుకోగా దిల్లీకి చెందిన శ్రేయ పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కి చెందిన తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. తాజా గెలుపుతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిగే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో తలపడే అవకాశాన్నీ సంపాదించుకుంది నందిని.

గుహలో ఒంటరిగా 500 రోజులు

స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్‌ ఫ్లమిని (50) అనే పర్వతారోహకురాలు అరుదైన ఘనత సాధించారు. ఓ భూగర్భ గుహలో ఆమె 500 రోజులు ఒంటరిగా జీవించారు. గుహను వీడి బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టారు. భూగర్భంలో దీర్ఘకాలం పాటు ఒంటరిగా ఉంటే వ్యక్తులపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 2021 నవంబరు 21న ఫ్లమిని ఒంటరిగా గుహలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆమెకు అవసరమైన ఆహారం, ఇతర సామగ్రిని తన బృంద సభ్యులు ఓ చోట పెట్టి వెళ్లిపోయేవారు. ఫ్లమిని వాటిని తీసుకొని, తనకు నిరుపయోగంగా మారిన వస్తువులను అక్కడ వదిలేసేది. గుహలో పఠనం, చిత్రలేఖనం, నేత వంటి ఇష్టమైన పనులు చేస్తూ ఆమె ఎక్కువ సమయం గడిపింది. రెండు కెమెరాల సాయంతో తన అనుభూతులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి బయటకు పంపించింది. నిర్ణీత కాలం పూర్తవడంతో బయటకు వచ్చింది. సమయం ఎంతవుతోందో కూడా తెలుసుకునే వెసులుబాటు లేకపోవడంతో గుహలోకి వెళ్లిన కొన్నాళ్లకు తాను రోజులను లెక్కించడం కూడా మానేశానని ఫ్లమిని తెలిపింది.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి అరుదైన ఘనత

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సత్తా చాటారు. 2023కుగానూ ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్, రచయిత సల్మాన్‌ రష్దీ, బుల్లితెర ప్రయోక్త, న్యాయనిర్ణేత పద్మాలక్ష్మి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ రాజు ఛార్లెస్, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకులు ఎలాన్‌ మస్క్, ప్రఖ్యాత గాయని బియాన్స్‌ తదితరులు కూడా ఈ జాబితాలో నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటించిన ప్రముఖ నటి ఆలియా భట్‌ రాజమౌళి గురించి టైమ్‌ మేగజీన్‌లో ప్రొఫైల్‌ రాశారు.

ఏకధాటిగా 8 గంటల పాటు ఈత కొట్టిన చంద్రకళ ఓజా

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అమ్మాయి నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సంపాదించింది. దుర్గ్‌ జిల్లాలోని పురాయి గ్రామానికి చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా ఈ ఘనత సాధించింది. ఆమె తెల్లవారుజామున అయిదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్విరామంగా ఈత కొట్టింది. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది.

అమెరికా ఆర్థిక రంగంలోనూ భారత సంతతి మహిళల ఘనత

అమెరికా ఆర్థిక సేవల రంగంలో అత్యంత ప్రభావవంత 100 మంది మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు అనుబంధమైన బారన్‌ రూపొందించింది. ఆర్థిక సేవల రంగంలో ఉన్నత స్థాయిలకు చేరడంతో పాటు ఈ రంగ భవితను మార్చడంలో కీలక పాత్రను పోషించిన అత్యుత్తమ 100 మంది మహిళలకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఇందులో భారత సంతతికి చెందిన అను అయ్యంగార్, రూపాల్‌ జె భన్సాలి, సోనాల్‌ దేశాయ్, మీనా ఫ్లిన్, సవితా సుబ్రమణియన్‌కు స్థానం లభించింది. అను అయ్యంగార్‌: జేపీ మోర్గాన్‌లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయ హెడ్‌గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2020 జనవరి నుంచి ఈ విభాగానికి కో-హెడ్‌గా వ్యవహరించారు. రూపాల్‌ జె భన్సాలి: ఏరియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 100 వుమెన్‌ ఇన్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. సోనాల్‌ దేశాయ్‌: 2018లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కు ముఖ్య పెట్టుబడుల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె నిర్వహణలో 137 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. మీనా ఫ్లిన్‌: గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూపులో గ్లోబల్‌ ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి కో-హెడ్‌గా ఉన్నారు. ఆమె 1999లో జేపీ మోర్గాన్‌ ఛేజ్‌లో చేరారు. ఆ తర్వాతి సంవత్సరమే గోల్డ్‌మన్‌ శాక్స్‌కు మారారు. సవితా సుబ్రమణియన్‌: బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో యూఎస్‌ ఈక్విటీ, క్వాంటిటేటివ్‌ స్ట్రాటజీ విభాగానికి హెడ్‌గా ఉన్నారు.

ఆసియా సంపన్నుడిగా అంబానీ

ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 83.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. ‘జనవరి 24న అదానీ 126 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలో మూడో సంపన్నుడిగా ఉన్నారు. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక తర్వాత ప్రస్తుతం ఆయన సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని ఫోర్బ్స్‌ తెలిపింది. అంబానీ తర్వాత రెండో ధనిక భారతీయుడిగా అదానీ నిలిచారు. గతేడాది అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 100 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది. ముఖ్యాంశాలు.. ‣ ఫోర్బ్స్‌ జాబితాలోని అగ్రగామి 25 సంపన్నుల మొత్తం సంపద విలువ 2.1 లక్షల కోట్ల డాలర్లు. ‣ ట్విటర్‌ కొనుగోలు తర్వాత ఎలాన్‌ మస్క్‌ సంపద 39 బిలియన్‌ డాలర్లు తగ్గి రెండో స్థానానికి వచ్చారు. ‣ ఫ్రాన్స్‌ విలాస వస్తువుల దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 211 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. మస్క్‌ (180 బి.డాలర్లు), బెజోస్‌ (114 బి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ‣ ఫోర్బ్స్‌ 2023 జాబితాలో 169 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. 2022లో వీరి సంఖ్య 166గా ఉంది. కానీ వీరి సంపద మాత్రం 750 బి.డాలర్ల నుంచి 10% తగ్గి 675 బి.డాలర్లకు చేరింది. ‣ హెచ్‌సీఎల్‌ టెక్‌ అధిపతి శివ్‌ నాడార్‌ సంపద 11% కోల్పోయి 25.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ఆయన దేశంలో మూడో సంపన్న వ్యక్తిగా ఉన్నారు. సైరస్‌ పూనావాలా, లక్ష్మీ మిత్తల్, సావిత్రి జిందాల్, దిలీప్‌ సంఘ్వీ, రాధాకిషన్‌ దమానీ, కుమార్‌ బిర్లా, ఉదయ్‌ కోటక్‌ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. ‣ జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్, నితిన్‌ కామత్‌లు వరుసగా 1.1 బి.డాలర్లు, 2.7 బి.డాలర్ల సంపదతో జాబితాలో తొలిసారి స్థానం పొందారు.

చంద్రుడి పైకి వెళ్లే వ్యోమగాముల్లో ఓ మహిళ

వచ్చే ఏడాది చివర్లో చేపట్టబోయే చంద్రమండల యాత్ర కోసం నలుగురు వ్యోమగాములను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంపిక చేసింది. వీరిలో ఒక మహిళ ఉన్నారు. వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికన్లు కాగా కెనడా వాసి ఒకరు ఉన్నారు. హ్యూస్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నాసా వీరిని పరిచయం చేసింది. వీరిలో మిషన్‌ కమాండర్‌ రీడ్‌ వైస్‌మాన్, విక్టర్‌ గ్లోవర్, క్రిస్టీనా కోచ్, కెనడాకు చెందిన జెరిమీ హాన్సెన్‌ ఉన్నారు. వ్యోమగాముల్లో క్రిస్టీనా కోచ్‌ సుదీర్ఘకాలం అంతరిక్ష యాత్ర చేపట్టిన మహిళగా గుర్తింపు పొందారు. వీరిలో హాన్సెన్‌ తప్ప అందరికీ రోదసి యాత్ర అనుభవం ఉందని సంస్థ అధిపతి బిల్‌ నెల్సన్‌ పేర్కొన్నారు. నాసాకు చెందిన ఒరాయన్‌ కాప్స్యూల్‌లో వీరు యాత్ర చేపడతారు. అయితే వారు జాబిల్లిపై దిగరు. చంద్రుడి కక్ష్యలోకి మాత్రమే వెళ్లి, తిరిగి భూమికి చేరుకుంటారు. 2025లో చేపట్టే యాత్రలో చందమామపై ఇద్దరు వ్యోమగాములు దిగుతారు.

900 ఏళ్ల నాటి కందూరు చోళుల శాసనం!

దాదాపు 900 ఏళ్ల నాటి శిలా శాసనం ఒకటి నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్‌లో లభ్యమైంది. దీన్ని కందూరు చోళుల నాటి వైద్య శాసనంగా పురావస్తు నిపుణులు చెబుతున్నారు. 12వ శతాబ్దానికి చెందిన కందూరు చోళుల శాసనంగా వారు గుర్తించారు. అది వైద్య శాసనం అని, కందూరు చోళుల రాజవంశానికి చెందిన ఉదయన చోడ రాజు వేయించారని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ శాసనం కందూరు చోళ రాజులు ఆచరించిన వైద్య సమాచారాన్ని తెలియజేస్తోందన్నారు.

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ చోటు దక్కించుకుంది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ అధ్యయనం వెల్లడించింది. పది లక్షల డాలర్లకు (మన కరెన్సీలో దాదాపు రూ.8.2 కోట్లు) పైగా ఆస్తులు ఉన్న వ్యక్తులను మిలియనీర్లుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 97 నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా హైదరాబాద్‌కు 65వ స్థానం లభించింది. భారత్‌ నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్‌ నగరం తొలి స్థానం పొందింది. అలానే 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక నికర సంపద ఉన్న వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగిందని ఈ మేరకు పేర్కొంది. అధ్యయనం చేసిందిలా.. దేశాలు, నగరాల మధ్య సంపద వలస పోకడలను పరిశీలించే స్వతంత్ర పరిశోధన సంస్థ న్యూ వరల్డ్‌ వెల్త్‌ సహకారంతో అధ్యయన ఫలితాలను వెల్లడించినట్లు హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ పేర్కొంది. సంస్థ అంతర్గత డేటాబేస్‌లో ఉన్న 1,50,000కు పైగా వ్యక్తుల ఖర్చుల అలవాట్లు, ఆస్తి రిజిస్టర్లు, స్థిరాస్తుల విక్రయాలు, ఆయా ప్రాంతాల్లో అధిక ధర ఉన్న గృహాల సంఖ్య, పెట్టుబడి పెట్టే సంపద, నగదు, లిస్టెడ్‌ కంపెనీ హోల్డింగ్‌లు తదితరాలను పరిగణనలోకి తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. 40 మంది సెంటీ మిలియనీర్లు, అయిదుగురు బిలియనీర్లు హైదరాబాద్‌లో 40 మంది సెంటీ మిలియనీర్లు, అయిదుగురు బిలియనీర్లు ఉన్నట్లు తెలిపింది. 100 మిలియన్‌ అమెరికా డాలర్ల (రూ. 822 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులను సెంటీ మిలియనీర్లుగా, ఒక బిలియన్‌ డాలర్ల (రూ.8,225 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉంటే బిలియనీర్లుగా పరిగణిస్తారు.

తెలంగాణలో అయ్యనార్‌ ఆరాధన

సాధారణంగా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కనిపించే అయ్యనార్‌ల ఆరాధన తెలంగాణలోనూ సాగినట్లు గుర్తించామని చారిత్రక పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి వివరించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో మంగళికుంట వద్ద అయ్యనార్‌ శిల్పాన్ని గుర్తించినట్లు చెప్పారు. కుంటలు, చెరువులు, నదులు, సరస్సులు, పంట పొలాలను రక్షించే దేవుడిగా పేర్కొన్నారు. సుమారు 1600 సంవత్సరం నాటిదై ఉంటుందన్నారు.

మేఘాలయ గుహలో కొత్త కప్ప జాతి గుర్తింపు

మేఘాలయలోని సౌత్‌ గారో హిల్స్‌ జిల్లాలోని ఒక గుహలో కొత్త కప్ప జాతిని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది కాస్కేడ్‌ రానిడ్‌ జాతికి సంబంధించిందని వారు పేర్కొన్నారు. అక్కడ 4 కిలోమీటర్ల పొడవైన సిజూ గుహలో ఇది వెలుగు చూసింది. అందువల్ల ఆ మండూకానికి అమోలోప్స్‌ సిజు అని పేరు పెట్టారు. ఇది గుహ ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో కనిపించిందన్నారు. ఇది గుహలోని వాతావరణానికి అనుగుణంగా మార్పులకు లోనైనట్లు కనిపించడం లేదని, అందువల్ల అది ఆ ప్రదేశంలో శాశ్వతంగా నివాసం ఉండటం లేదని స్పష్టమవుతోందని వివరించారు. భారత్‌లో కొత్త కప్ప జాతులను గుహలో కనుగొనడం ఇది రెండోసారి. 2014లో తమిళనాడులో మిక్రిక్షాలస్‌ స్పెలున్సా అనే జాతిని గుర్తించారు.

రాంనగర్, గౌరి గ్రామాల్లో అరుదైన శిలల గుర్తింపు

తెలంగాణలోని ఆసిఫాబాద్‌ - కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని రాంనగర్, గౌరి గ్రామాల అటవీ ప్రాంతాల్లో కాలమ్నార్‌ బసాల్ట్స్‌ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. తమ బృందం సభ్యుడు తిరుపతి గిత్తే వాటిని గుర్తించారని, బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట భూగర్భంలోని రంధ్రాల ద్వారా పైకి వచ్చిన లావా, గట్టిపడ్డాక ఏర్పడిన శిలల రూపాలనే కాలమ్నార్‌ బసాల్ట్స్‌గా పిలుస్తారని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో 15 అరుదైన మూలకాల గుర్తింపు

అనంతపురం జిల్లాలో అరుదైన మూలకాల ఉనికిని హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. వైద్య సాంకేతికత, వైమానిక, రక్షణ, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వివిధ పారిశ్రామిక అవసరాల్లో ఈ మూలకాలు అత్యంత కీలకం. లాంథనమ్, సిరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ఇట్రియం, హాఫ్నియం, టాంటాలమ్, నియోబియం, జిర్కోనియం, స్కాండియం మూలకాలు వీటిలో ఉన్నాయి. నిత్యం ఉపయోగించే సెల్‌ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో, ఆటోమోటివ్, విద్యుత్తు పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు. అనంతపురం జిల్లాలో సేకరించిన రాళ్లను విశ్లేషించినప్పుడు వాటిలో అరుదైన 15 రకాల మూలకాలను గుర్తించినట్లు పరిశోధనలో పాలుపంచుకున్న ఎన్‌జీఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.వి.సుందర్‌రాజు తెలిపారు. వీటినుంచి శాశ్వత అయస్కాంతాలను తయారు చేయవచ్చని తెలిపారు. సెల్‌ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్, విండ్‌ టర్బైన్లు, జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఇతర ఉత్పత్తులలో ఉపయోగించే అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌కు శాశ్వత అయస్కాంతాల అవసరం ఉంటుందన్నారు. డిజిటలైజేషన్‌ కారణంగా వీటికి డిమాండు ఉందన్నారు.

పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్‌’ గుర్తింపు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డ మీద మట్టితో తయారు చేసిన పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్‌’ను నూతన తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్‌ గుర్తించారు. రెండు వేల ఏళ్ల నాటి ఈ ‘స్పూల్న్‌’ను నేత పనిలో వాడేవారని, ఇది చాలా అరుదైన పరికరమని ఆయన తెలిపారు. గిరక మాదిరిగా ఉండే ఈ పరికరాన్ని దారం వడకడం, కండెలు చుట్టడానికి ఉపయోగించేవారని చెప్పారు.

పోతులమడుగులో వెయ్యేళ్ల నాటి శిల్పాలు గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం పోతులమడుగులోని వేణుగోపాల స్వామి అలయ సమీపంలో వెయ్యేళ్ల నాటి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. దేవాలయ ప్రాంగణానికి కొంత దూరంలో వృథాగా పడి ఉన్న శిల్పాలను ఆయన పరిశీలించారు. కాకతీయుల కాలం నాటి వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణం సమయంలో నాగదేవత, చాముండి, భద్రకాళి, నందీశ్వరుడు, నల్లశాన పురాతన విగ్రహాలను అలయం వెలుపలకు చేర్చారని, కల్యాణి చాళుక్య, కాకతీయుల (క్రీ.శ.12, 13 శతాబ్దాలు) నాటి విగ్రహాలు చారిత్రక ప్రాధాన్యం కలవని పేర్కొన్నారు.

కేరళలో కొత్త రకమైన సీతాకోకచిలుక గుర్తింపు

కేరళలోని అక్కుళం, వెంబనడ్‌ సరస్సుల వద్ద క్తొత రకమైన సీతాకోకచిలుకలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కాల్టొరిస్‌ బ్రోమస్‌ సదాశివ అనే సీతాకోకచిలుకలను కనుగొన్నారు. కాల్టొరిస్‌ రకానికి చెందిన సీతాకోకచిలుకలు ఆగ్నేయాసియాలో 15 రకాల వరకు ఉన్నాయి. ఇందులో కాల్టొరిస్‌ బ్రోమస్‌ ఒకటి. ఈ మేరకు దీని ఉపరకాన్ని గుర్తించినట్లు లెపిడోప్టెరిస్ట్‌ల శాస్త్రవేత్తల బృందం తెలిపారు.

ప్రపంచ సవాళ్లకు బుద్ధుని బోధనలే పరిష్కారం

యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మతోన్మాదం, వాతావరణ మార్పులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచానికి గౌతమ బుద్ధుని బోధనలు పరిష్కారం చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ‘ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు’ దిల్లీలో ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గౌతమ బుద్ధ భగవానుడి బోధనల్ని ప్రపంచం ఆచరించి ఉంటే వాతావరణ సంక్షోభం ఎదురయ్యేది కాదన్నారు. భవిష్య తరాలకు సుస్థిరాభివృద్ధిని ఇచ్చేది బుద్ధుని బోధనలేనని చెప్పారు. ప్రజలు, ఆయా దేశాలు తమ సొంత ప్రయోజనాలతో పాటు ప్రపంచం గురించీ పట్టించుకోవడం ప్రస్తుత తరుణంలో అవసరం. బుద్ధుని తత్వం నుంచి మనం స్ఫూర్తి పొందాలి. సంకుచిత భావాన్ని పక్కనపెట్టాలి. పేదల కోసం, వనరులు లేని దేశాల కోసం ప్రపంచం ఆలోచించాలి. ప్రపంచ సంక్షేమానికి ఇలాంటి చొరవను భారత్‌ చూపిస్తోంది. బుద్ధుని స్ఫూర్తితోనే మానవాళికి చేయూతనందిస్తోందని వివరించారు. యుద్ధాలను కాకుండా బుద్ధుడిని ప్రపంచానికి భారత్‌ ఇచ్చిందని చెప్పారు. ఈ సదస్సు ద్వారా ఇతర దేశాలతో దౌత్య, సాంస్కృతిక బంధాలు బలపడతాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. 30 దేశాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

జీ-7 కూటమి విదేశాంగ మంత్రుల సదస్సు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని, తైవాన్‌పై చైనా బెదిరింపులను ఉమ్మడిగా ఎదుర్కొంటామని ఇక్కడ జరిగిన జీ-7 కూటమి విదేశాంగ మంత్రుల సదస్సు ప్రకటించింది. రష్యాపై విధించిన కఠిన ఆంక్షల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో పౌరులపైన, మౌలిక వసతులపైన దాడులు, అత్యాచారాలు, ఇతర యుద్ధ నేరాలకు పాల్పడినందుకు రష్యా శిక్ష నుంచి తప్పించుకోలేదని ఉద్ఘాటించింది. జీ-7లో అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, ఈయూలు సభ్యులు. ఇక్కడ సమావేశాలు ముగిశాక విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కూటమి ప్రతినిధులు ఉత్తర కొరియా, ఇరాన్, మయన్మార్, అఫ్గానిస్థాన్, అణ్వస్త్ర వ్యాప్తి వంటి తీవ్ర సమస్యల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్, తైవాన్‌ సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ‣ జీ-7 విదేశాంగ మంత్రుల సంయక్త ప్రకటన వచ్చే నెల హిరోషిమాలో జరిగే కూటమి శిఖరాగ్ర సదదస్సుకు అజెండాగా ఉపకరిస్తుంది. ఉక్రెయిన్‌లో అవసరమైతే అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బెదరించడం బాధ్యతారహితమని సంయుక్త ప్రకటన ఖండించింది. తైవాన్‌పై దండయాత్ర తప్పదన్న సంకేతాలను చైనా ఇవ్వడాన్ని కూటమి తప్పుబట్టింది. గత సంవత్సర ఆరంభం నుంచి ఇంతవరకు 100 క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా తీరుపైనా ఆందోళన వ్యక్తం చేసింది.

రష్యాను అడ్డుకుందాం: జీ-7 మంత్రుల సమావేశంలో నిర్ణయం

రష్యాను అడ్డుకునేలా ఉక్రెయిన్‌కు మరింత మద్దతు కూడగట్టేందుకు కృషి చేద్దామని, తైవాన్‌పై కాలుదువ్వుతున్న చైనాకు చెక్‌ పెడదామని, క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియాకు గుణపాఠం చెబుదామని జీ-7 దేశాల మంత్రుల సమావేశం నిర్ణయించింది. మేలో హిరోషిమాలో జరగనున్న జీ-7 దేశాల అధినేతల సమావేశానికి సన్నాహకంగా కరిజావా రిసార్టులో మంత్రులు సమావేశమయ్యారు. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ఎక్కువగా వారు చర్చించారు. రష్యా అణు ఆయుధాలను వాడతామని హెచ్చరించడాన్ని జపాన్‌ విదేశాంగ మంత్రి యోషిమసా హయాషి ప్రస్తావించారు. ఉక్రెయిన్‌కు ఇంధన, సైనిక సాయంలో మద్దతు సాధించడమే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ లక్ష్యమని ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రతినిధి వెల్లడించారు. సమావేశానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్‌ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు.

మైత్రీ బంధం బలోపేతానికి మార్గసూచీ

మూడు దేశాల (భారత్, భూటాన్, చైనా) సరిహద్దు కూడలి డోక్లామ్‌ ట్రైజంక్షన్‌ వివాదం నేపథ్యంలో ఉమ్మడి రక్షణ, భద్రత ప్రయోజనాల దృష్ట్యా తమ మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని మోదీ, భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ నిర్ణయించారు. ఇరు దేశాల అధినేతలు అయిదు సూత్రాల మార్గసూచీకి తుది రూపమిచ్చారు. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన వాంగ్‌చుక్‌ దిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. ఆర్థిక, వాణిజ్యపరమైన సహకారంతో పాటు ఇంధన, అంతరిక్ష, సాంకేతి రంగాల్లో భూటాన్‌కు చేయూతనందించేందుకు భారత్‌ హామీనిచ్చింది.

అత్యంత ప్రతికూల వాతావరణ ఏడాది 2022

2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్‌ నేతృత్వంలో ‘స్టేట్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ క్లైమెట్‌ 2022’ నివేదికను విడుదల చేసింది. లానినా పరిస్థితులున్నప్పటికీ ఇది ‘అయిదో లేదా ఆరో’ వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిందని తెలిపింది. 2015 నుంచి ఎనిమిదేళ్లు అత్యంత వెచ్చగా ఉన్నాయి. గతేడాది తీవ్ర వరదలు, రికార్డు స్థాయి వేడి గాలులు, కరవు పరిస్థితుల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని తెలిపింది. 2022 ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందు (1850 - 1900) సరాసరి కంటే 1.15 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉందని వెల్లడించింది. అలాగే సముద్ర జలాల వేడి, ఆమ్లత్వ స్థాయిలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంటార్కిటిక్‌ సముద్ర మంచు, యూరోపియన్‌ ఆల్ప్స్‌ హిమానీనదాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణంలోని మూడు ప్రధాన గ్రీన్‌హౌస్‌ వాయువులు కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ 2021లో రికార్డు స్థాయిని తాకడం ఈ ప్రతికూల పరిస్థితులకు కారణమని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల తగ్గుదల.. 2022 వేసవిలో భారత్, పాకిస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, పాకిస్థాన్‌లో మార్చి, ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఎండలున్నాయని డబ్ల్యూఎంవో తెలిపింది. ఈ రెండు నెలలు జాతీయ సగటు ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక సగటు కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయని పేర్కొంది. భారత్‌లో విపరీతమైన వేడిమి కారణంగా ధాన్యం దిగుబడులు తగ్గిపోగా, ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతంలో అనేక చోట్ల కార్చిచ్చులు రేగాయని పేర్కొంది. ఈ తరహా ప్రతికూల వాతావరణం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతోందని, అందువల్ల భారత్‌లో గోధుమలు, వరి ఎగుమతులపై ఆంక్షలు విధించారని గుర్తుచేసింది. భారత్‌లో వరదల వల్ల సుమారు 700 మంది మృత్యువాత పడగా, మరో 900 మంది పిడుగుల బారినపడి మృతి చెందారని డబ్ల్యూఎంవో తెలిపింది. పాకిస్థాన్‌లోనూ ఇదే విధంగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్‌ దేశాల్లో 2022లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నివేదిక గుర్తుచేసింది. తూర్పు ఆఫ్రికాలో కరవు పరిస్థితులు, చైనా, యూరప్‌ల్లో వేడి గాలుల తీవ్రత వల్ల అనేక మంది ప్రజలు కష్టాలు పడ్డారని వివరించింది. ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచ వ్యాప్తంగా జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూఎంవో ప్రధాన కార్యదర్శి పిట్టిరి టాలాస్‌ హెచ్చరించారు.

భారత్‌లో వ్యాక్సిన్‌కు దూరంగా 27 లక్షల మంది చిన్నారులు

ప్రపంచంలో సాధారణ వ్యాక్సిన్‌ పొందని 27 లక్షల మంది చిన్నారులకు భారతదేశం నిలయంగా మారిందని యునిసెఫ్‌ ప్రకటించింది. కరోనా-19 తరువాత వ్యాక్సిన్ల ప్రాముఖ్యతపై అవగాహన స్థిరపడిన లేదా మెరుగుపడిన 55 దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొందని యునిసెఫ్‌ పేర్కొంది. ఇలా వ్యాక్సిన్లు పొందని చిన్నారుల్లో సగం మంది 11 రాష్ట్రాల్లోని 143 జిల్లాల్లో ఉన్నారని యునిసెఫ్‌ వైద్య నిపుణుడు వివేక్‌ వీరేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఇటువంటి చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందని దాంతో వారు భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారన్నారు. అదే ఆఫ్రికాలో 2019 - 2021 మధ్య కాలంలో కోటి 27 లక్షల మంది చిన్నారులు ఇదే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపింది.

142.86 కోట్ల జనాభాతో భారత్‌ నం.1

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. ఇప్పటిదాకా నంబరు 1గా నిలిచిన చైనాను దాటేసింది. మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా డాష్‌ బోర్డు ఇప్పుడు భారత్‌ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిస్తోంది. భారత్‌తో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు ఐరాస తెలిపింది. కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుతుండగా భారత్‌లోనూ పెరుగుదలలో కొంత మేరకు క్షీణత కనిపిస్తోంది. అయితే చైనాతో పోలిస్తే తక్కువే. దీంతో భారత్‌ అగ్రస్థానానికి చేరింది. 2022 నాటికి భారత్‌ జనాభా 141.2 కోట్లు కాగా చైనా జనాభా 142.6 కోట్లు. బిహార్, యూపీల్లో యువత ఎక్కువ దేశంలో రాష్ట్రాల మధ్య జనాభాలో పలు వైరుధ్యాలున్నాయి. కేరళ, పంజాబ్‌లలో వయసు మీరినవారు ఎక్కువగా ఉన్నారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో యువత అధికంగా ఉన్నారు. తొలిసారిగా అగ్రస్థానం 1950 నుంచి ఐరాస జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పట్నుంచి అగ్రస్థానంలో చైనా కొనసాగుతోంది. తొలిసారిగా భారత్‌ ఈ ఏడాది అగ్రస్థానానికి చేరుకుంది. 2050 నాటికి మన జనాభా 166.8 కోట్లకు చేరుతుందని ఐరాస నివేదిక వెల్లడించింది. అప్పటికి చైనా జనాభా 131.7 కోట్లకు పడిపోనుంది. 1950 నుంచి ఇప్పటివరకూ చూస్తే ఇటీవల కాలంలో జనాభా వృద్ధి రేటు మరీ తక్కువగా నమోదవుతోంది. అత్యల్పంగా 2020లో 1 శాతం కంటే తక్కువ వృద్ధి రేటు నమోదైంది. జీవనకాలం తక్కువే భారత్‌లో జీవన కాలం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది. పురుషుల ఆయుష్షు మన దేశంలో సరాసరిన 71 ఏళ్లు ఉండగా మహిళలకు 74గా ఉంది. ‣ భారత్‌లో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు వారిలో గర్భ నిరోధక పద్ధతులను అవలంబిస్తున్న వారు 51 శాతం మంది.

అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా సర్వేలో తొలిస్థానం సాధించింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్టాట్రెజీ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కె. పిలానియా కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, వృత్తి, మతం, కొవిడ్‌-19 ప్రభావం, దాతృత్వం అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే నిర్వహించారు. ఈ అంశాలు స్థానిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి మిజోరంను అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగానూ మిజోరానికి గుర్తింపు ఉంది. స్థానిక ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లితండ్రులతో క్రమం తప్పకుండా సమావేశమవుతారు. విద్యార్థులు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా తల్లిదండ్రులతో చర్చించి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. కుల రహితమైన మిజోరం సమాజ నిర్మాణం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఆడ, మగ అనే భేదం లేకుండా యువత 16, 17 ఏళ్ల వయసులోనే ఉపాధి పొందుతున్నారు. చిన్న వయసులోనే సంపాదించడాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేదు. మిజోరంలో ఉద్యోగం చేసే మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉంటారని నివేదిక పేర్కొంది.

దేశంలో అత్యంత ధనిక సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల అందరి ఆస్తుల ఉమ్మడి విలువ రూ.1,018.86 కోట్లు కాగా, అందులో 50.09 శాతం ఆస్తులు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదే ఉన్నాయి. మిగతా 29 మంది సీఎంల ఆస్తుల సంయుక్త విలువ రూ.508 కోట్లు కాగా, జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరి ఆస్తి అంతకంటే ఎక్కువగా రూ.510.38 కోట్ల మేర ఉంది. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు, మిగతా స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు నేతృత్వం వహిస్తున్న 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా ఈ వివరాలు వెల్లడించాయి. ఈ జాబితా ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అందరి కంటే తక్కువగా రూ.15 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు. సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో జగన్‌ తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ (రూ.163 కోట్లు), ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ (రూ.63 కోట్లు) రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ‣ దేశంలోని 28 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరిలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో చేరిన జమ్మూకశ్మీర్‌కు సీఎం లేరు. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం.. 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై (43%) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, నేరపూరితమైన బెదిరింపు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఇవన్నీ అయిదేళ్లకు పైగా కారాగారశిక్ష పడే అవకాశమున్న నాన్‌ బెయిలబుల్‌ కేసులు. అతి తక్కువ ప్రకటిత సంపద ఉన్న జాబితాలో మమతా బెనర్జీ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్‌ (రూ.1.18 కోట్లు), హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (రూ.1.27 కోట్లు) ఉన్నారు. బిహార్, దిల్లీ సీఎంలు నీతీశ్‌ కుమార్, అరవింద్‌ కేజ్రీవాల్‌ల ఆస్తులు రూ.3 కోట్లకు పైగా ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. అప్పుల్లో కేసీఆర్‌ టాప్‌ 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం.. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఆస్తి విలువ రూ.23.55 కోట్లు కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆస్తి రూ.కోటికి పైగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్‌ (తమిళనాడు), బసవరాజ్‌ బొమ్మై (కర్ణాటక)లకు ఒక్కొక్కరికి రూ.8 కోట్లకు పైగా ఆస్తి ఉంది. అత్యధిక అప్పులు, కేసులున్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈయనకు అప్పులు రూ.8.88 కోట్ల మేర ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో మరే ముఖ్యమంత్రికీ అప్పుల్లేవు. కేసీఆర్‌ పేరు మీద మొత్తం 64 కేసులు కూడా నమోదయ్యాయి. కేసుల్లో కేసీఆర్‌ తర్వాతి స్థానాల్లో ఎంకే స్టాలిన్‌ (47), జగన్‌మోహన్‌రెడ్డి (38), ఏక్‌నాథ్‌ శిందే (18), అరవింద్‌ కేజ్రీవాల్‌ (13) ఉన్నారు. అప్పుల్లో కేసీఆర్‌ తర్వాతి స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (రూ.4.99 కోట్లు), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (రూ.3.74 కోట్లు) ఉన్నారు. ‣ 30 మంది ముఖ్యమంత్రుల్లో గ్రాడ్యుయేషన్‌ విద్యార్హత కలిగినవారు 11 మంది (37%), పీజీ చేసినవారు 9 (30%), గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్‌ కోర్సు చేసినవారు నలుగురు (14%), 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు ముగ్గురు (10%) ఉన్నారు.

నేరాల్లో భారత్‌కు 77వ స్థానం

నేరాలపై వెలువడిన వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్‌ 77వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు అత్యధిక నేరాలతో వెనిజులాకు మొదటి స్థానం. అమెరికాకు 55వ ర్యాంక్, ఇంగ్లండ్‌కు 65వ ర్యాంక్‌ లభించింది. తుర్కియే, జర్మనీ, జపాన్‌ తక్కువ నేరాలతో 92, 100, 135 స్థానాల్లో నిలిచాయి.

అధిక వ్యయంలో సమాజ్‌వాదీ పార్టీకి తొలి స్థానం

2021 - 22లో 36 ప్రాంతీయ పార్టీలు రూ.288 కోట్లు ఖర్చు చేశాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక పేర్కొంది. ఇందులో టాప్‌-5 పార్టీల వ్యయం రూ.176.77 కోట్లు కాగా, ఇది మొత్తం ఖర్చులో 61.35 శాతమని తెలిపింది. అధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీల జాబితాలో తొలి స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ (రూ. 54 కోట్లు) ఉండగా, తరువాతి స్థానాల్లో డీఎంకే (రూ.35 కోట్లు), ఆప్‌ (రూ. 30 కోట్లు), బీజేడీ (రూ. 28 కోట్లు), అన్నాడీఎంకే (రూ.28 కోట్లు) ఉన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా 36 ప్రాంతీయ పార్టీలకు రూ.1,213 కోట్ల విరాళాలు అందాయని తెలిపింది.

‘ఎనర్జీ ఎఫిషియన్సీ’లో ముందు వరుసలో తెలుగు రాష్ట్రాలు

కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ విడుదల చేసిన ‘స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్‌ - 2021 - 22’ నివేదికలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, రాజస్థాన్‌ 60కిపైగా పాయింట్లు సాధించి ముందు వరుసలో (ఫ్రంట్‌ రన్నర్స్‌) నిలిచాయి. ఇందులో కర్ణాటక 82.5, ఆంధ్రప్రదేశ్‌ 77.5, తెలంగాణ 74, కేరళ 68.5, రాజస్థాన్‌ 67 పాయింట్లు సాధించి మిగిలిన రాష్ట్రాల కంటే ముందంజ వేశాయి. అస్సాం, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్‌లు 50-60 పాయింట్లతో తర్వాతి స్థానానికి పరిమితమయ్యాయి. గత సూచికతో పోలిస్తే ఈసారి తెలంగాణ 45.5, ఆంధ్రప్రదేశ్‌ 27 పాయింట్లను మెరుగుపరచుకున్నట్లు నివేదిక వెల్లడించింది.

దేశంలో పులులు 3,167

దేశంలో పులుల సంఖ్య 3,167కి చేరింది. 2018తో పోలిస్తే 200 పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో విడుదల చేసిన ‘స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ - 2022’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. గత నివేదికలో రాష్ట్రాలవారీగా పులుల సంఖ్యను వెలువరించగా ఈసారి దాన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. మధ్యభారతం, తూర్పు కనుమల పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో 2018లో 1,033 పులులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 1,161కి చేరింది. శివాలిక్‌ పర్వత సానువులు, గంగామైదానంలో అత్యధికంగా 158 పులులు పెరగ్గా, సుందర్‌బన్‌ ప్రాంతంలో 12 మాత్రమే వృద్ధి చెందాయి. పశ్చిమ కనుమల్లో 157, ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదానంలో 25 మేర తగ్గాయి. మొత్తంగా మూడు ప్రాంతాల్లో నికరగా 298 పెరగ్గా, రెండుప్రాంతాల్లో 182 తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవేంకటేశ్వర నేషనల్‌ పార్క్, తెలంగాణలోని కవల్‌లోని పలు ప్రాంతాల్లో పులులు అంతరించిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో పులుల సంఖ్యను ఇది వరకు స్థాయికి తీసుకురావడానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

2021తో పోలిస్తే 2022లో ఎక్కువ అంతరిక్ష ప్రయోగాలు

అంతరిక్ష ప్రయోగాలు 2021తో పోలిస్తే 2022లో అధిక సంఖ్యలో జరిగినట్లు ఇస్రో అంతరిక్ష పరిస్థితుల అవగాహన (ఎస్‌ఎస్‌ఏ) అంచనా నివేదిక వెల్లడించింది. అందులోని వివరాల ప్రకారం.. 2021లో 135 ప్రయోగాల ద్వారా 1860 వస్తువులను కక్ష్యలోకి ప్రవేశపెట్టగా 2022లో 179 ప్రయోగాల ద్వారా మొత్తం 2,533 వస్తువులను కక్ష్యలోకి చేర్చారు. 2022లో విజయవంతమైన ప్రయోగాల్లో 32 శాతం, కక్ష్యలో ప్రవేశపెట్టిన వస్తువుల సంఖ్యలో 36 పెరుగుదల కనిపించింది. నాలుగు ఘటనల వల్ల అంతరిక్ష శిథిలాలకు మరో 360 శకలాలు తోడయ్యాయి. 2022 వరకు ప్రైవేటు ఆపరేటర్లు/విద్యా సంస్థలకు చెందిన 124 భారతీయ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. జనవరి 2023 నాటికి దిగువ భూ కక్ష్య (లియో)లో 23, స్థిర కక్ష్య (జియో)లో 29 పనిచేసే ఉపగ్రహాలను భారత ప్రభుత్వం కలిగి ఉంది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ చంద్రుని కక్ష్యలో విధులు చురుగ్గా నిర్వర్తిస్తోంది. మరోవైపు 2022లో 13 ఉపగ్రహాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు ఇస్రో పేర్కొంది. 2022లో నాలుగు విజయవంతమైన ప్రయోగాల ద్వారా ఎనిమిది భారతీయ ఉపగ్రహాలను, నాలుగు రాకెట్‌ బాడీలను కక్ష్యలో ఉంచినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 20, 2009న ప్రయోగించిన రీశాట్‌-2 సెప్టెంబర్‌ 2022 వరకు పనిచేసి అక్టోబరు 30, 2022న భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. అక్టోబర్‌ 12, 2011న ప్రయోగించిన మేఘా ట్రోఫిక్స్‌-1 ఉపగ్రహాన్ని ఆగస్టు - డిసెంబరు 2022లో వరస విన్యాసాలతో నిర్వీర్యం చేసినట్లు ఇస్రో ఈ నివేదికలో వెల్లడించింది.

‘ఇండియా జస్టిస్‌’లో తెలంగాణకు 3, ఏపీకి 5వ ర్యాంకు

పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఈ మేరకు ‘ఇండియా జస్టిస్‌’ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడులు తొలి రెండు స్థానాల్లో నిలవగా తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానాలను దక్కించుకున్నాయి. గుజరాత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు టాటా ట్రస్టు మంగళవారం తన మూడో ఇండియా జస్టిస్‌ నివేదిక (ఐజేఆర్‌) - 2022 వెల్లడించింది. ఈ ట్రస్టు 2019 నుంచి ఐజేఆర్‌ నివేదికలు ఇస్తోంది.

ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ప్రాంతాల మధ్య వంధ్యత్వ సమస్యలో పెద్దగా తేడాలు లేవని, సంపన్న, మధ్య తరగతి, పేద దేశాల్లో ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. సంపన్న దేశాల్లో 17.8 శాతం, మధ్య తరగతి, పేద దేశాల్లో 16.5 శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉంది. సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అద్నాం గేబ్రియేసస్‌ తెలిపారు. ఇంత మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి సంతాన సాఫల్య సౌకర్యాలను విస్తరించాలని, అవి అందుబాటు ధరల్లో ఉండాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డు

41 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్లో రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్‌ తాజాగా టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ క్యాచ్‌ అందుకున్న అతను మొత్తం 208 క్యాచ్‌లతో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. డికాక్‌ (207), దినేశ్‌ కార్తీక్‌ (205) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సత్యన్, రీత్‌లకు టైటిళ్లు

జాతీయ అంతర్‌ యూనిట్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సత్యన్, రీత్‌ రిష్య టైటిళ్లు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సత్యన్‌ (ఓఎన్‌జీసీ) 11-5, 11-9, 5-11, 11-8, 12-10తో శరత్‌కమల్‌ (ఐవోసీఎల్‌)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌ తుది పోరులో రీత్‌ రిష్య (ఐవోసీఎల్‌) 9-11, 11-4, 7-11, 7-11, 11-9, 11-4, 11-7తో యశస్విని గోర్పాడే (ఐవోఎల్‌)పై నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పురుషుల్లో అంకుర్‌ (ఐవోఎల్‌) 8-11, 11-8, 11-3, 11-8, 11-6తో సౌరభ్‌ సాహా (ఓఎన్‌సీజీ)ని ఓడించగా మహిళల్లో దివ్య (ఓఎన్‌జీసీ) 11-4, 11-8, 9-11, 11-8, 11-6తో జెన్నిఫర్‌ వర్గీస్‌ (ఐవోసీఎల్‌)పై గెలిచింది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే సూర్యకుమార్‌

టీమ్‌ ఇండియా విధ్వంసక‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఈ మేరకు ప్రకటించిన టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 906 పాయింట్లతో సూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (798) రెండు, బాబర్‌ ఆజాం (769) మూడో ర్యాంకుల్లో నిలిచారు. విరాట్‌ కోహ్లి (612) 15వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో 14వ స్థానంలో నిలిచిన అర్ష్‌దీప్‌సింగ్‌దే భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంకు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య రెండో ర్యాంకు సాధించాడు. షకిబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఆర్చరీలో సురేఖ ప్రపంచ రికార్డు

తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ సత్తా చాటింది. తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నమెంట్లో మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్‌ రౌండ్లో ప్రపంచ రికార్డుతో అదరగొట్టింది. ఈ పోటీల్లో డబుల్‌-50 రౌండ్లో (353/360), సింగిల్‌-50 రౌండ్లో (360/360) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో సింగిల్‌-50లో అత్యధిక స్కోరు (360)తో సారా లోపెజ్‌ (356, కొలంబియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాక ఓవరాల్‌గా 713 పాయింట్లతో సారా పేరిటే ఉన్న వరల్డ్‌ రికార్డును సురేఖ సమం చేసింది. అదితి గోపీచంద్‌ (700), అవ్‌నీత్‌ కౌర్‌ (699), సాక్షి చౌదరి (694) వరుసగా 15, 19, 26 ర్యాంకులు సాధించారు. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ (సురేఖ, అదితి, అవ్‌నీత్‌) ర్యాంకింగ్‌ రౌండ్లో అగ్రస్థానం సాధించింది. మిక్స్‌డ్‌లో జ్యోతి - ఓజస్‌ ప్రవీణ్‌ రెండో ర్యాంకు, పురుషుల టీమ్‌లో ఓజస్, రజిత్, ప్రథమేశ్‌ ఆరో ర్యాంకు దక్కించుకున్నారు.

బ్రెజిల్‌ పారా బ్యాడ్మింటన్‌లో నిత్య, నితీశ్‌లకు స్వర్ణాలు

బ్రెజిల్‌ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత షట్లర్లు నిత్యశ్రీ, నితీశ్‌ స్వర్ణాలతో మెరిశారు. మహిళల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6 కేటగిరిలో నిత్య 22-20, 21-11తో గిలీనా ఫ్లోరెస్‌ (పెరూ)పై నెగ్గింది. డబుల్స్‌లో శివరాజన్‌ సొలైమలైతో కలిసి 21-11, 21-17తో చుమాన్‌ - చోయ్‌ వింగ్‌ (హాంగ్‌కాంగ్‌)పై గెలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3 ఫైనల్లో కుమార్‌ నితీశ్‌ 21-12, 21-13తో టోక్యో పారాలింపిక్‌ ఛాంపియన్‌ ప్రమోద్‌ భగత్‌ను ఓడించగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో నితీష్‌ - తులసీమతి 21-8, 21-9తో హిక్మత్‌ - లీనీ (ఇండోనేషియా)పై నెగ్గారు. పురుషుల ఎస్‌-6 డబుల్స్‌ తుది సమరంలో ప్రమోద్‌ - సుకాంత్‌ 22-20, 21-19తో జూ డోంగె - షిన్‌ హవాన్‌ (కొరియా)పై గెలవగా మహిళల ఎస్‌యూ-5 సింగిల్స్‌ తుది పోరులో తులసీమతి 21-12, 21-18తో మాడ్‌ లీఫోర్ట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. ఎస్‌ఎల్‌-3 మహిళల సింగిల్స్‌లో మాన్సి జోషీ 11-21, 21-18, 0-21తో హలైమ్‌ (తుర్కియె) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఎస్‌యూ-5 పురుషుల డబుల్స్‌ తుది పోరులో చిరాగ్‌ - రాజ్‌కుమార్‌ 13-21, 18-21తో ఫరీజ్‌ - లీక్‌హో (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు.

అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో ప్రియాంకకు టైటిల్‌

ఫ్రాన్స్‌లో జరిగిన ‘టోర్నియో ఎంఐఎఫ్‌ ఇకామ్‌ లియోన్‌ - 2023’ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో విజయవాడకు చెందిన మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ నూతక్కి ప్రియాంక విజేతగా నిలిచింది. తొమ్మిది రౌండ్ల టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రియాంక ఏడు పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది.

జాతీయ షూటింగ్‌లో ఇషాకు కాంస్యం

జాతీయ షూటింగ్‌ సెలక్షన్స్‌లో తెలంగాణ అమ్మాయి ఇషాసింగ్‌ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఈ హైదరాబాదీ అమ్మాయి కాంస్యం నెగ్గింది. ఫైనల్లో ఇషా 21 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా రిథమ్‌ సాంగ్వాన్‌ (32) స్వర్ణం, నేహా (31) రజతం సాధించారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ తుది పోరులో నాన్సీ 16-10తో మెహులీ ఘోష్‌ను ఓడించింది. శ్రేయ అగర్వాల్‌కు మూడో స్థానం దక్కింది.

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అనిరుధ్‌కు కాంస్యం

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను భారత జట్టు కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరి రోజు పురుషుల ఫ్రీస్టయిల్‌ 125 కేజీల విభాగంలో అనిరుధ్‌ కుమార్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక బౌట్‌లో అనిరుధ్‌ 12-2తో సర్దార్‌బెక్‌ ఖొల్మతోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై గెలుపొందాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అనిరుధ్‌ 8-2తో తైకి యామమోటో (జపాన్‌)పై నెగ్గి, క్వార్టర్‌ ఫైనల్లో 0-2తో బతిర్‌ముర్జయెవ్‌ యుసుఫ్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడిపోయాడు. బతిర్‌ ఫైనల్‌ చేరుకోవడంతో అనిరుధ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. ఈ విభాగంలో భారత్‌ మొత్తం ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించింది.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అమన్‌కు పసిడి

భారత టీనేజీ సంచలన రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ ఆసియా ఛాంపియన్‌గా అవతరించాడు. నిరుడు అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన ఈ 19 ఏళ్ల హరియాణా కుర్రాడు, ఇప్పుడు సీనియర్‌ విభాగంలో ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ అదరగొట్టాడు. ఈ సారి టోర్నీలో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పసిడి సాధించాడు. ఫైనల్లో అతను 9-4 తేడాతో అల్మాజ్‌ (కిర్గిస్థాన్‌)ను చిత్తుచేశాడు. ప్రత్యర్థిని కింద పడేసి 3-2 ఆధిక్యంలో నిలిచిన అమన్‌ దూకుడు ప్రదర్శించాడు. అల్మాజ్‌ కాళ్లే లక్ష్యంగా పట్టు పట్టిన అమన్‌ ఒక్కసారిగా 7-4తో విజయం దిశగా సాగాడు. అదే ఊపులో 9-4తో ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. చివరి 30 సెకన్లు ప్రత్యర్థిని నిలువరించి అమన్‌ విజయ ఢంకా మోగించాడు. దిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియంలో శిక్షణ పొందుతున్న అతను ఈ ఏడాది ఇప్పటికే జాగ్రెబ్‌ ఓపెన్‌లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఈ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో దీపక్‌ కుక్నా (79 కేజీ) కాంస్యం గెలిచాడు. అతను 12-1తో బొజొరోవ్‌ (తజకిస్థాన్‌)పై నెగ్గాడు.

షణ్ముఖకు ఫిడే రేటింగ్‌ చెస్‌ టైటిల్‌

ఫిడే రేటింగ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు షణ్ముఖ పుల్లి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. అంచనాలే లేకుండా బరిలో దిగిన ఈ ఎనిమిదో సీడ్‌ ఆటగాడు అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. 8 రౌండ్లు ముగిసే సరికి ఆర్నవ్‌తో కలిసి 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న షణ్ముఖ్, దర్శ్‌ శెట్టితో చివరి రౌండ్‌ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మరోవైపు ఆర్నవ్‌పై గెలిచిన విక్రమాదిత్య, ఆయూష్‌ను ఓడించిన సౌరవ్‌ కూడా 9 రౌండ్లు ముగిసే సరికి తలో 7.5 పాయింట్లతో షణ్ముఖ్‌తో సమానంగా నిలిచారు. కానీ మెరుగైన టైబ్రేకర్‌ స్కోరు ఆధారంగా 24 ఏళ్ల షణ్ముఖ్‌నే విజయం వరించింది. దీంతో ట్రోఫీతో పాటు అతను రూ.75 వేల నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. విక్రమాదిత్య, సౌరవ్‌ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.

హెచ్‌ఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆర్పీ

హాకీ ఇండియా (హెచ్‌ఐ) సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆర్పీ సింగ్‌ నియమితుడయ్యాడు. హర్‌బీందర్‌ సింగ్‌ స్థానంలో ఆర్పీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఏప్రిల్‌ 15 నుంచి ఆర్పీ సింగ్‌ సారథ్యంలోని కొత్త సెలక్షన్‌ కమిటీ పని ప్రారంభిస్తుంది. ఆర్పీతో పాటు బల్వీందర్‌ సింగ్, రియాజ్, ఎంఎం సొమాయా, సుభద్ర, సర్దార్‌సింగ్, గోవింద, రజ్నీశ్, రఘునాథ్, సమీర్, యువరాజ్, జోయ్‌దీప్, అసుంత లక్రా ఈ సెలక్షన్‌ కమిటీలో ఉన్నారు. 1998లో భారత జూనియర్‌ జట్టుకు సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా పని చేసిన ఆర్పీ 2021లో హాకీ ఇండియా హై పెర్ఫార్‌మన్స్, డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించాడు. అదే ఏడాది సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడయ్యాడు.

జాతీయ మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో మనుకు స్వర్ణం

జాతీయ రైఫిల్‌/పిస్టల్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో మను బాకర్‌ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో మను 31-29తో చింకీ యాదవ్‌ను ఓడించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబుతా విజేతగా నిలిచాడు. ఫైనల్లో అర్జున్‌ 16-6తో అఖిల్‌ షెరోన్‌ను ఓడించాడు. క్వాలిఫయింగ్‌లో అర్జున్‌ 633.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అంతిమ్‌కు రజతం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో రజతం చేరింది. అంతిమ్‌ పంగాల్‌ తుదిపోరులో తడబడి వెండి పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 53 కేజీల స్వర్ణ పోరులో ఆమె 0-10 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అకారి ఫుజినామి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. బలమైన ప్రత్యర్థి ముందు 18 ఏళ్ల అంతిమ్‌ తేలిపోయింది. 2021 ప్రపంచ ఛాంపియన్‌ కూడా అయిన ఫుజినామిని అడ్డుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలి రౌండ్‌లోనే పది పాయింట్లు కోల్పోయిన అంతిమ్‌ ఓటమి బాధతో నిష్క్రమించింది. ఫుజినామికి ఇది వరుసగా 114వ విజయం కావడం విశేషం. నిరుడు అండర్‌-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా అంతిమ్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు అన్షు మలిక్‌ (57 కేజీ), సోనమ్‌ మలిక్‌ (62 కేజీ), మనీషా (65 కేజీ), రీతిక (72 కేజీ) కాంస్యాలు దక్కించుకున్నారు. కంచు పతక మ్యాచ్‌ల్లో అన్షు 10-0తో ఎర్డీన్‌ (మంగోలియా)పై, సోనమ్‌ 5-1తో జియావోజువాన్‌ (చైనా)పై, మనీషా 8-0తో అల్బీనా (కజకిస్థాన్‌)పై, రీతిక 5-1తో స్వెత్లానా (ఉజ్బెకిస్థాన్‌)పై గెలిచారు.

షూటింగ్‌లో పాత విధానంలోనే పసిడి విజేత: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌

పిస్టల్, రైఫిల్‌ పోటీల్లో విజేతలను నిర్ణయించే విధానంలో అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) మళ్లీ మార్పులు చేసింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఉన్న విధానాన్ని మళ్లీ అమలు చేయనుంది. ఈ ఒలింపిక్స్‌ ఫైనల్స్‌ ముగిసిన తర్వాత ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ఓ నిబంధన తీసుకొచ్చింది. ఫైనల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన షూటర్ల మధ్య పసిడి కోసం మళ్లీ పోటీ నిర్వహించేవాళ్లు. దీంట్లో గెలిచిన షూటర్‌ స్వర్ణం, ఓడిన వాళ్లు రజతం గెలిచేవాళ్లు. కానీ ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్‌కు ముందులా సులువైన ఎలిమినేషన్‌ ప్రక్రియను ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ తిరిగి అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం 24 రౌండ్ల ఫైనల్లో 12వ రౌండ్‌ తర్వాత నుంచి తక్కువ స్కోరుతో ఉండే ఒక్కో షూటర్‌ నిష్క్రమిస్తూ ఉంటాడు. ముందుగా 16 పాయింట్లు సాధించిన వాళ్లను విజేతగా ప్రకటిస్తారు. ఆ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన వాళ్లకు వరుసగా రజత, కాంస్యలు దక్కుతాయి. అర్హత రౌండ్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అందులో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే షూటర్లు ఫైనల్లో తలపడతారు. మే 8న బాకులో ఆరంభమయ్యే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ పిస్టల్‌/రైఫిల్‌ ప్రపంచకప్‌ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ దీన్నే కొనసాగిస్తారు. మారిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని, అందుకు అనుగుణంగా బాకు ప్రపంచకప్‌కు షూటర్లను సిద్ధం చేస్తామని భారత రైఫిల్‌ కోచ్, హై పర్‌ఫార్మెన్స్‌ మేనేజర్‌ దీపక్‌ దూబె పేర్కొన్నాడు.

బీడబ్ల్యూఎఫ్‌ పురుషుల సింగిల్స్‌ జాబితాలో ప్రియాంశుకు 38వ ర్యాంకు

ఆర్లీన్స్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత యువ షట్లర్‌ ప్రియాంశు రజావత్‌ ర్యాంకుల్లోనూ మెరుగయ్యాడు. బీడబ్ల్యూఎఫ్‌ పురుషుల సింగిల్స్‌ జాబితాలో ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం 30,786 పాయింట్లతో ఉన్న 21 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్‌ షట్లర్‌ సింగిల్స్‌లో భారత్‌ తరఫున నాలుగో ఉత్తమ ర్యాంకర్‌. హెచ్‌ఎస్‌.ప్రణయ్‌ ఎనిమిదో ర్యాంకులో ఉండగా శ్రీకాంత్‌ 23, లక్ష్యసేన్‌ 24 స్థానాల్లో నిలిచారు. ఇటీవల స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీలో ఫైనల్‌ చేరినా ర్యాంకుల్లో మాత్రం పి.వి.సింధు మెరుగవకపోగా టాప్‌-10కు దూరమైంది. రెండు స్థానాలు కోల్పోయిన ఆమె ప్రస్తుతం పదకొండో ర్యాంకులో కొనసాగుతోంది. సైనా నెహ్వాల్‌ 31వ స్థానంలో ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌శెట్టి 6, అర్జున్‌ - ధ్రువ్‌ 27, మహిళల డబుల్స్‌లో గాయత్రి - జాలీ 20, తనీషా - ఇషాన్‌ 29వ ర్యాంకుల్లో ఉన్నారు.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నిషాకు రజతం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత రెజ్లర్‌ నిషా దహియా రజతం గెలుచుకుంది. మహిళల 68 కిలోల విభాగం ఫైనల్లో ఆమె 0-10తో జపాన్‌కు చెందిన ఇషి చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీఫైనల్లో నిషా 7-6తో ఫెంగ్‌ జౌ (చైనా)పై గెలుపొందింది. నిషాకు ఇదే తొలి ఆసియా రెజ్లింగ్‌ టోర్నమెంట్‌. 76 కిలోల విభాగంలో ప్రియా మాలిక్‌ కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో ఆమె జపాన్‌ రెజ్లర్‌ మిజుకి నగషిమాను ఓడించింది. అండర్‌-17 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతక విజేత ప్రియాకు సీనియర్‌ విభాగంలో ఇదే తొలి మేజర్‌ ఈవెంట్‌. 50 కిలోల విభాగం కాంస్య పోరులో నీలమ్‌ పరాజయంపాలైంది.

గుకేశ్‌కు ఆర్మగెడాన్‌ ఆసియా, ఓసియానియా టైటిల్‌

భారత చెస్‌ కెరటం గుకేశ్‌ మరోసారి సత్తా చాటాడు. ఆర్మగెడాన్‌ ఆసియా, ఓసియానియా టైటిల్‌ను ఈ గ్రాండ్‌మాస్టర్‌ సొంతం చేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌ నొడిర్‌బెక్‌ అబ్దుసతొరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించాడు. తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న గుకేశ్‌ రెండో గేమ్‌లో నెగ్గి విజేతగా నిలిచాడు. సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ ఆర్మగెడాన్‌ టోర్నీకి గుకేశ్, నొడిర్‌బెక్‌ బెర్తు దక్కించుకున్నారు. ఈ టోర్నీలో విదిత్‌ గుజరాతి, కార్తికేయన్‌ మురళీ (భారత్‌), వ్లాదిమిర్‌ క్రామ్నిక్, డానియల్‌ దబోవ్‌ (రష్యా) యాంగి యు (చైనా), పరమ్‌ (ఇరాన్‌) కూడా పోటీపడ్డారు.

జాతీయ రైఫిల్, పిస్టల్‌/స్లింగ్‌ షాట్‌ ఛాంపియన్‌షిప్‌లో సోనాలిసాకు స్వర్ణం

జాతీయ రైఫిల్, పిస్టల్‌/స్లింగ్‌ షాట్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భూక్యా సోనాలిసా స్వర్ణంతో మెరిసింది. షిరిడీలో జరిగిన అండర్‌-14 బాలికల రైఫిల్‌ ఎయిర్‌గన్‌ విభాగంలో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది.

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వికాస్‌కు కాంస్యం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. గ్రీకో రోమన్‌ 72 కేజీల విభాగంలో వికాస్‌ కాంస్యం సొంతం చేసుకున్నాడు. కంచు పతక పోరులో అతను 8-0 తేడాతో జైన్‌ టాన్‌ (చైనా)పై సాంకేతిక ఆధిపత్యంతో విజయం సాధించాడు. మరోవైపు తమ కాంస్య పతక మ్యాచ్‌ల్లో సుమిత్‌ (60 కేజీ) 6-14తో మైతా కవానా (జపాన్‌) చేతిలో, రోహిత్‌ దహియా (82 కేజీ) 1-5తో అలీరెజా (ఇరాన్‌) చేతిలో ఓడారు.

అండర్‌-19 అమ్మాయిల శిబిరానికి కోచ్‌గా విద్యుత్‌

జాతీయ క్రికెట్‌ అకాడమీ నిర్వహించే అండర్‌-19 అమ్మాయిల శిక్షణ శిబిరానికి కోచ్‌గా విద్యుత్‌ జైసింహా ఎంపికయ్యాడు. అతను ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌గానూ వ్యవహరించనున్నాడు. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఏప్రిల్‌ 17 నుంచి మే 11 వరకు ఈ శిబిరం జరుగుతుంది. రుమేలీ ధార్‌ (ఫాస్ట్‌ బౌలింగ్‌), సుమన్‌ శర్మ (ఫీల్డింగ్‌), రితుపర్ణ (స్పిన్‌)లు ఇతర సహాయక కోచ్‌లు. 25 మంది అమ్మాయిలు ఈ శిబిరంలో పాల్గొనబోతున్నారు.

ఆర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నీ విజేతగా ప్రియాంశు

భారత యువ షట్లర్‌ ప్రియాంశు రజావత్‌ ఆర్లీన్స్‌ మాస్టర్స్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. అతను తొలి బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 టైటిల్‌ను దక్కించుకున్నాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టి టోర్నీ సాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన 21 ఏళ్ల ప్రియాంశు పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 21-15, 19-21, 21-16 తేడాతో మాగ్నస్‌ జొహానెసన్‌ (డెన్మార్క్‌)పై గెలిచాడు. ఈ మధ్యప్రదేశ్‌ కుర్రాడు తొలి గేమ్‌లో ఆధిపత్యం ప్రదర్శించాడు. మూడో గేమ్‌లో ప్రియాంశు 5-0తో దూసుకెళ్లాడు. కానీ మాగ్నస్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఓ దశలో 9-9తో స్కోరు సమమైంది. కానీ అక్కడి నుంచి ప్రియాంశు బలంగా పుంజుకున్నాడు. పాయింట్ల వేటలో వేగంగా సాగి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు.

మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా రక్షిత

భారత చెస్‌ క్రీడాకారిణి రక్షిత రవి మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) హోదా సాధించింది. చివరి డబ్ల్యూజీఎం నార్మ్‌ను దక్కించుకున్న ఆమె 2300 ఎలో రేటింగ్‌ను కూడా దాటింది. ఫస్ట్‌ సాటర్‌డే టోర్నీ ఆరో రౌండ్లో సహజ్‌ గ్రోవర్‌ను ఓడించినప్పుడు రక్షిత ఆఖరి నార్మ్‌ను సొంతం చేసుకుంది. జాతీయ జూనియర్‌ బాలికల ఛాంపియన్‌ అయిన 17 ఏళ్ల రక్షిత 2019లో తొలిసారి డబ్ల్యూజీఎం నార్మ్‌ను సాధించింది. అదే ఏడాది రెండో నార్మ్‌ను కూడా సొంతం చేసుకుంది.

ధోనీకి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

ప్రతిష్ఠాత్మక మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ప్రపంచకప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ధోని సహా అయిదుగురు భారత క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం ఇచ్చింది. యువరాజ్‌ సింగ్, సురేశ్‌ రైనా, మిథాలి రాజ్, జులన్‌ గోస్వామి గౌరవం పొందిన ఇతర భారత క్రికెటర్లు. ఎనిమిది టెస్టు దేశాల నుంచి మొత్తం 19 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. అయిదుగురు భారత క్రికెటర్లకు గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని అందించాం. జులన్‌ గోస్వామి మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ కాగా మిథాలీ రాజ్‌ అత్యధిక పరుగులు (7,805) చేసిన బ్యాటరని ఎంసీసీ తన వెబ్‌సైట్లో పేర్కొంది. ధోని, యువరాజ్‌ సింగ్‌లు ఇద్దరూ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యులు. సురేశ్‌ రైనా 13 ఏళ్ల కెరీర్‌లో 5,500 వన్డే పరుగులు సాధించాడని చెప్పింది. మెరీసా (వెస్టిండీస్‌), జెనీ గున్, లారా మార్ష్, అన్య ష్రబ్సోల్, ఇయాన్‌ మోర్గాన్, కెవిన్‌ పీటర్సన్‌ (ఇంగ్లాండ్‌), మహ్మద్‌ హఫీజ్‌ (పాకిస్థాన్‌), మొర్తజా (బంగ్లాదేశ్‌), స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా), రేచెల్‌ హేన్స్‌ (ఆస్ట్రేలియా), అమీ సాటెర్‌వైట్, రాస్‌ టేలర్‌ (న్యూజిలాండ్‌) ఎంసీసీ సభ్యత్వం పొందిన ఇతర క్రికెటర్లు.

యాషెస్‌ అంపైర్‌గా నితిన్‌

ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భారత్‌ అంపైర్‌గా నితిన్‌ మేనన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో భారత్‌ నుంచి ఏకైక అంపైర్‌గా ఉన్న 39 ఏళ్ల నితిన్‌ జూన్‌ 16న ఆరంభమయ్యే యాషెస్‌ సిరీస్‌లో మూడు, నాలుగు టెస్టులకు ఫీల్డ్‌ అంపైర్‌గా విధులు చేపట్టనున్నాడు. యాషెస్‌లో జులై 6న లీడ్స్‌లో మూడో టెస్టు, జులై 19న మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు ఆరంభమవుతాయి. మేనన్‌ ఇప్పటిదాకా 18 టెస్టులు, 42 వన్డేలు, 40 టీ20లకు అంపైర్‌గా పని చేశాడు.

వెయిట్‌లిఫ్టర్‌ సంజితపై నాలుగేళ్ల నిషేధం

రెండుసార్లు కామన్వెల్త్‌ ఛాంపియన్, వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చానుపై నాలుగేళ్ల నిషేధం పడింది. గతేడాది డోప్‌ పరీక్షలో పట్టుబడిన మణిపుర్‌ లిఫ్టర్‌పై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ క్రమశిక్షణ కమిటీ ఈ శిక్షను విధించింది. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో 29 ఏళ్ల సంజిత ఇచ్చిన శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు నాడా పరీక్షల్లో తేలింది. ఈ నిషేధం ఆమె ప్రాథమికంగా సస్పెండ్‌ అయిన నవంబర్‌ 12, 2022 నుంచి అమల్లోకి రానుంది. డోపీగా నిర్ధారణ అవడంతో జాతీయ క్రీడల్లో సాధించిన రజత పతకాన్ని కూడా చాను కోల్పోనుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి నెగ్గిన సంజిత, 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లోనూ స్వర్ణంతో మెరిసింది.

మియామి టైటిల్‌ మెద్వెదెవ్‌ సొంతం

రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ మియామి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అతడు 7-5, 6-3తో జానిక్‌ సినర్‌ (ఇటలీ)ను ఓడించాడు. తొలి సెట్లో డానియల్‌కు సినర్‌ నుంచి గట్టిపోటీనే ఎదురైంది. ఒక దశలో సినర్‌ 3-2తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ పుంజుకున్న మెద్వెదెవ్‌ వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-3తో స్కోరు సమం చేశాడు. మళ్లీ పన్నెండో గేమ్‌లో బ్రేక్‌ సాధించి సెట్‌ను సొంతం దక్కించుకున్నాడు. రెండుసార్లు ప్రత్యర్థి సర్వ్‌ను బ్రేక్‌ చేసిన రష్యా స్టార్‌ అలవోకగా సెట్‌ను మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. గత 25 మ్యాచ్‌ల్లో మెద్వెదెవ్‌ 24 గెలవడం విశేషం. ఇండియన్‌ వెల్స్‌ ఫైనల్లో కార్లోస్‌ అల్కరాస్‌ చేతిలో మాత్రమే అతడు ఓడాడు.

ఐపీఎల్‌లో ధోని 5 వేల పరుగులతో రికార్డు

చెన్నై కెప్టెన్‌ ధోని ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతడి కంటే ముందు కోహ్లి (6706), ధావన్‌ (6284), వార్నర్‌ (5937), రోహిత్‌ (5880), రైనా (5528), డివిలియర్స్‌ (5162) ఈ ఘనత సాధించారు. లఖ్‌నవూతో మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని, వరుసగా రెండు బంతులకు రెండు సిక్సర్లు బాది మూడో బంతికి ఔటయ్యాడు. చెన్నైలో మూడేళ్ల తర్వాత ధోని బ్యాటింగ్‌కు రావడంతో ‘జియో సినిమా’ యాప్‌లో మ్యాచ్‌ను ఏకంగా 1.7 కోట్ల మంది వీక్షించారు. ఈ సీజన్లో ఇది రికార్డు.

వెర్‌స్టాపన్‌దే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఫార్ములావన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్, 25 పాయింట్లు) విజేతగా నిలిచాడు. పోల్‌ పొజిషన్‌లో రేసు మొదలుపెట్టిన ఈ డచ్‌ డ్రైవర్‌ ఆరంభం నుంచి ఎక్కడా తగ్గలేదు. ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా నిలిచిన మ్యాక్స్‌ తొలిసారి ఆస్ట్రేలియన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫెర్నాండో అలాన్సో (అస్టన్‌ మార్టిన్, 15 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు.

వన్డే ప్రపంచకప్‌ లోగో ఆవిష్కరణ

భారత్‌ 2011 ప్రపంచకప్‌ గెలిచి 12 ఏళ్లు అయిన సందర్భంగా ఐసీసీ 2023 వన్డే ప్రపంచకప్‌ లోగోను ఆవిష్కరించింది. నీలం, గులాబి రంగు డిజైన్‌ మధ్య ప్రపంచకప్‌ను ఉంచిన ఈ లోగో ఆకర్షణీయంగా ఉంది. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోని సారథ్యంలోని భారత్‌ జట్టు శ్రీలంకను ఓడించి చరిత్రాత్మక ప్రపంచకప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు సిక్స్‌తో మహి జట్టును విజేతగా నిలిపాడు.టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డు 41 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్లో రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్‌ తాజాగా టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ క్యాచ్‌ అందుకున్న అతను మొత్తం 208 క్యాచ్‌లతో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. డికాక్‌ (207), దినేశ్‌ కార్తీక్‌ (205) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఆర్చరీలో సురేఖ ప్రపంచ రికార్డు

తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ సత్తా చాటింది. తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నమెంట్లో మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్‌ రౌండ్లో ప్రపంచ రికార్డుతో అదరగొట్టింది. ఈ పోటీల్లో డబుల్‌-50 రౌండ్లో (353/360), సింగిల్‌-50 రౌండ్లో (360/360) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో సింగిల్‌-50లో అత్యధిక స్కోరు (360)తో సారా లోపెజ్‌ (356, కొలంబియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాక ఓవరాల్‌గా 713 పాయింట్లతో సారా పేరిటే ఉన్న వరల్డ్‌ రికార్డును సురేఖ సమం చేసింది. అదితి గోపీచంద్‌ (700), అవ్‌నీత్‌ కౌర్‌ (699), సాక్షి చౌదరి (694) వరుసగా 15, 19, 26 ర్యాంకులు సాధించారు. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ (సురేఖ, అదితి, అవ్‌నీత్‌) ర్యాంకింగ్‌ రౌండ్లో అగ్రస్థానం సాధించింది. మిక్స్‌డ్‌లో జ్యోతి - ఓజస్‌ ప్రవీణ్‌ రెండో ర్యాంకు, పురుషుల టీమ్‌లో ఓజస్, రజిత్, ప్రథమేశ్‌ ఆరో ర్యాంకు దక్కించుకున్నారు.

‘సివిల్‌ సర్వీసెస్‌ డే’ 2023

ప్రభుత్వ పాలనాధికారులపై దేశం ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉందని, దానిని వారు నిలబెట్టుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. వారు తీసుకునే ప్రతి నిర్ణయానికీ దేశ హితమే ఏకైక ప్రాతిపదిక కావాలని స్పష్టం చేశారు. ‘సివిల్‌ సర్వీసెస్‌ డే’ సందర్భంగా బ్యూరోక్రాట్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును అధికార పార్టీ తన సొంత లబ్ధి కోసం వినియోగిస్తుందా, దేశం కోసం ఖర్చు చేస్తుందా అనే విషయాన్ని విశ్లేషించడం ప్రతి ప్రభుత్వ ఉన్నతోద్యోగి విధి అని స్పష్టం చేశారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు వారి కలల సాకారానికి ప్రతి ఉద్యోగి చేయూతనివ్వడం అభివృద్ధి చెందిన (వికసిత) భారత్‌లో కీలకమైన అంశమని విశదీకరించారు. వికసిత భారత్‌ అనే భావన ఆధునిక మౌలిక సదుపాయాలకే పరిమితం కాదని స్పష్టం చేశారు. దేశ హితానికి, పౌరుల ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యమివ్వడమే తన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సెబీ కొత్త లోగో ఆవిష్కరణ

క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) తమ కొత్త లోగోను ఆవిష్కరించింది. 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నూతన లోగోను సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పూరి బుచ్‌ ఆవిష్కరించారు. ఈ సంస్థ 1988 ఏప్రిల్‌ 12న ఏర్పాటైంది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.

హైదరాబాద్‌ ఓపెనర్‌ అజీమ్‌ మరణం

హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మరణించారు. ఆయన వయసు 62 ఏళ్లు. మెరుపు బ్యాటర్‌గా పేరున్న అజీమ్‌ 1980 - 95 మధ్య కాలంలో హైదరాబాద్‌కు 73 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 43.40 సగటుతో 4644 పరుగులు సాధించాడు. 1986 రంజీ సీజన్లో తమిళనాడుపై ట్రిపుల్‌ సెంచరీ (303 నాటౌట్‌) చేశాడు. మొత్తం మీద 12 శతకాలు, 18 అర్ధ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. బలమైన షాట్లతో స్కోరు పరుగులు పెట్టించే అజీమ్‌కు హుక్, పుల్‌ షాట్ల స్పెషలిస్టుగా పేరుంది. హైదరాబాద్‌ జట్టుకు చీఫ్‌ కోచ్, చీఫ్‌ సెలక్టర్‌గా కూడా ఆయన పని చేశారు.

ప్రముఖ చిత్రకారుడు బాలి మరణం

ప్రముఖ చిత్రకారుడు బాలి (81) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. బాలి అసలు పేరు మేడిశెట్టి శంకర్రావు. హైస్కూలు చదివే రోజుల్లోనే బాలి చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకున్నారు. 1958లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ఆయన మొదటి చిత్రం ప్రచురితమైంది. 1980 - 82 మధ్యకాలంలో ‘ఈనాడు’లో వ్యంగ్య చిత్రకారుడిగా పనిచేశారు. 1983 - 87 మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి వారపత్రిక, దినపత్రికలలో బొమ్మలు వేశారు. వేలకొద్దీ నవలలకు ముఖచిత్రాలు గీశారు. ఆయన చిత్రాలు, కార్టూన్లు షికాగో, దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ప్రదర్శితమయ్యాయి. 2013లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి హంస అవార్డు అందుకున్నారు. బాలి కార్టూన్లు, జోక్‌లు, బాలి ఆత్మకథ, బాలి కథలు పేరుతో పలు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. చిత్రకళ నేర్చుకోవడంపై ఒక పుస్తకం, చిన్నారుల కోసం రెండు నవలలు రాశారు.

మహీంద్రా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ కేశబ్‌ మహీంద్రా మరణం

భారతీయ వాహన పరిశ్రమకు మార్గదర్శకులు, మహీంద్రా అండ్‌ మహీంద్రా గౌరవ ఛైర్మన్‌ కేశబ్‌ మహీంద్రా (99) ముంబయిలోని స్వగృహంలో మరణించారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. కేశబ్‌ 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవల వెలువడిన ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో 1.2 బిలియన్‌ డాలర్ల సంపదతో భారత్‌లో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు. 1947లో కంపెనీలో చేరిన కేశబ్‌ సంస్థను అనేక రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యాపారంలోకి ప్రవేశించిన నాటికి కంపెనీ ప్రధానంగా విల్లీస్‌ జీప్‌లను తయారు చేస్తుండేది. ఇప్పుడు మహీంద్రా గ్రూప్‌ వాహన, ఇంధన, సాఫ్ట్‌వేర్‌ సేవలు, స్థిరాస్తి, ఆతిథ్యం, రక్షణ, ఇలా పలు రంగాలకు విస్తరించింది. 2012 వరకు దాదాపు 64 ఏళ్ల పాటు మహీంద్రా బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగిన కేశబ్‌ ఒక స్టీల్‌ ట్రేడింగ్‌ కంపెనీని 15.4 బి.డాలర్ల విలువైన ‘భిన్న రంగాలకు విస్తరించిన గ్రూప్‌’గా మార్చి తన చేతికి అప్పగించారని మహీంద్రా గ్రూప్‌ ప్రస్తుత ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.

ప్రముఖ భారత మాజీ కోచ్‌ సుధీర్‌ నాయక్‌ మరణం

భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రముఖ కోచ్, క్యూరేటర్‌ సుధీర్‌ నాయక్‌ ముంబయిలోని ఆస్పత్రిలో మరణించారు. నాయక్‌ వయసు 78 ఏళ్లు. సుధీర్‌ నాయక్‌ భారత్‌ తరఫున 1974లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 85 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 4376 పరుగులు సాధించారు. నాయక్‌కు మంచి కోచ్‌గా పేరుంది. జహీర్‌ ఖాన్‌ ఎదుగుదలలో ఆయన పాత్ర ఉంది. నాయక్‌ ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్‌గా కూడా పని చేశారు.

భారత క్రికెట్‌ దిగ్గజం సలీమ్‌ దురాని మరణం

భారత క్రికెట్‌ తొలి తరం దిగ్గజాల్లో ఒకడైన సలీమ్‌ దురాని మ‌ర‌ణించాడు. ఆయన వయసు 88 ఏళ్లు. 1960-73 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన దురాని అభిమానులతో పాటు సహచర క్రికెటర్లు ఆయన్ని ‘ప్రిన్స్‌’గా పిలుచుకునేవారు. అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో పుట్టిన దురాని, పెరిగింది మాత్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో. 29 టెస్టులాడిన ఈ ఆల్‌రౌండర్, 1202 పరుగులు చేసి, 75 వికెట్లు పడగొట్టాడు. 170 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన దురాని 8,545 పరుగులు చేశాడు. 484 వికెట్లు తీశాడు. 1961-62లో ఇంగ్లాండ్‌ లాంటి పెద్ద జట్టుపై భారత్‌ 2-0తో సిరీస్‌ సాధించడంలో సలీమ్‌ పాత్ర కీలకం. అది సలీమ్‌కు రెండో సిరీస్‌ మాత్రమే. లెఫ్టార్మ్‌ స్పిన్నరైన దురాని, కోల్‌కతా టెస్టులో 10, మద్రాస్‌ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి దోహదపడ్డాడు. 1971లో వెస్టిండీస్‌పై భారత జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకోవడంలోనూ దురాని ముఖ్య పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో దిగ్గజ ఆటగాళ్లు లాయిడ్, సోబర్స్‌లను ఔట్‌ చేసి జట్టును గెలుపు బాటలో నడిపాడు. టాప్‌ ఆర్డర్లో చాలా దూకుడుగా ఆడే బ్యాటర్‌గానూ దురానికి మంచి పేరుంది. 1960లో ముంబయి బ్రబోర్న్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన దురాని, అదే వేదికలో 1973లో ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడాడు. రెండున్నర దశాబ్దాల దేశవాళీ కెరీర్లో ఆయన గుజరాత్, రాజస్థాన్, సౌరాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్లో అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్‌ దురాని. 1973లో ‘చరిత్ర’ అనే బాలీవుడ్‌ సినిమాలోనూ నటించాడు.

మధుమేహ బాధితులకు చక్కెర పానీయాలతో ముప్పు

చక్కెరతో కూడిన శీతలపానీయాల (షుగర్‌ స్వీటెన్డ్‌ బెవరేజెస్‌ - ఎస్‌ఎస్‌బీ)ను ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్‌-2 మధుమేహ వ్యాధిగ్రస్థులకు అకాల మరణం ముప్పు పెరుగుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ పానీయాల స్థానంలో కాఫీ, టీ, కొవ్వు తక్కువగా ఉండే ఆవు పాలు, మంచి నీరు తాగితే అకాల మరణం ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా దాదాపు 9 వేల మంది మహిళలు, 3,500 మంది పురుషుల ఆరోగ్య డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వీరందరూ ఏదో ఒక దశలో టైప్‌-2 మధుమేహం బాధితులు. వారు ఎస్‌ఎస్‌బీలను ఎంత మేర తీసుకుంటున్నామన్నది 2-4 ఏళ్లకోసారి సేకరించారు. వీటిని ఎక్కువగా తీసుకునేవారికి గుండె జబ్బుతో మరణించే ప్రమాదం పెరుగుతుందని తేల్చారు. రోజూ అదనంగా ఒక్కసారి ఎస్‌ఎస్‌బీ తాగినా మరణం ముప్పు 8 శాతం పెరుగుతుందని తేల్చారు. రోజువారీగా ఒక్కసారి ఎస్‌ఎస్‌బీకి బదులు కాఫీ తాగడం వల్ల ఏ కారణంతోనైనా అకాల మరణం సంభవించే ముప్పు 18 శాతం తగ్గుతుందని, గుండె జబ్బుతో చనిపోయే అవకాశం 20 శాతం మేర తగ్గుతుందని వివరించారు.

మనసు, శరీరాల బంధం నిజమే

మనసు, శరీరాల మధ్య బంధం నిజమేనని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు. మెదడులో శారీరక చలనాన్ని నియంత్రించే భాగాలకు గ్రహణ, జ్ఞాన కేంద్రాలతో సంబంధం ఉందని వారు కనుగొన్నారు. చాలా మంది ఆదుర్దా తగ్గించుకోవడానికి అటూ ఇటూ పచార్లు చేయడానికి కారణమిదే. నిత్యం వ్యాయామం చేసే వారికి జీవితం మీద సానుకూల దృక్పథం ఏర్పడటానికీ ఇదే మూలం. మెదడులో శారీరక చలనాన్ని నియంత్రించే భాగాలు అసంకల్పిత చర్యలైన రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్నీ నియంత్రిస్తాయి. బ్రిటన్‌లో 50,000 మంది మెదళ్లను స్కాన్‌ చేసి, పరిశీలించి తమ అధ్యయనాన్ని శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. మెదడులో శారీరక కదలికలను నియంత్రించే భాగాలతో పాటు మనసుకే పరిమితమైన భాగాలూ ఉన్నాయి. అవి ఆలోచన, కార్యాచరణ పథక రచన, రక్తపోటు, గుండె వేగాల వంటి వాటిని నియంత్రిస్తాయి. అయితే వ్యక్తి లేచి కదలాలని ఆలోచించగానే ఈ మనో నియంత్రణ కేంద్రాలూ కార్యశీలమవుతాయి. తమ అధ్యయనాన్ని నేచర్‌ పత్రికలో శాస్త్రవేత్తలు ప్రచురించారు.

ధ్రువాల్లో ద్రవీభవిస్తున్న మంచుతో ఉపద్రవం

ఉత్తర, దక్షిణ ధ్రువాలతో పాటు గ్రీన్‌లాండ్‌లో మంచు వేగంగా కరిగిపోతోంది. 1992 - 2020 మధ్య కాలంలో ధ్రువాల్లోని మంచు పలకలు 7,56,000 టన్నుల మంచును కోల్పోయాయని 65 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ మంచును ఒక్కచోట కుప్పగా పోస్తే 20 కిలోమీటర్ల ఎత్తయిన మంచు కొండ ఏర్పడుతుంది. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్‌ మహా సముద్రంలో ప్రచండమైన ఎండలు కాయడంతో గ్రీన్‌లాండ్‌లో మంచు కరిగిపోతోంది. గ్రీన్‌లాండ్‌ మంచు మరీ ఎక్కువగా ద్రవీకరించి సముద్రం పాలవుతోందని 50 ఉపగ్రహాల ద్వారా చేసిన పరిశీలన నిర్ధారించింది. ఇదంతా మానవ కార్యకలాపాలవల్ల సంభవిస్తున్న ఉపద్రవమే. ప్రపంచంలో 99 శాతం మంచి నీరు గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలలో మంచు రూపంలో పోగుపడి ఉంది. 1992 నుంచి ఈ మంచు కరుగుతున్నందున 8.3 లక్షల కోట్ల టన్నుల మంచి నీరు ఉప్పు సముద్రాల పాలైంది. ఈ నీటిని అమెరికాపై పరిస్తే 33.6 అంగుళాల ఎత్తున దేశమంతటా అలుముకుంటుంది. ఇదే నీరు ఫ్రాన్స్‌ ను 49 అడుగుల లోతులో ముంచేస్తుంది.

ఊపిరితిత్తుల క్షయ వ్యాధితో చిన్నారుల్లో దీర్ఘకాలిక ప్రభావం

చిన్నారులకు ఆరంభ దశలో ఊపిరితిత్తుల క్షయవ్యాధి (పీటీబీ) సోకితే, ఆ ప్రభావం దీర్ఘకాలం వెంటాడుతుందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 5 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులు పీటీబీకి గురైతే నిద్రలో గురక, బలహీన ఊపిరితిత్తులు, ఎత్తు, బరువు తగ్గడం, తదితర సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుందని బోస్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు చెబుతున్నారు. పీటీబీకి చికిత్స ఉన్నప్పటికీ కోలుకున్న తర్వాత పిల్లల ఆరోగ్యంపై ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని అంటున్నారు. వీరి అధ్యయనాన్ని ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెసిపిరేటరీ, క్రిటికల్‌ కేర్‌ మెడిసన్‌’ ప్రచురించింది. పుట్టిన ఏడాదిలోపే టీబీ సోకిన చిన్నారులు, ఐదేళ్లు వచ్చేసరికి తమ వయసుకు తగ్గ బరువు కంటే తక్కువుగా ఉంటున్నారు. ఏడాది నుంచి నాలుగేళ్ల మధ్య సోకితే ఐదేళ్లకొచ్చేసరికి వారి పొడవు తక్కువగా ఉంటోంది. శ్వాసలో గురక తీయడమూ ఎక్కువవుతోందని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినెజ్‌ తెలిపారు. ఈ ఫలితాల ద్వారా తొలి సంవత్సరాల్లో క్షయ వ్యాధి రాకుండా నిరోధించుకుంటే మేలని, దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అధ్యయనం తెలిపింది.

యాంటీబయాటిక్స్‌తో పేగు బ్యాక్టీరియాకు చికిత్స

యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఇదే సమయంలో ఈ మందు సమర్థత తగ్గకుండా చూశారు. మానవ పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి జీర్ణ ప్రక్రియకు తోడ్పడటం, పోషకాలు, మెటబోలైట్లను అందించడం, హానికర బ్యాక్టీరియా, వైరస్‌లను తిప్పికొట్టే విషయంలో రోగనిరోధక వ్యవస్థతో కలిసి పనిచేయడం ద్వారా ఆయా వ్యక్తుల ఆరోగ్యంపై గణనీయ ప్రభావాన్ని చూపుతాయి. యాంటీబయాటిక్‌ చికిత్సల వల్ల ఇలాంటి ప్రయోజనకర బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వాటి కూర్పులో తేడాలు వస్తాయి. దీనివల్ల తరచూ జీర్ణాశయ ఇబ్బందులు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఊబకాయం, అలర్జీలు, ఉబ్బసం, ఇతర ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు కూడా రావొచ్చు. ‣ ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు పేగుల్లో సాధారణంగా కనిపించే 27 రకాల ప్రయోజనకర బ్యాక్టీరియాపై 144 రకాల యాంటీబయాటిక్స్‌ ప్రభావం గురించి శోధించారు. సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్‌ మందుల వల్ల పేగు బ్యాక్టీరియాపై చాలావరకూ ప్రభావం ఉండదని గుర్తించారు. అయితే టెట్రాసైక్లిన్లు, మాక్రోలైడ్లు ఆరోగ్యకర బ్యాక్టీరియాను సగానికి పైగా చంపేస్తాయని తేలింది. ఈ నేపథ్యంలో మరో ఔషధం ద్వారా ఈ సూక్ష్మజీవులను రక్షించొచ్చా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ క్రమంలో ఎరిథ్రోమైసిన్‌ (మాక్రోలైడ్‌), డాక్సీసైక్లిన్‌ (టెట్రాసైక్లిన్‌)తో దాదాపు 1,197 రకాల మందులను పరీక్షించారు. రక్తం గడ్డకట్టకుండా చేసే డైక్యూమారోల్‌ సహా పలు మందులు కొన్ని రకాల ప్రయోజనకర బ్యాక్టీరియా జాతులను రక్షించగలవని తేల్చారు.

పురుషుల్లో కుటుంబ నియంత్రణకు ఉపయోగపడే జన్యువు

పురుషుల్లో కుటుంబ నియంత్రణకు ఉపయోగపడే ఒక జన్యువును అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని స్విచ్ఛాఫ్‌ చేస్తే అది సమర్థ గర్భనిరోధక సాధనమవుతుందని వివరించారు. సంతానాన్ని పొందాలనుకున్నప్పుడు మళ్లీ ఈ జన్యువును క్రియాశీలం చేయవచ్చని పేర్కొన్నారు. పురుషుల వృషణాల్లో దీన్ని గుర్తించారు. ఎలుకలు, పందులు, పశువులు సహా అనేక క్షీరదాల జాతుల్లోనూ ఇది ఉంది. ఈ జన్యువుకు ఏఆర్‌ఆర్‌డీసీ5 అని పేరు పెట్టారు. ఇది వీర్య కణాల సంఖ్య, కదలిక, ఆకృతిపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది వృషణాల కణజాలంలో తప్ప శరీరంలో మరెక్కడా లేదని వివరించారు. దీన్ని క్రియారహితం చేస్తే ఆ వ్యక్తిలో ఉత్పత్తయ్యే వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుందని, వాటి కదలికలూ నెమ్మదిగా ఉంటాయని, ఆకృతి కూడా మారిపోతుందని వివరించారు. అందువల్ల అవి అండంతో ఫలదీకరణ చెందవని పేర్కొన్నారు. ‣ ఈ జన్యువు లోపించిన మగ ఎలుక 28 శాతం తక్కువగా వీర్య కణాలు ఉత్పత్తి చేసిందని, ఆ కణాల కదలికలు కూడా 2.8 రెట్లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. తదుపరి దశలో ఈ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనే ఔషధాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. దాన్ని పురుషుల్లో కుటుంబ నియంత్రణ సాధనంగా వాడొచ్చని పేర్కొన్నారు.

అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తల ఎండోథీలియం నమూనా రూపకల్పన

శరీరంలో ఒక చోట పుట్టే క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపించి, రోగి పరిస్థితిని జటిలం చేస్తుంటుంది. ఇలాంటి వారికి చికిత్స కూడా కష్టమే. క్యాన్సర్‌ మరణాలకు చాలావరకూ ఈ పరిస్థితే కారణం. కణితి కణాలు రక్త ప్రవాహం నుంచి తప్పించుకొని ఇతర అవయవాల్లోకి చొరబడుతున్న తీరును తొలిసారిగా అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సవివరంగా ఆవిష్కరించారు. క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా చూడటానికి సాగుతున్న పరిశోధనలకు ఇది విలువైన డేటా అందిస్తుందని వారు పేర్కొన్నారు. అలాగే కొత్త ఔషధాల రూపకల్పనకూ మార్గం సుగమమవుతుందని వివరించారు. ప్రయోగంతో పరిశీలన అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు మెటాస్టాసిస్‌ తీరుతెన్నులపై లోతుగా పరిశోధించారు. రక్త ప్రవాహం నుంచి ఇతర కణజాలాల్లోకి క్యాన్సర్‌ కణాలు ఎలా చొరబడగలుగుతున్నాయి? అందుకు దోహదపడుతున్న బయో మెకానికల్‌ బలాలు ఏమిటి అన్నది నిశితంగా పరిశీలించారు. ‣ రక్త ప్రవాహానికి, ఇతర భాగాలకు మధ్య ఎండోథీలియం అనే ఒక పొర అడ్డుగోడగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని నమూనాను ల్యాబ్‌లో తయారు చేశారు. ‣ ఈ నమూనాను భిన్న రకాలైన కొలాజెన్‌ జెల్‌పై ఉంచారు. తద్వారా దృఢమైన లేదా సన్నటి రంధ్రాలతో కూడిన కణజాలాలను ఇవి అనుకరించేలా చూశారు. ‣ అనంతరం కణితి కణాలను ఈ నమూనాల్లోకి ప్రవేశపెట్టారు. ఈ కణాలు ఎండోథీలియాన్ని దాటుకొని వెళ్లగలవా అన్నది పరిశీలించారు. ఇందుకు ఎంత సమయం పడుతుంది? ఆ ప్రక్రియ ఎలా సాగింది అన్నది గమనించారు.

జ్వాలలను శోధించే మల్టీస్పెక్ట్రల్‌ కెమెరా

అమెరికా, స్వీడన్‌ శాస్త్రవేత్తలతో కలిసి భారత పరిశోధకులు ఒక వినూత్న కెమెరాను అభివృద్ధి చేశారు. మంటల్లో నాలుగు రకాల రసాయనాల జాడకు సంబంధించిన మల్టీస్పెక్ట్రల్‌ చిత్రాలను ఇది అందిస్తుంది. డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా సాయంతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు. గతంలో ఇలాంటి అంశాల చిత్రీకరణకు నాలుగు కెమెరాలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అవసరమయ్యేది. ఇందౌర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఇంధనాల ప్రజ్వలన గురించి శోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా కంబషన్‌ ఇంజిన్లను మెరుగుపరచొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతిమంగా దీని ద్వారా హానికర ఉద్గారాలను తగ్గించొచ్చని వివరించారు. ఇంధనాన్నీ పొదుపుగా వాడటానికి వీలు కల్పిస్తుందన్నారు. పారిశ్రామిక దహన యంత్రాలు, వాహనాలు, విమానాలు, వ్యోమనౌకల ఇంజిన్ల నుంచి వెలువడే మూలకాలపై పరిశోధనలు సాగించొచ్చని పేర్కొన్నారు. ఈ సాధనానికి ‘సీఎల్‌-ఫ్లేమ్‌’ అని పేరు పెట్టారు. మూడేళ్ల పాటు పరిశోధన సాగించి దీన్ని రూపొందించారు. దీని ఖరీదు రూ.50 వేలని శాస్త్రవేత్తలు తెలిపారు.

రోగి రక్త కణాలతో క్యాన్సర్‌కు చికిత్స

రక్తం నుంచి సేకరించిన ఒక రకం కణాలతో కణుతులపై పోరాడొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. వీటి కోసం కణుతులపై ఆధారపడాల్సిన పనిలేదని గుర్తించారు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే వీటిని ఒడిసిపట్టొచ్చని వివరించారు. ముదిరిపోయిన దశలో ఉన్న కణుతులకు చికిత్స చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల రేడియేషన్‌ థెరపీ, దుష్ప్రభావాలు కలిగించే కీమోథెరపీ ఔషధాల అవసరం లేకుండానే క్యాన్సర్‌ బాధితులకు కొత్త చికిత్సలను అందుబాటులోకి తీసుకురావొచ్చని వివరించారు. అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీకి చెందిన షానా ఒ కెల్లీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. గతంలో వీరు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటిలోని కణుతుల నుంచి రోగ నిరోధక కణాలను సేకరించారు. వీటిని ట్యూమర్‌ ఇన్‌ఫిల్ట్రేటింగ్‌ లింఫోసైట్స్‌ (టిల్స్‌)గా పేర్కొంటారు. నాటి పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ కణాల సంఖ్యను పెంచే విధానాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రస్తుతమున్న ప్రక్రియల కన్నా 400 శాతం అధికంగా వీటిని రాబట్టవచ్చు. టిల్స్‌ ప్రయోగించడం వల్ల ఎలుకల్లో మెలనోమా అనే ఒకరకం చర్మ క్యాన్సర్‌ కణుతులు నాటకీయంగా కుంచించుకుపోయాయి. అయితే టిల్స్‌ను సేకరించడానికి కణుతుల్లో తొలగించడం కొన్నిసార్లు రోగులకు ముప్పు కలిగించొచ్చు. ఈ నేపథ్యంలో శరీరంలో ఇంకెక్కడైనా ఇలాంటి కణాలు ఉంటాయా అన్నది కెల్లీ బృందం తాజాగా శోధించింది. రక్తంలో టిల్స్‌ తరహా లింఫోసైట్లు ఉన్నాయి. కణితి కణాలను చంపే సామర్థ్యం వీటికి కూడా ఉందని గుర్తించారు. ఈ కణాలకు సిటీఆర్‌ఎల్స్‌ అని పేరు పెట్టారు. వీటిలో కణుతులపై మెరుగ్గా పోరాడగలిగే కణాలను గుర్తించి, వేరు చేసే విధానాన్ని కెల్లీ బృందం కనిపెట్టింది.

నిద్ర పోకడల్లో వైరుధ్యాలతో స్కిజోఫ్రీనియా తీవ్రం!

మానసిక సమస్య అయిన స్కీజోఫ్రీనియా స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఎస్‌ఎస్‌డీ) రోగుల నిద్ర పోకడల్లో వైరుధ్యాలు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి నిద్ర, మెలకువ తీరుతెన్నుల్లో నియంత్రణ ఉండదని వివరించారు. రోజువారీ జీవితం మూసలా ఉండేవారిలో ఎస్‌ఎస్‌డీ లక్షణాలు తీవ్రం కావొచ్చని కూడా తేల్చారు. పిట్స్‌బర్గ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల నేతృత్వంలో అంతర్జాతీయ బృందం ఈ పరిశోధన చేసింది. ఎస్‌ఎస్‌డీ ఉన్నవారు గాఢ నిద్రలోకి జారుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని మునుపటి పరిశోధన పేర్కొంది. మానసిక సమస్యలు లేనివారితో పోలిస్తే వీరిలో విశ్రాంతి సమయం తక్కువగా ఉంటుందని కూడా వెల్లడైంది. అయితే ఎస్‌ఎస్‌డీ లక్షణాలను తగ్గించడానికి ఇచ్చే సెడేటివ్‌ మందుల వల్ల నిద్ర తీరు మారిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోజులో 15 గంటల వరకూ రోగులు నిద్రించేలా అవి చేస్తాయన్నారు. దీనివల్ల వారిలో ఎస్‌ఎస్‌డీ లక్షణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.

ఈబీవీ వైరస్‌తో క్యాన్సర్‌ ముప్పు

మానవుల్లో చాలా సులువుగా వ్యాపించే ఎప్‌స్టెయిన్‌ బార్‌ వైరస్‌ (ఈబీవీ)తో క్యాన్సర్‌ రావొచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. అలాగే ఆ రుగ్మతపై పోరాడే సామర్థ్యాన్ని కూడా తగ్గించేస్తుందని వివరించారు. ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ఈబీవీ బారినపడ్డవారే. ప్రధానంగా చిన్నతనంలో ఇది సోకుతుంది. దీనివల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లు చాలా నామమాత్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. వైరస్‌ మాత్రం శరీరంలోనే నిద్రాణంగా ఉండిపోతుంది. కొన్నిసార్లు క్రియాశీలమవుతుంది. లాలాజలం వంటి శరీర ద్రవాల ద్వారా ఈబీవీ వ్యాప్తి చెందుతుంది. మానవ క్రోమోజోమ్‌-11లో ఈ వైరస్‌ మార్పులు కలిగించగలదని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఫలితంగా తలెత్తే జన్యుపరమైన అస్థిరతతో లుకేమియా కారక ఆంకోజన్యువు క్రియాశీలం కావొచ్చని గుర్తించారు. అలాగే కణితిని అణచివేసే మరో జన్యువును నిర్వీర్యం చేస్తుందని కనుగొన్నారు. ఈబీవీ సోకినవారిలో ఈబీఎన్‌ఏ1 అనే ఒక వైరల్‌ ప్రొటీన్‌ ఉంటుందని గుర్తించారు. ఇది మానవ క్రోమోజోమ్‌ 11లోని ఒక బలహీన ప్రదేశంతో బంధం ఏర్పరుస్తుందని తేల్చారు.

పెరగనున్న ఆకస్మిక కరవుల ఉద్ధృతి

ఆకస్మికంగా వచ్చే కరవులు ఇక పెరగనున్నాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవ చర్యలతో జరుగుతున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని వారు వివరించారు. ఈ పోకడ వల్ల కరవులను ముందే ఊహించడం, ఎదుర్కోవడానికి సిద్ధం కావడం కష్టమవుతోందని చెప్పారు. ఆకస్మిక కరవుల వల్ల నేలలో నీరు తగ్గిపోతుందని వివరించారు. అందువల్ల కొద్ది వారాల్లోనే అది తీవ్ర కరవుగా రూపాంతరం చెందొచ్చని తెలిపారు. ఆ పోకడ కొద్దినెలల పాటు సాగొచ్చని పేర్కొన్నారు. ఫలితంగా పచ్చదనం, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇవి వడగాల్పులు, కార్చిచ్చులకు దారితీయవచ్చు. తూర్పు, ఉత్తర ఆసియా, ఐరోపా, సహారా ప్రాంతం, దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరంలో ఇలాంటి ఆకస్మిక కరవులకు అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు.

గాలిని కొలిచే అల్గోరిథమ్‌ అభివృద్ధి

గాలికి సంబంధించిన వివిధ అంశాలను కొలిచేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక అల్గోరిథమ్‌ను అభివృద్ధి చేశారు. అది నీటి ఆవిరి కదలికలకు సంబంధించిన డేటాను సేకరించడం ద్వారా పనిచేస్తుంది. తుపాన్లు వంటి వాతావరణ పోకడలను పసిగట్టడానికి ఉపయోగపడుతుంది. అమెరికాలోని ఆరిజోనా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు నీటి ఆవిరికి సంబంధించి రెండు ఉపగ్రహాలు సేకరించిన డేటాను ఇందులో ఉపయోగించారు. నీటి ఆవిరిని ఒక్క చోటుకు తీసుకురావడం ద్వారా మేఘాల ఆవిర్భావాన్ని గాలి ప్రభావితం చేస్తుంది. ఏరోసాల్‌ రేణువులు, రేడియోధార్మికతనూ అది ఒక్క చోట పోగుచేస్తుంది. అధునాతన అల్గోరిథమ్‌లను ఉపయోగించి భిన్న ఎత్తుల్లో గాలుల వేగాన్ని ఇప్పటికే అంచనా వేయగలిగారు. ఇప్పుడు మెషీన్‌ లెర్నింగ్‌ అల్గోరిథమ్‌లను ఉపయోగించి నీటి ఆవిరి కదలికలను గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేశారు.

ఈఎస్‌ఏ చేపట్టిన ‘జ్యూస్‌’ ప్రయోగం విజయవంతం

గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) ‘జ్యూస్‌’ వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా నుంచి ఏరియాన్‌ రాకెట్‌ ద్వారా ఇది నింగిలోకి పయనమైంది. గురు గ్రహాన్ని చేరుకోవడానికి ఈ వ్యోమనౌకకు 8 ఏళ్లు పడుతుంది. అక్కడికి చేరాక ఇది ఆ గ్రహం గురించి నిశితంగా శోధిస్తుంది. గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, కాలిస్టో, గానీమీడ్‌ చందమామలపైనా పరిశోధనలు సాగించనుంది. హిమమయంగా ఉండే వీటి ఉపరితలాల కింద సముద్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడ జీవుల మనుగడకూ ఆస్కారం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ యాత్రలో జ్యూస్, గానీమీడ్‌ను పరిభ్రమిస్తుంది. మరో గ్రహానికి చెందిన చందమామ చుట్టూ ఒక వ్యోమనౌక తిరగడం అదే మొదటిసారవుతుంది.

అగ్నిపర్వత ఉద్గారాల పర్యవేక్షణకు సరికొత్త కెమెరా

అగ్నిపర్వతాలకు సంబంధించిన ఉద్గారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఓ సరికొత్త కెమెరాను బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సల్ఫర్‌ డయాక్సైడ్‌ (ఎస్‌వో2) వాయువును గుర్తించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఎస్‌వో2 స్థాయులను నిర్ధారించుకోవడం ద్వారా అగ్నిపర్వతాల లోపలి భాగంలో ఎలాంటి ప్రక్రియలు చోటు చేసుకుంటున్నాయో పసిగట్టొచ్చు. ఈ వాయువును గుర్తించేందుకు అతినీలలోహిత ఎస్‌వో2 కెమెరాలను కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. వాటికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో, ఎస్‌వో2 స్థాయులను కచ్చితత్వంతో గుర్తించేలా స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సెన్సర్‌లో మార్పులు చేసి తాజా కెమెరాను రూపొందించారు.

నావిగేషన్‌ సేవలకు దేశీయ చిప్‌ను ఆవిష్కరించిన బెంగళూరు కంపెనీ

పాఠశాల బస్సుల వంటి వాహనాలతో పాటు ఆయుధ వ్యవస్థల కదలికలనూ పక్కాగా తెలుసుకునేందుకు వీలు కల్పించే సరికొత్త దేశీయ చిప్‌ను బెంగళూరుకు చెందిన ఎలీనా జీయో సిస్టమ్స్‌ అనే అంతరిక్ష సాంకేతిక కంపెనీ ఆవిష్కరించింది. భారతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ సాయంతో ఇది పనిచేయగలదు. పౌర, రక్షణ రంగాల్లో ఇది అత్యంత ప్రయోజనకరంగా మారే అవకాశాలున్నాయి. ‘నావిక్‌’ పేరుతో పిలుస్తున్న ఈ చిప్‌ పొడవు కేవలం 12 నానోమీటర్లు. మొబైల్‌ ఫోన్లు సహా ఎలాంటి వేరబుల్‌ డివైజ్‌లలోనైనా దాన్ని వినియోగించొచ్చు. ఇది చాలా తక్కువ విద్యుత్‌ శక్తిని వినియోగించుకుంటుంది. అమెరికాకు చెందిన ‘గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)’, రష్యాకు చెందిన గ్లోనాస్‌ కాన్‌స్టెల్లేషన్‌లతో పాటు భారత్‌కు చెందిన ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) నుంచీ సంకేతాలు అందుకోగల సామర్థ్యం దీనికి ఉంది. మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నావిగేషన్‌ సేవల కోసం జీపీఎస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు నావిక్‌ దోహదపడనుంది. నౌకలు, జలాంతర్గాములు, రాడార్లు, డ్రోన్లు, శతఘ్నుల్లోనూ దాన్ని వినియోగించొచ్చు. ఈ చిప్‌ల ఉత్పత్తి కోసం తైవాన్‌కు చెందిన ఓ కంపెనీతో ఎలీనా జియో సిస్టమ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

పార్కిన్సన్స్‌ వ్యాధిని ముందే గుర్తించొచ్చు

పార్కిన్సన్స్‌ వ్యాధిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలతో పోలిస్తే చాలా ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని అమెరికా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. ‘ఎ-సైన్యూక్లీన్‌ సీడ్‌ యాంప్లిఫికేషన్‌ అస్సే’గా దానికి నామకరణం చేశారు. పార్కిన్సన్స్‌ వ్యాధి ప్రారంభ దశల్లో మెదడులో ఎ-సైన్యూక్లీన్‌ అనే అసాధారణ ప్రొటీన్‌ గణనీయంగా పోగుపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఆ ప్రొటీన్‌ స్థాయులను గుర్తించడం ద్వారా లక్షణాలు బయటపడక ముందే వ్యాధి రాకను అత్యంత కచ్చితత్వంతో పసిగట్టేందుకు తమ తాజా విధానం దోహదపడుతుందని వివరించారు.

కపాల ఎముకలు తగ్గడంతో మెదడు పరిమాణం పెరిగింది!

తొలినాటి క్షీరదాల గురించి బ్రిటన్‌లోని బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. పరిణామ క్రమంలో 10-15 కోట్ల ఏళ్ల కిందట వాటిలో కపాల ఎముకల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఫలితంగా మెదడు పరిమాణం పెరుగుదలకు ఆస్కారం ఏర్పడిందని పేర్కొన్నారు. వాస్తవానికి 30 కోట్ల ఏళ్ల కిందట ఈ క్షీరదాల పుర్రె, కింది దవడల్లో అధిక మొత్తంలో ఎముకలు ఉండేవని చెప్పారు. 15-20 కోట్ల ఏళ్లు గడిచేసరికి వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారు. అదే సమయంలో క్షీరదాల శరీర పరిమాణం కూడా బాగా క్షీణించిందని వారు తెలిపారు. కొన్నింటి పుర్రె పొడవు 10-12 మిల్లీమీటర్లకే పరిమితమైందని చెప్పారు. దాంతో వాటికి అందుబాటులో ఉన్న ఆహార వనరులూ తగ్గిపోయాయని వివరించారు.

ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాన్ని బలపరిచిన ‘శూన్యం’ విశ్లేషణ

అనంత విశ్వంలో ‘శూన్యం’ విస్తరించి ఉన్న తీరును వివరించేలా సరికొత్త విశ్లేషణ పటాన్ని అంతర్జాతీయ పరిశోధక బృందం తాజాగా అభివృద్ధి చేసింది. విశ్వం పుట్టుకకు సంబంధించి ఐన్‌స్టీన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అది బలపరిచింది. అంతరిక్షంలో భారీ నిర్మాణాలు ఎలా అవతరించాయో తెలుసుకునేందుకు ఈ విశ్లేషణ దోహదపడనుంది. ప్రస్తుతం విశ్వం విస్తరిస్తున్న తీరును సమగ్రంగా అధ్యయనం చేసేందుకూ వీలు కల్పించనుంది. మహా విస్ఫోటం తర్వాత మిగిలిపోయిన కాంతికి సంబంధించిన వక్రీకరణలను ఉపయోగిస్తూ తాజా విశ్లేషణ పటాన్ని రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు.

పిడుగు దెబ్బకు భూమిపై కొత్త పాస్ఫరస్‌ పదార్థం పుట్టుక!

అమెరికాలో ఇటీవల ఓ చెట్టుపై పిడుగు పడటంతో భూమిపై గతంలో ఎన్నడూ కనిపించని సరికొత్త పాస్ఫరస్‌ పదార్థం ఏర్పడటానికి కారణమైంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త మాథ్యూ పసెక్‌ దాన్ని గుర్తించారు. నూతన పాస్ఫరస్‌ పదార్థం ఘన రూపంలో ఉందని పసెక్‌ తెలిపారు. దాన్ని ఓ శిలలో గుర్తించామని చెప్పారు. ఫ్లోరిడాలోని న్యూ పోర్ట్‌ రిచే ప్రాంతంలో ఓ చెట్టుపై పడిన పిడుగు, దాని వేర్లపై పోగుబడిన ఐరన్‌ను, చెట్టు లోపల ఉన్న కార్బన్‌ను అధిక ఉష్ణోగ్రతతో మండించిందని వివరించారు. ఫలితంగా చోటు చేసుకున్న రసాయనిక చర్యల వల్ల కొత్త పాస్ఫరస్‌ పదార్థం ఆవిర్భవించిందని తెలిపారు. అంతరిక్షంలో మాత్రమే ఇలాంటి పదార్థాల ఉనికి బయటపడే అవకాశముందని పేర్కొన్నారు.

దోమల తాకిడిని పెంచే కాంతి కాలుష్యం

పట్టణాల్లో కాంతి కాలుష్యం వల్ల దోమల తాకిడి కాలం మరింత పెరుగుతుందని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అందువల్ల సాధారణం కన్నా ఎక్కువ రోజుల పాటు మనుషులు ఈ కీటకాల దాడికి గురికావాల్సి ఉంటుందని పేర్కొంది. శీతాకాలానికి ముందు బాగా లావెక్కాలని దోమలు ప్రయత్నిస్తాయి. ఇందుకోసం అవి మొక్కల నుంచి సేకరించిన మకరందం వంటి చక్కెర వనరులను కొవ్వుగా మార్చుకుంటాయి. ఆ తర్వాత అవి ఒకింత నిద్రాణ దశలోకి వెళతాయి. దీన్ని డయాపాజ్‌ అంటారు. కాంతి కాలుష్యం వల్ల ఆ దోమలు లావెక్కే ప్రక్రియలో అవరోధం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఫలితంగా అవి చాలా తక్కువ పరిమాణంలో కొవ్వును సమకూర్చుకుంటున్నట్లు ఒహాయో వర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ తరహా ఇబ్బందుల వల్ల ఈ కీటకాలు డయాపాజ్‌ దశలోకి త్వరగా వెళ్లవని తేలింది. ఈ జాప్యం కారణంగా మనుషులు, ఇతర జంతువులపై మరింత ఎక్కువ కాలం దాడి చేస్తాయని పరిశోధకులు తెలిపారు.

క్యాన్సర్‌కు భారతీయ ఆయుర్వేద ఔషధం

క్యాన్సర్‌ కోసం రూపొందించిన ఆయుర్వేద ఔషధం ‘వీ2ఎస్‌2’ను కొన్ని రకాల మొక్కల నుంచి సేకరించిన హైడ్రో-ఆల్కహాలిక్‌ పదార్థాలతో తయారు చేశారు. జైపుర్‌లోని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ) దీన్ని అభివృద్ధి చేసింది. దీని సామర్థ్యాన్ని మనుషులపై పరీక్షించేందుకు ఎన్‌ఐఏతో పాటు ముంబయిలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్, ఏఐఎంఐఎల్‌ ఫార్మా వంటి సంస్థలు భాగస్వాములయ్యాయి. ఈ ఔషధానికి క్యాన్సర్‌ నిరోధక సామర్థ్యం ఉందని ఇప్పటికే నిర్వహించిన ల్యాబ్‌ పరీక్షల్లో వెల్లడైంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, క్యాన్సర్‌ వృద్ధిని అడ్డుకుంటుందని కూడా తేలింది.

మెదడులో కణితులకు ‘ప్రోగ్రామ్‌’

ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా అనే మెదడు క్యాన్సర్‌కు చికిత్సా విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కణితి కణాలు తమంతట తాము నశించేలా ‘ప్రోగ్రామ్‌’ చేయవచ్చని గుర్తించారు. ఇందుకోసం ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుందని తేల్చారు. దీని ద్వారా కీమోథెరపీ ఔషధాల సమర్థతనూ మెరుగుపరచొచ్చని పరిశోధకులు తెలిపారు. ఏమిటీ గ్లియోబ్లాస్టోమా? మెదడులో వచ్చే కణితుల్లో ఎక్కువగా కనిపించేది గ్లియోబ్లాస్టోమా. ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనికి సమర్థ చికిత్స లేదు. అందువల్ల ఈ రకం కణితులపై అవగాహన పెంచుకొని, కొత్త చికిత్సలను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మార్గాలేంటి? తాజా పరిశోధన నేపథ్యంలో శరీరానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, రోగి శక్తి అవసరాలపై ప్రభావం పడకుండా సిస్టీన్, మెథియోనైన్‌లను ఆహారం నుంచి తొలగించడానికి ఉన్న మార్గాలపై పరిశోధనలు చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ‣ ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్లపైనా ఈ ఆహారం సమర్థంగా పనిచేస్తుందని వెల్లడైంది. క్యాన్సర్‌ చికిత్సల సమర్థతను పెంచే సాధనంగా ఇది అక్కరకొస్తుందని భావిస్తున్నారు.

మస్తిష్కంపైనా వాయుకాలుష్య ప్రభావం!

గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉంటున్నారా? వాహనాల రద్దీలో ప్రయాణం సాగుతోందా? వాయుకాలుష్యానికి గురవుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తే అప్రమత్తం కావాల్సిందే. పలు అవయవ వ్యవస్థలను దెబ్బతీస్తున్న వాయుకాలుష్యం మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని ప్రపంచంలో మొదటిసారిగా అధ్యయనంలో వెల్లడైనట్లు బ్రిటిష్‌ కొలంబియా, విక్టోరియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు తెలిపారు. గంటల వ్యవధిలోనే అది మెదడును ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా జ్ఞాపకశక్తి, అంతర్గత ఆలోచనలకు సంబంధించిన మెదడు ప్రాంతాల్లో మార్పులను గుర్తించినట్లు తెలిపారు. వాయుకాలుష్యంతో వచ్చిన మార్పులు మళ్లీ సాధారణ స్థితికి చేరినా ఎక్కువ సమయం, తరచుగా దీని బారిన పడితే మాత్రం ఆ ప్రభావం కొనసాగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అత్యాధునిక పరిశోధన వ్యవస్థ ఉన్న వాంకోవర్‌ జనరల్‌ ఆసుపత్రిలోని ఎయిర్‌ పొల్యూషన్‌ ఎక్స్‌పోజర్‌ ప్రయోగశాలలో ఈ అధ్యయనం జరిపారు. ఇందులో భాగంగా పరిశుభ్రమైన గాలితో, డీజిల్‌ పొగతో నిండిన కలుషిత వాయువులతో, ప్రభావానికి గురిచేసి మార్పులను నమోదు చేశారు. ముందు, తర్వాత మెదడులో వచ్చిన మార్పులను పరిశీలించారు. రెండు గంటలు డీజిల్‌ వాయుకాలుష్యానికి గురైన మెదడు పనితీరులో మార్పులొచ్చినట్లు గుర్తించారు. మానవ మెదడులోని వివిధ ప్రాంతాలు పరస్పర సంఘర్షణకు గురికావడం, సంభాషించే సామర్థ్యంపై ప్రభావం వంటి కీలకాంశాలు గుర్తించినట్లు బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయం రెస్పిరేటరీ మెడిసిన్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ క్రిస్‌ కార్ల్‌స్టన్‌ వెల్లడించారు. జ్ఞాపకశక్తి, అంతర్గత ఆలోచనలకు సంబంధించిన కీలకమైన మెదడు ప్రాంతాల్లో అంతరాయం కలిగించినట్లు గుర్తించామని తెలిపారు. మెదడుపై చూపే ప్రభావానికి కారణాలను గుర్తించేందుకు లోతైన పరిశోధనలు అవసరమని చెప్పారు.

గ్రహాల పుట్టుక గుట్టును విప్పే తారా ధూళి

సూర్యుడి కన్నా కొంచెం పెద్దగా ఉండే అసింప్టోటిక్‌ జయింట్‌ బ్రాంచ్‌ (ఏజీబీ) నక్షత్రాల నుంచి వచ్చే ధూళిని విశ్లేషించడం ద్వారా గ్రహాల పుట్టుకకు సంబంధించిన గుట్టును విప్పొచ్చని జపాన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటి వెలుగుల్లోని వైరుధ్యాలను గమనించడం ద్వారా దీని సాధించొచ్చని వివరించారు. ఏజీబీ తారలు భార మూలకాలను వెదజల్లుతుంటాయి. అవి ధూళి రూపంలో పోగుపడుతుంటాయి. రెండు నక్షత్రాల మధ్య ఉండే ఇంటర్‌స్టెల్లార్‌ ప్రదేశంలో అవి చేరుతుంటాయి. అది గ్రహాల పుట్టుకకు దారి తీయవచ్చు. అందువల్ల వీటి గురించి అధ్యయనం చేయడం ద్వారా గ్రహాలు, భూమిపై జీవం వంటి అంశాల గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ తారలు వెదజల్లే కాంతిలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటి నుంచి వెలువడే పరారుణ కాంతి చాలా కీలక సమాచారాన్ని అందిస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన కెంగో తాచిన్‌బానా పేర్కొన్నారు.

రొమ్ము క్యాన్సర్‌ ముప్పును పసిగట్టే కృత్రిమ మేధ

రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని ముందే గుర్తించడానికి దోహదపడేలా కృత్రిమ మేధ (ఏఐ) విధానం కింద బ్రిటన్‌ శాస్త్రవేత్తలు డీప్‌ లెర్నింగ్‌ మోడల్‌ను అభివృద్ధి చేశారు. మాంచెస్టర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. రొమ్ములోని ఫైబ్రో-గ్రాండ్యులర్‌ కణజాల నిష్పత్తిని రొమ్ము సాంద్రతగా పేర్కొంటారు. ఆ భాగంలో క్యాన్సర్‌ వచ్చే ముప్పు అంచనాకు నిపుణులు దీనిపై ఆధారపడుతుంటారు. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు 10 లక్షల వైద్యేతర ఇమేజింగ్‌ చిత్రాలతో కూడిన డేటాసెట్‌ పరిశీలన ద్వారా రెండు స్వతంత్ర డీప్‌ లెర్నింగ్‌ నమూనాలను ఉపయోగించారు. వాటికి ట్రాన్స్‌ఫర్‌ లెర్నింగ్‌ అనే విధానం ద్వారా వైద్య ఇమేజింగ్‌ డేటాపై శిక్షణ ఇచ్చారు. ఈ విధానంలో రూపొందిన కొత్త నమూనా మహిళ మమ్మోగ్రామ్‌ ఇమేజ్‌ని విశ్లేషించి, రొమ్ము సాంద్రతను లెక్కకట్టగలదు.

మందులు లేకుండానే అల్జీమర్స్‌కు మెరుగైన చికిత్స

తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నవారికి ఔషధాల అవసరం లేకుండానే మెరుగైన చికిత్స అందించవచ్చని అమెరికా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అల్జీమర్స్, డిమెన్షియాల చికిత్సకు ఉపయోగిస్తున్న మందులు ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఔషధాలు వాడకుండా బాధితులను ఇళ్లలో స్వతంత్రంగా ఉండనివ్వడం, వారికి సుశిక్షితులతో సమర్థ కౌన్సిలింగ్‌ ఇవ్వడం, వ్యాధిగ్రస్తుల బాగోగులు చూసుకునే వారిలో నైపుణ్యాలు పెంచడం వంటి విధానాలతోనూ ప్రయోజనాలుంటాయని తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. బాధితుల జీవన నాణ్యత మెరుగుపడేందుకు అవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ విధానాలతో చికిత్స ఖర్చులు తగ్గుతాయని వివరించారు.

మేధో సామర్థ్యాన్ని తగ్గిస్తున్న ఓఎస్‌ఏ!

నిద్రలో శ్వాసలేమికి కారణమయ్యే ‘అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా (ఓఎస్‌ఏ)’ మధ్య వయస్కుల్లో మేధో సామర్థ్య క్షీణతకు కారణమవుతుందని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు తొలిసారిగా గుర్తించారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఓఎస్‌ఏ బాధితులు పలు రకాల మేధో సంబంధిత పరీక్షల్లో తక్కువ ప్రతిభ చూపుతున్నట్లు తేల్చారు. ఓఎస్‌ఏ మినహా మరే అనారోగ్య సమస్యలూ లేని 27 మందిపై వారు ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టారు. మేధో సామర్థ్యం తగ్గుదలకు కారణాలు ఏంటన్నది మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు. శ్వాసలేమి కారణంగా ఆక్సిజన్‌ సరఫరా తగ్గడం, రక్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులు పెరగడమే ఇందుకు కారణం కావొచ్చని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు.

ఉత్తర భారతంలో వేగంగా భూగర్భజలాల క్షీణత

ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు చాలా వేగంగా క్షీణిస్తున్నాయని ఐఐటీ-గాంధీనగర్‌ పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో గుర్తించారు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల తగ్గుదలలో 95% వాటా ఆ ప్రాంతాలదేనని నిర్ధారించారు. భవిష్యత్తులో వర్షపాతం పెరిగినా ప్రస్తుతం క్షీణించిన స్థాయిలో జల వనరులను పునరుద్ధరించుకోవడం సాధ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బోరుబావుల తవ్వకం లోతుపై పరిమితులు విధించడం, వాటి తవ్వకం వ్యయాలను పెంచడం వంటి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ‘వన్‌ ఎర్త్‌’ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

గగన్‌యాన్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ సాకారమయ్యే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో ఉపయోగించనున్న హ్యూమన్‌ రేటెడ్‌ ఎల్‌110-జీ వికాస్‌ ఇంజిన్‌ను తాజాగా 240 సెకన్ల పాటు మండించి పరీక్షించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ)లో ఈ ప్రజ్వలన ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

అంతరించిపోయిన జీవి డీఎన్‌ఏతో కృత్రిమ మాంసం తయారీ

కృత్రిమ మాంసం తయారీ రంగంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘వావ్‌’ అనే కంపెనీ వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన ‘మామ్మత్‌’ అనే ఏనుగు వంటి జీవి డీఎన్‌ఏ క్రమాన్ని ఉపయోగించి కృత్రిమ మాంసాన్ని అభివృద్ధి చేసింది. దానితో ‘మాంసపు బంతి’ని తయారు చేసింది. దాన్ని నెదర్లాండ్స్‌లోని ‘నెమో’ సైన్స్‌ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ మాంసాన్ని ఇంకా ఎవరూ రుచి చూడలేదు. మానవ శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. మాంసాన్ని రెట్టింపు చేయడం కోసం ఏనుగు డీఎన్‌ఏను కూడా ‘వావ్‌’ శాస్త్రవేత్తలు ఉపయోగించారు. గొర్రె నుంచి సేకరించిన కండర కణాలతో మామ్మత్‌ కండరాల ప్రొటీన్, ఏనుగు డీఎన్‌ఏను కలపడం ద్వారా వారు కోట్ల కొద్దీ కణాలను అభివృద్ధి చేశారు. దాంతో అరుదైన కృత్రిమ మాంసం తయారైంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు కొన్ని వారాల సమయం పట్టిందని ప్రొఫెసర్‌ ఎర్నెస్ట్‌ వోల్వెట్యాంగ్‌ తెలిపారు. ‘వావ్‌’ కంపెనీ ఇప్పటికే దున్న, మొసలి, కంగారూ, నెమలి మాంసాలను ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన సంగతి గమనార్హం.

మురుగు నీటిలో పొదుగుతున్న ఔషధ నిరోధకత

యాంటీబయోటిక్‌ ఔషధాలకు సూక్ష్మజీవులు నిరోధకతను సముపార్జించుకోవడంలో మురుగు నీరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వీడన్‌లోని సెంటర్‌ ఫర్‌ యాంటీబయోటిక్‌ రెసిస్టెన్స్‌ రీసెర్చ్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు. సాధారణంగా మురుగు నీటిలో యాంటీబయోటిక్‌ల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. సంబంధిత ఔషధాల ప్రభావాన్ని నిరోధించగల శక్తిని పెంపొందించుకునేందుకు ఆ వాతావరణం బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంటుంది. యాంటీబయోటిక్‌ నిరోధక సామర్థ్యం పెంపునకు అవసరమైన జన్యువులు హానికరం కాని బ్యాక్టీరియా నుంచి వ్యాధికారక బ్యాక్టీరియాలోకి ప్రవేశించేందుకు మురుగునీరు గతంలో ఊహించినదానితో పోలిస్తే అత్యంత అనువైన కేంద్రంగా మారుతోందని స్వీడన్‌ పరిశోధకులు ప్రస్తుత అధ్యయనంలో తేల్చారు.

‘ధావన్‌-2’ 3డీ-ప్రింటెడ్‌ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం

హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ రంగ అంతరిక్ష టెక్‌ అంకుర సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ మరో కీలకమైన మైలురాయిని సాధించింది. 200 సెకన్ల పాటు పూర్తి 3డీ-ప్రింటెడ్‌ క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను విజయవంతంగా సంస్థ పరీక్షించింది. స్కైరూట్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన మొబైల్‌ క్రయోజెనిక్‌ ప్యాడ్‌ను వినియోగించి ‘ధావన్‌-2’ పరీక్షను నాగపూర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ ప్రోపల్షన్‌ పరీక్షా కేంద్రంలో నిర్వహించారు. 2022 నవంబరులో విక్రమ్‌-ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్‌ సంస్థ అంతరిక్షంలో రాకెట్‌ను పంపిన తొలి భారత ప్రైవేటు కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే. నవంబరు 2021లో విజయవంతంగా పరీక్ష నిర్వహించిన ధావన్‌-1 ఇంజిన్‌ (ఇది సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన తొలి పూర్తి స్థాయి క్రయోజనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌) ఆధారంగానే ధావన్‌-2నూ స్కైరూట్‌ నిర్మించింది.

సమయాన్ని బట్టి తలనొప్పి విజృంభణ

క్లస్టర్‌ తలనొప్పులు, పార్శ్వ నొప్పి (మైగ్రేన్‌) వంటివి శరీరంలోని జీవగడియారాన్ని (సర్కాడియన్‌ వ్యవస్థ) అనుసరించే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. దాని ప్రకారం రోజులో, ఏడాదిలో నిర్దిష్ట సమయంలో అవి విజృంభిస్తుంటాయని వివరించారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది వెల్లడైంది. వీరు క్లస్టర్‌ తలనొప్పి (కంటి వెనుక భాగంలో వచ్చే తీవ్ర నొప్పి), మైగ్రేన్‌తో పాటు శరీరంలోని సర్కాడియన్‌ వ్యవస్థకు సంబంధించిన కార్టిసాల్, మెలాటోనిన్‌ వంటి హార్మోన్ల గురించి శోధించారు. ఈ రెండు రకాల రుగ్మతలు శరీరంలోని జీవగడియార వ్యవస్థను అనుసరిస్తాయని తేల్చారు. శరీరానికి సంబంధించిన ప్రాథమిక జీవ గడియారం మెదడులోని హైపోథాలమస్‌లో ఉంటుంది. క్లస్టర్‌ తలనొప్పి, మైగ్రేన్‌లో దీని పాత్రను మా పరిశోధన తేటతెల్లం చేసిందని పరిశోధనకు నేతృత్వం వహించిన మార్క్‌ జోసెఫ్‌ బ్యూరిష్‌ పేర్కొన్నారు. 71 శాతం క్లస్టర్‌ తలనొప్పి కేసుల్లో జీవగడియారానికి అనుగుణమైన పోకడ కనిపించింది. రాత్రి పొద్దుపోయినప్పటి నుంచి తెల్లవారేలోగా ఈ రుగ్మత గరిష్ఠ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నట్లు వెల్లడైంది. మైగ్రేన్‌ తలనొప్పి విషయంలో జీవగడియారానికి అనుగుణమైన వ్యవహారశైలిని 50 శాతం కేసుల్లో గుర్తించారు.

చిప్‌ మీద కృత్రిమ మూత్రపిండం

యాంటీ బయాటిక్స్‌తో పాటు మధుమేహం, రక్తపోటు వంటి వేర్వేరు వ్యాధుల చికిత్సకు వాడే మందుల అవశేషాలను మూత్రపిండాలు శరీరం నుంచి విసర్జిస్తాయి. ఏ మందులు మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయో ముందే పసిగట్టడానికి ఔషధ పరిశ్రమతో పాటు శాస్త్రజ్ఞులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వారికి ఈ విషయంలో తోడ్పడే కృత్రిమ మూత్ర పిండాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు రూపొందించారు. మూత్రపిండంలో దాదాపు 10 లక్షల ఫిల్టర్‌ (వడపోత) యూనిట్లు ఉంటాయి. వాటిని నెఫ్రాన్‌ అంటారు. ప్రతి నెఫ్రాన్‌లో గ్లోమెరూలస్‌ ఫిల్టర్‌ రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. వ్యర్థాలు పోగా శరీరానికి పనికొచ్చే పదార్ధాలను ట్యూబులర్‌ ఫిల్టర్‌ తిరిగి శరీరానికి అందిస్తుంది. అతిగా మందులు వాడినప్పుడు మొదట దెబ్బతినేది నెఫ్రానే. శాస్త్రజ్ఞులు ఒక కంప్యూటర్‌ చిప్‌ మీద గ్లోమెరూలర్‌ ఎండోథీలియల్‌ కణజాలం, పోడోసైట్‌ పొరలు, గ్లోమెరూలర్‌ ప్రాతిపదిక పొర (జీబీఎం)లను కూర్పు చేశారు. మరో విధంగా చెప్పాలంటే చిప్‌ మీద గ్లోమెరూలర్‌ సూక్ష్మ రక్తనాళాలను పొదిగి కృత్రిమ మూత్ర పిండాన్ని రూపొందించారు. ఆ చిప్‌ గ్లోమెరూలర్‌ కణాలు ఎలా పనిచేస్తాయో ప్రదర్శిస్తుంది. ఏడ్రియామైసిన్‌ అనే మందుకూ, రక్తంలో చక్కెర శాతం అతిగా పెరిగిపోయినప్పుడూ చిప్‌ ఎలా స్పందిస్తుందో పరిశీలించారు. మూత్రపిండాలకు మందుల వల్ల నష్టం కలుగుతుందో? లేదో? ముందే కనిపెట్టడానికి చిప్‌పై సృష్టించిన కృత్రిమ మూత్రపిండం ఉపకరిస్తుందని దక్షిణ కొరియాలో పోహాంగ్‌ సైన్స్, టెక్నాలజీ విశ్వవిద్యాలయ పరిశోధక బృంద సారథి ప్రొఫెసర్‌ డాంగ్‌ వూ చో తెలిపారు.

ఇక మరింత స్పష్టంగా ఖగోళ చిత్రాలు

దూరాన ఉన్న నక్షత్ర మండలాలను భూమిపై నుంచి టెలిస్కోపు ద్వారా చూసేటప్పుడు వాతావరణం ఒక పొరలా అడ్డువచ్చి ఖగోళ చిత్రాలు అస్పష్టంగా రావడానికి కారణమవుతుంది. నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కిరణాలు భూ వాతావరణం గుండా ప్రవేశించినప్పుడు వాటి ప్రకాశం మందగించడం వల్ల అస్పష్టత ఏర్పడుతుంది. ఫలితంగా నక్షత్ర మండలాల స్వరూపం అపభ్రంశానికి లోనవుతుంది. అవి ఉన్నదానికన్నా ఎక్కువ గుండ్రంగానో, ఎక్కువ సాగినట్లుగానో కనిపిస్తాయి. ఛాయాచిత్రాల్లో వాటి స్వరూపం యథాతథంగా కనిపిస్తే నక్షత్ర మండలాల గురుత్వాకర్షణ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయగలుగుతాం. వాతావరణ పొర వల్ల ఖగోళ చిత్రాల్లో ఏర్పడుతున్న అస్పష్టతను తొలగించే పద్ధతిని అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ వర్సిటీ, చైనాలోని జిన్హువా విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు కనిపెట్టారు. ఖగోళ చిత్రాల పరిశీలనలో శిక్షణ పొందిన డీప్‌ లెర్నింగ్‌ నెట్‌వర్కును ఆప్టిమైజేషన్‌ అల్గొరిథమ్‌తో మేళవించి ఒక టూల్‌ను రూపొందించారు. వాతావరణ పొర వల్ల ఏర్పడే అస్పష్టతను తొలగించడానికి సంప్రదాయంగా వాడుతున్న పద్ధతుల కన్నా 38.6 శాతం తక్కువ తప్పులతో ఈ టూల్‌ ఖగోళ చిత్రాలను రూపొందించింది. ఆధునిక పద్ధతులకన్నా 7.4% తక్కువ తప్పులతో చిత్రాలను అందిస్తోంది.

పునర్వినియోగ వాహక నౌక పరీక్షలు విజయవంతం

అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో కీలకమైన పరీక్షను ఇస్రో విజయవంతంగా ముగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌)లో ఇస్రో తయారు చేసిన రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ అటానమస్‌ ల్యాండింగ్‌ మిషన్‌ (ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌)ను విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచంలోనే తొలిసారిగా రెక్కలున్న వాహక నౌకను భూమికి 4.5 కిలోమీటర్ల దూరం నుంచి సురక్షితంగా, స్వయంగా రన్‌వే పై ల్యాండ్‌ అయ్యే పరీక్షను చేపట్టినట్లు ఇస్రో ట్వీట్‌ చేసింది. ఉదయం 7:10 గంటలకు ఐఏఎఫ్‌కు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌లో ఆర్‌ఎల్‌వీని మోసుకెళ్లి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు. తిరిగి ల్యాండ్‌ అయ్యే పరిస్థితులన్నీ సాంకేతికపరంగా సరిగా ఉన్నట్లు నిర్ధారించుకుని ల్యాండింగ్‌ సంకేతాలు పంపారు. ఇంటిగ్రేటెడ్‌ నావిగేషన్, గైడెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా 30 నిమిషాల తరవాత రన్‌వేలో ల్యాండ్‌ అయినట్లు ఇస్రో వెల్లడించింది. డ్రాగ్‌ రేషియా లిఫ్టింగ్‌ విధానంతో 350 కిలోమీటర్ల వేగంతో ఆర్‌ఎల్‌వీని తయారు చేయగా, సూడో సిస్టమ్స్‌ తదితర డిజిటల్‌ హంగులతో ఎల్‌ఈఎక్స్‌ను రూపొందించినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో మరో కీలకమైన అడుగు వేసినట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించారు.

శరీర బరువునూ, మధుమేహాన్నీ తగ్గించే రసాయనం

బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేయించుకోకుండానే స్థూలకాయాన్నీ, మధుమేహాన్నీ తగ్గించడానికి తోడ్పడే కొత్త రసాయనాన్ని రాబర్ట్‌ డాయల్, క్రిస్టియన్‌ రాత్‌ అనే అమెరికన్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఈ రసాయనం లేదా పెప్టైడ్‌ శరీర బరువుతో పాటు మధుమేహాన్నీ తగ్గిస్తుంది. బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స తరువాత ఉదరంలో గ్లూకగాన్‌ తరహా పెప్టైడ్‌-1 (జీఎల్పీ-1), పెప్టైడ్‌ వైవై (పీవైవై) అనే హార్మోన్ల స్థాయులు మారతాయి. దానివల్ల కొంచెం తిన్నా కడుపు నిండిపోయి ఆకలి తీరిన అనుభూతి కలిగి, తద్వారా రక్తంలో చక్కెర శాతం తగ్గిపోతుంది. క్లోమ గ్రంథిలో, మెదడులో జీఎల్పీ-1 రిసెప్టర్లను ప్రేరేపించి కడుపు నిండిపోయిన అనుభూతిని కలిగించే లిరాగ్లుటైడ్‌ అనే మందు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. జీఎల్పీ-1ను మాత్రమే ప్రేరేపించే లిరాగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ కన్నా మూడు రెట్లు ఎక్కువ బరువును తగ్గించే జీఈపీ-44 పెప్టైడ్‌ను డాయల్‌ బృందం రూపొందించింది. అది జీఎల్పీ-1తోపాటు పీవైవై రిసెప్టార్లనూ ప్రేరేపించి 80 శాతం తక్కువ తిండితోనే సరిపెట్టుకునేట్లు చేస్తుందని ఎలుకల మీద పరిశోధనలు తేల్చాయి. లిరాగ్లుటైడ్‌ మాదిరిగా ఈ పెప్టైడ్‌ వాంతులు, తలతిరుగుడు వంటి ప్రభావాలను కలిగించదు.

వాషింగ్టన్ డీసీలో 2వ జి20 ఆర్థిక మంత్రుల సమావేశం

భారత జి20 ప్రెసిడెన్సీలో జి20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల 2వ సమావేశంను, ఏప్రిల్ 12-13 తేదీలలో వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జి20 సభ్యులు, 13 ఆహ్వానిత దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థల నుండి దాదాపు 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశం ప్రధానంగా గ్లోబల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్, సస్టైనబుల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ సెక్టార్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్, మరియు ఇంటర్నేషనల్ టాక్సేషన్ అంశాలకు సంబంధించి చర్చిందేందుకు నిర్వహించారు. అలానే క్యాపిటల్ అడిక్వసీ ఫ్రేమ్‌వర్క్స్ (CAF) సిఫార్సుల అమలు పురోగతిపై కూడా మంత్రులు మరియు గవర్నర్‌లు చర్చించారు. ఈ సమావేశంను ఫిబ్రవరి 24-25 మధ్య కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన మొదటి జి20 ఆర్థిక మంత్రుల సమావేశానికి కొనసాగింపుగా నిర్వహించారు.

వారణాసిలో జి20 అగ్రి చీఫ్ శాస్త్రవేత్తల సమావేశం

అగ్రి చీఫ్ శాస్త్రవేత్తల మూడు రోజుల జి20 సమావేశానికి వారణాసి ఆతిథ్యం ఇచ్చింది. భారత జి20 అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంను ఏప్రిల్ 17 -19 తేదీల్లో నిర్వహించారు. జి20 సభ్య దేశాల నుంచి దాదాపు 80 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది భారత జి20 అధ్యక్షతన నిర్వహించిన100వ ఈవెంట్‌గా నిలిచింది.

ఈ సమావేశంను 'ఒక భూమి, ఒక కుటుంబం' అనే ధీమ్‌తో నిర్వహించారు. ఈ సమావేశం ప్రధానంగా ప్రజారోగ్యం కోసం స్థిరమైన వ్యవసాయం & ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయడం అనే అంశంపై నిర్వహించారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పోషకాహార సమస్యలను తగ్గించేందుకు బయో-ఫోర్టిఫైడ్ పంటసాగు సత్వర పరిస్కారంగా పేర్కొన్నారు.

భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ-ప్రమాణ ఎన్నికల అఫిడవిట్‌లను విశ్లేషించగా, అందులో 29 మంది సీఎంలు కోటీశ్వరులుగా ఉన్నారు. ఈ జాబితాలో వైఎస్ జగన్ 510 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ 15 లక్షలతో అట్టడుగున నిలిచారు.

ఎడిఆర్ నివేదిక ప్రకారం ప్రస్తుత 30 మంది సీఎంలలో 13 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ మరియు క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఆస్తుల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జగన్ మోహన్ రెడ్డి (510 కోట్లు), అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన పెమా ఖండూ (163 కోట్లు), ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (63 కోట్లు) ఉన్నారు.

చివరి మూడు స్థానాల్లో కేరళకు చెందిన పినరయి విజయన్ మరియు హర్యానాకు చెందిన మనోహర్ లాల్ ఒక కోటికి పైగా ఆస్తులను కలిగి ఉండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ కేవలం 15 లక్షల వ్యక్తిగత ఆస్తులను మాత్రమే కలిగి ఉన్నట్లు నివేదించింది. అలానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ 3 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కెసిఆర్ 23 కోట్ల వ్యక్తిగత ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.

ఢిల్లీలో ఇండియా-స్పెయిన్ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్

ఇండియా-స్పెయిన్ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ (JCEC) యొక్క 12వ సెషన్, ఏప్రిల్ 13న ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ మరియు స్పెయిన్ ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి జియానా మెండెజ్‌లు సహ అధ్యక్షత వహించారు. ఈ సంధర్బంగా 1972లో ఏర్పాటైన ఇండియా-స్పెయిన్ జాయింట్ కమీషన్ మెకానిజం యొక్క స్వర్ణోత్సవ ఎడిషన్‌ను ఇరుపక్షాలు జరుపుకున్నాయి.

గత 50 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల నమోదయినట్లు పేర్కొన్నారు. దాదాపు 250 స్పానిష్ కంపెనీలు భారతదేశంలో వ్యాపారం నిర్వర్తిస్తుండగా, 40కి పైగా భారతీయ కంపెనీలు స్పెయిన్‌లో ఐటీ, ఫార్మా, పునరుత్పాదక శక్తి, ఆటోమొబైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి మొదలైన రంగాలలో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రెన్యూవబుల్ ఎనర్జీ, షిప్పింగ్, పోర్ట్స్, టూరిజం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు డిఫెన్స్ రంగంలో మరింత సహకారం కోసం ఇరుపక్షాలు ఆసక్తి కనబర్చారు.

నేపాల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్‌తో ఒప్పందం

నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ అధ్యక్షతన జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు నేపాల్ 53వ సమావేశంలో 669 మెగావాట్ల దిగువ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు, భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ (SJVN) ప్రతిపాదించిన రూ. 92.68 బిలియన్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. 900 మెగావాట్ల అరుణ్-III మరియు 695 మెగావాట్ల అరుణ్-IV జలవిద్యుత్ ప్రాజెక్టుల తర్వాత అరుణ్ నదిపై చర్చల ద్వారా చేపట్టిన మూడవ ప్రాజెక్ట్ ఇది.

సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ ప్రస్తుతం అదే నదీ పరీవాహక ప్రాంతంలో మరో జలవిద్యుత్ ప్రాజెక్ట్ అయిన అరుణ్ IIIని అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్టులు తూర్పు నేపాల్‌లోని అరుణ్ నది నుండి దాదాపు 2,300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి. 2022లో నేపాల్‌లోని లుంబినీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా, ఇరుపక్షాలు తమ తమ ప్రభుత్వాల తరపున అరుణ్-IV అభివృద్ధికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులకు ఆమోదం

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్లలో ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అంతటా ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.

దీని ద్వారా అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద వాహనాల ఉద్గారాలను అరికట్టడంతో పాటుగా సందర్శకుల వాహనాలకు పొడవైన క్యూలలో వేచిచూసే బెడద తొలగిపోయి, వన్యప్రాణులను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్, టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపులను నిర్వహించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది. దేశంలో అన్ని 4-వీలర్‌లు & అంతకంటే ఎక్కువ వీల్స్ వాహనాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ని అతికించడం తప్పనిసరి చేయబడింది.

అంబేద్కర్ సర్క్యూట్‌ సందర్శన కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

ఇండియన్ రైల్వే అంబేద్కర్ సర్క్యూట్‌ సందర్శన కోసం ఏప్రిల్ 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది. ఈ రైలు ఏప్రిల్ 14న న్యూఢిల్లీ నుండి బయలుదేరి ఏప్రిల్ 15వ తేదీన ఇండోర్ మరియు నాగపూర్‌లో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జన్మస్థలానికి చేరుకుంది. భీమ్ జన్మభూమిలోని స్మారక మందిరంలో ప్రయాణికులు సమావేశమై బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం, పోరాటాలు తదితర అంశాలపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వం 2022లో అంబేద్కర్‌ జీవితంతో అనుబంధించబడిన ఐదు కీలక ప్రదేశాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను ప్రకటించింది. దీనిని అంబేద్కర్ పంచతీర్థం అనికూడా అంటారు. ఈ యాత్ర ద్వారా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ జీవిత చరిత్రతో ముడిపడిన 4 ప్రదేశాలను సందర్శించే భాగ్యంను ప్రయాణికులకు కల్పిస్తున్నారు.

8రోజుల నిడివితో సాగే ఈ యాత్రలో పర్యాటకులు దీక్షాభూమి, డ్రాగన్ ప్యాలెస్‌లను సందర్శించారు. దీక్షాభూమి అనేది అక్టోబర్ 1956లో డాక్టర్ అంబేద్కర్ తన లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించిన చారిత్రాత్మక ప్రదేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి అవశేషాలు దీక్షభూమి స్థూపం మధ్య గోపురంలో ఉంచబడ్డాయి. నాగ్‌పూర్‌లోని కాంప్టీ పట్టణంలోని డ్రాగన్ ప్యాలెస్ ధ్యానం చేసేందుకు సరిపోయే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహం ప్రధాన ఆకర్షణ.

అంబేద్కర్ పంచతీర్థంలో ప్రదేశాలు

  1. జన్మ భూమి- మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ జన్మస్థలం మోవ్‌.
  2. శిక్షా భూమి - యూకేలో చదువుకున్న ప్రదేశం.
  3. దీక్షా భూమి- నాగ్‌పూర్‌లోని అతను బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం.
  4. మహాపరినిర్వాన్ భూమి- ఢిల్లీలో ఆయన మరణించిన ప్రదేశం.
  5. చైత్య భూమి - ముంబైలో అతని దహన స్థలం.

ఖతార్ - బహ్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు పునఃప్రారంభం

ఖతార్ మరియు బహ్రెయిన్ రెండేళ్ల తర్వాత తమ దౌత్య సంబంధాలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియా, యుఎఇ, ఈజిప్ట్ మరియు బహ్రెయిన్ వంటి కొన్ని అరబ్ దేశాలు 5 జూన్ 2017 నుండి ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. ఖతార్ నమోదిత విమానాలు మరియు నౌకలను తమ గగనతలం, సముద్ర జలాలు, భూమిని ఉపయోగించకుండా నిషేధించాయి.

ఖతార్, సిరియాలోని అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-నుస్రా ఫ్రంట్‌తో సహా సిరియాలోని తిరుగుబాటు గ్రూపులకు నిధులు సమకూర్చుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుదనేది మిగతా అరబ్ దేశాల ప్రధాన ఆరోపణ. ఇదే ఖాతర్ సంక్షోభానికి దారి తీసింది. అయితే 5 జనవరి 2021 న సౌదీ అరేబియా మరియు ఖతార్ మధ్య జరిగిన అల్ ఉలా డిక్లరేషన్ తర్వాత ఈ అరబ్ నిషేధం ఎత్తివేయబడింది. బహ్రెయిన్ మినహా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఈజిప్ట్ దేశాలు తమ వాణిజ్య, వ్యాపార సంబంధాలను అదే సమయంలో పునరుద్ధరించాయి. రెండేళ్ల తర్వాత తాజాగా బహ్రెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది.

వచ్చే ఐదేళ్లలో క్రీడా సౌకర్యాల కోసం రూ.3,200 కోట్లు

ఖేలో ఇండియా క్యాంపెయిన్ కింద వచ్చే ఐదేళ్లలో దేశంలో క్రీడా సౌకర్యాల కోసం సుమారు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన అన్నారు. ఏప్రిల్ 14న హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో సాయ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సిఓఇ) ప్రారంభోత్సవం సంధర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఎంపీ ముఖ్యమంత్రి తీర్థ్ యోజన పరిధిలోకి అంబేద్కర్ పంచతీర్థం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం పరిధిలోకి 'అంబేద్కర్ పంచతీర్థం' సందర్శనను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఏప్రిల్ 14న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన జీవితంతో ముడిపడి ఉన్న పంచ తీర్థాలను ముఖ్య మంత్రి తీర్థం-దర్శన్ యోజనకు అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం 2022లో అంబేద్కర్‌ జీవితంతో అనుబంధించబడిన ఐదు కీలక ప్రదేశాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను ప్రకటించింది. ఇందులో ఆయన జన్మభూమి అయినా డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్), ఢిల్లీలోని మహాపరినిర్వాన్ భూమి, ముంబైలోని చైత్య-భూమి (దాదర్), నాగ్‌పూర్‌లో దీక్ష-భూమి అలానే లండన్‌లో ఉన్న శిక్షా భూమి ఉన్నాయి. ఇండియన్ రైల్వే కూడా అంబేద్కర్ సర్క్యూట్‌ సందర్శన కోసం ఏప్రిల్ 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది.

హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన బీఆర్ అంబేద్కర్ విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహాన్ని 146.50 కోట్లతో 360 టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు 114 టన్నుల కాంస్యం ఉపయోగించి నిర్మించారు.

హుస్సేన్ సాగర్ సరస్సుకు దగ్గరలో, రాష్ట్ర సచివాలయం పక్కన, బుద్ధ విగ్రహానికి ఎదురుగా మరియు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంకు దరిదాపులో స్థాపించిన ఈ విగ్రహం రాబోయే కాలంలో ప్రముఖ పర్యాటక స్టలంగా మారనుంది. ఇకపోతే బీఆర్ అంబేద్కర్ పేరున కొత్తగా అవార్డును ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అవార్డును ఏటా ఏప్రిల్ 14న, ఆయన జయంతి రోజున దళితులకు కోసం అత్యుత్తమ సేవలు అందించే వ్యక్తులకు అందివ్వనున్నారు.

శ్రీలంక రుణ పునర్నిర్మాణ పరిష్కారం కోసం ఉమ్మడి వేదిక

జపాన్, భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాలు, శ్రీలంక యొక్క రుణాల పునర్నిర్మాణాన్ని సమన్వయం చేయడానికి ద్వైపాక్షిక రుణదాతల మధ్య చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను ప్రకటించాయి. శ్రీలంక, పాకిస్తాన్ వంటి మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల రుణ కష్టాలను పరిష్కరించడానికి ఈ చొరవ ఒక నమూనాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఈ ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌ చైనాతో సహా శ్రీలంక యొక్క ద్వైపాక్షిక రుణదాతలందరికీ గ్రూప్ ఆహ్వానం పంపిందని, వీలైనంత త్వరగా మొదటి రౌండ్ చర్చలు జరిపి సంబంధిత పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నారు. 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంక, గత నెలలో తన భారీ రుణ భారాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి 2.9 బిలియన్ డాలర్ల రుణ సాయాన్ని పొందింది.

అయితే మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థ రుణ సమస్య పరిస్కారం కోసం జి20 యొక్క సాధారణ ఫ్రేమ్‌వర్క్ కింద ఉపశమనం పొందే అవకాశం ఉన్నా, దీని కోసం శ్రీలంక దరఖాస్తు చేసుకోలేదు. దీనితో ప్రస్తుతం జి20, జి7 అధ్యక్షతలో ఉన్న భారత్. జపాన్ దేశాలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాయి.

శ్రీలంక ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం, శ్రీలంక ద్వైపాక్షిక రుణదాతలకు మొత్తం 7.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో చైనాకు 3 బిలియన్ డాలర్లు, పారిస్ క్లబ్‌కు 2.4 బిలియన్ డాలర్లు మరియు భారతదేశానికి 1.6 బిలియన్ డాలర్లు బకాయిపడి ఉంది.

మొజాంబిక్‌లో బుజి వంతెనను ప్రారంభించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, మొజాంబిక్‌లోని132 కిమీ టికా-బుజి-నోవా-సోఫాలా రోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన బుజి వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనను భారతదేశం స్నేహాత్మక దృక్పథంతో నిర్మించింది. డాక్టర్ జైశంకర్ ఈ పర్యటనలో మొజాంబిక్‌ విదేశాంగ మంత్రి మగాలాతో కలిసి మాపుటో నుండి మచావా వరకు మేడ్ ఇన్ ఇండియా రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్ సీఎండీ రాహుల్ మిథాల్ వారితో కూడా పాల్గొన్నారు.

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం

కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో అమన్ సెహ్రావత్ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెహ్రావత్, కిర్గిజిస్తాన్‌కు చెందిన అల్మాజ్ స్మాన్‌బెకోవ్‌ను 9-4తో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అలానే సెహ్రావత్ గతేడాది స్పెయిన్‌లో జరిగిన అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా నిలిచాడు.

యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌తో భారత్ అవగాహన ఒప్పందం

ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం 10,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపడానికి మార్గం సుగమం చేస్తూ యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌తో భారతదేశం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ అధికారుల మధ్య ముంబైలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఆఫ్ఘన్ జనాభాలోని అత్యంత బలహీన వర్గాలకు గోధుమలను త్వరితగతిన అందజేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ కల్పిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధంతో భారత్ ఈ మానవతా సహాయం అందిస్తుంది.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలలుగా రబడ

దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ పేసర్ కగిసో రబడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రబడ, ఏప్రిల్ 13న బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించాడు. ఈ ఘనత గతంలో70 మ్యాచులతో లలిత్ మలింగ పేరట ఉండగా, రబడ తన 64వ మ్యాచులోనే ఈ రికార్డు నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా

  1. కగిసో రబడ - 64 మ్యాచుల్లో 100 వికెట్లు
  2. లసిత్ మలింగ - 70 మ్యాచుల్లో 100 వికెట్లు
  3. భువనేశ్వర్ కుమార్ - 81 మ్యాచుల్లో 100 వికెట్లు
  4. అమిత్ మిశ్రా - 83 మ్యాచుల్లో 100 వికెట్లు
  5. ఆశిష్ నెహ్రా - 83 మ్యాచుల్లో 100 వికెట్లు
  6. యుజ్వేంద్ర చాహల్ - 84 మ్యాచుల్లో 100 వికెట్లు

ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశంగా ఘనా

యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్తగా అభివృద్ధి చేయబడిన అత్యంత ప్రభావవంతమైన మలేరియా వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశంగా ఘనా అవతరించింది. దేశీయంగా మలేరియాతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉన్న 5 నెలల నుండి 36 నెలల వయస్సు గల పిల్లలకు ఈ టీకాను ఆమోదించింది. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రతి సంవత్సరం 600,000 కంటే ఎక్కువ మంది పిల్లల మరణానికి కారణమౌతుంది. ఇందులో అత్యధిక మరణాలు ఆఫ్రికా దేశాలలో నమోదు అవుతున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏటా 200 మిలియన్ డోస్‌ల వరకు ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌కు R21 అని పేరు పెట్టారు. చివరి ట్రయిల్స్ దశలో ఉన్న ఈ వాక్సిన్ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇంకా ట్రయల్స్ కూడా పూర్తిచేయండి ఒక టీకాను ధనిక దేశాల కంటే ముందుగా ఒక ఆఫ్రికన్ దేశం పెద్ద మొత్తంలో ఆమోదించబడటం ఇదే మొదటిసారి.

ఆఫ్రికా వంటి అత్యంత పేద దేశాలలో బాల్య వ్యాక్సిన్‌లు సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే గావి వాక్సిన్ అలయన్స్ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థల ద్వారా అందించబడతాయి. అయితే ఘానా ప్రస్తుతం ఆర్థికంగా మెరుగుపడటంతో తమ స్వంత నిధులలో కొనుగోలు చేసే దిశగా కదులుతోంది. ఇదే మార్గంలో నైజిరియా వంటి దేశాలు ఉన్నాయి.

గౌహతిలోని ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏప్రిల్ 14న గౌహతిలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ఈశాన్య ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో మే 2017లో శంకుస్థాపన చేశారు. ఇది ఈశాన్య రాష్ట్రాలలో నిర్మించబడ్డ మొదటి ఎయిమ్స్ ఆసుపత్రిగా అవతరించింది.

ఇదే వేదిక ద్వారా నల్బారి, నాగోన్ మరియు కోక్రాఝర్‌లలో మూడు వైద్య కళాశాలలను కూడా ప్రారంభించారు. అలానే 5 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ వైద్య చికిత్స ప్రయోజనాలను పొందగలిగే లబ్ధిదారులకు 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. వీటితో పాటుగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మరియు ఐఐటీ గౌహతి సంయుక్త చొరవతో నిర్మించబోతున్న అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ (AAHII) కి శంకుస్థాపన చేశారు.

ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియాతో హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ ఒప్పందం

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయినా హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు, 300 మిలియన్ డాలర్ల క్రెడిట్ కోసం ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియాతో మాస్టర్ ఇంటర్‌బ్యాంక్ క్రెడిట్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ క్రెడిట్ ఒప్పందం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విదేశీ కరెన్సీ నిధులను సమీకరించుకోనుంది.

ఈ క్రెడిట్ లైన్‌ను కొరియన్ కంపెనీలు ఈక్విటీ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న కంపెనీలకు అలాగే కొరియన్ కంపెనీలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న కంపెనీలకు నిధుల అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు తెలిపింది. అలానే కొరియా సంబంధిత కంపెనీల కార్ల కొనుగోలు చేసే వినియోగదారుల యొక్క నిధుల అవసరాలను తీర్చేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.

ఇండియా నుండి దిగుమతి చేసుకునే చిత్రాలకు బంగ్లాదేశ్ మార్గదర్శకాలు

బంగ్లాదేశ్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిమిత స్థాయిలో భారత ఉపఖండంలో నిర్మించిన చిత్రాలను దిగుమతి చేసుకోవడానికి 5-పాయింట్ల మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా సినిమా హాళ్లలో ప్రదర్శించే ముందు బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ పొందాలి నిర్దేశించింది. అలానే దిగుమతి చేసుకున్న చిత్రాలను ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అజా మరియు దుర్గాపూజల సమయంలో ప్రదర్శన ఆంక్షలు విధించింది. అలానే భారత ఉపఖండంలోని వివిధ భాషల్లో నిర్మించబడే చిత్రాలను చట్టబద్ధమైన చిత్ర నిర్మాతలు మరియు పంపిణీదారులకు మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు కల్పించింది.

ఎల్‌ఐసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా రత్నాకర్ పట్నాయక్‌

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కొత్త చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా రత్నాకర్ పట్నాయక్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. పట్నాయక్ సెప్టెంబరు 1990లో ఎల్‌ఐసీలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేరారు. గత ముప్పై రెండు సంవత్సరాలలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా ఇండోర్ మరియు జంషెడ్‌పూర్ డివిజన్‌లకు నాయకత్వం వహించాడు. 2021లో సెంట్రల్ ఆఫీస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ - ఫ్రంట్ ఆఫీసరుగా ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం చీఫ్ రిస్క్ ఆఫీసర్‌ హోదాలో ఉన్నారు.

ముంబైలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ముంబై తాజ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ యొక్క నాల్గవ మరియు చివరి ఈవెంట్‌ను నిర్వహించింది. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం జ్ఞాపకార్థం, ఈ చివరి వేడుకను 7రోజుల నిడివితో ఘనంగా నిర్వహించారు. భారత్ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన కారణంగా ప్రభుత్వం ఈ ప్రచార ఈవెంటులను దేశవ్యాప్తంగా నిర్వహించింది.

ఈ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్‌ను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ప్రారంభించారు. ఏప్రిల్ 19 వరకు హోటల్‌లోని షామియానా రెస్టారెంట్‌లో లంచ్ మరియు డిన్నర్ కోసం కజకిస్తాన్, కిర్గిజేస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా మరియు భారతదేశానికి చెందిన చెఫ్‌లు తయారుచేసిన విభిన్న మిల్లెట్‌ల వంటకాలను సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు.

ప్రధాని మోడీ ప్రభుత్వ విజయాలపై దూరదర్శన్ ప్రచార డాక్యుమెంటరీ

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలకు సంబంధించి 'ధరోహర్ భారత్ కీ - పునృతాన్ కి కహానీ' అనే డాక్యుమెంటరీని, ఏప్రిల్ 14. 15 తేదీల్లో రెండు భాగాలుగా భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్ దూరదర్శన్ ప్రచారం చేసింది. ప్రధాని దార్శనికతలో గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం సాధించిన సాంస్కృతిక ఐక్యత, గొప్పతనం మరియు పునరుజ్జీవనం సంబంధించిన పురోగతిని ఇది ప్రదర్శించింది. ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ డిజిటల్ మీడియా ప్రెజెంటర్ కమియా జానీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

జలియన్ వాలా బాగ్, కర్తార్‌పూర్ సాహిబ్, రామజన్మభూమి, కాశీ విశ్వనాథ్ ధామ్, సోమనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్, సెల్యులార్ జైలు, ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం, వార్ మెమోరియల్, సబర్మతీ ఆశ్రమం, పంచతీర్థం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ మరియు ఇతర స్మారక చిహ్నాలు వంటి చారిత్రాత్మక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రవిత్రత, భద్రత, సుందరీకరణ మరియు నిర్మాణం వెనుక ఉన్న ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, కారణాన్ని ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది.

ఈ డాక్యుమెంటరీ ప్రధాని మోడీ, భారత సైనికుల యొక్క త్యాగాన్ని, గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాటలతో ప్రారంభమవుతుంది. అలానే ప్రాచీన, ఉదాత్తమైన మరియు అసమానమైన భారత వారసత్వంను భావితరాలకు అందించేందుకు, ప్రతి భారతీయుని యొక్క ఆసక్తి, భాగస్వామ్యం ఉండాలని కోరుతుంది. ఈ చొరవ ప్రతి భారతీయ హృదయానికి ఆనందం మరియు గర్వాన్ని తెస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది.

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ - కృషి విజ్ఞాన కేంద్రలతో అనుసంధానం

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ATL)ని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) మరియు అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ATMA)తో అనుసంధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), నీతి ఆయోగ్ మరియు వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపాయి. ఈ చొరవ భారతదేశం అంతటా పాఠశాల విద్యార్థులలో వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉపయోగపడనుంది.

కృషి విజ్ఞాన కేంద్రలు అనేవి సింగిల్ విండో అగ్రికల్చరల్ నాలెడ్జ్ రిసోర్స్ మరియు కెపాసిటీ డెవలప్‌మెంట్ సెంటర్లుగా పనిచేస్తాయి. ఇవి రైతులకు, పాఠశాల డ్రాపౌట్‌లకు మరియు క్షేత్ర స్థాయి వ్యవసాయ కార్యకర్తలకు వ్యవసాయ వృత్తి శిక్షణను మరియు ఇన్‌పుట్‌లను అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు) ఉన్నాయి. వీటిని 973లో ఐసిఏఆర్ అధ్యక్షుడు మోహన్ సింగ్ మెహతా ప్రతిపాదించారు.1974లో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా నియంత్రణలో మనుగడలోకి వచ్చాయి.

అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశంలో ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి 2016లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. దీనిని విశ్వవిద్యాలయాలు, సంస్థలు మరియు కార్పొరేట్‌ సంస్థలలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా అమలు చేస్తుంది.

అటల్ టింకరింగ్ లాబొరేటరీలను భారతదేశంలో ఒక మిలియన్ పాఠశాల విద్యార్థులను నియోటెరిక్ ఇన్నోవేటర్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పాఠశాల విద్యార్థులలో వ్యవసాయ రంగపు ఆవిష్కరణలకు ప్రోత్సహం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 10వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి, 75 లక్షల విద్యార్థులు వీటి యందు నిమగ్నమై ఉన్నారు. వీరు 12 లక్షల ఇన్నోవేషన్ ప్రాజెక్టులు సృష్టించారు.

అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ATMA) అనేది కేంద్ర ప్రాయోజిత వ్యవసాయ పథకం. ఇది రైతులకు ఫలవంతమైన ఫలితాలు మరియు మెరుగైన ప్రతి యూనిట్ ఆదాయాన్ని పొందడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇవి రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్డ్ సొసైటీగా వ్యవహరిస్థాయి. రైతులు, రైతు సంఘాలు, పంచాయత్ రాజ్ సంస్థలు, ఎన్జీఓలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు జిల్లా, గ్రామ స్థాయిలలోని ఇతర వాటాదారులను భాగస్వామ్యం చేస్తాయి.

ఉత్తరాఖండ్‌లో A - హెల్ప్ పేరుతొ జంతు సంరక్షణ కార్యక్రమం ప్రారంభం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం A - హెల్ప్ పేరుతొ జంతు సంరక్షణ కార్యక్రమంను ప్రారంభించింది. A-HELP అనగా ఆక్రెడిటేడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్సటెన్షన్ ఆఫ్ లైవ్‌స్టాక్ పప్రొడక్షన్ అని అర్ధం. ఈ కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంబంధిత ఆరోగ్యం, ఉత్త్పత్తి కార్యకలాపాలను బలోపేతం చేస్తారు.

ఏ - హెల్ప్ కార్యక్రమం కింద శిక్షణ పొందిన కార్యకర్తలు, జంతువులకు సంబంధించిన వివిధ అంటు వ్యాధులను నివారించడంలో పాటుగా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ (RGM) కింద కృత్రిమ గర్భధారణ పద్దతులను అమలు చేయడం, జంతువులను ట్యాగింగ్ చేయడం మరియు వాటికీ బీమా కల్పించడం వంటి సేవలు అందిస్తారు.

447 బిలియన్ డాలర్లకు చేరుకున్న భారతదేశ ఎగుమతులు

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అదే సమయంలో ఎగుమతులు 6 % పెరిగి 447 బిలియన్ డాలర్ల గరిష్ట మార్కును నమోదు చేశాయి. గత ఆర్థిక ఏడాదిలో భారత దిగుమతులు 613 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా, ఎగుమతులు 442 బిలియన్ డాలర్లుగా నమోదు కబడ్డాయి.

పెట్రోలియం, ఫార్మా, కెమికల్స్ మరియు మెరైన్ వంటి రంగాల అవుట్‌బౌండ్ ఎగుమతులలో ఆరోగ్యకరమైన వృద్ధి కారణంగా 2022-23లో దేశ ఎగుమతులు దాదాపు 6 శాతం పెరిగినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అదే సమయంలో భారతదేశం యొక్క సేవల ఎగుమతులు కూడా 2021-22లో 254 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2022-23లో 323 బిలియన్ డాలర్లతో 27.16 శాతం పెరుగుదల నమోదు కాబడినట్లు తెలిపారు.

భారతదేశంలోకి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో క్రూడ్ పెట్రోలియం ఉండగా, అత్యధికంగా ఎగుమతి చేస్తున్న వస్తువుల జాబితాలో రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. భారతదేశం యొక్క దిగుమతులలో అత్యధిక వాటా చైనా, యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా దేశాల నుండి ఉంది. అలానే ప్రపంచంలో అత్యధికంగా వస్తువులను దిగుమతి చేసుకునే దేశల జాబితాలో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో చైనా మరియు జర్మనీలు ఉన్నాయి. ప్రపంచ అతిపెద్ద ఎగుమతిదారుల జాబితాలో యూరోపియన్ యూనియన్‌ను పక్కన పెడితే, చైనా అగ్రస్థానంలో ఉంది.

రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ఎస్‌బిఐతో ఫసల్ ఒప్పందం

రైతులకు సులభంగా మూలధనాన్ని అందించే లక్ష్యంతో ప్రముఖ అగ్రి-టెక్ కంపెనీ ఫసల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం, రైతులకు త్వరితగతిన, సులభమైన మరియు అనుషంగిక రహిత రుణాలను తక్కువ వడ్డీ రేట్లతో అందించడం ద్వారా కీలక వ్యవసాయ సాగు సమయంలో నగదు ప్రవాహ పరిమితులను పరిష్కరించనుంది. ఈ ఫైనాన్సింగ్ సొల్యూషన్ ద్వారా, రైతులు మూడు లక్షల వరకు పూచీకత్తు రహిత రుణాలను పొందవచ్చు. రైతులకు సమర్థవంతంగా నిధులు సమకూర్చడమే దీని ప్రధాన లక్ష్యం.

2023 బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11% నుండి ?20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫసల్ యొక్క తాజా ఫైనాన్సింగ్ సొల్యూషన్ ప్రారంభం దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుగా పరిగణించవచ్చు. ఈ రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద పంపిణీ చేయబడతాయి.

2010లో వ్యవసాయ మార్గదర్శకుడు ఆనంద వర్మ స్థాపించిన ఈ ఏఐ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ ఫసల్, వ్యవసాయ సాగు ఖర్చులను ఆప్టిమైజ్ చేస్తూ, దిగుబడి నాణ్యతను పెంచడానికి పంట నిర్దిష్ట మరియు పంట దశ నిర్దిష్ట కార్యాచరణ మేధస్సును అందిస్తుంది. ఫసల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలోని బెంగళూరులో ఉంది.

ఇకపోతే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ప్రభుత్వ ప్రాయోజిత పంటల బీమా పథకం. ఇది పంట వైఫల్యానికి వ్యతిరేకంగా సమగ్ర బీమా రక్షణను అందజేస్తుంది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 18, ఫిబ్రవరి 2016 న ప్రారంభించారు. నోటిఫైడ్ ఏరియాలో నోటిఫైడ్ పంటలు సాగుచేస్తున్న రైతులందరూ ఈ బీమా చేయించుకోవడానికి అర్హులు. ఈ ఎన్‌రోల్‌మెంట్ 100% స్వచ్ఛందంగా చేయబడుతుంది.

నమామి గంగే, 49 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా 49 విశ్వవిద్యాలయాలతో నీటి సంరక్షణ మరియు నదుల పునరుజ్జీవనం పట్ల యువతను ప్రేరేపించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏప్రిల్ 12న నమామి గంగే : యూనివర్శిటీలు కనెక్ట్ అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ ఒప్పంద ప్రతిపాదనపై సంతకం చేశారు. దేశీయ నదులలో స్థిరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కోసం జరుగుతున్నా సామూహిక ఉద్యమంలో విద్యార్థి సంఘాన్ని భాగస్వామ్యం చేయడమే ఈ ఎమ్ఒయు లక్ష్యం.

నమామి గంగే : యూనివర్శిటీలు కనెక్ట్ కార్యక్రమం చొరవ ద్వారా, అనేక ఉన్నత విద్యా సంస్థలు నదుల పునరుజ్జీవనం మరియు నీటి సంరక్షణ కోసం తమ మద్దతును ప్రతిజ్ఞ చేశాయి. ఈ కార్యక్రమాన్ని 'ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్, రిజువనేటింగ్ రివర్స్' అనే థీమ్‌తో నిర్వహించారు. నమామి గంగే, విద్యాసంస్థల మధ్య సహకారం నేపథ్యంలో జన్ భగీదారి మాదిరిగానే నేడు ‘జ్ఞాన్ భగీదారి’ దిశగా ముందుకు సాగుతున్నామని గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. నమామి గంగే కార్యక్రమం ప్రపంచ పునరుద్ధరణ యొక్క మొదటి పది ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా ఐక్యరాజ్యసమితిచే గుర్తించబడింది.

యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ కార్యక్రమం ప్రారంభం

కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రి పర్షోత్తం రూపాలా ఏప్రిల్ 14న రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో యానిమల్ జూనోటిక్ వ్యాధులు మరియు జంతు అంటువ్యాధుల పట్ల భారతదేశం యొక్క సంసిద్ధతను మరియు ప్రతిస్పందనను మెరుగుపరచడానికి యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ (APPI) అనే ప్రత్యేక ఒక కార్యక్రమం ప్రారంభించారు.

అలానే ప్రపంచ బ్యాంకు నిధులతో పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ విభాగంలో మెరుగైన జంతు ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ కోసం యానిమల్ హెల్త్ సిస్టం సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ (AHSSOH) అనే మరో కార్యక్రమం కూడా ఆరంభించారు. ఈ రెండు ప్రాజెకట్లను ఐదు భాగస్వామ్య రాష్ట్రాల్లోని 151 జిల్లాల పరిధిలో అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా 75 జిల్లాలలో ప్రాంతీయ ప్రయోగశాలల అప్‌గ్రేడేషన్, మూడు వందల వెటర్నరీ హాస్పిటల్స్ మరియు డిస్పెన్సరీలను అప్‌గ్రేడేషన్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో తొమ్మిది వేల మంది పారా-వెటర్నరీ వైద్యులు మరియు రోగనిర్ధారణ నిపుణులు మరియు 5,500 మంది పశువైద్య నిపుణులకు శిక్షణ కూడా అందివ్వనున్నారు.

ఎఐ ఆధారిత పెట్టుబడుల్లో భారతదేశంకు 5వ స్థానం

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ వార్షిక ఏఐ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తున్న స్టార్టప్‌ల ద్వారా వచ్చిన పెట్టుబడుల పరంగా భారతదేశం గత సంవత్సరం ఐదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారతదేశంలోని ఎఐ స్టార్టప్‌లకు దాదాపు 3.24 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల కంటే భారత్ ముంది వరుసలలో ఉంది. ఈ జాబితాలో అమెరికా, చైనా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ దేశాలు భారత్‌ కంటే ముందున ఉన్నాయి.

అత్యంత నేరపూరిత దేశాలలో ఇండియాకు 77వ ర్యాంక్

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోని "అత్యంత నేరపూరిత దేశాల" ర్యాంకింగులో భారతదేశం 77వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో వెనిజులా అగ్రస్థానంలో ఉండగా, పపువా న్యూ గినియా (2), ఆఫ్ఘనిస్థాన్ (3), దక్షిణాఫ్రికా (4), హోండురాస్ (5), ట్రినిడాడ్ (6), గయానా (7), సిరియా (8) సోమాలియా (9) మరియు జమైకాలు (10) వరుసగా టాప్ 10లో ఉన్నాయి.

ఈ నేరాల ర్యాంకింగ్‌లో భారత్‌ కంటే అమెరికా (55), బ్రిటన్‌లు (65) ముందంజలో ఉండగా, 135 ర్యాంక్‌లలో ఉన్న జపాన్, అతి తక్కువ నేరపూరిత దేశంగా నిలిచింది. అధిక నిరుద్యోగిత రేటు ఉన్న దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ర్యాంకులను దేశంలో నివేదించబడిన మొత్తం నేరాల సంఖ్యను ఆ దేశ మొత్తం జనాభాతో భాగించి, తర్వాత 100,000తో గుణించడం ద్వారా వచ్చిన స్కోరు ఆధారంగా అందిస్తారు. ఈ స్కోరు మొత్తం నేరాల రేటును తెలియజేస్తుంది. నేరాల రేటు సాధారణంగా ప్రతి 100,000 మందికి లెక్కించబడుతుంది.

అసోచామ్ నూతన అధ్యక్షుడిగా అజయ్ సింగ్

స్పైస్‌జెట్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) యొక్క నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే అసోచామ్ అధ్యక్షుడుగా పదవీకాలాన్ని పూర్తి చేసిన సుమంత్ సిన్హా స్థానంలో ఈ నూతన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది న్యూ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వేతర వాణిజ్య మరియు న్యాయవాద సమూహం. ఈ సంస్థ భారతదేశంలో వ్యాపార మరియు వాణిజ్య సమస్యలు మరియు కార్యక్రమాల మధ్య ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది. దేశీయ వ్యాపార సంస్థలకు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ అసోసియేషన్ ప్రత్యేక పాత్ర వహిస్తుంది. దీనిని 1920లో డాక్టర్ నిరంజన్ హిరానందని స్థాపించారు.


స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌వీర్ సింగ్‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌, స్టార్ స్పోర్ట్స్ ఇండియా నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేశారు. ప్రస్తుతం ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటుగా ఇతర స్టార్ స్పోర్ట్స్ క్రీడా ఈవెంట్‌ల ప్రచారాలలో కూడా పాల్గొంటాడు. ఈ జాబితాలో త్వరలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ, ఆసియా కప్ మరియు ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి.


ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మార్చి 29న నిర్వహించిన ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సులో వర్చువల్‌గా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ నేడు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం అనేది పౌరుల నమ్మకంపై ఆధారపడి ఉంటుందని, వారి అవసరాలు మరియు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు. భారతదేశంలో పాలకులు వారసత్వంగా లేరని, భారతదేశం నిజానికి ప్రజాస్వామ్యానికి తల్లి అని మోదీ అభివర్ణించారు.

29 మరియు 30 తేదీలలో యునైటెడ్ స్టేట్స్ నిర్వహించే ఈ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2023కి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆతిథ్యం ఇస్తున్నారు. సహ-హోస్ట్‌లుగా నెదర్లాండ్స్, కోస్టా రికా, జాంబియా దేశాలు వ్యవహరిస్తున్నాయి. గ్రీస్, ఇజ్రాయెల్, ఇటలీ, కెన్యా, క్రొయేషియా మరియు తైమూర్-లెస్టే అనే ఆరు దేశాల అధ్యక్షులు మరియు ప్రధానమంత్రులు కూడా శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు.

సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అనేది "స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మరియు విదేశాలలో నిరంకుశ పాలనలను ఎదుర్కోవడానికి" యునైటెడ్ స్టేట్స్ నిర్వహించే వర్చువల్ సమ్మిట్. దీనికి సంబంధించి మొదటి శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 9-10, 2021లో జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నది రెండవది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రక్షించడం, అవినీతిని పరిష్కరించడం, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.


ఐడబ్ల్యుఎఫ్ వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్‌కి కాంస్యం

అల్బేనియాలోని డ్యూరెస్‌లో జరిగిన ఐడబ్ల్యుఎఫ్ వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ భరాలీ బెడబ్రేట్, పురుషుల 67 కిలోల కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్ల భరాలీ బెడబ్రేట్, మొత్తం 267kg (119kg+148kg) బరువును ఎత్తి మూడవ స్థానంలో నిలిచాడు. 13-17 సంవత్సరాల మధ్య వయస్సు గల లిఫ్టర్లు వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హులు.

అర్మేనియాకు చెందిన సెరియోజా బర్సెఘ్యాన్ 275 కేజీలు (128 కేజీ+147 కేజీలు) మరియు సౌదీ అరేబియాకు చెందిన మహ్మద్ అల్ మార్జౌక్ 270 కేజీలు (119 కేజీలు+148 కేజీలు) వరుసగా బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. కాంటినెంటల్ మరియు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో స్నాచ్, క్లీన్ & జెర్క్ మరియు టోటల్ లిఫ్ట్‌లకు విడివిడిగా పతకాలు ఇవ్వబడతాయి, అయితే ఒలింపిక్ క్రీడలలో మొత్తం లిఫ్ట్‌కు కేవలం ఒక పతకం మాత్రమే ఇవ్వబడుతుంది.


చండీగఢ్‌లో జీ20 రెండో వ్యవసాయ ప్రతినిధుల సమావేశం

భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) రెండవ అగ్రికల్చరల్ డిప్యూటీస్ మీటింగ్ 2023ను మార్చి 29 నుండి 31 మధ్య చండీగఢ్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి 19 సభ్య దేశాలు, 10 ఆహ్వానించబడిన దేశాలు మరియు 10 అంతర్జాతీయ సంస్థల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మొదటి అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ ఇండోర్‌లో, 15 ఫిబ్రవరి 2023న జరపబడింది.

ఈ కార్యక్రమంలో నాలుగు వ్యవసాయ నేపథ్య రంగాలపై దృష్టి సారించారు. అందులో మొదటిది ఆహార భద్రత మరియు పోషకాహారం, రెండోవది వాతావరణ స్మార్ట్ విధానంతో స్థిరమైన వ్యవసాయం, మూడవది సమగ్ర వ్యవసాయ విలువ గొలుసులు, ఇక చివరిగా ఆహార, వ్యవసాయ రంగాల్లో డిజిటలైజేషన్ అంశాలు ఉన్నాయి.


ముంబైలో మొదటి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, మొదటి ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్‌ మీటింగ్‌ను మార్చి 29న ముంబైలో ప్రారంభించారు. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ప్రాంతీయ సమూహాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

మొదటి సెషన్‌లో, 'ట్రేడ్ ఫర్ గ్రోత్ అండ్ ప్రోస్పెరిటీ' అంశంపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (IEG), ఢిల్లీ, వరల్డ్ బ్యాంక్ (WB), మరియు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (UNESCAP) ప్రెజెంటేషన్‌ అందించాయి. రెండవ సెషన్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ & యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ద్వారా 'ట్రేడ్ అండ్ రెసిలెంట్ గ్లోబల్ వాల్యూ చెయిన్స్' అనే అంశంపై ప్రదర్శన ఇచ్చారు.


ఎలిఫెంటా కేవ్స్ వరకు ఈత కొట్టిన మొదటి వ్యక్తిగా కృష్ణ ప్రకాష్

'డ్రౌనింగ్ ప్రివెన్షన్ అవేర్‌నెస్' ప్రచారంలో భాగంగా, ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి కృష్ణ ప్రకాష్, గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి ముంబైలోని ఎలిఫెంటా గుహలకు ఈదుకుంటూ వెళ్లిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 16.20 కిలోమీటర్ల ఈ యాత్రను కేవలం 5 గంటల 26 నిమిషాల్లో పూర్తి చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. డ్రౌనింగ్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ అనేది 1-24 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యువకులు నీటిలో మునిగిపోకుండా అవగహన కల్పించే కార్యక్రమం. దీనిని ఏటా జూలై 25న నిర్వహిస్తారు. 2021లో యూఎన్ జనరల్ అసెంబ్లీ దీనిని ప్రారంభించింది.

2017లో ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసిన తర్వాత ఈయన ఐరన్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందాడు. ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌లో భాగంగా 15 గంటల వ్యవధిలో 3.8 కిలోమీటర్ల ఈత, 180.2 కిలోమీటర్ల సైకిల్ రైడ్ మరియు 42.2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ ఘనత సాధించిన మొదటి సివిల్ సర్వెంట్ ఆఫీసరుగా గుర్తింపు పొందాడు.


నవీన్ జిందాల్‌కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, భారతీయ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించింది. ఈ అవార్డును 25 మార్చి 2023న విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక వేడుకలో అందుకున్నారు. వ్యాపార, రాజకీయ, విద్యారంగంలో ఆయన సేవలకు గాను ఈ గౌరవాన్ని అందించారు. 1992లో ఇదే యూనివర్సిటీ నుంచి నవీన్ జిందాల్‌ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఈ అవార్డు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పూర్వ విద్యార్ధులకు అందించే అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది.


గ్రామీణ నిరుద్యోగుల కోసం 'క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్' పథకం

దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన కింద 'క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్' అనే నూతన కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, మార్చి 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం కింద 31,000 మందికి పైగా గ్రామీణ యువతకు వివిధ అంశాల యందు నైపుణ్య శిక్షణ అందివ్వనున్నారు. శిక్షణ పొందిన యువతకు వారి కంపెనీ లేదా అనుబంధ సంస్థలో ఉపాధి కల్పిస్తారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించడం కోసం, ప్రభుత్వం 19 మంది పరిశ్రమ, శిక్షణ సంస్థల యజమానులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎంపిక చేయబడిన క్యాప్టివ్ ఎంప్లాయర్‌లు గ్రామీణ పేద యువతకు వారి సంబంధిత పరిశ్రమలతో పాటుగా ఆతిథ్యం, ​​దుస్తులు & వస్త్రాలు, తయారీ, ఐటీ, టెలికాం, రిటైల్, పవర్ మొదలైన వాటిలో శిక్షణను అందిస్తారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనేది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్లేస్‌మెంట్ లింక్డ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం గ్రామీణ పేద యువతకు ఉపాధి కల్పిస్తుంది. ఇది 25 సెప్టెంబర్ 2014న ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం ప్రస్తుతం 27 రాష్ట్రాలు, 4 యుటిలలో 877 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలతో, 2,369 శిక్షణా కేంద్రాల ద్వారా అమలు చేయబడుతుంది.


ఢిల్లీలో మొదటి అంతర్జాతీయ క్వాంటం కమ్యూనికేషన్ కాన్‌క్లేవ్

మార్చి 27-28 తేదీలలో న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటం కమ్యూనికేషన్ కాన్‌క్లేవ్'ను నిర్వహించారు. రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్‌లు ఈ కాన్‌క్లేవ్ ప్రారంభించారు. ఈ సమావేశంలో క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీలలో తాజా పురోగతుల గురించి చర్చలు జరిపారు.

ఈ కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ ఇండియా మరియు సిడాట్ కలిసి నిర్వహించాయి. ఇదే వేదిక ద్వారా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డులను కూడా అందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అందించే ఈ అవార్డులను టెలికాం రంగంలో అత్యుత్తమ సేవలు అందించే సంస్థలకు అందజేస్తారు.

టాప్ 50 కాలుష్య నగరాల్లో 39 మనవే

→మనదేశంలో కాలుష్యం కొంత తగ్గినా... సిటీల్లో మాత్రం రోజురోజుకూ పెరిగిపోవడం. ఆందోళన కలిగిస్తోంది. 2022లో పొల్యూషన్ విషయంలో ఇండియా ప్రపంచంలోనే 8వ స్థానంలో నిలిచింది.
→గతేడాదితో పోలిస్తే మూడు . స్థానాలు మెరుగైంది. ప్రస్తుతం పీఎం 2.5 లెవల్ ప్రతి క్యూబిక్ బీటర్కు 53.3 మైక్రోగ్రాములకు తగ్గింది.
→అయినా కూడా ఇప్పటికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్) సూచించిన సేఫ్టీ లెవల్ కంటే మనదేశంలో కాలుష్యం పది రెట్లు ఎక్కువగా ఉంది.
→ఇదే సమయంలో ప్రపంచం లోని టాప్ 100 పొల్యూటెడ్ సిటీల్లో 6.5 మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
→అం తకుముందు ఏడాది టాప్ 100లో 61 సిటీలు మాత్రమే ఉన్నాయి. 2022లో టాప్ 50లో 39. టాప్ 20లో 14, టాప్ 10లో 6 సిటీలు ఉన్నాయి.. కొత్త క్లాసిఫికేషన్ ప్రకారం టాప్ 10 లో ఢిల్లీ, న్యూ ఢిల్లీ రెండూ ఉన్నాయి.

131 దేశాల్లో డేటా సేకరణ :-
→స్విస్కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ మంగళ వారం 2022కు సంబంధించిన "వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్'ను విడుదల చేసింది.
→పొల్యూ షన్ కు కీలకంగా భావించే పీఎం 2.5 లెవల్ ఆధారంగా ఈ రిపోర్ట్లు రెడీ చేశారు.
→మొత్తం 131 దేశాల్లోని 30 వేలకు పైగా గవర్నమెంట్.. నాన్ గవర్నమెంట్ మానిటర్ల నుంచి డేటాను సే కరించారు.
→2017లో 2,200 సిటీలు మాత్రమే ఉండగా ఇప్పుడు 7,300 సిటీలను పరిగణనలో కి తీసుకున్నారు.
→పీఎం 2.5 శాతం కారణంగా ఏటా ఇండియాకు లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
→ఇందులో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ వల్ల జరు గుతున్న నష్టమే 20 నుంచి 35 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది.
→ఇండస్ట్రియల్ యూనిట్లు, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు, బయోమాస్ బర్నింగ్ కారణంగా ఎక్కువ నష్టం జరుగుతోందని పేర్కొంది.

ఢిల్లీ.. కాలుష్య రాజధాని కాదు:-
→ఇకపై ప్రపంచంలో కాలుష్య రాజధాని ఢిల్లీ కాదు. ఆ స్థానాన్ని ఇప్పుడు చార్ రాజధాని ఎన్జమెనా ఆక్రమించింది.
→ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. పాపులేషన్ పరంగా చూస్తే నా జనాభా పది లక్షలు కాగా.. ఢిల్లీ జనాభా నలభై లక్షలకు పైగానే ఉంటుంది.
→ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్లో లో పాపులేషన్ లెవల్స్ అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి.
→వీటిలో కాలుష్యం కొంత తగ్గినా ఇండియా సగటుతో పోలిస్తే ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉంది.
→ఆగ్రాలో మాత్రం పొల్యూషన్ లెవెల్స్ భారీగా తగ్గాయి. మొత్తంగా చూస్తే 31 సిటీల్లో. రెండంకెల స్థాయిలో పొల్యూషన్ లెవల్ తగ్గింది.
→ఇందులో ఉత్తరప్రదేశ్లోని 10, హర్యానాలోని 7 సిటీలు ఉన్నాయి. ఆగ్రాలో పొల్యూషన్ 55 శాతం తగ్గింది.
→2017-21 మధ్య పీఎం 2.50 85 మైక్రోగ్రాములుగా ఉంటే 2022లో అది 38 మైక్రోగ్రాములకు తగ్గింది. మరోవైపు 38 సిటీలు, టౌన్లలో గత సంవత్సరాలతో పోలిస్తే పొల్యూషన్ పెరిగిందని ఈ రిపోర్ట్ వెల్లడించిం ది.
→మెట్రో సిటీల విషయానికి వస్తే ఢిల్లీ తర్వాత అత్యంత కాలుష్యనగరంగా కోల్కతా నిలిచింది. అయితే ఈ రెండు నగరాలకు మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంది.
→ చెన్నై కొంత వరకు క్లీన్ సిటీగా కనిపిస్తోంది. అయినా అక్కడ సేఫ్టీ లెవల్ కంటే పొల్యూషన్ ఐదు రెట్లు ఎక్కువగా సగటు కంటే కాలుష్యం స్థాయి పెరిగిన మెట్రో సిటీలు హైదరాబాద్, బెంగళూరు మాత్రమే.
→ ఈ లిస్ట్లో హైదరాబాద్ 199వ ప్లేస్లో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం లాహోర్ :-
→పాకిస్తాన్లోని లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. రెండో ప్లేస్ లో చైనాలోని హోటన్ ఉంది.
→మూడో ప్లేస్ లో రాజస్థాన్లోని భివాడి.. నాలుగో ప్లేస్ లో ఢిల్లీ ఉన్నాయి. 9వ స్థానంలో న్యూఢిల్లీ ఉన్నాయి.
→ఢిల్లీలో ఇప్పటికీ సీఎం 2.5 లెవల్ 92.6 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది డబ్ల్యూహెచ్ వో సేఫ్ లిమిట్ కంటే 20 రెట్లు ఎక్కువ.
→అత్యంత కాలుష్య దేశాల జాబితాలో చాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండోప్లేస్ ఇరాక్, మూడో ప్లేస్ లో పాకిస్తాన్ ఉన్నాయి.

తెలంగాణలో 7,502 మెగావాట 3 పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం

→ తెలంగాణలో ప్రస్తుతం 7,502 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలి పారు.
→ రాజ్యసభలో భాజపా సభ్యుడు కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
→ 'చిన్న తరహా జలవిద్యుత్తు కేంద్రాల్లో 90.87 మెగా వాట్లు, పవన విద్యుత్తు ద్వారా 128.10, జీవ ఇంధనం ద్వారా 220.37, సౌర విద్యుత్తు కింద 4,657.18, భారీ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా 2,405.60 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వీలుంది.
→ ఇవికా కుండా అన్ని నగరాల్లో మున్సిపల్ ఘన వ్యర్థాల ద్వారా 38.4 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
→ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-2 కింద 71.42 మెగావాట్ల సామర్థ్యమున్న యూనిట్లు మంజూరు చేశాం ' అని మంత్రి వెల్లడించారు.

పైగా ప్యాలెస్కు అమెరికా కాన్సులేట్ వీడ్కోలు

→హైదరాబాద్ లోని చారి త్రక పైగా ప్యాలెస్ నుంచి 14 ఏళ్లుగా సేవలు అందిం చిన అమెరికా కాన్సులేట్.. బుధవారం ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేస్తోంది.
→నానక్ రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రి క్ట్ లో నిర్మించిన సొంత భవనానికి మారుతోంది.
→ఆ ప్రాంగణంలో ఈ నెల 23 నుంచి వీసా సేవలను ప్రారంభించనున్నట్లు కాన్సులేట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
→తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పాటు ఒడిశా ప్రజలకు వీసా సేవలతోపాటు ఆయా ప్రాంతా లోని అమెరికా సంస్థలకు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించనుంది.
2008లో ప్రారంభం:-
→2006 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. నగ రంలో అమెరికా కాన్సులేట్ ప్రారంభిస్తామని ప్రకటిం చారు.
→ఆ మేరకు 2007 జులైలో కాన్సులేట్ ఏర్పాటుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అమెరికా ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. కాన్సులేట్ ఏర్పాటు కోసం నగరంలో పలు భవనాలను పరిశీలించిన అమెరికా అది కారులు.. పైగా ప్యాలెస్ను ఎంపిక చేసుకున్నారు.
→ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన కేటాయిం చడంతో 2008 అక్టోబరులో కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
యూరోపియన్ శైలిలో ప్యాలెస్ నిర్మాణం:- →హైదరాబాద్ సంస్థానంలోని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ వద్ద ప్రధానమంత్రిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా.. బేగం పేటలోని రెండు న్నర ఎకరాల విస్తీర్ణంలో యూరోపియన్ శైలిలో ఈ ప్యాలెస్ను నిర్మించి నిజాంకు బహుమతిగా ఇచ్చారు.
→కాలక్రమంలో ఆ భవనం రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ సంపదగా మారింది.
→కాన్సులేట్ ఏర్పాటు వరకూ.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయం ఈ ప్యాలెస్ లోనే ఉండేది.
→రాష్ట్ర ప్రభుత్వం కాన్సులేట్కు నానక్ రాంగూడలో 12.3 ఎకరాలు కేటాయించడంతో నూతన ప్రాంగణ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు.
→340 మిలి యన్ డాలర్ల వ్యయంతో ఆధునిక హంగులతో భవ నాని నిర్మించారు.

రోజుకు 2,500 ఇంటర్వ్యూలు :-
→ నూతన ప్రాంగణంలో ఈ నెల 23 నుంచి వీసా కార్య కలాపాలు ప్రారంభం కానున్నాయి.
→బేగంపేటలోని కాన్సు లేట్ కార్యాలయంలో 18 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలు (విండోస్) ఉండగా.. నూతన ప్రాంగణంలో 51 ఏర్పాటు చేయనున్నారు.
→ఇక్కడ రోజుకు సుమారు 2,500 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సౌకర్యాలు ఉన్నాయి.

స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం

→గగనతల రక్షణకు ఉద్దేశించిన స్వల్ప శ్రేణి క్షిపణి (వీఎస్ హెచ్ఐఆర్ఎడీఎస్) పరీక్షను భారత్ రెండుసార్లు విజయవం తంగా నిర్వహించింది.
→ఒడిశా తీరానికి చేరువ లోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగాలు జరి గాయి.
→సైనికులు భుజం మీద మోసుకెళ్లే చిన్న పాటి లాంచర్ ద్వారా ఈ అస్త్రాలను ప్రయోగిం చారు.
→ఆకాశంలో వేగంగా పయనిస్తున్న డ్రోన్లను వీటికి లక్ష్యంగా నిర్దేశించారు. వాటిని క్షిపణులు విజయవంతంగా నేలకూల్చాయి.
→గాల్లో తక్కువ ఎత్తులోని లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
→ఈ క్షిపణి వ్యవస్థను హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) రూపొందించింది.
→రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ఇతర ల్యాబ్లు, ప్రైవేటు పరిశ్రమలు ఇందులో పాలుపంచుకున్నాయి.

తేజస్ స్వదేశీ పవర్ టేకాఫ్ షాఫ్ట్

→ భారత్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం (తేజస్) స్వదేశీ పవర్ టేకాఫ్ (పీటీవో) షాఫ్ట్ తొలిసారిగా గగ నవిహారం చేసింది.
→ ఇది విజయవంతంగా సాగిం దని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్ష బెంగళూరులో జరిగిందన్నారు.
→ పీటీవో షాఫ్ట్.. చాలా కీలక సాధనం. విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్బాక్స్క బదిలీ చేస్తుంది.
→ దీన్ని విజయవంతంగా పరీక్షించడం ద్వారా.. అతికొద్ది దేశాలకే పరిమితమైన సంక్లిష్ట హైస్పీడ్ రోటర్ పరిజ్ఞానాన్ని భారత్ సముపార్జించినట్లయిందని తెలిపారు.

హైడ్రోజన్ ఇంధనంతో పేరుకుపోనున్న మీథేన్ !

→కాలుష్యానికి తావులేని శుద్ధ ఇంధనంగా హైడ్రో జనన్ను పరిగణిస్తారు.
→అయితే దీనికి సంబంధించిన ఒక రసాయన చర్య వల్ల దిగువ వాతావరణంలో మీథేన్ పేరు కుపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన పేర్కొంది.
→హైడ్రోజన్ను విస్తృతంగా ఉపయోగించేందుకు ఇది ప్రతి బంధకం కావొచ్చన్నారు.
→హైడ్రోజన్.. భవిష్యత్ ఇంధన మని అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన మాటియో బెర్టాన్ని పేర్కొన్నారు.
→దీనివల్ల పర్యావరణ, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్క రించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణంలోని →మీథేన్ ఉద్గారాలపై హైడ్రోజన్ ప్రభావాల గురించి విశ్లేషిం చడానికి శాస్త్రవేత్తలు ఒక మోడల్ను రూపొందించారు.
→పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను పూర్తిగా తొల గించి, హైడ్రోజన్ ను ప్రవేశపెడితే పరిస్థితి ఎలా ఉంటుంద న్నది పరిశీలించారు.
→ఒక పరిమితికి మించి ఈ వాయు వును ఉపయోగిస్తే వాతావరణంలో మీథేన్ స్థాయి పెరు గుతుందని తేల్చారు.
→దీనికితోడు హైడ్రోజన్ ఉత్పత్తికి. సంబంధించిన కొన్ని విధానాల్లో మీథేన్ ను ముడిపదార్థంగా ఉపయోగిస్తారని, ఇది సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుం దని చెప్పారు.
→హైడ్రోజన్ లీకేజీల వల్ల ఇబ్బంది తలెత్తుతుందని పేర్కొన్నారు.
→హైడ్రాక్సిల్ రాడికల్ (ఓహెచ్) అనే పరమాణువు.. మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణం నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషి స్తుంది.
→ఇది గాల్లోని హైడ్రోజన్ తోనూ చర్య జరుపుతుంది. నిత్యం పరిమితస్థాయిలో మాత్రమే ఓహెచ్ ఉత్పత్త వుతుంది.
→వాతావరణంలో హైడ్రోజన్ మోతాదు పెరి గితే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఓ హెచ్ పరమా ణువులు ఎక్కువగా ఖర్చవుతాయి.
→అలాంటి పరిస్థి తుల్లో మీథేన్ ను నిర్మూలించడానికి ఇవి పరిమితం గానే అందుబాటులో ఉంటాయని శాస్త్రవేత్తలు తెలి పారు.
→ఫలితంగా ఆ వాయువు దీర్ఘకాలం పాటు వాతావరణంలో తిష్ఠవేస్తుందని చెప్పారు.

అంచనాలను మించి ఆర్కిటిక్ మహాసాగర తాపం

→ ఐరాసకు చెందిన వాతావరణ మార్పుల కమిటీ- ఐపీసీసీ అంచనావేసిన దాని కన్నా ఆర్కిటిక్ మహాస ముద్రం వేడెక్కే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
→ వాతావరణ మార్పులపై లెక్కలు కట్ట డానికి ఈ నమూనాలు... కమిటీ ఉపయోగించిన ఆర్కిటిక్ భవిష్యత్ను | స్పష్టంగా ప్రతిబింబించలేదని వివరిం చారు.
→ స్వీడన్ లోని గోథెన్బర్గ్ విశ్వవి ద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మంచు విస్తృతి, అత్యంత ప్రతికూల వాతావరణం వంటి అంశాల కారణంగా మిగతా చోట్లతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతంలో చాలా తక్కువగా పరిశీలనలు చేపట్టారని వివ రించారు.
→వాటి ఆధారంగా రూపొందిన నమూనాల్లో కచ్చి తత్వం కొరవడుతుందని పేర్కొన్నారు. అక్కడి పరిస్థితులపై వాస్తవ పరిశీలనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామ న్నారు.
→ఉదాహరణకు.. ఆర్కిటిక్ ప్రాంతాల్లోని వేడి నీటి ఉష్ణోగ్రతలు అంచనాకు మించి ఉంటాయని, అవి సముద్ర మంచుగడ్డలకు చాలా చేరువలోనే పాగా వేస్తాయని పేర్కొ న్నారు.
→ప్రస్తుత వాతావరణ నమూనాల అంచనాలు కచ్చిత మైనవి కావని చెప్పడానికి ఇదొక కారణమని తెలిపారు.

ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్-2023 పరిశీలనకు తమిళ నవల 'పైర్'

→ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాళ్ మురుగన్ (56) రచించిన 'పైర్ (పుక్కులి) నవల చోటు దక్కించుకుందని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది.
→ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురు గన్ నిలిచారు.
→నమక్కల్ లో నివసిస్తున్న ఈయన తమిళంలో రచించిన పైర్ను అనిరుద్ధన్ వాసుదే వన్ ఇంగ్లిషులోకి అనువదించారు.
→కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట పారిపోవడం, పరు వుహత్యల ఇతివృత్తం ఆధారంగా కథనం సాగు తుంది.
→ఈ నవలపై తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తడంతో రచయితగా తన 'మరణాన్ని ' 2015లో మురుగన్ ప్రకటించారు.
→2016లో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మళ్లీ రచనలు కొనసాగించారు. 30 ఏళ్లు అధ్యాపక వృత్తిలో ఉన్న మురుగన్ స్వచ్ఛంద పదవీ విర మణ పొందారు.
→తుది జాబితాలో పైర్తో పాటు వివిధ దేశాల నుంచి మరో 12 రచనలు అవార్డు కోసం పోటీ పడుతున్నాయి.
→మే 23న లండన్లో జరిగే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు.
→రూ.50 లక్షల నగదు బహు మతి ఉంటుంది. డైసీ రాక్వెల్ అనువదిం చిన గీతాంజలి శ్రీ హిందీ నవల 'టూంబ్ ఆఫ్ శాండ్ గతేడాది ఈ సాహిత్య బహు మతిని గెలుచుకున్న విషయం తెలిసిందే.

DRDO సాంకేతికతతో ఔషధం

→ వికిరణ, అణుధార్మిక అత్యవసర పరి స్థితుల్లో వినియోగించేందుకు రక్షణ పరిశో ధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక తతో అభివృద్ధి పరచిన సంక్లిష్ట ఔషధానికి భారత ఔషధ నియంత్ర సంస్థ (డీసీజీఐ) అనుమతులు జారీ చేసింది.
→ ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడిం చింది.
→ ప్రష్యన్ బ్లూగా పేర్కొనే ఈ ఔష ధాన్ని టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ (టీడీ ఎఫ్) కింద అభివృద్ధి పరిచారు.

రజనీ శ్రీ పురస్కారానికి కలుంకూరిగుట్ట కథా సంపుటి ఎంపిక

→ జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ జిల్లా శాఖ ఏటా అందించే రజనీ శ్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి కథా పురస్కారానికి (2023) కలుంకూరిగుట్ట కథా సంపుటి ఎంపికైనట్లు పురస్కార కమిటీ కన్వీనర్, జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, పరి షత్ అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, నంది శ్రీనివాస్ లు ప్రకటనలో తెలిపారు.
→ దీనిని చిత్తూరు జిల్లాకు చెందిన కేవీ మేఘనాథ్ రెడ్డి రచించారని చెప్పారు.
→ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 73 కథా సంపుటాలు పరిశీలనకు రాగా ఈ పుస్తకం ఎంపికైనట్లు తెలిపారు.
→ రాయలసీమ మాండలికంలో సామాజిక జీవితాలను, అక్కడి వర్షాభావ పరిస్థితు లను కళ్లకు కట్టినట్లు రాసిన ఈ పుస్తకాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.
→ ఈ పురస్కారాన్ని ఏప్రిల్లో ప్రదానం చేస్తామన్నారు.

యంగ్ గ్లోబల్ లీడర్స్-23 జాబితాలో ఆదిత్య ఠాక్రే

→ ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించిన ప్రపంచ యువ నేతల జాబితాలో మన దేశానికి చెందిన ఆరుగురికి చోటు దక్కింది.
→ శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) యువ నేత ఆదిత్య రాక్రే, భాజపా యువ మోర్చా ఉపాధ్యక్షుడు మధుకేశ్వర్ దేశాయ్, టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరె క్టర్ సుదర్శన్ వేణు, జియో హాప్టిక్ టెక్నాలజీస్ సీఈవో ఆకృత్ వైష్, బయోజీన్ సీఈవో విబిన్ బి జోసెఫ్, పాలసీ 4.0 పరిశోధన సంస్థ సీఈవో తన్వీ రత్న ఉన్నారు.
→ ఈ ఏడాది నాటికి 40ఏళ్ల లోపు ఉన్న యువ నేతలను ఇందుకు ఎంపిక చేశామని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది.
→ వీరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ మార్పులు రంగాల్లో కృషి చేశారని తెలిపింది.
→ ఇంకా ఈ ఏడాది 100 మందిని ఎంపిక చేశామని వివరించింది.

2025లో 15.7లక్షలకు చేరనున్న క్యాన్సర్ కేసులు

→దేశంలో 2022లో నమోదైన 14.6 లక్షల క్యాన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు చేరే అవ కాశం ఉందని కేంద్రప్రభుత్వం మంగళవారం పార్లమెం టకు వెల్లడించింది.
→ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం (ఐసీఎంఆర్- ఎన్సీఆర్పీ) నివేదిక ఆధారంగా ఈ మేరకు పేర్కొ న్నట్లు కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి భరతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభలో తెలిపారు.

చైనాపై అణు జలాంతర్గామి అస్త్రం

→ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకు డుకు కళ్లెం వేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ (ఆకస్) కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
→అణుశ క్తితో నడిచే సరికొత్త పోరాట జలాంతర్గాములను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను తాజాగా ఆవిష్కరించాయి.
→దీని కింద ఆస్ట్రే లియాకు కనీసం మూడు అణు జలాంతర్గాములను అమెరికా సరఫరా చేయనుంది. ఈ పరిణామాన్ని చైనా ఖండించింది.
→ఈ మూడు దేశాలు స్వీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ సమాజ ఆందోళనలను విస్మరించా ని ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నాయని, ఆణు వ్యాప్తి నిరోధక ఒప్పందాని (ఎన్పీటీ)కి తూట్లు పొడు స్తున్నాయని ఆరోపించింది.
→అమెరికాలోని శాన్ డియెగోలో ఆమె రికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ల శిఖ రాగ్ర సదస్సులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
→ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులను నెలకొల్పేందుకు ఇది అవసరమని నేతలు పేర్కొన్నారు.
→దీని ప్రకారం 2030ల ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలి యాకు విక్రయిస్తుంది.
→అవసరమైతే మరో రెండు సబ్ మెరైన్లనూ సరఫరా చేస్తామని బైడెన్ పేర్కొన్నారు. త్వరలో ఆస్ట్రేలియా నౌకాదళ సిబ్బందికి అమెరికా, బ్రిట న్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
→అలాగే 2027 నుంచి వంతులవారీగా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గా ములను పంపుతామన్నారు. దీనివల్ల ఆ దేశ నౌకాదళా నికి ఈ తరహా సబ్మెరైన్లపై తగిన శిక్షణ లభిస్తుంద న్నారు.
→ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియాల కోసం కొత్త రకం అణు జలాంతర్గాములను నిర్మిస్తారు. వీటిని 'ఎస్ ఎస్ఎన్-ఆకస్'గా పేర్కొంటారు.
→అందులో మూడు దేశాల పరిజ్ఞానాలను ఉపయోగిస్తారు. వీటిలో సంప్ర చాయ అస్త్రాలు ఉంటాయి.
→తాజా ఒప్పందంలో భాగంగా.. తన సబ్మెరైన్ నిర్మాణ సామర్థ్యాన్ని, వర్జీ నియా తరగతి జలాంతర్గాముల నిర్వహణ వసతులను మెరుగుపరుచుకోవడానికి 460 కోట్ల డాలర్లను అమెరికా వెచ్చిస్తుంది.
→ఇది మూడు దేశాల సంబంధాల్లో నూతన ఆధ్యాయానికి వీలు కల్పిస్తుందని, కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తుందని ఆల్బనీస్ తెలిపారు.
→కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇలాంటి కొత్త బంధాలు అవసరమని సునాక్ చెప్పారు.

మరింత శక్తిమంతం:-
→ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద డీజిల్ ఇంజిన్ జలాంతర్గా -ములు ఉన్నాయి. వాటి సామర్ధ్యం పరిమితం.
→వర్జీ నియా తరగతి సబ్మెరైన్లు పొందాక.. సాగరగర్భంలో ఆస్ట్రేలియా పరిధి మరింత విస్తరిస్తుంది. శత్రువులపై దీర్ఘశ్రేణి దాడులు చేపట్టగల సత్తాను సాధిస్తుంది.
→హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ మహా సముద్రంతో కూడిన ప్రాంతాన్ని 'ఇండో-పసిఫిక్'గా చెబు తున్నారు. అక్కడ చైనా సైనిక కార్యకలాపాలు బాగా పెరిగాయి.
→ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు ఉండాలని భారత్ సహా అనేక దేశాలు చెబు తున్నాయి.
→అక్కడి దక్షిణ చైనా సముద్రం మొత్తం తన దేనని చైనా వాదిస్తోంది. పొరుగునున్న తైవాన్, ఫిలి ప్పీన్స్ తదితర దేశాలు దీన్ని విభేదిస్తున్నాయి.
→దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాముల అవసరం ఉందన్న అభిప్రాయానికి అమెరికా, బ్రిటన్లు వచ్చాయి.

భూమి ఎందుకు భ్రమిస్తుంది?

→భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యోదయం, సూర్యాస్తమయం.. పగలు, రాత్రి అనేవీ ఉండవు.
→కానీ భూమి భ్రమిస్తున్న విషయాన్ని ఇక్కడ్నుంచి మనం చూడలేం. మన కళ్లు గుర్తించలేనంత నెమ్మదిగా తిరుగుతుంది మరి.
→ఇంతకీ భూమి ఎందుకు భ్రమిస్తుంది? దుమ్ము, ధూళి ముద్దలు, వాయువు మేఘాలతో ఏర్పడింది కాబట్టి. అప్పటికే అవి భ్రమిస్తూ ఉన్నాయి.
→గురుత్వాకర్షణ ప్రభావంతో ఒక దగ్గరికి చేరుకున్నాయి. ఇవి భూమిగా పోగుపడిన తర్వాత కూడా అలాగే తిరుగుతున్నాయి.
→అంతరిక్షంలోని శూన్యంలో వీటి వేగాన్ని తగ్గించటానికి అవసరమైన ఘర్షణ ఏదీ లేదు. భూమి భ్రమిస్తోందనటానికి అలలు మంచి ఉదాహరణ.
→చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పెద్ద అలలు ఎగిసిపడతాయి. చంద్రుడి గురుత్వాకర్షణ మహాసముద్రాలను తన వైపునకు లాక్కుంటుంది.
→దీంతో అవి చంద్రుడి వైపునకు వస్తాయి. కానీ ఇది తాత్కాలికమే. భూమి తిరుగుతుండటం అలలు తిరిగి వెనక్కి వెళ్తాయి. ఈ అలల చక్రం మళ్లీ మళ్లీ కొనసాగుతూ వస్తుంటుంది.
→గంట గంటకూ అలల్లో వచ్చే మార్పులకూ భూ భ్రమణమే కారణం.

విపత్తుల అంచనాకు ఐఐటీ మండీ కొత్త ఆల్గోరిథమ్

కృతి విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. వీటిని అంచనా వేయగలిగితే 'ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు.
→ ఇలాంటి ఉద్దేశంతోనే ఐఐటీ మండి పరిశోధకులు వినూత్న ఆల్గోరిథమ్న రూపొందించారు.
→ కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాయంతో పనిచేసే ఇది ప్రకృతి విపత్తులను కచ్చితంగా అంచనా వేయటానికి తోడ్పడగలదు. దీన్ని కొండ చరియలు విరిగిపడటం మీద పరీక్షించారు కూడా.
→ ఇది కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న చోట డేటాను విశ్లేషించి, వాటిల్లో ఏవైనా తేడాలుంటే సవరించగలదు.
→ వీటి ద్వారా పటాన్ని రూపొందించి, నిర్ణయాన్ని.. అంటే కొండ చరియలు విరిగిపడే అవకాశాన్ని అంచనా వేయగలదు.
→ దీన్ని వరదలు, మంచు ఫలకాలు విరగటం వంటి విపత్తులను అంచనా వేయటానికీ ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు.

ఏమిటీ ఎంసీఎల్ఆర్?

బ్యాంకులు నిధుల సమీకరణకు చేసే వ్యయాల ఆధా రంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను నిర్ణయిస్తాయి.
→ అంటే ఈ శాతాని కన్నా తక్కువగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీల్లేదు. రోజు, నెల, 3, 6, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి.
→ ఇది బ్యాంకును బట్టి మారుతుంది. ఈ విధానం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తీసుకున్న గృహరుణాలు, తనఖా రుణాలు, కార్పొరేట్ రుణాలు ఎక్కువగా దీని పరిధిలోకి వస్తాయి.
→ ప్రస్తుతం గృహరుణాలు చాలావరకూ రెపో ఆధారిత వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) మారాయి. అంటే రెపో రేటు ఆధారంగా ఇది మారుతుంటుంది. ఈ విధానా నికి మారని వారికి ఎంసీఎల్ఆర్ వర్తిస్తుంది.

భూగర్భ బుల్లెట్ రైల్ స్టేషన్ ప్రాజెక్టు హెచ్సీసీ- ఎంఈఐఎల్ చేతికి

ముంబయి- అహ్మదాబాద్ మధ్య నిర్మి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో, బాంద్రా కుర్లా స్టేషన్ కాంప్లెక్స్ పనులను హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ముంబయికి చెందిన హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్సీసీ) ఉమ్మడిగా దక్కించుకున్నాయి.
→ ఈ మేరకు హెచ్సీసీ వెల్లడించింది. హై స్పీడ్ రైల్ కారిడార్ లో ఉన్న ఏకైక భూగర్భ స్టేషన్ ఇది.
→ నేల నుంచి దాదాపు 24 మీటర్ల లోతులో ఉంటుంది. స్టేషన్ మొత్తం మూడు అంతస్తులు ఉంటాయి.
→ ఈ స్టేషన్ నిర్మాణానికి సంబంధిం చిన రూ.3,681 కోట్ల విలువైన ప్రాజెక్టును నేష నల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్) ఈ సంస్థలకు అప్పగిం చింది. 508.17 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడా ర్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్లో ఆరు ప్లాట్ఫారాలు ఉంటాయి.
→ ఒక్కో ప్లాట్ఫారం సుమారు 414 మీటర్ల పొడవుతో, 16 కోచ్ల బుల్లెట్ రైలుకు సరిపోతుంది.

శక్తికాంత దాస్ కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం

రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్కు 'గవ ర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023' పురస్కారం వరించింది.
→ కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును అందించింది.
→ శక్తికాంత దాస్ ప్రస్తుతం రెండో పర్యాయం ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగుతున్నారు.
→ కీలక సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రపంచ స్థాయి చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో దాస్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది.
→ 2015లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్కు దేశం నుంచి మొదటిసారిగా ఈ అవార్డు దక్కింది.

15 కాలుష్య నగరాల్లో 12 మనవే

మధ్య, దక్షిణాసియాల్లోని 15 అత్యంత కాలుష్య కారక నగరాల్లో 12 మన దేశానికి చెందినవే ఉన్నాయి.
→ ఈ జాబితాలో మహారాష్ట్రలోని భివాండీ అత్యంత కాలుష్య కారక నగరంగా నిలిచింది.
→ 2022కు సంబంధించిన ఈ జాబి తాను స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ విడుదల చేసింది.
→ దేశంలోని 60శాతం నగ రాలు 2.5 పీఎం స్థాయిలో ఉన్నాయని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న స్థాయికన్నా ఏడు రెట్లు ఎక్కువని తెలిపింది.
→ కాలుష్యంలో రవాణా రంగం వాటానే 20 నుంచి 35 శాతం దాకా ఉందని పేర్కొంది.
→ దిల్లీ పరిసర ప్రాంతాల్లో పంటల అవశేషాల కాల్చివేత కూడా కాలుష్యానికి కారణమవుతోందని వివరిం చింది.
→ 2022లో విద్యుత్తు ఉత్పత్తి కోసం గనుల విషయంలో పర్యావరణ నిబం ధనలను కేంద్రం సడలించిందని, ఇదీ కాలుష్యానికి కారణమని తెలిపింది.

పురుషులకూ జాతీయ కమిషన్ కావాలి

పెళ్లైన మగవారూ గృహ హింస కార ణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటు వంటి వారి రక్షణకు మహిళా కమిషన్ మాదిరిగా జాతీయ పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
→ 2021 జాతీయ నేర గణాంక నివేదిక ప్రకారం.. దేశంలో 1,64,033 మంది ఆత్మహత్య లకు పాల్పడ్డారని, ఇందులో 81,063 మంది పెళ్లైన పురుషులు, 28,680 మంది పెళ్లైన మహిళలు ఉన్నారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ తెలిపారు.
→ కుటుంబ సమస్యల కారణంగా 33.2శాతం మంది పురు షులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 4.8 శాతం మంది వివాహ సంబంధ కారణాలతో తనువులు చాలించారని వివరించారు.
→ 2021లో మొత్తం ఆత్మ హత్యల్లో 1,18,979 (72శాతం) మంది పురుషులని, 45,026 మంది 27శాతం) మహిళలని తెలిపారు.
→ ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
→ దీంతోపాటు పెళ్లైన మగవారి ఆత్మహ త్యల కేసులను, గృహ హింస కారణంగా ఇబ్బం దులు పడుతున్న వారి కేసులను విచారణకు స్వీక రించేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనరు కోరారు.
→ దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో గృహ హింస కారణంగా, కుటుంబ ఇబ్బందులతో కష్టాలు పడు తున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కేంద్ర ప్రభు త్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
→ ఇవే ఫిర్యాదులను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు తీసుకునేలా సూచించాలని కోరారు.

ఆధార్ అప్డేషను మూణ్నెల్లు ఉచితం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (యూఐడీఏఐ) మార్చి 15 నుంచి జూన్ 14 వరకు మూణ్నెల్ల పాటు ఆధార్ డాక్యుమెంట్ల అప్డేషను ఆన్లైను ద్వారా ఉచితంగా చేసుకునే అవకాశం కల్పిస్తు న్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
→ గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్ డేషను చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది.
→ విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకొన్న తాజా నిర్ణయంతో లక్షల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు.
→ నిబంధనల మేరకు.. ఆధార్ సంఖ్య పొందిన వారు ప్రతి పదేళ్లకోమారు సంబంధిత డాక్యుమెం ట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు చూపాలి.
→ ఉచిత సేవలు 'మై ఆధార్' పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులకు సాధా రణ చార్జీలు వర్తిస్తాయి.
→ ఉచితం గడువు ముగి శాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేడేషను చేసుకోవచ్చు..

ఆరిపోయే తార వెలుగులివి!

ఈ నక్షత్ర సముదాయం మధ్యలో అత్యంత ప్రకాశవం తంగా కనిపిస్తున్న తార పేరు వూల్ఫ్-రాయెట్ 124.
→ నిజానికి ఈ నక్షత్రం మరణం అంచున ఉంది.
→ ఇక చుట్టుపక్కల అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్న నీహారిక.. నక్షత్రంలో చోటుచేసుకున్న అల్లకల్లోలం కారణంగా దాని నుంచి బయటపడిన పదార్థాలు, ధూళితో ఏర్పడింది.
→ నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గతేడాది జూన్ లో నక్షత్రంలో చోటుచేసు కున్న ఈ అద్భుత దశను బంధించింది. నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో 9వ స్థానంలో తెలంగాణ

హరియాణా రాష్ట్రం పంచకులలో ఇటీవల జరిగిన 26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ తరపున 3 క్రీడాకారులుగా బరిలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది 16 పత కాలను సాధించారు. ఎనిమిది బంగారు, రెండు రజతం, ఆరు కాంస్య పతకాల సాధనతో రాష్ట్రం జాతీయస్థాయిలో తొమ్మిదో స్థానంలో నిలి చింది.
→ ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అటవీశాఖలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
→ పతకాలు గెలుచుకున్న రాష్ట్ర అటవీశాఖ ప్రతినిధు లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి అభినందించారు.
→ బిలియర్డ్స్ రెండు బంగారు పతకాలు సాధించిన ఐఎఫ్ఎస్ అధికారిణి సోనీ బాలాదేవి బీఆర్కే భవన్లో సీఎస్ ను కలిసి క్రీడోత్సవాల వివరాలు తెలిపారు.
→ అథ్లెటిక్స్ బి. ఖాజా, ఎం. సునీత, వి.సాంబయ్య, స్విమ్మింగ్ జి. కిష్టాగౌడ్, బి.సక్రు, క్యార మ్స్ ఘాజీ కమాలుద్దీన్లు పతకాలు సాధించారు. చెస్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర ఆటల్లోనూ ఉద్యోగులు పతకాలు సాధించారు.

అప్పుల్లో ఆంధ్రులే ఎక్కువ

ప్రతి లక్షమందిలో 39,358 మందిపై రుణభారం
→ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు.
→ రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడినవారిలో ప్రతి లక్షమందిలో 46,330 మంది సంస్థాగతంగానో, వ్యక్తుల ద్వారానో అప్పు తీసుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన 78వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది.
→ ఈ సర్వే 2020 జనవరి నుంచి 2021 ఆగస్టు 15 వరకు చేశారు. దేశవ్యా గ్రామీణ, 5,797పట్టణ ప్రాంతాల్లోని 2,76,409 ప్తంగా 8,469 ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు.
→ ఈ నివేదికలో తేలిన అంశాల ప్రకారం మరే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత భారీ సంఖ్యలో ప్రజలు అప్పుల్లో లేరు. తెలం గాణ రెండో స్థానంలో నిలిచింది.
→ తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 39,358మంది ఏదోఒక రూపంలో అప్పు చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో 17% మంది ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయారు.
→ జాతీయస్థాయి సగటు (15,809 మంది) తో పోలిస్తే ఏపీలో 193% మంది, తెలం గాణలో 148% మంది అధికంగా అప్పుల్లో ఉన్నారు.
→ దక్షి ణాదిలో తెలుగు రాష్ట్రాల తరువాత స్థానంలో కేరళ, తమి ళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలు నిలిచాయి.
→ ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి లక్షమంది మహిళల్లో 51.49%, పురు షుల్లో 46.61% మంది అప్పుల్లో ఉన్నారు.
→ పట్టణాల్లో 35.38% మంది మహిళలు, 45.16% మంది పురుషులు రుణభారం మోస్తున్నారు. తెలంగాణలో ఇందుకు భిన్న మైన పరిస్థితి ఉంది.
→ అక్కడ మహిళలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పురుషులపైనే అధిక అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే తెలంగాణలోని మహిళలపై రుణభారం చాలా తక్కువ కనిపించింది.
→ ఇక్కడి గ్రామీణ మహిళల్లో 39.84% మంది, పట్టణ మహిళల్లో 15% మాత్రమే అప్పుల భారం మోస్తున్నారు.
→ పెద్దరాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మహిళలు అతితక్కువ సంఖ్యలో అప్పు తీసుకున్నారు.
→ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్షమందికి 1,791 మంది, పట్టణాల్లో 1,186 మంది మాత్రమే సంస్థాగతంగానో, తెలిసినవాళ్లద గ్గరో అప్పుచేశారు.
→ ఈ సర్వే చేసేనాటికి కనీసం రూ. 500కి మించి అప్పు చేసి, తీర్చలేని బాకీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
→ ప్రభుత్వం, సహకార సంస్థలు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్ అథారిటీనుంచి నుంచి తీసుకున్న రుణాలను సంస్థాగత రుణాలుగా పరి గణించారు.
→ బంధువులు, స్నేహితులు, వడ్డీవ్యాపారుల నుంచి తీసుకున్న అప్పులను అసంఘటిత రంగాల నుంచి తీసుకున్న వాటిగా గుర్తించారు.

ష్కిజోఫ్రెనియా కారక జన్యువుల గుర్తింపు

మనోవైకల్యానికి (ష్కిజోఫ్రెనియా) దారితీసే 10 రకాల జన్యువులను ఇటీవల ఐరోపా అధ్యయ నంలో కనుగొన్నారు.
→ తాజాగా మరో రెండు జన్యు వులూ ఈ రుగ్మతకు కారణం కావచ్చని అమెరికా లోని ఐకాన్ వైద్య కళాశాల పరిశోధకులు తేల్చారు.
→ ష్కిజోఫ్రెనియాతోపాటు ఆటిజం అనే మరో మాన సిక రుగ్మతకూ దారితీయగల జన్యువును కూడా వారు గుర్తించారు.
→ ఈ అధ్యయనాలు సరికొత్త ఔష ధాల తయారీకి ఉపకరిస్తాయి. ఐరోపా అధ్యయనం ప్రధానంగా తెల్లజాతి వారికి పరిమితం కాగా, అమె రికా పరిశోధకులు వేర్వేరు జాతుల వ్యక్తులను పరి శీలించారు.
→ ఎస్ఆర్ఆర్ఎం-2, ఏకేఏపీ-11 అనే రెండు జన్యువులు మనోవైకల్యానికి దారితీయవచ్చని కనుగొ న్నారు.
→ ష్కిజోఫ్రెనియా ప్రతి 100 మందిలో ఒకరికి రావచ్చు. దానిబారిన పడినవారికి వాస్తవికతతో సంబంధం తెగిపోతుంది.

భారత్ లో ఎస్ సీవో సమావేశాలకు పాక్ కు ఆహ్వానం

షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) ప్రస్తుత అధ్యక్ష హోదాలో మనదేశం పాకిస్థానన్ను కలుపుకొని పోవడానికి చర్యలు తీసుకొంది.
→ ఏప్రిల్ 28న జరిగే ఎస్సీవో రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనవలసిం దిగా ఇతర సభ్యదేశాలతోపాటు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్కు కూడా భారత్ ఆహ్వానం పంపింది.
→ మే నెలలో జరిగే ఎస్సీవో విదేశాంగ మంత్రుల సభ కోసం పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి కొన్ని వారాల క్రితమే ఆహ్వానం పంపింది.
→ సమావేశా లకు వచ్చేదీ లేనిదీ ఇంతవరకు బిలావల్ కానీ, ఆసిఫ్ కానీ నిర్ధారించలేదు.
→ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే రక్షణ మంత్రుల సమావేశంలో అఫ్ఘానిస్థాన్ పరిస్థితి, ఉగ్రవాదం తదితర ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చిస్తారు.
→ ఎస్సీవోలో భారత్ సహా చైనా, రష్యా, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, కజఖస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.

వైద్యుల నైపుణ్యం పెంచే స్కిల్ ల్యాబ్

అత్యవసర సమ యంలో రోగుల ప్రాణాలు కాపాడే విధంగా వైద్యుల్లో క్లినికల్ నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు స్కిల్ ల్యాబ్ సెంటర్ దోహదం చేస్తుందని రాష్ట్ర వైద్యవిద్య సంచాల -కుడు డా. కె. రమేష్ రెడ్డి అన్నారు.
→ ఈ విషయమై వైద్యు లకు, వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో కోరిలోని ఉస్మానియా వైద్య కళాశాల (ఓఎంసీ)లో ఏర్పాటు చేసిన నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ (నెల్స్) స్కేల్ ల్యాబ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
→ ఓఎంసీ ప్రిన్సిపల్ డా. శశికళారెడ్డి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా. నాగేందర్, స్కిల్ ల్యాబ్ నోడల్ అధికారి డా. పాండునాయక్ తదితరులతో కలిసి డీఎంఈ రమేష్రెడ్డి దీన్ని ప్రారంభించారు.
→ ఆయన మాట్లాడుతూ.. అన్ని వైద్య కళాశాలల్లో ఇలాంటి సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
→ ఓఎంసీ ప్రిన్సిపల్ డా. శశికళా రెడ్డి మాట్లాడుతూ.. స్కిల్ ల్యాబ్ ద్వారా ఏటా సుమారు 500 మంది యూజీ, పీజీ వైద్య విద్యార్థులకు, వందలాది మంది పారామెడికల్, టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ద్రువీకరణ పత్రం అందజేస్తామని వివరించారు.
→ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకురాలు (ఆర్డీ) డా. అనూరాధ మేడోజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే స్కిల్ ల్యాబ్ సెంటర్లను అన్ని వైద్యకళాశాలల్లో నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు.
→ ఓఎంసీ అనస్థీ షియా విభాగాధిపతి డా.సాధనారాయ్, ఆయా విభాగా ధిపతులు, ప్రొఫెసర్లు, ఎంపీహెచ్ఓ వేణుగోపాల్రెడ్ తదితరులు పాల్గొన్నారు.

'స్వదేశ్ దర్శన్'కు భువనగిరికోట, 'సాగర్'

మారుమూల ప్రాంతాల్లోని చారిత్రక, పురాతన కట్టడాలతో పాటు ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జవనరి నుంచి అమలుచేస్తున్న స్వదేశ్ దర్శన్ రెండో విడత పథకానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి కోట, నాగార్జునసాగర్ ప్రాంతాలు ఎంపికయ్యాయి.
→ రాష్ట్రవ్యాప్తంగా భువనగిరి కోట, నాగార్జునసాగర్, మహబూబ్నగర్ లోని మన్యంకొండ వెంకటేశ్వరా! లయం, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు, ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం, తది తర ప్రాంతాలను రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
→ ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఒక్కో ప్రాంతానికి హీనపక్షం రూ. 100 కోట్లకు పైగా నిధులతో అభి వృద్ధి పనులు చేపట్టనున్నాయి.
→ భువనగిరి కోట పైకి రోప్్వతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టాలని గతంలోనే నిర్ణయించినా సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో సాధ్యపడలేదు.
→ స్వదేశ్ దర్శన్ కింద చారిత్రక కోటను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఇప్పటికే రూపొందించారు.
→ దీనికి క్షేత్రస్థాయిలో మేనేజింగ్ కమిటీ చైర్మన్గా కలెక్టరు వ్యవహరించనున్నారు.
→ కోటలో అభివృద్ధి పనులకు యాదాద్రి జిల్లా అధికార యంత్రాంగంతో రాష్ట్ర పర్యాటకశాఖ ఎంవోయూ కుదుర్చుకోనుంది.
→ నాగార్జునసాగర్ లోనూ అభివృద్ధి పనులు :-
→ ఈ పథకం కింద నాగార్జునసాగర్ సైతం ఎంపిక కావడంతో ఇక్కడా కేంద్ర, రాష్ట్ర నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్ట నున్నారు.
→ ఇప్పటికే ఈ ప్రాంతం బౌద్ధుల ఆరాధ్య ప్రాంతంగా విలసిల్లుతోంది. ఇక్కడ 274 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్ల వ్యయంతో బుద్ధవనం ప్రాజె క్టును నిర్మించింది.
→ దీంతో విదేశీ పర్యాటకులు పెరిగారు. దీనికి మరింత ఊతమిచ్చేలా పర్యాటకులకు కావా ల్సిన మౌలిక వసతులను ఈ పథకంలో భాగంగా అధికారులు చేపట్టనున్నారు.
→ డీపీఆర్ త్వరలోనే రూపొం దించి నల్గొండ కలెక్టరుతోనూ ఎంవోయూ కుదుర్చుకుంటామని పర్యాటకశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

రావత్ పేరిట రెండు అవార్డులు

దివంగత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సంస్మరణార్ధం రెండు అవార్డులను ఏర్పాటు చేయను న్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది.
→ ఇందులో మొద టిదాన్ని శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మహిళా అగ్నివీర్ ట్రైనీకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
→ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఈ నెల 28న ఐఎన్ఎస్ చిల్కాలో జరిగే తొలి నేవీ అగ్నివీర్ పాసింగ్ ఔట్ పరేడ్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ చేతుల మీదగా ప్రదానం చేయను న్నట్లు వివరించింది.
→ రెండో పురస్కారాన్ని గోవాలోని నేవల్ వార్ కాలేజీలో 'హయ్యర్ కమాండ్ కోర్స్' శిక్షణ పొందుతున్న వారిలో అత్యుత్తమ ప్రతిభ చాటిన అధికా రికి ప్రదానం చేస్తామని తెలిపింది.
→ దేశ తొలి త్రిదళాధి పతి అయిన జనరల్ రావత్, ఆయన భార్య మధులికా రావత్లు 2021 డిసెంబర్ 28న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.

కొంగరకలాన్ ప్లాంట్లో ఎయిర్ పాడ్స్ ఉత్పత్తి

ప్రపంచవ్యా ప్తంగా ఖ్యాతిగాంచిన యాపిల్ ఎయిర్పెడ్స్ ఇక రాష్ట్రంలో తయారు కానున్నాయి.
→ వీటిని తైవాన్ కు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్కాన్ తయారు చేయనుంది.
→ ఇటీ వలే రాష్ట్రంలో పర్యటించిన ఫాక్సాకాన్ చైర్మన్ ముఖ్య మంత్రి కేసీఆర్తో సమావేశమై రాష్ట్రంలో భారీ పెట్టుబ డులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలి సిందే.
→ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్లో దాదాపు 200 ఎకరాల్లో ఫాక్స్కాన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
→ యాపిల్ కంపెనీ మొబైల్ ఫోన్లు, ఎయిర్పాడాతో పాటు ఇతర అన్ని ఉత్పత్తుల్లో 70 శాతం ఫాక్స్కాన్ తయారు చేస్తుంది.
→ ఈ సంస్థ ఇప్పటికే తమిళ నాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ లోని ప్లాంట్లో ఐ ఫోన్లు తయారుచేస్తుండగా ఎయిర్పాడ తయారీ చైనాలో మాత్రమే జరుగుతోంది.
→ చైనాతో పాటు భారత్లో కూడా ప్లాంట్ నెలకొల్పాలన్న యాపిల్ సూచ నతో ఫాక్స్కాన్ రాష్ట్రానికి రానుంది.
→ కొంగర కలాన్లోని ప్లాంట్కు ఫాక్స్కాన్ 200 మిలియన్ డాలర్ల (రూ.1600 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది.
→ మరో రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే ఏడాది ఆఖరుకల్లా ప్లాంట్ను ప్రారంభించాలని ఫాక్స్కాన్ భావిస్తోంది.

మధుమేహ నియంత్రణకు కృత్రిమ క్లోమం

టైప్-1 మధుమేహ బాధితులు తమ రక్తంలో గ్లూకోజ్ నిల్వల నియంత్రణ కోసం నొప్పికారక ఇంజెక్షన్లు వేసుకోవాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించగల సరికొత్త నానో సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
→ ఆస్ట్రేలియా లోని మోనాష్ విశ్వవిద్యాలయం పరిశోధకుల నేతృత్వంలో శాస్త్ర వేత్తల బృందం ఇందుకోసం సమర్ధ కృత్రిమ క్లోమ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
→ ఇది బాధి తుల రక్తంలో గ్లూకోజ్ నిల్వలను కచ్చిత త్వంతో గుర్తించి.. అవసరమైన స్థాయిలో ఇన్సులిన్ను విడుదల చేస్తుంది.
→ గ్లూకోజ్ అణు వుల గొలుసులుగా పిలిచే ఫైటోగ్లైకోజెన్ నానో కణాలను ఈ కృత్రిమ క్లోమం తయారీకి శాస్త్రవేత్తలు ఉపయోగించారు.
→ ఇతర వ్యవస్థలతో పోలిస్తే- ఇన్సులిన్ సానుకూల ప్రభావాలు ఎక్కువ సమయం పాటు కొనసాగేలా ఈ వ్యవస్థ చూస్తుందని వారు తెలిపారు.
→ ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధా నాల్లో మధుమేహులు రోజుకు దాదాపు అయిదుసార్లు ఇన్సులిన్ను ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
→ తమ ఆవిష్కరణ పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే కేవలం రెండుసార్లు ఇంజెక్షన్ వేసు కుంటే సరిపోతుందని వివరించారు.

ఇక సులభంగా సమర్థ నానోబాడీల సమీకరణ

కరోనా సహా అనేక ప్రమాద కర వైరస్లపై సమర్థంగా పోరాడ గల నానోబాడీ (బుల్లి యాంటీబాడీలు)లను తక్కువ ఖర్చులో, సులభంగా సమీక రించేందుకు అమె రికాలోని రాక్ఫె ల్లర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
→ పెద్ద యాంటీబాడీలు చేరుకోలేని భాగాల్లోకి కూడా చొచ్చుకెళ్లడం ద్వారా వైరస్ల అంతానికి నానోబాడీలు దోహదపడ తాయి.
→ వాటి గుర్తింపు, సేకరణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకే తికతలు చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నవి.
→ ఈ నేపథ్యంలో ప్రత్యా మ్నాయ మార్గాలపై దృష్టిపెట్టిన పరి శోధకులు.. దక్షిణ అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపించే లామా అనే జంతు వులను స్వల్ప మోతాదులో కొవిడు గురిచేశారు.
→ ఆపై- వాటి రక్త నమూ నాల నుంచి నానోబాడీ డీఎన్ఏన్ను సేక రించి విశ్లేషించారు. ఆ జన్యువులను బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టి అధిక సంఖ్యలో నానోబాడీలను సృష్టించగలి గారు.
→ కరోనా సహా అనేక వైరస్ల పై పోరాడగల నానోబాడీలను గుర్తించేం దుకు, వాటిని త్వరితగతిన సమీకరిం చేందుకు తమ ఆవిష్కరణ ఉపయోగప డుతుందని పరిశోధకులు తెలిపారు.

దేశవ్యాప్తంగా 37 ఉత్తమ పాఠశాలల గుర్తింపు

వినూత్న విధానాలను అవలంబిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న వివిధ రాష్ట్రాల్లోని 37 పాఠశాలలను సీఐపీఎస్ (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్) గుర్తించింది.
→ వీటిలో తెలంగాణలోని తేజ పాఠ శాల(కోదాడ), విద్యారణ్య (హైదరాబాద్ ఆదర్శన గర్), పల్లవి స్కూల్(బోడుప్పల్), శ్లోకా (అజీజన గర్, రంగారెడ్డి జిల్లా), అక్షరవనం (కల్వకుర్తి), ఆంధ్రప్రదేశ్ లోని వికాస్ విద్యావనం, అభ్యాస విద్యా లయాలు(విజయవాడ) ఉన్నాయి.
→ 13వ ఆర్థిక సంఘం సూచనల మేరకు విద్య, వైద్యం, సుపరి పాలన వంటి వివిధ రంగాల్లో అమలవుతున్న సృజనాత్మక, నూతన ఆవిష్కరణలను గుర్తించేం దుకు సీఐపీఎస్ కృషి చేస్తోంది.
→ తాను గుర్తించిన అంశాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తుంది. అందులో భాగంగా తాము ఎంపిక చేసిన 37 పాఠ శాలల్లో అమలవుతున్న అత్యుత్తమ విద్యాబోధన పద్ధతులపై పుస్తకం తీసుకురానుంది.
→ దాన్ని కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు పంపిస్తుంది.
→ ఈమే రకు సీఐపీఎస్ సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీవిద్య. సలహాదారు ఉపేందర్రెడ్డి, అసోసియేట్ సభ్యుడు వెంకటరెడ్డి ఆయా పాఠశాలలను పరిశీలిస్తున్నారు.
→ గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయ పాఠశాలను సందర్శించారు.
→ పాఠశాల ప్రిన్సిపల్ రమ, మార్గదర్శకుడు సోమిరెడ్డి, ఉపా ధ్యాయులు, విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకు న్నారు. 'మేం చదువుతోపాటు విద్యార్థుల మనోవి కాసానికి ప్రాధాన్యం ఇస్తాం.
→ వీటి కారణంగానే తెలంగాణ ఇంటర్ సిలబస్ లో మా పాఠశాలపై పాఠం పొందుపరిచారు. చంద్రయాన్ కార్యక్ర మంలో ప్రధాని మోదీతో కలిసి మా విద్యార్థిని పాల్గొంది' అని ప్రిన్సిపల్ రమ వివరించారు.

ఆయుధ దిగుమతుల్లో నంబర్ వన్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతోంది.
→ స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలి యా, చైనాలు నిలిచాయి.
→ అతిపెద్ద ఆయుధ ఎగు మతిదారులుగా వరుసగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ ఉన్నాయి.

ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్

ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాళ్ మురుగన్ రచించిన 'పైర్' (పుక్కులి) నవల చోటు దక్కించు కుందని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది.
→ ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు.

గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం

రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023' పురస్కారం వరించింది.
→ కరోనా సంక్షోభం, రష్యాఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థం గా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును అందించింది.

నాటు.. నాటు' పాటకు ఆస్కార్

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' 95వ ఆస్కార్ పురస్కా రాల్లో ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ గెలిచింది.
→ కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమ కూర్చారు.

భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి

భారత్లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు బైడెన్ సన్నిహితుడు ఎరిక్ గార్సెట్టి నియామకం ఖరారైంది.
→ ఆయన నామినేషన్ ను సెనెట్ 52-42 మెజార్టీతో ఆమోదించింది.
→ రెండేళ్లుగా ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి పదవి త్వరలోనే భర్తీ కానుంది.

ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అమితవ ముఖర్జీ

ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించా రు.
→ ప్రస్తుతం ఆయన ఎన్ఎండీసీలో ఫైనాన్స్ డైరెక్ట ర్గా వ్యవహరిస్తున్నారు. అమితవ ముఖర్జీ 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఎఎ స్) అధికారిగా ఉంటున్నారు.

కార్తికి గోన్సాల్వెస్

అనాథ ఏనుగులను ఆదరించిన దంపతులు కథతో తెరకెక్కిన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది.
→ దర్శకురాలు కార్తికి న్సాస్, నిర్మాత గునీత్ మోంగా వేదికపై అవార్డు తీసుకున్నారు.
→ ప్రముఖ ఆర్థికవేత్త, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయం మాజీ ప్రొఫెసర్ జయతీఘోష్ వ్యవసాయ ఆర్థికశాస్త్రం విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
→ గ్లోబల్ అగ్రికల్చరల్ ఎక నామిక్స్ అవార్డును 2023 ఏడాదికి జయతీఘోష్క బహూకరించనున్నారు.

అరుణ్ సుబ్రమణియన్

సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (ఎస్ఓఎన్ఎ) జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ నియా మకానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
→ ఈ పదవి చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా సు ||బ్రమణియన్ నిలవనున్నారు. ఈయన కంప్యూటర్ సైన్స్ చేసి, కొలంబియా లా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు.

తెలంగాణకు మరో రెండు పురస్కారాలు

తెలంగాణ దేశంలో వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ రా ంగా ఆవిర్భవించింది.
→ గ్రామీణ స్వచ్ఛ సర్వే క్షణాలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

సావిత్రి, నాగిరెడ్డికి అవార్డులు

మహానటి సావిత్రి, విజయా ప్రొడక్షన్స్ అధినేత బి.నాగిరెడ్డికి ప్రకటించిన ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయచా ముండేశ్వరికి, విశ్వనాథరెడ్డిలకు బాలకృష్ణ అందజేశారు.

తేజస్ లో స్వదేశీ పవర్ టేకాఫ్ షాఫ్ట్

భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తే లికపాటి యుద్ధ విమానం (తేజస్) స్వదేశీ పవర్ టేకాఫ్ (పీటీవో) షాఫ్ట్ తొలిసారి గగనవిహారం చేసింది.
→ పీటీవో షాఫ్ట్, చాలా కీలక సాధనం. విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్బాక్స్కు బదిలీ చేస్తుంది.

చైనా ప్రధానిగా లీ చియాంగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కు అత్యంత వి. శ్వసనీయుడైన లీ చియాంగ్ ఆ దేశ నూతన ప్రధానిగా మంత్రిగా ఎన్నికయ్యారు.
→ గత పదే ళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

95th ఆస్కార్ అవార్డులు

లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవా ర్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
→ 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' ఉత్తమ చిత్రంగా నిలవగా, డానియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ ఈ సినిమాకు 'ఉత్తమ దర్శ కుడి'గా అవార్డును గెలుచుకున్నారు.
→ మిషెల్ యో 'ఉత్తమ నటి' అవార్డును, 'ది వేల్' చిత్రంతో బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

ప్రపంచంలోనే బెస్ట్ విమానాశ్రయం సింగపూర్ లోని 'ఛాంగి'

అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యు త్తమ విమానాశ్రయంగా నిలిచింది.
→ ఖతార్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్

కేంద్ర ప్రభుత్వం తెలంగా ణతోపాటు మరో ఆరు రాష్ట్రాలకు మెగా టెక్స్ టైల్ పార్కులు ప్రకటించింది.
→ ఈ విష యాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
→ కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
→ ఏడిం టిలో మూడు దక్షిణాది రాష్ట్రాలు ఉండటం విశేషం.
→ "పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు 5 ఎఫ్ (ఫామ్ ఫైబర్-ఫ్యాక్టరీ - ఫ్యాషన్-ఫారిన్) విధానంతో జౌళిరంగానికి ఊతమిస్తాయి.
→ తెలంగాణ, తమిళనాడు, కర్ణా టక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్త రప్రదేశ్ లో మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాయి

లింగాలఘనపురంలో వరి విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు

రాష్ట్రంలో లక్షల మంది రైతులు వరినే ప్రధానంగా సాగు చేస్తారు. ఈ పంటను చీడపీడలు, అగ్గి తెగులు వేధిస్తున్నాయి.
→ రైతుల సమస్యలను తీర్చే క్రమంలో... అధిక దిగుబడితోపాటు సేంద్రియ విధానంలో సాగుకు ఉపయుక్తమైన మేలి రకం వంగడాలను తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్ ఆర్ఎ) కృషి చేస్తోంది.
→ అందులో భాగంగా జనగామ జిల్లా లింగాలఘనపు రంలో రూ.2 కోట్లతో వరి విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఇప్ప టికే ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించింది.
→ ఈ కేంద్రం ఆధ్వ ర్యంలో సాగు చేసిన వంగడాలను అన్నదాతలకు చవకగా అందించనుంది.
→ వరి విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి ఏనెబావి అనే గ్రామమే కారణం.

వచ్చేఏడాది ఆఖరుకల్లా నెట్ జీరో ఎనర్జీ సంస్థగా సింగరేణి

వచ్చే సంవత్సరం ఆఖరునాటికి సింగరేణిలో రోజువారీ వినియోగా నికి సౌరవిద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేసి 'నెట్ జీరో ఎనర్జీ' సంస్థగా అవతరించనుంది.
→ ఏటా 700 మిలియన్ యూనిట్ల కరెంటును సౌరఫలకాలపై ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
→ కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఢిల్లీ నుంచి నిర్వహించిన దేశవ్యాప్త బొగ్గు కంపెనీల సమీక్ష సమావేశంలో ఈ వివ రాలను సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.
→ మొత్తం 42 బొగ్గు గనులు, 43 వేల మంది కార్మికులు నివసించే కాలనీల అవసరాల కోసం ఏటా 700 మిలియన్ యూనిట్ల కరెంటును తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి సింగరేణి కొనుగోలు చేసి వినియోగిస్తోంది.
→ ఈ ఖర్చును తగ్గించుకోవడానికి సౌరవిద్యుత్తు ప్లాంట్లను పెడుతోంది. ఇప్పటికే ఏటా 350 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది.
→ మరో 76 మెగావాట్ల సౌర ప్లాంట్లను వచ్చే జూన్ చివ రికల్లా పూర్తి చేయనున్నారు. తద్వారా 120 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్తు అందు బాటులోకి వస్తుంది.
→ రెండో దశలో 150 మెగా వాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్లను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటినుంచి మరో 230 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు.

ఆస్ట్రేలియాకు 220 టోమహాక్ క్షిపణులు

ఆస్ట్రేలియాకు 220 టోమహాక్ దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను సరఫరా చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.
→ ఇప్పటికే ఆ దేశానికి అణు జలాంతర్గాము లను సమకూర్చాలని 'ఆకస్' (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమె రికా) కూటమి నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
→ టోమహాక్ క్షిపణులను సబ్మె రైన్లు, యుద్ధ నౌకల్లో వినియోగించే అవకాశం ఉంది. చైనాను లక్ష్యంగా చేసుకొని ఈ ఆయుధాలను అగ్ర రాజ్యం సరఫరా చేస్తోంది.
→ "ఈ క్షిపణి విక్రయాలతో అమెరికా, ఇతర మిత్రదేశాల దళాలతో ఆస్ట్రేలియా సమ న్వయం చేసుకొంటూ.. ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే ఆపరేషన్లను విజయవంతంగా చేయగలదు" అని అమె రికా రక్షణ భద్రత సహకార సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
→ ఈ ఒప్పందం విలువ 89.5 కోట్ల డాలర్లు అని తెలిపింది. 2033 నాటికి తమకు మూడు వర్జీనియా శ్రేణి జలాంతర్గాములు అందుతాయని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పాట్ కాన్రే తెలిపారు.
→ అప్పటికి టోమహాక్ క్షిప ణులూ అందుబాటులో వస్తాయన్నారు.

ఎమర్జింగ్ లీడర్- 2023 అవార్డు

ఎమర్జింగ్ లీడర్- 2023 అవార్డు మ్యాను ఫ్యాక్చరింగ్ ఇంజినీర్ రష్మీ వడ్లకొండకు లభిం చింది. మార్చి 5న ఐర్లాం డ్ లో జరిగిన సమావే శంలో 2023కు ఉమెన్ మేక్ అవార్డులో ఆమె నిలిచారు.
→ ఈ అవా ర్డును 'ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్' అందజేస్తుంది.

సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ డీఐజీగా బిళ్ల ఉదయ్ భాస్కర్

సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ డీఐజీగా బిళ్ల ఉదయ్ భాస్కర్ మార్చి 6న బాధ్యతలు చేప ట్టారు.
→ ఉత్తర కాశ్మీర్ రేంజ్ బారాముల్లా డీఐ జీగా పనిచేసిన ఆయన డిప్యూటేషన్పై సీఆర్పీ ఎఫ్కు బదిలీ అయ్యారు.
→ ఏపీలోని గుంటూరు జిల్లా (కన్నవారి తోట)కు చెందిన ఆయన 2008 జమ్ముకశ్మీర్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్.

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా

మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా మార్చి 7న షిల్లాంగ్ లో ప్రమాణం చేశారు.
→ ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత సంగ్మా రెండోసారి సీఎంగా ఎన్నికయ్యారు.
→ లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్రాడ్ సంగ్మా. . అలాగే నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో ప్రమాణం చేశారు. ఆయన నాగాలాండ్ కు సీఎంగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి.

సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (ఎస్ఓఎ న్వై) జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్

సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (ఎస్ఓఎ న్వై) జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ మార్చి 7న నియమితుల య్యారు.
→ దీంతో ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా నిలిచారు. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్ చదివారు.

మాణిక్ సాహా

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా మార్చి 8న ప్రమాణం చేశారు.
→ ఆయన త్రిపు రకు సీఎంగా ఎన్నిక కావడం ఇది రెండోసారి.

రామచంద్రపౌడెల్

నేపాల్ అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్కు చెందిన రామచంద్ర పౌడెల్ మార్చి 9న ఎన్నిక య్యారు.
→ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వం లోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది.
→ 550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
→ ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది రామ్ చంద్రకు ఓటు వేశారు.

ఇరానీ కప్

ఇరానీ కప్ రెస్టాఫ్ ఇండియా జట్టు గెలుచుకుంది.
→ మార్చి 5న గ్వాలియ ర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా జట్టు మధ్యప్రదేశ్ప 238 పరుగుల తేడాతో విజయం సాధిం చింది.
→ యశస్వి జైస్వాల్ (రెస్టాఫ్ ఇండి యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ప్రైమ్ వాలీబాల్ లీగ్

" ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో అహ్మదాబాద్ జట్టు ట్రోఫీని గెలుచుకుంది.
→ మార్చి 5న కొచ్చిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అహ్మదాబాద్ 3-2తో బెంగళూరు టార్పెడోస్పై విజయం సాధించింది.

షాన్ మార్ష్

ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు మార్చి 10న రిటైర్మెంట్ ప్రక టించాడు. కానీ టీ20ల్లో కొనసాగను న్నాడు.
→ 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2019లో టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
→ 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2,265, వన్డేల్లో 2,773 పరుగులు చేశాడు.

బ్రహ్మోస్

బ్రహ్మోస్ సూపర్సానిక్ క్షిపణిని భారత నౌకాదళం మార్చి 5న విజయవంతంగా ప్రయోగించింది.
→ ముంబైకి సమీపంలో అరే బియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
→ డీఆర్డీవో దేశీ యంగా రూపొందించిన సీకర్ అండర్ బూస్టర్ పరిజ్ఞానంతో ఈ పరీక్ష నిర్వహిం చారు. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో (మ్యాక్ 2.8) ప్రయాణించగలదు.

వడాపావ్

ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో ముంబైలో పేరుగాంచిన వడాపావ్ కు 13వ స్థానం లభించింది.
→ 'టెస్ట్ అట్లాస్' అనే సంస్థ శాండ్విచ్లపై అధ్యయనం చేసి రూపొందిం చిన ఈ జాబితాను మార్చి 5న విడుదల చేసింది.

ఎంటీ - 1

కాలం చెల్లిన, భూ కక్ష్యలో తిరుగుతున్న శాటి లైట్ మేఘ ట్రోపిక్స్-1ను ఇస్రో మార్చి 7న విజయవంతంగా ధ్వంసం చేసింది.
→ భూ వాతావరణంలోకి ప్రవేశించి, దానికదే విడి పోయి పసిఫిక్ మహాసముద్రంపై గగనత లంలో కాలి బూడిదైంది.
→ యునైటెడ్ నేషన్స్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అను గుణంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
→ ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేయగల సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భార త్ కు కూడా ఉంది.
→ ఉష్ణమండల వాతావర అధ్యయనం చేయడానికి ఇస్రో ఈ శాటిలైట్ను 2011, అక్టోబర్ 12న ప్రయో గించింది.

ఎంఆర్ శామ్

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యా. లను ఛేదించే మధ్య స్థాయి ఎంఆర్ శామ్. (ఎంఆర్ ఎస్ఎం) మిసైల్ను భారత నేవీ మార్చి 7న విజయవంతంగా ప్రయోగిం చింది.
→ ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. డీఆర్డీవో, ఇజ్రా యెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్షిపణిని అభివృద్ధి చేయగా, బీడీఎల్ ఉత్పత్తి చేసింది.

నిసార్

" భూమిపై పరిణామాలను నిత్యం పరిశీలించి తక్షణం సమాచారాన్ని అందించే నిసార్ శాటిలైట్ను అమెరికా దళం మార్చి 8న ఇస్రోకు అందజేసింది.
→ దీనిలో రెండు వేర్వేరు రాడార్లు ఉంటాయి. లాంగ్ రేంజ్ రాడార్ను అమెరికా, ఎస్-బ్యాండ్ రాడారన్న భారత్ సైంటిస్టులు రూపొందించారు.
→ వీటిని అమెరికాలోని జెటాపుల్సన్ ల్యాబొరేటరీకి పంపి ఏక యూనిట్గా మార్చారు. దీన్ని వచ్చే ఏడాది ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోషల్ (ఇంపాక్ట్) సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు

హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోషల్ (ఇంపాక్ట్) సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు మార్చి 5న అందుకున్నారు.
→ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఈవోలు సభ్యులుగా ఉన్న సీఈవో క్లబ్స్ ఆఫ్ ఇండియా ఈ అవా ర్డును బెంగళూరులో 'గో బియాండ్-2023' రీట్రీట్ కార్యక్రమంలో అందజేసింది.
→ థైరోకేర్ | టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డా. ఆరోగ్యస్వామి వేలుమణి ద్వారా ఈ అవా ర్డును ఆయన స్వీకరించారు. |

తెలంగాణలో నే ఫాక్స్కాన్

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసి ద్ధిగాంచిన హోన్ హోయ్ టెక్నాలజీ గ్రూప్ నకు చెందిన 'ఫాక్స్కాన్'ను తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ యంగ్ లియూ మార్చి 6న సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా లేఖ రాసి ఇచ్చారు.
→ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగర కలాన్లో ఫాక్స్కాన్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది.
→ టీ వర్క్స్ ప్రారంభానికి వచ్చిన యంగ్ లియూ తెలం గాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభు త్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో సారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్-ఎ యిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే 'ఉత్తమ ''విమానాశ్రయం' అవార్డుకు మార్చి 6న ఎంపికయ్యింది.
→ 2022కు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల వార్షిక ప్రయాణికుల విభాగంలో ఈ అవార్డు లభిం చింది.
→ వరుసగా 9 సంవత్సరాలు ఈ ఎయి ర్పోర్ట్ గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తుంది.

శేఖర్ రెడ్డి

సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ -భారతీయ పరిశ్రమల సమాఖ్య) తెలం గాణ విభాగానికి నూతన చైర్మన్ గా సీ శేఖర్ రెడ్డి మార్చి 7న ఎంపికయ్యారు.
→ రియల్ సీఎస్ఆర్ ఎస్టేట్స్ లిమిటెడ్కు సీఎండీగా ఉన్నారు. అలాగే వైస్ చైర్మన్ గా డి సాయిప్ర సాద్ ఎంపికయ్యారు. ఈయన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.

బోయింగ్ ఫైటర్

దేశంలోనే తొలి బోయింగ్ ఫ్రైటర్ కన్వర్షన్ లైన్ (బీసీఎఫ్) హైదరాబాద్లో ఏర్పాటు కానున్నది.
→ ప్రయాణికుల విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే సదుపాయాన్నే బీసీఎఫ్ అంటారు.
→ ఈ సదుపాయాన్ని జీఎంఆర్ ఏరో టెక్నిక్ కలిసి బోయింగ్ నెలకొల్పనున్నది.
→ దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే, జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ మార్చి 10న సంతకాలు చేశారు.

అప్పుల బాధల్లో దేశాలు

ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం చీఫ్ అచిమ్ స్టెయినర్ మార్చి 5న ప్రకటించారు.
→ దీనిలో 23 దేశాలు ప్రభుత్వ ఆదాయంలో 5వ వంతు కంటే ఎక్కువ కేవలం రుణాల నిర్వహణకే చెల్లి ున్నాయని వెల్లడించారు.

చైనా రక్షణ వ్యయం

రక్షణ బడ్జెట్ను గతేడాది కంటే ఈసారి 7.2 శాతం ఎక్కువగా కేటాయించారని చైనా రక్షణ శాఖ మార్చి 5న వెల్లడించింది.
→ దీంతో రక్షణ శాఖ బడ్జెట్ 225 బిలియన్ డాలర్లకు (సు మారు రూ.18,38,537 కోట్లు) చేరింది. ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు. చైనా రక్షణ బడ్జెట్ను పెంచడం వరుసగా ఇది 8వ సారి.

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మార్చి 8న నిర్వ హించారు.
→ మహిళల సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆర్థిక విజయాలను గుర్తుచేసుకోవ డానికి, వివిధ రంగాల్లో మహిళల భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ డేని ఏటా నిర్వహిస్తున్నారు.
→ ఐక్యరాజ్యసమితి ఈ దినో త్సవాన్ని మొదటిసారి 1975లో నిర్వహించింది.
→ ఈ ఏడాది థీమ్ డిజిటల్ (DigitALL): ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ".

ఎంజైం

శుద్ధ ఇంధన ఉత్పత్తిదారుగా మానవాళికి ఉప యోగపడగల ఎంజైము కనుగొన్నట్లు ఆస్ట్రే లియాలోని మోనాష్ యూనివర్సిటీ సైంటి స్టులు క్రిస్ గ్రీనింగ్, రిస్ గ్రింటర్ మార్చి 10న వెల్లడించారు.
→ గాలిని విద్యుచ్ఛక్తిగా మార్చగల సామర్థ్యం ఉందని ప్రకటించారు.
→ మట్టిలో ఎక్కువగా లభించే మైకో బ్యాక్టీరియం స్మెగ్మా టిస్ అనే బ్యాక్టీరియంలో 'హక్' ఎంజైమ్ ఉంటుందని, అది హైడ్రోజన్ వాయువును విద్యుత్ ప్రవాహంగా మార్చగలదని వివరించారు.

మహిళా న్యాయమూర్తుల డే

అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని మార్చి 10న నిర్వహించారు.
→ న్యాయ వ్యవస్థలో కూడా మహిళలకు పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ డేని నిర్వహిస్తున్నారు.
→ ఐక్యరా జ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 2021 నుంచి నిర్వహిస్తున్నారు.

కుటుంబ వివాదాల పరిష్కారానికి కల్పతరు

కుటుంబ వివాదాలకు సంబంధించి అన్నిరకాల పరిష్కారాలకు సమీకృత కోర్టుల సముదాయమైన 'కల్పతరు' ఉపయోగపడు తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
→ అన్ని కుటుంబ న్యాయస్థానాలనూ బాద్ ఒకేచోటుకు తీసుకురావడం అభినందనీయమన్నారు.
→ పురానాహవేలిలో గతంలో ఉన్న రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్ భవనాన్ని ఆధునికీకరించి అన్నిరకాల వస తులతో ఏర్పాటుచేసిన సమీకృత కోర్టుల సముదాయం 'కల్పతరు'ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు.
→ ఈ కార్యక్రమంలో జస్టిస్ వి. రామసుబ్రమణియన్ మాట్లాడుతూ కల్పతరు అంటే ఏది కావాలంటే అది ఇస్తుందని చెప్పారు.
→ ప్రస్తుతం ఈ పేరుతో ఉన్న కోర్టు సముదాయం విడాకులు కావాలంటే విడాకులు, కలిసి జీవించి సుఖంగా ఉంటామంటే అదీ ఇస్తుందని వివరించారు.
→ దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయ స్థానాల్లోనే 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబ న్యాయస్థా నాలు లేని ప్రాంతాల్లోని కేసులనూ కలిపితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంద న్నారు.
→ తెలంగాణలో 9 వేల కుటుంబ వివాదాల కేసులు పెండింగ్లో ఉన్నా యని చెప్పారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయ వాదులది కీలకపాత్ర అని తెలిపారు.
→ సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ మాట్లాడుతూ సమాజంలో నాగరికత కుటుంబ సంబంధాల పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
→ ప్రతికూల వ్యాజ్యాల కంటే మధ్యవ ర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం మంచిదన్నారు. భవిష్యత్తులో మీడియేషన్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.
→ ఈ కోర్టు సముదాయం కక్షి దారులకు ఉపయుక్తమవుతుందని పేర్కొన్నారు.
→ సుప్రీంకోర్టు న్యాయమూర్తి || జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్ మాట్లాడుతూ కుటుంబ వివాదాలకు ప్రత్యేక కోర్టు ఉండాలన్న వాదన 1958 నుంచి ఉండగా.. 1984లో చట్టం వచ్చిందని. - 1995లో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని అన్నారు.
→ 28 ఏళ్లు పూర్త య్యాక ఇలాంటి అద్భుత భవనం ఏర్పాటైందని చెప్పారు. ప్రస్తుతం తెలంగా ణలో 36 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయని చెప్పారు.
→ ఇతర వివాదాలకంటే కుటుంబ వివాదాలు భిన్నంగా ఉంటాయన్నారు.
→ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ, సరికొత్త సౌకర్యాలతో ఈ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
→ మీడియేషన్ సెంటర్, ధ్యాన కేంద్రం, మనోవి కాస కేంద్రం, వైద్యకేంద్రం, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు.
→ ఈ భవనం రూపకల్పనకు, కార్యాచరణకు తీసుకువచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు.
→ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావుతో పాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్, నల్సార్ వైఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావు, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
→ హైకోర్టు వార్షిక నివేదిక 'న్యాయ మయూఖ'ను ఆవిష్కరించారు.
→ బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం:-
→ జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటైన 'అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ను శనివారం జస్టిస్ వి. రామసుబ్రమణి యన్, జస్టిస్ పి. ఎస్. నరసింహ, జస్టిస్ పి.సంజయ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్లు ఆన్లైన్లో ప్రారం భించారు. బమ్మెరలో జనగామ ఇన్ఛార్జి జడ్జి బాలభాస్కర్, సీనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు, నల్సార్ రిజిస్ట్రార్ విద్యుల్లతారెడ్డి, లీఫ్స్ అధ్యక్షుడు ఎం. సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుక్కి మొదలుకొని పంట మార్కె ట్లో విక్రయించడం వరకు అన్ని దశల్లో రైతుకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం పలు చట్టాలను చేసిందని, ఆ చట్టాలకు సంబంధించి లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ఉచిత న్యాయసాయం అందిస్తామని సునీల్ కుమార్ తెలిపారు.

మేడ్చల్ డీఈవోకు జాతీయ పురస్కారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారిణి ఐ. విజయ కుమారికి జాతీయ పురస్కారం దక్కింది.
→ కేంద్ర విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ / ఎన్ ఈపీఎ అందజేస్తున్న జాతీయ ఇన్నోవే షన్ అవార్డును మేడ్చల్ జిల్లా విజయకుమారి పొందింది.
→ కరోనా సమయంలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన అత్యంత ప్రభావితమైన ఇన్నోవేషన్కు జాతీయస్థాయిలో విద్యాశాఖ అధికారులకు పురస్కా రాలను అందజేస్తారు.
→ లాక్ డౌన్ కారణంగా పాఠశా లలు మూతపడ్డ సమయంలో మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం మేడ్చల్ బడి డాట్కాం వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువ చ్చారు.
→ ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాఠాలను నాణ్యంగా రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
→ ఈ వెబ్సైట్కు ఇన్నోవేషన్ పురస్కారం వరించింది. ఈనెల 23న దిల్లీలో జరగనున్న కార్యక్ర మంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా విజయకుమారి పురస్కారాన్ని అందుకోనున్నారు.

యూపీలో ‘అన్న్ పూర్తి' ధాన్యం ఏటీఎంలు

ప్రతినెలా రేషను సరకుల కోసం దుకాణాల ముందు చాంతాడంత క్యూ లైన్లలో నిలబడటం ఇకపై గతకాలపు మాట.
→ రేషన్కార్డు ఉన్న వినియోగదారులు కేవలం 30 సెకన్ల వ్యవ ధిలో బియ్యం, గోధుమలు తీసుకునేలా ఇపుడు 'అన్న పూర్తి' ధాన్యం ఏటీఎంలు వచ్చేశాయి.
→ ఉత్త ప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మూడు ధాన్యం ఏటీఎంలను ప్రభుత్వం ప్రారంభించింది. మార్చి 15న లఖ్ నవ్వూ సమీప జానకీపురంలో తొలి ఏటీఎం సిద్ధమైంది.
→ దాదాపు 150 మంది వినియోగదారులకు ఇది సేవలందిస్తోంది. దీంతో పాటు మరో రెండు ఏటీఎంలు కూడా వినియో గదారులకు అందుబాటులోకి వచ్చాయి.
→ వినియోగదారు ఈ యంత్రం మీద వేలిముద్ర వేయగానే 3 కేజీల బియ్యం, 2 కేజీల గోధుమలు వస్తాయి.

కనుమరుగవుతున్న పర్వతారణ్యాలు

భూమిపై పర్వతారణ్యాలు హరించుకుపోతు న్నాయి.
→ 2001-2018 మధ్య ఏడాదికి 52 లక్షల హెక్టార్ల చొప్పున పర్వతారణ్యాలు హరించుకుపోయాయని బ్రిటన్లోని లీడ్స్ విశ్వవి ద్యాలయ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్ర వేత్తల బృందం లెక్కగట్టింది.
→ 2000 నుంచి పుడమి మొత్తం 7.81 కోట్ల హెక్టార్ల పర్వతారణ్యాలను కోల్పోయింది. కలప కోసం చెట్లు కొట్టేయడం వల్ల 42% పర్వతారణ్య క్షయం సంభవించింది.
→ కార్చిచ్చుల వల్ల 29%, పోడు వ్యవసాయం వల్ల 15%, తాత్కాలిక, శాశ్వత సేద్యం వల్ల 10% పర్వతారణ్యాలు అదృశ్యమయ్యాయి.
→ ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవుల్లో పర్వతారణ్య క్షీణత తక్కువే. ఆగ్నేయాసియా దేశాల్లో వ్యవసాయ విస్తరణ వల్ల ఈ తరహా నష్టం పెరిగిపోయింది.
→ ప్రపంచ పర్వతార ణ్యాల క్షయంలో 42% ఉష్ణమండల పర్వతారణ్యాల్లోనే సంభవించినా అక్కడ 23% ప్రాంతాల్లో చెట్లు మళ్లీ పెరిగాయి.

వీడనున్న 'వాసన' గుట్టు!

ఆఘ్రాణ (వాసన) శక్తి గుట్టును విప్పే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
→ మానవుల్లోని ఒక రిసెప్టర్ క్రియాశీలమవుతున్న తీరుకు సంబంధిం చిన త్రీడీ చిత్రాన్ని వారు ఆవిష్కరించారు.
→ ఆహార పదార్థాల నుంచి వెలువడే వాసనలను ఆఘ్రాణించి అవి రుచికరంగా ఉంటాయో లేదో ముక్కు అంచనా వేస్తుంది.
→ నాసికలోనూ, దేహంలోని ఇతర అవయవాల్లోనూ ఉండే 400 గ్రాహకాలు వాసన శక్తిని ఇస్తాయి.
→ ఉదాహరణకు స్విస్ చీజ్ నుంచి ఘాటైన వాసన వెలు వడటానికి కారణమైన ప్రొపియనేట్ అనే మాలి క్యూల్ను పసిగట్టడానికి ఓఆర్ 512 అనే రిసె ప్టర్ తోడ్పడుతుంది.
→ క్రయో ఎలక్ట్రానిక్ మైక్రో స్కోపీ ప్రక్రియతో శాస్త్రవేత్తలు దీని త్రీడీ చిత్రాన్ని తీశారు. సాధారణంగా ఒక్క మిల్లీ గ్రాము ఓఆర్ 512 ప్రోటీన్ లభ్యమైతే కానీ దాని పరమాణు చిత్రాన్ని తీయలేము.
→ కాలిఫో ర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు మిల్లీగ్రాములో నూరో వంతుతోనే ఈ ఘనతను సాధించారు.

ఐఎస్ఎల్ ఛాంప్ ఏటీకే

ఏటికే మోహన్ బగాన్ కల తీరింది. పట్టుదల ప్రదర్శించిన ఆ జట్టు ఐఎస్ఎల్ సీజన్-9 టైటిల్ను ఎగరేసుకుపోయింది.
→ పెనాల్టీ షూటౌట్లో ఏటీకే 4-3 గోల్స్తో బెంగళూరు ఎఫ్సీని ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది.
→ నిర్ణీత సమయంలోపు రెండు జట్లూ 2-2తో సమంగా నిలిచాయి.
→ దిమిత్రి (14వ ని) గోల్తో ఏటీకే ఆధిక్యంలోకి వెళ్లగా.. సునీల్ ఛెత్రి (50వ), రాయ్ కృష్ణ (78వ) బంతిని నెట్ లోకి పంపడంతో బెంగళూరు గెలుపు దిశగా సాగింది.
→ కానీ ఆట చివర్లో దిమిత్రి (85వ) పెనాల్టీని గోల్గా మలచడంతో స్కోర్లు ఒకటయ్యాయి. అదనపు సమయంలోనూ రెండు జట్లూ సఫలం కాకపోవడంతో మ్యాచ్ షూటౌట్కు వెళ్లింది.
→ తొలి రెండు ప్రయత్నాల్లో ఏటీకే, బెంగళూరు గోల్స్ కొట్టాయి. మూడో ప్రయత్నంలో రమైర్స్ (బెంగళూరు) షాట్ని ఏటీకే గోల్కీపర్ విశాల్ అడ్డుకున్నాడు.
→ ఆపై కియాన్ స్కోరు చేయడంతో ఏటీకే 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది.
→ ఆ తర్వాత నాలుగో షాట్ను ఛెత్రి (బెంగళూరు) సద్విని యోగం చేసి స్కోరు 3-3తో సమం చేసినా.. ఆ వెంటనే మన్వీర్ బంతిని నెట్లోకి పంపడంతో మోహన్బగాన్ మళ్లీ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది.
→ ఆపై పెరిజ్ (బెంగళూరు) విఫలం కావడంతో ఏటీకే సంబరాల్లో మునిగిపోయింది.

డెల్టా భూములు సముద్రం పాలు

వాతావరణ మార్పులకు స్థానిక కారణాలూ తోడై ఈ శతాబ్దాంతానికి ప్రపంచ డెల్టా భూముల్లో అత్యధిక భాగం సముద్రంలో కలసిపోవచ్చని అమెరి కాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చ రిస్తున్నారు. డెల్టాలో భూగర్భ జలాలను, చమురు, సహజవాయు నిక్షేపాలనూ తోడివేయడం, సముద్ర తీర మడ అడవులు, ఇతర వృక్షజాలం హరించుకుపో వడం వల్ల నేల కుంగి సముద్రపు నీరు చొచ్చుకొ స్తుంది. సాధారణంగా భూతాపం సముద్ర మట్టాల పెరుగుదలకు దారితీస్తుంది. దీనికితోడు డెల్టా ప్రాంతాల్లో నేలకుంగి సముద్రం పాలవుతుందని వారు వివరించారు. చిరకాలంగా ఎగువ ప్రాంతాల నుంచి నదులు తీసుకొచ్చే ఒండ్రు మట్టి.. డెల్టాలో కొత్త భూములు విస్తరించడానికి తోడ్పడుతుంది.
→ సముద్ర మట్టాలు పెరిగినా డెల్టా ముంపునకు గురవకుండా రక్షిస్తుంది. ఇప్పుడు అదంతా పాత కాలపు మాట అయింది.
→ నదులకు ఎగువన భారీ ఆనకట్టలు, జలా శయాలు నిర్మించడం వల్ల కిందకు కొట్టుకొచ్చే ఒండ్రు మట్టి తగ్గిపోతోంది.
→ డెల్టాలోనూ కరకట్టలు, లాకుల నిర్మాణం వల్ల వచ్చే కాస్త ఒండ్రుమట్టి సువిశాలంగా పరచుకోలేకపోతోంది.
→ నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడే డెల్టా భూములు సముద్రమట్టం కన్నా కొద్ది ఎత్తులోనే ఉంటాయి.
→ ప్రపంచంలో మొత్తం భూ విస్తీర్ణంలో డెల్టా భూముల వాటా 0.5 శాతమే అయినా, అవి ప్రపంచ జీడీపీకి 4 శాతం వాటా, ప్రపంచ పంటల ఉత్పత్తిలో 3 శాతం వాటా సమకూ రుస్తున్నాయి.
→ ప్రపంచ జనాభాలో 5.5 శాతం డెల్టా ప్రాంతాల్లోనే నివసిస్తోంది.
→ వాతావరణ మార్పుల నిరోధంతోపాటు డెల్టా భూముల్లో సహజ వనరుల అతి వినియోగాన్నీ అరికట్టడం తక్షణావసరమని శాస్త్ర వేత్తలు సూచించారు.

జమ్మూ-కశ్మీర్ లో జీ-20 సదస్సు ఖాయం

జమ్మూ-కశ్మీర్ జీ-20 సదస్సు నిర్వహించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడ దని భారత్ నిర్ణయించింది.
→ ఇప్పటికే పాకిస్థాన్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చైనా, తుర్కియే, సౌదీ అరే బియాతో కలిసి లాబీయింగ్ చేపట్టింది.
→ కానీ, భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లా డుతూ.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీ-20 సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఇవి జరుగుతాయన్నారు.
→ వచ్చే వారం ఓ జీ-20 సమా వేశం అరుణాచల్ ప్రదేశ్లో కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
→ అమెరికా 12, చైనా 14, ఇండోనేసియా 25 నగరాల్లో జీ-20 సదస్సులు నిర్వహించాయని గుర్తుచే శారు.
→ జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని ప్రపంచానికి తెలియజేసేందుకు కేంద్రం జీ-20 సదస్సును వేదికగా వాడుకోవాలనుకుంటోంది.

తెలంగాణ మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత

చిరుధాన్య పంట 'లకు గుర్తింపు దక్కేలా నాలుగు దశాబ్దాలకు పైగా విశేష కృషి చేసిన పీవీ సతీష్ (77) కన్నుమూ శారు.
→ సతీష్ కర్ణాటకలోని మైసూర్లో 1945 జూన్ 18న జన్మించారు.
→ దిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టా పొంది పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభిం చారు.
→ దూరదర్శన్లో రెండు దశాబ్దాలపాటు పని చేశారు.
→ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి, అక్షరాస్యత కార్యక్రమాల రూపకల్పన, 1970లో ఉపగ్రహ బోధన టెలివిజన్ ప్రయోగం (సైట్)లో ముఖ్యపాత్ర పోషించారు.
→ 1980లో స్నేహితులతో కలిసి డీడీఎస్ ను స్థాపించారు. ప్రధానంగా దళిత మహిళల సాధికారతపై దృష్టి సారించారు.
→ మహి ళాసంఘాలు ఏర్పాటు, సాగులో వారే కీలకపాత్ర పోషించేలా చూడటం, చిరుధాన్యాల సాగును పెంచడం, అడవుల పరిరక్షణ, సేంద్రియ వ్యవ సాయం, విద్యా నైపుణ్యాల వృద్ధి తదితర అంశా లపై పనిచేశారు. పస్తాపూర్ కేంద్రంగా జహీరా బాద్ ప్రాంతంలోని 75 గ్రామాల్లో ఎందరికో అండగా నిలిచారు.
→ నిరక్షరాస్య మహిళలు విదేశా లకు వెళ్లి ప్రముఖుల సమక్షంలో అనర్గళంగా మాట్లాడేలా వారిలో స్ఫూర్తి నింపిన ఘనత ఆయన సొంతం.
→ జీవవైవిధ్యం, చిరుధాన్యాల సాగు తదితర అంశాలపై సతీష్ జాతీయ, అంతర్జాతీయ వ్యవస్థలతో కలిసి పనిచేశారు.
→ దేశంలోనే తొలిసా రిగా గ్రామీణ మహిళలే నిర్వహించే సంఘం రేడి యోను నిర్వహిస్తున్నారు.
→ డీడీఎస్ ఆధ్వర్యంలో మహిళలు దశాబ్దాలుగా చేసిన కృషికి ఐరాస 2019లో 'ఈక్వేటర్' అవార్డును అందజేసింది.

జాతీయ 'పశుసంవర్ధక ప్రాథమిక గణాంకాలు -2022'

దేశంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో నిలి చాయి.
→ దేశ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం గుడ్లలో ఏపీ నుంచి 20.41%, తెలంగాణ నుంచి 12.86% వస్తున్నట్లు కేంద్రం ఇటీవల విడుదల చేసిన 'పశుసంవర్ధక ప్రాథమిక గణాంకాలు 202 2' నివేదిక వెల్లడించింది.
→ దీని ప్రకారం 2021-2 2లో దేశంలో పాల ఉత్పత్తి 221.06 మిలియన్ టన్నులకు చేరింది. 5.29% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
→ ఈ విషయంలో రాజస్థాన్ (15.05%), ఉత్తర్ ప్రదేశ్ (14.93%), మధ్యప్రదేశ్ (8.06%), గుజరాత్ (7.56%), ఆంధ్రప్రదేశ్ (6.97%) తొలి 5 స్థానాలను ఆక్రమించాయి.
→ దేశంలో గుడ్ల ఉత్పత్తి 6.19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 2021-2 2లో 129.60 బిలియన్ల గుడ్లు దేశంలో ఉత్పత్తి అయ్యాయి.
→ ఇందులో ఆంధ్రప్రదేశ్ (20.41%), తమిళనాడు (16.08%), తెలంగాణ (12.86 %). పశ్చిమ బెంగాల్ (8.84%), కర్ణాటక (6.38%) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.

ఆర్టికల్ 32 ద్వారా తీర్పును సవాలు చేయలేరు:Supreme Court

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేయజాలరని, అది హక్కుల అమలు కోసమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
→ 2020లో 2013నాటి భూసేకరణ చట్టంపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ.. దాఖలైన పిటి షన్ను ఈ ఆర్టికల్ కింద విచారించలేమంటూ కొట్టి వేసింది.
→ 'రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అనేది హక్కుల అమలు కోసం చేపట్టాల్సిన చర్యలపైనే చర్చిస్తుంది.
→ 32(1) అనేది ఈ హక్కుల అమలు కోరుతూ సరైన ఆదేశాలివ్వాలని కోర్టును కోరేం దుకు ఉద్దేశించినది.
→ అందుకే ఈ పిటిషన్ ను తిరస్క రిస్తున్నాం' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జె.బి. పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

గువాహటి రైల్వేస్టేషన్లో ట్రాన్స్ జెండర్ టీ స్టాల్ ప్రారంభం

ట్రాన్స్ జెండర్ల సాధికారత కోసం ఈశాన్య సరి హద్దు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు.
→ ఇందులో భాగంగా గువాహటి రైల్వే స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ల టీ స్టాలు ఎన్ఎస్ఆర్ జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ప్రారంభించారు.
→ ఈ టీ స్టాల్ ట్రాన్స్ జెండర్ల ఆధ్వ ర్యంలోనే నడవనుంది.

భారత్ లో విదేశీ లాయర్ల ప్రాక్టీస్ కు అనుమతి

భారత్లో విదేశీ న్యాయవాదులు, న్యాయ సం స్థలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిర్ణయించిం ది.
→ విదేశీ చట్టాలు, వివిధ రకాల అంతర్జాతీయ న్యాయ సమస్యలు, మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో విదేశీ న్యాయవాదుల ప్రాక్టీసు అనుమతించాలని నిశ్చ యించింది.
→ ఈ నిర్ణయానికి అనుగుణంగా భార త్లో విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థల రిజి స్ట్రేషన్, నియంత్రణకు బీసీఐ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది.
→ ఈ నిర్ణయంతో భారత్లోని న్యా యవాదులకు, విదేశీ న్యాయవాదులకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందని బీసీఐ పేర్కొన్నది.

భారత్లో డియాకిన్ వర్సిటీ క్యాంపస్

ఆస్ట్రేలియాకు చెందిన డియాకిన్ విశ్వవిద్యా లయం తన మొదటి విదేశీ క్యాంపస్ ను గుజరాత్ లోని గిఫ్ట్సిటీలో ప్రారంభించింది.
→ భారత్లో ఒక విదేశీ వర్సిటీ తన బ్రాంచ్ ప్రారంభించడం ఇదే ప్రథమం. ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ ఈ శాఖను ప్రారంభించారు.
→ 'భారత్లో, భారత్లో, భారత్ కోసం' అనే భావనతో ఈ శాఖను ప్రారం భించినట్టు వర్సిటీ తెలిపింది.
→ 'ఇది నాకు చాలా సం తోషాన్ని కలిగించే విషయం. ఇది ఒక విజయం. బలమైన విద్యా, వ్యాపార, సాంస్కృతిక సంబంధా లకు ఇది ఆరంభం' అని అల్బనీస్ పేర్కొన్నారు.

ఆయుధ దిగుమతుల్లో భారత్ నంబర్-1

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదా రుగా భారత్ కొనసాగుతోంది. 2013-17తో పోల్చి నప్పుడు 2018-22లో ఈ దిగుమతులు 11 శాతం మేర తగ్గాయి.
→ రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్ట త. భిన్న సరఫరాదారుల నుంచి సమీకరణకు ప్రయత్నాలు. స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటివి.
→ ఈ తగ్గుదలకు కారణం. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేది కలో ఈ మేరకు పేర్కొంది.
→ 2018-22లో ప్రపంచం లో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనా లు నిలిచాయి.
→ అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు గా అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు ఉన్నాయి.

ప్రపంచ గాలి నాణ్యత నివేదిక

ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నట్టు ఐక్యూ ఎయిర్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.
→ స్విట్జర్లాండ్ కు చెం దిన ఈ సంస్థ 'ప్రపంచ గాలి నాణ్యత నివేదిక 'ను ఇటీవల విడుదల చేసింది.
→ 131 దేశాలలోని 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది.
→ ఈ నివేదిక ప్రకారం - ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది భారత్ 5వ స్థానంలో ఉండేది.
→ మన దేశంలో పీఎం 2.5 కాలుష్యం 53.3 మైక్రోగ్రా మ్స్/క్యూబిక్ మీటర్ ఉంది. అంటే.. డబ్ల్యూ హెచ్ ఓ నిర్ధారించిన సురక్షిత స్థాయి కంటే 10 రెట్లు అధిక కాలుష్యం ఉందని అర్ధం.
→ దేశంలోని పీఎం 2.5 కాలుష్యంలో రవాణా రంగం నుంచే 20 నుంచి చేసే శాతం వరకు విడుదలవుతోంది.

ఇండోనేషియాలో మౌంట్ మెరాపీ అగ్నిపర్వత విస్ఫోటనం

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న మౌం ట్ మెరాపీ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిం ది.
→ ఇండోనేషియాలోని 120 క్రియాశీలక అగ్నిపర్వ తాల్లో మెరాపీ ఒకటి, జావా ద్వీపంలోని యోగ్యకర్త నగరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం: వరకు ఇది విస్తరించి ఉంది.
→ ఇది గతంలో 2020, ఇదే నెలలో బద్దలైంది. ఆరు కిలోమీటర్ల ఎత్తు: వరకు బూడిద కమ్మేసింది. ఇక 2019లో ఈ అగ్నిప ర్వతం భారీగా విస్ఫోటనం చెందింది.

అరుణాచల్ ప్రదేశ్ భారతలో భూభాగమే: అమెరికా

భారత్, చైనా మధ్య ఉన్న మెక్ మోహన్ లైన్ను అంతర్జాతీయ సరిహద్దుగా భావిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
→ అమెరికన్ సేనేట్ తీర్మానం ప్రకారం ఆ రుణాచల్ ప్రదేశ్ భారత భూభాగంలోనే ఉన్నట్లు పేర్కొన్నది.
→ ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని.. ఇలాం టి దశలో మిత్ర దేశం ఇండియాకు తోడుగా ఉండా. లని భావిస్తున్నట్లు అమెరికా ఫేనేటర్ బిల్ హగేర్జి తెలిపారు.

2030 నాటికి ఇస్రో స్పేస్ టూరిజం

ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ఎక్స్, ఆమెజాన్ సహా పలు సంస్థలు. రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా... ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
→ 2030 నాటికి స్పేస్ టూరిజాన్ని అందుబాటులోకి తీసు వెస్టర్న్ ఫ్రంట్: కొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

డీఆర్డీవో సాంకేతికతతో ఔషధం : అనుమతులు మంజూరు చేసిన DCGI

వికిరణ, అణుధార్మిక అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సాంకేతికతతో అభివృద్ధి చేసిన. సంక్లిష్ట ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సం (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది.
→ ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 'ప్రష్యన్ బ్లూ'గా పేర్కొనే ఈ ఔషదాన్ని టెక్నాలజీ డెవలప్ మెంట్ ఫండ్ (టీడీఎఫ్) కింద అభివృద్ధి పరిచారు.

విద్యుత్తు సరఫరాకు సరికొత్త పదార్థం

వృథాను అరికడుతూ ఎలాంటి నిరోధకత లేకుం డా సజావుగా విద్యుత్తు సరఫరా చేయగలిగే కొత్త పదార్ధాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్కు చెందిన ప్రొఫె సర్ంగా దియాస్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృం దం ఆరుదైన లుటేటియంలో హైడ్రోజన్, కొంత మోతాదులో నైట్రోజన్ ను కలిపి ఈ సూపర్ కండ క్టింగ్ మెటీరియల్ను అభివృద్ధి చేసింది.
→ దీనికి రెడ్ ''మ్యాటర్' అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

గాలిని విద్యుత్తుగా మార్చే ఎంజైమ్

శుద్ధ ఇంధన ఉత్పత్తిదారుగా మానవాళికి ఉప యోగపడగల ఓ ఎంజైమ్లు ఆస్ట్రేలియా పరిశోధ కులు ఇటీవల కనుగొన్నారు.
→ దీనికి గాలిని విద్యుత్ శక్తిగా మార్చగల సామర్థ్యం ఉన్నట్లు తేల్చారు. మ ట్టిలో ఎక్కువగా లభించే మైకోబ్యాక్టీరియం స్మెగ్మా టిస్ అనే బ్యాక్టీరియంలో 'హక్ ఎంజైమ్ ఉంటుం ది.
→ ఇది హైడ్రోజన్ వాయువును విద్యుత్ ప్రవాహం గా మార్చగలదని పరిశోధకులు తేల్చారు.
→ వాతావ రణంలో హైడ్రోజన్ గాడత చాలా స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇది మెరుగ్గా పనిచేయగలదని నిర్ధారించారు. సహజసిద్ధ బ్యాటరీగా 'హక్ 'ను అభివర్ణించారు. భవిష్యత్తులో పవన విద్యుత్ ఆధా రిత పరికరాలను అభివృద్ధి చేసేందుకు ఇది దోహ దపడే అవకాశముందని పేర్కొన్నారు.

మూడోసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్

వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్(69) బాధ్యతలు చేపట్టారు.
→ జిన్ పింగ్ సారథ్యా నికి చైనా పార్లమెంట్ ఏకగీవ్రంగా ఆమోదం తెలి పింది.
→ దీంతో ఆయన మరో ఐదేళ్లపాటు చైనా ఆ ధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
→ గత అక్టోబర్లో పార్టీ లక పక్షల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) నాయ కుడిగా ఆయన తిరిగి ఎన్నికయ్యారు.
→ పార్టీ వ్యవస్థా పకుడు మావో జెడాంగ్ తర్వాత రెండు పర్యాయా ల కంటే ఎక్కువసార్లు అధికారంలో ఉన్న మొదటి నాయకుడిగా జీసింగ్ చరిత్ర సృష్టించారు.

సీనియర్ పాత్రికేయుడు వేద్ ప్రతాప్ వైదిక కన్నుమూత

సీనియర్ పాత్రికేయుడు, అంతర్జాతీయ వ్యవహా రాల నిపుణుడు వేద్ ప్రతాప్ వైదిక (78) కన్నుమూ శారు.
→ వైదిక్ ప్రతాప్ ప్రెస్ ట్రస్ట్ ఆప్ ఇండియా(పీ టీఐ) హిందీ విభాగానికి దశాబ్దకాలం పాటు వ్యవ స్థాపక సంపాదకుడిగా సేవలందించారు.
→ 'నవ భారత్ టైమ్స్'కు సైతం ఎడిటర్ గా పనిచేశారు. భారతీయ భాషలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న భారతీయ భాషా సమ్మేళకు చైర్ పర్సన్ గానూ సేవలు అందించారు.
→ మధ్య ఆసియా, ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ వ్యవహారాల్లో నిపు ణుడిగా గుర్తింపు పొందారు..

చైనా నది మధ్యలో 4.4 కి.మీ.ల హైవే

నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం సర్వసాధా రణం.
→ నది మధ్యలో 4.4 కిలో మీటర్ల హైవే నిర్మాణం ఊహిం చగలమా! ఈ అద్భుతాన్ని చైనా ఇంజినీర్లు చేసి చూపిం చారు.
→ 2015 నుంచి ఈ మార్గంలో వేలాది వాహనాలు రబ్రహ్మంటూ దూసుకుపోతున్నాయి.
→ జింగ్ షాన్ కౌంటీలోని గుపుచెనన్ను షాంఘై, చెంగు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయ డానికి చైనా ప్రభుత్వం నది పొడవునా పలు వంతె నలతో ఈ హైవే నిర్మించింది.
→ ఈ 'రివర్ హైవే' కు సమాంతరంగా ముందే రోడ్డు ఉంది. మరి నది మధ్యలో హైవే నిర్మించాల్సిన అవసరం ఏముందని అనుకొంటున్నారా? పాత రోడ్డును వెడల్పు చేయాలంటే కొత్తగా చాలాచోట్ల సొరం గాలు తవ్వాల్సి ఉంటుంది.
→ కొండలు బద్దలు గొట్టాలి. ఇళ్లు ఖాళీ చేయించాలి. ఈ వ్యయ ప్రయాసలతో పోల్చుకుంటే నది మధ్యలో వంతెన నిర్మించడమే సులభమని చైనా ఇంజినీర్లు భావిం చారు.
→ హుబీ ప్రావిన్స్లోని జియాంగ్జీ నది పలు వంపులు తిరుగుతూ పర్వతాల గుండా సాగు తుంది. సాధారణ హైవేతో పోలిస్తే ఈ మార్గంలో 'రివర్ హైవే' నిర్మించడం వల్ల వ్యయం బాగా తగ్గింది.
→ మొత్తానికి రూ.585 కోట్లలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. గత ఎనిమిదేళ్లలో ఈ 'రివర్ హైవే' ఓ పర్యాటక ప్రాంతంగానూ మారిపోయింది.

'గవర్నర్పేట టు గవ ర్నర్స్ హౌస్ - ఎ హిక్స్ ఒడిస్సీ' పుస్తక విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసం గంలో మార్పులు, చేర్పులు చేసి.. అసెంబ్లీలో చది విన ధైర్యం తమిళనాడు మాజీ గవర్నరు పీఎస్ శ్రీ రామమోహనరావుదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్గ ప్రశంసించారు.
→ 'ఆయన, నేను బలమైన మహిళా ముఖ్యమంత్రులున్న సమయంలో (తమిళ నాడుకు జయలలిత, పశ్చిమ బెంగాలు మమతా బెనర్జీ) రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశాం.
→ ఆర్టికల్ 176 కింద అసెంబ్లీని ఉద్దేశించి గవర్నరు ప్రసంగిం చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదిస్తే అది చదవాలి.
→ కానీ రామమోహనరావు ప్రభుత్వం పంపిన ప్రసం గంలో మార్పులు చేయొచ్చా అని సీఎంకు లేఖ రాసి ఆమె అనుమతి తీసుకుని మరీ మార్పులు చేశారు' అని పేర్కొన్నారు.
→ 'గవర్నర్పేట టు గవ ర్నర్స్ హౌస్ - ఎ హిక్స్ ఒడిస్సీ' పేరుతో రామమోహనరావు రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, హరి యాణా గవర్నరు దత్తాత్రేయ లతో కలిసి ఢిల్లీలో ధనఖడ్ విడుదల చేశారు.

మోదీ అసాధారణ నేత

రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా భారత ప్రధాని నరేంద్ర మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ ఉందని, ఆయనను చైనీ యులు అసాధారణ పురుషుడిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక 'డిప్లొ మాట్' వెల్లడించింది. ఈ మేరకు ఒక కథనాన్ని అది ప్రచురించింది.
→ మోదీ నాయకత్వంలోని భారత్ అగ్ర దేశాల మధ్య సమతూకం పాటిస్తోందని చైనా వ్యవహారాలను విశ్లేషించే జర్నలిస్టు ము షుంషాన్ అందులో పేర్కొన్నారు.
→ 'చైనీయులు సామాజిక మాధ్యమాల్లో 'మోదీ లార్షియన్' అని మోదీకి పేరు పెట్టుకున్నారు. దాని అర్థం అసాధారణ సామర్థ్యమున్న వృద్ధుడైన దివ్య పురుషుడు.
→ ఆయన మిగిలిన నేతలకన్నా విభిన్నంగా ఉంటారు' అని ఆయన విశ్లేషించారు.
→ ఆయన వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని, ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు.
→ రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో మోదీ స్నేహంగా ఉంటారనేది చైనీయుల అభిప్రా యమని షుంషాన్ వివరించారు.
→ 20ఏళ్ల నుంచీ అంతర్జాతీయ మీడియా వార్తలను తాను అందిస్తున్నానని, కానీ చైనీయులు ఒక విదేశీ నేతకు ముద్దు పేరు పెట్టడం ఎప్పుడూ లేదని పేర్కొన్నారు.
→ చైనా ప్రజల దృష్టిలో ఆయ నకు ప్రత్యేక స్థానముందని తెలిపారు. చైనాలో ట్విటర్కు పోటీగా వచ్చిన 'సైనా వీబో'లో మోదీ 2015లో చేరారు.
→ ఆయనకు 2.44 లక్షల మంది ఫాలో యర్లు ఉన్నారు. అయితే చైనా యాప్ల పై నిషేధంలో భాగంగా 2020 జులై తర్వాత ఆయన తన ఖాతాను మూసేశారు.

వాతావరణ మార్పులపై ఐరాస నివేదికకు ఆమోదం

బెర్లిన్: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన అతి కీలకమైన నివేదికకు ఆదివారం పలు దేశాలు ఆమోదం తెలిపాయి.
→ ధనిక, పేద దేశాల మధ్య కాలుష్య ఉద్గారాల లక్ష్యాలు, ముప్పు పొంచి ఉన్న దేశా లకు ఆర్థిక సాయం అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఆమోదం లభించడం గమనార్హం.
→ స్విట్జర్లాండ్ ని ఇంటర్లాకెన్ పట్టణంలో జరిగిన సదస్సులో ఈ ఆమోదం లభించింది
→ ఒప్పం దానికి ఆమోదం లభించినా ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదు.
→ నివేదిక వివరాలను ఐరాస వెల్లడించనుంది.

హ్యాపీనెస్ ర్యాంకుల్లో మరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానం

ఫిన్లాండ్ ఎప్పటి మాదిరిగానే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. ఆరుదఫాలుగా అదే స్థానంలో కొనసాగుతోంది.
→ 'అంతర్జా తీయ ఆనంద దినోత్సవమైన సోమ వారం(మార్చి 20న) యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తాజా ర్యాంకులను విడుదల చేసింది.
→ ప్రపంచంలోని 150కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకునే గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది.
→ సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్లాండ్ (3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. భారత్ 125వ స్థానంలో నిలిచింది.
→ అయితే, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇండో-పసిఫిక్ శాంతికి భారత్-జపాన్ భాగస్వామ్యం కీలకం

ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ద పాలనపై గౌరవం ఆధా రంగా భారత్, జపాన్ల మధ్య వ్యూహాత్మక భాగ స్వామ్యం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
→ దీన్ని మరింత విస్తరించుకోవడం రెండు దేశాలకూ ప్రయోజనకరమే కాక, ఇండో-పసి ఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు కీలకమన్నారు.
→ భారత్ పర్యటనలో భాగంగా సోమవారం దిల్లీకి వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో చర్చలు జరిపిన అనంతరం మోదీ ఈ మేరకు పేర్కొ న్నారు.
→ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో మోదీ, కిషిద భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
→ శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకో వడంపై వారిద్దరూ ప్రధానంగా చర్చించారు.
→ చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో పెరుగుతున్న ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంపైనా వారు సమాలోచనలు జరిపారు.
→ భారత్ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుతోపాటు జపాన్ సార థ్యంలో నిర్వహించనున్న జీ సమావేశాల్లో ప్రపంచ సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవడానికి కల సికట్టుగా పనిచేయాలని మోదీ, కిషిద తీర్మానించు కున్నారు. మే నెలలో జపాన్ లోని హిరోషిమాలో జరిగే జీ7 సమావేశాలకు మోదీని ఆహ్వానించగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు కిషిద చెప్పారు.
→ ఈ చర్చల సందర్భంగా ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ రుణంలో నాలుగో విడతగా 300 బిలియన్ల యెన్ల (రూ.18 వేల కోట్లు) నిధుల జారీకి సంబంధించి రెండు దేశాలు పత్రాలు మార్చుకున్నాయి.

→ జీ20 నేపథ్యంలో ఈ భేటీ ప్రత్యేకం: మోదీ:-
→ ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించి నట్లు మోదీ తెలిపారు. "వచ్చే అయిదేళ్లలో భార తో జపాన్ రూ.3.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని గత ఏడాదిలో లక్ష్యాన్ని విధించుకున్నాం.
→ ఆ దిశగా జరిగిన పురోగతి సంతృప్తికరంగా ఉంది" అని మోదీ తెలిపారు. జీ20కి భారత్, జీ7 కు జపా న్ అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఈ బేటీ జర గడం ప్రత్యేకమని మోదీ అన్నారు.

→ కిషిదకు మోదీ ప్రత్యేక కానుక :-
→ జపాన్ ప్రధాని కిషిదకు మోదీ ప్రత్యేక కానుక ఇచ్చారు. చందనపు చెక్క పై చెక్కిన బుద్ధుని ప్రతిమను బహూకరించారు.
→ బోధి వృక్షం కింద బుద్ధుడు ధ్యానముద్రలో ఉన్న ఈ కళాకృతి. వెనుక కర్ణాటక సంపన్న వారసత్వం ఉందని అధికారులు తెలిపారు.
→ కర్ణాటకలో కళా కారులు చందనపు చెక్కపై చేతులతోనే ప్రత్యేక నైపుణ్యంతో బొమ్మలను చెక్కే సంప్రదాయం ఉందని వివరించారు.
→ బాల్బోధి మొక్కను కూడా కిషిదకు మోదీ బహూకరించారు.

→ భారత్ పాత్ర కీలకం: కిషిద
→ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలకు భారత్ ఎంతో కీలకమని కిషిద ఉద్ఘాటించారు.
→ దిల్లీలో దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి తన ప్రణాళికను ఆవిష్క రించిన అనంతరం ఈ మేరకు ప్రసంగించారు.

2025 నాటికి క్షయ లేని తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యాచరణను రూపొం దించింది.
→ 2022లో చేపట్టిన కార్యక్రమంలో 90 శాతం లక్ష్యం సాధించినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
→ క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం కొనసాగు తోందని ప్రభుత్వ, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో కార్యాచరణ అమలు చేస్తు న్నామని అధికారులు తెలిపారు.
→ రాష్ట్రంలో 2020లో 63059 మంది క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించగా 55,892 మందికి విజయవంతంగా చికిత్స పూర్తయిందని, 2021లో 61047కు గాను 55,133 మందికి, 2022 జనవరి నుంచి 34,941 మందిని గుర్తించగా 30,092 మందికి చికిత్స పూర్తయినట్లు పేర్కొన్నారు.
→ క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత యూడీఎసీ పరీక్షలతో పాటు 59,677 మందికి నిక్షయ పోషణ యోజన కింద నెలకు రూ.500 చొప్పున అందజేస్తున్నారు.

వాతావరణ మార్పులపై సమయం మించిపోతోంది

పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న కీలక లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు అందుకోలేకపోవచ్చని వాతావరణ మార్పులపై ఏర్పడ్డ ఐరాస కమిటీ- ఐపీసీసీ హెచ్చరించింది.
→ అయితే ఈ దశాబ్దంలో శరవేగంగా చేపట్టే ఉపశమన చర్యలతో ఈ పరిస్థితిని నివారించొచ్చని తన తాజా సెంథసిస్ రిపోర్ట్' లో పేర్కొంది.
→ 15 డిగ్రీల సెల్సియస్ లక్ష్య సాధనకు అన్ని రంగాల్లోనూ గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపు వేగంగా, నిరంతరంగా సాగాలని తేల్చిచెప్పింది.
→ "ఇప్పుడు మనం. చర్యలు చేపడితే.. అందరికీ ఆవాసయోగ్య పరిస్థితులను కల్పించొచ్చు" అని ఐపీసీసీ చైర్పర్సన్ హోసంగ్ లీ పేర్కొన్నారు.
→ మానవాళి చాలా పలుచటి హిమఫలకం పై ఉందని, అది కూడా వేగంగా కరిగిపోతోందని ఐరాస జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు.
→ "ఇది ఒక టైమ్ బాంబ్ లాంటిది. సమయం మించిపోతోంది. వాతావరణ కార్యాచర ణలో పెద్ద ముందడుగు వేస్తే 15 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని సాధించొచ్చు" అని పేర్కొన్నారు.
→ ధనిక దేశాలు 2040 నాటికి నెట్ జీరో' ఉద్గార స్థాయిని సాధించాల న్నారు.
→ వర్ధమాన దేశాలు 2050లో ఈ లక్ష్యాన్ని అందు కోవాలని కోరారు. 'ఓఈసీడీ' దేశాలు 2030 కల్లా బొగ్గు వినియోగాన్ని ఆపేయాలని, మిగతా దేశాలు 2040 కల్లా ఆ లక్ష్యాన్ని అందుకోవాలన్నారు.
→ ఈ నివేదికను భారత్ స్వాగతించింది.
→ వనరులను ఆచితూచి వినియోగించా లన్న ప్రధాని మోదీ దార్శనికతకు ఇది అద్దం పడుతోం దని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు.
→ వాతావరణ కార్యాచరణకు అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్ధమాన దేశాలకు అందుతున్న నిధులు ఏ మాత్రం సరిపోవన్నారు.

→ ఐపీసీసీ నివేదికలోని అంశాలివీ:-
→ ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కుటుంబాల తలసరి కర్బన ఉద్గారాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కుటుంబాలు వెలువరించే ఉద్గారాల్లో వీరి వాటా 35-45 శాతంగా ఉంది.
→ ఈ జాబితాలో కింది స్థాయిలో ఉన్న 50 శాతం కుటుంబాలు కేవలం 13-15 శాతం ఉద్గా రాలను వెలువరిస్తున్నాయి.
→ భూతాపంలో పెరుగుదలకు శిలాజ ఇంధనాల వినియో గమే ప్రధాన కారణం.
→ 2019లో ప్రపంచ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో 79 శాతం.. ఇంధనం, పరిశ్రమలు, రవాణా, భవనాల నుంచే వచ్చాయి. వ్యవసాయం, అడవులు, ఇతర రంగాల వాటా 21 శాతం.
→ వాస్తవ అవసరాలకు అనుగుణంగా వర్ధమాన దేశాలు, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమూహాలకు వాతా వరణ కార్యాచరణ నిధులను ధనిక దేశాలు అందించాలి.
→ 15 డిగ్రీల లక్ష్యాన్ని సాధించాలంటే 2030 నాటికి కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించాలి.

ఉత్తర కొరియా డమ్మీ అణ్వాయుధ ప్రయోగం

డమ్మీ అణ్వాయుధంతో కూడిన క్షిపణిని ప్రయోగించామని ఉత్తర కొరియా వెల్లడిం చింది.
→ దక్షిణ కొరియా పై అణ్వస్త్ర దాడి ఎలా చేయాలనే అంశాన్ని పరీక్షించే దిశగా దీన్ని చేపట్టింది.
→ అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర సిస్తూ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
→ శత్రువుల దూకుడు నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతను మెరుగుపర చుకోవాలని ఉత్తర కొరియా అణ్వస్త్ర బలగాలను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు.
→ విన్యాసాల్లో భాగంగా అమెరికాకు చెందిన బీ-1బీ బాంబర్ విమానాలు ఎగరడానికి సుమారు గంట ముందు ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి స్వల్పశ్రేణి క్షిప ణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ సైనిక దళాలు గుర్తించాయి.
→ డమ్మీ అణ్వాయుధం కలిగిన ఈ క్షిపణి సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయా ణించి.. సముద్రంలో లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతానికి 800 మీటర్ల ఎగువన విస్ఫోటం చెందిందని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
→ దీని ద్వారా అణ్వాయుధ విస్ఫోట నియంత్రణ సాధ నాలు, వార్హెడ్ డిటోనేటర్ల సమర్థతను పరీక్షించినట్లు పేర్కొంది.
→ అమెరికా, దక్షిణ కొరియాలకు ఇది తీవ్ర హెచ్చరిక అని స్పష్టం చేసింది.
→ ఉత్తర కొరియా అధి నేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె, సీనియర్ సైనిక అధికారులతో కలిసి ఈ క్షిపణి ప్రయోగానికి హాజరయ్యారు.
→ అమెరికా, దక్షిణ కొరియాలు మార్చి 13న ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించాయి.
→ వీటిని వ్యతిరేకిస్తున్న ఉత్తర కొరియా.. క్షిపణి ప్రయో గాలను ముమ్మరం చేసింది. మొత్తంగా ఈ నెలలో చేప ట్టిన ఐదో అస్త్రపరీక్ష ఇది.
→ ఈ దేశం 2022లో రికార్డు స్థాయిలో 70 క్షిపణులను పరీక్షించగా.. ఈ ఏడాది ఈ ఇప్పటివరకు 20 ప్రయోగించింది.
→ ఉత్తర కొరియా ఇటీ వల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన నేప థ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసరంగా సమావేశమైంది.

కొవిడ్ చికిత్స మార్గదర్శకాలను సవరించిన కేంద్రం

కొవిడ్-19 బాధితులకు చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ వాడొ ద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
→ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు పరీక్షల్లో తేలితే మాత్రమే వాటిని ఉపయోగించాలని నిర్దేశిస్తూ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
→ లోపినవిర్-రిటోనవిర్, హైడ్రాక్సీ క్లోరో క్విన్, ఐవరెమెక్టిన్, మోల్నుపిరవిర్, ఫావిపిరవిర్, అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ మందులను వాడొద్దంది.
→ దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు ఆదివారం 1000, సోమవారం 918 నమోదయ్యాయి. మొత్తంగా క్రియాశీలక కేసులు 6,350 ఉన్నాయి.
→ కొవిడ్-19 పై ఎయిమ్స్/ఐసీఎంఆర్ ప్రతినిధులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ జనవరి 5న సమావేశమైనప్పుడు ప్లాస్మా థెరపీని సైతం వద్దని వైద్యులకు సూచించింది.
→ అయితే మధ్యస్థ, తీవ్ర కేసుల్లో మాత్రం రెమిడెసివిర్ వాడొచ్చని, అది కూడా లక్షణాలు బహిర్గతమైన 10 రోజుల్లోనే ఉపయోగించాలని సూచించింది.
→ ఆక్సిజన్ అవసరం లేకుండా, ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారికి అయిదు రోజులకంటే అధికంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉన్నట్లు భావించడంలేదంది.
→ లక్షణాల తీవ్రత పెరిగి, ఐసీయూలో చేర్చాల్సి వస్తే మాత్రం టొసిలిజుమాబ్ మందును 24-48 గంటల్లో వాడొచ్చని కేంద్రం సూచించింది.

జనంలోకి 'జి-20 సన్నాహక సదస్సుల' లక్ష్యాలు

జి-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో జన భాగ స్వామ్య కార్యక్రమాలకు విశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
→ ఈ నెల 28, 29వ తేదీల్లో జరిగే సదస్సులకు 45 దేశాలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
→ ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సదస్సుల లక్ష్యాలు ప్రజల్లోకి వెళ్లేందుకు మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వ హించనున్నారు.
→ ఉదయం 5.30 గంటలకు 'యోగా ఆల్' పేరుతో వుడా, జీవీ ఎంసీ, సెంట్రల్ పార్కులలో యోగా తరగతులు నిర్వహించనున్నారు.
→ 22న విద్యార్థులతో 'మాక్-జీ20 కాన్ క్లేవ్' పేరుతో సదస్సు, 24న సాగరతీర స్వచ్ఛత పేరుతో బీచ్ క్లీనింగ్, 25న చిత్రలేఖనం (ఆర్ట్ కాంటెస్ట్) పోటీలు, 26న వైజాగ్ సిటీ మారథాన్, వైజాగ్ కార్నివాల్ పేరుతో కూచిపూడి, వీరనాట్యం, థింసా, కోలాటం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
→ మరో వైపు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పర్యాటకశాఖ సంయుక్తంగా సుమారు రూ.150 కోట్లతో నగరంలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

కలుషిత ఆహారాన్ని గుర్తించే అతి చిన్న సెన్సార్!

ఆహారం కలుషితమైన విషయాన్ని గుర్తించే ఒక అతి చిన్న, చవకైన సెన్సార్ను ఖెండ్లియూ చవాంగ్ అనే పరిశోధకురాలు తాజాగా అభివృద్ధి చేశారు.
→ నాగాలాండ్కు చెందిన ఆమె, అమెరికాలోని టెక్సాస్లో గల సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో పీహెచీ చేస్తున్నారు.
→ యూనివర్సిటీ తరపున విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె తన ఆవిష్కరణ గురించి వివరించారు.
→ "సాధారణంగా పరిశ్రమలు కలుషిత ఆహారాన్ని గుర్తించేందుకు పెద్ద సెన్సార్లను వినియోగిస్తుంటాయి.
→ అందువలన అన్ని రకాల ప్యాకేజ్డ్ పదార్థాలకు వాటిని వాడటం కుదరదు. కానీ నేను రూపొందించిన సెన్సార్ కేవలం రెండు మిల్లీమీటర్ల పొడవు, 10 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.
→ ప్రస్తుత ప్లాస్టిక్ ప్యాకేజింగ్ విధానాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. వైర్ లెస్ రేడియో తరంగాలను గుర్తించే పరికరంలా ఇది పనిచేస్తుంది.
→ విమానాశ్రయాలు, హార్బర్లు, సూపర్ మార్కెట్ల వంటి చోట్ల ఏర్పాటు చేసే చెప్పాయింట్ల ద్వారా ఆహార ప్యాకేజీ వెళ్లినప్పుడు ఈ సెన్సార్ సహాయంతో వాటిని స్కాన్ చేసి వాటిలోని పీహెచ్ స్థాయుల్ని కనుగొనవచ్చు.
→ ఈ స్థాయులు ఎక్కువగా ఉంటే ఆహారం పాడైనట్లే. ఇలాంటి విధానంలో పంట పండిన లేదా తయారైన చోటి నుంచి వినియోగదారుడి ఇంటివరకూ కేవలం తాజా ఆహార పదార్థాలు మాత్రమే చేరేలా జాగ్రత్తపడవచ్చు.
→ ఆహార వృథాను సైతం దీని ద్వారా అరికట్టవచ్చు. నా సొంతరాష్ట్రమైన నాగాలాండ్లో జరిగే ఆహార వృథా నన్ను ఈ దిశగా ఆలోచింపచేసింది.
→ అత్యంత తక్కువ ఖర్చుతోనే ఈ సెన్సార్ను రూపొందించవచ్చు" అని చవాంగ్ స్పష్టం చేశారు.
→ ఈ సెన్సార్ ఆవిష్కరణకు గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్(ఐఈఈఈ) పోటీలో ఆమెకు అవార్డు లభించడం విశేషం.

ఆసియా అపర కుబేరుడు అంబానీ

అంతర్జాతీయ అగ్రగామి 10 మంది కుబేరుల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఎఐఎల్) చైర్మన్ ముశ్ అంబానీ ఒక్కరే ఉన్నారు.
→ భారత్ తో పాటు ఆసియా అపర కుబేరుడుగా కూడా ఉన్న | అంబానీ 82 బిలియన్ డాలర్ల నికర సంపదతో, "ది 2023 ఎండిఎం హురున్ అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 9వ స్థానం పొందారు.
→ అంబానీ సంపద విలువ ఏడాది క్రితం కంటే 20% (21 బిలియన్ డాలర్లు) తగ్గినా, అదానీ సంపద విలువ అంతకంటే ఎక్కువగా క్షీణించడంతో, దేశీయ కుబేరుల్లో మళ్లీ ఆగ్రస్థానాన్ని పొందారు.
→ ముకేశ్ అంబానీ 20 ఏళ్ల నేతృత్వంలో ఆర్ఎస్ఐఎల్ ఆదాయాలు 17 రెట్లు, నికరలాభం 20 రెట్లు పెరిగాయి.
→ హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరవ్వ కముందు, గౌతమ్ అదానీ అంతర్జాతీయ సంపన్నుల జాబి తాలో రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి గ్రూప్ కంపె నీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపదా కరిగిపోయింది.
→ భారత్లో గత ఏడాది కుబేరుల సంఖ్య 15 శాతానికి పైగా పెరిగి 187కు చేరింది. ఇందులో ముంబయిలో 66 మంది నివసిస్తున్నారు.
→ అంతర్జాతీయంగా ఉన్న భారత ఆదానీ సంతతి కుబేరులనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 217గా ఉంది.
→ అత్యధిక సంఖ్యలో కుబేరులు ఉన్న దేశంగా చైనా నిలిచింది. భారత్ కంటే 5 రెట్లు అధికంగా కుబేరులు చైనాలో ఉన్నారు.

స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభాలో 26 శాతం మంది | స్వచ్ఛమైన తాగునీరు పొందలేకపోతున్నారని, 46 శాతం మందికి కనీస పారిశుద్ధ్యం అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) వెల్లడించింది.
→ 45 ఏళ్ల తర్వాత జలవనరులపై మొదటిసారిగా ఐరాస సుదీర్ఘ సదస్సు నిర్వహించింది. ఆ అంశాలను ప్రస్తా విస్తూ 'ఐరాస ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2023’ ను విడుదల చేసింది.
→ 2030లోగా ప్రపంచ జనాభా మొత్తం శుద్ధ జలం, పారిశుద్ధ్యాన్ని పొందాలన్న లక్ష్యా లను చేరుకోవడానికి, ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది.
→ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి 600 బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్లు అవసరమని నివేదిక ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ కానర్ వెల్లడించారు.
→ ముంచుకొస్తున్న నీటి ఎద్దడి :-
→ పర్యావరణ మార్పుల కారణంగా మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియాలతో పాటు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొం టాయని, ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లో ఉన్న పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాలు దుర్భర భవిష్యత్తు వైపు పయనిస్తున్నాయని నివేదిక హెచ్చరిం చింది.
→ సగటున ప్రపంచ జనాభాలో 10 శాతం మంది కటిక నీటి కొరత ఉన్న దేశాల్లో నివసిస్తుండగా, 350 కోట్ల మంది ప్రజలు ఏడాదికి కనీసం ఒక నెల నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నివేదిక ఒకటి వెల్లడించింది.

పన్ను.. ఆదాయం.. వివరాలన్నీ యాప్లో అందుబాటులోకి 'ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్ '

పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మొబైల్ యాప్ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది.
→ 'ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్ పేరుతో గూగుల్ ప్లే, యాప్ స్టోర్ లో ఉన్న ఈ యాప్ను ఉచితంగానే వినియోగించుకోవచ్చు.
→ ఈ మొబైల్ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇన్ఫ ర్మేషన్ స్టేట్మెంట్ - ఏఐఎస్), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్పే యర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ - టీఐఎస్) చూసుకోవచ్చు.
→ వేతనం ద్వారా పొందిన ఆదాయం, డివిడెండ్లు, వడ్డీ, షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలు, పన్ను చెల్లింపులు, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్), పన్ను వసూలు (టీసీ ఎస్), ఆదాయపు పన్ను రిఫండుతో పాటు జీఎస్టీ, విదేశీ చెల్లింపుల వంటివీ కనిపిస్తాయి. వీటిపై ఫిర్యాదు నమోదు చేసే వీలునూ పొందుపరచారు.
→ ఓటీపీలతో: ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక.. పాన్, పుట్టిన తేదీతో పాటు ఇన్ కంట్యాక్స్ పోర్టల్లో పేర్కొన్న మొబైల్ నెంబరు, ఇ-మెయిల్ నమోదు చేయాలి.
→ ఈ రెండింటికీ ఇన్ కంట్యాక్స్ నుంచి ఓటీపీలు వస్తాయి. వీటిని అధీ కృతం చేశాక, 4 అంకెల పిన్ ఏర్పాటు చేసుకుని, యాప్ను వాడుకోవచ్చు.

ఏడాదంతా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకులకు అనుమతి

రాష్ట్రపతి దక్షిణాది విడి దిగా పేరొందిన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సంద ర్శనకు సిద్ధమైంది. ఏడాదంతా తిలకించేందుకు వీలుగా అనుమతి కార్యక్ర మాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాదిని పురస్కరించుకొని లాంఛనంగా ప్రారంభించారు.
→ దిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ఆమె కార్యక్రమాన్ని ఆరంభించగా... గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ శాంతికు మారి రాష్ట్రపతి నిలయంలో హాజరయ్యారు.
→ ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లా డుతూ.. ఆహ్లాదాన్ని అనుభవించడంతోపాటు స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల త్యాగాలను ఈ తరం పిల్లలు, యువకులకు తెలిపేందుకు సందర్శన కార్యక్రమానికి అనుమతి ఇచ్చామన్నారు.
→ అనంతరం ఆమె జైహింద్ ర్యాంప్, జాతీయ పతాక పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
→ రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే వారికి అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
→ ఆర్ట్ గ్యాలరీ, కోర్టర్డ్ ప్రాంతాలను నవీకరిం చింది. గతంలో ఏడాదికి 15 రోజులు మాత్రమే సందర్శనకు అనుమతి ఉండగా.. మార్చి 23 నుంచి సోమవారాలు, సెలవు రోజులు మినహా ఏడా దిలో మిగతా అన్ని రోజుల్లోనూ సందర్శించొచ్చు. http://visit.rashtra- pathibhavan.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి.
→ భార తీయులకు రూ.50, విదేశీయులకు రూ.250గా ధర నిర్ణయించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.
→ తొలిసారిగా బుధవారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు.

ట్రామాకేర్ వ్యవస్థ సత్ఫలితాలు

రోడ్డు ప్రమాదాల్లో క్షతగా త్రులకు సత్వరం చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడే 'ట్రామాకేర్ వ్యవస్థ' తమిళనాడులో ఆదర్శంగా పనిచేస్తోంది.
→ దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎక్కువమంది చనిపోతున్న ఆ రాష్ట్రంలో అయిదేళ్ల క్రితం ప్రారంభించిన వ్యవస్థ సత్ఫలితాలి స్తోంది.
→ రైట్ పేషెంట్, రైట్ సెంటర్, రైట్ టైమ్ అనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
→ ప్రమాదాల సంఖ్య 2.27 శాతం పెరిగినా మరణాల్లో 1.35 శాతం తగ్గించగలిగినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
→ ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరుకునే సమయం గతంలో 18.09 నిమిషాలు కాగా తాజాగా 13.51 నిమి షాలకు తగ్గించగలిగినట్లు పేర్కొంది.
→ ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్ అవర్లో) అత్యవసర చికిత్స అందిస్తే 54 శాతం నుంచి 90 శాతం మంది ప్రాణాలను కాపా డవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

శక్తిమంతమైన న్యూట్రినోల ఆవిష్కరణ

దిల్లీ: శాస్త్ర పరిశోధనలో తొలిసారిగా ఓ పార్టికిల్ కొలైడర్ అత్యంత శక్తిమంతమైన న్యూట్రినో కణాలను వెలువరించింది.
→ రెండు కణ పుంజాలు ఒకదానితో ఒకటి ఢీకొనగా న్యూట్రినోలు వెలువడ్డాయని అంతర్జాతీయ శాస్త్ర జ్ఞుల బృందం తెలిపింది.
→ జెనీవాలోని సెర్న్లో నిర్వహించిన ఫార్వార్డ్ సెర్చ్ ఎక్స్ పెరిమెంట్ (ఫేజర్) ద్వారా వీటిని కనుగొన్నారు.
→ అంతర్జా తీయ శాస్త్రజ్ఞులు సెర్న్ లోని లార్జ్ హేడ్రాన్ కొలై డర్ ఫేజర్ను ఏర్పాటు చేశారు. విశ్వంలో అత్యధికంగా కనిపించే కణాలే న్యూట్రినోలు. వీటిని 1956లో కనుగొన్నారు.
→ అప్పటి నుంచి తక్కువ శక్తి గల న్యూట్రినోలే పరిశోధనలకు లభ్యమవుతున్నాయి.
→ తాజాగా ఫేజర్ కనుగొన్న న్యూట్రినోలు ప్రయోగశాలలో ఇంతవరకు ఎన్నడూ లేనంత అధిక శక్తి కలిగిఉన్నాయి.
→ అవి అంతరిక్షంలో సుదూరం నుంచి భూమిని తాకే న్యూట్రినోలను పోలి ఉన్నాయి. నక్షత్రాలు మండే విధం గురించి న్యూట్రినోల ద్వారా తెలు సుకోవచ్చు.

ధూమపానాన్ని మాన్పించే సిగిబడ్

ధూమపాన దురలవాటును | మాన్పించే సిబడ్ పరికరాన్ని అందుబాటు లోకి తీసుకొచ్చారు
→ ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి ప్రతీక్ శర్మ. ఈ పరికరం ప్రపం చంలోనే మొట్టమొదటిదని చెబు తున్నారు.
→ సిగిబడ్.. సిగరెట్ పొగ నుంచి 80 శాతం తారు, నికోటిన్లను పరిహరిస్తుంది.
→ దీన్ని వాడటం వల్ల మూడు నెలల్లోనే ధూమపాన అలవాటుకు స్వస్తి చెప్పగలుగు తారని ఆయన వివరించారు.
→ మానవ ఆరో గ్యంపై వాయు కాలుష్య దుష్ప్రభావాన్ని తొల గించడానికి ప్రతీక్ ఐఐటీ ఢిల్లీలో పరిశోధనలు చేశారు.
→ దీనికోసం నానో ఫైబర్ సాంకేతిక తను అభివృద్ధి చేసి 2017లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ జాతీయ అంకుర అవార్డును స్వీకరించారు. 3నెలలపాటు సిగిబడ్లను వాడి ధూమపానానికి స్వస్తి చెప్పవచ్చునని ప్రతీక్ శర్మ చెప్పారు.

నియంత్రణ రేఖ సమీపంలో కొలువుదీరిన శారదాదేవి

జమ్మూ-కశ్మీర్ లోని కుప్వారా జిల్లా కర్నాహ్ సెక్టార్లో శారదా దేవి కొలువుదీరింది.
→ ఈ మేరకు కర్ణా టకలోని శృంగేరి శారద మఠం ఆధ్వర్యంలో నిర్మించిన 'మాతా శారదాదేవి' ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వీడియో సమావేశం. విధానంలో ప్రారంభించారు.
→ అధికరణం 370 రద్దు.. కేంద్ర పాలిత ప్రాంతంలో సంప్రదాయాలు, సంస్కృతిని వెనక్కు తెస్తోందని చెప్పారు.
→ ఈ ఆలయం ప్రారంభం కశ్మీర్లో నూతన ఉదయం ప్రారంభానికి, శారదా సంస్కృతిని పునరుజ్జీవింపజేసే తపనకు నిదర్శనమ న్నారు.
→ ఉగాది రోజున మాతా శారదా దేవి ఆల యాన్ని భక్తుల దర్శనాల కోసం ప్రారంభించాం. ఇది దేశవ్యాప్తంగా భక్తులకు శుభసూచకం. దేశం మొత్తం మీద శారదాదేవి ఆశీస్సులు ఉంటాయి" అని అమిత్ షా చెప్పారు.
→ ఈ ఆలయ ప్రారంభోత్సవంలో నేరుగా పాల్గొ నలేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
→ జమ్మూ-కశ్మీర్ తదుపరి పర్యటనలో తప్పకుండా అమ్మ వారి దర్శనం చేసుకుంటానని వెల్లడించారు.

పశ్చిమ అంటార్కిటికాలో 3 లక్షల టన్నుల మంచు మాయం

పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్ సముద్రంలో గత 25 ఏళ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటిం చారు.
→ ఈ మేరకు లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహిం చిన అధ్యయనంలో 1966-2021 మధ్య 3,331 బిలి యన్ టన్నుల హిమ ఫలకాలు కరిగిపోయాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు మిల్లీ మీటర్ల మేర పెరిగాయని వెల్లడైంది.
→ ఒక వేళ కరిగిపోయిన ఈ మంచునంతా లండన్ నగరంపై పేర్చితే 2 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, మన్హ ట్టన్పై ఉంచితే 137 ఎంపైర్ భవంతులను ఒకదానిపై ఒకటి ఉంచితే ఎంత పొడవు ఉంటుందో అంత ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.
→ "మహాసముద్రాల ఉష్ణోగ్రతలు, హిమ ఫలకాల్లో మార్పులు దీర్ఘకాలం ఉండేలా పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పశ్చిమ అంటార్కిటికా మంచు ఫలకంపై భారీస్థాయిలో మార్పులు సంభవించనున్నాయి.
→ సముద్ర మట్టాల పెరుగుదలకు అవసరమైన జలాలను ఈ మార్పులు సమకూర్చే అవకాశం ఉన్నందున మనం వాటిపై మరింతగా పరిశోధన చేయాలి" అని లీడ్స్ విశ్వవిద్యా లయానికి చెందిన ప్రధాన పరిశోధక కర్త బెంజమిన్ డేవిసన్ తెలిపారు.
→ అముండ్సెన్ సముద్ర ప్రాంతం లోని 20 హిమ శిఖరాలు ప్రపంచ మహా సముద్రాల మట్టాలు పెరగడానికి దోహదం చేస్తున్నట్లు ఈ సంద ర్భంగా శాస్త్రవేత్తలు తెలిపారు.
→ ఈ మంచు అంతా కరి గిపోయి నీరుగా మారితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఒక మీటరు కంటే ఎక్కువగా పెరుగుతా యని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

త్రీడీ ముద్రిత రాకెట్ ప్రయోగం విఫలం

త్రీడీ ముద్రిత విధానంలో ఉత్పత్తి చేసిన విడిభాగాలతో తయారైన ఓ రాకెట్ ప్రయోగం అమెరి కాలో తాజాగా విఫలమైంది.
→ 'టెర్రాన్'గా పిలిచే ఈ 110 అడుగుల ఎత్తయిన రాకెట్ను రిలేటివిటీ స్పేస్ అనే అంకుర కంపెనీ రూపొందించింది.
→ 200 కిలో మీటర్ల ఎత్తులోని కక్ష్యలో దాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. ఈ ప్రయోగంలో భాగంగా కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి బుధవారం రాత్రి రాకెట్ సజావుగానే పైకి ఎగిరింది.
→ తద్వారా తొలి దశను విజయవంతంగా పూర్తిచేసుకుంది. అయితే తర్వాతి దశ ఆరంభమైన కొద్దిసేపటికే రాకెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది.
→ టెర్రాన్లో 85 శాతాన్ని త్రీడీ ముద్రణ సాంకేతికత సాయంతో రూపొందించిన విడిభాగాలతోనే తయారుచేశారు.
→ దీని ప్రయోగ ప్రయత్నాలు ఇంతకు ముందు రెండుసార్లు విఫలమయ్యాయి.

అంతరిక్షంలో వింత గ్రహం

అంతరిక్షంలో మరో వింతగ్రహాన్ని నాసా ఆధ్వర్యంలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సైంటిస్టుల బృందం గుర్తించింది.
→ భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'వీహెచ్ఎస్ 1256 బీ' అనే ఈ యంగ్ ప్లానెట్ వయస్సు 15 కోట్ల ఏండ్లేనని అంచనా.
→ యంగ్ ఏజ్ లో ఉండటం వల్ల దీనిపై వాతావరణం ఇసుక మేఘాలతో భీకరంగా ఉందని సైంటిస్టులు చెప్తున్నారు.
→ ఇక్కడ వేడిగా ఉండే ఇసుక రేణువులు పైవైపున, చల్లగా ఉండే ఇసుక రేణువులు కింది వైపున సుడులు తిరు గుతున్నాయని, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనా క్సైడ్, మీథేన్, నీటి ఆనవాళ్లు కూడా ఈ గ్రహవాతా వరణంలో ఉన్నాయని కనుగొన్నారు.
→ ఒకే గ్రహానికి సంబంధించి ఇన్ని ఆసక్తికర విషయాలను ఒకేసారి కనుగొనడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు.
→ ఈ గ్రహం రెండు జంట నక్షత్రాల చుట్టూ తిరుగుతోందట.
→ మన సూర్యుడికి, ప్లూటోకి ఉన్న దూరంతో పోలిస్తే.. 4 రెట్లు దూరంగా ఇది తన జంట నక్ష త్రాల చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల.. ఇక్కడ దాదాపు 10 వేల ఏండ్లకు ఒక ఏడాది కాలం పూర్తి వుతుందని అంచనా వేశారు.
→ కానీ మనతో పోలిస్తే ఒక రోజుకు పట్టే సమయం మాత్రం 2 గంటలు తక్కువగా 22 గంటలు ఉంటుందని గుర్తించా రు.
→ ఈ గ్రహంపై మరింత స్టడీ చేస్తే.. ఇంకా ఆస క్తికరమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు.

మూత్రపిండ వ్యాధులకు ఇక మెరుగైన చికిత్సలు

మూత్రపిండ సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా అమె రికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు కీలక ముందడుగు వేశారు.
→ నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ) అనే ఎంజైమ్ స్థాయులను నియంత్రించడం ద్వారా కిడ్నీల వైఫల్యాన్ని అడ్డుకోవచ్చునని వారు గుర్తిం చారు.
→ ఎన్ఏడీ స్థాయులు తక్కువగా ఉంటే.. మూత్రనాళికల్లోని మైటోకాండ్రియాలు దెబ్బతిం టున్నాయని, ఫలితంగా మూత్రపిండ సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతోందని తేల్చారు.
→ నికో నమైడ్ రైబోసైడ్ లేదా నికోటినమైడ్ మోనో న్యూక్లియోటైడ్ వంటివాటిని అందించడం ద్వారా ఆ ఎంజైమ్ స్థాయులను పెంచొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ తద్వారా మైటోకాండ్రియాలకు రక్షణ కల్పించి- మూత్రపిండ వైఫల్యం, ఇతర వ్యాధు లను నివారించొచ్చని వివరించారు.
→ ఎన్ఏడీ సంబంధిత జీవక్రియ మార్పులను గుర్తించడం ద్వారా కిడ్నీ వ్యాధులను ముందుగానే పసిగట్టి చ్చని పేర్కొన్నారు.

సుదూర గ్రహంపై ఇసుక మబ్బులు

భూమి నుంచి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'వీహెచ్ఎస్ 1256 బి' అనే గ్రహంపై సుడులు తిరుగుతున్న ఇసుక మబ్బులను ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తిం చారు.
→ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ప్రతిష్ఠాత్మక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్) అందించిన డేటాను విశ్లేషించడం ద్వారా వాటిని కనుగొ న్నారు.
→ సౌర వ్యవస్థ ఆవల ఓ గ్రహంపై ఒకే సారి ఇంతటి అధిక స్థాయిలో అణువులను గుర్తించడం ఇదే తొలిసారి అని వారు పేర్కొ న్నారు.
→ 'వీ హెచ్ఎస్ 1256 బి'పై నీరు, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ల ఉనికి కూడా జేడబ్ల్యూఎ డేటాతో బయటపడిందని చెప్పారు.
→ ఈ గ్రహం తన చుట్టూ తాను ఒక భ్రమ ణాన్ని పూర్తిచేసుకునేం దుకు 22 గంటలు పడు తున్నట్లు తెలిపారు.

బెల్ తో రక్షణశాఖ రూ.3,750 కోట్ల ఒప్పందం

వైమానిక దళ(ఐఏఎఫ్) నిర్వహణ సామర్థ్యాల పెంపులో భాగంగా రక్షణశాఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)తో రూ.3,750 కోట్ల విలువైన రక్షణ పరికరాల సరఫరా ఒప్పందాలు రెండింటిని కుదుర్చు కుంది.
→ ఇందులో భాగంగా రూ.2,800 కోట్ల విలువ చేసే మీడియం పవర్ ఆరుద్ర రాడార్లు ఐఏఎఫ్ కు అందుతాయి.
→ అలాగే రూ.950 కోట్ల విలువైన 129 డీఆర్-118 రాడార్ హెచ్చరిక రిసీవర్లు సరఫరా అవుతాయి.

నేడు జగదలురు మహిళా జవాన్ల బైక్ ర్యాలీ

సీఆర్ పీఎఫ్ కు చెందిన 75 మంది మహిళా జవాన్లు బైక్ లపై దిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్ బస్తర్ జిల్లాలోని జగదల్ పుర్ పయనమయ్యారు.
→ 84వ సీఆర్పీ ఎఫ్ డే సందర్భంగా.. జగదల్పుర్లో జరగ నున్న వేడుకల్లో వీరు పాల్గొంటారు.
→ మొత్తం 1,848 కి.మీ. వీరు ప్రయాణించనున్నారు. గురువారం వరకు 1,650 కి.మీ. ప్రయా ణించి ఛత్తీస్గఢ్లోని ధమ్రికి చేరుకున్నారు.
→ ఈ నెల 9న ఇండియా గేట్ నుంచి.. వీరు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. 25న జగదలపుర్కు చేరు కుంటారు.

LIC ఛైర్మన్గా సిద్ధార్థ మొహంతి!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా ఛైర్మన్గాగా సిద్ధార్థ మొహంతిని ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఎంపిక చేసింది.
→ ఎల్ఐసీ నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల(ఎండీ) నుంచి ఛైర్మన్ ను ఎంపిక చేశారు.
→ 2023 మార్చి 23 నాటికి ఉన్న పరామితులు, మొత్తం అనుభవం ఆధారంగా నలుగురు ఎండీలను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఐబీ తెలిపింది.
→ ఈ ఏడాది మార్చి 13న చైర్మన్ ఎమ్. ఆర్. కుమార్ పదవీ కాలం పూర్తి కావడంతో, ఎల్ఐసీ ఎండీగా ఉన్న మొహంతి.. తాత్కాలికంగా ఛైర్మన్ బాధ్యతలను సైతం నిర్వర్తిస్తున్నారు.
→ ఎఫ్ఎస్ఎస్ఐబీ సిఫారసుపై ప్రధాన మంత్రి నేతృ త్వంలోని మంత్రివర్గ నియామకాల సంఘం తుది నిర్ణయం తీసుకుం టుంది.
→ ఎఫ్ఎస్ఐబీ ఎంపిక చేయకపోతే, ఇతర ఎగ్జిక్యూటివ్ తరహాలోనే ఈ ఏడాది జూన్ 30కి 60 ఏళ్ల మొహంతి పదవీ విరమణ చేయాల్సి వచ్చేది.
→ ఎల్ఐసీ చైర్మన్ మాత్రం 62 ఏళ్ల వరకు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.

తమిళనాడులో 'మగళిర్ ఉరిమై తొగై'

తమిళనాడులో మహిళలకు 'మగళీర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) పథకాన్ని ప్రకటించారు.
→ ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన చేశారు.

కాశీ విశ్వనాథుడి ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదo

కాశీ విశ్వనాథుడి ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆలయ యాజమాన్యం తెలిపింది.
→ ఇటీవల ప్రధాని మోడీ మిల్లెట్లను 'శ్రీ అన్న'గా సంబోధించారు. దీంతో కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి 'శ్రీ అన్న ప్రసాదం'గా నామకర ణం చేశారు.

ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవం

కొచ్చిలో ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారం రాష్ట్రపతి పతాకను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అందించారు.
→ దేశ వ్యూహాత్మక, మిలిటరీ, ఆర్ధిక, వాణిజ్య వ్యవహారాల్లో నౌకా దళం అత్యంత కీలకమని ఆమె అన్నారు.

లలిత కుమార్ గుప్తా

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్, ఎండీగా లలితకుమార్ గుప్తా నియమితులయ్యారు.
→ ఈయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్ (ఫైనాన్స్)గా సేవలందిస్తున్నారు. కొత్త బాధ్యతల్లో అయిదేళ్ల పాటు కొనసాగుతారు.

పీవీ సతీష్

తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా పేరుగాంచిన పీవీ సతీష్ అనారోగ్యంతో మరణించారు.
→ ప్రతీ సంక్రాంతికి 'పాత పంటల జాతర'ను ఆయన నిర్వహిస్తున్నారు.
→ చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా చేయడంలో ఆయన జీవితకాల కృషికి ఇటీవల పురస్కారం లభించింది.

టాప్ 50 పర్యాటక జాబితా

ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన 50 ప్రదే శాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది.
→ అందులో భారత్కు ఒడిశాలోని మయూర్ భంజ్, లదాఖ్ చోటు దక్కించుకున్నాయి.
→ మయూర్ భంజ్ జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదకు పెట్టింది పేరు.

లక్ష్మణ్ నరసింహన్

స్టార్ బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలను స్వీకరించా రు.
→ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ హోవర్డ్ స్కాల్ట్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు.
→ దిగ్గజ సంస్థల సీఈఓలుగా ఉన్న భారత దీంతో సంతతి వ్యక్తుల్లో ఇంకొకరు చేరారు.

వడాపావ్ కు ప్రపంచ గుర్తింపు

ముంబైలో పేరు గాంచిన వడాపావ్ స్ట్రీట్ ఫుడ్ కు ప్రపంచ గుర్తింపు లభించింది.
→ ప్రపంచంలోనే బెస్ట్ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్ కు 13వ స్థానం లభించింది.
→ మొదటి స్థానంలో తుర్కియేకు చెందిన తొంబిక్ శాండ్విచ్ నిలిచింది.

స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్

స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ర్యాంక్ అందు కున్నాడు.
→ ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్ట ర్స్ - 1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు.
→ స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్ 10లో చోటు కోల్పోయాడు.

రాణి రాంపాల్

భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం దక్కింది.
→ రాయబరేలీలోని ఓ స్టే డియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని 'రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్' పేరిట పిలవనున్నారు.
→ రాణీనే ఈ స్టేడియాన్ని ప్రారంభించింది. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమే.

రాష్ట్రానికి టెక్స్ టైల్ పార్కు

తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
→ దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు ప్రధాని తెలిపారు.

టీసీఎస్ కు ఇండస్ట్రీస్ అవార్డ్

రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు 'తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డ్ ఫర్ ఎక్స్ లెన్సీ ఇన్ ఐటీ' పురస్కారానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎంపికయ్యింది.

చంద్రయాన్ -3 ప్రీలాంచ్ టెస్ట్

చంద్రయాన్ -3లో భాగంగా నిర్వహిం చిన ప్రీలాంచ్ పరీక్ష విజయవంతమైంది.
→ చంద్రుడిపైన ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ మాడ్యూళ్లతో కూడిన లూనార్ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్-3 ప్ర యోగాన్ని జూన్లో చేపట్టే అవకాశం ఉంది.

రష్యా లో జిన్ పింగ్ పర్యటన

రష్యాలో జిన్పింగ్ పర్యటన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మూడు రోజులు రష్యాలో పర్యటించారు.
→ ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తుం డడం నేపథ్యంలో జిన్ పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరిం చుకుంది.

హ్యాపీనెస్ ర్యాంకింగ్

యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ విడుదల చేసిన సంతోష సూచీల్లో ఫిన్లాండ్ (1), డెన్మా ర్క్ (2), ఐస్లాండ్ (3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో ఉండగా, భారత్ 125వ స్థానంలో నిలిచింది.

ఇండియాలో జపాన్ ప్రధాని

భారత్-జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భా గస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు చర్చించారు.
→ భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిడాలు రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఏటీపీ మాస్టర్స్ టైటిల్

ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్-1000లో మాథ్యూ ఎల్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు.
→ ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు.

ఆసియా బిలియర్డ్స్ టైటిల్

భారత క్యూ సూపర్ స్టార్ పంకజ్ అద్వాని మరోసారి ఆసియా బిలియర్డ్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
→ ఫైనల్లో అతను 5-1తో బ్రిజేష్ దమానిపై విజయం సాధించాడు.

శిక్ష పడి అనర్హులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో రెండేళ్లు.. అంతకుమించి శిక్ష పడిన చట్టసభ సభ్యులు అనర్హత వేటుకు గురవుతారు.
→ అంతేకాదు, శిక్షా కాలం ముగిసిన తర్వాత వారు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీల్లేదు.
→ ఈ సెక్షన్ కారణంగా.. గతంలో తమ లోక్ సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలెందరో. అందులో కొంతమంది ప్రముఖు లను పరిశీలిస్తే..

→ లాలూ ప్రసాద్ యాదవ్ :-
→ దాణా కుంభకోణం కేసులో 2013 అక్టోబరు ప్రత్యేక న్యాయస్థానం లాలూను దోషిగా తేల్చింది. మరు సటి రోజే ఈ ఆర్జేడీ అధినేత లోక్ సభ సభ్యత్వంపై వేటు పడింది.

→ జయలలిత :-
→ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష 2014 తన శాసనసభ్యత్వాన్ని కోల్పో వాల్సి వచ్చింది. ఆమె తన ముఖ్యమంత్రి పద వికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

→ మహమ్మద్ ఫైజల్ :-
→ లక్షద్వీప్ నియోజకవర్గ ఎన్సీపీ ఎంపీ, ఓ హత్యా ప్రయత్నం స్థానిక న్యాయస్థానం ఈయనకు ఈ ఏడాది జనవరిలో పదేళ్ల జైలుశిక్ష విధించింది. వైజ ల్పై లోక్సభ సచివాలయం అనర్హత వేటు అబులా ఆజంఖాన్ వేసింది. తదనంతరం శిక్షపై కేరళ హైకోర్టు స్టే. విధించింది. అయినా తన అనర్హత ఉత్తర్వు లను వెనక్కి తీసుకుంటున్నట్లు లోక్సభ సచివా లయం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయ లేదని ఫైజల్ చెబుతున్నారు.

→ ఆజంఖాన్ :-
→ విద్వేష ప్రసంగాల కేసులో ఈ సమాజ్వాదీ పార్టీ నేతకు 2022 అక్టో బలో మూడేళ్ల జైలు శిక్ష పడింది. రాంపుర్ సదర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యేపై ఉత్తర్ ప్రదేశ్ శాస నసభ వేటు వేసింది.

→ అనిల్ కుమార్ సాహ్ని :-
→ ఈయన ఆర్జేడీ ఎమ్మెల్యే. కుర్హానీ శాసన సభ స్థానానికి ప్రాతి నిధ్యం వహించిన ఈ ఎమ్మెల్యేపై అక్టోబరు 2022లో బిహార్ శాసన సభ వేటు వేసింది. ఇందుకు కారణం.. ఓ మోసం కేసులో న్యాయ స్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించడమే.

→ విక్రం సింగ్ సైని :-
→ ఖతౌలీ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే: 2013 ముజఫర్ నగర్ కేసులో విక్రము రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో 2022లో ఈయన తన శాసనసభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

→ ప్రదీప్ చౌదరి :-
→ హరియాణాలోని కాల్కా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఓ దాడి కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడడంతో ఇత నిపై హరియాణా శాసనసభ వేటు వేసింది

→ కుల్లిప్పింగ్ సెంగర్ :-
→ ఉత్తరప్రదేశ్ భాజపా ఎమ్మెల్యే. ఉన్నావ్లోని బంగర్పుర్ నుంచి ఎన్ని కైన ఈయన అత్యాచారం కేసులో శిక్ష పడడంతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

→ అబ్దుల్లా ఆజాంఖాన్ :-
→ యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత. ఆజంఖాన్ తనయుడు. రాంపుర్లోని స్వార్ శాస నసభ ఎమ్మెల్యే ఓ పాత కేసులో 2023లో అబ్దుల్లాకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో అనర్హతకు గురయ్యారు.

→ అనంత్ సింగ్ :-
→ బీహార్ కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే. ఆయు ధాల కేసులో శిక్షతో జులై 2022లో శాసనసభ సభ్య త్వానికి దూరమయ్యారు.

కోహి దంపతుల 'సేవ' కొత్త ఎన్జీవోకు శ్రీకారం

స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కలిసి 'సేవ (ఎస్ఈవీవీఏ)' పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించారు.
→ అనుష్క శర్మ ఫౌండేషన్, విరాట్ కోహ్లి ఫౌండేషన్ను విలీనం చేసి ఈ కొత్త ఎన్జీవోకు శ్రీకారం చుట్టారు. మేము సేవ (ఎస్ఈవీవీఏ) ఎన్జీవోకు శ్రీకారం చుట్టాం.
→ ఎస్ఈ అంటే సెల్ఫ్ (స్వీయ), వీ అంటే విరాట్, వీ అంటే వామిక, ఏ అంటే అనుష్క అనేది దీని అర్థం. మాకు సాధ్యమైన మార్గంలో సేవ చేస్తూనే ఉంటాం.
→ ఒక్కటిగా, ఓ కుటుంబంగా.. మేం జీవించే ఈ ప్రపంచం అనే కుటుంబం కోసమే ఇది" అని విరాట్, అనుష్క సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.

సలీమాకు ఏహెచ్ఎఫ్ అవార్డు

ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) 2022 ఉత్తమ వర్ధమాన మహిళా క్రీడాకారిణి అవార్డు భారత స్టార్ సలీమా టెట్ ను వరించింది.
→ కొరి యాలో జరిగిన ఏహెచ్ఎఫ్ వార్షిక సమావేశంలో సలీమా ఈ పురస్కారాన్ని అందుకుంది.
→ "మైదానంలో నా ప్రతిభను గుర్తించినందుకు ఆసియా హాకీ సమాఖ్యకు కృతజ్ఞతలు. మా జట్టు సభ్యుల సహకారం లేకుండా ఈ గుర్తింపు వచ్చేది కాదు" అని సలీమా చెప్పింది.
→ 2016లో అరంగేట్రం చేసిన నాటి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న ఈ మిడ్ఫీల్డర్.. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నాలుగో స్థానంలో నిలవడంలో ముఖ్య భూమిక పోషించింది.
→ 2018లో యూత్ ఒలింపిక్స్లో రజతం గెలిచిన జట్టులోనూ ఆమె ఉంది. మరోవైపు హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి బోళా నాథ్ సింగ్కు 'వర్ధమాన స్పోర్ట్ లీడర్' అవార్డు లభించింది.

రాష్ట్రంలోనే తొలి రూరల్ మార్ట్ సేవలు

హనుమకొండ జిల్లా ఐన వోలు మండల కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూరల్ మార్ట్ (సూపర్ మార్కెట్) సేవలు అందుబా టులోకి వచ్చాయి.
→ నందనం కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
→ దీని నిర్వ హణ కోసం రూ.65 లక్షలతో ధాన్యం నిల్వగోదాం, రూ. 35 లక్షలతో దుకాణ సముదాయ భవనం నిర్మిం చారు.
→ అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... గ్రామీణులకు 500 రకాలకు పైగా నిత్యావసరాలను ఎమ్మార్పీ కంటే 5 శాతం తక్కువకే విక్రయించడం అభినందనీయమన్నారు.
→ సొసైటీల బలోపేతంతో రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుందని, రూరల్ మార్ట్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

'వసుధైక కుటుంబం' ప్రపంచానికి పరిష్కార మార్గం

'వసుధైక కుటుంబం' అనే భారతీయ భావజాలం ప్రపంచానికి పరిష్కార మార్గాలు చూపు తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
→ ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వారణా సిలో నిర్వహించిన 'వన్ వరల్డ్ టీబీ సమిట్ లో ఆయన ప్రసంగించారు.
→ 2025 లోగా దేశంలో క్షయను నిర్మూలించేందుకు చర్యలు చేపడుతు న్నామని పేర్కొన్నారు.

ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు

రిలయన్స్ రిటైల్ ఈషా చైర్పర్సన్ తాజాగా జెన్నెక్ట్స్ ఎం ట్రప్రెన్యూర్ పురస్కా రాన్ని దక్కించుకు న్నారు.
→ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు.
→ వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ 'సీఈవో ఆఫ్ ది ఇయర్', మ్యాక్స్ హెల్త్కేర్ సీఎండీ అభయ్ సోయి 'ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవా ర్డులను దక్కించుకున్నారు.
→ ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలి యనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానం లో నిల్చారు.
→ యేల్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదివారు.

నేడు నింగిలోకి ఎల్ పీఎం-3 వాహకనౌక

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.
→ వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే తిరుపతి జిల్లా లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆది వారం ఉదయం 9 గంటలకు ఎల్వీఎంచి వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
→ శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 24.30 గంటల పాటు కొనసాగనుంది. ఎల్పీఎం-3 వాహకనౌక ద్వారా వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
→ ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహా లను ప్రయోగించడానికి వన్ వెబ్ తో ఒప్పందం చేసు కుంది.
→ ఇందులో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టింది.

వారాల ఆనంద్ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార ప్రదానం

కరీంనగర్ కు చెందిన సినీ విమర్శకులు, రచయిత వారాల ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.
→ ప్రముఖ కవి గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్ కవితా సంకలనాన్ని తెలుగులో ఆకుపచ్చ కవితల పేరుతో అను వదించిన ఆయనకు మూడు నెలల కిందట కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు ప్రక టించారు.
→ గోవా రాష్ట్రం పనాజీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా వారాల ఆనంద్ ఈ పుర స్కారాన్ని అందుకున్నారు.
→ దీని కింద రూ. 50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.

ఆహార వృథాను అరికట్టే సెన్సర్

నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన పరిశోధక విద్యార్థి బెంగ్ డౌలియు చవాంగ్ కనుగొన్న ఒక చిన్న పరికరం ఆహార ప్యాకేజింగ్ పరి శ్రమకు గొప్ప వరం కానున్నది.
→ చవాంగ్ టెక్సస్ (అమెరికా)లోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో పరి శోధక విద్యార్ధి. ప్లాస్టిక్ తదితర సంచుల్లో నిల్వచేసిన కొంత కాలానికి ఆహారం ఆమ్లీకర ణకు లోనవుతుంది.
→ ఆమ్ల స్థాయులను పీహెచ్ స్థాయులంటారు. ఆమ్లీకరణ వల్ల ఆహార పదార్థాలు పాడ వుతాయి.
→ ప్రస్తుతం ఆహార పరిశ్రమ ప్రతి ఆహార ప్యాకే జిలో అంగుళం నుంచి అయిదు అంగుళాల పొడవు ఉండే పీహెచ్ సెన్సర్లను ఉంచి ఆహార నాణ్యతను పరీక్షిస్తోంది.
→ చవాంగ్ రూపొందించిన పీహెచ్ సెన్సర్ కేవలం రెండు మిల్లీమీటర్ల పొడవు, 10 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంది. ఇలాంటి సెన్సర్లను ప్రతి ఆహార ప్యాకెట్ లో ఉంచవచ్చు.
→ తన సెన్సర్ ను పాలు, పండ్లు, తేనె, చేపల నాణ్యతా నిర్ధార ణకు విజయవంతంగా పరీక్షించినట్లు చవాంగ్ తెలిపారు.
→ ఈ సెన్సర్ తయారీకి జీవసంబంధ పదార్థాలను ఉపయోగి చేస్తారు. వార్తా పత్రికలను ముద్రించినట్లే ఈ సెన్సర్లను ముద్రించవచ్చు.
→ తమ పీహెచ్ సెన్సర్ ఉన్న ఆహార ప్యాకె ట్లను సూపర్ మార్కెట్ ద్వారాల గుండా తీసుకెళ్లేటప్పుడు, రేవుల ద్వారా ఎగుమతిచేసేటప్పుడు, బట్వాడా కేంద్రాల్లో నిల్వచేసినప్పుడు ఆహారం చెడిపోతే సెన్సర్ వెంటనే హెచ్చ రిస్తుందని చవాంగ్ తెలిపారు.
→ నాగాలాండ్లో వ్యవసాయ పంటలు ఈ విధంగానే చెడిపోతున్నందున దాన్ని అరికట్టడా నికి పీహెచ్ సెన్సర్ను రూపొందించానని తెలిపారు.
→ దీనివల్ల పిల్లలు, వృద్ధులకు మరింత ఆహారం అందించవచ్చన్నారు.

రూ.12,30,000 కోట్లకు దేశీయ ఇ-కామర్స్ విపణి

గతేడాది దేశీయ ఇ- కామర్స్ విపణి 83 బిలియన్ డాలర్లు (రూ.6,80,600 కోట్లు) ఉండగా.. 2026లో 150 బిలి యన్ డాలర్లకు (రూ.12,30,000 కోట్లు) చేరే అవకాశం ఉందని ఓ నివేదిక వేసింది.
→ యూపీఐ ఆధారిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతుండటం, నగదు రూపేణా లావాదేవీలు మరింత తగ్గనుండటమే ఇందుకు కారణంగా అభి ప్రాయపడింది.
→ 2023 జనవరి నాటికి యూపేఐ లావాదేవీల సంఖ్య ఏడా దిక్రితంతో పోలిస్తే రికార్డు స్థాయిలో 74.1 శాతం పెరిగాయి.
→ 2019లో డిజిటల్ వ్యాలెట్ లు 5 శాతంగా ఉండగా.. 2022లో 35 శాతానికి చేరా రాయని ఎఫ్ఎస్ఐఎస్ రూపొందించిన 'గ్లోబల్ పేమెంట్స్ రిపోర్ట్ వెల్లడించింది.
→ 2019లో పీఓఎస్ లావాదేవీల విలువలో నగదు వినియోగం 71 శాతంగా ఉండగా.. 2022లో 27 శాతానికి తగ్గింది.
→ రియల్ టైం చెల్లింపుల మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా అవతరించిందని నివేదిక పేర్కొంది.
→ 'యూపీఐ రాకతో వినియోగదారులు నగదు రూపేణా చెల్లింపులు తగ్గించారు. అదే సమయంలో అందరికీ చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకూ దోహదం చేసింది.
→ ప్రపంచవ్యాప్తంగా చెల్లింపుల్లో భారతన్ను అగ్రగామిగా నిలబెట్టింద'ని ఎఫ్ ఐఎస్ జనరల్ మేనేజర్ ఫీల్ పామ్ఫోర్డ్ తెలిపారు.
→ 2026 కల్లా మొత్తం లావాదేవీల విలువలో నగదు చెల్లింపులు 34 శాతం తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది..

ఇంటెల్ సహ వ్యవస్థాపకులు గోర్డాన్ మూర్ కన్నుమూత

ఇంటెల్ కార్ప్ సహ వ్యవ స్థాపకులు గోర్డాన్ మూర్ (94) కన్నుమూ శారు.
→ హవాయి లోని ఆయన సొంతం గృహంలో తుది శ్వాస విడిచినట్లు ఇంటెల్, ||గోర్డాన్ అండ్ బెట్టీ మూర్ ఫౌండేషన్లు వెల్ల డించాయి.
→ మూర్ రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రంలో పీహెచీ పట్టా పొందారు. 1968లో ఇంటెల్ను స్థాపించారు.
→ దీనికి మూడేళ్ల ముందు ఆయన మూర్స్ లాను కనిపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల సామర్ధ్యం, సంక్లిష్టత ప్రతి ఏడాది రెట్టింపు అవుతాయని అప్పట్లో చిప్ల ఆధారంగా ఆయన అంచనా వేశారు.
→ టెక్ పరిశ్రమ పురోగతి, ఆవిష్కర ణలకు తర్వాత ఇది ప్రామాణికంగా మారింది.
→ 2000వ సంవత్సంలో ఆయన తన భార్యతో కలిసి గోర్డాన్ అర్ బెట్టీ మూర్ ఫౌండేషన్ స్థాపించి పర్యావరణ పరిరక్షణ, సైన్స్, రోగుల సేవ తదితర ప్రాజెక్టులకు 5.1 బిలియన్ డాలర్లను అందించారు.
→ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్- ఇంటెల్: మూర్ 1929 జనవరి 3న శాన్ఫ్రా న్సిస్కోలో జన్మించారు.
→ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి రసా యన శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1954లో పీహెచ్ పట్టా పొందారు.
→ జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో రీసెర్చర్గా పని చేశారు. ఫిజిక్స్లోలో నోబెల్ బహుమతి పొందిన విలియమ్ షాక్లే దగ్గరా పని చేశారు.
→ షాకే సెమీ కండక్టర్ లేబొ రేటరీ నుంచి బయటకొచ్చిన తర్వాత 1968లో మూర్, రాబర్ట్ నోసేలు కలిసి ఇంటెల్ను స్థాపించారు.
→ 'ఇంటిగ్రేటెడ్, 'ఎలక్ట్రానిక్స్' పదాలను కలిపి ఇంటెల్గా కంపెనీకి పేరు పెట్టారు.
→ 1975లో ఇంటెల్ సీఈఓగా మారారు. 1987 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. మరో 10 ఏళ్లు చైర్మన్ గా కొన సాగారు.
→ 1997 నుంచి 2006 వరకు గౌరవ చైర్మన్ గా ఉన్నారు.

టేకాఫ్ షాఫ్ట్

భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తేలి కపాటి యుద్ధ విమానం (తేజస్) స్వదేశీ పవర్ టేకాఫ్ (పీటీవో) షాఫ్ట్ తొలిసారిగా మార్చి 14న గగన విహారం చేసింది.
→ బెంగ ళూరులో నిర్వహించిన ఈ ప్రయోగం విజ యవంతమైంది. పీటీవో షాఫ్ట్.. చాలా కీలక సాధనం.
→ విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్ బాక్స్కు బదిలీ చేస్తుంది. దీన్ని విజయవం తంగా పరీక్షించడం ద్వారా అతికొద్ది దేశాలకే పరిమితమైన సంక్లిష్ట హైస్పీడ్ రోటర్ పరిజ్ఞా నాన్ని భారత్ సముపార్జించినట్లయ్యింది

VSHORDS

గగనతల రక్షణకు ఉద్దేశించిన స్వల్ప శ్రేణి. క్షిపణి (వీఎస్ హెచ్ఆర్ఎడీఎస్) పరీక్షను మార్చి 14న భారత్ రెండు సార్లు విజయవం తంగా నిర్వహించింది.
→ ఒడిశా తీరానికి చేరు వలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగాలు చేపట్టారు. సైనికులు భుజం మీద మోసుకెళ్లే చిన్నపాటి లాంచర్ ద్వారా ఈ అస్త్రాలను ప్రయోగించారు.
→ తక్కువ ఎత్తులోని లక్ష్యా లను ధ్వంసం చేయడానికి ఇవి ఉపయోగప డతాయి. ఈ మిసైల్ వ్యవస్థను హైదరాబాద్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించినది.

కాలుష్య నగరాల జాబితా

కాలుష నగరాలకు సంబంధించి 2022 జాబి తాను స్విస్ సంస్థ ఐక్యూ మార్చి 15న విడు దల చేసింది.
→ దీనిలో మధ్య, దక్షిణాసియా లోని 15 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 12 భారత్కు చెందినవే ఉన్నాయి.
→ దీనిలో మహారాష్ట్రలోని భివాండి అత్యంత కాలుష్య కారక నగరంగా నిలిచింది. దేశంలోని 60 శాతం నగరాలు 2.5 పీఎం స్థాయిలో ఉన్నా యని, ఇది డబ్ల్యూహెచో పేర్కొన్న ప్రపంచ స్థాయి కన్నా ఏడు రెట్లు అధికమని వెల్లడించింది.
→ అదేవిధంగా అత్యంత కాలుష్య దేశాల్లో.. చాద్, ఇరాక్, పాకిస్థాన్, బహ్రెయిన్, బంగ్లా దేశ్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్ 8వ స్థానంలో ఉంది.
→ మెట్రో నగ రాల్లో ఢిల్లీ 4వ స్థానంలో ఉండగా.. కోల్కతా (99), ముంబై (137), హైదరాబాద్ (199), బెంగళూరు (440), చెన్నై (682) స్థానాల్లో ఉన్నాయి.

ఐఎన్ఎస్ ద్రోణాచార్య

ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారం రాష్ట్రపతి పతాకను అందించారు.
→ మార్చి 16న కొచ్చిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిర్వహించారు.
→ ఈ సందర్భంగా రాష్ట్రపతి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత న్ను సందర్శించారు.

రావత్ పేరిట అవార్డులు

దివంగత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సంస్మరణార్ధం రెండు అవార్డులను ఏర్పాటు చేయనున్నట్లు నౌకాదళం మార్చి 16న ప్రక టించింది.
→ దీనిలో ఒకటి శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మహిళా అగ్నివీర్ ట్రెయి నీకి ఇవ్వనున్నారు.
→ మొదటి పురస్కారాన్ని మార్చి 28న ఐఎన్ఎస్ చిల్కాలో నిర్వహించే తొలి నేవీ అగ్నివీర్ పాసింగ్ ఔట్ పరేడ్లో అందజేయనున్నారు.
→ రెండో పురస్కారం గోవాలోని నేవల్ వార్ కాలేజీలో 'హయ్యర్ కమాండ్ కోర్స్' శిక్షణ పొందుతున్నవారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారికి ఇవ్వనున్నారు.

చైనా ప్రధానిగా లీ కియాంగ్

చైనా ప్రధానిగా కియాంగ్ మార్చి 12న ఎన్నికయ్యారు.
→ మొత్తం 2,936 మంది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యుల్లో ముగ్గురు లీకి వ్యతిరేకంగా ఓటు వేయగా, మరో 8 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
→ లీ కియాంగ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ప్రధాని లీ కెకియాంగ్ ఉన్నారు.
→ ఆ అదేవిధంగా చైనా కొత్త రక్షణ మంత్రిగా లీ షెంగ్్పూ నియమితులయ్యారు.
→ ఆ దేశ సైన్యంలో జనరల్ గా పనిచేస్తున్న ఆయ నపై 2018లో అమెరికా ఆంక్షలు విధిం చింది.
→ రష్యా అనుకూలుడిగా ఆయనకు పేరుంది.

సురేఖ యాదవ్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ హై స్పీడ్ రైలును నడిపిన తొలి మహిళా లోకో సురేఖ యాదవ్ నిలి చారు.
→ ఆమె మార్చి 13న షోలాపూర్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (ముంబై) వరకు (450 కి.మీ.) రైలు నడిపారు.
→ మహారాష్ట్రకు చెందిన ఆమె 1988లో రైలును నడిపి దేశంలోనే కాకుండా, ఆసియాలోనే మొదటి మహిళా లోకోపైలట్ చరిత్ర సృష్టించారు.

శక్తికాంత దాస్

ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ (ఇండియా) గవర్నర్ శక్తికాంత దాసు 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2028' అవార్డు మార్చి . 15న లభించింది
→ కరోనా సంక్షోభం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థంగా నడిపినందుకు ఈ అవార్డు దక్కింది.
→ అంతర్జాతీయ ప్రముఖ ఇంటర్నేషనల్ రిసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును అందజేసింది.

తిరిగొచ్చిన వ్యోమగాములు

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర (ఐఎస్ఎస్-ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో 5 నెలలు విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మార్చి 12న భూమికి తిరిగి వచ్చారు.
→ స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో 19 గంటలు ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్ర జలాల్లో దిగారు.
→ వారిలో అమెరికాకు చెందిన నికోల్మన్, జోష్ కాసాడా, జపాన్ కు చెందిన కోయిచీ వాకాటా, రష్యా కాస్మోనాట్ అన్నా కికినా ఉన్నారు.

ఇంటర్ పార్లమెంటరీ యూనియన్

బహ్రెయిన్లోని మనామాలో నిర్వహిస్తున్న 146వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) సమావేశం మార్చి 15న ముగి సింది.
→ 'ప్రమోటింగ్ పీసుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ ఇన్ క్లూజివ్ సొసైటీస్: ఫైటింగ్ ఇన్టిల రెన్స్' అనే థీమ్ నిర్వహించిన ఈ సమా వేశం మార్చి 11న ప్రారంభమైంది.
→ అంతర్జా తీయ భద్రత, శాంతి, సైబర్ దాడులు, సైబర్ నేరాలపై చర్చించారు. భారత్ నుంచి ఈ సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పాల్గొన్నారు.

అత్యంత వేగం గా 75 వ సెంచరీ చేసిన ఆటాగాడిగా కోహ్లీ

ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో విరాట్ కోహ్లి మార్చి 12న సెంచరీ చేశాడు.
→ దీంతో 75వ ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన కోహ్లి... సచిన్ (100) తర్వాత ఈ ఘనత అందు కున్న ఆటగాడిగా నిలిచాడు.
→ అత్యంత వేగంగా ఈ మైలురాయి అందుకున్న బ్యాటర్ గానూ రికార్డులకెక్కాడు. 75వ సెంచరీకి సచిన్ 566 ఇన్నింగ్స్లు ఆడగా.. కోహ్లి 552 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు.
→ బోర్డర్-గవాస్కర్ టెస్టు ట్రోఫీని భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అశ్విన్, జడేజా నిలిచారు.
→ స్వదేశంలో టెస్టుల్లో వేగంగా 4 వేల పరు గుల మైలురాయిని అందుకున్న ఘనత కోహ్లి (77 ఇన్నింగ్స్) దక్కింది. సునీల్ గవాస్కర్ (87), ద్రవిడ్ (88)లను అధిగ మించాడు.

రైజింగ్ డే

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐ ఎస్ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవం (రై జింగ్ డే)ను మార్చి 12న నిర్వహించారు.
→ హైదరాబాద్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ సెంటర్ లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకా డమీ (నిసా)లో నిర్వహించిన ఈ రైజింగ్ డేలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
→ ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సెంటినల్- 20 పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఎన్ఐఆర్డీ - ఇక్రిశాట్

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఎస్ఐఆర్-జా తీయ గ్రామీణాభివృద్ధి సంస్థ), ఇక్రిశాట్ మార్చి 13న అవగాహనా ఒప్పందం కుదు ర్చుకున్నాయి.
→ అధునాతన పరిజ్ఞానంతో మెట్ట పంటల్లో అధిక ఉత్పాదకత, ఆహారభద్రత సాధన కోసం కలిసి పనిచేయడం ఈ ఒప్పందం లక్ష్యం.
→ అదేవిధంగా వాతావరణ మార్పుల అనుసరణ, గ్రామీణ వ్యవస్థాపకతలో అభివృద్ధి, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా ప్రోత్సాహం, మహిళా సంఘాల ద్వారా వ్యాపారం, అధిక దిగుబడి నిచ్చే వంగడాలపై పరిశోధన, అభివృద్ధికి కృషి చేస్తాయి.

'బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్ ' అవార్డు

శంషాబాద్ ఎయిర్పోర్టుకు 2023కు స్కైట్రాక్స్ 'బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్ ' అవార్డు మార్చి 16న లభించింది.
→ భారతో పాటు దక్షిణాసియాలోనే ఈ ఎయిర్పోర్ట్ నిలిచింది.
→ దీంతో పాటు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు కూడా దక్కింది

ఇస్రో ఎల్ వీఎం-3 ప్రయోగం విజయవంతం

ఇస్రో మరోమారు సత్తా చాటింది. ఆ సంస్థ ప్రయోగించిన ఎల్వీఎం -3 వాహకనౌక.. వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
→ తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9.00 గంటలకు 5,805 కేజీల పేలోడ్తో ఎల్వీఎం-3 వాహ కనౌక నిప్పులు చిమ్ముతూ నింగి లోకి దూసుకెళ్లింది.
→ ఉపగ్రహాలను 450 కి.మీ.ల వృత్తాకార ఆకాంక్షించారు. కక్ష్యలో 87.4 డిగ్రీల వంపుతో విజయవం తంగా వదిలిపెట్టింది.
→ రాకెట్ బయలుదేరిన 9 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యను చేరుకోగా 20వ నిమిషం నుంచి ఉపగ్రహాలను కక్ష్యలో పెట్టడం ప్రారంభించింది.
→ ఈ దశలో సీ25 స్టేజ్ అద్భుతంగా పనిచేసిందని ఇస్రో పేర్కొంది. ఉపగ్రహాలు ఒకదానినొకటి ఢీకొ నకుండా నిర్దేశిత సమయాంతరాల్లో వాటిని విడిచిపెట్టింది.
→ అన్ని ఉపగ్రహాలనూ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు తొమ్మిది దశల్లో 1:27 గంటల సమయం పట్టింది.
→ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ అదరగొట్టిన జరీన్ బలమైన పంచ్లతో చెలరేగి.. మెరుపు దాడులతో సత్తాచాటి.. రింగ్లో తన జోరుకు ఎదురు లేకుండా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది.
→ 50 కేజీల విభాగంలో పసిడిని ముద్దాడి వరుసగా రెండో ఏడాదీ ప్రపంచ టైటిల్ పట్టేసింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గో హెయిన్ ఛాంపియన్గా నిలిచింది.
→ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఆమె.. తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సారి మొత్తం నాలుగు బంగారు పతకాలు భారత్ సొంతమయ్యాయి.
→ 2006 తర్వాత ఓ ప్రపంచ ఛాంపియన్షిప్లో నాలుగు స్వర్ణాలు నెగ్గడం భారత్కు ఇదే తొలిసారి.

నిండా మునుగుతున్న పగడాల 'లక్షదీవులు'

ప్రపంచంలో వాతావరణ మార్పుల వేగం పెరిగింది. అంటార్కిటికాలో గత 25 ఏక్షలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు తాజాగా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
→ దాంతో ప్రపంచవ్యా ప్తంగా సముద్ర మట్టాలు 8 మిల్లీమీటర్ల మేర పెరిగా 9 యని వెల్లడైంది. భారత్కు మూడు వైపులా సముద్రం తీరం ఉంది. చుట్టూ 1982 ద్వీపాలున్నాయి.
→ సముద్రం, నదులు కోత, మడ అడవుల నరికివేత, ఉష్ణో గ్రత పెరుగుదల, అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా ఈ ద్వీపాలు రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా మాయమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
→ ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు చేపడితే ఆ ప్రమాదాన్ని వాస్తయినా నివారించ వచ్చని చెబుతున్నారు. లక్ష దీవుల్లోని ఒక ద్వీపం ఇప్ప టికే పూర్తిగా మ్యాసలో కనిపించడం లేదట.
→ అలాంటి ముప్పు పొంచి ఉన్న కొన్ని జనావాస ద్వీపాలివీ...

పగడాల లక్షదీవులు

టకులను అమితంగా ఆకర్షించే లక్షదీవులు 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ సగడపు దిబ్బలు అధికం.
→ 2010, 2016 సంవత్సరాల్లో వచ్చిన ఎల్సీనో కారణంగా అవి క్షీణించాయి. అరే బియా సముద్రంలో పెరుగుతున్న వేడి కూడా అందుకు ఒక కారణం.
→ ఇక్కడ ఒక వాటర్ విల్లా ప్రాజెక్టు చేపట్టాలని నీతి ఆయోగ్ సూచించింది.
→ ఆ ప్రాజెక్టు వల్ల లక్షదీవుల్లోని మడుగులకు భారీగా నష్టం వాటిల్లుతుందని, దీనిపై పునరాలోచన చేయాలని 2021లో పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
→ ఇలాంటి ప్రాజెక్టులు, ఆకాల తుపానుల వల్ల నేల కోతకు గురవుతోంది. ఒక అధ్యయనం ప్రకారం 2080210 మధ్య కాలంలో ఏడాదికి 0.78 మిల్లీమీ టర్ల మేర జలాలు పెరుగుతాయని తెలిసింది.
→ దాంతో చిన్న దీవులు అంతరించి పోయే ప్రమాదముంది. అందుకే ఇక్కడ నివసిస్తున్న దాదాపు 64 వేల మంది. తమ అస్థిత్వం కోసం పోరాడుతున్నారు.

అండమాన్ నికోబార్ దీవులు

బంగాళాఖాతంలో ద్వీపాల సముదాయం అండమా సైన్ అండ్ నికోబార్, 2004 సునామీ కారణంగా అక్కడిఇందిరా పాయింట్ వద్దనున్న లైట్ హౌస్ నాలుగు మీటర్లు మునిగిపోయింది.
→ రాకాసి అలల దాటికి ఈ ద్వీపాల స్వరూపమే మారిపోయింది. ద్వీపాల వైవి ధ్యాన్ని కాపాడుతున్న మడ అడవులు దాదాపుగా క్షీణిం విపోయాయి.
→ ఫలితంగా గడిచిన పదేళ్లలో దాదాపు 450 భూకంపాలను చవి చూడాల్సి వచ్చింది.
→ కేంద్రప్ర భుత్వం చేపట్టిన ఓ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నికోబార్లోని అడవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.
→ ఇక్కడ సముద్ర మట్టం ఏటా 5 మిల్లీమీ టర్లు పెరుగుతూ వస్తోంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ.

భారత్-శ్రీలంక మధ్యన 'వహాన్'

తమిళనాడులోని తూత్తుకుడి తీరానికి 6 కిలోమీ టర్ల దూరంలో వహాన్ ఐలాండ్ కనిపిస్తుంది. ఇది భారత్, శ్రీలంకకు మధ్యలో ఉంటుంది.
→ 1869 నాటికి 20,08 హెక్టార్లలో వ్యాపించి ఉన్న ఈ ద్వీపం 2.30 హెక్టార్లకు తగ్గిపోయి ఓ బల్బులాగా ప్రస్తుతం ధర్శనమిస్తోంది.

యాస్ తుపానుతో 'ఘోరామం"

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో కోల్ కతాకు 92 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం కని పిస్తుంది.
→ ఈ ప్రాంతం 5 చదరపు కిలోమీటర్ల పరి దిలో ఉంటుంది. మట్టి కోతకు గురి కావడంతో ఉపాధినిస్తున్న తాటి చెట్లు నిలవడం కష్టంగా మారుతోంది.
→ ఈ ప్రాంతంలో తమలపాకు సాగు అధికం. 2021లో వచ్చిన 'యాస్' తుపానుకు ముందు ఇక్కడ 550 యూనిట్ల తోటలు సాగ య్యేవి.
→ తుపాను కారణంగా ఆ తోటలు, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ద్వీపం ఉత్తర, ఈశాన్య భాగంలో కోత కొనసాగు తోంది.
→ ఇదే ఒరవడి సాగితే ద్వీపం జాడ లేకుండా పోతుందేమోనని స్థానికులు భయాందోళకు గురవు తున్నారు. ఒకప్పుడు ఇక్కడ 40వేల మంది వరకూ నివసించే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 4వేలకు పడిపోయింది .

ఉప్పగా మారుతున్న 'మన్రో థురుతు"

కేరళలోని కొల్లం పట్టణానికి 25 కిలో మీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది.
→ ట్రావెన్ కోర్ రాజ్య బ్రిటిష్ పరిపాలనాధికారి కర్నల్ జాన్ మన్రో పేరు దీనికి పెట్టారు.
→ ఈ ద్వీపం క్రమక్రమంగా క్షీణించిపో వేలున్న జనాభా ఇప్పుడు 8వే లకు తగ్గిపోయింది.
→ వారంతా కొబ్బరి సాగు, పర్యాట కంపై ఆధారపడి జీవిస్తున్నారు. అలల తాకిడి, వర దల కారణంగా ఈ నేల ఉప్పుగా మారింది.
→ దాంతో సారవంతమైన ఈ భూభాగం వ్యవసాయానికి పనికి చాకుండా పోతోంది.
→ ఈ ద్వీపానికి సమీపంలో నిర్మి స్తున్న రెనుల డ్యామ్ విచ్చలవిడి ఇసుక తవ్వకాల కారణంగా ఈ నష్టం చవి చూడాల్సి వస్తోందని ఓ పరిశోధనలో వెల్లడైంది.
→ కల్లాడ నదిలోని వ్యర్థాలు, ఉప్పునీటి మడుగుల వల్ల మట్టి మాత్రమే కాకుండా భూగర్భ జలాల్లోనూ మార్పు వచ్చిందని పరిశోధ కులు అభిప్రాయపడుతున్నారు.

గిన్నీస్ కి ఎక్కిన మజులీ

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ ద్వీపం మజూలీ, ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపంగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది.
→ 2016లో దీనిని జిల్లాగా ప్రక టించారు ఆ ఘనత అందుకున్న తొలి ఐలాండ్ ఇదే. వ్యవసాయం, ఆవాల సాగు, చేపల పెంపకం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు.
→ 950 నాటికి 1250 చదరపు కిలో మీటర్లున్న ఈ ద్వీపం ప్రస్తుతం 183 చదరపు కిలోమీటర్లకు కుంచించుకుపోయింది.
→ నది కోతకు గురికావడం, దాని దక్షిణ భాగంలో కట్టలు కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం..

ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా జమ్మూ-కశ్మీర్ లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన ఇది.
→ వంతెనను అధికారులతో కలిసి పరిశీలిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

వైద్యరంగంలో కృత్రిమ మేధ వినియోగానికి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు

జీవ వైద్య పరిశోధనలు, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) విని యోగంలో అనుసరించాల్సిన నైతిక సూత్రాలకు సంబంధించి భారత వైద్య పరి శోధనా మండలి (ఐసీఎంఆర్) దేశంలో తొలిసారిగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
→ వైద్యరంగంలో ఏఐ ప్రధానంగా రోగి నుంచి తీసుకున్న డేటా ఆధా రంగా పనిచేస్తుందని, దీంతో ఆశ్రిత పక్షపాతం, డేటా నిర్వహణ, స్వయంప్రతి పత్తి, వృత్తిపరమైన పోటీ, గోప్యత తదితర అంశాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశమున్నందున మార్గదర్శకాలు అత్యవసరమని వైద్య పరిశోధన విభాగం, ఐసీఎమ్ర్కు చెందిన కృత్రిమ మేధ విభాగం తమ నివేదికలో వెల్లడించాయి.
→ అయితే ఇవి వైద్య రంగంలో ఏఐ పాత్రను పరిమితం చేయడానికి కాదని, కృత్రిమ మేధను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు సురక్షితమైన విధానాల్లోనే దానిని ఉపయోగించడానికి మాత్రమేనని స్పష్టం చేసింది.

జమ్మూకాశ్మీర్ లో తొలి విదేశీ పెట్టుబడి

జమ్మూకాశ్మీర్కు తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ( ఎఫ్ డీఐ) వచ్చింది.
→ దుబాయికి చెందిన ఎమార్ గ్రూపు రూ.500 కోట్లతో షాపింగ్ మాల్, మల్టీప ర్పస్ టవర్ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది.
→ 201 9లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకాశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రక టించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎఫ్ఐ ఇదే కావడం విశేషం.
→ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణాలు చేసిన ఎమార్ గ్రూపు కశ్మీరు లోయలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

టైమ్ అద్భుత ప్రాంతాల జాబితా'లో లడఖ్, మయూర్ భంజ్

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన 50 ప్రాంతాల జాబితా-20 23లో మన దేశం నుంచి లడఖ్, మయూర్ భంజ్ లకు చోటు కల్పించింది.
→ అరుదైన పులులు, పురా తన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం. ఆహా అనిపించే ఆహారం.. ఇవన్నీ కలగలిసిన ప్రాం తాలు ఇవి.
→ ఇక్కడి మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి
→ . 'అక్కడి వాతావర తాన్ని అనుభూతి చెందడానికి పదేపదే లడఖ్ వెళ్లా లి' అని టైమ్స్ కీర్తించింది.
→ 'ఇక మయూర్ భంజ్ అంటే పచ్చదనం, సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు నిలయం.
→ ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం' ఇది అంటూ కొనియాడింది.
→ ఏటా ఏప్రిల్లో మయూర్ భంజ్లో జరిగే 'చౌ' డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతోపాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది.

నికోటిన్ ను అడ్డుకొనే ఫిల్టర్ సిగరెట్

నికోటిన్ వాడకాన్ని తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి ప్రతీకశర్మ అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు.
→ నికోటిన్, తారును 80 శాతం వరకూ అడ్డు, కొంటూ.. టేస్ట్ ఎలాంటి మార్పులేని ఫిల్టర్ సిగ రెట్ను తయారు చేశాడు.
→ 'సిగిబ' పిలుస్తున్న ఈ ఫిల్టర్ సిగరెట్ను ఇటీవల మార్కెట్లోకి విడు దల చేశారు. ఇది ధూమపానం అలవాటును మూడు నెలల్లో మానేలా చేస్తుందని శర్మ తెలిపారు.

దక్షిణాసియాలో ఢిల్లీ విమానాశ్రయమే ఉత్తమం

దేశంలోనే కాకుండా మొత్తం దక్షిణాసియాలోనే ఉత్తమ విమానాశ్రయంగా ఢిల్లీ విమానాశ్రయం నిలిచింది.
→ అంతర్జాతీయ విమాన ప్రయాణ రేటింగ్ సంస్థ సైట్రాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 50 విమానా శ్రయాలకు 2020 నుంచి ఏటా ర్యాంకులు కేటాయి స్తోంది.
→ అంతర్జాతీయంగా 2022లో 37వ స్థానం లో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం.. ఈ ఏడాది ఒక ర్యాంకు మెరుగుపర్చుకుని 38వ స్థానంలో నిలిచింది.
→ దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఇదే. విమాన ప్రయాణం తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సైట్రాక్స్ సంస్థ ఏటా సర్వే పైనా వారు సమాలోచనలు జరిపారు.
→ తాజా సర్వే 2022 ఆగస్టు 2023 ఫిబ్రవరి మధ్య నిర్వహించి, వివరాలు వెల్లడించిం ది. ఈ జాబితా తొలిస్థానంలో సింగపూర్ లోని రాం విమానాశ్రయం నిలిచింది.

వాతావరణ మార్పులపై ఐరాస నివేదికకు ఆమోదం

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి(ఐ రాస) రూపొందించిన అతి కీలకమైన నివేదికకు ఇటీవల పలు దేశాలు ఆమోదం తెలిపాయి.
→ ధనిక, పేద దేశాల మధ్య కాలుష్య ఉద్గారాల -లక్ష్యాలు, ముప్పు పొంచి ఉన్న దేశాలకు ఆర్థిక సాయం అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేప థ్యంలో.. ఈ ఆమోదం లభించడం గమనార్హం.
→ స్విట్జర్లాండ్లోని ఇంటర్లాకెన్ పట్టణంలో జరిగిన సదస్సులో ఈ ఆమోదం లభించింది.

ఇండో-పసిఫిక్ శాంతికి భారత్-జపాన్ భాగస్వామ్యం కీలకం

ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ వ్యవహా రాల్లో చట్టబద్ద పాలనపై గౌరవం ఆధారంగా భారత్, జపాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం: కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు.
→ దీన్ని మరింత విస్తరించుకోవడం రెండు దేశాలకూ ప్రయోజనకరమే కాక, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు కీలకమన్నారు.
→ భారత్ పర్యటనలో భాగంగా మార్చి 20న ఢిల్లీకి వచ్చిన జపాన్ ప్రధాని పుమియో కిషిదతో చర్చలు జరిపిన అనంతరం మోదీ ఈ మేరకు పేర్కొ న్నారు.
→ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో.. మోదీ, కిషిద భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
→ శుద్ధ ఇం ధనం, సెమీ కండక్టర్లు, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు.
→ పెరుగు తున్న ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం భారత్ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుతో పాటు జపాన్ సారథ్యంలో నిర్వహించనున్న జీ7 సమావేశాల్లో ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదు ర్కోవడానికి కలసికట్టుగా పనిచేయాలని మోదీ, కిషిదా నిర్ణయించారు.
→ మే నెలలో జపాన్లోని హిరోషిమాలో జరిగే జీ7 సమావేశాలకు మోదీని ఆహ్వానించగా.. ఆయన అంగీకరించినట్లు కిషిద చెప్పారు.
→ ఈ చర్చల సందర్భంగా ముంబయి - ఆ హ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ రుణంలో నాలుగో విడతగా 300 బిలియన్ల యెన్ల (రూ.18 వేల కోట్లు) నిధుల విడుదలకు సంబం ధించి రెండు దేశాలు పత్రాలు మార్చుకున్నాయి.

శక్తిమంతమైన న్యూట్రినోల ఆవిష్కరణ

శాస్త్ర పరిశోధనలో తొలిసారిగా ఓ పార్టికిల్ కొలై డర్ అత్యంత శక్తిమంతమైన న్యూట్రినో కణాలను వెలువరించింది.
→ రెండు కణపుంజాలు ఒకదానితో ఒకటి ఢీకొనగా న్యూట్రినోలు వెలువడ్డాయని అం. తర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.
→ జెనీవాలో ని సెర్న్ నిర్వహించిన ఫార్వార్డ్ సెర్చ్ ఎక్స్పెరిమెంట్ (ఫేజర్) ద్వారా వీటిని కనుగొన్నారు.
→ అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు చార్జ్ హెడ్రాస్ కొలైడర్ ఫేజర్ను ఏర్పాటు చేశారు. విశ్వంలో అత్యధికంగా కనిపించే కణాలే న్యూట్రినోలు, వీటిని 1956లో కనుగొన్నారు.
→ అప్ప టి నుంచి తక్కువ శక్తి గల న్యూట్రినోతే పరిశోధన లకు లభ్యమవుతున్నాయి.
→ తాజాగా ఫేజర్ కనుగొ న్న న్యూట్రినోలు ప్రయోగశాలలో ఇంతవరకు ఎన్న డూ లేనంత అధిక శక్తి కలిగిఉన్నాయి.
→ అవి అంతరి క్షంలో సుదూరం నుంచి భూమిని తాకే న్యూట్రినో లను పోలి ఉన్నాయి.
→ నక్షత్రాలు మండే విధం: గురించి న్యూట్రినోల ద్వారా తెలుసుకోవచ్చు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీపై అనర్హత వేటుపడింది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది.
→ ప్రధాని మోదీ ఇంటి పేరును కించ పరిచేలా చేసిన వ్యాఖ్యలకుగాను రాహుల్పై కేసు నమోదైంది.
→ ఈ కేసును విచారించిన సూరత్ కోర్ట్ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
→ ఈ నేప ధ్యంలో రాహుల్ ఎంపీ సభ్యత్వంపై లోక్ సభ సెక్ర టేరియట్ అనర్హత వేటు వేసిం ది.
→ ప్రజాప్రతినిధ్య చట్టం1 సెక్షన్ 8(3) ఆధారంగా ఈ నిర్ణ యాన్ని తీసుకోవడం జరిగింది.

రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసే బ్యాగ్లు

దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడంలో సాయపడే వినూత్న బ్లడ్ బ్యాగ్లను భారత శాస్త్రవే త్తలు అభివృద్ధి చేశారు.
→ ఇందు కోసం ప్రత్యేక పాలిమర్లను ఉప యోగించారు. అవి.. రక్తానికి నష్టం కలిగించే పరమాణు స్థాయి పోకడల (డీఏఎంపీ) ను కట్టడి చేస్తాయి.
→ అందువల్ల రక్తం 51 రోజుల పాటు భద్రంగా ఉంటుంది.
→ బెంగ ళూరులో బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యం లోని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ బయా లజీ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ (ఇన్ స్టైమ్) సంస్థ ఈ బ్యాగ్లను అభివృద్ధి చేసింది.
→ ఈ పరిశోధన బృందానికి ప్రవీణ్ కుమార్ వేముల నేతృత్వం వహించారు.
→ సాధారణంగా దాతల నుంచి సేకరించిన రక్తం 42 రోజులు భద్రంగా ఉంటుంది.
→ అయినా దాన్ని 21 రోజుల లోపే గ్రహీతల్లోకి ఎక్కించాల్సి ఉంటుంది.
→ నాణ్యత తక్కువగా ఉన్న రక్తాన్ని ఎక్కిస్తే రోగుల అంతర్గత అవ యవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
→ ప్రస్తుతం బ్లడ్లో పీహెచ్ స్థాయిని నియం త్రించడానికి కొన్ని రకాల పదార్థాలను ఉప యోగిస్తున్నారు. అయితే అవి డీఏ ఎంపీలను తొలగించలేవు.
→ భారత శాస్త్రవేత్తలు రూపొం దించిన పాలిమర్లు.. జిగురులా వీటికి అంటుకుంటాయి. రక్త కణాల జోలికి పోకుండా కట్టడి చేస్తాయి.

యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు ఫుడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వర్గల్ శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) జాతీయ సర్టిఫికెట్ బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ (భోగ్ గుర్తింపు లభించింది.
→ దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసు కోగా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా తెలంగాణలోని యాదాద్రి, సిద్దిపేట జిల్లా వర్గల్ దేవాలయాలకు ఈ గుర్తింపు దక్కింది.
→ కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశా లపై పరిశీలించింది.
→ ఆహార భద్రత, నాణ్యతా ప్రమా ణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్ గుర్తింపునకు రిఫర్ చేసింది.
→ ఈ ధ్రువపత్రం సాధించేందుకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం కృషి చేసింది.
→ ప్రోగ్రాం ప్రత్యేక నోడల్ అధి కారిగా అదనపు ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యం లోని బృందం ఈ రెండు దేవాలయాల్లో నైవేద్యం, అన్నప్రసాదాలు తయారు చేసే క్రమంలో అనుసరించా ల్సిన నాణ్యత ప్రమాణాలు, శుభ్రత విషయంలో పాటిం చాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించింది.

బ్లాక్ చెయిన్ కూ బీఐఎస్ ప్రమాణాలు

బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ (ఏఐ), బ్రెయిన్ కంప్యూటింగ్ ఇంటర్ఫేస్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలకు సైతం ప్రమాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చీఫ్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు.
→ అలాగే, యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యోగా మ్యాట్స్, యోగా సెంటర్లతో పాటు యోగా పరికాలకు కూడా ప్రమాణాలను నిర్దేశిం చబోతున్నామన్నారు.
→ ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరిన మేరకు మౌలికా ఔష దాలకు సైతం తాము ప్రమాణాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
→ హెచ్ యూఐడీ గడువు పొడిగించం:- ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా 6 అంకెల హాల్మార్క్ వినూత్న గుర్తింపు నంబరు (హెచ్ యూఐడీ)తో కూడిన నగలనే విక్రయించాలన్న గడువును పొడిగించబోమన్నారు.
→ ఈ విషయంలో ఆభరణ వర్తకులకు ఇప్పటికే 2 ఏళ్లకు పైగా సమయమిచ్చాం.. మరింత గడువిచ్చే ఉద్దేశం లేదని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
→ ఆభరణ వర్తకుల సూచన మేరకు హాల్మార్క్ లో భాగంగా బంగారం ఆభరణ బరువును కూడా చేర్చాలని బ్యూరో నిర్ణయించిందన్నారు.
→ నగలోని బంగారం స్వచ్ఛతను ధ్రువీకరించే ప్రక్రియే గోల్డ్ హాల్మార్కింగ్ 2021 జూన్ 16 నుంచి దీన్ని ప్రవేశపెట్టారు.
→ 6 అంకెల హెచ్ఐయూఐడీని 2021 జూలై 1 నుంచి ప్రవేశపెట్టారు.

→ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా :-
→ "దేశంలో సులభతరం వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు మేం ప్రమాణాలను రూపొందిస్తాం. విదేశీ వాణిజ్యం కూడా సాఫీగా జరిగేందుకు వీలుగా మన జాతీయ ప్రమాణా లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని తివారీ పేర్కొన్నారు.
→ ఇప్పటివరకు రూపొందించిన 22,000 బీఐఎస్ ప్రమా ణాల్లో, 8000 స్టాండర్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దినట్లు ఆయన చెప్పారు.

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రెండో స్థానం దక్షిణాది రాష్ట్రాల్లో నం.1

గత ఏడాది చేపట్టిన వరి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో నిలిచిందని, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
→ 2014-15 నుంచి 2022-23 వానాకాలం వరకు ఒక లక్ష 21 వేల కోట్ల విలువైన 6.71 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుచేసి రికార్డు సృష్టించిందని తెలిపింది.
→ అతి తక్కువ సమయంలో ఈస్థాయిలో ప్రొక్యూర్మెంట్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది.
→ ఈ మేరకు రాష్ట్ర ఏర్పాటునుంచి ఇప్పటివ రకు చేపట్టిన ప్రొక్యూర్మెంట్పై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
→ వ్యవ సాయమే సాధ్యం కాదన్నచోట ఏడాదిలో కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం | ఉత్పత్తిచేసి తెలంగాణ రైతులు సత్తా చూపిస్తున్నారని వెల్లడించింది.
→ దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థా లో కనీస మద్దతు ధరకు కొనుగోలుచేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొంది.
→ రాష్ట్ర విభజనకు ముందుతో పోలిస్తే విభజన తర్వాత ధాన్యం సేకరణలో ఊహించని పురోగతి వచ్చిందని తెలిపింది.
→ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరి గితే.. 2021-22లో 1 కోటి 20 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని ప్రభుత్వం వెల్లడించింది.
→ ఈ ఏడాది వానాకాలంలో 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 11.69 లక్షల మంది రైతుల నుంచి రూ.13 వేల కోట్ల విలువైన 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టినట్లు తెలిపింది.
→ ఈ యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని పేర్కొంది.
→ రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల ఎక రాల్లో వరి పంట సాగైందని, రైస్ మిల్లర్ల కొనుగోళ్లు, రాష్ట్ర ప్రజల అవసరాలుపోగా.. 90 లక్షల టన్నుల నుంచి కోటి టన్నుల వరకు యాసంగిలో ధాన్యం సేకరణకు సమాయత్తమవుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కోపా మ్యూజియంలో మెస్సి విగ్రహం

అర్జెం టీనాకు చరిత్రా త్మక ప్రపంచకప్ అందించిన దిగ్గజ ఆటగాడు లియొనల్ మెస్సికి గౌరవ సత్కా రాల పరంపర ఇంకా కొనసాగుతోంది.
→ ఈ సందర్భంగా మెస్సి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని అక్కడే ఉన్న కోపా మ్యూజియంలో ఫుట్బాల్ ఆల్టైమ్ దిగ్గజాలు పీలే, మారడోనా సర సన ఉంచనున్నారు.
→ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్పై నెగ్గి సుదీర్ఘ విరామం తర్వాత అర్జెంటీనా ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే.

ఉ.కొరియా అణుబాంబు ప్రదర్శన

ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్రాలు. ఉన్నాయని చెబుతుంటే వినడమే తప్ప... ప్రపంచం చూసింది లేదు. ఇన్నాళ్లూ అణు హెచ్చ రికలకే పరిమితమైన ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు స్వయంగా ఆ విధ్వంసకర అస్త్రాలను ప్రదర్శించారు.
→ తమ దేశంలోని అణ్వాయుధ సంస్థను సందర్శించిన ఆయన.. అక్క డున్న వివిధ రకాల అణు వార్హెడ్లను పరిశీలిం చారు.
→ ఆ ఫొటోలను ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది.
→ అక్కడ కొత్త రకం ట్యాక్టికల్ వార్హెడ్లు కూడా ఉన్నాయి. స్వల్పశ్రేణి క్షిపణులు సహా అనేక అస్త్రాల్లో అమర్చేలా ఈ చిన్నపాటి బాంబులను రూపొందించినట్లు స్పష్టమవుతోంది.
→ దక్షిణ కొరియా లక్ష్యంగా రూపొందిన వీటికి హ్వాసన్-31 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
→ ఖండాంతర క్షిపణుల్లో అమర్చేలా వార్హెడ్ పరి మాణాన్ని బాగా కుదించడంలో ఉత్తర కొరియా పురోగతి సాధించినట్లు ఈ చిత్రాలు సూచిస్తు న్నాయి.
→ యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేసే సామర్థ్యమున్న భారీ టోర్పిడో కూడా అక్కడ కనిపించింది.

వ్యర్థ జలాలను శుద్ధి చేసి సేద్యానికి వాడాలి

వ్యర్ధ జలాలను శుద్ధి చేసి, వ్యవసా యంలో వాడటం వల్ల హానికర గ్రీన్ హౌస్ ఉద్గారాలకు కళ్లెం వేయవచ్చని తాజా అధ్య యనం పేర్కొంది.
→ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వి రానిమెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ అధ్యయనం చేసింది.
→ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా ప్రకారం.. భారత్లో 2025 నాటికి 15 ప్రధాన నదీపరివాహక ప్రాంతాల్లో 11 చోట్ల నీటి లభ్యత తగ్గొచ్చు.
→ డిమాండ్-సరఫ రాలో అంతరాన్ని పూడ్చడానికి ప్రత్యామ్నాయ జలవనరులను శోధించాల్సి ఉంది.
→ వ్యర్థజలా లను శుద్ధి చేసి, వ్యవసాయానికి వినియోగిస్తే 2021లో భారత్లో 1.38 మిలియన్ హెక్టా ర్లలో పొలాలు సాగులోకి వచ్చేవి.
→ దీనివల్ల రూ.96 వేల కోట్ల ఆదాయం సమకూరి ఉండే దని, 10 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గి ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు.

సుదూర గ్రహంలో 225 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు

అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్).. భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్-1బి అనే గ్రహంపై ఉష్ణోగ్ర త్ర తను కొలిచింది.
→ 225 డిగ్రీల సెల్సి 'యస్ వేడితో అది నిప్పుల కొలిమిలా ఉంటుందని తేల్చింది. ఆ గ్రహం నుంచి వెలువడే థర్మల్ ఉద్గారాలను విశ్లేషించిన టెలిస్కోపులోని మిడ్ ఇన్ఫ్రారెడ్ పరికరం.. ఈ మేరకు తేల్చింది.
→ ఈ సాధనానికి సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాల ఉష్ణోగ్రతలు, భూ పరిమాణంలో ఉన్న గ్రహాలను వర్గీకరించే సామర్థ్యం ఉంది.
→ జీవుల మనుగడకు అవసర మైన స్థాయిలో అక్కడ వాతావరణం ఉందా. అన్నది కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
→ ట్రాపిస్ట్-1 వ్యవస్థలో మొదటి గ్రహం 1బి. మాతృతారకు చాలా దగ్గరగా ఉండటం వల్ల అది ఎక్కువ వేడిని పొందుతోంది.

పాల దిగుబడిలో భారత్ ప్రథమ స్థానం

పాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని, 220 మిలియన్ టన్నుల లీటర్లు ఉత్పత్తి చేస్తోందని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్ డీబీ) చైర్మన్ మీనేష్ తెలిపారు. అమెరికా 104 మిలియన్ టన్నుల లీటర్లతో ద్వితీయ స్థానంలో ఉందన్నారు.
→ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సహకార డెయి రీల ప్రతినిధులతో 'గడ్డి గింజల ఉత్పత్తి, పంపిణీ పై కార్యశాల నిర్వహించారు.
→ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'దేశంలో 300 డెయిరీల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం.
→ పశుగ్రాసం నుంచి వినియోగదారునికి పాలు అందించే వరకు ప్రతి స్థాయిలో ఎన్డీ బీ సేవలందిస్తోంది.
→ పాల దిగుబడి పెంచేందుకు పశుగ్రాస విత్తనాలను పూర్తి రాయితీపై అందిస్తాం' అని తెలిపారు.
→ అనంతరం క్షేత్రస్థాయిలో పశుగ్రాస విత్తనోత్పత్తి పంటలను పరిశీలించి, రైతు క విత్తనాలను ఉచితంగా అందజేశారు.
→ సమావే శంలో మహిళా డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ. జీఎం భాస్కర్రె డ్డి, ఎన్డీడీబీ ప్రాంతీయ అధికారి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

'ఇష్టా' జాతీయ కార్యదర్శిగా పల్లె నర్సింహ

ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసి యేషన్ (ఇష్టా) జాతీయ కార్యదర్శిగా పల్లె నర్సింహ ఎన్నికయ్యారు.
→ ఝార్ఖండ్ లోని డాల్టన్ పట్టణంలో నిర్వహించిన ఇష్టా జాతీయ మహాసభల్లో ఏర్పడిన నూతన కమిటీకి కార్యదర్శిగా పల్లె నర్సింహ ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు.
→ ఉపాధ్యక్షుడిగా కందిమళ్ల ప్రతా పరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా కన్నం లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాస్, కె. ఉప్పలయ్య, పి. నళిని, కె.స్వామి, జగన్, కొండలరావు ఎన్నికయ్యారని పల్లె నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
→ దేశంలో సాంస్కృతిక ఉద్య మానికి పునరుజ్జీవం కల్పించడంతోపాటు కళారంగానికి పూర్వవైభవం తీసుకొస్తానని ఆయన పేర్కొన్నారు.

మెస్సి సెంచరీ

కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన అర్జెం టీనా ఫుట్బాల్ సూపర్స్టార్ లియొనల్ మెస్సి మరో మైలురాయి అందు కున్నాడు.
→ కురసావోతో స్నేహపూర్వక మ్యాచ్లో హ్యాట్రిక్ కొట్టిన అతడు.. ఈ క్రమంలో దేశం తరపున 100 గోల్స్ ఘనతను కూడా సొంతం చేసు కున్నాడు.
→ కురసావోతో మ్యాచ్లో తొలి అర్ధభాగంలో మెస్సి (20, 33, 37 ని) మూడు గోల్స్ సాధించి జట్టును విజయపథంలో నడిపించాడు.
→ అత డితో పాటు గోంజెలెజ్ (23వ), ఫెర్నాండెజ్ (35వ), డిమారియా (78వ), మాంటియెల్ (87వ) కూడా ఒక్కో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 7-0తో ఘన విజయాన్ని అందుకుంది.
→ అధికారిక అంతర్జాతీయ మ్యాచ్లో దేశం. తరపున ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మెస్సి మూడో స్థానంలో ఉన్నాడు.
→ క్రిస్టియానో రొనాల్డో (122), ఇరాన్ ఆటగాడు అలీ డాయ్ (109) మాత్రమే అతడికన్నా ముందున్నారు. భారత స్టార్ సునీల్ ఛెత్రి (85) అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

సైబీరియా ఎడారిలో ఖండాంతర క్షిపణులతో పరీక్షలు

ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో అణు విన్యాసాలు ప్రారంభించింది.
→ వ్యూహా త్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుం టున్నాయి. ఇందులో దేశ అణు సత్తాను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా పరీక్షించనున్నారు.
→ ఈ విన్యాసాల్లో డించలేదు. 12 వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే యార్స్ ఖండాం |తర క్షిపణులూ పాల్గొనడం గమనార్హం.
→ వీటికి వివిధ రకాల అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. 'మొత్తం మీద 3 వేల మంది సైనిక సిబ్బందితో పాటు 300 వాహనాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి' అని రష్యా రక్షణశాఖ తెలిపింది.
→ ట్రక్కు లపై వెళుతున్న ఖండాంతర క్షిపణులు చిత్రాలను కూడా విడుదల చేసింది. మొత్తం మూడు ప్రాంతాల్లో యార్స్ సంచార వ్యవస్థలు తమ పాటవాన్ని చూపనున్నాయని సమాచారం.
→ ప్రాంతాల పేర్లను మాత్రం మాస్కో వెల్లడించలేదు ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగాలు ఉంటాయా లేదా అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వ లేదు.
→ అయితే క్షిపణి పరీక్షలకు సంబంధించి అమెరి కాతో ఇక ఎలాంటి సమాచారం పంచుకోబోమని తేల్చి చెప్పింది.
→ ఈ విషయాన్ని రష్యా ఉప విదేశాంగమంత్రి సెర్గీ రిబకోవ్ కూడా ధ్రువీకరించారు.
→ గతంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా మాస్కో, వాషింగ్టన్లు సమాచారం పంచుకొనేవి.
→ అయితే గత నెల న్యూస్టార్ట్ అణ్వాయుధ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది.
→ ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అగ్రరాజ్యానికి ఎలాంటి సమాచారం అందించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక 'చరక' పురస్కారం

ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డిని చెన్నైకి చెందిన గిండీ రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు శ్రీరామ్, అలెక్స్ పాల్ మేనన్, రాధా క్రిష్ తదితరులు డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ఈ అవా ర్డును అందజేశారు.
→ ఈ సందర్భంగా గిండీ రోటరీ క్లబ్ అధ్యక్షుడు రమేశ్బాబు మాట్లాడుతూ.. వైద్యవృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తూ రోగులకు విశిష్ట సేవలు అందిస్తున్న డా. నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారం ప్రదానం చేయడం గర్వ కారణంగా ఉందన్నారు.
→ డా. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గిండీ రోటరీ క్లబ్ 3 దశాబ్దాలుగా వ్యాధుల నివారణే లక్ష్యంగా పోరాడుతోందన్నారు.

'ఫ్లోట్ ఆన్- ఫ్లోట్ ఆఫ్'లో చెన్నై పోర్టు సరికొత్త రికార్డు

భారత నౌకా పరిశ్రమ గర్వించేలా చెన్నై పోర్టు తన పనితనంతో తడాఖా చూపింది.
→ ఓ భారీ వస్తువును (పెద్ద పంటపై అమర్చే 'ఫ్లోట్ ఆన్ - ఫ్లోట్: ఆఫ్(ఫ్లో-ఫ్లో) పద్ధతిని విజయవంతంగా పూర్తి చేసింది.
→ అరుదుగా చేపట్టే ఈ క్రతువును పూర్తి చేసిన పోర్టు అధికారులు, ఇంజినీర్లను ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రశంసిం చారు.
→ పోర్టులు, షిప్పింగ్ రంగానికి ఇదో గొప్ప శుభవార్త అని కొనియాడారు.

→ విశేషం ఏంటీ..? :-
→ 285 మీటర్ల పొడవు, 43 మీ వెడల్పు, 14.2 మీ ఎత్తుతో 17 వేల టన్నుల బరువున్న 'ఎంవీ 'మలీషా' అనే ఓడను ఉన్నది ఉన్నట్లు చెన్నై నుంచి 14 వేల కి.మీ దూరంలోని రిపబ్లిక్ ఆఫ్ గయానా దేశానికి తరలించాలి.
→ అందుకు... ముందుగా దాన్ని భారీ పంటుపై అమర్చాలి. ఇది పనికాదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా అంత సులువైన భావించి చెన్నై పోర్టు ఈ బాధ్యతను తీసుకుంది.
→ అరుదైన ఫ్లోట్ ఆన్ - ఫ్లోట్ ఆఫ్ విధానాన్ని ఎంచుకొని.. ఇటీవలే దిగ్విజయంగా పంటు పైకి ఓడను చేర్చి ఆ దేశానికి సాగనంపింది.
→ ఎలా చేర్చారంటే:-
→ బార్జి మధ్య ప్లాట్ఫాంను సముద్రం నీటిలో మునిగేలా చేశారు. ఓడను నీటి మార్గాన తీసుకెళ్లి సరిగ్గా.. బార్డ్ ప్లాట్ ఫాంపై కూర్చునేలా నిలిపారు.
→ ఆ తర్వాత ముంచి ఉంచిన ప్లాట్ఫాం భాగాన్ని పైకి లేపారు. దాంతో ఓడ.. బార్జిలోకి వచ్చిన ట్లయింది.
→ వెంటనే భారీ దూలాలతో ఓడను కదలకుండా బిగించేశారు. ఈ తంతు పూర్తికి 12 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిం దని పోర్టు అధికారులు తెలిపారు.
→ ఇందుకు బార్జిలో ఓడ కోసం ప్రత్యేక ప్లాట్ఫాంను తయారు చేసినట్లు వివరించారు. ఇది ఓ రికార్డు అని, 'మేకిన్ ఇండియా' సాధించిన ఘనతగా పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వశాఖ ప్రకటించింది..

విశాఖపట్నంలో ''జి-20' సన్నాహక సమావేశాలు

పట్టణాలు, నగ రాల అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగ మించి ముందుకెళుతున్న తీరును 'జి-20' సన్నాహక సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, నిపుణులు వివరించారు.
→ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం జీ20 ప్రెసిడెన్సీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్త ఆధ్వ ర్యంలో 'కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్' నిర్వహించారు.
→ నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు అంతర్జాతీయంగా అవలంబి స్తున్న విధానాలపై చర్చించారు.
→ స్థానిక ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను వివరించారు.
→ భారత్, సింగ పూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనాలకు చెందిన నిపు ణులు ఆయా దేశాల్లోని నగరాల్లో మౌలిక సదుపా యాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరిం చారు.
→ సింగపూర్ లోని జాతీయ పర్యావరణ సంస్థ (ఎన్ఎస్ఈఏ) మాజీ డిప్యూటీ సీఈవో అహ్ తువాన్ లో. తమ దేశంలో నగరాల సుస్థిరాభివృద్ధికి అమలు చేస్తున్న పద్ధతులను వివ రించారు.
→ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు, వ్యర్థాలు, నీటి నిర్వహణ, విద్య, పర్యావరణ పర్యవే క్షణపై అవగాహన కల్పిం చారు.
→ దక్షిణ కొరియాలో బడుల ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరును సియోల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇన్స్టీ కిమ్, నిపుణులు హుయ్ షిన్ ప్రస్తావించారు.
→ అనంతరం ప్రతినిధులు ముడసర్లోవలోని ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని చెత్త నుంచి విద్యుదుత్పత్తి కేంద్రం, మాధవధారలోని 24 గంటల నీటి సరఫరా కేంద్రాలతోపాటు కైలాసగి రిని సందర్శించారు.
→ వివిధ దేశాల్లో అభివృద్ధి చర్యల గురించి తెలుసుకునేందుకు మెరుగైన శిక్షణ నిర్వహిం చిన భారత ప్రభుత్వాన్ని వారు అభినందించారు.
→ కార్య క్రమంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.

వందేళ్లుగా రైతుల సేవలో లాం పరిశోధన కేంద్రం

స్వాతంత్య్రానికి పూర్వమే వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటైన తొలి సంస్థ లాంపామ్.
→ వర్షాధార ప్రాంతాల్లో అత్తెసరు దిగుబడు లతో నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఆసరాగా నిలిచింది.
→ చిరుదాన్యాల దిగుబడులు పెంపు ప్రయోగాలతో మొదలై పశు పరిశోధన, ఆహార, వాణిజ్య పంటల పరిశోధనలకు చుక్కానిలా నిలిచింది.
→ మెరుగైన వ్యవసాయ విధానాలు, కొత్తరకం వంగడాల ఆవిష్కరణలకు జాతీయస్థాయిలో వేదికగా మారింది.
→ బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటై... నేటికీ సాగుఫలాలకు ఊతమిస్తున్న గుంటూరు లాంఫామ్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం వంద వసం తాలు పూర్తిచేసుకుంది.

ఎమ్మెల్సీలుగా ప్రమాణం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం గా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీలు

తెలంగాణలో 2021-22 సంవత్సరానికి రా ష్టస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
→ మొత్తం 43 పం చాయతీలకు 47 పురస్కారాలు లభించాయి.

వన్ వెబ్ ఇండియా-2 సక్సెస్

షార్ నుంచి అత్యంత బరువైన ఎల్పీఎం 3- ఎం3 బాహుబలి రాకెట్ను విజయవంతం గా పరీక్షించింది.
→ తొలి బ్యాచ్లో 36 ఉప గ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
→ తాజా యోగ మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు.

అమెరికా జర్నలిస్ట్ రష్యాలో అరెస్ట్

రష్యాలో విలేకరిగా విధులు నిర్వర్తిస్తున్న అమె రికాకు చెందిన అంతర్జాతీయ వార్తాపత్రిక 'ది వాల్ట్ జర్నల్ 'కు చెందిన ఇవాన్ ను రష్యా నిఘా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎ ఫ్ఎస్బీ) అరెస్ట్్చసింది.
→ రహస్య పత్రాలను సేకరించేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు మోపింది.

ఎలాన్ మస్క్ రికార్డ్

ఎలాన్ మస్కును ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
→ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జస్టిన్ బీబర్ వంటి ప్రముఖులకు ఉన్న ఫాలోయింగ్ కన్నా ఎలాన్ మస్క్ ఎక్కువ పాపులారిటీ సాధించాడు.
→ 133 మిలియన్ల ఫాలోయర్లు ప్రస్తుతం మస్క్ ను ఫాలో అవుతున్నారు.

ఆంగ్ సాన్ సూకి పార్టీ రద్దు

మయన్మార్ సైనిక ప్రభుత్వం 40 ప్రతి పక్ష పార్టీలను రద్దు చేసింది.
→ ఇందులో ప్రముఖ నాయకురాలు అంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్ర సీ ఉంది.
→ గడువు లోపు నమోదు చేసుకోని పార్టీలను రద్దు చేసింది.

నాసా కొత్త ప్రాజెక్టు సారథిగా అమిత్ క్షత్రియ

భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్, రోబోటిక్స్ ఇంజినీర్ అమిత్ క్షత్రియ అరుదైన ఘనత సాధించారు.
→ అమెరికా అంతరిక్ష పరిశో ధనా సంస్థ(నాసా)లో కొత్తగా ఏర్పాటు చేసిన 'చంద్రుడి నుంచి అరుణుడి వరకు (మూన్ టు మార్స్' ప్రాజెక్టుకు తొలి సారథిగా నియమితుల య్యారు.
→ మానవాళి ప్రయోజనాల కోసం నాసా చేపట్టిన... చంద్రుడు, అంగారక గ్రహాలపై జీవ రాశి అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
→ ఇలాంటి ప్రతిష్ఠాత్మక విభాగానికి భారత సంతతి వ్యక్తి నేతృత్వం వహిం చడం ఇదే మొదటిసారి.
→ అంతరిక్ష పరిశోధనల రంగంలో అమిత్ క్షత్రియ 2003లో తన ప్రస్థానం ప్రారం భించారు.
→ ఎక్స్ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిష 5 డై రెక్ట రేట్ (ఈఎస్ఓ ఎండీ)కు తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారు.
→ సాఫ్ట్ వేర్, రోబోటిక్స్ ఇంజినీర్గానే కాకుండా స్పేస్ క్రాఫ్ట్ ఆపరేటర్గానూ నాసాలో సేవలందించారు. 2014 నుంచి 2017 వరకు స్పేస్ స్టేషన్ ఫ్లైట్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు.
→ తన సేవలకుగానూ నాసా అవుటాండింగ్ లీడర్షిప్ మెడల్, సిల్వర్ సూపీ అవార్డు పొందారు.
→ ఇకపై 'చంద్రుడి నుంచి అరుణుడి వరకు' ప్రాజెక్టు ప్రణాళికల రూపకల్పన, అమలులో ముఖ్య భూమిక పోషించ నున్నారు. స్థూలంగా అంగారకుడిపై మనుషుల్ని పంపే బాధ్యత ఆయనదే.

'తెలంగాణ మట్టి వాసన'కు సినారె పురస్కారం

జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య, సాహితీ గౌతమి ఏటా అందించే రాష్ట్ర స్థాయి సినారె పురస్కారం అన్నవరం దేవేందర్ రచించిన 'గవాయి' పుస్తకానికి దక్కింది.
→ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రచనలను ఆహ్వానించి దేవేందర్ కమిటీ ద్వారా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
→ దేవేందర్ రచనలు తెలంగాణ మట్టి పొరల్లో దాగిన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి.
→ సాహితీ ఇప్పటివరకు 16 పుస్తకాలు (12 కవిత్వం, 2 ఆంగ్ల అనువాద కవిత్వం, 2 వ్యాసాల సంపుటి) వెలువ రించారు.

అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికను కీలక పదవి

అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరి కన్ కీలక పదవిని అలంకరించనున్నారు.
→ అమెరికా విదే శాంగ శాఖలో శక్తిమంతమైన డిప్యూటీ సెక్రటరీ(నిర్వ హణ, వనరులు) పదవికి ప్రముఖ న్యాయవాది, దౌత్య వేత్త రిచర్డ్ వర్మ (54) నామినేషనన్ను సెనెట్ ఆమోదిం చింది.
→ ఓటింగ్ లో 67-26 మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఈ హోదాను విదే శాంగ శాఖ సీఈవోగా పరిగణిస్తారు.
→ రిచర్డ్ వర్మ 2015-2017 మధ్య భారత్లో అమెరికా రాయబారిగా సేవలు అందించారు.
→ ప్రస్తుతం మాస్టర్కార్డ్ సంస్థకు ప్రధాన న్యాయ వ్యవహారాల అధికారిగా, ప్రపంచ ప్రజా విధానాల విభాగ అధిపతిగా ఉన్నారు.
→ ఒబామా.. హయాంలో విదేశాంగ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ(చట్ట వ్యవహారాలు)గా వ్యవహరించారు. అంతకు ముందు సెనెటర్ హారీ రెడ్కు జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందించారు.
→ ఆసియా గ్రూప్ ఉపాధ్యక్షుడిగా బాధ్య తలు నిర్వర్తించారు. మరి కొన్ని సంస్థల్లోనూ వివిధ హోదాల్లో కొనసాగారు.
→ అమెరికా వైమానిక దళంలో జడ్జి అడ్వొకేట్గా పనిచేశారు. అధ్యక్షుడి నిఘా సలహా బోర్డులో సేవలందించారు.
→ సామూ హిక విధ్వంస ఆయు ధాలు, ఉగ్రవాద నిరోధక కమిషన్ సభ్యుడిగా కొన సాగారు. ఫోర్డ్ ఫౌండేషన్ ట్రస్టీగానూ, మరికొన్ని సంస్థల బోర్డుల్లో సభ్యుడిగానూ ఉన్నారు.
→ అమెరికాకు వలస వచ్చిన ఓ భారతీయ కుటుంబంలో 1968లో జన్మించిన రిచర్డ్ వర్మ పెన్సిల్వేనియాలో పెరిగారు
→ . జార్జిటౌన్ యూనివర్సిటీ లా సెంటర్లో న్యాయవాద విద్యలో పీజీ, జార్జిటౌన్ యూనివర్సిటీలో పీహెచ్ చేశారు.
→ తన సేవలకుగానూ విదేశాంగ శాఖ, విదేశీ వ్యవహారాల మండలి, వైమానిక దళం నుంచి పురస్కా రాలు అందుకున్నారు.

మనిషికి సోకిన ‘వృక్ష శిలీంధ్రం'!

సాధారణంగా వృక్షజాతుల్లో వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంధ్రం తొలిసారి మనదేశంలో ఓ వ్యక్తికి సోకింది.
→ ప్రపంచంలోనే ఈ తరహా కేసు ఇదే కావడం గమనార్హం.
→ వృక్షాల్లో 'సిల్వర్ లీఫ్' వ్యాధికి కారణమయ్యే 'కొండ్రోస్టీరియం పోర్పోరియమ్' అనే శిలీంధ్రం.. కోల్కతాకు చెందిన వృక్ష సంబంధిత శిలీంద్రాలపై పని చేసే ఓ పరిశోధకుడికి సోకింది.
→ బాధితుడికి చికిత్స అందజేసిన వైద్యులు ఈ కేసుపై రూపొందించిన ఓ నివేదిక.. 'మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమైంది.
→ 'గొంతు బొంగు రుపోవడం, దగ్గు, ఆయసం, ఆహారం మింగడానికి ఇబ్బంది, ఆకలి మందగించడం వంటి లక్షణాలు బాధి తుడి(61)లో కనిపించాయి.
→ ఆయనకు మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, గాయాలు వంటివి ఏం లేవు. వృత్తిపరంగా ఆయన వృక్షసంబంధిత మైకాల జిస్ట్.
→ కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ వృక్ష సంబంధిత శిలీంద్రాలపై ఏళ్లుగా పరిశోధన సాగిస్తున్నారు.
→ కుళ్లిపోతున్న పదార్థాలతో పని చేయ డమే ఈ అరుదైన సంక్రమణకు కారణం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ స్వభావం, వ్యాప్తి చెందగల సామర్థ్యం మొదలైనవి నిర్ధారితం కాలేదు' అని నివేదికలో పేర్కొన్నారు.
→ 'బాధితుడి మెడ వద్ద కణితిని గుర్తించి. శస్త్రచికిత్స ద్వారా తొలగించాం. అనంతరం తీసిన 'ఎక్స్-రే’లో అసాధారణంగా ఏమీ కనిపించలేదు.
→ ఆయన 'యాంటీ-ఫంగల్ ఔషధాలు తీసుకున్నారు. ఇది జరిగి రెండేళ్లవుతోంది. ఆయన ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారు.
→ ఆ వ్యాధి పునరావృతం అవుతుం దనేందుకు కూడా ఆధారాల్లేవు. అయితే, సంప్రదాయ పరీక్ష విధానాలు (మైక్రోస్కోపీ, కల్చర్) బాధితుడిలో ఫంగస్ ఆనవాళ్లను గుర్తించలేకపోయాయి.
→ ప్రస్తుతా నికి సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధి కారకాన్ని గుర్తించొచ్చు.
→ వృక్షసంబంధిత శిలీం ధ్రాల ద్వారా మనుషులకు వ్యాధి సోకే అవకాశాలు, వాటిని గుర్తించే విధానాల ఆవశ్యకతను ఈ కేసు చాటిచెబుతోంది' అని వైద్యులు తెలిపారు.

ప్రపంచ బ్యాంకు అధిపతి మన అజయ్ బంగానే!

ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షు డిగా, భారత-అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా (63) నియమితులు కానున్నారు.
→ నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ఈ పదవికి అందిన ఏకైక నామినేషన్ బంగాదేనని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.
→ అధికారికంగా బంగా నియామకాన్ని మేలో ప్రకటించొచ్చు.
→ ఆర్థిక పరి స్థితుల రీత్యా అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో, ప్రపంచ బ్యాంకుకు నేతృత్వం వహించడానికి అజయ్ బంగాను నామినేట్ చేస్తున్నట్లు అమెరికా ||అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
→ ప్రస్తుతం బంగా జనరల్ అట్లాంటికు వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తు ప్రపంచ బ్యాంకు ఎగ్జి న్నారు. గతంలో ఈయన మాస్టర్కార్డ్కు క్యూటివ్ డైరెక్టర్ల నేతృత్వం వహించారు.

→ బంగా మనకు చరిత్రే:-
→ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎస్ఎఫ్), ప్రపంచ బ్యాంకుల్లో ఏదో ఒక దానికి అధిపతిగా మారిన తొలి భారతీయ-అమె రికన్, సిక్కు - అమెరికన్ బంగాయే అవుతారు.
→ ప్రపంచబ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మల పాప్ జూన్లో వైదొలగనున్నారు. ఆయన పద వీకాలం ఇంకా ఏడాది ఉండగానే, తప్పుకుంటు న్నారు.
→ పర్యావరణ మార్పులపై ఆయన వ్యక్తి, గత అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు రావడం ఇందుకు నేపథ్యం.

ఐఎన్ఎస్ సుజాత

కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లోని ఐఎన్ఎస్ సుజాత నౌక విదేశీ విస్తరణలో భాగంగా మార్చి 19, 20 తేదీల్లో మొజాం బిక్లోని పోర్ట్ మపుటోను సందర్శించింది.
→ మొజాంబికన్ నేవీ రియర్ అడ్మిరల్ యుజె నియో డయాస్ డా సిల్వా ముటుకా, మపుటో మేయర్ ఎనియాస్ డా కాన్సెకావో కొమిచే ఈ నౌక స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.
→ ఇరుదేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం మెరుగుపర్చుకోవడం ఈ సందర్శన ఉద్దేశం.

నేపాల్ - ఇండియా

నేపాల్లో మూడు రోజులు నిర్వహించిన నేపాల్-ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ మార్చి 19న ముగిసింది.
→ బిరత్నగర్ మెట్రోపాలిటన్ సిటీ (నేపాల్), క్రాంతిధార లిటరేచర్ అకా డమీ ఆఫ్ మీరట్ (ఇండియా) ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు.
→ దీనిలో నేపాల్, భారత్ నుంచి 350 మంది సాహిత్య రచయితలు | పాల్గొన్నారు. నేపాల్-ఇండియా మధ్య సాహి త్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 10 పాయింట్ల బిరత నగర్ డిక్లరేషను ఆమోదించారు.
→ ఇరు దేశాల సాహిత్యాన్ని పరస్పరం హిందీ నుంచి నేపాలీలోకి నేపాలీ నుంచి హిందీలోకి అనువ దించడం, మహాభారతంలోని బిరాట ప్యాలె స్ ను మహాభారత్ సర్క్యూట్తో అనుసంధా నించడం, పురావస్తు కళాఖండాలను అన్వే షించడానికి సాహిత్య రచయితలను ప్రోత్స హించడం, ఇరుదేశాల రచయితలు తమ సాహిత్యాన్ని పంచుకోవడానికి ఆన్లైన్ వేది కను సృష్టించడం తదితర విషయాలు 10. పాయింట్స్ డిక్లరేషన్లో పొందుపర్చారు.

ఫ్లా ట్ బర్న్

గాలి కాలుష్యాన్ని కొలిచే చవకైన పరికరం 'ఫ్లా ట్బర్న్' అనే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు మార్చి 19న వెల్లడిం చారు.
→ 2017లో దీన్ని రూపొందించినా, ఇప్పుడు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. నైట్రోజన్ సహా వివిధ కాలుష్య కారకాలను ఈ పరికరం కచ్చితంగా కొలుస్తుంది.
→ 3డీ ప్రింటింగ్ ద్వారా లేదా చవకైన విడి భాగాలు ఆర్డర్ చేయడం ద్వారా ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు.
→ ఈ పరికరం న్యూయార్క్, బోస్టన్లలో లభ్యమవుతుంది.

స్టార్ క్రేట్

అంగారకుడిపై నిర్మాణాలు చేపట్టేందుకు కొత్త కాంక్రీటు తయారుచేసినట్లు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కు చెందిన సైంటిస్టులు మార్చి 19న వెల్లడించారు.
→ దీనికి స్టార్క్రేట్ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో అంగారకుడిపై నిర్మాణాలు చేపడితే భూమి నుంచి కాంక్రీటు తీసుకెళ్లడం కష్టం కాబట్టి అక్కడే లభ్యమయ్యే ధూళి, ఆలుగడ్డలు, ఉప్పును వినియోగించి ఈ కాంక్రీటును తయారుచేయవచ్చని వెల్లడించారు.

ఫారెస్ట్ డే

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ను మార్చి 21న నిర్వహించారు. మానవాళి మనుగడకు అడ వులు, చెట్ల ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఈ డేని నిర్వహిస్తు న్నారు.
→ 2011లో ఐక్యరాజ్యసమితి 2011- 20ను అంతర్జాతీయ అటవీ దశాబ్దంగా ప్రక టించింది. 2012లో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దీని థీమ్ 'ఫారెస్ట్ అండ్ హెల్త్'.

అంతర్జాతీయ పుట్బాల్ అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు

పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ పుట్బాల్ అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
→ 2024 యూరోపియన్ చాంపియన్ షిప్ క్వాలిఫయర్స్లో భాగంగా మార్చి 24న లీ టెన్స్టెయిన్ పోర్చుగల్ తరపున మ్యాచ్ ఆడాడు.
→ ఇది అతడికి జాతీయ జట్టు తరపున | 197వ మ్యాచ్ దీంతో కువైట్కు చెందిన బేడర్ అల్ ముతావా (196) రికార్డును రొనాల్డో వెనక్కి నెట్టాడు.
→ 2021లోనే అత్యధిక అంత ర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఐరోపా ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు. ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు.
→ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ (118) రికార్డు కూడా అతడి పేరు మీదే ఉంది

చాట్ జీపీటీపై ఇటలీలో నిషేధం

ప్రపం చవ్యాప్తంగా చాట్gpt నేడు చర్చనీయాంశంగా మారగా... దీని వాడకంపై ఇటలీ నిషేధం విధించింది.
→ చాటేజీ పీటీ అనేది కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్. టెక్ రంగంలోకి దీని ప్రవేశంపై నిపు ణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
→ ఈ క్రమంలో ఐరోపా దేశం ఇటలీ ఈ అప్లికేషను పై నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చేలా ఇటలీ అధికారులు ఆదేశాలు జారీ చేయ డంతో చాటి జీపీటీని బ్లాక్ చేశారు.
→ ఈ చాటా బా టన్ను బ్లాక్ చేసిన మొదటి ఐరోపా దేశం ఇటలీ కావడం గమనార్హం.
→ తాము చాటే పీటీని బ్లాక్ చేస్తున్నట్లు శుక్రవారం ఇటాలియన్ డేటా ప్రొటె క్షన్ అథారిటీ వెల్లడించింది.
→ అలాగే ఇది తమ దేశ సమాచార భద్రతా నియంత్రణలకు లోబడి ఉందా.. లేదా అనేదానిపై విచారణ జరుపుతా మని తెలిపింది.
→ డేటా ఉల్లంఘనకు సంబంధిం చిన కేసు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
→ ఇప్పటికే దీనిపై చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నిషేధం విధిం చాయి. గతేడాది చివరలో చాటీ జీపీటీ ప్రపంచా నికి అందుబాటులోకి వచ్చింది.
→ రావడంతోనే సాంకేతికరంగంలో ఎంతో ప్రాచుర్యం సొంతం చేసుకుంది. దాదాపు అన్ని టెక్ దిగ్గజ సంస్థలు దీనిపై దృష్టి సారించాయి.
→ చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఏఐకి మైక్రోసాఫ్ట్ సహకారముంది. ఆ సంస్థ ఇందులో పెట్టుబడులు పెట్టింది.

సలీమ్ దురాని కన్నుమూత

భారత క్రికెట్ తొలి తరం దిగ్గజాల్లో ఒకడైన సలీమ్ దురాని ఆదివారం కన్నుమూశాడు.
→ ఆయన వయసు 88 ఏళ్లు. 1960-73 మధ్య అంతర్జా తీయ క్రికెట్ ఆడిన దురాని తన ఆటతోనే కాక చలాకీ తనంతో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకు న్నాడు.
→ అభిమానులతో పాటు సహచర క్రికెటర్లు ఆయన్ని 'ప్రిన్స్'గా పిలుచుకునేవారు.
→ అఫ్గానిస్థాన్లోని కాబూల్లో పుట్టిన దురాని.. పెరిగింది మాత్రం గుజరాత్లోని జామ్నగర్, 29 టెస్టులాడిన ఈ ఆల్రౌండర్.. 1202 పరుగులు చేసి, 75 వికెట్లు పడగొట్టాడు.
→ 170 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లోడిన దురాని 8,545 పరుగులు చేశాడు. 484 వికెట్లు తీశాడు. 1961-62లో ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్టుపై భారత్ 2-0తో సిరీస్ సాధించడంలో సలీమ్ పాత్ర కీలకం.
→ అది సలీమ్ కు రెండో సిరీస్ మాత్రమే. లెఫ్టార్మ్ స్పిన్నరైన దురాని.. కోల్కతా టెస్టులో 10, మద్రాస్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి దోహదపడ్డాడు.
→ 1971లో వెస్టిండీస్ పై భారత జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకోవడంలోనూ దురాని ముఖ్య పాత్ర పోషించాడు.
→ రెండో ఇన్నింగ్స్లో దిగ్గజ ఆటగాళ్లు లాయిడ్, సోబర్స్ ను ఔట్ చేసి జట్టును గెలుపు బాటలో నడిపాడు. టాప్ ఆర్డర్లో చాలా దూకుడుగా ఆడే బ్యాటర్గానూ దురానికి మంచి పేరుంది.
→ అభిమానుల కోరిక మేరకు ఫోర్లు, సిక్సర్లు బాదడం ఆయన ప్రత్యేకత.
→ 1960లో ముంబయి బ్రబోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో అరంగేట్రం చేసిన దురాని.. అదే వేదికలో 1973లో ఇంగ్లాండ్తో చివరి మ్యాచ్ ఆడాడు.
→ రెండున్నర దశాబ్దాల దేశవాళీ కెరీర్లో ఆయన గుజరాత్, రాజస్థాన్, సౌరాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్లో అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ దురాని.
→ 1973లో 'చరిత్ర' అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించాడు. దురాని మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.
→ "దురాని ఒక దిగ్గజం. ఆయనో వ్యవస్థ. ప్రపంచ క్రికెట్లో భారత్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. దురాని మృతి ఎంతగానో బాధించింది. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నా" అని మోదీ పేర్కొన్నారు.

అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడైన దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
→ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి(సీఎస్) ఎ. శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
→ ప్రతి ఏడాది ఏప్రిల్ 3న దొడ్డి కొమురయ్య జయంతి, జులై 4న వర్ధంతిని రాష్ట్ర కార్యక్రమాలుగా నిర్వహించాలని ఆ ఉత్తర్వులో సీఎస్ పేర్కొన్నారు.

పునర్వినియోగ వాహక నౌక పరీక్షలు విజయవంతం

అంతరిక్షంలో ఉపగ్రహా లను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో కీలక మైన పరీక్షను ఇస్రో విజయవంతంగా ముగించింది.
→ కర్ణా టకలోని చిత్రదుర్గం జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీ ఆర్) లో ఇస్రో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీ ఎల్ ఈఎక్స్) ను విజయవంతంగా పరీక్షించింది.
→ ప్రపంచం లోనే తొలిసారిగా రెక్కలున్న వాహకనౌకను భూమికి 4.5 కిలోమీటర్ల దూరం నుంచి సురక్షితంగా, స్వయంగా రన్వే పై ల్యాండ్ అయ్యే పరీక్షను చేపట్టినట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
→ ఐఏఎఫ్కు చెందిన చినూక్ హెలికాప్టర్ లో ఆర్ఎల్వీని మోసుకెళ్లి 4.5 కిలో మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు.
→ తిరిగి ల్యాండ్ అయ్యే పరిస్థితులన్నీ సాంకేతికపరంగా సరిగా ఉన్నట్లు నిర్ధారించుకుని ల్యాండింగ్ సంకేతాలు పంపారు.
→ ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 30 నిమిషాల తరువాత రన్వేలో ల్యాండ్ అయినట్లు ఇస్రో వెల్లడించింది.
→ డ్రాగ్ రేషియా లిఫ్టింగ్ విధానంతో 350 కిలోమీటర్ల వేగంతో ఆర్ఎల్వీని తయారు చేయగా, సూడో సిస్టమ్స్ తదితర డిజిటల్ హంగులతో ఎల్ఈఎక్స్ను రూపొందించినట్లు ఇస్రో ప్రకటించింది.
→ ఈ ప్రయోగంలో మరో కీలకమైన అడుగు వేసినట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రకటించారు.
→ ఆర్ఎల్వీని మరింత కఠినమైన పరిస్థి తుల్లో ఆల్గారిథమ్, హార్డ్వేర్ పనితీరును కూడా పరీక్షించాల్సి ఉందన్నారు.

రామకృష్ణ మఠం ఉపాధ్యక్షుడు స్వామీ ప్రభానంద కన్నుమూత

రామకృష్ణ మఠం, మిషన్ ఉపాధ్యక్షుడు స్వామీ ప్రభానంద (91) కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.
→ గత ఆరు నెలలుగా ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
→ స్వామీ ప్రభానంద మృతిపట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశం ఉంచారు.
→ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న అఖెరాలో అక్టోబరు 17, 1931లో స్వామీ ప్రభానంద జన్మించారు. 1966లో వీరేశ్వరానంద మహారాజ్ వద్ద సన్యాస దీక్ష స్వీకరించారు.

పాస్ పోర్ట్ సూచీలో దిగజారిన భారత ర్యాంకు

వార్షిక పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 199 దేశాల జాబి తాలో గత ఏడాది 138 స్థానంలో ఉన్న భారత్.. ఈసారి 144వ స్థానంలో నిలిచింది.
→ భారతదేశ మొబిలిటీ స్కోర్ - 2019లో 71 ఉండగా.. 2020లో కరోనా ఆంక్షల నేపథ్యంలో 47కు తగ్గింది.
→ ఆంక్షలు తొలగించిన తర్వాత 2022లో మళ్లీ 73 స్కోర్ సాధించగా.. ఈ సంవత్సరం 70కు తగ్గింది.
→ విదే శాల్లో వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యం, వీసా ఆన్ఆరైవల్, ఈ-వీసా వంటి సౌలభ్యాలను పరిగ ణనలోకి తీసుకొని ఆర్జన్క్యాపిటల్ సంస్థ మొబలిటీ స్కోర్ ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది.

పాల దిగుబడిలో భారత్ ప్రథమ స్థానం

పాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని.. 220 మిలియన్ టన్నుల లీటర్లు ఉత్పత్తి చేస్తోందని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీబీ) చైర్మన్ మీనేష్ షా తెలిపారు. అమెరికా 104 మిలియన్ టన్నుల లీటర్లతో ద్వితీయ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

పండ్లు పక్వాన్ని గుర్తించే సెన్సర్

ఐఐటీ- జోధ్ పూర్, ఢిల్లీ పరిశోధకుల బృందం పండ్ల పక్వాన్ని గుర్తించే సెన్సర్ను సృష్టించింది. లితోగ్రఫీ రహిత డైఎలక్ట్రికల్ పొరతో, నానో నీడిల్ నిర్మాణం కలిగిన పీడీఎమ్ఎస్(పాలీ డై మిథైల్ సి లోక్సేన్)తో ఈ సెన్సర్ నిర్మితమై ఉంటుంది.
→ ఎలా స్టిక్ మాడ్యూల్ను కొలవడం ద్వారా వివిధ రకాల టమోటాల పక్వాన్ని పరిశోధకులు విశ్లేషించారు.

కూనో నేషనల్ పార్క్ నమీబియా చిరుత సాషా మృతి

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్కు తీసుకొచ్చిన ఎనిమిది చీరుతల్లో ఒకటి ఇటీవల మృతి చెందింది.
→ సెప్టెంబర్ నమీ బియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమా నంలో భారత్కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని మధ్యప్రదేశ్లోని కూనో నేష నల్ పార్క్లోకి వదిలారు.
→ ఎనిమిదింట్లో 5 ఆడ, 3 మగ చిరుతలు ఉన్నాయి. అందులో సాషా అనే చిరుత మరణించినట్లుగా అధికారులు ధ్రువీకరిం చారు.

ఎల్పీ ఎం3 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఎల్పీఎం3 వాహక నౌక ద్వారా ఒకేసారి 36 ఇంటర్నెట్ శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి చేర్చింది.
→ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 5,805 కిలోల పేలోడ్తో ఈ వాహక నౌక నిప్పులు చిమ్ము కుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.
→ బ్రిటన్ సంస్థ వన్. వెబ్ గ్రూప్ నకు చెందిన 72 శాటిలైట్లను నిర్దేశిత కక్ష్యల్లోకి పంపించేందుకు గానూ ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఎస్ఐ ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.
→ ఇందులో భాగం గా మొదటి విడతగా గత ఏడాది అక్టోబరు 23న 36 శాటిలైట్లను తీసుకెళ్లగా.. రెండో విడతగా మార్చి 26న మిగతా 36 శాటిలైట్లను మోసుకెళ్లింది.
→ ఈ 36. శాటిలైట్ల నుంచి సిగ్నళ్లు అందుతున్నాయని వన్వెబ్ సంస్థ ధృవీకరించింది.
→ ఈ మిషన్ విజయవంతం అయిన నేపథ్యంలో ఎన్ఎస్ఎస్ఐఎల్, ఇస్రో, వన్వెబ్ సంస్థలకు ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్

పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవం తంగా ఉండేలా మొబైల్ యాప్ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
→ 'ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్' పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే, యాప్ స్టోర్ లో అందుబాటులో ఉందని ఐటీ విభాగం తెలిపింది.
→ ఈ మొబైల్ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివే దిక (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్- ఏఐఎ స్), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ - టీఐఎస్) చూసుకు నేందుకు వీలవుతుంది.
→ ఇందులో కనిపించే సమా చారంపై ఏమైనా ఫిర్యాదులుంటే దాన్ని నమోదు చేసే వీలునూ యాప్లో పొందుపర్చినట్లు సీబీడీటీ తెలిపింది.

సాగర తీరంలో సారెక్స్ సాహస ప్రదర్శన

కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఇండియన్ కోస్ట్ గార్డు ఆధ్వ ర్యంలో ఇటీవల రీజినల్ సెర్చ్, రెస్క్యూ ఎక్సర్సైజ్( సారెక్స్ - 2023) నిర్వహించారు.
→ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ ఆధ్వర్యంలో సముద్రంలో విపత్తుల స్పం దన, నిర్వహణపై నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ అబ్బురపరిచింది.

కోర్టులు వేగంగా పనిచేస్తేనే పర్యావరణ కేసుల సత్వర పరిష్కారం

కోర్టులు ప్రస్తుతానికంటే రెట్టింపు వేగంతో పని చేస్తేనే పర్యావరణ సంబంధిత పెండింగు కేసులు సత్వరం పరిష్కారానికి నోచుకుంటాయని సెంటర్' ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక వెల్లడించిం ది.
→ 2021లో రోజుకు సుమారు 130 చొప్పున 47.316 కేసులను పరిష్కరించినా.. ఏడాది చివరి నాటికి ఇంకా 89,305 పెండింగ్లో ఉండాల్సి వచ్చిందని ఆ నివేదిక వివరించింది.
→ రోజుకు 245 కేసుల చొప్పున పరిష్కరించడమే దీనికి మార్గమని సూచించింది.
→ 'దేశవ్యాప్తంగా 2020-21 మధ్య పర్యావరణ కేసులు 4 శాతం పెరిగి పోగా.. వాటి పరిష్కార శాతం మాత్రం మరీ మందకొడిగా ఉంది
→ ఈ కారణంగానే కేసులు గుట్టలుగా పోగుబడు తున్నాయి. 2021లో పర్యావరణ నిబంధనల ఉల్లం ఘనలకు సంబంధించి 64.471 కేసులు నమోద వగా 59,220 కేసులు విచారణకు వెళ్లాయి.
→ అవి పోను 1,36,621 కేసులు పెండింగులో ఉన్న 77,401 కేసులు సహా) విచారణ దశలో ఉన్నాయి. అని నివేదిక తెలియజేసింది.

రొనాల్డో మరో రికార్డు

రికార్డుల వేటలో సాగుతున్న ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో చరిత్ర సృష్టించాడు. పురుషులు అంతర్జాతీయ ఫుట్ బాల్ లో అత్యధిక -మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.
→ 2024 యూరోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫయర్స్ భాగంగా లిటన్లైన్ తో మ్యాచ్లో ఈ పోర్చుగల్ ఆట గా బరిలో దిగాడు.
→ అది అతనికి జాతీయ జట్టు తరపున 197వ మ్యాచ్. దీంతో కువైట్ కు చెందిన -బేడర్ అల్ ముతావా (196)ను రొనాల్డో వెనక్కి నె ట్టాడు.
→ 2021లోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆడిన ఐరోపా ఆటగాడిగా 38 ఏళ్ల రొనాల్డో నిలిచాడు. ఇప్పుడు ప్రపంచ రికార్డు అందుకు న్నాడు.
→ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ (118) రికార్డు అతని పేరు మీదే ఉంది.

టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా

సాధారణంగా టీ20 మ్యాచ్ అత్యధిక మ్యాచ్లో 200కు మించి స్కోర్లు నమోదు కావు. కొన్నిసార్లు. 230-240 వరకూ నమోదైన సందర్భాలున్నాయి.
→ కానీ, ఆ స్కోర్లను ఛేదించడంలో చాలా జట్లు చతికి లపడతాయి. కానీ, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో ఒక జట్టును మించి మరొ కటి స్కోర్లను నమోదు చేశాయి.
→ ఈ మ్యాచ్లో దక్షి ణాఫ్రికా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ2 0ల్లో అత్యధిక టార్గెట్ ను ఛేదించిన జట్టుగా రికా ర్డుల్లో కెక్కింది.
→ విండీస్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు మిగిలుండగానే ఛేదించి. ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
→ అం తకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉం డేది. 2018లో న్యూజిలాండ్లో జరిగిన టీ20 మ్యాచ్లో 245 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేదించింది.
→ ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఛేజింగ్ కాగా తాజా మ్యాచ్లో ఆసీస్ రికార్డును దక్షిణాఫ్రికా బద్దలు కొట్టింది.

అసోచామ్ అధ్యక్షుడిగా అజయ్ సింగ్

భారత్లోని పరిశ్రమ సంఘాల్లో ఒకటైన అసోసి యేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) అధ్యక్షుడిగా స్పైస్ జెట్ . సీఎండీ అజయ్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ఓటమి

ఫిన్లాండ్ డైనమిక్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న సనా మారిన్ తాజా పార్లమెంటు ఎన్ని కల్లో ఓ పాల య్యారు.
→ హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కన్జ ర్వేటివ్ పార్టీ (ఎన్సీపీ) స్వల్ప ఆధిక్యంతో ముందు వరుసలో నిలిచింది.
→ రైట్ వింగ్ పాపులిస్టు ఫిన్నిస్ పార్టీ రెండో స్థానంలో నిల వగా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.
→ దీంతో ఫిన్లాండ్ మాజీ ఆర్థికశాఖ మంత్రి పెటెరీ ఓర్పో నూతన ప్రధా నిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
→ మొత్తం 200 స్థానాలున్న ఫిన్లాండ్ పార్లమెంటుకు జరిగిన ఎన్ని కల్లో 22 పార్టీల నుంచి 2400 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
→ 2019లో దేశ ప్రధాన మంత్రిగా పిన్న వయ సులో బాధ్యతలు చేపట్టిన సనా మారిన క్కు (37) మంచి పేరు వచ్చింది.
→ నూతన విధానాలను అనుసరిస్తూ. ఐరోపా యూనియన్తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

చంద్రుడి పైకి వెళ్లే వ్యోమగాముల్లో ఓ మహిళ

వచ్చే ఏడాది చివర్లో చేపట్టబోయే చంద్రమండల యాత్ర కోసం నలుగురు వ్యోమగాములను అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఎంపిక చేసింది. వీరిలో ఒక మహిళ ఉన్నారు.
→ వ్యోమగాముల్లో ముగ్గురు అమెరి కన్లు కాగా కెనడావాసి ఒకరు ఉన్నారు. సోమవారం హ్యూస్టన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో నాసా వీరిని పరిచయం చేసింది.
→ వీరిలో మిషన్ కమాండర్ రీడ్ వైస్ మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనా కోచ్, కెనడాకు చెందిన జెరిమీ హాన్సెన్ ఉన్నారు.
→ వ్యోమగాముల్లో క్రిస్టీనా కోచ్.. సుదీర్ఘకాలం అంతరిక్ష యాత్ర చేపట్టిన మహిళగా గుర్తింపు పొందారు. వీరిలో హాన్సెన్ తప్ప అందరికీ రోదసి యాత్ర అనుభవం ఉంది.
→ "వీరు మానవాళి తర పున చంద్రమండల యాత్రకు వెళుతున్నారు" అని సంస్థ అధిపతి బిల్ నెల్సన్ పేర్కొన్నారు. నాసాకు చెందిన ఒరా యన్ కాప్స్యూల్లో వీరు యాత్ర చేపడతారు.
→ అయితే వారు జాబిల్లిపై దిగరు. చంద్రుడి కక్ష్యలోకి మాత్రమే వెళ్లి, తిరిగి భూమికి చేరుకుంటారు. 2025లో చేపట్టే యాత్రలో చందమామపై ఇద్దరు వ్యోమగాములు దిగుతారు.

కిరణ్ నాడార్కు ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం

సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవి రళ కృషి చేస్తున్న కిరణ్ నాడార్కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఇటీవల అత్యున్నత పౌర పుర స్కారాన్ని ప్రకటిం చింది.
→ భార ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లీనన్ ఆ పురస్కారాన్ని కిరణ్ నాడార్కు అందజేసి సత్కరిం చారు.
→ జాతీయ, అంతర్జాతీయ కళాకృతులు సేకరిస్తున్న నాడార్.. ఇండో-ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గాను ఫ్రాన్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
→ కిరణ్ నాడార్ మ్యూజియం ఆర్ట్ (కేఎన్ఎంఏ) ఛైర్పర్సన్, శివ్ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ అయిన నాడార్ పలు సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వర్తిస్తున్నారు.

ఆంగ్ల భాషపై నిషేధం దిశగా ఇటలీ అడుగులు

ఇటీవలే చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ ప్రస్తుతం ఆంగ్ల భాషపై దృష్టి కేంద్రీకరించింది.
→ అధికారిక వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పూర్తిగా నిషే ధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రధాని జార్జియా మెలోని నేతృత్వంలోని 'బ్రదర్స్ ఆఫ్ ఇటలీ' పార్టీ బిల్లు తీసుకువచ్చింది.
→ ఇక పై ఆంగ్లం సహా విదేశీ భాషల్లో అధికారిక కార్యకలాపాలు చేపడితే లక్ష యూరోల జరిమానా విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ బిల్లుకు ప్రధాని మద్దతు తెలిపారు.
→ అయితే దీనిపై ఇంకా పార్లమెంటులో చర్చ జర గలేదు. విదేశీ భాషలతో తమ మాతృభాష ఇటాలియన్ అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆ బిల్లులో పేర్కొన్నారు.
→ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వ అధికారులకు ఇటాలియన్ భాషపై పట్టు ఉండాలి. రాయడం, చదవడం రావాలి.
→ ఆర్టికల్ 1 ప్రకారం.. అన్ని కార్యాలయాల్లో, విదేశీయులతో మాట్లా డేటప్పుడు కూడా ప్రాథమిక భాషగా ఇటాలియన్ను ఉపయోగించాలి.
→ ఆర్టికల్ 2 ప్రకారం.. దేశంలో వస్తుసేవల ప్రచారం కోసం ఇటాలియన్ భాష తప్పనిసరి.
→ ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఐదు వేల యూరోల నుంచి లక్ష యూరోల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవన్ను ముఖ్య మంత్రి కేసీఆర్ నియమించారు.
→ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశారు.
→ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శ్రీనివాస్ నియామక పత్రాలను అందుకున్నారు.
→ ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.
→ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన గెల్లు శ్రీనివాస్ ఎంఏ, ఎల్ ఎల్బీ చేశారు.
→ రాజనీతి శాస్త్రంలో పరిశోధక విద్యార్థి కూడా. భారాస అనుబంధ విద్యార్థి విభాగానికి తెలం గాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
→ ప్రత్యేక రాష్ట్ర ఉద్య మంలో చురుకైన పాత్ర పోషించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్పై తెరాస (ఇప్పుడు భారాస) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

నాటోలోకి ఫిన్లాండ్

ఐరోపా సమాఖ్యలోని కీలక దేశం. ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా మంగళవారం అధికారికంగా చేరింది.
→ ఇందుకు సంబంధించిన చేరిక పత్రాలను ఆ దేశ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్ట్లో అమెరికా విదే శాంగ మంత్రి అంటోనీ బ్లింకెన క్కు అందజేశారు.
→ అంతకు ముందు ఫిన్లాండ్ చేరికను బ్లింకెన్ ప్రక టించారు. నాటో సభ్యత్వానికి సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖ భద్రపరు టుంది.
→ నాటోలో ఫిన్లాండ్ చేరేందుకు చివ రగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలి చింది. ఇక నాటోలో చేరిక కోసం స్వీడన్ చేసిన దరఖాస్తు ఇంకా పెండింగులో ఉంది.
→ తాజా పరిణామం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతి న క్కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
→ దీనికి రష్యాతో ఫిన్లాండ్ కు 1,340 కి. మీ. సరిహద్దు కలిగి ఉండటమే కారణం. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మార నుంది.
→ ఈ నేపథ్యంలో ఫిన్లాండ్లో జరుగు తున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నా మని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి వెస్కోవ్ తెలిపారు.
→ నాటో విస్తరణ మా దేశ భద్రత, ప్రయోజనాల ఉల్లంఘనేనని అభివర్ణిం చారు. అంతేకాకుండా తాజా చర్య తాము ప్రతీ కార చర్యలు తీసుకునేలా పురిగొల్పుతోందని పేర్కొన్నారు.
→ ఫిన్లాండ్లోకి ఎటువంటి అదనపు బలగాలు లేదా పరికరాలనైనా నాటో పంపితే ఆ దేశ సరిహద్దుల్లో తమ బలగాలను బలో పేతం చేస్తామని హెచ్చరించారు.
→ అయితే ఫిన్లాండ్లో తమకు ఎటువంటి ప్రాదేశిక తగా దాలు లేవని స్పష్టం చేశారు.
→ ఫిన్లాండ్ చేరిక తర్వాత నాటో సభ్య దేశాల తాజా జాబితా ఇదీ:-
→ 1. అమెరికా,
→ 2. కెనడా,
→ 3. బ్రిటన్,
→ 4. జర్మనీ,
→ 5. డెన్మార్క్
→ 6. ఫ్రాన్స్,
→ 7. బెల్జియం,
→ 8. ఐస్లాండ్,
→ 9. ఇటలీ,
→ 10. లక్సెంబర్గ్,
→ 11. నెదర్లాండ్స్,
→ 12. నార్వే
→ 13. పోర్చుగల్,
→ 14. అల్బేనియా,
→ 15. బల్గేరియా,
→ 16. క్రొయేషియా,
→ 17. చెక్ రిపబ్లిక్,
→ 18. ఎస్తోనియా,
→ 19.గ్రీస్,
→ 20. తియా
→ 21 లిథువేనియా,
→ 22. మాంటెనిగ్రో,
→ 23. నార్త్ మాసిడోనియా,
→ 24. హంగరీ,
→ 25. పోలండ్,
→ 26. రొమేనియా,
→ 27. స్లోవేకియా,
→ 28. స్లోవేనియా,
→ 29. స్పెయిన్
→ 30. తుర్కియే
→ 31. ఫిన్లాండ్

ట్విటర్ 'బ్లూ బర్డ్' ఎగిరిపోయింది

ట్విటర్ లోగో మారింది. 'బ్లూ బర్డ్' స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన 'డోజ్కయిన్'కు సంబంధించిన డోజ్ మీమ్ను ఉంచారు.
→ ట్విటర్ యూజర్లకు ఈ కొత్త లోగో దర్శనమిచ్చింది. ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం ధ్రువీక రించారు.
→ బ్లూ బర్డ్ ఇక పాతదని.. ఇకపై ఈ డోజ్ మీమే కొత్త లోగో అని ఉన్న ఓ మీమ్ను ట్వీట్ చేశారు.
→ అలాగే 2022 మార్చి 26న ఓ ట్విటర్ యూజర్తో జరిపిన సంభా షణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా మస్క్ పంచుకున్నారు.
→ అందులో సదరు యూజర్ ట్విటర్ను కొనుగోలు చేసి 'డోజ్'ని లోగోగా పెట్టాలని సూచించడం గమనార్హం. దీనికి మస్క్ అప్పట్లో సానుకూలంగా స్పందించారు.
→ తాజాగా ఆ సంభాషణను గుర్తు $ చేస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం.. మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
→ మరి ఈ కొత్త లోగో శాశ్వతమా లేక కొన్నాళ్ల తర్వాత మారుస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వ లేదు.
→ కొంత మందికి ఈ లోగో కేవలం ట్విటర్ డెస్క్టాప్ వెర్షన్లో మాత్రమే మారింది. మొబైల్ యాప్ మాత్రం ఇంకా బ్లూ బర్డ్ లోగోనే కనిపిస్తోంది.
→ 'షిబా ఇనూ' అనే జపాన్ జాతి శునకం చిత్రాన్నే డోజ్ గా వ్యవహరిస్తుంటారు.

స్కైరూట్ మరో మైలురాయి

హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ రంగ అంతరిక్ష టెక్ అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ మరో కీలకమైన మైలురాయిని సాధించింది.
→ 200 సెకన్ల పాటు పూర్తి 3డీ- ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ ను విజయవంతంగా సంస్థ పరీక్షించింది.
→ స్కైరూట్ దేశీ యంగా అభివృద్ధి చేసిన మొబైల్ క్రయోజెనిక్ ప్యాడ్ను వినియోగించి 'ధావన్-2' పరీక్షను నాగపూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ ప్రొపల్షన్ పరీక్షా కేంద్రంలో నిర్వహించారు.
→ 2022 నవంబరులో విక్రమ్-ఎస్ ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ సంస్థ. అంతరిక్షంలో రాకెట్ను పంపిన తొలి భారత ప్రైవేటు కంపెనీగా అవతరించిన సంగతి తెలిసిందే.
→ నవంబరు 2021లో విజయవంతంగా పరీక్ష నిర్వహించిన ధావన్-1 ఇంజిన్(ఇది సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన తొలి పూర్తి స్థాయి క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్) ఆధారంగానే ధావన్-2 నూ స్కైరూట్ నిర్మించింది. కమై ద్రవ్యో ఆర్థికవేత్తలు ఏడాది బ్యారె చనా వేసింది.

ధోనీకి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం

ప్రతిష్ఠాత్మక మారిలో బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ).. ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ధోని సహా అయిదుగురు భారత క్రికెటర్లకు జీవితకాల సభ్యత్వం ఇచ్చింది.
→ యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మిథాలి రాజ్, జులన్ గోస్వామి గౌరవం పొందిన ఇతర భారత క్రికెటర్లు. ఎనిమిది టెస్టు దేశాల నుంచి మొత్తం 19 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది.
→ "అయిదుగురు భారత క్రికెటర్లకు గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని అందించాం.
→ జులన్ గోస్వామి మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కాగా.. మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు (7,805) చేసిన బ్యాటర్" అని ఎంసీసీ తన వెబ్సైట్లో పేర్కొంది.
→ ధోని, యువరాజ్ సింగ్లు ఇద్దరూ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు. సురేశ్ రైనా 13 ఏళ్ల కెరీర్లో 5,500 వన్డే పరుగులు సాధించాడు" అని చెప్పింది.
→ మెరీసా (వెస్టిండీస్), జెనీ గున్, లారా మార్ష్, అన్య షబ్సోల్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్), మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్), మొర్హజా (బంగ్లాదేశ్), స్టెయిన్ (దక్షిణాఫ్రికా), రేచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), అమీ సాటెర్వైట్, రాస్ టేలర్ (న్యూజిలాండ్) ఎంసీసీ సభ్యత్వం పొందిన ఇతర క్రికెటర్లు.

ముదిమి రాకను ఆలస్యం చేసేలా..!

మానవుల్లో ముదిమి రాకను ఆలస్యం చేయడంతో పాటు ఆయుర్దాయాన్ని పెంచే దిశగా శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలకు శ్రీకారం చుట్టారు.
→ ఇందులో భాగంగా- మట్టిలో ఎక్కువగా కనిపించే సి. ఎలిగన్స్ నెమటోడ్ క్రిముల నాడీ వ్యవస్థలోని ఎన్టీఆర్- అనే ప్రొటీన్పై ప్రధా నంగా దృష్టిసారించారు.
→ మానవులు సహా అనేక జంతువుల చర్మం, ఎముకలు, అనుసంధాన కణజా లాల్లో కొల్లాజెన్ అనే ప్రొటీన్ కీలక భాగంగా ఉంటుంది. చర్మం ముడతలు పడటాన్ని అది ప్రభావితం చేస్తుంది.
→ అయితే కొల్లాజెన్ వ్యక్తీకర ణను నియంత్రించగల సామర్థ్యం ఎన్పీఆర్-8కు ఉందని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివ ర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
→ ఎన్టీఆర్-8ను తొలగించేకొద్దీ సి. ఎలిగన్స్ నెమటోడ్ చర్మం తక్కువగా ముడతలు పడుతున్నట్లు తాము గుర్తిం చామని తెలిపారు.
→ భవిష్యత్తులో మానవుల చర్మం ముడతలు పడటాన్ని తగ్గించేందుకు, ఆయుర్దా యాన్ని పెంచే కీలక ఆవిష్కరణలకు తమ పరిశో ధనలు దోహదపడే అవకాశముందని వెల్లడించారు.

అంతరించిపోయిన జీవి డీఎన్ఏతో కృత్రిమ మాంసం తయారీ

కృత్రిమ మాంసం తయారీ రంగంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
→ ఆస్ట్రే లియాకు చెందిన 'వావ్' అనే కంపెనీ- వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన 'మామ్మత్ అనే ఏనుగు వంటి జీవి డీఎన్ఏ క్రమాన్ని ఉపయోగించి కృత్రిమ మాంసాన్ని అభి వృద్ధి చేసింది.
→ దానితో 'మాంసపు బంతి'ని తయారుచేసింది. దాన్ని నెదర్లాండ్స్ లోని 'నెమో' సైన్స్ మ్యూజియంలో గత వారం ప్రదర్శించారు.
→ ఈ మాంసాన్ని ఇంకా ఎవరూ రుచి చూడలేదు. మానవ శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుం దనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
→ మాంసాన్ని రెట్టింపు చేయడం కోసం ఏనుగు డీఎన్ఏను కూడా 'వావ్' శాస్త్రవేత్తలు ఉపయోగించారు.
→ గొర్రె నుంచి సేకరించిన కండర కణాలతో మామ్మత్ కండరాల ప్రొటీన్, ఏనుగు డీఎన్ఏను కలపడం ద్వారా వారు కోట్ల కొద్దీ కణాలను అభివృద్ధి చేశారు.
→ దాంతో అరుదైన కృత్రిమ మాంసం తయారైంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు కొన్ని వారాల సమయం పట్టిందని ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వోల్వెట్యాంగ్ తెలిపారు.
→ 'వావ్' కంపెనీ ఇప్పటికే దున్న మొసలి, కంగారూ, నెమలి మాంసాలను ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన సంగతి గమనార్హం.

ఐరాస గణాంక కమిషన్కు ఎన్నికైన భారత్

వచ్చే జనవరి 1వ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల కాలానికి ఐక్య రాజ్యసమితి అత్యున్నత గణాంక కమిషన్ సభ్యురాలిగా మనదేశం ఎన్నికైంది.
→ ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ట్విటర్లో వెల్లడించారు. ఇందుకోసం కృషి చేసిన భారత బృందానికి అభినందనలు తెలి పారు.
→ గణాంకాలు, వైవిధ్యం, జనాభా అంశాల్లో గల నైపుణ్యాలు.. ఐరాస గణాంక కమిషన్లో మనదేశానికి సభ్యత్వం దక్కడానికి దోహదపడ్డాయన్నారు.

జియో ట్యాగింగ్ కేరళకు అగ్రస్థానం

జియో ట్యాగింగ్ దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 సంవత్సరానికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియో ట్యాగ్ లు లభించాయి.
→ జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రికార్డుల ప్రకారం.. కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్లు లభించాయి.
→ బిహార్ కు చెందిన మిథిలా మఖానా, మహారా ష్ట్రకు చెందిన అలీబాగ్ తెల్ల ఉల్లిపాయలు జియో ట్యాగ్లను సాధించాయి.
→ తెలంగాణలోని తాండూర్ కందిపప్పునకూ 2022-23లోనే జియో ట్యాగ్ లభించింది.
→ లద్దాఫ్ కు చెందిన రాక్సే కాప్రో ఆప్రికాట్, అస్సాం లోని గమోసా హస్తకళలు జియో ట్యాగ్లను సాధిం చాయి.
→ 2022-23లో మొత్తం 12 ఉత్పత్తులు జియో ట్యాగ్లను సాధించగా అందులో రెండు విదేశాలకు చెందినవి ఉన్నాయి.
→ 2021-22లో మొత్తం 50 ఉత్పత్తులు జియోట్యా గ్లను సాధించాయి. ఆ ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్ 7 ట్యాగ్లను సాధించి అగ్రస్థానంలో నిలిచింది..

కొరియా ద్వీపకల్పానికి అమెరికా బి-52 బాంబర్లు మరోసారి అణ్వస్త్ర పరీక్ష దిశగా ఉ.కొరియా!

ఉత్తర కొరియా మళ్లీ అణ్వస్త్ర పరీక్షకు సిద్ధమవుతోందనే అనుమానాల మధ్య అమెరికా అణ్వ స్త్రాలను ప్రయోగించగల బి-52 బాంబర్ విమానాలను కొరియా ద్వీపకల్పానికి పంపింది.
→ అవి అమెరికా, దక్షిణ కొరియా యుద్ధ విమానాలు సంయు క్తంగా జరిపిన అభ్యాసాలలో పాలు పంచుకున్నాయి.
→ మార్చి 6న కూడా అమెరికా బి-52 బాంబర్ విమాన మొకటి కొరియా ద్వీపకల్పంపై ఎగిరింది. దాన్ని కవ్వింపు చర్యగా పరిగణించిన ఉత్తర కొరియా అధ్య క్షుడి సోదరి కిమ్ యో జాంగ్ అమెరికా, దక్షిణ కొరి యాలపై సత్వరమే తీవ్ర చర్య తీసుకుంటామని హెచ్చ రించారు. అయినప్పటికీ అమెరికా మళ్లీ బి-52లను పంపింది. అమెరికా-దక్షిణ కొరియా-జపాన్ లు గత వారం శత్రు జలాంతర్గాములను వేటాడే విన్యాసాలను నిర్వహించాయి. వీటిని చూసి ఉత్తర కొరియా అణ్వ స్త్రాలను ప్రయోగించగల క్షిపణులను పరీక్షిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లను తాకగల హ్వాసోంగ్ 17 దూరశ్రేణి ఖండాంతర క్షిపణినీ, అణు బాంబులను ప్రయోగించగల డ్రోన్ నూ, జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూజ్ క్షిపణిని పరీక్షించింది.

ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సుకు కేటీఆర్

భారతదేశ అభివృద్ధిపై చర్చించేందుకు ఉద్దేశించిన 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సులో పాల్గొనేందుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ను అంతర్జాతీయ సలహా సంస్థ ఈపీజీ ఆహ్వా నించింది.
→ మే 11, 12 తేదీల్లో లండన్ వేదికగా జరగ నున్న ఈ సదస్సులో పాల్గొని, ప్రసంగించాలని కోరింది.
→ యూకే, యూరోప్, భారతదేశ పరిశ్రమలు, విధానకర్తలు, వ్యాపారవేత్తలను ఒకే వేదికపై తీసుకువచ్చేలా ఈ కార్య క్రమం జరుగుతోంది.
→ "మీరు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఈ చర్చలు మరింత విలువను సంతరించుకుం టాయి.
→ తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తెలుసుకునేం దుకు ఆసక్తిగా ఉన్నాం" అని ఆహ్వానపత్రంలో ఈపీజీ సంస్థ పేర్కొంది.
→ యూకే పార్లమెంటు దిగువసభ హౌజ్ ఆఫ్ కామన్స్లో అక్కడి కార్మికశాఖ మంత్రి సీమా మల్హోత్ర ఇచ్చే విందుకు, యూకే కేబినెట్ మంత్రితో కలిసి ప్రధానవక్తగా బ్లాక్ టై సెలబ్రేషన్ విందుకు కేటీ ఆర్ హాజరుకానున్నారు.
→ 'ఐడియాస్ ఫర్ ఇండియా' సద స్సులో 800 మందికి పైగా వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొంటారు.

'ఇండియా జస్టిస్' ర్యాంకింగ్

'ఇండియా జస్టిస్' ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానాలను దక్కించుకున్నాయి.
→ టాటా ట్రస్టు మూడో ఇండియా జస్టిస్ నివేదిక (ఐజేఆర్) - 2022ను వెల్లడించింది.

మన పంచాయతీలకు అవార్డుల పంట

జాతీయ పంచా యతీ అవార్డుల్లో తెలంగాణ పంట పండింది. జాతీయ పంచాయతీ పురస్కారాల కింద 48 అవార్డులు ప్రకటిస్తే రాష్ట్రానికి 13 లభిం చాయి.
→ దేశవ్యాప్తంగా అత్యధిక అవార్డులతో రాష్ట్రం నం.1 స్థానంలో నిలిచింది.
→ జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచా యత్ సతత్ వికాస్ పురస్కారాల కింద తొమ్మిది కేటగిరీల్లో గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రకటించింది.
→ ఇందులో ఎనిమిది కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలకు అవార్డులు(నాలుగు కేటగిరీల్లో మొదటి ర్యాంకు) వచ్చాయి.
→ కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 24న పంచాయ తీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పని తీరు కనబరిచిన పంచాయతీలకు అవార్డులు అందిస్తోంది.
→ జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా ఆన్లైన్లో పంచాయతీల నుంచి తొమ్మిది అంశాల్లో నామినేషన్లు తీసుకుంది.

సత్తా చాటిన షారుక్ ఖాన్

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటారు.
→ 2022కు గానూ 100 మంది అత్యంత ప్రభావశీలురను ఎంపిక చేసేందుకు టైమ్ మ్యాగజీన్ నిర్వహించిన పాఠకుల ఓటింగ్ లో అత్యధిక ఓట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచారు.
→ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, బ్రిటన్ యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్ మెర్కెల్, మెటా సీఈవో జుకర్ బెర్గ్ తదితర ప్రముఖులను వెన క్కినెట్టి ఆయన ఈ ఘనత సాధించారు.
→ మొత్తం 12లక్షల మంది ఓటింగ్లో పాల్గొనగా, షారుకు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. ఇరాన్లో మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు రెండో స్థానం దక్కింది.
→ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించు కున్నారు. మెస్సీ అయిదో స్థానంలో నిలిచారు.

పేద ఖైదీలకు ఆర్థికసాయం

జరిమానా లేదా బెయిల్ మొత్తాన్ని చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న పేదఖైదీలకు ఆర్థికసాయం అందించేందుకు కేంద్రం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
→ దీంతో జైళ్లలో ఖైదీల రద్దీ తగ్గుతుందని భావి స్తోంది.
→ ఆదాయం, చదువు అంతగా లేని సామా జికంగా వెనుకబడిన, అట్టడుగు వర్గ పేద ఖైదీలు జైలు నుంచి బయటికి రావడానికి ఈ పథకం తోడ్పడనుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
→ అండర్ ట్రయల్ ఖైదీల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని.. అందులో భాగమే ఈ 'పేదఖైదీలకు మద్దతు' అని తెలిపింది.
→ వివిధ స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయసేవలు కూడా ఖైదీలకు అందిస్తామని పేర్కొంది.

గజ ఉత్సవ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఏనుగులు అడవుల్లో ఎలాంటి అడ్డం కులు లేకుండా స్వేచ్ఛగా సంచరించడానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు ప్రజలు సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరారు.
→ అస్సాం పర్యటనలో రెండో రోజైన శుక్రవారం ఆమె గజ ఉత్సవ్ 2023 కార్యక్రమాన్ని ప్రారంభించారు.
→ ఈ సందర్భంగా రాష్ట్ర పతి ప్రసంగిస్తూ.. ఏనుగులు తెలివైన, దయ కలిగిన జంతువులు, వాటి పట్ల ప్రజలు కరుణ చూపాల న్నారు. అనేక సవాళ్ల మధ్య 'ప్రాజెక్టు ఎలిఫెంట్' 30 ఏళ్లు పూర్తిచేసుకుందని వెల్లడించారు. ఏనుగులు సంచరించే అటవీ ప్రాంతాల పరిరక్షణ మన కర్తవ్య పునిచ్చారు.
→ ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న లఘుచిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్'ను ప్రస్తావించిన ముర్ము ఆదివాసీ సమాజానికి ప్రకృతి, పక్షులు, జంతు వుల పట్ల గాఢమైన అనుబంధం ఉందని వెల్లడించారు

ట్విటర్ పక్షి మళ్లీ వచ్చేసింది

ట్విటర్ లోగోగా ఉన్న డోజ్ (కుక్క) స్థానంలో మళ్లీ పక్షి వచ్చింది.
→ మూడు రోజుల కిందట ట్విటర్ తన లోగో అయిన బ్లూబర్డ్ను తొలగించి దాని స్థానంలో డోజ్కాయిన్ క్రిప్టోకరెన్సీ లోగో అయిన డోజోమ్ను లోగోగా మార్చింది.
→ ఓ వినియోగదారుడికి ఇచ్చిన మాట ప్రకారమే అలా చేసినట్లు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటిం మార్పు శాశ్వతంగా . ఉంటుందా లేదా అన్న విషయమై మస్క్ అప్పుడు స్పష్టత ఇవ్వలేదు. సామాజిక మాధ్య మాల్లో సరదాగా ఈ డోజ్మోమ్ను వాడుతుం టారు.
→ దీంతో మస్క్ కూడా సరదాగా దీన్ని ఏర్పాటు చేసి ఉంటారనీ.. కొన్ని రోజులే ఇది ట్విటర్ లోగోగా ఉంటుందనే భావనలు వ్యక్తమ య్యాయి. ఇప్పుడు అదే నిజమైంది.
→ ట్విటర్ ప్రారంభం నుంచి ఉన్న బ్లూబర్డ్ లోగోను ఆ సంస్థ పునరుద్ధరించింది.
→ ఎలాన్ మస్క్ ట్విటర్ లోగోను మార్చిన తర్వాత డోజ్కాయిన్ విలువ 20 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

దేశంలో తొలి డిజిటల్ కోర్టు ప్రారంభం

దేశంలో మొట్టమొదటి సారి కాగితపు రహిత డిజిటల్ న్యాయస్థానం మహారాష్ట్రలో అందుబాటులోకి వచ్చింది.
→ నవీ ముంబయిలోని వాశీ కోర్టు ఈ విశిష్ట తను సొంతం చేసుకుంది. ఇక్కడ ఏర్పాటైన జిల్లా, అడి షనల్ సెషన్స్ కోర్టును శనివారం బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రారంభించారు.
→ అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కాగితం వినియోగిం చాల్సిన అవసరంలేని, పూర్తిస్థాయి డిజిటల్ కోర్టు ఏర్పా టులో స్థానిక న్యాయవాదులు అందించిన సహకారం అమోఘమని ప్రశంసించారు.
→ ఈఫైలింగ్, డిజిటల్ కోర్టుల ఏర్పాటుకు సాధారణంగా అభ్యంతరాలు వస్తుం టాయని తెలిపారు.
→ అయితే, వాశీ కోర్టు న్యాయవా దులు ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ మద్దతునిచ్చి కార్య రూపం దాల్చేలా చేశారని తెలిపారు.
→ వారి సహకారం వల్లే దేశంలో తొలి డిజిటల్ కోర్టు ఇక్కడ కార్యరూపం దాల్చిందని వివరించారు.

ఉత్తర కొరియాలో మరో జలాంతర అణు డ్రోన్ పరీక్ష

ఉత్తర కొరియా మరో జలాంతర అణు డ్రోన్ పరీక్షను నిర్వహించింది. ఇది సముద్ర గర్భంలో నుంచి నౌకలను, పోర్టులను ధ్వంసం చేయగలదు.
→ ఈ డ్రోన్ పేరు హెయిల్-2 (కొరియన్ భాషలో దీని అర్థం సునామీ) అని, 71 గంటలపాటు నీటిలోపల ప్రయాణిం చిన అనంతరం ఇది వారెడ్ను పేల్చిందని, తూర్పున ఉన్న పోర్టు నగరం సమీపంలో ఈ పరీక్ష జరిగిందని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ పేర్కొంది.
→ వేయి కిలోమీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదించగలదని వెల్లడించింది. అయితే గతంలో ప్రయోగించిన హెయిల్-1 డ్రోన్ ఉత్తర కొరియా చెప్పినంత శక్తిమంతమైనది కాదని దక్షిణ కొరియా అభిప్రాయపడింది.
→ మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ అధికారులు ఉత్తర కొరియాపై సమావే శమైన సమయంలోనే హెయిల్-2 పరీక్ష జరిపామని ఆ దేశం ప్రకటించడం గమనార్హం.

దేశంలో పులులు 3,167

దేశంలో పులుల సంఖ్య 3,167కి చేరింది. 2018తో పోలిస్తే 200 పెరిగాయి. ప్రధా నమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలో విడు దల చేసిన 'స్టేటస్ ఆఫ్ టైగర్స్-2022' నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
→ గత నివేదికలో రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను వెలువరించగా ఈసారి దాన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు.
→ మధ్యభా రతం, తూర్పుకనుమల పరిధిలోకి వచ్చే ఆంధ్రప్ర దేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లలో 2018లో 1,033 పులులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 1,161కి చేరింది.
→ శివా లిక్ పర్వత సానువులు, గంగామైదానంలో అత్యధి కంగా 158 పులులు పెరగ్గా, సుందర్బన్ ప్రాంతంలో 12 మాత్రమే వృద్ధి చెందాయి.

ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచానికి గర్వకారణం

దేశంలో 50 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ కేవలం భారత్్క కాకుండా ప్రపంచానికి గర్వకారణమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
→ ఆయన కర్ణాటకలోని మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించారు.
→ దేశంలో తాజాగా నిర్వహించిన పులుల అంచనా. పులుల రక్షిత వలయాల నివేదికల ఆవిష్కరణ, ఇంట ర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలయెన్స్ (ఐబీసీఏ)ని ప్రారంభిం చారు.
→ అంతకుముందు తమిళనాడు పరిధిలోని ముదు మలై అభయారణ్యంలో ఏనుగుల శిబిరాన్ని సందర్శిం చారు.
→ 'ద ఎలిఫెంట్ విస్పరర్స్ ముదుమలై ఏనుగుల శిబిరంలో బొమ్మన్, బెల్లీ దంపతులతో.. ఆస్కార్ అవార్డుతో ప్రాచుర్యం పొందిన బొమ్మన్, బెల్లీ తిలో భాగంగా మారిందన్నారు.

సీపీఐ, తృణమూల్, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు

సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీ పీలు జాతీయ పార్టీల హోదాను కోల్పో యాయి. వీటి హోదాను ఎన్నికల కమి షన్(ఈసీ) ఉపసంహరించుకుంది.
→ మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను దక్కించు కుంది. పార్టీల హోదాలను మారుస్తూ ఎన్ని కల సంఘం ఉత్తర్వులను వెలు వరించింది.
→ సమగ్ర విశ్లేషణ, ఆయా పార్టీలతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.
→ ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉండటం స్తారు. తోపాటు గుజరాత్, గోవాల్లో భారీగా ఓట్లు సాదించడంతో ఆపకు జాతీయ హోదా ఇస్తు న్నట్లు ఈసీ ప్రకటించింది.
→ ప్రస్తుతం భాజపా, కాంగ్రెస్, సీపీఎం, బహు జన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆప్లు జాతీయ పార్టీలుగా ఉంటాయి.

సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం

ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, భారతీయ-అమెరికన్ అయిన కల్యం పూడి రాధాకృష్ణారావుకు (సీఆర్ రావు) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది.
→ 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలో చనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గణాంక బహు మతిని 2023 సంవత్సరానికి ఆయన అందుకోను. న్నారు.
→ ఏమిటీ పరిశోధనలు:-
→ సీఆర్ రావు తన పరిశోధనలో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లే షించారు.
→ ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్ ఈ గణాంక టూల్స్ను భారీగా వాడటానికి ఉపయోగపడ్డాయి.

న్యాక్కు విశ్వకర్మ అవార్డు

నిర్మాణ నైపుణ్య అభి వృద్ధి అచీవ్మెంట్ విభాగంలో న్యాక్ కు విశ్వకర్మ అవార్డు దక్కింది.
→ దిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహా రాలు, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ న్యాక్ సంచాలకులకు అవార్డును ప్రదానం చేశారు.
→ గతేడాది 21,240 మందికి న్యాక్ నిర్మాణ సంబంధ శిక్షణ కార్యక్రమాలను అందిం చింది. వారిలో చాలా మంది యువకులు ప్రైవేటు పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పొందారు.
→ అవార్డు లభించడం పట్ల న్యాక్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
→ 2023లో దేశంలోనే ప్రతిష్ఠా త్మక అవార్డును అందుకున్న ఏకైక సంస్థ న్యాక్ అని పేర్కొన్నారు.
→ న్యాక్ అభివృద్ధికి కృషి చేసిన సంస్థ సంచాలకులు ఎం. రాజిరెడ్డి, శాంతిశ్రీ, హేమలత, సత్యపాల్ రెడ్డిలను మంత్రి అభినందించారు.

దక్షిణ డిస్కంకు రెండు అవార్డులు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (డిస్కం)కు ఉత్తమ పంపిణీ సంస్థ కేటగిరీలో ప్రథమ, వినియోగదారులకు అవ గాహన కల్పించే విభాగంలో ద్వితీయ అవార్డు లభించింది.
→ ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసి యేషన్ కర్ణాటకలో నిర్వహించిన 'నియంత్రణ మండళ్లు, విధానకర్తల సదస్సు'లో ఈ అవార్డులు అమలు చేయడం ద్వారా ఏడాదికి దాదాపు 122 స్థాపిత సామర్థ్యం, విద్యుత్ వాహనాల వినియో గాన్ని ప్రోత్సహించే విధానం, స్మార్ట్ టెక్నాలజీ అమలు తదితర వినూత్న కార్యక్రమాలతో సంస్థకు ప్రథమస్థానంలో అవార్డు లభించిందని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధి లోని 91 వినియోగదారుల సేవ కేంద్రాలను అనుసంధానించి నిర్ణీత సమ యంలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం, 100 శాతం ఆన్లైన్ బిల్లింగ్ వంటి సేవలకు రెండోస్థానంలో అవార్డు లభించిందని వివరించారు.

భారత్లో పులులు పెరుగుతున్నాయ్

దేశంలో పులుల సంఖ్య బాగా పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతంగా 20225 పులులపై సర్వే జరిపా మని జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) తెలిపింది.
→ ఈ సంస్థ 2022లో పులుల స్థితిగతుల పేరుతో వెలువరించిన నివేదికను మైసూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడు దల చేశారు. 20 రాష్ట్రాల్లో కాలినడకన మొత్తం 6,41,499 కిలో మీటర్ల దూరం తిరిగి సర్వే నిర్వహిం చారు.
→ ఎన్టీసీఏ అధికారులు, జీవ శాస్త్రజ్ఞులు, వాలం టీర్లు సర్వేలో పాల్గొన్నారు.
→ అడవుల్లో 32,588 చోట్ల ఏర్పాటుచేసిన రహస్య కెమేరాలు మొత్తం 4,70,81,881 ఫొటోలను తీశాయి.
→ 2018లో ఈ కెమేరాలు 2,461 పులులను ఫొటో తీయగా 2022లో ఏడాదికి పైగా వయసున్న 3,080 పులులను ఫొటో తీశాయి.

‘ఎక్స్ యాప్'లో ట్విటర్ కంపెనీ విలీనం చేసిన మస్క్

ట్విటర్ ను మరో కంపెనీలో విలీనం చేశారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్ అనే ఎవ్రీథింగ్ యాప్లో ట్విట ర్ను కలిపేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
→ ప్రస్తుతం ట్విటర్ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలో లేదని, ఒక కేసు నేపథ్యంలో కోర్టుకిచ్చిన సమాచారంలో పేర్కొంది.
→ ఈ పరిణామాన్ని ధ్రువీకరించే ఉద్దేశంతో 'ఎక్స్' అంటూ ఒకే అక్షరాన్ని మస్క్ ట్వీట్ చేశారు.

→ వీచాట్ లాంటి యాప్ కోసం.:
→ ట్విటర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే, ఎక్స్ యావనకు సంబంధించిన ప్రణాళికలను వివరిం చారు మస్క్ 'ఎక్స్ యాప్ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక.

మేఘాలయ గుహలో కొత్త కప్ప జాతి

మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ జిల్లాలోని ఒక గుహలో కొత్త కప్ప జాతిని భారత శాస్త్రవేత్తలు కనుగొ న్నారు. ఇది కాస్కేడ్ రానిడ్ జాతికి సంబంధించిందని వారు పేర్కొన్నారు.
→ అక్కడ 4 కిలో మీటర్ల పొడవైన సిజూ గుహలో ఇది వెలుగు చూసింది. అందు వల్ల ఆ మండూకానికి అమోలోప్స్ సిజు అని పేరు పెట్టారు.
→ ఇది గుహ ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో కనిపించింద న్నారు.
→ ఇది గుహలోని వాతావరణానికి అను గుణంగా మార్పులకు లోనైనట్లు కనిపించడం లేదని, అందువల్ల అది ఆ ప్రదేశంలో శాశ్వ తంగా నివాసం ఉండటంలేదని స్పష్టమవుతోం దాని వివరించారు.
→ భారత్లో కొత్త కప్పజాతు లను గుహలో కనుగొనడం ఇది రెండోసారి. 2014లో తమిళనాడులో మిక్రికాలస్ స్పెలున్సా అనే జాతిని గుర్తించారు.

దేశంలో అత్యంత ధనిక సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు.
→ దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్య మంత్రుల అందరి ఆస్తుల ఉమ్మడి విలువ రూ. 1,018.86 కోట్లు కాగా, అందులో 50.09 శాతం ఆస్తులు ఒక్క జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఉన్నాయి.
→ మిగతా 29 మంది సీఎంల ఆస్తులు సంయుక్త విలువ రూ.508 కోట్లు కాగా, జగన్మో హన్రెడ్డి ఒక్కరి ఆస్తి అంతకంటే ఎక్కువగా రూ. 108 కోట్ల మేర ఉంది. ఇందులో రూ.443 కోట్ల చరాస్తులు, మిగతా స్థిరాస్తులు ఉన్నాయి.

ఏపీ రాష్ట్ర పండగగా తిరుపతి గంగమ్మ జాతర

తిరుమల శ్రీవారికి స్వయానా చెల్లెలు, తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్ణయించిం దని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కార్యా లయం ఒక ప్రకటన విడుదల చేసింది.
→ 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరకు సంబం ధించి ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ధ్రువీకరిస్తూ సంబంధిత దస్త్రంపై సంతకం చేశారని అందులో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన రాజమౌళి

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రా లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్. ఎస్. రాజ మౌళి సత్తా చాటారు.
→ 2023కుగానూ ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు దక్కిం చుకున్నారు.
→ ప్రముఖ బాలీవు నటుడు షారుక్ ఖాన్, రచయిత BA A సల్మాన్ బుల్లితెర ప్రయోక్త. న్యాయనిర్ణేత లక్ష్మి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు ఛార్లెస్, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకులు ఎలాన్ మస్క్, ప్రఖ్యాత గాయని బియాన్స్ తదితరులు కూడా ఈ జాబితాలో నిలిచారు.
→ 'ఆర్ఆర్ఆర్'లో నటించిన ప్రముఖ నటి ఆలియా భట్ రాజమౌళి గురించి టైమ్ మేగ జీన్ ప్రొఫైల్ రాశారు.

అరుణాచల్ గ్రామంపై అమిత్ షా పిలుపు

అరుణాచల్ ప్రదేశ్లోని కిబితూ గ్రామంలో ప్రతి ఒక్కరూ పర్యటించాలని దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
→ ఆ ప్రాంత ప్రకృతి అందాలను వీక్షించాలని సూచించారు. దీనికి సంబంధించి గురువారం ట్విటర్లో ఒక వీడియోను పోస్టు చేశారు.
→ ఇదివరకు దానిని మొదటి గ్రామంగా (ఇండియాస్ ఫస్ట్ విలేజ్) ఆయన అభివర్ణించిన సంగతి తెలిసిందే.
→ 'ఇండియాస్ ఫస్ట్ విలేజ్ కిబితూలో పర్యటిం చిన సందర్భంగా అక్కడి సుందర దృశ్యాలను కెమె రాలో బంధించాను. అరుణాచల్ ప్రదేశ్ ప్రకృతి అందా లకు నెలవు.
→ అందరూ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిం చాలని, మరీ ముఖ్యంగా కిబితూను వీక్షించాలని కోరు తున్నాను. ఆ ప్రాంత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
→ ఏప్రిల్ 10న కేంద్ర మంత్రి కిబితూలో పర్యటించారు.

జర్మనీలో అణు విద్యుత్కు తిలోదకాలు!

దేశంలో మిగిలిన మూడు అణు విద్యుత్ కేంద్రాలను మూసివేతకు జర్మనీ శనివారం శ్రీకారం చుట్టింది.
→ పునరుత్పాదక ఇంధనం దిశగా మళ్లేందుకు చాలా కాలం కిందట రూపొందించిన ప్రణాళికలో భాగంగా ఈ చర్యను చేపట్టింది.
→ దీంతో పర్యావరణవే త్తల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎమండ్, నెకార్వెయిమ్- 2, ఇసార్- 2 అనే మూడు రియాక్టర్లను నిలిపివేయాలని దశాబ్దం కిందటే నిర్ణయించారు.
→ అమెరికా, జపాన్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి ఇతర పారిశ్రామిక దేశాలు మాత్రం భూతాపా నికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నా యంగా అణు ఇంధనంపైనే ఆధారపడుతున్నాయి.
→ ఈ రెండింటికీ వీడ్కోలు పలకాలని జర్మనీ నిర్ణయించింది. దీనిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి

కక్ష్యలోకి కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం

కెన్యా తొలి భూపరిశీలన ఉపగ్రహం తైఫా-1ను శనివారం విజ యవంతంగా కక్ష్యలోకి చేరింది.
→ అమెరికాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరి గింది.
→ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదాపడింది. తైఫా-1.. నాలుగురోజులకోసారి కెన్యాకు ఎగువన పరిభ్ర మిస్తుంది.
→ వ్యవసాయం, నేల, పర్యావరణానికి సంబంధించిన డేటాను సేక రిస్తుంది.
→ ఆ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు ఉచితంగా, ప్రైవేటు కంపెనీ లకు తక్కువ ధరకు అందించనున్నట్లు కెన్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.

చైనా గగనతల రక్షణ పరీక్ష విజయవంతం

శత్రు క్షిపణులను మార్గమధ్యంలో నేలకూల్చే అస్త్రాన్ని విజయ వంతంగా పరీక్షించినట్లు చైనా ప్రకటించింది.
→ ఆ ఆయుధాన్ని నేలమీద నుంచి ప్రయోగించినట్లు తెలిపింది. దీంతో అంతరిక్షం నుంచి దూసుకొచ్చే అస్త్రాలను ధ్వంసం చేసే సామర్థ్యం విషయంలో డ్రాగన్ పురోగతి సాధించినట్లు స్పష్ట మవుతోంది.
→ రాత్రి తమ భూభాగంలోనే ఈ పరీక్షను నిర్వహిం చామని చైనా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
→ ఇది పూర్తిగా ఆత్మరక్షణకు ఉద్దేశించిన ప్రయోగమని తెలిపింది. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని దీన్ని నిర్వహించలేదని వివరించింది.
→ అయితే తాజా పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను చైనా వెల్లడించలేదు. అది నిర్దిష్టంగా గగనతలంలోని లక్షిత వస్తువును తాకిందా? ఎన్ని అస్త్రాలను పరీక్షించారు.. అవి ఎక్కడ పడ్డాయి వంటివి బహిర్గతం చేయలేదు.

వైద్యులు, శాస్త్రవేత్తలనూ రోదసిలోకి పంపుతాం!

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మానవసహిత అంతరిక్షయాత్ర 'గగన్మోన్' ఒక్క ప్రయోగానికే పరిమితం కాబోదని ఇస్రో సీనియర్ అధి కారి ఇంతియాజ్ అలీ ఖాన్ తెలిపారు.
→ వీటిని నిరంతరం నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు.
→ గగన్యాన్ కింద వచ్చే ఏడాది చివర్లో నిర్వహించే తొలి యాత్రలో భారత వైమానిక దళానికి చెందిన నలుగురు పైలట్లు పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.
→ వారు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని తెలిపారు. తదుపరి చేపట్టే యాత్రల్లో పైలట్లు కానివారికీ అవకాశం కల్పించే వీలుందన్నారు.
→ వీరిలో వైద్యులు, మహిళలు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు సహా పౌర సమాజానికి సంబంధించినవారు ఉండొచ్చని వెల్లడించారు.

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తా

మిస్ఇండియా 2023" కిరీటం రాజస్థాన్లోని కోట నగరానికి చెందిన . 19 ఏళ్ల నందినీ గుప్తాను వరించింది.
→ మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో శనివారం జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ ఇందుకు వేదికగా నిలిచింది.
→ గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి.. మిస్ ఇండియా కిరీటాన్ని నందినీ గుప్తాకు అలంకరించారు.
→ దీంతో త్వరలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకా శాన్ని నందిని దక్కించుకున్నారు.
→ ఈ మెగా బ్యూటీ కాంటెస్ట్లో ఢిల్లీకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ శ్రేయా పూంజా ఫస్ట్ రన్నరప్ గా నిలవగా, రెండో రన్నరప్ గా మణిపూర్కు చెందిన టీవీ యాంకర్ తౌనావ్ జంస్టైలా లువాంగ్ నిలిచారు.
→ మిస్ ఇండియా నందినీ గుప్తా విషయానికి వస్తే ఆమె బిజినెస్ మేనేజ్ మెంట్ డిగ్రీ చేశారు.

గిన్నిస్ రికార్డుల్లో బిహూ డ్యాన్స్

ఈశాన్య రాష్ట్రం అస్సాం సంప్రదాయ నృత్య మైన బిహూ డ్యాన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డుల్లో స్థానం దక్కించుకుంది.
→ ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృ త్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు.
→ గువాహటి లోని సరుసజై స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం లో సంప్రాదాయ వాయిద్యాలైన దోల్, తాల్, గోగోనా, టోరా, షెపా వంటి వాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు.
→ అస్సాం సాంస్కృ స్థితిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్ర _మాన్ని నిర్వహించింది.

భారత్ అధ్యక్షతన 100వ జీ-20 సదస్సు

జీ-20 అధ్యక్ష హోదాలో భారత్ కీలక మైలురా యిని దాటిందని, సోమవారం 100వ జీ-20 సమావేశాలు నిర్వహించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్ల డించింది.
→ ఇప్పటివరకూ దేశంలోని 41 నగరాల్లో ఈ సమావేశాలు జరిగాయని వివరించింది.
→ వారణాసిలో గత డిసెంబరు 1న వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (ఎంఏసీఎస్) ప్రారంభమైందని తెలియజేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. సోమవారం మరో 2 సమావేశాలు జరిగాయని తెలిపింది.
→ ఆరోగ్య సేవలపై గోవాలో వర్కింగ్ గ్రూప్-2 సమావేశం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై హైదరాబాద్లో వర్కింగ్ గ్రూప్-2 సమావేశం జరిగాయని పేర్కొంది.
→ జీ-20 సభ్యదేశాల ప్రతినిధులు ఉత్సాహంగా హాజరవుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదు ర్కొంటున్న సవాళ్లపై ప్రసంగిస్తుండటం.. భారత్ అధ్యక్ష తన పెద్ద ఎత్తున సమావేశాలు కొనసాగుతున్నాయనడా నికి నిదర్శనమని…

స్టార్షిప్ ప్రయోగం వాయిదా

సౌథ్ పాడ్రే ఐలాండ్: చందమామ, అంగారకుడి పైకి మానవులను చేరవేసేందుకు రూపొందించిన భారీ 'స్టార్' షిప్' రాకెట్ తొలి ప్రయోగాన్ని స్పేస్ఎక్స్ సంస్థ చివరి నిమిషంలో నిలిపివేసింది.
→ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం నుంచి ఈ రాకెట్ను నింగిలోకి పంపాల నుకున్నారు. ఇంధనాన్ని నింపే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
→ ఇంజినీర్లు దీన్ని సకాలంలో సరిచేయ లేకపోవడంతో ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. స్టార్షిప్ ప్రయోగానికి రెండో ప్రయత్నం తర్వాతే ఉండొచ్చని భావిస్తున్నారు.

భారత్లో యాపిల్ తొలి స్టోర్

అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. భారత్లో తొలి.. అధికారిక స్టోర్ను ప్రారంభిస్తోంది.
→ దేశ ఆర్థిక రాజ దాని ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.
→ అంతేకాకుండా కస్ట మర్లకు ఆయన సాదర స్వాగతం పలకనున్నారు.
→ అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన భారత్లో స్టోర్ను ప్రారంభిం చనుండటం ఎంతో సంతోషాన్నిస్తోందని, దీర్ఘకాలంగా భారత్తో ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఇది ఎంత గానో దోహదపడుతుందని టిమ్ కుక్ ఒక ప్రకటనలో వెల్లడిం. చారు.

సాహితీవేత్త విఠలాచార్యులుకు దిల్లీ నుంచి ఆహ్వానం

'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్లో పాల్గొన్నవారికి పిలుపు
→ యా దాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చి 2 లక్షలకు పైగా పుస్తకాలను ఉంచి ఎంతో మంది ఉన్నత చదువులకు తోడ్ప డుతున్న ప్రముఖ సాహితీవేత్త, మధుర కవి డాక్టర్ కూరెళ్ల విఠలా చార్యులుకు దిల్లీ నుంచి ఆహ్వానం అందింది.
→ ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం వందో ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా అందులో పాల్గొన్న వారందరితో దిల్లీలో ఈనెల 25 నుంచి 30 వరకు ప్రసారభారతి వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.
→ అందులో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం అందినట్లు విఠలాచార్యులు సోమ వారం తెలిపారు. ఈనెల 25 నుంచి దిల్లీలో జరిగే కార్యక్రమాల గురించి వివరించారు.
→ 30న 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్లో పాల్గొన్న వారంద రితో సమావేశం నిర్వహించి వారిని గౌరవిస్తారని తెలిపారు.

హైదరాబాద్ ఓపెనర్ అజీమ్ ఇక లేరు

హైదరా బాద్ క్రికెట్ జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ అబ్దుల్ అజీమ్ కన్నుమూ శారు. ఆయన వయసు 62 ఏళ్లు.
→ అజీమ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న అబ్దుల్ తుదిశ్వాస విడిచారు.. గా పేరున్న అజీమ్.
→ మెరుపు బ్యాటర్ 1980-95 మధ్య కాలంలో హైద రాబాద్కు 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు 3.40 సగటుతో 4644 పరు గులు సాధించాడు.
→ 1986 రంజీ సీజన్లో తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) చేశాడు. మొత్తం మీద 12 శతకాలు, 18. అర్ధ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
→ బలమైన షాట్లతో స్కోరు పరుగులు పెట్టించే అజీమ్కు హుక్, ఫుల్ షాట్ల స్పెషలి స్టుగా పేరుంది.
→ హైదరాబాద్ జట్టుకు చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్గా కూడా ఆయన పని చేశారు.

సురేఖ ప్రపంచ రికార్డు

తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ సత్తా చాటింది.
→ తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్న మెంట్లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డుతో అదరగొట్టింది.
→ డబుల్-50 రౌండ్లో (353/360) సింగిల్-50 రౌండ్లో (360/360) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
→ ఈ క్రమంలో సింగిల్-50లో అత్యధిక స్కోరు (360) తో సారా లోపెజ్ (356, కొలంబియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
→ అంతేకాక ఓవరాల్గా 713 పాయిం ట్లతో సారా పేరిటే ఉన్న వరల్డ్ రికార్డును సురేఖ సమం చేసింది.

ఆశా భోంస్లేకు లతా మంగేష్కర్ అవార్డు

దిగ్గజ గాయని లతా దీనానాథ్ మంగే ష్కర్ అవార్డుతో సత్కరిం చనున్నట్లు మంగేష్కర్ కుటుంబం ప్రకటించింది.
→ గతేడాది ఫిబ్రవరి 6న బాలీవుడ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ దివంగతురాలు కావడంతో ఆమె పేరిట కుటుంబ సభ్యులు, ట్రస్టు ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
→ జాతి నిర్మాణంలో మార్గ దర్శక పాత్ర పోషించిన ప్రముఖులకు ఇవ్వాలని సంక ల్పించిన ఈ అవార్డును గతేడాది ప్రప్రథమంగా ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ స్వీకరించారు.
→ లతాకు స్వయానా సోదరి అయిన ఆశాభోంస్లేకు ఏప్రిల్ 24న ఈ పురస్కారం అందజేస్తారు.
→ ఇదే వేడుకలో ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాసు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ పురస్కారంతో సత్కరిస్తారు.

400 నౌకా విధ్వంసక క్షిపణులు కొనుగోలు చేయనున్న తైవాన్

అమెరికా నుంచి తైవాన్ 400 హార్పూన్ నౌకా విధ్వంసక క్షిపణులను కొనుగోలు చేయనుంది.
→ చైనా ఆక్రమణ ప్రయత్నాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఆ దేశం వీటిని వినియోగించే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జనాభాలో 142.86 కోట్ల మందితో అగ్రస్థానానికి భారత్

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది.
→ ఇప్పటిదాకా నంబరు 1గా నిలిచిన చైనాను దాటేసింది.
→ మొత్తం 142 86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిల్చి చింది.
→ ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా డాష్ బోర్డు ఇప్పుడు భారతన్ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిస్తోంది.
→ భారత్లో పోలిస్తే చైనాలో 29 లక్షల్ మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది. జనాభా ఉన్నారు.
→ ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచా రాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు ఐరాస తెలిపింది.
→ భారత్లో జనాభా వేగంగా పెరగడంపై 63 శాతం మంది సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తున్నట్లు తాజా సర్వేలో తేలిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వోజ్నార్ తెలిపారు.

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో మన హైదరాబాద్ చోటు

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో మన హైదరాబాద్ చోటుదక్కించుకుంది.
→ నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్రీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ అధ్యయనం వెల్లడించింది.
→ పది లక్షల డాలర్లకు (మన కరెన్సీలో దాదాపు రూ.8.2 కోట్లు) పైగా ఆస్తులు ఉన్న వ్యక్తులను మిలియనీ ర్లుగా పరిగణిస్తారు.
→ ప్రపంచవ్యాప్తంగా 97 నగ రాలు ఈ జాబితాలో చోటుదక్కించుకోగా హైదరా బాద్కు 65వ స్థానం లభించింది.
→ భారత్ నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానంలో నిలిచింది.
→ ఈ జాబితాలో 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం తొలి స్థానం పొందింది.
→ అలానే 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్ లో అత్యధిక నికర సంపద ఉన్న వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగిందని నివే దిక పేర్కొంది.

1.05 కోట్లు దాటిన హైదరాబాద్ జనాభా

రాష్ట్ర రాజధాని హైదరా బాద్ జనాభా 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి. జనాభా విభాగం అంచనా వేసింది.
→ ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరనుందని తెలిపింది.
→ జనాభా పరంగా మన నగరం దేశంలో 6వ స్థానంలో, ప్రపం చంలో 34వ స్థానంలో నిలిచింది. పెరిగిన పట్టణీకర ణతో రాష్ట్ర జనాభాలో మూడోవంతు రాజధానిలోనే ఉంటోంది.
→ 1950 ప్రాంతం లో హైదరాబాద్ జనాభా 10 లక్షలకు పైగా ఉండగా ,1975 నాటికి 20 లక్షలు దాటింది.
→ అంటే పాతికేళ్ళలో రెండింతలైంది.ఆ తర్వతా 15 ఏళ్ళలో అంతే 1990 కి 40 లక్షలకి పైగా పెరిగింది.
→ ఆ తర్వాత 20 ఏళ్ళలో 80 లక్షలకు పైగా చేరింది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఎం సి హెచ్ పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే .
→ జి హెచ్ ఎం సి ఏర్పాటుతో 650 కి.మి. పరిధికి నగరం విస్తరించింది. అవుటర్ రింగురోడ్డు వరకు పరిగణలోకు తీస్కుంటే 1000 చ.కి.మీ. విస్తీర్ణం అవుతుంది.
→ ఏటా 5 లక్షల మంది ఉపాధి రీత్యా నగరానికి వలస వస్తున్నారు.

రాష్ట్రంలో 9.9 శాతం నిరుద్యోగిత

తెలంగాణలో నిరు ద్యోగ రేటు పెరుగుతోంది. చదువుకుని కార్మిక బలగంలో చేరాల్సిన యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది.
→ గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2 శాతం పెరిగింది. గత ఏడాది జనవరి నాటికి 7.7 శాతంగా ఉన్న నిరుద్యోగం డిసెంబరు నాటికి 9.9 శాతంగా నమో దైంది.
→ జాతీయస్థాయిలో నిరుద్యోగ సగటు 7.2 శాతం కన్నా ఇది 2.7 శాతం అధికం. తెలంగాణ కన్నా నిరుద్యోగిత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి.
→ ఈ జాబితాలో రాజస్థాన్, జమ్మూకశ్మీర్, బిహార్, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమాచల్,ఉత్తరాఖండ్ ఉన్నాయి.
→ దేశవ్యాప్తంగా అత్యధిక నిరుద్యోగ రేటు రాజ స్థాన్ (13.7 శాతం)లో ఉండగా, గుజరాత్ (3. 2శాతం)లో అతి తక్కువగా ఉంది.

సినిమాటోగ్రఫ్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

ఏ చలన చిత్రాలను ఏయే వయసుల వారు చూడవచ్చో వర్గీకరించేందుకు ఉద్దేశించిన సినిమాటోగ్రఫ్ (సవరణ) బిల్లు-2023ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
→ దీనిని పార్లమెం టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమా చార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ విలే కరులకు తెలిపారు.
→ ఇప్పటివరకు సినిమాలను యూ, ఏ, యూఏ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి సెన్సార్ బోర్డు అనుమతి మంజూరు చేస్తోంది.
→ ఇది కాకుండా వైద్యులు, శాస్త్రవేత్తలు వంటి ప్రత్యేక విభాగ వీక్షకులకు ఉద్దేశించిన చిత్రాలకు ఎస్ వర్గం కింద ధ్రువీకరణను ఇస్తోంది.
→ యూఏ చిత్రాలను 12 ఏళ్లలోపు పిల్లలు చూడాలంటే అది వారి తల్లిదండ్రుల పర్యవేక్షణకు లోబడి జరగాలనేది నిబంధన.
→ ఇకపై 12 ఏళ్ల లోపు వారికి బదులు యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ అనే వర్గీకరణ తీసుకురానున్నారు. ఆయా వయసుల వారు వాటిని చూడవచ్చని అర్ధం.
→ చలనచిత్రాల ధ్రువీకరణ ప్రక్రియను మెరు గుపరచడంతో పాటు వేర్వేరు వేదికల్లో చిత్రాల వర్గీకరణలో ఏకరూపతను తీసుకువచ్చేలా సవర ణలు ప్రతిపాదిస్తున్నారు.
→ పైరసీ చేసిన చిత్రా లను ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేయడాన్ని నిరోధించడానికి వీలు కల్పించేలా చట్టాన్ని సవ రించనున్నారు.
→ సుప్రీంకోర్టు తీర్పులు, కార్యనిర్వా హక ఉత్తర్వులను క్రోడీకరిస్తూ కొన్ని సవరణలు చేర్చనున్నారు.
→ ఎలాంటి వివాదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరిచేలా బిల్లు ఉంటుం దని ఠాకుర్ చెప్పారు.
→ పైరసీని అడ్డుకోవడం, ఏయే వయసు వారు ఏయే సినిమాలు చూడ వచ్చో వర్గీకరించడం, కాలంచెల్లిన నిబంధనల్ని రద్దు చేయడంపై వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లకు బిల్లులో చోటు కల్పించినట్లు వివరిం చారు.
→ మరిన్ని వివరాలను ముసాయిదాలో వెల్ల డిస్తామని చెప్పారు.

క్వాంటమ్ మిషన్కు ఆమోదం

క్వాంటమ్ సాంకేతకతలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించ డానికి ఉద్దేశించిన 'జాతీయ క్వాంటమ్ మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
→ 2023-31 మధ్య రూ.6,003 కోట్లను దీనికింద ఖర్చు చేస్తారు.

అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరాం

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా సర్వేలో తొలిస్థానం సాధించింది.
→ గురుగ్రామ్ లోని మేనేజ్మెంట్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్కు చెందిన స్టాట్రెజీ ప్రొఫెసర్ రాజేశ్ కె. పిలానియా దీనిపై అధ్యయనం చేశారు.
→ కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, వృత్తి, మతం, కొవిడ్-19 ప్రభావం, దాతృత్వం అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే అధ్యయనం నిర్వహిం చారు.
→ ఈ అంశాలు స్థానిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతు న్నాయో పరిశీలించి మిజోరంను అత్యంత సంతోషకర మైన రాష్ట్రంగా గుర్తించారు.
→ వందశాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగానూ మిజోరానికి గుర్తింపు ఉంది. స్థానిక ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లి తండ్రులతో క్రమం తప్పకుండా సమావేశమవుతారు.
→ విద్యార్థులు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా తల్లిదం డ్రులతో చర్చించి పరిష్కారమార్గాన్ని సూచిస్తారు. కుల రహితమైన మిజోరం సమాజ నిర్మాణం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది.
→ ఆడ, మగ అనే భేదం లేకుండా యువత 16, 17 ఏళ్ల వయసులోనే ఉపాధి పొందుతు న్నారు. చిన్న వయసులోనే సంపాదించడాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తారు.
→ అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేదు. మిజోరంలో ఉద్యోగం చేసే మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉంటారని నివేదిక పేర్కొంది.

ఉక్రెయిన్ కు అమెరికా పేట్రియట్ లు

అమెరికా సరఫరా చేసిన పేట్రియాట్ క్షిపణులు తమకు అందాయని బుధవారం ఉక్రెయిన్ ప్రకటిం చింది.
→ ఇవి ఉపరితలం నుంచి గగనతలంలోకి దూసు కెళ్లే మిసైళ్లు. వీటితో ఇక తమ గగనతలం సురక్షిత మని కీవ్ భావిస్తోంది.
→ "ఇక నుంచి మా అందమైన ఆకాశం భద్రత పెరగనుంది. పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ ఉక్రెయిన్ కి వచ్చేసింది" అని ఆ దేశ రక్షణమంత్రి రెజ్నికోవ్ తెలిపారు.
→ పేట్రియాట్ క్షిప ణులు యుద్ధ విమానాలను, ప్రత్యర్థి మిసైళ్లను లక్ష్యంగా చేసుకోగలవు.
→ ఇటీవల కాలంలో రష్యా విచక్ష ణారహితంగా క్షిపణుల వర్షం కురిపించి ఉక్రెయిన్లోని వివిధ నగరాలను ధ్వంసం చేస్తోంది.
→ ముఖ్యంగా విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలను లక్ష్యం చేసుకుంది. పేట్రియాట్ల రాకతో దాడులు ఆగే అవకాశం ఉందని భావిస్తోంది.
→ అయితే ఇది యుద్ధగమనాన్ని నిర్దేశించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

పని చేయడానికి అత్యుత్తమం టీసీఎస్

'మన దేశంలో పనిచేయడానికి ఉత్తమమైన విగా ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పొందింది.
→ సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్ఇన్ భారత్ లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితాను వెలువరించింది.
→ ఇ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్-ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ రెండు, మూడు స్థానాలు దక్కించు కున్నాయి.
→ గతేడాది జాబితాలో టెక్ కంపెనీలు ఆధిపత్యం ప్రద ర్మించగా.. ఈసారి ఆర్థిక సేవలు, చమురు-గ్యాస్, నిపు ణుల సేవలు, తయారీ, గేమింగ్ కంపెనీలు జాబితాలో ఎక్కువగా చోటు సాధించాయి.
→ అగ్రగామి 25 కంపెనీల్లో 10 ఆర్థిక సేవలు/ బ్యాంకింగ్/ ఫిన్ చెందినవే. మెక్వారీ గ్రూప్ (5వ స్థానం), హెల్డీఎఫ్సీ బ్యాంక్ (11), మాస్టర్కార్డ్ (12), యుబీ (14) స్థానాల్లో ఉన్నాయి. తొలిసారిగా ఇ-స్పోర్ట్స్, గేమింగ్ రంగాల కంపెనీలు డ్రీమ్ 11 సంస్థ 20వ స్థానంలో, గేమ్స్ 2447 సంస్థ 24వ స్థానంలో నిలిచాయి.
→ ఈ అంశాల ఆధారంగా:- రాణించే సామర్థ్యం, నైపుణ్యాల వృద్ధి, కంపెనీ స్థిరత్వం, విదేశీ అవకాశాలు, కంపెనీ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి అంశాల ఆధారంగా, కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది.
→ ఈ నైపుణ్యాలపై ఆసక్తి: కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కంప్యూటర్ సెక్యూరిటీ నైపు ణ్యాలు కలిగిన వారిని చేర్చుకునేందుకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి.
→ ఈ జాబితాలోని కంపెనీల్లో అత్య ధికం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తు న్నాయి. ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ, పుణె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
→ Top 10 కంపెనీలవే :-
→ 1) టీసీఎస్
→ 2) అమెజాన్
→ 3) మోర్గాన్ స్టాన్లీ
→ 4) రిలయన్స్ ఇండస్ట్రీస్
→ 5) మెక్వారీ గ్రూప్
→ 6) డెలాయిట్
→ 7) ఎన్ఏవీ ఫండ్
→ 8) ష్నైడర్ ఎలక్ట్రిక్
→ 9) వయాట్రిస్
→ 10) రాయల్ కరేబియన్

యూరప్ లో వడ్డీ రేట్లను తగ్గించే మొదటి దేశం హంగేరి!

యూరప్ లోని ఓ చిన్న దేశం వడ్డీ రేట్లను తగ్గించడానికి రెడీ అవుతోంది.
→ వరసగా ఆరు పాలసీ మీటింగ్ లో వడ్డీ రేట్లను హంగేరి సెంట్రల్ బ్యాంక్ హంగేరియ న్ నేషనల్ బ్యాంక్ మార్చకుండా ఉంచింది.
→ వచ్చే వారం జరగనున్న మీటింగ్ లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అక్కడి మీడియా పేర్కొంటోంది.
→ ప్రస్తుతం ఈ దేశంలో బేస్ వడ్డీ రేటు 13 శాతంగా ఉంది.
→ హంగేరియన్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ బర్నబస్ విరగ్ కూడా కొలేటర్ కూడిన లోన్ల రేట్లను ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి తగ్గిస్తామని ప్రకటించారు.
→ యూరప్ లో ఇన్లేషన్ పీక్ స్టేజ్కు చేరుకుం దని చాలా మంది ఎనలిస్టులు చెబుతున్నారు.
→ ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గిస్తే 2021 తర్వాత యూరప్ లో వడ్డీ రేట్లు తగ్గించిన మొదటి దేశంగా హంగేరి నిలుస్తుంది.

వరల్డ్ రిచ్చెస్ట్ సిటీగా న్యూయార్క్

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ మరోసారి నిలిచింది.
→ ఈ సిటీ 3.40 లక్షల మంది మిలియనీర్లతో వరల్డ్ రిచ్చెస్ట్ సిటీల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.
→ వరల్డ్ వెల్తియె స్ట్ సిటీస్ 2023 జాబితాను అంతర్జాతీయ సంస్థ 'హెన్రీ అండ్ పార్ట్నర్స్ ' విడుదల చేసింది.
→ ఇందులో ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈస్ట్ ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ల నుంచి 97 సిటీలకు చోటు దక్కింది.
→ టాప్ 10 జాబితాలో అమెరికాకు చెందిన నాలుగు నగరాలు, చైనాకు చెందిన రెండు నగరాలు ఉన్నాయి.
→ ఈ లిస్టులో మన దేశం నుంచి ముంబై, ఈ ఢిల్లీ, బెంగళూర్, కోల్ కతా, హైదరాబాద్ కు చోటు దక్కింది.
→ మన దేశంలో అత్యంత ధనిక నగరంగా మొదటి స్థానం సంపాదించిన ముంబై.. ప్రపంచ వ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచింది.
→ ఇక ఢిల్లీ 36, బెంగళూర్ 60, కోల్ కతా 63, హైదరాబాద్ 65వ స్థానంలో ఉంది.

డబ్ల్యుపిఎల్ 2023 విజేతగా ముంబై ఇండియన్స్

ఐదు ఫ్రాంచైజీలతో బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తోలి సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించింది. 26 మార్చి 2023న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టు, మెగ్-లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. డబ్ల్యుపిఎల్ విజేత జట్టుకు 6 కోట్లు, రన్నర్-అప్ జట్టుకు 3 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌ను 4 మార్చి నుండి 26 మార్చి 2023 మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం మరియు డీవై పాటిల్ స్టేడియంలో డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించారు. అత్యధిక పాయింట్లతో పూర్తి చేసిన మూడు జట్లు పోటీలో ప్లేఆఫ్ దశల్లోకి ప్రవేశిస్తాయి. తోలి సీజన్ విజయవంతమైతే భవిష్యత్ సీజన్‌లలో మ్యాచ్‌లు మరియు ఫ్రాంచైజీల సంఖ్యను పెంచాలని బీసీసీఐ యోచిస్తోంది.

ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్

సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం రికార్డు స్థాయిలో 12వ సారి "ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం"గా నిలిచింది. ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డు వేడుకలో సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్ 2023 ఏడాదికి సంబంధించి వరల్డ్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా ఎంపికైంది. ఈ జాబితాలో దోహా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెండవ స్థానంలో, టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్ 3వ స్థానంతో పాటుగా ప్రపంచంలోని క్లీనెస్ట్ ఎయిర్‌పోర్ట్, వరల్డ్ బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా నిలిచింది.

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భారతదేశం మరియు దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా అవార్డును అందుకోగా, హైదరాబాద్ విమానాశ్రయం భారతదేశం & దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా నిలిచింది. ఇస్తాంబుల్ విమానాశ్రయం దాదాపు 60+ మిలియన్ల ప్రయాణికులతో అత్యంత రద్దీగల విమానాశ్రయంగా నిలిచింది.

స్కైట్రాక్స్ వార్షిక వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్‌లు, విమానాశ్రయ పరిశ్రమకు ప్రతిష్టాత్మకమైనవిగా పరిగణించబడతాయి. ఈ అవార్డులు వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సంతృప్తి సర్వేలో కస్టమర్‌లు వేసిన ఓటు ద్వారా నిర్ణయిస్తారు. ఈ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 550కి పైగా విమానాశ్రయాల పరిధిలో ఏడాది పొడుగునా నిర్వహిస్తారు. ఈ అవార్డులు ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్‌మార్క్‌.

బంగ్లాదేశ్‌లో తోలి సబ్‌మెరైన్ బేస్ ప్రారంభం

మార్చి 20న కాక్స్ బజార్‌లోని పెకువాలో బంగ్లాదేశ్ మొదటి జలాంతర్గామి స్థావరం 'బిఎన్ఎస్ షేక్ హసీనా'ను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించబడిన ఈ నావికా స్థావరాన్ని 'అల్ట్రా మోడ్రన్ సబ్‌మెరైన్ బేస్'గా ప్రశంసించిన ఆమె, బంగ్లాదేశ్ నావికా దళ చరిత్రలో ఈ కార్యక్రమాన్ని గర్వించదగ్గ అధ్యాయమంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ నైవికాదళంలో 4 యుద్ధనౌకలు, 6 కొర్వెట్‌లు, 4 పెద్ద పెట్రోలింగ్ క్రాఫ్ట్‌లు, 5 పెట్రోలింగ్ క్రాఫ్ట్‌లు మరియు 2 శిక్షణా నౌకలతో సహా మొత్తం 31 యుద్ధనౌకలు ఉన్నట్లు వెల్లడించారు. 2017లో బంగ్లాదేశ్ నావికాదళంలోకి తొలిసారి బిఎన్ఎస్ నోబోజాత్రా మరియు బిఎన్ఎస్ జాయ్‌జాత్రా అనే రెండు జలాంతర్గాములు చేర్చింది. ప్రస్తుతం ప్రారంభించిన సబ్‌మెరైన్ బేస్ నిర్మాణం కోసం 2019 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది.


రాయ్‌బరేలీలోని హాకీ స్టేడియంకు రాణి రాంపాల్ పేరు

భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ పేరు మీద రాయబరేలీలోని ఇండియన్ రైల్వేస్ మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ స్టేడియం పేరును రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్‌గా మార్చారు. దీనితో తన పేరిట ఒక స్టేడియంను కలిగి ఉన్న మొదటి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది. ఈమె 2020లో భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది.

రాణి రాంపాల్ 2009లో అరంగేట్రం చేసినప్పటి నుండి భారతదేశం తరపున 250కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2017 మహిళల ఆసియా కప్ టైటిల్ విజేత జట్టులో భాగంగా ఉన్నారు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ఆమె సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు చారిత్రాత్మకంగా నాల్గవ స్థానంలో నిలిచింది.


యాంటీ సబ్‌మెరైన్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ప్రారంభం

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్‌లో ఐఎన్ఎస్ ఆండ్రోత్ పేరుతో నిర్మించిన రెండవ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రారంభించబడింది. దీనికి కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఆండ్రోత్ ద్విపం పేరును నామకరణం చేశారు. యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW - SWC) కొర్వెట్‌లు అనేవి ప్రస్తుతం ఇండియన్ నేవీ కోసం నిర్మించబడుతున్న ఆధునాతన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ నౌకలు.

భారతీయ నావికాదళంలోని పాత అభయ్ - క్లాస్ కార్వెట్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని రూపొందిస్తున్నారు. ఇవి సముద్రతీర-జలాల్లో ఉపరితల నిఘా, శోధన మరియు వార్ యూనిట్లుగా విధులు నిర్వర్తిస్తాయి. నావికా విమానాలతో సమన్వయ పరచబడిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలకు వీటిని ఉపయోగించనున్నారు.

వీటిని కొచ్చిన్ షిప్‌యార్డ్ మరియు కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ రూపొందిస్తున్నారు. 29 ఏప్రిల్ 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ ఒప్పందం కూర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2026 నాటికి మొత్తం 16 నౌకలను రూపొందించి భారత నౌకాదళానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. వీటిలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మొత్తం 8 నౌకులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే గత డిసెంబర్ 20న యాంటీ సబ్‌మెరైన్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆర్నాలా ప్రారంభించబడింది.


ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్

దేశంలో ఆరోగ్య హక్కు చట్టాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 2021-2022 రాష్ట్ర బడ్జెట్‌లో చిరంజీవి ఆరోగ్య బీమా పేరుతొ నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అప్పటిలోనే రాష్ట్రలోని నివాసితులందరికీ ఆరోగ్య బీమాను అందించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఇప్పుడు దీనికి అనుబంధంగా ఆరోగ్య హక్కును చట్టంగా చేసింది.

మార్చి 21న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి నివాసికి ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేట్‌గా నడిచే ఆరోగ్య సంస్థలలో తప్పనిసరిగా ఉచిత అత్యవసర చికిత్సను అందించాల్సి ఉంటుంది. అనగా ఎటువంటి ముందస్తు చెల్లింపు లేకుండా అత్యవసర చికిత్స పొందే హక్కును ఇది కల్పిస్తుంది.

ఆ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం ఈ బిల్లులో కఠినమైన నిబంధనలు చేర్చి, ప్రైవేట్ ఆరోగ్య రంగాన్ని అణిచివేస్తుందని ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితిని సరిగా నిర్వచించకుండా ఉచిత చికిత్స అందించడాన్ని ఈ బిల్లు తప్పనిసరి చేసిందని ఆందోళన చెందుతున్నారు.


స్టార్‌బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్

భారతీయ సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్, అమెరికా కాఫీహౌస్ చైన్ 'స్టార్‌బక్స్' సంస్థకు తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ నరసింహన్ గత అక్టోబర్ నుండే స్టార్‌బక్స్‌లో ఇన్‌కమింగ్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రంగంలో ఆయన దాదాపు 30 ఏళ్ళ అనుభవం కలిగి ఉన్నారు.


వాయు ప్రహార్ శిక్షణ వ్యాయామం విజయవంతం

భారత సైన్యం మరియు వైమానిక దళం, చైనా సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) సమీపంలో వాయు ప్రహార్ అనే 92 గంటల ఉమ్మడి వ్యాయామాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. ఇరు సాయుధదళాల మధ్య అవగహన పెంపొందించేందుకు మరియు వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం కల్పించేందుకు ఈ శిక్షణ వ్యాయామం నిర్వహిస్తారు.

యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 52వ సెషన్‌లో వార్ & ఉమెన్ బుక్ విడుదల

బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో జరిగిన యుద్ధ నేరాలను వివరిస్తూ 'వార్ అండ్ ఉమెన్' అనే పుస్తకాన్ని మార్చి 24న జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 52వ సెషన్‌లో విడుదల చేశారు. డాక్టర్ ఎంఏ హసన్ రాసిన ఈ పుస్తకంలో, 1971 లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్ సైన్యం మహిళలపై చేసిన లైంగిక వేధింపులు, హింసలు మరియు హత్యల పరిమాణాన్ని వివరించారు.


లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్ నాయకుడు మరియు వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. 2019 ఎన్నికల సమయంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ పరువు నష్టం కేసులో రాహుల్‌కి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో అతనికి బెయిల్ కూడా మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

అయితే ఈ కోర్టు కేసు వెలువడిన మరుసటి రోజే లోక్‌సభ సెక్రటేరియట్, రాహుల్ గాంధీని వాయనాడ్ లోక్‌సభ సభ్యునిగా అనర్హులుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేరారోపణపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే, వచ్చే ఎనిమిదేళ్లపాటు రాహుల్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించబడతారు. ఈ పరిణామాలన్నింటిని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతీకార చర్యగా ఆరోపిస్తూ దేశవ్యాప్త సత్యాగ్రహ దీక్షను ప్రారంభించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హుత వేసే ముందు, వారి నేరారోపణపై అప్పీలు చేసుకోవడానికి మూడు నెలలు సమయం ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే భారత సర్వోన్నత న్యాయస్థానం 10 జూలై 2013 నాటి తీర్పులో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును పరిష్కరిస్తూ, ఎవరైనా పార్లమెంటు సభ్యుడు (MP), సభ్యుడు శాసన సభ (MLA) లేదా శాసన మండలి సభ్యుడు (MLC) ఒక నేరానికి పాల్పడి, కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లయితే, తక్షణమే ఆ సభ్యుడుపై అనర్హుత అమలులోకి వస్తుందని వెల్లడించింది.

ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చే ప్రయత్నంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ఎంపీ మరియు న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, ప్రజాప్రాతినిధ్యం బిల్లు సవరించేందుకు 2013 ఆగస్టు 30న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. నేరారోపణ జరిగిన వెంటనే ప్రతినిధులు అనర్హులుగా కాకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం కూడా ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే ఈ రెంటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

దీనితో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును ఆర్డినెన్స్‌గా అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. అయితే అప్పటిలో భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ దీనిని తీవ్రంగా విమర్శించారు. మీడియా ముఖంగా ఈ బిల్లు కాగితాలను చించిపాడేశారు. ఏకంగా తమ యూపీఏ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామాకే పిలుపునిచ్చారు.

దీనితో 2 అక్టోబర్ 2013న ఈ ఆర్డినెన్స్ మరియు బిల్లు రెండింటిని యూపీఏ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పుడు అదే అంశం రాహుల్ గాంధీ పేరట శాపంగా మారింది. ఒక రాజకీయ సంబంధిత పరువు నష్టం కేసులో ఒక పార్లమెంట్ సభ్యుడు, ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకుడు అనర్హుడు అవ్వడంతో దేశ రాజకీయాల్లో అలజడి మొదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థల పనితీరుపై మేధావుల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు దీనిని సరి చేయాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు చేతిలో ఉంది. అయితే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ఎంపీగా రషీద్ మసూద్ నిలిచారు.


ఇస్రో యొక్క అతిపెద్ద ఎల్‌విఎం3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), 26 మార్చి 2023న 36 ఉపగ్రహాలతో భారతదేశపు అతిపెద్ద ఎల్‌విఎం3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా వన్‌వెబ్ గ్రూప్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాల రెండో సెట్‌ను భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎల్‌విఎం3 43.5 మీటర్ల పొడవుతో 643 టన్నుల బరువును కలిగిఉంది.

యూకేకు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ గ్రూప్ కంపెనీ) 72 ఉపగ్రహాలను లో-ఎర్త్ ఆర్బిట్స్ (LEO)లోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో యొక్క వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. వన్‌వెబ్ గ్రూప్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాల మొదటి సెట్‌ను ఇస్రో ఇదివరకే అక్టోబర్ 23, 2022న ప్రయోగించింది. వన్‌వెబ్ అనేది అంతరిక్ష ఆధారితమైన గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్. ఇది ప్రభుత్వాలు మరియు వ్యాపారాల కోసం మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.

లాంచ్ వెహికల్ మార్క్-3 ( ఎల్‌విఎం3 ) అనేది జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ III ( జీఎస్ఎల్వీ) యొక్క ఆధునాతన వెర్షన్. ఇది మూడు-దశల మీడియం-లిఫ్ట్ ప్రయోగ వాహనం. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసింది. జియోస్టేషనరీ కక్ష్యలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది రూపొందించబడింది. ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సిద్దమవుతుండటంతో దీనిని అభివృద్ధి చేసింది.


మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు

ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్, నీతు ఘంఘాస్ మరియు సావీటీ బూరాలు బంగారు పతకాలు సాధించారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహిస్తున్న ఈ 13వ ఎడిషన్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిధ్యం ఇస్తుంది. దీనిని దేశ రాజధాని న్యూ ఢిల్లీలో మార్చి 15 నుండి 26 మార్చి 2023 వరకు నిర్వహించారు. రష్యా మరియు బెలారస్ నుండి అథ్లెట్లు పాల్గొనడం వలన ఈ ఈవెంట్‌ను మెజారిటీ దేశాలు బహిష్కరించాయి.

  1. నిఖత్ జరీన్, మేరీ కోమ్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌గా నిలిచింది. 50 కేజీల ఫైనల్‌లో నిఖత్ జరీన్ వియత్నాంకు చెందిన న్గుయెన్ థి థామ్‌ను ఓడించడం ద్వారా ఈ స్వర్ణం సొంతం చేసుకుంది. నిఖత్ గతంలో 52 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. తెలంగాణకు చెందిన జరీన్ 2022 కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.
  2. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోని 81 కిలోల విభాగంలో సావీటీ బూరా బంగారు పతకం సాధించింది.
  3. టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోని 75 కిలోల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది.
  4. ఏస్ ఇండియా బాక్సర్ నీతూ ఘంఘాస్ 48 కిలోల విభాగంలో బంగారు పతకం పొందారు. నీతూ గత ఏడాది 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా బంగారు పతక విజేతగా నిలిచింది.

కాశ్మీర్‌కు చెందిన అలియా మీర్‌కు వన్యప్రాణి సంరక్షణ అవార్డు

కాశ్మీర్‌కు చెందిన వన్యప్రాణి సంరక్షకురాలు అలియా మీర్‌కు వన్యప్రాణి సంరక్షణ అవార్డుతో సత్కరించారు. జమ్మూ కాశ్మీర్ కలెక్టివ్ ఫారెస్ట్స్ నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకల్లో లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా ఆమెకు ఈ అవార్డును అందించారు. కాశ్మీర్‌ ఎలుగుబంటి వంటి వివిధ వన్యప్రాణుల సంరక్షణకు చేస్తున్న సేవకు గాను ఈ అవార్డు అందించారు.

బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలుగా దిల్మా వానా రౌసెఫ్

మార్కస్ ట్రోయ్జో తర్వాత న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) కొత్త అధినేతగా బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది 2014లో బ్రిక్స్ దేశాలతో స్థాపించబడిన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు. దీనిని గతంలో బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అని పిలిచేవారు. ఇది బ్రెజిల్‌లోని సియరాలో ఉంది.

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, బ్రిక్స్ దేశాల ప్రభుత్వ లేదా ప్రైవేట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేస్తుంది. బ్రిక్స్ అనేది ఐదు ప్రముఖ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త రూపం. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా అని అర్ధం. దీనిని 16 జూన్ 2009లో స్థాపించారు. దీనిని సభ్యదేశాల మధ్య శాంతి, భద్రత, అభివృద్ధి మరియు పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది.


వైజాగ్‌లో 2వ జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

జీ20 ఇండియన్ ప్రెసిడెన్సీలో రెండవ జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశం 2023 మార్చి 28 మరియు 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించారు. రేపటి ఆర్థిక నగరాలు అనే థీమ్‌తో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 63 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ ఏడాది జనవరిలో పూణేలో జరిగిన మొదటి జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంకు కొనసాగింపుగా దీనిని నిర్వహిచారు. భారత G20 ప్రెసిడెన్సీలో 2023 మౌలిక సదుపాయాల ఎజెండాపై ప్రధానంగా చర్చలు నిర్వహించారు. ఏటా పట్టణీకరణ శాతం పెరుగుతన్న నేపథ్యంలో, దానికి తగ్గట్టుగా పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సమావేశానికి ఇతర కేంద్ర మంత్రులతో సహా ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు.


భారతదేశం - బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ప్రారంభం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంయుక్తంగా భారతదేశం-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ (IBFP) ను మార్చి 18న వర్చువల్ మోడ్‌లో ప్రారంభించారు. ఈ పైప్‌లైన్ నిర్మాణానికి 2018 సెప్టెంబర్‌లో ప్రధానమంత్రులిద్దరూ పునాది రాయి వేశారు. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య మొదటి క్రాస్-బోర్డర్ ఎనర్జీ పైప్‌లైన్, దీనిని దాదాపు 377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు.

ఇండియాకు చెందిన నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ 2015 నుండి బంగ్లాదేశ్‌కు పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ప్రసుతం నిర్మించిన పైప్‌లైన్ సంవత్సరానికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల హై-స్పీడ్ డీజిల్‌ను రవాణా చేయగల సామర్థ్యం కలిగిఉంది. బంగ్లాదేశ్ ఇప్పుడు దక్షిణాసియాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. విద్యుత్ మరియు ఇంధన రంగంలో ఈ సహకారం మరింత ఎక్కువ ఉంది.


చైనా కొత్త ప్రధానమంత్రిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు

చైనా మాజీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లి కియాంగ్, ఆ దేశంలో రెండవ అత్యున్నత పదవిని చేపట్టారు. గత 10 సంవత్సరాలుగా ఆ పదవిలో ఉన్న లీ కెకియాంగ్ తర్వాత 11 మార్చి 2023న ఆయన చైనా ప్రదమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చైనా రాజకీయ వ్యవస్థలో ప్రధానమంత్రి రెండవ అత్యున్నత పదవి. ఈ హోదాను సాధారణంగా చైనా యొక్క ప్రీమియర్ అని పిలుస్తారు.


సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ మొదటి సమావేశం ప్రారంభం

మొదటి సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్ 20 (SAI20) యొక్క సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్, మార్చి 13న గౌహతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 'బ్లూ ఎకానమీ' మరియు 'రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' థీమ్‌లతో జరిపారు. జీ20 సభ్య దేశాలు, అతిథి దేశాలు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బ్లూ ఎకానమీ ద్వారా పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతూ జీ20 దేశాల ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవనోపాధి మరియు సముద్ర వనరులను స్థిరంగా ఉపయోగించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

జీ20 యొక్క సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్, 2022లో ఇండోనేషియా జీ20 ప్రెసిడెన్సీ సమయంలో సహకార పర్యవేక్షణ ద్వారా ఆర్థిక పాలనను మెరుగుపరచడానికి స్థాపించబడింది. ఈ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ విధాన సంభాషణ మరియు ప్రభుత్వ రంగ ఆడిట్ ఎకోసిస్టమ్‌లోని ఉత్తమ పద్ధతులను గుర్తించి వాటిని అమలు చేస్తుంది.


హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌

కర్ణాటకలోని హుబ్బల్లిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను మార్చి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిందని అధికారులు తెలిపారు. ఈ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌కు శ్రీ సిద్ధారూఢ స్వామీజీ స్టేషన్‌గా నామకరణం చేసినట్లు కూడా వెల్లడించారు.

ఇదే వేదిక ద్వారా 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఐఐటి ధార్వాడ్ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హోస్‌పేట-హుబ్బ‌ళ్లి-తీనాఘాట్ సెక్షన్‌ల విద్యుద్దీకరణ మరియు అప్‌గ్రేడ్ చేసిన హోసపేట స్టేషన్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అలానే హుబ్బళ్లిలో జయదేవ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.


భారత్ గౌరవ్ పథకం కింద భారత్ నేపాల్ అష్ట యాత్ర

భారత్ గౌరవ్ టూరిస్ట్‌ల రైలు కింద "భారత్ నేపాల్ అష్ట యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని 31 మార్చి, 2023న జలందర్ నుండి ఈ రైలు బయలుదేరుతుంది. 9 రాత్రుల 10 రోజుల నిడివితో సాగే ఈ యాత్రలో భారతదేశంలోని అయోధ్య, వారణాసి & ప్రయాగ్‌రాజ్ మరియు నేపాల్‌లోని పశుపతినాథ్ (ఖాట్మండు) వంటి ప్రదేశాలను కవర్ చేస్తుంది.

ఇండియన్ రైల్వే 2021లో భారత్ గౌరవ్ స్కీమ్‌ను ప్రారంభించి. ఇది భారతదేశంలోని వివిధ చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అందుబాటులో తీసుకొచ్చారు. మొదటి భారత్ గౌరవ్ రైలు కోయంబత్తూర్ మరియు షిర్డీ మధ్య నడపబడింది. తెలుగు రాష్ట్రాల నుండి మొదటి 'ఆరిజినేటింగ్ భారత్ గౌరవ్ రైలును పూరీ-కాశి-అయోధ్య పేరుతొ మార్చి 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యందు ప్రారంభించారు.


బెంగళూరులో మొట్టమొదటి మిథనాల్‌తో నడిచే బస్సు ప్రారంభం

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్చి 12 న బెంగళూరులో మొట్టమొదటి మిథనాల్‌తో నడిచే బస్సులను ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను కార్బన్ ఉద్గారాల స్థాయిని తగ్గించే లక్ష్యంతో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నీతీ ఆయోగ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు అశోక్ లేలాండ్ కలిసి నిర్వహిస్తున్నాయి.

మిథనాల్ ఎకానమీ భావనను ఇప్పటికే చైనా, ఇటలీ, స్వీడన్, ఇజ్రాయెల్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ మరియు అనేక ఇతర యూరోపియన్ దేశాలు అందిపుచ్చుకున్నట్లు, ఇండియాను కూడా ఈ జాబితాలో చేర్చేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు నీతీ ఆయోగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.


కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో ప్రముఖ రుణదాతలలో ఒకటైన యునైటెడ్ స్టేట్స్‌లోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్, మార్చి 10న కుప్పకూలింది. 2007–2008లో చోటు చేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇది అతిపెద్ద బ్యాంక్ వైఫల్యంగా నమోదుయ్యింది. బీమా చేయని డిపాజిట్ల యొక్క అధిక నిష్పత్తి మరియు హోల్డ్-టు-మెచ్యూరిటీ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టబడిన డిపాజిట్ల యొక్క అధిక భాగం కారణంగా ఈ సంక్షోభం నెలకొంది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనం భారతీయ స్టార్టప్ పరిశ్రమను అప్రమత్తం చేసింది. మెజారిటీ భారతీయ స్టార్టప్‌ కంపెనీలు ఎస్వీబీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకు పతనంతో ఈ కంపెనీల ఆర్థిక వనరులపై ప్రభావం పడనుంది. ఎస్వీబీ 2003 నుండి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 20కి పైగా భారతీయ కంపెనీలలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్, కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా 1983లో స్థాపించబడింది. ఇది ప్రధానంగా స్టార్టప్ కంపెనీల ఆర్థిక అవసరాలను తీర్చే లక్ష్యంతో రోజర్ వి స్మిత్ ప్రారంభించారు. దాదాపు 40 సంవత్సరాల సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చరిత్రలో 30,000 కంటే ఎక్కువ వ్యవస్థాపక సంస్థలకు విజయపథంలో మద్దతునిచ్చింది.


షీ చేంజ్ క్లైమేట్ భారత అంబాసిడర్‌గా శ్రేయా ఘోదావత్

ప్రముఖ క్లైమేట్ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రేయా ఘోదావత్ 13 మార్చి 2023న 'షీ చేంజ్స్ క్లైమేట్' యొక్క భారత అంబాసిడర్‌గా నియమితులయ్యారు. షీ చేంజ్స్ క్లైమేట్ అనేది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గ్లోబల్ క్యాంపెయిన్. ఇది మహిళ భాగస్వామ్యతో వాతావరణ మార్పుల ప్రభావాలపై అవగాహనా కల్పించడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.


తమిళ రచయిత్రి శివశంకరికి సరస్వతి సమ్మాన్‌ పురస్కారం

ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి, 2019 లో పబ్లిష్ చేసిన తన సూర్య వంశం పుస్తకం కోసం సరస్వతి సమ్మాన్ 2022 పురస్కారంను దక్కించుకున్నారు. సరస్వతీ సమ్మాన్ అనేది భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIIలో జాబితా చేయబడిన 22 భాషలలో ఏదైనా అత్యుత్తమ గద్య లేదా పద్య సాహిత్య రచనలకు అందించే వార్షిక పురస్కారం. దీనిని 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. విజేతకు 15 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తారు.


ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీకి 4వ స్థానం

ప్రపంచ ఎయిర్ క్వాలిటీ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 50 నగరాల జాబితాలో ఢిల్లీ నాల్గవ స్థానంలో నిలిచింది. ఐక్యూ ఎయిర్ రిపోర్ట్ 2022, ఢిల్లీలో సగటు PM2.5 స్థాయి 92.6 μg/m3 నమోదు కాబడినట్లు తెలిపింది. ఈ జాబితాలో పాకిస్తాన్ లోని లాహోర్‌ అత్యంత కాలుష్య నగరంగా ప్రధమ స్థానంలో ఉండగా, చైనాలోని హోటాన్ రెండవ స్థానంలో ఉంది.

భారతదేశం 2022లో ప్రపంచంలో ఎనిమిదవ అత్యంత కలుషితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ప్రపంచంలోని టాప్ 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 నగరాలకు ఇండియా నిలయంగా ఉంది. రాజస్థాన్‌లోని భివాడి ప్రపంచ ర్యాంకింగులో మూడో స్థానంలో ఉండగా, దేశంలో ప్రధమ స్థానంలో ఉంది. ఐక్యూ ఎయిర్ అనేది స్విస్ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ. ఇది గాలి నాణ్యత పర్యవేక్షణ మరియు పరిశోధన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.


మేఘాలయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ప్రారంభం

మేఘాలయ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ మార్చి 14న షిల్లాంగ్‌లో ప్రారంభమైంది. ఈ వేడుకను మేఘాలయ టూరిజం సహకారంతో మేఘాలయ ఫిల్మ్‌మేకర్స్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తుంది. స్థానిక ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించేందుకు, పర్యాటకులను ఆకర్శించేందుకు దీనిని నిర్వహిస్తున్నారు. 5 రోజుల్లో నిర్వహిస్తున్న ఈ వేడుకలో దాదాపు 40 సినిమాలు ప్రదర్శించబడ్డాయి. దాదాపు 5,000 మంది వీక్షకులు హాజరయ్యారు.


అత్యల్ప అక్షరాస్యత రేటు కిలిగిన రాష్ట్రంగా బీహార్

విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, బీహార్ దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగిన రాష్ట్రంగా నిలిచింది. అదే సమయంలో కేరళ దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉంది. ఈ జాబితాలో కేరళ 94 శాతం, లక్షద్వీప్ 91.85, మిజోరం 91.33 శాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలవగా, రాజస్థాన్ 66.1 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 65.3 శాతం, బీహార్ 61.8 శాతంతో దిగువ మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ జాబితాలో ఆంధప్రదేశ్ 67.02 శాతం, తెలంగాణ 72.80శాతంతో దిగువ స్థానాల్లో ఉన్నాయి. గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యత రేటు 67.77 శాతంగా ఉండగా, పట్టణ భారతదేశంలో 84.11 శాతంగా ఉంది. లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ సమాచారాన్ని అందించారు.


ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా సురేఖ యాదవ్‌

కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై-స్పీడ్ వందే భారత్‌ను ఆపరేట్ చేసిన మొదటి మహిళా లోకో పైలట్‌గా సురేఖ యాదవ్ నిలిచారు. సురేఖ యాదవ్ గతంలో 2011లో ఆసియాలో మొట్టమొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. 13, 2023న షోలాపూర్ స్టేషన్ మరియు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య వందే భారత్‌ను నడిపి నూతన గుర్తింపును పొందారు. ఈమె 1988లో మొదటి మహిళా లోకో పైలట్‌గా భారతీయ రైల్వేలో కెరీర్ ప్రారంభించారు.


బెంగుళూరులో "అగ్రియూనిఫెస్ట్"ను ప్రారంభించిన నరేందర్ సింగ్ తోమర్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సహకారంతో బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన 5-రోజుల సాంస్కృతిక కార్యక్రమం “అగ్రియూనిఫెస్ట్” ను కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మార్చి 15న ప్రారంభించారు. ఈ వేడుకకు దేశంలోని 60 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/డీమ్డ్ యూనివర్సిటీలు/సెంట్రల్ యూనివర్శిటీల నుండి 2500 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు.

సంగీతం, నృత్యం, సాహిత్యం, థియేటర్, లలిత కళలు వంటి 18 ఈవెంట్‌లలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ భారతీయ సంస్కృతులను అనుసంధానం చేయడం ద్వారా భారతీయ వ్యవసాయాన్ని ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో 1999-2000లో ఈ అఖిల భారత అంతర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ యువజనోత్సవాన్ని ప్రారంభించారు. తద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయాలలోని యువత ప్రతిభకు ప్రోత్సహం అందిస్తున్నారు.


టీసీఎస్ సీఈవో మరియు ఎండీగా కే కృతివాసన్

ప్రముఖ భారత సాఫ్ట్‌వేర్ & ఐటీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఇఒ రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన ఈ హోదా నుండి వైదొలిగారు. రాజేష్ గోపీనాథన్ స్థానంలో తదుపరి టీసీఎస్ సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా కె కృతివాసన్‌ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్‌గా జి కృష్ణకుమార్

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా జి కృష్ణకుమార్ నియమితులయ్యారు. గత అక్టోబరు 2022లో బిపిసిఎల్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన అరుణ్ కుమార్ సింగ్ స్థానంలో ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ హోదాలో ఆయన 2025 వరకు సేవలు అందించనున్నారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రభుత్వ మహారత్న కేటగిరిలో ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ముంబై, కొచ్చి, నుమాలిగర్ మరియు బినాలోని రిఫైనరీల ద్వారా 40 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చమురు శుద్ధి చేసే సామర్థ్యంతో భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఇంధన రిటైలర్ వాటా కలిగి ఉంది. అయితే భారత ప్రభుత్వం ప్రస్తుతం 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణతో దీనిని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పూర్తివ్వాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్ సంక్షోభం వలన వాయిదా పడింది.


పీఎం మిత్ర పథకం కింద ఏడు రాష్టాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కులు

భారత ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ మరియు అపెరల్ (PM MITRA) పథకం కింద ఏడు రాష్ట్రాలలో మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడు టెక్స్‌టైల్ పార్కులను తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో అభివృద్ధి చేయనున్నారు. వీటి కోసం 13 రాష్ట్రాల నుండి వచ్చిన 18 ప్రతిపాదనలు రాగా, వాటిలో పై 7 సైట్లు ఎంపిక చేయబడ్డాయి.

టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి పీఎం మిత్ర పథకాన్ని ప్రారంభించిది. ఈ రంగంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులు పెంచడం ద్వారా, నూతన టెక్స్‌టైల్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ వస్త్ర తయారీ మరియు ఎగుమతుల కేంద్రంగా మార్చడమనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో నిరుద్యోగులకు ఉపాధికల్పన కూడా ప్రధానమైనది.


అత్యంత దారుణమైన టెర్రర్ పీడిత దేశాల జాబితాలో భారత్

భారతదేశం 25 అత్యంత దారుణమైన టెర్రర్ పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023 ప్రకారం 25 అత్యంత దారుణమైన టెర్రర్ పీడిత దేశాలలో ఇండియా 13వ స్థానంలో ఉంది. గడిసిన ఏడాదిలో పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద దాడులు 9 శాతం తగ్గి 6,701 మరణాలు నమోదయినట్లు నివేదించింది. అఫ్ఘనిస్తాన్ వరుసగా నాల్గవ సంవత్సరం కూడా తీవ్రవాదంతో ప్రభావితమైన దేశంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

2022లో తీవ్రవాదం ద్వారా ఎక్కువగా ప్రభావితమైన పది దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్‌లో తీవ్రవాద సంబంధిత మరణాలు గణనీయంగా పెరిగినట్లు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 120 శాతం పెరుగుదలతో 643 మరణాలు నమోదు కబడినట్లు నివేదించింది.


వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ న్యాయమూర్తులు అరెస్ట్ వారెంట్ జారీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) కి చెందిన న్యాయమూర్తులు, మార్చి 17న అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఉక్రెయిన్ యందు యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అభియోగం మోపారు. గతంలో రష్యాకు తీసుకెళ్లిన ఉక్రేనియన్ పిల్లలను బలవంతంగా కిడ్నప్ లేదా జాతీయతను మార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రష్యా బాలల హక్కుల కమీషనర్ మరియా ల్వోవా-బెలోవాను కూడా ఇదే నేరాలకు సంబంధించి ఐసీసీ వారెంట్ అందించింది.

ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒక అంతర్జాతీయ ఇంటర్‌ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. ఇది అంతర్జాతీయంగా చోటు చేసుకునే మారణహోమం మరియు యుద్ధ నేరాల వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై దర్యాప్తు మరియు విచారణను కోరుతుంది. అయితే ఐసీసీ సొంత సైన్యం లేదా దర్యాప్తు వ్యవస్థను కలిగి లేదు. ఇది సభ్యదేశాల వ్యవస్థను ఉపయోగించుకుంటుంది.

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ప్రస్తుతం 123 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వీటిలో చైనా, ఇండియా, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్‌తో సహా డజన్ల కొద్దీ దేశాలు కనీసం ఈ సంస్థలో చేరలేదు లేదా అంతర్జాతీయ రోమ్ శాసన ఒప్పందంపై సంతకం చేయలేదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క రోమ్ శాసనం అనేది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును స్థాపించిన ఒప్పందం. ఇది 17 జూలై 1998న ఇటలీలోని రోమ్‌లో జరిగిన దౌత్య సదస్సులో ఆమోదించబడింది. 1 జూలై 2002న అమల్లోకి వచ్చింది.

రోమ్ శాసనం ప్రకారం, అంతర్జాతీయ నేరాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సభ్య దేశాలు పూర్తిగా, అధికారికంగా సహకరించవల్సి ఉంటుంది. ఒక దేశం యథార్థంగా దర్యాప్తును నిర్వహించలేక లేదా నేరస్థులను విచారించడానికి ఇష్టపడని చోట మాత్రమే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జోక్యం చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇది వరకు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కోట్ డి ఐవరీ, డార్ఫర్, సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, లిబియా, ఉగాండా, బంగ్లాదేశ్/మయన్మార్, పాలస్తీనా మరియు వెనిజులాలో జరిగిన యుద్ధ నేరాల పైనా దర్యాప్తు జరిపిన అనుభవం కలిగి ఉంది.


వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో భారతదేశంకు 126వ స్థానం

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం టాప్ 5 సంతోషకరమైన దేశాల జాబితాలో ఐదు యూరప్ దేశాలైన 1. ఫిన్‌లాండ్, 2. డెన్మార్క్, 3. స్విట్జర్లాండ్, 4. ఐస్‌లాండ్, 5. నెదర్లాండ్స్ ఉన్నాయి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రచురించే వార్షిక నివేదిక.

ఐక్యరాజ్యసమితి విడుదల చేసే ఈ వార్షిక నివేదికలో మొత్తం 137 దేశాలను చేర్చింది. ఫిన్‌లాండ్ వరుసగా ఆరవ సంవత్సరం కూడా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో అత్యున్నత స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ పట్టణీకరణ, నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ఆహార భద్రత, నీటి భద్రత ఆందోళనలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, మహిళల భద్రత, పర్యావరణ కాలుష్యం, ప్రజల మానసిక ఆరోగ్యం వంటి విభిన్న అంశాలపై ముడిపడి ఉంటుంది.

భోపాల్‌లో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌, మార్చి 20న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రారంభమైంది. ఈ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 30 దేశాల నుంచి 200 మంది షూటర్లు పాల్గొంటున్నారు. భోపాల్‌లోని కుషాభౌ థాకరే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఐఎస్ఎస్ఎఫ్ అధ్యక్షుడు లూసియానో ​​రోసీ గౌరవ అతిథిగా హాజరు కాగా, మధ్యప్రదేశ్ క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ మంత్రి యశోధర రాజే సింధియా, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రణిందర్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌ 1897లో ప్రారంభించారు.


జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల భారత్ పర్యటన

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మార్చి 20-21 తేదీలలో భారతదేశంలో పర్యటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించేందుకు ఈ పర్యటనకు విచ్చేశారు. 2006 నుండి భారతదేశం మరియు జపాన్ మధ్య రెగ్యులర్ వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. గత ఏడాది ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటించారు. ప్రస్తుతం ఇండియా జీ20 అధ్యక్షతలో ఉండగా, జపాన్ జీ7 అధ్యక్షతను నిర్వహిస్తున్నది.

భారతదేశం మరియు జపాన్‌లు జి20 మరియు జి7 అధ్యక్ష పదవులను నిర్వహిస్తున్న ముఖ్యమైన సమయంలో ఇద్దరు ప్రధానుల మధ్య సమావేశం జరుగుతోంది. ఈ పర్యటన ఆహారం మరియు ఆరోగ్య భద్రత, శక్తి పరివర్తనలు మరియు ఆర్థిక భద్రతతో సహా కీలకమైన ప్రపంచ సమస్యలపై జీ20 మరియు జీ7 కలిసి ఎలా పని చేయడానికి, చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది.


ఇండియన్ వెల్స్ మాస్టర్స్ 2023 విజేతగా రోహన్ బోపన్న జోడి

రోహన్ బోపన్న మరియు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. బోపన్న, ఎబ్డెన్‌ల అన్‌సీడెడ్ జట్టు గ్రేట్ బ్రిటన్‌కు చెందిన టాప్-సీడ్ డచ్ ప్లేయర్‌లు వెస్లీ కూల్‌హాఫ్, నీల్ స్కుప్‌స్కీని 6-3, 2-6, 10-8తో ఓడించింది విజేతగా నిలిచింది.


అస్సాంలో 4వ ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

అస్సాంలోని బక్సా జిల్లాలో 4వ ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్, మార్చి 20 - 23 తేదీల మధ్య నిర్వహిస్తున్నారు. అస్సాం ఖో ఖో అసోసియేషన్ మరియు బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రభుత్వంతో కలిసి ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అస్సాం ప్రభుత్వం కూడా పోటీకి తన మద్దతును అందిస్తుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం తొమ్మిది దేశాలు-భారత్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, మలేషియా, నేపాల్, భూటాన్, ఇరాన్, శ్రీలంక మరియు ఇండోనేషియాలు పాల్గొంటున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి ఏషియన్ ఖో ఖో ఛాంపియన్‌షిప్ 1996లో కోల్‌కతాలో ప్రారంభించారు.


బాంబే జయశ్రీకి సంగీత కళానిధి పురస్కారం

ప్రఖ్యాత కర్ణాటక గాయని బొంబాయి జయశ్రీకి 2023 సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేయనున్నట్లు సంగీత అకాడమీ ప్రకటించింది. ఈ అవార్డును 1942లో అప్పటి అకాడమీ అధ్యక్షుడు కె.వి.కృష్ణస్వామి అయ్యర్ ప్రారంభించారు. ఇది కర్ణాటక సంగీత రంగంలో అత్యున్నత పురస్కారంగా పరిగణించబడుతుంది. దీనితో పాటుగా ఇతర అవార్డులను కూడా మ్యూజిక్ అకాడమీ ప్రకటించింది.

సంగీత కళా ఆచార్య అవార్డు కేరళకు చెందిన కర్ణాటక గాయకురాలు పల్కులంగర అంబికా దేవి మరియు మృదంగం వాద్యకారుడు కేఎస్ కాళిదాస్‌కు అందించారు. టీటీకే అవార్డుకు ప్రముఖ తవిల్ ప్లేయర్ తిరునాగేశ్వరం ఎంపికయ్యారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపద సంగీతం, శాస్త్రీయ తమిళ సాహిత్యంలో పరిశోధనలు చేస్తున్న అరిమలం ఎస్.పద్మనాభన్‌కు సంగీత విద్వాంసుడు అవార్డును ప్రదానం చేయనున్నారు.


ఖేలో ఇండియా దస్ కా దమ్ టోర్నమెంట్ ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023ని పురస్కరించుకుని ఖేలో ఇండియా దస్ కా దమ్ టోర్నమెంట్ పేరుతొ ప్రత్యేక క్రీడా ఈవెంటును మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈవెంట్‌ను మార్చి 10 నుండి 31 వరకు దేశంలోని 10 నగరాల్లో 10 రకాల క్రీడా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. వీటిలో దాదాపు 15000 మంది మహిళా అథ్లెట్లు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంను మార్చి 10న దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇలాంటి క్రీడా చొరవ దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. జాతీయ/రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనలేని మహిళా క్రీడాకారిణులకు వేదికను అందించడం కోసం ఈ కార్యక్రమం రూపొందించారు.


లక్నోలో 8వ ఎడిషన్ ఇండియన్ ఫార్మా ఫెయిర్

8వ ఎడిషన్ ఇండియన్ ఫార్మా ఫెయిర్ 2023 కు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మార్చి 17, 18వ తేదీల్లో ఆతిధ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమం ఫార్మాస్యూటికల్, డ్రగ్ మరియు ఫార్ములేషన్ పరిశ్రమలలో అత్యంత తాజా ట్రెండ్‌లు మరియు సాంకేతికతను పరిచయం చేసేందుకు, ప్రదర్శించేందుకు నిర్వహించారు.


ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్-సెంట్రల్ ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్

ఆఫ్ఘనిస్తాన్‌పై భారతదేశం-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG) మొదటి సమావేశం 7 మార్చి 2023 న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి భారతదేశం, కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్థాన్‌ల ప్రత్యేక రాయబారులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయ, భద్రత, మానవతా పరిస్థితులతో సహా ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిగాయి. సార్వభౌమాధికారం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత మరియు దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని నొక్కి చెబుతూనే, పాల్గొన్న వారందరూ శాంతియుత, సురక్షితమైన మరియు స్థిరమైన ఆఫ్ఘనిస్తాన్ కోసం తమ మద్దతును పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల సహాయాన్ని ప్రకటించింది. ఈ సరుకులను ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా పంపనుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న మానవతా సంక్షోభంను కొంతలో కొంత తగ్గించేందుకు ఈ సహాయం చేస్తుంది. ఇదివరకే 8,000 మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ పంపించింది.


ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 4 రోజుల భారత పర్యటన

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 4 రోజుల భారత పర్యటన మార్చి 8న ఇండియా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మార్చి 9న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు అల్బనీస్ హాజరయ్యారు.

మార్చి 10న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. అలానే రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ఆంథోనీ అల్బనీస్ భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్య మంచి విదేశీ దౌత్య సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి.


నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్

నేపాల్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామ్ చంద్ర పాడెల్ మార్చి 9న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు చోటు చేసుకున్నాయి. 2008లో రిపబ్లిక్‌ ఆఫ్ నేపాల్‌గా అవతరించిన తర్వాత ఇవి మూడో అధ్యక్ష ఎన్నికలు.

నేపాల్‌లో ప్రస్తుతం ప్రధాని పుష్ప కమల్ దహల్ నేతృత్వంలోని తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వం వివిధ రాజకీయ అస్థిరతల మధ్య పరిపాలన అందిస్తుంది. ప్రస్తుత ప్రధానమంత్రి 25 డిసెంబర్ 2022న అప్పటి ప్రెసిడెంట్ బిధ్యా దేవి భండారీచే నియమించబడ్డారు.


ఈఎంఈ యూనిట్‌కి మొదటి మహిళా కమాండ్‌గా కల్నల్ గీతా రాణా

కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్‌కి చెందిన కల్నల్ గీతా రాణా, తూర్పు లడఖ్‌లోని ఫార్వర్డ్ మరియు రిమోట్ లొకేషన్‌లో స్వతంత్ర ఫీల్డ్ వర్క్‌షాప్‌కు మొదటి మహిళా కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ బోర్డులను క్లియర్ చేసే మహిళా అధికారులకు కమాండ్ రోల్స్ ఇవ్వబడతాయి. వీరు భవిష్యత్తులో ఉన్నత ర్యాంక్‌ పదోన్నతులు పొందేందుకు కూడా పరిగణించబడతారు.

ఇటీవల భారత వైమానిక దళం కూడా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామీకి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్ కమాండ్‌ని అప్పగించింది. పశ్చిమ సెక్టార్‌లోని ఈ ప్రాంతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం ఉంది. భారత వైమానిక దళంలో ఒక మహిళా అధికారి పోరాట విభాగానికి బాధ్యతలు చేపట్టడం కూడా ఇదే తొలిసారి.


తెలంగాణలో కొత్తగా 'ఆరోగ్య మహిళ' పథకం ప్రారంభం

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిటి హరీష్ రావు, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం 'ఆరోగ్య మహిళ' పేరుతో కొత్త ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ఈ కార్యక్రమం కింద ప్రతి మంగళవారం 100 ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారు. అలానే ఉగాది పండుగ తర్వాత మహిళల కోసం న్యూట్రిషన్‌ కిట్‌ పేరుతొ మరో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వైద్యానికి నోచుకోని నిరుపేద మహిళకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది చేకూర్చనున్నారు.ఇందులో మహిళలకు ఎనిమిది రకాల వైద్య సేవలు అందించబడతాయి. ప్రతి మంగళవారం, గుర్తించబడిన క్లినిక్‌లలో ప్రత్యేకంగా మహిళల వైద్యులతో సహా, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉంచుతారు.

ఈ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ట్రీట్‌మెంట్ కూడా అందించి మందులు అందిస్తారు. అవసరమైతే, ఆపరేషన్లు మరియు ఇతరత్రా సహా తదుపరి చికిత్స కోసం మహిళలను జిల్లా ప్రధాన ఆసుపత్రికి రెఫర్ చేస్తారు.


అత్యధిక మహిళా బిలియనీర్లలో ఇండియాకు ఐదవ స్థానం

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మహిళా బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారతదేశం ఐదవ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా విడుదల చేసిన సిటీ ఇండెక్స్ 2023 నివేదికలో 92 మహిళా బిలియనీర్లతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో నిలవగా, 46 మహిళా బిలియనీర్లతో చైనా రెండువ స్థానం దక్కించుకుంది. తర్వాత 3 స్థానాల్లో జర్మనీ (32), ఇటలీ (16), ఆస్ట్రేలియా (9), ఇండియా (9), మలేషియా (9)లు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనిక స్వయం-నిర్మిత మహిళగా హాంకాంగ్ టెక్ మొగల్ జౌ కున్‌ఫీ, $6.6 బిలియన్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియాకు చెందిన కాన్వా సహ వ్యవస్థాపకురాలు మెలానీ పెర్కిన్స్ $3.62 బిలియన్లతో రెండవ స్థానంలో ఉన్నారు. భారతీయ వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ మరియు ఆమె కుటుంబం $16.96 బిలియన్ల సంపదతో భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది.

అయితే ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళగా, లోరియల్ వైస్ ఛైర్మన్‌ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ $81.49 బిలియన్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. వాల్‌మార్ట్ వారసురాలు అలిస్ వాల్టన్ ($60.16 బిలియన్), న్యూయార్క్‌కు చెందిన సోషలైట్ జూలియా కోచ్ ($59.65 బిలియన్) లు తర్వాత రెండు స్థానాల్లో దాదాపుగా సమంగా ఉన్నారు.


హిందుస్థాన్ యూనిలీవర్ కొత్త ఎండీ & సీఈఓగా రోహిత్ జావా

హిందుస్థాన్ యూనిలీవర్ కొత్త ఎండీ & సీఈఓగా రోహిత్ జావాను నియమించింది. ప్రస్తుతం యూనిలీవర్ ట్రాన్స్‌ఫర్మేషన్ చీఫ్‌గా ఉన్న జావా జూన్ 27 నుండి ఎండీ మరియు సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్న సంజీవ్ మెహతా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) ముంబైలో ప్రధాన కార్యాలయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారతీయ వినియోగదారు వస్తువుల సంస్థ. ఇది బ్రిటిష్ కంపెనీ యూనిలీవర్‌కు అనుబంధ సంస్థ. దాని ఉత్పత్తులలో ఆహారాలు, పానీయాలు, శుభ్రపరిచే ఏజెంట్లు, వ్యక్తిగత సంరక్షణ వంటి ఉత్పత్తులు ఇండియాలో మార్కెట్ చేస్తుంది.


ఉత్తరాఖండ్‌లో దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్

దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్ సుమారు 900 కి.మీ పొడవున ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మించబడుతోంది. ఈ మార్గంలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రతి 30 కి.మీకి ఒక ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అలానే ఈ మార్గం పరిధిలోని అన్ని అతిథి గృహాలలో కూడా ఛార్జింగ్ పాయింట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడుకను ప్రోత్సహాయించడం ద్వారా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


2023 ఆస్కార్ అవార్డుల విజేతలు

95 వ అకాడమీ అవార్డుల విజేతలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉత్తమ చిత్రాలకు. నటులకు, సినిమా నిపుణులకు అకాడమీ అవార్డులను అందించింది. ఈ వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 12, 2023న హాట్టహాసంగా నిర్వహించబడింది. ఈ అవార్డు వేడుకకు జిమ్మీ కిమ్మెల్ హోస్టుగా వ్యవహరించారు.

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల విజేతలలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' ఉత్తమ చిత్రంతో సహా అత్యధికంగా ఏడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 11 విభాగాలలో నామినేషన్ పొందగా 7 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రం రెండు అవార్డులను, ది వేల్, టాప్ గన్: మావెరిక్, బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, విమెన్ టాకింగ్, పినోచియో మరియు నావల్నీ వంటి చిత్రాలు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి.

ఈ ఏడాది ఇండియా నుండి ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ మరియు తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ వివిధ విభాగాల్లో ఆస్కార్ తుది నామినేషన్ దక్కించుకోగా, వీటిలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యూమెంటరీగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. అలానే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు గీతం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.


ఆస్కార్ అవార్డు అందుకున్న వివిధ భారతీయ చిత్రాలు

ఇప్పటి వరకు పదుల సంఖ్యలో భారతీయ చిత్రాలు ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ కాగా కేవలం 5 చిత్రాలు మాత్రమే వివిధ విభాగాల్లో అకాడమీ అవార్డును సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో 1958 లో విడుదలైన మదర్ ఇండియా చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారతదేశం నుండి మొదటి ఆస్కార్ నామినేషన్ పొందిన చిత్రంగా నిలిచింది.

అయితే ఇండియా నుండి మొట్టమొదటి ఆస్కార్ అవార్డును భాను అతయ్య 1983 లో గాంధీ చిత్రానికి గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అందుకున్నారు. అలానే 2009 లో విడుదలైన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం అత్యధికంగా 3 ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రంగా నిలిచింది.

భారతీయ సినిమా / వ్యక్తులు గెల్చుకున్న ఏడాది అవార్డు కేటగిరి
భాను అతయ్య (గాంధీ) 1983 ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
రెసుల్ పూకుట్టి (స్లమ్‌డాగ్ మిలియనీర్) 2009 ఉత్తమ సౌండ్ మిక్సింగ్
గుల్జార్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) 2009 ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (జై హో)
ఆర్ రెహమాన్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) 2009 బెస్ట్ ఒరిజినల్ స్కోర్
గునీత్ మోంగా (పిరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటన్స్) 2019 ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)
కార్తికి గోన్సాల్వేస్ & గునీత్ మోంగా (ది ఎలిఫెంట్ విస్పరర్స్) 2023 ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్)
కీరవాణి & చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్) 2023 ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు)

నేపాల్‌ అధ్యక్షుడిగా రామ్‌చంద్ర ప్రమాణం

→సీనియర్‌ నేపాలీ కాంగ్రెస్‌ నాయకుడు రామ్‌చంద్ర పౌడెల్‌ ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
→శీతల్‌ నివాస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హరికృష్ణ కార్కి రామ్‌చంద్ర పౌడెల్‌ చేత ప్రమాణం చేయించారు.

చైనా రక్షణ మంత్రిగా లీ షెంగ్‌ఫూ నియామకం

→దేశ కొత్త రక్షణ మంత్రిగా లీ షెంగ్‌ఫూను చైనా నియమించింది. సైన్యంలో జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న లీ పై 2018లో అమెరికా ఆంక్షలు విధించింది.
→రష్యా నుంచి సుఖోయ్‌ ఎస్‌యూ-35, ఎస్‌-400లు దిగుమతి చేసుకున్నందుకు ఈ చర్యలు తీసుకుంది. ఏరోస్పేస్‌ ఇంజినీరైన లీ, రష్యా అనుకూలుడన్న పేరు ఉంది.
→ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు సాయంగా చైనా ఆయుధాలను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని నాటో కూటమి హెచ్చరిస్తున్న నేపథ్యంలో షెంగ్‌ఫూ నియామకం జరగడం గమనార్హం.

చైనా కొత్త ప్రధాని లీ చియాంగ్‌

→చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్‌ (63) ఆ దేశ నూతన ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.
→గత పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్‌ (67) స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
→అంతకుముందు చియాంగ్‌ పేరును అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రతిపాదించగా చైనా పార్లమెంటు, నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపింది.
→మొత్తం పార్లమెంటు సభ్యులు 2,952 మంది కాగా సమావేశానికి 2,947 మంది హాజరయ్యారు.
→వీరిలో 8 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ముగ్గురు సభ్యులు చియాంగ్‌కు వ్యతిరేకంగా, మిగిలిన 2,936 మంది అనుకూలంగా ఓటు వేశారు.
→ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత చియాంగ్‌ను ప్రధాన మంత్రిగా నియమిస్తున్నట్లు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
→తదనంతరం నూతన ప్రధాని దేశ రాజ్యాంగంపై ప్రమాణం చేశారు.

అమెరికా ‘సలహా కమిటీ’లో సభ్యులుగా ఇద్దరు భారతీయ అమెరికన్లు

→అమెరికా వాణిజ్య విధానం - సంప్రదింపుల సలహా కమిటీలో ఇద్దరు భారతీయ అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు.
→ ఈ సలహా కమిటీలో సభ్యులుగా భారతీయ అమెరికన్లు రేవతి అద్వైతి - ఫ్లెక్స్‌ సీఈవో, మనీష్‌ బాప్నా - నేచురల్‌ రిసోర్సెస్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సీఈవో సహా 14 మంది పేర్లను ఆయన ప్రకటించారు.
→ అమెరికా వ్యాపార ప్రతినిధికి ఈ కమిటీ విధాన సలహాదారుగా సేవలందిస్తుంది. వ్యాపార ఒప్పందాలకు ముందు చర్చలు, సంప్రదింపులు నిర్వహిస్తుంది.

మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్‌

→ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ (69) సరికొత్త చరిత్ర లిఖించారు. మూడోసారి ఆ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.
→మరో ఐదేళ్ల పాటు ఆయనకు అత్యున్నత అధికార బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంటు, నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
→ గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) మహాసభ జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
→దీంతో సీపీసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మావో తర్వాత రెండు దఫాలకు మించి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు.
→సాధారణంగా సీపీసీ నిర్ణయాలనే యథాతథంగా అమలు చేస్తూ ‘రబ్బర్‌ స్టాంప్‌ పార్లమెంటుగా పేరొందిన ఎన్‌పీసీ జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
→మొత్తం 2,952 మంది సభ్యులు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. ఈ ఎన్నిక తర్వాత జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.
→జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు హన్‌ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
→ఇరవై లక్షల మందికి పైగా సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు పొందిన చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి అధిష్ఠానంగా భావించే కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ పార్లమెంటు తీర్మానించింది.
→దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్‌ చేతుల్లోకే వెళ్లాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా చైనాలోని మూడు అధికార కేంద్రాలకు ఆయన అధినాయకుడిగా కొనసాగనున్నారు.

నేపాల్‌ అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌

→నేపాల్‌ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్‌చంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. ప్రధాని పుష్పకమాల్‌ దహాల్‌ ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి ఆయనకు మద్దతుగా నిలిచింది.
→ 550 మంది అసెంబ్లీ సభ్యుల్లో 518 మంది, 332 మంది ఎంపీల్లో 313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.
→ ఎమ్మెల్యేల్లో 352 మంది, ఎంపీల్లో 214 మంది పౌడెల్‌కు ఓటు వేశారు.
→ మాజీ ప్రధాని కె.పి.శర్మ నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌ ఓడిపోయారు.
→ ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనుంది. 2008లో గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత నేపాల్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి.
→ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన పౌడెల్, 16 ఏళ్ల వయసులో విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు.

గ్రీన్‌హౌస్‌ వాయువులను అదుపుతెచ్చేందుకు డెన్మార్క్‌లో సరికొత్త ప్రాజెక్టు

→భూతాపానికి కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులను అదుపులోకి తీసుకొచ్చేందుకు డెన్మార్క్‌ ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
→వాతావరణంలోకి అధిక మొత్తంలో చేరే కార్బన్‌ డైఆక్సైడ్‌ను సమీకరించి దానిని సముద్ర భూతలం అడుగున పాతిపెట్టే క్రతువును ప్రారంభించింది.
→తద్వారా పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం సాకారానికి తన వంతు తోడ్పాటునివ్వాలని నిర్ణయించింది.
→‘ప్రాజెక్టు గ్రీన్‌శాండ్‌’గా దీనికి నామకరణం చేసింది. రసాయనాలు, చమురు-సహజవాయువును ఉత్పత్తి చేసే దిగ్గజ కంపెనీలు అంతర్జాతీయ కన్సార్షియంగా ఏర్పడి ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర వహిస్తున్నాయి.
→డెన్మార్క్‌లోని ‘నార్త్‌ సీ’ భూతలం దిగువున, నిరుపయోగంగా మారిన చమురు క్షేత్రం ‘వెస్ట్‌ ఆయిల్‌ ఫీల్డ్‌’లో కార్బన్‌డైఆక్సైడ్‌ను పాతిపెట్టేందుకు ఆ దేశ యువరాజు ఫ్రెడెరిక్‌ అనుమతించారు.
→ కర్బన ఉద్గారాలను భూస్థాపితం చేయడం ద్వారా డెన్మార్క్‌తో పాటు ఐరోపా దేశాలు లబ్ధిపొందుతాయన్న ఆశాభావాన్ని ఫ్రెడెరిక్‌ వ్యక్తం చేశారు.
→ద్రవ రూపంలోకి మార్చిన కార్బన్‌డైఆక్సైడ్‌ను నిరుపయోగంగా మారిన చమురు క్షేత్రాలకు చేరుస్తారు.
→తొలుత బెల్జియంలోని ఓ రసాయన కంపెనీ నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను తీసుకువస్తారు. ఆ తర్వాత డెన్మార్క్, ఇతర ఐరోపా దేశాల నుంచి సేకరిస్తారు.
→తొలి ప్రాజెక్టులో భాగంగా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్‌హౌస్‌ వాయువును సముద్ర భూతలం నుంచి 1.8 కిలోమీటర్ల లోతులో ఇసుక, రాళ్లతో నింపిన రిజర్వాయర్‌లో పాతిపెడతారు.
→2030 నాటికి ఇలా పూడ్చిపెట్టే కర్బన ఉద్గారాలను ఏడాదికి 80 లక్షల టన్నుల స్థాయికి తీసుకెళతారు.
→వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ కూడా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి వాటిని సేకరించి పూడ్చిపెట్టే సాంకేతిక పరిజ్ఞానాలనూ పరిష్కార మార్గాల్లో భాగం చేయాలని సూచించింది.
→ఐరోపా సమాజంలోని 27 దేశాల నుంచే ఏడాదికి 30 కోట్ల టన్నుల మేర కార్బన్‌డైఆక్సైడ్‌ను సేకరించి భూమిలో పాతిపెట్టాల్సిన అవసరం ఉందని ఐరోపా కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌డెర్‌ తెలిపారు.
→2050 వరకు అలా చేయగలిగితే వాతావరణంపై గ్రీన్‌హౌస్‌ వాయువుల దుష్ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలమని అభిప్రాయపడ్డారు.

‘ఫోర్స్‌’ ఉపాధ్యక్షుడిగా వినయేంద్ర పర్వతనేని

→ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వతంత్ర ఫ్రైట్‌ ఫార్వాడర్స్‌ సంఘమైన ఫోర్స్‌ (ఫ్రైట్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రిలేటెడ్‌ కార్గో ఎక్స్‌పర్ట్స్‌) ఉపాధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన వినయేంద్ర పర్వతనేని (35) ఎన్నికయ్యారు.
→సీవేస్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ (సీవేస్‌ గ్రూపు) అనుబంధ కంపెనీల్లో వినయేంద్ర పర్వతనేని డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
→ఫోర్స్‌కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు ఈయనే. ఫోర్స్‌కు ఒక్కో దేశం నుంచి ఒక కంపెనీ మాత్రమే ప్రతినిధిగా ఉంటుంది.
→ఐరోపా, అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన ఆరుగురు ఫ్రైట్‌ ఫార్వాడర్స్‌తో 1982లో ‘ఫోర్స్‌’ ఏర్పాటైంది.
→ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి భారత్‌ నుంచి రెండు దశాబ్దాలుగా సీవేస్‌ గ్రూపు ప్రాతినిధ్యం వహిస్తోంది.
→సీవేస్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన కెప్టెన్‌ పీవీకే మోహన్, ఇంతకు ముందు ఫోర్స్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.
→వినయేంద్ర పర్వతనేని, యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి బీబీఏ చేశారు.
→ఆ తర్వాత యూఎస్‌లోని థండర్‌బర్డ్‌ యూనివర్సిటీ-ఫోనిక్స్‌ (అరిజోనా) నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.
→ఫోర్స్‌ నూతన కార్యవర్గాన్ని మార్చి 6న దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.

అమెరికాలో జిల్లా జడ్జిగా తొలి భారతీయ - అమెరికన్‌ మహిళ

→అమెరికాలోని మసాచుసెట్స్‌లో తొలి భారతీయ - అమెరికన్‌ మహిళా జడ్జిగా తెజల్‌ మెహతా నియమితులయ్యారు.
→అయెర్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. గత కొంతకాలం ఇదే న్యాయస్థానంలో సహ న్యాయమూర్తిగా ఆమె విధులు నిర్వర్తించారు.

తొలిసారిగా ప్రపంచ సముద్ర జీవజాల పరిరక్షణ!

→చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సముద్రాల్లో నివసించే జీవజాలాల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏకగ్రీవ ఒప్పందానికి వచ్చాయి.
→ఏ దేశానికీ చెందని ఈ సముద్ర జలాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని రక్షించడమంటే సగం భూగోళాన్ని కాపాడటమే అని ఈ మేరకు జరిగిన సమావేశం అభిప్రాయపడింది.
→ఈ ఒప్పందాన్ని తీసుకురావడానికి 20 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనప్పటికీ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.
→ఆఖరుకు గత రెండు వారాల నుంచి న్యూయార్క్‌లో జరుగుతున్న సమావేశాల్లో ఒప్పందానికి సభ్యులందరూ ఆమోదముద్ర వేశారు.
→ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రత్యేక సముద్ర జీవవైవిధ్య ప్రాంతాలు ఏర్పాటవుతాయి. వీటిని సమన్వయం చేయడానికి నూతన అంతర్జాతీయ ప్రాధికార సంస్థ ఉనికిలోకి వస్తుంది.
→మహా సముద్రాల్లో నిర్వహించే వాణిజ్య కార్యకలాపాలు పర్యావరణపరంగా చూపించే ప్రభావానికి సంబంధించి కూడా ఈ ఒప్పందం నియమ నిబంధనలను రూపొందిస్తుంది.
→సముద్రం అపరిమితమైన వనరు కాదని గుర్తించడం, సముద్ర జలాలను సుస్థిరంగా ఉపయోగించుకోడానికి ప్రపంచ దేశాల సహకారం అవసరమని చాటడం కొత్త ఒప్పంద ఉద్దేశమని న్యూజెర్సీ విశ్వవిద్యాలయ జీవ శాస్త్రవేత్త మాలిన్‌ పిన్‌స్కీ తెలిపారు.

చైనా రక్షణ బడ్జెట్‌ 225 బిలియన్‌ డాలర్లు

→చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా 7.2 శాతం పెంచింది. ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు కాగా డాలర్లలో 225 బిలియన్లు.
→చైనా రక్షణ బడ్జెట్‌ను పెంచడం వరుసగా ఇది 8వసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్‌ పెంపు రేటు అధికంగా ఉండటం గమనార్హం.
→గతేడాది 7.1 శాతం పెంపుతో 1.45 ట్రిలియన్ల (230 బిలియన్‌ డాలర్ల) బడ్జెట్‌ను ఆమోదించింది.
→యువాన్‌తో పోలిస్తే డాలర్‌ విలువ ఈ ఏడాది పెరిగిన నేపథ్యంలో 225 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు చైనా అధికార పత్రిక విశ్లేషించింది.
→ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 2023 సంవత్సరానికి 816 బిలియన్‌ డాలర్లు. ఆ తరువాత అత్యధిక బడ్జెట్‌ చైనాదే కావడం గమనార్హం.
→భారత రక్షణ బడ్జెట్‌ (రూ.5.94 లక్షల కోట్లు/72.6 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే అది మూడు రెట్లు అధికం.
→ దేశ రబ్బర్‌ స్టాంపు పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి పదవి నుంచి దిగిపోతున్న ప్రధాని లి కెకియాంగ్‌ తన స్వీయ నివేదిక సమర్పించారు.
→ అందులో సరిహద్దుల్లో (తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభనను నేరుగా పేర్కొనకుండా) సైనిక బలగాలు చూపిన ధైర్యసాహసాలను గొప్పగా వివరించారు.

రోదసిలోకి నలుగురు వ్యోమగాములు

→నలుగురు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.
→వీరిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన సల్తాన్‌ అల్‌ నెయాదీ కూడా ఉన్నారు. అమెరికాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
→ఈ నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు నిర్వర్తించనున్నారు.
→గత అక్టోబరు నుంచి అక్కడ పనిచేస్తున్న అమెరికా, రష్యా, జపాన్‌ వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు.
→ఎమిరేట్స్‌ తరఫున రోదసిలోకి వెళ్లిన రెండో వ్యోమగామిగా నెయాదీ గుర్తింపు పొందారు.
→ సౌదీ యువరాజు సుల్తాన్‌ బిన్‌ సల్మాన్‌ 1985లో డిస్కవరీ షటిల్‌లో ప్రయాణించి అంతరిక్ష యాత్ర చేసిన తొలి అరబ్‌గా ఖ్యాతిని ఆర్జించారు.
→ అయితే ఎక్కువ కాలం అంతరిక్షంలో బసచేసిన తొలి అరబ్‌వాసిగా నెయాదీ చరిత్ర సృష్టించనున్నారు. ఆరు నెలల పాటు ఆయన ఐఎస్‌ఎస్‌లో ఉంటారు.
→ ఈ యాత్రలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన స్టీఫెన్‌ బోవెన్, వారెన్‌ హోబర్గ్, రష్యాకు చెందిన ఆండ్రెయ్‌ ఫెడయేవ్‌ పాలుపంచుకున్నారు.
→ ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఐఎస్‌ఎస్‌ విషయంలో అమెరికా, రష్యా కలిసే పని చేస్తున్నాయి.

ప్రపంచ భవిష్య నగరాల్లో అమరావతి

→ప్రపంచంలోనే అత్యద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చోటు దక్కింది.
→రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతోందనే దానికి అమరావతి, వివిధ దేశాల్లోని మరో 5 నగరాలు అద్దం పట్టనున్నాయని ప్రపంచ ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్‌ ‘ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌’ పేర్కొంది.
→‘6 మోస్ట్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ బీయింగ్‌ బిల్ట్‌ అరౌండ్‌ ది వరల్డ్‌’ శీర్షికతో ఆ మ్యాగజైన్‌ నగరాల నమూనాలతో సహా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
→ఆ జాబితాలో అమరావతిని చేర్చింది.
→ ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ అనేది ప్రపంచ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ప్రఖ్యాత పత్రిక.
→అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా దీన్ని 1920లో ప్రారంభించారు. గత 103 ఏళ్లుగా ఇది వివిధ రూపాల్లో నడుస్తోంది.
→ఇటలీ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, స్పెయిన్, మెక్సికో, లాటిన్‌ అమెరికా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ ఈ పత్రిక ఎడిషన్లు, వెబ్‌సైట్లు నడుస్తున్నాయి.
→అలాంటి ప్రఖ్యాత మ్యాగజైన్‌ అమరావతిని ప్రపంచ భవిష్య నగరంగా కొనియాడింది. ఆ ఆరు నగరాల ప్రత్యేకతలివే..

స్మార్ట్‌ ఫారెస్ట్‌ సిటీ, మెక్సికో

→భవనాలు, హరిత ప్రాంతాల సమతుల్యతతో ఒక బొటానికల్‌ గార్డెన్‌లా ఈ నగరాన్ని నిర్మించ తలపెట్టారు.
→మెక్సికోలోని క్యాన్‌కున్‌ నగరానికి సమీపంలో ఈ నగర నిర్మాణానికి ప్రతిపాదించారు.
→ఇటాలియన్‌ ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోరి ఈ నగర నిర్మాణ ప్రణాళికలను 2019లో ఆవిష్కరించారు.
→నగరంలో వివిధ వృక్షజాతులకు చెందిన 75 లక్షల మొక్కలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
→పబ్లిక్‌ పార్కులు, ప్రైవేటు ఉద్యనవనాలు, పచ్చని పైకప్పులు, పచ్చని ముఖద్వారాలతో నగరాన్ని నిర్మించ తలపెట్టారు. మొత్తం 557 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించాలనేది ప్రణాళిక.

చెంగ్డు స్కై వ్యాలీ, చైనా

→సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ భవిష్య నగరంగా దీన్ని నిర్మించనున్నారు. ఈ లోయలో ఉన్న వివిధ సంప్రదాయ తెగల ఆవాసాలను పరిరక్షిస్తూనే ఈ నగరాన్ని నిర్మించ తలపెట్టారు.
→ఈ లోయ ప్రాముఖ్యం మరింత పెంచేలా ఈ కొండలపైనే భవనాల్ని నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలోని పొలాలను కాపాడుతూనే వాటి మధ్య నగరాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక.
→ప్రకృతితో కలిసి జీవించేందుకు అనుగుణంగా ఈ నగర నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామీణ వాతావరణంతో కూడిన నగరంగా, సంప్రదాయాలు, ఆధునికత కలగలిసిన నగరంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం దీని నిర్మాణం సాగట్లేదు.

టెలోసా, అమెరికా

→అంతర్జాతీయ ప్రమాణాలతో మానవ సామర్థ్యాలను విస్తరించేలా, భావితరాలకు ఒక బ్లూప్రింట్‌లా ఉండేలా అమెరికాలో ఓ కొత్త నగరాన్ని సృష్టించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించ తలపెట్టారు.
→మార్క్‌ లోర్‌ అనే కోటీశ్వరుడు ఈ నగర నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం, హరిత ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చి పరిరక్షించేలా ప్రణాళిక రూపొందించారు.
→ప్రతి పౌరుడికీ నగర భూభాగంలో వాటా ఉండేలా ‘సమానత్వం’ అనే ఆలోచన చుట్టూ ఈ నగరాన్ని నిర్మించనున్నారు. 2050 నాటికి 50 లక్షల జనాభా ఇక్కడ నివసించేలా చేయాలనేది లక్ష్యం.

ఓషియానిక్స్‌ బూసన్, దక్షిణ కొరియా

→సముద్రమట్టాల పెరుగుదల, వాతావరణ మార్పుల వంటి సమస్యలున్న తీరప్రాంత సమూహాలకు ఆదర్శంగా ఉండేలా ఈ నగర నిర్మాణాన్ని తలపెట్టారు.
→నిర్మాణం పూర్తికాబోయే మొట్టమొదటి ‘తేలియాడే నగరం’ ఇదే కానుంది. 2025 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేయాలనేది లక్ష్యం.
→బయోరాక్‌ అనే మెటీరియల్‌తో నగరాన్ని నీటిపై నిర్మించనున్నారు.

ద లైన్, సౌదీ అరేబియా

→కార్లు అవసరం లేని, కర్బన ఉద్గారాలు లేని నగరంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ప్రణాళిక. హైస్పీడ్‌ రవాణా వ్యవస్థ ఈ నగరానికి ప్రత్యేకం.
→2030 నాటికి నగర నిర్మాణాన్ని పూర్తిచేయాలని సౌదీ అరేబియా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం 100-200 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనుంది.
→100 మైళ్ల పొడవున ఈ నగరం ఉంటుంది. మొత్తంగా 4.60 లక్షల ఉద్యోగాల సృష్టి, దేశ జీడీపీకి 48 బిలియన్‌ డాలర్లు సమకూర్చటం దీని ప్రధాన లక్ష్యం.

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌

→ప్రపంచంలోని భవిష్య నగరాలు ఎలా ఉంటాయో చూపేందుకు ఒక మచ్చుతునకగా అమరావతిని నిర్మించేలా ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేశారు.
→ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నగరానికే తలమానికంగా నిలిచేలా ప్రణాళిక రూపొందించారు.
→దిల్లీలోని లూట్యెన్స్, న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్కు స్ఫూర్తితో నగరానికి వెన్నెముకలా సెంట్రల్‌ గ్రీన్‌స్పేస్‌ను తీర్చిద్దాలనేది ప్రతిపాదన.
→మొత్తం విస్తీర్ణంలో 60% మేర పచ్చదనం, నీళ్లు ఉండేలా హరిత, నీలి నగరంగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
→ప్రపంచంలోనే సుస్థిర నగరంగా సరికొత్త, వర్ధమాన సాంకేతికతలతో కూడిన నగరంగా దీన్ని అభివృద్ధి చేయతలపెట్టారు.
→విద్యుత్‌ వాహనాలు, నీటి ట్యాక్సీలు, ప్రత్యేకమైన సైకిల్‌ మార్గాలతో అత్యద్భుతంగా ఈ నగరాన్ని నిర్మించాలనుకున్నారు.

మెట్టపంటల్లో అధిక ఉత్పాదకతకు ఇక్రిశాట్, ఎన్‌ఐఆర్డీల మధ్య ఒప్పందం

→అధునాతన పరిజ్ఞానంతో మెట్టపంటల్లో అధిక ఉత్పాదకత, ఆహారభద్రత సాధన కోసం కలిసి పనిచేసేందుకు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇక్రిశాట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
→ఎన్‌ఐఆర్‌డీలో జరిగిన ఈ ఒప్పందంపై సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జి.నరేంద్రకుమార్, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జాక్వెలిన్‌ హుజెస్‌ సంతకాలు చేశారు.
→వాతావరణ మార్పుల అనుసరణ, గ్రామీణ వ్యవస్థాపకతలో అభివృద్ధి, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ ద్వారా ప్రోత్సాహం, స్వయం సహాయక బృందాల ద్వారా వ్యాపార అవకాశాలు, మెట్ట పంటల్లో ఉత్పాదకత పెంచడం, అధిక దిగుబడినిచ్చే రకాలపై పరిశోధన, అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నరేంద్రకుమార్, జాక్వెలిన్‌ తెలిపారు.

బోయింగ్, జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ ఒప్పందం

→ప్రయాణికుల విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే సదుపాయం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది.
→బోయింగ్‌ కన్వర్టెడ్‌ ఫ్రైటర్‌ (బీసీఎఫ్‌) అనే ఈ సదుపాయాన్ని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో కలిసి బోయింగ్‌ నెలకొల్పుతుంది.
→ఏడాదిన్నర వ్యవధిలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది.
→ఇటువంటి సదుపాయం భారత్‌లో అందుబాటులోకి రానుండటం ఇదే ప్రథమం.
→దీనివల్ల భారతదేశంలో అంతర్గతంగా, అంతర్జాతీయంగా సరకు రవాణా సదుపాయాలు గణనీయంగా పెరుగుతాయి.
→అలాగే విమానాల ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్‌) సేవల విస్తరణతో పాటు సరకు రవాణా విభాగంలో సత్వర వృద్ధి సాధనంగా, జీఎంఆర్‌ ఏరోతో కలిసి తాము నెలకొల్పే సదుపాయం ఎంతగానో దోహదపడుతుందని బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్తే అన్నారు.
→బోయింగ్‌ సహకారంతో ప్రపంచ స్థాయి సేవలను మనదేశంలో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ సీఈఓ అశోక్‌ గోపీనాథ్‌ వివరించారు.

రికార్డు స్థాయిలో సరకు రవాణా: ద.మ.రైల్వే

→సరకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే తెలిపింది. 2018 - 19లో సాధించిన 122.498 మిలియన్‌ టన్నుల లోడింగే ఇప్పటివరకు అత్యధికం.
→అయితే, ప్రస్తుత (2022 - 23) ఆర్థిక సంవత్సరంలో మార్చి 8 నాటికే 122.628 మిలియన్‌ టన్నులతో గత రికార్డును అధిగమించినట్లు ద.మ.రైల్వే తెలిపింది.

త్రిపుర సీఎంగా సాహా ప్రమాణం

→త్రిపుర ముఖ్యమంత్రిగా 70 ఏళ్ల మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
→ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాల సమక్షంలో ఆయన చేత గవర్నరు ఎస్‌.ఎన్‌.ఆర్య ప్రమాణం చేయించారు.
→మరో 8 మంది మంత్రులూ సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో ఐపీటీఎఫ్‌కు చెందిన ఒకరు ఉన్నారు.
→మిగిలిన వారంతా భాజపాకు చెందిన ఎమ్మెల్యేలే.

నాగాలాండ్‌ సీఎంగా నెఫ్యూ రియో

→నాగాలాండ్‌ సీఎంగా నెఫ్యూ రియో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌డీపీపీ అధినేత అయిన 72 ఏళ్ల నెఫ్యూ ఐదోసారి నాగాలాండ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు.
→రియో కేబినెట్‌లో ఏడుగురు ఎన్‌డీపీపీకి, ఐదుగురు భాజపాకు చెందినవారున్నారు. తొలిసారిగా సల్హౌతునొ క్రుసే అనే మహిళా ఎమ్మెల్యే కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

మేఘాలయ సీఎంగా రెండోసారి సంగ్మా

→ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత కాన్రాడ్‌ సంగ్మా షిల్లాంగ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
→ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సంగ్మా రెండోసారి మేఘాలయకు ముఖ్యమంత్రి అయ్యారు.
→లోక్‌సభ మాజీ స్పీకరు పీఏ సంగ్మా తనయుడైన కాన్రాడ్‌కు రాజకీయ చాణక్యుడనే పేరుంది.
→60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో 12 మందికే మంత్రులుగా పనిచేసే అవకాశముంది. సీఎంతో సహా 12 మంది ప్రమాణం చేశారు.

త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా

→త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్‌ సాహా ఎంపికయ్యారు. భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
→అంతకుముందు కేంద్ర మంత్రి ప్రతిభా భౌమిక్‌ పేరు తెరపైకి వచ్చినా చివరకు సాహాకే పదవి దక్కింది. ఆయన మార్చి 8వ తేదీన ప్రమాణం చేయనున్నారు.
→60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లను గెలుచుకుంది.

న్యూట్రి హబ్‌ - ఐఐఎంఆర్‌తో మారికో ఒప్పందం

→మారికో లిమిటెడ్, చిరు ధాన్యాలపై పరిశోధనలు నిర్వహించే నిమిత్తం న్యూట్రి హబ్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) తో ఒప్పందం కుదుర్చుకుంది.
→ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
→చిరు ధాన్యాలపై పరిశోధన, నూతన ప్రాసెసింగ్‌ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం, మానవ వనరులకు శిక్షణ, తదితర అంశాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
→దీనివల్ల చిరు ధాన్యాలతో విభిన్న ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశం లభిస్తుందని మారికో భావిస్తోంది.

ప్రపంచంలోనే తొలిసారిగా 200 మీటర్ల వెదురు బారియర్‌ ఏర్పాటు

→సాధారణంగా మనకు రహదారుల వెంట స్టీల్‌ బారియర్లు (రక్షణ అడ్డుకట్టలు) కనిపిస్తాయి.
→కానీ, ప్రపంచంలోనే మొదటి వెదురు బారియర్‌ను మహారాష్ట్రలోని ఓ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు.
→కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
→చంద్రపుర్, యవత్మాల్‌ జిల్లాలను కలిపే హైవేపై వాణీ - వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్‌ బారియర్‌ను ఉంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
→ఈ వెదురు బారియర్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ‘బాంబూసా బాల్కోవా’ వెదురు జాతితో వీటిని తయారు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
→ఈ వెదురు బారియర్లు ఉక్కుకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెప్పారు.

మైసూర్‌ సిల్క్‌కు జీఐ ట్యాగ్‌

→మైసూర్‌ సిల్క్, కంగ్రా టీ, తంజావుర్‌ పెయింటింగ్స్‌ వంటి 429 ఉత్పత్తులకు ఇప్పటి వరకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) ట్యాగ్‌ కేటాయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
→ఇందులో 31 విదేశీ ఉత్పత్తులు కూడా ఉన్నాయని పేర్కొంది.
→ఈ వస్తువులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ అనుబంధంగా పని చేస్తున్న పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) వెల్లడించింది.
→జీఐ ట్యాగ్‌ ఉన్న కొన్ని ఉత్పత్తులు ఇవే: బాస్మతి బియ్యం, డార్జిలింగ్‌ టీ, ఛందేరీ ఫ్యాబ్రిక్, మైసూర్‌ సిల్క్, కులు షాల్, కంగ్రా టీ, తంజావుర్‌ పెయింటింగ్స్, అలహాబాద్‌ సుర్ఖా, ఫరుఖాబాద్‌ ప్రింట్స్, లఖ్‌నవూ జర్దోజి, కశ్మీర్‌ వాల్‌నట్‌ వుడ్‌ కార్వింగ్‌ తదితరాలు.

వాయుసేనకు 70 శిక్షణ విమానాలు

→భారత వాయు సేన (ఐఏఎఫ్‌) అవసరాల కోసం హెచ్‌టీటీ-40 రకానికి చెందిన 70 శిక్షణ విమానాలు కొనుగోలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
→దీని కోసం రూ.6,828 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశం నిర్ణయించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు.
→ఆరేళ్ల వ్యవధిలో వీటిని సమకూర్చుకుంటామని చెప్పారు. ఈ విమానాల పరికరాల్లో దాదాపు 56% మేర మన దేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ తెలిపింది.
→అధునాతన సదుపాయాలుండే ఈ విమానాల ద్వారా కొత్త పైలట్లకు మెరుగైన శిక్షణ లభిస్తుందని పేర్కొంది.
→ సిమ్యులేటర్లు, శిక్షణ పరికరాల కొనుగోలు ఖర్చు కూడా దీనిలో ఇమిడి ఉందని తెలిపింది.
→ సైనిక బలగాల భవిష్యత్తు అవసరాల కోసం ఈ విమానాల స్థాయిని మెరుగుపరచుకునే అవకాశం ఉందని వివరించింది.
→ భారత నౌకాదళంలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న కేడెట్లు ఆ తర్వాత అవసరమైన శిక్షణ పొందడానికి రూ.3,108 కోట్ల వ్యయంతో మూడు నౌకల్ని కొనుగోలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.
→ ఎల్‌ అండ్‌ టీ సంస్థతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసేందుకు ఆమోదం లభించినట్లు రక్షణ శాఖ తెలిపింది. 2026 నుంచి ఈ నౌకల అందజేత మొదలవుతుందని వెల్లడించింది.
→ స్నేహపూరిత దేశాల కేడెట్ల శిక్షణకు, విపత్తుల సమయాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని తెలిపింది.
→ ఇవి చెన్నైలోని ఎల్‌ అండ్‌ టి నౌకా నిర్మాణ కేంద్రంలో తయారవుతాయని వెల్లడించింది. నాలుగున్నరేళ్లలో 22.5 లక్షల పనిదినాలను ఈ ప్రాజెక్టు కల్పిస్తుందని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు కేంద్ర పురస్కారాలు

→తెలంగాణ మరో రెండు ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. దేశంలో వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
→ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఫలితాల్లో రాష్ట్రం ఈ ఘనత సాధించింది.
→ ఈ మేరకు ఓడీఎఫ్‌ ప్లస్, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులు రాష్ట్రానికి రెండు పురస్కారాలను ప్రకటించారు.
→ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించినట్లు వారు ప్రకటించారు.
→మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు.
→అదనంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడి పొడిగా వేరు చేయడం, చెత్తను సేకరించడానికి ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ సమకూర్చడం, శ్మశాన వాటికను నిర్మించడం, ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపడితే దానిని ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తిస్తారు. ఇటీవల ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశమిచ్చింది.
→ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేశారు.
→వీటి ఆధారంగా తెలంగాణ ప్రగతిని కేంద్రం గుర్తించి, పురస్కారాలను ప్రకటించింది.


కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌

→ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్‌లో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనుంది.
→ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో టీ-వర్క్స్‌ ప్రారంభానికి విచ్చేసిన ‘ఫాక్స్‌కాన్‌’ ఛైర్మన్‌ యంగ్‌ లియూ, సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ కంపెనీకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.

సీఆర్పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ డీఐజీగా ఉదయ్‌భాస్కర్‌

→సీఆర్పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ డీఐజీగా బిళ్ల ఉదయ్‌భాస్కర్‌ బాధ్యతలు స్వీకరించారు.
→ఉత్తర కశ్మీర్‌ రేంజ్‌ బారాముల్లా డీఐజీగా పనిచేసిన ఆయన ఇటీవలే డిప్యుటేషన్‌పై సీఆర్పీఎఫ్‌కు బదిలీ అయ్యారు.
→అధికారులు ఆయనకు హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలోని గ్రూప్‌ సెంటర్‌ డీఐజీగా పోస్టింగ్‌ ఇచ్చారు.
→గుంటూరు జిల్లా కన్నవారితోటకు చెందిన ఉదయ్‌భాస్కర్‌ 2008లో జమ్మూకశ్మీర్‌ కేడర్‌ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.
→శిక్షణ అనంతరం అనంత్‌నాగ్‌ ఏఎస్పీగా పనిచేశారు. తర్వాత జమ్మూ, లేహ్‌ ఎస్పీగా, జమ్మూ ట్రాఫిక్‌ ఎస్పీగా విధులు నిర్వర్తించారు.
→2017లో ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. తర్వాత తిరిగి జమ్మూకశ్మీర్‌కు వెళ్లారు.
→ డీఐజీగా పదోన్నతి పొందిన అనంతరం జమ్మూ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ల, తర్వాత దోడా-కిష్ట్వార్‌-రంబన్‌ (డీకేఆర్‌) రేంజ్‌ డీఐజీగానూ పనిచేశారు.

భారత్, తైవాన్‌ కలిస్తే ప్రపంచస్థాయి ఉత్పత్తులు: మంత్రి కేటీఆర్‌

→సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ రంగాల్లో అగ్రగామిగా ఉన్న భారత్, తైవాన్‌ దేశాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూతో కలిసి దేశంలోనే తొలి ప్రొటోటైపింగ్‌ కేంద్రం టి-వర్క్స్‌ను రాయదుర్గంలో ప్రారంభించారు. గ్రామీణ ఆవిష్కరణకర్తల భాగస్వామ్యంతో టీ హబ్‌ ఇప్పటికే వెంటిలేటర్, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ పరికరాలను రూపొందించిందని, ప్రపంచస్థాయి వసతులతో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ జరుగుతోందని వెల్లడించారు.
→ టి-హబ్‌ 5.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టి-వర్క్స్‌ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టి-వర్క్స్‌ రెండో దశ దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదాల్చనుంది. దీని పక్కనే భారీ విస్తీర్ణంలో ఇమేజ్‌ టవర్స్‌. అంకుర సంస్థలకు వేదికగా టి-హబ్‌ నిలిస్తే సృజనాత్మక ఉత్పత్తుల కేంద్రంగా టి-వర్క్స్‌.. యానిమేషన్, గేమింగ్, వన్‌ టైమ్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఈ నాలుగింటి కలబోతగా ఇమేజ్‌ టవర్స్‌ రూపుదాల్చనున్నాయి. భూమిలో పెట్టే విత్తనం మొదలుకొని, అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌ దాకా అన్నింటిలోనూ సృజనాత్మక ఆవిష్కరణలకు టీవర్క్స్‌ వేదిక కానుంది. భారత్‌లో ఇప్పటి వరకూ ఎక్కడా ఇలాంటి సంస్థ అందుబాటులో లేదు. ఇందులో మెటల్, త్రీ డి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్, మెట్రాలజీ, వుడ్‌ వర్కింగ్, వెల్డింగ్, పెయింట్‌ జాబ్, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు తదితర విభాగాలు అందుబాటులో ఉన్నాయి.

సీఐఐ ఏపీ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా లక్ష్మీప్రసాద్‌

→భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్రప్రదేశ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌ నియమితులయ్యారు.
→వైస్‌ ఛైర్మన్‌గా వైజాగ్‌ హాస్పిటల్స్, క్యాన్సర్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.మురళీకృష్ణ వ్యవహరిస్తారు.
→2023 - 24 సంవత్సరానికి గాను వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగనున్నారు.
→సుజయ్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌ ఈ పదవితో పాటు వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
→డాక్టర్‌ మురళీకృష్ణకు ఉత్తరాంధ్రలో సీనియర్‌ సర్జికల్‌ అంకాలజిస్ట్‌ (క్యాన్సర్‌ వైద్యుడు)గా 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పేటీఎం మాతృసంస్థ ఒప్పందం

→ఆర్థిక, ప్రజారోగ్య, పారిశ్రామిక, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేటీఎం మాతృసంస్థ ‘వన్‌97 కమ్యునికేషన్స్‌’ వెల్లడించింది.
→ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపింది.
→ఈ ఒప్పందం ప్రకారం చిన్న వ్యాపారులకు, ప్రభుత్వ శాఖల చెల్లింపులకు పేటీఎం తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది.

జాతీయ మైనారిటీ కమిషన్‌ ఏపీ సలహాదారుగా అర్షద్‌ అయూబ్‌ఖాన్‌

→జాతీయ మైనారిటీ కమిషన్‌ ఏపీ సలహాదారుగా చిత్తూరు జిల్లాకు చెందిన అర్షద్‌ అయూబ్‌ఖాన్‌ను కేంద్రం నియమించింది.
→ఈ మేరకు కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షరిక్‌ సయీద్‌ ఆదేశాలు జారీ చేశారు.

విశాఖ ఉక్కులో రికార్డు స్థాయి ఉత్పత్తి

→విశాఖ ఉక్కు కర్మాగారం ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ పనితీరుతో నూతన రికార్డులు నమోదు చేసిందని ఉక్కు వర్గాలు తెలిపాయి.
→ఫిబ్రవరిలో బ్లాస్ట్‌ఫర్నెస్‌ (బీఎఫ్‌)-1, -2ల్లో కలిపి రోజుకు సరాసరి 15,004 టన్నుల చొప్పున మొత్తం 4,20,100 టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి జరిగింది.
→వైర్‌ రాడ్‌ మిల్‌ (డబ్ల్యూఆర్‌ఎం)-1 నుంచి 91,356 టన్నులు, ఎస్‌బీఎం (స్పెషల్‌ బార్‌ మిల్‌) నుంచి 53,453 టన్నులు, డబ్ల్యూఆర్‌ఎం-2 నుంచి 56,722 టన్నులు, స్ట్రక్చరల్‌ మిల్‌ నుంచి 48,853 టన్నుల ఉత్పత్తి సాధించి రికార్డు నమోదు చేసింది.
→విస్తరణ యూనిట్ల నుంచి 1,59,028 టన్నుల ఫినిష్డ్‌ స్టీల్, సాధారణ యూనిట్లు, విస్తరణ యూనిట్లు మొత్తంగా 3,77,489 టన్నుల ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తి చేసి మరో రికార్డు నమోదు చేసినట్టు ఉక్కు వర్గాలు పేర్కొన్నాయి.

ఎన్‌ఎండీసీ సీఎండీగా అమితవ ముఖర్జీ

→ఎన్‌ఎండీసీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎండీసీలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
→అమితవ ముఖర్జీ 1995 బ్యాచ్‌ ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌) అధికారి.
→ఎన్‌ఎండీసీలో డిజిటలైజేషన్, ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయించడం, ఆస్ట్రేలియాలో మైనింగ్‌ కార్యకలాపాల పర్యవేక్షణ వంటి బాధ్యతలను నిర్వహించారు.
→ఎన్‌ఎండీసీలో చేరక ముందు ఆయన రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)లో జనరల్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌)గా పనిచేశారు.

హెచ్‌యూఎల్‌ ఎండీగా రోహిత్‌ జవా

→ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవవర్‌ (హెచ్‌యూఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) రోహిత్‌ జవా నియమితులయ్యారు.
→దశాబ్ద కాలం పాటు సంస్థకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన సంజీవ్‌ మెహతా పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో రోహిత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.
→ప్రస్తుతం రోహిత్‌ జవా, యునిలీవర్‌లో చీఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అధికారిగా ఉన్నారు. 2023, జూన్‌ 27 నుంచి అయిదేళ్ల పాటు హెచ్‌యూఎల్‌ ఎండీ పదవిలో కొనసాగుతారని హెచ్‌యూఎల్‌ పేర్కొంది.

మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4 శాతమే!

→ఈ ఆర్థిక సంవత్సరం (2022 - 23) నాలుగో త్రైమాసికంలో (జనవరి - మార్చి) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది.
→దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి దేశ జీడీపీ వృద్ధి రేటు, ప్రభుత్వ అంచనా అయిన 7% కంటే తక్కువగా నమోదు కావొచ్చని పేర్కొంది.
→ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 13.2 శాతం, రెండో త్రైమాసికంలో 6.3 శాతం, మూడో త్రైమాసికంలో 4.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసింది.
→పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7 శాతంగా ఉండాలంటే నాలుగో త్రైమాసికంలో కనీసం 5.1 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని ముఖ్య ఆర్థిక సలహాదారు పేర్కొన్న సంగతి విదితమే. మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చు.
→అంటే 2022 - 23 జీడీపీ వృద్ధి అంచనా 7 శాతం కంటే తక్కువగానే నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్‌ విశ్లేషకులు పరాస్‌ జస్రాయ్‌ వెల్లడించారు.
→వృద్ధికి ప్రధానమైన గిరాకీ సాధారణ స్థాయికి చేరుతుండటం, ఎగుమతులకు అంతర్జాతీయ మందగమనం అడ్డంకిగా మారడం, రుణ వృద్ధి, కఠిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటుండటం వంటి పలు సవాళ్లు మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 4 శాతానికి పరిమితం చేయొచ్చని ఇండియా రేటింగ్స్‌ వెల్లడించింది.

సీఐఐ - తెలంగాణ ఛైర్మన్‌గా సి.శేఖర్‌ రెడ్డి

→సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య), తెలంగాణ విభాగానికి నూతన ఛైర్మన్‌గా సి.శేఖర్‌ రెడ్డి ఎంపికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా డి.సాయి ప్రసాద్‌ వ్యవహరిస్తారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి వీరిద్దరూ సీఐఐ - తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తారు.
→ సి.శేఖర రెడ్డి రియల్‌ సీఎస్‌ఆర్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌కు సీఎండీగా ఉన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రియల్‌ ఎస్టేట్‌ సంఘాల్లో కీలక పదవులు నిర్వహిస్తూ, సంబంధిత విధానాల రూపకల్పనలో పాల్గొన్నారు. క్రెడాయ్‌ రూపకల్పనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
→ డి.సాయి ప్రసాద్, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌లో బయోటెక్నాలజీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ లోవా నుంచి ఎంబీఏ (ఫైనాన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) పట్టా పుచ్చుకున్నారు. వ్యాక్సిన్లు, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ జెనిటిక్స్, సెల్‌ బయాలజీ విభాగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది.

టీసీఎస్‌కు తెలంగాణ ఇండస్ట్రీస్‌ పురస్కారం

→తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు గాను ‘తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ ఇన్‌ ఐటీ’ పురస్కారానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఎంపికయ్యింది.
→సీఐఐ తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న అందుకున్నారు.
→హైదరాబాద్‌ టీసీఎస్‌లో దాదాపు 90,000 మంది ఉద్యోగులున్నారని, వీరి సంఖ్య పెరుగుతూనే ఉందని రాజన్న తెలిపారు.

భారతదేశ తలసరి ఆదాయం రూ.1,72,000

→భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ.1,72,000కు చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది.
→ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీయే కూటమి అధికారంలోకి వచ్చిన 2014 - 15లో ఎన్‌ఎస్‌వో ప్రకారం అది రూ.86,647గా ఉంది. ఈ లెక్కన దాదాపు 99 శాతం వృద్ధి నమోదైంది.
→ అదే స్థిర ధరల వద్ద 2014 - 15లో దేశ తలసరి ఆదాయం రూ.72,805గా ఉండగా ప్రస్తుతం అది రూ.98,118కి చేరింది. దీంట్లో 35 శాతం వృద్ధి నమోదైంది.

సీఐఐ ఐడబ్ల్యూఎన్‌ తెలంగాణ విభాగం ఛైర్‌ ఉమెన్‌గా శ్రీవిద్య రెడ్డి

→సీఐఐ ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ (సీఐఐ ఐడబ్ల్యూఎన్‌) తెలంగాణ విభాగానికి ఛైర్‌ ఉమెన్‌గా శ్రీవిద్య రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
→అదే విధంగా వైస్‌ ఛైర్‌ ఉమెన్‌గా తనూజ అబ్బూరి ఎంపికయ్యారు. వీరిద్దరూ 2023 - 24 సంవత్సరానికి ఈ హోదాల్లో పనిచేస్తారు.
→జి.పుల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శ్రీవిద్య రెడ్డి ఉన్నారు. అమెజాన్‌లో ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి డీఈఐ లీడ్‌గా తనూజ అబ్బూరి కొనసాగుతున్నారు.

జీఎస్‌టీ వసూళ్లలో 12% వృద్ధి

→ఫిబ్రవరి నెల జీఎస్‌టీ వసూళ్లలో గత ఏడాదితో పోలిస్తే సుమారు 12 శాతం వృద్ధి నమోదైంది.
→ మొత్తం వసూలైన రూ.1,49,577 కోట్ల జీఎస్‌టీలో, సీజీఎస్‌టీ రూ.27,662 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.34,915 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.75,069 కోట్లు, సెస్‌ రూ.11,931 కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
→ ఐజీఎస్‌టీ నుంచి ప్రభుత్వం సీజీఎస్‌టీకి రూ.34,770 కోట్లు, ఎస్‌జీఎస్‌టీకి రూ.29,054 కోట్ల మేర సర్దుబాటు చేసింది.
→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాధారణ పంపకాల అనంతరం ఫిబ్రవరిలో సీజీఎస్‌టీకి రూ.62,432 కోట్లు, ఎస్‌జీఎస్‌టీకి రూ.63,969 కోట్లు చేరింది.
→ గత ఏడాది ఫిబ్రవరిలో వసూలైన జీఎస్‌టీ మొత్తం రూ.1,33,026 కోట్లు. ఈసారి దిగుమతి వస్తువులపై 6%, దేశీయ లావాదేవీలపై 15% అధికంగా వసూలైంది.
→ జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి సెస్సు రూపంలో అత్యధికంగా రూ.11,931 కోట్లు ఖజానాకు చేరింది.
→ఫిబ్రవరి జీఎస్‌టీకి సంబంధించి ఏపీలో 13%, తెలంగాణలో 8% వృద్ధి రేటు నమోదైంది. ఏపీ ఖజానాకు గత ఏడాది ఫిబ్రవరిలో రూ.3,157 కోట్లు చేరగా, ఈసారి రూ.3,557 కోట్లు వచ్చింది.
→తెలంగాణకు గత ఏడాది రూ.4,113 కోట్లు, ఈసారి రూ.4,424 కోట్లు జమ అయ్యాయి. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు (19%), కర్ణాటక (18%)లు అధిక వృద్ధి రేటు సాధించాయి.

సీఆర్‌పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ ఐజీగా చారుసిన్హా

→సెంట్రల్‌ రిజర్వు పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సదరన్‌ సెక్టార్‌ ఐజీగా చారుసిన్హా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
→ఈ సెక్టార్‌లో ఐజీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన మహేష్‌చంద్ర లడ్హా జమ్మూ సెక్టార్‌కు బదిలీ అయ్యారు.
→చారుసిన్హా ఐజీపీగా జమ్మూ సెక్టార్‌లో ఉగ్రవాద నిర్మూలన బృందానికి సంవత్సరం పాటు, శ్రీనగర్‌ సెక్టార్‌లో దాదాపు రెండున్నరేళ్ల పాటు విధులు నిర్వహించారు.
→గతంలో నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆమె బిహార్‌లోనూ పనిచేశారు.
→సీఆర్‌పీఎఫ్‌కు డిప్యుటేషన్‌పై రాకముందు చారుసిన్హా తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వహించారు.
→నిజామాబాద్, మహబూబ్‌నగర్, చిత్తూరు, తూర్పు గోదావరి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు.
→అల్బేనియన్‌ ముస్లింలు, క్రిస్టియన్‌ సెర్బ్‌ల మధ్య సంఘర్షణతో నలిగిపోయిన ప్రాంతంలో శాంతి పరిరక్షణకు డిప్యుటేషన్‌పై కొసావాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగస్వాములై సేవల విభాగాన్ని కూడా పర్యవేక్షించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు.. నాటు’ పాటకు ఆస్కార్‌

→భారతీయ సినీ చరిత్రలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 95వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ఆస్కార్‌ గెలిచింది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్‌ రచించిన నాటు నాటు.. పాట అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు సమకూర్చారు. అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ వుమెన్‌), లిఫ్ట్‌ మి అప్‌ (బ్లాక్‌పాంథర్‌: వకాండా ఫరెవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), హోల్డ్‌ మై హ్యాండ్‌ (టాప్‌ గన్‌ మావెరిక్‌) పాటల్ని అధిగమించి మన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ పురస్కారాన్ని గెలిచింది.

భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి తొలి అవార్డు →అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో అవార్డు గెలుచుకుంది.
→దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్‌ మోంగా వేదికపై అవార్డు తీసుకొని మురిసిపోయారు.
→కార్తికికు దర్శకురాలిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
→భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్‌ దక్కడం ఇదే తొలిసారి.

ఒకే చిత్రానికి ఏడు అవార్డులు:- →చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఓ కుటుంబం కథతో తెరకెక్కిన ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది.
→ఈ సినిమా 11 నామినేషన్లు పొందింది. ఏకంగా ఏడు అవార్డులను కైవసం చేసుకుంది. డానియల్‌ క్వాన్, డేనియల్‌ స్కీనెర్ట్‌ ఈ సినిమాకు ‘ఉత్తమ దర్శకుడి’గా అవార్డును గెలుచుకున్నారు.
→అమెరికన్‌ చలన చిత్ర దర్శకులైన వీరిని ‘డేనియల్స్‌’ అని పిలుస్తారు.
→ఈ చిత్రంలో లాండ్రీ షాప్‌ యజమానిగా కీలక పాత్రలో నటించిన మిషెల్‌ యో ‘ఉత్తమ నటి’ అవార్డును సొంతం చేసుకుంది.
→ఆస్కార్‌ పురస్కారం అందుకున్న ఆసియా సంతతికి చెందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.
→ఉత్తమ సహాయ నటి, సహాయ నటుడు, స్క్రీన్‌ప్లే, ఎడిటర్‌ విభాగాల్లోనూ ఈ చిత్రం పురస్కారాలు గెలుచుకుంది.
→‘ది వేల్‌’ చిత్రంతో బ్రెండన్‌ ఫ్రేజర్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ‘ఉత్తమ విమానాశ్రయ’ పురస్కారం

→హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ - ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది.
→2022కి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 15-25 మిలియన్ల వార్షిక ప్రయాణీకుల విభాగంలో ఈ అవార్డు లభించింది.
→వరుసగా 9 సంవత్సరాలు హైదరాబాద్‌ విమానాశ్రయం గ్లోబల్‌ టాప్‌-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తూవస్తోంది.

ఆర్థికవేత్త జయతీఘోష్‌కు అంతర్జాతీయ అవార్డు

→ప్రముఖ ఆర్థికవేత్త, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ వ్యవసాయ ఆర్థికశాస్త్రం విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
→అమెరికన్‌-కెనడా ఆర్థికవేత్త జాన్‌ కెనెత్‌ గాల్‌బ్రెయిత్‌ పేరుతో ఏర్పాటైన గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ అవార్డును 2023 ఏడాదికి గాను జయతీఘోష్‌కు బహూకరించాలని నిర్ణయించినట్లు నిర్వాహక సంస్థ అగ్రికల్చరల్‌ అండ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అవార్డు

→కొవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయడంలో సాధించిన విజయానికి గాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పోర్టర్‌ ప్రైజ్‌ 2023 దక్కింది.
→అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి నెలాఖరులో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ (ఐఎఫ్‌సీ), యూఎస్‌ ఏసియా టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ (యూఎస్‌ఏటీఎంసీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ది ఇండియా డైలాగ్‌’ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


‘పాలమూరు-రంగారెడ్డి’లో పర్యావరణ నష్ట నివారణపై అధ్యయనానికి కమిటీ

→పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధ్యయన కమిటీని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఏర్పాటు చేసింది.
→ఈ పథకంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పనుల కారణంగా పర్యావరణానికి వాటిల్లిన నష్టంపై ఈ కమిటీ అధ్యయనం చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలను సిఫారసు చేస్తుంది.
→జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.
→కమిటీకి డాక్టర్‌ ఎ.మల్హోత్రా ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కె.గౌరప్పన్, అశోక్‌ ఖర్య, ఎన్‌.లక్ష్మణన్, అమియా సాహూ, జేఏ జాన్సన్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో ‘మిషన్‌ కర్మయోగి’ అమలు కమిటీ

→ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మిషన్‌ కర్మయోగి’ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా నేతృత్వంలోని ఈ కమిటీలో పీఎంవో నుంచి ఒక సీనియర్‌ అధికారి, వివిధ శాఖల నుంచి ఏడుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
→నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ కెపాసిటీ బిల్డింగ్‌ (ఎన్‌పీసీఎస్‌సీబీ) లేదా మిషన్‌ కర్మయోగి కింద నిర్దిష్ట విధానాన్ని రూపొందించే ప్రక్రియలో భాగంగా కేబినెట్‌ సెక్రటేరియట్‌ సమన్వయ విభాగాన్ని (సీఎస్‌సీయూ) ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
→ఎన్‌పీసీఎస్‌సీబీ అమలును సీఎస్‌సీయూ పర్యవేక్షిస్తుందని ఆదేశాలు జారీ చేసింది ఈ ఏడాది జనవరి నాటికి సమీకృత ప్రభుత్వ ఆన్‌లైన్‌ శిక్షణ (ఐజీవోటీ) కర్మయోగి డిజిటల్‌ లెర్నింగ్‌ వేదికపై 1,532 మంత్రిత్వశాఖలు/విభాగాలు, సంబంధిత సంస్థలు 341 కోర్సులను ప్రారంభించగా, 3,13,367 మంది ఇందులో శిక్షణకు నమోదు చేసుకున్నారు.
→వీరంతా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అనుభవజ్ఞులు/నిపుణులతో సంప్రదింపులకు గాను గత నెలలో ‘కర్మయోగి టాక్స్‌ సిరీస్‌’ను ప్రారంభించారు.

అహోమ్‌ మహావీరుడు లచిత్‌పై 42 లక్షల వ్యాసాలు

→అహోమ్‌ వీరుడు లచిత్‌ బోర్‌ఫుఖన్‌పై రాసిన 42 లక్షల వ్యాసాలు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కాయి.
→లచిత్‌.. 1671లో సరాయిఘాట్‌ యుద్ధంలో మొగలులను ఓడించారు. ఇటీవల ఈ మహావీరుడి 400వ జయంతి ఉత్సవాలను అస్సాం ప్రభుత్వం భారీగా జరిపింది.
→అందులో భాగంగా వ్యాసాల పోటీ నిర్వహించింది. లచిత్‌పై 57 లక్షల వ్యాసాలు వచ్చాయి. అందులో చేతితో రాసినవి మాత్రమే తీసుకున్నాం.
→దీంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫొటో ఆల్బమ్‌ రూపొందించామని అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తెలిపారు.

ఎస్‌డీఎన్‌వై జడ్జిగా అరుణ్‌ సుబ్రమణియన్‌

→సదరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ (ఎస్‌డీఎన్‌వై) జడ్జిగా భారతీయ అమెరికన్‌ అరుణ్‌ సుబ్రమణియన్‌ నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర వేసింది.
→మెజారిటీ సభ్యులు ఈ నియామకానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఈ పదవిని చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా సుబ్రమణియన్‌ నిలవనున్నారు.
→కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వు విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్సు, ఆంగ్లంలో పట్టా తీసుకున్న సుబ్రమణియన్‌ ఆ తర్వాత కొలంబియా లా స్కూల్‌ నుంచీ డిగ్రీ పొందారు.

వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా మహిళ నాయకత్వం

→భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చరిత్రలో తొలిసారిగా ఓ పోరాట విభాగానికి మహిళ నాయకత్వం వహించబోతున్నారు. గ్రూపు కెప్టెన్‌ శాలిజా ధామీకి ఈ ఘనత లభించనుంది.
→పశ్చిమ ప్రాంతంలో క్షిపణుల స్క్వాడ్రన్‌కు ఆమె నేతృత్వం వహించనున్నారు. వాయుసేనలో ఇంతవరకు ఒక మహిళ ఇలాంటి బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి అని వాయుసేన తెలిపింది. 2003లో హెలికాప్టర్‌ పైలట్‌గా ఐఏఎఫ్‌లోకి ధామీ అడుగుపెట్టారు. 2,800 గంటలు హెలికాప్టర్లు నడిపిన అనుభవం ఆమెకు ఉంది. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్‌ విభాగానికి ఆమె ఫ్లైట్‌ కమాండర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్ల విభాగంలో ఉన్నారు. సియాచిన్‌లో సేవలు అందించడానికి భారత సైన్యం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కోర్‌’కు చెందిన కెప్టెన్‌ శివ చౌహాన్‌ను జనవరిలో నియమించిన విషయం తెలిసిందే. ఈ సేవల్లో నియమితురాలైన తొలి మహిళ ఆమె. ఈ మేరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణ క్షేత్రమైన సియాచిన్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి సైనికాధికారిణిగా కెప్టెన్‌ శివ చౌహాన్‌ రికార్డులకు ఎక్కారు.

చిన్నారి సియెన్నా చోప్రా పర్వతారోహణతో అరుదైన ఘనత

→పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆరున్నరేళ్ల చిన్నారి సియెన్నా చోప్రా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
→దక్షిణాఫ్రికాలోని 19 వేల అడుగుల ఎత్తున్న కిలిమంజారో, మేరూ పర్వత శిఖరాలను అధిరోహించింది.
→ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ సాధించని విధంగా శిఖర ద్వయాన్ని ఒక వారంలోనే అధిరోహించి అక్కడ మువ్వన్నెల జెండాను ఎగురవేసింది.

చిన్నారుల గుండె చికిత్సకు వాడే కోనార్‌-ఎంఎఫ్‌ పరికరానికి పేటెంట్‌

→పుట్టుకతోనే చిన్న పిల్లల గుండెలో ఏర్పడే రంధ్రాలను మూసివేసేందుకు ఓ తెలుగు వైద్యుడు రూపొందించిన వైద్య పరికరానికి భారత ప్రభుత్వం తాజాగా పేటెంట్‌ మంజూరు చేసింది.
→ప్రతి వెయ్యి మంది శిశువుల్లో పది మందికి వివిధ కారణాలతో పుట్టుకతోనే గుండెలో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.
→ఇందులో వెంట్రిక్యులర్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (వీఎస్‌డీ) వల్ల గుండె దిగువ గదుల్లో రంధ్రం ఏర్పడి సమస్యలకు దారితీస్తుంది.
→ఈ రంధ్రాలను మూసివేసే పరికరాన్ని రూపొందించడానికి తెలుగు వైద్యుడు, ప్రముఖ చిన్న పిల్లల హృద్రోగ చికిత్స నిపుణులు, రెయిన్‌బో హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కోనేటి నాగేశ్వరరావు తన బృందంతో కలిసి పరిశోధనలు చేశారు. 2009లో ఆయన శ్రమ ఫలించింది.
→ఆయన రూపకల్పన చేసిన పరికరానికి కోనార్‌-ఎంఎఫ్‌ డివైజ్‌గా నామకరణం చేశారు. దీనికి విదేశాల నుంచి కూడా అనుమతులు దక్కాయి.
→ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ లేకుండానే ట్రాన్స్‌ క్యాథటర్‌ ద్వారా దీన్ని గుండె గదుల మధ్య ఉంచి రంధ్రాలను మూసివేస్తారు.
→మన దేశంతో పాటు జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా తదితర 72 దేశాల్లో ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు విజయవంతంగా దీన్ని వినియోగించారు.
→ఈ పరికరంపై 2012లో అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించగా ఉత్తమ ఆవిష్కరణ కింద ఎంపికైంది.
→తాజాగా భారత ప్రభుత్వం ఈ పరికరానికి సంబంధించి తనకు పేటెంట్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిందని డాక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు.

హెకానీ జఖాలు, సల్హౌతునొ క్రుసె చరిత్రను తిరగరాస్తూ ఎన్నికల్లో జయకేతనం

→నాగాలాండ్‌ది 60 ఏళ్ల చరిత్ర. 13 శాసనసభ ఎన్నికలు. ఇన్నేళ్లలో ఒక్క మహిళా ఎంఎల్‌ఏ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఈసారి హెకానీ జఖాలు, సల్హౌతునొ క్రుసె చరిత్రను తిరగరాస్తూ జయకేతనం ఎగురవేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.
→ హెకానీది దిమాపుర్‌లోని తొలువి. నాన్న ఎస్‌ఐ జఖాలు మాజీ లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌. తల్లి కఖేలు మాత్రం ఆవిడకు ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. దీంతో బెంగళూరులో స్కూలు విద్య, దిల్లీ లేడీ శ్రీరామ్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. అక్కడే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తయ్యాక ఐరాసలో కొన్నాళ్లు పని చేశారు. తర్వాత దేశానికి తిరిగొచ్చి దిల్లీలో న్యాయవాదిగా కెరియర్‌ ప్రారంభించారు. సుప్రీం, హైకోర్టుల్లో పనిచేశారు. న్యాయవాదిగా చేస్తున్నా యువత సరైన మార్గనిర్దేశం లేక చిరు వ్యాపారాల్లో మునిగిపోవడం, బాల్య వివాహాలు, అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయడం వంటివి ఆవిడని కలచివేసేవి. దీంతో న్యాయవాద వృత్తిని వదిలి 2005లో ఊరికెళ్లిపోయారు. ‘యూత్‌ నెట్‌’ అనే ఎన్‌జీఓను స్థాపించి వేల మంది యువతకు విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సాయపడ్డారు. మహిళా సాధికారత కోసం చేసిన కృషికి 2018లో నారీశక్తి పురస్కారాన్నీ అందుకున్నారు. 2018 ఎన్నికలు ఆవిడ ఆలోచనని మార్చాయి. నాగాలాండ్‌ లాంటి చిన్న రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అయిన ఖర్చు మొత్తాన్నే రాష్ట్రాభివృద్ధికి ఖర్చుపెడితే అభివృద్ధి సాధ్యం అనే ఆశయంతో ఎన్‌డీపీపీ తరఫున దిమాపుర్‌ నుంచి పోటీ చేసి గెలుపొంది, ఆ రాష్ట్రం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి మహిళగా నిలిచారు.
→ ఇంటర్‌ చదివిన సల్హౌతునొ క్రుసె హోటల్‌ నిర్వహిస్తున్నారు. 24 ఏళ్లుగా అనగామీ విమెన్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. ఆ సంస్థకు ప్రెసిడెంట్, అడ్వయిజర్‌ కూడా. రాజకీయ నేపథ్యం లేదు. కానీ 2018 ఎన్నికల్లో ఈవిడ భర్త కెవిసేకో క్రుసె ఎన్‌డీపీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అదే ప్రత్యర్థిపై ఈవిడ పోటీ చేసి 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈవిడ సేవలు మెచ్చి, మద్దతుగా అసోం, నాగాలాండ్‌ ముఖ్యమంత్రులు స్వయంగా ప్రచారం చేశారు.

సౌరశక్తితో వెలిగే తొలి ఒడిశా గ్రామంగా సగసాహి

→ఒడిశాలో సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునే తొలి గ్రామంగా సగసాహి నిలిచింది.
→ఇక్కడి సుందర్‌గఢ్‌ జిల్లాలోని మారుమూల గ్రామమైన సగసాహిలో ప్రతి ఇంటికీ, కార్యాలయానికి 24 గంటలూ సౌర విద్యుత్‌ అందించేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
→కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఆర్సెలోర్‌ మిత్తల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా సంస్థ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో మైలురాయిని వేగంగా చేరుకున్నామని సబ్‌ కలెక్టర్‌ సురంజన్‌ సాహూ పేర్కొన్నారు.
→ఇకపై ఇక్కడ ఉన్న 90 నివాసాలు, 10 వేల లీటర్ల నీటి సరఫరా వ్యవస్థ, 70 వీధి దీపాలు సౌర విద్యుత్‌ను పొందనున్నాయని తెలిపారు.

23 వేల సంవత్సరాల నాటి మానవ డీఎన్‌ఏ

→ప్రస్తుత ఐరోపా ప్రాంతంలో 23 వేల సంవత్సరాల కిందట నివసించిన ఒక వ్యక్తి డీఎన్‌ఏను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
→చివరి మంచు యుగం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అతడు పుడమిపై సంచరించాడు. దక్షిణ స్పెయిన్‌లోని క్వేవా మాల్‌ అల్‌మ్యురెజోలో ఈ డీఎన్‌ఏ వెలుగు చూసింది.
→నాడు అది ఐరోపాలోనే ఒకింత వేడి ప్రదేశమని పరిశోధకులు తెలిపారు. దీనికి తోడు స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో దాదాపు ఏడు వేల ఏళ్ల నాటి రైతుల జన్యు పటాలనూ సేకరించారు.
→ఒక జీవి మరణం తర్వాత దాని డీఎన్‌ఏ అనుకూల పరిస్థితుల నడుమ కొంత కాలం వరకే భద్రంగా ఉంటుంది.
→వేడి, పొడి వాతావరణ పరిస్థితుల్లో పురాతన జీవుల నుంచి డీఎన్‌ఏను సేకరించడం పరిశోధకులకు పెద్ద సవాల్‌. ఈ ఇబ్బందులను అధిగమించి, శాస్త్రవేత్తలు వెలికితీయడం విశేషం.
→చివరి మంచు యుగంలో ప్రజల కదలికలు, వలసలు, జన్యు సంబంధాలు, మూలాలపై ఇది కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

146వ ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సదస్సు

→లోక్‌సభలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, సభ్యులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి దాన్ని ఉపయోగించుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లా పిలుపునిచ్చారు.
→ బహ్రెయిన్‌లోని మనామాలో జరుగుతున్న 146వ ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ సదస్సులో ‘శాంతియుత సహజీవనం.. సమ్మిళిత సమాజాలు.. అసహనానికి వ్యతిరేకంగా పోరాటం’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘భారత్‌ పార్లమెంటులో మాట్లాడేందుకు సభ్యులకు పూర్తి స్వేచ్ఛాయుతమైన హక్కులున్నాయి.
→ మా వద్ద భాగస్వామ్య ప్రజాస్వామ్యం, గతిశీలమైన బహుళ పార్టీ విధానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలను ప్రజాప్రతినిధుల ద్వారా వ్యక్తీకరిస్తారు.
→ ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారతదేశ విధానం.
→ వాతావరణ మార్పుల ద్వారా వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రపంచ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో భారత్‌ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది.
→ శాంతియుత సహజీవనం, పరస్పర చర్చల ద్వారానే సమ్మిళిత, సహనంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ విషయంలో పార్లమెంటులు కీలకపాత్ర పోషించాలి.
→ మానవ ప్రపంచానికి ఉత్తమ భవిష్యత్తు నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజం కలసిరావాలని పిలుపునిచ్చారు.

ఆస్ట్రేలియా - భారత్‌ మంచి మిత్ర దేశాలు: అల్బనీస్‌

→ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
→ఆ దేశ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
→అలాగే ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు.
→ఆస్ట్రేలియా - భారత్‌ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (సీఈసీఏ) సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని, ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
→ఇండో-పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో భద్రత అంశంపైనా చర్చించినట్లు వివరించారు.
→ఈ సందర్భంగా క్రీడలు, నూతన ఆవిష్కరణలు, దృశ్య-శ్రవణ ఉత్పత్తులు, సౌర విద్యుత్తు రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి మొత్తం నాలుగు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.
→శుద్ధ ఇంధనం, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సంక్లిష్ట ఖనిజాలు, వలసలు, సరఫరా గొలుసులు, విద్య, సంస్కృతి, క్రీడల్లో మరింత సహకారంపై ప్రధానంగా చర్చించారు.

ముగిసిన జీ20 జీపీఎఫ్‌ఐ సమావేశాలు

→జీ20 సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (జీపీఎఫ్‌ఐ) సమావేశాలు ముగిశాయి.
→జీ20 కో-ఛైర్, జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాల్లో జీ20 దేశాలతో పాటు పలు ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల, జీపీఎఫ్‌ఐ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త కో-ఛైర్‌ ఎంపిక జరిగిందని జీపీఎఫ్‌ఐ తెలిపింది.
→2024 నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ఎస్‌ఎంఈ రుణాలు, డిజిటల్‌ ఆర్థిక సేవలపై చర్చ జరిగిందని పేర్కొంది.

సాగర తీరాల్లో నిరంతర అప్రమత్తత అవసరం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

→భారతదేశం ప్రథమంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్‌ మీద రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నౌకాదళ కమాండర్లతో ద్వైవార్షిక సమావేశం నిర్వహించారు.
→అరేబియా సముద్రంలో లంగరు వేసిన ఈ యుద్ధనౌకపై జరిపిన భేటీలో హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ సంచారం వల్ల ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించారు.
→ఈ సందర్భంగా ఫ్రిగేట్, డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిర్వహించిన భారీ యుద్ధ విన్యాసాలను రాజ్‌నాథ్‌ వీక్షించారు. తూర్పు, పశ్చిమ నౌకాదళ విభాగాలు ఇందులో పాల్గొన్నాయి.
→ఈ సందర్భంగా నౌకాదళం కోసం నిర్మించిన రెండు తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్‌సీఏ) విక్రాంత్‌పై ఒడుపుగా దిగాయి.
→డిసెంబరు నుంచి ట్రాపెక్స్‌ పేరుతో జరుగుతున్న అతిపెద్ద నౌకా విన్యాసాలు ఈ కవాతుతో ముగిశాయి.

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 378 ఒప్పందాలు

→ఏపీ ప్రభుత్వం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. ఈ సదస్సులో మొత్తం రూ.13,41,734 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 378 ఒప్పందాలు చేసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
→ తొలిరోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు 92 ఎంఓయూలు, రెండో రోజు రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులకు 286 ఎంఓయూలు చేసుకున్నట్టు వెల్లడించింది. అత్యధికంగా పర్యాటక రంగంలో 117 ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపింది. రెండు రోజుల సదస్సులో ముకేశ్‌ అంబానీ, కరణ్‌ అదానీ, నవీన్‌ జిందాల్, అర్జున్‌ ఒబెరాయ్, కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, గ్రంధి మల్లికార్జునరావు, ప్రీతారెడ్డి, హరిమోహన్‌ బంగూర్, సతీష్‌రెడ్డి తదితర పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు.
→ రెండో రోజు పెట్టుబడుల సదస్సులో రిలయన్స్‌ సంస్థ రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హెచ్‌పీసీఎల్‌ ఎనర్జీ రూ.14.3 కోట్లతో ఒక ఒప్పందం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.22 కోట్లతో 2 ఒప్పందాలు, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ రూ.20 కోట్లతో 2 ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించింది.
→ సదస్సు వేదికగా రూ.3,841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటిక్, లారస్‌ ల్యాబ్స్, హేవెల్స్‌ ఇండియా, శారదా మెటల్స్, అల్లాయిస్‌ కంపెనీలు ప్రారంభించిన వాటిలో ఉన్నాయి.

ఉగ్రవాద జాబితాను రాజకీయం చేయొద్దు

→ఉగ్రవాదం విషయంలో చైనా అనుసరిస్తున్న ధోరణిని భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల ‘క్వాడ్‌’ కూటమి తీవ్రంగా తప్పుపట్టింది.
→డ్రాగన్‌ పేరు ప్రస్తావించకుండా తీవ్రవాదంపై ఆ దేశం అనుసరిస్తున్న తీరును పరోక్షంగా ఎండగట్టింది.
→భారత్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ నేతృత్వంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, యోషిమాసా హయాషి, పెన్నీ వాంగ్‌ సమావేశమయ్యారు.
→అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని పేర్కొన్నారు.
→అయితే ఈ సారి క్వాడ్‌ ఎజెండాలో ఉగ్రవాదం కూడా చేరింది.

విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభం

→పెట్టుబడిదారుల సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 340 ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌) ప్రారంభమైంది.
→సదస్సు మొదటి రోజు రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంఓయూలు, రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్, అదానీ, ఆదిత్య బిర్లా, రెన్యూ పవర్, అరబిందో, డైకిన్, ఎన్టీపీసీ ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలీస్, శ్రీ సిమెంట్స్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు, ఇప్పటికే ఉన్న పరిశ్రమల్ని విస్తరించేందుకు ముందుకు రావడం శుభపరిణామమని సీఎం అన్నారు. ‘పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చే వారికి అనువైన వాతావరణం కల్పించేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. మీకు ఎప్పుడు, ఎలాంటి సహకారం అవసరమైనా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలోనే ఉంటాం’ అని హామీ ఇచ్చారు.

ప్రపంచ సంస్థలు విఫలమయ్యాయ్‌.. ఐక్యతతో ముందుకెళ్లాలి

→ఆర్థిక సంక్షోభాలను, ఉగ్రవాదాన్ని, మహమ్మారులను నిరోధించడంలో ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలు విఫలమయ్యాయని, ఈ పరిస్థితుల్లో ఐక్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని జీ-20 విదేశాంగ మంత్రుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
→అయినా జీ-20 అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి దేశ రాజధాని దిల్లీలో భారత్‌ నిర్వహించిన ఈ రెండు రోజుల సదస్సులో చివరి రోజునన సయోధ్య కుదరలేదు.
→ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది. అధ్యక్ష హోదాలో అన్ని పక్షాలతో మాట్లాడి ఒప్పించేంద]ుకు భారత్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
→ఉమ్మడి ప్రకటనలో యుద్ధ ప్రస్తావనకు అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు ఒత్తిడి చేసినప్పటికీ రష్యా, చైనాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
→దీంతో జీ-20 అధ్యక్ష హోదాలో సంక్షిప్త ప్రకటనను మాత్రమే భారత్‌ వెలువరించింది. వివిధ పక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. రాజీ కుదర్చలేకపోయాం.
→అన్ని అంశాలపైనా సమావేశం సరిగ్గా స్పందించి ఉంటే ఉమ్మడి ప్రకటన విడుదలయ్యేదని భారత్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు.
→అయితే బహుళత్వాన్ని బలపరచడం, ఆహార, ఇంధన భద్రతను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు.
→సదస్సులో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా తదితర జీ-20 సభ్యులతో పాటు ఆహ్వానితులుగా 20 దేశాలు పాల్గొన్నాయి.

ఆయుధ దిగుమతుల్లో భారత్‌ నంబర్‌-1

→ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్‌ కొనసాగుతోంది. అయితే 2013 - 17తో పోల్చినప్పుడు 2018 - 22లో ఈ దిగుమతులు 11 శాతం మేర తగ్గాయి. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్టత, భిన్న సరఫరాదారుల నుంచి సమీకరణకు ప్రయత్నాలు, స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటివి ఈ తగ్గుదలకు కారణం. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) తన తాజా నివేదికలో ఈ మేరకు పేర్కొంది. 2018 - 22లో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు ఉన్నాయి. సిప్రీ నివేదిక ప్రకారం:-
→ ప్రపంచంలోనే 8వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పాకిస్థాన్‌ ఉంది. 2018 - 22 కాలంలో ఆ దేశ అస్త్ర దిగుమతులు 14 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా చైనా నుంచి వీటిని కొంటోంది.
→ 2013 - 17తో పోల్చినప్పుడు 2018 - 22లో ఫ్రాన్స్‌ ఆయుధ ఎగుమతులు 44 శాతం పెరిగాయి.
→ 2018 - 22లో ఫ్రాన్స్‌ ఆయుధ ఎగుమతుల్లో 30 శాతాన్ని భారత్‌ అందుకుంది. దీంతో అమెరికాను తోసిరాజని మన దేశానికి రెండో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఫ్రాన్స్‌ నిలిచింది. మొదటి స్థానంలో రష్యా ఉంది. అయితే ఆ దేశం నుంచి భారత్‌కు అందుతున్న అస్త్రాలు క్రమంగా తగ్గుతున్నాయి.
→ అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో రష్యా ఎగుమతులు తగ్గుతుండగా ఫ్రాన్స్‌ వాటా పెరుగుతోంది. 2018 - 22లో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 33 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. రష్యా వాటా 22 నుంచి 16 శాతానికి తగ్గింది.
→ 2021 చివరి వరకూ ఉక్రెయిన్‌ ఆయుధ దిగుమతులు చాలా స్వల్పం. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ దేశంపై రష్యా యుద్ధానికి దిగడంతో పరిస్థితి మారిపోయింది. 2022లో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్‌ నిలిచింది.

జీవన్మృతుల అవయవ దానంలో తెలంగాణ అగ్రగామి

→జీవన్మృతుల అవయవ దానం, అవయవాల మార్పిడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.
→ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్‌ ఆర్గాన్, టిష్యు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సంస్థ నివేదికను విడుదల చేసింది.
→అందులో 2022వ సంవత్సరంలో జీవన్మృతుల (బ్రెయిన్‌ డెడ్‌) అవయవ దానంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
→గత ఏడాది తెలంగాణలో 194 మంది జీవన్మృతుల అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయగా తర్వాత స్థానంలో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి.
→అలాగే జీవన్మృతుల నుంచి తీసుకున్న అవయవాల మార్పిడిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. వీరి నుంచి 655 అవయవాలను ఇతరులకు మార్పిడి చేసి తొలి స్థానంలో నిలిచింది.
→తర్వాత స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నట్లు పేర్కొంది.

ఏడు జాతీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.2,172 కోట్ల ఆదాయం: ఏడీఆర్‌

→దేశంలోని ఏడు జాతీయ పార్టీలకు 2021 - 2022లో తెలియని మూలాలు, ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) పేర్కొంది.
→పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం తెలియని మూలాల నుంచి అందినట్లు తెలిపింది.
→2021 - 22లో భాజపా, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలకు మొత్తంగా తెలియని మూలాల నుంచి రూ.2,172 కోట్లు సమకూరాయని వెల్లడించింది.
→తెలియని మూలాల నుంచి వచ్చిన మొత్తంలో 83.41 శాతం (రూ.1,811.94 కోట్లు) ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారానే వచ్చిందని ఏడీఆర్‌ వివరించింది.
→అదే ఆర్థిక సంవత్సరంలో గుర్తు తెలియని వనరుల నుంచి భాజపాకు రూ.1,161కోట్లు వచ్చాయని ఇది ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన ఆదాయంలో 53.45 శాతమని వివరించింది.
→గుర్తు తెలియని మూలాల నుంచి టీఎంసీకి రూ.528 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్‌ తెలిపింది.
→ఎలక్టోరల్‌ బాండ్లు, కూపన్ల విక్రయం, రిలీఫ్‌ ఫండ్, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు/మోర్చాల ద్వారా విరాళాలు వంటివి తెలియని మూలాల నుంచి వచ్చే ఆదాయం జాబితాలో ఉన్నాయి.

2030 నాటికి భారత్‌లో కర్బన ఉద్గారాల తగ్గుముఖం

→భారత్‌లో కర్బన ఉద్గారాలు ప్రస్తుత ఏడాదితో పోలిస్తే 2030 నాటికి సుమారు మూడో వంతు తగ్గుతాయని ఐఎంఎఫ్‌కు చెందిన ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. ‘పునరుత్పాదక ఇంధన వనరులపై ఇస్తున్న రాయితీలు, బొగ్గుపై విధిస్తున్న అధిక సుంకాలే ఇందుకు కారణం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ రెండు విధానాల ఫలితంగా బొగ్గు దిగుమతులు 14% తగ్గుతాóు. ఫలితంగా ఇంధన ధరలు, ఇంధన భద్రతకు అవకాశం లభిస్తుంది. ప్యారిస్‌ ఒప్పందం అమలులో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్‌ గణనీయమైన ప్రగతిని సాధించింది. అయితే గ్రీన్‌హౌస్‌ వాయువులు 40% పెరుగుతాయి. పేదరిక నిర్మూలన, ఇంధన భద్రత సాధించడానికి స్వల్పకాలిక ఉద్గారాల పెరుగుదల అవసరమే.
→ ప్రస్తుత విధానాలను ఇలాగే కొనసాగిస్తే 2070 నాటికి శూన్య ఉద్గారాల లక్ష్య సాధన సాధ్యమే. ప్రత్యామ్నాయ ఇంధనాలపై రాయితీని క్రమంగా పెంచడం, దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కాలుష్య ప్రభావాన్ని తగ్గించవచ్చు. పెరుగుతున్న విద్యుత్తు అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఆలంబనగా చేసుకోవాలి. శిలాజ ఇంధనాలతో తయారయ్యే విద్యుత్తు 50 శాతానికి పెరగకుండా చూసుకోవాలి. ఈ విధానంతో వినియోగదారులు అధిక పన్నులు చెల్లిస్తుండటంతో స్థూల వాస్తవ జాతీయాదాయం స్వల్పంగా తగ్గుతుంది. అయితే ఈ విధానం ద్వారా సానుకూల ఫలితాలు వచ్చే వరకూ పేద పౌరులను ఆదుకోవడానికి కేటాయింపులు పెరుగుతాయి. అదే సమయంలో ఉద్గారాలు తగ్గితే 2.5% కాలుష్యం తగ్గుతుంది. ఇది ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. ఆరోగ్యం మెరుగుపడి పిల్లలు పాఠశాలలకు, పెద్దలు పనులకు వెళ్లడం పెరుగుతుంది. బొగ్గు దిగుమతులు 14% తగ్గుతాయి. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణతో పాటు ఇంధన భద్రత పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది.

బియ్యం ఉత్పత్తిలో కొత్త రికార్డు!

→దేశ చరిత్రలోనే అత్యధికంగా 2022 - 23లో 13.05 కోట్ల టన్నుల బియ్యం మార్కెట్లకు వస్తాయని భారత అర్థ, గణాంక శాఖ (డీఈఎస్‌) తాజా నివేదికలో వెల్లడించింది.
→గత ఖరీఫ్‌ (వానాకాలం)లో తగ్గినా, ప్రస్తుత రబీ (యాసంగి)లో పుంజుకొని వరి దిగుబడులు పెరగడంతో ఆ ప్రకారం బియ్యంలో కొత్త రికార్డు నమోదు కానుంది.
→గత ఏడాది 12.94 కోట్ల టన్నులు కాగా అప్పటికది రికార్డు. 2016 - 17 నుంచి ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
→మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి సైతం 32.35 కోట్ల టన్నులు దాటే అవకాశముందని, ఇది మరో రికార్డని ప్రకటించింది.
→ఇప్పటివరకు 2021 - 22లో 31.56 కోట్ల టన్నులు రికార్డుగా ఉండగా ఈసారి మరో 79 లక్షల టన్నులు పెరుగుతాయని ఈశాఖ అంచనా వేసింది.
→దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పంట కోత ప్రయోగాలను నిర్వహించి డీఈఎస్‌ దిగుబడులపై ఏటా నాలుగుసార్లు నివేదికలు విడుదల చేస్తుంది.
→అందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన ముందస్తు అంచనాల నివేదికను వెల్లడించింది.
→అయితే ఈ దిగుబడి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 32.80 కోట్ల టన్నుల లక్ష్యం కన్నా తక్కువ కావడం గమనార్హం.

లైంగిక విద్యపై కేవలం 20 దేశాల్లోనే చట్టాలు, 39 దేశాల్లో జాతీయ విధానం

→ప్రపంచంలో 20 శాతం దేశాలే లైంగిక విద్యపై చట్టాలు చేశాయని యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ నివేదిక వెల్లడించింది.
→39 శాతం దేశాలు దానిని జాతీయ విధానంగా పేర్కొన్నాయంది.
→68 శాతం దేశాల్లో ప్రాథమిక స్థాయిలో, 76 శాతం దేశాల్లో ప్రాథమికోన్నత విద్య స్థాయిలో లైంగిక విద్య తప్పనిసరిగా ఉండాలని సూచించింది.
→10 దేశాల్లోని ఆరింట లింగాధారిత నియమాలు, లైంగిక, గృహ హింస, లింగాధార హింస వంటివి బోధనాంశాలుగా ఉన్నాయని తెలిపింది.
→రెండింట ఓ దేశంలో పరస్పర అంగీకార భావనలను, మూడింట రెండొంతుల దేశాల్లో గర్భనిరోధక సంగతులను వివరిస్తున్నారని నివేదిక తెలిపింది.
→సంబంధాలకు, లైంగికతకు మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోకపోతే బాల్యం నుంచి యుక్త వయసుకు పెరిగేకొద్ది వాటిపై వారి మదిలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది.
→మొత్తం మీద లైంగిక విద్య తప్పనిసరని తేల్చింది. అయితే చాలా దేశాల్లో ఈ విద్యకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
→సమగ్ర లైంగిక విద్య (సీఎస్‌ఈ) లైంగికత విద్యపై అవగహన కల్పిస్తుంది. సీఎస్‌ఈ ప్రణాళికలో భావోద్వేగ, శారీరక, సామాజికపరమైన అంశాలు గురించి బోధించడం, నేర్చుకోవడం ఉంటుంది.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ భారత్‌ సొంతం

→ వరుసగా నాలుగో సారి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.
→ తొలి రెండు టెస్టుల్లో భారత్‌ నెగ్గగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.
→ అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.
→ భారత్‌ గత మూడు సిరీస్‌ల్లోనూ ఆస్ట్రేలియాను 2-1తో ఓడించడం విశేషం.
→ 2017లో సొంతగడ్డపై నెగ్గిన టీమ్‌ఇండియా, 2018 - 19, 2020 - 21లో ఆస్ట్రేలియాలో ఆడి పైచేయి సాధించింది.

జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కీర్తనకు స్వర్ణం

→జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) క్రీడాకారిణి కీర్తన (పాలకుర్తి) మెరిసింది.
→బాలికల స్టీపుల్‌ ఛేజ్‌లో కీర్తన (7 నిమిషాల 22.55 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది.
→బాలికల 1000 మీటర్ల స్ప్రింట్‌ మెడ్లేలో సత్తాచాటిన తెలంగాణ జట్టు (2ని 18.95 సె) బంగారు పతకం గెలుపొందింది.
→ శైలజ, శ్రుతి (దిండి), సాయి సంగీత (హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌), సింధు (మన్ననూరు) తెలంగాణ తరఫున బరిలో దిగి జట్టును అగ్రస్థానంలో నిలిపారు.
→ బాలుర 2000 మీ. స్టీపుల్‌ ఛేజ్‌లో చంద్రశేఖర్‌ (6ని 2.35 సె - రాజాపేట) కాంస్య పతకం సాధించాడు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌లో పృథ్వీరాజ్‌కు కాంస్యం

→ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌ పురుషుల ట్రాప్‌లో భారత షూటర్‌ పృథ్వీరాజ్‌ తొండైమన్‌ కాంస్యం గెలుచుకున్నాడు.
→ఫైనల్లో అతడి 20 షాట్లు లక్ష్యాన్ని తగిలాయి. తుజున్‌ ఒగుజాన్‌ (టర్కీ) స్వర్ణం, మాథ్యూ కొవార్డ్‌ - హోలీ రజతం గెలుచుకున్నారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు షాన్‌ మార్ష్‌ వీడ్కోలు

→ఆస్ట్రేలియా సీనియర్‌ ఓపెనర్‌ షాన్‌ మార్ష్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు దూరం అయిన అతను సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి పూర్తిగా తప్పుకొన్నాడు.
→39 ఏళ్ల షాన్‌ మార్ష్‌ చివరగా 2019లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఆఖరి వన్డే కూడా ఆడింది కూడా ఆ ఏడాదే.
→2016 తర్వాత షాన్‌ ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో ప్రాతినిధ్యం వహించలేదు. అతను ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో మాత్రం కొనసాగనున్నాడు.
→38 టెస్టుల్లో 2,265 పరుగులు చేసిన షాన్‌ 73 వన్డేల్లో 2,773.. 15 టీ29ల్లో 255 పరుగులు సాధించాడు.
→అతను టెస్టుల్లో 6, వన్డేల్లో 7 శతకాలు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో షాన్‌ 183 మ్యాచ్‌ల్లో 12,032 పరుగులు సాధించాడు. అందులో 32 శతకాలున్నాయి.

ఇండియా ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతికకు స్వర్ణం

→ఇండియా ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ (గోపీచంద్‌ మైత్రా) స్వర్ణ పతకంతో సత్తాచాటింది.
→మహిళల 400 మీటర్ల పరుగును జ్యోతిక 53.26 సెకన్లలో ముగించి అగ్రస్థానం కైవసం చేసుకుంది. సీనియర్‌ విభాగంలో జ్యోతికకు ఇదే మొదటి టైటిల్‌.

దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్‌గా మార్‌క్రమ్‌

→దక్షిణాఫ్రికా టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ మార్‌క్రమ్‌ నియమితుడయ్యాడు.
→టెస్టు సారథ్యం చేపట్టేందుకు టెంబా బవుమా ఇటీవలే టీ20 కెప్టెన్సీని వదులుకోగా అతడి స్థానంలోకి మార్‌క్రమ్‌ వచ్చాడు.
→టీ20ల అనంతరం జరిగే వన్డే సిరీస్‌లో మాత్రం బవుమానే జట్టును నడిపిస్తాడు. మాజీ ఆటగాడు జేపీ డుమిని సఫారీ జట్టుకు పూర్తి స్థాయి బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. మార్‌క్రమ్‌ ఇటీవలే ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సారథిగా ఎంపికైన సంగతి తెలిసిందే.

రెస్ట్‌దే ఇరానీ కప్‌

→ రెస్టాఫ్‌ ఇండియా ఇరానీ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. 2022 రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌ను చిత్తుచేసి ఇరానీ కప్‌ను నిలబెట్టుకుంది.
→ ముగింపు మ్యాచ్‌లో రెస్ట్‌ 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది.
→ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

సంతోష్‌ ట్రోఫీ విజేత కర్ణాటక

→సంతోష్‌ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్‌బాల్‌ టోర్నీలో విజేతగా నిలిచింది.
→ఫైనల్లో కర్ణాటక 3-2తో మేఘాలయపై విజయం సాధించింది.
→సునీల్‌ కుమార్‌ (3వ నిమిషం), బెకి ఓరమ్‌ (20వ), రాబిన్‌ యాదవ్‌ (44వ) కర్ణాటక తరఫున గోల్స్‌ నమోదు చేశారు.

భారత హాకీ కోచ్‌గా ఫుల్టన్‌

→భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌గా క్రెయిగ్‌ ఫుల్టన్‌ (దక్షిణాఫ్రికా) నియమితుడయ్యాడు.
→శిక్షణలో 25 ఏళ్ల అనుభవమున్న ఫుల్టన్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.
→సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో కోచ్‌ పదవికి గ్రాహమ్‌ రీడ్‌ రాజీనామా చేశాడు.
→జట్టు విశ్లేషణ కోచ్‌ గ్రెగ్‌ క్లార్క్, సైంటిఫిక్‌ సలహాదారు మిచెల్‌ పెంబర్టన్‌ కూడా తప్పుకున్నారు.
→టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ చరిత్రాత్మక కాంస్య పతకం సాధించడంలో రీడ్‌ కీలకపాత్ర పోషించాడు.
→2014 నుంచి 2018 వరకు ఫుల్టన్‌ ఐర్లాండ్‌ పురుషుల జట్టు కోచ్‌గా వ్యవహరించాడు.
→2016 రియో ఒలింపిక్స్‌కు ఐర్లాండ్‌ అర్హత సాధించడం ఫుల్టన్‌ అతిపెద్ద ఘనత. ఒలింపిక్స్‌ హాకీకి ఐర్లాండ్‌ అర్హత సాధించడం వందేళ్లలో అదే తొలిసారి.
→దీంతో 2015 సంవత్సరానికి గాను ‘ఎఫ్‌ఐహెచ్‌ కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ఫుల్టన్‌ను వరించింది. టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత బెల్జియం జట్టుకు ఫుల్టన్‌ సహాయక కోచ్‌గా వ్యవహరించాడు.
→దక్షిణాఫ్రికా తరఫున పదేళ్ల కెరీర్‌లో ఫుల్టన్‌ 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

ఏసీఎఫ్‌ మేటి ఆటగాడిగా గుకేశ్‌

→భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ ఆసియా చెస్‌ సమాఖ్య (ఏసీఎఫ్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
→నిరుడు మహాబలిపురంలో జరిగిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌లో రికార్డు స్కోరు (9/11)తో స్వర్ణం సాధించిన 16 ఏళ్ల గుకేశ్‌ను ఈ అవార్డు వరించింది.
→గత ఏడాది మార్చిలో గుకేశ్‌ 2700 ఎలో రేటింగ్‌ సాధించిన భారత ఆరో క్రీడాకారుడిగా ఘనత అందుకున్నాడు.
→అత్యంత పిన్న వయసులో భారత్‌ తరఫున 2700 పైచిలుకు ఎలో రేటింగ్‌ సాధించిన గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించాడు.
→అఖిల భారత చెస్‌ సంఘం (ఏఐసీఎఫ్‌) ‘అత్యంత చురుకైన సమాఖ్య’ అవార్డును గెలుచుకుంది.
→2022 ఆగస్టులో చెస్‌ ఒలింపియాడ్‌కు విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ గౌరవం దక్కింది.
→చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం సాధించిన భారత్‌కు ‘ఉత్తమ మహిళల జట్టు’ అవార్డు లభించింది.
→గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.బి.రమేశ్‌ (పురుషులు), గ్రాండ్‌మాస్టర్‌ అభిజిత్‌ కుంతే (మహిళలు)లు ‘కోచ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులు గెలుచుకున్నారు.

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మస్కట్‌ ‘శక్తి’ ఆవిష్కరణ

→మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మస్కట్‌ ‘శక్తి’ని బీసీసీఐ ఆవిష్కరించింది.
→బ్యాట్‌ పట్టుకుని, హెల్మెట్‌ పెట్టుకుని ఆడ పులి ఆకారంలో మైదానంలో షాట్లు ఆడుతూ శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ మస్కట్‌ పరిచయ వీడియోను బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌లో పోస్టు చేశాడు.
→ ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌ కోసం ‘యే తో బస్‌ షురువాత్‌ హై’ అంటూ సాగే నేపథ్య గీతాన్ని బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సీఐఎస్‌ఎఫ్‌ 54వ ఆవిర్భావ దినోత్సవం (రైజింగ్‌ డే)

→దేశ ఆర్థిక వ్యవస్థ అయిదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలనే ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాధించడంలో విమానాశ్రయాలు, ఓడ రేవులు, పారిశ్రామిక సంస్థల భద్రత ఎంతో ముఖ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.
→ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కేంద్ర పారిశ్రామిక భద్రత సంస్థ (సీఐఎస్‌ఎఫ్‌)ది కీలకపాత్ర అని వెల్లడించారు.
→వేర్పాటువాదం, ఉగ్రవాదం, జాతి వ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
→హైదరాబాద్‌ హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ కేంద్రంలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో నిర్వహించిన సీఐఎస్‌ఎఫ్‌ 54వ ఆవిర్భావ దినోత్సవం (రైజింగ్‌ డే)లో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
→ఈ సంద‌ర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ సెంటినల్‌ - 2023 పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ప్రపంచ ఊబకాయ దినోత్సవం 2023

→ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది.
→ఇప్పటి పరిస్థితులే కొనసాగితే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఊబకాయం బారినపడే ప్రమాదముందని తాజా అధ్యయనం వెల్లడించింది.
→వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌ (డబ్ల్యూవోఎఫ్‌) ప్రపంచ ఊబకాయ దినాన్ని (మార్చి 4) పురస్కరించుకొని ‘వరల్డ్‌ ఒబేసిటీ అట్లాస్‌ - 2023’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ చేదునిజాన్ని వెల్లడించింది.
→భారత్‌ విషయానికొస్తే.. 2020 నుంచి 2035 మధ్య 5.2 శాతం వార్షిక పెంపుదలతో రానున్న 12 ఏళ్లలో స్థూలకాయుల సంఖ్య 11 శాతం వరకు పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.
→2020లో 3 శాతం మంది భారత బాలల్లో ఊబకాయ సమస్య ఉండగా 2035 నాటికి ఇది 12 శాతానికి చేరనుంది.
→అలాగే బాలికల్లో 2020లో 2 శాతం ఉన్న ఈ సమస్య 7 శాతానికి, మహిళల్లో 7 నుంచి 13కు, పురుషుల్లో 4 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.
→ స్థూలకాయ సమస్య 2035 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై రూ.3,53,41,488 కోట్లకు (4.32 ట్రిలియన్‌ డాలర్లు) పైగా ప్రభావం చూపనుందని డబ్ల్యూవోఎఫ్‌ పేర్కొంది.
→ప్రపంచ జీడీపీలో ఇది సుమారు మూడు శాతంతో సమానం. భారత జాతీయ జీడీపీపై 1.8 శాతం మేర దీని ప్రభావం ఉంటుంది.

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కె.రామలక్ష్మీ ఆరుద్ర మరణం

→ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కె. రామలక్ష్మీ (92) మలక్‌పేట ఆస్మాన్‌గఢ్‌ శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లోని తమ నివాసంలో మరణించారు.
→రామలక్ష్మీ కాకినాడ జిల్లా కోటనందూరులో 1930 డిసెంబరు 31న జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని స్టెల్లా మారిస్‌ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు.
→తెలుగు, తమిళం, ఆంగ్లం, హిందీ భాషలపై పట్టున్న రామలక్ష్మీ 1951 నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించారు.
→1954లో ఆరుద్రతో వివాహం జరిగింది. మానవశాస్త్రం, మానవ సంబంధాలపై ప్రొఫెసర్‌ యు.ఆర్‌. ఎబ్రెన్‌ఫెల్స్‌ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు.
→ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు ఆధ్వర్యంలోని ‘స్వతంత్ర’ పత్రికలో ఆంగ్ల విభాగానికి ఉప సంపాదకురాలిగా చేశారు.
→వివాహమైన తరువాత ‘రామలక్ష్మీ ఆరుద్ర’ అనే కలం పేరుతోనూ రచనలు చేశారు.
→పరిశోధన, వ్యాసం, చిన్న కథలు, నవలలు, బాల సాహిత్య రచనల్లో ఆమె నిష్ణాతులు. జీవనజ్యోతి చిత్ర కథారచనకు నంది అవార్డు అందుకున్నారు.
→ఆమెకు 1957లో గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం లభించింది. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డును జమీన్‌రైతు వారపత్రిక అందజేసింది.
→‘నన్ను వెళ్లిపోనీరా’ నవలకు 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకున్నారు.
→1997లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ‘సమాజానికి సాహిత్య-సామాజిక సహకారం’పై గౌరవ డి.లిట్‌ను పొందారు. 1998లో రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు.

మాజీ సీజేఐ జస్టిస్‌ అహ్మది మరణం

→సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అజీజ్‌ ముషబ్బీర్‌ అహ్మది (90) దక్షిణ దిల్లీలో మరణించారు. ఆయన సూరత్‌లో జన్మించారు.
→1994 అక్టోబరు 25న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అయ్యారు. 1997 మార్చి 24 వరకు ఆ హోదాలో సేవలందించారు.
→అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి రెండుసార్లు కులపతిగా ఉన్నారు.

రక్షణ - పారిశ్రామిక అవసరాలకు రోబో

→దేశ రక్షణ అవసరాలతో పాటు, పరిశ్రమల్లోనూ వినియోగించేందుకు వీలుగా చతుర్భుజ (క్వాడ్రప్‌డ్‌) రోబోను అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన స్వయ రోబోటిక్స్‌ వెల్లడించింది.
→డీఆర్‌డీఓ ల్యాబ్స్‌ - రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (పుణె), బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రోమెడికల్‌ లేబోరేటరీ (బెంగళూరు) సాంకేతిక భాగస్వామ్యంతో ఈ రోబోను రూపొందించినట్లు వెల్లడించింది.
→సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ దేశీయ సంస్థలకు రోబోల తయారీలో అవసరమైన సాంకేతికతను డీఆర్‌డీఓ అందిస్తోందని పేర్కొన్నారు.
→ఈ చతుర్భుజి రోబో కఠిన భూభాగాల్లో పనిచేస్తుందని, రిమోట్‌ నిఘా, మానవులకు సాధ్యం కాని ప్రదేశాలకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
→సైనికులు ఎక్కువ దూరం నడిచేటప్పుడు అలసిపోకుండా, బరువులు ఎత్తేటప్పుడు అధిక శ్రమ లేకుండా ప్రత్యేకంగా ఎక్సో-స్కెలిటన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

కార్చిచ్చుతో ఓజోన్‌ పొరకు పొగ

→గత కొన్నేళ్లలో చెలరేగిన కార్చిచ్చుల నుంచి ఉత్పన్నమైన పొగ రేణువులు భూమి చుట్టూ ఉన్న ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది.
→సూర్యుడి నుంచి వచ్చే హానికర రేడియోధార్మికత నుంచి జీవులను ఈ పొర రక్షిస్తుంది. ఇప్పటికే ఏర్పడ్డ నష్టం నుంచి అది కోలుకుంటోందని, దాన్ని పొగ రేణువులు దెబ్బతీస్తున్నాయని తెలిపింది.
→అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
→అధ్యయనంలో భాగంగా 2019 డిసెంబరు నుంచి 2020 జనవరి మధ్య తూర్పు ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న భారీ కార్చిచ్చుపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
→ఆ ప్రమాదంలో వేల ఎకరాల్లో అడవులు కాలి బూడిదయ్యాయి. దీనివల్ల వాతావరణంలోకి 10 లక్షల టన్నుల పొగ వెలువడింది.
→దానికి సంబంధించిన రేణువులు భూమి చుట్టూ ఉన్న స్ట్రాటో ఆవరణంలో ఏడాదికిపైగా పాగా వేసే అవకాశం ఉందని తేల్చారు.
→అవి ఒక కొత్తరకం రసాయన చర్యను కలిగిస్తున్నాయని, అవి ఓజోన్‌ పొరకు నష్టం కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
→దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ఎగువన ఓజోన్‌ పొరలో 3-5 శాతం మేర క్షీణతకు ఈ రసాయన చర్య కారణమైందన్నారు.
→ఈ కార్చిచ్చు ప్రభావం ధ్రువ ప్రాంతాలపైనా పడిందని తేల్చారు. అంటార్కిటికాపై ఓజోన్‌ పొరలో ఏర్పడ్డ రంధ్రాన్ని కొంచెం పెద్దగా చేసినట్లు వారు పేర్కొన్నారు.

నిద్ర సమస్యలతో తీవ్ర మతిమరుపు ముప్పు

→నిద్రలేమికి తీవ్ర మతిమరుపు (డిమెన్షియా)నకు మధ్య గట్టి సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు.
→కునుకు కోసం మందులు వాడాల్సి రావడం, త్వరగా నిద్రలోకి జారుకోలేకపోవడం వంటి సమస్యలున్నవారు తదుపరి పదేళ్లలో తీవ్ర మతిమరుపు బారినపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→అకస్మాత్తుగా మెలకువ వచ్చాక తిరిగి రెప్పలు మూతపడటం కష్టమయ్యేవారికి మాత్రం ఈ వ్యాధి ముప్పు తక్కువని తేల్చారు.
→అమెరికాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
→ఇందుకోసం వారు 2011 నుంచి 2020 మధ్య ‘నేషనల్‌ హెల్త్‌ అండ్‌ ఏజింగ్‌ ట్రెండ్స్‌ స్టడీ’ (ఎన్‌హెచ్‌ఏటీఎస్‌)లో సేకరించిన డేటాను విశ్లేషించారు.
→ప్రస్తుతం డిమెన్షియాకు చికిత్స లేదు. మందులతో దీన్ని తగ్గించడానికి ఇటీవల జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
→అందువల్ల దీన్ని నివారించడమే తరుణోపాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్ర సమస్యలను గుర్తించి, వాటికి అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డిమెన్షియా ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు.

మూత్రాశయ క్యాన్సర్‌ను 12 ఏళ్ల ముందే గుర్తించొచ్చు

→చిన్నపాటి మూత్ర పరీక్ష ద్వారా దాదాపు 12 ఏళ్ల ముందే మూత్రాశయ క్యాన్సర్‌ను గుర్తించొచ్చని ఫ్రాన్స్, ఇరాన్, యునైటెడ్‌ స్టేట్స్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కనుగొన్నారు.
→సాధారణ రోగ నిర్ధారణ పరీక్షల కన్నా ముందే ఇది వ్యాధిని పసిగడుతుందని వారు పేర్కొన్నారు. మూత్రాశయ క్యాన్సర్‌ లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. కొన్నేళ్ల పాటు బయటపడవు.
→చాలా సాధారణంగా కనిపించే లక్షణం మూత్రంలో రక్తం. ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఖరీదైన సిస్టోస్కొపీ వంటి విధానాలను ప్రయోగించాల్సి ఉంటుంది.
→ఇందుకోసం మూత్రాశయంలోకి కెమెరాను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
→ఈ ఇబ్బందులేమీ లేకుండా చిన్నపాటి పరీక్షతో చాలా ముందుగా ఈ వ్యాధిని గుర్తించొచ్చా అన్నది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పరిశీలించారు.
→గతంలో వీరు మూత్రాశయ క్యాన్సర్‌ బాధితుల్లోని జన్యు ఉత్పరివర్తనాలను గుర్తించారు. అందులో పది జన్యువుల్లోని మార్పులు చాలా కీలకమైనవని తాజాగా గమనించారు.
→వీటిని అమెరికాలోని కన్వర్జెంట్‌ జీనోమిక్స్‌ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు యూరోయాంప్‌ టెస్ట్‌ అనే మూత్ర పరీక్ష సాయంతో పసిగట్టవచ్చా అన్నది పరిశీలించారు.
→ఈ పరీక్షలో 60 జన్యువుల్లోని ఉత్పరివర్తనాలను గుర్తించొచ్చు.
→ఒక అధ్యయనం కోసం టెహ్రాన్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో దాదాపు 50 వేల మంది నుంచి సేకరించిన మూత్ర నమూనాలపై ఈ విధానాన్ని ప్రయోగించారు.
→కొన్నేళ్ల తర్వాత వారిలో మూత్రాశయ క్యాన్సర్‌ వచ్చిందా అన్నది పరిశీలించారు. మూత్ర పరీక్షలో నిర్దిష్ట జన్యు ఉత్పరివర్తనాలు ఉన్నట్లు వెల్లడైన అనేక మందిలో ఈ క్యాన్సర్‌ తలెత్తినట్లు తేల్చారు.

పరిమితికి మించిన ఓజోన్‌తో గుండెజబ్బులు

→వాతావరణంలో ఓజోన్‌ వాయువుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి దాటిపోతే గుండె జబ్బులు, పక్షవాతం, గుండె వైఫల్యం సమస్యలతో ఆసుపత్రి పాలు కావడం ఎక్కువవుతుందని తాజా అధ్యయనం పేర్కొంది.
→అలాగే ఈ వాయువు తక్కువగా ఉన్నా ఇబ్బందికరమేనని తెలిపింది. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావొచ్చని వివరించింది.
→చైనాలోని జియావోటాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మూడేళ్ల పాటు అధ్యయనం చేసి ఈ మేరకు తేల్చారు. వాతావరణ మార్పుల వల్లే ఓజోన్‌ వాయు పరిమాణం పెరుగుతోందని వివరించారు.
→ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. ఓజోన్‌ కాలుష్యం వల్ల ఎక్కువగా వయోధికుల గుండెపైనే ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించారు.
→వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇది పెను సమస్యగా మారుతుందన్నారు.
→సూర్యకాంతి ప్రభావంతో ఇతర కాలుష్య కారకాలు చర్యలు జరపడం వల్ల ఓజోన్‌ కాలుష్యం ఉత్పన్నమవుతుంది.
→ఫొటోకెమికల్‌ పొగ మంచుకు ఇది ప్రధాన కారణం. సూర్యుడి నుంచి వచ్చే హానికారక అతినీలలోహిత కిరణాలను శోషించుకునే ఓజోన్‌ పొరకు ఇది భిన్నం.

రెండు గంటల్లో రక్తశుద్ధి

→మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) చేపట్టిన పరిశోధన కొంత ఉపశమనం కలిగించనుంది.
→పూర్తిగా దేశీయ సాంకేతికతతో పరిశోధకులు పాలి సల్ఫోన్‌ హ్యాలో ఫైబర్స్‌ ఆధారంగా హీమోడయాలసిస్‌ మెంబ్రేన్‌ మాడ్యుల్‌ను అభివృద్ధి చేశారు.
→ప్రస్తుతం జంతువులపై ప్రయోగాల దశలో ఉన్న పరిశోధన.. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంటే డయాలసిస్‌ చికిత్సకు పట్టే సమయం, ఖర్చు సగానికి సగం తగ్గనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
→ రోగి పరిస్థితిని బట్టి డయాలసిస్‌ కొందరికి వారంలో 4 రోజులు చేయించుకోవాల్సి వస్తే, మరికొందరికి రోజూ చేయాల్సి ఉంటుంది.
→ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో డయాలసిస్‌ యంత్రం సాయంతో రోగి రక్తం శుద్ధికి 4 గంటల సమయం పడుతుంది.
→ ఈ సమయంలో ప్రతిసారీ హ్యాలో ఫైబర్‌ డయలైజర్‌ను మార్చాల్సిందే. ఇవన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ఖర్చు ఎక్కువగా ఉంటోంది.
→ రక్తాన్ని శుద్ధి చేసే హీమోడయాలసిస్‌ మెంబ్రేన్‌ను పాలి సల్ఫోన్‌ హ్యాలో ఫైబర్స్‌ ఆధారంగా మాడ్యుల్‌ను ఐఐసీటీ తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసింది.
→ గొర్రె రక్తంతో పరీక్షించి చూడగా విజయవంతంగా శుద్ధి జరిగినట్లు పరిశోధకులు తెలిపారు. ఇందుకోసం జాతీయ జంతు పరిశోధన సంస్థతో ఐఐసీటీ చేతులు కలిపింది.
→ దీంతో రెండు గంటల్లోనే రక్తం శుద్ధి ప్రక్రియ పూర్తవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

తొలిసారిగా రెండు మ‌గ ఎలుక‌ల్లో సంతానోత్ప‌త్తి

→మానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
→తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. భవిష్యత్తులో ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని పొందేందుకు ఈ విధానం దోహదపడే అవకాశాలున్నాయి.
→తాజా పరిశోధనలో భాగంగా జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు తొలుత మగ ఎలుక చర్మ కణాలను తీసుకున్నారు.
→ఇండ్యూస్డ్‌ ప్లూరీపొటెంట్‌ స్టెమ్‌ (ఐపీఎస్‌) కణాలను సృష్టించేందుకు ఆ చర్మ కణాలను మూల కణాల స్థితికి చేర్చారు.
→తర్వాత వాటి నుంచి ‘వై’ క్రోమోజోంను తొలగించారు. ఆ స్థానంలో మరో ‘ఎక్స్‌’ క్రోమోజోంను ప్రవేశపెట్టారు. ఆ కణాలు అండాలుగా తయారయ్యేలా చేశారు.
→అనంతరం ఈ అండాలను మరో ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు. ఈ విధానంలో మొత్తం 600 పిండాలు ఏర్పడ్డాయి.
→వాటిని సరోగేట్‌ ఎలుకలో ప్రవేశపెట్టగా అది ఏడు ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. అవి ఆరోగ్యంగా ఉన్నాయి.
→ఈ ఎలుకలకు జీవశాస్త్రపరంగా రెండు తండ్రి ఎలుకలు (బయోలాజికల్‌ ఫాదర్‌) ఉన్నట్లు భావించొచ్చు.
→మానవ కణాలపైనా ఈ తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడం రాబోయే పదేళ్లలో సాధ్యం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూర్యుడి కంటే ముందే భూమిపై నీరు

→భూమిపై ఉన్న నీరు సూర్యుడి పుట్టుకకు ముందే ఆవిర్భవించి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు.
→భూగ్రహానికి దాదాపు 1,300 కాంతి సంవత్సరాల దూరంలోని ‘వీ883 ఒరైయోనిస్‌’ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ నవజాత గ్రహంపై ఉత్తర చిలీలోని అధునాతన రేడియో టెలిస్కోప్‌ల సాయంతో విస్తృత పరిశోధనలు చేపట్టడం ద్వారా అమెరికా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధారించారు.
→సాధారణంగా వినీలాకాశంలో వాయు-ధూళి మేఘం కూలిపోయినప్పుడు దాని మధ్యలో నక్షత్రం ఉద్భవిస్తుంది.
→మేఘంలోని పదార్థమంతా నక్షత్రం చుట్టూ డిస్క్‌గా ఏర్పడుతుంది. కాలక్రమంలో కొన్ని లక్షల ఏళ్లకు డిస్క్‌ నుంచి తోకచుక్కలు, గ్రహశకలాలు, చివరగా గ్రహాలు ఆవిర్భవిస్తాయి.
→వాయు-ధూళి మేఘాల నుంచి నక్షత్రాలకు, అక్కడి నుంచి తోకచుక్కలకు, ఆపై వాటి నుంచి గ్రహాలకు వివిధ రూపాల్లో జలం చేరుతున్న తీరును వీ883 ఒరైయోనిస్‌ వ్యవస్థపై పరిశోధనల ద్వారా పరిశీలించారు.
→అదే తరహాలో భూమిపైకి నీరు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. వాయు-ధూళి మేఘం నుంచే నక్షత్రాలకు జలం చేరుతుండటంతో సూర్యుడి ఆవిర్భావానికి ముందునాటి నీరే భూమిపైకి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

గాలిని విద్యుత్తుగా మార్చే ఎంజైమ్‌

→శుద్ధ ఇంధన ఉత్పత్తిదారుగా మానవాళికి ఉపయోగపడగల ఓ ఎంజైమ్‌ను ఆస్ట్రేలియా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.
→గాలిని విద్యుత్‌ శక్తిగా మార్చగల సామర్థ్యం దానికి ఉన్నట్లు తేల్చారు. మట్టిలో ఎక్కువగా లభించే మైకోబ్యాక్టీరియం స్మెగ్మాటిస్‌ అనే బ్యాక్టీరియంలో ‘హక్‌’ ఎంజైమ్‌ ఉంటుంది.
→ఇది హైడ్రోజన్‌ వాయువును విద్యుత్‌ ప్రవాహంగా మార్చగలదని పరిశోధకులు తేల్చారు.
→వాతావరణంలో హైడ్రోజన్‌ గాఢత చాలా స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇది మెరుగ్గా పనిచేయగలదని నిర్ధారించారు. సహజసిద్ధ బ్యాటరీగా ‘హక్‌’ను అభివర్ణించారు.
→భవిష్యత్తులో పవన విద్యుత్‌ ఆధారిత పరికరాలను అభివృద్ధి చేసేంద]ుకు ఇది దోహదపడే అవకాశముందని పేర్కొన్నారు.

విజయవంతంగా ఉపగ్రహ ధ్వంసం: ఇస్రో

→భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్‌-1 (ఎంటీ 1)ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇస్రో ప్రకటించింది.
→సుమారు పదేళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహం సాయంత్రం 4.30 నుంచి 7.30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
→అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్‌ మహాసముద్రం పైన గగనతలంలో కాలి బూడిదైంది.
→యునైటెడ్‌ నేషన్స్‌ స్పేస్‌ డెబ్రిస్‌ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్‌కే ఉందని తెలిపారు.
→భూమిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు 2011 అక్టోబరు 12న ఫ్రెంచ్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పంపగా 2021 తర్వాత దీని పనితీరు పూర్తిగా నిలిచిపోయింది.
→చైనా ఉపగ్రహాలు తరచూ భూవాతావరణంలోకి ప్రవేశించి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో భారత ఉపగ్రహాల వల్ల అలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించాలని ఇస్రో లక్ష్యం పెట్టుకుంది.
→గంటకు 27 వేల కి.మీ. వేగంతో కక్ష్యలో తిరుగుతున్న మేఘాను ధ్వంసం చేయడం ద్వారా గతితప్పిన, కాలం చెల్లిన ఉపగ్రహాలను కూల్చేసే సత్తా ఇస్రోకు ఉన్నట్లు స్పష్టమయింది.

గగన్‌యాన్‌ కోసం పారాచూట్ పరీక్షలు

→గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా పారాచూట్ పరీక్షలను చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ ల్యాబరేటరీ పరిధిలో మార్చి 1, 3వ తేదీలలో నిర్వహించామని ఇస్రో తెలిపింది.
→వాహక నౌకలో వ్యోమగాములను పంపించి, వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురావడానికి జరుపుతున్న ప్రయోగాల్లో భాగంగా రెండు పైలట్ పారాచూట్లను పరీక్షించారు.
→ఒకటి గాలి ప్రవాహానికి అనుగుణంగా తక్కువ కోణంలో, మరొకటి ఎక్కువ కోణంతో కిందకు దిగేందుకు అనువుగా చర్యలు తీసుకున్నామని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రతినిధులు తెలిపారు.
→గాలి ఒత్తిడి, వేగం, ప్రతికూల పరిస్థితులను ఈ పారాచూట్లతో అధిగమించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను అధ్యయనం చేసేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు.
→ఈ ప్యారాచూట్ వ్యవస్థను తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్‌ సెంటర్, ఆగ్రాలోని ఏరియల్‌ డెలివరీ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సహకారంతో అభివృద్ధి చేశారు.

ఎంఆర్‌ శామ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అధునాతన మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌ శామ్‌)ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది.
అగ్రశ్రేణి యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా క్షిపణి సామర్థ్యాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
దీని నౌకా విధ్వంస సామర్థ్యాన్ని పరీక్షించినట్లు వివరించారు. ఎంఆర్‌శామ్‌ను ప్రభుత్వ రంగంలోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) సంస్థ అభివృద్ధి చేసింది.

చిన్నారుల్లో రక్తహీనతను పసిగట్టే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌

→స్మార్ట్‌ఫోన్‌తో తీసిన చిత్రాల విశ్లేషణ ద్వారా పిల్లల్లో రక్తహీనత (ఎనీమియా) ఉందా అన్నది గుర్తించే సరికొత్త పరిజ్ఞానాన్ని అమెరికా, ఘనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ఘనా సహా అనేక పేద, మధ్యాదాయ దేశాల్లో చిన్నారులను సులువుగా స్క్రీన్‌ చేయడానికి ఈ సాధనం అక్కరకొస్తుందని పరిశోధకులు తెలిపారు.
→రక్తంలో హీమోగ్లోబిన్‌ పరిమాణం తగ్గిపోవడం వల్ల ఎనీమియా ఉత్పన్నమవుతుంది. దీనివల్ల శరీరం మొత్తం ఆక్సిజన్‌ సరిగా సరఫరా కాదు.
→ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందిపై ఈ రుగ్మత ప్రభావం ఉంది. చిన్నారుల్లో ఎదుగుదలను ఇది దెబ్బతీస్తోంది. సాంక్రమిక వ్యాధుల ముప్పునూ పెంచుతోంది.
→ఈ ఇబ్బంది ఉన్న చిన్నారుల్లో విషయ గ్రహణ సామర్థ్యంపరంగానూ లోపాలు తలెత్తుతున్నాయి. ఎనీమియాకు ప్రధాన కారణం ఐరన్‌ లోపం.
→మలేరియా, సికిల్‌ సెల్‌ వ్యాధి వల్ల కూడా ఈ రుగ్మత రావొచ్చు. సాధారణంగా ఈ వ్యాధిని నిర్ధారించడానికి రక్త నమూనాలను సేకరించాలి. హీమోగ్లోబిన్‌కు ఒక ప్రత్యేక రంగు ఉంటుంది.
→దీని ఆధారంగా ఎనీమియాని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు కసరత్తు చేపట్టారు. ఇందుకోసం ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు.
→తొలుత కంట్లోని తెల్లటి భాగం, కింది కనురెప్ప, కింది పెదవిని స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు. దాన్ని విశ్లేషించిన యాప్‌.. ఎనీమియా కేసులను విజయవంతంగా గుర్తించగలిగింది.

స్క్రబ్‌ టైఫస్‌కు మెరుగైన చికిత్స

→ప్రాణాంతకమైన బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ స్క్రబ్‌ టైఫస్‌కు మెరుగైన చికిత్సను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు.
→ఈ పరిశోధనలో తిరుపతిలోని స్విమ్స్‌ సహా అనేక సంస్థలు పాలుపంచుకున్నాయి. ఓరియెన్షియా సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్‌ టైఫస్‌ వస్తుంది.
→ఇన్‌ఫెక్షన్‌ సోకిన చిన్నపాటి కీటకాల ద్వారా ఇది మానవుల్లోకి వ్యాప్తి చెందుతుంది. భారత్, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగానే ఉంది.
→ఏటా పది లక్షల మంది దీని బారిన పడుతుంటారు. అందులో 10 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. తొలుత జ్వరంలా ఇది మొదలవుతుంది.
→ఆ తర్వాత తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మానసిక గందరగోళం వంటి సమస్యలు తలెత్తుతాయి. మూడో వంతు రోగుల్లో సమస్య తీవ్రం కావొచ్చు.
→శరీరంలో అనేక అవయవాలపై అది ప్రభావం చూపుతుంది. దీనికి మెరుగైన చికిత్స విధానాన్ని కనుగొనేందుకు భారత్‌లోని పలు సంస్థలు పరిశోధన చేపట్టాయి.
→ఇందులో భాగంగా పరిశోధకులు ‘ఇంట్రెస్ట్‌’ పేరిట నిర్వహించిన ఒక క్లినికల్‌ ట్రయల్‌ డేటాను విశ్లేషించారు.
→ఇందులో తీవ్రస్థాయి స్క్రబ్‌ టైఫస్‌ బారినపడ్డ రోగులపై డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్‌ అనే యాంటీబయాటిక్స్‌తో ఏడు రోజుల పాటు సాగిన మూడు చికిత్సల సమర్థతను పరీక్షించారు.
→విడివిడిగా వాడటం కంటే ఈ రెండు రకాల మందులను కలిపి రక్తనాళం ద్వారా ఇవ్వడమే మేలని తేల్చారు.
→ఈ మిశ్రమాన్ని పొందిన వారిలో ఏడో రోజు తర్వాత చాలా తక్కువ దుష్ప్రభావాలు తలెత్తాయని వివరించారు.

బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతం

→బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారత నౌకాదళం ముంబయికి సమీపంలో అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
→డీఆర్‌డీవో దేశీయంగా రూపొందించిన సీకర్‌ అండర్‌ బూస్టర్‌ పరిజ్ఞానంతో ఈ పరీక్ష చేపట్టినట్లు సైన్యానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.
→బ్రహ్మోస్‌ క్షిపణి ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో (మ్యాక్‌ 2.8) ప్రయాణించగలదు.

ఆయుర్వేద ఔషధంతో కిడ్నీల ఆరోగ్యం మెరుగు

→అనారోగ్యం బారినపడ్డ అనంతరం మూత్రపిండాలు త్వరితగతిన కుదుటపడేందుకు ‘నీరీ కేఎఫ్‌టీ’ అనే ఆయుర్వేద ఔషధ సమ్మేళనం బాగా దోహదపడుతుందని భారతీయ పరిశోధకులు గుర్తించారు.
→సాధారణంగా మూత్రపిండాల పనితీరును సీఏఎస్‌పీ, ఐఈఎల్, ఏకేటీ, ఏసీఈ-2, ఏజీటీఆర్‌-1, ఎస్‌ఓడీ-1 అనే ఆరు కీలక జన్యువులు నియంత్రిస్తుంటాయి.
→సంప్రదాయ ఆయుర్వేద ఔషధంగా పేరొందిన ‘నీరీ కేఎఫ్‌టీ’లోని గాలిక్, కెఫీక్, ఫెరులిక్‌ ఆమ్లాలకు ఆ జన్యువుల పనితీరును మెరుగుపర్చగల సామర్థ్యం ఉన్నట్లు పరిశోధకులు తాజాగా నిర్ధారించారు.
→కిడ్నీ కణజాలాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను అవి గణనీయ స్థాయిలో తగ్గించగలవని తేల్చారు.

పేగుల్లోని సూక్ష్మజీవులతో శరీరమంతటా ప్రయోజనాలు

→పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిలోని మేలు చేసే సూక్ష్మజీవులు/రోగనిరోధక కణాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయన్నది శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల క్రితమే తేల్చిన విషయం.
→అయితే అంతటితో ఆగిపోకుండా శరీరంలోని పలు ఇతర కణజాలాల మరమ్మతులకూ అవి దోహదపడతాయని అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు తాజా అధ్యయనంలో నిర్ధారించారు.
→‘ట్రెగ్స్‌’ అని పిలుచుకునే రెగ్యులేటరీ టీ-కణాల ఉత్పత్తిని పేగుల్లోని మేలుదాయక సూక్ష్మజీవులు ప్రేరేపిస్తుంటాయి. ఈ రకం టీ-కణాలు శరీరమంతటా గస్తీ తిరుగుతాయి.
→ఎక్కడైనా గాయాల సంబంధిత సంకేతాలు వెలువడితే వాటిని పసిగడతాయి. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడతాయి.
→సాధారణంగా కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే తీవ్ర అనారోగ్యం తలెత్తుతుంది. దానివల్ల మరణ ముప్పు కూడా పొంచి ఉంటుంది.
→అలాంటి తీవ్రస్థాయి సమస్య నుంచి నెమ్మదిగా కోలుకునేందుకూ ట్రెగ్స్‌ ఉపయోగపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

టైప్‌-1 మధుమేహం చికిత్సకు వినూత్న విధానం

→టైప్‌-1 మధుమేహ బాధితులకు వరంగా మారగల సరికొత్త విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి (ఎంజీహెచ్‌) పరిశోధకుల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేసింది.
→ ఈ రకం మధుమేహుల్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంటుంది.
→ బీటా కణాల మార్పిడి ద్వారా వారికి సాంత్వన చేకూర్చవచ్చని పరిశోధకులు తేల్చారు.
→ అయితే అందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలు ప్రభావవంతంగా పనిచేయడం లేదు.
→ కాలేయానికి జోడించిన బీటా కణాల్లో దాదాపు సగం రోగనిరోధక వ్యవస్థ దాడితో ధ్వంసమవుతున్నాయి.
→ ఇందుకు పరిష్కార మార్గంగా పేగులను చుట్టి ఉండే ఒమెంటమ్‌తో బీటా కణాలను అనుసంధానించే విధానాన్ని కనుగొన్నారు.
→ ఇందులో బీటా కణాలు కృత్రిమ క్లోమం తరహాలో పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. వాటిపై రోగ నిరోధక వ్యవస్థ ప్రతికూల ప్రభావం చూపబోదని పేర్కొన్నారు.

పెరుగుతున్న సముద్ర మట్టాలతో చెన్నై, కోల్‌కతాలకు ముప్పు

→పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఆసియాలోని మెగా నగరాలపై పెను ప్రభావం పడుతుందని తాజా పరిశోధన తేల్చింది.
→పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు ఇదే రీతిలో కొనసాగితే 2100 నాటికి చెన్నై, కోల్‌కతా, మయన్మార్‌లోని యాంగాన్, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, వియత్నాంలోని హోచిమిన్‌ సిటీ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా నగరాలకు ముంపు ముప్పు పొంచి ఉంటుందని వివరించారు.
→ సముద్ర మట్టాల్లో సహజసిద్ధ హెచ్చుతగ్గులపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (సీఎన్‌ఆర్‌ఎస్‌), ఫ్రాన్స్‌లోని లా రోషెల్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పియరిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఆర్‌) శాస్త్రవేత్తల సంయుక్త నేతృత్వంలో సహజ సముద్ర మట్టం ప్రభావాలను పరిశీలించారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. నీరు వేడెక్కడం వల్ల మంచు ఫలకాలు కరిగి, అధిక నీరు వచ్చి చేరుతుంది. సముద్ర వడిలో మార్పుల కారణంగా ఈ పెరుగుదల ప్రాంతాల వారీగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ తాజా పరిశోధనలో ప్రపంచ వాతావరణానికి సంబంధించిన కంప్యూటర్‌ నమూనా, ప్రత్యేక గణాంక నమూనాతో విశ్లేషణ జరిపారు.
→ అంతర్గత వాతావరణ వైరుధ్యాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టాలు 20-30 శాతం పెరుగుతాయని, ఫలితంగా వరద ముప్పు మరింత పెరుగుతుందని తెలిపారు.

రోజూ 11 నిమిషాలు నడిస్తే చాలు

→ఇటీవలి కాలంలో యువత సైతం గుండెపోటుతో కన్నుమూస్తుండటం చూస్తున్నాం. ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నవారూ క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడుతున్నారు.
→దీనికి పరిష్కారం ఎలా? మరేం లేదు. రోజూ 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడిస్తే చాలు గుండెజబ్బు, పక్షవాతంతో పాటు పలు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది.
→యూకేకు చెందిన జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్‌) సూచించిన శారీరక శ్రమలో కనీసం సగం చేసినా ప్రతి పది అకాల మరణాల్లో ఒకదాన్ని నివారించవచ్చని ‘బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు లేదా 75 నిమిషాలు అత్యంత తీవ్రస్థాయి శారీరక శ్రమ చేయాలని ఎన్‌హెచ్‌ఎస్‌ సిఫారసు చేసింది.
→అసలేమీ చేయకపోవడం కన్నా ఎంతో కొంత శారీరక శ్రమ వల్ల మేలు కలుగుతుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధన మండలి (ఎంఆర్‌సీ) మహమ్మారుల విభాగానికి చెందిన డాక్టర్‌ సోరెన్‌ బ్రేజ్‌ పేర్కొన్నారు. వర్సిటీ జరిపిన అధ్యయనంలో వారానికి 75 నిమిషాల ఓ మోస్తరు శారీరక శ్రమ గుండె వ్యాధుల ముప్పును 17 శాతం, క్యాన్సర్ల ముప్పును 7 శాతం తగ్గిస్తుందని తేలింది.

ఫిఫా ఉత్తమ ఆటగాడిగా మెస్సి

→అర్జెంటీనా సూపర్ స్టార్ లియొనల్ ఉత్తమ ఆటగాడి పురస్కారాన్ని సొంతం చేసుకు న్నాడు.
→గతేడాది ఖతార్ లో జరిగిన ప్రపంచకప్ జట్టును గెలిపించి సుదీర్ఘ కలను తీర్చుకున్న మెస్సి (54 పాయింట్లు).. ఫ్రాన్స్ స్టార్లు ఎంబాపె (44), కరీమ్ బెంజిమా (34) నుంచి పోటీని అధిగమించి ఈ అవార్డు దక్కించుకు న్నాడు.
→గత 14 ఏళ్లలో ఈ పురస్కారాన్ని అతడు ఏడుసార్లు అందుకోవడం విశేషం. మహిళల ఉత్తమ క్రీడాకారిణిగా అలెక్సియా పెటెలాస్ (స్పెయిన్) వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు సాధించింది.
→గత సీజన్లో అన్ని టోర్నీల్లో కలిపి అలెక్సియా 34 గోల్స్ కొట్టింది. అర్జెంటీనా ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన కోచ్ లియొనల్ స్కాలోని ఉత్తమ కోచ్గా ఎంపికయ్యాడు.
→మహిళల్లో ఈ అవార్డు సరెనా వీగా మాను దక్కింది. యూరో ఛాంపియన్షిప్ లో ఇంగ్లాండ్ను వీగ్మాన్ విజేతగా నిలబెట్టింది.
→జాతీయ జట్ల కెప్టెన్లు, కోచ్లు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, ఫిఫా దేశాల సభ్యులతో కూడిన ప్యానల్తో పాటు ఆన్లైన్ ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేశారు.

దేశంలోని వర్సిటీల్లో పరిశోధనల్లో హెచ్సీయూ నంబర్ వన్ అగ్రగామిగా గుర్తింపు

→శాస్త్ర పరిశోధనలు.. సామాజిక, ఆర్థిక రంగాలు.. భాషా విభా గాల్లో పురోగమిస్తున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయానికి అరుదైన గుర్తింపు లభించింది.
→విశ్వవిద్యాల యాల విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిం దంటూ నేచర్ ఇండెక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది.
→అంతర్జాతీయ జర్నల్ ప్రపంచంలోనే పేరొందిన ఆ సంస్థ పలు పరిశోధన పత్రాలను ప్రచురించడంతోపాటు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పనితీ రును విశ్లేషిస్తుంది.
→ఇందుకోసం ఆయా విశ్వవిద్యాల యాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు పరిశోధన పత్రాల ర్యాంకింగ్లను పరిగణనలోకి తీసుకుంటుంది.
→విభిన్నంగా, నాణ్యంగాఉన్న పత్రాలను అన్నికోణాల్లో పరిశీలించి అత్యు త్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది.
→వాటి ద్వారా సమా జానికి జరిగిన, జరగనున్న మేలు, భవిష్యత్తులో రాబోయే మార్పులను విశ్లేషిస్తుంది.
→ఈ నివేదికలో యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ కోల్ కతా, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలను తోసిరా జని హెచ్ సీయూ తొలిస్థానంలో నిలిచింది.
→నేచర్ ఇండెక్స్ సంస్థ.. పరిశోధనలను, వాటి ఫలితాలు ఆధారంగా ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నుంచి 300 వరకూ స్థానాలను ప్రకటి స్తుంది.
→ఈ సంస్థ ద్వారా పొందిన స్థానాలు చాలా విలు వైనవి. వీటి ద్వారా విదేశీ వర్సిటీలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు ఆయా విశ్వవిద్యాలయాలతో మరిన్ని పరిశో ధనలకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
→నేచర్ ఇండెక్స్ ఈ స్థానాలను ఇచ్చేందుకు 2021 డిసెంబరు 1, నుంచి 2022 నవంబరు 30 వరకు మధ్య కాలాన్ని పరి గణనలోకి తీసుకుంది.
→12 నెలల్లో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనలను పరిశీలించింది.

నాలుగు తెలంగాణ జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పురస్కారాలు

→ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకో సారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పురస్కారాల్లో తెలంగాణ మరో సారి సత్తా చాటింది.
→ 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అగ్రగామిగా నిలిచింది.
→ స్టార్ త్రీ విభా గంలో సిద్దిపేట, జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలి చాయి.
→ కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా మూడో స్థానం సాధించింది. స్టార్ ఫోర్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానం, పెద్దపల్లి జిల్లా మూడో స్థానం పొందాయి.
→ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులు హర్షం వ్యక్తంచేశారు.
→ "స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రకటించే అవా ర్డుల్లో ప్రతిసారీ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో అనేక పురస్కారాలు వస్తున్నాయి.
→ ఈ అవా ర్డులు రావడంలో రాష్ట్రస్థాయిలో కార్యదర్శి, ఉన్నతాధికారుల నుంచి గ్రామస్థా యిలో సిబ్బంది వరకు అందరి కృషి ఉంది" అని వారు పేర్కొన్నారు.
→ 'నిధులు ఇవ్వకున్నా కేంద్రం నుంచి పురస్కారాలు లభిస్తున్నాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు రావాలి.
→ పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలను చేపట్టిన సీఎం కేసీఆర్ కృషి వల్లే పురస్కారాలు దక్కుతున్నాయి" అని ఎర్ర బెల్లి చెప్పారు.
→ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చ సుజల శక్తి సమ్మాన్ పుర స్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామ సర్పంచి మీనాక్షి ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
→ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 4న దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారని తెలిపారు.

భారత్-ఉజ్బెకిస్తాన్ ద్వైవార్షిక సైనిక శిక్షణ వ్యాయామం డస్ట్‌లిక్ ప్రారంభం

భారత సైన్యం మరియు ఉజ్బెకిస్తాన్ సైన్యం మధ్య జరిగే ద్వైవార్షిక శిక్షణ వ్యాయామం డస్ట్‌లిక్ (DUSTLIK) యొక్క నాల్గవ ఎడిషన్ ఫిబ్రవరి 21 నుండి 5 మార్చి, 2023 వరకు ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో నిర్వహిస్తున్నారు.

ఈ ద్వైపాక్షిక వ్యాయామంలో వెస్ట్రన్ కమాండ్‌లో భాగమైన 14వ బెటాలియన్, ది గార్వాల్ రైఫిల్స్ ద్వారా భారత బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది. అలానే ఉజ్బెకిస్తాన్ సైన్యం నుండి నార్త్ వెస్ట్రన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యొక్క దళాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ఉమ్మడి వ్యాయామం ఐక్యరాజ్యసమితి ఆదేశం మేరకు ఉప సంప్రదాయ దృష్టాంతంతో ఇరు దేశాల మధ్య సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరుగుతుంది.

రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలోని భూపరివేష్టిత దేశం. ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీని రాజధాని నగరం తాష్కెంట్. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్.


జైపూర్‌లో 18వ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్

18 వ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ సమావేశాలు ఫిబ్రవరి 21 -23 తేదీల మధ్య జైపూర్‌లో నిర్వహించారు. ఈ 3 రోజుల సదస్సును ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాలను రైల్వే సెక్యూఐర్తి స్ట్రాటజీ - రెస్పాన్సేస్ అండ్ విజన్ ఫర్ ఫ్యూచర్ థీమ్‌తో నిర్వహించారు.

ఈ సమావేశాలలో ప్రస్తుత రైల్వే భద్రతా సవాళ్లు మరియు నూతన పరిష్కారాలపై చర్చించారు. అలానే రైల్వే రంగంలో నిర్మాణాత్మక చర్చలు, ఆలోచనల మార్పిడి మరియు ఉత్తమ సాంకేతిక ఉత్పత్తులపై మేధోమథనం జరిగింది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) భారతదేశంలోని రైల్వే భద్రతా వ్యవహారాలు మరియు చట్టాన్ని అమలు చేసే సంస్థ. ఇది 1957లో ఫెడరల్ ఫోర్స్‌గా ఏర్పాటై, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతొ సేవలు అందిస్తుంది. ఇది రైల్వే ఆస్తి మరియు రైల్వే ప్రయాణీకుల భద్రతకు బాధ్యత వహిస్తుంది.

ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) 1922 లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ఇది రైలు రవాణా పరిశోధన, అభివృద్ధి & ప్రమోషన్ కోసం రైల్వే రంగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.


ఎంపాస్‌పోర్టు పోలీస్ యాప్‌ ప్రారంభం

పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపాస్‌పోర్టు పోలీస్ యాప్‌ పేరుతొ నూతన మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది. ఈ కొత్త యాప్ మొబైల్ టాబ్లెట్‌ల ద్వారా డిజిటల్ మరియు పేపర్‌లెస్ వెరిఫికేషన్ రిపోర్టులను సమర్పించడానికి పోలీసు సిబ్బందిని అనుమతిస్తుంది, దీని ద్వారా పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గిస్తుంది.

పోలీసు ధృవీకరణ అనేది పాస్‌పోర్ట్ జారీ వ్యవస్థలో అంతర్భాగం. ఈ ధృవీకరణ వ్యక్తిగతంగా చేయబడుతుంది. దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొన్న చిరునామాను పోలీస్ అధికారి సందర్శిస్తారు. సమాచార ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసిన తర్వాత, పోలీస్ స్టేషన్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నోటిఫికేషన్ పంపుతుంది. దీని తర్వాత, దరఖాస్తుదారునికి పాస్‌పోర్ట్ జారీ చేయబడుతుంది.

పాస్‌పోర్ట్ అనేది ఒక రకమైన వ్యక్తిగత గుర్తింపు పత్రం. ఒక వ్యక్తి పౌరసత్వం కలిగిఉన్న దేశాన్ని ధృవీకరించడానికి పాస్‌పోర్ట్ ఉపయోగించబడుతుంది. ఇది అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం మరియు చట్టబద్దం చేస్తుంది.


చైనా, రష్యా & దక్షిణాఫ్రికాల ఉమ్మడి నావికా వ్యాయామం మోసి II ప్రారంభం

రష్యా-చైనాలతో కలిసి దక్షిణాఫ్రికా సంయుక్త నావికా సైనిక వ్యాయామం నిర్వహించింది. మోసి II పేరుతొ జరుగుతున్నా ఈ పదిరోజుల నావికా విన్యాసాలు దక్షిణాఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో జరుగుతున్నాయి. 350 మంది సాయుధ దళాల సభ్యులు ఇందులో పాల్గున్నట్లు దక్షిణాఫ్రికా జాతీయ రక్షణ దళం తెలిపింది.

జిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణులను మోసుకెళ్లే అడ్మిరల్ గోర్ష్‌కోవ్ యుద్ధనౌకను పంపనున్నట్లు రష్యా ప్రకటించింది. ఇవి ధ్వని కంటే తొమ్మిది రెట్లు వేగంతో ఎగురుతాయి మరియు 1,000 కిమీ (620 మైళ్ళు) లక్ష్య పరిధిని ఛేదిస్తాయి. ఒక పక్కన ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం యొక్క మొదటి వార్షికోత్సవం జరుగుతుండగా చైనా, రష్యాలతో కలిసి దక్షిణాఫ్రికా ఈ సైనిక వ్యాయామం నిర్వహించడం వివిధ ప్రపంచ దేశాల విమర్శలకు గురవుతుంది.

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధ వివాదంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం తటస్థంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి వార్షిక సైనిక విన్యాసాలు ఫ్రాన్స్ మరియు యుఎస్‌తో సహా ఇతర దేశాలతో మామూలుగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.


యునిసెఫ్‌ బాలల హక్కుల జాతీయ అంబాసిడర్‌గా ఆయుష్మాన్ ఖురానా

యునిసెఫ్‌ బాలల హక్కులకు సంబంధించి భారత జాతీయ రాయబారిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఫిబ్రవరి 19 న నియమితులయ్యారు. దీనితో యునిసెఫ్ ఇండియాతో కలిసి బాలల హక్కుల కోసం తన సహాయాన్ని అందించనున్నారు.

ఆయుష్మాన్ ఖురానా ఇది వరకు 2020 లో పిల్లలపై హింసను నిరోధించే మరియు విస్తృత బాలల హక్కుల ఎజెండా కోసం వాదించడానికి యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కూడా నియమితులయ్యారు. యూనిసెఫ్ బాలల హక్కుల కాపాడటం కోసం గ్లోబల్, రీజినల్ మరియు నేషనల్ అంబాసిడర్‌లను నియమిస్తుంది. వీరి ద్వారా యూనిసెఫ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది.

యునిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవతా మరియు అభివృద్ధి సహాయాన్ని అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. దీని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే ఇప్పుడు అధికారికంగా యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్'గా పిలువబడుతోంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.


కార్తీక్ సుబ్రమణ్యంకు నేషనల్ జియోగ్రాఫిక్ 'పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కార్తీక్ సుబ్రమణ్యం 2023 నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క ' పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు. తన అలస్కా పర్యటనలో ఈగిల్ ప్రిజర్వ్‌లో తీసిన 'డాన్స్ ఆఫ్ ది ఈగల్స్' ఫోటో ఈ అవార్డు గెలుచుకుంది.


గిన్నిస్ రికార్డులో లడఖ్ ఫ్రోజెన్ లేక్ ఆఫ్ మారథాన్‌

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఫిబ్రవరి 20న మొదటి 'ఫ్రోజెన్ లేక్ హాఫ్ మారథాన్ నిర్వహించారు. లడఖ్‌లోని 13,862 అడుగుల ఎత్తులో ఉన్న ఘనీభవించిన పాంగోంగ్ త్సో సరస్సుపై, సున్నా ఉష్ణోగ్రతలలో విజయవంతంగా నిర్వహించిన ఈ 21-కిమీ ఆఫీషియల్ రన్నింగ్ ఈవెంట్‌, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఘనీభవించిన హాఫ్ మారథాన్‌గా గిన్నిస్ ప్రపంచ రికార్డులో నమోదు చేయబడింది.

ది లాస్ట్ రన్ థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని లడఖ్ ఆటోనొమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ లడఖ్ ఉమ్మడిగా నిర్వహించాయి. హిమాలయ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో పాంగోంగ్ త్సో సరస్సు ఒకటి. ఇప్పుడు ఇది భారతదేశపు మొట్టమొదటి 'ఫ్రోజెన్ లేక్ హాఫ్ మారథాన్'కు ఆతిథ్యం ఇచ్చిన సరస్సుగా ప్రసిద్ధికెక్కింది.


దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల విజేతలు

సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారాలుగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 విజేతల జాబితా వెలువడింది. ఫిబ్రవరి 20న ముంబైలో జరిగిన దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోగా. బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఉత్తమ నటి, మరియు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు.

49వ అంతర్జాతీయ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్-2023

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఏడు రోజుల 49వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్-2023 ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. ఏడాదికోసారి జరిగే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 1975లో ప్రారంభించబడింది. దీనిని మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తుంది.

ఈ డాన్స్ కార్యక్రమంలో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల ప్రదర్శిస్తారు. ఈ వేడుకలో దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రసిద్ధ కళాకారులు తమ నృత్య ప్రదర్శనలను ప్రదర్శిస్తారు.


76వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల విజేతలు

76వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్థుల వేడుక 19 ఫిబ్రవరి 2023న లండన్ సౌత్‌బ్యాంక్ సెంటర్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. 2022లో ఉత్తమ జాతీయ మరియు విదేశీ చిత్రాలను సత్కరిస్తూ ఈ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రిచర్డ్ ఇ. గ్రాంట్ మరియు అలిసన్ హమ్మండ్ హోస్టులుగా వ్యవహరించారు.


ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ సీఎండీగా రాజేష్ రాయ్

కేంద్ర ప్రభుత్వం ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటిఐ) సీఎండీగా రాజేష్ రాయ్‌ని నియమిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. వచ్చే ఐదేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది బెంగుళూరు కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. దీనిని 1948 లో ఏర్పాటు చేశారు.


డా. మహేంద్ర మిశ్రాకు అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు

భారతీయ విద్యావేత్త మరియు ఒడిషా సామాజిక కార్యకర్త డాక్టర్ మహేంద్ర కుమార్ మిశ్రాకు అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 21న ఢాకాలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజున ప్రదానం చేశారు. దీనితో మహేంద్ర మిశ్రా ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు.

ఈ ఏడాది ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి షేక్ హసీనా మొత్తం నలుగురు గ్రహీతలకు రెండు జాతీయ అవార్డులు మరియు రెండు అంతర్జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. బంగ్లాదేశ్ జాతీయులు హబీబుర్ రెహమాన్ మరియు రంజిత్ సింఘాలకు జాతీయ అవార్డులు లభించగా, మహేంద్ర కుమార్ మిశ్రా మరియు కెనడాలోని వాంకోవర్‌లోని మదర్ లాంగ్వేజ్ లవర్స్ ఆఫ్ వరల్డ్ సొసైటీకి అంతర్జాతీయ అవార్డులు లభించాయి.

డాక్టర్ మిశ్రా ఒడిశాలోని అట్టడుగు భాషల భాష, సంస్కృతి మరియు విద్యపై మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు 2021లో యునెస్కో ద్వారా స్థాపించబడింది. ఈ అవార్డును మాతృభాషల పరిరక్షణ, పునరుజ్జీవనం మరియు అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తులకు, సంస్థలకు అందిస్తారు.


కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రాజీవ్ రఘువంశీ

కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)గా రాజీవ్ రఘువంశీ నియమితులయ్యారు. రాజీవ్ రఘువంశీ ప్రస్తుతం ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్‌లో సెక్రటరీ-కమ్-సైంటిఫిక్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 28 నుండి నూతన డిసిజిఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదా అనేది భారత ప్రభుత్వం యొక్క సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విభాగ అధిపతి. ఈ సంస్థ వ్యాక్సిన్‌లు మరియు ఔషధాల యొక్క లైసెన్స్‌ల ఆమోదానికి బాధ్యత వహిస్తుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. భారతదేశంలో ఔషధాల తయారీ, అమ్మకాలు, దిగుమతి మరియు పంపిణీకి ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది.


సంసద్ రత్న అవార్డు విజేతలు 2023

సంసద్ రత్న అవార్డుల 13వ ఎడిషన్ విజేతలు ప్రకటించబడ్డారు. సంసద్ రత్న అవార్డ్స్ 2023 కోసం లోక్‌సభ నుండి 8 మంది, రాజ్యసభ నుండి ఐదుగురు ఎంపీలు. అదనంగా రెండు డిపార్ట్‌మెంట్ సంబంధిత స్టాండింగ్ కమిటీలు (DRSC) మరియు ఇద్దరు ఇతర నాయకులు ప్రత్యేక అవార్డుల కేటగిరీ కింద నామినేట్ చేయబడ్డారు.

2022 నుండి అనుభవజ్ఞులైన నాయకులను గౌరవించేందుకు "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్" కొత్తగా ప్రారంభించారు. ఈ ఏడాది ఈ అవార్డును సిపిఎం సీనియర్ నాయకుడు శ్రీ టీకే రంగరాజన్‌కు అందిస్తున్నారు. కింది పేర్కొన్న అన్ని అవార్డులు 25 మార్చి 2023న న్యూ ఢిల్లీలో అందించబడతాయి. సివిల్ సొసైటీ తరపున ఈ అవార్డులను అందజేస్తారు.

సంసద్ రత్న అవార్డులను అత్యుత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లను గౌరవించడం కోసం 2010లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకు ఏర్పాటు చేశారు. ఆయనే స్వయంగా 2010లో చెన్నైలో ఈ అవార్డు ఫంక్షన్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సంసద్ రత్న అవార్డుల కమిటీకి శ్రీ కె. శ్రీనివాసన్ వ్యవస్థాపక చైర్మన్ మరియు శ్రీమతి ప్రియదర్శిని రాహుల్ అధ్యక్షురాలిగా ఉన్నారు.

  1. శ్రీ బిద్యుత్ బరన్ మహతో (బీజేపీ, జార్ఖండ్).
  2. డాక్టర్ సుకాంత మజుందార్ (బీజేపీ, పశ్చిమ బెంగాల్).
  3. శ్రీ కుల్దీప్ రాయ్ శర్మ (కాంగ్రెస్, అండమాన్ నికోబార్ దీవులు).
  4. డాక్టర్ హీనా విజయకుమార్ గావిట్ (బిజెపి, మహారాష్ట్ర).
  5. శ్రీ అధిర్ రంజన్ చౌదరి (ఐఎన్‌సి, పశ్చిమ బెంగాల్).
  6. శ్రీ గోపాల్ చినయ్య శెట్టి (బిజెపి, మహారాష్ట్ర).
  7. శ్రీ సుధీర్ గుప్తా (బిజెపి, మధ్యప్రదేశ్).
  8. డాక్టర్ జాన్ బ్రిట్టాస్ (సిపిఎం, కేరళ).
  9. డాక్టర్ మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ బీహార్).
  10. ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్ (ఎన్సీపీ, మహారాష్ట్ర) .
  11. విషంభర్ ప్రసాద్ నిషాద్ (సమాజ్వాది పార్టీ, యూపీ).
  12. ఛాయా వర్మ (కాంగ్రెస్, ఛత్తీస్‌గఢ్).
  13. పార్లమెంటరీ సంబంధిత స్టాండింగ్ కమిటీలు (DRSC).
  14. ఫైనాన్స్ కమిటీ (లోక్‌సభ కమిటీ - ఛైర్మన్ - శ్రీ జయంత్ సిన్హా, బిజెపి, జార్ఖండ్)

ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్పు

ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్చుతూ మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తీర్మానించింది. చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌ పేరు స్థానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ చింతమన్‌రావ్ దేశ్‌ముఖ్ పేరు నివేదించింది. దేనికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే త్వరలో చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌, చింతమన్‌రావ్ దేశ్‌ముఖ్ స్టేషన్‌గా మారనుంది.

సీడీ దేశ్‌ముఖ్ అని పిలుచుకునే మహారాష్ట్రకు చెందిన చింతమన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నరుగా సేవలు అందించారు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు.


రష్యాపై యూఎన్ నాన్‌బైండింగ్ రిజల్యూషన్‌ ఆమోదం

ఉక్రెయిన్‌లో యుద్ధంను విరమించుకోవాలని కోరుతూ రష్యాకు పిలుపునిచ్చే నాన్‌బైండింగ్ తీర్మానానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 23న ఆమోదం తెలిపింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తికావడంతో, రష్యా దండయాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసతి ఈ బలమైన సందేశాన్ని పంపింది. తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

ఉక్రెయిన్ తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపి రూపొందించిన తీర్మానం 141-7 ఓటుతో యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆమోదించబడింది, 32 దేశాలు గైర్హాజరయ్యాయి. ఇందులో భారతదేశం కూడా ఉంది. ఇక ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏడు దేశాలలో బెలారస్, నికరాగ్వా, రష్యా, సిరియా, ఉత్తర కొరియా, ఎరిట్రియా మరియు రష్యాతో సన్నిహిత సైనిక సంబంధాలను కలిగి ఉన్న మాలి దేశం ఉన్నాయి.


'బారిసు కన్నడ డిమ్ దిమావా' ఫెస్టివల్‌ ప్రారంభం

ఫిబ్రవరి 25 న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ' బరిసు కన్నడ డిమ్ దిమావా సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్నారు.

ప్రధానమంత్రి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' విజన్‌కు అనుగుణంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవంకు వందలాది మంది కర్ణాటక నృత్య, సంగీతం, నాటక కళాకారులు తమ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి హాజరయ్యారు.


ప్రపంచ బ్యాంక్‌కు అధ్యక్షుడిగా అజయ్ బంగా

మాస్టర్ కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించడానికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. అతను గతంలో జూలై 2010 నుండి డిసెంబర్ 31, 2020 వరకు మాస్టర్ కార్డ్ కంపెనీకి ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా సేవలు అందించారు.

ప్రపంచ బ్యాంకు అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసేందుకు గాను 1945 లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రస్తుతం ఇది ఇది మూలధన ప్రాజెక్టులను చేపట్టలనే ఉద్దేశంతో పేద దేశాల ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేస్తుంది. ప్రపంచ బ్యాంకులో ప్రస్తుతం 189 సభ్య దేశాలు ఉన్నాయి.


అబుదాబిలో 2023 ఐ2యూ2 బిజినెస్ ఫోరమ్

ఫిబ్రవరి 21-22 తేదీల్లో అబుదాబిలో జరిగే ఐ2యూ2 యొక్క మొదటి వైస్ మినిస్టీరియల్ సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నెలలో కాప్28కి యూఏఈ ఆతిధ్యం ఇస్తున్నందున, ఈ సమావేశాల్లో భాగస్వామ్య దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని మరియు ఇంధన సంక్షోభం, వ్యాపార పెట్టుబడులు మరియు ఆహార అభద్రత నిర్వహణతో సహా, అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమస్యలపై చర్చించారు.

ఇదే వేదిక ద్వారా స్మార్ట్ వ్యవసాయానికి పెట్టుబడి మరియు మద్దతును వేగవంతం చేసే లక్ష్యంతో యూఎస్ మరియు యూఏఈ ప్రారంభించిన అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ (AIM4C) లో ఇండియా చేరుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ జాబితాలో 42 దేశాల ప్రభుత్వాలతో పాటుగా 275 కంటే ఎక్కువ వ్యవసాయ,క్లైమేట్ సంస్థలు ఉన్నాయి.

ఐ2యూ2 అనేది భారతదేశం, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లతో కూడిన అంతర్-ప్రభుత్వ ఆర్థిక సహకార ఫోరమ్. దీనిని అక్టోబర్ 2021లో ప్రారంభించారు. దీనిని సభ్య దేశాల మధ్య నీరు, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం మరియు ఆహార భద్రతలో పాటుగా పరస్పర ఉమ్మడి పెట్టుబడుల ద్వారా పరస్పర సహకారం అందించేందుకు ప్రారంభించారు.


ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో రష్యా సభ్యత్వం రద్దు

ఉక్రెయిన్ పైన యుద్ధం కారణంగా తమతో ఉన్న రష్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో తమ ప్రధాన సూత్రాలకు వ్యతిరేకంగా రష్యన్ ఫెడరేషన్ యొక్క చర్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంతర్జాతీయంగా మనీలాండరింగ్ మరియు టెర్రరిజం ఫైనాన్సింగ్ నివారణకు బాధ్యత వహిస్తుంది. ఇది 200 కంటే ఎక్కువ దేశాలకు మరియు దర్యాప్తు సంస్థలకు భద్రత ప్రమాణాలను నిర్దేశిస్తుంది.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా మరియు తీవ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలను పరిష్కరించడానికి అధికారులకు సహాయం చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. దీనిని 1989లో గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం దీనిని అధ్యక్షుడుగా ఇండియాకు చెందిన టి రాజ కుమార్ ఉన్నారు.


జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భారత పర్యటన

జర్మనీ ఛాన్సలర్, ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 25-26 తేదీలలో భారతదేశంలో పర్యటించారు. ఛాన్సలర్‌గా భారతదేశంలో మొదటిసారి పర్యటించిన ఓలాఫ్ స్కోల్జ్, తన పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ముచ్చటించారు. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై చర్చలు జరిపారు. భారత్, జర్మనీలు జీ4 లో సభ్య దేశాలుగా ఉన్నాయి.

2011లో ద్వైవార్షిక ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్ (IGC) మెకానిజం ప్రారంభమైన తర్వాత జర్మనీ ఛాన్సలర్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు నాయకుల ద్విపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదం మరియు వేర్పాటువాదంపై పోరాటంలో భారతదేశం మరియు జర్మనీల మధ్య క్రియాశీల సహకారం ఉందని వెల్లడించారు.

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారానికి భద్రత మరియు రక్షణ చురుకైన మూలస్తంభమని ప్రధాన మంత్రి అన్నారు. గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్‌ని గత ఏడాది నా జర్మనీ పర్యటన సందర్భంగా ప్రకటించామని మోదీ చెప్పారు. దీని ద్వారా క్లైమేట్ యాక్షన్ మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ రంగాలలో ఇరు దేశాలు సహకారాన్ని విస్తరిస్తున్నాయని ఆయన హైలైట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంకు 4 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డులు

6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఎపిక్ పీరియడ్ డ్రామా ఆర్ఆర్ఆర్ చిత్రం నాలుగు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ పాట (నాటు నాటు), మరియు ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలలో ఈ అవార్డులు అందుకుంది.



ఈ చిత్రం ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రముఖ అవార్డులను అందుకోగా, ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ను గెలుచుకుంది.




కేరళలో రోబోటిక్ మ్యాన్‌హోల్ క్లీనర్లు ప్రారంభం

మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడానికి రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన దేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఫిబ్రవరి 24న టెంపుల్ టౌన్‌లోని మురుగునీటిని శుభ్రం చేయడానికి కేరళ ప్రభుత్వం బాండికూట్ అనే మొదటి రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. దీనిని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు.


Y20 ఇండియా సమ్మిట్‌కు మహారాజా సాయాజీరావు యూనివర్శిటీ ఆతిథ్యం

గుజరాత్‌లోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ వడోదరలో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో నిర్వహించిన యూత్ 20 ఇండియా సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ సదస్సు 'వసుధైవ్ కుటుంబం - ఒకే భూమి-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు' అనే నినాదంతో నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో 62 దేశాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.


ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పుకు కేంద్రం ఆమోదం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును 'ఛత్రపతి శంభాజీనగర్'గా మరియు ఉస్మానాబాద్ నగరాన్ని 'ధరాశివ్'గా పేరు మార్చడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పేరు మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని గత ఏడాది జులై 16వ తేదీన మహారాష్టలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఆమోదించింది.



ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా మరియు ఉస్మానాబాద్‌ని ధరాశివ్‌గా పేరు మార్చేందుకు గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే షిండే తిరుగుబాటుతో గత జూన్‌లో ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం గత కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేసి, తాజా నిర్ణయం తీసుకుంది.


ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫిబ్రవరి 13న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015 లో తన కెరీర్ ప్రారంభించిన మోర్గాన్, ఇంగ్లాండ్ తరుపున 225 వన్డే మ్యాచులకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన నాయకత్వంలో 125 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ జట్టు 76 మ్యాచులలో విజేతగా నిలిచింది. మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ 2019లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

మోర్గాన్ 100 టీ20ఐలు (కెప్టెన్‌గా 57) ఆడిన ఇంగ్లండ్‌కు మొదటి పురుష క్రికెటర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌లో జన్మించిన మోర్గాన్, 2006 అండర్-19 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 5 ఆగష్టు 2006న స్కాట్లాండ్‌తో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ తరపున తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అలానే మోర్గాన్ రెండు దేశాల తరుపున ఒన్డే సెంచరీలు చేసిన మొదటి ఆటగాడుగా నిలిచాడు.


ఏంజెలా మెర్కెల్‌కు యునెస్కో శాంతి బహుమతి

జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫెలిక్స్ హౌఫౌట్-బోయిగ్నీ యునెస్కో శాంతి బహుమతి 2022ను అందుకున్నారు. ఈ అవార్డును గత ఏడాది చివరిలో యునెస్కో ప్రకటించింది. తాజాగా ఐవోరియన్‌లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో ఆమెకు అందజేశారు.

స్వదేశంలో మరియు యూరోపియన్ భాగస్వాములలో ప్రతిఘటన ఉన్నప్పటికీ 2015-2016 మధ్యకాలంలో 1.2 మిలియన్లకు పైగా శరణార్థులకు జర్మనీలోకి ఆహ్వానించి, వారికీ సహాయం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు అందించారు.

ఏంజెలా మెర్కెల్ ఒక జర్మన్ మాజీ రాజకీయవేత్త మరియు శాస్త్రవేత్త. ఆమె 2005 నుండి 2021 వరకు జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేశారు. మెర్కెల్ 2005లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) లో కీలక నాయకురాలిగా వ్యవహరించారు.

2014 -15 లలో సిరియా , ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇతర ప్రాంతాలలో చోటుచేసుకున్న సంఘర్షణల కారణంగా సొంత దేశాలను విడిచిన లక్షలాది మంది వలసదారులకు ఆమె నాయకత్వంలోని జర్మనీ పునరావాసం కల్పించింది.


ప్రసాద్ పథకం కింద కర్ణాటకలో 4 యాత్రిక కేంద్రాలు ఎంపిక

ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ 2.0 పథకాల కింద అభివృద్ధి కోసం కర్ణాటకలో నాలుగు యాత్రికుల కేంద్రాలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో మైసూరులోని చాముండేశ్వరి ఆలయం, ఉడిపి జిల్లాలోని శ్రీ మధ్వ వన, బీదర్ జిల్లాలోని పాప్నాష్ ఆలయం, బెళగావి జిల్లాలోని శ్రీ రేణుకా యల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. స్వదేశ్ దర్శన్ పథకం కింద హంపి మరియు మైసూరు వారసత్వ ప్రదేశాలు ఇప్పటికే ఆ రాష్ట్రం నుండి ఎంపిక చేయబడ్డాయి.

భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2014-2015 సంవత్సరంలో ప్రసాద్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశంలోని తీర్థయాత్ర గమ్యస్థానాలను ఏకీకృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఆ ప్రాంతాల నివాసితులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రసాద్ పథకం పరిధిలో ఎంపికైన ప్రాముఖ్య యాత్ర కేంద్రాల జాబితాలో అమృత్‌సర్, అజ్మీర్, ద్వారక, మధుర, వారణాసి, గయా, పూరి, కాంచీపురం, వెల్లంకన్ని, కేదార్‌నాథ్, కామాఖ్య మరియు పాట్నా వంటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి మరియు శ్రీశైలం ఇందులో చోటు దక్కించుకున్నాయి.


ఏపీలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలలో 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఈ పర్యాటక పోలీసు స్టేషన్‌లు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిచే నిర్వహించబడతాయి. ఇవిస్థానిక పోలీస్ స్టేషన్‌లతో అనుసంధానించబడి, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక భద్రతకు ఊతం ఇస్తాయి.

కొత్తగా ప్రారంభించిన టీపీఎస్‌లలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, వంటిమిట్ట, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, రాజమండ్రిలోని పుష్కరఘాట్, ద్వారకా తిరుమల, మంగినపూడి బీచ్, మోపిదేవి ఆలయం, ఇంద్రకీలాద్రి ఆలయం, భవానీ ద్వీపం, మైపాడు బీచ్, శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మహానంది, అహోబిలం, మంత్రాలయం, హార్సిలీ కొండలు, లేపాక్షి దేవాలయాలు ఉన్నాయి.


ఐసీఏఐ కొత్త అధ్యక్షుడిగా అనికేత్ సునీల్ తలతి

ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త అధ్యక్షుడుగా అనికేత్ సునీల్ తలాటి నియమితులయ్యారు. ఈయన 2023-24 ఏడాదికి సంబంధించి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే సమయంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడుగా రంజీత్ కుమార్ అగర్వాల్ ఎన్నికయ్యారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రణలోని భారతదేశపు అతిపెద్ద ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ. ఇది దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తికి సంబందించిన వ్యవహారాలను నియంత్రించడం కోసం చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం ద్వారా 1949లో స్థాపించబడింది.

ఇది భారతదేశంలో అకౌంటింగ్ ప్రమాణాలు మరియు ఆడిటింగ్ ప్రమాణాలను నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) కి, భారత ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.


అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి ఖనన్ ప్రహరీ మొబైల్ యాప్

అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నివేదించడం కోసం భారత ప్రభుత్వం "ఖనన్‌ప్రహరి" అనే మొబైల్ యాప్ మరియు కోల్ మైన్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMSMS) అనే ఒక వెబ్ యాప్‌ను ప్రారంభించింది. ఇవి అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పౌరులు ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పిస్తాయి.

తద్వారా లా & ఆర్డర్ ఎన్‌ఫోర్సింగ్‌లను ఉపయోగించి కోల్‌ఫీల్డ్ ప్రాంతాలలో అక్రమ బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి అక్రమ బొగ్గు మైనింగ్ సంఘటనను జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తాయి.


భారత్ & ఫిజీ మధ్య వీసా మినహాయింపు ఒప్పందం

భారతదేశం మరియు ఫిజీ దేశాలు దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారి వీసా మినహాయింపుకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, దౌత్య మరియు అధికారిక పాస్‌పోర్ట్ హోల్డర్‌లు 90 రోజుల వరకు వీసా లేకుండా ఇరు దేశాల్లో సందర్శించేందుకు లేదా నివశించేందుకు అనుమతి లభిస్తుంది.

ఈ ఎంఓయూ ఒప్పందం ఫిజీ ప్రధాన మంత్రి సితివేణి రబుకా మరియు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సమక్షంలో జరిగింది. ఈ ఒప్పందం ఫిజీని సందర్శించే భారత యాత్రికులకు, అలానే వైద్య చికిత్స మరియు విద్యా ప్రయోజనాల కోసం భారతదేశాన్ని సందర్శించే ఫిజీ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఫిజీ, దక్షిణ పసిఫిక్‌లోని 322 ద్వీపాలతో కూడిన ఒక ద్వీపసమూహం. దీని రాజధాని నగరం సువా. ఇది ఆస్ట్రేలియా ఖండంలోకి వస్తుంది. దీని మొత్తం జనాభా 10 లక్షలు. ఫిజీ మొత్తం జనాభాలో 37 శాతం మంది భారతీయ హిందువులు ఉండగా, 20 శాతం మంది ముస్లింలు మరియు 6 శాతం క్రైస్తవులు ఉన్నారు.


యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకుగా పేటీఎం

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ దేశంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకుగా నిలిచింది. ఈ యూపీఈ లైట్ ఫీచర్‌ తక్షణ యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది. దీని ద్వారా ఒకే క్లిక్‌తో వేగవంతమైన చెల్లింపులను నిర్వహించవచ్చు. దీని కోసం వినియోగదారుడు ప్ర్యత్యేకంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

యూపీఐ లైట్ అనేది వినియోగదారులను ఆఫ్‌లైన్‌లో చిన్న-విలువ చెల్లింపులను చేయడానికి డిజైన్ చేయబడిన 'ఆన్-డివైస్ వాలెట్' ఫీచర్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ యూపీఈ లైట్ ఫీచర్‌ను గత ఏడాది సెప్టెంబరులో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది బ్యాంకింగ్ సిస్టమ్‌పై భారాన్ని తగ్గించడానికి రూపొందించబడింది.


విశాఖపట్నంలో రెండు రోజుల 'గ్లోబల్ టెక్ సమ్మిట్'

జీ20 సమ్మిట్‌లో భాగమైన గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 16, 17వ తేదీలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25కి పైగా దేశాల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంకు ముఖ్యా అతిధిగా హాజరయ్యారు.

గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేది ఆరోగ్యం, టెక్, ఫైనాన్స్, ఫార్మా, సైన్స్ మరియు ఇతర పారిశ్రామిక రంగాలలో నూతన సాంకేతికతను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించే కార్యక్రమం. గ్లోబల్ టెక్ సమ్మిట్ బహుళ రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు పరిశ్రమ వృద్ధికి తోడ్పడే అత్యుత్తమ, మార్కెట్-ఆధారిత ఈవెంట్‌లను ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉంటుంది. దేనిని భారతదేశంలో నిర్వహించడం ఇదే మొదటిసారి.


స్పెయిన్‌లో పీరియడ్ లీవ్ చట్టం ఆమోదం

స్పెయిన్ పార్లమెంట్ ఫిబ్రవరి 16న పీరియడ్ లీవ్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం బాధాకరమైన పీరియడ్స్ ఉండే మహిళలకు పని నుండి వేతనంతో కూడిన "రుతుక్రమం సెలవు " తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనితో ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి యూరోపియన్ దేశంగా స్పెయిన్ నిలిచింది.

జపాన్ 1947లో కార్మిక చట్టంలో రుతుక్రమ సెలవులను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో దేశాల్లో మాత్రమే ఋతు సెలవులు అందించబడుతున్నాయి, వాటిలో జపాన్, ఇండోనేషియా మరియు జాంబియా వంటి దేశాలు ఉన్నాయి.


యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్

భారతీయ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ వీడియో విభాగం యూట్యూబ్‌కి కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. నీల్ మోహన్ 2015 నుండి యూట్యూబ్‌కి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గూగుల్ యొక్క ప్రారంభ ఉద్యోగులలో ఒకరైన సుసాన్ వోజ్కికి 2014 నుండి యూట్యూబ్‌ సీఈవోగా ఉన్నారు. ఆమె ఈ పదవి నుండి తప్పుకోవడంతో నీల్ మోహన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మెజారిటీ వర్గానికే పార్టీ గుర్తు

→రాజకీయ పార్టీల్లో చీలికలు తలెత్తిన ప్రతిసారీ వివాదాల పరిష్కారానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మెజారిటీ మంత్రమే పాటిస్తూ వస్తోంది.
→శిందే వర్గానికి శివసేన పార్టీ చిహ్నమైన విల్లు-బాణం కేటాయింపులోనూ ఈ విధానాన్నే అనుసరించింది.
→శాసనవ్యవస్థల్లో, పార్టీ శ్రేణుల్లో మెజారిటీ మద్దతు శిందే కూటమికే ఉందని, ఆ వర్గానికే గుర్తు పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది.
→ఇప్పుడు శివసేన తరహాలో మరో వివాదం ఎన్నికల సంఘం ముందు ఉంది. అదే బిహార్లోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్లేపీ) చీలిక వ్యవహారం.
→కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణిం చిన కొన్ని నెలలకే 2021లో రెండుగా చీలింది.
→ఓ వర్గానికి పాసవాన్ కుమారుడు చిరాగ్ పాస వాన్, మరో వర్గానికి అతని సోదరుడు పశుపతి కుమార్ పరాస్ నేతృత్వం వహిస్తున్నారు.
→తద నంతర పరిణామాల్లో 2021 అక్టోబరులో ఆ పార్టీ గుర్తు అయిన బంగళాపై ఈసీ నిషేధం విధిం చింది.
→తుది నిర్ణయం తీసుకొనేవరకు చిహ్నాన్ని రెండు వర్గాలూ వాడకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
→అయితే శివసేన వివాదంలో ఎన్నికల సంఘం అనుసరించిన వైఖరి చూస్తే.. ఈ గొడవా మెజారిటీ ఆధారంగానే పరిష్కార మయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
→1969లో కాంగ్రెస్ తొలిసారి చీలినప్పటి నుంచి ఈసీ వైఖరి మెజారిటీయే.
→ఈ విష యంలో ఎన్నికల సంఘం విధానాన్ని న్యాయస్థానాల బలప రుస్తూ వచ్చాయి.
→రాజ్యాంగంలోని 324వ అధికరణం కింద, 1968లో వెలువడిన చిహ్నాల ఉత్తర్వుల ప్రకారం. పార్టీల గుర్తులపై నిర్ణయం తీసుకొనే అధికారం ఈసీకే ఉంది.
→2017లో పార్టీపై పట్టు కోసం సమాజ్వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు ములాయంసింగ్ యాదవ్, అతని కుమారుడు అఖిలేశ్ యాదవ్ మధ్య తలెత్తిన పోరు ఎన్నికల సంఘానికి చేరింది.
→అప్పుడు కూడా శాసనసభ్యుల్లో, శ్రేణుల్లో ఆదరణ అఖిలేశ్ కే ఉందంటూ పార్టీ పేరును, గుర్తును అతనికే కేటాయించింది.
→2016లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే.. పన్నీ ర్ సెల్వం, శశికళ - పళనిస్వామి వర్గాలుగా విడి పోయి పార్టీ గుర్తు రెండాకులపై ఘర్షణ పడ్డారు.
→తదనంతర పరిణామాల్లో పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలిసిపోయారు. దీంతో మెజారిటీ ఆధారంగా ఈ వర్గమే.. ఎన్నికల సంఘం నుంచి గుర్తును దక్కించుకుంది

ఐరాస సామాజిక అభివృద్ధి కమిషన్ 62వ భేటీకి అధ్యక్షురాలిగా రుచిరా కాంబోజ్

→ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్.. ఐరాస సామా జిక అభివృద్ధి కమిషన్ 62వ సెషన్ కు అధ్యక్షత వహించనున్నారు.
→న్యూయార్క్ లో ఐరాస కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంబోజ్ ఎన్నిక జరిగింది.
→నార్త్ మాసిడోనియాకు చెందిన జాన్ ఇవనోవస్కీ, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన కార్లా మారియా కార్లసన్, లక్సెంబర్గ్ు్కు చెందిన థామస్ లమార్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
→యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నియమితు లయ్యారు.
→ఈ పాత్రలో ఆయన బాలల హక్కులపై అవగాహన కల్పిస్తారు.

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రులకు సీఈవోగా భారత సంతతి మహిళ

→భారత సంత తికి చెందిన వైద్యురాలు మేఘనా పండిట్ ను ఆక్స్ విశ్వవిద్యాలయ ఆస్పత్రులకు సీఈవోగా నియమిస్తున్నట్లు షెల్ ఫర్డ్ గ్రూప్ నకు చెందిన నేషనల్ హెల్త్ సర్వే (ఎన్ హెచ్ఎస్) ప్రకటించింది. యూకేలోని అతిపెద్ద బోధనాస్పత్రి అయిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆస్పత్రులకు మేఘన 2022 జులై నుంచి తాత్కాలిక సీఈఓగా పని చేస్తున్నారు.
→పూర్తి స్థాయి సీఈఓ నియామకానికి ఇటీవల జరిగిన ఎంపిక ప్రక్రియలో ట్రస్టు ఇంటర్వ్యూ బోర్డు ఏకగ్రీవంగా ఈ నియామకాన్ని ఆమోదించింది.
→మేఘన ఈ స్థానానికి ఎంపికైన తొలి భారతీయురాలే కాకుండా తొలి మహిళ కూడా కావడం విశేషం.
→ఈ నియామకం పట్ల గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.

ఒకసారి కొవిడ్ సోకితే వైరస్ నుంచి చిరకాల రక్షణ

→కొవిడ్ వ్యాధి సోకి సురక్షితంగా బయటపడిన వారిలో కరోనా వైరస్ ను తట్టుకునే శక్తి ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే.
→కొవిడ్ మొదటిసారి సోకినా రెండో, మూడోసారి సోకినా ఈ రోగ నిరోధకత చెక్కు చెదరకుండా నిలబడుతుందా? కొత్త వేరియంట్లు వచ్చినా తట్టుకోగలదా అనేది కీలక ప్రశ్న.
→19 దేశాలలో నిర్వహించిన శాస్త్రవేత్తలు సమాధానం కనుగొనే ప్రయత్నం కలో ప్రచురితమైంది.
→సహజ నిరోధక శక్తికి కొవిడ్ టీకా వల్ల కలిగే నిరోధకత తోడై వచ్చే హైబ్రిడ్ నిరోధకతను ఈ అధ్యయనాల్లో పరిగ ణనలోకి తీసుకోలేదు.
→కొవిడ్ ప్రారంభమైన 2019 నుంచి 2022 సెప్టెంబరు వరకు వివిధ వేరియంట్లకు గురైన వారిని పరిశీ లించారు.
→ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు ఒకసారి సోకితే మళ్లీ వైరస్ వచ్చే ప్రమాదం నుంచి 82 శాతం రక్షణ లభిస్తుంది.
→అదే ఒమిక్రాన్ బీఏ1 వేరి యంట్ నుంచి 45 శాతం మాత్రమే రక్షణ లభించింది.

జస్టిస్ గోపాల రెడ్డి కమిటీ

→ తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎస్ఆర్సీ) నూతన చైర్మన్ గా జస్టిస్ ఏ గోపాల్ రెడ్డిని ప్రభుత్వం ఫిబ్రవరి 6న నియమించింది.
→ ఈయన హైకోర్టులో జడ్జిగా పని చేసి రిటైర్ అయ్యారు.
→ కమిటీ సభ్యులుగా మంజూర్ హుస్సేన్ (జేఎన్ టీయూ రిజిస్ట్రార్, విమలా థామస్ (సిద్ది పేట మెడికల్ కాలేజీ డైరెక్టర్), జీవీ లక్ష్మణ్ రావు (చార్టెర్డ్ అకౌంటెంట్), పీ సుధీర్రెడ్డి (అడ్వకేట్), ఓయూ వీసి (ఇంజినీరింగ్ కోర్సులు), కాళోజీ వర్సిటీ వీసీ (మెడికల్ కోర్సులు), మహాత్మాగాంధీ వీసి (బీఈడీ కోర్సులు) నియమితులయ్యారు.

మొబిలిటీ చాలెంజ్

→ ఈ-మొబిలిటీ వీక్ లో భాగంగా టీ హబ్లో మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ను ఫిబ్ర వరి 7న నిర్వహించారు. దీనిలో ఐ-ఎలక్ట్రి కు ప్రథమ స్థానం దక్కింది.
→నియోమోషన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ స్టార్టప్లకు సంయుక్తంగా రూ.15 లక్షల గ్రాంట్ను అందించారు.
→మొత్తం 7 స్టార్టప్లను ఎంపిక చేయగా, అందులో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రానికి చెందినవి రెండు చొప్పున, తమిళ నాడు, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

ఎస్టీలోకి 11 కులాలు

→ ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేరుస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఫిబ్రవరి 10 ఆమోదించింది.
→వాల్మీకి బోయ, బేడర్, కిరాతక, నిషాద్, పెద్ద బోయలు, తల యారి, చుండువాళ్లు, కాయితి లంబాడాలు, భాట్ మధురాలు, చమర్ మధుర లను ఎస్టీ లుగా గుర్తించారు.
→ఈ కులాలను ఎస్టీలుగా గుర్తించాలన్ని ఎస్టీ విచారణ సంఘం 2016లో సిఫారసులు చేసింది.
→ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నివసిస్తున్న మాలి సామాజిక వర్గం తమను ఎస్టీలుగా గుర్తించాలని అనేక ఏండ్లుగా కోరుతుంది.
→వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఎస్టీలో చేర్చారు. దీంతో మొత్తం 11 కులాలు ఎస్టీ జాబితాలో చేరాయి.

దేశంలో మొదటిసారిగా డ్రోన్ల కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టము

→కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి 7న ఆవిష్కరించారు.
→దీన్ని గురు గ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై ఎయిర్ డ్రోన్ స్టార్టప్ సంస్థ 'స్కై యూటీఎం' అనే పేరుతో రూపొందించింది.
→ఇది మానవర హిత ట్రాఫిక్ నిర్వహణ. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్డీఎస్) డ్రోన్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
→దీని ద్వారా ఏ డ్రోన్ ను అయినా చూడకుండానే సుదూర ప్రాంతాలకు సురక్షితంగా ఆపరేట్ చేయవచ్చు.

సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34

→అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే అరవింద్ కుమార్లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా కేంద్రం ఫిబ్రవరి 10న పదోన్నతి కల్పించింది.
→దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఫిబ్రవరి 6న ప్రమాణం చేశారు.
→ఆయనతో పాటు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, || జస్టిస్ ఎహసాసుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా బాధ్యతలు చేపట్టారు.

ఎస్ఎస్ఎల్ వీ డి-2

→ చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్ఎస్ఎల్పీ) - డీ-2 రాకెట్ను ఫిబ్రవరి 10న విజయవంతంగా ప్రయోగించారు.
→ శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
→ దీని ద్వారా ఎస్-07, జానుస్-1, అజాదీ శాట్ -2 అనే మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవే శపెట్టింది. గతేడాది చేపట్టిన ఎస్ఎస్ఎల్పీ డీ-1 విఫలమైంది.
→ ఆజాదీ శాట్ ను దేశవ్యా ప్తంగా 750 మంది పాఠశాల విద్యార్థినులు తయారు చేశారు. దీనిలో తెలంగాణ విద్యార్థి నులు కూడా ఉన్నారు.

అసా ధారణ తెలివితేటలు కలి గిన విద్యార్థిని

→ప్రపంచంలో అసా ధారణ తెలివితేటలు కలి గిన విద్యార్థినిగా భారత అమెరికన్ నటాషా పెరి (13) నిలిచింది
→ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకుంది
→ఆమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీ) టీవై) నిర్వహించిన పోటీ పరీక్షల్లో అగ్రస్థా నంలో నిలిచింది
→మొత్తం 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు
→వారిలో నటాషా అందరి కంటే ఎక్కువ స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 2021లో జరిగిన పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది

కెనరా బ్యాంక్ ఎండీ, సీఈ వోగా కే సత్యనారాయణ రాజు

→ ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈ వోగా కే సత్యనారాయణ రాజును కేంద్ర ప్రభుత్వం నియమిం చింది.
→ ఈ పదవిలో ఉన్న ఎల్వీ ప్రభాకర్ 2022, డిసెంబర్ 31న పదవీ విరమణ పొందారు.
→ సత్యనారాయణ రాజు 2021 నుంచి కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు.
→ దీంతో నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ అహ్లు వాలియా నియమితులయ్యారు.

తుర్కియే (టర్కీ), సిరియా దేశాల్లో భూకంపం

→తుర్కియే (టర్కీ), సిరియా దేశాల్లో ఫిబ్రవరి 6న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమో దైంది.
→ఈ భూకంపం వల్ల సుమారు 34 వేలకు పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చు.
→దీంతో ఆగ్నేయ తుర్కియేలోని భూకంప ప్రభావిత 10 ప్రావి న్సుల్లో మూడు నెలల పాటు అత్యవసర స్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ)ని ఆ దేశాధ్యక్షుడు ఎర్డో గన్ విధించారు.
→తుర్కియేను ఆదుకునేందుకు భారత్ 'ఆపరే షన్ దోస్త్' పేరుతో సహాయక చర్యలు చేప ట్టింది. ఆస్పత్రులను నెలకొల్పేందుకు కావా ల్సిన పరికరాలు, ఔషధాలు, ఇతర పరికరా లతో భారత వైమానిక దళానికి చెందిన సీ17 మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ తుర్కియేకు ఫిబ్ర వరి 8న వెళ్లింది.
→కొవిడ్ సమయం 2021లో తుర్కియే భారత్కు రెండు విమానాల నిండా కొవిడ్ మందులను పంపింది.

వందేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపం: ఐక్యరాజ్యసమితి

→తుర్కియే సిరియా సరిహద్దులో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపం. చాలా తీవ్రమైనదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
→గత సందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది.
→ఈ భూకంప భారిన పడిన దేశాలకు ( తుర్కియే, సిరియా) సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 'ఆపరేషన్ దోస్త్' ని ప్రారంభిం చింది.

హైపర్సానిక్ జనరేటర్

→హైపర్సానిక్ స్పీడ్ తో ప్రయాణించే వేడి వాయువును విద్యుచ్ఛక్తిగా మార్చే జనరేట ర్ను అభివృద్ధి చేసినట్లు చైనా సైంటిస్టులు ఫిబ్రవరి 7న ప్రకటించారు.
→దీని ద్వారా ఉత్ప త్తయ్యే విద్యుత్తును మిలిటరీ లేజర్లు, రైల్ గన్లు, మైక్రోవేవ్ ఆయుధాలకు వినియోగించ వచ్చు.
→చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన సైంటిస్టులు ఈ జనరేటర్ను రూపొందిం చారు. దీనికి సంబంధించిన వివరాలు థియ రిటికల్ అండ్ అప్లయ్ మెకానిక్స్ జర్నల్ లలో ప్రచురితమయ్యాయి.

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్

→ చాట్ జీపీటీకి పోటీగా 'బార్డ్' అనే ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ను సిద్ధం చేసి నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఫిబ్రవరి 7న ప్రక టించారు.
→ముందుగా దీన్ని నమ్మకమైన టెస్ట ర్లకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత కొద్ది వారాల్లో అందరికీ అందుబాటులోకి తెస్తా మని వెల్లడించారు.
→దీన్ని మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ (LaMDA) ఆధారంగా రూపొం దించారు. సంభాషణల ద్వారా ఇది పని చేస్తుంది.
→చిన్న చిన్న సందేహాల నుంచి సంక్లిష్ట ప్రశ్నల వరకు అన్నింటికీ జవాబు ఇస్తుంది.
→అంతర్గత టెస్టింగ్ తో పాటు ఫీడ్ బ్యాక్ తీసు కొని అత్యున్నతంగా 'బార్డ్' ను రూపొందిస్తు న్నట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
→మైక్రో సాఫ్ట్ మద్దతుతో ఓపెన్ఏఐ అనే సంస్థ చాట్ జీపీటీ పేరుతో ఏఐ చాట్ బాట్ ను తెచ్చింది.

వరల్డ్ పల్సెస్ డే

→ఐక్యరాజ్యసమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గ నైజేషన్ (ఎఫ్ఎవో) ఆధ్వర్యంలో ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం (వరల్డ్ పల్సెస్ డే)ను ఫిబ్రవరి 10న నిర్వహించారు.
→స్థిర మైన ఆహార ఉత్పత్తిలో భాగంగా పప్పు దిను సుల పోషక, పర్యావరణ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
→ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2016ను అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా ప్రకటిస్తూ 2013, డిసెంబర్ 20న ఒక తీర్మా నాన్ని ఆమోదించింది.
→ఐక్యరాజ్య సమితి జన రల్ అసెంబ్లీ ఫిబ్రవరి 10ని వరల్డ్ పల్సెస్ డేగా నిర్వహించాలని 2019లో ఆమోదించి, నిర్వహించింది.

తొలి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం

→ మార్టిన్ ఫౌండేషన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సహకారంతో మహాబలి పురం సమీప పట్టిపుల్లంలో నిర్వ హించిన భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంత మైంది.
→ ముఖ్యఅతిథిగా పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరయ్యారు.
→ దేశంలోని వివిధ ప్రాంతాల ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు తయారుచేసి పంపిన 150 బుల్లి ఉపగ్రహాలను వారే రూపొందిం చిన రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు.
→ 6 నుంచి 12వ తరగతి వరకు చదివే సుమారు 3,500 మంది విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.
→ తమిళనాడు, పుదుచ్చేరిలోని మత్స్యకార కుటుంబాలకు చెందిన 200 మంది విద్యార్థులు, గిరిజన తండాల పాఠశా లల్లోని వంద మంది విద్యార్థులూ ఇందులో ఉన్నారు.
→ రాకెట్ ప్రయోగం విజయవం తంపై ముఖ్యఅతిథితో పాటు శాస్త్రవేత్తలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

గజల్ రచయిత్రి బైరి ఇందిర కన్నుమూత

→ కవయిత్రిగా, గజల్ రచయిత్రిగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలిన బైరి ఇందిర కన్ను మూశారు.
→ కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె కడవరకు ఆత్మస్థై ర్యంతో జీవించారు.
→ నేను పోయినప్పుడు ఒక కాగి తాన్ని కప్పండి.. రాసుకోవడానికి పనికొస్తుంది. మట్టిలో కప్పెట్టకండి.. మరీ గాలాడదు.. పురుగూ పుట్రా ఉంటాయి. పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్ బ్యాగులో ఉండేలా చూడండి.
→ సెల్ మర్చిపోయేరు.. బోర్ కొట్టి చస్తాను. పసుపూ గట్రా పూసి.. భయంకరంగా మార్చకండి.. పిల్లలు జడుసుకుంటారు.. పైగా నన్ను గుర్తు పట్టాలి కదా.. పనిలో పని కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి.
→ నేను ఉ(వి)న్నట్టుంటుంది అనే కవితను వీలునామాగా రాసుకున్న అక్షరజీవి ఇందిర.
→ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో జన్మించిన ఆమె స్వగ్రామంతో పాటు వరంగల్, హైదరాబాద్ లలో విద్యాభ్యాసం చేశారు.
→ తన తండ్రి భైరి రామ్మూర్తి ప్రోత్సాహంతో బాల్యంలోనే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. పెళ్లయ్యాక భర్త రామశం కరయ్యతో కలిసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
→ ప్రధా నోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. తెలం గాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు వంటి గజల్స్ సంకలనాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
→ రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి 'జనరంజక కవి' పురస్కారం అందుకున్నారు.
→ మహిళా గజల్ రచయితల్లో తొలిసారిగా గజల్స్ సంక లనాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు. ఆమె కుమార్తె హిమజా రామమ్ గజల్ గాయని.

వైభవోపేతంగా పెద్దపట్నం

→సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామున 'పెద్దపట్నం' వైభవోపేతంగా జరిగింది.
→మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ పరిధి తోటబావి సమీపంలోని కల్యాణ మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ముగ్ధు లను చేసింది.
→మల్లికార్జునస్వామిని ధ్యానిస్తూ వేలమంది ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
→జాగరణ చేస్తూ రాత్రంతా క్రతువును వీక్షించారు.
→ శనివారం రాత్రి 11.45 గంటలకు ప్రారంభమైన వేడుక ఆదివారం ఉదయం ఏడింటి వరకు కొనసాగింది.
→ ముందుగా అర కులు ఉత్సవ విగ్రహాలతో పాటు పట్నం తొక్కుతూ దాన్ని దాటగా తర్వాత వేలమంది.
→ భక్తులు శివతాండవం చేస్తూ వారిని అనుస రించారు.

బహిరంగ విపణిలోకి సిద్దిపేట సేంద్రియ ఎరువు

→సిద్దిపేట పట్ట ణంలో సేకరించిన తడి చెత్త ద్వారా తయా ఎరువు 'కార్బన్ లైట్స్' పేరిట బహిరంగ విప రానుందని మంత్రి హరీశ్ రావు తెలి పారు. ఇవ్వనున్నట్లు వెల్లడిం చారు.
→నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి ఆదివారం హైదరాబాద్ నుంచి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.
→ సేంద్రియ ఎరు వులో కర్బనం అధికంగా ఉందని, మామిడి, ఆయిల్ష్పామ్, వరి, కూరగాయలు, ఇతర పంటలకు వినియోగిస్తే అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉంద న్నారు.
→ నీటిని నిలిపే సామర్థ్యం పెరుగుతుందని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ముందుగా నియోజక వర్గ రైతులకు రాయితీపై అందించాలని నిర్ణయించామ న్నారు.
→ సంబంధిత అంశంపై 'భూ మిత్ర' పేరిట ఈ నెల 21న ఉదయం పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

చలిగంటి రఘుకు ఇండో జర్మన్ పురస్కారం

→ జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘుకు ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం-2023 లభించింది.
→జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ భారతీయ ఉత్సవాల్లో బ్రెమన్ సిటీ మేయర్ మైక్స్కేపర్, హాంబర్గ్ కాన్సుల్ జనరల్ సౌమ్య గుప్తా చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు.
→కరోనా సమయంలో రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ భాగస్వామిగా జర్మనీలోని 410 మంది భారతీ యులకు, విద్యార్థులకు ఆహారంతో పాటు ఆరోగ్యసే వలు అందించినందుకు రఘును ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
→సేవా కార్య క్రమాల్లో పాలుపంచుకున్న జర్మనీ తెలంగాణ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటరమణ బోయినపల్లి, అమికాల్ గ్రూపు చైర్మన్ అంజన సింగ్, సంస్కృతి అధ్యక్షుడు అఖిల్ అగర్వాల్ ను నిర్వాహకులు అభినందించారు.

అత్యధిక విద్యుదుత్పత్తికి తోడ్పడేలా సరికొత్త మిశ్రమ లోహం

→ విద్యుదుత్పత్తి ప్రక్రియలో వెలువడే ఉష్ణాన్ని మరింతగా వినియోగించుకునేందుకు ఉపయో గపడే మహా మిశ్రమ లోహాన్ని (సూపర్ ఎలాయ్)ను అమెరికాలోని శాండియా నేషనల్ లేబరేటరీస్ పరిశోధ కులు త్రీడీ ముద్రణ పద్ధతిలో తయారుచేశారు.
→ ప్రస్తుతం విద్యుదుత్పాదనకు ఉపయోగిస్తున్న గ్యాస్ టర్బైన్ యంత్రాల తయారీకి దీనిని ఉపయోగిస్తే.
→ అద్భుతమైన ఫలితాలు రాబట్టొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలో 80 శాతం విద్యుత్ను శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు.
→ అక్కడ ప్రస్తుతం ఉపయోగిస్తున్న టర్బైన్లు ఒక స్థాయి వరకే ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ఈ మహా మిశ్రమ లోహంతో టర్బైన్లను రూపొందిస్తే మరింత ఉష్ణోగ్రతలో కూడా పనిచేయగలిగి, ఆ వేడినంతటినీ విద్యు త్తుగా మారుస్తూ వృథాను అరికడుతుందని పరిశోధ కుల ఆలోచన.
→42 శాతం అల్యూమినియం, 25 శాతం టైటానియం, 13 శాతం నియో బియం, 8 శాతం జిర్కోనియం, 8 శాతం లి, 4 శాతం టాంటలం లోహాలను కలిపి ఈ మిశ్రమ లోహాన్ని తయారుచే శారు.
→దీనిని 800 సెల్సియస్ డిగ్రీల వరకు వేడిచేసి, వెంటనే సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకొచ్చేసినా దాని పటిష్ఠత చెక్కుచెదరలేదు.
→తేలికగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే ఈ మిశ్రమలోహాన్ని విమానాలు, రాకెట్లు, వ్యోమనౌ కలు, ఆటోమొబైల్ రంగంలోనూ వినియోగించవచ్చు.

వచ్చే దశాబ్దం నాటికి భూతాపంలో 1.5 డిగ్రీల పెరుగుదల

→పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే.. వచ్చే 10-15 ఏళ్లలో భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుందని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో జరిగిన అధ్యయనం తేల్చింది.
→హానికారక ఉద్గారాలను తగ్గించినప్పటికీ ఇది తప్పదని పేర్కొంది.
→రానున్న కొన్ని దశాబ్దాల్లో ఈ వాయువుల మోతాదు బాగా పెరిగితే ఈ శతాబ్దం మధ్య నాటికి పుడమి ఉష్ణోగ్రత సరాసరిన 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరగొచ్చని కూడా హెచ్చరించింది.
→ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి ఉష్ణోగ్రతలను పరిశీలించి భవిష్యత్లో వాతావరణ మార్పులపై ఈ లెక్కలను కట్టింది.
→ప్రపంచ దేశాలు 'శూన్య ఉద్గార స్థాయి'కి చేరుకోవడానికి మరో 50 ఏళ్లు పడితే భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ఆ దిశగా వేడి ఇప్పటికే పెరిగిందని వివరించారు. ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పెరగడమంటే 2015 నాటి పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో విఫలం కావడమేనని వారు పేర్కొన్నారు.
→ఈ అధ్యయనంలో న్యూరల్ నెట్వర్క్ అనే ఏఐని ఉపయోగించారు.

అజిత్రోమైసిన్ తో బాలింతలకు అదనపు రక్షణ

→బాలింతలకు సాధారణ యాంటీబయాటిక్ అయిన అజిత్రోమైసిన్ను ఇవ్వడం ద్వారా వారికి ఇన్ఫెక్షన్లు సోకడం లేదా మృత్యువాత పడే ప్రమాదాన్ని 33 శాతం వరకు తగ్గించొచ్చని పరిశోధకులు గుర్తించారు.
→అమెరికాకు చెందిన అలబామా విశ్వవిద్యాలయం పరిశోధకులు.. సాధారణ ప్రసవం ద్వారా బిడ్డను కన్న 29 వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
→ప్రసవ సమయంలో వీరిలో కొంత మందికి 2 గ్రా. అజిత్రోమైసిన్ను అందించారు.
→ఔషధాన్ని తీసుకున్న సమూహంలో ఇన్ ఫెక్షన్లు, మరణాల శాతం 1.6 ఉండగా తీసుకోని సమూహంలో ఇది 2.4 శాతంగా నమోదయింది.
→ఈ కిటుకును అవలంబించడం వల్ల పుట్టిన శిశువులపై అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉండబోవని 2020 సెప్టెంబరు 2022 ఆగస్టు మధ్య జరిగిన ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

చంద్రయాన్-3పై కీలక పరీక్ష విజయవంతం

→చందమామపైకి ల్యాండర్, రోవ ర్ను దించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-3 వ్యోమనౌకపై కీలక పరీక్షను భారత అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పూర్తి చేసింది.
→ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ ఇంటర్ఫి రెన్స్/ ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ కంపాటబిలిటీ (ఈఎంఐ/ ఈఎంసీ) అనే ఈ పరీక్ష బెంగళూరులోని యు. ఆర్. రావు ఉపగ్రహ కేంద్రంలో జరిగింది.
→అంతరిక్ష వాతావరణంలోని విద్యుదయస్కాంత స్థాయిని తట్టుకొని వ్యోమనౌకలోని వ్యవస్థలన్నీ సాఫీగా పని చేసేలా చూడటం దీని ఉద్దేశం.
→జనవరి 31 నుంచి ఈ నెల 2 మధ్య ఈ పరీక్ష జరిగినట్లు ఇస్రో ఆది వారం ఒక ప్రకటనలో తెలిపింది.
→చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ అనే మూడు మాడ్యూల్స్ ఉంటాయి.
→ఈ వ్యోమనౌకను జీఎస్ ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ఈ ఏడాది జూన్లో ప్రయోగించనున్నారు.

భూగర్భంలో జలసిరిని లెక్కించే విధానం

→భూగర్భంలో వందల అడుగుల లోతున ఉండే జలాలు ఎన్ని రోజుల వరకు నీటి అవసరాలను తీ ర్చగలుగుతాయో తేల్చే ఇంటిగ్రేటెడ్ హైడ్రో జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ విధానాన్ని జాతీయ భూగోళిక అధ్యయన సంస్థ(ఎన్ జీఆర్ ఐ) అభివృద్ధి చేసింది.
→దీనిద్వారా రాతి నేలల అడుగున నీటి ల భ్యత, దాని పరిమాణాన్ని పక్కాగా లెక్కించడానికి వీలవుతుందని చెబుతున్నారు.
→ముఖ్యంగా వర్షా భావ ప్రాంతాల్లో, కేవలం బోరుబావులపై ఆధార పడి వ్యవసాయం చేసే రైతులకు లబ్ధి చేకూరేలా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

దేశంలోనే మొట్టమొదటి డబుల్ ఎలక్ట్రిక్ బస్సు

దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు ముంబైలోని పార రవాణా సంస్థ అయిన బ్రిహన్ ముంబై ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్ పోర్ట్ సంస్థ ప్రారంభించింది.

మూడేళ్లలో లక్షకుపైగా వేతన జీవులు ఆత్మహత్య

→మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది దినసరి వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
→నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను ఆయన వెల్లడించారు.
→2019 నుంచి 2021 వరకు మూడే ళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన కార్మికులు ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
→ఈ మూడేళ్లలో -31,839 మంది రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు 35,850 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసు కున్నట్లు పేర్కొన్నారు.
→కాగా, అసంఘటిత కార్మి కుల సామాజిక భద్రతా చట్టం 2008 కింద రోజు వారీ వేతన కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపాం దించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
→వీటి ద్వారా జీవిత, సామాజిక భద్రత కల్పించడంతోపాటు ఆరోగ్యం, ప్రసూతి. ప్రయోజనాలు, దివ్యాంగుల రక్షణ, వృద్ధాప్య రక్షణ వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
→ప్ర ధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ద్వారా జీవిత బీమా అందిస్తున్నట్లు వెల్లడించారు.
→2022 డిసెంబర్ 31. నాటికి 14.82 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథ కాల కింద నమోదు చేసుకున్నట్లు వివరించారు.

బెంగళూరులో వైమానిక ప్రదర్శన

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదికైంది. ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా- 2023 జరిగింది. ఏరో ఇండియా-2023( 14వ ఏరో ఇండియా) షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎయిర్ షో థీమ్ ఈ సంవత్సరానికి గాను.. 'ది రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్'.

దేశంలోనే తొలి చాటి జీపీటీ ఆధారిత ఏవి టూల్

→దేశంలో మొట్టమొదటి చాటే జీపీటీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ను వెలా సిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది.
→'లెక్సీ' పేరుతో తెచ్చిన ఈ టూల్ ద్వారా తమ విని. యోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ(బెంగళూరు) తెలిపింది.

చంద్రుడిపై ధూళితో సౌర విద్యుత్తు పరికరాలు

→చంద్రుడిపై ఉండే ధూళిని ఉపయోగించి సోలా ర్సిల్స్, విద్యుత్తు ప్రసార తీగలను తయారు చేసి నట్టు అమెరికాకు చెందిన బ్లూ ఆరిజన్ అనే సంస్థ ప్రకటించింది.
→అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో సక్కు చెందిన సంస్థ ఇది. బ్లూ అల్కెమిస్ట్ పేరుతో 'మాల్టన్ రెగాలితో ఎలెక్ట్రోలిసిస్' అనే ప్రక్రియ ద్వారా సోలాస్సిల్స్ తయారుచేసినట్టు సంస్థ తెలి పింది.
→ఈ ప్రక్రియ ద్వారా అల్యూమినియం, ఇనుము, సిలికాన్లు సేకరించే అవకాశం ఉంటుం దని పేర్కొంది. 99.99 శాతం స్వచ్ఛతతో సిలికాన్ ను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది.
→మనుషులను చంద్రుడిపైకి పంపించేందుకు నాసా చేపడుతున్న కార్యక్రమానికి ఉపయోగపడేలా.. తాము అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను నాసాకు అందించను న్నట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ పేర్కొన్నది.

ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2023

→ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2023 ఫిబ్రవరి 13న దుబాయ్లో ప్రారంభమైంది. ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం 'భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం' అనే థీమ్ తో నిర్వహించారు.
→ఇది భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడంలో కీలకమైన సాధనాలు, విధానాలు, నమూనాల అభి వృద్ధికి దోహదపడుతుంది.
→ప్రపంచ మేధావులు, నిపుణులు, నిర్ణయాధికారులను ఒకచోట చేర్చిన వేదికగా చెప్పవచ్చు.

రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు 2023 పురస్కార గ్రహీతగా ప్రసాద్

→2023లో రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ ఆవార్డు జర్నలిస్ట్ ఎ.బి.కె.ప్రసాద్ కు వరించింది.
→జర్నలిజంలో ఆయన సేవలకుగానూ ఈ అవార్డు అందింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవ త్సరం రాజా రామ్మోహన్ రాయ్ పేరిట అవార్డు లను అందజేస్తుంది.

సౌదీ అరేబియా తొలి మహిళా వ్యోమగామి

→సౌదీ అరేబియాకు చెందిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి ఈ సంవత్సరం అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
→సౌదీ మహిళా వ్యోమగామి అయిన రేయానా బర్నావి ఈ సంవత్సరం అంతర్జా తీయ అంతరిక్ష కేంద్రానికి తోటి సాదీ వ్యోమగామి ఆలీ అల్-కర్నీతో కలిసి వెళ్లనున్నారు.
→ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సియోమ్ స్పేస్ మిషన్ లో భాగంగా బర్నాని, ఆల్-కార్న్ స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు

ఆసియా ప్రెసిడెంట్ కప్ విజేత భారత్

→భారత హ్యాండ్బాల్ చరిత్రలో చిరస్మరణీయ సందర్భం, జోర్డాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా ప్రెసిడెంట్ కప్ టోర్నీలో భారత అమ్మా యిల జట్టు విజేతగా నిలిచింది.
→టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్. ఓవరాల్గా 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని ము ద్దాడింది.
→ప్రెసిడెంట్ కప్ టోర్నీ గెలువడం భారత- అమ్మాయిలకు ఇది తొలిసారి కావడం విశేషం.
→రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన టోర్నీలో శైలజ శర్మ నాయకత్వంలోని భారత్ ఆడిన ఆరు మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

→టీమిండియా ఆటగాళ్లపై వివా దాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీ సీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ త న పదవికి రాజీనామా చేశారు.

నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం

→నీతి ఆయోగ్ సీఈఓగా తెలుగు అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. →1987 ఛత్తీస్గఢ్ కేడ ర్కు చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.
→ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈఓగా ఉన్న పరమేశ్వరన్ అయ్యర్ అమెరికాలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట ర్ నియమితులయ్యారు.
→కేంద్ర ప్రభుత్వం అయ్యర్ స్థానంలో బీవీఆర్ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. ఈయన ఈ పదవిలో రెండేళ్లు లేదా తదుపరి ఉత్త ర్వులు జారీ చేసేంత వరకు కొనసాగు తారు.
→ఏపీకి చెందిన బీవీఆర్ సుబ్ర హ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం.
→ఆయన తల్లిది కాకినాడ. తండ్రిది ఒడిశాలోని గుణు పురం. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విద్యా భ్యాసం విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీల్లో సాగింది.
→దిల్లీ కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ లో మెకానికల్లో బీటెక్ చేశారు. తర్వాత ఐఏఎస్కు ఎంపికయ్యారు. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
→లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో స్విట్జర్లాం డ్లోని వరల్డ్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ లా అండ్ ఎకనామిక్స్ మాస్టర్స్ చేశారు.
→2004-08, 2012- 15 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీల హయాంలో ప్రధాని కార్యాలయంలో పని చేశారు. ప్రపంచ బ్యాంకులోనూ సేవలందించారు.
→2015లో ఛత్తీ సగఢ్ కేడర్కు వెళ్లారు. 2018 జూన్ లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
→2019లో ఆ రాష్ట్ర విభజన సమయంలో ఈయన ప్రధాన కార్యదర్శి హోదాలో కీలక పాత్ర పోషించారు.
→ఛత్తీస్ గ ఢ్ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్పుడు అక్కడ తీవ్రవాద ప్రాబల్యాన్ని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషించారు.
→కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిం చారు.
→జీ-20 సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దిల్లీలోని ప్రగతి మైదాన్ పునర్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించారు.
→ఆయన సతీమణి ఉమాదేవి భమిడి పాటి ఛత్తీస్గఢ్ కేడర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధి కారిగా పనిచేసి ఇటీవల కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు.

దేశంలోని 9 రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని

→ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్రాంతాల జాబితాలో మొదటి 50 స్థానాల్లో భారత్ లోని 9 రాష్ట్రాలు ఉన్నాయి.
→ 2050లో పర్యావరణానికి హాని కలి గించే 2500కు పైగా రాష్ట్రాలు, ప్రావిన్సుల్లోని వాతావరణ మార్పులను క్రాస్ డిపెండెన్సీ ఇని షియేటివ్(ఎక్స్ఐ) గణించింది.
→ వరదలు, అడ వుల్లో మంటలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని పర్యావరణ హానికారకాల ప్రాంతాల వివరాలను ఆ సంస్థ వెల్లడించింది.
→ పర్యావరణానికి విఘాతం కలిగించే ప్రపంచంలోని మొదటి 50 స్థానాల్లో భారత్ లోని బిహార్ (22), ఉత్తర్ ప్రదేశ్ (25), అస్సాం (28), రాజస్థాన్ (32), తమిళనాడు(36), మహారాష్ట్ర(38), రాత్(48), పంజాబ్ (50), కేరళ (52) ఉన్నాయి.
→ 2050 నాటికి హాని కలిగించే మొదటి 50 స్థానాల జాబితాలో చైనా, అమెరికా, భారత్ నుంచే 80 శాతం రాష్ట్రాలు ఉండటం గమ నార్హం.
→ భారత్లోని అస్సాం రాష్ట్రంలో 1990లో పోల్చితే 2050 నాటికి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు 330 శాతానికి పైగా పెరగనున్నా యని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది.

కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో 'మిషన్ కర్మయోగి' అమలు కమిటీ

→ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'మిషన్ కర్మయోగి' కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
→కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలోని ఈ కమిటీలో పీఎంవో నుంచి ఒక సీనియర్ అధికారి, వివిధ శాఖల నుంచి ఏడుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. .
→నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్పీసీఎస్సీబీ) లేదా మిషన్ కర్మయోగి కింద నిర్దిష్ట విధానాన్ని రూపొందించే ప్రక్రియలో భాగంగా కేబినెట్ సెక్రటేరియట్ సమన్వయ విభాగాన్ని (సీఎస్సీయూ) ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. .
→ఎన్పీసీఎస్ సీబీ అమలును సీఎస్సీయూ పర్యవేక్షిస్తుందని ఆదేశాలు జారీ చేసింది ఈ ఏడాది జనవరి నాటికి సమీకృత ప్రభుత్వ ఆన్లైన్ శిక్షణ (ఐజీవోటీ) కర్మ యోగి డిజిటల్ లెర్నింగ్ వేదికపై 1,532 మంత్రిత్వశాఖలు/విభాగాలు, సంబంధిత సంస్థలు 341 కోర్సులను ప్రారంభించగా, 3,13,367 మంది ఇందులో శిక్షణకు నమోదు చేసుకున్నారు. .
→వీరంతా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ లకు చెందిన అనుభవజ్ఞులు/నిపుణులతో సంప్రదింపులకు గాను గత నెలలో 'కర్మయోగి టాక్స్ సిరీస్'ను ప్రారంభించారు.

దెబ్బతిన్న గుండెకు ప్రొటీన్ తో చికిత్స

→ గుండెకు మరమ్మతులు చేయడానికి సాయపడే ఒక 'రీకాంబినెంట్ ప్రొటీన్ టూల్బాక్స్' ను గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆరు ప్రత్యేక ప్రొటీన్లు ఉంటాయి.
→ ఇవి.. మానవ చర్మం నుంచి సేకరిం చిన కణాలను గుండె కణాలుగా మార్చడానికి ఉప యోగపడతాయి. ఇవి అచ్చం గుండె కణాల తర హాలోనే పనిచేస్తాయి.
→ దెబ్బతిన్న హృదయ కణ జాల పునరుజ్జీవనానికి వీటిని వాడొచ్చు. గుండె లోని ఒక భాగం దెబ్బతిన్నప్పుడు గుండెపోటురావొచ్చు. జీబ్రా ఫిష్ వంటి కొన్ని జీవుల్లో.. దెబ్బ తిన్న గుండె తిరిగి వృద్ధి చెందుతుంది. మానవుల్లో ఇలాంటి ప్రక్రియ ఉండదు.
→ కొత్త గుండె కణాలు వృద్ధి చెందడానికి బదులు 'స్కార్' కణజాలం ఏర్ప డుతుంది. పూర్తిగా దెబ్బతిన్న గుండెకు మార్పిడి ఒక్కటే పరిష్కారం.
→ అయితే ఇందుకు సరిపడా అవయవాలు అందుబాటులో ఉండటంలేదు. పైగా మార్పిడి చేసినా.. దాన్ని రోగి శరీరం సాఫీగా స్వీకరిస్తుందా అన్నది అనుమానమే.
→ ఈ నేప థ్యంలో సాధారణ కణాలను గుండె కణాలుగా మార్చడానికి ఉన్న అవకాశంపై శాస్త్రవేత్తలు చాలాకా లంగా పరిశోధనలు చేస్తున్నారు.
→ దెబ్బతిన్న గుండె పునరుజ్జీవనానికి ఇవి సాయపడతాయని వారు తెలి పారు. అయితే మార్పిడి ప్రక్రియలో కణాలు హానిక రంగా మారొచ్చు.
→ అందువల్ల సురక్షితమైన విధానా లపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. కణాల పనితీ రును మార్చే ప్రక్రియను సెల్యులార్ రీప్రోగ్రామిం గా గా పేర్కొంటారు.
→ ఇందులో నిర్దిష్ట ప్రొటీన్లను ఉప యోగించాలి. అవి.. సంబంధిత కణంలోని జన్యు వుల వ్యక్తీకరణను మార్చేస్తాయి. కణానికి కొత్త గుర్తింపును ఇస్తాయి.
→ ఇలాంటి రీకాంబినెంట్ ప్రొటీ న్లను ఐఐటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.

భూకంపాల గుట్టును విప్పే పగుళ్లు

→భారీ భూకంపాల ఆస్కారాన్ని పసిగట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
→భూపకాలకు సంబంధిం చిన ఒక ప్రక్రియ ఇందులో కీలకం కానుందని తేల్చారు. టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవే త్తలు ఈ ఘనత సాధిం చారు.
→భూఫలకాల అంచులు లేదా పగుళ్లను ఫాల్ట్స్ పేర్కొంటారు. ఇవి నెమ్మదిగా కలి సిపోతే.. వాటి కదలికల వల్ల స్వల్పస్థాయి ప్రకంపనలు మాత్రమే వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→వేగంగా పూడుకుపోయే ఫాల్ట్.. ఆ తర్వాత భారీ భూకంపం ద్వారా విడిపో తుందని వివరించారు.
→తదుపరి భారీ ప్రకం పనలు ఎప్పుడు వస్తాయన్నది పసిగట్టడానికి ఈ అంశం ఒక్కటే సరిపోదన్నారు.
→ఇందులో సంక్లిష్ట ప్రక్రియలు ఇమిడి ఉంటాయని పేర్కొన్నారు. అయితే భూకంపానికి ఉన్న అవకాశం, కారణాల గురించి శోధించడానికి ఇది సాయపడుతుందని తెలిపారు.
→న్యూజి లాండ్ తీరానికి చేరువలోని ఒక ఫాల్ట్ ప్రాంతంలో శిలల పరిశీలన, కంప్యూటర్ నమూనాతో విశ్లేషణ ద్వారా శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారించారు.
→నేల నుంచి దాదాపు అర మైలు దూరం డ్రిల్ చేసి ఈ శిలలను సేకరించారు. తరచూ స్వల్పస్థాయి భూకం పాలు రావడానికి కారణం.. ఫాల్లో బంక మట్టి పుష్కలంగా కలిగిన శిలలు.
→చాలా నెమ్మదిగా అతుక్కోవడమేనని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వంతో గ్లాండ్ ఫార్మా ఒప్పందం

→ప్రసిద్ధ ఔషధ సంస్థ 'గ్లాండ్ ఫార్మా' మరో రూ.400 కోట్లతో విస్తరణకు ఏర్పాట్లుచేస్తోంది.
→తద్వారా మరో 500 మందికి పైగా ఈ రంగాలకు చెందిన నిపుణులు, పాక్షిక నైపుణ్యమున్న వారికి ఉద్యో గాలు లభించే అవకాశాలున్నాయి.
→ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ సోమవారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
→ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద సమావేశంలో గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్ సాదు, పరిశ్ర మల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ జీవశాస్త్రాల విభాగం సీఈఓ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
→జీనోమ్ వ్యాలీలో 'గ్లాండ్ ఫార్మా బయో ఫార్మాస్యూటి కల్స్' సంస్థను 2022 ఫిబ్రవరిలో స్థాపించారు.
→రూ.300 కోట్లతో నెలకొల్పిన ఈ సంస్థలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులు పనిచే స్తున్నారు. వ్యాక్సిన్స్, బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్, ఇతరాలను ఉత్పత్తి చేస్తున్నారు. 40 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నాం. మా సంస్థకు దేశ వ్యాప్తంగా ఎని మిది ఔషధ, జీవశాస్త్ర ఉత్పత్తి కేంద్రాలు న్నాయి.
→తెలంగాణ ప్రభుత్వంతో భాగ స్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. తాజా విస్తరణ ప్రాజెక్టులో భాగంగా బయోలా జికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్, రికాం బినెంట్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణ యించాం' అని సంస్థ ఎండీ శ్రీనివాస్ సాదు ఈ సందర్భంగా వెల్లడించారు.
→"సంస్థ విస్తరణతో జీవ శాస్త్ర ఉత్పత్తులపై మరింత దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ రంగంలో శక్తి సామర్థ్యా లను పెంచుకోవడానికి వీలు కలుగుతుంది.
→తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. జీవ శాస్త్ర రంగంలో రాష్ట్రం ఎంత బలంగా ఉందో తెలపడానికి తాజా పెట్టుబడులే నిదర్శనం.
→ఔషధ, జీవశాస్త్ర రంగాల్లో తెలంగాణ అంతర్జా తీయంగా మరింత ఖ్యాతి గడించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రమాదమెరుగని పిలాటస్ విమానం

→పైలెట్లకు ప్రాథమిక స్థాయిలో శిక్షణ అందించే పీసీ-7, ఎంకే-2 రకం పిలాటస్ విమానం.. ప్రమాదమెరుగని శిక్షణ విమా నంగా అరుదైన ఘనత సాధించింది.
→వాయుసేనలో దశాబ్ద కాలంగా రెండు లక్షల గంటల ప్రమాద రహిత ప్రయాణంతో రికార్డు సృష్టించింది.
→2013లో ఈ ఆధునిక యుద్ధ శిక్షణ విమానాలను భారతీయ వాయుసేన స్విట్జర్లాండ్ నుంచి కొనుగోలు చేసింది.
→మొత్తం 75 శిక్షణ విమానాలను కొనుగోలు చేయగా, ఐదు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
→దుండిగల్ ఎయి ర్ఫోర్స్ అకాడమీ, చెన్నై తాంబరంలోని ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ స్కూల్లో కలిపి 2 లక్షల గంటల ప్రమాద రహిత విమానయాన మైలురాయిని చేరుకున్నాయి.
→ఈ నేపథ్యంలో ఎయిర్ మార్షల్ బి. చంద్రశేఖర్, చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ అతుల్ ఆనంద్ ఇందులో ప్రయాణించి రెండు లక్షల గంటల (చివరి గంట) ప్రయాణాన్ని పూర్తిచేశారు. డిప్యూటీ కమాండెంట్ ఎయిర్ వైస్మర్షల్ డి.ఎస్. జోషి, చీఫ్ ఇన్స్ట్రక్టర్ (ఫ్లయింగ్), ఎయిర్ సీఎండీ ఈ అనిష్ అగర్వాల్, చీఫ్ ఇంజినీరింగ్ అధికారి డి. సంతుష్ట్ తదితరులు పాల్గొన్నారు. దుండిగల్ ఎయి ర్ఫోర్స్ అకాడమీ ఏటా పైలెట్లకు 25 వేల గంటల శిక్షణ ఇస్తోందని ఎయిర్ మార్షల్ బి. చంద్రశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తొలిసారి ఉక్రెయిన్లో బైడెన్

→అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమ వారం ఆకస్మాత్తుగా ఉక్రెయిన్లో తొలిసారి పర్య టించారు.
→ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలు పెట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సంఘీభావ సంకేత కంగా ఆ దేశ రాజధాని కీవు చేరుకు న్నారు.
→ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ లెన్స్క బేటీ అయ్యారు. యుద్ధ నేపథ్యంలో తదుపరి చర్యలను అడిగి తెలుసుకు న్నారు.
→మరిన్స్కై ప్యాలెస్లో ఆయనతో కలిసి బైడెన్ మాట్లాడుతూ రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధానిని త్వరగా ఆక్రమించుకుంటాయని ఏడాది క్రితం ఆందోళన చెందినట్లు గుర్తు చేసుకు న్నారు.
→ఏడాదిగా సాగుతున్న పోరును 'కిరాతకం, 'అన్యాయమైన యుద్ధం' అని అభివర్ణించారు. "ఏడాది తరువాత చూస్తే కీవ్ ధైర్యంగా నిలబడింది. ఉక్రెయిన్ నిలబడింది. ప్రజా స్వామ్యం నిలబడింది. అమెరికా మీతో కలిసి ఉంది. ప్రపంచమంతా మీతో ఉంది" అని బైడెన్ పేర్కొన్నారు.
→హోవిట్జర్ షెల్స్, యాంటీ ట్యాంకు మిస్సైల్స్, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్లు సహా 50 మిలియన్ డాలర్ల అదనపు సాయాన్ని ప్రకటించారు.
→ఇప్పటి వరకూ ఉక్రె యిన్ కు అమెరికా 50 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది.
→దీర్ఘశ్రేణి ఆయు దాలు, తమకు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకూ సరఫరా చేయని ఇతర ఆయుధాలు విషయాన్ని బైడెన్లో చర్చించినట్లు జెలెన్స్కీ వెల్లడించారు.
→అయితే కొత్త హామీల గురించి ఏమీ వివరించలేదు. తమ చర్చలు పూర్తిస్థా యిలో ఫలవంతమయ్యాయని చెప్పారు.
→కీలక యుద్ధ సమయంలో అమెరికా అధ్య క్షుడు ఉక్రెయిన్లో పర్యటించడం వెనుక ఆ దేశానికి మద్దతు ఇవ్వడంలో మిత్రపక్షాలను ఐక్యంగా ఉంచడం లక్ష్యంగా ఉంది.
→త్వరలో రెండు వైపుల నుంచి యుద్ధం తీవ్రమవు తుందన్న అంచనాలు ఉన్నాయి.
→తమకు వాగ్దానం చేసిన మేరకు ఆయుధాలను అందించాలని జెలెన్స్క మిత్రపక్షాలను కోరు తున్నారు. అంతేకాకుండా యుద్ధ విమానా లను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
→దీనిని అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే..
→ఉక్రెయిన్ కు వేగంగా వేలాది ఫిరంగి గుళ్లను అందించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మార్గాలను అన్వేషించాలని ఈయూ దౌత్యాధికారులు సూచించారు.
→లేదంటే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

మళ్లీ క్షిపణుల్ని పరీక్షించిన ఉత్తర కొరియా

→ ఉత్తర కొరియా మరో రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల్ని పరీక్షించింది.
→ రాజధాని ప్యాంగ్యాంగ్కు ఉత్తరాన ఉన్న తీర పట్టణం నుంచి రెండు క్షిపణుల్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది.
→ ఇవి రెండూ తమ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) వెలుపల పడ్డాయనీ, దానివల్ల ఆ ప్రాంతంలోని తమ విమానాలకు గానీ, యుద్ధ నౌకలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని జపాన్ ప్రకటిం చింది. ఈ పరీక్ష విషయాన్ని ఉత్తర కొరియా అధికా రిక వార్తాసంస్థ కూడా ధ్రువీకరించింది. గరిష్ఠంగా 100 కి. మీ. ఎత్తుకు వెళ్లి, 395 కి. మీ. దూరంలోని లక్ష్యాలపై ఇవి గురి పెట్టాయని తెలిపింది. దీనిలో 600 మి.మీ. బహుళ రాకెట్ లాంచర్ వ్యవస్థను వినియోగించారు. దక్షిణ కొరియాలోని ప్రాంతాలన్నీ ఈ క్షిపణి పరిధిలోనే ఉంటాయి. యుద్ధాల్లో వ్యూహాత్మక అణ్వాయుధాలు వాడేందుకు ఇవి ఉపయోగపడతాయి.
→ఇలా క్షిపణుల్ని పరీక్షించడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. దీనిపై జపాన్ మండిపడింది. వెంటనే భద్రత మండలి సమావేశాన్ని నిర్వహించాలని ఐరాసను కోరింది.
→ఏడాది కాలంలో అత్యధిక స్థాయిలో 70కి పైగా క్షిపణుల్ని ఉత్తర కొరియా పరీక్షించింది. →అమెరికా- దక్షిణ కొరియా సైన్యాల సంయుక్త విన్యాసాలకు సమా ధానంగా అనూహ్య రీతిలో స్పందిస్తామని ఇప్పటికే ఈ దేశం హెచ్చరించిన విషయం తెలిసిందే. →ఈ విన్యా సాలు తమపై చొరబాటుకేనని ఉత్తర కొరియా అను మానిస్తోంది. అమెరికా దళాల చర్యలపై ఆధారపడి తమ స్పందన ఉంటుందని దేశాధినేత కిమ్ సోదరి యో జోంగ్ స్పష్టం చేశారు. →ఈ దేశం చేస్తున్న పరీక్షలు అంతర్జాతీయ శాంతికి విఘాతంగా మారనున్నాయని దక్షిణ కొరియా, జపాన్ పేర్కొంటున్నాయి. →ఉ. కొరియా అణ్వాయుధ కార్యక్రమానికి సహకరిస్తున్న నలుగురు వ్యక్తులు, ఐదు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ద. కొరియా ప్రకటించింది.

సి-32 విమానంలో బైడెన్ ఉక్రెయిన్ పర్యటన

→యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి వెళ్లొ చ్చిన తీరు ఆద్యంతం రహస్యమే.
→శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయ టకు రావడం నుంచి పోలండ్ మీదుగా ఉక్రెయి న క్కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే అమెరికా బలగాలే లేని యుద్ధక్షేత్రానికి అధ్యక్షుడు వెళ్లడం ఆధునిక చరి త్రలో ఇదే తొలిసారి.
→గతంలో ఒకరిద్దరు అధ్య క్షులు వేరే దేశాల్లో ఇలాంటి ప్రాంతాలకు వెళ్లినా అక్కడ ఆ సమయంలో అగ్రరాజ్యం బలగాలు ఉండేవి.
→అమెరికా అధ్యక్షుడి హోదాలో 2006లో జార్జ్ బుష్ బాగ్దాద్లో పర్యటించారు. 2014లో బరాక్ ఒబామా అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ప్రత్యక్షమయ్యారు.
→2019లో డొనాల్డ్ ట్రంప్ అఫ్గా నిస్థాన్లో బాగ్రామ్ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులతో కలిసి సంబరాలు చేసుకొన్నారు.

సంసద్ రత్న అవార్డులకు 13 మంది ఎంపీలు

→సంసద్ రత్న అవార్డులకు (2023) గాను కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీ, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, సీపీఎం నేత జాన్ బ్రిటాస్ సహా 13 మంది ఎంపీలు నామినేట్ అయ్యారు.
→వీరిలో 8 మంది లోక్సభ, ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు అవార్డులను రూపొందించిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
→వీరిలో ముగ్గురు రిటైర్డ్ సభ్యులున్నట్లు పేర్కొంది. కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఈమేరకు నామినేట్ చేసినట్లు తెలిపింది.
→స్థాయీసంఘాలకు సంబం ధించి.. జయంత్ సిన్హా (భాజపా, ఝార్ఖండ్) నేతృత్వంలోని ఫైనాన్స్ కమిటీ (లోక్సభ), ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వి. విజయసాయిరెడ్డి చైర్మన్ ఉన్న రవాణా, పర్యాటక, సాంస్కృతిక కమిటీ (రాజ్యసభ)లను ప్రత్యేక అవార్డుల కేటగిరీ కింద జ్యూరీ నామినేట్ చేసింది.

కొండచరియలు విరిగిపడే ముప్పును పసిగట్టే ఏఐ అల్గోరిథమ్

→ కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను అత్యంత కచ్చితత్వంతో ముందుగానే పసిగట్టే దిశగా భారత శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. →ఇందుకోసం వారు కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్తో ఒక కొత్త అల్గోరిథము అభి వృద్ధి చేశారు. → హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఉన్న ఐఐటీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. → కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతోంది. వీటిని తగ్గించాలంటే.. కొండచరి యలు విరిగిపడే ముప్పున్న ప్రాంతాలను గుర్తిం చాలి. → ఇందుకోసం కొండ వాలు, ఎత్తు, అక్కడి మట్టి రకం, నదులకు ఆ ప్రాంతం ఎంతదూరంలో ఉంది. వంటి వివరాలను సేకరించాలి. → గతంలో అక్కడ జరిగిన ఘటనలనూ తెలుసుకోవాలని పరిశోధనలో పాలుపంచుకున్న డి.పి. శుక్లా పేర్కొన్నారు. ఈ విష యంలో ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. → అనుభవాల ఆధారంగా కంప్యూటర్లు నిర్దిష్ట సామర్ధ్యాన్ని అలవర్చుకోవడం ఇందులో కీలకం. → ఈ ప్రక్రి యలో.. డేటాను విశ్లేషించి, నిర్దిష్ట పోకడలను గుర్తించి, అంచనాలను వెలువరించే అల్గోరిథమ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. → ఈ విధానంలో కచ్చితత్వం కావాలంటే భారీస్థాయిలో శిక్షణ డేటా అవసరం. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం చాలా అరుదు. → దీనివల్ల అల్గోరిథమ్ శిక్షణకు అవసరమైన డేటా అందుబాటులో ఉండదు. సంబంధిత డేటాలోని సానుకూల, ప్రతికూల అంశాల మధ్య అసమతౌల్యత తలెత్తుతుంది. → ఇది అంచనాల కచ్చితత్వాన్ని దెబ్బతీ స్తుంది. దీన్ని అధిగమించడానికి శుక్లా బృందం కొత్తగా మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్న అభివృద్ధి చేసింది.

నానోరేణువుల వీక్షణ సులువు

→ ప్రస్తుత మైక్రోస్కోపులు పసి గట్టలేని సూక్ష్మ నానో రేణువులను వీక్షించే సరికొత్త విధానాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు కను గొన్నారు.
→ ఇందు కోసం వారు న్యూరోమా ర్ఫిక్ కెమెరాతో కూడిన ఆప్టికల్ మైక్రోస్కోపీ, మెషీన్ లెర్నింగ్ అల్గోరిథ మ్లను ఉపయోగించారు.
→ 50 నానోమీటర్ల కన్నా చిన్నగా ఉన్న రేణువులను గుర్తించడా నికి ఇది సాయపడుతుంది.
→ఆప్టికల్ మైక్రోస్కోపులను కనుగొన్నప్పటి నుంచి శాస్త్రవేత్తలు 'వివర్తన పరిమితి' అనే అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
→ఈ పోకడ కారణంగా.. 200-300 నానోమీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉన్న రెండు వస్తువుల మధ్య వైరుధ్యాలను ఆ సాధనాలు పసిగట్టలేవు.
→దీన్ని న్యూరోమా ర్ఫిక్ కెమెరాతో ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అధిగ మించారు. 100 గ్రాముల బరువుండే ఈ సాధనం.. మానవ కంట్లోని రెటీనా తర హాలో పనిచేస్తుంది.
→కాంతి సంకేతాలను విద్యుత్ ప్రకంపనలుగా మారుస్తుంది. సంప్ర దాయ కెమెరాలతో పోలిస్తే దీనితో అనేక ప్రయోజనాలు ఉంటాయి.
→ దీనికి ప్ లెర్నింగ్ అల్గోరిథము జోడించడం ద్వారా వివర్తన పరిమితిని శాస్త్రవేత్తలు అధిగమిం చారు. సూక్ష్మమైన ఒక ఫ్లోరోసెంట్ బీడ్ను విజయవంతంగా వీక్షించగలిగారు.

సుప్రీంకోర్టులో వాదనల ట్రాన్స్క్రిప్షన్ ప్రత్యక్ష ప్రసారం తొలిసారి ప్రయోగాత్మకంగా అమలు

→ న్యాయ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను మరింత వినియోగించుకునే దిశగా సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది.
→ కృత్రిమ మేధస్సు, సహజ | భాషా ప్రక్రియ సహాయంతో అత్యున్నత న్యాయస్థా నంలో మొట్టమొదటిసారి వాదనల ట్రాన్స్క్రిప్షన్(లిఖి తపూర్వక మార్పిడి)ను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
→ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టు గదిలో ప్రయోగాత్మకంగా దీనికి శ్రీకారం చుట్టారు.
→ సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడానికి ముందు పరిశీలన కోసం సంబంధిత ప్రతులను న్యాయవాదులకు అందజేయనున్నారు.
→ ఇదొక సాధారణ ప్రక్రియగా కొనసాగడానికి ముందు అందులోని లోటుపాట్లను సవరించేందుకు వీలుగా ఒకటి లేదా రెండు రోజులపాటు ప్రయోగాత్మక ప్రాతిపదికగా ఈ ప్రక్రియ చేపడతామని సీజేఐ తెలిపారు.
→ 2022 మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని | రాజ్యాంగ ధర్మాసనం వాదనలను చేపట్టింది.

భారతీయ యువతకు 2,400 యూకే వీసాలు రెండేళ్లు అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం

→అర్హులైన 18 నుంచి 30 ఏళ్ల వయసున్న భారతీయ యువతకు 'యూకే-ఇండియా యువ నిపు ణుల ఒప్పందం' కింద 2,400 వీసాలు జారీ చేయను న్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది.
→దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఓ ప్రక టనలో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. అభ్యర్థి వీసా పొందాలంటే ముందుగా బాలెట్ దశలో ఎంపిక వ్వాలి.
→ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు బాలెట్ నమోదుకు అవకాశం ఉంటుంది. దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు.
→ఈ ప్రక్రియ మొదలు పెట్టాలంటే ఈ | వీసా పొందడానికి పూర్తి అర్హత ఉందని అభ్యర్థి తప్ప నిసరిగా ప్రకటించాలి.
→బాలెట్ దశలో ఎంపికయిన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన తర్వాత ఆరు నెలల్లోగా యూకేకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
→ఈ దఫా వీసా పొందలేకపోతే జులైలో ప్రారంభమయ్యే రెండో బాలెట్ ద్వారా మరోసారి ప్రయత్నించొచ్చు.
→భారత్, యూకే ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం యూకే యువత రెండేళ్ల పాటు భారత్లో ఉండొచ్చు.
→అదే విధంగా భారతీయులకూ యూకేలో నివసించే అవకాశం ఉంటుంది.

మాతృభాషలో బోధనతో విద్యార్థులకు మేలు: యునెస్కో

→చిన్న వయసులో మాతృభాషలో విద్యా బోధన కొనసాగిస్తే అది విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని యునెస్కో పేర్కొంది.
→అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలూ మాతృభాషలో బోధన కొనసాగించాలని పిలుపునిస్తూ ట్వీట్ చేసింది.
→"విద్యార్థులు పాఠశాలలో చేరిన ప్రాథమిక దశలో మాతృభాష ఆధారంగా బహుభాషా విద్యను కొనసా గిస్తే అది పిల్లలు బాగా నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి, సమాజంలో పూర్తిగా భాగస్వాములు కావ డానికి ఉపయోగపడుతుంది.
→ప్రపంచవ్యాప్తంగా 40% విద్యార్థులకు వారు మాట్లాడే, అర్థం చేసుకొనే భాషలో చదువుకొనే అవకాశం లేదు.
→మాతృభాషలో విద్యా బోధన జరిగిన చోట ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి మిగతా పిల్లలకంటే 30% ప్రాథమిక అంశా లను వారు చదవగలుగుతారు.
→అందువల్ల మాతృభా | షాధారిత బోధనను అమలు చేయడానికి ప్రపంచ దేశా లకు ఇదే సరైన సమయం.
→అందుకే 24వ అంతర్జా తీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా బహు భాష విద్య మార్పునకు ఒక అవసరం' అన్న అంశంపై దృష్టిసారించాం" అని యునెస్కో పేర్కొంది.

దేశవ్యాప్తంగా స్మగ్లర్లపై ఆపరేషన్ గోల్డెన్ డాన్!

→ ఇండో-నేపాల్ సరిహద్దుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో 'ఆపరేషన్ గోల్డెన్ డాన్ పేరుతో ఏకకాలంలో దాడులు చేశారు.
→ ఈ దాడుల్లో రూ.51 కోట్ల విలువైన 100 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలి పారు.
→ అక్రమ రవాణాకు సంబంధించి పది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఏడు గురు సుడాన్ దేశస్థులు ఉన్నారు.
→ పట్నా, పుణె, ముంబయిలతో పాటు ఇండో-నేపాల్ సరిహద్దులో తని ఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
→ నిందితుల నుంచి రూ.1.35 కోట్లు విలువ చేసే దేశ, విదేశీ కరె న్సీని సైతం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
→ అక్రమ బంగా రాన్ని ఎక్కువ భాగం పేస్ట్ రూపంలో ఇండో-నేపాల్ సరిహద్దు గుండా బిహార్ రాజధాని పట్నాకు తీసుకొ చ్చారు.
→ ఆపై రైళ్లు, విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా ముంబయికి రవాణా అవుతున్నట్లు గుర్తించారు.
→ ముగ్గురు సుడాన్ దేశస్థులను పట్నా రైల్వే స్టేష న్లో ముంబయి రైలు ఎక్కుతున్న సమయంలో పట్టు కున్నట్లు డీఆర్ఎస్ఐ అధికారులు తెలిపారు.
→ వీరి వద్ద 37. 126 కిలోల బంగారం పేస్ట్ లభ్యమైంది.
→ స్లీన్లెస్ జాకెట్లలో 40 పాకెట్లలో రహస్యంగా దాచిన బంగారాన్ని మరో ఇద్దరు సుడాన్ దేశస్థుల నుంచి స్వాధీనం చేసు కున్నారు.
→ మూడో విదేశీయుడు సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా కార్యకలాపాలకు ఏర్పాట్లు చేస్తున్నాడని తేలింది.
→ ఇద్దరు మహిళల బృందాన్ని బస్సులో హైదరా బాద్ నుంచి ముంబయి వెళ్తుండగా పుణెలో అరెస్ట్ చేశారు.
→ వారి నుంచి వివిధ రూపాల్లో ఉన్న 5.65లో బగారాన్ని స్వాధీనం చేసుకున్నా మని అధికారులు వెల్లడించారు.

ఉత్తర కొరియా అణు ప్రయోగాలు

→అణ్వాయుధ పరీక్షలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న ఉత్తర కొరియా... సొంత ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్వాసుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తోంది.
→ప్రపంచంలోనే అత్యధిక అణు సామర్థ్యం కలిగిన దేశంగా అవతరించా లన్న అక్కడి పాలకులు స్వార్థ చింతనే దీనికి ప్రధాన కారణం. ఉత్తర కొరియాలోని 'పుంగేరి' భూగర్భ అణు పరీక్షా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రయోగాలు ఎంతటి విపత్తును కలిగిస్తున్నాయో సియోల్కు చెందిన ఓ మానవ హక్కుల సంఘం తాజా అధ్యయన నివేదికలో వెల్లడించింది.
→భూగర్భ జలాలు కలుషితమవుతున్నా యని, దీంతో ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
→ఉత్తర కొరియా ఏడో అణు పరీక్షకు సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న వేళ ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
→అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వాల అంచనా ప్రకారం.. ఉత్తర కొరియా 2006-17 మధ్యకాలంలో ఉత్తర హమ్్యంగ్ ప్రావిన్స్లోని పుంగేరి కేంద్రంలో రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది.
→ఈ క్రమంలో ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియోధార్మిక పదార్థాలు స్థానికంగా ఎనిమిది నగరాలు, కౌంటీల్లో విస్త రించి ఉండొచ్చని 'ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్' పేర్కొంది.
→ఈ ప్రాంతాల్లో పది లక్షలకుపైగా జనాభా నివ సిస్తోంది. తాగునీటితో సహా రోజువారీ కార్యకలాపాల్లో చారు భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు.
→ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల కారణంగా.. అక్కడి ప్రజలూ కొంతవరకు ప్రమాదంలో పడొచ్చని నివేదిక పేర్కొంది.
→2015లోనే దక్షిణ కొరియా ఆహార భద్రతా సంస్థ తాము దిగుమతి చేసుకున్న పుట్టగొడుగుల్లో సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా రేడియోధా ర్మిక సీజీయం ఐసోటోపులను గుర్తించినట్లు వెల్లడించింది.
→చైనా ఉత్పత్తులుగా వాటిని విక్రయించినప్పటికీ, వాస్తవా నికీ అవి ఉత్తర కొరియాలో పండించినవేనని పేర్కొంది.
→అయితే, భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్న ఆరోప ణలను ఉత్తర కొరియా కొట్టిపారేస్తూ వస్తోంది.
→అణు పరీక్షల తరువాత ఎటువంటి హానికరమైన పదార్థాలు లీక్ కాలేవని పేర్కొంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రం అందించలేదు.
→2018లో పుంగేరి న్యూక్లియర్ పరీక్ష కేంద్రంలోని కొన్ని సొరంగాలను పరిశీలించేందుకు వెళ్లిన కొంత మంది విదేశీ జర్నలిస్టుల 'రేడియేషన్ డిటె క్టర్లనూ ఉత్తరకొరియా జప్తి చేసింది.
→ఈ నేపథ్యంలో పంగేరి పరిసరాల్లోని ప్రజలకు రేడియేషన్ పరీక్షలు నిర్వ హించాలని, అంతర్జాతీయ విచారణ చేపట్టాలని అధ్య యన సహ రచయిత హూబర్ట్ యంగ్ హ్వాన్ లీ డిమాండ్ చేశారు.
→ఐరాస, ఇతర ప్రభుత్వ నివేదికలు, అణు, వైద్య నిపుణులతో పాటు ఉత్తర కొరియా నుంచి తప్పించుకు వచ్చిన పౌరుల సమాచారం విశ్లేషణ ఆధా రంగా అధ్యయనం కొనసాగింది.

'ఐకామ్' నుంచి చిన్న ఆయుధాలు, పిస్టళ్లు

→చిన్న ఆయుధాలు, పిస్టళ్ల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి యూఏఈకి చెందిన కారకల్లో ఎంఈఐఎల్ (మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) గ్రూపు సంస్థ అయిన ఐకామ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చు కుంది.
→దీని ప్రకారం హైదరాబాద్ శివార్లలోని తన యూనిట్లో చిన్న ఆయుధాలు, పిస్టళ్లు తయారీ చేసి మన దేశంలోని రక్షణ, పోలీసు బలగాల అవసరాలకు ఐకామ్ సరఫరా చేస్తుంది.
→యూఏఈలోని అబుదాబీలో జరిగిన అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎక్స్పో, 'ఐడీఎక్స్- 2028'లో ఐకామ్, కారకల్ సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
→కారకల్ ఈఎఫ్ పిస్టల్, సీఎంపీ 9 సబ్మెషీన్ గన్, సీఏఆర్ 814, సీఏ ఆర్ 816, సీఏఆర్ 817, డీఎంఆర్ టాక్టికల్ స్నైపర్ రైఫిల్స్, కాకకాల్ సీఎస్ఆర్ 338, సీఎస్ఆర్ 308, బోల్ట్ యాక్షన్ స్నైపర్ రైఫిల్స్ తదితర ఆయుధాలకు ఎంతో ఆదరణ ఉంది.
→ఈ ఆయుధాలను ఇకపై మనదేశంలో ఐకామ్ ఉత్పత్తి చేస్తుంది. మన రక్షణ రంగాన్ని బలో పేతం చేయటానికి కారకల్లో తాము కుదుర్చుకున్న ఒప్పందం వీలుకల్పిస్తుందని ఐకామ్ ఎండీ పి. సుమంత్ అన్నారు.
→మేక్-ఇన్-ఇండియాలో ఒక ముఖ్యమైన ఘట్టంగానూ నిలిచిపోతుందని వివరించారు.
→రక్షణ. రంగంలో స్వయంసమృద్ధి సాధించటానికి ప్రైవేటు రంగాన్ని అనుమతించటం ద్వారా ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని, దీనివల్ల తమ వంటి సంస్థలు ఆయుధాల తయారీలోకి అడుగుపెట్టే వీలుకలి గిందని సుమంత్ పేర్కొన్నారు.
→ఐకామ్ ప్రస్తుతం పలు రకాలైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కమ్యూనికేషన్ సిస్ట మ్స్ లు, డ్రోన్- యాంటీ డ్రోన్ సిస్టమ్లు ఉత్పత్తి చేస్తోంది. భారతీయ మార్కెట్ కోసం ఐకామ్న తాము భాగస్వామిగా ఎంచుకున్నట్లు కారకల్ సీఈఓ హమద్ అల్ అమెరి పేర్కొన్నారు.
→అధునాతన చిన్న ఆయుధా లను ఆవిష్కరించటంతో తమ శక్తిసామర్థ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందని వివరించారు.

స్టెమ్ సెల్స్ మార్పిడితో జర్మనీ పేషెంట్కు హెచ్ఐవీ నయమైంది

→ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) మార్పిడితో మరోవ్యక్తికి ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీ నుంచి విముక్తి లభించింది.
→ ఇప్పటివరకు లండన్ పేషెంట్, బెర్లిన్ పేషెంట్ గా గుర్తింపు పొందిన ఇద్దరికి ఈ ట్రీట్ మెంట్ తో హెచ్ఐవీ నయం కాగా, తాజాగా డసె స్టార్స్ పేషెంట్ గా గుర్తింపు పొందిన 53 ఏండ్ల వ్యక్తి కూడా హెచ్ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు.
→ జర్మ నీలోని డసెల్డార్ఫ్ యూనివర్సిటీ హాస్పిటల్ డాక్టర్లు నిర్వహించిన తాజా చికిత్స వివరాలు 'నేచర్' జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి. ప్రపంచంలో స్టెమ్ సెల్స్ థెరపీతో హెచ్ఐవీ నయమైన మూడో పేషెంట్ ఈయనేనని హాస్పిటల్ వర్గాలు వెల్లడించా యి.
→ "డసెల్జార్చ్ పేషెంట్ కు హెచ్ఐవీ సోకడంతో పాటు అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా (ఎముక మజ్జపై ప్రభావం చూపే కేన్సర్ వచ్చింది.
→ ల్యుకేమి యా ట్రీట్మెంట్ కోసం ఇతనికి 2013 ఫిబ్రవరిలో ఓ వ్యక్తి నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ను మార్పిడి చేశాం. తర్వాత 9ఏండ్లపాటు మానిటర్ చేశాం.
→ గత నాలుగేండ్లుగా ఎయిడ్స్ ట్రీట్మెంట్ కు వాడే యాంటీ రిట్రోవైరల్ మందులను కూడా ఆపేశాం. ఇప్పుడు ఇతని శరీరంలో హెచ్ఐవీ ఆనవాళ్లు పూర్తిగా నశించాయి” అని డాక్టర్లు తెలిపారు.
→కొంతమందికి సీసీఆర్ అనే జన్యువులో మ్యుటేషన్ (మార్పు) జరు 5 గుతుంది. దానివల్ల సహజంగానే హెచ్ఐవీ నుంచి నిరోధకత వస్తుంది.
→గతంలో లండన్, బెర్లిన్ పేషెం ట్లకూ ఇలాగే సీసీఆర్5 జీన్ లో మ్యుటేషన్ జరిగిన దాతల నుంచి స్టెమ్ సెల్స్ మార్పిడి చేసి హెచ్ఐవీని నయం చేశారు.
→ఇప్పుడు మేం ఇదే పద్ధతిలో ట్రీట్మెం ట్ చేసిన డసెల్డార్చ్ పేషెంట్ కూడా ఇటు హెచ్ఐవీ నుంచి, అటు ల్యుకేమియా నుంచి కోలుకున్నాడు"" అని డాక్టర్లు వివరించారు.
→అయితే, ఇదే తరహా | ట్మెంట్ అందరికీ పని చేస్తుందన్న గ్యారంటీ లేదని మరికొందరు రీసెర్చర్లు స్పష్టం చేస్తున్నారు.
→స్టెమ్ సెల్స్ మార్పిడితో ఇప్పటివరకు ముగ్గురికే హెచ్ఐవీ నయమైందని, కానీ ఇదే ట్రీట్మెంట్ తీసుకున్న చాలా మందికి మాత్రం నయం కాలేదని అంటున్నారు.

యూపీఐతో పేనౌ లింక్

→మనదేశానికి చెందిన డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ యూపీఐ, సింగపూర్ కు పేనౌలను దేశాలూ లింక్ చేశాయి.
→దీనివల్ల రెండు దేశాల్లో నూ డిజిటల్ ట్రాన్స్ ఫర్స్ వేగంగా సులువుగా జరుగుతాయి.
→నగదు బదిలీకి కూడా అతి తక్కు వగా ఖర్చు అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, సింగపూర్ పీఎం లీ సియెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రియల్ఎం క్రాస్బర్టర్ పేమెంట్ సిస్టమ్ను ప్రారంభించారు.
→ఇన్నోవేటి వ్ టెక్నాలజీ సొల్యూషన్స్ విషయంలో ఇక నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బల పడతాయని అన్నారు.
→రెండు పేమెంట్స్ సిస్టమ్స్ సాయంతో కొత్త విధానాన్ని ప్రారంభించినం దుకు ఎంతో సంతోషంగా ఉందని లీ అన్నారు. కార్యక్రమానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) ఎండీ రవి మీనన్ హాజరయ్యారు. మొదటి లావా దేవీని వీరిద్దరే పూర్తి చేశారు.
→ ఈ విధానాన్ని రెమి టెన్స్ లకు, వ్యాపార అవసరాలకు, ఈ-వాలెట్స్ కోసం వాడుకోవచ్చని సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
→ సింగపూర్లోని ఇండియన్లకు, ముఖ్యంగా వలన కార్మికులకు, స్టూడెంట్లకు ఈ కొత్త విధానం: ఉపయోగకరంగా ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారు.
→ ఇండియాకు సులువుగా డబ్బు పంపవచ్చని, తీసుకోవచ్చని తెలిపారు. రెండు దేశాల ఎకానమీలు బలోపేతమయ్యేందుకు యూపీఐ పేనౌ లింకేజ్ సాయపడుతుందని పేర్కొన్నారు.
→ క్రాస్బర్డర్ పర్సన్ టూ పర్సన్ పీ2పీ) పేమెంట్ విధానాన్ని మొట్టమొదటిసారి గా తీసుకొచ్చింది సింగపూరేనని అన్నారు.
→ రెండు దేశాల్లోనూ సామాన్యులు కూడా చాలా చవకగా డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని వివరించా రు.
→ 2022లో రూ.126 లక్షల కోట్ల విలువైన 7400 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయని చెప్పారు.
→ భవిష్యత్ లో సాధారణ లావాదేవీలను డిజిటల్ లావాదేవీలు మించిపోయే అవకాశం ఉందని మోడీ అన్నారు.
→మనదేశంలో క్విక్ మనీ ట్రాన్స్ ఫర్స్, బిల్స్ చెల్లింపు కోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే వంటి యూపీఐ యాప్స్ ఉన్న విషయం తెలిసిందే.
→యూపీఐ లాగానే సింగపూర్లో పేనౌ సౌకర్యం ఉంది. వినియోగదారులు మొబైల్ నంబర్ తో ఒకబ్యాంక్ లేదా ఈ వాలెట్ ఖాతా నుంచి మరొ కదానికి డబ్బులను పంపవచ్చు. తీసుకోవచ్చు.
→ఆ దేశంలోని పార్ట్నర్ బ్యాంకులు, నాస్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ (ఎన్ఎఫ్ఎస్ఐలు) ద్వారా పీర్-టు-పీర్ పేమెంట్స్ జరుగుతాయి.
→సాధారణంగా, సరిహద్దు చెల్లింపులు ఖరీదైన వి. యూపీఐ పేనౌ ఇంటిగ్రేషన్ వల్ల మొబైల్ ఫోన్ నంబర్లను ఉపయోగించి భారతదేశం నుంచి సింగపూర్ ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.
→యూపీఐ వర్చువల్ పేమెంట్ అడ్రస్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
→రెండు దేశాలలోని వ్యక్తు లు క్యూఆర్ కోడ్ ఆధారంగా లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్లను నమోదు. చేయడం ద్వారా రియల్టైంలో డబ్బును పంప వచ్చు.
→డబ్బు తక్షణమే ట్రాన్సఫర్ అవుతుంది. మనదేశానికి అత్యధిక విదేశీ కరెన్సీ వచ్చేదేశాల్లో సింగపూర్ నాలుగోస్థానం. ఈ కొత్త విధానంలో రోజుకు రూ.60 వేల వరకు పంపవచ్చు.
→ప్రస్తుతం సింగపూర్లోని డీబీఎస్ వంటి కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ కొత్త విధానానికి మారాయి. మిగతా బ్యాంకులు త్వరలో ఈ సేవలను మొదలుపెడు తాయి.
→నరేంద్ర మోడీ 2018లో సింగపూర్ వచ్చినప్పుడు యూపీఐ-పేనౌ లింకేజ్ ప్రపోజల్ తెచ్చారని పీఎం లీ వెల్లడించారు.
→అప్పటి నుంచి రెండు దేశాల సెంట్రల్ బ్యాంకులు దీని గురించి పనిచేశాయని, ఇండియా సింగపూర్ మినిస్టీరి యల్ రౌండ్ టేబుల్లో ఈ విషయం గురించి చర్చ జరిగిందని వివరించారు.

ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలోకి

→ నూతన విద్యావి ధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది.
→ అన్ని రాష్ట్రాలు, కేంద్రపా లిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది.
→ "చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడా తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది.
→ పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
→ అందులో ఏళ్లు పాఠశాల 3 ముందస్తు విద్య (ప్రీ స్కూల్ ఎడ్యు కేషన్), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 12వ తరగతులు ఉంటాయి.
→ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
→అందువల్ల అంగన్ వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్టీవోలు నిర్వ హించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం.
→ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి.
→ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలి.
→అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమపరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ రెండేళ్ల డిప్లొమా కోర్సును అమలుచేయాలి.
→ఈ కోర్సును స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) ద్వారా అమల్లో పెట్టాలి.
→ఈ కార్యక్ర మాన్ని ఎస్సీఈఆర్ పర్యవేక్షణలో నిర్వహించాలి" అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.

అమెరికా అధ్యక్ష ఎన్ని కల బరిలో వివేక్ రామస్వామి

→వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్ని కల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.
→రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వాన్ని దక్కించు కునేందుకు ప్రాథమిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు.
→ఈ విషయాన్ని రామస్వామి స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న రెండో భారత సంతతి వ్యక్తిగా ఆయన నిలిచారు.
→రిపబ్లికన్ పార్టీ తరఫున మరో ప్రముఖ భారతీయ అమె రికన్ నిక్కీ హేలీ కూడా అభ్యర్థిత్వాన్ని ఆశి స్తున్న సంగతి తెలిసిందే.
→అమెరికా ఆదర్శా లను పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు రామ స్వామి తెలిపారు.
→చైనా నుంచి ఎదురవు తున్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడం ప్రస్తుతం తమ దేశం ముందున్న ప్రధాన సవాలు అని పేర్కొన్నారు.
→రామస్వామి 1985 ఆగస్టు 9న ఒహైయోలో జన్మించారు. వయసు 37 ఏళ్లు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
→రామస్వామి హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాల యాల్లో చదువుకున్నారు. గతేడాది డ్రైవ్ అస్సెట్ మేనేజ్మెంట్ అనే సంస్థను స్థాపిం చారు.
→అంతకుముందు ఔషధ రంగంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు.

కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన సియాటెల్

→ అమెరి కాలో అమలవుతున్న 'వివక్ష వ్యతిరేక చట్టంలో ' కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా సియాటెల్ నిలిచింది.
→ దీనికి సంబంధించి స్థానిక సభలో ప్రవాస భారతీ యురాలు, సియాటెల్ నగర కౌన్సిల్ సభ్యు రాలు క్షమా సావంత్ తీర్మా నాన్ని ప్రవేశ పెట్టారు.
→ జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు.
→ సియాటెల్ సిటీ కౌన్సిల్ 6-1 ఓట్లతో దాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో అమె రికాలోని ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులా లకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని కౌన్సిల్ వెల్లడించింది.
→ ఈ సందర్భంగా క్షమా సావంత్ మాట్లాడుతూ ఈ స్ఫూర్తి దేశ మంతా విస్తరించేలా కృషి చేయాలన్నారు.

జనపనార సంచుల్లోనే ఆహార ధాన్యాలు

→ ఆహార ధాన్యాలన్నింటినీ జనపనార సంచుల్లోనే (జూట్ బ్యాగుల్లో) తప్పనిసరిగా నింపి పంపించాలనే నిబంధనను మరో ఏడాది పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.
→ 2022-23 జూట్ ఏడాది (1.7.2022 నుంచి 30.6. 2023)కి ఈ నిబంధనను అమలు చేయాలనే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ సమావేశం సమ్మ తించింది.
→ ఆహార ధాన్యాలనైతే 100%, చక్కెర పరిమాణంలో 20% మేర ప్యాకింగును ఈ గోనె సంచుల్లోనే చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
→ దేశంలోని జనపనార పరిశ్ర మలు, అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న 3.70 ణలను కేబినెట్ ఆమోదించింది.
→లక్షల మంది కార్మికులకు ఈ నిర్ణయం ఊరట కల్పిస్తుందని, అనేక లక్షల మంది రైతుల కుటుం బాలకు జీవనోపాధి లభిస్తుందని వివరించాయి.
→ఈ సంచులు తిరిగి వాడుకునేందుకు వీలైనవి. సహజంగా భూమిలో కలిసిపోయే స్వభావం ఉన్నవి కావడంతో ప్రకృతి పరిరక్షణకూ మేలేనని తెలిపాయి.
→ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, అస్సాం, త్రిపుర, మేఘా లయ రాష్ట్రాల్లో జూట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి.
→ఏటా రూ. 9,000 కోట్ల విలువైన గోనె సంచుల్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

బైడెన్ ఉక్రెయిన్ పర్యటనకు ముందు రష్యా భీకర ఖండాంతర క్షిపణి పరీక్ష

→ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఉక్రెయిన్ లో పర్యటించడానికి కొన్ని గంటల ముందే రష్యా అత్యంత శక్తిమంత మైన ఖండాంతర క్షిపణి సర్మత్ (సాటన్-2)ను పరీక్షించింది. ఈ విషయాన్ని ప్రయోగానికి ముందే అమెరికా అధికారులకు తెలియజేసింది. ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా ఈ చర్య తీసుకొన్నారు. పరీక్షకు సంబంధించిన అదనపు వివరాలు మాత్రం చెప్పలేదు. సర్మత్ క్షిపణి ఒకే సారి 16 అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు.

→దాని పొడవు 36 మీటర్లు. చుట్టుకొలత 3 మీటర్లు. 200 టన్నులు. గంటకు 25 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇందులోని ఒక్కో ఆయుధాన్ని ఒక్కో లక్ష్యానికి గురి పెట్టొచ్చు. భూమిపై ఏ లక్ష్యాన్నయినాసరే సర్మతో తాము ఛేదించగలమని గతంలో రష్యా పేర్కొంది. రష్యా నుంచి ప్రయోగిస్తే అమెరికాలోని టెక్సాస్ నగరం మొత్తాన్నీ తుడిచిపెట్టేయగల సామర్థ్యం సర్మత్కు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


రేణూ స్వరూప్, బాలసుబ్రమణియన్లకు ఫాబా పురస్కారాలు

→ దేశంలో ప్రతి ష్ఠాత్మక డాక్టర్ బి. ఎస్. బజాజ్ స్మారక ఫెడరేషన్ ఆఫ్ అసోసియే పురస్కారాలు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ రేణూ స్వరూప్; ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పరిశోధన సంచాలకులు డాక్టర్ బాలసు బ్రమణియన్లను వరించాయి.
→ జినోమ్ వ్యాలీలో ఈ అవార్డులను అందజేయనున్నారు. డాక్టర్ రేణూ స్వరూప్, డాక్టర్ బాల సుబ్రమణియన్లు దశా బ్దాలుగా బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కృషి చేస్తున్నారని ఫాబా కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రొఫె సర్ రెడ్డన్న తెలిపారు.

గ్రామీణ భారతంలో పెరుగుతున్న కాలుష్యం

→ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోం దని ఖరగ్ పూర్ ఐఐటీ పరిశోధక బృందం వెల్లడించింది.
→శాటిలైట్ చిత్రాల ద్వారా నైట్రోజన్ డై ఆక్సైడ్ (ఎన్ట2) పరిమాణాన్ని అంచనా వేస్తూ ఐఐటీ ఖరగ్పూర్ పరిశోధకులు గ్రామీణ భారతంలో వాయు నాణ్యతపై పరిశోధన నిర్వహించారు.
→'ఎయిర్ ట్రెండ్స్ ఇన్ రూరల్ ఇండియా' పేరిట నిర్వహించిన పరిశోధన వివరాలను బుధవారం వెల్లడించారు.
→పట్టణాల్లో కాలుష్యం పెర గడం పెద్దగా చెప్పుకోదగిన విషయం కాకున్నా.. గ్రామాలు దీని ప్రభావానికి లోనవుతుండటం ఆందోళన కలిగించే పరిణామమేనని వారు పేర్కొన్నారు.
→గ్రామాల్లో వాయు నాణ్యత క్రమంగా క్షీణిస్తోందన్న విషయం తమ పరిశీల నలో తేలిందని, దిల్లీ, భారతదేశ తూర్పు ప్రాంతాలతో పోల్చితే ప్రస్తుతం గ్రామాల్లో ప్రమాదకర పరిస్థితులు లేకున్నా కాలుష్య నివారణకు సంబంధిం చిన తగిన చర్యలు చేపట్టడానికి ఇదే సరైన సమయమని సూచించారు.
→ సాధారణంగా పట్టణాల్లోనే కాలుష్యం ఉంటుందని భావిస్తూ గ్రామీణ ప్రాంతా లను విస్మరిస్తున్నామని, అయితే అక్కడి వాతావరణ సమతౌల్యం, నివాసి తుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరముందన్న అంశాన్ని తమ పరిశోధన సూచిస్తోందని ఖరగుర ఐఐటీ రీసెర్చ్ స్కాలర్, ఈ అంశంపై పరిశోధక పత్రం సమర్పించిన మాన్సీ పాఠక్ తెలిపారు.

భారత్ 500 గిగావాట్ శుద్ధ ఇంధన లక్ష్య సాధనకు చేయూతనిస్తాం: యూఏఈ

→ భూతాపాన్ని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా భారతదేశం నిర్దేశించుకున్న 500 గిగావాట్ శుద్ధ ఇంధన లక్ష్యాన్ని సాకారం చేసే మహత్కార్యంలో తామూ భాగస్వాములవుతామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెల్లడించింది.
→ ఢిల్లీలో ఇంధన వనరుల సంస్థ... 'తెరి' నిర్వహించిన 'ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సులో యూఏఈ వాతావరణ రాయ బారి సుల్తాన్ అల్ జబర్ పాల్గొన్నారు.
→ 'ఏడేళ్లలో 500 గావాట్ల శుద్ధ ఇంధన లక్ష్యాన్ని చేరుకోవాలన్న భారత్ నిర్ణయం ఎంతో సముచితమైనది.
→ పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న యూఏఈ భారత్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది.
→ ఈ అంశంలో అన్ని విధాలా మద్దతుగా నిలుస్తామ'ని సుల్తాన్ అల్ జబర్ తెలిపారు. భూ ఉష్ణోగ్రతలను పారిశ్రామిక విప్లవం పూర్వం నాటి స్థాయికి తీసుకురా వాలన్న లక్ష్యంతో రాజీపడేది లేదన్నారు.
→ దుబయిలో నవంబరులో నిర్వహించే కాప్2కు అల్ జబర్ అధ్యక్షు డిగా నియమితులయ్యారు.

పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యం: మోదీ
→భూమి మనందరి మాతృమూర్తని, మనందరం ఆమె బిడ్డలమని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ సౌభ్రాతృత్వ భావన మన దేశాన్ని, ప్రజలను నిరంత రంగా ముందుకు నడిపిస్తోందన్నారు.
→పర్యావరణ పరిరక్షణ మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. పున రుత్పాదక, ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి మన దేశం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రపంచ సుస్థిరాభివృద్ధి సద స్సుకు పంపిన సందేశంలో మోదీ తెలిపారు.
→కాలుష్యం, పారిశుద్ధ్యం తదితర సవాళ్లను ఎదుర్కోవ డానికి సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నూతన డీసీజీఐ డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ

→ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నూతన డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ నియమితులయ్యారు.
→ ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వ నియా మకాల కమిటీ ఆమోదించింది. 2025 ఫిబ్ర వరి 28 వరకు రఘువంశీ ఈ పదవిలో ఉంటారు.
→ దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఔషధ ప్రమాణాలు, నాణ్యతను ధ్రువీకరించి వాటి వినియోగానికి అనుమతివ్వడంలో ఈ సంస్థదే ప్రధానపాత్ర.
→ కొత్త మందులు, వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలకు అనుమతివ్వడం కూడా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది.
→ ప్రస్తుతం ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ సెక్ర టరీ, సైంటిఫిక్ డైరెక్టర్గా రఘువంశీ వ్యవహరిస్తున్నారు.
→ ఇప్పటి వరకు డీసీజీఐగా వ్యవహరించిన డాక్టర్ వి.జి. సోమానీ పదవీ విరమణ చేయ డంతో, ఈ పదవికి ఖాళీ ఏర్పడింది.
రఘువంశీ గురించి:-
→ డాక్టర్ రఘువంశీ ఐఐటీ-బీహెచ్ యూ, వారణాసి నుంచి పట్టభద్రుడయ్యారు.
→దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యు నాలజీలో పీహెచ్ చేశారు. రాన్బ్యాక్సీ లేబొరేటరీస్ లో 12 ఏళ్లు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లో 11 ఏళ్లు పనిచేశారు.
→డ్రగ్ డెలివరీ విభాగంలో విస్తృత పరిశోధనలు నిర్వహించారు. దాదాపు 200 ఔషధాలను ఆయన తన బృందంతో కలిసి అభివృద్ధి చేశారు.
→డాక్టర్ రాజీవ్ సింగ్ కు 14 యూఎస్ పేటెంట్లు లభించాయి. ఆయన రాసిన 25 పరిశోధనా వ్యాసా లను ప్రముఖ పత్రికలు సమీక్షించాయి.
→డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్లో అందించిన సేవలకు గాను ఆయనకు రెండు సార్లు 'డాక్టర్ రెడ్డీస్ ఎక్స్ లెన్స్ అవార్డు' లభించింది.

ప్రపంచ వృద్ధిలో 15% భారతే అందిస్తుంది

→6.8 శాతం వృద్ధి నమోదవుతుంది 2022-23పై ఐఎమ్ఎఫ్ అంచనా
→ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 'వెలుగు రేఖ'గా కొనసాగుతుందని.. 2023 అంత ర్జాతీయ వృద్ధిలో 15 శాతం వాటాను అందించగల దాని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) ఎండీ క్రిస్టాలినా జార్జీవా పేర్కొన్నారు. 'కరోనా కనిష్ఠ స్థాయిల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలీక రణే కాపాడింది. తాజా బడ్జెట్ లో ప్రకటించిన బల మైన ద్రవ్య విధానం, భారీ మూలధన పెట్టుబడులు వల్ల వృద్ధి కొనసాగగలద'ని అంచనా వేశారు. 'భారత్ అద్భుతంగా రాణిస్తోంది. 2022-23లో 6.8 శాతం వృద్ధి నమోదుకావొచ్చు. 2023-24లో ఇతర దేశాల తరహాలోనే వృద్ధి కాస్త తగ్గి 6.1 శాతం నమోదు కావొచ్చు. అయినా అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువే' అని ఆమె పేర్కొ న్నారు. 2022లో 3.4 శాతంగా నమోదైన అంతర్జాతీయ వృద్ధి... 2023లో 2.9 శాతానికి పరిమితం కావొచ్చన్నది ఆమె అంచనా..
→నిర్మలా సీతారామన్ పై ప్రశంసలు: 'కరోనా పరిణామాల నుంచి బయటపడడానికి భారత్ డిజిటలీకరణను చాలా చక్కగా వినియోగించుకుంది. ఆ సమయంలో కొన్ని నెలల పాటు బలమైన
→విధానాలను అమలు చేసి, వృద్ధి, ఉద్యోగావ కాశాలను సృష్టించుకుంది. ఆర్థిక పరిస్థితు లకు తగ్గట్లుగా ద్రవ్య విధానాన్ని మలచు కుంది. కొత్త బడ్జెట్లోనూ ద్రవ్య స్థిరీకర ణకు కట్టుబడ్డ సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో మూలధన పెట్టుబడు లనూ అందించనున్నారు. తాజా బడ్జెట్ అభివృద్ధి, ద్రవ్య బాధ్యతలను సమతౌల్యం చేయడంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్ చక్కటి జాగ్రత్తలు పాటించారని క్రిస్టాలినా పేర్కొన్నారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు కూడా భారత కు ఒక అవకా శంగా మారనున్నాయన్నారు. హరిత ఆర్ధిక వ్యవస్థ, డిజిటల్ ఐడీలపై భారత్ చర్యలను ప్రశంసించారు. భారత్లో మహిళలు మాత్రమే నడిపిన రైలులో, ప్రయాణించిన వ్యక్తిగత అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
→'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్': జి-20 నినాదమైన `ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ నినాదం అత్యంత ఆశా వహంగా ఉందని క్రిస్టాలినా అన్నారు. బెంగళూరులో జరగనున్న జి- 20 ఆర్థిక ట్రాక్ మీటింగ్కు ఆమె హాజరుకానున్నారు. 'మహా ఉపనిష త్తులోని సంస్కృత వాక్యమైన 'వసుధైక కుటుంబం' ఆధారంగా ప్రధాని మోదీ గతేడాది ఈ నినాదాన్ని ఆవిష్కరించారు.

15 శాతం తగ్గిన ఎఫ్ఐ పెట్టుబడులు

→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- డిసెంబరు మధ్య భారత్ లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ) 15 శాతం తగ్గి 36.75 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి.
→ 2021-22 ఇదే సమయంలో పెట్టుబడులు 43.17 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు డీపీఐఐటీ గణాంకాలు వెల్ల డించాయి.
→ ఈక్విటీలతో కలిపి మొత్తం ఎఫ్ డీఐ పెట్టుబడులు 60.4 బిలియన్ డాలర్ల నుంచి 55.27 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

అగ్రగామి దేశాలు:-
→మన దేశంలోకి వచ్చిన ఎఫ్ డీఐల్లో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది.
→మారిషస్ (4.7 బి. డాలర్లు), అమెరికా (5 బి. డాలర్లు), యూఏఈ (3.1 బి. డాలర్లు), నెద ర్లాండ్స్ 2.15 బి.డాలర్లు), జపాన్ (1.4 బి. డాలర్లు), సైప్రస్ (1.15 బి. డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


చాట్ జీపీటీ తరహాలో బైదూ ఎర్నీ

→ కృత్రిమమేధ (ఏఐ)తో పనిచేసే చాటిజీపీటీకి పోటీగా చాట్ బాట్ ఎర్నీని తీసుకురానున్నట్లు చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూ ప్రకటిం చింది.
→ కృత్రిమ మేధతో పనిచేసే చాట్బాట్ ఎర్నీని సెర్చ్ సేవల్లోకి మార్చి నుంచి అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.
→ ఈలోపు ఎర్నీ బాట్ అంత ర్గత పరీక్షలను పూర్తిచేస్తామని కంపెనీ వెల్లడించింది.
→ బైదూకు చెందిన సెర్చ్, క్లౌడ్ సేవల్లో ఎర్నీ బాటు సమీకృతం చేశామని బైదూ సీఈఓ రాబిన్ లీ తెలిపారు.
→ స్మార్ట్ కార్ ఆపరేటింగ్ వ్యవస్థ, స్మార్ట్ స్పీకర్కు కూడా దీన్ని కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.
→ ఈ వార్తలతో న్యూయార్క్ ముందస్తు మార్కెట్ ట్రేడింగ్లో కంపెనీ షేరు 7 శాతం పెరిగి 150 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా!

→ప్రముఖ భార తీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రతిష్టాత్మక పదవి వరించే అవకాశాలు కనిపి స్తున్నాయి.
→ప్రపంచ బ్యాంకు అధ్యక్ష స్థానానికి ఆయన్ను నామి నేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ ప్రకటించారు
→ ఆయన నామినేషన్ కు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
→ ఆ ప్రక్రియ సవ్యంగా సాగితే.. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్, సిక్కు అమెరి కన్గా బంగా చరిత్ర సృష్టిస్తారు.
→ ఆయన వయసు 63 ఏళ్లు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ చైర్మ న్గా ఉన్నారు. గతంలో మాస్టర్కార్డ్ అధ్యక్షుడు-సీఈ వోగా విధులు నిర్వర్తించారు.
→ 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
→ మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని వ్యాఖ్యా నించారు.
→ పర్యావరణ మార్పుల అంశం సహా ప్రపంచం ముందు ప్రస్తుతమున్న అన్ని సవాళ్లను బంగా సమర్థంగా ఎదుర్కోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
→ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఆయన గతంలో సన్నిహితంగా పనిచేశారు.

రాష్ట్ర అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు

→ అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ప్రమాణాలు పాటిస్తున్న తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్ఎసీ)కు జర్మనీకి చెందిన ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ (ఎఫ్ఎస్సీ) సర్టిఫికెట్ దక్కింది.
→ రాష్ట్రంలో తయారయ్యే సేంద్రియ అటవీ ఉత్పత్తులకు 5 సంవత్సరాల పాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్ఎస్సీ అనుమతినిచ్చింది.
→ ఈ సంద ర్భంగా అరణ్యభవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ అధికారులు, సిబ్బందిని అభి నందించారు.
→ రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను మంచి ప్రమాణాలతో సాగు చేస్తూ పంట పండిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
→ ఇందులో కొత్తగూడెం, పాల్వంచ, సత్తు పల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు.
→ ఈ అటవీ ఉత్పత్తుల నుంచి తయారుచేసే కాగితం, టెట్రా ప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్. ఎస్సీ ఆమోదం లభించిందని చెప్పారు.
→ దీనివల్ల అంతర్జాతీయంగా తెలం గాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని.. ఐకియా వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు ఎఫ్ఎస్సీ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని వెల్లడించారు.
→ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రశాంతి, సంస్థ ఉపాధ్యక్షుడు, ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.

ఐఐటీ మద్రాసులో కృత్రిమ వజ్రాల తయారీ కేంద్రం

→ కృత్రిమ వజ్రాల తయారీ కేంద్రాన్ని ఐఐటీ మద్రాసులో ఏర్పాటు చేయాలని ప్రతిపా దించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది.
→ దీని కోసం రూ.242.96 కోట్లు కేటా యిస్తున్నట్లు వెల్లడించింది.
→ దీని ద్వారా ఎగుమతులను పెంచడమే కాకుండా.. ఉపాధిని కల్పిం చనున్నామని తెలిపింది.
→ ఎంపిక చేసిన ఐఐ టీల్లో అచ్చం వజ్రం లాగే ఉండే కృత్రిమ వజ్రా లను ప్రయోగశాలలో తయారు చేస్తారు.
→ వీటి తయారీకి సంబంధించి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం నిధులు కేటా యించిన సంగతి తెలిసిందే.

ఎత్తులో పనిచేస్తున్నా నిరంతర అప్రమత్తత!

→ఎత్తయిన ప్రదేశాల్లో పనిచేసే వ్యక్తు లను వారి భద్రతపై అప్రమత్తం చేసే సరికొత్త 'స్మార్ట్ పర్యవేక్షణ వ్యవస్థ (ఎస్ఎంఎస్)'ను ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.
→ఎక్కువ ఎత్తులో ఉండి పనిచేసే కార్మికులు రక్షణ సాధనాలను ధరించినప్పటికీ.. రకరకాల కారణాల వల్ల కొన్నిసార్లు వాటిని నిర్దేశిత వ్యవస్థతో అనుసంధానించడం మర్చిపోతుంటారు.
→అలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించేం దుకు ఎస్ఎంఎస్ సాంకేతికతను రూపొందిస్తు న్నట్లు పరిశోధకులు తెలిపారు.
→కార్మికులు తమ రక్షణ సాధనాలను సరిగ్గా వినియోగిస్తున్నారో లేదో ఇది పర్యవేక్షిస్తుందని చెప్పారు.
→నిర్దేశిత వ్యవస్థతో అనుసంధానమై ఉండకపోతే.. కార్మి కులకు వినిపించేలా అలారాన్ని మోగిస్తుంద న్నారు.
→యాప్ ద్వారా సూపర్వైజర్ కూ సమా చారాన్ని చేరవేస్తుందని పేర్కొన్నారు.

రంజీ ట్రోఫీ చాంపియన్ సౌరాష్ట్ర

→దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర టీమ్ జోరు కొనసాగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ముగిసిన రంజీ ట్రోఫీ -2023 ఫైనల్లో బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర జయకేతనం ఎగురవేసింది. ఈరోజు కేవలం 12 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ నిర్దేశించగా.. సౌరాష్ట్రం 2.4 ఓవర్లలోనే 14/1తో విజయాన్ని అందుకుంది. చివరి మూడు రంజీ సీజన్లలో సౌరాష్ట్ర గెలిచిన రెండో టైటిల్ ఇది.

→ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. బెంగాల్‌ని ఫస్ట్ బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. కానీ ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉన్కదత్ 3 వికెట్లు పడగొట్టగా.. చేతన్ సకారియా మూడు, డీఏ జడేజా, చిరాక్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. బెంగాల్ టీమ్‌లో షబాజ్ అహ్మద్ (69), అభిషేక్ (50) మాత్రమే హాఫ్ సెంచరీలతో ఫర్వాలేదనిపించారు.

→తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర టీమ్ 404 పరుగుల చేసింది. ఆ జట్టులో హార్విక్ దేశాయ్ (50), జాక్సన్ (59), వసవాడ (81), చిరాగ్ జాని (60) రూపంలో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. బెంగాల్ బౌలర్లలో ముకేష్ నాలుగు, అక్షదీప్, ఇషాన్ పోరెల్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ నేపథ్యంలో.. 230 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన బెంగాల్ టీమ్ 241 పరుగులకే ఆలౌటైంది. దాంతో కేవలం 12 పరుగుల టార్గెట్ మాత్రమే సౌరాష్ట్ర ముందు ఈరోజు నిలిచింది. మ్యాచ్‌ నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది.

→రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర చాంపియన్ నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్ను ఓడించింది. అర్పిత్ వసవాడాకు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు దక్కింది.

సన్ రైజర్స్ కెప్టెన్ మార్ క్రమ్

→రానున్న ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్ క్రమ్ కెప్టెన్ గా ఉండనున్నారు.
→ఇటీవల జొహానెస్ బర్గ్ ముగిసిన తొలి ఎస్ఏ20 లీగ్ విజేతగా నిలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు మార్క్రమ్ నాయకత్వం వహించాడు.

అస్త్ర మిస్సైల్ సక్సెస్

→డీఆర్డీవో అస్త్ర మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది.
→ఒడిశా తీరంలో ఎస్యూ-30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి దీన్ని పరీక్షించగా సక్సెస్ఫుల్ గా టార్గెట్ను ఛేదించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

చిరుధాన్యాల ప్రదర్శన

→ఐక్యరాజ్యసమితిలో భారత్ ఏర్పాటు చేసిన మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ రిసెర్చ్ అండ్ అవేర్నెస్ (ఎంఐఐఆర్ఎ)ను ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఫిబ్రవరి 13న ప్రారంభించారు.
→ఐక్యరాజ్యస మితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

వరల్డ్ పంగోలిన్ డే

→ వరల్డ్ పంగోలిన్ డేని ఏటా ఫిబ్రవరి నెలలోని మూడో శనివారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న నిర్వహించారు. ఇది 12వ ఎడి షన్.
→పొలుసులుగా, చిన్నగా ఉండే పంగోలిన్ అనే క్షీరదాల సంఖ్య క్షీణతపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నారు. ఇది ఫోలిడోటా క్రమానికి చెందినది.
→ఇవి ఎక్కువగా ఆఫ్రికా, ఆసియాలో ఉష్ణమం డల ప్రాంతాల్లో కనిపిస్తాయి.
→పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ఆహార గొలుసులో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక్కో పంగోలిన్ 70 మిలియన్ కీటకాలను తింటుంది.

అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం

→ అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని ప్రకటించే ద్వై పాక్షిక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనెట్లో ప్రవే శపెట్టారు.
→ దీన్ని పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ జెఫ్ మెర్క్ లే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సెనెటర్ బిల్ హేగెర్టీ సంయుక్తంగా ప్రతిపాదించారు.
→ ఇండియా కాకస్ సహాధ్యక్షుడు జాన్ కార్నిన్ సహ ప్రాయోజకుడిగా వ్యవహ రించారు.
→ అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా వర్ణిస్తూ.. చైనా దురాక్రమణ చర్యలకు పాల్పడడాన్ని తీర్మానం ఖండించింది.
→ వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాలు నిర్మించడం, అరుణాచల్ ప్రదేశ్లోని పట్టణాలు, ప్రాంతాలకు మాండ రిన్ భాషలో పేర్లు పెట్టి మ్యాపులు ప్రచురించడాన్ని తీర్మానం తప్పుపట్టింది.
→ మెక్ మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా అమెరికా గుర్తిస్తోందని స్పష్టం చేసింది.
→ స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం ఏర్పడిన క్వాడు, భారత్- అమెరికా వ్యూహ భాగస్వామ్యాన్నీ మరింత పటిష్ఠం చేయాలని పేర్కొంది.

కేరళలో కొత్త క్యాట్ ఫిష్ జాతి

→ కేరళలో కొత్తగా ఒక క్యాట్ఫిష్ జాతిని భారత్, జర్మనీ శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. ఆ జీవి పొడవు 32 మిల్లీమీటర్లు మాత్రమే. దానికి కళ్లు లేవు.
→ భూగర్భజలాల్లో ఇది మనుగడ సాగిస్తోంది. లేట రైట్ శిల పొరల్లోని నీటిపై ఆరేళ్ల పాటు పరిశోధన సాగించిన శాస్త్ర వేత్తలు దీన్ని గుర్తించారు.
→ గతంలో కనుగొన్న జాతులతో పోలిస్తే ఇది జన్యుపరమైన వైరుధ్యాన్ని కలిగి ఉంది.

తెలంగాణ జైళ్లకు తొలిసారిగా సోలార్ విద్యుత్ వ్యవస్థ

→ తెలంగాణ జైళ్లలో సౌరకాం తులు తళుకులీననున్నాయి. కారాగారాల్లో విద్యుత్ వ్యవ స్థల్ని అందుబాటులోకి తెచ్చే దిశగా కార్యాచరణ రూపొందుతోంది.
→పైలట్ ప్రాజెక్టులు సత్ఫలితాలివ్వ డంతో రాష్ట్రవ్యాప్తంగా విడతలవారీగా అన్ని కారాగా రాల్లో వీటి ఏర్పాటుకు జైళ్లశాఖ సమాయత్తమవుతోంది.
→తొలుత సోలార్ విద్యుత్ వినియోగానికి, తక్కువ వ్యయంతో ఏర్పాటుకు అనువుగా ఉన్న సబ్ జైళ్లు, జిల్లా జైళ్లపై అధికారులు దృష్టి సారించారు.
→తర్వాత దశల వారీగా వీటిని విస్తరించి, కేంద్ర కారాగారాల్లోనూ పెట్ట నున్నారు.
→→హరిత ఇంధన(గ్రీన్ఎనర్జీ) వినియోగానికి ప్రాధాన్యమివ్వడంతోపాటు జైళ్లశాఖకు వ్యయభారాన్ని తగ్గించుకునే అవకాశం ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
→ఇప్పటికే ఖమ్మం జిల్లా జైలు, లక్సె ట్టిపేట సబ్బైలు, చంచల్గూడ మహిళా కారాగారం.. తదితరాల్లో వీటి ఏర్పాటు కొలిక్కివచ్చింది.
→కొద్దిరోజు లుగా సోలార్ విద్యుత్ను వినియోగిస్తున్నారు. మిగిలిన జైళ్లలోనూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
→ఈనెలాఖరులోపు తొలివిడత పనులు కొలిక్కి వచ్చే అవ కాశాలున్నట్లు చెబుతున్నారు.

సబ్ జైలుకు 4 కిలోవాట్లు.. జిల్లా జైలుకు 8-16 కిలోవాట్లు:-
→ప్రస్తుతం రాష్ట్రంలో 3 కేంద్ర కారాగారాలు, ఒక మహిళా కారాగారం, ఒక ఓపెన్ ఎయిర్ జైలు, 7 జిల్లా జైళ్లు. 20 సబ్ జైళ్లు, 4 ప్రత్యేక సబ్ జైళ్లు ఉన్నాయి.
→వీటిలో దాదాపు ఏడువేల మంది ఖైదీలున్నారు. నేటి వరకు ఈ జైళ్లన్నీ సాధారణ విద్యుత్పనే ఆధారప| డ్డాయి.
→ప్రతినెలా సగటున వీటికి రూ.కోటి వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి.
→ఈ నేపథ్యంలో వీటిపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ఉన్నతాధికారులు సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు కసరత్తు ప్రారంబిం చారు.
→తొలుత ఖైదీల సంఖ్యను బట్టి సబ్ జైలుకు 4కి లోవాట్లు.. జిల్లా జైలుకు 8-16కిలోవాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయించారు.
→సబ్ జైళ్లలో రూ. 3.5-4లక్షలు, జిల్లాజైళ్లలో దాదాపు రూ.10లక్షల మేర వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
→సాధారణంగా ఒక్కో జైలులో వినియోగంలో ఉన్న విద్యుత్లో గరి ష్ఠంగా 80శాతం మేరకు సోలార్ విద్యుత్ను ఉత్పత్తి - చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
→ఇలా ప్రతినెలా సుమారు 60-80 లక్షల మేర విద్యుత్ వ్యయం ఆదా అయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

విమానాల్లో సిగ్నల్ సమస్యలకు 'వాయులింక్' పేరిట కొత్త సాంకేతికత

→ ప్రతికూల వాతావరణాన్ని పైలట్లు సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.
→బేస్ స్టేషన్ నుంచి నిరంతరంగా విమానాలకు సంకేతాలు అందించేందుకు 'వాయులింక్ అనే స్వదేశీ సాంకేతిక తను అందుబాటులోకి తేనుంది.
→డేటా లింక్ కమ్యూని కేషన్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న సమయంలో బేస్ స్టేష నో తో అనుసంధానానికి ఈ సాంకేతికత పైలట్లకు ఉప యోగపడనుంది.
→దేశీయంగా రూపొందించిన ఈ సాంకేతికతను సైన్యం, నౌకాదళంలోనూ వినియోగించుకోవచ్చని వాయుసేన అధికారులు వెల్లడించారు.
→ప్రతి కూల పరిస్థితుల్లో విమాన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుందని చెప్పారు.
→ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్) ఆధారంగా ఇది పనిచేస్తుందని వివరిం చారు.
→విమానాలు పరస్పరం ఢీ కొట్టుకోకుండా ఈ టెక్నాలజీ సాయపడుతుంది. భూమిపైనున్న యుద్ధ ట్యాంకులు, ఇతర వాహనాల కదలికలను దీని ద్వారా కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు.
→సిగ్నల్స్ జామ్ కాకుండా కూడా వాయులింక్ తోడ్పడుతుంది. శత్రు సేనలపై దాడుల సమయంలో ఇది బాగా అక్కరకొస్తుంది.
→రేడియో సిగ్నల్స్ అందుబాటులో ఉండని కొండ ప్రాంతాల్లో పైలట్లకు ఈ సాంకేతికత కీలకం కానుంది.

గ్వాలియర్ వాయు సేన స్థావరానికి దక్షిణాఫ్రికా చీతాల రాక

→దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ విమానాశ్రయం నుంచి 12 చీతాలతో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వాయు సేన స్థావరానికి చేరుకోనుంది.
→గ్వాలియర్ నుంచి భారత వాయుసేనకు చెందిన భారీ హెలికాప్టర్లలో చీతాలను శ్యోపుర్ కు తరలిస్తారు.
→చరిత్రాత్మకమైన ఈ చీతాల స్థలమార్పిడి రెండు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నడుమ సద్భావనా సంబంధాలకు కొలమానంగా ఇరు దేశాల సీనియర్ అధికారులు అభివర్ణించారు.
→గతేడాది సెప్టెం బరులో 8 చీతాలను నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చాక.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వాటి స్థితిగతులను సమీక్షిస్తున్నట్లు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఐజీ డాక్టర్ అమిత్ మల్లిక్ (ఢిల్లీ) తెలిపారు.
→ప్రపంచంలోని 70 శాతానికి పైగా పులులకు కేంద్రంగా ఉన్న భారత్కు చీతాల సంరక్షణలో సమస్యలు ఉండబోవన్నారు.

బాన్సువాడ ఎంసీహెచ్(MOTHER AND CHILDREN HOSPITAL BANSWADA) కు జాతీయ గుర్తింపు

→రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలోగల బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
→తల్లి పాలను ప్రోత్సహిస్తున్న బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్ హెచ్ఐ) అందించే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడిటే షన్ (గ్రేడ్-1)ను ఈ ఆస్పత్రి సొంతం చేసుకుంది.
→దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా బాన్సువాడ ఎంసీహెచ్ గుర్తింపు పొందిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
→శిశువుల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన, కేంద్రం అమలుచేస్తున్న మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్ (ఎంఏఏ) కార్యక్రమం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బాన్సువాడ ఎంసీహెచ్ ఉంటూ అక్రిడిటేషన్ పొందిందని తెలిపింది.
→బ్రెస్ట్ ఫీడిం గ్ ను ప్రోత్సహిస్తున్న ఆస్పత్రులను యూనిసెఫ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఎస్ఐ), అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీచెస్ఐ)లు ఎంపిక చేసి అక్రిడి టేషన్ ఇస్తున్నాయని, ఈ ప్రత్యేక గుర్తింపు మూడేళ్ల పాటు ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
→దేశంలో మొత్తం నాలుగు ఆస్పత్రులకు బీఎఫ్ హెచ్ఎస్ఐ అక్రిడిటేషన్ ఉండగా వీటిలో బాన్సువాడ మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రి అని వివరించారు.
→బాన్సువాడ ఎంసీ హెచ్కు జాతీయస్థాయి గుర్తింపు రావడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.
→ ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బం దీని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

సైబర్ నేరాలను కట్టడిచేసే జాతీయ స్థాయి హ్యాకథాన్ కవచ్ ప్రారంభం

→దేశంలో సైబర్ నేరాలకు ముకుతాడు బిగించి, సైబర్ భద్రతకు భరోసా కల్పించే నవ్యాలోచనలను, సాంకేతిక పరిష్కారాలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ ప్రారంభమైంది.
→'కవచ్-2023'గా వ్యవహరించే ఈ కార్యక్రమంలో పాల్గొనేం దుకు దేశంలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, నమోదిత స్టార్టప్లకు అర్హత కల్పించారు.
→కేంద్ర విద్యాశాఖకు చెందిన ఇన్నోవేషన్ సెల్, ఏఐసీ టీఈ, పోలీస్ పరిశోధన-అభివృద్ధి విభాగం, కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సంయుక్తంగా ఈ హాకథా న న్ను నిర్వహిస్తున్నాయి.
→రెండు దశలుగా జరిగే ఈ కార్యక్రమంలో తొలుత డార్క్ వెబ్, మహిళల భద్రత, అశ్లీల దృశ్యాలు- రాతల గుర్తింపు, స్పామ్ అలర్ట్, మాల్వేర్ విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్ వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లకు వినూత్నమైన, సాంకేతికపరమైన పరిష్కారాలపై తమ ఆలోచన లను పోటీదారులు మార్చి 1 నుంచి ఏప్రిల్ 15లోగా అందజేయాలి.
→ఈ దశలో అర్హులైన వారి జాబితాను మే 16-31 తేదీల మధ్య ప్రకటిస్తారు.
→వడపోతలో ఎంపికైన వారు జులై 12-14 తేదీల్లో నిర్వహించే గ్రాండ్ ఫినా లేకు అర్హులవుతారని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ అభయ్ వివరించారు.
→విజే తలుగా నిలిచిన బృందానికి రూ.20లక్షలు బహుమతిగా అందజేస్తారు.

జల్ జన్ అభియాన్ ప్రారంభం

→మానవాళి భవితవ్యం నీటితోనే ముడి జీవనానికి జల సంరక్షణ అత్యంత కీలకమని తెలి పారు.
→ప్రకృతితో భావోద్వేగమైన అనుబంధం కలి గిఉండడం ప్రాచీన భారతీయతలో ఓ ప్రధాన అంశమని, దానిని తిరిగి అలవరచుకోవాల్సిన ఆవ శ్యకత ఉందని వివరించారు.
→కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, బ్రహ్మకుమారీస్ సంయుక్తంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం 'జల్' జన్' అభియాను ప్రధాని మోదీ ప్రారంభిం చారు.
→ఈ సందర్భంగా రాజస్థాన్లోని మౌంట్ అబులో ఉన్న బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాల యంలో నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
→జల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచే ఈ కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగనుంది.
→నీటి వనరులను కాపాడుకోవడం అందరి సమష్టి బాధ్యత అని గుర్తు చేస్తూ తక్షణమే అందుకు నడుంబిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
→నీరు కలుషితం కావడం, భూగర్భ జలాలు తరిగి పోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జల సమృద్ధితోనే మనందరి భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు.
→కొన్ని వేల సంవత్సరాలుగా భార పడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిరమైన తీయ తాత్విక చింతనలో జల సంరక్షణ అంశం ఓ భాగంగా ఉంటూ వస్తోందన్నారు.
→అందువల్లే నీటిని దేవతగాను, నదిని తల్లిగానూ భావిస్తున్నా. మని వివరించారు. గంగా నది పరిరక్షణకు, దేశ వ్యాప్తంగా భూగర్భ జలాల సంరక్షణకు తమ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పథకాలను మోదీ గుర్తు చేశారు.
→పర్యావరణ పరిరక్షణకూ అత్యంత ప్రాధా న్యమివ్వాలని కోరారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సినీనటుడు నానా పటే కర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'ఆది మహోత్సవ్' ప్రారంభం

→గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం పట్టే జాతీ యస్థాయి వేడుక 'ఆది మహోత్సవ్ 'ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
→కేంద్ర గిరి జన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన 'ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్' ఆధ్వర్యంలో ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ క్రీడాప్రాంగ ణంలో ఈ నెల 27 వరకు ఈ ఉత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.
→ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన అటవీ ఉత్పత్తులను, గిరిజన హస్తకళా నిపుణులు రూపొందించిన వస్తువులను, ఆహార పదార్ధాలను, ఆదిమవాసుల సంస్కృతిని ప్రతి బింబించే అంశాలను ప్రదర్శిస్తారు.
→ 200 పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవ్వండి.. 'బంగారం' పొందండి!

→ పర్యావరణ పరిరక్షణ కోసం జమ్మూ-కశ్మీర్ లోని సదివార-ఎ గ్రామ సర్పంచి ఫరూక్ అహ్మద్ గనై వినూత్న ఆలోచన చేశారు.
→ 'పాలిథిన్ వ్యర్థాలను అందజేయండి.. బంగారు నాణేలు పొందండి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
→ గ్రామస్థులు తమ ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను చుట్టుపక్కల పొలాలు, జల వనరుల్లో పడేయకుండా నిరోధించే ఉద్దేశంతో దీన్ని చేపట్టారు.
→ గనై మాట్లాడుతూ..' ప్రభుత్వం, అధికార యంత్రాంగం పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషిచేస్తున్నాయి. పౌరులు కూడా తమ వంతు సాయం అందించాలి.
→ ప్రస్తుతం 20 క్వింటాళ్ల పాలిథిన్ వ్యర్థాలను తెచ్చినవారికి ఒక బంగారు నాణెం అందిస్తున్నాం. ఇంతకంటే తక్కువ తీసు కొచ్చిన వారికి వెండి నాణెం ఇచ్చి ప్రోత్సహి స్తున్నాం' అని తెలిపారు.

ఫుట్ బాల్ దిగ్గజం బలరాం మృతి

→ భారత దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు తులసీదాస్ బలరాం మృతి చెందారు.
→ ఆయన వయసు 86 ఏళ్లు గత కొంతకాలంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
→ 2021లో మెదడులో రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్సతో బయటపడిన బలరాం.. తాజాగా మరోసారి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
→ సికింద్రాబాద్లో జన్మించిన ఆయన.. ఫార్వర్డ్ స్థానంలో హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ రైడర్స్ క్లబ్, ఆర్మీ కాంబాట్ ఫోర్స్, ఈస్ట్ బెంగాల్ తరఫున ఆడారు.
→ 1956-62 మధ్య భారత్ కు 27 మ్యాచ్లో ప్రాతినిధ్యం వహిం చారు. 1956, 1960 ఒలింపిక్స్ లో ఆడిన బలరాం.. కోచ్ అబ్దుల్ రహీమ్ సారథ్యంలో జకార్తా ఆసియా క్రీడల స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడు.
→ 1960 రోమ్ ఒలింపిక్స్ లో హంగరీ, పెరూపై తులసీదాస్ గోల్స్ కొట్టారు.

డాక్టర్ దాసరి ప్రసాదరావుకు ‘జీవిత సాఫల్య పురస్కారం'

→ ప్రముఖ వైద్యుడు, గుండె శస్త్రచికిత్స నిపుణుడు, నిమ్స్ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు 'జీవిత సాఫల్య పురస్కారం' అందు కున్నారు.
→ కోయంబత్తూరులో గురువారం జరిగిన 'హార్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా' 69వ వార్షికోత్సవంలో ఆయన దీన్ని స్వీకరించారు.
→ గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధుల శస్త్రచికిత్సలలో ఉత్తమ సేవలు అందించిన దుకు 'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్క్యు లర్ సర్జన్స్' ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
→ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యిమందికి పైగా గుండె శస్త్ర చికిత్స నిపుణులు పాల్గొన్నారు.
→ ముఖ్య అతిథిగా హాజ రైన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ నుంచి డాక్టర్ ప్రసాదరావు పురస్కారం స్వీకరించారు.
→ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైల్సెంగ్ మెహర్వాల్, కార్యదర్శి డాక్టర్ సీఎస్ హైర్మత్ తదితరులు ప్రసాద రావు సేవలను అభినందించారు.
→ అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేశంలో పేదలకూ అధునాతన వైద్యం అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు దీనిపై దృష్టి సారించాలన్నారు.

65 ఏళ్లు పైబడినవారూ ఇక అవయవాలు స్వీకరించొచ్చు!

→ఇక నుంచి 65 ఏళ్లు పైబడిన రోగులు కూడా మరణించిన దాతల నుంచి అవయవాలు స్వీకరించేందుకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు.
→ఇందుకు సంబం ధించి నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసి నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
→“గతంలో గరిష్ఠ వయోపరిమితి 65 ఏళ్లు ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తొలగించ డంతో ఏ వయసులో ఉన్నవారైనా మరణిం చిన వ్యక్తుల నుంచి అవయవాలు తీసుకో వచ్చు" అని ఓ అధికారి పేర్కొన్నారు.
→అంతేకాదు.. అవయవాలు స్వీకరించే రోగుల నుంచి నివాస ధ్రువపత్రాలను అడగ కూడదని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
→రిజిస్ట్రేషన్ కోసం ఫీజులు కూడా వసూలు చేయకూడదని పేర్కొంది.

పంచాయతీ పల్లెల్లోనూ అంకురాలు

→ హైద రాబాద్లోని టీహబ్... వీహబ్, టీవర్క్స్, టీఎస్ఎస్ఐసీ తదితరచోట్ల ఏర్పాటవుతున్న అంకురాలు (స్టార్టప్స్) ఇకపై పల్లెలకూ రాను న్నాయి.
→ వినూత్న ఆలోచనలు, ప్రయోగాలతో ముందుకొచ్చే పల్లె వాసులకు సాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అంకుర పరిశ్రమల కార్య క్రమానికి(స్టార్టప్ విలేజ్ ఆంత్రప్రె న్యూర్షిప్ ప్రోగ్రామ్) శ్రీకారం చుట్టబోతోంది.
→ తొలుత రాష్ట్రం లోని 19 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేట్టాలని నిర్ణయించిన సర్కారు ప్రాథమికంగా రూ.50 కోట్లు కేటాయించింది.
→తద్వారా 11,711 అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని సర్కారు నిర్దేశించుకుంది.
→రాష్ట్ర ప్రభుత్వం అంకుర విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 12 వేలకు పైగా అంకుర పరిశ్రమలు ఏర్పడ్డాయి.
→హైదరా బాద్ సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, యువత, సాంకేతిక నిపుణులు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తే అవి కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది.
→ప్రయోగాలతోపాటు ఉత్పత్తుల కోసం ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసి, స్థలాలను ప్రభుత్వమే కేటాయిస్తోంది.
→అంకుర సంస్థ ఉత్పత్తికి సిద్ధమైన తర్వాత వారికి పెట్టుబడులు సమకూర్చడంతోపాటు ఉత్పత్తుల మార్కెటిం గు సాయం అందిస్తోంది.
→కొన్ని సంస్థల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఈ వ్యవస్థ విజయవంతం కావడంతో సర్కారు తాజాగా గ్రామా లపై దృష్టి సారించింది.
→ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసా యేతర రంగాల్లో అంకుర సంస్థలను నెలకొల్పడానికి, అవి స్థిరంగా కొనసాగ డానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
→దీనికి ఐటీ శాఖ సాయంతో టీహబ్, వీహబ్, టీవర్క్స్ వంటి సంస్థలు అవసరమైన సాంకేతిక నైపుణ్య శిక్షణ, సలహాలను అందిస్తాయి.
→ప్రయోగాలకు అవసరమైన పరికరా లను పంపిణీ చేస్తాయి. బ్యాంకులతో పాటు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తాయి.
→ఏయే జిల్లాల్లో 19 జిల్లాల్లో 4 దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తారు.
→ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, జనగామ, జోగు లాంబ గద్వాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, హనుమ కొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఇందులో ఉన్నాయి.

మార్చి నుంచి వ్యవసాయ గణన

→ రాష్ట్రంలో వ్యవసాయ గణన (అగ్రికల్చర్ సెన్సెస్) ప్రారంభం కానుంది.
→ దేశంలో వ్యవసాయ స్థితిగతు లను తెలుసుకోవడంతోపాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక, ఆర్థిక విధాన రూపకల్పన కోసం కేంద్ర వ్యవసాయశాఖ అయిదేళ్లకోసారి దేశ వ్యాప్తంగా గణాంకాలను సేకరిస్తోంది.
→ చివరిసారిగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో గణన జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరగాల్సిన ప్రక్రియ కరోనా కారణంగా వాయిదా పడింది.
→ తాజాగా దీనిని చేప ట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కమిటీల ఏర్పాటు:-
→సర్వే నిర్వహణకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పా టైంది.
→వ్యవసాయశాఖ కమిషనర్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
→ఆయనతోపాటు CCLA, వ్యవసాయ, ఉద్యానవనశాఖల కమిషన ర్లు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, అటవీ శాఖ ప్రధాన సంక్షరణాధికారి కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
→జిల్లా స్థాయుల్లో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటుచేశారు.
→గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణాధికా రుల(ఏఈవో) ఆధ్వర్యంలో గణన జరుగుతుంది.
→ఇప్పటికే రెవెన్యూ దస్త్రాల్లో ఉన్న రైతుల వివరా లతో వారి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేస్తారు.
→కమతాల వారీగా సన్నకారు (ఒక హెక్టారు కంటే తక్కువ), చిన్నకారు (1-1.99 హెక్టార్లు), పాక్షిక మధ్యస్థం (2-3.99 హెక్టార్లు), మధ్యస్థం (4-999 హెక్టార్లు), భారీ (పది అత కంటే ఎక్కువ హెక్టార్లు)గా భూములున్న వారి జాబితా రూపొందిస్తారు
→ వారి వయసు, విద్యార్హతలు, సామాజిక (ఎస్సీ, ఎస్టీలు, ఇతరులు) వర్గం, కుటుంబ వివరాలు, భూమి విని యోగం (వ్యక్తిగత, ఉమ్మడి, సంస్థాగత, నీటిపారుదల వనరులు, వినియోగిస్తున్న ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వారి వద్దనున్న వ్యవసాయ పరికరాలు, పశు వులు, బ్యాంకు ఖాతాలు తదితర వివరాలు సేకరిస్తారు.
→ 'ఇప్పటికే రైతుబంధు ఖాతాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ ద్వారా వివరాలను సేకరించింది. వారికి ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసింది.
→ ఈ ఖాతాలనూ గణనలో పరిగణనలోకి తీసుకుంటాం. ఏఈవోలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విధానంలో వివరాలు సేకరిస్తారు.
→ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ శాఖ సదరు వివరాలను ప్రణాళిక విభాగానికి పంపు తుంది.
→ అక్కడి నుంచి అవి కేంద్ర వ్యవసాయ శాఖకు చేరుతాయి' అని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈక్వెటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ వ్యాప్తి

→ తమ దేశంలో మార్బర్గ్ వైరస్ కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పో యారని ఆఫ్రికా దేశం 'ఈక్వెటోరియల్ గినియా' ప్రకటించింది.
→ మరో 16 కేసులు నమోదయ్యాయని, మొత్తం 200 మందిని పరి శీలనలో ఉంచామని తెలిపింది.
→WHO వివరాల ప్రకారం మార్బర్గ్ వైరస్ ఎబోలా తరహాలోనే వేగంగా వ్యాపిస్తుంది.
→ఈ వైరస్ సోకిన వారిలో 88 శాతం మంది మృత్యువాత పడే ప్రమాదముంది.
→అంగోలా, డీఆర్ కాంగో, గినియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల్లో గతంలో మార్బర్గ్ వ్యాప్తి జరిగినప్పటికీ ఈక్వె టోరియల్ గినియాలో దీని జాడ కనపడటం ఇదే తొలిసారి.
→ప్రస్తుతం దేశ ప్రభుత్వం, డబ్ల్యూహెచ్లు ప్రభావిత ప్రాంతాలకు వైద్యు లను, నిపుణులను పంపించాయి.

పాఠశాల విద్యార్థులకు వన దర్శిని

→ పర్యావరణం, అడవులను పరిచయం చేసే వన దర్శిని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు అటవీ శాఖ రాజ్యసభ తెలిపింది.
→ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న కీసర ఎకో అర్బన్ పార్క్క నాగారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను అటవీ అధికారులు తాజాగా తీసుకెళ్లి అక్కడి వివిధ రకాల చెట్లు, ఔషధ మొక్కల గురించి వివరించారు.
→ పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే అడ వుల వల్ల ఉపయోగాలు, అడవులపై పెరుగుతున్న ఒత్తిడిని విద్యార్థులకు అర్థమయ్యేలా విశదీకరించారు.
→ విద్యార్థుల వనదర్శిని వివరాలను ట్విటర్లో షేర్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్.. తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఎకో పార్క్ ఫలితాలను ఇస్తోందన్నారు.
→ విద్యార్థులు పర్యా వరణ జ్ఞానం పెంచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అన్నారు.
→ పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యం, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అటవీశాఖ తెలిపింది.

న్యూజిలాండ్ ను వణికిస్తున్న గాబ్రియెల్

→ న్యూజిలాండ్లోని నార్త్ లాండ్ రీజి యన్ ని గాబ్రియెల్ తుపాను వణికిస్తోంది. దీని తీవ్రతకు పెను విధ్వంసం చోటుచేసుకుంది.
→ ఇక్కడ గంటకు 140 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దాదాపు 11 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని వాతావ రణ శాఖ పేర్కొంది.
→ ప్రభుత్వం జాతీయ అత్య వసర పరిస్థితిని విధించింది. న్యూజిలాండ్ చరి త్రలో అత్యవసర పరిస్థితి విధించడం ఇది మూడోసారి.
→ రెండు వారాల క్రితమే ఆక్లాండ్ను భారీ తుపాను అతలాకుతలం చేసింది. ఆ సమ యంలో నలుగురు మృత్యువాత పడ్డారు.
→ భారీ వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చోట్ల రహ దారులు ధ్వంసమయ్యాయి.
→ సుమారు 60,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆక్లాండ్లో సోమవారం రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రంథాలయాలు, పాఠశాలలను సైతం మూసివేశారు.

ప్రపంచంలో రెండో అత్యంత కాలుష్య నగరం ముంబై

→ ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ముంబై నిలిచింది. మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే.
→ స్విట్జర్లాండ్ కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ 'ఐక్యూ ఎయిర్' తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి.
→ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గాలినాణ్యతను తనిఖీ చేసి ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ను ఐక్యూ ఎయిర్ రూపొందిం చింది.
→ ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా.. ఇప్పుడా స్థానం లోకి ముంబై వచ్చింది.
→ ఆశ్చర్యకరంగా ఈసారి కలుషిత నగరాల టాప్ 10 లిస్టులో ఢిల్లీ పేరు లేదు.
→ ఈ జాబితాలో ప్రపంచం లోనే అత్యంత పొల్యూటెడ్ సిటీగా పాకిస్తాన్లోని లాహోర్ నిలిచింది.
→ ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా కాబూల్ (అఫ్ఘానిస్తా న్), కావో హిసియుంగ్ (తైవాన్), బిష్కెక్ (కిర్గిజ్ స్తాన్, ఆక్రా (నా), క్రాకో (పోలండ్), దోహా(ఖతర్), అస్తనా (కజకిస్తాన్), శాంటియాగో (చిలీ) ఉన్నాయి.
→ఎయిర్ క్వాలిటీ సర్వే చేయడంలో 'ఐక్యూ ఎయిర్'కు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెం ట్ ప్రోగ్రామ్ (యూఎస్ఈపీ), గ్రీన్ పీస్ సంస్థలు సహకరించాయి.
→ఈ స్టడీ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి కాలుష్యం, గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.

భూపరిశీలన ఉపగ్రహం నిసార్

→ భారత్-అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన భూపరిశీలన ఉపగ్రహం 'నిసార్' ఈ ఏడాది అందుబాటులోకి రానుంది.
→ 2.8 టన్నుల బరువున్న దీనిని ఈ ఏడాది సెప్టెంబరులో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
→ డ్యూయల్ బ్యాండ్ పేలోడ్ను కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరే టరీ (జేపీఎల్) నుంచి ఇస్రో అధిపతి డా. సోమనాథ్ జెండా ఊపి బెంగ ళూరులోని యూఆర్రావు శాటిలైట్ సెంటర్ కు తీసుకురానున్నారు.
→ ఇక్కడ పూర్తిగా అనుసంధానించాక శ్రీహరికోటకు తీసుకొస్తారు.
→ నాసా-ఇస్రో సింథ టిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్) అంచనా వ్యయం రూ.12,150 కోట్లు. దీని నిర్మాణానికి 2014 సెప్టెంబరులో ఇస్రో, నాసా ముందుకొచ్చాయి.
→ యూఎస్ కు చెందిన ఎల్ బ్యాండ్, భారత్కు చెందిన ఎస్-బ్యాండ్ సార్ను ఉపయోగించిన ఈ ఉపగ్రహం జీవితకాలం మూడేళ్లు.
→ భూమి, మంచు ద్రవ్యరాశి, ఎత్తును ప్రతినెలా నాలుగు నుంచి ఆరుసార్లు మ్యాప్ చేయడా నికి అధునాతన రాడార్ ఇమేజింగ్ను ఉపయోగిస్తుంది.
→ క్రస్ట్ పరిణామం, స్థితికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తుంది.
→ వాతావరణ మార్పులను శాస్త్రవేత్తలు సులువుగా అర్థం చేసుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమ యంలో విస్తృతంగా సాయపడనుంది.
→ భూగ్రహంపై ఉన్న జీవావరణం, వాతావరణ పరిస్థితులు, మంచు పలకల పరిస్థితి, సముద్ర భూగర్భ జల మట్టాలు, సునామీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు కొలిచే వీలుంది.

మన్మోహన్ కు జీవితకాల సాఫల్య పురస్కారం

→ భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మో హన్ సింగ్(90)కు బ్రిటన్లో జీవితకాల సాఫల్య గౌర వాన్ని ప్రకటించారు.
→ ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపు భారత్-బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది.
→ బ్రిటన్ లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (ఎస్ఐ ఎస్ఏయూ) త్వరలోనే దిల్లీలో మన్మోహన్కు ఈ అవా ర్డును ప్రదానం చేస్తుంది.
→ బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో చదివి లబ్ధప్రతిష్ఠులైన భారతీయ విద్యార్థులకు ఇచ్చే అవార్డు ఇది.
→ భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తోం దాని మన్మోహన్ లిఖిత సందేశంలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌ నూతన అధ్యక్షుడిగా చుప్పూ

→బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్‌ షహాబుద్దీన్‌ చుప్పూ ఎన్నికయ్యారు.
→ఈ మేరకు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. అవామీ లీగ్‌ పార్టీ తరపున చుప్పూ పోటీ చేశారని, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నామని తెలిపింది.
→74 ఏళ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్‌ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో విపత్తు అత్యయిక స్థితి

→దక్షిణాఫ్రికాను తీవ్ర విద్యుత్‌ సంక్షోభం చుట్టుముట్టడంతో దేశంలో విపత్తు అత్యయిక స్థితి (స్టేట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌)ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ప్రకటించారు.
→ఆస్పత్రులు, తాగు నీటి సరఫరా వ్యవస్థలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
→దక్షిణాఫ్రికాకు ఏకైక విద్యుత్‌ సరఫరా సంస్థ అయిన ఎస్కామ్‌ దివాళా తీయడంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
→సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా విద్యుత్‌ శాఖా మంత్రిని నియమిస్తామని రామఫోసా తెలిపారు.
→ఎస్కామ్‌ ఇప్పటికే పొరుగు దేశాల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుందని, ప్రైవేటు సంస్థలను కూడా విద్యుదుత్పత్తి కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు.
→9,000 మెగావాట్లను ఉత్పత్తి చేసే 100 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

పాకిస్థాన్‌కు రూ.8,250 కోట్ల రుణ సాయం

→తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు పెద్ద ఊరట లభించింది.
→ఓ దశలో సంక్లిష్టంగా మారిన ఇరు పక్షాల చర్చలు ఎట్టకేలకు కొలిక్కిరావడంతో అధికారుల స్థాయి ఒప్పందంపై సంతకాలు చేశారు.
→పాక్‌ కష్టాలు గట్టెక్కి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడినపడేలా రూ.8,250 కోట్ల (ఒక బిలియన్‌ డాలర్లు) రుణ సాయం ఆ దేశానికి అందనుంది.
→ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌తో సమావేశమైన ఐఎంఎఫ్‌ ప్రతినిధుల బృందం ఒప్పందం గురించి ఆయనకు తెలియజేసింది.
→ప్రభుత్వ వర్గాల కథనం మేరకు ఇరు పక్షాలు రుణ షరతులపై ఓ అవగాహనకు రావడంతో ఈ ఒప్పందాన్ని ప్రధాని వెంటనే ఆమోదించారు.

భారత కాకస్‌ సహాధ్యక్షులుగా రో ఖన్నా, మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నిక

→అమెరికాలోని ప్రస్తుత 118వ కాంగ్రెస్‌ సభలో భారత్‌తో పాటు ఇండో అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన కాకస్‌ సహాధ్యక్షులుగా (కో-ఛైర్స్‌) ఇండో అమెరికన్‌ అయిన డెమోక్రటిక్‌ సభ్యుడు రో ఖన్నా (46), రిపబ్లిన్‌ హౌస్‌ సభ్యుడు మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నికయ్యారు.
→ఈ కాకస్‌ అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభ సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి.
→ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఇది కృషి చేస్తుంది.
→ 1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్‌కు ఇప్పటిదాకా సహాధ్యక్షుడిగా ఎన్నికైన రెండో ఇండో అమెరికన్‌ రో ఖన్నా. 115వ కాంగ్రెస్‌ సభలో (2015 - 16) ఇండో అమెరికన్‌ అమీ బేరా ఈ కాకస్‌కు సహాధ్యక్షుడిగా పనిచేశారు.
→ ప్రస్తుత కాంగ్రెస్‌ సభలో అయిదుగురు ఇండో అమెరికన్లు ఉన్నారు.

యూఏఈ, ఫ్రాన్స్‌లతో భారత్‌ త్రైపాక్షిక సహకారం

→ఉక్రెయిన్‌ యుద్ధం అనిశ్చితిలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో భారత్‌ మరో కీలక కూటమి దిశగా ఫ్రాన్స్, యూఏఈలతో వివిధ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకుంది.
→ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటన చేశాయి.
→భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, ఫ్రెంచ్‌ మంత్రి కేథరిన్‌ కలోనా, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు ప్రకటన విడుదల చేశారు.
→ ఇందులో రక్షణ, ఇంధన, ఆహార భద్రతా రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించారు.
→ ఈ త్రైపాక్షిక సహకారానికి గత ఏడాది సెప్టెంబరు 19న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల వేదికగా ఈ ముగ్గురు విదేశాంగ మంత్రులు కలిశారు.

సైబర్‌ సెక్యూరిటీ బలోపేతానికి క్వాడ్‌ నిర్ణయం

→సైబర్‌ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెషిన్‌ లెర్నింగ్‌తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్‌ కూటమి నిర్ణయించింది.
→శ్వేతసౌధం వెలువరించిన ఓ ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. సైబర్‌ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది.
→తమ తమ దేశాల్లోని ప్రజలకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడానికి క్వాడ్‌ కృషి చేస్తుందని వివరించింది.

కరెన్సీ నోటుపై బ్రిటన్‌ రాజముద్ర తొలగింపు

→తమ దేశ ఐదు డాలర్‌ల కరెన్సీ నోటుపై ఇక నుంచి బ్రిటన్‌ రాజు చిత్తరువుని ముద్రించబోమని ఆస్ట్రేలియా సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది.
→బ్రిటన్‌ రాజ వంశంతో ముద్రిస్తున్న చివరి కరెన్సీ నోటు ఇదే కావడంతో తాజా నిర్ణయంతో ఇక నోట్లపై రాజవంశ ఆనవాళ్లు కనపడవు.
→ ఆ స్థానంలో తమ దేశ మూలవాసుల సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త నోట్లను ఆస్ట్రేలియా ముద్రించనుంది. నాణేలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
→ ప్రస్తుత బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌ 3 రూపు ఉన్న నాణేలు త్వరలోనే విపణిలోకి వస్తాయని వివరించింది.
→ ఆస్ట్రేలియా పూర్తి స్వతంత్ర దేశమే అయినప్పటికీ బ్రిటన్‌ రాజ వంశం పేరు మీదుగానే పాలన సాగడం సంప్రదాయంగా వస్తోంది.

మయన్మార్‌లో మరో ఆరు నెలలు సైనిక పాలనే

→ప్రస్తుతం అమలులో ఉన్న అత్యయిక స్థితిని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్‌లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం ప్రకటించింది.
→ ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలను జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది.
→ ఈ మేరకు సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌ఎస్‌డీసీ) నిర్ణయం తీసుకుంది.
→ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మరికాస్త సమయం పడుతుందని ఎన్‌ఎస్‌డీసీ తన ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.

అంకుర సంస్థల ఏర్పాటులో 8వ స్థానంలో తెలంగాణ

→అంకుర సంస్థల (స్టార్టప్‌) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ బిహార్‌ కంటే దిగువ స్థాయిలో నిలిచింది.
→2022 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్‌లు ఏర్పాటవగా వాటిలో 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పరిమితమైంది.
→4,566 స్టార్టప్‌లతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాలను మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌ ఆక్రమించాయి.
→దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.
→కేంద్రం ప్రకటించిన స్టేట్స్‌ స్టార్టప్స్‌ ర్యాంకింగ్‌ ఎక్సైజ్‌ - 2022లో తెలంగాణ టాప్‌ పెర్ఫార్మర్‌గా 7వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌ 29వ స్థానానికి పరిమితమైంది.
→కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
→2019 ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లోని అర్హతల ప్రకారం ఏర్పాటైన వాటిని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ట్రేడ్‌ (డీపీఐఐటీ) స్టార్టప్‌లుగా గుర్తిస్తూ వస్తున్నారు.
→అలా గుర్తింపు పొందిన 86,713 స్టార్టప్‌లలో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఝార్ఖండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి.

కర్ణాటక - ఏపీ ఆర్టీసీల ఒప్పందం

→ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కర్ణాటకలో నిత్యం 2.34 లక్షల కి.మీ. తిరిగేలా ఒప్పందం కుదిరింది. కర్ణాటక బస్సులు ఏపీలో నిత్యం 2.26 లక్షల కి.మీ. తిరగనున్నాయి. →ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, కేఎస్‌ఆర్టీసీ ఎండీ వి.అంబుకుమార్‌ విజయవాడలో ఒప్పందంపై సంతకాలు చేశారు. →ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటి వరకు కర్ణాటకలో 1.65 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పేది. →ఆ రాష్ట్ర బస్సులు ఏపీలో 1.56 లక్షల కి.మీ. తిరిగేవి. ఇప్పుడు కి.మీ. పెరగడంతో ఆ మేరకు బస్సులనూ పెంచనున్నారు. →రాష్ట్ర పునర్విభజన తర్వాత కర్ణాటకతో తొలిసారి ఏపీఎస్‌ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌

→తెలుగు వ్యక్తి, ప్రస్తుతం మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌తో సహా అయిదుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ సీనియర్‌ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. →ఇందులో రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్, అదే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌మిశ్ర ఉన్నారు. →వీరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనుంది. ఇక రెండే ఖాళీలు ఉంటాయి. →సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం గత డిసెంబరు 13న ఈ అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ధర్మాసనంపై రెండో తెలుగు వ్యక్తి:- →ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చోబోతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌. →సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా సేవలందించిన ఆయన తండ్రి పి.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. →జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. →హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. →2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. →2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్‌ 14న పంజాబ్‌ - హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. →2021 ఫిబ్రవరి 12న మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

12 వేల అడుగుల ఎత్తులో ఐస్‌ స్కేటింగ్‌ ట్రాక్‌

→హిమాచల్‌ ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లాలోని నాకో సరస్సు వద్ద సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. →12 వేల అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఉన్న ఈ సరస్సులో పొడవైన ఐస్‌ ట్రాక్‌ తీర్చిదిద్ది ఈ ఘనత సాధించారు. →అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. ఇక్కడ మైనస్‌ 18 డిగ్రీల వాతావరణంలో జాతీయ స్థాయి ఐస్‌ స్కేటింగ్‌ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. →15 రాష్ట్రాల నుంచి 70 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఐస్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీలు ముగిశాయి.

సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం

→సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. →ఆయనతో పాటు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రలతో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయించారు. →వీరి పేర్లను గతేడాది డిసెంబరు 13న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. →తాజాగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్‌ మనోజ్‌మిశ్ర అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. →తాజా నియామకాలతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.

దేశంలో తొలిసారి లిథియం నిల్వలు గుర్తింపు

→దేశంలో మొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. →జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్‌ - హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్లు పేర్కొంది. →దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది. →కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్లు గనుల శాఖ వెల్లడించింది.

సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు

→సర్వోన్నత న్యాయస్థానం ఇక పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయనుంది. →ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేస్తూ కొలీజియం జనవరి 31న తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. →దీంతో ఇక పూర్తిస్థాయి సామర్థ్యం (34 జడ్జీలు)తో సుప్రీంకోర్టు పనిచేయనుంది. →రాజ్యాంగ నిబంధనల ప్రకారం అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా భారత రాష్ట్రపతి నియమించారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. →ఫిబ్రవరి 13న ఈ జడ్జీల చేత సీజేఐ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మూషికంగా గిన్నిస్‌ రికార్డు

→కాలిఫోర్నియాకు చెందిన ఒక చిట్టెలుక ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మూషికంగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. →దీని వయసు 9 ఏళ్ల 209 రోజులని ధ్రువీకరణ పత్రం స్పష్టం చేస్తోంది. →మానవ సంరక్షణలో ఎక్కువ కాలం జీవించిన మూషికంగా ఇది గుర్తింపు సాధించింది. →ప్యాట్‌ అనే ఈ ఎలుక శాన్‌ డియోగో సఫారీ పార్క్‌లో 2013 జులై 14న జన్మించింది. ఇది పసిఫిక్‌ పాకెట్‌ మౌస్‌ జాతికి చెందింది.

ముంబయి - దిల్లీ ఎక్స్‌ప్రెస్‌ వేలో మొదటి దశ ప్రారంభం

→కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (1,386 కి.మీ.) లో 246 కి.మీ. మొదటి దశ సోహ్నా - దౌసా రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని దౌసాలో ప్రారంభించారు. దిల్లీ-దౌసా-లాల్‌సాట్‌ మధ్య పూర్తయిన ఈ రహదారితో దేశరాజధాని నగరం, జైపుర్‌ మధ్య ప్రయాణసమయం అయిదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది. రూ.18 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారితో పాటు నాలుగు ప్రాజెక్టుల శంకుస్థాపనలు/ఆరంభాలను ప్రధాని మోదీ రిమోట్‌ మీట నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు, రైల్వేలు, ఆప్టికల్‌ ఫైబర్‌ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు, వైద్య కళాశాలలను ప్రారంభించడం వంటి చర్యలు వర్తకులు, చిన్న దుకాణదారులు, పరిశ్రమలను బలోపేతం చేస్తుందన్నారు. మౌలిక సదుపాయాల్లో చేసే పెట్టుబడులతో మరిన్ని కొత్త పెట్టుడులు వస్తాయని చెప్పారు. → దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే తొలి దశ రహదారిని జాతికి అంకితం చేయడం, దేశంలో అతి పెద్ద, ఆధునిక ఎక్స్‌ప్రెస్‌ వేల్లో ఇదీ ఒకటి. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. → ప్రపంచంలోనే రికార్డు స్థాయి వేగంతో పూర్తవుతున్న హైవేగా పేరొందిన ఈ రహదారి వల్ల దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మధ్య ప్రస్తుతమున్న దూరం 180 కిలోమీటర్ల మేర తగ్గుతుంది.

14వ ఏరో ఇండియా ప్రదర్శన ప్రారంభం

→బెంగళూరులో 14వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. యువత నవ్యాలోచనలు, సాంకేతిక నైపుణ్యాన్ని రక్షణ రంగంలో వినియోగించి- దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్, భారత్‌లో తయారీకి, సమర్థతకు ప్రమాణంగా నిలిచినట్లు ప్రధాని ప్రకటించారు. భారత్‌లో తయారీ కారణంగా ప్రస్తుతం 75 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఈ రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉన్నామని మోదీ వెల్లడించారు. → ఏరో ఇండియా ప్రదర్శనకు 98 దేశాల నుంచి 810 రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అమెరికా వైమానికదళానికి చెందిన 5వ తరం సూపర్‌ సోనిక్‌ మల్టీకోర్‌ ఎఫ్‌35ఏ శ్రేణిలోని రెండు కొత్త విమానాలు ఎఫ్‌35ఏ లైట్నింగ్‌ 2, ఎఫ్‌ 35ఏ జాయింట్‌ స్ట్రైక్‌ ఫైటర్‌లను ఏరో ఇండియాలో ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన సూపర్‌సోనిక్‌ స్టెల్త్‌ విమానాలు మన దేశానికి రావడం ఇదే తొలిసారని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. →రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జింబాబ్వే రక్షణ మంత్రి ఓపా చార్మ్‌ జ్విన్‌పంజ్, బంగ్లాదేశ్‌ ప్రధాని భద్రతా సలహాదారు మేజర్‌ జనరల్‌ తారిఖ్‌ అహ్మద్‌ సిద్ధిఖీ, నేపాల్‌ రక్షణ మంత్రి హరిప్రసాద్‌ ఉప్రేతి, శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రేమిత బండారలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

→2023 - 24 ఆర్థిక సంవత్సరపు తెలంగాణ రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. →శాసనసభ, మండలి ఆమోదించిన రెండు బిల్లులకు సంబంధించిన దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. →ఫిబ్రవరి 12న శాసనసభ, మండలి బిల్లుకు ఆమోదం తెలపగా, 13న గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. ఒకరోజు వ్యవధిలోనే గవర్నర్‌ ఆమోదం తెలిపారు. →దీంతో ద్రవ్య వినిమయ బిల్లుపై తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించేందుకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

→సమావేశాల చివరి రోజున తెలంగాణ శాసనసభ, మండలిలు రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. →చివరి రోజు శాసనసభలో చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానమిచ్చారు. రెండున్నర గంటల పాటు ఆయన ప్రసంగించారు. →మండలిలో చర్చకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జవాబు చెప్పారు. అనంతరం రెండు సభలూ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సమావేశాలు 56.25 గంటలు:-
→ఏడు రోజుల పాటు సాగిన సమావేశాల్లో 56.25 గంటల పాటు సభ కొలువుదీరింది. ఫిబ్రవరి 3న గవర్నర్‌ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. →ఫిబ్రవరి 6న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సభలో మొత్తం 41 మంది సభ్యులు మాట్లాడగా 38 ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానమిచ్చారు. →ఈ దఫా 5 బిల్లులను ప్రవేశపెట్టగా చర్చ అనంతరం వాటికి సభ ఆమోదముద్ర వేసింది. మరోవైపు శా‹సన మండలి సమావేశాలు 17 గంటల పాటు సాగాయి.

తెలంగాణలో 12 పద్దులకు సభ ఆమోదం

→తెలంగాణ అసెంబ్లీలో 12 పద్దులను సభ అమోదించింది. →సమాచార-పౌర సంబంధాల శాఖ, పరిశ్రమలు-వాణిజ్య శాఖ, ఐటీ-ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్స్‌ శాఖ, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ, కార్మిక-ఉపాధి కల్పన శాఖ, దేవాదాయ శాఖ, అటవీ-పర్యావరణ శాఖ, న్యాయ శాఖ, విద్యుత్తు, పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు సంబంధించిన పద్దులపై సభలో చర్చించి, ఆమోదించారు. →వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా మారుస్తూ మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

రూ.2,90,396 కోట్లతో 2023 - 24 తెలంగాణ బడ్జెట్‌

సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 - 24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సుమారు ఇరవై శాతం నిధులను సబ్బండ వర్గాల సంక్షేమానికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కాయి. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌కు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసింది. పేదల గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో నిధులను కేటాయించడంతో పాటు బడ్జెట్‌ వెలుపల నిధులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేయనుంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పథకాల జోలికి పోకున్నా ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ నిధులను కేటాయించింది. 2018 ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా నిధులను కేటాయించింది. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వాటాను పెంచింది.

వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
→ నీటి పారుదల శాఖకు రూ.26,885కోట్లు
→ విద్యుత్‌ కేటాయింపులు రూ.12,727కోట్లు
→ ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు
→ దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
→ ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
→ ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు
→ బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
→ మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు
కేటాయింపులిలా:-
→ నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు
→ వ్యవసాయ రంగం రూ.26,831
→ విద్యుత్‌ రంగం రూ.12,727 కోట్లు
→ ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
→ ఆసరా పింఛన్లకు రూ.12,000 కోట్లు
→ దళితబంధుకు రూ.17,700 కోట్లు
→ గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధికి రూ.15,233 కోట్లు
→ బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
→ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.3,210 కోట్లు
→ మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు
→ మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
→ హరితహారానికి రూ.1,471 కోట్లు
→ విద్యారంగానికి రూ.19,093 కోట్లు
→ వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు
→ పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
→ పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు
→ రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు
→ పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
→ హోం శాఖకు రూ.9,599 కోట్లు
→ కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు
→ కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022 - 23

→ఆర్థికమాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
→ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ యావద్దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి...‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు.
→రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఆటంకాలు కల్పిస్తున్నా గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. శాంతిభద్రతల సమర్థ నిర్వహణతో దేశంలోనే ఎక్కడా లేనిరీతిలో పెట్టుబడులు సాధ్యమయ్యాయన్నారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేశారు.

రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.13.27 లక్షల కోట్లు

→రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సేవల రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. 2022 - 23లో 17.5 శాతం ఉండగా 2021 - 22లో ఇది 20.5 శాతం నమోదైంది. ఈ రంగం పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, రవాణా, స్థిరాస్తి తదితర సేవలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక (సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌) - 2023లో వివిధ రంగాల్లో తాజా పరిస్థితులను వెల్లడించింది. 2022 - 23లో సేవల రంగం విలువ రూ.7,50,408 కోట్లు. వ్యవసాయం, పశు సంవర్ధకం, మత్స్య, గనులు, ఖనిజాల నుంచి లభించే ఆదాయ అంచనా ప్రకారం ప్రాథమిక రంగం వాటా 11.7 శాతంగా తేలింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా విలువ రూ.2,45,794 కోట్లు. మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సంబంధ సేవలు, నిర్మాణ రంగం కలిపి ద్వితీయ రంగంవాటా 10.6%. దీని విలువ రూ.1,98,575 కోట్లు. మొత్తం ఆదాయంలో జీఎస్‌డీపీ వాటా 15.6%. దీని విలువ రూ.13,27,495 కోట్లు. గతేడాది 19.4% నమోదైంది. విలువ రూ.11,48,115 కోట్లు. 2015 - 16లో జీఎస్‌డీపీ 14.2%. కరోనా కాలంలో 2019 - 20లో 10.8 శాతం, 2020 - 21లో 1.2శాతానికి పడిపోగా గతేడాది నుంచి పుంజుకుంది.

→ తలసరి ఆదాయం (పర్‌ క్యాపిటా)లో రూ.6,69,102లతో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాజధాని నగరంలో ఎక్కువ ప్రాంతం ఈ జిల్లాలోనే విస్తరించి ఉండటంతోపాటు ఐటీ, పరిశ్రమలు, సేవలు, తదితర రంగాలు వృద్ధి చెందడంతో ఇక్కడ తలసరి ఆదాయం భారీగా నమోదైంది. హైదరాబాద్‌ జిల్లా (రూ.3,49,061), సంగారెడ్డి (రూ.2,49,091), సిద్దిపేట జిల్లా (రూ.2,12,788) వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. హనుమకొండ జిల్లా రూ.1,30,821 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. ఆపై స్థానాల్లో కుమురం భీం ఆసిఫాబాద్‌ (రూ.1,31,843), వికారాబాద్‌ (రూ.1,31,962) జిల్లాలు ఉన్నాయి.

మండలాల సగటు జనాభా 61,366

→మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలోని 612 మండలాల్లో మొత్తం జనాభా సుమారు 3.75 కోట్లు. దీని ప్రకారం ఒక్కో మండల సగటు జనాభా 61,366. అదే సమయంలో దేశంలో తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు కలిపి ఒక్కో మండల సగటు జనాభా 2.07 లక్షలుగా తేలింది. అంటే రాష్ట్రంలో మండల సగటు జనాభా చాలా తక్కువని స్పష్టమవుతోంది. తెలంగాణ తర్వాత అతి తక్కువ సగటు మండల జనాభా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. అక్కడ మండల సగటు జనాభా 79,023. అత్యధికంగా మహారాష్ట్రలో 3.53 లక్షలుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 828 మండలాలు/బ్లాక్‌లు ఉండగా.. 668 మండలాలతో ఏపీ, 612 మండలాలతో తెలంగాణ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

23 లక్షలు దాటిన ధరణి లావాదేవీలు

ధరణి పోర్టల్‌ ద్వారా ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ పూర్తికి 47 నిమిషాల సమయం పడుతోంది. 2020 నవంబరు రెండో తేదీ నుంచి 2023 జనవరి 27 వరకు 23.20 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల నిమిత్తం 17.30 లక్షల దరఖాస్తులు రాగా 16.59 లక్షలు పూర్తయ్యాయి.

అడవుల విస్తీర్ణంలో తెలంగాణ ప్రథమం

అడవుల విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2019 - 21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ - 2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. 2015లో తెలంగాణ 19,854 చదరపు కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా 2019 నాటికి 20,582 చదరపు కి.మీ.లకు పెరిగింది. 2021 నాటికి 21,214 చదరపు కి.మీ.లకు చేరుకుంది. 2019 - 21 కాలంలో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కి.మీ.(3.07 శాతం) అడవులు విస్తరించాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతంలో పెరుగుదల 1,540 చదరపు కి.మీ.లు (0.22 శాతం) మాత్రమే నమోదు కావడం గమనార్హం.

మరికొన్ని ముఖ్యాంశాలు:-
→ రాష్ట్రంలోని మొత్తం బ్యాంకు శాఖల్లో 46% (2,732) నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. మిగిలిన వాటిలో సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 24% (1,408) ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 30% (1,818) ఉన్నాయి.

→ మాంసం ఉత్పత్తి గత తొమ్మిదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరిగింది. 2013 - 14లో 2.30 లక్షల టన్నులు ఉండగా 2021 - 22 నాటికి 10.14 లక్షల టన్నులకు పెరిగింది. పాల ఉత్పత్తిలో 55, గుడ్ల ఉత్పత్తిలో 71 శాతం వృద్ధి నమోదైంది.

→ పోలీస్‌ బలగాల సంఖ్య 2015లో 52,116 ఉండగా 2019 నాటికి 77,680కి చేరింది. అంటే దాదాపు 50 శాతం పెరిగింది.

→ రాష్ట్రంలోని మొత్తం కార్మికుల్లో 33.21 శాతం మంది సేవారంగంలో పనిచేస్తున్నారు. ఈ అంశంలో జాతీయ సగటు 29.64 శాతమే. రాష్ట్రంలో సేవా రంగంలో ఉన్న వారిలో 39.75 శాతం మంది వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. మరో 21.04 శాతం మంది రవాణా, స్టోరేజీ, కమ్యూనికేషన్‌ రంగాల్లో ఉన్నారు. అర్బన్‌ కార్మికుల్లో 63.22 శాతం మంది సేవా రంగంలో పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో 18.28 శాతం మంది ఈ రంగంలో ఉన్నారు.

→ తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి 31 నాటికి 13.79 లక్షల ఉత్తర్వులను జారీ చేసింది. గవర్నమెంట్‌ ఆర్డర్‌ ఇష్యూ రిజిస్టర్‌ (జీవోఐర్‌) పోర్టల్‌ ద్వారా సచివాలయంలోని శాఖలు 1,63,896, వాణిజ్య పన్నులశాఖ 4,26,590, ట్రాన్స్‌కో 34,774, సచివాలయ శాఖలు ఎఫ్‌ఎంఎస్‌లో జారీ చేసినవి 6,89,819, ఎస్‌వోఎంఎస్‌ ద్వారా 64,813 ఉత్తర్వులు జారీ చేశాయి.

→ 2014 జూన్‌ నుంచి 2023 జూన్‌ వరకు నమోదైన ఈ-లావాదేవీల్లో (ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌) దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రతి వెయ్యి జనాభాకు రాష్ట్రంలో 1,58,241 లావాదేవీలు జరిగాయి. రెండో స్థానంలో ఉన్న ఏపీలో 1,41,147, మూడో స్థానంలో ఉన్న కేరళలో 1,40,709 నమోదయ్యాయి. బిహార్‌లో 11,267, మహారాష్ట్రలో 15,819 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి.


వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 46 శాతం మందికి ఉపాధి

తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరులు, ఉపాధి, ఇతర అంశాలపై అధ్యయన వివరాలను ఈ నివేదికలో వెల్లడించారు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 65 లక్షల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమేపీ పెరిగి 2021 - 22 నాటికి 1.5 కోట్లకు చేరింది.
వీరిలో అత్యధికంగా 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు, అనుబంధ వృత్తులు, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం తదితర రంగాల్లో వారు పనిచేస్తున్నారు. తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం ఉంది. ఔషధ, ఇంధన, రసాయన, జౌళి, తయారీ పరిశ్రమల్లో 11 శాతం, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఆతిథ్యం, ఇతర వాణిజ్య, సేవా రంగాల్లో 11 శాతం మంది ఉన్నారు. నిర్మాణ, రవాణా రంగాల్లో 9 శాతం మంది చొప్పున పనిచేస్తున్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో 5 శాతం, ఆర్థిక సేవల రంగాల్లోనూ 5 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. ఐటీ, అనుబంధ వృత్తుల్లో 3 శాతం, గనులు, విద్యుత్, ఇతర రంగాల్లో ఒక శాతం మంది ఉపాధి పొందుతున్నారని నివేదిక వెల్లడించింది.

తొలిసారిగా ఫిబ్రవరిలోనే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల ముగింపు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండో వారంలోనే బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.
ఫిబ్రవరి 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 6న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా తర్వాత ఆరు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్‌ అకౌంట్‌ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి.
రాష్ట్ర ఆవిర్భావం దృష్ట్యా 2014లో నవంబరు అయిదో తేదీన బడ్జెట్‌ సమావేశం జరిగింది. 2018 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరగగా మరుసటి ఏడాది సెప్టెంబరు 9న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్‌ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది.
అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్‌ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది.
బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్‌ అమల్లోనే ఉంటుంది.

తెలంగాణలో తలసరి ఆదాయంలో 15 శాతం వృద్ధి రేటు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3,17,115గా ప్రభుత్వం అంచనా వేసింది.
మొదటిసారిగా తలసరి ఆదాయం రూ.3 లక్షలను దాటగా గత ఏడాది కంటే 15 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ విషయాన్ని గవర్నర్‌ ప్రసంగంలో వెల్లడించారు.
గత ఏడాది, రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.2,75,443గా అంచనా వేశారు. ప్రాథమిక అంచనాల మేరకు గత ఏడాదికంటే ఈసారి తలసరి ఆదాయం రూ.41,672 పెరిగింది.

బొగ్గు రవాణాలో రికార్డు

గత నెలలో 68.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని, 68.4 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో కొత్త రికార్డు నమోదైందని సింగరేణి సంస్థ తెలిపింది. 2016 మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటి వరకు నెలవారీ గరిష్ఠ రవాణా రికార్డు అని వివరించింది. ఉపరితల గనుల్లో రోజువారీ మట్టి తొలగింపులో కూడా గత నెల 31న అత్యధికంగా 16.67 లక్షల క్యూబిక్‌ మీటర్లను తొలగించి రికార్డు సృష్టించినట్లు పేర్కొంది.

ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను నియమించింది.
ఇప్పటివరకు ఇక్కడ ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేసింది.
మొత్తం 13 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో ఆరుగురు కొత్తవారు.
ఏడుగురు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయ్యారు.

→ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదరిలో జన్మించారు. బాల్యం అంతా అక్కడే సాగింది.
అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన, మంగళూరు కొడియాల్‌బెయిల్‌ ఎస్‌డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు.
1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్‌ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు.

గవర్నర్‌గా నియమితులైన రెండో న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన అనంతరం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రెండో వ్యక్తిగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నిలువనున్నారు.
ఈ తొలి రికార్డు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తమిళనాడుకు చెందిన జస్టిస్‌ పి.సదాశివంకి దక్కుతుంది.
ఆయన 2014 ఏప్రిల్‌ 26న పదవీ విరమణ చేయగా, 2014 సెప్టెంబర్‌ 5న కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు గవర్నర్‌గా నియమితులవడం అదే తొలిసారి. నరేంద్రమోదీ ప్రభుత్వం జరిపిన తొలి గవర్నర్‌ నియామకం కూడా అదే.
మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు దక్కింది.
ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారి, లద్దాఖ్‌ లెఫ్టినెంటర్‌ గవర్నర్‌ ఆర్‌.కె.మాథుర్‌లు పదవులకు రాజీనామా చేయగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఎంఎంటీసీ డిజిటల్‌ వెండి ఆవిష్కరణ

ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్‌కు చెందిన పీఏఎంపీ ఎస్‌ఏ సంయుక్త సంస్థ ఎంఎంటీసీ - పీఏఎంపీ డిజిటల్‌ వెండిని ఆవిష్కరించాయి.
కనీసం రూ.1 నుంచి పెట్టుబడితో ఆన్‌లైన్‌లో వెండిని కొనుగోలు చేసుకోవచ్చు. 3 శాతం జీఎస్‌టీ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా కొనుగోలు చేసిన వెండిని ఎంఎంటీసీ - పీఏఎంపీ డిజిటల్‌ వాల్ట్‌లో దాచుకుని, భవిష్యత్‌లో విక్రయించే సౌలభ్యం ఉంది.
పారదర్శకత, 24/7 లభ్యత, కచ్చితమైన స్వచ్ఛత, ఎటువంటి తయారీ ఛార్జీలు లేకపోవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని సంస్థ తెలిపింది.
కంపెనీ ఇప్పటికే డిజిటల్‌ పసిడిలో అగ్రగామిగా ఉందని ఎంఎంటీసీ - పీఏఎంపీ ఎండీ వికాస్‌ సింగ్‌ తెలిపారు.
తమ ప్లాట్‌పామ్‌పై పసిడిని కొనుగోలు చేసి, అనంతరం వెండి నాణేలుగా మార్చుకోవచ్చని వెల్లడించారు.

డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి ‘డాక్టర్‌ కె.అంజిరెడ్డి మెమోరియల్‌ ఫెలోషిప్‌’

డాక్టర్‌ కె.అంజిరెడ్డి మెమోరియల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అఫర్డబుల్‌ బయోఫార్మాస్యూటికల్స్‌’ ను, ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐసీటీ), డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డికి అందజేసింది. ఐసీటీ సారథ్యంలో గోవాలో జరిగిన 4వ బయోసిమిలర్‌ వర్క్‌షాప్‌లో ఈ ఫెలోషిప్‌ను సతీష్‌రెడ్డి అందుకున్నారు.
డాక్టర్‌ రెడ్డీస్‌ వ్యవస్థాపకుడు కె.అంజిరెడ్డి ఐసీటీ పూర్వ విద్యార్థి. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫెలోషిప్‌ ముందుగా సతీష్‌రెడ్డికి లభించింది.

కేంద్ర బడ్జెట్‌ 2023 - 24

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్ల‌మెంట్‌లో ప్రవేశపెట్టారు.
సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్‌ ప్రాధాన్యం
→ వ్యవసాయం కోసం డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు.
→ వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సదుపాయం.
→ వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
→ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.
→ పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సదుపాయం.
→ ఆత్మ నిర్భర్‌ భారత్‌ క్లీన్‌ పథకం ఉద్యానవన పంటకు చేయూత.
→ చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం

అమృతకాలంలో ఇది తొలి బడ్జెట్‌

భారత దేశం తలెత్తుకుని నిలబడుతోంది. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్‌. డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగాయి. సమష్టి ప్రగతి దిశగా భారత్‌ కదులుతోంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టాం. 220 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌లను అందించాం. 44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోంది. విశ్వకర్మ కౌశల్‌ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నాం. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోంది.

కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు:-
→ 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొన్నారు. 2022 - 23లో ద్రవ్యలోటును 6.4 శాతంగా సవరించారు.
→ మూలధన పెట్టుబడి వ్యయం అంచనాను 33 శాతం మేర భారీగా పెంచి రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జీడీపీలో 3.3 శాతానికి సమానం. తాజా కేటాయింపు 2020లో కన్నా మూడు రెట్లు అధికం.
→ మహిళలకు కొత్త పొదుపు పథకం, మహిళా సమ్మాన్‌ పొదుపు పత్రం. రూ.2 లక్షల వరకూ ఏకకాలంలో పొదుపు చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు ఆ సొమ్మును దాచుకోవచ్చు. వడ్డీ 7.5శాతం.
→ వయోధికులు పొదుపు పథకాల్లో గరిష్ఠంగా మదుపు చేసుకునే పరిమితి మొత్తం రెట్టింపయ్యింది. ప్రస్తుతమున్న రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరిగింది.
→ వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు రూ.20 లక్షల కోట్లకు పెంపు.
→ రాష్ట్రాల ద్రవ్యలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.5శాతం వరకు ఉండవచ్చు. ఇందులో 0.5 శాతాన్ని విద్యుత్‌ రంగ సంస్కరణలతో ముడిపెట్టారు.
→ దేశ ప్రజల తలసరి ఆదాయం రూ.1.97 లక్షలకు పెరిగింది.
→ కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఎంపీలకు 2021 నుంచి బడ్జెట్‌ పత్రాలు ఇవ్వట్లేదు. ఆయా పత్రాలను వెబ్‌సైట్, ప్రత్యేక యాప్‌ ద్వారా సభ్యులకు అందుబాటులో ఉంచారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2019 నుంచి ఆచరిస్తున్నట్లుగానే జాతీయ చిహ్నంతో కూడిన ఎరుపు రంగు వస్త్ర సంచిలో ట్యాబ్‌ను పెట్టుకొని పార్లమెంటుకు వచ్చారు.

బడ్జెట్‌ కీల‌కాంశాలు:-
→ నీతి ఆయోగ్‌ మరో మూడేళ్లు పొడిగింపు
→ 5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు
→ 63వేల సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2,516కోట్లు
→ ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం.
→ డిజిటల్‌ ఇండియా అవసరాలకు నూతన కేవైసీ విధానం.
→ వచ్చే మూడేళ్లలో కోటిమంది రైతులను సేంద్రియ సేద్యం వైపు మళ్లింపు.
→ రైతుల కోసం 10వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు ఏర్పాటు.
→ ఎంఎస్‌ఎంఈలకు ముందస్తు పన్ను రూ..2కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంపు .
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు
→ కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, అక్కడ సాగు రంగానికి రూ.5,300 కోట్లు
→ దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్‌ల నిర్మాణం
→ 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు
→ పీఎం కౌశల్‌ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ.
→ దేశంలో 50 టూరిస్ట్‌ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
→ దేఖో ఆప్నా దేశ్‌ పథకం ప్రారంభం
→ స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్‌
వరుసగా 5 బడ్జెట్లు.. 6వ ఆర్థిక మంత్రి:-
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వరుసగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టిన 6వ కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ గుర్తింపు పొందారు. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 5వది. ఇంతకుముందు వరుసగా 5, అంతకన్నా ఎక్కువగా కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్‌సింగ్, మొరార్జీ దేశాయ్‌ల సరసన ప్రస్తుతం నిర్మలా సీతారామన్‌ చేరారు. అలానే ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగానూ ఆమె ఇప్పటికే గుర్తింపు పొందారు.
→ 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక (2019లో సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) ప్రవేశపెట్టిన 11వ బడ్జెట్‌ ఇది.

తెలంగాణలోని పలు సంస్థలకు కేటాయింపులు:-
తెలంగాణలోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. సింగరేణికి రూ. 1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు (ఈఏపీ కింద) రూ. 300 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించారు.

ఏపీ సంస్థలకు కేటాయింపులు:-
→ ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి - రూ. 47 కోట్లు
→ పెట్రోలియం యూనివర్సిటీకి - రూ. 168 కోట్లు
→ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు - రూ. 683 కోట్లు

తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు:-
→ రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు - రూ. 37 కోట్లు
→ మంగళగిరి, బిబినగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు
→ సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు - రూ.357 కోట్లు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ రాజేశ్, జస్టిస్‌ అరవింద్‌

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లు ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ప్రమాణం చేయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య తొమ్మిది నెలల వ్యవధి తర్వాత పూర్తిస్థాయికి (34) చేరింది. ఇప్పటి వరకు జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన సంగతి తెలిసిందే.

కెనరా బ్యాంక్‌ ఎండీగా సత్యనారాయణ రాజు

→ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. ఫిబ్రవరి 7 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అయిన రాజు 1988లో విజయా బ్యాంకులో చేరారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పని చేశారు. అదే బ్యాంకులో శివమొగ్గ, విజయవాడ, హైదరాబాద్, ముంబయిలకు ప్రాంతీయ అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. తరవాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో అతిపెద్ద జోన్‌ అయిన ముంబయి జోనల్‌ హెడ్‌గా ఆయన పనిచేశారు. అదే బ్యాంకులో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరారు. బీఓబీ ప్రధాన కార్యాలయంలో సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగానూ పనిచేశారు. తదుపరి 2021 మార్చి 10న కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బ్రాంచ్‌ బ్యాంకింగ్, కార్పొరేట్‌ క్రెడిట్, రిటైల్‌ క్రెడిట్, అగ్రి ఫైనాన్సింగ్, క్రెడిట్‌ మానిటరింగ్, క్రెడిట్‌ రికవరీ తదితర విభాగాల్లో సత్యనారాయణ రాజుకు మంచి అనుభవం ఉంది. బ్యాంకింగ్‌ సేవలు, ఉత్పత్తుల డిజిటలీకరణలోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారు.

→ కెనరా బ్యాంక్‌ కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా హర్దీప్‌ సింగ్‌ అహ్లువాలియా నియమితులయ్యారని బ్యాంకు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈయన ఇండియన్‌ బ్యాంక్‌లో రికవరీ విభాగంలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.


ఆచార్య పెన్నా మధుసూదన్‌కు ముదిగంటి గోపాల్‌రెడ్డి పురస్కారం

రచయిత్రి, పరిశోధకురాలు డా.ముదిగంటి సుజాతారెడ్డి ఏర్పాటు చేసిన ఆచార్య ముదిగంటి గోపాల్‌రెడ్డి స్మారక పురస్కారానికి ఆచార్య పెన్నా మధుసూదన్‌ ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ఆచార్య పెన్నా మధుసూదన్, నాగ్‌పుర్‌ రాంటెక్‌లోని కవికుల గురువు కాళీదాసు సంస్కృత విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 21న హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆయనకు పురస్కారం అందజేయనున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. మధుసూదన్‌ ఇప్పటి వరకు కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.

సర్వేశ్వర శర్మకు ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సైన్సు రచయిత, కోనసీమ సైన్సు పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీవీ సర్వేశ్వర శర్మకు కామన్వెల్త్‌ ఒకేషనల్‌ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన డి.ఎస్‌సి (డాక్టర్‌ ఇన్‌ సైన్సు) డిగ్రీని ప్రదానం చేసింది. దిల్లీలోని గురుగ్రామ్‌లో నిర్వహించిన స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయ ప్రో-వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ రిపురంజన్‌ సిన్హా చేతుల మీదుగా ఈ డిగ్రీని అందుకున్నట్లు ఆయన తెలిపారు. స్నాతకోత్సవంలో 16 పీహెచ్‌డీ డిగ్రీలు ఉండగా శర్మ ఒక్కరికే డి.ఎస్‌సి డిగ్రీ దక్కడం విశేషం. ఇతర శాస్త్ర రంగాల పరిశోధనల్లో భౌతికశాస్త్రం ఉపయోగపడుతున్న తీరుపై రాసిన సిద్ధాంత గ్రంథానికి ఈ డిగ్రీని ప్రదానం చేశారన్నారు. అక్కడే గ్లోబల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నిర్వహించిన మరో కార్యక్రమంలో ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డును కౌన్సిల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సల్వాటోర్‌ మోకియా అందించారన్నారు.

ఆచార్య రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

బయో ఆసియా 20వ విడత సదస్సును పురస్కరించుకొని 2023 సంవత్సరానికి ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని ఆచార్య రాబర్ట్‌ ఎస్‌ లాంగర్‌కు ప్రకటించారు. ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ను నిరోధించడానికి వినియోగించే ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ టీకాను వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. లాంగర్‌ ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో పనిచేస్తున్నారు. క్యాన్సర్‌ వ్యాధిని తొలిదశలో గుర్తించడం, చికిత్స అందించడంలో మెరుగైన విధానాలను అందించడంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వివిధ వైద్య పత్రికల్లో సుమారు 1,500కు పైగా శాస్త్రీయ పరిశోధన పత్రాలను రచించారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సులో లాంగర్‌కు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

ఎన్టీఆర్‌ చిత్రంతో రూ.వంద వెండి నాణెం

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆయన చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నాణెం కొనుగోలుకు రిజర్వు బ్యాంకు కౌంటర్‌ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాలి. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింకు, నికెల్‌ కలిపి ఈ నాణెం తయారు చేయనున్నారు. ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఇలాంటి నాణేలను రిజర్వు బ్యాంకు విడుదల చేస్తుంది. గతంలో ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి చిత్రంతో ఇలా నాణెం విడుదల చేసింది. ఎన్టీఆర్‌ చిత్రంతో నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న పుస్తకంలా 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేస్తారు.

ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి అదానీ

టాప్‌-20 ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి గౌతమ్‌ అదానీ వైదొలిగారు. సంస్థకు చెందిన పలు షేర్లు క్షీణించడంతో 23వ స్థానంలోకి అదానీ పడిపోయారు. తాజా ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం అయన సంపద 53.2 బిలియన్‌ డాలర్లు (రూ.4.40 లక్షల కోట్లు). 9వ స్థానంలో అంబానీ భారత్‌కు చెందిన మరో పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రస్తుతం 83.8 బిలియన్‌ డాలర్ల (రూ.6.94 లక్షల కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. అలాగే ఆసియాలో అత్యంత సంపన్నుడు ఇప్పుడు ముకేశ్‌ అంబానీయే. ఫోర్బ్స్‌ జాబితాలో 214 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్యాషన్, రియల్టీ వ్యాపార సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నాల్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద 192 బిలియన్‌ డాలర్లు. మూడో స్థానంలో 123 బిలియన్‌ డాలర్ల సంపదతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ కొనసాగుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ - అమెరికన్‌ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్‌ (13) వరుసగా రెండో ఏడాది ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యంత చురుకైన విద్యార్థులను, తమ వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) ఏటా విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300కి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనగా కేవలం 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో నటాషా ప్రథమ స్థానంలో నిలిచింది. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్‌ స్కూల్‌లో చదువుతున్న ఈ బాలిక 2021లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాల్గొని తన ప్రతిభ చాటింది. అప్పటికి ఐదో గ్రేడ్‌ (అయిదో తరగతి) చదువుతున్న తను ఎనిమిదో తరగతి విద్యార్థి స్థాయి ప్రతిభ చూపింది. చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు.

ఫోర్బ్స్‌ టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో శివతేజకు చోటు

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో ఆయన పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్‌ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొంత మంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో శివతేజ మెషీన్‌ లెర్నింగ్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్‌ యూనివర్సిటీలో క్లినికల్‌ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.

తల్లిదండ్రులుగా మారనున్న ట్రాన్స్‌జెండర్‌ జంట

దేశంలో తొలిసారి కేరళకు చెందిన జహాద్, జియా పావల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ జంట మరో నెలలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ మేరకు అమ్మాయిలా మారిన జియా పావెల్‌ తెలిపారు. సంతానం కోసం అబ్బాయిగా మారే చికిత్సను జహాద్‌ వాయిదా వేసుకున్నారు.

అమెరికా పార్లమెంటులో భారతీయ అమెరికన్లకు కీలక సభ్యత్వాలు

అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్లను సభ్యులుగా నియమించారు. అమెరికాలో నానాటికీ పెరుగుతున్న భారతీయ అమెరికన్ల ప్రాముఖ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రమీలా జయపాల్, అమీబెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నాలను ఈ నియామకాలు వరించాయి. వలస వ్యవహారాల ఉప సంఘ సభ్యురాలిగా నియమితులైన ప్రమీలా జయపాల్‌ (57) పదహారేళ్ల వయసులో అమెరికాకు వలస వచ్చి, 17 ఏళ్ల తరవాత అమెరికా పౌరసత్వం పొందారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళనైన తాను ఈ సభ్యత్వం పొందడాన్ని గొప్ప గౌరవంగా పరిగణిస్తున్నానని ఆమె చెప్పారు. అమెరికా వెలుపల పుట్టి అమెరికా పౌరసత్వం పొంది కాంగ్రెస్‌లో సభ్యులైన రెండు డజన్ల మందిలో తానూ ఒకరినని జయపాల్‌ తెలిపారు. గూఢచర్య వ్యవహారాలపై శక్తిమంతమైన సభా సంఘ సభ్యత్వాన్ని అమీబెరా (57) పొందారు. సీఐఏ, జాతీయ భద్రతా సంస్థ ఎన్‌.ఐ.ఏ, సైన్య గూఢచారి సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించే సంఘమది. ఆరుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బెరా విదేశాంగ వ్యవహారాల సంఘం, శాస్త్ర-సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల సంఘంలో కూడా సభ్యుడే. అమెరికాకు, ప్రపంచానికి చైనా వల్ల పొంచివున్న ముప్పును ఎదుర్కొనే అంశంపై కొత్తగా ఏర్పాటైన సభా సంఘంలో రాజా కృష్ణమూర్తి సభ్యుడయ్యారు. ఈ సంఘంలో మరొక భారతీయ అమెరికన్‌ రో ఖన్నానూ సభ్యుడిగా నియమించారు.

1200 ఏళ్ల నాటి రాతి విగ్రహాలు గుర్తింపు

పురాతన నలందా విశ్వవిద్యాలయం సమీపంలో 1200 ఏళ్ల నాటి రెండు రాతి విగ్రహాలను కనుగొన్నారు. బిహార్‌లోని సర్లిచక్‌ గ్రామ సమీపంలోని తార్సిన్హ్‌ కొలనులో పూడిక తీస్తుండగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ రెండు విగ్రహాలు ఏ దేవుళ్లవనే వివరాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) వెల్లడించలేదు. ఏడాది క్రితం ఇదే కొలనులో పాలా కాలానికి చెందిన 1300 ఏళ్ల నాటి నాగదేవత విగ్రహం బయటపడింది. దీన్ని నలందాలోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంచారు.

పుష్కరిణిలో 464 ఏళ్ల నాటి శివలింగాలు గుర్తింపు

గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి పుష్కరిణి (పెదకోనేరు)లో 464 ఏళ్ల నాటి 2 శివలింగాలు వెలుగుచూశాయి. దేవాదాయ శాఖ ఇటీవల పెదకోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా కోనేటిలో నీటిని తొలగిస్తున్నారు. ఈ మేరకు నాటికి వంద అడుగుల మేర నీటిని తోడారు. శివలింగాలు, ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయం కనిపించాయి. ఊట మాత్రం పెద్దఎత్తున వస్తుండటంతో అధికారులు నిత్యం నీటిని తోడుతూనే ఉన్నారు.

తెలంగాణలో ఆదిమానవుని వర్ణ చిత్రాలు గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. శ్రీరామోజు హరగోపాల్‌ నేతృత్వంలో బృందం సభ్యులు ఎ.కరుణాకర్, మహమ్మద్‌ నషీరుద్దీన్, గోపాల్, మహమ్మద్‌ అన్వర్‌ పాషా ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి చిత్తరిగుట్టను పరిశీలించారు. అక్కడ కొత్త రాతియుగపు మూపురం ఉన్న ఎద్దు బొమ్మలు ఆరు, ఒక అడవి పంది, రెండు జింకలు, ఇద్దరు మనుషుల బొమ్మలున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. ఎర్రజాబు రంగుతో, రేఖా చిత్ర రీతిలో గీచిన ఈ బొమ్మలు ఆనాటి మానవుల చిత్ర కళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. గుట్ట దిగువన సూక్ష్మరాతి పనిముట్లు, కొత్త రాతియుగపు రాతి గొడ్డలి, గొడ్డళ్లను అరగదీసిన గుంటలను కూడా గుర్తించామని, ఈ ఆధారాల వల్ల ఈ వర్ణ చిత్రాలు కీ.పూ 8 వేలు- 4 వేల సంవత్సరాలకు చెందినవిగా తెలుస్తోందన్నారు.

ముంబయి - గాంధీనగర్‌ మార్గంలో ‘వందేభారత్‌’ ఆక్యుపెన్సీ 127%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల దాకా దేశంలో ప్రవేశపెట్టిన ఎనిమిది వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ముంబయి - గాంధీనగర్‌ మార్గంలోని రైలు అత్యధికంగా దాదాపు 127 శాతం మేర భర్తీ అవుతూ నడుస్తోంది. బిలాస్‌పుర్‌ - నాగ్‌పుర్‌ రైలు 55 శాతం భర్తీతో చివరి స్థానంలో ఉంది. గంటకు 180 కి.మీ.వేగంతో నడిచే వీటిలో మొత్తం మూడు రైళ్లు తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తుండగా మిగతా అయిదూ కిటకిటలాడుతున్నట్లు భారతీయ రైల్వే నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరి పదో తేదీన మరో రెండు రైళ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో దేశంలో ఈ రైళ్ల సంఖ్య పదికి చేరింది. ఈ గణాంకాల ప్రకారం.. తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్న రైళ్ల జాబితాలో 70% భర్తీ అవుతున్న న్యూ దిల్లీ - అంబ్‌ అందౌరా, 75% భర్తీ అవుతున్న చెన్నై సెంట్రల్‌ - మైసూర్‌ జంక్షన్‌ రైళ్లు కూడా ఉన్నాయి. మిగతా అయిదు రూట్లలో వంద శాతానికి అటూ ఇటూగా ఈ రైళ్లు నిండుతున్నాయి. ముంబయి - గాంధీనగర్‌ రైలు రికార్డు స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం రూటుతో పాటు న్యూ దిల్లీ - వారణాసి మార్గంలో నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు 125.76% ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్నాయి. వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ చూపుతున్న రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ గణాంకాలు విడుదల చేశారు. డిసెంబరులో ప్రారంభించినప్పటి నుంచీ తరచూ రాళ్ల దాడిని ఎదుర్కొంటున్న హావ్‌డా - న్యూ జల్‌పాయీగుడీ వందేభారత్‌ రైలు రెండు దిశల్లోనూ 104 నుంచి 105 శాతం మేర ఆక్యుపెన్సీ ఉండటం విశేషం. ఈ వందేభారత్‌ రైళ్లు (8) ఇప్పటిదాకా 1,635 ట్రిప్పుల్లో 20 లక్షలకు పైగా ప్రయాణికులను చేర వేసి ఈ ఏడాది 100.72 సగటు ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.

భాజపాకు 2021 - 22లో రూ.614 కోట్ల విరాళాలు

పెద్ద మొత్తంలో విరాళాలను పొందిన రాజకీయ పార్టీలలో భాజపా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.20 వేలకు పైబడిన విరాళాల రూపంలో భాజపా రూ.614.63 కోట్లను పొందగా, కాంగ్రెస్‌ పార్టీకి రూ.95 కోట్లు వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) తన నివేదికలో ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. భాజపా 4,957, కాంగ్రెస్‌ 1,255 విరాళాల ద్వారా ఆయా మొత్తాలను స్వీకరించాయి. 16 ఏళ్ల నుంచి ప్రకటిస్తున్నట్లుగానే 2021 - 22కి సంబంధించి తమకు రూ.20 వేలను మించిన విరాళాలు ఏమీ రాలేదని బీఎస్పీ వెల్లడించింది. మొత్తం జాతీయ పార్టీలన్నీ కలిపి 7,141 విరాళాల ద్వారా 780.774 కోట్లను పొందాయని ఈ నివేదిక తేల్చింది. కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఐ (ఎమ్‌), ఎన్పీఈపీ, ఏఐటీసీలు పొందిన మొత్తాల సగటు కంటే భాజపాకు వచ్చిన విరాళాలు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2020 - 21తో పోలిస్తే విరాళాల మొత్తాల్లో భాజపాకు 28.71 శాతం, కాంగ్రెస్‌కు 28.09 శాతం పెరుగుదల కనిపించింది.

అగ్రగామి 5 అక్రెడిటేషన్‌ వ్యవస్థల్లో భారత్‌

ప్రపంచంలోని అక్రెడిటేషన్‌ వ్యవస్థల్లో భారత్‌ 5వ స్థానంలో నిలిచింది. మౌలిక సదుపాయాల నాణ్యత (క్యూఐ) ఆధారంగా 184 దేశాలతో గ్లోబల్‌ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండెక్స్‌ (జీక్యూఐఐ) 2021 నివేదిక వెలువరించింది. భారత మొత్తం క్యూఐ వ్యవస్థ 10వ స్థానంలో కొనసాగుతోంది. సూచీ ప్రకారం మెట్రాలజీలో 21వ స్థానం, స్టాండరైజేషన్‌లో 9వ స్థానంలో భారత్‌ నిలిచింది. అక్రెడిటేషన్‌ వ్యవస్థల్లో జర్మనీ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అమెరికా, చైనా, ఇటలీ, భారత్‌ ఉన్నాయి. ఈ నివేదికను 2022 డిసెంబరులో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. అగ్రగామి 25 దేశాల్లో ఎక్కువ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్‌ల్లోనే ఉన్నాయి. క్యూఐలో భారత్‌ (10), బ్రెజిల్‌ (13), ఆస్ట్రేలియా (14), తుర్కియే (16) స్థానాల్లో నిలిచాయి.

భారత్‌పై ఐసిల్‌-కె గురి: ఐరాస నివేదిక

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అధికారాన్ని సవాలు చేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్, లెవాంట్‌ - ఖోరాసాన్‌ (ఐసిల్‌-కె) తన దురాగతాలను ముమ్మరం చేయనుంది. మధ్యాసియా, దక్షిణాసియాలలోని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలతో అఫ్గాన్‌ తాలిబన్‌ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను దెబ్బతీయడాన్ని అది లక్ష్యంగా పెట్టుకొంది. దీని కోసం కాబుల్‌లోని భారత్, ఇరాన్, చైనా రాయబార కార్యాలయాలపై ఉగ్రదాడులు చేయడానికి ఐసిల్‌-కె సన్నద్ధమవుతోందని ఐరాస నివేదిక వెల్లడించింది.

2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం ఆసియాలోనే వినియోగం

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో సగం మొత్తాన్ని ఒక్క ఆసియానే వినియోగించుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) వెల్లడించింది. చరిత్రలో తొలిసారి 2025లో ఆసియా ఈ ఘనతను సాధిస్తుందని ఈ మేరకు విడుదల చేసిన భవిష్యత్తు అంచనా నివేదికలో ఐఈఏ ప్రకటించింది. ఐరోపా సమాఖ్య, అమెరికా, భారత్‌లు కలిపి వినియోగించే విద్యుత్‌ కంటే చైనా ఎక్కువ కరెంటును ఉపయోగించనుందని ఈ నివేదిక పేర్కొంది. ఆ సమయానికి ప్రపంచ జనాభాలో అయిదో వంతుకు ఆశ్రయమివ్వనున్న ఆఫ్రికా మౌలికవసతుల కొరత కారణంగా ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడు శాతం కరెంటును మాత్రమే వినియోగించుకుంటుందని ఐఈఏ అంచనా వేసింది. విద్యుదుత్పత్తిలో అణు, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం గణనీయంగా పెరగడం వల్ల ఆ మేరకు వాయుకాలుష్యం తగ్గనుందని ఈ నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంప్రదాయేతర వనరుల వినియోగం మరింత పెరగాలని నివేదిక స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి, సరఫరా వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటున్నాయనే నిజాన్ని ప్రభుత్వాధినేతలు అర్థం చేసుకోవాలని హెచ్చరించింది. గతేడాది యూరోప్, భారత్, మధ్య, తూర్పు చైనాల్లో ఉష్ణపవనాలు, కరవు పరిస్థితులు ఏర్పడగా, అమెరికాలో శీతల పవనాలు ఇబ్బందులు సృష్టించాయని ఐఈఏ వెల్లడించింది. ఆయా పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తుచేసింది.

ఇస్లామిక్‌ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా దేశాలు: యూఎన్‌డీపీ

ఇస్లామిక్‌ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా ఎడారి చుట్టుపక్కల ఉన్న దేశాలు (సబ్‌ సహారన్‌ ఆఫ్రికా) మారుతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడించింది. ఇక్కడున్న ఆర్థిక సమస్యలు దీనికి ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొంది. 2017తో పోలిస్తే 92 శాతం మంది కొత్తగా తీవ్రవాద బృందాల్లో చేరారని వివరించింది. చాలా మంది ఆఫ్రికన్ల జీవన శైలిపై కొవిడ్‌-19 ప్రభావం చూపిందని, అక్కడ అధిక ద్రవ్యోల్బణం ఏర్పడిందని వివరించింది. అదే సమయంలో మత ప్రాతిపదికన తీవ్రవాదం వైపు మళ్లేవారు 57 శాతం తగ్గారని తెలిపింది. బుర్కినాఫాసో, కామెరూన్, చాద్, మాలి, నైగర్, నైజీరియా, సోమాలియా, సూడాన్‌ దేశాల్లో 2,200 మంది తీవ్రవాదుల అభిప్రాయాలను సేకరించామని పేర్కొంది. తీవ్రవాద గ్రూపుల్లో అంతకుముందే సభ్యులుగా ఉన్న వేయి మంది కూడా ఇందులో ఉన్నారని తెలిపింది. 2017 నుంచి కనీసం 4,155 దాడులు నమోదయ్యాయని యూఎన్‌డీపీ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో 18,417 మంది మరణించారని, సోమాలియాలో ఎక్కువ దారుణాలు నమోదయ్యాయని పేర్కొంది. సోమాలియాలోని అల్‌షబాబ్, నైజీరియాలోని బోకోహరామ్‌ తదితర ఉగ్రవాద బృందాలను ఈ నివేదిక ప్రస్తావించింది. కొందరు ఉగ్రవాదులు అల్‌ఖైదాకు విధేయత చూపుతున్నారని వెల్లడించింది.

286 శాతం పెరిగిన 71 మంది ఎంపీల ఆస్తులు

లోక్‌సభకు 2009 నుంచి 2019 మధ్య తిరిగి ఎన్నికైన 71 మంది ఎంపీల ఆస్తులు సగటున ఏకంగా 286 శాతం పెరిగాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో వెల్లడించింది. వీరిలో భాజపాకు చెందిన కర్ణాటకలోని బీజాపుర్‌ లోక్‌సభ సభ్యుడు రమేశ్‌ చందప్ప జిగాజినగి ఆస్తుల వృద్ధి అందరి కంటే ఎక్కువని తెలిపింది. ఆయనకు 2009లో రూ.1.18 కోట్ల ఆస్తులు ఉండగా అవి 2014 నాటికి రూ.8.94 కోట్లకు, 2019 నాటికి రూ.50.41 కోట్లకు చేరుకున్నాయని ఈ పెరుగుదల 4,189 శాతమని వివరించింది. ఆరుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన ఆయన 2016 జులై నుంచి 2019 మే వరకూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. భాజపాకే చెందిన మరో ఎంపీ (బెంగళూరు సెంట్రల్‌) పి.సి.మోహన్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు వరుసగా 2009లో రూ.5.37 కోట్లు, 2019లో రూ.75.55 కోట్లుగా ఉన్నాయి. ఈ పెంపుదల 1,306 శాతం. మూడో స్థానంలోనూ కమలదళానికే చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ ఎంపీ వరుణ్‌గాంధీ నిలిచారు. ఆయన ఆస్తులు 2009 - 2019 మధ్య రూ.4.92 కోట్ల నుంచి రూ.60.32 కోట్లకు చేరాయి. తరువాత స్థానాల్లో సుప్రియా సదానంద్‌ సూలే (ఎన్‌సీపీ) రూ.51.33 కోట్ల నుంచి రూ.140.88 కోట్లు; పినాకి మిశ్ర (బిజద) రూ.29.69 కోట్ల నుంచి రూ.117.47 కోట్లు ఉన్నారు.

ఆర్సీబీ మెంటార్‌గా సానియా

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరో కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆమె మార్గనిర్దేశకురాలిగా ఎంపికైంది. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆమె చివరగా ఈ నెలలో ఏటీపీ దుబాయ్‌ ఓపెన్‌ టోర్నీలో ఆడనుంది. ఆ తర్వాత మెంటార్‌గా ఆర్సీబీతో చేరనుందని ఆర్సీబీ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ తెలిపారు.

మొదటి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలం

మొదటి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) కోసం నిర్వహించిన వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన మహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలంలో సత్తాచాటింది. మొదటి డబ్ల్యూపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లు వెచ్చించింది. ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తున్న ఆమె టీమ్‌ఇండియాలో కీలక బ్యాటర్‌. పరిస్థితులకు తగినట్లు ఇన్నింగ్స్‌ నిర్మించడంతో పాటు ధనాధన్‌ షాట్లతో చెలరేగే నైపుణ్యాలు ఆమె సొంతం. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రెండో అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్‌గా నిలిచింది. యూపీ వారియర్స్‌ ఆమెను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. → విధ్వంసక ఓపెనర్, కెప్టెన్‌గా దేశానికి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన షెఫాలీని రూ.2 కోట్లకు, టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో పోరులో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్‌ను రూ.2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ కైవసం చేసుకుంది. పూజ వస్త్రాకర్‌ కోసం ముంబయి, రిచా ఘోష్‌ కోసం ఆర్సీబీ చెరో రూ.1.9 కోట్లు పెట్టాయి. టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కు మాత్రం ఊహించిన దానికంటే తక్కువ ధరే పలికింది. అత్యధిక ధర పలికిన టాప్‌-6 భారత క్రికెటర్లలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. భారీ షాట్లను అలవోకగా ఆడగలిగే ఆమెను రూ.1.8 కోట్లకు ముంబయి సొంతం చేసుకుంది. యువ పేసర్‌ రేణుక సింగ్‌ను ఆర్సీబీ, యాస్తిక భాటియాను ముంబయి ఇండియన్స్‌ చెరో రూ.1.5 కోట్లకు కొనుక్కున్నాయి. ఆల్‌రౌండర్‌ దేవిక వైద్యాను రూ.1.4 కోట్లకు యూపీ వారియర్స్‌ జట్టులో చేర్చుకుంది.

ఐసీసీ జనవరి హీరో గిల్‌

భారత యువ బ్యాటింగ్‌ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ (జనవరి 2023)గా ఎంపికయ్యాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ జనవరిలో పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో అదరగొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో కలిపి 567 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతను ఇంకో రెండు శతకాలు కూడా బాదాడు. ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్‌ స్క్రీవెన్స్‌ మహిళల విభాగంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైంది.

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు మోర్గాన్‌ వీడ్కోలు

గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల జట్టు మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. పొట్టి ఫార్మాట్‌లో అన్ని రకాల ఫ్రాంచైజీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు మోర్గాన్‌ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన మోర్గాన్‌ నిరుడు జులైలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుని ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతానని చెప్పాడు. కానీ ఎనిమిది నెలలు తిరిగేసరికే దాన్నుంచి కూడా వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ అనంతరం మోర్గాన్‌ హండ్రెడ్స్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌కు సారథిగా వ్యవహరించాడు. అబుదాబి టీ10లో న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎస్‌ఏ20 (దక్షిణాఫ్రికాటీ)లో పార్ల్‌ రాయల్స్‌ తరఫున ఏడు మ్యాచ్‌ల్లో బరిలో దిగాడు.

ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతికి రజతం

తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఆమె మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌లో 8.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ ఇండోర్‌ రికార్డును ఆమె మెరుగుపరిచింది. పురుషుల లాంగ్‌ జంప్‌లో మరో భారత అథ్లెట్‌ జెస్విన్‌ కాంస్యం సాధించాడు. అతను 7.97 మీటర్ల దూరం దూకి రెండో స్థానం సాధించాడు.

ఫార్ములా-ఈ రేసు ఛాంప్‌ వెర్న్‌

ఫార్ములా-ఈ ప్రి నాలుగో రౌండ్లో పెన్‌స్కీ డ్రైవర్‌ జీన్‌ ఎరిక్‌ వెర్న్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో సాగిన రేసులో వెర్న్‌ అగ్రస్థానం సాధించాడు. 46 నిమిషాల 1.099 సెకన్లలో 32 ల్యాప్‌లను పూర్తిచేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. కారులో 0.5 శాతం ఎనర్జీ మాత్రమే ఉండగా వెర్న్‌ విన్నింగ్‌ లైన్‌ను దాటేశాడు. ఫార్ములా-ఈలో వెర్న్‌కు ఇది 11వ విజయం. 2016 తర్వాత పెన్‌స్కీ జట్టుకు మొదటి గెలుపు ఇది. నిక్‌ కాసిడీ (46 ని 01.499 సె - ఎన్విజన్‌) రెండు, ఆంటోనియా డికోస్టా (46 ని 02.958 సె - పోర్షే) మూడు స్థానాలు సాధించారు. క్వాలిఫయింగ్‌లో పోల్‌ పోజిషన్‌ దక్కించుకున్న ఇవాన్స్‌ 21, బర్డ్‌ 19 స్థానాలకు పరిమితమయ్యారు. నార్మన్‌ (నిసాన్‌) 2.835 కిలోమీటర్ల ట్రాక్‌ను ఒక నిమిషం 14.698 సెకన్లలో చుట్టేసి అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తిచేసిన ఘనత అందుకున్నాడు.

వర్షిణికి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎం.సాహితీ వర్షిణి ‘ఫిడే మాస్టర్‌’ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఉమన్‌ క్యాండిడేట్‌ మాస్టర్, ఉమన్‌ ఫిడే మాస్టర్, ఉమన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్స్‌ సాధించిన సాహితి వర్షిణి తాజాగా ‘ఫిడే మాస్టర్‌’ అయింది. ఏడాదిగా వివిధ టోర్నీల్లో ఆమె నిలకడగా రాణిస్తోంది. తండ్రి వద్దే శిక్షణ తీసుకుంటున్న వర్షిణి ఇప్పటి వరకు తొమ్మిది అంతర్జాతీయ పతకాలు సాధించింది.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్‌ వీడ్కోలు

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 36 ఏళ్ల ఫించ్‌ ఆట నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. అయితే బిగ్‌బాష్‌లో లీగ్‌లో అతడు రెనెగేడ్స్‌ తరఫున కొనసాగుతాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతర టీ20 లీగ్‌లలో ఆడే అంశాన్ని కూడా పరిశీలిస్తాడు. అతడు చివరగా 2018లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. పేలవ ఫామ్‌ నేపథ్యంలో ఫించ్‌ నిరుడు వన్డే క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. అతడు 76 టీ20ల్లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఇది ప్రపంచ రికార్డు. అతడు 103 టీ20ల్లో 34.28 సగటుతో 3120 పరుగులు చేశాడు. 146 వన్డేల్లో 38.89 సగటుతో 5406 పరుగులు సాధించాడు.

ముంబయి మార్గనిర్దేశకురాలిగా జులన్‌

2023 మార్చిలో ఆరంభమయ్యే తొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టుకు జులన్‌ గోస్వామి మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించనుంది. ఈ మాజీ పేసర్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ బాధ్యతలు చేపట్టనుంది. గతేడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జులన్‌ రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 350పైగా అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. మరోవైపు మాజీ ఇంగ్లాండ్‌ మహిళల జట్టు కెప్టెన్‌ చార్లొటె ఎడ్వర్డ్స్‌ ముంబయి జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైంది. టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ దేవిక బ్యాటింగ్‌ కోచ్‌గా తృప్తి భట్టాచార్య టీమ్‌ మేనేజర్‌గా పని చేయనున్నారు. 2014, 16లో భారత మహిళల జట్టుకు సహాయ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన దేవిక 2018లో బంగ్లాదేశ్‌కు సహాయక కోచ్‌గా పని చేసి జట్టు ఆసియాకప్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టయిన ముంబయి ఇండియన్స్‌ మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో రూ.912.99 కోట్లతో ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది.

తొలి టీ20 ప్రపంచకప్‌ హీరో జోగిందర్‌ వీడ్కోలు

2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ హీరో, టీమ్‌ఇండియా మీడియం పేసర్‌ జోగిందర్‌ శర్మ ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 39 ఏళ్ల జోగిందర్‌ 2004 నుంచి 2007 వరకు టీమ్‌ఇండియా తరఫున నాలుగేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఫైనల్లో ఆఖరి ఓవర్లో పాకిస్థాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా అనుభవం లేని జోగిందర్‌కు కెప్టెన్‌ ధోని బంతినిచ్చాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని సిక్స్‌ కొట్టి మిస్బావుల్‌ హక్‌ పాక్‌ను విజయానికి చేరువ చేశాడు. సమీకరణం 4 బంతుల్లో 6 పరుగులుగా ఉన్నప్పుడు మూడో డెలివరీని మిస్బా స్కూప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్‌ ఒడిసి పట్టుకున్నాడు. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ హీరోగా చరిత్రలో నిలిచిపోయిన జోగిందర్‌కు అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం ఊహించని పరిణామమే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడిన జోగిందర్‌ పెద్దగా రాణించలేదు. అనంతరం తెరమరుగయ్యాడు. పోలీసు శాఖలో డీఎస్పీగా చేరిన జోగిందర్‌ కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విశేష సేవలందించి ప్రశంసలు అందుకున్నాడు. నిరుడు లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్న జోగిందర్‌ విదేశీ ఫ్రాంచైజీ క్రికెట్లో బరిలో దిగాలని భావిస్తున్నాడు.

ప్రపంచ కేన్సర్‌ దినోత్సవం 2023

ఆగ్నేయాసియా దేశాల్లో కేన్సర్‌ను త్వరగా గుర్తించడానికి, నివారించడానికి ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ‘ప్రపంచ కేన్సర్‌ దినం’ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది. నాణ్యమైన కేన్సర్‌ చికిత్సల్లో ఉన్న తేడాలను సవరించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో అతిపెద్ద కారణంగా కేన్సర్‌ నిలుస్తోంది. 2020లో దీనివల్ల దాదాపు 99 లక్షల మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంత సంచాలకురాలు డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ చెప్పారు. 2010 నుంచి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌ విస్తృతి 26%, దానివల్ల మరణాలు 21% పెరిగాయని ఆమె వివరించారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో 2020లో 23 లక్షల మందికి కేన్సర్‌ సోకగా, వారిలో 14 లక్షల మంది మరణించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 47 లక్షల మరణాలు ఈ వ్యాధి వల్లే ఉంటున్నాయి. 2020లో ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లతో 4 లక్షల మంది మరణించారు. ఈ వ్యాధి సోకిన వారిలో మూడింట రెండొంతుల మంది మరణిస్తుండటం త్వరగా గుర్తించాల్సిన, మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని డాక్టర్‌ పూనమ్‌ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఆగ్నేయాసియాలో కేన్సర్‌పై అవగాహన గణనీయంగా పెరిగిందని చెప్పారు.

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ మరణం

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ (79) అమైలాయిడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ మరణించారు. భారత్, పాక్‌ల మధ్య 1999 నాటి కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన కారణం ముషారఫే. కేసుల భయంతో స్వదేశాన్ని వీడిన ఆయన 2016 నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో తలదాచుకున్నారు. అవిభాజ్య భారత్‌లోని దిల్లీలో ముషారఫ్‌ 1943లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. దేశ విభజన తర్వాత 1947లో ఆయన కుటుంబం పాక్‌కు వలస వెళ్లింది. 1949 నుంచి 1956 వరకు తండ్రి ఉద్యోగరీత్యా ముషారఫ్‌ తుర్కియేలో ఉన్నారు. 1961లో పాక్‌ మిలిటరీ అకాడమీలో చేరిన ముషారఫ్‌ 1964లో శతఘ్నిదళంలో ప్రవేశించారు. 1965 నాటి భారత్‌ - పాక్‌ యుద్ధంలో యువ అధికారిగా పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య 1971లో జరిగిన యుద్ధంలో కమాండో బెటాలియన్‌లో కంపెనీ కమాండర్‌గా పోరాడారు. కార్గిల్‌ యుద్ధం సూత్రధారి ముషారఫే. 1999 ఫిబ్రవరిలో అప్పటి భారత ప్రధానమంత్రి వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లాహోర్‌లో చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ కొన్ని నెలల్లోనే ముషారఫ్‌ కారణంగా కార్గిల్‌ యుద్ధం ముంచుకొచ్చింది. ఆయనకు భారత్‌పై విపరీతమైన ద్వేషం. సరిహద్దుల్లోని సియాచిన్‌ ప్రాంతంలో మన దేశం పట్టును సహించలేకపోయారు. అందుకే కార్గిల్‌లో చొరబడేందుకు 1988-89 మధ్య అప్పటి పాక్‌ ప్రధాని బెనజీర్‌ భుట్టో ముందు ప్రతిపాదనలు ఉంచారు. యుద్ధ పరిణామాలపై భయంతో భుట్టో అందుకు అంగీకరించలేదు. కానీ ముషారఫ్‌ తన ఆలోచనను విరమించుకోలేదు. 1999 మార్చి నుంచి మే మధ్య కార్గిల్‌ ప్రాంతంలోకి రహస్యంగా పాక్‌ సైన్యాన్ని చొప్పించారు. ఆ సంగతిని భారత్‌ గుర్తించడంతో రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తింది.

జెట్‌ప్యాక్‌లను అభివృద్ధి చేసిన బెంగళూరు స్టార్టప్‌

భారతీయ సైనిక వ్యవస్థలో వాయువేగంతో పయనించే ఫైటర్‌ జెట్‌లు, డ్రోన్ల వరుసలో త్వరలో ఎగిరే సైనికుడు వచ్చి చేరనున్నాడు. ప్యారాచూట్‌ల అవసరం లేకుండానే పక్షిలా ఎగురుతూ లక్ష్యాలను చేరేందుకు బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్‌ కంపోజిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏసీపీఎల్‌) అనే స్టార్టప్‌ సైనిక దుస్తులను (జెట్‌ప్యాక్‌) తయారు చేసింది. అవి ప్రస్తుతం బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియాలో ప్రదర్శించారు. వాటి ప్రత్యేకతలిలా ఉన్నాయి.. టర్బోజెట్‌ల పనితీరును పోలిన ఇంధన వ్యవస్థలు జెట్‌ప్యాక్‌లో ఉన్నాయి. ఇందులో ఇంధనంతో మండించే చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన టర్బో ఇంజిన్, 30 లీటర్ల డీజిల్‌ ట్యాంకు అమర్చారు. ఎయిర్‌ ఇన్‌లెట్‌ కాంపాక్ట్‌ ఫ్లయింగ్‌ మిషన్‌ విధానంతో ఎగిరే వ్యవస్థలు ఉన్నాయి. పర్వతాలు, ఎడారులు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో రక్షణ చర్యలు, హిట్‌ అండ్‌ రన్‌ ఛేదనలో సైనిక సేవలను మరింత వేగంగా, సమర్థంగా అందించేందుకు జెట్‌ప్యాక్‌లు ఉపయోగపడతాయని స్టార్టప్‌ ఎండీ రాఘవ్‌రెడ్డి తెలిపారు. వీటిని ధరించిన సైనికుడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలడని వెల్లడించారు. వీటిని 70% స్వదేశీ పరిజ్ఞానంతో, పేలోడ్‌తో కలిపి 80 కిలోల బరువుతో తయారు చేశారు. ఇప్పటికే 48 జెట్‌ సూట్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రక్షణ శాఖ ప్రతిపాదనల విభాగానికి పంపారు.

సెనగపిండితో మధుమేహం దూరం

సెనగలు, కాయ ధాన్యాలు, బీన్స్‌ వంటివి ఆహారంలో భాగమైతే గుండె జబ్బుల ముప్పు తక్కువనే విషయం తెలిసిందే. వీటిలో పెద్ద మొత్తంలో పీచు పదార్థాలు ఉండటమే దీనికి కారణం. తాజా పరిశోధనల మేరకు గోధుమ పిండి స్థానంలో సెనగ పిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపు నిండిన భావన కలిగిస్తుందని, అలాగే ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని తేలింది. తద్వారా అధిక బరువు సమస్యతో పాటు, టైప్‌-2 మధుమేహం బారిన పడకుండా తప్పించుకోవచ్చని వెల్లడైంది. 30% కొమ్ముసెనగ పిండి కలిపిన గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్‌ భుజిస్తే సాధారణ రొట్టె తిన్నప్పటితో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 40% తగ్గినట్లు గుర్తించారు. దీనికి ఇందులో ఉండే పిండి పదార్థం అరుగుదల స్థాయిని నెమ్మదింపచేయడమే కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

పురుషులకు సంతానోత్పత్తి నిరోధక మాత్ర!

మగ ఎలుకల్లో వీర్యకణాల విడుదలను తాత్కాలికంగా అడ్డుకోవడం ద్వారా ఆడ ఎలుకల్లో గర్భధారణను నిరోధించగల రసాయనాన్ని అమెరికాలోని వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ సంస్థ పరిశోధకులు రూపొందించారు. ఆ రసాయన మాత్ర పేరు టీడీఐ-11861. గర్భం నివారణ కోసం ప్రస్తుతం పురుషులకు కండోమ్‌లు, వేసెక్టమీ శస్త్రచికిత్స వంటివి అందుబాటులో ఉన్నాయి. ఎలుకల మీద ప్రస్తుత ప్రయోగాలు విజయవంతంగా పూర్తయితే మగవాళ్లకూ సంతానోత్పత్తి నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. టీడీఐ-11861 మాత్రను మగ ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి వీర్య కణాలు రెండున్నర గంటలసేపు స్తంభించిపోయాయి. ఆడ ఎలుకల్లో ప్రవేశించిన మూడు గంటల తరవాత కొన్ని వీర్య కణాలు కొంత మేరకు తిరిగి క్రియాశీలమయ్యాయి.

గుండె వయసు 10 ఏళ్లు వెనక్కి!

నిండు నూరేళ్లు జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. వందేళ్లను పరిపూర్ణ జీవితంగా పరిగణిస్తుంటారు. అయితే ఈ వరం దక్కేది అతి కొద్దిమందికే. ప్రపంచ జనాభాలో వందేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జీవిస్తున్న వారు 0.004 శాతం మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సంపూర్ణ ఆరోగ్యవంతులకూ కొదవలేదు. ఇది శాస్త్రవేత్తలకు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వారి గుండె ఎలా పదిలంగా ఉంటోందన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయం, ఇటలీలోని మల్టీమెడికా గ్రూప్‌ శాస్త్రవేత్తలు ఒక కీలక ఆవిష్కారం చేశారు. శతాధిక వయస్కుల్లో గుర్తించిన ఒకరకం జన్యువు గుండె వయసును 10 ఏళ్ల మేర వెనక్కి మళ్లిస్తుందని తేలింది. గుండె వైఫల్య సమస్య ఉన్న రోగులకు ఇది ఆశాకిరణమవుతుంది. → వయసు మీదపడే కొద్దీ క్రమంగా గుండె, రక్తనాళాల పనితీరు మందగిస్తుంది. దీనికి ప్రస్తుతం నిర్దిష్ట చికిత్స ఏమీ లేదు. సాధారణంగా ఉపయోగించే హృద్రోగ మందులను ఇలాంటి వారికి సూచించడం వైద్యపరంగా సవాలే. వార్ధక్యంతో గుండెలో హానికారక మార్పుల రేటు విషయంలో వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉంటున్నాయి. పొగతాగడం, మద్యపానం, శారీరక శ్రమలేని జీవనం వంటి వాటి వల్ల గుండె గడియారం వేగంగా కదులుతుంది. మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం ద్వారా దీన్ని నెమ్మదింప చేసుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన మంచి జన్యువులూ ఆరోగ్యకర జీవనాన్ని పెంపొందిస్తాయని, యవ్వన జీవనాన్ని పొడిగిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మేలైన జన్యు ఉత్పరివర్తనాలను కలిగి ఉన్న కొందరు వందేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించడాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఏమిటీ జన్యువు? జన్యువుల్లోని మూలజతల్లో యాదృచ్ఛికంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఈ ఉత్పరివర్తనాలు చాలావరకూ పెద్దగా ప్రాముఖ్యత లేనివే. కొన్ని సందర్భాల్లో ఈ మార్పులు సంబంధిత జన్యు పనితీరుపై ప్రభావం చూపొచ్చు. అది కొన్నిసార్లు మనకు ప్రయోజనకరంగా, కొన్నిసార్లు నష్టదాయకంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు జీవిత చరమాంకం వరకూ శతాధికులు గుండె సమస్యలను ఎలా తప్పించుకోగలుగుతున్నారన్న అంశంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేశారు.

శనిగ్రహంలో కొత్త ‘స్పోక్‌ సీజన్‌’ ప్రారంభం

శనిగ్రహం వలయాలకు సంబంధించి హబుల్‌ టెలిస్కోప్‌ తాజాగా తీసిన చిత్రంలో ‘స్పోక్‌ సీజన్‌’ ప్రారంభానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు నాసా పేర్కొంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ‘స్పోక్స్‌’కి సంబంధించిన కారణాలు, వాటి స్వభావం ఎలా ఉంటుంది తదితర అంశాలను గుర్తించనున్నట్లు వెల్లడైంది. తాజా స్పోక్స్‌నకు శనిగ్రహానికి సంబంధించిన అస్థిర అయస్కాంత క్షేత్రమే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు నాసా వెల్లడించింది.

లయన్స్‌ మేన్‌ పుట్టగొడుగులతో జ్ఞాపకశక్తి వృద్ధి

లయన్స్‌ మేన్‌ మష్రూమ్స్‌గా పిలిచే హెరిసియం హెరినాసియస్‌ జాతికి చెందిన పుట్టగొడుగులతో మెదడు కణాలు వృద్ధి చెందడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగుపడుతోందని పరిశోధనలో రుజువైంది. ఔషధ గుణాలున్నాయనే నమ్మకంతో ప్రాచీన కాలం నుంచీ ఈ పుట్టగొడుగులను ఆసియా దేశాల్లో సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అయితే దీనిలో శాస్త్రీయతను నిర్ధరించేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పూనుకున్నారు. ఈ పుట్టగొడుగుల నుంచి తీసిన మూలకాల వల్ల సజీవమైన బ్రెయిన్‌ కణాల్లో వచ్చిన మార్పులను అధ్యయన బృందం పరిశీలించింది. మెదడు కణాల్లో న్యూరాన్‌ల వృద్ధి, వాటి మధ్య బంధం ఏర్పడటం వంటి సానుకూల మార్పులను వారు గమనించారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్‌ ఆఫ్‌ న్యూరోకెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం అల్జీమర్స్‌కు చికిత్స అందించడంలో ఉపయోగపడుతుందని పరిశోధనా పత్రం పేర్కొంది.

ఎరువుల ఉద్గారాలను 80% తగ్గించొచ్చు

సేంద్రియ, రసాయన ఎరువులు విడుదలచేసే కర్బన ఉద్గారాలను 80 శాతం మేర తగ్గించవచ్చని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. ఈ ఉద్గారాల్లో మూడో వంతు మాత్రమే ఉత్పత్తి సమయంలో వెలువడతాయని, మిగతా ఉద్గారాలన్నీ ఎరువులను పొలాల్లో చల్లిన తరవాతే వెలువడతాయని గుర్తించారు. పెట్రోరసాయనాల పరిశ్రమ ఉత్పత్తుల్లో 74 శాతం వాటా ప్లాస్టిక్స్, రసాయన ఎరువులదే. 48 శాతం ప్రపంచ జనాభా ఆహార అవసరాలను రసాయన ఎరువుల ద్వారా సాగయిన పంటలే తీరుస్తున్నాయి. 2050 కల్లా ప్రపంచ జనాభా 20 శాతం పెరగనున్నందున ఆ మేరకు రసాయన ఎరువుల వినియోగమూ పెరుగుతుంది. నత్రజని ఆధారిత ఎరువులు అన్నింటికన్నా ఎక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తాయి. సేంద్రియ, రసాయన ఎరువులు కలిసి ఏడాదికి 2.6 గిగాటన్నుల ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ఇది విమానయాన, నౌకా రవాణా రంగాలు రెండూ వెలువరిస్తున్న ఉద్గారాల కన్నా ఎక్కువ. రసాయన ఎరువుల ఉత్పత్తి ప్రక్రియలో అమోనియా సంశ్లేషణ వల్ల కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఈ పరిశ్రమలో ఉష్ణీకరణ, హైడ్రోజన్‌ ఉత్పత్తికి బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తే ఉద్గారాలు తగ్గుతాయి.

ఇస్రో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. శాస్త్రవేత్తలు మొదటిసారిగా చిన్న ఉపగ్రహ వాహకనౌకను (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) రూపొందించి, ప్రయోగించి విజయవంతం చేశారు. దీనివల్ల సమయంతో పాటు, ఖర్చు ఆదా అయింది. వాణిజ్య ప్రయోగాల పరంగా మరింత ముందుకెళ్లేందుకు ఇది ఎంతోగానో ఉపయోగపడనుంది. తిరుపతి జిల్లాలోని షార్‌లో ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల ఈవోఎస్‌-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌ క్విడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీ శాట్‌-2లను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ‘ఈ విజయంతో ఇస్రో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అతి తక్కువ ఖర్చు, ఐదు రోజుల వ్యవధిలో రాకెట్‌ను రూపొందించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన దేశంగా భారత్‌ తన పేరును నమోదు చేసుకుంది’ అని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈవోఎస్‌-07: ఇది 156.3 కిలోల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ మిషన్‌ లక్ష్యం మైక్రోశాటిలైట్‌ బస్, కొత్త సాంకేతికతలకు అనుకూలమైన పేలోడ్‌ సాధనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం. భవిష్యత్తులో ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ఎంతో అవసరం కానుంది. ఈ ఉపగ్రహం ద్వారా భూమిపైన, సముద్రాల్లోని వాతావరణ మార్పులను గుర్తించవచ్చు. మరెన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కొత్త ప్రయోగాల్లో ఎంఎం-వేవ్‌ హ్యుమిడిటీ సౌండర్, స్పెక్ట్రమ్‌ మానిటరింగ్‌ పేలోడ్‌ ఉన్నాయి. జానుస్‌-1: బరువు 10.2 కిలోలు. అంటారిస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫారం ఆధారంగా రూపొందిన స్మార్ట్‌ శాటిలైట్‌ మిషన్‌. ఆజాదీ శాట్‌-2: బరువు 8.7 కిలోలు. ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 750 మంది బాలికల సంయుక్త ప్రయత్నం. దీనిని చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేశారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఎందుకంటే.. ఈ చిన్న ఉపగ్రహ వాహకనౌక ద్వారా తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పీఎస్‌ఎల్‌వీ సిద్ధం చేయడానికి 45 రోజులకు పైగా సమయం పడుతుంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీని వారం రోజుల్లోపే సిద్ధం చేయవచ్చు. బహుళ ఉపగ్రహాలను పంపడానికీ ఇది ఉపకరిస్తుంది. ప్రస్తుతం ప్రయోగించిన వాహకనౌక 34 మీటర్ల పొడవు. 2 మీటర్ల వ్యాసం, 120 టన్నుల బరువు కలిగి ఉంది.

మరుగుజ్జు గ్రహం చుట్టూ వలయాలు

సౌర కుటుంబం అంచుల్లో ఉన్న ఒక మరుగుజ్జు గ్రహం చుట్టూ వలయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వావార్‌ అనే బుల్లి గ్రహం, ప్లూటోతో పోలిస్తే సగం పరిమాణంలో ఉంటుంది. నెప్ట్యూన్‌ గ్రహానికి అవతల ఉండి, సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. స్పెయిన్‌లోని జీటీసీ టెలిస్కోపులో ఉన్న హైపర్‌కామ్‌ అనే హైస్పీడ్‌ కెమెరా దీన్ని గుర్తించింది. వలయాలు కలిగిన ఇతర గ్రహాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది. క్వావార్‌కు ఒకింత దూరంగా దాని వలయాలు ఉన్నాయి. దీంతో గ్రహాల చుట్టూ ఈ ఆకృతులు ఏర్పడిన తీరుపై ప్రస్తుతమున్న సిద్ధాంతాలపై ఇది సందేహాలు లేవనెత్తుతోంది. క్వావార్‌ వలయాలు చాలా చిన్నగా, అస్పష్టంగా ఉన్నాయి. ఆ మరుగుజ్జు గ్రహం తన వెనుక ఉన్న నక్షత్రం నుంచి వచ్చే కాంతిని అడ్డుకున్న సమయంలో నిశితంగా పరిశీలించినప్పుడు అవి కనిపించాయి. సౌర కుటుంబంలో గ్రహాలకు వలయాలు ఉండటం చాలా అరుదు. శని, గురుడు, యురేనస్, నెప్ట్యూన్‌కు మాత్రమే అవి ఉన్నాయి. మరో రెండు బుల్లి గ్రహాల చుట్టూ కూడా ఇవి వెలిశాయి.

ప్రాసెస్డ్‌ ఆహారంతో క్యాన్సర్‌ ముప్పు

తీవ్రస్థాయిలో ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారినపడే, ఆ వ్యాధితో మరణించే ముప్పు పెరుగుతుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఆహార పదార్థాలను ఉత్పత్తి సమయంలో భారీగా ప్రాసెస్‌ చేస్తారు. శీతల పానీయాలు, పలు రకాల ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో ఉప్పు, కొవ్వు, చక్కెర, రసాయనాలు ఎక్కువే. వీటివల్ల ఊబకాయం, టైప్‌-2 మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు నడి వయసులో ఉన్న 2 లక్షల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. పదేళ్లపాటు ఈ పరిశీలన సాగింది. తీవ్రస్థాయిలో ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకున్నవారికి క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని ఇందులో వెల్లడైంది. ముఖ్యంగా అండాశయ, రొమ్ము క్యాన్సర్ల బారినపడే అవకాశం ఎక్కువని తేలింది. ఈ తరహా తినుబండారాలను భుజించడం 10 శాతం పెరిగితే క్యాన్సర్‌ ముప్పు 2 శాతం పెరగొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధితో మరణించే ముప్పు కూడా 6 శాతం పెరుగుతుందని వివరించారు.

డ్రైవర్‌ లేకుండా ట్రాక్టర్‌ నడిపేయొచ్చు!

ఇక రైతులు ఎక్కడైనా కూర్చొని పొలంలో ట్రాక్టర్‌ను మొబైల్‌ సాయంతో నడపవచ్చు. డ్రైవర్‌ అవసరం లేకుండా గేర్లు అదే మార్చుకుంటుంది. ఎక్స్‌లేటరూ ఇచ్చుకుంటుంది. స్టీరింగ్‌ దానంతట అదే తిరుగుతుంది. ట్రాక్టర్‌ వెనక్కి, ముందుకు ఎటు కావాలంటే అటు నడిపేయవచ్చు. ఈ మేరకు వ్యవసాయంలో అన్నదాతకు ప్రయోజనకరంగా వరంగల్‌ ‘కిట్స్‌’ కళాశాల అధ్యాపకులు డ్రైవర్‌ లేకుండా ట్రాక్టర్‌ నడిపే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ‘డ్రైవర్‌ రహిత ట్రాక్టర్‌’గా దీనికి నామకరణం చేశారు. మూడేళ్ల పాటు శ్రమించి దీన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) కింద 2020 ఫిబ్రవరిలో రూ.41 లక్షల విలువైన ఈ ప్రాజెక్టు మంజూరైంది. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి కో-ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా, సహాయ ఆచార్యుడు షర్ఫుద్దిన్‌ వసీమ్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా, అధ్యాపకుడు నరసింహారెడ్డి ప్రాజెక్టుకు మెంటర్‌గా వ్యవహరించగా, బీటెక్‌ సీఎస్‌ఈ చివరి సంవత్సరం విద్యార్థి సాకేత్‌ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నాడు. ట్రాక్టర్‌కు మైక్రో కంట్రోలర్‌ను అమర్చి, డ్రైవర్‌ అవసరం లేకుండానే క్లచ్, బ్రేకు, ఎక్స్‌లేటర్‌ తిరగడానికి మూడు యాక్చువేటర్స్‌ వినియోగించారు. స్టీరింగ్‌ తిరిగేందుకు మరో మోటార్‌ను అమర్చారు. డ్రైవర్‌ రహిత ట్రాక్టర్‌ను మొబైల్‌ ద్వారా నియంత్రించేలా రూపొందించామని ప్రిన్సిపల్‌ ఆచార్య కె.అశోక్‌రెడ్డి చెప్పారు. ఐవోటీ పరిజ్ఞానంతో సందేశం క్లౌడ్‌కు వెళుతుందని, అక్కడి నుంచి మొబైల్‌కు మనమిచ్చే ఆదేశాలు వస్తాయని వివరించారు. మన ఇంట్లో లేదా వేరే ఎక్కడినుంచైనా పొలంలో ట్రాక్టర్‌ను మొబైల్‌ ఫోన్‌తో నడిపించవచ్చని, 45 హెచ్‌పీ ట్రాక్టర్‌పై ప్రాంగణంలో ప్రయోగాలు చేయగా సమర్థంగా నడుస్తోందని తెలిపారు. ట్రాక్టర్‌ ఉన్న రైతులు ఈ సాంకేతికతను అమర్చుకోవాలంటే రూ.20 వేలు ఖర్చవుతుందని వసీమ్‌ తెలిపారు.

వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు

పిల్లలు విపరీతంగా వీడియో గేమ్స్‌ ఆడుతున్నా.. మరేం పర్వాలేదు. వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల బాలల గ్రహణ శక్తి తగ్గడం, విజ్ఞాన సముపార్జన దెబ్బతినడం లేదా మెరుగుపడటం లాంటివి జరగవని అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. కొందరిలో ఈ గేమ్స్‌ గ్రహణ శక్తిని మెరుగుపరిచినా యవ్వన వయసు వారిపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలిపారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న 160 మంది యవ్వన వయసు వారికి భాషా, గణిత సామర్థ్యాలు అంచనా వేసే కాగ్‌ ఏటీ పరీక్ష జరిపారు. ఈ బాలలు రోజుకు సగటున రెండున్నర గంటలసేపు వీడియో గేమ్స్‌ ఆడతామని చెప్పారు. కొంతమంది నాలుగున్నర గంటలు అని చెప్పారు. అయినా వారి గ్రహణ శక్తి, సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నాయి. అదే పనిగా వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల పిల్లల్లో అటు గ్రహణ శక్తి మెరుగుపడటం గానీ, సామర్థ్యాలు తగ్గడం గానీ ఉండదని అధ్యయనం తెలిపింది.

అగ్నిపర్వతాలు వెదజల్లే హానికారక ఉద్గారాలు ఎక్కువే

అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు వాతావరణంలోకి భారీగా హానికారక వాయువులు విడుదలవుతుంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడూ వీటిని ఎక్కువగానే వెదజల్లుతుంటాయని అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికన్నా కనీసం మూడు రెట్లు ఎక్కువగా అగ్నిపర్వతాలు సల్ఫర్‌ను ఆర్కిటిక్‌ వాతావరణంలోకి వెలువరించినట్లు గుర్తించారు. గ్రీన్‌ల్యాండ్‌ ప్రాంతంలోని ఐస్‌ కోర్‌ను విశ్లేషించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. విస్ఫోట సమయంతో పోలిస్తే సాధారణ పరిస్థితుల్లో సల్ఫేట్‌ ఏరోసాల్స్‌ను 10 రెట్లు ఎక్కువగా వెలువరిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ రేణువులు సౌరశక్తిని అడ్డుకుంటాయి. తాజా పరిశోధన నేపథ్యంలో మానవ చర్యలు, అగ్నిపర్వతాల నుంచి వెలువడే రేణువుల సంఖ్యను సరిగా మదించాల్సి ఉంటుందని వివరించారు.

నగరాల్లో మరణాలకు చెట్లతో తగ్గుదల

అధిక ఉష్ణోగ్రతల కారణంగా నగరాల్లో సంభవించే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగల శక్తి చెట్లకు ఉందని పరిశోధకులు తెలిపారు. ఐరోపా ఖండంలోని 93 నగరాల్లో 2015లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కు చెందిన తామర్‌ లంగ్‌మాన్‌ నేతృత్వంలో పరిశోధకులు విస్తృత అధ్యయనాన్ని నిర్వహించారు. నగరాల్లో చెట్ల విస్తృతి 30% మేర పెరిగితే సగటున 0.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత తగ్గుతుందని వారు నిర్ధారించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా 93 ఐరోపా నగరాల్లో 2015లో 6,700 మరణాలు నమోదయ్యాయి. చెట్ల విస్తృతి 30% వరకు పెరిగి ఉంటే అందులో దాదాపు మూడో వంతు మరణాలు (2,644) సంభవించి ఉండేవి కావని పరిశోధకులు తేల్చారు.

క్వాంటమ్‌ రేణువుల పరిజ్ఞానంలో కీలక ముందడుగు

క్వాంటమ్‌ పరిజ్ఞానం విషయంలో ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. రెండు అయాన్ల మధ్య 230 మీటర్ల ద]ూరం విజయవంతంగా బంధనం (ఎంటాంగిల్‌మెంట్‌) ఏర్పర్చగలిగారు. గతంలో ఒక ల్యాబ్‌ పరిధిలో కొద్దిమీటర్ల దూరం వరకూ మాత్రమే దీన్ని సాధించగలిగారు. ఇన్‌బ్రక్‌ వర్సిటీలో తాజా పరిశోధన జరిగింది. భవిష్యత్‌లో నగరాల వ్యాప్తంగా ఈ క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ను విస్తరింపచేయడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్వాంటమ్‌ కంప్యూటర్లు, ఇతర క్వాంటమ్‌ టెక్నాలజీల నిర్మాణానికి ట్రాప్డ్‌ అయాన్లు కీలకం. ఆస్ట్రియా శాస్త్రవేత్తలు ఆప్టికల్‌ కావిటీల్లో అణువులను ట్రాప్‌ చేసే విధానాన్ని కొన్నేళ్ల కిందట అభివృద్ధి చేశారు. క్వాంటమ్‌ సమాచారాన్ని కాంతి రేణువుల ద్వారా సమర్థంగా చేరవేసేలా వీటిని రూపొందించారు. ఈ కాంతి రేణువులను ఆ తర్వాత ఆప్టికల్‌ ఫైబర్ల ద్వారా పంపి, అణువులను విభిన్న ప్రదేశాల్లో అనుసంధానించొచ్చు.

రాడార్ల కళ్లుగప్పే పదార్థం అభివృద్ధి

సైనిక సాధనాలు, ఆయుధాలను శత్రు రాడార్ల కంటపడకుండా చూసే ఒక అద్భుత పదార్థాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది స్టెల్త్‌ వాహనాల అద్దాలనూ కప్పేయగలదు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. యుద్ధరంగంలో రాడార్లు చాలా కీలకం. అవి రేడియో తరంగాలను వెదజల్లుతూ ప్రత్యర్థిపై కన్నేస్తాయి. మన ఆయుధాలను వాటి కంటపడకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. దీనివల్ల శత్రువులు వాటిని లక్ష్యంగా చేసుకోకుండా రక్షించుకోవచ్చు. ఈ తరంగాలను శోషించుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశగా ఐఐటీ శాస్త్రవేత్తలు ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్‌ సర్ఫేస్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌) అనే విధానం ఆధారంగా ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. తొలుత వీరు పారదర్శకమైన ఇండియం టిన్‌ ఆక్సైడ్‌ (ఐటీవో) పూత పూసిన పాలీఇథలీన్‌ టెరెప్తలేట్‌ (పీఈటీ) ఫలకాన్ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ ఆకృతులను డిజైన్‌ చేశారు. ఇది 90శాతం వరకూ రాడార్‌ తరంగాలను శోషించుకోగలదని పరీక్షల్లో వెల్లడైంది. ఇది పారదర్శకంగా ఉండటం వల్ల స్టెల్త్‌ వాహనాల అద్దాలకూ దాన్ని ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

100 శాతం భూమిలో కలిసిపోయే కాగితపు స్ట్రాల రూపకల్పన

ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు స్ట్రాలతో పోలిస్తే 100 శాతం భూమిలో కలిసిపోయే పర్యావరణహిత కాగితపు స్ట్రాలను రూపొందించినట్లు కొరియా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ పరిశోధకులు ప్రకటించారు. అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వివరాల ప్రకారం.. భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి అనువుగా ఉండే ఈ స్ట్రాలను పూర్తిగా కాగితంతోనే శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయితే కార్బొనేటెడ్‌ పానీయాల్లో ఈ స్ట్రాలు నానిపోకుండా భూమిలో త్వరగా కలిసిపోయే ప్లాస్టిక్‌ (పాలీబ్యుటైలీన్‌ సక్సినేట్‌)తో వాటికి ఒక పూత పూస్తున్నామని వివరించారు. ఇందులో ఉపయోగించే సెల్యులోజ్‌ నానోక్రిస్టల్స్‌ ఆ పూతను పట్టి ఉంచుతాయన్నారు. ఈ పర్యావరణహిత స్ట్రాలు భూమిలోనూ, సముద్రాల్లోనూ త్వరగా కలిసిపోతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగానికి కొత్త సాంకేతికత అభివృద్ధి

వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగాన్ని ఏకంగా 90 శాతం వరకూ తగ్గించే వినూత్న హరిత టెక్నాలజీని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘ఎయిర్‌ నానో బబుల్‌’ అని పేరు పెట్టారు. వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగం చాలా ఎక్కువ. అద్దకం, బ్లీచింగ్‌ సహా పలు దశల్లో ఒక కిలో నూలు వస్త్రం ప్రాసెస్‌ చేయడానికి 200-250 లీటర్ల నీరు అవసరం. దీనివల్ల కలుషిత నీటి సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమస్యపై రోపార్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. వీరు గాలి, ఓజోన్‌తో కూడిన నానో బబుల్స్‌ ఆధారంగా ఈ టెక్నాలజీని సిద్ధం చేశారు. వెంట్రుక కన్నా పదివేల రెట్లు సన్నగా ఉండే ఈ సూక్ష్మ బుడగలకు హైడ్రోఫోబిక్‌ తత్వం ఉంటుంది. అందువల్ల అవి నీటి కన్నా మెరుగ్గా వస్త్రంతో చర్య జరుపుతాయి. రసాయనాలు, రంగులను వస్త్రం అంతటా వ్యాప్తి చేయిస్తాయి. మిగులు రంగులను సమర్థంగా తొలగిస్తాయి. అవి నీటిలో క్షీణించిపోయేలా చేస్తాయి. మొత్తం మీద 90-95 శాతం నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. ప్రాసెసింగ్‌ రసాయనానికి వాహకంగా ఈ బబుల్స్‌ పనిచేస్తాయి. అదనపు కెమికల్స్‌ అవసరాన్ని తప్పిస్తాయి. నానో బబుల్‌ యంత్రంతో ప్రాసెస్‌ చేశాక నీటిని తిరిగి వినియోగించొచ్చు.

గురు గ్రహ కక్ష్యలో మరో 12 చందమామలు

గురుడి కక్ష్యలో మరో 12 కొత్త చందమామలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఆ గ్రహం వద్ద ఉన్న సహజ ఉపగ్రహాల సంఖ్య రికార్డు స్థాయిలో 92కు చేరింది. చందమామల సంఖ్య విషయంలో సౌర కుటుంబంలో ఇప్పటివరకూ శనిదే ఆధిపత్యం. ఆ గ్రహం చుట్టూ 83 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు గురుడిదే ఆధిపత్యం. హవాయ్, చిలీలోని టెలిస్కోపుల సాయంతో వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన చందమామలు 1- 3 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉన్నాయి. భవిష్యత్‌లో మరింత నిశితంగా వీటిని చిత్రీకరిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఉపగ్రహాల సంఖ్య మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. సౌర కుటుంబంలో యురేనస్‌కు 27, అంగారకుడికి రెండు, భూమికి ఒకటి చొప్పున చందమామలు ఉన్నాయి. శుక్రుడు, బుధుడి చుట్టూ సహజ ఉపగ్రహాలు లేవు.

సముద్ర జలం నుంచి హరిత ఉదజని

సముద్రపు నీటిని ముందుగా శుద్ధి చేయకుండా నేరుగా ఆమ్లజని, ఉదజనిగా విడగొట్టే ప్రక్రియను అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది. ఈ బృందానికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ వర్సిటీకి చెందిన యావో ఝెంగ్‌ సారథ్యం వ్యవహరించారు. క్రోమియం ఆక్సైడ్‌ పూతతో చవకగా లభించే కోబాల్ట్‌ ఆక్సైడ్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగించి సముద్ర జలాన్ని విద్యుత్‌ ప్రయోగంతో (ఎలక్ట్రోలైసిస్‌) ఆమ్లజని, హరిత ఉదజని (గ్రీన్‌ హైడ్రోజన్‌)గా విడగొట్టారు. సాధారణంగా ఎలక్ట్రోలైసిస్‌ ప్రక్రియకు ముందు రివర్స్‌ ఆస్మోసిస్‌ డెసొలేషన్, క్షారీకరణ వంటి ప్రక్రియల్లో నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. శిలాజ ఇంధనాల బదులు హరిత ఉదజని ఉత్పత్తికి తాగునీటిని ఉపయోగించడం జలవనరుల కొరతను తీవ్రం చేస్తుంది. సముద్రజలం దాదాపు అనంతం కాబట్టి నీటి కొరత ఏర్పడదు.

మూత్ర పరీక్షతో మెదడులో కణితి నిర్ధారణ

మూత్రాన్ని విశ్లేషించడం ద్వారా మెదడులో కణితి ఉందో లేదో సులువుగా నిర్ధారించగల సరికొత్త పరీక్షను జపాన్‌ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. సాధారణంగా మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తుల మూత్రంలో కణితి సంబంధిత ఎక్స్‌ట్రాసెల్యులర్‌ వెసికిల్స్‌ (ఈవీ) ఉంటాయి. అత్యంత సూక్ష్మ పరిమాణంలోని ఈ ఈవీల జాడను పసిగట్టడం ద్వారా కణితి నిర్ధారణ జరపొచ్చని జపాన్‌లోని నాగోయ, టోక్యో విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకోసం నానో వైర్లతో కూడిన పరికరాన్ని తయారు చేశారు. బాధితుల మూత్ర నమూనాల్లో సీడీ31, సీడీ63 అనే ఈవీ త్వచ ప్రొటీన్లను గుర్తించడం ద్వారా తొలి దశల్లోనే కణితి నిర్ధారణకు అది దోహదపడుతుందని వారు తెలిపారు.

భూతాపం కట్టడి ఇప్పట్లో అసాధ్యం

భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీల లోపునకు కట్టడి చేయడమనేది ప్రస్తుత సామాజిక మార్పుల వల్ల సాధ్యపడదని జర్మనీలోని హాంబర్గ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. వాతావరణ మార్పులను అంచనా వేయడానికి మొదటిసారిగా సామాజిక శాస్త్రాలను, ప్రాకృతిక శాస్త్రాను మేళవించిన అధ్యయనమది. మానవ సమాజం ఎంత వేగంగా సానుకూల మార్పులను చేపడితే అంత త్వరగా భూతాపానికి కళ్లెం వేయగలుగుతామని పరిశోధకులు నిర్ధారించారు. మానవ వస్తుసేవల వినియోగం, కార్పొరేట్‌ చర్యలు వాతావరణ మార్పులను నిరోధించే కృషిని మందగింపజేస్తున్నాయి. కర్బన ఉద్గారాలను వెదజల్లే శిలాజ ఇంధనాలను మానవ సమాజం వేగంగా వదిలించుకోలేకపోతోంది. ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని పెంచుతున్నందున పారిస్‌ వాతావరణ సభ తీర్మానించిన ప్రకారం భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల లోపునకు పరిమితం చేయడం కష్టమవుతోంది. రష్యన్‌ సహజవాయువుపై ఆధారపడాల్సిన అగత్యం నుంచి ప్రపంచం ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా శిలాజ ఇంధనాలకు వీడ్కోలు చెప్పగలుగుతామని జర్మన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవ సమాజం తన పంథాను మార్చుకోకపోతే భూతాపం పెరిగిపోవడం ఖాయమన్నారు.

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం మరణం

→ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం (78) చెన్నైలో మరణించారు. 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరుకు చెందిన దురైస్వామి, పద్మావతి దంపతులకు జన్మించారు. →అసలు పేరు కలైవాణి. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించడంతో పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. →పదేళ్ల వయసులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. దీంతో పాటు నాటకాలు, కవితలు చదివి శ్రోతలను మెప్పించారు. →అలా 1970లో ‘గుడ్డీ’ అనే హిందీ చిత్రంలో ‘బోలే రే’ అనే పాటతో గాయనిగా తన ప్రయాణాన్ని ఆరంభించారు. ఆమె పాడిన తొలిపాటే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. →సుశీల, జానకి లాంటి గాయనీమణుల హవా కొనసాగిస్తున్న సమయంలో తనదైన గానంతో అలరించారు వాణి. →‘అభిమానవంతుడు’ చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి...’ పాటతో తెలుగులో తొలిసారి ఆమె గొంతు వినిపించింది. →ఆ తర్వాత ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటతో బాగా పాపులర్‌ అయ్యారు. ‘ఏళు స్వరంగల్‌కుళ్‌’, ‘అపూర్వ రాగంగళ్‌’, ‘అండమాన్‌ కాలనీ’, ‘పాదపూజై’ ‘అవన్‌దాన్‌ మణిదన్‌’, ‘రోజాపూ రవిక్కైక్కారి’, ‘మీనవ నన్బన్‌’ లాంటి ఎన్నో చిత్రాల్లో పాటలు పాడి తమిళ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించారు. శాస్త్రీయం, జానపదం, బీట్... ఇలా ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు. →తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, ఆంగ్లం వంటి 19 భాషల్లో వేల పాటలు పాడారు. →ఏ భాషలో పాడినా ఆ భాషలోని స్పష్టతను గొంతులో పలికించడం వాణీ జయరాం ప్రత్యేకత. →వాణీ జయరాం ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 1976లో వచ్చిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’తో ఉత్తమ గాయనిగా తొలి జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఆ తర్వాత ‘శంకరాభరణం’లోని మానస సంచరరే, ‘స్వాతికిరణం’లోని ఆనతి నీయరా హరా గీతాలతో మరో రెండు జాతీయ అవార్డుల్ని దక్కించుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్‌ సహా మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న వాణీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించింది.

కళా తపస్వి కె.విశ్వనాథ్‌ మరణం

→కళా తపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌ (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
→బాపట్ల జిల్లా రేపల్లెలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్‌ జన్మించారు.
→గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు.
→ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు.
→పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్‌గా చేరారు. కొన్ని చిత్రాలకు కథా రచనలో పాలుపంచుకున్నారు.
→అలా రాణిస్తున్న సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
→ఆ తొలి చిత్రానికే నంది అవార్డు సాధించిన విశ్వనాథ్, తన సినీప్రయాణంలో సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు లాంటి అనేక ఆణిముత్యాలను అందించి తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారు.
→ విశ్వనాథ్‌కు 1992లో పద్మశ్రీ, 2017లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు వచ్చాయి.
→అదే ఏడాది రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది. నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.
→పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.
→మేటి దర్శకుడిగా పేరొందిన ఆయన నటుడిగా కొన్ని కుటుంబ కథాచిత్రాల్లో ఇంటిపెద్ద పాత్రల్లోనూ మెప్పించారు.
→1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ఆయన మరణించడం యాదృచ్ఛికం.

హర్యానా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు

→దేశానికి విశిష్ట సేవలందించినందుకు హర్యానా పోలీసులకు ఫిబ్రవరి 14న ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందజేయనున్నారు.
→కర్నాల్‌లోని హర్యానా పోలీస్ అకాడమీ, మధుబన్‌లో జరిగే వేడుకల సందర్భంగా రాష్ట్ర పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును అందజేయనున్నారు.
→"ప్రెసిడెంట్స్ కలర్" అనేది ఏదైనా సాయుధ దళాలు లేదా పోలీసు విభాగానికి, శాంతి మరియు యుద్ధంలో దేశానికి అందించిన అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది.

ఆల్ హిలాల్‌ను ఓడించి రికార్డు స్థాయిలో ఐదవ క్లబ్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న రియల్ మాడ్రిడ్

→మొరాకోలోని రబాత్‌లోని అబ్దెల్లా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో రియల్ మాడ్రిడ్ 2023 క్లబ్ ప్రపంచ కప్‌ను రికార్డు స్థాయిలో ఐదవసారి గెలుచుకుంది.
→సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్‌పై రియల్ మాడ్రిడ్ 5-3 తేడాతో విజయం సాధించింది.
→వినిసియస్ జూనియర్ (బ్రెజిల్) రెండు గోల్స్ చేసి రియల్ మాడ్రిడ్‌కు నాయకత్వం వహించడానికి కరీమ్ బెంజెమాకు సహకరించాడు.
→రియల్ మాడ్రిడ్ చివరిసారిగా 2014, 2016, 2017 మరియు 2018లో టోర్నీని గెలుచుకుంది.
→మాడ్రిడ్ 1960, 1998 మరియు 2002లో మూడు ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లను కూడా గెలుచుకుంది.

అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం 2023: 13 ఫిబ్రవరి

→అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం జరుపుకుంటారు మరియు ఈ సంవత్సరం (2023), ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీన వస్తుంది.
→లక్ష్యం: మూర్ఛ వ్యాధిపై అవగాహన కల్పించడం
→వేడుకలు "STIGMA" అంటే భయం లేదా ప్రతికూల ప్రతిచర్యలపై దృష్టి పెట్టాలి.
→మూర్ఛ అనేది మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేసే నాడీ రుగ్మత.
→ఈ రోజును ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ఇతర దేశాలు పాటిస్తాయి.

రివర్ సిటీస్ అలయన్స్ సభ్యుల వార్షిక సమావేశం పూణేలో జరిగింది

→రివర్ సిటీస్ అలయన్స్ (River Cities Alliance (RCA)) "ధార" సభ్యుల వార్షిక సమావేశం 2023 ఫిబ్రవరి 13 నుండి 14 వరకు పూణేలో నిర్వహించబడుతోంది.
→DHARA: Driving Holistic Action for Urban Rivers
→RCA సభ్యుల వార్షిక సమావేశాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (National Mission for Clean Ganga (NMCG))తో కలిసి నిర్వహిస్తోంది.
→ఈ ఈవెంట్ భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ పరిధిలో అర్బన్20 (U20) చొరవతో బలమైన సమన్వయాన్ని కలిగి ఉంది.

'ఒక కుటుంబం, ఒకే ID' కోసం పోర్టల్‌

→ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు కుటుంబ ID కోసం పోర్టల్‌ను ప్రారంభించింది - 'ఒక కుటుంబం ఒక గుర్తింపు'.
→లక్ష్యం: 'ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం' ప్రతిపాదనను అమలు చేయడానికి కుటుంబాలను యూనిట్‌గా గుర్తించడం.
→ఒక కుటుంబం ఒక గుర్తింపు పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు జారీ చేయబడుతుంది.
→ఇది రాష్ట్రంలోని కుటుంబ యూనిట్ల ప్రత్యక్ష సమగ్ర డేటాబేస్‌ను ఏర్పాటు చేస్తుంది.
→ఈ డేటాబేస్ లబ్ధిదారుల పథకాల యొక్క మెరుగైన నిర్వహణ మరియు పారదర్శక ఆపరేషన్‌లో సహాయపడుతుంది.

ప్రపంచ రేడియో దినోత్సవం 2023: 13 ఫిబ్రవరి

→రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి మరియు వార్తలతో అప్‌డేట్‌గా ఉండటానికి ప్రజలకు ఇది ఎలా సహాయపడిందనే దానిపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటారు.
→ప్రపంచ రేడియో దినోత్సవం (2023) 12వ ఎడిషన్ థీమ్ 'Radio and Peace'.
→థీమ్ యొక్క దృష్టి: రేడియో సాంకేతికతలో వేగవంతమైన మార్పులు మరియు పురోగతిపై
→1946లో ఐక్యరాజ్యసమితి రేడియో స్థాపించిన రోజు కాబట్టి ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవంగా ఎంచుకున్నారు.

బెంగుళూరులో ఏరో ఇండియా 2023ని ప్రారంభించిన ప్రధాని మోదీ

→ఏరో ఇండియా షో 14వ ఎడిషన్‌ను 13 ఫిబ్రవరి 2023న బెంగళూరు (కర్ణాటక)లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
→2023 Theme: The Runway to a Billion Opportunities
→ఉద్దేశ్యం: స్వదేశీ రక్షణ పరికరాలు, సాంకేతికతలు మరియు యుద్ధ విమానాలను ప్రదర్శించడం
→విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి స్వదేశీ ఉత్పత్తి మరియు ఎయిర్ ప్లాట్‌ఫారమ్‌ల ఎగుమతిని ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం.
→ఈ కార్యక్రమంలో 98 విదేశీ దేశాలు పాల్గొన్నాయి మరియు రూ. 75,000 కోట్లపై సంతకాలు చేయాలని భావిస్తున్నారు

హాకీ ప్రపంచ కప్ 2023 విజేతగా జర్మనీ

→హాకీ ప్రపంచ కప్ 2023 ను జర్మనీ సొంతం చేసుకుంది. దీనితో ప్రపంచ హాకీలో గత ఐదేళ్లుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న బెల్జియంకు చెక్ పెట్టింది.
→జనవరి 29న భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన ఫైనల్లో జర్మనీ షూటౌట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంను 5-4తో ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది.
→జర్మనీకి ఇది మూడవ ప్రపంచ కప్ విజయం. అత్యధికంగా పాకిస్తాన్ 4 సార్లు విజేతగా నిలిచింది.
→అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క హాకీ ప్రపంచ కప్ 2023 కు ఇండియాలోని ఒడిశా రాష్ట్రం ఆతిధ్యం ఇచ్చింది.
→జనవరి 13 నుండి జనవరి 29 మధ్య జరిగిన ఈ టోర్నమెంట్ మ్యాచులను ఓడిశాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటుగా, కళింగ స్టేడియంలో నిర్వహించారు.
→2026 లో జరిగే తదుపరి హాకీ ప్రపంచ కప్, బెల్జియం & నెదర్లాండ్స్ దేశాలలో జరగనుంది.

ఎకనామిక్ సర్వే 2023-24 ముఖ్యాంశాలు

→కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే అనేది దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వార్షిక నివేదిక కార్డు, మొదటి ఆర్థిక సర్వే ను 1950-51 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఇది బడ్జెట్ పత్రాలలో భాగంగా ఉండేది.

→1960వ దశాబ్దంలో దీనిని బడ్జెట్ డాక్యుమెంట్ల నుంచి వేరు చేసి కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు విడుదల చేస్తున్నారు. ఆర్థిక సర్వే దేశ ఆర్థిక అంశాలకు యొక్క పనితీరును, భవిష్యత్ వృద్ధిని అంచనా వేస్తుంది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందిస్తుంది. ఈ ఏడాది సీఈఏ ముఖ్య ఆర్థిక సలహాదారుడు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ అధ్యక్షతన ఇది రూపొందించబడింది.

→ఆర్థిక సర్వే 2023 భారతదేశ వృద్ధి దృక్పథం మహమ్మారి ముందు సంవత్సరాల కంటే మెరుగ్గా ఉందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 7శాతం నమోదు కాగా, 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఈ అంచనా 6 నుండి 6.8 శాతం మధ్య ఉండనున్నట్లు తెలిపింది.

→అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ అప్‌డేట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి అంచనాను 6.8 శాతంగా మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

→భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ఈ ఏడాది మార్చి నాటికీ భారతదేశ నామ మాత్రపు జీడీపీ 3.5 ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. వినియోగదారుల ధరల పెరుగుదల గణనీయంగా తగ్గిందని సర్వే పేర్కొంది.

→ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పూర్తయిందని, నాన్ బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ రంగాలు ఇప్పుడు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌లను కలిగి ఉన్నాయని నివేదించింది. మహమ్మారి రికవరీ గురించి ఇకపై మాట్లాడాల్సిన అవసరం లేదని, తదుపరి దశ కోసం మనం ఎదురుచూడాలని పేర్కొంది.

→ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మద్దతుతో 2022 జనవరి-నవంబర్ మధ్య కాలంలో మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) సెక్టార్‌కి క్రెడిట్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఇది సగటున 30.6 శాతానికి పైగా ఉందని పేర్కొంది.

→మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పిస్తోందని తెలిపింది. పూర్తిస్థాయి కోవిడ్ కార్యక్రమం ద్వారా వలస కార్మికులు నగరాలకు తిరిగి చేరుకున్నారని, తద్వారా నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయని వెల్లడించింది.

→పీఎం -కిసాన్ మరియు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలు దేశంలో ఆహార భద్రతను పటిష్టం చేశాయని, వీటి ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కూడా ఆమోదించిందని పేర్కొంది.

→ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం, మూలధన నిర్మాణం ఉపాధి కల్పనకు దోహదం చేశాయని, పట్టణ ఉపాధి రేటు తగ్గగా, ఉద్యోగ భవిష్య నిధి నమోదుల సంఖ్య మాత్రం పెరిగిందని పేర్కొంది.

→ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లో 7.8 శాతానికి పెరిగిందని, ఇది ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికంటే ఎక్కువ అయినప్పటికీ ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది.

→దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం మద్దతుతో పెరుగుతున్న పెట్టుబడులు, ప్రైవేటు కన్జమ్షన్​ అని ఎకనామిక్​ సర్వే 2023 వెల్లడించింది. అదే సమయంలో.. ప్రైవేటు రంగాల్లోను పెట్టుబడుల ప్రవాహం పెరగాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. ఉద్యోగాలను సృష్టించే ప్రక్రియ మరింత వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.


యూనిలీవర్ నూతన సీఈఓగా హెయిన్ షూమేకర్‌

→బ్రిటీష్ కన్జ్యూమర్ కంపెనీ యూనిలీవర్ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హెయిన్ షూమేకర్‌ను నియమించినట్లు ప్రకటించింది. →51 ఏళ్ల షూమేకర్ గత ఏడాది అక్టోబర్‌లో యూనిలీవర్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. →ప్రస్తుత యూనిలీవర్ సీఈఓ అలన్ జోప్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్థానంలో హెయిన్ షూమేకర్‌ నియమించబడ్డారు.

ఉస్మాన్ ఖవాజాకు షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు

→ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తోలి షేన్ వార్న్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. →ఈ అవార్డును గతేడాది మార్చిలో మరణించిన దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ గౌరవార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రారంభించింది. →దీనిని ఏడాదిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టెస్ట్ ప్లేయరుకు అందిస్తారు.

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ విజేతగా భారత్

→దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది. →ఈ ఛాంపియన్ జట్టుకు షఫాలీ వర్మ నేతృత్వం వహించారు. భారత మహిళల క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కు ఇదే తొలి ఐసీసీ ప్రపంచ టైటిల్. →ఈ టోర్నమెంటులో మొత్తం పదహారు జట్లు పోటీ పడ్డాయి. →ఇందులో రెగ్యులర్ దేశాలతో పాటుగా ఐర్లాండ్, రువాండా, యూఏఈ, యూఎస్ఏ, జింబాబ్వే, ఇండోనేషియా, స్కాట్లాండ్ వంటి దేశాలు కూడా పాల్గొన్నాయి. →ఈ టోర్నీలో అత్యధిక పరుగులను భారత క్రికెటర్ శ్వేతా సెహ్రావత్ (297) నమోదు చేయగా, అత్యధిక వికెట్లను మ్యాగీ క్లార్క్ (12) నమోదు చేసింది. →ఐసీసీ అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రపంచ కప్పుకు దక్షిణాఫ్రికా ఆతిధ్యం ఇచ్చింది. →నిజానికి ఈ టోర్నమెంటు 2021లో బంగ్లాదేశ్ యందు నిర్వహించాల్సి ఉంది, అయితే కోవిడ్ కారణాలతో చివరిగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. →ఇక మీదట ప్రతి రెండేళ్లకు ఒకసారి దీన్ని ఐసీసీ నిర్వహిస్తుంది. తదుపరి 2025 ప్రపంచ కప్‌కు మలేషియా మరియు థాయ్‌లాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2020-21

→కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE), 2020-2021 డేటాను విడుదల చేసింది. ఈ సర్వే విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల డేటా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు మొదలగు ప్రమాణాల ఆధారంగా రూపొందించడబడింది.

→తాజా నివేదిక ప్రకారం 2019-20 మధ్య దేశంలో 3.85 కోట్ల మంది ఉన్నత విద్య కోసం నమోదు చేసుకోగా, ఆ సంఖ్యా 2020-21లో దాదాపు 4.14 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఇందులో మహిళలు 2019-20 మధ్య 1.88 కోట్ల మంది ఉండగా 2020-21 నాటికీ 2.01 కోట్లకు చేరుకుంది. మహిళా నమోదులో 2014-15 నుండి దాదాపు 44 లక్షల (28%) పెరుగుదల కనిపించినట్లు తెలిపింది.

→మొత్తం మహిళల చేరికలలో పురుషులతో పోల్చుకుంటే 2014-15 లో 45% ఉండగా 2020-21 నాటికి అది పెరిగి 49% కి చేరుకున్నట్లు నివేదించింది. అలానే 2019-20 నుండి 2020-21 మధ్య ఉన్నత విద్య కోసం నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గిరిజన విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలలో 2014-15 మధ్య చేరికలు 9.36 లక్షలు కాగా 2020-21 లో అది 12.06 లక్షలకు పెరిగినట్లు తెలిపింది.

→ఉన్నత విద్య కోసం నమోదు చేసుకుంటున్న అత్యధిక మంది విద్యార్థుల జాబితాలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నట్లు నివేదించింది. ఈ సర్వే ప్రకారం ఉన్నత విద్య కోసం నమోదు చేసుకున్న విద్యార్థులలో దాదాపు 79.06% మంది డిగ్రీ స్థాయి కోర్సులలో చేరగా, 11.5 % మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల్లో చేరారు.

→డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులలో 20.56% మంది చేరగా, ఆ తరువాత సైన్స్ కోర్సుల్లో 15.5%, కామర్స్ కోర్సుల్లో 13.9%, ఇంజనీరింగ్ కోర్సులలో 11.9% చేరారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అత్యధికంగా హ్యుమానిటీస్ కోర్సులలో 20.56% మంది, ఆ తరువాత సైన్స్ కోర్సులలో 14.83% మంది చేరినట్లు తెలిపింది.

→ఉన్నత విద్యలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వాటా 59% కాగా చేరికల వాటా 73.1%గా నమోదైంది. అలానే ప్రభుత్వ కళాశాలల వాటా 21.4% కాగా చేరికల వాటా 34.5%గా నమోదైంది. ఉన్నత విద్యా సంస్థలలో 2020-21 లో వివిధ మౌలిక సదుపాయాల విషయానికి వస్తే గ్రంధాలయాలు (97%), ప్రయోగశాలలు (88), కంప్యూటర్ కేంద్రాలు (91%), నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (61%), నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనుసంధానత (56%) కళాశాలు ఉన్నట్లు తెలిపింది.

→దేశంలో ప్రస్తుతం 1,113 విద్యాలయాలు ఉండగా 43,796 కళాశాలలు, 11,296 స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థలు ఉన్నట్లు నివేదించింది. 2020-21లో విశ్వవిద్యాలయాల సంఖ్య 70 కి పెరిగినట్లు, కళాశాల సంఖ్య 1,453 పెరిగినట్లు తెలిపింది. విశ్వవిద్యాలయాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ (92), ఉత్తరప్రదేశ్ (84), గుజరాత్ (83) మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి.

→అత్యధిక సంఖ్యలో కళాశాలలున్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ముందు వరసలో ఉండగా అత్యధిక కళాశాల సాంద్రత ఉన్న రాష్ట్రాలుగా కర్ణాటక(62), తెలంగాణ(53), కేరళ (50), హిమాచల్ ప్రదేశ్ (50), ఆంధ్రప్రదేశ్ (49), ఉత్తరాఖండ్ (40), రాజస్థాన్(40), తమిళనాడు (40) లు టాప్ జాబితాలో ఉన్నాయి.

→దేశంలో అత్యధిక కళాశాలలున్న జిల్లాలుగా బెంగళూరు అర్బన్ (1058), జైపూర్ (671), హైదరాబాద్ (488), పూణే(466), ప్రయాగ రాజ్ (374), రంగారెడ్డి (345), భోపాల్ (327), నాగపూర్ (318) ముందు వరుసలో ఉన్నాయి.


ఐదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ప్రారంభం

→ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఐదవ ఎడిషన్ జనవరి 30న మధ్యప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. కేంద్ర క్రీడల మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు భోపాల్‌లోని టిటి నగర్ స్టేడియంలో ఈ క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించారు.

→మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, జబల్‌పూర్, గ్వాలియర్, మాండ్లా, బాలాఘాట్ మరియు మహేశ్వర్‌ వంటి ఎనిమిది నగరాల్లో ఫిబ్రవరి 11 వరకు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. మొత్తం 27 క్రీడా ఈవెంట్‌లలో 250 కంటే ఎక్కువ బంగారు పతకాల కోసం పోటీపడనున్నారు.

→ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను పాఠశాల స్థాయి విద్యార్థులలో క్రీడల యందు ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దె లక్ష్యంతో 2018 లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీటిని మొదటిలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పేరుతొ నిర్వహించే వారు.


రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరును "అమృత్ ఉద్యాన్" గా మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్' థీమ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మార్పుపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 29న దీనిని పునఃప్రారంభించారు. వచ్చే రెండు నెలల పాటు ప్రజల సందర్శనార్థం తెరవబడి ఉంటుంది.

చెక్ రిపబ్లిక్ నూతన అధ్యక్షుడిగా పీటర్ పావెల్

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ జనరల్ పీటర్ పావెల్, చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అధ్యక్షపదవి కోసం జరిగిన ఎన్నికలలో బిలియనీర్ ఆండ్రెజ్ బాబిస్‌ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచాడు. ఈ ఎన్నికలో పావెల్ 58.2 శాతం ఓటింగు పొందగా, ఆండ్రెజ్ బాబిస్‌ 42.8 శాతం ఓటింగు మాత్రమే దక్కించుకున్నారు. పీటర్ పావెల్ త్వరలో వివాదాస్పద అధ్యక్షుడు మిలోస్ జెమాన్ స్థానంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు

ఉత్తర బెంగాల్‌లో త్రిశక్తి ప్రహార్‌ సైనిక శిక్షణ వ్యాయామం

భారత ఆర్మీ యొక్క త్రిశక్తి ప్రహార్ శిక్షణ వ్యాయామంను జనవరి 21 నుండి 31 మధ్య ఉత్తర బెంగాల్‌లో వ్యూహాత్మక 'సిలిగురి' కారిడార్‌కు సమీపంలో నిర్వహించారు. 11 రోజుల ఈ సైనిక వ్యాయామంలో భారత సాయుధ దళాలతో పాటుగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు కూడా పాల్గొన్నాయి. ఇంటిగ్రేటెడ్ వాతావరణంలో సరికొత్త ఆయుధాలు మరియు పరికరాలను ఉపయోగించి భద్రతా దళాల యుద్ధ సన్నద్ధతను సాధన చేయడమే ఈ వ్యాయామం యొక్క ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సిలిగురి కారిడార్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్‌లకు ఉమ్మడి సరిహద్దుగా ఉంటుంది. ఇది ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాతో కలుపుతుంది.

46వ అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 30న అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన 46వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ పుస్తక ప్రదర్శన జనవరి 31 నుండి ఫిబ్రవరి 12 వరకు బిధాన్‌నగర్‌లోని సెంట్రల్ పార్క్ మేళా మైదానంలో జరగనుంది. ఈ ఏడాది అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్ యొక్క థీమ్ దేశంగా స్పెయిన్ ఉండనుంది. ఈ బుక్ ఫెయిర్‌లో అంతర్భాగమైన కోల్‌కతా లిటరేచర్ ఫెస్టివల్ 2023 యొక్క 9వ ఎడిషన్ ఫెయిర్‌గ్రౌండ్‌లోని ఆడిటోరియంలో ఫిబ్రవరి 9 నుండి 11 వరకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దేశ నలుమూలల నుండి పుస్తక రచయితలు హాజరవుతారు. అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శన ప్రపంచంలోనే అతిపెద్ద నాన్-ట్రేడ్ బుక్ ఫెయిర్‌గా గుర్తింపు పొందింది. ఇది ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫెయిర్ మరియు లండన్ బుక్ ఫెయిర్ తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద వార్షిక పుస్తక ప్రదర్శనగా నిలుస్తుంది. ఈ పుస్తక ప్రదర్శనను 1976లో కోల్‌కతా పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్ గిల్డ్ మొదటిసారి ప్రారంభించారు.

కొత్త డ్రగ్స్ కంట్రోలర్‌ జనరల్‌గా రాజీవ్ సింగ్ రఘువంశీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కొత్త డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ పేరును సిఫార్సు చేసింది. 2019 నుండి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న డా వీజీ సోమాని స్థానంలో ఆయన బాధ్యతలు స్వికరించనున్నారు. డాక్టర్ రాజీవ్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఫార్మకోపోయియా కమీషన్ యొక్క సెక్రటరీ కమ్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనేది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సిఓ) కి నాయకత్వం వహిస్తుంది. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నియంత్రణ సంస్థ. ఇది దేశంలో విక్రయించే ఔషదాలు మరియు సౌందర్య సాధనాల నాణ్యతను నిర్దారిస్తుంది, కొత్త ఔషధాల ఆమోదం మరియు క్లినికల్ ట్రయల్స్‌ని నియంత్రిస్తుంది.

మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన పథకం ప్రారంభం

శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మధ్యప్రదేశ్ నిరుపేద మహిళల కోసం కొత్తగా లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 1000/- చెప్పున ఆర్థిక చేయూతను అందిస్తారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం 2007లో బాలిక శిశుహత్యలను అణిచివేసేందుకు లాడ్లీ లక్ష్మీ యోజన పేరుతొ అప్పటిలో ఇలాంటి పథకాన్నే ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో పుట్టిన ఆడ పిల్లలకు 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రూ. 1,43000 అందుకునేలా ఈ పథకం రూపొందించారు.

తెలంగాణలో తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ ప్రారంభం

తెలంగాణ మన ఊరు-మన బడి పథకం కింద తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. గంభీరావుపేటలోని ఈ కొత్త కేజీ టు పీజీ క్యాంపస్‌కు తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పటిష్టత కోసం తెలంగాణ ప్రభుత్వం 2022 మార్చి 8న వనపర్తిలోని జెడ్పీ హైస్కూల్ (బాలుర)లో మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,065 పాఠశాలను నూతన సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీని కోసం వచ్చే మూడేళ్ళలో 7200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇదే పథకం పరిధిలో కొత్తగా కేజీ టు పీజీ క్యాంపస్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలే కాకుండా కస్తూర్బాయి గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్ళు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలను కేజీ టు పీజీ క్యాంపస్లుగా రూపుదిద్దుతున్నారు.

సోలమన్ దీవుల్లో యూఎస్ రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం

పసిఫిక్‌లో దౌత్య సంబంధాలను పెంపొందించుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ 30 సంవత్సరాల తర్వాత సోలమన్ దీవులలో రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభించింది. 1993 లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక, సోలమన్ దీవుల రాజధాని హోనియారాలోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. సోలమన్ దీవులు సౌత్ పసిఫిక్‌లోని వందలాది ద్వీపాలతో కూడిన సమూహం. దీని రాజధాని నగరం హోనియారా. ప్రస్తుతం మనస్సే సోగావేర్ ఆ దేశ ప్రధానిగా ఉన్నారు. ఇది 7 జూలై 1978లో యూకే నుండి స్వాతంత్రం పొందింది. ఈ దీవులు 1942 నుండి 1943 మధ్య రెండో ప్రపంచ యుద్దంకు సంబంధించి ప్రధాన భూ, సముద్ర మరియు వాయు వేదికలుగా ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) అనేది యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ మరియు వాటి మిత్రదేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలాన్ని సూచించడానికి సాధారణంగా ఉపయోగించే పదం. ఇది 1985లో ప్రారంభమై 1991 వరకు కొనసాగింది. సోవియట్ యూనియన్ లేదా యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా పరస్పరం యుద్ధం ప్రకటించనందున దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అని పిలుస్తారు.

మహారాష్ట్ర రాష్ట్ర గీతంగా జై జై మహారాష్ట్ర మజా

ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 'జై జై మహారాష్ట్ర మాజా'ని ఆ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతాన్ని ప్రకటించింది. ఇక మీదట అన్ని అధికారిక కార్యక్రమాలు మరియు ఉత్సవ కార్యక్రమాలలో ఈ గీతం ప్లే చేయబడుతుంది. హిందూ ప్రజల స్వయం పాలనకు పునాది వేసిన పురాణ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జన్మదినమైన ఫిబ్రవరి 19న ఈ పాట రాష్ట్ర గీతంగా ఆమోదించబడుతుంది. ఈ గీతాన్ని రాజా బాదే రాశారు. శ్రీనివాస్ ఖలే సంగీతం సమకూర్చారు. బల్లధీరుడు కృష్ణారావు సాబ్లే పాడారు. ఈ గీతం 1.41 నిమిషాల నిడివి ఉంది.

ఈక్వటోరియల్ గినియా తొలి మహిళా పీఎంగా మాన్యులా రోకా బోటీని

ఈక్వటోరియల్ గినియా నూతన ప్రధానమంత్రిగా మాన్యులా రోకా బోటీని బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనితో ప్రధాని పదవిని చేపట్టిన ఆ దేశ తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. రోటీ 2020 నుండి ప్రస్తుత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ దేశ ప్రస్తుత పీఎం ఫ్రాన్సిస్కో పాస్కల్ ఒబామా అసూ స్థానంలో ఆమె త్వరలో నియమితులు కానున్నారు. ఈక్వటోరియల్ గినియా మధ్య ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న ఒక చిన్న దేశం. దీని రాజధాని నగరం మలాబో. 2021లో దీని జనాభా 1.5 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ దేశ ప్రస్తుత అధ్యక్షుడుగా టియోడోరో ఒబియాంగ్ మబాసోగో ఉన్నారు.

ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్‌ విజేతగా సాయి సంజయ్

ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ 2023, ఎంఆర్ఎఫ్ ఫార్ములా 2000 విభాగంలో సాయి సంజయ్ విజేతగా నిలిచాడు. 2022 లో పూర్తికావాల్సిన ఈ సీజన్ చివరి పోటీ మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగింది. అలానే ప్రతీక్ సోనవానే మరియు విశ్వాస్ విజయరాజ్ వరుసగా పోలో కప్ మరియు ఫార్ములా ఎల్జీబీ 1300 టైటిళ్లను గెలుచుకున్నారు.

లావోస్‌లో భారత తదుపరి రాయబారిగా ప్రశాంత్ అగర్వాల్

లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రశాంత్ అగర్వాల్ ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ నమీబియాలో భారత హైకమిషనరుగా ఉన్నారు. ప్రశాంత్ అగర్వాల్ 1998 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.

లడఖ్ యొక్క మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా యాయా త్సో

లడఖ్ యొక్క మొట్టమొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం (బిహెచ్‌ఎస్)గా యాయా త్సో ప్రతిపాదించబడింది. సముద్ర మట్టానికి 4,820 మీటర్ల ఎత్తులో ఉన్న లడఖ్‌లోని యాయా త్సో సరస్సు పక్షుల స్వర్గధామంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిపాదిత యాయా త్సో సైట్ సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, ఇందులో సరస్సు యొక్క పరీవాహక ప్రాంతం కూడా ఉంది. లడఖ్‌లోని అత్యంత అందమైన సరస్సులలో యాయా త్సో ఒకటి.

సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవంలో సింగపూర్ చీఫ్ జస్టిస్

సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి గౌరవ అతిథిగా ఫిబ్రవరి 4న, భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సుప్రీంకోర్టు వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఇదే తొలిసారి. 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించిన రెండు రోజుల తర్వాత జనవరి 28న సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. సిజెఐ డివై చంద్రచూడ్ ఆహ్వానం మేరకు సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవానికి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "ది రోల్ ఆఫ్ ది రోల్" "మారుతున్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర" అనే అంశంపై ఆయన ఉపన్యాసం ఇచ్చారు. సుందరేష్ మీనన్ 2012 నుండి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

36వ సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ప్రారంభం

వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 36వ సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు. భారతీయ హస్తకళలు, చేనేత మరియు జానపద సంప్రదాయాలను ప్రదర్శించే జాతర ఫిబ్రవరి 3 నుండి 19 వరకు నిర్వహిస్తారు. "సూరజ్‌కుండ్ డిజైనర్స్ విలేజ్" అని పిలువబడే ఈ వార్షిక వేడుకలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి సాంప్రదాయ కళాకారులు, చిత్రకారులు, చేనేత కార్మికులు మరియు శిల్పులు పాల్గొంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ ఫెయిర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం 1987 లో తొలిసారిగా ప్రారంభమైంది.

న్యూ ఇండియా అస్యూరెన్స్ నుండి 'పే యాజ్ యు డ్రైవ్' పాలసీ

న్యూ ఇండియా అస్యూరెన్స్ (NIA) 'పే యాజ్ యు డ్రైవ్' (PAYD) అనే నూతన పాలసీని ప్రారంభించింది. ఈ నూతన పాలసీ వాహన వినియోగం ఆధారంగా ప్రీమియం వసూలు చేసే సమగ్ర మోటార్ బీమా పాలసీని ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో రెండు భాగాలు ఉన్నాయి, ఇది థర్డ్-పార్టీ కవర్ మరియు సొంత-డ్యామేజ్ కవర్ సౌలభ్యన్ని అందిస్తుంది. ఈ పాలసీ ద్వారా నిర్దిష్ట కిలోమీటర్లకు మించి నడపని వాహన వినియోగదారులు, పునరుద్ధరణ ప్రీమియంపై డబ్బును ఆదా చేయవచ్చు. ఇది వినియోగించని వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం బెడదను తగ్గిస్తుంది. వాహనం కిలోమీటర్ థ్రెషోల్డ్ పరిమితికి మించి నడిపినట్లయితే, పాలసీ యొక్క మిగిలిన వ్యవధి వరకు ఈ కవరేజ్ కొనసాగుతుంది. ఈ పాలసీ ద్వారా అదనంగా నిల్ తరుగుదల, ఇంజిన్ రక్షణ, ఇన్‌వాయిస్‌కు రిటర్న్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి మొదలైన యాడ్-ఆన్స్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ అనేది ముంబై కేంద్రంగా ఉన్న భారతీయ ప్రభుత్వ రంగ జనరల్ బీమా కంపెనీ. ఇది విదేశీ కార్యకలాపాలతో సహా స్థూల ప్రీమియం సేకరణ ఆధారంగా భారతదేశంలో అతిపెద్ద జాతీయం చేయబడిన బీమా కంపెనీగా ఉంది. ఇది 1919లో సర్ దొరాబ్జీ టాటాచే స్థాపించబడింది. 1973లో జాతీయం చేయబడింది.

కర్ణటకలో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీ ప్రారంభం

కర్ణాటకలోని తుమకూరులో నిర్మించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క హెలికాప్టర్ ఫ్యాక్టరీని ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్త దిశగా 2016లో దీనికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఇది ఆసియాలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా మారింది. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రంలో మొదట లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను (LUH) ఉత్పత్తి చేయనున్నారు. ఎల్‌యూహెచ్ హెలికాప్టర్లు అనేవి స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన 3-టన్నుల సింగిల్-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ కాప్టర్లు. వీటిని సైనిక లాజిస్టిక్ కాఫ్టర్లుగా ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) మరియు ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (IMRH) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో పాటు తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద దాదాపు 8,484 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. అలానే తుమకూరులోని తిప్టూరు, చిక్కనాయకనహళ్లిలో రెండు జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు.

గ్రామీ అవార్డు 2023 విజేతలు

65వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఫిబ్రవరి 5, 2023న యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్ ఏంజిల్స్‌లో హాట్టహాసంగా నిర్వహించారు. అరేనాలో జరిగిన ఈ వార్షిక సంగీత అవార్డుల వేడుకలో అత్యుత్తమ రికార్డింగ్‌లు, కంపోజిషన్‌లు మరియు కళాకారులకు అవార్డులు అందిస్తారు. భారతీయ సంగీత స్వరకర్త మరియు నిర్మాత రికీ కేజ్‌ తన కెరీరులో మూడవ గ్రామీ అవార్డు అందుకున్నారు. దీనితో మూడుసార్లు గ్రామీని గెలుచుకున్న ఏకైక సజీవ భారతీయుడుగా నిలిచాడు. రికీ 2015లో తన మొదటి గామీ గెలుచుకున్నాడు. ఇండియా నుండి గ్రామీ అవార్డులు అందుకున్న నలుగురు స్వరకర్తలలో రికీ మోస్ట్ యాంగేస్ట్.

రికార్డ్ ఆఫ్ ది ఇయర్ : అబౌట్ డామ్న్ టైమ్ (మెలిస్సా వివియన్ జెఫెర్సన్ (లిజ్జో) )

ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : హ్యారీస్ హౌస్ (హ్యారీ స్టైల్స్)

సాంగ్ ఆఫ్ ది ఇయర్ : జస్ట్ లైక్ దట్ (బోనీ రైట్)

బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : సమారా జాయ్ మెక్‌లెండన్

బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్ : ఈజీ ఆన్ మి (అడెలె)

బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్‌ - డివైన్ టైడ్స్ (రికీ కేజ్)

మహీంద్రా ఫైనాన్స్‌కి ఎండి మరియు సిఇఒగా రౌల్ రెబెల్లో

మహీంద్రా & మహీంద్రా గ్రూప్ యొక్క వెహికల్ ఫైనాన్సింగ్ యూనిట్ అయిన మహీంద్రా ఫైనాన్స్ ఎండి మరియు సిఇఒగా రౌల్ రెబెల్లో నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ రమేష్ అయ్యర్ ఏప్రిల్ 29న పదవీ విరమణ చేసిన వెంటనే ఆయన ఈ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. రౌల్ రెబెల్లో ప్రస్తుతం ఇదే కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.


గర్వి గుజరాత్ పర్యటన కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

గుజరాత్ రాష్ట్ర సాంస్కృతిక & ఆధ్యాత్మిక వారసత్వాన్ని సందర్శించేందుకు భారతీయ రైల్వే గర్వి గుజరాత్‌ టూర్ పేరుతొ కొత్త తీర్థ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, చంపానేర్, సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బేట్ ద్వారక, అహ్మదాబాద్, మోధేరా మరియు పటాన్ వంటి గుజరాత్‌లోని ప్రముఖ తీర్థయాత్ర మరియు వారసత్వ ప్రదేశాలను కవర్ చేస్తున్నారు. భారతీయ రైల్వేలు 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పథకం కింద భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడుపుతున్నాయి. ఈ అత్యాధునికమైన భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లు ద్వారా దేశంలోని ప్రముఖ సందర్శన ప్రదేశాలకు తీర్ధయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ రైళ్లలలో ఫస్ట్ క్లాస్ ఏసీ మరియు సెకండ్ క్లాస్ ఏసీతో పాటు, ప్యాంట్రీ కార్, రెండు రైల్ రెస్టారెంట్లు ఉంటాయి. ఇందులో 156 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. ఈ యాత్రలు వారం నుండి 10 రోజుల నిడివితో నిర్వహిస్తున్నారు.

లక్నోలో 6వ షాంఘై సహకార సంస్థ నాయకుల సమావేశం

ఫిబ్రవరి 6 న లక్నోలో ప్రారంభమైన 6వ షాంఘై సహకార సంస్థ (SCO) సుప్రీం ఆడిట్ ఇన్‌స్టిట్యూషన్స్ (SAI) నాయకుల సమావేశానికి కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) హోస్టుగా వ్యవహరించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశాలలో ఎనిమిది షాంఘై సహకార సంస్థ సభ్య దేశ ప్రతినిధి బృందాలు పాల్గున్నాయి. షాంఘై సహకార సంస్థ అనేది 1996 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా మరియు తజికిస్తాన్ మధ్య ఏర్పడిన యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత మరియు రక్షణ సంస్థ. ప్రస్తుతం దీనిలో ఇండియా, పాకిస్థాన్, ఉజ్బెకిస్తాన్ కలుపుకుని మొత్తం ఎనిమిది దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్ మరియు మంగోలియాలు త్వరలో సభ్య దేశాలుగా మారనున్నాయి. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ద్వారా స్థాపించబడిన భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. దీనిని 1858లో స్థాపించారు. కాగ్ యూనియన్ మరియు రాష్ట్రంలోని అన్ని ట్రేడింగ్, తయారీ, లాభం మరియు నష్టాల ఖాతాలు మరియు బ్యాలెన్స్ షీట్లు మరియు ఇతర అనుబంధ ఖాతాలను ఆడిట్ చేస్తుంది.

ముంబైలో కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభం

కాలా ఘోడా అసోసియేషన్ యొక్క కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ 2023 ముంబైలో ప్రారంభమైంది. ఈ వారీక్ష ఉత్సవం 1999 నుండి ఏటా నిర్వహిస్తున్నారు. ఇది ఏటా ఫిబ్రవరి మొదటి శనివారం ప్రారంభమయి ఫిబ్రవరి రెండవ ఆదివారం నాడు ముగుస్తుంది. ఇది ఆసియాలో అతిపెద్ద బహుళ సాంస్కృతిక వీధి కళా ఉత్సవాల్లో ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులు హాజరవుతారు.

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరామ్ కన్నుమూశారు

ప్రముఖ దక్షిణ భారత నేపథ్య గాయని వాణీ జయరామ్ చెన్నైలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న జన్మించిన ఈమె వెయ్యికి పైగా భారతీయ సినిమాలకు ప్లేబ్యాక్ గాయనిగా పనిచేశారు, 10 వేలకు పైగా పాటలను రికార్డ్ చేశారు. వాణీ జయరామ్‌కు భారత ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. వాణీ జయరామ్ తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ, ఒడియా, గుజరాతీ, హర్యాన్వి, అస్సామీ, తుళు మరియు బెంగాలీ భాషలలో ఆలపించారు. ఈమె మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. అలానే ఫిల్మ్‌ఫేర్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిసా మరియు గుజరాత్ రాష్ట్రాల నుండి రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మరియు ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో ఫిబ్రవరి 5 న మరణించారు. 1999లో తిరుగుబాటుతో పాకిస్తాన్ అధికారాన్ని చేజిక్కించుకున్న ముషారఫ్, 2001 మరియు 2008 మధ్య ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. 2008లో జరిగిన ఆ దేశ మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికలలో ముషారఫ్ పార్టీ ఓడిపోయింది. పార్లమెంటులో అభిశంసన ఎదుర్కొన్న ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి లండన్‌కు పారిపోయారు. 2013లో తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లి పార్లమెంటులో స్థానం కోసం పోటీ చేసినా వెంటనే అనర్హత వేటు వేయబడింది. ముషారఫ్ 2016లో దుబాయ్ వెళ్లేందుకు అనుమతి పొందారు. 2007లో ఎమర్జెన్సీ రూల్ విధించినందుకు గాను ఆ దేశ సుప్రీం కోర్టు 2019లో అతనికి మరణశిక్ష విధించింది, అయితే ఆ తీర్పు తర్వాత రద్దు చేయబడింది.

యూపీలో గ్లోబల్ జాయింట్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో తొలి వీఎఫ్‌ఎస్ గ్లోబల్ జాయింట్ వీసా అప్లికేషన్ సెంటర్ ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, క్రొయేషియా, ఇటలీ, సౌదీ అరేబియా, హంగేరీ, జర్మనీ సహా పలు దేశాల వీసా దరఖాస్తులను స్వీకరించనున్నరు. ఈ వీసా దరఖాస్తు కేంద్రం సంవత్సరానికి 1.20 లక్షల వీసా దరఖాస్తులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

యువ సంగం రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఈశాన్య ప్రాంత యువతతో మిగిలిన భారతదేశంలోని యువత మధ్య సన్నిహిత సంబంధాలను ఏర్పరచడానికి ప్రభుత్వం “యువ సంగం” రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 20 వేలకు పైగా యువతకు క్రాస్ కల్చరల్ లెర్నింగ్ పేరిట దేశ వ్యాప్తంగా పర్యటించే అవకాశం కల్పిస్తారు. ఈ పోర్టల్ విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మరియు క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం భారతదేశాన్ని చూడడానికి, తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి మరియు దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుందని వీరు భావిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆరోన్ ఫించ్

ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆరోన్ ఫించ్ టీ20ఐ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు రికార్డు స్థాయిలో 76 మ్యాచ్‌లలో నాయకత్వం వహించాడు. ఫించ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా 2021 మొదటిసారి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వన్డే ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన ఫించ్, అరంగేట్రం చేసిన 12 ఏళ్ల తర్వాత అన్ని అంతర్జాతీయ క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా మాంటీ దేశాయ్‌

నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్‌ను నియమించింది. గత డిసెంబర్ 2022లో ఈ పదవికి రాజీనామా చేసిన మరో భారత మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ స్థానంలో మాంటీ దేశాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశాయ్ గతంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు, ఐపీఎల్ యందు రాజస్థాన్ రాయల్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

టర్కీ మరియు సిరియాలో ఘోరమైన భూకంపం

6 ఫిబ్రవరి 2023న దక్షిణ టర్కీ మరియు సిరియాలో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కొన్ని గంటల వ్యవధిలో రిక్టర్ స్కేల్‌పై 7.8 మరియు 7.5 తీవ్రతతో టర్కీ మరియు సిరియాలను కదిలించింది. టర్కీలో 1939లో వచ్చిన భూకంపం తర్వాత ఇదే అతిపెద్దది. ఈ భూకంపం కారణంగా లక్షల మంది నిరాశ్రయులు అవ్వడమే కాకుండా అనధికారిక గణాంకాల మేరకు 50 వేలకు పైగా మృత్యవాత పడినట్లు సమాచారం. 105 దేశాలు మరియు 16 అంతర్జాతీయ సంస్థలు భూకంప బాధితులకు మానవతా సహాయాన్ని అందించాయి. భూకంపం అనేది భూమి యొక్క లిథోస్పియర్‌లో అకస్మాత్తుగా శక్తి విడుదలయ్యి భూకంప తరంగాలను సృష్టిస్తుంది. దీని వల్ల భూమి యొక్క ఉపరితలం వణుకుతుంది. భూకంపాలు సాధారణంగా భూగర్భ శిల అకస్మాత్తుగా విరిగిపోయినప్పుడు లేదా వేగవంతమైన చలనం ఏర్పడినప్పుడు సంభవిస్తాయి. 80 శాతానికి పైగా పెద్ద భూకంపాలు పసిఫిక్ మహాసముద్రం అంచుల చుట్టూ సంభవిస్తాయి , ఈ ప్రాంతాన్ని 'రింగ్ ఆఫ్ ఫైర్' అని పిలుస్తారు. భూకంపాల తీవ్రతను కొలవడానికి శాస్త్రవేత్తలు రిక్టర్ స్కేల్‌ను ఉపయోగిస్తారు. దీనిని మాగ్నిట్యూడ్ స్కేల్ లేదా గుటెన్‌బర్గ్-రిక్టర్ స్కేల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1934 లో చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ అభివృద్ధి చేశాడు. రిక్టర్ స్కేల్ అనేది 1-10 లాగరిథమిక్ స్కేల్. రిక్టర్ స్కేల్ యందు ప్రతి పాయింట్ పెరుగుదల, భూమి వణుకుతున్న పరిమాణంను 10 రెట్లు సూచిస్తుంది మరియు విడుదలైన శక్తి మొత్తం 32 రెట్లుకు పెరుగుతుంది.

భారతీయ రైల్వేలో వాట్సాప్ ఫుడ్ డెలివరీ సదుపాయం

భారతీయ రైల్వే వాట్సాప్ ఫుడ్ డెలివరీ ఫెసిలిటీ 'జూప్ (Zoop)'ను ప్రారంభించింది. దీని ద్వారా భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. ప్రయాణికులు తమ పీఎన్ఆర్ నెంబర్ సహాయంతో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆర్డర్ చేసిన ఆహారాన్ని దగ్గరలో ఉండే రైల్వే రెస్టారెంటుల నుండి డెలివరీ చేస్తారు.

ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశంకు మొదటి స్థానం

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కార్పొరేట్ స్టాటిస్టిక్స్ డేటాబేస్ (FAOSTAT) డేటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారునిగా నిలిచింది.
2021-22 ఏడాదికి సంబంధించిన ఈ నివేదికలో గ్లోబల్ పాల ఉత్పత్తికలో భారత దేశం 24 శాతం వాటాతో అగ్రస్థానం దక్కించుకుంది.
ఇకపోతే భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉండగా. తర్వాత స్థానాలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

విదేశాల్లో ఫోన్‌పే పేమెంట్ సేవలు ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపు సంస్థ ఫోన్‌పే ఇంటర్నేషనల్ యూపీఐ చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఫోన్‌పే వినియోగదారులు ఇప్పుడు తమ భారతీయ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి యుఎఇ, సింగపూర్, మారిషస్, నేపాల్ మరియు భూటాన్‌లోని వ్యాపారి అవుట్‌లెట్‌లలో చెల్లించవచ్చని నివేదించింది.
దీనితో క్రాస్-బోర్డర్ యూపీఐ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా ఫోన్‌పే నిలిచింది.

గోల్డెన్ బుక్ అవార్డులు 2023 విజేతలు

వింగ్స్ పబ్లికేషన్ గోల్డెన్ బుక్ అవార్డ్ 2023 విజేతలను ప్రకటించింది. ఈ అవార్డును ఏడాదిలో ప్రచురించబడిన అత్యుత్తమ రచనలకు అందిస్తారు. భారతదేశంలోని ప్రముఖ స్వతంత్ర ప్రచురణకర్త అయిన వింగ్స్ పబ్లికేషన్ ఇంటర్నేషనల్ ఈ అవార్డులను నిర్వహిస్తుంది.

డాక్టర్ కైలాష్ పింజాని (ప్రెసిడెంట్ ఇండియన్ ఆథర్స్ అసోసియేషన్), డాక్టర్ దీపక్ పర్బత్ (సూపర్ ఫాస్ట్ రచయిత వ్యవస్థాపకుడు) & మురళీ సుందరం (TLC వ్యవస్థాపకుడు) వంటి సాహిత్య నిపుణుల బృందం ఈ అవార్డ విజేతలను ఎంపిక చేసింది. గోల్డెన్ బుక్ అవార్డులు 2023 విజేతల పూర్తి జాబితా


ముంబైలో అరబిక్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబైలోని మరోల్‌లో దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన ప్రధాన విద్యా సంస్థ అల్జామియా-తుస్-సైఫియా అరబిక్ అకాడమీ (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దావూదీ బోహ్రా కమ్యూనిటీ అధినేత సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ కూడా పాల్గొన్నారు.

దావూదీ బోహ్రాలు షియా ఇస్లాం యొక్క ఇస్మాలీ శాఖలోని ఒక మతపరమైన తెగ. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో స్థిరపడ్డారు. వీరిలో అత్యధిక మంది భారతదేశం, పాకిస్తాన్, యెమెన్, తూర్పు ఆఫ్రికా దేశాల్లో నివసిస్తున్నారు.


వీపీ నందకుమార్‌కు హురున్ ఇండియా అవార్డు

మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సీఈఓ వీపీ నందకుమార్‌కు ది హురున్ ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డ్ 2022 లభించింది.
ముంబయిలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో హురున్ ఇండియా అధికారుల నుండి శ్రీ నందకుమార్ ది హురున్ ఇండస్ట్రీ అచీవ్‌మెంట్ అవార్డ్ 2022ని అందుకున్నారు.
మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ వ్యాపార ప్రపంచంలో నందకుమార్ సాధించిన విజయాలకు గాను ఈ అవార్డు లభించింది.

→విశ్వభారతికి త్వరలో లివింగ్ హెరిటేజ్‌ యూనివర్సిటీగా గుర్తింపు

→కోల్‌కతాలోని విశ్వభారతి విశ్వవిద్యాలయం త్వరలో ప్రపంచంలోని మొట్టమొదటి 'జీవన వారసత్వ విశ్వవిద్యాలయం'గా చరిత్ర సృష్టించనుంది.
→భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో ఈ విశ్వవిద్యాలయం పాత్రను గుర్తించిన యునెస్కో, ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో ఈ హెరిటేజ్‌ యూనివర్సిటీ గౌరవాన్ని ప్రకటించనుంది.
→విశ్వభారతి విశ్వవిద్యాలయం 1921లో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చేత స్థాపించబడింది.
→విశ్వభారతి 1951లో పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించబడింది.
→దేశంలో ప్రధానిమంత్రి వైస్-ఛాన్సలర్‌గా ఉండే ఏకైక యూనివర్సిటీ ఇదే.

'సేవ్ వెట్‌ల్యాండ్స్ క్యాంపెయిన్' ప్రారంభించిన భూపేందర్ యాదవ్

→కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 4 న 'సేవ్ వెట్‌ల్యాండ్స్ క్యాంపెయిన్'ని ప్రారంభించారు.
→చిత్తడి నేలల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
→దీని ద్వారా పర్యావరణ, ఆర్థిక మరియు వాతావరణ భద్రతను భద్రపరచడంలో చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థ పోషించే కీలక పాత్రపై అవగాహన కల్పిస్తారు.
→ఇదే వేదిక ద్వారా 'ఇండియాస్ 75 అమృత్ ధరోహర్- ఇండియాస్ రామ్‌సర్ సైట్స్ ఫ్యాక్ట్‌బుక్' మరియు 'మేజింగ్ క్లైమేట్ రిస్క్‌ ఇన్ వెట్‌ల్యాండ్స్ - ఎ ప్రాక్టీషనర్స్ గైడ్' అనే రెండు పుస్తకాలను విడుదల చేశారు.
→భారతదేశంలో ప్రస్తుతం 75 రామ్‌సర్ సైట్‌లు ఉన్నాయి. ఒరిస్సాలోని చిలికా సరస్సు మరియు రాజస్థాన్‌లోని కియోలాడియో నేషనల్ పార్క్ భారతదేశంలోని మొదటి రామ్‌సర్ సైట్‌లుగా గుర్తించబడ్డాయి.
→భారతదేశంలోని అతిపెద్ద చిత్తడి నేల సుందర్‌బన్స్. ఇరాన్‌లోని రామ్‌సర్ కన్వెన్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నెలలకు రామ్‌సర్ సైట్‌ గుర్తింపు కల్పిస్తుంది.

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 12 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్‌లను నియమించారు. ఇందులో ఏడు రాష్ట్రలకు ఇతర రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయగా మిగతా రాష్ట్రలకు నూతన గవర్నర్లను నియమించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీకాగా, ఆయన స్థానంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు.

మహారాష్ట్ర గవర్నర్‌ కోష్యారీ స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ నియమితులయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆయన స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రాను నియమించారు.

భారత రాష్ట్రల గవర్నర్లు స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ యొక్క విధులను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర గవర్నర్‌ను ఐదు సంవత్సరాల కాలానికి రాష్ట్రపతి నియమిస్తారు. కనీసం 35 ఏళ్లు నిండిన భారత పౌరులు మాత్రమే ఈ పదివికి అర్హులు. గవర్నర్‌ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం ప్రమాణస్వీకారం చేస్తారు.


25 అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ (ATF) జాతికి అంకితం

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ 25 అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ సెంటర్లను ఫిబ్రవరి 9న జాతికి అంకితం చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన ఈ ఏటీఎఫ్‌ కేంద్రాల ద్వారా సమాజంలోని మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో పాటుగా డ్రగ్స్‌ రహిత దేశంగా మార్చేందుకు పని చేయనున్నారు.

యువత, పిల్లలు మరియు సమాజంలో డ్రగ్స్ దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం ఆగస్టు 2020లో నషా ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగం ఎక్కువగా ఉన్న 372 సున్నితమైన జిల్లాలను గుర్తించారు. ఇప్పటివరకు, తొమ్మిది కోట్ల 40 లక్షల మందికి పైగా ప్రజలు మరియు వేలాది విద్యా సంస్థలు ఈ దేశవ్యాప్త ప్రచారంలో భాగమయ్యాయి.


మిషన్ అంత్యోదయ సర్వే 2022-23 ప్రారంభం

కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, మిషన్ అంత్యోదయ సర్వే (MAS) 2022-23 దాని పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్‌ను ఫిబ్రవరి 8న ఢిల్లీలో ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖ 2017-18 నుండి దేశంలోని అన్ని గ్రామ పంచాయితీలలో మిషన్ అంత్యోదయ సర్వేను నిర్వహిస్తోంది. ఇది గ్రామీణ పరిపాలనను మెరుగుపర్చేందుకు సంబంధించిన కార్యక్రమం.

ఈ కార్యక్రమం ద్వారా బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో వార్షిక పంచాయతీ మౌలిక సదుపాయాలు, పంచాయతీ సేవలు, గ్రామ మౌలిక సదుపాయాలు, గ్రామ సేవలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి మొదలగు అంశాల ప్రాథమిక డాటాను సేకరిస్తారు.


మయన్మార్, రష్యా మధ్య అణుశక్తి అభివృద్ధిపై ఒప్పందం

రష్యా మరియు మయన్మార్ ప్రభుత్వాలు శాంతియుత అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే రంగంలో సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. 2015లో మయన్మార్ మరియు రష్యా యొక్క అణు విద్యుత్ సంస్థ రోసాటమ్ మధ్య జరిగిన ప్రాథమిక ఒప్పందంకు కొనసాగింపుగా ఇది ఉండనుంది. మయన్మార్‌లోని యాంగాన్‌లోని న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఈ ఒప్పందంపై సంతకం చేయబడింది.

మయన్మార్ (గతంలో బర్మా) భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్ మరియు థాయ్‌లాండ్‌ల సరిహద్దులతో ఉన్న ఆగ్నేయాసియా దేశం. దీని రాజధాని నగరం నైపిడావ్. ఈ దేశం 1948లో స్వాతంత్ర్యం పొందింది . 1962లో తిరుగుబాటు తరువాత, బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ క్రింద సైనిక నియంతృత్వంగా మారింది.

2020 మయన్మార్ సార్వత్రిక ఎన్నికల తరువాత ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఉభయ సభలలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. అయితే 2021లో ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించిన బర్మీస్ మిలిటరీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఈ దేశ తాత్కాలిక అధ్యక్షుడుగా మైంట్ స్వే ఉన్నారు. మయన్మార్ మిలటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

గతంలో మయన్మార్ ఇండియాలో భాగంగా ఉండేది. బర్మా జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు బ్రిటీష్ ప్రభుత్వం 1937లో బర్మాను భారతదేశం నుండి విభజించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యు ఆంగ్ సాన్ నాయకత్వంలో, ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. బర్మా జనవరి 4, 1948న స్వాతంత్ర్యం పొందింది.


సల్మాన్ రష్దీ కొత్త నవల 'విక్టరీ సిటీ' విడుదల

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తన కొత్త నవల “విక్టరీ సిటీ”ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ద్వారా ప్రచురించాడు. ఇది 14వ శతాబ్దానికి చెందిన ఒక మహిళా కథ, ఒక నగరాన్ని పాలించడానికి పితృస్వామ్య ప్రపంచాన్ని ధిక్కరించిన ఒక స్త్రీ పురాణ కథ. గత ఆగస్టులో న్యూయార్క్‌లోని చౌటుప్పల్ ఇన్‌స్టిట్యూషన్‌ వేదికపై కత్తిపోటుకు గురైన తర్వాత సల్మాన్ రష్దీ ఒక కంటి చూపును మరియు అతని చేతిని ఉపయోగించగల సామర్థ్యాన్ని కోల్పోయాడు.

సల్మాన్ రష్దీ భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత, వ్యాసకర్త. 1981లో ఈయన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ బుకర్ ప్రైజు గెలవడంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులయ్యారు. ఈయన రచనా శైలి భారత ఉపఖండము నేపథ్యంలో చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజంగా ఉంటుంది.


'డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్' ప్రారంభించిన మంత్రి అశ్విని వైష్ణవ్

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వేల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 'డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్' అనే సమగ్ర ప్రచారాన్ని ఫిబ్రవరి 9న ప్రారంభించారు. జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (DEWG) ఈవెంట్‌లో భాగంగా దేశంలో, ముఖ్యంగా లక్నో, పూణే, హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో 2023 ఫిబ్రవరి 9 నుండి అక్టోబర్ 9 మధ్య వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్బంగా భారతదేశం వెలుపల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరిధిని విస్తరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి వెల్లడించారు. యూపీఐని గ్లోబల్ పేమెంట్ పద్ధతిగా మార్చడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, యూకే మరియు అమెరికా వంటి 10 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.


కెనరా బ్యాంకు కొత్త ఎండీ & సీఈఓగా కె సత్యనారాయణ రాజు

బెంగుళూరు కేంద్రంగా ఉన్న కెనరా బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా కె సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. మాజీ సీఈఓ శ్రీ ఎల్‌వి ప్రభాకర్ గత 31 డిసెంబర్ 2022న రాజీనామా చేసిన తర్వాత ఈ స్థానం ఖాళీగా ఉన్నది. సత్యనారాయణ రాజు 7 ఫిబ్రవరి 2023 నుండి ఈ కొత్త బాధ్యతలు స్వీకరించారు.

కెనరా బ్యాంక్ అనేది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణ మరియు యాజమాన్యంలోని భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది 1906లో మంగళూరులో అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ చేత స్థాపించబడింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు లండన్, దుబాయ్ మరియు న్యూయార్క్‌లలో కూడా కార్యాలయాలు ఉన్నాయి.


జర్నలిస్టు ఎబికె ప్రసాద్‌కు రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు

ప్రముఖ తెలుగు జర్నలిస్టు ఎబికె ప్రసాద్‌ను జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా పేరుగాంచిన అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ గత 75 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో సేవలు అందిస్తున్నారు.

ఎబికె ప్రసాద్‌ గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్రవంతి పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2009 మధ్య రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈ అవార్డును ఫిబ్రవరి 28, 2023న న్యూ ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని డిప్యూటీ స్పీకర్ హాల్‌లో ప్రదానం చేస్తారు.

భారతీయ జర్నలిజానికి రాజా రామ్ మోహన్ రాయ్‌ని మార్గదర్శకుడుగా భావిస్తారు. దేశ ప్రజలలో సామాజిక-సాంస్కృతిక మరియు రాజకీయ అవగాహన కల్పించేందుకు బెంగాలీ (సంబాద్ కౌముది), పర్షియన్ (మిరాత్-ఉల్-అక్బర్) మరియు హిందీ వంటి ప్రధాన భాషలలో జర్నల్స్‌ను తీసుకువచ్చాడు. 1828లో ఈయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఇది భారతదేశపు మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.


ప్రపంచంలోని టాప్ 5 అక్రిడిటేషన్ సిస్టమ్స్‌లో భారతదేశం

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI ) కింద భారతదేశ జాతీయ అక్రిడిటేషన్ సిస్టమ్ ఇటీవలి ప్రచురించిన గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) యందు 5వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ప్రపంచంలోని 184 ఆర్థిక వ్యవస్థలకు నాణ్యమైన మౌలిక సదుపాయాల ఆధారంగా ర్యాంక్ ఇస్తుంది.

అయితే భారతదేశం యొక్క మొత్తం QI సిస్టమ్ ర్యాంకిగులో 10 వ స్థానంలో ఉండగా, స్టాండర్డైజేషన్ సిస్టమ్ (BIS కింద) 9 వ స్థానంలో మరియు మెట్రాలజీ సిస్టమ్ (NPL-CSIR కింద) ప్రపంచంలో 21 వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక 2021 డేటా ఆధారంగా రూపొందనించారు. అక్రిడిటేషన్ బాడీలు ఐఎస్ఓ/ఐఈసీ వంటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ బాడీల యొక్క యోగ్యత మరియు నిష్పాక్షికతను ధృవీకరిస్తాయి.

భారతదేశంలో గుర్తింపు పొందిన ఉన్నత విద్య అక్రిడిటేషన్ సంస్థలు


ముంబైలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2023 ప్రారంభం

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2023ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రారంభించారు. ఈ మహోత్సవ్‌ను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఫిబ్రవరి 11 నుండి 19 వరకు జరిగే ఈ మహోత్సవంను జాతీయ ఐక్యత మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి నిర్వహిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రారంభం

గురుగ్రామ్‌కు చెందిన డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన స్కై ఎయిర్, భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. స్కై యూటీఎం పేరుతొ అందుబాటుకి తీసుకొచ్చిన ఈ సాంకేతికత డ్రోన్‌లకు సిట్యువేషనల్ అవేర్‌నెస్, అటానమస్ నావిగేషన్, రిస్క్ అసెస్‌మెంట్ మరియు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అందించడానికి నిర్మించబడింది.

భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ప్రారంభించబడిన ఈ సాఫ్ట్‌వేరును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్-ఆధారిత ఎయిర్‌మ్యాప్ మరియు నెదర్లాండ్స్-ఆధారిత ఎయిర్‌బస్ వంటి అనేక కంపెనీలు ఇటువంటి పరిష్కారాలను అందిస్తున్నాయి. మన దేశంలో ఇదే మొదటిది.


క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులకు సపోర్ట్ చేసే భారతదేశపు మొట్టమొదటి యాప్‌గా మోబిక్విక్

భారతదేశపు ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ మోబిక్విక్, క్రెడిట్ కార్డ్‌ యూపీఐ చెల్లింపులకు సపోర్ట్ చేసే భారతదేశపు మొట్టమొదటి యాప్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ సేవలు రూపే క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. రూపే క్రెడిట్ కార్డ్‌ కలిగిన మోబిక్విక్ వియోగదారులు ఇక మీదట యూపీఐ క్యూఆర్ కోడ్‌ ఆధారిత పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చు.


ఎంఆర్ఎఫ్ చైర్మన్ కేఎం మమ్మెన్‌కి ఆత్మ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ఎంఆర్ఎఫ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కేఎం మమ్మెన్‌ను ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ATMA) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన ఆత్మ వార్షిక కాన్‌క్లేవ్ 2023లో మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో హిసాచి టేకుచి అందజేశారు. మమ్మెన్‌ యొక్క విలక్షణమైన మరియు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు, సహకారంకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసింది.


జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల భారీ లిథియం నిక్షేపాలు

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల భారీ లిథియం నిక్షేపాలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) ప్రకటించింది. లిథియం నిక్షేపాలను ఇండియాలో కనుగొనబడటం ఇదే మొదటిసారి. మెరిసే బూడిదరంగులో కనిపించే లిథియం లోహాన్ని 'వైట్ గోల్డ్' అని కూడా పిలుస్తారు. 8 మిలియన్ టన్నులతో, చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది.

దాదాపు 26 సంవత్సరాల క్రితం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్‌లోని ఇదే ప్రాంతంలో లిథియం ఉనికి గురించి వివరణాత్మక నివేదికను సమర్పించింది. ప్రస్తుతం దానిని అధికారికంగా ప్రకటించింది. లిథియం ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో ప్రధాన మూలకంగా ఉపయోగపడుతుంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్‌టాప్‌లు మరియు సెల్ ఫోన్‌ల బ్యాటరీలలో తయారీ రంగంలో భారత్ ముందుడుగు వేయనుంది.


దక్షిణాఫ్రికాలో ఐసిసి టి-20 మహిళల ప్రపంచకప్ ప్రారంభం

దక్షిణాఫ్రికాలో ఐసిసి టి-20 మహిళల ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ ఫిబ్రవరి 10న ప్రారంభం అయ్యింది. ఇది ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 10 నుండి 26 ఫిబ్రవరి 2023 వరకు నిర్వహించబడుతోంది. దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారతదేశం, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్ మరియు ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్లు పోటీ పడుతున్నాయి.


నాసా చీఫ్‌ ఆస్ట్రోనాట్‌గా జోసెఫ్ అకాబా

హ్యూస్టన్‌లోని నాసా యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని ఆస్ట్రోనాట్ కార్యాలయానికి వెటరన్ వ్యోమగామి జోసెఫ్ అకాబా చీఫ్‌గా నియమితులయ్యారు. దీనితో నాసా కార్యాలయానికి నాయకత్వం వహిస్తున్న మొట్టమొదటి హిస్పానిక్ వారసత్వ వ్యక్తిగా అకాబా అవతరించారు.

మూడు అంతరిక్ష ప్రయాణాలలో అనుభవజ్ఞుడైన అకాబా కాలిఫోర్నియాలోని ఇంగ్ల్‌వుడ్‌లో జన్మించాడు. అతను శాంటా బార్బరాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భూగర్భ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, అరిజోనా విశ్వవిద్యాలయం నుండి భూగర్భ శాస్త్రంలో ఒక మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.

అకాబా 306 రోజులు అంతరిక్షంలో గడిపారు, స్పేస్ షటిల్ డిస్కవరీ యొక్క STS-119 మిషన్‌లో మిషన్ స్పెషలిస్ట్‌గా మరియు 2012లో ఎక్స్‌పెడిషన్స్ 31 మరియు 32 కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా, అలాగే 2017-2018లో ఎక్స్‌పెడిషన్స్ 53 మరియు 54లో కూడా ఉన్నారు. ఆ సమయంలో, అతను మూడు స్పేస్‌వాక్‌లను నిర్మించడంలో మరియు స్పేస్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో పాల్గొన్నాడు.


టర్కీ, సిరియాల భూకంప సహాయార్థం ఆపరేషన్ దోస్త్

భూకంపంతో స్వర్వం కోల్పోయిన టర్కీ మరియు సిరియా దేశాలకు సహాయం చేయడానికి భారత్ 'ఆపరేషన్ దోస్త్' పేరుతొ శోధన మరియు రెస్క్యూ బృందాలను పంపింది. బాధితులకు సహాయం అందించేందుకు 23 టన్నులకు పైగా సహాయ సామగ్రిని కూడా తరలించింది.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గరుడ ఏరోస్పేస్ యొక్క ద్రోణి డ్రోన్‌లను, మందులు, ఆహారం మరియు సామాగ్రిని మోసుకెళ్ళినందుకు కిసాన్ డ్రోన్‌లను కూడా తీసుకెళ్లింది. 7 ఫిబ్రవరి 2023న, భారత వైమానిక దళం మరో రెండు C-17 విమానాలను టర్కీకి పంపింది. ఈ రెండు విమానాలలో సహాయ సామాగ్రి, మొబైల్ ఆసుపత్రి మరియు అదనపు ప్రత్యేక శోధన మరియు రెస్క్యూ బృందాలు ఉన్నాయి.

భారత్ గతంలో వివిధ పేర్లతో ఇటివంటి ఆపరేషన్లు నిర్వహించింది. 2021 లో తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో భారత్ పౌరులను తరలింపు కోసం ఆపరేషన్ దేవి శక్తి పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.

కోవిడ్-19 సమయంలో విదేశాల నుండి భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే జాతీయ ప్రయత్నంలో భాగంగా మే 2020లో ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించబడింది. 2021లో భారత నౌకాదళం భారతదేశానికి ఆక్సిజన్ నింపిన కంటైనర్‌లను రవాణా చేయడానికి ఆపరేషన్ సముద్ర సేతు-II ని నిర్వహించింది.

2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్ లో ఇరుక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. 2015 లో నేపాల్ లో సంభవించిన భయంకర భూకంపములో సర్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సహాయ సహకారాలు అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ మైత్రిని నిర్వహించింది.


హైదరాబాద్‌లో ఫార్ములా ఇ-ఛాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌లో ఫార్ములా ఇ-ఛాంపియన్‌షిప్‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరి 11న జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. విద్యుత్ శక్తితో నడిచే కార్ల రేసు కావడంతో దీనిని ఫార్ములా ఈ-రేస్‌గా పేరు పెట్టారు. దీనితో హైదరాబాద్ ఫార్ములా ఇ-రేస్‌ నిర్వహించిన 27వ నగరంగా నిలిచింది. ఈ తొలి ఆల్-ఎలక్ట్రిక్ రేసులో జీన్-ఎరిక్ వెర్గ్నే విజేతగా నిలిచాడు.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్ మరియు ఎన్టీఆర్ మార్గ్ ఒడ్డున ఉన్న 'హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్' ఈ ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌కు వేదికయ్యింది. 2013లో నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన చివరి ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత భారతదేశంలో జరిగే మొదటి ఎఫ్ఐఏ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ ఇది.


దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023

వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 ఫిబ్రవరి 13 న దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌లో హోస్ట్ చేయబడింది. ఈ వార్షిక సమ్మిట్ "షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్" అనే థీమ్‌తో నిర్వహించారు. మూడు రోజుల సమావేశానికి వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, మంత్రులు, సీఈవోలు, నిపుణులు మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సహా విభిన్న శ్రేణి వక్తలు నిపుణులు హాజరవుతారు.

వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది దుబాయ్‌లో ప్రతి సంవత్సరం జరిగే గ్లోబల్ ఫోరమ్. ఇది మానవాళి ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై చర్చించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల భవిష్యత్తును రూపొందించడం, కొత్త ఆలోచనలు, సాంకేతికతలు మరియు పాలనలో అత్యుత్తమ అభ్యాసాలను అన్వేషించడం, ప్రభుత్వ రంగంలో సానుకూల మార్పును మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం.


ఉత్తరాఖండ్ యాంటీ కాపీయింగ్ చట్టంకు గవర్నర్ ఆమోదం

దేశంలోనే అత్యంత కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టంను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్ పోటీ పరీక్ష (రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలపై నివారణ చర్యలు) ఆర్డినెన్స్ 2023ని ఫిబ్రవరి 10న ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఆమోదించారు.

ఈ యాంటీ కాపీయింగ్ చట్టం యందు కాపీ క్యాట్ మాఫియాకు జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా విధించే నిబంధన ఉంది. అంతే కాకుండా కాపీయింగ్ మాఫియా ఆస్తులను అటాచ్ చేయాలనే నిబంధన కూడా చేర్చారు. పోటీ పరీక్షలో అవినీతిని, మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు ఈ కఠిన చట్టాన్ని పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.


ముంబై నుంచి మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి రెండు వందేభారత్ రైళ్లను ఫిబ్రవరి 10న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో ఒకటి ముంబై - షోలాపూర్ మధ్య, మరొకటి ముంబై - సాయినగర్ షిర్డీల మధ్య ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. దీనితో భారతదేశంలో ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యా 10కి చేరుకుంది.

దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి మధ్య ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే నడుపుతున్న ప్రతిష్టాత్మక ఆధునిక సెమీ-హై స్పీడ్ రైలుగా పరిగణించ బడుతుంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో నడుస్తాయి.

  1. న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (759 కిమీ)
  2. న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (655 కిమీ)
  3. ముంబై సెంట్రల్ - గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (522 కిమీ)
  4. న్యూఢిల్లీ - అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  5. చెన్నై సెంట్రల్ - మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (496 కిమీ)
  6. బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  7. హౌరా - న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (561 కిమీ)
  8. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (698 కిమీ)
  9. ముంబై సెంట్రల్ - షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (452 కిమీ)
  10. ముంబై సెంట్రల్ - షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (343 కిమీ)

ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 10 చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV - D2) రెండవ ఎడిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి 09:18 IST గంటలకు బయలుదేరిన ఈ ఉపగ్రహ వాహనం, ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ఇంజెక్ట్ చేయడానికి దాదాపు 15 నిమిషాల సమయం తీసుకుంది.

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఇస్రోచే అభివృద్ధి చేయబడిన కొత్త చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం. ఇది 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది 500 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలోకి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తులో బహుళ సంఖ్యలో చిన్న వాణిజ్య ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షలోకి ప్రయోగించేందుకు సహకరించనుంది.


మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అలానే అంతర్జాతీయ ఈ ఘనత దక్కించుకున్న నాల్గొవ కెప్టెన్‌గా అవతరించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ రికార్డు నమోదు చేసాడు.

రోహిత్ శర్మ కంటే ముందు, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన కెప్టెన్‌ల జాబితాలో తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), ఫాఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా), బాబర్ ఆజం (పాకిస్తాన్) లు ఉన్నారు. అయితే మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటరుగా సురేష్ రైనా ఈ ఘనతను దక్కించుకున్నాడు.


సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్

సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్ మార్చి 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికలలో 49 ఏళ్ల క్రిస్టోడౌలిడెస్ 51.9 % ఓట్లను దక్కించుకోగా, రన్‌ఆఫ్ ప్రత్యర్థి ఆండ్రియాస్ మావ్రోయినిస్ 48.1% ఓట్లను మాత్రమే సాధించాడు.

సైప్రస్ తూర్పు మధ్యధరా సముద్రంలో అనటోలియన్ ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న ఒక ద్వీప దేశం. ఇది భౌగోళికంగా పశ్చిమ ఆసియాలో ఉన్నప్పటికీ, ఇది రాజకీయంగా యూరప్ ఖండంలోకి వస్తుంది. దీని రాజధాని నగరం నికోసియా, అధికారిక కరెన్సీ - యూరో, అధికారిక భాషలు - గ్రీకు, టర్కిష్.


దయానంద్ సరస్వతి 200వ జయంతిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద్ 200వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరిగే వేడుకలను ఫిబ్రవరి 12న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంస్మరణ సందర్భంగా ఆయన లోగోను కూడా విడుదల చేశారు.

స్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజ్ స్థాపకుడుగా, భారతీయ తత్వవేత్తగా, సామాజిక నాయకుడుగా మరియు వైదిక ధర్మం యొక్క సంస్కరణకర్తగా ప్రసిద్ధి. స్వామి దయానంద గో బ్యాక్ టు ది వేదస్ ' అనే నినాదాన్ని ఇచ్చాడు. అన్ని రకాల ప్రజలకు మరియు మతాలకు సమాన హక్కు మరియు గౌరవాన్ని ఇచ్చాడు. ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు.


2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కటక్‌లోని ఐసిఏఆర్-నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2 వ ఇండియన్ రైస్ కాంగ్రెస్‌ను ఫిబ్రవరి 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న ఈ సమావేశాలను ఈ ఏడాది "ట్రాన్సఫార్మింగ్ రైస్ రీసెర్చ్" థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 నుండి 14 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఒడిశా వ్యవసాయ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశాలు రైస్ పరిశోధన సంభందిత అంశాలను చేర్చించేందుకు నిర్వహిస్తారు.


డబ్ల్యుపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన

ముంబైలో జరిగిన ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. ఈమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ వేలంలో అమ్ముడుపోయిన ఇతర మహిళా క్రికెటర్లలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రూ. 1.8 కోట్లు, ఆష్లీ గార్డనర్ (రూ. 3.2 కోట్లు), ఎలీస్ పెర్రీ (రూ. 1.7 కోట్లు), బెత్ మూనీ (రూ. 2 కోట్లు), మెగ్ లానింగ్ (రూ. 1.1 కోట్లు), నటాలీ స్కివర్-బ్రంట్ (రూ. 3.2 కోట్లు) ఉన్నారు.

అండర్-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.2 కోట్లు) మరియు రిచా ఘోష్ (రూ. 1.9 కోట్లు) దక్కించుకున్నారు. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఐదు జట్లతో పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు.


ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో 2023కి కోల్‌కతా ఆతిథ్యం

ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో (ఐఐఎస్‌ఎస్) 23వ ఎడిషన్ కోల్‌కతాలోని బిస్వా బంగ్లా మేళా ప్రాంగన్‌లో ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 17 మధ్య నిర్వహించబడుతుంది. ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో ఆసియాలో అతిపెద్ద సీఫుడ్ ఫెయిర్‌లలో ఒకటి. ఇది రెండేళ్లకోసారి నిర్వహించబడుతుంది.

ఈ సమావేశాల ద్వారా భారతీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులు, ఉత్పత్తిదారులు, ప్రాసెసర్లు, ప్రాసెసింగ్ యంత్రాల తయారీదారులు, అనుసంధాన రంగాలు, సాంకేతిక నిపుణులు ఒక చోట చేరి, సీఫుడ్ పరిశ్రమ సంబంధిత చర్చలు నిర్వహిస్తారు.


తొలిసారి.. తగ్గిన చైనా జనాభా

→ జననాల రేటు తగ్గుతుండటం. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గి నట్లు చైనా ప్రకటించింది.

→ 2021 కంటే 2022 చివ రినాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిం దని అక్కడి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్ బీఎస్) తెలిపింది.

→ 95.6 లక్షల జన నాలు, 1.04 కోట్ల మరణాలు ఉండటంతో చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు.

→ ఇందులో పురుషులు 72.2 కోట్లు ఉండగా, మహి ళలు 68.97 కోట్ల మంది ఉన్నారు.

→ ఈ లెక్క చైనా ప్రధాన భూభాగానికే పరిమితం.

→ హాంకాంగ్, మకావ్ భూభాగాలతోపాటు స్థానికంగా ఉంటున్న విదేశీయులను పరిగణనలోకి తీసుకోలేదు.

→ ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని, 2023 ఏప్రిల్ నాటికి అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని గతేడాది నవంబరు 15న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

→ 1950 తర్వాత తొలిసారిగా 2020లోనే ప్రపంచ జనాభా 1% తగ్గిందని తెలిపింది.

→ ఈ లెక్కన 2050 నాటికి భారత జనాభా 166.80 కోట్లకు చేరుకుంటుందని, అప్పటికి చైనా జనాభా 131.70 కోట్లే ఉంటుందని ఐరాస అంచనా వేసింది.

→ 'ఒక్క సంతానం' విధా నానికి చైనా 2016లోనే ముగింపు పలికింది.

→ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండొచ్చని చెప్పినా, దానికి పెద్దగా స్పందన రాలేదు.

→చైనా నగరాల్లో పిల్లల పెంపకానికి ఖర్చు ఎక్కువగా ఉండటం కూడా జననాల రేటు తగ్గడానికి కారణ మని చెబుతున్నారు.

→ప్రస్తుతం చైనా జనాభాలో 62% అంటే.. 87.55 కోట్ల మంది 16-59 ఏళ్ల మధ్య వయసువారు ఉన్నారు.

→65 ఏళ్లు దాటిన వారు 20.97 కోట్లు.. అంటే 14.9% ఉన్నారని చైనా నేషనల్ బ్యూరో తెలిపింది.

→" చైనా జనాభా తగ్గిన తీరు భారత్ కు మేలుకొలుపు కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాభా నియంత్రణకు బలవంతంగా చేపట్టే చర్యలు ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రా యపడ్డారు.

→ 'కఠినమైన నియంత్రణ చర్యల కార ణంగా చైనాలో జనాభా సంక్షోభం నెలకొంది.

→ సిక్కిం, గోవా, జమ్మూకశ్మీర్, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్, లద్దాబ్, పశ్చిమబెంగాల్, లక్షద్వీప్ల లోనూ వృద్ధుల జనాభా పెరుగుతోంది' అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఎస్ఐ) అనే స్వచ్ఛంద సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

→ మొత్తం సంతాన సాఫల్య రేటు (టీఎస్ఆర్) తగ్గడం వల్ల దీర్ఘకాలంలో వృద్ధుల జనాభా పెరు గుతుందని, దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో వనరుల కొరత తలెత్తి, వైద్యరంగంపై ఎక్కువ ఖర్చుచే యాల్సి ఉంటుందని హెచ్చరించింది.

→ ఆంధ్రప్ర దేశ్, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో విద్య, అభివృద్ధి అవకాశాలు బాగున్నా టీఎస్ఆర్ తగ్గు తోందని తెలిపింది.

→ ఇద్దరు పిల్లలే ఉండాలన్న నినాదానికి భారత్ ముగింపు పలకాలని పీఎఫ్ఎస్ఐ సూచించింది.

→ ప్రతికూల లింగ నిష్పత్తి, వృద్ధ జనాభా పెరుగుతున్న యువత వంటి భిన్నమైన సవాళ్లను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుందని సెంటర్ ఫర్ ఎడ్వొకసే అండ్ రీసెర్చ్ సంస్థ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ అఖిలా శివదాస్ అన్నారు.


అస్సాంలో విద్యుత్తు వాహన విప్లవం

→ త్రిచక్ర విద్యుత్తు వాహ నాల అమ్మకాల్లో అస్సాం రాష్ట్రం దూసు కుపోతోంది.

→2022 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు కొత్త విద్యుత్తు త్రిచక్ర వాహనాల అమ్మకాల లక్ష్యంలో 85 శాతాన్ని సాధించిన అస్సాం 2025 కల్లా వంద శాతానికి చేరుకొంటుందని అమెరి కాలోని జడ్గవీ (శూన్య ఉద్గార వాహ నాలు) పరిశోధన కేంద్రం తెలిపింది.

→భారత్ లో ఏ విభాగంలోనైనా భారీగా విద్యుత్తు వాహనాల అమ్మకాలను సాధించిన రాష్ట్రాల్లో అస్సాంతోపాటు ఉత్త రాఖండ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ ఉన్నాయి.

→భారత్లోనే కాదు. ప్రపంచమంతటా అస్సాం మాదిరిగా రికార్డు సృష్టించిన ప్రాంతం మరొకటి లేదని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన జస్ఈవీ పరిశోధన కేంద్ర అధ్యయనం తెలిపింది.

→2070 కల్లా నెట్ జీరో (కర్బన ఉద్గారాల తటస్థత)ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ ఏయే రంగాల్లో ఎంతెంత మేర లక్ష్యాలు సాధించాలో నిర్దేశించకుండా ఆ పనిని రాష్ట్రాలకే వదిలేసింది.

→ ఇప్ప టివరకు 25 భారతీయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యుత్తు వాహన విధానాలను ప్రకటించాయి.

→ ఈ వాహనాల ఉత్పత్తి, చార్జింగు కేంద్రాల ఏర్పా టుకు రాయితీలు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలను ఇవి అందిస్తున్నాయి.

→ 2030 నాటికి ఈ రాయితీలు, ప్రోత్సాహకాల విలువ రూ. 8,975 కోట్లకు (110 కోట్ల డాలర్లు) చేరుకోనుంది.

→అస్సాం 2022 జనవరిలో విద్యుత్తు వాహన విధానాన్ని అమలుచేయడం.

→ఆరంభించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో 38,710 త్రిచక్ర విద్యుత్తు వాహనాలు, 1,903 ద్విచక్ర విద్యుత్తు వాహనాలు, 90 నాలుగు చక్రాల విద్యుత్తు వాహ నాలు అమ్ముడుపోయాయి.

→రాయితీలు ఇవ్వడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, రహదారి పన్ను, పార్కింగ్ రుసుములను ఎత్తివేసిన అస్సాంలో మున్ముందు ఈ వాహనాల అమ్మకాలు మరింత ఊపందుకోనున్నాయి.

→2021 నుంచి 2026-27 నాటికి అస్సాంలో లక్ష ద్విచక్ర విద్యుత్తు వాహనాలు, 75,000 త్రిచక్ర వాహనాలు, 25,000 నాలుగు చక్రాల వాహనాల అమ్మకాలను సాధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

→2030 కల్లా ప్రభుత్వ రవాణా బస్సులు, ఇతర ప్రభుత్వ వాహనాలన్నీ విద్యుత్తు చోదకమే కావాలని తీర్మా నించింది.

→అప్పటికి అన్ని రవాణా, వాణిజ్య వాహనాలు శిలాజ ఇంధనాలను పూర్తిగా వదిలేసి, విద్యుత్తు వాహనాలుగా మారాల్సి ఉంటుంది.


బ్రిటన్లో యువ నిపుణులు పథకం

→ రెండేళ్లు ఉండొచ్చు.. పని చేసుకోవచ్చు
→ వచ్చేనెల 28 నుంచి కొత్త పథకం
→ భారతీయ వృత్తి నిపుణులు గరిష్టంగా రెండేళ్లపాటు బ్రిటన్లో నివాసం ఉంటూ అక్కడే పని చేసేందుకు వీలు కల్పించే కొత్త పథకం వచ్చేనెల 28న ప్రారంభం కానుంది
→ బ్రిటన్ వృత్తి నిపుణులు మన దేశంలో ఉండేందుకు, పని చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న నిపుణులు దీనికి అర్హులు.
→ దీనిని 'యువ నిపుణులు పథకం' గా పిలుస్తారు. రెండు దేశాల విదేశీ వ్యవహారాల కార్యాలయాల మధ్య సంప్రదింపుల తర్వాత ఈ మేరకు ప్రకటన వెలువడింది.

భాజపాకు రూ.1,917 కోట్లు.. కాంగ్రెస్కు రూ.541 కోట్లు

→రాజకీయ పార్టీల ఆదాయ వివరాలను వెల్లడించిన ఈసీ
→ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు స్వీక రించిన పార్టీల్లో భాజపా తొలిస్థానంలో నిలిచింది.
→2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్నికల కమిషన్ పలు వివరాలను వెల్లడించింది.
→ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భాజపా రూ. 1,033.7 కోట్లు అందుకోగా.. కాంగ్రెస్ రూ. 347.99 కోట్లు స్వీకరించింది.
→మొత్తంగా భాజపా రూ. 1,917.12 కోట్లు పొందగా.. కాంగ్రెస్కు రూ.541.27 కోట్లు వచ్చా యని తెలిపింది.
→ఇందులో భాజపాకు రూ.854. 46 కోట్లు వ్యయం అవగా.. కాంగ్రెస్కు రూ. 400. 41 కోట్లు ఖర్చయ్యాయి.
→సీపీఐ రూ.2.87 కోట్లు ఆదాయం చూపించగా.. రూ.1.18 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపింది.
→ ఈ వివరా లను ఈసీ తమ వెబ్సైట్లో పొందుపర్చింది.

చైనా ఆర్థిక ఆర్థిక వ్యవస్థ డీలా

→2022లో జీడీపీ వృద్ధి 3 శాతమే
→50 ఏళ్లలోనే రెండో అతి తక్కువ నమోదు
→ చైనా జీడీపీ వృద్ధి 2022లో 3 శాతానికే పరిమితమైంది. గత 50 ఏళ్లలో ఇది రెండో అతి తక్కువ వృద్ధి అని మంగళవారం విడుదలైన అధికారిక గణాం కాలు వెల్లడించాయి.
→ 2022లో చైనా వార్షిక జీడీపీ 121.02 లక్షల కోట్ల యువాన్ (17, 94 లక్షల కోట్ల డాలర్లుగా నమో దైంది.
→ అధికారిక లక్ష్యం కంటే ఇది 5.5% కంటే తక్కువని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది.

ఇవీ కారణాలు:-
→ జీరో-కొవిడ్ లక్ష్యంతో, కేసులు బయట పడి నపుడల్లా లాక్డౌన్ లు విధించడంతో పెద్ద స్థాయి కార్పొరేట్ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి.
→దీంతో పారిశ్రామిక వృద్ధి డిసెం బరులో 1.3 శాతానికి పరిమితం కాగా.. మొత్తం ఏడాదికి 3.6 శాతంగా నమోదైంది. దీనికి తోడు స్థిరాస్తి సంక్షోభమూ కొనసా గింది.
→దీంతో 1974లో నమోదైన 2.3 శాతం వృద్ధి తర్వాత అత్యంత తక్కువ వృద్ధి రేటు నమోదైంది.

భవిష్యత్ ఏమిటి?:-
→ దేశీయంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ పునాదులు బలంగా లేవు. గిరాకీ క్షీణత, సరఫరా ఇబ్బందులు దేశీయంగా ఒత్తిడిని తెస్తున్నాయి.
→అంతర్జాతీయ పరిస్థితులూ అనిశ్చితిలోనే ఉన్నాయి. అయితే ఆర్ధిక స్థిరత్వాన్నే ఈ ఏడాది తన ప్రాధాన్యతగా చైనా గుర్తిస్తుం దని విశ్లేషకులు చెబుతున్నారు.
→ప్రస్తుతం కొవిడ్-19 ఆంక్షలను చైనా పూర్తిగా ఎత్తివేయడం సానుకూలాంశం.

చంద్రుడి అవతలి వైపు చీకటా?

→చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు. ఆ చల్లటి వెన్నెల పరవశంలో ఎన్ని కథలు, కవితలు పుట్టుకొచ్చాయో! అయితే మనకు ఎప్పుడూ చంద్రుడి ఒక వైపే కనిపిస్తుంది.
→అవతలి వైపు కనిపించదు. అందుకే దాన్ని చీకటి భాగమనీ అభివర్ణిస్తుంటారు. నిజానికి అక్కడేమీ చీకటిగా ఉండదు.
→ఇవతలి వైపున పడినట్టుగానే అక్కడా ఎండ పడుతుంది. మరెందుకు కనిపించదు? దీనికి కారణం- చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం.
→భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉండటమే. దీన్నే టైడల్ లాకింగ్ అంటారు.
→గ్రావిటేషనల్ లాకింగ్, క్యాప్చర్డ్ రొటేషన్, స్పిన్-ఆర్బిట్ లాకింగ్ అనీ పిలుస్తారు. దీని మూలంగానే చంద్రుడి ఒక వైపే మనకు కనిపిస్తుంది.
→చంద్రుడి భ్రమణం భూమి గురుత్వాకర్షణ మీద ఆధారపడి ఉంటుంది.
→మన సౌర వ్యవస్థలో గ్రహాల చుట్టూ భ్రమించే చంద్రుళ్లన్నీ ఇలాగే తిరుగుతూ ఉంటాయి.
→నిజానికి కోట్లాది సంవత్సరాల క్రితం చంద్రుడి అవతలి భాగాలూ భూమి నుంచి కనిపించాయి.
→ఎందుకంటే అప్పుడు చంద్రుడి భ్రమణం ఇప్పటికన్నా భిన్నంగా ఉండేది. క్రమంగా భూమి, చంద్రుడి శ్రీ మధ్య గురుత్వాకర్షణ బలాలు స్వల్పంగా మారిపోయాయి.
→'ఫలితంగా కక్ష్యలు, భ్రమణ వేగాలూ తారుమారయ్యాయి. చంద్రుడి కన్నా భూమి పరిమాణం చాలా ఎక్కువ. కాబట్టి " సమతుల స్థితికి చేరుకునేంతవరకు చంద్రుడి భ్రమణ వేగం నెమ్మదించింది.
→ఇదే టైడల్ లాకింగ్కు కారణమైంది. చంద్రుడి టైడల్ బలాలు భూమి భ్రమణ వేగాన్నీ నెమ్మదింపజేస్తున్నాయి.
→దీని మూలంగానే భూమి రోజు వ్యవధి పెరిగింది. ఇప్పటికీ చంద్రుడు ఏడాదికి 15 మైక్రో సెకండ్ల మేరకు భూమి భ్రమణ వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాడు

జనాభాలో మనమే నం-1

→చైనాను భారత్ ఇప్పటికే అధిగమించినట్లు అంచనాలు
→ జనాభాలో చైనాను భారత్ ఇప్పటికే అధిగమించి తొలిస్థానానికి చేరుకున్నట్లు అంతర్జా తీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
→ తాజాగా 'వరల్డ్ పాపులేషన్ రివ్యూ' కూడా ప్రపం చంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించి నట్లు పేర్కొంది.
→ చైనాలో జననాల రేటు తగ్గినట్లు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
→ ఈ నేప థ్యంలో చైనా జనా భాను భారత్ ఇప్పటికే దాటి ఉండవ అంచనాలు వెలువడుతు న్నాయి.
→ వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం... 2022 చివరినాటికే భారత్ జనాభా 141.7 కోట్లు కాగా, తాజాగా (జనవరి 18, 2023 నాటికి) ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకు న్నట్లు అంచనా.
→ మరో అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్ సైతం భారత్లో ప్రస్తుత జనాభా 142.8 కోట్లుగా లెక్క కట్టింది.
→ చైనా ఇటీవల ప్రకటించిన జనాభా కంటే భారత గణాంకాలే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవత రించినట్లేనని స్పష్టమవుతోంది.
→జననాల రేటు తగ్గి.. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న కారణంగా తమ జనాభా ఇటీ వలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు ప్రకటించిన చైనా... ప్రస్తుతం తమ జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేసింది.
→భారత్ 2028 చివరి నాటికి ఈ రికార్డును చేరుకుంటుం దని ఐక్యరాజ్యసమితి ఇది వరకు అంచనా వేసినప్ప టికీ.. అంతకుముందే భారత్ ఈ రికార్డును అధి గమించినట్లు తెలుస్తోంది.
→ 2022 నవంబర్ 15న పుట్టిన శిశువుతో ప జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
→1974 ప్రపంచ జనాభా 400 కోట్లు ఉండగా.. 48 ఏళ్లలో అది రెట్టింపయింది.
→వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్దాయం పెర గడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణ మని ఐరాస వెల్లడించింది.

మన పార్లమెంటు భవనానికి 96 ఏళ్లు

→ ప్రపంచంలో అద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా పేరొందిన మన దేశ పార్లమెంటు భవనం ఎన్నో చారిత్రక ఘటనలకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ వలస పాలన, దానికి చరమ గీతం పాడుతూ స్వతంత్ర భారతావని ఆవి. ర్భావం.
→ నూతన రాజ్యాంగం, వినూత్న చట్టాలు, వాదప్రతివాదాలు, వివాదాస్పద శాస నాలు తదితరాలు ఎన్నిటికో వేదికైన ఈ అపు రూప కట్టడానికి ప్రారంభోత్సవం జరిగి బుధవా దానికి సరిగ్గా 96 ఏళ్లు పూర్తయ్యాయి.
→ 1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు.
→ భారత్ లో బ్రిటన్ సామ్రాజ్య రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో రైసినా హిల్ ప్రాంతంలో 1921 ఫిబ్రవరి 12న పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
→ బ్రిటన్ ఆర్కిటెక్ట్లు సర్ హెర్బర్ట్ వాకర్, సర్ ఎడ్విన్ లుటియన్లు దీని రూపశిల్పులు.
→ 560 అడుగుల వ్యాసంతో, మైలులో మూడో వంతు చుట్టుకొలత గలిగిన వలయాకార సుందర కట్ట డాన్ని పూర్తిచేయడానికి ఆరేళ్ల సమయం. పట్టింది.
→ ప్రపంచంలోనే ఆమోఘమైన పార్ల మెంటు భవనంగా ఆనాడు ప్రసిద్ధికెక్కింది.
→ ఈ ప్రాంగణంలోనే నిర్మితమవుతున్న కొత్త పార్లమెంటు సముదాయం త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోనుంది.
→ అది అందుబాటులోకి వచ్చాక పాత భవనం మన దేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

అతి తక్కువ ఇన్నింగ్స్ 1000 పరు గులు

→వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ 1000 పరు గులు పూర్తిచేసిన మొదటి భారత బ్యాటర్ గా గిల్ రికార్డు సృష్టించాడు.
→19 ఇన్నింగ్స్ గిల్ ఈ ఘనత అందుకున్నాడు. గతంలో శిఖర్ ధావన్, కోహ్లి 24 ఇన్నింగ్స్ లో 1000 పరు గులు సాధించారు.
→మొత్తంగా ఫఖర్ జమాన్ (18 ఇన్నింగ్స్ లు) అగ్రస్థానంలో ఉన్నాడు.
→గిల్, ఇమాముల్ హక్ (19 ఇన్నింగ్స్) ఉమ్మ డిగా రెండో స్థానంలో ఉన్నారు.
→పిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా శుభ్ మన్(23ఏళ్ల 132 రోజులు) రికార్డు సాధించాడు.
→ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.

గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

→ఈ ఏడాది గణతంత్ర వేడుకలు నూతనంగా నిర్మితమైన సెంట్రల్ విస్టా దగ్గర జరగనున్నాయి. ఈ వేడుకలకు తొలిసారి ఈజిప్టు అధ్యక్షుడు అబ్జెల్ ఫతే ఆల్ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
→1200 మందితో కూడిన ఈజిప్టు సైనిక బృందం సైతం పాల్గొననుంది.
→ఈ నెల 23న సుభాష్ చంద్రబోస్ జయంతితో వేడుకలు మొదలై 31న గాంధీ వర్ధంతి వరకు జరగనున్నాయి.
→తొమ్మిది రఫేల్ యుద్ధ విమానాలు సహా మొత్తం 50 విమానాలతో విన్యా సాలు నిర్వహిస్తారు.
→ఈ నెల 29న జరిగే బీటింగ్ ది రీట్రీట్ కార్యక్రమంలో 3500 డ్రోన్లతో అతిపెద్ద ప్రదర్శన నిర్వహించబోతున్నారు.

త్రిపుర , మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఎన్నికలు

→ఈశాన్యంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికల భేరీ మోగింది.
→ఫిబ్రవరి 18న త్రిపుర, 27న మేఘాలయ, నాగాలాండ్ శాసనస భలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది.
→ఫిబ్రవరి 27నే ఐదు రాష్ట్రాల్లోని ఆరు శాసనసభ స్థానాలకు, లక్ష ద్వీప్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. మార్చి 2న వీటన్నింటి ఫలి తాలు వెలువరించనుంది.
→కేంద్ర ప్రధాన ఎన్ని కల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తన సహచర కమిషనర్లు అనూస్చంద్ర పాండే, ఆరు ణ్ గోయల్ తో కలిసి షెడ్యూల్ విడుదల చేశారు.
→ఒక్కో రాష్ట్రంలో 00 చొప్పున మూడు ఈశాన్య రాష్ట్రాల్లో 180 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో తొలిదశ కింద వీటికి షెడ్యూల్ ఖరారు చేశారు.
→వీటి శాసనసభల గడువు మార్చిలో ముగుస్తుంది. మూడు రాష్ట్రాల్లో కలిపి 63,06,429 నుంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా త్రిపురలో 28.29 లక్షల మంది ఉన్నారు.
→మేఘాలయ (21 64 లక్షలు), నాగాలాండ్ (13,17 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మూడు రాష్ట్రాల్లో కలిపి 1,17,850 మంది నవ ఓటర్లు తొలిసారి.

హరిత ఇంధనం వచ్చేస్తోంది

→పెట్రోలు, డీజిల్, సహజ వాయువు (గ్యాస్) కు ప్రత్యా మ్నాయ ఇంధనం వచ్చేస్తోంది. పైగా కాలుష్యం వెదజల్లదు. కూడా.
→వ్యక్తిగత, వాణిజ్య రవాణాకు, పారిశ్రామిక అవ సరాలకూ వినియోగించే అవకాశం ఉండటం దీని ప్రత్యే కత.
→అదే గ్రీన్ హైడ్రోజన్, ఈ ఇందన ఉత్పత్తి త్వరలోనే పట్టాలెక్కేలా, కేంద్ర మంత్రివర్గం 'నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోద ముద్ర వేసింది.
→2030 నాటికి 50 లక్షల టన్నుల వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనేది లక్ష్యం.
→ఇందుకోసం పరిశ్రమలు, పరిశోధనా సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.19,744 కోట్లు కేటాయించారు. ఫలి తంగా ఈ రంగంలోకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు లభిస్తాయని అంచనా.
→దీంతోపాటు రూ.1 లక్ష కోట్ల విలు మైన కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశమూ ఉంది.

భవిష్యత్తు ఇం'ధనం':-
→ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి లభించిన విద్యుత్తును ఉపయోగించి, ఎలక్ట్రోలైజింగ్ ప్రక్రియ ద్వారా గ్రీన్ హైడ్రోజనన్ను ఉత్పత్తి చేస్తారు.
→నీటిని విడదీసిన ఆక్సిజన్, హైడ్రోజన్ లభిస్తాయి. పెట్రోలు, డీజిల్ మండించినప్పుడు వెలువడే కర్బన ఉద్గారాలు.. హైడ్రోజన్ మండినప్పుడు ఉత్పత్తి కావు. ప్రస్తుతం ఒక కిలో హైడ్రో జన్ ఉత్పత్తికి 2-3 డాలర్లు ఖర్చవుతోంది.
→ఉత్పత్తి, సాంకే తిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఈ ఖర్చు దిగివస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే దీన్ని భవిష్యత్తు ఇంద నంగా భావిస్తున్నారు.

సవాళ్లు :-
→గ్రీన్ హైడ్రోజన్ ను నిల్వ రవాణా చేయడం కొంత సంక్లిష్ట వ్యవహారమే. దీన్ని వివిధ రంగాల్లో వినియోగిం చడానికి అనువైన ఉపకరణాలు, యంత్రాలు ఆవిష్కరిం చాల్సి ఉంది.
→వీటిని త్వరగా ఆవిష్కరించగలిగితే. ప్రపంచ మార్కెట్కు అందించి లబ్ది పొందొచ్చు.
→పలు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఈ విభాగంలో పెద్దఎత్తున అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
→ఒక కిలో గ్రీన్ హైడ్రోజన్ ను 1 డాలర్ కంటే తక్కువ ధరలో ఉత్పత్తి చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది.
→భారీ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం కోసం రూ.75,000 కోట్ల పెట్టు బడికి ఈ సంస్థ సిద్ధమవుతోంది..
→ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది.
→యూఎస్ లోని బ్లూమ్ ఎనర్జీ సాంకేతికతను వినియోగిస్తోంది.
→ఈ పైలెట్ ప్రాజెక్టును విశాఖపట్నంలోని ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్ ప్రాంగణంలో చేపట్టారు.

'కమిన్స్' హైడ్రోజన్ ఇంటర్నల్ కంబర్టన్ ఇంజిన్ :-
→గ్రీన్ హైడ్రోజన్ ఇండ నంగా పనిచేసే ఇంజిన్లను ఆవిష్కరించడంలో కమిన్స్ ఇండియా తొలి అడుగు వేసింది.
→మీడియం- టు- హెవీ డ్యూటీ ట్రక్కులకు అనువైన హైడ్రోజన్ ఇంట ర్నల్ కంబస్టన్ ఇంజిన్ను 'బి6, 7హెచ్ ఇంజిన్ పేరుతో రూపొందించింది.
→దీనికి అనుబంధంగా 700 బార్ హైడ్రోజన్ ట్యాంక్ను కమిన్స్ ఇండియా తయారు చేసింది. దీనివల్ల ఇంధనాన్ని త్వరగా నింపడానికి వీలు వుతుంది.
→ఈ ఇంజిన్ తో హెవీ డ్యూటీ ట్రక్కులు, బస్సులు సుదూర ప్రాంతాలకు వెళ్లగలుగుతాయి.

ఎంజీ హైడ్రోజన్ ఫ్యూయల్-సెల్ టెక్నాలజీ :-
→ఎంజీ మోటార్ ఇండియా మూడో తరం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని మనదేశంలో ప్రవేశపెట్ట నుంది.
→హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నడిచే కారును తాజాగా ఆవిష్కరించింది. అత్యధిక శక్తి, దీర్ఘకాల మన్నిక, భద్రత, నమ్మకమైన టెక్నాలజీ, పర్యావరణానికి అనుకూ లంగా ఉండటం దీని ప్రత్యేకత.
→ఆక్మే గ్రూపు 'సౌరశక్తి నుంచి గ్రీన్ హైడ్రోజన్, దాని నుంచి గ్రీన్ ఆమ్మోనియా ఉత్పత్తి చేసే ప్లాంటును రూ. 52,000 కోట్లతో కర్ణాటకలో ఏర్పాటు చేయనుంది.
→2027కు పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల ఏటా 12 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్న ఉత్పత్తి చేయొచ్చు.


దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం 'భారోస్' రూపొందించిన ఐఐటీ మద్రాస్

→ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను (ఓఎస్) ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చింది.
→ కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిధులతో 'ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్వేర్ తయారు చేసినట్లు ప్రకటించింది.
→ దేశ వ్యాప్తంగా 100 కోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా, సౌకర్యంగా విని యోగించుకునేలా ఇది ఉంటుందని వెల్లడించింది.
→ దీనికి 'భారోస్ (భారత్ ఓఎస్)' అని పేరు పె ట్టింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటర్ కు చెందిన జండ్ ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జండ్ కాప్స్) సంస్థ దీన్ని రూపొందించింది.
→ ఈ వివ రాల్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి వెల్ల డించారు.
→ ఈ ఓఎస్ ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన సంస్థలకే ఇచ్చామని, త్వరలో ప్రజలకు కాప్స్ సంస్థ డైరెక్టర్ కార్తిక్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఓఎస్ వినియోగ దారుల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచుతుందని తెలిపారు.

విదర్భ అరుదైన ఘనత

→విదర్భ అరుదైన ఘనత సాధించింది.
→దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా రికార్డు అందుకుంది.
→ గుజరాత్తో మ్యాచ్లో 73 పరుగుల లక్ష్యాన్ని విదర్భ కాపాడుకుంది.
→ ఈ మ్యాచ్లో విదర్భ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంటార్కిటికాలో విశేషమైన ఉల్క

→ అంటార్కిటికాలోని బ్లూఐస్ ప్రాంతంలో శాస్త్ర జ్ఞులు 7.6 కిలోల బరువున్న ఉల్కను కనుగొన్నారు.
→ఆ ప్రాంతంలో గతంలో బెల్జి యన్, జపనీస్ శాస్త్రజ్ఞులు 600 ఉల్కలను సేక రించారు. డిసెంబరు 11 నుంచి జనవరి 11 వరకు అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల అన్వేషణలో తాజా ఉల్క బయటపడింది.
→ఈ తరహా ఉల్క అంతరిక్షంలోని గ్రహశకల మండలం నుంచి లక్షల సంవత్సరాల క్రితం భూమికి వచ్చి చేరింది.
→ఇప్పుడు లభ్యమైన ఉల్కను శాస్త్రజ్ఞులు చేతితో తాకకుండా ఫోర్కుతో నేరుగా ప్లాస్టిక్ సంచిలోకి కానీ, అల్యూమినియం పొరలోకి కానీ తీసుకుని భద్రపరుస్తారు.
→శీతలీకరించిన పెట్టెలో దాన్ని బ్రస్సెల్స్క పంపుతారు. అక్కడ దాని రసాయన స్వరూపాన్ని విశ్లేషిస్తారు.

స్థూలకాయుల్లో మధుమేహం ఎందుకంటే..

→ స్థూలకాయులు మధుమేహం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువని వైద్య పరి శోధకులకు తెలిసినా, దానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియరాలేదు.
→ వాషింగ్టన్ విశ్వవిద్యా లయ వైద్య కళాశాల పరిశోధకులు ఎట్టకేలకు ఆ ప్రక్రియను కనిపెట్టారు.
→ ఒక వ్యక్తి శరీరంలో కొవ్వు మరీ ఎక్కువగా ఉంటే క్లోమ గ్రంథిలోని బీటా కణాలు ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి.
→ ఇన్సులిన్ స్థాయి మితిమీరితే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనిని ఉత్పత్తి చేసే బీటా కణాలు పనిచేయడం మానేస్తాయి.
→ ఇన్సులిన్ పాళ్లు మితిమీరినప్పుడు పాల్మిటేట్ అనే కొవ్వు ఆమ్లం కణాల్లోని ప్రోటీన్లకు అతుక్కుపో తుంది. దీనిని తొలగించకపోతే మధుమేహం వస్తుంది.
→ పాల్మిటేట్ను బీటా కణాల నుంచి తొలగించే ఏపీటీ 1 అనే ఎంజైమ్ మధుమే హుల్లో చాలా తక్కువగా ఉంటుంది.
→ ఈ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచగల అనేక రసాయన మిశ్రమాలను తాము గుర్తించినట్లు పరిశోధక బృందం సారథి క్లే సెమెన్ కోవిచ్ చెప్పారు.

మానసిక సామర్థ్యాలను తగ్గించే ధూమపానం

→సిగరెట్ తాగే అలవాటుతో అరవై ఏళ్లు. అంతకు పైబడిన వయసు కలవారిలో మానసిక సామర్ధ్యాలు సన్నగిల్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ మేరకు వెయిల్ కార్నెల్ మెడిసిన్ న్యూయార్క్-ప్రెస్బిటేరి యన్ పరిశోధకులు వెల్లడిం చారు. వారి అధ్యయన ఫలితాలు
→గతేడాది డిసెంబరు 6న జర్నల్ ఆఫ్ అల్జీ లో ప్రచురితమయ్యాయి. ధూమ మర్స్ డిసీజ్ పానం, మధుమేహం, హైపర్టెన్షన్ మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కారకాలన్నీ ఏకమైనప్పుడు మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్ ధమనికి చెందిన అథ్లె సోరోటిక్ గట్టిపడటం వంటి బ్రెయిన్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మునుపటి అధ్యయనాలు తేల్చాయి. తాజా పరిశోధనలో ధూమపానం, మధుమేహం, హైపర్టెన్షన్లు కలగలసినప్పుడు మానసిక సామర్థ్యాలు దిగ జారుతాయని తేలింది.
→ఇటువంటి సంద ర్భాల్లో రోగులకు ఎదురయ్యే అదనపు అధిక ప్రమాద స్థితిపై వారికి సూచనలివ్వొచ్చని తెలిపింది. అధ్యయనం సందర్భంగా 60 ఏళ్లు, అంతకు మించి వయసు కలిగిన 3007 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ధూమపానం అలవాటును వదులుకొనేలా ప్రోత్సహించడం ద్వారా వ్యక్తుల్లో చక్కని ఆలోచనలు, నేర్చుకునే... గుర్తుపెట్టుకోగల శక్తి వంటి సామర్థ్యాలను కాపాడవచ్చని పరిశోధకులు తేల్చారు.

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా రాజీనామా

→కొవిడ్ కట్టడి, క్రైస్ట్ చర్చ్ కాల్పుల తదనంతర పరి ణామాల్లో తనదైన ముద్ర వేశారని ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
→తన పదవికి న్యాయం చేయలేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానిగా ఫిబ్రవరి 7 తనకు చివరి రోజని.. ఉబికివస్తున్న కన్నీళ్లతో ప్రకటించారు.
→సాధారణ ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని స్పష్టంచేశారు. అప్పటివరకు ప్రధానిగా ఎవరుంటారనేది తేలనుంది.

మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్ ప్రమాణం

→ అమెరికాలోని భారత సంతతి హౌస్ ఆఫ్ డెలిగేట్స్ ప్రతినిధిగా 2010 నుంచి మహిళ అరుణా మిల్లర్ (58) చరిత్ర సృష్టిం 2018 వరకూ వ్యవహరించారు.
→ అరుణ ఆంధ్రప్ర చారు. మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవ దేశ్కు చెందిన వ్యక్తి. ఆమెకు ఏడేళ్ల వయసులో ర్నర్(10వ)గా ఎన్నికైన తొలి భారత అమెరికా ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.
→ మహిళా రాజకీయవేత్తగా రికార్డుకెక్కారు. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నా హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతపై లజీ నుంచి అరుణ పట్టభద్రురాలయ్యారు.
→ మేరీ ప్రమాణం చేస్తూ ఆమె బుధవారం తన బాధ్య లాండ్కు లెఫ్టినెంట్ గవర్నర్ కావడం తనకు తలు చేపట్టారు.
→ డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ లభించిన గౌరవం అని ఆమె ట్వీటర్ పేర్కొ చేసి గెలుపొందారు. పలువురు రిపబ్లికన్లూ న్నారు.
→ ఈ బాధ్యతను వినయపూర్వకంగా స్వీక అమెకు మద్దతు తెలపడం విశేషం. మేరీలాండ్ రిస్తున్నట్లు తెలిపారు.

మిస్సోరి ట్రెజరర్ గా వివేక్

→ భారత సంతతికే చెందిన వివేక్ మాలిక్ (45) కూడా మిస్సోరి రాష్ట్ర ట్రెజరర్ గా ఎన్నికై చరిత్ర సృష్టిం చారు.
→ హరియాణా నుంచి విద్యార్థిగా అమెరికా చేరుకున్న ఆయన ప్రస్తుతం న్యాయసేవల సంస్థను విజయవం తంగా నిర్వహిస్తున్నారు.

వార్షిక విద్యా స్థాయి (ఆసర్) నివేదిక

→ గత దశాబ్ద కాలంలో ఏటా 60 కంటే తక్కువ విద్యార్ధులు చేరిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరు గుతూనే ఉంది.
→ ఈ విషయం వార్షిక విద్యా స్థాయి (ఆసర్) నివేదికలో వెల్లడైంది.
→ 2022లో చిన్న పాఠశా లలు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉన్నాయి. వాటి సంఖ్య ఉత్తర ప్రదేశ్లో 2018లో 10. 4% నుంచి 2022లో 7.9%కు, కేరళలో 2018లో 24. 1 నుంచి 2022లో 16.2%కు తగ్గింది.
→ తొలి ఆసర్ సర్వే 2005లో జరిగింది. అప్పట్నుంచి పదేళ్ల పాటు ఏటా నిర్వహించారు.
→ మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2022లో తొలిసారిగా క్షేత్రస్థాయి ప్రాథమిక సర్వే చేశారు.
→ కొవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసేసిన తర్వాత మళ్లీ ఇప్పుడే విద్యార్థులు వస్తుం డటంతో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.
→ ఇందులో భాగంగా 19,060 గ్రామాల్లోని 3,74,544 కుటుంబాల్లో 3 నుంచి 16 సంవత్సరాల మధ్య వయ సున్న 6,99,597 మంది పిల్లలను పరిశీలించారు.
→ 2018 స్థాయి కంటే విద్యాహక్కు చట్టంలోని సూచికలన్నింటిలో దేశవ్యాప్తంగా కొంత మెరుగుదల కనిపించింది.
→ 2018లో బాలికలు ఉపయోగించగల మరుగుదొడ్లు 66.4% ఉండగా, ఆది 2022లో 68.4% కు పెరిగింది.
→ అలాగే తాగునీటి సదుపాయం 74.8% నుంచి 76% కు పెరిగింది. పాఠ్యపుస్తకాలే కాక, ఇతర పుస్తకాలున్న పాఠశాలల సంఖ్య 36, 9% నుంచి 44%కు పెరిగింది.
→ అయితే రాష్ట్రాల వారీగా ఈ గణాంకాల్లో తేడాలు న్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాగునీరు అందుబాటులో ఉన్న పాఠశాలల సంఖ్య 2018లో 58.1% నుంచి 2022 నాటికి 65.6% కు పెరిగింది.


అరుణాచల్ ప్రదేశ్ లో పెరిగిన చేరికలు

→అరుణాచల్ ప్రదేశ్ లో గత 15 ఏళ్లలో పాఠశాలల్లో పిల్లల చేరిక పెరిగింది.
→2018లో ఇది 97.2% ఉండగా, ఉంది. ప్రథమ్ ఫౌండేషన్ కార ణంగా ఇక్కడి అభ్యసన ఫలితాలు మెరుగుపడ్డాయి.
→సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలతో పాఠశాలల్లో బాలికల చేరిక కూడా పెరిగింది.
→కానీ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా లల్లో అయిదో తరగతి పిల్లలు తీసివేతలు చేయగల సామర్థ్యం 2018లో 27.1% ఉండగా, 2022లో 22. 9%కు తగ్గింది.
→ఎనిమిదో తరగతిలోనూ తీసివేతలు చేసే సామర్ధ్యం 2018లో 49.3% నుంచి 2022లో 45. 3%కు తగ్గింది. సాధారణ ఇంగ్లిషు వాక్యాలు చదివే సామర్ధ్యం అరుణాచల్ ప్రదేశ్లో కొద్దిగా పెరిగింది.
→దేశంలో గల అయిదేళ్ల చిన్నారుల్లో మూడింట ఒక వంతు మంది ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి కంటే తక్కువ తరగతిలోనే చదువుతున్నారు.
→నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో 1వ తరగతిలో చేరడానికి చిన్నారులకు కనిష్ఠంగా ఆరేళ్ల వయసు వచ్చి ఉండాలి.


జాతీయ వారసత్వ కట్టడంగా రామసేతు ప్రకటించే ప్రక్రియ పరిశీలనలో కేంద్రం

→ తమిళనాడు-శ్రీలంక మధ్య ఉన్న రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జి)ని జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
→ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ అంశంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్, జస్టిస్ జె. బి. పార్దీవాలాల ధర్మాసనం విచారణ జరిపింది.

ప్రముఖ నర్తకి లక్ష్మీ విశ్వనాథన్ కన్నుమూత

→ ప్రముఖ నర్తకి, నృత్య కళానిధి లక్ష్మీ విశ్వనాథన్ చెందారు.
→ 1953లో ఏడేళ్ల ప్రాయంలోనే ఆమె భరతనాట్య అరంగేట్రం చేశారు.
→ సుప్రసిద్ధ సినీ దర్శ కుడు కె.సుబ్రహ్మణ్యం తమ్ముడు కె. విశ్వనాథన్ కుమార్తె, నృత్య కళానిధి పద్మా సుబ్రహ్మణ్యానికి చెల్లెలు అయిన లక్ష్మీ విశ్వనాథన్కు కూచిపూడిలోనూ ప్రావీణ్యం ఉంది.
→ దేశ విదేశాల్లో పలు నాట్యోత్సవాల్లో పాల్గొన్నారు. నర్తకిగానే కాకుండా నాట్యాచారిణిగా, రచయిత్రిగా, నృత్య దర్శకురాలిగా పలు పాత్రలను ప్రతిభావం తంగా పోషించారు.
→ తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, శ్రీకృష్ణ గానసభ నుంచి నృత్య చూడామణి, మ్యూజిక్ అకాడమీ నుంచి నృత్య కళానిధి వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.
→ పలు విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలిచ్చారు. మ్యూజిక్ అకాడ మీకి ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.

ఐఎస్ బీలో వచ్చే నెలలో కుటుంబ వ్యాపార సదస్సు

→ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ ప్రాంగ ణంలో వచ్చే నెలలో 'కుటుంబ వ్యాపార సదస్సు' ను పెద్దఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
→ ఐఎస్బీలోని థామస్ స్మిథేని సెంటర్ ఫర్ ఫ్యామిలీ ఎంట రైజ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4-5 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవే త్తలు హాజరు కానున్నారు.
→ 'కుటుంబ వ్యాపా రాల భవిష్యత్తు' అంశాన్ని ప్రధాన చర్చనీయాం శంగా ఎంపిక చేశారు.
→ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుటుంబ వ్యాపా రాల నుంచి నేర్చుకోవలసిన అంశాలు, మహిళా నాయకత్వం, కుటుంబ వ్యాపారాల్లో మానవ వనరుల వృద్ధి, వివాదాల పరిష్కార మార్గాలు, సంక్షోభాలను తట్టుకోవడం ఎలా.. అంశాలపై చర్చలు నిర్వహిస్తారు.
→ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా 'కుటుంబ అనుబంధాలను కొనసాగిస్తూనే, కుటుంబ వ్యాపారాల నిర్మాణం నుంచి వాటిని విజయవంతంగా నిర్వహించడంపై అవగాహన పెంచుకునే అవకాశం కలుగుతుంద'ని ఐఎస్బీ ప్రొఫెసర్లు సౌగతా రే, కవిల్ రామచంద్రన్ తెలిపారు. దాదాపు 30 కుటుంబ వ్యాపార సంస్థల ప్రతినిధుల అనుభవాలను తెలుసుకు నేందుకు, కుటుంబ వ్యాపారాలపై ఎంతో అను భవం ఉన్న నిపుణుల ఉపన్యాసాలు వినేం దుకు ఈ సదస్సు వీలు కల్పిస్తుందని తెలి పారు. ఆసియా ఖండంలోనే అత్యున్నత సద స్సుగా గుర్తింపు పొందిన దీనికి, 350 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతాయని అంచనా. వేస్తున్నట్లు రామచంద్రన్ వివరించారు.

బ్రాండ్ సంరక్షకుల్లో ముకేశ్ No.1

→అంతర్జాతీయంగా రెండో స్థానం
→తొలి 10 ర్యాంకుల్లో మనవాళ్లే ఏడుగురు
→బ్రాండు విలువను పరి రక్షించే సామర్థ్యపరంగా భారతీయ/ భారత సంతతి సీఈఓల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీకి మొదటి స్థానం దక్కింది.
→మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంటే ఆయన ముందున్నారు.
→ప్రపంచ వ్యాప్తంగా రెండోస్థానంలో ముకేశ్ నిలిచారని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.
→కార్పొరేట్ బ్రాండు విలువ బలపరిచేలా, బ్రాండ్ గార్డియన్షిప్ (సంరక్షక) సూచీని 2023 సంవత్సరానికి ఈ సంస్థ రూపొందించింది.
→'కంపెనీ బ్రాండు విలువను, దీర్ఘకాలిక వాటాదార్ల ప్రయోజనాలను కాపాడే విషయంలో సీఈఓకు ఉన్న సమ ర్థతను లెక్కలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు 2023 నివే దికలో బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ఇందుకోసం షేరు కదలిక, పనితీరు, పెట్టుబడులు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

టాటా బోయింగ్ ఏరోస్పేస్ నుంచి అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్జ్

→ఏహెచ్- 64 అపాచీ హెలికాప్టర్ మొదటి ఫ్యూజ్ జ్ (కీలక మధ్య భాగం) ను భారత సైన్యానికి టాటా బోయింగ్ ఏరో స్పేస్ అందించింది.
→హైదరాబాద్ లోని యూనిట్ నుంచి 6 ప్యూజ్లజ్లు సరఫరా చేసినట్లు టాటా బోయింగ్ ఏరోస్పేస్ వెల్లడించింది. దీన్ని పెద్ద మైలురాయిగా అభివ ర్ణించింది.
→ప్రపంచ స్థాయి తయారీ ప్రమాణాలను అందుకుని, ఈ ఘనత సాధించినట్లు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తా అన్నారు.
→గత రెండేళ్లలో భారత వాయు సేనకు బోయింగ్ ఏహెచ్- 64ఇ అపాచీ హెలికా ప్టర్లు 22 సరఫరా చేసిందని ఆయన గుర్తుచేశారు.
→బోయింగ్ 737, 777 మోడళ్లకు అనువైన ఏరో-స్ట్రక్చర్లను, అపాచీ ఫ్యూజ్జ్లను హైదరాబాద్లో ఉత్పత్తి చేస్తున్నారు.
→రక్షణ తయారీలో అత్యున్నత ప్రమాణాలు అందుకునేం దుకు తాము సిద్ధంగా ఉన్నట్లు, అపాచీ ఫ్యూజ్జ్ల సరఫరా దీనికి ఉదా హరణగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ సుకరన్ సింగ్ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్లో డైనోసార్ గుడ్లు

→ధార్ జిల్లాలోని ఐదు గ్రామాల్లో గుర్తింపు
→256 భారీ సైజు ఎగ్స్ స్వాధీనం
→ఇప్పటిదాకా ఎక్కడా ఇన్ని దొరకలేదంటున్న సైంటిస్టులు
→ మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో అతిపెద్ద డైనోసార్లు జీవించినట్టు ఇండియన్ సైంటిస్టులు చెబుతున్నారు.
→ మొత్తం 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజు టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కూడా కనుగొ న్నారు.
→ ఇప్పటి దాకా ఇంత భారీ స్థాయిలో ఎగ్స్ ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని సైంటిస్టులు అంటున్నారు.
→ వీటిలో చాలా అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్టు తెలిపారు.
→ నర్మదా వ్యాలీలో డైనోసార్ జాతులు, అక్కడి వా తావరణంపై సమాచారం సేకరించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడ్తాయని అంటున్నారు.
→ ధార్ జిల్లాలోని బాగ్ - కుక్షి ప్రాంతాల్లో సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి.
→ అఖాడా. ధోలియా రాయ్ పురియా, ఝబా, జమ్ని యాపూరా, పడియా గ్రామాల్లో ఎక్కువ గుడ్లు బయటపడ్డాయని జర్నల్ ప్లోస్ వన్లో దీనికి సం బంధించిన న్యూస్ పబ్లిష్ అయ్యింది.
→ ఈ ప్రాంతం సెంట్రల్ ఇండియా అప్పర్ నర్మదా లోయలోని జబల్పూర్ (మధ్యప్రదేశ్), వెస్ట్రన్ సెంట్రల్ ఇం డియాలోని లోయర్ నర్మదా లోయ, పశ్చిమాన ఉన్నబాలాసినోర్ (గుజరాత్) మధ్య ఉంది.
→ 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం.. 250కంటే ఎక్కువ టైటానోసార్ ఎగ్స్ తో పాటు హేచరీస్ ను కనుగొన్నదని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్నటీం తెలిపింది.
→1928లో ఫస్ట్ టైం గుర్తింపు టైటానోసార్ సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్లు ఇప్పటివరకు భూమిపై నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి.
→ఇవి పొడవైన మెడ, తోక, చిన్న తల, స్తంభాల్లాంటి నాలుగు కాళ్లు కలిగి ఉంటాయి.
→ఈ ప్రాంతంలో ఫస్ట్ డైనోసార్ అవశేషాలను 1928లో జబల్పూర్ దగ్గ ర్లో కెప్టెన్ స్లీమన్ గుర్తించారు.
→అప్పటి నుంచి ఈ ఏరియాలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మ డెన్నిస్, రాహియోసారస్ గుజరాటెన్సిస్, ఇం దోసుచస్ రాస్టోరియస్. ఇండోసారస్ మాట్టేయి. లేవిసుచస్ ఇండికస్, జైనోసారస్ సీఎఫ్ వంటి డైనోసార్ జాతులున్నాయి.
→సెప్టెంట్రియోనాలిస్, ఇసిసారస్ కోల్బెర్టి, టైటానోసారి ఫార్మ్స్ ఇండెట్, టైటానోసార్లలో తొమ్మిది బిస్పెసీలు ఉన్నాయని స్టడీలో తేలింది.
→ఇండియన్ సబ్ కాంటినెంటల్లో నివసించిన టైటానోసార్ ఎగ్స్ వేరే ప్రాంతాలతో పోలిస్తే డిఫెరెంట్ గా ఉన్నట్టు గుర్తించారు.
→పక్షుల మాదిరి గుడ్డు పెట్టే లక్షణానికి అనుగుణంగా ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
→తాబేళ్లు, బల్లుల మాదిరిగానే డైనోసార్లకు పునరుత్పత్తి వ్యవస్థ ఉందా అనే దానిపై పరిశోధనలు చేయ దానికి ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
→కొన్ని మిలియన్ ఏండ్ల కింద ఇవి ఇండియన్ భూభాగంలో సంచరిస్తుండేవి. ఈ డైనోసార్ల శిలాజాలు గతంలో గుజరాత్, మధ్యప్ర దేశ్, మేఘాలయలో కూడా బయటపడ్డాయి.

పాలకుర్తిలో దీప స్తంభ శాసనం

→ జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దీప స్తంభ శాసనం ఉందని చరిత్ర పరిశోధకుడు తెలిపారు.
→ ఆలయాన్ని సంద ర్శించినట్లు ఆయన పేర్కొ న్నారు.
→ స్తంభంపై ఆలయ ముఖంగా గరుత్మంతుడు, సుమారు 10 వరుసల్లో వాక్యాలు ఉన్నాయని అందులోని లిపిని బట్టి ఈ దీప స్తంభం 16వ శతాబ్దానికి చెందినదిగా గుర్తిం చామని పేర్కొన్నారు.
→ ఏళ్లుగా రంగు, సున్నం వేస్తుం డడంతో గుర్తు పట్టలేని విధంగా దీప స్తంభం మారిం దన్నారు.
→ ఆలయానికి ఈ స్తంభం పురాతన చారిత్రక ఆధారమని ఆయన వివరించారు. శిలపై ఒక చక్రం గంటు చిత్రంతో ఉందని ఇది కూడా చరిత్రను తెలి యజేస్తుందన్నారు.
→ దిగువన వీరాంజనేయ దీప స్తంభ శాసనాన్ని శిల్పాలు ఉన్నాయన్నారు.

శృంగేరీ పీఠంలో సిద్ధమైన శారదామాత విగ్రహం LOC సమీపంలో కొలువుదీరనున్న అమ్మవారు

→ కశ్మీరు లోని నియంత్రణ రేఖ (ఎల్ ఓసీ) సమీప ఆలయంలో ప్రతిష్ఠించనున్న శారదా మాత విగ్రహం కర్ణాటకలోని శృంగేరి శారదామాతా పీఠం(సరస్వతీ దేవి) సిద్ధం చేసింది.
→ ఈ పంచలోహ విగ్రహాన్ని అక్కడికి తరలించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే అక్కడికి తీసుకెళ్లనున్నట్లు సేవ్ శారదా కమిటీ కశ్మీర్ వ్యవస్థాపకుడు రవీం దర్ పండిత్ తెలిపారు.
→ ఎల్ఓసీకి సమీపం లోని టీట్వాల్ గ్రామంలో జీర్ణోద్ధరణ చేసిన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిం చనున్నట్లు వెల్లడించారు.
→ శృంగేరి నుంచి బెంగళూరు, ముంబయి, పుణె, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ మార్గాల్లో ప్రతిమను రథంలో తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
→ మార్చి 22న ఆలయంలో ప్రతిష్ఠిస్తామన్నారు. టీట్వా ల్లో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు శారదా పీఠం మద్దతుగా నిలుస్తోందని తెలిపారు.
→ శృంగేరి ఆలయంలోని అమ్మ వారి విగ్రహ నమూనానే కశ్మీరుకు పంపిస్తు న్నామని మఠం ముఖ్య కార్యనిర్వ హణ అధికారి వీఆర్ గౌరీ శంకర్ తెలిపారు.

భూగర్భ జలాల్లో వృద్ధి

రాష్ట్రంలో 2015 నుంచి 2022 (రుతుపవనాలకు ముందు) మధ్య సగటు భూగర్భ జల మట్టం 4.26 మీటర్లు పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.
'దశాబ్ద కాలంలో నీటి నాణ్యతపై రాష్ట్ర భూగర్భ జలవనరులశాఖ రూపొందిం చిన నివేదికను హైదరాబాద్ విశ్వేశ్వ రయ్య భవన్ కార్యక్రమంలో ఆయన విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. 'కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకంలో 26,700 చెరువుల పునరుద్ధ రణ, చెక్ డ్యాంలు, రీఛార్జి షాఫ్ట్లు, గొలుసుకట్టు చెరువుల అనుసంధానం తదితర కార్యక్రమాలతో జలమట్టం పెరిగింది.
రాష్ట్రానికి కృష్ణా జలాల్లో వాటా కన్నా ఎక్కువగా.. అంటే 680 టీఎంసీల స్థాయిలో జలాలు భూగ ర్భంలో ఉన్నాయి' అని రజతకుమార్ పేర్కొన్నారు.

కేంద్రం ఆమోదిస్తే.. మొదటి స్వలింగ సంపర్క న్యాయమూర్తిగా కృపాల్!

కొలీజియం పై సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వా నికి మధ్య నడుస్తున్న వివాదంలో సీనియర్ న్యాయ వాది సౌరభ్ కృపాల్ పేరు బాగా చర్చలోకి వచ్చింది.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ కృపాల్ కుమారుడైన సౌరభ్ కృపాల్.
దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయవాదిగా 20 ఏళ్ల నుంచి వాదిస్తున్నారు. తాను స్వలింగ సంప ర్కుడినని ఆయనే ప్రకటించుకున్నారు.
ఈ కారణం తోనే సౌరభ్ను దిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించా లని కొలీజియం చేసిన సిఫార్సును కేంద్రప్రభుత్వం ఐదేళ్లుగా ఆమోదించ లేదు.
ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలలో సౌరభ్ ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
అనంతరం ఐక్యరాజ్యసమితిలోనూ కొంతకాలం సేవలందించారు.
2017లో తొలిసారి దిల్లీ హైకోర్టు కొలీజియం సౌరభ్ను న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది.
స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్య మంలో చురుగ్గా పాల్గొన్న సౌరభ్.. న్యాయమూర్తిగా వ్యవహరించేటప్పుడు పక్షపాతం ప్రదర్శించవచ్చని కేంద్రం భావిస్తోంది.
ఆయన స్విస్ జాతీయు డితో సహజీవనంలో ఉన్నారని 'రా' నివేదిక ఇచ్చింది. సదరు వ్యక్తి స్విస్ రాయబార కార్యాలయంలో ఉద్యోగి అని తెలుస్తోంది.
వీటన్నింటినీ తోసిపు చ్చిన సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా పాత సిఫార్సును పునరుద్ధరించింది.
భవిష్యత్తులో ఈ సిఫార్సును కేంద్రం అమోదిస్తే భారత్లో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి స్వలింగ సంపర్కుడు ఆయనే అవుతారు.

ఉత్తమ ఇంక్యుబేటర్ 'టీ హబ్'

భారత్లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న 'టీ హబ్ 'కు 'బెస్ట్ ఇంక్యుబేటర్ ఇండియా' అవార్డు లభించింది.
జాతీయ స్టా ర్టప్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో 'నేషనల్ స్టా ర్టప్ అవార్డులు 2022'ను ప్రదానం చేశారు.

నేపాల్లో విమాన ప్రమాదం

నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చెందారు.
ఖాఠ్మాండు నుంచి టూరిస్టు కేంద్రమైన ఖారా బయల్దేరిన యతి ఎయిర్లైన్స్ విమానం ల్యాండవడానికి కొద్దిసేపటి ముందుఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ దారుణంలో అందరూ మరణించినట్లు భావిస్తున్నారు.

యుకి-సాకేత్ జోడీకి టైటిల్

యుకి బాంబ్రి, సాకేత్ మైనేని జంట బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో ఈ టాప్ సీడ్ జోడీ రుంగ్కాత్, అకిర సాంటిలన్ (ఆస్ట్రేలియా) ద్వయంపై విజయం సాధించింది.
యుకి, సాకేత్ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్ కార్డ్ లభించింది.

జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు

భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్లో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ట్రయల్స్లో డబుల్ 50 మీటర్ల రౌండ్లో 1418 పాయింట్లతో వరల్డ్ రికార్డ్ సాధించింది.

36వ వీఎల్ ఎస్ఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్

36వ వీఎల్ఎస్ఎస్ఐ (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రే షన్) డిజైన్, 22వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ సదస్సును జనవరి 10న హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ సదస్సును కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ వర్చువల్ గా ప్రారంభించారు.
ఆధునిక సాంకేతిక పరిక రాలు, ఐపీ, టూల్స్ డిజైనింగ్ లోని స్టార్టప్ లకు తగిన ప్రోత్సాహం అందించేందుకు 200 మిలియన్ డాలర్లతో ఫ్యూచర్ డిజైన్: పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
ఇంటెల్, క్వాల్కాం, మాస్ చిప్ వంటి సంస్థలకు హైద రాబాద్ కీలకంగా ఉందని, వీఎల్ఎస్ఎస్ఐ రంగ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.

సందీప్ కు మార్ సుల్తానియాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అవార్డు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కు మార్ సుల్తానియాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అవార్డు లభించింది.
ఢిల్లీలో జనవరి 10న 16వ ఐసీఏఐ అవార్డుల ప్రదానోత్సవం జరి గింది. సర్వీస్ విభాగంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నుంచి ఆయన అవార్డును అందుకున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుల్తానియా సీఏ పూర్తి చేసి ఐసీఏ ఐలో సభ్యుడిగా ఉన్నారు.

(ఈసీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అనురాగ్ కుమార్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమి టెడ్ (ఈసీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అనురాగ్ కుమార్ జనవరి 9న నియమితులయ్యారు.
ఈసీఐఎల్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పదోన్నతి. లభించింది. ఈ నియామకానికి ఏసీసీ (ది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబి నైట్) అనుమతించింది.
ఆయన ఈ పదవిలో 2026, జనవరి 31 వరకు ఉంటారు.

పృథ్వీ-2

ఆ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ -2ను జనవరి 10న విజయవంతంగా పరీక్షించారు.
ఈ ఒడిశా తీరంలోని చాందీపూ ర్లో చేపట్టారు. ఈ క్షిపణికి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యం ఉంది.
ఇది 500 కిలోల పేలోడ్ను మోసు కెళ్లగలదు
పృథ్వీ సిరీస్లో పృథ్వీ-1, పృథ్వీ-2, పృథ్వీ-3, ధనుష్ క్షిపణులు |

వరల్డ్ హిందీ డే

ఆ వరల్డ్ హిందీ డే (విశ్వ హిందీ దివస్)ని జనవరి 10న నిర్వహించారు.
1949లో మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్డీఏ)లో హిందీని భార తదేశ అధికారిక భాషగా గుర్తించింది.
దీనికి గుర్తుగా 1975లో నాగ్పూర్లో మొట్టమొ దటి ప్రపంచ హిందీ సదస్సును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు.
ఈ సదస్సు జనవరి 10 నుంచి 12 వరకు జరిగింది. దీంతో 2006లో ప్రధాని మన్మో హన్ సింగ్ జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటిం చారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

7వ ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్-గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిటు జనవరి 11న ప్రారంభించారు.
'మధ్యప్రదేశ్ - ది ఫ్యూచర్ రెడీ స్టేట్' తో రెండు రోజులు ఈ సమ్మిట్ను నిర్వహించారు.
84 దేశాల నుంచి 447 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 401 బయ్యర్లు, ఐదు వేల మంది పారిశ్రామికవే త్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

గంగా విలాస్

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ (నదీ పర్యాటక నౌక 'ఎంవీ గంగా విలాస్'ను వారణాసిలో జనవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించారు.
51 రోజులు సాగే ఈ నౌక ప్రయాణంలో 50 పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గువాహటి, కోల్కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కవర్ అవుతాయి.
రెండు దేశాల్లో కలిపి 27 నదుల్లో ప్రయాణం సాగుతుంది. వారణాసిలో ప్రారంభమై బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్ కు చేరు కుంటుంది.
ఈ నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉంది. విలాసవంత మైన 18 సూట్లు ఉన్నాయి. రూ.68 కోట్లతో దీన్ని నిర్మించారు.

2028 ఒలింపిక్స్లో 6 జట్లతో టీ20 ఈవెంట్!

ఒలింపిక్స్ లో క్రికెట్ను చేర్చే దిశగా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో 6 జట్లతో టీ20 ఈవెంట్ను నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఐసీసీ ప్రతిపాదించింది.
దీనిపై అక్టోబర్లో గా ఐవోసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈలోగా లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో చేర్చే కొత్త ఆటల జాబితాను ఐవోసీ మార్చిలోగా రూపొందించ నుంది.
ఐసీసీ ఒలింపిక్స్ వర్కింగ్ గ్రూప్ లో బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఉన్నాడు.
ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సారథ్యం వహిస్తున్న ఈ బృందంలో ఇంద్రనూయి (డైరెక్టర్), పరాగ్ మారాథె (మాజీ అమెరికా క్రికెట్ సంఘం అధ్యక్షుడు) కూడా సభ్యులు.

అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం

ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూ ర్లో రాత్రి వైభవంగా ప్రారంభమైంది.
మెస్రం వంశస్థులు నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవతకు పూజలు చేసి కేస్లాపూర్లోని మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశ స్టులు.. ఆ చెట్ల నీడలో గంగాజలంతో మూడురోజుల పాటు వివిధ సంప్రదాయ పూజలు చేశారు.
అక్కడి నుంచి వెండి విగ్రహం, పూజా సామ గ్రిని తీసుకొని డోలు, కాలికోమ్ వాయిద్యాలతో ప్రదర్శ నగా ఆలయానికి చేరుకున్నారు.
గంగాజలంతో ఆల యాన్ని శుభ్రపరిచి, నాగోబాకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా డోలు, కిక్రీ వాయిద్యాలతో ఆలయం మార్మోగింది.
ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలతోపాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లోని ఆదివాసీలు తరలివచ్చారు.
ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, పటేల్ మెస్రం బాదరావు, పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహిం చారు.

ఢిల్లీలో 57వ అఖిల భారత డీజీపీ / ఐజీపీల సదస్సు

కాలినడకన గస్తీ నిర్వహించడం వంటి సంప్రదాయ పద్ద తుల్ని మరింత బలో పేతం చేసుకుంటూనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో పోలీసు బలగాలు శిక్షణ పొందా లని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు.
ఢిల్లీలో 57వ అఖిల భారత డీజీపీ / ఐజీపీల సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
కేంద్ర సంస్థలు, రాష్ట్ర పోలీసుల మధ్య సమ న్వయం, సహకారం పెరగాలని మోదీ చెప్పారు.
కాలం చెల్లిన క్రిమినల్ చట్టాలను రద్దు చేయడం తోపాటు పోలీసు విభాగాల కోసం ప్రమాణాలు రూపొందించాలని చెప్పారు.
అధికారులు తరచూ పర్యటించడం ద్వారా సరిహద్దులు, తీరప్రాంత భద్రతలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
పోలీసు వ్యవస్థ, జాతీయ భద్రత, ఉగ్రవాద కట్టడికి చేపడుతున్న చర్యలు, సైబర్ భద్రత వంటి అంశాలను సదస్సు చర్చించింది.
మూడు రోజులపాటు కొనసాగిన సదస్సులో సుమారు 600 మంది అధికారులు పాల్గొన్నారు.
నేపాల్, మయన్మార్ తో సరిహద్దు వివాదాలు, మావో యిస్టుల ప్రాబల్య ప్రాంతాల్లో అనుసరించాల్సిన వైఖరి, కాలపరిమితి తర్వాత కూడా మన దేశంలో కొనసాగుతున్న విదేశీయుల్ని గుర్తించే వ్యూహాలు తదితర అంశాలు దీనిలో చర్చకు వచ్చాయి.
విశిష్ట సేవలందించినవారికి పతకా లను ఈ సదస్సులో ప్రధాని ప్రదానం చేశారు.

క్లోమ క్యాన్సర్కు సరికొత్త చికిత్స!

క్లోమ క్యాన్సర్ చికిత్సకు అద్భుతంగా పనికొచ్చే ఒక ప్రొటీన్ ను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దీని లక్ష్యంగా చేసుకొని కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యా లయ శాస్త్రవేత్తల నేతృ త్వంలో అంతర్జాతీయ పరిశోధక బృందం ఈ ఘనత సాధించింది.
క్లోమ క్యాన్సర్కు సమర్ధ చికిత్స చాలా కష్టం. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి చికిత్సలను ఈ క్యాన్సర్ మూలకణాలు చాలా త్వరగా తట్టుకొని, వాటిని అధిగ మించే సామర్థ్యాన్ని సాధిస్తున్నాయి.
అందు వల్ల ఈ వ్యాధి బారిన పడ్డవారిలో ఐదేళ్ల పాటు జీవించగలుగుతున్నవారు 10 శాతం మంది మాత్రమే.
ఈ నేపథ్యంలో ఎస్ఎంఏ ఆర్సీడీకి అనే ప్రొటీన్పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇది ఎస్ డబ్ల్యూఐ/ ఎస్ఎన్ ఎఫ్ తరగతికి చెందింది.
ఇవి చాలావ రకూ కణితి కట్టడి సాధనాలుగా పనిచేస్తుంటాయి. అయితే క్యాన్సర్లో ఎస్ఎంఏ -ఆర్సీడీ 3 విస్తృతంగా ఉన్నాయి.
ముఖ్యంగా క్లోమ క్యాన్సర్ మూలకణాల్లో అవి భారీగా ఉండటాన్ని గమనించారు. అవి ఈ ప్రొటీన్ ను ఏమార్చి, కీమోథెరపీ ప్రభావాన్ని తప్పించుకునేందుకు ఉపయో గించుకుంటున్నాయి.
తద్వారా అవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని శాస్త్రవే త్తలు తెలిపారు. ఈ ప్రొటీన్ ను తొలగించి నప్పుడు కణితుల వృద్ధి తగ్గిపోయింది.

హిమాలయ శ్రేణుల్లో శాశ్వత ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాలు!

హిమాలయ పర్వత శ్రేణుల్లో శాశ్వత కేంద్రాలను ఏర్పరచాలని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్ఐఆర్ఎఫ్) యోచిస్తోంది.
హిమపాతాలు సంభవించినప్పుడు, కొండచరియలు విరిగిపడిన ప్పుడు ఆకస్మిక వరదలు ముంచెత్తినప్పుడు.. త్వరి తగతిన సహాయక కార్యకలాపాలు ప్రారంభించడా నికి ప్రత్యేక పర్వతారోహక దళాలను ఈ కేంద్రాల్లో మోహరించాలని భావిస్తోంది.

కున్లావుత్ సియంగ్ లకు టైటిళ్లు

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో కునావుత్ వితిధ్సర్న్ (థాయ్లాండ్), ఆన్ సియంగ్ (కొరియా) విజేతలుగా నిలిచారు.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో కున్లాపుత్ 22-20, 10-21, 21-12తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) పై, మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సియంగ్ 15-21, టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్)పై గెలిచి టైటిళ్లు సాధించారు.
పురుషుల డబుల్స్లో లియాంగ్ కెంగ్- వాంగ్ చాంగ్ (చైనా), మహిళల డబుల్స్ లో మత్సుయామా చిహరు (జపాన్), మిక్స్ డ్ డబుల్స్ లో వతనబె- హిగషినా (జపాన్) జోడీలు విజేతలుగా నిలిచాయి.

బ్రెజిల్ ఆర్మీ చీఫ్ తొలగింపు

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొ నారో మద్దతుదారులు ఇటీవల రాజధాని బ్రసీలి యాలో సృష్టించిన అల్లర్లపై అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జూలియో సిజర్ డె అర్రుడాను పదవి నుంచి తొలగించింది.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ ఆర్మీ అధికారిక వెబ్సైట్ వెల్లడించింది.
జూలియో స్థానంలో జనరల్ టొమస్ మిగ్యూల్ రెబెరో పైవాను నియమించినట్లు పేర్కొంది.
సైన్యంలోని కీలక వ్యక్తులే అల్లరి మూకలను రాజధానిలోకి అను మతించారన్న ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకొన్నారు.
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనా రోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితా లను అంగీకరించేందుకు బోల్సొనారో నిరాకరించారు.
ఈ క్రమంలోనే ఈ నెల 8న వేలసంఖ్యలో ఆయన మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని దేశ రాజధానిలోని కీలక భవనాల్లోకి చొరబడ్డారు.
సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టాయి.


గణతంత్ర కవాతుకు 'కోనసీమ ప్రభల తీర్థం' శకటం

కోనసీమ పల్లెల్లో సంక్రాంతి సంబరాలను గణతంత్ర దినోత్సవ కవాతులో ఆంధ్రప్రదేశ్ శకటం ఆవిష్కరించనుంది.
74వ గణ తంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పద్లో గురువారం నిర్వహించే కవాతులో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 'కోనసీమ ప్రభల తీర్థం' నేప థ్యంగా శకటాన్ని రూపొందించారు.
కోనసీమ ప్రభల తీర్థానికి 450 ఏళ్ల కుపైగా చరిత్ర ఉంది. టేకు చెక్కలు, వెదురు బద్దలు, తాటి శూలం, మర్రి ఊడలు, రంగుల నూలు దారాలు, నెమలి పింఛాలు, వరి కంకులు, కూరగాయలతో రూపొందించిన ప్రభలు ఏపీ శకటంపై కనువిందు చేయనున్నాయి.
ప్రజలంతా కరవుకాటకాలు లేకుండా సంతోషంగా జీవిం చాలనే ఉద్దేశంతో ప్రభల తీర్థం నిర్వహిస్తారని పౌర సంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.
కోనసీమలో ప్రభల తీర్థా నికి ప్రభలు ఎలా తీసుకెళ్ళతారు.. పచ్చని పొలాల మధ్య నుంచి ఎద్దుల బండిపై ఓ కుటుంబం తీర్థానికి ఎలా వెళుతుందనే విషయాన్ని కళ్లకు కట్టేలా శకటంపై తీర్చిదిద్దామని ఆయన చెప్పారు.
తీర్థంతో పాటు సంప్రదాయ గరగ నృత్యాన్ని ప్రదర్శిస్తామని వెల్లడించారు. శకటంపై నిజమైన కొబ్బరి చెట్లను అమర్చినట్లు ఆయన తెలిపారు.

చిరుధాన్య ఉత్పత్తుల ప్రదర్శనలో రైతు సాధికార సంస్థ స్టాల్ కు రెండో బహుమతి

→ 'చిరుధాన్యాలు, ఆర్గానిక్స్ 2023 పేరిట మూడు రోజుల పాటు బెంగళూరులో నిర్వహిం చిన ప్రదర్శనలో ఏర్పాటుచేసిన స్టాల్కు రెండో బహుమతి దక్కిందని రైతు సాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
→ సేంద్రియ చిరుధాన్యా లకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో మహారాష్ట్ర, ఉత్త రాఖండ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రైతులు హాజరయ్యా రని, రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి 50 మంది రైతులు తమ ఉత్పత్తు లను ప్రదర్శించారని వివరించింది.
→ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతులు మీదుగా రైతు సాధికార సంస్థ అధికారి ప్రభాకర్ అవార్డు అందుకున్నారని పేర్కొంది.

పర్యాటక ప్రాంతంగా రంగనాయకసాగర్ రూ.125 కోట్ల అంచనాతో టెండర్లు

→ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైంది.
→ సిద్దిపేటకు 10 కి. మీ. దూరంలోని ఈ జలాశయం వద్ద రూ.125 కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది.
→ బిడ్ డౌన్లోడింగ్ సోమవారం ప్రారంభం కానుంది. దాదాపు 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎప్పుడూ జలాలతో కళకళలా డుతుంటుంది.
→ రిజర్వాయర్ మధ్యలో ద్వీపంలా గుట్ట ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
→ కాళేశ్వరం సర్క్యూట్లో భాగంగా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపో చమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతా లుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించింది.
→ జలాశయాల్లో బోటింగ్, పక్కన పర్యాటకులకు సౌకర్యాలు, రిజర్వాయర్ల వెంట పచ్చ దనం పెంచడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.

అసర్ 2022 నివేదిక

→అసర్ (ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) - 2022 నివే దికను ప్రథమ్ సంస్థ 2023, జనవరి 18న విడుదల చేసింది. 2018 తర్వాత నాలుగేళ్లకి ప్రథమ్ ఈ సర్వేను ప్రకటిం చింది.
→జాతీయ స్థాయిలో పాఠశాల విద్యా రంగం. వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఆధా రంగా గణాంకాల రూపంలో దీన్ని రూపొందించింది.
→ జాతీయస్థాయిలో గత 15 ఏళ్లలో 6-14 ఏళ్ల వయసు పిల్లల చేరికలు 95 శాతం లోపు ఉండగా, 2018 నాటికి 97.2 శాతానికి పెరిగాయి. 2022లో ఇవి 98.4 శాతానికి చేరాయి.
→ మూడేళ్ల వయసు పిల్లలకు జాతీయస్థా యిలో 78.3 శాతం మందికి బాల్య విద్యఅందుతున్నట్లు సర్వే 2018 లో ఇది 71.2 శాతంగా ఉంది.
→మూడేళ్ల వయసు తర్వాత స్కూల్, అంగ న్వాడీ కేంద్రాల్లో చేరేవారి సంఖ్య 2018లో 57.1 శాతం ఉండగా, అది 2022లో 66.8 శాతానికి పెరిగింది.
→నాలుగేళ్ల వయసు చిన్నారులు చేరికలు. 50.5 శాతం నుంచి 61.2 శాతానికి పెరిగాయి.
→ జాతీయ స్థాయిలో 2018లో టీచర్ల హాజరు 85.4 శాతం ఉండగా, 2022 నాటికి 87.1 శాతానికి పెరిగింది.

నాసా చీఫ్ టెక్నాలజీస్ భారతీయ అమెరికన్

→అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' చీఫ్ టెక్నాలజిస్ట్ భారతీయ అమెరికన్ ఏసీ చరానియా నియమితు లయ్యారు. ఈయన 2023, జనవరి 30 బాధ్యతలు స్వీకరించారు.
→ వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కార్యాల యంలో అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సను టెక్నాలజీ పాలసీ, ప్రోగ్రామ్ ప్రధాన సలహాదారుడిగానూ ఈయన సేవలు
→ ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న భారతీయ అమె రికన్ సైంటిస్ట్ స్థానంలో ఈ నియామకం జరిగింది.

పరాక్రమ్ దివస్: నేతాజీ గుర్తుగా నిర్మించనున్న స్మారకాన్ని ఆవిష్కరించిన మోదీ

→భారత చరిత్రకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసమాన సేవ చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.
→సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకొని మోదీ, ఆయనకు నివాళులు అర్పించారు.
→ఈ మేరకు ట్వీట్ చేశారు.
→"నేడు పరాక్రమ దినోత్సవం సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోసు నా నివాళులు. ఆయన దేశ చరిత్రకు అసమాన సేవ చేశారు. వలస పాలనకు వ్యతిరేకంగా ఆయన కనబరిచిన ధీరత్వం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆలోచనలు స్ఫూర్తిని రగిలించాయి. ఆయన కలగన్న భారతన్ను నిర్మించేందుకు మేం కృషి చేస్తున్నాం" అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
→సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23వ తేదీని భారత ప్రభుత్వం 'పరాక్రమ దివస్'గా 2021లో ప్రకటించింది.

అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు

→సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు.
→ఈ కార్యక్రమానికి మోదీ వర్చువల్ గా హాజరయ్యారు.
→అలాగే నేతాజీ గుర్తుగా "నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం"లో నిర్మించనున్న జాతీయ స్మారకాన్ని ఆయన ఆవిష్కరించారు.

నేవీలో చేరిన ఐఎన్ఎస్ వాగీర్

→భారత నౌకాదళంలో కలవరి శ్రేణికి చెందిన అయిదో జలాంతర్గామి 'వగీర్'
→ కల్వరీ తరగతికి చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ భారత నేవీలో అధికారికంగా చేరింది.
→'ప్రాజెక్ట్ 75'లో భాగంగా స్కార్పియన్ సాంకేతికతతో మజగావ్ డాక్ షిబిల్డర్స్ ఐఎన్ఎస్ వాగీరు నిర్మించింది.
→దీని కోసం ఫ్రాన్స్ నావల్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది.
→వైర్ గైడెడ్ టార్పెడోలు, పా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు,అత్యంత శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్లు, అత్యాధునిక సెన్సర్లు, టార్పెడో డెకాయ్, సోనార్, స్టెల్త్ వ్యవస్థలతో వాగీరు అత్యున్నత సాంకేతికతతో నిర్మించారు.
→ వాగీర్ అంటే షార్క్ అని అర్ధమని, షార్క్క ఉండే గోప్యత, నిర్భయత్వం దీని సొంతమని భారత నేవీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
→ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) దీన్ని నిర్మించింది.
→పోయిన ఏడాది డిసెంబర్ 20న భారత నౌకాదళానికి దాన్ని అప్పగించారు. ప్రస్తుతం నేవీలో నాలుగు కలవరి శ్రేణి సబ్మెరైన్లు ఉన్నాయి.
→శత్రువుల కంట పడకుండా సంచరించగల ఆధునిక టెక్నాలజీ వగీర్ ఉందని, ఇది సముద్రజలాల్లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
→భారత నౌకాదళంలో 1973లో తొలిసారి 'నగీర్ 'ను తీసుకొచ్చారు. మూడు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఆ జలాంతర్గామిని 2001లో డీకమిషన్ చేశారు.

ఇన్ఫెక్షన్ మరణాలను తగ్గించే ప్రొటీన్

→ తీవ్రస్థాయి ఇన్ ఫెక్షన్లతో జరిగే మరణాలను తగ్గించడంలో ఒక ప్రొటీన్ పాత్రను జపాన్ శాస్త్రవే త్తలు గుర్తించారు.
→ శరీరం మొత్తానికి ఆక్సిజన్, పోషక పదార్థాలను చేరవేయడంలో రక్తప్రస'రణ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
→ ఈ రక్త నాళాల గోడలకు పూతగా ఉండే కణాల మధ్య ఖాళీని వాస్క్యులర్ పర్మియబులిటీగా పేర్కొంటారు.
→ రక్త నాళాలకు పరిసరాల్లోని కణజాలానికి మధ్య వివిధ రకాల పదార్థాల మార్పిడి సజావుగా సాగేలా ఇది చూస్తుంది.
→ ఇన్ఫెక్షన్ కు శరీర రోగ నిరోధక వ్యవస్థ స్పందించే సమయంలో పర్మియబులిటీ వల్ల ముఖ్య మైన రోగ నిరోధక కణాల కదలికలు సాఫీగా సాగు తాయి.
→ ఇది ప్రమాదకరమైన సూక్ష్మజీవుల నిర్మూలనకు దోహదపడుతుంది. అయితే ఈ పర్మియబులిటీ మరీ ఎక్కువగా ఉంటే తీవ్ర విపరిణామాలు తప్పవు.
→కొవిడ్- 19 వంటి తీవ్ర ఇన్ఫెక్షన్ల సమయంలో ఇది చోటుచేసు కుంటుంది. దీనివల్ల అవయవాలు దెబ్బతినడంతోపాటు మరణం సంభవిస్తుంది.
→రక్తనాళం లోపలి పొర (ఎండో థీలియల్)ల్లోని కణాల్లో ఉండే రోబో4 అనే కీలక ప్రొటీ న్కు వాస్క్యులర్ పర్మియబులిటీలో ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
→ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవే త్తలు.. దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ సమస్యను అదుపు చేయవచ్చా అన్నది తేల్చేందుకు ఎలుకలపై పరి శోధనలు జరిపారు.
→ఏఎల్కే ఇన్హిబిటర్ మందులతో చికిత్స చేస్తే రోబో4 ప్రొటీన్ స్థాయి పెరుగుతుందని, దీనివల్ల పర్మియబులిటీ తగ్గుతుందని తేల్చారు.

అంగారకుడిపై 'సాలిటరీ తరంగాలు'

→ అంగారక గ్రహ వాతావరణంలో 'సాలిటరీ తరంగాల' ఉని కిపై తొలిసారిగా శాస్త్రవేత్తలు ఆధారాలు సంపాదించారు.
→ ముంబయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నెటిజం (ఐఐజీఎం)కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
→ అంగారకుడి అయస్కాంత వలయం (మ్యాగ్నెటోస్పియర్)లోని విద్యుత్ క్షేత్రంలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను సాలిటరీ తరంగాలుగా పిలుస్తారు.
→ వీటి ఉనికికి సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకూ వెలుగు చూడలేదు. భారతీ కాకడ్ నేతృత్వంలోని ఐఐజీఎం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు సాగించారు.
→ అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన 'మావెన్' వ్యోమనౌక అందించిన డేటాను విశ్లేషించారు.
→ 450 సాలిటరీ తరంగాల ఉని కిని గుర్తించారు. వాతావరణంలోని ప్లాస్మా దశ, ఇతర ప్రాథమిక భౌతిక శాస్త్ర ప్రక్రి యల గురించి అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి.

సుదూర నక్షత్రమండలం నుంచి రేడియో సంకేతం

→ విశ్వంలో సుదూర నక్షత్ర మండలం (గెలాక్సీ)లోని పరమాణు హైడ్రోజన్ నుంచి వెలువడిన ఒక రేడియో సంకేతాన్ని కెనడా, భారత్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
→ ఇంత దూరం నుంచి వచ్చిన ఇలాంటి సిగ్నల్ను పసి గట్టడం ఇదే మొదటిసారి.
→ ఇందుకు పుణెలోని జయంట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎం ఆర్డీ)ను ఉపయోగించారు.
→ పరమాణు హైడ్రో జన్ అనేది ఒక గెలాక్సీలో నక్షత్ర ఆవిర్భావానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం.
→ సమీపంలోని వేడి అయనైజ్డ్ వాయువు.. గెలాక్సీలోకి వచ్చిప డినప్పుడు అది చల్లబడుతుంది.
→ అనంతరం పర మాణు హైడ్రోజన్ గా మారుతుంది. తర్వాత అది మాలిక్యూలర్ హైడ్రోజన్గా రూపాంతరం చెందు తుంది.
→అంతిమంగా అది నక్షత్ర ఆవిర్భావానికి దారితీస్తుంది. పరమాణు హైడ్రోజన్.. 21 సెంటీ మీటరు తరంగదైర్ఘ్యంలో రేడియో తరంగాలను వెలువరిస్తాయి.
→అందువల్ల వాటిని జీఎంఆర్టీ వంటి తక్కువ పౌనఃపున్య రేడియో టెలిస్కోపు లతోనే గుర్తించవచ్చు.
→అయితే తాజా తరంగం చాలా సుదూర గెలాక్సీ నుంచి వచ్చినందు వల్ల అది బలహీనంగా ఉంది.
→జీఎంఆర్టీ డేటాను విశ్లేషించిన కెనడాలోని ట్రాటియర్ స్పేస్ ఇన్స్టి ట్యూట్, బెంగళూరులోని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించగలిగారు.
→'గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే పోకడ వల్ల ఇది సాధ్యమైంది.

మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస

→లష్కరే తోయిబా(ఎల్ ఈటీ) డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవా దిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిర్ణయం తీసుకుంది.
→భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎల్, ఆల్వైదా ఆంక్షల కమిటీ మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
→భారత్, అమెరికా ఈ మేరకు ప్రతిపాదన చేయగా ఏడు నెలల క్రితం చైనా అడ్డుపడింది. తాజాగా డ్రాగన్ తన అభిప్రాయాన్ని మార్చుకో వడంతో ఈ నిర్ణయం వెలువడింది.
→మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో అత డికి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ప్రయా ణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం మొదలై నవి అమలులోకి వస్తాయి.
→తన మిత్రపక్షాలతో కలిసి పోరాటం చేస్తున్న భారత్కు ఇది అద్భుత దౌత్య విజయమని ఐరాసలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి టి.ఎస్. తిరుమూర్తి వ్యాఖ్యానిం చారు.
→మక్కీ లాహోర్లో గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐరాస నిషేధిత జాబితాలో పాకిస్థాన్ కు చెందిన లేదా పాకిస్థా నో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవా దుల సంఖ్య సుమారు 150కి చేరింది.

జాతీయ భద్రత ఉప సల హాదారునిగా పంకజ్ కుమార్ సింగ్

→జాతీయ భద్రత ఉప సల హాదారునిగా (డిప్యూటీ ఎన్ఎస్ఏగా) పంకజుమార్ సింగ్ నియమితులు య్యారు.
→రాజస్థాన్ క్యాడర్ 1988 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన 'సరిహద్దు భద్రతా దళం' (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో గత నెల 31న పదవీ విరమణ చేశారు.
→రెండేళ్ల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన ఆయన్ని డిప్యూటీ ఎన్ఎస్ఏగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
→దేశంలో పోలీసు సంస్కరణలకు మూలస్తంభంగా ఆయన పేరొందారు.
→పంకజ్ కుమార్ తండ్రి ప్రకాశ్ సింగ్ (1959 బ్యాచ్ ఐపీఎస్) కూడా బీఎస్ ఎఫ్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం.

అయిదో అత్యధిక వేడి ఏడాదిగా 2022

→ భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత 2022లో అత్యధికంగా నమోదైనట్లు నాసా నివే దిక తేల్చింది.
→ దీంతో ఆ ఏడాది అయిదో అత్య ధిక వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది.
→ నాసా నిర్దేశించిన 1951-1980 మధ్య కాల ఉష్ణోగ్రత సగటు కంటే 2022లో 1.6 డిగ్రీల ఫారెన్హీట్, లేదా 0.89 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమో దైంది.
→ ఈ మేరకు న్యూయార్క్ లోని నాసాకు చెందిన గొడ్డార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కృష్ణ వావిలాల కు మార్టిన్ లూథర్ కింగ్ గ్రాండ్ పరేడ్ స్పెషల్ అవార్డు గ్రహీత

→అమెరికన్ మాన వహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ (ఎంఎల్కే) జూనియర్ జయంతి (జనవరి 15) సందర్భంగా కృష్ణ వావిలాలకు ఎంఎల్కే గ్రాండ్ పరేడ్ స్పెషల్ అవార్డు అందజేశారు.

→హ్యూస్టన్ లో నివాసం ఉంటున్న కృష్ణ బిట్స్ పిలాని పూర్వ విద్యార్థి. ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పదవీ విరమణ పొంది, 'ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్టడీస్ (ఎఫ్ఎస్ఐఎస్) సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.

→గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ అనుసరించిన అహింస విధాన వ్యాప్తికి గతంలో అమెరికాలో జరిగిన పలు గ్రాండ్ పరేడ్లలో ఈయన మహాత్ముడి వేషధార ణలో పాల్గొని ప్రచారం చేశారు.


ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి మృతి

→ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డు కెక్కిన ఫ్రాన్స్కు చెందిన బామ్మ లూసిల్ రాండన్ కన్నుమూసింది. వయసు 118 ఏళ్లు.
→ బ్రన్యాస్ మోరేరా ప్రస్తుతం ప్రపంచంలో మున 2 గంటలకు
→ దక్షిణ ఫ్రాన్స్ టౌలోన్ పట్టణంలోని నర్సింగ్ హోమ్లో ఆమె తుది శ్వాస విడిచారు.
→క్రైస్తవ సన్యా సిని అయిన లూసిల్ రాండన్ 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్ లోని అలెస్ పట్టణంలో జన్మించారు.
→రాండన్ మరణంతో అమెరికాకు చెందిన 115 ఏళ్ల మారియా బ్రన్యాస్ మోరేరా అత్యంత వృద్ధురాలిగా రికార్డుల్లో మిగలనున్నారు.

ట్విటర్ లో ప్రభావిత వ్యక్తుల్లో కేటీఆర్

→సామాజిక మాధ్యమాల్లో ప్రభావిత వ్యక్తుల (ఇన్ ఫ్లుయన్సర్స్) జాబితాలో కేటీ రామారావు 12వ స్థానంలో నిలిచారు.
→వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా కేకోర్ అనా లిటిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో మొదటి 30 మంది ప్రభా విత వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.
→ఇందులో తెలంగాణ ఐటీ శాఖకు చెందిన అధికారిక ఖాతా 22వ స్థానం పొందింది.
→ ఈ జాబితాలో కేటీఆర్ తో పాటు ఢిల్లీకి చెందిన ఆమాద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాలు మాత్రమే భారతీయులు. రాఘవ్ చద్దా 23వ స్థానం పొందారు.
→ట్విటర్లో రాజకీయా లతో పాటు ప్రజా సమస్యలపై కేటీఆర్ ఎప్ప టికప్పుడు స్పందిస్తారు.
→నిత్యం నెటిజన్ల నుంచి తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తూ అండగా నిలుస్తున్నారు.

భారతీయ రైల్వేల కోసం అమృత్ భారత్ స్టేషన్ పథకం

→దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పథకాన్ని ప్రారంభించింది.
లక్ష్యం:- దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన 1,000 కంటే ఎక్కువ స్టేషన్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి.
→రైల్వే స్టేషన్‌లలోని అన్ని కేటగిరీలలో హై లెవల్ ప్లాట్‌ఫారమ్‌లు (760 నుండి 840 మి.మీ) ఏర్పాటు చేయబడతాయి.
→ప్లాన్‌లో దాని వినియోగదారులకు ఉచిత వైఫై యాక్సెస్‌ను అందించడానికి నిబంధన ఉంది.
→రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తారు

స్టార్టప్ మెంటర్‌షిప్ కోసం MAARG పోర్టల్‌

→వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ MAARG ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు (మార్గదర్శకత్వం, సలహా, సహాయం, స్థితిస్థాపకత మరియు వృద్ధి- Mentorship, Advisory, Assistance, Resilience, and Growth)
→రంగాలు, దశలు మరియు విధుల్లో స్టార్టప్‌లు మరియు వ్యవస్థాపకుల మధ్య మెంటర్‌షిప్‌ను పోర్టల్ సులభతరం చేస్తుంది.
→గోయల్ నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 ఫలితాలను కూడా ప్రకటిస్తారు విజేత స్టార్టప్‌లకు రూ. 5 లక్షల నగదు బహుమతి ఇవ్వబడుతుంది.
→ఒక అసాధారణమైన ఇంక్యుబేటర్ మరియు ఒక యాక్సిలరేటర్ ఒక్కొక్కటి రూ. 15 లక్షల నగదు బహుమతిని కూడా పొందుతాయి

యూరప్‌లో అరుదైన మూలకాల నిక్షేపం

→స్వీడిష్ ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ కంపెనీ, LKAB, దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువ అరుదైన ఎర్త్ ఆక్సైడ్‌లను కనుగొంది.
→ఇది ఐరోపాలో తెలిసిన అతిపెద్ద నిక్షేపం.
→ప్రస్తుతం, ఇది ఎక్కువగా ఇతర ప్రాంతాల నుండి వాటిని దిగుమతి చేసుకుంటుంది.
→యూరోపియన్ యూనియన్ ఉపయోగించే దాదాపు 98 శాతం అరుదైన ఎర్త్‌లు చైనా పంపినవే.
→అరుదైన భూమి మూలకాలు లేదా అరుదైన భూమి లోహాలు ఆవర్తన పట్టికలోని 17 రసాయన మూలకాల సమితి.

భారతదేశంలో ‘సోల్ ఆఫ్ స్టీల్’ ఛాలెంజ్ ప్రారంభించబడుతుంది

→ఉత్తరాఖండ్‌లో 'సోల్ ఆఫ్ స్టీల్' ఛాలెంజ్ ప్రారంభించబడింది,
→యాత్ర యొక్క ప్రాంతం నందా దేవి నేషనల్ పార్క్.
→ఈ సవాలు CLAW గ్లోబల్ యొక్క చొరవ మరియు దీనికి భారత సైన్యం మద్దతునిస్తోంది.
→సోల్ ఆఫ్ స్టీల్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, నైపుణ్యం సెట్‌లను పూల్ చేయడం మరియు ఎత్తైన ప్రదేశాలలో మనుగడ, స్థిరీకరించడం మరియు వృద్ధి చెందగల మానవ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసే సవాలును సృష్టించడం.

ప్రధాని మోదీ ‘ఆరోగ్య మైత్రి’ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు

→వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ “ఆరోగ్య మైత్రి” ప్రాజెక్ట్‌ను ప్రకటించారు
→ఈ ప్రాజెక్ట్ ద్వారా, ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశానికి అవసరమైన వైద్య సామాగ్రిని దేశం అందిస్తుంది.
→ఈ దేశాలకు అభివృద్ధి పరిష్కారాలను సులభతరం చేసేందుకు 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు
→అలాగే, అంతరిక్ష సాంకేతికతలో తన నైపుణ్యాన్ని పంచుకోవడానికి భారతదేశం గ్లోబల్ సౌత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్‌ను ప్రారంభించనుంది

COP28 అధ్యక్షుడిగా సుల్తాన్ అల్-జాబర్‌

→ఈ సంవత్సరం COP28 వాతావరణ చర్చలకు UAE యొక్క జాతీయ చమురు కంపెనీ (Abu Dhabi National Oil Company (ADNOC))అధ్యక్షుడు సుల్తాన్ అల్-జాబర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
→ADNOC యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ UN సమ్మిట్‌లో పాత్ర పోషించిన మొదటి CEO అవుతారు.
→జబర్ వాతావరణ మార్పుల కోసం గల్ఫ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి మరియు 10 కంటే ఎక్కువ COP(The Conference of Parties (COP)) సమావేశాలలో పాల్గొన్నారు.
→కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా COP అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వాతావరణ సమావేశం.

జాతీయ యువజన దినోత్సవం: జనవరి 12

→జాతీయ యువజన దినోత్సవం భారతదేశంలోని ప్రజల హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది మరియు జ్ఞానాన్ని అందిస్తుంది.
→ దేశంలో సక్రమంగా ప్రవర్తించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన రోజు.
→ యువతను చైతన్యపరచడం ద్వారా స్వామి వివేకానంద ఆలోచనలను వ్యాప్తి చేయడం ద్వారా దేశానికి మంచి భవిష్యత్తును అందించడమే ఈ వేడుకల వెనుక ప్రధాన లక్ష్యం. జాతీయ యువజన దినోత్సవాన్ని యువ దివస్ అని కూడా పిలుస్తారు.

జాతీయ యువజన దినోత్సవం: చరిత్ర

→1984లో, భారత ప్రభుత్వం తొలిసారిగా స్వామి వివేకానంద జన్మదినాన్ని అంటే జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది.
→అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
→స్వామి వివేకానంద జీవిత విధానం, ఆలోచనల ద్వారా యువతను చైతన్యవంతం చేయడం ద్వారా దేశానికి మంచి భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. యువతలో శాశ్వతమైన శక్తిని మేల్కొల్పడంతోపాటు దేశం అభివృద్ధి చెందడానికి ఇది గొప్ప మార్గం.


దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా కేరళ అవతరించింది

→ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన బ్యాంకింగ్ సేవలో పూర్తిగా డిజిటల్‌గా మారిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా కేరళను ప్రకటించారు మరియు ఈ గుర్తింపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని అన్నారు.
→ మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పురోగతులతో పాటు స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా సామాజిక జోక్యాల వల్ల ఈ విజయం సాధ్యమైందని విజయన్ అన్నారు.

జాతీయ సైన్స్ డే 2023 థీమ్‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

→గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్‌బీయింగ్ (Global Science for Global Wellbeing) పేరుతో జాతీయ సైన్స్ డే 2023 థీమ్‌ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు.

భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో మొదటి ఆరోగ్య కార్యవర్గ సమావేశం జనవరి 18-20 వరకు కేరళలో జరుగుతుంది

→ భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో మొదటి ఆరోగ్య కార్యవర్గ సమావేశం జనవరి 18 నుండి 20 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరుగుతుంది.
→భారతదేశ సాంప్రదాయ ఔషధం, మూలికా టీ వంటి దేశీయ ఉత్పత్తులు మరియు ఆయుర్వేదం ఆధారంగా వంటకాలను ప్రోత్సహించడానికి G20 ఈవెంట్‌లను ఉపయోగించాలని కేంద్రం యోచిస్తోంది.
→సమావేశానికి ముందు, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ, అన్ని సమావేశాలలో, యోగా సెషన్‌లు ఉంటాయని మరియు సాంప్రదాయ వైద్య నిపుణులు విదేశీ ప్రతినిధులకు వ్యక్తిగతీకరించిన ఆహారం మరియు శ్రేయస్సు చిట్కాలను పంచుకుంటారని చెప్పారు.

జనవరి 16-17, 2023న పూణేలో G-20 యొక్క మొదటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

→ G20 ఇండియా ప్రెసిడెన్సీలో మొదటి G-20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశం 2023 జనవరి 16-17 మధ్య పూణేలో జరగనుంది. ఫోరమ్ IWG సభ్య దేశాలు, అతిథి దేశాలు మరియు భారతదేశం ఆహ్వానించిన అంతర్జాతీయ సంస్థలను కలిసి 2023 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎజెండాను భారత G20 ప్రెసిడెన్సీ క్రింద చర్చిస్తుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో పాటు ఆస్ట్రేలియా మరియు బ్రెజిల్‌లు కో-ఛైర్‌లుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాయి.
→G20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోని వివిధ అంశాలపై చర్చిస్తుంది, ఇందులో మౌలిక సదుపాయాలను ఆస్తి తరగతిగా అభివృద్ధి చేయడం; నాణ్యమైన మౌలిక సదుపాయాల పెట్టుబడిని ప్రోత్సహించడం; మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడి కోసం ఆర్థిక వనరులను సమీకరించడానికి వినూత్న సాధనాలను గుర్తించడం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ యొక్క ఫలితాలు G20 ఫైనాన్స్ ట్రాక్ ప్రాధాన్యతలను తెలియజేస్తాయి మరియు అవస్థాపన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.
→భారత G20 ప్రెసిడెన్సీ యొక్క 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్ 2023 భారత G-20 ప్రెసిడెన్సీ క్రింద 2023 మౌలిక సదుపాయాల ఎజెండాకు టోన్‌ని సెట్ చేస్తుంది. థీమ్ సమానమైన వృద్ధి సందేశాన్ని నొక్కి చెబుతుంది మరియు స్థిరమైన, కలుపుకొని మరియు స్థిరమైన పట్టణ మౌలిక సదుపాయాలను నిర్మించే చర్చల యొక్క కేంద్ర ఎజెండాతో సముచితంగా ముడిపడి ఉంది.
→పూణే సమావేశంలో, భారత అధ్యక్షతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ ఎజెండాపై చర్చలు జరుగుతాయి. ఈ సమావేశంలో చర్చించాల్సిన ప్రధాన ప్రాధాన్యత "రేపటి ఫైనాన్సింగ్ సిటీస్: ఇన్‌క్లూజివ్, రెసిలెంట్ మరియు సస్టైనబుల్". నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా చేయడం, పట్టణ మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం చేయడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పట్టణ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఇంధన-సమర్థవంతమైన మరియు పర్యావరణపరంగా స్థిరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రైవేట్ ఫైనాన్సింగ్‌ను అన్‌లాక్ చేయడానికి ఆర్థిక పెట్టుబడులను నిర్దేశించడం మరియు సామాజిక అసమతుల్యతలను తగ్గించడం వంటి వివిధ కోణాలపై థీమ్ దృష్టి సారిస్తుంది.

భారతదేశం-జపాన్ పర్యావరణ వారోత్సవాలు

→ముఖ్యంగా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు వనరుల సామర్థ్యం, తక్కువ కార్బన్ టెక్నాలజీ మరియు గ్రీన్ హైడ్రోజన్‌పై భారతదేశం మరియు జపాన్ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడాన్ని అన్వేషించవచ్చని పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నొక్కిచెప్పారు.
→జనవరి 12న భారతదేశం-జపాన్ పర్యావరణ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో జపాన్ పర్యావరణ మంత్రి అకిహిరో నిషిమురాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రం లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

ఆర్థిక చేరిక (Financial Inclusion) కోసం గ్లోబల్ పార్టనర్‌షిప్‌పై G20 వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం

→ఆర్థిక చేరిక (Financial Inclusion) కోసం గ్లోబల్ పార్టనర్‌షిప్‌పై G20 వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం జనవరి 10, 2020న కోల్‌కతాలోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ సంధర్భంగా డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై సింపోజియంలు మరియు ఎగ్జిబిషన్‌లను కలిగి ఉన్న G20 ఆగ్మెంటింగ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సెషన్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
→ప్లీనరీ సెషన్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, సార్వత్రిక ఏకత్వ భావనను ప్రోత్సహించడం మరియు ఎవరూ వెనుకబడి ఉండని మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ యొక్క కొత్త నమూనాను రూపొందించడానికి కలిసి పనిచేయడం భారతదేశ దృష్టి అని అన్నారు.
→దేశం నలుమూలల నుండి వచ్చిన 1,800 మంది విద్యార్థులను ఉద్దేశించి, Mr. ముండా భారతదేశం యొక్క వసుధైవ కుటుంబం యొక్క దృక్పథాన్ని నొక్కి చెప్పారు

కొట్టాయంలో ఆచారబద్ధంగా నిర్వహించబడిన పెట్ట తుల్లల్

→ కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఎరుమేలి పట్టణంలో అంబలప్పుజ బృందంచే పెట్టా తుల్లాల్ అనే ఆచారబద్ధమైన పవిత్ర నృత్యం జరిగింది.
→కారణం: రాక్షస యువరాణి మహిషిపై అయ్యప్ప స్వామి సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి.
→ఈ సంఘటన వార్షిక శబరిమల తీర్థయాత్ర సీజన్ చివరి దశను సూచిస్తుంది.
→కోచంబలం నుండి ఆకాశంలో పవిత్రమైన డేగ (కృష్ణ పరుంతు)ను చూసిన తర్వాత భక్తులు ఉత్సవ నృత్యాన్ని ప్రారంభించారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.9 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

→2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది, ఇది గత ఆర్థిక సంవత్సరం (FY2021/22)లో దేశం సాధించిన 8.7% వృద్ధి కంటే చాలా తక్కువ.
→నివేదిక శీర్షిక: గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ (Global Economic Prospects Report)
→2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది.
→కారణం: పెరిగిన ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, తగ్గిన పెట్టుబడి మరియు ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అంతరాయాలు

హెన్లీ పాస్‌పోర్ట్ సూచీ 2023లో అగ్రస్థానంలో జపాన్

→హెన్లీ & పార్ట్‌నర్స్ విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 ప్రకారం, 193 గమ్యస్థానాలతో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది.
→కాగా, సింగపూర్ మరియు దక్షిణ కొరియా 192 గమ్యస్థానాలతో రెండవ స్థానంలో ఉన్నాయి, జర్మనీ మరియు స్పెయిన్ (190 గమ్యస్థానాలు) మూడవ స్థానం ; ఫిన్లాండ్, ఇటలీ మరియు లక్సెంబర్గ్ (189 గమ్యస్థానాలు) నాల్గవ స్థానంలో ఉన్నాయి
→ప్రపంచవ్యాప్తంగా 59 గమ్యస్థానాలతో భారతదేశం 85వ స్థానంలో ఉంది.
→దిగువ: ఆఫ్ఘనిస్తాన్
→ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన డేటా ఆధారంగా జాబితా తయారు చేయబడింది.

కర్ణాటకలోని హుబ్బలిలో 26వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు

→2023 జనవరి 12 నుండి 16వ తేదీ వరకు కర్ణాటకలోని హుబ్బల్లిలో నిర్వహించబడుతున్న 26వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
→జాతీయ స్థాయిలో మన ప్రతిభావంతులైన యువతకు అవకాశం కల్పించేందుకు ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.
→ఇది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ యువజన దినోత్సవం (జనవరి 12) నాడు నిర్వహించబడుతుంది.
→ఈ ఈవెంట్ యొక్క ఇతివృత్తం : “Viksit Yuva - Viksit Bharat”
→ఈ కార్యక్రమంలో జానపద నృత్యాలు మరియు పాటలు కూడా ఉన్నాయి.

సబరగామువా విశ్వవిద్యాలయంలో హిందీ పీఠాన్ని ఏర్పాటు చేయనున్న భారత హైకమిషన్

→శ్రీలంకలోని సబరగమువా విశ్వవిద్యాలయంలో హిందీ చైర్‌ను స్థాపించడానికి భారత హైకమిషన్ అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది.
→గోపాల్ బాగ్లే (హై కమిషనర్) మరియు ప్రొఫెసర్ ఉదయ రత్నాయక్ (సబరగామువా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్) మధ్య ఒప్పందం సంతకం చేయబడింది.
→లక్ష్యం: భారతదేశం, దాని చరిత్ర మరియు సంస్కృతితో విద్యార్థులకు పరిచయం చేయడంలో సహాయం చేయడంతోపాటు భారతీయ అధ్యాపకులను నియమించడం ద్వారా హిందీని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మార్గం సుగమం చేయడం.

రూపే డెబిట్ కార్డ్‌ల ప్రమోషన్ కోసం ప్రభుత్వం ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది

→రూపే డెబిట్ కార్డ్‌లు మరియు తక్కువ విలువ కలిగిన BHIM-UPI లావాదేవీల ప్రమోషన్ కోసం ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
→ఈ పథకం 2,600 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయాన్ని కలిగి ఉంది.
→లక్ష్యం: పటిష్టమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నిర్మించడంలో సహాయం చేయడం.
→అంతేకాకుండా, కోల్‌కతాలోని జోకాలోని నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ మరియు క్వాలిటీ పేరును డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్‌గా మార్చడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్ అనే పుస్తకాన్ని మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు

→ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బ్రేవింగ్ ఎ వైరల్ స్టార్మ్: ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ(Braving A Viral Storm: India’s Covid-19 Vaccine Story) అనే పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
→దీనిని ఆశిష్ చందోర్కర్ మరియు సూరజ్ సుధీర్ సహ రచయితగా చేశారు.
→మహమ్మారిపై పోరాడేందుకు సమాజంలోని అన్ని వర్గాల వారు సహకరించిన స్వయం సమృద్ధిగల దేశంగా భారతదేశం ఎదుగుదల గురించి ఈ పుస్తకం వివరించింది.
→జనవరి 2021లో COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించి భారతదేశం యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పుస్తకం ప్రారంభించబడింది.

Revolutionaries పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

→ రివల్యూషనరీస్- ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వోన్ ఇట్స్ ఫ్రీడం(Revolutionaries- The Other Story of How India Won Its Freedom) అనే పుస్తకాన్ని హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు.
→ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ ఈ పుస్తకాన్ని రచించారు.
→ఈ పుస్తకంలో భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, వి డి సావర్కర్, అరబిందో ఘోష్, రాష్‌బెహారీ బోస్ మరియు బాఘా జతిన్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల కథలను సమిష్టిగా రాశారు.

జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చేలా కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకం

→భారత ప్రభుత్వం కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజన (PMGKAY) అని పేరు పెట్టింది.
→దీనికి ముందు, అంతోదయ ఆన్ యోజన (AAY) మరియు ప్రాథమిక గృహ (PHH) లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించే ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
→ఈ పథకం 1 జనవరి 2023 నుండి అమలులోకి వచ్చింది. 80 కోట్ల మందికి పైగా పేదలకు లబ్ది చేకూరుతుంది
→PMGKAY కింద, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హత ప్రకారం, PHH మరియు AAY లబ్ధిదారులందరికీ ఉచిత ఆహారధాన్యాలు అందించబడతాయి.

పృథ్వీ-II బాలిస్టిక్ క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా ప్రయోగించింది

→డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (Defence Research and Development Organisation (DRDO)) షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ (Short-Range Ballistic Missile (SRBM)), పృథ్వీ-IIని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చాందీపూర్, ఒడిశా తీరం నుండి విజయవంతంగా ప్రయోగించింది.
→పృథ్వీ-II క్షిపణి బాగా స్థిరపడిన వ్యవస్థ.
→ఇది భారతదేశంలో అణు ప్రతిఘటనలో అంతర్భాగంగా ఉంది.
→శిక్షణా ప్రయోగ సమయంలో, క్షిపణి అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించింది మరియు క్షిపణి యొక్క అన్ని కార్యాచరణ మరియు సాంకేతిక పారామితులను విజయవంతంగా ధృవీకరించింది.
→పరిధి: 350 కి.మీ

నలందలో 1200 సంవత్సరాల నాటి రెండు సూక్ష్మ స్థూపాలను వెలికితీసిన ASI

→ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) యొక్క పాట్నా సర్కిల్ "నలంద మహావిహార" మైదానంలో సరాయ్ తిలా మట్టిదిబ్బ సమీపంలో 1200 సంవత్సరాల నాటి రెండు సూక్ష్మ స్థూపాలను కనుగొంది.
→రాతితో చెక్కబడిన స్థూపాలు బుద్ధుడి బొమ్మలను వర్ణిస్తాయి.
→నలంద మహావిహారం బీహార్‌లోని నలంద జిల్లాలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం.
→ఈ ప్రదేశం 3వ శతాబ్దం BCE నుండి 13వ శతాబ్దం CE వరకు ఉన్న సన్యాసుల మరియు పాండిత్య సంస్థ యొక్క పురావస్తు అవశేషాలను కలిగి ఉంది.

ఒడిశా ప్రభుత్వ CAMPA స్టీరింగ్ కమిటీ ₹1,086 కోట్ల కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది

→మానవ-జంతు సంఘర్షణలను తగ్గించడానికి 2023-24 సంవత్సరానికి గాను రూ. 1,086 కోట్ల కార్యాచరణ ప్రణాళికను CAMPA (పరిహారం అటవీ నిర్మూలన నిధి నిర్వహణ & ప్రణాళికా సంస్థ) కోసం ఒడిశా ప్రభుత్వ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఆమోదించింది.
→ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సి మహపాత్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రణాళికకు ఆమోదం తెలిపారు
→CAMPA నిధుల ద్వారా విస్తృతంగా నిర్వహిస్తున్న వన్యప్రాణుల నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యను కూడా ఆయన లేవనెత్తారు.

గోదావరి నదీతీరం Indian skimmer కి ప్రధాన ఆవాసం

→ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదీతీరం భారతీయ స్కిమ్మర్ (Indian skimmer)కి ప్రధాన మరియు సురక్షితమైన నివాసంగా మారింది.
→జనవరి 10న, కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం (ఆంధ్రప్రదేశ్) దక్షిణ భాగంలో ఆసియన్ వాటర్‌బర్డ్ సెన్సస్-2023లో ఒక రోజులో దాదాపు 250 మంది భారతీయ స్కిమ్మర్‌లు కనిపించాయి.
→భారతీయ స్కిమ్మర్ ఆహారం కోసం గోదావరి నదికి వలస వస్తుంది.
→ఇది పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలోని తీర ప్రాంతాలలో కనిపిస్తుంది.

బాస్మతి బియ్యం కోసం సమగ్ర నియంత్రణ ప్రమాణాలను FSSAI తెలియజేస్తుంది

→ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మొదటిసారిగా బాస్మతి బియ్యం కోసం సమగ్ర నియంత్రణ ప్రమాణాలను నోటిఫై చేసింది మరియు 1 ఆగస్టు 2023 నుండి అమలులోకి వస్తుంది.
→లక్ష్యం: బాస్మతి బియ్యం వ్యాపారంలో న్యాయమైన పద్ధతులను ఏర్పాటు చేయడం మరియు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం.
→ప్రమాణాల ప్రకారం, బాస్మతి బియ్యం బాస్మతి బియ్యం సహజ సువాసన లక్షణాలను కలిగి ఉండాలి మరియు కృత్రిమ రంగులు, పాలిషింగ్ ఏజెంట్లు మరియు కృత్రిమ సువాసనలు లేకుండా ఉండాలి.

గరుడ ఏరోస్పేస్ ద్రోణి పేరుతో నిఘా డ్రోన్‌ను ప్రారంభించింది

→గరుడ ఏరోస్పేస్ మరియు మాజీ క్రికెటర్, మహేంద్ర సింగ్ ధోనీ ‘ద్రోణి’ పేరుతో ఒక నిఘా డ్రోన్‌ను ప్రారంభించారు.
→MS ధోని గరుడ ఏరోస్పేస్ యొక్క పెట్టుబడిదారుడు కమ్ అంబాసిడర్.
→ద్రోణి అనేది బ్యాటరీతో పనిచేసే క్వాడ్‌కాప్టర్ నిఘా డ్రోన్.
→గరుడ ఏరోస్పేస్ ఇటీవల డ్రోన్ తయారీ రకం సర్టిఫికేట్ మరియు RTPO రెండింటికీ ద్వంద్వ DGCA ఆమోదాలను పొందిన భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ కంపెనీగా అవతరించింది.
→2022లో చెన్నైలో జరిగిన గ్లోబల్ డ్రోన్ ఎక్స్‌పోలో ద్రోణి అనే కెమెరా డ్రోన్‌ను ఆవిష్కరించాడు.

బ్లాక్ డీల్ ద్వారా $125 మిలియన్ల విలువైన Paytm వాటాను అలీబాబా విక్రయించింది

→అలీబాబా గ్రూప్ బ్లాక్ డీల్ ద్వారా $125 మిలియన్ విలువైన Paytmలో 3.1% వాటాను విక్రయించింది.
→సెప్టెంబరు 2022 నాటికి Paytmలో అలీబాబా 6.26% వాటాను కలిగి ఉంది.
→మెగా $2.5 బిలియన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) తర్వాత Paytm 2021లో జాబితా చేయబడింది.
→బ్లాక్ డీల్: ఇద్దరు సంస్థాగత ఆటగాళ్ల మధ్య కనీసం 5 లక్షల షేర్లు లేదా కనీసం రూ. 5 కోట్ల విలువ చేస్తుంది.
→ఇది ఒక ప్రత్యేక ట్రేడింగ్ విండో ద్వారా సుమారు 35 నిమిషాల పాటు ట్రేడింగ్ గంటల ప్రారంభం ముందు జరుగుతుంది.

కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్‌ను ప్రారంభించారు

→త్రిపురలోని అగర్తలాలో స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్, వాటర్‌వేస్ మరియు కమ్యూనికేషన్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రారంభించారు.
→లక్ష్యం: ప్రతిభను రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడం.
→ఇది స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (SIPARD) కింద ఏర్పాటు చేయబడింది, ఇది త్రిపుర ప్రభుత్వం మరియు MoRD ద్వారా నిధులు సమకూరుస్తుంది.

SBI ఈ-బ్యాంక్ గ్యారెంటీ సౌకర్యాన్ని ప్రారంభించింది

→ఇ-బ్యాంక్ గ్యారెంటీ (ఇ-బిజి) సదుపాయాన్ని ప్రారంభించడానికి SBI నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (NeSL)తో అనుబంధాన్ని కలిగి ఉంది.
→ఇది బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తుంది, ఇక్కడ బ్యాంక్ గ్యారెంటీ తరచుగా పెద్ద పరిమాణంలో ఉపయోగించబడుతుంది.
→ప్రస్తుతం, బ్యాంక్ ఈ హామీలను ఫిజికల్ స్టాంపింగ్ మరియు సంతకాలతో జారీ చేస్తుంది.
→ఇది ఈ ఫంక్షన్‌ను ఇ-స్టాంపింగ్ మరియు ఇ-సంతకంతో భర్తీ చేస్తుంది.
→ఈ చొరవ పారదర్శకతను పెంచుతుంది మరియు టర్న్‌అరౌండ్ సమయాన్ని రోజుల నుండి నిమిషాలకు తగ్గిస్తుంది.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూశారు

→కేంద్ర మాజీ మంత్రి, శరద్ యాదవ్ (75) హర్యానాలోని గురుగ్రామ్‌లో కన్నుమూశారు.
→1970ల మధ్యకాలంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం సమయంలో ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
→1974లో 27 ఏళ్ల వయసులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
→1989లో ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు.
→అతను 1991, 1996, 1999 మరియు 2009లో బీహార్‌లోని మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం నుండి కూడా ఎన్నికయ్యారు.
→ఆయన సొంత పార్టీ లోక్‌తాంత్రిక్ జనతాదళ్‌ను ప్రారంభించారు.

కాగ్నిజెంట్ సీఈఓగా ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవికుమార్‌

→ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్, రవి కుమార్ కాగ్నిజెంట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తక్షణం అమల్లోకి వచ్చారు.
→మార్చి 15, 2023న కంపెనీ నుండి వైదొలగనున్న బ్రియాన్ హంఫ్రీస్ తర్వాత అతను CEO అయ్యాడు.
→అతను ఇన్ఫోసిస్‌లో 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు, అక్కడ అతను వివిధ నాయకత్వ పాత్రలను నిర్వహించాడు.

వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్-MV గంగా విలాస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు

→ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13 జనవరి 2023న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్-MV గంగా విలాస్‌ను ప్రారంభించారు.
→వారణాసిలో టెంట్ సిటీని కూడా ఆయన ప్రారంభించారు.
క్రూజ్ గురించి:-
→భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా క్రూయిజ్ను నిర్మిం చారు. 3 అంతస్థులు ఉండే నౌక ఇది.
→మొత్తం 3200 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ నదీయాత్రను పకడ్బం దీగా ప్లాన్ చేశారు. 51 రోజుల పాటు ఈయాత్ర సాగనుంది. మొత్తంగా 27 నదీవ్యవస్థల మీదుగా ఈయాత్ర జరగనుంది. భారత్'లో 2100 కిలోమీటర్లు, బంగ్లాదేశ్'లో 1100 కిలోమీటర్ల పాటు ఎంవీ గంగా విలాస్ పర్యటించనుంది.
→దేశంలో ఐదు రాష్ట్రా లతో పాటు, బంగ్లాదేశ్లోని మిగతా కొన్ని ప్రాంతాల్లో ఇది నడవనుంది. జీవ నదులైన గంగా, బ్రహ్మ పుత్రలతో పాటు భాగీరథీ, బిద్యా వతి, మాట్లా, హుగ్లీ, బంగ్లాదేశ్ లోని పద్మ, మేఘన, జమున నదుల గుండా ప్రవహిస్తుం ది. . వారణాసిలోమొదలై బంగ్లాదేశ్ గుండా అస్సాం లోని దిబ్రూగడ్కు చేరుకోవడంతోయాత్ర పూర్తవుర్త తుంది.
→ఇందులో మొత్తం 32 మంది ప్రయాణించగలరు. వారణాసిలో గంగా హారతి అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. యాత్రలో ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, పర్యటక ప్రాంతాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించొచ్చు. కజిరంగ నేషనల్ పార్కు, సుందర్బన్ డెల్టా వంటి వాటిని చూడొచ్చు.
→ టికెట్ ధర ఒక్కొ కరికి రోజుకు రూ.25వేలు. దీంతో మొత్తం ప్రయాణానికి రూ.12.75 లక్షలు ఖర్చవుతుందని అంచనా. జనవరి 13న వారణాసిలో ప్రారంభమై మార్చి 1న అస్సాం లోని దిబ్రూగఢ్కు చేరుకుంటుంది.
→టెంట్ సిటీ ప్రత్యేకతలు :. గంగా నది ఒడ్డున టెంట్ నగరాన్ని నిర్మిం చారు. పర్యటకులకు విడిది కల్పించడానికి ఈ టెంట్ సిటీని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశారు.
→అంతర్గతర్గ జలమార్గాలను మరింత అధునాతనం చేసి.. నదీ ఆధారిత పర్యటకాన్ని అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా టెంట్ సిటీని నిర్మిం చారు.
→ఈ విలాసవంతమైన గుడారాలలో బెడ్రూమ్, డ్రెస్సిం గ్ కమ్-స్టోర్ రూమ్, వాష్ రూమ్ , లాబీ ఉన్నాయి. షీషమ్ చెక్కతో చేసిన ఫర్నిచర్'తో ఇంటీరియర్ డిజైన్ చేసారు .

భారతీయ-అమెరికన్, A C చరానియా NASA యొక్క కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ఎంపికయ్యారు

→భారతీయ-అమెరికన్ ఏరోస్పేస్ నిపుణుడు, AC చరానియా NASA యొక్క కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులయ్యారు.
→అతను సాంకేతిక విధానం మరియు కార్యక్రమాలపై అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్‌కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారు.
→అతను జనవరి 3, 2023న తన కొత్త పాత్రలో అంతరిక్ష సంస్థలో చేరాడు.
→మాజీ నియామకానికి ముందు తాత్కాలిక ప్రధాన సాంకేతిక నిపుణుడిగా పనిచేసిన భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త భవ్య లాల్ స్థానంలో అతను నియమించబడ్డాడు.
→అతను రిలయబుల్ రోబోటిక్స్‌లో ప్రొడక్ట్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు

రూ. 4,276 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది

→ భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో రూ.4,276 కోట్ల విలువైన ప్రతిపాదనకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదం తెలిపింది.
→అధునాతన తేలికపాటి హెలికాప్టర్ మరియు కొత్త స్వల్ప-శ్రేణి వైమానిక రక్షణ క్షిపణిలో అమర్చడానికి స్వదేశీ ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను కొనుగోలు చేయడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.
→అన్ని ప్రాజెక్ట్‌లు దేశీయంగా రూపొందించబడిన అభివృద్ధి మరియు తయారీ (IDDM) వర్గం క్రింద ఉన్నాయి.

రూ. 4,276 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

→భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో రూ.4,276 కోట్ల విలువైన ప్రతిపాదనకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదం తెలిపింది.
→అధునాతన తేలికపాటి హెలికాప్టర్ మరియు కొత్త స్వల్ప-శ్రేణి వైమానిక రక్షణ క్షిపణిలో అమర్చడానికి స్వదేశీ ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను కొనుగోలు చేయడానికి ఈ మొత్తాన్ని వినియోగిస్తారు.
→అన్ని ప్రాజెక్ట్‌లు దేశీయంగా రూపొందించబడిన అభివృద్ధి మరియు తయారీ (IDDM) వర్గం క్రింద ఉన్నాయి.


గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ నియమితులయ్యారు

→జనవరి 12 నుంచి అమలులోకి వచ్చే గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నొంగ్మెయికపం కోటీశ్వర్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
→2023 జనవరి 11న పదవీ విరమణ పొందిన ప్రధాన న్యాయమూర్తి రష్మిన్ మన్హర్‌భాయ్ ఛాయా స్థానంలో ఆయన నియమితులయ్యారు.
→మే 2022లో గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
→సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తే, హైకోర్టు న్యాయమూర్తి 62 ఏళ్లకే పదవీ విరమణ చేస్తారు.

సచిన్ టెండూల్కర్ రికార్డు సమం

→భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంతగడ్డపై 20 వన్డే ఇంటర్నేషనల్ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
→మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో శ్రీలంకపై కేవలం 80 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
→సొంతగడ్డపై 20వ వన్డే సెంచరీ సాధించడానికి అతను 99 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు, సచిన్ 160 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు.
→కోహ్లీ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో 73 సెంచరీలను కలిగి ఉన్నాడు, టెండూల్కర్ 100 సెంచరీల తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు.

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించింది

→రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 2023 జనవరి 11 నుండి 17 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించింది.
→లక్ష్యం: స్వచ్ఛతా పఖ్వాడా కింద అందరికీ సురక్షితమైన రోడ్ల కారణాన్ని ప్రచారం చేయడం.
→రోడ్డు ప్రమాదాల కారణాలు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అవగాహన ప్రచారాలు వంటి వివిధ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి.
→న్యూ ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో నుక్కడ్ నాటకాలు మరియు సెన్సిటైజేషన్ క్యాంపెయిన్‌ల వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘నాటు నాటు’ కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు

→SS రాజమౌళి యొక్క "RRR" "నాటు నాటు" ట్రాక్ కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్- 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకుంది.
→ఈ చిత్రం 'ఉత్తమ చిత్రం-నాన్ ఇంగ్లీషు'కి కూడా నామినేట్ చేయబడింది.
→ఈ ట్రాక్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు, MM కీరవాణి స్వరపరిచారు మరియు కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ పాడారు
→గోల్డెన్ గ్లోబ్ అవార్డులు జనవరి 1944 నుండి హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ అందించే అవార్డులు.
→ఇవి అమెరికన్ మరియు అంతర్జాతీయ చలనచిత్రం మరియు టెలివిజన్ రెండింటిలోనూ అవార్డులను అందిస్తుంది .

పురుషుల సింగిల్ అడిలైడ్ ఇంటర్నేషనల్ 1 టైటిల్ 2023 గెలుచుకున్న నోవాక్ జకోవిచ్

→అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డాను ఓడించి సెర్బియా టెన్నిస్ ప్లేయర్, నోవాక్ జొకోవిచ్ 2023 అడిలైడ్ ఇంటర్నేషనల్ 1 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు
→కాగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన లిండా నోస్కోవాను ఓడించి అరీనా సబలెంకా (బెలారస్) మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.
మరో విజేత:-
→పురుషుల డబుల్స్: లాయిడ్ గ్లాస్‌పూల్ (యునైటెడ్ కింగ్‌డమ్) / హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)
→మహిళల డబుల్స్: ఆసియా ముహమ్మద్ (యునైటెడ్ స్టేట్స్) / టేలర్ టౌన్సెండ్ (యునైటెడ్ స్టేట్స్)

BCCI సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగనున్న చేతన్ శర్మ

→ఐదుగురు సభ్యులతో కూడిన బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ పేసర్ చేతన్ శర్మ మళ్లీ నియమితులయ్యారు.
→అతను డిసెంబర్ 2020 నుండి బోర్డు ఎంపిక కమిటీకి అధిపతిగా ఉన్నాడు.
→అతని పేరును క్రికెట్ సలహా కమిటీ సిఫార్సు చేసింది.
→కమిటీ శివ సుందర్ దాస్ (సెంట్రల్ జోన్), సుబ్రోతో బెనర్జీ (ఈస్ట్ జోన్), సలీల్ అంకోలా (వెస్ట్ జోన్) మరియు శ్రీధరన్ శరత్ (సౌత్ జోన్) పేర్లను కూడా పేర్కొంది.
→బీసీసీఐ కార్యదర్శి: జే షా

దేశంలోని మొట్టమొదటి పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా కేరళ

→కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన బ్యాంకింగ్ సేవలో పూర్తిగా డిజిటల్‌గా మారిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా కేరళను ప్రకటించారు.
→స్థానిక స్వీయ-ప్రభుత్వ సంస్థల ద్వారా సామాజిక జోక్యాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పురోగతి కారణంగా ఇది సాధ్యమైంది.
→రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ (KFON) ప్రాజెక్ట్ డిజిటల్ విభజనను తగ్గిస్తుందని కూడా ఆయన ప్రకటించారు.

జాతీయ సైన్స్ డే 2023 థీమ్‌ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేశారు

→కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేషనల్ సైన్స్ డే 2023 థీమ్‌ను విడుదల చేశారు.
→Theme 2023: Global Science for Global Wellbeing
→ప్రపంచ శ్రేయస్సుపై ప్రభావం చూపుతున్న గ్లోబల్ సందర్భంలో శాస్త్రీయ సమస్యలపై ప్రజల ప్రశంసలను పెంచే ఉద్దేశ్యంతో థీమ్ ఎంపిక చేయబడింది
→భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి వి రామన్ రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కాశ్మీర్ తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రెహ్మాన్ రాహి కన్నుమూశారు

→ప్రముఖ విద్యావేత్త మరియు కవి, ప్రొఫెసర్ రెహ్మాన్ రాహి 98 సంవత్సరాల వయస్సులో జనవరి 9, 2023 మరణించారు.
→1961లో ‘నౌరోజ్-ఇ-సబా’ కవితా సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
→అతను 2007లో "సియాహ్ రూడ్-ఎ-జారెన్ మాంజ్" అనే రచనకు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠంతో సత్కరించబడ్డాడు.
→అతను 2000లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం కూడా పొందాడు.
→అతను చాలా మంది ప్రసిద్ధ కవులు మరియు రచయితల రచనలను కాశ్మీరీ భాషలోకి అనువదించిన ప్రశంసలు పొందిన కవి.

మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు 8 దేశాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది

→జనవరి 9, 2023న ఇండోర్‌లోని 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (GOPIO) ఎనిమిది దేశాల అధ్యాయాలతో మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
→లక్ష్యం: రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడం, మరియు పర్యాటక ప్రదేశాల ప్రచారం మరియు ప్రచారం.
→ఫ్రాన్స్ మెట్రోపోల్ పారిస్, మారిషస్, రీయూనియన్ ఐలాండ్, మార్టినిక్, శ్రీలంక, GOPIO ఇంటర్నేషనల్, మలేషియా మరియు మారిషస్‌లతో ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

దౌత్యవేత్తల శిక్షణలో సహకారాన్ని పెంపొందించేందుకు పనామాతో భారత్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది

→దౌత్యవేత్తల శిక్షణలో సహకారాన్ని పెంపొందించేందుకు పనామాతో భారత్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.
→ఈ ఒప్పందంపై EAM, డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ మరియు పనామా విదేశాంగ మంత్రి జనైనా తెవానీ మెన్‌కోమో సంతకం చేశారు.
→ఇరు దేశాలు ఆర్థిక, ఆరోగ్యం, ఆర్థిక మరియు ప్రజలతో ప్రజలకు అనుసంధానం కోసం ఉన్న అవకాశాలపై కూడా చర్చించాయి.
→ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్‌లో పనామా మంత్రి కూడా చేరారు.

ప్రపంచ హిందీ దినోత్సవం 2023: జనవరి 10

→ప్రపంచవ్యాప్తంగా భాషపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
→Theme 2023: "Hindi – Traditional Knowledge to Artificial Intelligence"
→ఈ రోజున, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో మొదటిసారిగా హిందీ (భారత జాతీయ భాష) మాట్లాడబడింది.
→ఫిబ్రవరి 15 నుండి 17, 2023 వరకు ఫిజీ ప్రభుత్వంతో కలిసి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిజీలో 12వ ప్రపంచ హిందీ సదస్సును నిర్వహించనుంది.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

→భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర పదవీకాలాన్ని జనవరి 15, 2023 నుండి ఒక సంవత్సరం పొడిగించింది.
→ఆయన మూడేళ్ల పదవీకాలం జనవరి 14, 2023తో ముగియనుంది.
→ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ద్రవ్య విధాన విభాగాన్ని ఆయన చూస్తున్నారు.
→అతను ద్రవ్య విధాన కమిటీ సభ్యుడు కూడా.
→ఆర్‌బీఐకి చెందిన మరో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్.

భారతదేశం యొక్క మొదటి ఇన్‌క్లూజన్ ఫెస్టివల్, పర్పుల్ ఫెస్ట్ ప్రారంభమవుతుంది

→ భారతదేశం యొక్క మొట్టమొదటి-రకం ఇన్క్లూసివిటీ(inclusivity), 'పర్పుల్ ఫెస్ట్: సెలబ్రేటింగ్ డైవర్సిటీ('Purple Fest: Celebrating Diversity')' జనవరి 6–8, 2023 నుండి గోవాలోని పంజిమ్‌(పనాజి)లో ప్రారంభించబడింది.
→ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్; గోవా ముఖ్యమంత్రి , డాక్టర్ ప్రమోద్ సావంత్; మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, గోవా ప్రభుత్వం సుభాష్ ఫాల్ దేశాయ్.
→లక్ష్యం: ప్రతి ఒక్కరికీ స్వాగతించే మరియు కలుపుకొనిపోయే ప్రపంచాన్ని సృష్టించడానికి మనం ఎలా కలిసి రాగలమో ప్రదర్శించడం.

తాల్చేర్‌ ఎరువుల కర్మాగారం అక్టోబర్ 2024 నాటికి పని చేస్తుంది

→ఒడిశాలోని తాల్చేర్‌లో ఫర్టిలైజర్ ప్రాజెక్టులు అక్టోబర్ 2024 నాటికి పనిచేస్తాయని యూనియన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మన్సుఖ్ మాండవియా తెలియజేశారు.
→ఇది భారతదేశంలో అతిపెద్ద మరియు మొట్టమొదటి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ అవుతుంది.
→సంవత్సరానికి 12.7 లక్షల టన్నుల స్థాపిత సామర్థ్యంతో (LMTPA) కొత్త బొగ్గు గ్యాసిఫికేషన్ ఆధారిత యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా FCIL యొక్క పూర్వపు తాల్చర్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలని తాల్చర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌ని ప్రభుత్వం ఆదేశించింది.

CJI చంద్రచూడ్‌కు 'అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్' ప్రదానం

→ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), D.Y. చంద్రచూడ్‌ను హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ "అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్"కి ఎంపిక చేసింది.
→కారణం: దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా న్యాయవాద వృత్తికి అతని జీవితకాల సేవకు గుర్తింపుగా.
→జనవరి 11, 2023న జరిగే ఆన్‌లైన్ ఈవెంట్‌లో ఈ అవార్డును అతనికి ప్రదానం చేస్తారు.
→నవంబర్ 9, 2022న 50వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.
→అతను L.L.M పట్టా పొందాడు. డిగ్రీ మరియు హార్వర్డ్ లా స్కూల్ నుండి జురిడికల్ సైన్సెస్ (SJD)లో డాక్టరేట్.

ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన PM

→ న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
→లక్ష్యం: వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడం
→ఈ కార్యక్రమం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ (2018లో ప్రారంభించబడింది) తరహాలో ఉంది.
→ఈ కార్యక్రమం ప్రారంభంలో 31 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 500 జిల్లాలను కవర్ చేస్తుంది.
→వీటిలో సగానికి పైగా బ్లాక్‌లు 6 రాష్ట్రాల్లో ఉన్నాయి-ఉత్తరప్రదేశ్ (68 బ్లాక్‌లు), బీహార్ (61), మధ్యప్రదేశ్ (42), జార్ఖండ్ (34), ఒడిశా (29) మరియు పశ్చిమ బెంగాల్ (29).

భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించింది

→నిక్కీ ఆసియా నివేదిక ప్రకారం, భారతదేశం మొదటిసారిగా మూడవ అతిపెద్ద ఆటో మార్కెట్‌గా జపాన్‌ను అధిగమించింది.
→నివేదిక ప్రకారం, భారతదేశం యొక్క కొత్త వాహనాల విక్రయాలు కనీసం 4.25 మిలియన్ యూనిట్లు, ప్రాథమిక ఫలితాల ఆధారంగా జపాన్‌లో విక్రయించబడిన 4.2 మిలియన్లలో అగ్రస్థానంలో ఉన్నాయి.
→సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రకారం, జనవరి మరియు నవంబర్ 2022 మధ్య భారతదేశంలో డెలివరీ చేయబడిన కొత్త వాహనాలు మొత్తం 4.13 మిలియన్లు
→ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా తర్వాతి స్థానంలో ఉంది

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి కన్నుమూశారు

→ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బీజేపీ సీనియర్ నేత, కేశరినాథ్ త్రిపాఠి (88) కన్నుమూశారు.
→అతను జూలై 2014 నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు.
→అతను బీహార్, మేఘాలయ మరియు మిజోరాం గవర్నర్‌గా మరియు యుపి శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేశాడు.
→అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు.
→అతను "ది ఏజ్ ఆఫ్ వింగ్స్", "సంచయిత: కేశరినాథ్ త్రిపాఠి", "డెస్టినేషన్ జీసస్" వంటి అనేక పుస్తకాలను రచించాడు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 2023 అంతర్జాతీయ గాలిపటాల పండుగను ప్రారంభించారు

→ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 2023 జనవరి 8 నుండి 14వ తేదీ వరకు అహ్మదాబాద్‌లో నిర్వహించబడిన అంతర్జాతీయ గాలిపటాల పండుగ 2023ని ప్రారంభించారు.
→ఈ అంతర్జాతీయ గాలిపటాల పండుగ థీమ్ G20 - 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' థీమ్‌తో జరుగుతుంది.
→కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ ఈవెంట్ నిర్వహించబడింది.
→అంతర్జాతీయ గాలిపటాల పండుగ 2023 ప్రారంభోత్సవానికి G20 దేశాల నుండి ప్రతినిధులు తమ సంస్కృతిని మార్పిడి చేసుకోవడానికి ఆహ్వానించబడ్డారు.

పంజాబ్‌లో ఖేలో ఇండియా నేషనల్ ఉమెన్ ఖో ఖో లీగ్‌లు జరగనున్నాయి

→ఖేలో ఇండియా సీనియర్ మహిళా జాతీయ ఖో ఖో లీగ్ జనవరి 10 నుండి జనవరి 13, 2023 వరకు పంజాబ్‌లోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరుగుతుంది.
→ఈ లీగ్‌ని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
→యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నుండి పూర్తి ఆర్థిక సహకారంతో ఇది మూడు దశల్లో నిర్వహించబడుతుంది.
→జూనియర్ మరియు సబ్-జూనియర్ వయస్సుల కోసం ఖో ఖో మహిళల లీగ్ జనవరి 16 నుండి 19 వరకు రాంచీలోని హోత్వార్‌లోని అల్బెర్టా ఎక్కా ఖో ఖో స్టేడియంలో షెడ్యూల్ చేయబడింది.

టీ20ల్లో అత్యంత వేగంగా 1,500 పరుగులు చేసిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్

→టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,500 పరుగులు చేసిన ఆటగాడిగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.
→అతను ఈ మైలురాయిని చేరుకోవడానికి 843 బంతులు మాత్రమే తీసుకున్నాడు.
→45 మ్యాచ్‌లు, 43 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ 46.41 సగటుతో 1,578 పరుగులు చేశాడు.
→అతను ఫార్మాట్‌లో మూడు సెంచరీలు మరియు 13 అర్ధ సెంచరీలను కలిగి ఉన్నాడు, అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 117.
→అయితే, ఇన్నింగ్స్ పరంగా వేగంగా 1,500 పరుగుల మార్క్‌ను చేరుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు.

2023 బ్రిటిష్ జూనియర్ ఓపెన్‌లో బాలికల U-15 స్క్వాష్ టైటిల్‌ను గెలుచుకున్న అనాహత్ సింగ్

→భారతీయ స్క్వాష్ ప్రాడిజీ, అనాహత్ సింగ్ (14) జనవరి 4-8, 2023 వరకు బర్మింగ్‌హామ్ (యునైటెడ్ కింగ్‌డమ్)లో జరిగిన 2023 బ్రిటిష్ జూనియర్ ఓపెన్ టోర్నమెంట్‌లో బాలికల అండర్-15 స్క్వాష్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
→ఫైనల్‌లో ఈజిప్ట్‌కు చెందిన సొహైలా హజెమ్‌పై 3-1 తేడాతో విజయం సాధించింది.
→బ్రిటిష్ జూనియర్ ఓపెన్ ప్రతి సంవత్సరం జనవరిలో UKలో జరుగుతుంది.
→స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగిన 2022 స్కాటిష్ జూనియర్ ఓపెన్‌లో బాలికల అండర్-17 విభాగాల్లో కూడా ఆమె విజేతగా నిలిచింది. ఆమె న్యూఢిల్లీకి చెందినవారు.

ఛత్తీస్‌గఢ్ సాంప్రదాయ 'చెర్చెరా' పండుగను జరుపుకుంటుంది

→ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ రాయ్‌పూర్‌లోని దుధాధారి మఠంలో సంప్రదాయ చెర్చెరా పండుగను జరుపుకున్నారు.
→ఈ సాంప్రదాయ పండుగను 'పౌష్' హిందూ క్యాలెండర్ నెల పౌర్ణమి రాత్రి జరుపుకుంటారు.
→సాగు చేసిన తర్వాత పంటలను తమ ఇళ్లకు తీసుకెళ్లిన ఆనందంలో జరుపుకుంటారు.
→పురాణాల ప్రకారం, ఈ రోజున శంకర్ మాతా అన్నపూర్ణను వేడుకున్నాడు, కాబట్టి ప్రజలు ఈ రోజు వరితో పాటు పచ్చి కూరగాయలను దానం చేసేవారు.

మణిపూర్‌లో మార్జింగ్ పోలో విగ్రహాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి అమిత్ షా

→మణిపూర్‌లోని ఇంఫాల్‌లోని హీంగాంగ్‌లో ఇబుధౌ మార్జింగ్ కాంప్లెక్స్‌లో 122 అడుగుల ఎత్తైన సాగోల్ కాంగ్జీ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
→రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేశారు.
→అతను చురచంద్‌పూర్ మెడికల్ కాలేజీని ప్రారంభించాడు మరియు INA ప్రధాన కార్యాలయం, మొయిరాంగ్‌లో 175 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఎగురవేశాడు.
→సగోల్ కాంజీ: ఇది మణిపూర్‌లో ఆడే పోలో ఆట పేరు.

'ముఖ్యమంత్రి డైరీ నెం.1' పుస్తకాన్ని మాజీ సీజేఐ రంజన్‌ గొగోయ్‌ విడుదల చేశారు.

→భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్ 'ముఖ్యమంత్రి డైరీ నెం.1' అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
→ఈ పుస్తకంలో అస్సాం సీఎం డాక్టర్ హిమంత బిస్వా శర్మ మొదటి సంవత్సరం జరిగిన సంఘటనల కథనం ఉంది.
→ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
→అతని డైరీలో రాష్ట్రం గత 11 నెలలుగా సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా కలిగి ఉంది.

పారిశ్రామిక యూనిట్లు మరియు ప్రయోగశాలల మ్యాపింగ్ కోసం BIS పోర్టల్‌ను ప్రారంభించింది

పారిశ్రామిక యూనిట్లు మరియు ప్రయోగశాలల మ్యాపింగ్ కోసం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పోర్టల్‌ను ప్రారంభించారు.
→ఇది కేంద్రీకృత వేదిక.
→లక్ష్యం: దేశవ్యాప్తంగా పారిశ్రామిక యూనిట్లు మరియు ప్రయోగశాలల సమాచారాన్ని అందించడం.
→ఇది దేశంలోని పరీక్షా సౌకర్యాల విశ్లేషణను అనుమతిస్తుంది మరియు టెస్టింగ్ సౌకర్యాల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో వ్యవస్థాపకులకు సహాయపడుతుంది.
→అతను స్టాండర్డ్స్ నేషనల్ యాక్షన్ ప్లాన్ (Standards National Action Plan-SNAP) 2022-27ని కూడా ప్రారంభించాడు.

డిజిటల్ ఇండియా 2022 అవార్డుల ప్రదానం

→భారత రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము 7 జనవరి 2023న డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2022 విజేతలకు ప్రదానం చేశారు.
→e-NAM (వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ) పౌరుల డిజిటల్ సాధికారత విభాగంలో ప్లాటినం అవార్డును పొందింది.
→e-Vivechna యాప్ (మధ్యప్రదేశ్) గ్రాస్‌రూట్ స్థాయిలో డిజిటల్ ఇనిషియేటివ్స్‌లో ప్లాటినం అవార్డును అందుకుంది.
→మైన్ మిత్ర (ఉత్తర ప్రదేశ్) డిజిటల్ ఇనిషియేటివ్స్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో అవార్డు పొందింది.
→డిజిటల్ ఇండియా అవార్డ్స్ (https:/digitalindiaawards.gov.in) అన్ని స్థాయిలలో ప్రభుత్వ సంస్థలచే వినూత్న డిజిటల్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది మరియు గౌరవిస్తుంది. ఈ అవార్డులు ప్రభుత్వ సంస్థలను మాత్రమే కాకుండా డిజిటల్ ఇండియా విజన్‌ను నెరవేర్చడంలో స్టార్టప్‌లు మరియు గ్రాస్‌రూట్ స్థాయి డిజిటల్ కార్యక్రమాలను ప్రేరేపించడం మరియు ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

→డిజిటల్ ఇండియా అవార్డ్స్ యొక్క 7వ ఎడిషన్ క్రింది ఏడు విభాగాల క్రింద అందించబడింది:
1) పౌరుల డిజిటల్ సాధికారత: విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా గుర్తించడం, డిజిటల్ వనరులను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయడం మరియు భాగస్వామ్య పాలన మరియు డిజిటల్ అక్షరాస్యతలో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవన సౌలభ్యం మెరుగుపడుతుంది.
అవార్డు - విజేతలు
→ప్లాటినం - ఇ-నామ్
→బంగారం - రవాణా మిషన్ మోడ్ ప్రాజెక్ట్ (eTransport)
→ వెండి - తీర్పు శోధన పోర్టల్

2) గ్రాస్‌రూట్ స్థాయిలో డిజిటల్ ఇనిషియేటివ్‌లు: వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, కార్మికులు, నైపుణ్యం మొదలైన డొమైన్‌లలో పంచాయతీలు, స్థానికంగా డిజిటల్ టెక్నాలజీ ఉదా., AI, బ్లాక్‌చెయిన్, డ్రోన్స్, IoT, ML, GIS మొదలైన వాటిని ఉపయోగించే కార్యక్రమాలను గుర్తించడం. సంస్థలు, ఉప-జిల్లాలు.
అవార్డు - విజేతలు
→ప్లాటినం - ఇ-వివేచన యాప్ (మధ్యప్రదేశ్)
→బంగారం - DeGS కంప్యూటర్ బేసిక్ ట్రైనింగ్ (జార్ఖండ్)
→వెండి - క్షీరశ్రీ పోర్టల్ (కేరళ)

3) సులభంగా వ్యాపారం చేయడం కోసం డిజిటల్ ఇనిషియేటివ్‌లు: వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేయడం, నిర్వహించడం మరియు నిర్వహించడంలో సమయం, ఖర్చులు మరియు ప్రయత్నాలను తగ్గించడం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని సృష్టించే డిజిటల్ కార్యక్రమాలను గౌరవించడం.
అవార్డు విజేతలు
→ ప్లాటినం - మైన్ మిత్ర (UP)
→ బంగారం - ఇఅబ్కారీ (ఒడిశా)
→ వెండి - ఇన్వెస్ట్ పంజాబ్

4) డేటా షేరింగ్ మరియు సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగం: దేశంలో విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం, ఆవిష్కరణ, ఆర్థిక అభివృద్ధి కోసం ఒక శక్తివంతమైన డేటా ఎకోసిస్టమ్‌ను రూపొందించడానికి మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థలు, రాష్ట్రాలు, స్మార్ట్ సిటీలు మరియు ULBల ద్వారా ప్రభుత్వ డేటాను కేంద్ర రిపోజిటరీకి పంచుకోవడం. మరియు ప్రజా ప్రయోజనం
అవార్డు విజేతలు
→ప్లాటినం - స్మార్ట్ సిటీస్ మిషన్, M/o హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్
→గోల్డ్ - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)
→సిల్వర్ - సెంటర్ ఫర్ ఇ-గవర్నెన్స్ (కర్ణాటక)

5)పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు - కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు రాష్ట్రాలు: విస్తృత స్థాయి కవరేజీతో మరియు సమాజంలో అధిక ప్రభావాన్ని కలిగి ఉండే పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రూపకల్పన మరియు అమలులో నైపుణ్యాన్ని గౌరవించడం
అవార్డు విజేతలు - రాష్ట్రాలు
→ప్లాటినం - డ్యూరే సర్కార్ (పశ్చిమ బెంగాల్)
→గోల్డ్ - ఇ-సర్వీసెస్ మణిపూర్

అవార్డు విజేతలు - కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాఖలు
→ప్లాటినం - ICEGATE పోర్టల్
→బంగారం - ఈశ్రమ్

6)స్టార్టప్‌ల సహకారంతో డిజిటల్ ఇనిషియేటివ్‌లు: డిజిటల్ పాలనను మెరుగుపరచడం మరియు/లేదా రూపాంతరం చేయడం, డిజిటల్ సేవల అనుభవాన్ని మెరుగుపరచడం మరియు పౌరుల డిజిటల్ సాధికారత కోసం స్టార్టప్‌ల సహకారంతో ప్రభుత్వ సంస్థలచే గౌరవప్రదమైన ప్రతిభను పొందడం
అవార్డు విజేతలు
→ప్లాటినం - డిజిటల్ వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (కేరళ)
→బంగారం - మట్టి యొక్క స్మార్ట్ పోషక నిర్వహణ (తెలంగాణ)
→సిల్వర్ - డిజిటల్ డిపాజిట్ రీఫండ్ సిస్టమ్ (ఉత్తరాఖండ్)

7)GIGW & యాక్సెసిబిలిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తమ వెబ్ & మొబైల్ కార్యక్రమాలు: ఏదైనా పరికరంలో రిచ్ కంటెంట్ మరియు అవరోధ రహిత యాక్సెస్‌ని నిర్ధారించే వెబ్ & మొబైల్ కార్యక్రమాలను గుర్తించడం.
అవార్డు విజేతలు
→ప్లాటినం - బిలాస్‌పూర్ జిల్లా వెబ్‌సైట్ (ఛత్తీస్‌గఢ్)
→గోల్డ్ - కొట్టాయం జిల్లా (కేరళ) వెబ్‌సైట్
→సిల్వర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ వెబ్‌సైట్


రైతులను బలోపేతం చేసేందుకు నాబార్డ్ మరియు SIIRD ల మధ్య ఒప్పందం

→'హాకీ వాలీ సర్పంచ్' అని ముద్దుగా పిలుచుకునే నీరూ యాదవ్ SIIRD (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) సహాయంతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (FPO)ని ప్రారంభించేందుకు నాబార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
→ఈ చొరవ రాజస్థాన్‌లోని లంబి అహిర్ విలేజ్ రైతులను బలోపేతం చేస్తుంది.
FPO:
→ఇది ప్రాథమిక నిర్మాతలచే ఏర్పడిన చట్టపరమైన సంస్థ.
→రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు మొదలైన నిర్మాతలు కంపెనీ ఆధారిత ఈక్విటీ వాటాను ఏర్పాటు చేసుకోవచ్చు.

8,000 కోట్ల చొప్పున రెండు విడతలుగా ఆర్‌బీఐ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది

→రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి సావరిన్ గ్రీన్ బాండ్లను (SGrBs) రెండు విడతల్లో మొత్తం 16,000 కోట్ల రూపాయలకు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
→కర్బన ఉద్గారాలను తగ్గించాలని కోరుతూ ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ఈ ఆదాయాన్ని వినియోగిస్తారు.
→మొదటి వేలం జనవరి 25, 2023న జరుగుతుంది, రెండవది ఫిబ్రవరి 9, 2023న జరుగుతుంది.
→SGrBలు ఏకరీతి ధర వేలం ద్వారా జారీ చేయబడతాయి మరియు విక్రయించబడిన నోటిఫై చేసిన మొత్తంలో 5% రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వ్ చేయబడుతుంది

అనురాగ్ సింగ్ ఠాకూర్ (యువజన వ్యవహారాల మంత్రి) Y20 సమ్మిట్ ఇండియా థీమ్‌లు ఆవిష్కరించారు

→అనురాగ్ సింగ్ ఠాకూర్ (యువజన వ్యవహారాల మంత్రి) న్యూ ఢిల్లీలోని కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో Y20 సమ్మిట్ ఇండియా థీమ్‌లు, లోగో మరియు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
థీమ్‌లు:-
→పని యొక్క భవిష్యత్తు: పరిశ్రమ 4.0, ఇన్నోవేషన్ & 21వ శతాబ్దపు నైపుణ్యాలు
→క్లైమేట్ చేంజ్ మరియు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్: సస్టైనబిలిటీని ఒక జీవన విధానంగా మార్చడం
→శాంతి నిర్మాణం మరియు సయోధ్య: యుద్ధం లేని యుగానికి నాంది పలుకుతోంది
→షేర్డ్ ఫ్యూచర్: యూత్ ఇన్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ అండ్ హెల్త్, శ్రేయస్సు & క్రీడలు: యువత కోసం ఎజెండా.

2022లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 10 విమానాశ్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు: సిరియమ్

→ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ ప్రకారం, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఆన్-టైమ్ ఎయిర్‌పోర్ట్‌లలో టాప్ 10లో ఉన్నాయి.
→బెంగుళూరు విమానాశ్రయం 2022లో ఆన్‌టైమ్ రాక మరియు డిపార్చర్‌ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యుత్తమ విమానాశ్రయంగా ఉంది.
→కాగా, జపాన్‌లోని హనేడా విమానాశ్రయం అత్యుత్తమ పనితీరు కనబరిచిన విమానాశ్రయంగా నిలిచింది.
→ఇందిరా గాంధీ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఆన్-టైమ్ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానంలో నిలిచింది.

బిర్సా ముండా హాకీ స్టేడియంను ఒడిశా సీఎం పట్నాయక్ ప్రారంభించారు

→దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
→భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం తర్వాత రూర్కెలా FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023 యొక్క రెండవ వేదిక.
→44 మ్యాచ్‌ల్లో 20 మ్యాచ్‌లకు రూర్కెలా ఆతిథ్యం ఇవ్వగా, మిగిలిన 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి.
→జనవరి 13న ఇక్కడి బిర్సా ముండా హాకీ స్టేడియంలో స్పెయిన్‌తో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది.

ప్రొఫెషనల్ టెన్నిస్‌కు సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది

→భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
→ఫిబ్రవరి 2023లో దుబాయ్‌లో జరిగే WTA 1000 ఈవెంట్‌లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు.
→ఆమె 2005లో తన స్వస్థలమైన హైదరాబాద్ ఈవెంట్‌లో గెలిచినప్పుడు WTA సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు.
→ఆమె 2007 నాటికి టాప్ 30లోకి ప్రవేశించింది మరియు ప్రపంచ 27వ ర్యాంక్‌తో కెరీర్‌లో అత్యధిక ర్యాంకింగ్‌కు చేరుకుంది.
→2015లో, ఆమె స్విస్ లెజెండ్ మార్టినా హింగిస్‌తో జతకట్టింది మరియు మూడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.

'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్'ని వర్చువల్'గా నిర్వహించనున్న భారతదేశం

→భారతదేశం 2023 జనవరి 12 మరియు 13 తేదీల్లో వర్చువల్‌గా 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్'ని నిర్వహించనుంది.
→సమ్మిట్ యొక్క థీమ్ Unity of Voice, Unity of Purpose.
→సమ్మిట్ గోబల్ సౌత్ దేశాలను ఒకచోట చేర్చి, వారి దృక్కోణాలు మరియు ప్రాధాన్యతలను మొత్తం శ్రేణి సమస్యలపై ఉమ్మడి వేదికపై పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
→సబ్‌కా సాథ్, సభా వికాస్, సబ్‌కా విశ్వాస్ ఔర్ సబ్‌కా ప్రయాస్ మరియు వసుధైవ కుటుంబం అనే భారతదేశం యొక్క సూత్రం యొక్క PM మోడీ దార్శనికత నుండి ఈ కార్యక్రమం ప్రేరణ పొందింది.

తమిళనాడుకు చెందిన ప్రాణేష్ ఎం భారతదేశానికి 79వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు

→తమిళనాడుకు చెందిన ఎం ప్రాణేష్ (16) 2022/2023 రిల్టన్ కప్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుని, భారతదేశానికి 79వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ఇది FIDE సర్క్యూట్ యొక్క మొదటి టోర్నమెంట్.
→అతను లైవ్ రేటింగ్ 2,500 ఎలో పాయింట్లను అధిగమించాడు.
→అతను 18వ ఢిల్లీ GM ఓపెన్‌లో తన మొదటి నార్మ్, స్పెయిన్‌లోని సన్‌వే సిట్‌జెస్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్‌లో రెండవ నార్మ్ మరియు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ నార్మ్‌ను గెలుచుకున్నాడు.
→ప్రముఖ కోచ్ ఆర్‌బీ రమేష్‌ వద్ద శిక్షణ పొందాడు.

NER అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క పథకాల కొనసాగింపును క్యాబినెట్ ఆమోదించింది

→15వ ఆర్థిక సంఘం (2022-23 నుండి 2025-26 వరకు) బ్యాలెన్స్ కాలానికి 12,882 కోట్ల రూపాయల వ్యయంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క పథకాల కొనసాగింపును ప్రభుత్వం ఆమోదించింది.
→ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకానికి రూ.8139.5 కోట్లు వెచ్చించనున్నారు.
→కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల నిబద్ధతతో సహా ‘ఎన్‌ఇసి పథకాల’ కోసం రూ.3202.7 కోట్లు ఖర్చు అవుతుంది.
→అస్సాంలో BTC, DHATC మరియు KAATC కోసం ప్రత్యేక ప్యాకేజీల కోసం ఖర్చు రూ.1540.

50 ASI-రక్షిత స్మారక చిహ్నాలు అదృశ్యమయ్యాయి

→పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన ‘భారతదేశంలో గుర్తించలేని స్మారక చిహ్నాలు మరియు స్మారక చిహ్నాల రక్షణకు సంబంధించిన సమస్యలు’ అనే శీర్షికతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, భారతదేశంలోని 3,693 కేంద్ర రక్షణ స్మారక చిహ్నాలలో 50 కనిపించకుండా పోయాయి.
→వేగవంతమైన పట్టణీకరణ 14 స్మారక చిహ్నాలను చుట్టుముట్టింది.
→రిజర్వాయర్లు మరియు డ్యామ్‌ల నిర్మాణాల వల్ల 12 స్మారక చిహ్నాలు మునిగిపోగా, 24 అదృశ్యమయ్యాయి.
→248 స్మారక చిహ్నాలు మాత్రమే సెక్యూరిటీ గార్డులచే రక్షించబడుతున్నాయి.

సైలెంట్ వ్యాలీ లో పెరిగిన పక్షి జాతుల సంఖ్య

→డిసెంబర్ 2022లో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో నిర్వహించిన పక్షుల సర్వేలో 17 కొత్త పక్షి జాతులు ఇప్పటికే ఉన్న జాబితాకు జోడించబడ్డాయి.
→దీంతో సైలెంట్ వ్యాలీలో పక్షి జాతులు 175కి పెరిగాయి.
→సైలెంట్ వ్యాలీలో మొదటి పక్షి సర్వే యొక్క 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 2022 చివరి వారంలో సర్వే నిర్వహించబడింది.
→మొదటి సర్వే 1990 డిసెంబర్ చివరి వారంలో జరిగింది.
→కేరళ నేచురల్ హిస్టరీ సొసైటీతో కలిసి ఈ సర్వే జరిగింది.
→సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ భారతదేశంలోని కేరళలో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం. ఇది నీలగిరి కొండలలో ఉంది, ఇది 89.52 కిమీ² యొక్క ప్రధాన విస్తీర్ణం కలిగి ఉంది, దీని చుట్టూ 148 కిమీ² బఫర్ జోన్ ఉంది. ఈ జాతీయ ఉద్యానవనంలో కొన్ని అరుదైన వృక్షజాలం మరియు జంతుజాలం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని 1847లో రాబర్ట్ వైట్ అనే వృక్షశాస్త్రజ్ఞుడు అన్వేషించాడు.

ఒడిశా తన జాగా మిషన్ కోసం వరల్డ్ హాబిటాట్ అవార్డు 2023 గెలుచుకుంది

→జగ మిషన్ (రాష్ట్రం యొక్క 5T చొరవ) కోసం UN-హాబిటాట్ యొక్క వరల్డ్ హాబిటాట్ అవార్డ్స్ 2023ను ఒడిశా గెలుచుకుంది.
→5T అంటే : 5T: Team work, Technology, Transparency, Transformation and Time limit.
→ఇది మురికివాడల నివాసితుల జీవితాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ టైటిల్ మరియు స్లమ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్.
→ఈ మిషన్ కింద, 2,724 మురికివాడల్లోని 100% గృహాలకు పైపు నీటి కనెక్షన్లు అందించబడ్డాయి మరియు 8 నగరాలు మురికివాడలు లేని నగరాలుగా మారాయి.

‘నార్త్ ఈస్ట్ కృషి కుంభ-2023’ను ప్రారంభించిన నరేంద్ర సింగ్ తోమర్

→కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మేఘాలయలో మూడు రోజుల ‘నార్త్ ఈస్ట్ కృషి కుంభ-2023’ను ప్రారంభించారు.
→NEH రీజియన్, Umiam కోసం ICAR రీసెర్చ్ కాంప్లెక్స్ యొక్క 49వ వ్యవస్థాపక దినోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు.
→ఈ ఈవెంట్‌లో అన్ని ICAR ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు హోస్ట్ ఇన్‌స్టిట్యూట్ మరియు దాని ప్రాంతీయ కేంద్రాల ద్వారా 102 స్టాల్స్ ద్వారా ఇటీవలి టెక్నాలజీల ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు ప్రదర్శనలు ఉన్నాయి.

మార్చి 2023లో ఢిల్లీలో G20 విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు

→G20 విదేశాంగ మంత్రి సమావేశం 2023 మార్చిలో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనుంది.

అల్చి, లేహ్ సమీపంలోని NHPC డ్యామ్ వద్ద హైడ్రో టూరిజం అభివృద్ధి చేయబడుతుంది

→లడఖ్ టూరిజం డిపార్ట్‌మెంట్ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC)తో కలిసి లేహ్‌లోని ఆల్చి సమీపంలో సింధు నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో హైడ్రో టూరిజంను అభివృద్ధి చేసింది.
→జెట్ స్కీయింగ్, మోటర్‌బోటింగ్, శీతాకాలంలో ఐస్ స్కేటింగ్ మరియు వేసవి కాలంలో బోటింగ్ వంటి జల క్రీడలు దశలవారీగా ప్రారంభించబడతాయి.
→అదేవిధంగా, భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సహకారంతో పర్యాటక శాఖ కూడా సరిహద్దు పర్యాటకాన్ని ప్రవేశపెడుతోంది.

భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు UGC అనుమతి అవసరం

→యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) చైర్మన్, ఎం జగదీష్ కుమార్ విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ముసాయిదా నిబంధనలను ఆవిష్కరించారు.
→ముసాయిదా నిబంధనల ప్రకారం, UGC నుండి అనుమతి పొందిన తర్వాత విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.
→ప్రాథమిక ఆమోదం 10 సంవత్సరాలు ఉంటుంది.
→దేశంలో క్యాంపస్‌లు ఉన్న విదేశీ వర్సిటీలు పూర్తి-సమయ ప్రోగ్రామ్‌లను ఫిజికల్ మోడ్‌లో అందించడానికి మాత్రమే అనుమతించబడతాయి (ఆన్‌లైన్ లేదా దూరవిద్య లేదు)

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ఎంపిక

→ఫిల్మ్ మేకర్ SS రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో RRR కోసం ఉత్తమ దర్శకుడు అవార్డుతో సత్కరించబడ్డాడు .
→RRR ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు సాంగ్ కోసం) కూడా నామినేట్ చేయబడింది.
→95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ పాటల విభాగంలో నాటు నాటు కూడా షార్ట్‌లిస్ట్ చేయబడింది.
→ఇతర అవార్డులు:-
→ఉత్తమ చిత్రం: టార్ (టాడ్ ఫీల్డ్ దర్శకత్వం)
→ఉత్తమ నటుడు: కోలిన్ ఫారెల్ (తార్)
→ఉత్తమ నటి: కేట్ బ్లాంచెట్

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం 2023 జనవరి 4

→ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, జనవరి 4న గుర్తించబడింది, పాక్షికంగా దృష్టిగల మరియు అంధులకు కమ్యూనికేషన్ యొక్క ఒక రూపంగా బ్రెయిలీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
→ఐక్యరాజ్యసమితి 2019 నుండి రోజును స్మరించుకుంటుంది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జనవరి 4, 1809న జన్మించిన లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని కూడా స్మరించుకుంటుంది.
→బాల్యంలో తన దృష్టిని కోల్పోయిన తరువాత, ఫ్రెంచ్ విద్యావేత్త బ్రెయిలీ పద్ధతిని రూపొందించారు.

108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు

→వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం దాని శతాబ్ది జ్ఞాపకార్థం ISC యొక్క ఐదు రోజుల 108వ సెషన్‌ను నిర్వహిస్తోంది.
→108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ థీమ్ : “మహిళా సాధికారతతో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ” ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ యొక్క ప్రధాన థీమ్.
→ సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత మరియు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్రపై చర్చలు వార్షిక కాంగ్రెస్ అంతటా జరుగుతాయి.

జనవరి 1న గ్లోబల్ ఫ్యామిలీ డే

→గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రతి సంవత్సరం జనవరి 1 న జరుపుకుంటారు. కుటుంబాల ఆలోచన ద్వారా దేశాలు మరియు సంస్కృతులలో ఐక్యత, సంఘం మరియు సోదర భావాన్ని ఈ రోజు సృష్టిస్తుంది.
→ఇతర సంస్కృతులు, దేశాల పట్ల అసమంజసమైన ప్రతికూల దృక్పథాలను నిరుత్సాహపరిచేందుకు ఈ రోజు జరుపుకుంటారు, ఇది ద్వేషాన్ని పెంపొందించవచ్చు, సామాజిక వైరాగ్యాన్ని ప్రోత్సహించవచ్చు మరియు హింసకు దారి తీస్తుంది.
→సాంస్కృతిక లేదా మత భేదాలతో సంబంధం లేకుండా అన్ని దేశాలు సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ రోజు హైలైట్ చేస్తుంది. ఈ రోజు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు ఆలోచనను విశ్వవ్యాప్త స్థాయికి విస్తరించాలని కోరింది.

త్రిపురలో 90 శాతానికి పైగా ఓటింగ్‌ను పెంచేందుకు ‘మిషన్-929’

→ఎన్నికల సంఘం (EC) త్రిపుర వ్యాప్తంగా 929 పోలింగ్ బూత్‌లపై దృష్టి సారించింది, ఈ ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 92 శాతం ఓటింగ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.
→ఈ బూత్‌లలో 89 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది, ఇది 2018 అసెంబ్లీ ఎన్నికలలో 3,328 బూత్‌లలో సగటు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ‘మిషన్ జీరో పోల్ వయలెన్స్’పై కూడా ఈసీ కసరత్తు చేస్తోంది.
త్రిపుర అసెంబ్లీ మరియు ఎన్నికల గురించి:-
→త్రిపుర శాసనసభలో 60 సీట్లు ఉన్నాయి. త్రిపుర 12వ శాసనసభను ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు 18 ఫిబ్రవరి 2018న జరిగాయి. 12వ శాసనసభ పదవీకాలం 22 మార్చి 2023న ముగుస్తుంది.
→భారతీయ జనతా పార్టీ (బిజెపి) 36 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది మరియు అది త్రిపురలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
→త్రిపుర ముఖ్యమంత్రి: మాణిక్ సాహా
→రాజధాని: అగర్తల

అణు ఆస్తులు మరియు జైలు ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకున్న భారతదేశం మరియు పాకిస్తాన్

→ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ 1992 నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, శత్రుత్వాల సందర్భంలో దాడి చేయలేని అణు వ్యవస్థాపనల జాబితాలను భారతదేశం మరియు పాకిస్తాన్ జనవరి 1, 2023న పరస్పరం మార్చుకున్నాయి.
→ఇరు పక్షాలు పరస్పరం జైళ్లలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం మార్చుకున్నాయి, మరియు భారత పక్షం పాకిస్తాన్ కస్టడీ నుండి వారి పడవలతో పాటు పౌర ఖైదీలు, తప్పిపోయిన రక్షణ సిబ్బంది మరియు మత్స్యకారులను త్వరగా విడుదల చేసి స్వదేశానికి రప్పించాలని కోరింది.
→రెండు దేశాల మధ్య ఇది వరుసగా 32వ జాబితా మార్పిడి, మొదటిది జనవరి 1, 1992న జరిగింది. కాన్సులర్ యాక్సెస్‌పై 2008 ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఇరుపక్షాలు పరస్పరం కస్టడీలో ఉన్న ఖైదీల జాబితాలను ఒక సంవత్సరం, జనవరి 1 మరియు జూలై 1 న, న్యూ ఢిల్లీ మరియు ఇస్లామాబాద్‌లోని దౌత్య మార్గాల ద్వారా రెండుసార్లు మార్పిడి చేసుకున్నాయి.
→ప్రస్తుతం భారత్ అదుపులో 339 మంది పాకిస్థానీ పౌర ఖైదీలు, 95 మంది మత్స్యకారులు ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
→పాకిస్తాన్ తన అదుపులో ఉన్న 51 మంది పౌర ఖైదీలు మరియు 654 మంది మత్స్యకారుల జాబితాను పంచుకుంది.

ఏపీలో రూ.2,000 కోట్లతో గ్రాన్యూల్స్‌ పరిశ్రమ

→ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌ .. ఆం ధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ కేంద్రానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
→100 ఎకరాల విస్తీర్ణంలో దశలవారీగా ఈ ఫెసిలిటీ కార్యరూపం దాల్చనుంది. ఔషధాల ఉత్పత్తికి కావాల్సి న కీస్టార్టిం గ్‌ మెటీరియల్స్ , ఇంటర్మీ డియేట్స్ , యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్ , ఫెర్మెంటేషన్‌ ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. కాగా, గ్రాన్యూల్స్‌ తాజాగా గ్రీన్‌కో జీరోసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్గార రహిత విద్యుత్‌ను గ్రీన్‌కో ఈ ప్లాంటుకు సరఫరా చేస్తుంది. అలాగే డీసీడీఏ, పీఏపీ, పారాసీటమాల్, మెట్‌ఫార్మి న్, ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీలో వాడే రసాయనాలను సైతం అందిస్తుంది.

2021-22లో అంబుడ్స్‌మన్ పథకాల కింద ఫిర్యాదులు 9.39% పెరిగాయి

→ ఆర్‌బిఐ విడుదల చేసిన అంబుడ్స్‌మన్ పథకాల వార్షిక నివేదిక, 2021-22 ప్రకారం, 2021-22లో అంబుడ్స్‌మన్ స్కీమ్‌ల కింద వచ్చిన ఫిర్యాదులు 9.39% పెరిగాయి.
→2021-22లో RB-IOS మరియు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్ కింద అందిన ఫిర్యాదుల పరిమాణం 4,18,184.
→దాదాపు 42% ఫిర్యాదులు డిజిటల్ చెల్లింపులు మరియు లావాదేవీలకు సంబంధించినవి.
→రిజర్వ్ బ్యాంక్ - ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RB-IOS) నవంబర్ 12, 2021న ప్రారంభించబడింది.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం

→19,744 కోట్ల రూపాయల ప్రారంభ వ్యయంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
→లక్ష్యం: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడం.
→రూ. 19,744 కోట్ల వ్యయంలో, గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ (సైట్) కార్యక్రమం కోసం వ్యూహాత్మక జోక్యాల కోసం 17,490 కోట్లు.
→కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) సంబంధిత భాగాల అమలు కోసం పథకం మార్గదర్శకాలను కూడా రూపొందిస్తుంది.

నాసా యొక్క అపోలో 7 వ్యోమగామి, వాల్టర్ కన్నింగ్‌హామ్ కన్నుమూశారు

→NASA యొక్క అపోలో కార్యక్రమంలో మొదటి విజయవంతమైన సిబ్బందితో కూడిన అంతరిక్ష యాత్ర నుండి జీవించి ఉన్న చివరి వ్యోమగామి, వాల్టర్ కన్నింగ్‌హామ్ 90 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు.
→అపోలో 7 మిషన్‌లోని ముగ్గురు వ్యోమగాములలో అతను ఒకడు, అది 1968లో ప్రారంభించబడింది మరియు 11 రోజుల పాటు కొనసాగింది.
→నాసాలో చేరడానికి ముందు, అతను US నేవీలో చేరాడు మరియు 1952లో పైలట్‌గా శిక్షణ పొందడం ప్రారంభించాడు.
→అతను కొరియాలో 54 మిషన్లలో US మెరైన్ కార్ప్స్‌తో ఫైటర్ పైలట్‌గా పనిచేశాడు.

382 మెగావాట్ల సున్ని డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం పెట్టుబడిని ఆమోదించింది

→హిమాచల్ ప్రదేశ్‌లోని 382 మెగావాట్ల సున్ని డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం 2,614 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో (రూ. 2,246.40 కోట్లు (కష్ట వ్యయం మొత్తం), రూ. 358.96 కోట్లు (నిర్మాణ సమయంలో వడ్డీ) మరియు 9.15 కోట్ల (ఫైనాన్సింగ్ చార్జీలు ) పెట్టుబడిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. .
→సట్లెజ్ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
→దీనిని సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ 5 సంవత్సరాలలో నిర్మిస్తుంది.
→ఈ ప్రాజెక్ట్ దాదాపు 4,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది.

ముఖ్యమంత్రి నివాస భూమి హక్కుల పథకాన్ని ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

→ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి , శివరాజ్ సింగ్ చౌహాన్ టికామ్‌ఘర్ జిల్లాలోని బగజ్ మాతా దేవాలయ సముదాయంలో ముఖ్యమంత్రి నివాస భూమి హక్కుల పథకాన్ని (ముఖ్యమంత్రి అవాసీయ భూ అధికార్ యోజన) ప్రారంభించారు.
→ఈ పథకం కింద టికామ్‌ఘర్ జిల్లాలోని 10 వేల 918 కుటుంబాలకు సుమారు 129 కోట్ల రూపాయల విలువైన ప్లాట్లు పంపిణీ చేయబడ్డాయి.
→లక్ష్యం: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఉచితంగా ప్లాట్లు అందించడం.
→అన్ని ఇతర పథకాల ప్రయోజనాలు కూడా అందించబడతాయి.

ప్రభుత్వం BIND పథకాన్ని ఆమోదించింది

→ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) 2025-26 వరకు 2,539.61 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్టార్ బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (Broadcasting Infrastructure and Network Development (BIND) ) పథకాన్ని ఆమోదించింది.
→లక్ష్యం: ప్రసార భారతి అంటే ఆల్ ఇండియా రేడియో (AIR) మరియు దూరదర్శన్ (DD) యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం.
→ప్రస్తుతం, దూరదర్శన్ 28 ప్రాంతీయ ఛానెల్‌లతో సహా 36 టీవీ ఛానెల్‌లను నిర్వహిస్తోంది మరియు ఆల్ ఇండియా రేడియో (AIR) 500 కంటే ఎక్కువ ప్రసార కేంద్రాలను నిర్వహిస్తోంది.

జల మంత్రిత్వ శాఖ మొట్టమొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సమావేశాన్ని నిర్వహిస్తుంది

→జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 జనవరి 5న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నీటిపై మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సమావేశాన్ని నిర్వహించింది.
→ఇతివృత్తం : వాటర్ విజన్ 2047
→లక్ష్యం: సుస్థిర అభివృద్ధి మరియు మానవ పురోగతి కోసం నీటి వనరులను ఉపయోగించుకునే మార్గాలను చర్చించడానికి కీలకమైన విధాన నిర్ణేతలను ఒకచోట చేర్చడం.
→కాన్ఫరెన్స్ '5P' మంత్రం (రాజకీయ సంకల్పం, పబ్లిక్ ఫైనాన్సింగ్, భాగస్వామ్యాలు, ప్రజల భాగస్వామ్యం మరియు స్థిరత్వం కోసం ఒప్పించడం)పై కూడా చర్చించబడింది.

డాక్టర్ తపన్ సైకియాకు అస్సాం అత్యున్నత పౌర పురస్కారం ‘అస్సాం బైభవ్’

→అస్సాం సిఎం, హిమంత బిస్వా శర్మ 21 మంది వ్యక్తులను అస్సాం స్టేట్ సివిలియన్ అవార్డ్స్ 2022 కోసం ఎంపిక చేశారు.
→రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం, 'అస్సాం బైభవ్' క్యాన్సర్ సంరక్షణ రంగంలో చేసిన కృషికి. డాక్టర్ తపన్ సైకియాకు ఇవ్వబడుతుంది
→అస్సాం సౌరవ్ (అస్సాం రెండవ అత్యున్నత పౌర పురస్కారం) కృష్ణ రాయ్‌; గిల్బర్ట్‌సన్ సంగ్మా; నయన్మోని సైకియా; డాక్టర్ బినోయి కుమార్ సైకియా మరియు డాక్టర్ శశిధర్ ఫుకాన్'లకు ఇవ్వబడుతుంది
→అసోమ్ గౌరవ్ (మూడవ అత్యున్నత పౌర పురస్కారం) 15 మందికి ప్రదానం చేస్తారు.

శశి థరూర్ యొక్క తాజా పుస్తకం 'అంబేద్కర్: ఎ లైఫ్' విడుదల

→కితాబ్ కోల్‌కతా కార్యక్రమంలో శశి థరూర్ రచించిన 'అంబేద్కర్: ఎ లైఫ్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
→శ్రీ సిమెంట్ సమర్పించిన ఐటీసీ సోనార్‌లో ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ (పీకేఎఫ్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
→ఈ కార్యక్రమంలో బైబిలియోఫైల్స్ యువకులు మరియు పెద్దలు, ఎహ్సాస్ ఉమెన్ మరియు FICCI FLO సభ్యులు పాల్గొన్నారు.
→శశి థరూర్ యొక్క ఇతర ప్రముఖ పుస్తకాలు: రైట్ (2001), వై ఐ యామ్ ఎ హిందు (2018), ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ (2018), ఇండియా: ఫ్రమ్ మిడ్‌నైట్ టు ది మిలీనియం (1997)

జనవరి 1 నుంచి ఎపిలో పింఛను వారోత్సవాలు

→ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చేలా వృధ్యాప్య ఫించను రూ.2500 నుండి రూ.2750 కి పెంచింది .
→ప్రజలలో దీని గురుంచి అవగాహన పెంచేందుకు ప్రభుత్వం జనవరి 1 నుంచి పింఛను వారోత్సవాలు నిర్వహించనుంది .
→జనవరి 2023 నెలలో వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నారు.
→జనవరి 2023 గాను పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసింది.
→ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది.
→దీంతో దేశంలోనే అత్యధిక సామాజిక పించన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది .

మాజీ పోప్ బెనెడిక్ట్ XVI వాటికన్ నగరంలో కన్నుమూత

→ మాజీ పోప్ బెనెడిక్ట్ XVI (95 సంవత్సరాలు) మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలోని తన నివాసంలో కన్నుమూశారు.
→జనవరి 5న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే పోప్ ఎమెరిటస్ అంత్యక్రియలకు పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షత వహిస్తారు.
→పోప్ బెనెడిక్ట్ XVI క్యాథలిక్ చర్చికి ఎనిమిదేళ్ల కంటే తక్కువ కాలం నాయకత్వం వహించి, 2013లో, 1415లో గ్రెగొరీ XII తర్వాత రాజీనామా చేసిన మొదటి పోప్ అయ్యాడు.
→అనారోగ్యం కారణంగా ఆయన పోప్ పదవికి రాజీనామా చేశారు.

చైనా కొత్త విదేశాంగ మంత్రిగా క్విన్ గ్యాంగ్‌

→యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో చైనా రాయబారి క్విన్ గ్యాంగ్ (56 ఏళ్లు) ఆ దేశ కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.
→13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC) స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది
→అతను ఇప్పుడు CPC సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు మరియు రాష్ట్ర కౌన్సిలర్‌గా ఉన్న వాంగ్ యి స్థానంలో నియమిస్తారు.
→అతను గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియు తరువాత వైస్ మినిస్టర్ స్థాయికి ఎదిగాడు, Mr. Xiతో సన్నిహిత సంబంధం ఉంది.

హాకీ హర్యానా మహిళల U-18 జట్టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 విజేతగా నిలిచింది

→భువనేశ్వర్‌లో జరిగిన ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌ను 2-0తో ఓడించిన తర్వాత హాకీ హర్యానా మహిళల జట్టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 మహిళల అండర్ 18 క్వాలిఫైయర్స్‌లో విజేతగా నిలిచింది.
→హర్యానా తరఫున పూజా, గుర్‌మైల్ కౌర్ చెరో గోల్ చేసి జట్టును ట్రోఫీ విజేతగా నిలిపారు
→3వ, 4వ స్థానాల్లో జరిగిన పోరులో ఒడిశా 2-1తో హాకీ జార్ఖండ్‌ను ఓడించి 3వ స్థానానికి ఎగబాకింది.
→హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్‌లు 2023లో మధ్యప్రదేశ్‌'లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు అర్హత సాధించాయి.

1 జనవరి 2023 నుండి కొత్త సమగ్ర ఆహార భద్రత పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది

→2023లో జాతీయ ఆహార భద్రతా చట్టం, NFSA కింద 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి కేంద్రం 1 జనవరి 2023 నుండి కొత్త సమగ్ర ఆహార భద్రతా పథకాన్ని అమలు చేస్తుంది.
→ఇది చట్టం యొక్క ప్రభావవంతమైన మరియు ఏకరీతి అమలును నిర్ధారిస్తుంది మరియు ఉచిత ఆహారధాన్యాలు ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒక రేషన్ కార్డు కింద పోర్టబిలిటీని ఏకరీతిగా అమలు చేయడానికి నిర్ధారిస్తుంది.
→ఈ పథకం కింద, NFSA లబ్ధిదారులందరికీ కేంద్రం ఉచితంగా ఆహారధాన్యాలను అందిస్తుంది.

NRDCలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

→స్టార్టప్‌లకు బహుముఖ సహాయాన్ని అందించడానికి ఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC)లో కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు.
→NRDC ఇంక్యుబేటింగ్ స్టార్ట్-అప్‌ల సదుపాయాన్ని సృష్టించింది మరియు స్టార్ట్-అప్‌లకు నిధులు, మార్గదర్శకత్వం, IP సహాయం మరియు ఇతర అనుబంధ సేవల పరంగా మద్దతును అందించడానికి ప్రయోజనకరమైన పథకాలను కూడా ప్రోత్సహిస్తోంది.
→NRDC ఢిల్లీ ప్రధాన కార్యాలయంతో 1953లో స్థాపించబడింది.

ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపీ రజతం సాధించింది

→మాజీ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్, కోనేరు హంపీ కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరిగిన FIDE వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన ఝోంగీ టాన్‌ను ఓడించి భారతదేశానికి మొట్టమొదటి రజత పతకాన్ని సాధించింది .
→ఆమె 12.5 పాయింట్లు సాధించింది, కజకస్తాన్‌కు చెందిన బంగారు పతక విజేత బిబిసర బాలబయేవా కంటే కేవలం సగం పాయింట్ వెనుకబడి ఉంది .
→విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ బ్లిట్జ్‌లో పతకం సాధించిన రెండో భారతీయుడు/భారతీయురాలు .

అల్ నాసర్‌ క్లబ్ లో క్రిస్టియానో రొనాల్డో

→పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్‌లో 2025 వరకు సంవత్సరానికి USD 75 మిలియన్లకు పైగా కాంట్రాక్ట్‌పై చేరాడు.
→అల్ నాసర్ 9 సార్లు సౌదీ టాప్-ఫ్లైట్ టైటిళ్లను గెలుచుకుంది , చివరిగా 2019లో.
→ఈ చర్య వారి లీగ్, దేశం మరియు భవిష్యత్ తరాలు, అబ్బాయిలు మరియు బాలికలు తమలో తాము ఉత్తమ వెర్షన్‌గా ఉండేలా ప్రేరేపిస్తుంది.
→పోర్చుగల్ కెప్టెన్ వివాదాస్పద ఇంటర్వ్యూలో క్లబ్‌ను విమర్శించిన తరువాత మాంచెస్టర్ యునైటెడ్‌ను విడిచిపెట్టిన తర్వాత ఖాళీగా ఉన్నాడు.

నగరాలకు సుందరీకరణ ఆధారిత ర్యాంకింగ్ కోసం కార్యక్రమాలను ప్రారంభించిన MoHUA

→MoHUA, హర్దీప్ సింగ్ పూరి రెండు కీలక చొరవలను ప్రారంభించారు - సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ మరియు సిటీ బ్యూటీ కాంపిటీషన్.
→సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్‌లు: వనరుల సమీకరణ, వ్యయ పనితీరు మరియు ఆర్థిక పాలనా వ్యవస్థలు అనే మూడు ఆర్థిక పారామితుల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలను (ULBలు) మూల్యాంకనం చేయడం, గుర్తించడం మరియు అవార్డులు ప్రకటించడం
→సిటీ బ్యూటీ కాంపిటీషన్: అందమైన, వినూత్నమైన మరియు సమ్మిళిత బహిరంగ ప్రదేశాలను రూపొందించడానికి భారతదేశంలోని నగరాలు చేసిన పరివర్తన ప్రయత్నాలను గుర్తించడం .

భారతీయ రైల్వేల కోసం అమృత్ భారత్ స్టేషన్ పథకం

→దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పథకాన్ని ప్రారంభించింది.
→లక్ష్యం: దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన 1,000 కంటే ఎక్కువ స్టేషన్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి.
→రైల్వే స్టేషన్‌లలోని అన్ని కేటగిరీలలో హై లెవల్ ప్లాట్‌ఫారమ్‌లు (760 నుండి 840 మి.మీ) ఏర్పాటు చేయబడతాయి.
→ప్లాన్‌లో దాని వినియోగదారులకు ఉచిత వైఫై యాక్సెస్‌ను అందించడానికి నిబంధన ఉంది.
→రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తారు

కార్ల్‌సెన్ మరియు టాన్ జోంగీ 2022 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు

→GM మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరిగిన 2022 ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో తన నాల్గవ టైటిల్‌ను సాధించాడు.
→విన్సెంట్ కీమర్ (జర్మనీ) రజతంతో సరిపెట్టుకోగా, ఫాబియానో కరువానా (అమెరికా) కాంస్యం దక్కించుకున్నాడు.
→కాగా, 2022 మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా టాన్ ఝొంగీ (చైనా) స్వర్ణం సాధించింది.
→భారత చెస్ క్రీడాకారిణి, బి సవిత శ్రీ మహిళల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది . దీంతో ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ మరియు హంపీ తర్వాత పతకాన్ని గెలుచుకున్న మూడవ భారతీయురాలుగా నిలిచింది .

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ పాలసీని ప్రవేశపెట్టింది

→సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశం యొక్క జియోస్పేషియల్ డేటా పరిశ్రమను ప్రోత్సహించడానికి మరియు పౌర సేవలను మెరుగుపరచడానికి మరియు మరిన్నింటి కోసం అటువంటి డేటాను ఉపయోగించడానికి జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి నేషనల్ జియోస్పేషియల్ పాలసీ, 2022ని నోటిఫై చేసింది.
→లక్ష్యం: 2030 నాటికి అధిక రిజల్యూషన్ టోపోగ్రాఫికల్ సర్వే మరియు మ్యాపింగ్ మరియు అధిక ఖచ్చితత్వంతో కూడిన డిజిటల్ ఎలివేషన్ మోడల్‌ను అభివృద్ధి చేయడం.
→2025 నాటికి కంపెనీల కోసం "మెరుగైన లొకేషన్ డేటా" లభ్యత మరియు యాక్సెస్‌ని మెరుగుపరచడానికి కూడా ప్రభుత్వం చూస్తుంది.

ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

→బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్, పీలేగా ప్రసిద్ధి చెందిన ఎడ్సన్ అరంటెస్ డో నాస్సిమెంటో బ్రెజిల్‌లోని సావో పాలోలో 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
→అతను మూడు సార్లు (1958, 1962 మరియు 1970) ప్రపంచ కప్ గెలిచిన ఏకైక ఆటగాడు.
→అతను 2000లో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీగా ఎంపికయ్యాడు.
→అతని 21 ఏళ్ల కెరీర్‌లో, అతను తన దేశం కోసం 92 మ్యాచ్‌లలో 77 గోల్స్‌తో సహా 1,363 గేమ్‌లలో 1,283 కెరీర్ గోల్స్ చేశాడు.

భారతదేశం మరియు సైప్రస్ రక్షణ మరియు సైనిక సహకారంపై ఒప్పందంపై సంతకం చేశాయి

→ భారతదేశం మరియు సైప్రస్ రక్షణ మరియు సైనిక సహకారంతో సహా వివిధ రంగాలలో ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
→విద్యార్థులు, వ్యాపారవేత్తలు మరియు నిపుణుల చలనశీలతను సులభతరం చేయడానికి ఏర్పాటు మరియు సహకారం యొక్క సాధారణ ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి రెండు దేశాలు వలస మరియు మొబిలిటీ భాగస్వామ్యంపై ఉద్దేశ్య లేఖపై సంతకం చేశాయి.
→ఇది అక్రమ వలసలను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది.
→భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరియు సైప్రస్ విదేశాంగ మంత్రి మధ్య ఒప్పందాలు జరిగాయి.

మొబైల్ యాప్ ‘ప్రహరీ’ని ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా

→డిసెంబర్ 29, 2022న న్యూఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా మొబైల్ యాప్ ‘ప్రహరీ’ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ యొక్క మాన్యువల్ ప్రారంభించారు.
→ఈ యాప్ జవాన్లకు వారి మొబైల్‌లలో వసతి, ఆయుష్మాన్ CAPF మరియు లీవ్‌లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం మరియు సమాచారాన్ని అందిస్తుంది.
→ఇది జవాన్లను హోం మంత్రిత్వ శాఖ పోర్టల్‌తో అనుసంధానిస్తుంది.
→అతను కార్యకలాపాలు, పరిపాలన మరియు శిక్షణపై అవగాహనను పెంచే మాన్యువల్‌ల యొక్క సవరించిన సంస్కరణను కూడా ప్రారంభించాడు.
→BSF DG: పంకజ్ కుమార్

గోవాలో కొత్త జువారీ వంతెనను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

→నితిన్ గడ్కరీ (కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి) గోవాలో ఉత్తర మరియు దక్షిణ గోవాలను కలిపే జువారీ వంతెన దశ 1ని ప్రారంభించారు.
→ఇది మార్గోవో-పనాజీ జాతీయ రహదారిపై కోర్టాలిమ్ గ్రామం వద్ద జువారీ నదిపై ఉంది
→ఈ దశలో, 8 లేన్ స్టేడ్ కేబుల్ వంతెన యొక్క 4 లేన్ రైట్ సైడ్ కారిడార్ ప్రారంభించబడింది.
→ఈ కొత్త వంతెన బాంబోలిమ్ నుండి వెర్నాకు చేరుకుంటుంది మరియు మొత్తం ప్రాజెక్ట్ పొడవు 13.20 కి.మీ.

సుఖోయ్ జెట్ నుండి బ్రహ్మోస్ యొక్క పొడిగించిన శ్రేణి వెర్షన్‌ను IAF విజయవంతంగా పరీక్షించింది

→భారత వైమానిక దళం బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క పొడిగించిన శ్రేణి వెర్షన్‌ను సుఖోయ్-30MKI ఫైటర్ జెట్ నుండి బంగాళాఖాతంలోని ఓడ లక్ష్యానికి వ్యతిరేకంగా విజయవంతంగా పరీక్షించింది.
→అచీవ్‌మెంట్: సుఖోయ్ నుండి భూమి మరియు సముద్ర లక్ష్యాలకు వ్యతిరేకంగా చాలా సుదూర శ్రేణులలో ఖచ్చితమైన దాడులను నిర్వహించడం .
→క్షిపణి ప్రస్తుత బరువు 2.65 టన్నులు, బ్రహ్మోస్-ఎన్‌జి (అభివృద్ధిలో ఉంది)తో ఇది 1.33 టన్నులకు తగ్గుతుంది.
→బ్రహ్మోస్ అనేది రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయెనియా మరియు DRDO మధ్య ఒక జాయింట్ వెంచర్ .

బెంగాల్‌లో రూ. 5,800 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు

→డిసెంబర్ 30, 2022న ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో రూ. 5,800 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
→ప్రాజెక్ట్‌లలో జోకా-తరటాలా జోకా-ఎస్ప్లానేడ్ మెట్రో ప్రాజెక్ట్ (పర్పుల్ లైన్) మరియు హౌరా-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.
→జోకా-తరటాల ప్రాజెక్ట్ 6.5 కిలోమీటర్ల పొడవుతో ఆరు స్టేషన్లతో రూ. 2,475 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించబడింది.
→న్యూ జల్‌పైగురి రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేసేందుకు ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రముఖ రవీంద్ర సంగీత విద్వాంసురాలు సుమిత్రా సేన్ కన్నుమూశారు

→ప్రముఖ రవీంద్ర సంగీత విద్వాంసురాలు సుమిత్రా సేన్ (89) కన్నుమూశారు.
→ఆమె పాడిన పాటల్లో జోఖోన్ పోర్బే నా మోర్, సోఖి వబోనా కహరే బోలే మరియు మోనే కి ద్విధా ఉన్నాయి.
→2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను సంగీత మహాసమ్మన్ అవార్డుతో సత్కరించింది.
→రవీంద్ర సంగీతం ఠాగూర్ పాటలు అని కూడా పిలుస్తారు, ఇవి భారత ఉపఖండం నుండి బెంగాలీ పాలిమాత్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించి స్వరపరిచారు.

MoD, MoE, MSDE, మరియు మూడు సేవలు అగ్నివీర్ల విద్య కోసం అవగాహన ఒప్పందాలపై సంతకం చేస్తాయి

→సాయుధ దళాలలో పనిచేస్తున్నప్పుడు అగ్నివీర్లకు నిరంతర విద్యను అందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (MoD), విద్యా మంత్రిత్వ శాఖ (MoE), నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE), మరియు త్రివిధ దళాలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.
→నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ మరియు ఇగ్నో అగ్నివీర్‌లకు 12వ తరగతి సర్టిఫికెట్లు మరియు బ్యాచిలర్స్ డిగ్రీలను అందజేస్తాయి.
→ఇది సకాలంలో విద్యను పూర్తి చేయడానికి మరియు అదనపు లక్షణాలు మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అగ్నివీర్లను అనుమతిస్తుంది

భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని పెంచడానికి భారతదేశం మరియు ADB రుణ ఒప్పందం

→దేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB)తో భారతదేశం వివిధ రుణ ఒప్పందాలపై సంతకం చేసింది.
→మహారాష్ట్రలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి 350 మిలియన్ యుఎస్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకం చేశారు.
→అస్సాంలో 300 కి.మీ రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రహదారులను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం 300 మిలియన్ US డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది.
→త్రిపురలో ఇంధన భద్రత మరియు విద్యుత్ రంగం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి 220 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకం చేయబడింది.

మణిపూర్ లో గాన్ న్గై(Gaan Ngai) పండుగ

→మణిపూర్‌లోని జెలియాంగ్‌రోంగ్ సంఘం 4 జనవరి 2023న గాన్ న్‌గై పండుగను జరుపుకుంది.
→రైతులు తమ ఆహారధాన్యాలను తమ గ్యారీలలో నిల్వ చేసుకున్న సంవత్సరం ముగింపును కూడా ఈ పండుగ సూచిస్తుంది.
→వారు సర్వశక్తిమంతుడికి మంచి పంటను అందించడం ద్వారా మరియు మంచి జీవితం కోసం ప్రార్థించడం ద్వారా తమ కృతజ్ఞతను చూపుతారు.
→ఎండు చెక్కను, చీల్చిన వెదురు ముక్కలను రుద్దడం ద్వారా కొత్త మంటలు పుట్టించి పంచడం ఆనవాయితీ.
→జెలియాంగ్‌రోంగ్ సంఘంలో రోంగ్‌మీ, లియాంగ్‌మీ మరియు జెమ్ తెగలు ఉన్నాయి.

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో APPU బాధ్యతలను భారతదేశం స్వీకరించనుంది

→జనవరి 2023 నుండి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ (APPU) బాధ్యతలను భారతదేశం తీసుకుంటుంది.
→డాక్టర్ వినయ ప్రకాష్ సింగ్ నాలుగేళ్ల పాటు యూనియన్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
→APPU అనేది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 32-సభ్య దేశాలకు చెందిన అంతర్-ప్రభుత్వ సంస్థ.
→APPU లక్ష్యం: సభ్య దేశాల మధ్య తపాలా సంబంధాలను విస్తరించడం, సులభతరం చేయడం మరియు మెరుగుపరచడం మరియు పోస్టల్ సేవల రంగంలో సహకారాన్ని ప్రోత్సహించడం.

సియాచిన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారిగా కెప్టెన్ శివ చౌహాన్

→కెప్టెన్ శివ చౌహాన్ (ఇండియన్ ఆర్మీ యొక్క ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి-సియాచిన్ వద్ద కుమార్ పోస్ట్ (ఎత్తు: 15,632 అడుగులు)లో ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె రాజస్థాన్‌కు చెందినవారు.
→జూలై 2022లో సియాచిన్ వార్ మెమోరియల్ నుండి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508-కిమీల పొడవైన `సుర సోయి’ సియాచిన్ సాపర్స్ సైక్లింగ్ యాత్రకు ఆమె నాయకత్వం వహించారు.
→కష్టతరమైన ఆరోహణ తర్వాత ఆమె జనవరి 2న సియాచిన్ గ్లేసియర్‌లోకి ప్రవేశించింది.

రాజమండ్రిలో పింఛన్‌ వారోత్సవాలు

→ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 3న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పింఛన్‌ వారోత్సవాలలో పాల్గొన్నారు.
→ఈ సంధర్భంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో మాట్లాడి అనంతరం సభా వేదికపై మాట్లాడారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:-
→ పెన్షన్‌ను నెలకు రూ. 2,750కి పెంపు
→ ఎపిలో కనిష్ట పెన్షన్ రూ. 2,750 కాగా గరిష్ట పెన్సన్ రూ. 10 వేలు * గత ప్రభుత్వంలో కేవంల 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌, ఇప్పుడు 64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్‌
→అత్యధిక స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
→ గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ. 400 కోట్లు కాగా ఇప్పుడు నెలకు పెన్షన్లకే రూ. 1,765 కోట్లు
→ మూడున్నరేళ్లలో పెన్షన్ల కోసం రూ. 62, 500 కోట్లు ఖర్చు.

డిసెంబర్ 31, 2022 నుండి ఏపీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు

→సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ఆంధప్రదేశ్'లో విధించిన నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక నుంచి 120 మైక్రాన్లు లేదా అంతకంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఈ నిబంధన డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రాగా, ఇక నుంచి ఎవరైనా వీటిని తయారు చేసినా, అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ పరిమితి 75 మైక్రాన్ల వరకు ఉండేది. ఇకపై వాడే ప్లాస్టిక్ వస్తువులు పునర్వినియోగానికి అవకాశమున్న సంచులను మాత్రమే వాడేలా పర్యవేక్షించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
→అలాగే ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం కూడా ఈ నెల 26 వ తేదీ నుంచి అమలవుతుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేశారు. తనఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిస్తే అక్కడికక్కడే కేసుల నమోదుకు ఆస్కారం ఉంది.

యూరోను స్వీకరించిన క్రొయేషియా

→క్రొయేషియా 1 జనవరి 2023 నుండి యూరోను తన కరెన్సీగా స్వీకరించింది మరియు యూరోజోన్‌లో 20వ సభ్యదేశంగా మారింది.
→క్రొయేషియా 2013లో EUలో ప్రవేశించింది.
→ఇది స్కెంజెన్ ప్రాంతంలో చేరిన 27వ దేశంగా అవతరించింది.
→స్కెంజెన్ ప్రాంతం: ఇది 27 యూరోపియన్ దేశాలను కలిగి ఉన్న ప్రాంతం, ఇది అన్ని పాస్‌పోర్ట్‌లు మరియు సరిహద్దు నియంత్రణను వారి పరస్పర సరిహద్దుల వద్ద రద్దు చేసింది.
→యూరోజోన్: దీనిని అధికారికంగా యూరో ప్రాంతం అంటారు.
→యూరోజోన్ యొక్క ద్రవ్య అధికారం యూరోసిస్టమ్.

బీహార్ రాష్ట్ర ఐకాన్‌గా మైథిలీ ఠాకూర్‌ను నియమించిన ఎన్నికల సంఘం

→బీహార్ రాష్ట్ర ఐకాన్‌గా జానపద గాయని మైథిలీ ఠాకూర్‌ను ఎన్నికల సంఘం నియమించింది.
→ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తారు.
→ఆమె బీహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించింది.
→ఆమె భారతీయ శాస్త్రీయ మరియు జానపద సంగీతంలో శిక్షణ పొందింది.
→2021కి బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గానూ ఆమె ఇటీవలే సంగీత నాటక అకాడమీ యొక్క ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపికైంది.

లింగమార్పిడి వర్గాన్ని ఏర్పాటు చేయనున్న వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్

→ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మారిసియో సులైమాన్ 2023 నుండి ట్రాన్స్‌జెండర్ కేటగిరీని ప్రవేశపెడతామని ప్రకటించారు.
→'పుట్టినప్పుడు నియమం' ఉపయోగించబడుతుంది, అంటే పుట్టుకతో మగవాడిగా నమోదు చేసుకున్న లింగమార్పిడి బాక్సర్, పుట్టుకతో మగవాడిగా నమోదు చేసుకున్న ఇతరులతో పోరాడటానికి అనుమతించబడతాడు.
→అయితే, పుట్టినప్పుడు స్త్రీగా నమోదు చేయబడిన వారు పుట్టినప్పుడు స్త్రీగా నమోదు చేసుకున్న ఇతరులతో పోరాడటానికి అనుమతించబడతారు.
→ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం: మెక్సికో

కర్నాటక పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వర స్వామీజీ కన్నుమూశారు

→ కర్ణాటకలోని ప్రముఖ లింగాయత్ పీఠాధిపతులలో ఒకరైన సిద్దేశ్వర స్వామిజీ 82 ఏళ్ల వయసులో జ్ఞానయోగాశ్రమంలో కన్నుమూశారు.
→అతను కర్ణాటకలోని విజయపురలోని బిజ్జరగిలో పుట్టి పెరిగాడు.
→అతను తరచుగా 'ఉత్తర కర్ణాటక యొక్క నడిచే దేవుడు' అని పిలుస్తారు.
→ఆయన గురువైన వేదాంత కేసరి శ్రీ మల్లికార్జున మహాశివయోగిచే గణిత శాస్త్రోక్తంగా నియమితులయ్యారు.
→2018లో పద్మశ్రీ అవార్డును స్వీకరించేందుకు నిరాకరించారు.

మమతా బెనర్జీ 'దీదీర్ సురక్ష కవచ్' అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు

→పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2023 పంచాయతీ ఎన్నికలకు ముందు 'దిదీర్ సురక్ష కవాచ్' మరియు 'దిదీర్ దూత్' అనే రెండు కార్యక్రమాలను ప్రారంభించారు.
→ఆహారం, గృహం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, ఆదాయం మరియు ఉపాధి వంటి వివిధ రంగాలను కవర్ చేసే 15 రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.
→ప్రజలు తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ‘దీదీర్ దూత్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా రూపొందించారు.
→ఈ కార్యక్రమం జనవరి 11, 2023న ప్రారంభించబడుతుంది.

స్టీల్ ఆర్చ్ సియోమ్ వంతెనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు

→అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో 100 మీటర్ల సియోమ్ వంతెనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
→ఈ వంతెన భారత్-చైనా సరిహద్దుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని తెరుస్తుంది.
→సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు రూ.724 కోట్లతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పూర్తి చేసిన 28 ప్రాజెక్టులలో సియోమ్ వంతెన ఒకటి.
→అతను లడఖ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు J&Kలో దాదాపు 27 ప్రాజెక్టులను ప్రారంభించాడు.

మణిపూర్'లో ప్రారంభమైన 'ఇమోయిను ఎరట్పా' పండుగ

→ మణిపూర్‌లోని మెయిటీ కమ్యూనిటీ ప్రతి సంవత్సరం ఇమోయిను ఎరట్పా పండుగను జరుపుకుంటుంది.
→వారు ఇమోయిన్ దేవతను సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా భావిస్తారు.
→ఆమె దేవత లీమారెల్ సిదాబి యొక్క అవతారాలలో ఒకటిగా కూడా సంబంధం కలిగి ఉంది.
→ఈ పండుగ మెయిటీ క్యాలెండర్‌లోని వాక్చింగ్ నెలలోని పన్నెండవ చంద్ర రోజున వస్తుంది (గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ లేదా జనవరిలో వస్తుంది).
→ఈ సంవత్సరం పండుగ జనవరి 3, 2023 న వస్తుంది.

27 మంది విదేశీ భారతీయులనకు 2023 ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు

→విదేశీ భారతీయులకు అత్యున్నత గౌరవం, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు (PBSA) 2023 కోసం 27 మందిని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.
→జనవరి 8-10, 2023 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరగనున్న ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 17వ ఎడిషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
→గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
→PBW 2023 థీమ్: Diaspora: Reliable Partners for India's Progress in Amrit Kaal

ఆయుర్వేద నిపుణుల కోసం ‘స్మార్ట్’ కార్యక్రమం ప్రారంభించబడింది

→నేషనల్ కమీషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM) మరియు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) ‘స్మార్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
→'స్మార్ట్' అనేది టీచింగ్ ప్రొఫెషనల్స్‌లో మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద పరిశోధన కోసం స్కోప్‌ను సూచిస్తుంది.
→లక్ష్యం: ఆయుర్వేద కళాశాలలు మరియు ఆసుపత్రుల ద్వారా ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ పరిశోధన రంగాలలో శాస్త్రీయ పరిశోధనలను పెంచడం.
→ఈ కార్యక్రమాన్ని వైద్య జయంత్ దేవపూజారి (ఛైర్మన్, NCISM) మరియు ప్రొఫెసర్ రబీనారాయణ ఆచార్య (DG, CCRAS) ప్రారంభించారు.

లడఖ్ సంస్కృతి, భాష & ఉపాధిని పరిరక్షించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది

→భారత ప్రభుత్వం హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అధ్యక్షతన 17 మంది సభ్యుల, హై పవర్డ్ కమిటీ (HPC)ని ఏర్పాటు చేసింది.
→కారణం: లడఖ్ యొక్క ప్రత్యేక సంస్కృతి, భాష మరియు ఉపాధిని రక్షించే చర్యలను చర్చించడం.
→కమిటీలో లడఖ్ LG, RK మాథుర్; ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్; లేహ్ మరియు కార్గిల్ హిల్ కౌన్సిల్స్ చైర్మన్‌లు, అపెక్స్ బాడీ లెహ్, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రతినిధులు మరియు హోం మంత్రిత్వ శాఖ నామినీ అధికారులు.

కౌస్తవ్ ఛటర్జీ భారతదేశం యొక్క 78వ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు

→ న్యూ ఢిల్లీలో జరిగిన MPL 59వ జాతీయ సీనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కౌస్తవ్ ఛటర్జీ (19) భారతదేశానికి 78వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.
→అతను పశ్చిమ బెంగాల్‌కు పదో గ్రాండ్‌మాస్టర్ కూడా.
→అతను అక్టోబర్ 2021లో బంగ్లాదేశ్‌లోని షేక్ రస్సెల్ GM 2021లో తన తొలి GM-నార్మ్‌ని గెలుచుకున్నాడు.
→నవంబర్ 2022లో జరిగిన ఆసియా కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లో అతను తన రెండవ GM-నార్మ్‌ని సాధించాడు.
→ఆగస్ట్ FIDE రేటింగ్ లిస్ట్‌లో కూడా అతను 2500 దాటాడు.
→భారతదేశం యొక్క 77వ గ్రాండ్ మాస్టర్: ఆదిత్య మిట్టల్
→భారతదేశానికి చెందిన 76వ GM: ప్రణవ్ ఆనంద్

బ్యాంక్ ఆఫ్ సింగపూర్ కొత్త CEO గా జాసన్ మూను

→ జేసన్ మూ (సింగపూర్) మార్చి 6, 2023 నుండి బ్యాంక్ ఆఫ్ సింగపూర్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారు.
→డిసెంబరు 31, 2023న మాజీ CEO బహ్రెన్ షరీ పదవీ విరమణ తర్వాత జనవరి 1, 2023న తాత్కాలిక CEO పాత్రను స్వీకరించిన విన్సెంట్ చూ స్థానంలో ఆయన నియమితులవుతారు.
→ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ మరియు క్యాపిటల్ మార్కెట్‌లలో అతనికి 25 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.
→అతను గోల్డ్‌మన్ సాక్స్ మరియు జూలియస్ బేర్‌లో కూడా పనిచేశాడు.

2023-2025 కాలానికి ఉత్కర్ష్ 2.0ని ప్రారంభించిన RBI

→RBI గవర్నర్, శక్తికాంత దాస్ ఉత్కర్ష్ 2.0ని ప్రారంభించారు, ఇది నియంత్రణ మరియు పర్యవేక్షక యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి RBI యొక్క మధ్యకాలిక వ్యూహం యొక్క రెండవ దశ.
→2023-25 కాలంలో RBIకి మార్గనిర్దేశం చేసే ఉత్కర్ష్ 2.0లోని విజన్:
→దాని విధుల పనితీరులో శ్రేష్ఠత
→ఆర్‌బిఐపై పౌరులు మరియు సంస్థలలో విశ్వాసం బలపరచడం
→జాతీయ మరియు ప్రపంచ పాత్రలలో మెరుగైన ఔచిత్యం మరియు ప్రాముఖ్యత
→పారదర్శక, జవాబుదారీ మరియు నైతికతతో నడిచే అంతర్గత పాలన

ఇస్రో, ఆంధ్రా యూనివర్శిటీ సముద్రంలో రిప్ కరెంట్‌లను అంచనా వేయడానికి పరికరాలను ఏర్పాటు చేశాయి

→ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ (NCES), మరియు ఆంధ్రా యూనివర్సిటీ (AU) పరిశోధన చేసి రుషికొండ బీచ్ మరియు RK బీచ్ వద్ద స్థిరమైన రిప్ కరెంట్ జోన్‌లు బీచ్ సందర్శకులకు ప్రమాదంగా మారాయని నిర్ధారించాయి.
→వారు మెరైన్‌లను మరియు స్థానిక పోలీసులను హెచ్చరించడానికి రిప్ కరెంట్‌లను గుర్తించడానికి పరికరాలను ఏర్పాటు చేశారు.
→ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బీచ్‌లలో రిప్ కరెంట్‌లు సర్వసాధారణం.
→రిప్ కరెంట్ జోన్లలో మోకాళ్ల లోతు వరకు నీటిలోకి ప్రజలు ప్రవేశించవచ్చు.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రజ్జ్వల ఛాలెంజ్‌ని ప్రారంభించింది

→దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రజ్జ్వల ఛాలెంజ్‌ను ప్రారంభించింది.
→లక్ష్యం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చగల ఆలోచనలు, పరిష్కారాలు మరియు చర్యలను ఆహ్వానించడం
→విస్తృత ఆకృతులు క్రింది వర్గాలలోకి వస్తాయి: మహిళలు మరియు సమాజంలోని అట్టడుగు వర్గాలపై దృష్టి పెట్టడం ; స్థానికీకరించిన నమూనాలు; స్థిరత్వం; ఖర్చుతో కూడుకున్న పరిష్కారాలు; బహుళ రంగాల ఆలోచనలు మరియు పరిష్కారాలు
→టాప్ 5 ఆలోచనలకు రివార్డ్‌గా రూ. ఒక్కొక్కరికి 2 లక్షలు

టాటా గ్రూప్‌ సీనియర్‌ అధికారి ఆర్‌ కృష్ణకుమార్‌ కన్నుమూశారు

→టాటా గ్రూప్‌ ప్రముఖుడు ఆర్‌ కృష్ణకుమార్‌ (84) కన్నుమూశారు.
→అతను 1963లో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో పనిచేయడం ప్రారంభించాడు మరియు 1965లో టాటా గ్లోబల్ బెవరేజెస్ (గతంలో టాటా ఫిన్‌లే)లో చేరాడు.
→అతను టాటా గ్లోబల్ బెవరేజెస్ టాటా టీగా రూపాంతరం చెందడం ద్వారా కూడా పనిచేశాడు మరియు 1982లో సౌత్ ఇండియా ప్లాంటేషన్స్‌కి VP అయ్యాడు.
→దేశ వాణిజ్యం మరియు వ్యాపారానికి చేసిన కృషికి గాను 2009లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.

గుజరాత్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి మంజుల సుబ్రమణ్యం కన్నుమూశారు

→గుజరాత్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంజుల సుబ్రమణ్యం 74 ఏళ్ల వయసులో వడోదరలోని ఓ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
→2007లో గుజరాత్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
→అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
→పదవీ విరమణ తర్వాత ఆమె గుజరాత్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
→ఆమె సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కూడా భాగమైంది.

డిసెంబర్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు 15 శాతం పెరిగాయి

→ డిసెంబర్ 2022లో భారత ప్రభుత్వం రూ. 1,49,507 కోట్ల స్థూల GST ఆదాయాన్ని సేకరించింది.
→ఇందులో సీజీఎస్టీ రూ.26,711 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.33,357 కోట్లు, ఐజీఎస్టీ రూ.78,434 కోట్లు, సెస్సు రూ.11,005 కోట్లు.
→డిసెంబర్ 2022కి వచ్చే ఆదాయాలు డిసెంబర్ 2021లోని GST రాబడి కంటే 15% ఎక్కువ.
→డిసెంబర్ 2022 నెలలో సాధారణ సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం CGSTకి రూ. 63,380 కోట్లు మరియు SGSTకి రూ. 64,451 కోట్లు.


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కొత్త ఎండీ మరియు సీఈఓగా అజయ్ కుమార్ శ్రీవాస్తవ

→ అజయ్ కుమార్ శ్రీవాస్తవ జనవరి 1, 2023 నుండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) MD మరియు CEO గా నియమితులయ్యారు.
→ప్రస్తుతం, అతను IOB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
→1991లో అలహాబాద్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు.
→అలహాబాద్ బ్యాంక్‌లో సుమారు 27 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అతను అక్టోబర్ 2017లో IOB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు.
→బోర్డ్ ఆఫ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు

బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రమాణ స్వీకారం చేశారు

→ బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (77) ప్రమాణ స్వీకారం చేశారు.
→అతను అక్టోబర్ 2022లో జైర్ బోల్సోనారోను ఓడించి మూడవ సారి అధ్యక్ష పదవిని గెలుచుకున్నాడు.
→ఎన్నికల్లో, అతను 50.83% ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి బోల్సోనారోకు 49.17% ఓట్లు వచ్చాయి.
→అతను 2003 నుండి 2006 వరకు మరియు తరువాత 2007 నుండి 2011 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
→అతను మూడవసారి పదవికి ఎన్నికైన మొదటి బ్రెజిల్ అధ్యక్షుడు.

నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజరీ గ్రూప్‌లో రాజీవ్ బద్యాల్

→USA వైస్ ప్రెసిడెంట్, కమలా హారిస్ భారతీయ అమెరికన్ రాజీవ్ బద్యల్‌ను కీలక జాతీయ అంతరిక్ష సలహా బృందానికి నియమించారు.
→అతను బలమైన మరియు బాధ్యతాయుతమైన US స్పేస్ ఎంటర్‌ప్రైజ్‌ను నిర్వహించడానికి మరియు ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు స్థలాన్ని సంరక్షించడానికి బాధ్యత వహిస్తాడు.
→ప్రస్తుతం, అతను అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు.
→ఈ పాత్రకు ముందు, అతను స్పేస్‌ఎక్స్‌లో ఉపగ్రహాల ఉపాధ్యక్షుడు.

REC లిమిటెడ్ అస్సాంలో 'బిజిలీ ఉత్సవ్' నిర్వహించింది

→ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న కంపెనీ అయిన REC లిమిటెడ్, అస్సాంలోని బక్సా జిల్లా ఆనందపూర్ గావ్ మరియు పరిసర గ్రామాలలో ‘బిజిలీ ఉత్సవ్’ను నిర్వహించింది.
→ఈ కార్యక్రమం విద్యుత్ వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలు మరియు మారుమూల ప్రాంతాల్లో విద్యుద్దీకరణ సమయంలో ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేసింది.
→వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
→పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎల్ ఈడీ బల్బులు, జామెట్రీ బాక్సులను బహుమతులుగా పంపిణీ చేయడంతో ముగింపు పలికారు.

ప్రిట్జ్కర్ విజేత ఆర్కిటెక్ట్, అరటా ఇసోజాకే మరణించారు

→ ప్రిట్జ్కర్-విజేత జపనీస్ ఆర్కిటెక్ట్, అరటా ఇసోజాకి 91 సంవత్సరాల వయస్సులో మరణించారు.
→అతను తన డిజైన్లలో తూర్పు మరియు పశ్చిమ సంస్కృతి మరియు చరిత్రను మిళితం చేసిన పోస్ట్-మాడర్న్ దిగ్గజం అని కూడా పిలుస్తారు.
→అతనికి 1986లో RIBA గోల్డ్ మెడల్ మరియు 2019లో ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ లభించాయి.
→అతను 1987లో ప్రిట్జ్‌కర్ బహుమతిని గెలుచుకున్న జపనీస్ లెజెండ్ కెంజో టాంగెమ్ శిష్యరికంలో తన నిర్మాణ వృత్తిని ప్రారంభించాడు.

హాకీ మధ్యప్రదేశ్ పురుషుల U-18 జట్టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 విజేతగా నిలిచింది.

→ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఫైనల్‌లో ఒడిశాను 6-5 తేడాతో ఓడించి మధ్యప్రదేశ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 పురుషుల అండర్-18 క్వాలిఫయర్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
→మధ్యప్రదేశ్ తరఫున అలీ అహ్మద్, మహ్మద్ జైద్ ఖాన్, కెప్టెన్ అంకిత్ పాల్ ఒక్కో గోల్ చేశారు.
→కాగా, జార్ఖండ్‌పై విజయంతో హర్యానా పోటీలో మూడో స్థానంలో నిలిచింది.
→దీంతో మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, జార్ఖండ్‌లు 2023లో మధ్యప్రదేశ్ 'లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు అర్హత సాధించాయి.

భారతదేశ నిరుద్యోగిత రేటు డిసెంబర్ 2022లో 8.30%కి పెరిగింది

→సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన డేటా ప్రకారం, డిసెంబర్ 2022లో భారతదేశ నిరుద్యోగిత రేటు నవంబర్ 2022లో 8% నుండి 16 నెలల గరిష్ట స్థాయికి 8.30%కి పెరిగింది.
→పట్టణ నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో 8.96% నుంచి 10.09%కి పెరిగింది.
→గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.55% నుంచి 7.44%కి పడిపోయింది.
→డిసెంబరులో హర్యానాలో నిరుద్యోగిత రేటు 37.4%కి పెరిగింది, రాజస్థాన్ (28.5), ఢిల్లీ (20.8%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఒక సంవత్సరం పాటు వాస్సేనార్ అరేంజ్‌మెంట్ అధ్యక్షత భాద్యతలు చేపట్టిన భారతదేశం

→ఒక సంవత్సరం పాటు వాస్సేనార్ అరేంజ్‌మెంట్ ప్లీనరీకి 2023 జనవరి 1న భారతదేశం అధ్యక్ష భధ్యతలు చేపట్టింది .
→వాస్సేనార్ అరేంజ్‌మెంట్ యొక్క 26వ వార్షిక ప్లీనరీలో, ఇయాన్ ఓ లియరీ (ఐర్లాండ్ రాయబారి) జైదీప్ మజుందార్ (భారత రాయబారి)కి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
→జైదీప్ మజుందార్ వియన్నాలోని UN మరియు అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధి.
→భారతదేశం డిసెంబర్ 2017లో 42వ భాగస్వామ్య రాష్ట్రంగా వాస్సేనార్ అరేంజ్‌మెంట్'లో చేరింది.

భారతీయ పరిశోధన విద్యార్థికి ఫెలోషిప్

→ ప్రత్యేక పొరలతో వడబోసే సాంకేతి కత (మెంబ్రేన్ టెక్నాలజీ)ను ఉపయోగించి అధునాతన నీటి శుద్ధీకరణపై పరిశోధన చేసిన భారతీయ మూలా లున్న విద్యార్థి హర్ష్ పటేల్ ను రూ.9.55 లక్షల (11,750 డాలర్లు) ఫెలోషిప్ వరించింది.
→ నలుగురు విద్యార్థులను ఈ ఫెలోషిప్ కు ఎంపికచేయగా.. వారిలో హర్ష్ పటేల్ ఒకరు.
→ అమెరికన్ మెంబ్రేన్ టెక్నాలజీ అసోసియేషన్ (ఏఎంటీఏ), ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అధునా తన శుద్ధీకరణ రంగంలో కృషి చేస్తున్న మరో సంస్థ ఏటా ఈ ఫెలోషిప్లను అందిస్తున్నాయి.
→ హర్ష్ పటేల్ మిషిగన్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ పీహెచ్ విద్యార్ధిగా, గ్రాడ్యు యేట్ రీసెర్చ్ అసిస్టెంట్ గా ఉన్నారు.
→ ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలు నీటికొరత వంటి ప్రపంచ సమస్యలను ఎదుర్కొనేం దుకు ఉపయోగపడతాయని హర్ష్ పటేల్ ఈ సందర్భంగా తెలిపారు.

భారత్, నేపాల్ మధ్య శ్రీరాం జానకి యాత్ర

ఫిబ్రవరి 17 నుంచి ఆధ్యాత్మిక పర్యాటక రైలు
సీతారాముల జన్మస్థానాలుగా భావి స్తున్న నేపాల్లోని జనకప్పుర్, భారత్లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రక టించింది.
→కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 'దేఖో అప్నా దేశ్ పిలుపునకు అనుగుణంగా ఈ భారత్ గౌరవ్ పర్యాటక రైలును ఫిబ్రవరి 17న ప్రారం భిస్తారు.
→'ఏడు రోజుల ప్యాకేజీలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మొదట ఆయోధ్యలో ఆగుతుంది.
→అక్కడ రామ జన్మ భూమి, హనుమంతుడి ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రాంలోని భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు.
→అనంతరం బిహార్ లోని సీతా మడీకి చేరుకొంటుంది. అక్కడి నుంచి 70 కి. మీ.ల దూరాన నేపాల్లో ఉన్న జనకప్పుర్ కు యాత్రికులను బస్సుల్లో తరలిస్తారు.
→సీతమ్మ జన్మస్థానంగా భావించే ఇక్కడ రెండు రాత్రు లున్న తర్వాత తిరుగు ప్రయాణంలో వారణాసి లోనూ రెండు రోజుల బస ఉంటుంది.
→ ప్రయా గా రాజ్లో ఒకపూట గడిపాక దిల్లీకి తిరిగివ స్తారు.
→ ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 39,775, ఇందులో ఏసీ రైలు ప్రయాణం, ఏసీ గదుల్లో బస, శాకాహార భోజనం, బస్సులు, గైడ్ ల ఖర్చులు, బీమా సదుపాయం కలిసి ఉంటాయి' అని రైల్వేశాఖ వివరించింది.

Driving లైసెన్సులు, ఆర్సీలకు 95 ప్లాస్టిక్ కార్డులు

చిప్ లేకుండా క్యూఆర్ కోడ్ జారీకి నిర్ణయం
→ డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై నవారికి జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు (డీఎల్), వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్చ్)లను ఇకపై ప్లాస్టిక్ కార్డులతో ఇవ్వనున్నారు. ఇప్పటివరకు స్మార్ట్ కార్డులు ఇస్తుం డగా, ఇకపై క్యూఆర్ కోడ్తో కూడిన పీవీసీ ప్లాస్టిక్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రవాణాశాఖ కార్యాలయాల్లో కలిపి నెలకు 3 లక్షల డీఎల్లు, ఆర్సీలు జారీ అవుతుం చాలా కాలంగా రాష్ట్రంలో చిప్తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నారు.
→అయితే ఆ చిప్లో వివరాలను రీడ్ చేసే యంత్రాలు రవాణాశాఖ అధికారులు, పోలీసుల వద్ద లేవు. ఈ స్మార్దకార్డుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.
→మరోవైపు గుత్తేదారులకు రూ. కోట్లలో బకాయిలు చెల్లించకపోవ డంతో మూడేళ్లుగా రాష్ట్రంలో స్మార్ట్ కార్డుల సరఫరా నిలిచింది.
→అప్పుడప్పుడు కొంత మొత్తం విడుదల చేయడంతో మధ్యలో కొన్ని కార్డుల చొప్పున గుత్తేదారు సరఫరా చేశారు.
→చివరకు ఏడాదిన్నరగా కార్డుల సరఫరా నిలిచింది. దీంతో అన్ని జిల్లాల్లో వేలాది కార్డులు పెండింగ్లో ఉన్నాయి.
→గతేడాది రవాణాశాఖ కమిషనర్ కొద్ది నెలలు పనిచేసిన కాటమనేని భాస్కర్.. ప్లాస్టిక్ కార్డుల జారీ వై దృష్టి పెట్టారు.
→విజయవాడ, విశాఖపట్నంలలో ప్రయోగాత్మకంగా వీటిని సరఫరా చేశారు.
→తాజాగా గత వారం అన్ని జిల్లాల రవాణా అధికారులతో ఆ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సమీక్షించి చివరకు ప్లాస్టిక్ కార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
→కార్డులపై క్యూఆర్ కోడ్ తెలంగాణలో నెలల కిందటి నుంచి చిప్ లేని ప్లాస్టిక్ కార్డులు ఇస్తున్నారు.
→మన వద్ద కూడా అలాంటివే ఇవ్వాలని, అందులో నకిలీవి తయారు కాకుండా వాటిపై క్యూఆర్ కోడ్ ముద్రించాలని నిర్ణయించారు.
→ఇలాంటి కార్డుల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రతిపా దనను త్వరలో ఆర్థిక శాఖకు పంపనున్నట్లు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి.

యుకి-సాకేత్ జోడీకి బ్యాంకాక్ టైటిల్

→ యుకి బాంబ్రీ, సాకేత్ మైనేని జంట బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ను గెలుచుకుంది.
→ ఫైనల్లో ఈ టాప్ సీడ్ జోడీ 2-6, 7-8 (7) 14-12తో రుంగ్ కాత్ (ఇండోనేషియా), అకిర సాంటిలన్ (ఆస్ట్రే లియా) ద్వయంపై విజయం సాధించింది.
→ యుక్తి, సాకేత్ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో వైల్డ్ కార్డ్ లభించింది.

ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఏడీ దామోదరన్ మృతి

→శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఎస్ఐఆర్) మాజీ సంచాలకులు, ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఏడీ దామోదరన్ (87) కన్నుమూశారు.
→కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్కు దామోదరన్ స్వయానా అల్లుడు. ఈయనకు భార్య మాలతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
→దామోదరన్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రచ నలు నంబూద్రిపాద్ ఆశయాలను ప్రతిబింబిచేవని తెలిపారు.

మలయాళ కవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం కన్హయ్యాలాల్ సేరియా కవిత్వ అవార్డు

→ఆధునిక మళయాళ కవి, విమర్శకుడు, అనువా దకుడు కె. సచ్చిదానందను 'ఎనిమిదవ మహాకవి కన్హయ్యాలాల్ సేరియా కవిత్వ అవార్డు' వరించింది.
→త్వరలో జరగనున్న 16వ జైపుర్ సాహిత్య ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
→రాజస్థానీ- హిందీ కవి అయిన కన్హయ్యాలాల్ పేరిట నెలకొల్పిన ఫౌండేషన్.. ఆయనకు లక్ష రూపాయల నగదు బహు మతితో పాటు ఒక మెమెంటోను బహూకరిస్తుంది.
→సచ్చిదానందన్ మొత్తం 21 కవిత్వ సంకలనాలు, 16 ప్రపంచ కవిత్వ అనువాదాలు, ఆంగ్ల, మలయాళ భాషల్లో 21 సాహిత్య విమర్శక గ్రంథాలను వెలువరించారు.
→ఆయన కేరళ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకా డమీ అవార్డులు అందుకున్నారు. ఆయన కవిత్వ సంకల నాలు 18 భాషల్లో, వివిధ దేశాల్లో ప్రచురితమయ్యాయి.

ఆరోగ్యమైత్రి ప్రారంభం

→అత్యవసర వైద్య సామగ్రి సరఫరా
→ భారత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
→ 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు.
→ ఈ సంద ర్భంగా కరోనా సమయంలో మేడిన్ ఇండియా టీకా లతో ప్రపంచ దేశాలకు భారత్ అండగా నిలిచిన విష యాన్ని గుర్తు చేశారు.
→ త్వరలో ఆరోగ్యమైత్రి ప్రాజె క్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
→ ఇందులో భాగంగా ఇతర దేశాల్లో ఎలాంటి విపత్తులు సంభవించినా తాము అత్యవసర వైద్య సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు.
→ అంతరిక్ష, శాస్త్ర రంగాల్లో భారత్ నైపుణ్యాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని పేర్కొన్నారు.

అమెరికాలో సెనేటర్ భారతీయ అమెరికన్

→డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి కాన్సస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్గా బాధ్యతలు చేపట్టారు.
→సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్ హాక్ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు
→ సెనేట్ కు ప్రాతినిధ్యం వహిం చడం చాలా ఉత్తేజంగానూ, సంతోషంగానూ ఉందని ఉషా రెడ్డి ట్వీట్ చేశారు.
→ ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అంశంపై మాస్టర్స్ చేసిన ఉష గతంలో రెండు సార్లు మేయర్ గా పనిచేశారు.

కేరళలో టీచర్లను 'సార్.. మేడమ్' అనొద్దు

→పాఠశాలలో 'సార్.. మేడం' అనే పదాలు ఉప యోగించవ ద్దని, వాటికి బదులుగా ఉపాధ్యాయులను 'టీచర్ అని మాత్రమే పిల వాలని కేరళ బాలల హక్కుల కమిషన్ ఉత్త ర్వులు జారీ చేసింది.
→ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సాధారణ విద్యాశాఖను ఆదేశించింది.
→టీచర్ అనే పదం పురుషులకు, మహిళలకు ఇద్దరికీ వర్తిస్తుంది.
→విద్యార్థి దశలోనే పిల్లలకు స్త్రీ, పురు షులిద్దరూ సమానమే (లింగ సమానత్వం) అని చెప్పేందుకే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు బాలల హక్కుల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది.
→కేరళ రాష్ట్ర కమిషన్ ప్యానల్ చైర్ప ర్సన్ కె. వి. మనోజ్, విజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం.. గత బుధవారం ఈ మేరకు మార్గ నిర్దేశం చేసింది.
→సార్/మేడం పదాలకు స్వస్తి చెప్పాలంటూ ఓ వ్యక్తి పిటిషను దాఖలు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకు న్నట్లు తెలుస్తోంది.
→ఈ ఉత్తర్వుల అమలు తీరుపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల కమిషన్ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొవిడ్ కట్టడికి వినూత్న స్ప్రే!

→ కొవిడ్-19 కారక సాక్స్-కోవ్-2 వైరస్ ను ముక్కు లోనే అడ్డుకొనే సూక్ష్మ పోగులను అమెరికాలోని జాన్స్ హాష్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు.
→ వీటితో రూపొందించే ఒక స్ప్రేతో ఈ మహమ్మారికి సమర్ధంగా అడ్డుకట్ట వేయవచ్చని వారు తెలిపారు. శ్వాస ద్వారా కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
→ జాన్స్ హాష్కిన్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు.. సూప్రామాలిక్యూలర్ ఫిలమెంట్స్ అనే పలుచటి పోగులను రూపొందించారు. ఇవి స్పాంజ్లో పని చేస్తూ.. వైరస్ ను శోషించుకుంటాయి.
→ తద్వారా మన శ్వాసమార్గాల్లోని కణాలతో బంధాన్ని ఏర్పరిచి, ఇన్ఫెక్షన్ కలిగించడానికి ముందే కరో నాను ఆపేస్తాయి.
→ఇలా ఒకటి రెండు గంటల పాటు వైరస్ ను నిలువరిం చినా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పోగుల్లో ఏసీఈ2 అనే ఎంజైమ్ ఉంటుంది.
→ఇది నాసిక మార్గం, ఊపి రితిత్తులు, చిన్న పేగు ఉపరితలాల్లోని కణాలపై ఉంటుంది. దీనికి అంటుకోవడం ద్వారానే కరోనా వైరస్.. మన కణాల్లోకి ప్రవేశి స్తుంది.
→శాస్త్రవేత్తలు రూపొందించిన సూక్ష్మ పోగులు.. నకిలీ ఎంజై మ్లో పనిచేస్తూ, కరోనా వైరస్ ను ఆకర్షించి, దారిమళ్లిస్తాయి.

'దగ్గు మందుతో 'పార్కిన్సన్స్' తగ్గు!

→ శ్వాసకోశ సమస్యల చికిత్స కోసం వాడే ఆంబ్రోక్సోల్ అనే మందు.. పార్కిన్ సన్స్ వ్యాధి పైనా పని చేస్తుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా తేల్చారు.
→నాడీ సంబంధమైన ఈ రుగ్మత లక్షణాలను ఇది నెమ్మ దింపచేయగలదని నిర్ధరించారు. ఆంబ్రోక్సోల్.. గొంతులో కఫాన్ని తగ్గిస్తుంది. దగ్గు నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది.
→యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలూ దీనికి ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) కు చెందిన క్వీన్ స్క్వేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజీ శాస్త్రవేత్తలు దీన్ని పార్కిన్సన్స్ వ్యాధి పై ప్రయోగించి చూశారు.
→వారు నిర్వహించిన రెండో దశ క్లినికల్ పరీక్షల్లో ఆశాజనక ఫలి తాలొచ్చాయి.
→పార్కిన్సన్స్ వ్యాధి బాధితులకు ఈ మందు సురక్షితమేనని తేల్చారు. ఈ ఔషధం మెదడులోకి సమర్థంగా చేరుతోందని, జీ కేస్ అనే ప్రొటీన్ స్థాయిని పెంచుతుందని గుర్తించారు.
→ఇది అల్ఫా సైన్యూక్లిన్ సహా అనేక వ్యర్థ ప్రొటీన్లను నిర్మూలించడంలో కణాలకు సాయం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
→పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్థుల్లో ఈ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నా యని, ఈ రుగ్మతకు ఇదే కారణమని భావిస్తున్నారు.
→ఈ ఔషధంపై మరింత విస్తృత స్థాయిలో మూడో దశ క్లినికల్ ప్రయోగా లను శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. ఇందులో పరీక్షార్థులకు ఆంబ్రోక్సో ల్ను రెండేళ్ల పాటు ఇచ్చి పరీక్షించనున్నారు.
→దీనివల్ల బాధితుల జీవన నాణ్యత, కదలికలు ఎంతమేర మెరుగుపడ్డాయన్నది పరిశీలిస్తారు.

'సేతు సముద్రం'లో కీలక ముందడుగు

→ సుదీర్ఘ కాలంగా విభిన్న చర్చలకు కేంద్రంగా ఉన్న నేతు సముద్రం ప్రాజెక్టుకు సంబం ధించి కీలక ముందడుగు పడింది.
→ దీని నిర్మాణానికి ఆమోదిస్తూ పార్టీలకు అతీతంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానించడంతో మరోసారి కదలిక వచ్చింది.
→ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం తమిళ నాడు సహా దేశాభివృద్ధికి అవరోధంగా మారుతోందని, దీనిని పూర్తిచేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తు న్నామంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానించింది.
→ భారత్, శ్రీలంక మధ్య రామసేతు ఉందని చెప్పడం కష్టమంటూ కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఈ తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏమిటీ సేతు సముద్రం?:-
→భారత తూర్పు, పశ్చిమ తీరాల మధ్య ప్రయాణిం చాలంటే ప్రస్తుతం శ్రీలంకను చుట్టి రావాల్సి వస్తోంది.
→భారత్-శ్రీలంకల మధ్య చిన్నపాటి మార్పులు చేస్తే అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా భారత్ జలా ల్లోంచే నౌకలు ప్రయాణించే వీలు ఉంటుంది.
→ఇందు కోసం పురాతన రామసేతు మార్గంలో కొంతభాగాన్ని తొలగించాల్సి ఉంటుంది.
→ఇది పూర్తిచేయాలని 1880 లోనే బ్రిటిష్ ప్రభుత్వం భావించినా.. రామసేతు హిందువుల విశ్వాసాలకు సంబంధించిన విషయమని, దానిని కూల్చడానికి వీల్లేదంటూ ఆందోళనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది.
→డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై. ఆ తర్వాత కరు ణానిధి సేతు సముద్రం సాకారానికి ప్రయత్నించారు. →ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ దీని విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాజపేయీ ప్రధా నిగా ఉండగా తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది.
→ఆనం తరం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూ.2,400 కోట్లతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా హిందూ సంఘాలవారు. పర్యావరణవే త్తలు అడుకున్నారు.
→దీంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయాల్సిందిగా 2007లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

కాగ్నిజెంట్ సీఈఓగా రవి కుమార్

→ కాగ్నిజెంట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా రవి కుమార్ నియమితులయ్యారు.
→ గతంలో ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ గా ఆయన వ్యవహరిం చారు.
→ ప్రస్తుత కాగ్నిజెంట్ సీఈఓగా ఉన్న బ్రయాన్ హంఫ్రీస్ మార్చి 15న కంపెనీని వీడాల్సి ఉంది.
→ ఇప్పుడే ఆయన బాధ్యతల నుంచి వైదొలగను న్నారు. కాగ్నిజెంట్ అమెరికాకు ప్రెసిడెంట్ రవికుమార్ను అంతక్రితం ప్రక టించింది.
→ ఇపుడు ఆ స్థానంలో సూర్య గుమ్మడి నియమితులు కానున్నారు.

అరుదైన వీరగల్లు శాసనం గుర్తింపు

→ బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో పదో శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు (యుద్ధంలో మరణించిన వారి స్మారకార్ధం వేసే శిల) శాసనం గురువారం వెలుగు చూసింది.
→ గ్రామంలోని మల్లికార్జునస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టగా.. అద్దంకి ప్రాంతానికి చెందిన చరిత్ర పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గుడి గోడపై దీన్ని గుర్తించారు.
→ మట్టితో నిండిన శాస నాన్ని శుభ్రం చేసి పరిశీలించారు. చాళుక్యుల లిపిగా తెలుస్తోందని, మాడయ్య అనే అతను మాధవస్వామి సన్నిధిలో తన తమ్ముడి పేరిట వేయించిన వీరగల్లుగా తెలిపారు.
→ త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ధర్మవరం పరిసరాల్లో ఇలాంటి శాసనం మొదటిసారిగా వెలుగు చూసినట్లు వివరించారు.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

→కేంద్ర మాజీ మంత్రి, జేడీ-యూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (75) కన్నుమూశారు.
→నివాసంలోనే కుప్పకూలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆయన్ని ఆసు పత్రికి తీసుకువచ్చారనీ, అప్పటికి నాడి కూడా కొట్టుకోవడం లేదని గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆసు పత్రి తెలిపింది.
→ఆయన ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలే దని ఒక ప్రకటనలో పేర్కొంది. యాదవ్కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
→వేర్వేరు ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా ఆయన సేవలందించారు.
→ఏడుసార్లు లోక్సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
→2008లో జేడీ- యూ ఆవిర్భవించాక తొలి జాతీయాధ్యక్షునిగా ఎన్నికైన ఆయన 2016 వరకు ఆ పదవిలో కొన సాగారు.
→పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
→పార్టీలో పదవుల నుంచి ఆయన్ని తొల గించారు. 2018లో లోక్ జనతాదళ్ పార్టీని సొంతంగా ఏర్పాటు చేసుకుని, 2020 మార్చిలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) లో దానిని విలీనం చేశారు.

బాస్మతీ బియ్యం గుర్తింపునకు ప్రమాణాల ఖరారు

→దేశంలో ప్రప్రథమంగా బాస్మతి బియ్యం గుర్తింపునకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సమగ్ర ప్రమా ణాలు ఖరారు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన జారీ చేసింది. కేంద్రం గుర్తించిన ఈ ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. దర్శక వాణిజ్య విధానాల అమలుకుతోడు కల్తీ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఈ చర్య లకు ఉపక్రమిస్తోంది. సహజ పరిమళాలు ఉండే ఈ బియ్యంలో కృత్రిమ రంగులు, పాలిషింగు, సువాసనలు ఉండరాదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ధాన్యం సగటు పరిమాణం, వండిన తర్వాత పొడవు నిష్పత్తి వంటివి కూడా పరిశీలిస్తారు. బియ్యంలో తేమ, చక్కెర (ఆమైలోజ్) పరి మాణం, యూరిక్ ఆమ్లం, ధాన్యం నాణ్యత పరి గణనలోకి తీసుకుంటారు. ఈ బియ్యంలో బ్రౌన్ బాస్మతీ, మరపట్టిన బియ్యం, పారాబాయిల్డ్ వంటి రకాలు ఉన్నాయి.

నివాసయోగ్యమైన నగరాల్లో విజయవాడకు 8వ ర్యాంకు

→విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే: నివాస యోగ్యమైన నగరాలు, పట్టణాల జాబితాలో విజయవా డకు చోటు దక్కింది.
→దేశవ్యాప్తంగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తాజాగా జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది.
→దీనిపై నగరపాలక సంస్థ అధికారులు సైతం నగరంలో చాలారోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేప ట్టారు.
→నిర్దేశిత అంశాల ఆధారంగా ఆన్లైన్ ద్వారా ఆడి గిన పలు ప్రశ్నలకు నగరవాసులు సానుకూలమైన సమాధానాలు ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల (5 నుంచి 10 లక్షల జనాభా) జాబి తాలో విజయవాడ 8వ ర్యాంకు దక్కించుకుంది.

సమయపాలనలో కోయంబత్తూర్ విమానాశ్రయం భేష్

→ ప్రపంచంలోనే అత్యుత్తమ సమయపాలన పాటిం చిన 20 విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో రూపొందించిన జాబితాలో కోయంబత్తూర్, ఇండిగో చోటు సాధించాయి.
→ 2022కు సంబంధించి విమానయాన రంగ విశ్లేషణా సంస్థ ఓఏజీ రూపొందించిన నివేదికలో, దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కు 15వ స్థానం, ప్రభుత్వ రంగంలోని కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ 13వ స్థానం దక్కించుకున్నాయి.
→ ఇండిగో ఆన్లైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 83.51 శాతంగా నమోదైంది. 2019లో 77.38 శాతంతో ఈ సంస్థ 54వ స్థానంలో ఉంది.
→గరుడ ఇండోనేషియా 95.63% ఓటీపీతో అగ్ర స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా సంస్థ సఫైర్ (95.30 శాతం), జర్మనీ సంస్థ యూరో వింగ్స్ (95. 26 శాతం) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
→ థాయ్ ఎయిరేషియా (92, 33 శాతం), దక్షిణ కొరియా సంస్థ జెజు ఎయిర్లైన్స్ (9184 శాతం) నాలుగు,అయిదు స్థానాలు దక్కించుకున్నాయి.
→జాబితాలోని థాయ్ స్మైల్ ఎయిర్వేస్ (16వ ర్యాంక్), డెల్టా ఎయిర్ లైన్స్ (17), వివా ఎయిర్ కొలంబియా (18), ఎతిహాద్ ఎయిర్వేస్ (19), ఎమిరేట్స్ (20) కంటే ఇండిగో (15) ముందు వరుసలో ఉంది.
మెగా ఎయిర్ లైన్స్ లో 5వ స్థానం:-
→2022లో అత్యధికంగా షెడ్యూల్డ్ విమానాలను నడి పిన 20 సంస్థలను మెగా ఎయిర్లైన్స్ గా నివేదిక గుర్తిం చింది.
→టాప్-20 మెగా ఎయిర్లైన్స్ ఓటీపీ పరంగా ఇండిగో 5వ స్థానంలో ఉంది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ (88.79 శాతం) అగ్రస్థానంలో ఉంది.
→జపాన్ ఎయిర్లైన్స్ (88.07 శాతం) లాటమ్ ఎయిర్లైన్స్ గ్రూప్ (85.03 శాతం), ఆజుల్ ఎయిర్లైన్స్ (84.87 శాతం) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
→తక్కువ టికెట్ ధరలతో సర్వీసులు నడిపే విమాన యాన సంస్థల్లో, సమయపాలన పరంగా ఇండిగోకు ఆరో స్థానం లభించింది.
→ అంతర్జాతీయంగా ఓటీపీ పరంగా ఉత్తమ 20 విమా నాశ్రయాల్లో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ (88,01 శాతం ఓటీపీ) కు 13వ ర్యాంకు లభించింది. జపాను చెందిన ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం 91.45 శాతం ఓటీపీతో అగ్రస్థానం దక్కించుకుంది.
→ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో అత్యంత సమయపాలన ప్రదర్శించిన విమానాశ్రయాల్లో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కు 10వ ర్యాంకు లభించింది.
→విమానాయాన సంస్థకు ర్యాంకు ఇలా: షెడ్యూల్ సమయానికి 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపో కలు సాగించడాన్ని ఓటీపీగా పరిగణిస్తారు.
→విమానాశ్రయాలకు: ఆయా విమానాలకు కేటాయిం చిన స్లాట్కు 15 నిముషాల కంటే తేడా లేకుండా రాకపో కలు సాగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

10 దేశాల ఎన్ఆర్ఐలూ యూపీఐ వినియోగించుకోవచ్చు

→ అమెరికా, కెనడా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ ఐ) కూడా తమ ఎన్ఆర్ఆ/ఎన్ఆర్ట్ ఖాతాల నుంచి యూపీఐ ప్లాట్ఫామ్ను వినియోగించుకుని నిధులు బదిలీ చేయొచ్చని నేష నల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ప్రకటించింది. → యూపీఐ సేవలకు తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లనూ వినియోగించుకునేందుకు అనుమ తించాలనే అభ్యర్ధనలు ప్రవాసుల నుంచి వచ్చాయని ఎన్పీసీఐ తెలిపింది. → ఇందుకనుగుణంగా ఏప్రిల్ 30 కల్లా చర్యలు తీసుకోవాలని యూపీఐ సేవలు అందిస్తున్న ఆర్థిక సంస్థలకు ఎన్పీసీఐ సూచించింది. → తొలుత ఈ 10 దేశా లోని ఎన్ఆర్ఎలు రూపాయల్లో నిధులు బదిలీ చేసే వీలుంటుందని, తదు పరి ఇతర దేశాలకూ విస్తరిస్తామని వెల్లడించింది. → భారత కు వచ్చినప్పుడు ఎన్ఆరలకు ఇది మరింత సౌలభ్యంగా ఉంటుందని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ విశ్వాస్ పటేల్ వివరించారు.

ప్రిన్స్ హ్యారీ పుస్తకానికి భారీ డిమాండ్

→ బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం 'స్పేర్ కు యూకేలో భారీ డిమాండ్ ఏర్పడింది.
→విడుదలైన తొలి రోజే ఏకంగా 4 లక్షల కాపీలు విక్రయమయ్యాయి.
→దీంతో బ్రిటన్ లో ఇప్పటివరకూ అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్ ఫిక్షన్ పుస్తకంగా ఇది సరికొత్త ఘనత సాధించింది.
→'స్పేర్' పుస్తకం నుంచి ప్రపంచవ్యాప్తంగా అందు బాటులోకి వచ్చింది.
→దాన్ని అధికారికంగా విడు దల చేసేందుకు బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న పుస్తక దుకాణాలు సోమవారం అర్ధరాత్రి తర్వాత 12 గంటలకు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి.
→అప్పటి నుంచే దీనికోసం అభిమానులు పుస్తక దకాణాల వద్ద బారులు తీరారు. హార్డ్ కాపీతో పాటు ఈ-బుక్, ఆడియో ఫార్మాట్లలో ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది.
→దీని వాస్తవ ధర రూ.2,774 (28 పౌండ్లు) ఉండగా.. మొదటి రోజు చాలా దుకాణాలు సగం ధరకే విక్రయించాయి.
→సాధారణంగా బ్రిటన్ హ్యారీ పోటర్ లాంటి ఫిక్షనల్ పుస్తకానికి తొలి రోజు భారీ డిమాండ్ ఉంటుంది.
→తొలిసారి ఓ నాన్ ఫిక్షనల్ బుక్కు ఈ స్థాయిలో గిరాకీ లభించిం దని విక్రయదారులు చెబుతున్నారు.

రెవల్యూషనరీ పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

→ సాయుధ పోరాటాలు దేశభక్తి కాంక్షను రగిల్చి కాంగ్రెస్ నేతృత్వంలో స్వాతంత్య్ర సంగ్రా మానికి ఎంతో సాయపడినా దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాల్లో వాటికి తగినంత ప్రాధాన్యం లభించలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక కోణాన్నే ప్రపంచానికి చాటిచెప్పినా నిజానికి ఎంతోమంది వ్యక్తులు, ఆలోచనలు, సంస్థలు సాయపడిన తీరు ఈ ఉద్యమంలో అమూల్యమై నదని అన్నారు.
→ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తీరుపై ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలిసభ్యుడు సంజీవ్ సన్యాల్ రచించిన రెవల్యూషనరీ పుస్తకాన్ని దిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా షా ప్రసంగించారు.
→'స్వాతంత్య్ర పోరాటంలో అహింసా ఉద్యమానికి ఎలాంటి పాత్ర లేదనో, అది చరిత్రలో భాగం కాదనో నేను చెప్పబోను. అది గొప్ప పాత్ర పోషించింది.
→కానీ ఇంకెవరూ ఎలాంటి కృషి చేయలేదని చెప్పడం మాత్రం సరి కాదు' అని వివరించారు.
→నేతాజీ సుభాష్ చంద్ర బోసు, ఆయన నేతృత్వంలోని ఐఎన్ఏ పోషిం చిన పాత్రకు దేశ చరిత్రలో తగినంత గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

దీర్ఘకాలంలో అతి పెద్ద సవాలు.. వాతావరణ మార్పు

→స్వల్పకాలంలో.. జీవన వ్యయ సంక్షోభం →ప్రపంచ ఆర్థిక ఫోరం నివేదికలో వెల్లడి లండన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే దీర్ఘకాలిక సవాళ్లలో అతి పెద్దది వాతావరణ మార్పే అయినా.. ప్రపంచం దీనికి అంతగా సిద్ధం కాలేదని ప్రపంచ ఆర్థిక ఫోరం తన తాజా నివేదికలో తెలిపింది.
→జీవన వ్యయ సంక్షోభం వల్ల ఎదురవుతున్న స్వల్పకాలిక సమస్యలే ఇందుకు కారణమంది.
→వచ్చేవారం దావోస్లో వివిధ ప్రభుత్వాధినేతలు, వ్యాపారవేత్తలు సమా వేశమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక ఫోరం తన 'గ్లోబల్ రిస్క్ రిపోర్ట్'లో ఈ విషయం చెప్పింది.
→మొత్తం 1200 మంది విపత్తు నిపు ణులు, పరిశ్రమల యజమానులు, విధాన నిర్ణేత లతో చేసిన సర్వేలో.. రాబోయే దశాబ్దంలో ఎదు రయ్యే అతి పెద్ద సమస్యలలో పర్యావరణమే ముందుంటుందని, అయినా స్వల్పకాల సమస్యల పైనే ప్రపంచాధినేతలు దృష్టిసారిస్తున్నారని అంతర్జాతీయ బీమా బ్రోకర్ మార్ష్ మెక్ నన్, జ్యూరిచ్ ఇన్సూరెన్స్ గ్రూప్ విడుదల చేసిన ఈ నివేదికలో తెలిపారు.

శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో 85వ స్థానంలో భారత్

→ ప్రపంచంలోనే 2023కిగానూ శక్తిమం తమైన పాస్పోర్ట్ దేశాల జాబితాను హెన్రీ పాస్ పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది.
→ అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 199 దేశాలతో కూడిన ఈ జాబితాను ప్రకటించింది.
→ ఇందులో భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతే డాది ఈ ర్యాంకింగ్స్ లో మనదేశం 83వ స్థానంలో ఉండటం గమనార్హం.
→ భారత పాస్పోర్టుతో 2022లో 60 దేశాల్లో పర్యటించేం దుకు వీలుండగా, ఈ ఏడాది 59 దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి.
→ గతేడాది భారత పాస్ పోర్ట్ ఉన్నవారికి వీసా లేకుండానే పర్యటిం చేందుకు అనుమతించిన సెర్బియా, ఈ ఏడాది ఆ సడలింపును తొలగించింది.
→ హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 2006లో భారత్ 71వ స్థానంలో ఉండేది.
→ తాజా జాబితాలో జపాన్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. దేశ పాస్పోర్టు ఉంటే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు.
→ జాబితాలో సింగపూర్, దక్షిణ కొరియా రెండు, మూడో స్థానాలు దక్కించుకు న్నాయి. చైనా 66, పాకిస్థాన్ 106 స్థానాల్లో నిలి చాయి.
→ అత్యంత బలహీనమైన పాస్పోర్ట్ అఫ్గానిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది.

బఠాణీ దిగుబడి పెంచేందుకు కీలకమైన ప్రొటీన్ గుర్తింపు

→ కరవు పరిస్థితులను తట్టు కుని బఠాణీ పంటలో ఉత్పత్తిని పెంచే దిశగా కీలక ముందడుగు పడింది.
→ నీటి కొరత తలెత్తినప్పుడు కిరణ జన్య సంయోగ ప్రక్రియలో వేగాన్ని తగ్గించేందుకు అవ సరమైన ప్రొటీన్ ను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయ పరిశోధకులు గుర్తించారు.
→ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్కు చెందిన వృక్షశాస్త్ర విభాగ ఆచార్యుడు ప్రొ.ఎస్. రాజగోపాల్ నేతృత్వంలో ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు జయేంద్ర పాండే, ఎల్సిన్రాజు దేవదాసు, దీప క్సెనీ, కునాల్ దోర్నే, మర్రిబోయిన సురేశ్బబు, ఆగే పాటి ఎస్. రాఘవేంద్ర భాగస్వామ్యంతో మూడేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.
→ యూజీసీ-ఇజ్రాయెల్ ప్రభుత్వ సంయుక్త సౌజన్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో సాధించిన కీలక పురోగతి వివరాలు 'ది ప్లాంట్ జర్నల్' పత్రికలో ప్రచురితమయ్యాయి.
ముందస్తు పుష్పీకరణకు అడ్డుకట్ట :-
→కరవు పరిస్థితులు తలెత్తినప్పుడు బఠాణీ మొక్కల కిరణజన్య సంయోగ ప్రక్రియలో మార్పులొస్తున్నాయి.
→పరిశోధనలో పాల్గొన్న ప్రొ.ఎస్. రాజగోపాల్, బృంద సభ్యులు ముందస్తుగా పుష్పించి ఉత్పత్తి త్వరగా వస్తున్నట్లు హెచ్సీయూ పరిశోధకులు గుర్తించారు.
→ దీంతో సాధా రణం కంటే 80 శాతం దిగుబడి తక్కువ వస్తోంది. కిర ణజన్య సంయోగ ప్రక్రియలో పీఎస్-1, పీఎస్-11 కాంప్లె క్సులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
→ వీటికి అద నంగా పీఎస్ బీఎస్ అనే ప్రొటీన్ కీలకంగా వ్యవహరిస్తు న్నట్లు గుర్తించారు. దీని పనితీరును నియంత్రిస్తే కిర ణజన్య సంయోగ ప్రక్రియ ఆలస్యమవుతుందని పరిశో ధకులు కనుగొన్నారు.
→ అందుకోసం జెనెటిక్ ఇంజినీ రింగ్ పద్ధతిలో ప్రొటీన్ మోతాదును పెంచితే సరిపో తుందని గుర్తించారు.
→ దీనివల్ల బఠాణీ మొక్కలు త్వరగా పుష్పించకుండా నియంత్రించి సీజన్కు తగ్గట్టు గానే పంట దిగుబడి సాధించేందుకు వీలుంటుంది.

తెలంగాణకు తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామకం

→ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ. శాంతికుమారి నియమితులయ్యారు.
→ రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్ కావడం విశేషం.
→ 1980 బ్యాచ్ కు చెందిన ఆమె ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా ఉన్నారు.
→ శాంతికుమారి పదవీ కాలం 2025 ఏప్రిల్ వరకు ఉంది.
→ఇప్పటివరకు సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ ఏపీ కేడర్లోనే కొన సాగాలని, ఆయన ఈ నెల 12లోగా ఆ రాష్ట్రంలో చేరా అని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
→తె లంగాణ ఆవిర్భావం తర్వాత సీఎస్ గా మహిళ నియ మితులవడం ఇదే తొలిసారి.
→ఏపీలోని కృష్ణా జిల్లాలో 1985 ఏప్రిల్ 7వ తేదీన జన్మించిన శాంతికుమారి మెరైన్ బయాలజీలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి 1989లో ఐఏఎస్ కు ఎంపికయ్యారు.


యూపీఐ లావాదేవీల ప్రోత్సాహానికి రూ.2,600 కోట్లు

→రూపే డెబిట్ కార్డు, చిన్న మొత్తాల్లో చేసే భీమ్- యూపీఐ (వ్యక్తి నుంచి వ్యాపారులకు) చెల్లింపు లను ప్రోత్సహించేందుకు అమలుచేస్తున్న పథకా నికి 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,600 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయిం చింది.
→"ప్రస్తుతం అమలు చేస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానం డిజిటల్ చెల్లింపుల వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐతోపాటు వివిధ భాగస్వామ్య సంస్థలు ఆందోళన వ్యక్తంచే శాయి.
→ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రోత్సాహక పథకానికి ఆమోదముద్ర వేసింది. ఇది బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేసి.. రూపే డెబిట్ కార్డు, బీమ్ యూపీఐ చెల్లింపులను ప్రోత్స హిస్తుంది" అని యాదవ్ వెల్లడించారు

2066 నాటికి ఓజోన్ పొరలో రంధ్రం మాయం

→ భూమి చుట్టూ ఉన్న రక్షణాత్మక ఓజోన్ పొర మెల్లగా కోలుకుంటోంది. అందులో ఏర్పడ్డ రంధ్రం.. 2066 నాటికి పూడుకోవచ్చని ఐరాస ఓ నివేదికలో పేర్కొంది.
→ నాలుగేళ్లకోసారి ఈ శాస్త్రీయ అధ్యయనం జరుగుతుంటుంది. చర్మ క్యాన్సర్లు, కళ్ల వ్యాధులు, పంటలకు నష్టాలు కలి గించే హానికారక రేడియోధార్మికత నుంచి ఓజోన్ పొర రక్షిస్తుంది.
→ అంటార్కిటికా ప్రాంతంపై ఈ పొరలో రంధ్రం ఏర్పడినట్లు కొన్ని దశాబ్దాల కిందట పరిశోధకులు గుర్తించారు.
→ దీంతో ఈ పొరకు హాని కలిగించే రసాయనాల ఉత్పత్తిని నిలిపివేయాలని అన్ని దేశాలు 1987లో ఒక నిర్ణ యానికి వచ్చాయి.
→ శీతల యంత్రాలు, ఏరోసా ల్స్ వాడే ఒక తరగతి రసాయనాలను నిషేదిం చారు.
→ ఓజోన్ పొర కోలుకోవడం వల్ల ఏటా 20 లక్షల మందిని క్యాన్సర్ బారినపడకుండా కాపాడి నట్లు అవుతుందని ఐరాస పర్యావరణ సంస్థ డైరె క్టర్ ఇంగెర్ అండర్సన్ పేర్కొన్నారు.


నిగూఢ వైరస్ల గుట్టురట్టు

→కరోనాతో ప్రపంచం అతలాకుత లమైన నేపథ్యంలో కొత్త వైరస్లను సమర్థంగా గుర్తించే విధానాలు అవసరమయ్యాయి.
→మన లోనే ఉంటూ, ప్రామాణిక వైద్య పరీక్షల్లో బహి ర్గతం కాని వైరస్లలను గుర్తించే తెలివైన ప్రక్రి యను అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయ పరి శోధకులు కనుగొన్నారు.
→"ప్రమాదకరమైన కొత్త వైరస్లను గుర్తించడం చాలా సంక్లిష్ట ప్రక్రియ. మా విధానం ఈ పనిని సులువు చేస్తుంది" అని పరిశోధనకు నాయకత్వం వహించిన ఎలెన్ ఫాక్స్మన్ పేర్కొన్నారు.
→శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్న రోగుల నుంచి నాసిక శ్వాబ్లను శాస్త్రవేత్తలు తీసుకున్నారు.
→అప్పటికే తెలిసిన 10-15 వైరస్లను ఇవి గుర్తించగలవు. నెగెటివ్ గా తేలిన శ్వాజ్లలోనూ.. యాంటీవైరల్ రక్షణ యంత్రాంగం క్రియాశీలమైన లక్షణాలు కనిపిం చాయి.
→దీన్నిబట్టి ఆ నమూనాల్లో వైరస్ జాడ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
→వాటిని గుర్తించేం దుకు.. నాసిక మార్గాల్లోని పైపొరల్లో ఉండే కణాలతో రూపొందిన యాంటీ వైరల్ ప్రొటీన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→దీన్ని పాత నమూనాలకు జోడించి, సమగ్ర జన్యుక్రమ ఆవి ష్కరణ విధానాలతో పరీక్షించారు. ఇన్ఫ్లూ యెంజా సి అనే అనూహ్య వైరస్ వాటిలో బయ టపడింది.
→2020 మార్చి మొదటి రెండు వారాల్లో నెగెటివ్ గా తేలిన పాత నమూనాల పైనా ఈ విధానాన్ని ప్రయోగించారు. వాటి లోనూ నాలుగు కొవిడ్ కేసులు బయటపడ్డాయి.

చిరు వ్యాపారులకు జగనన్న తోడు

→జగనన్న తోడు పథకంతో రాష్ట్రంలో 15.31 లక్షల చిరు వ్యాపా రుల కుటుంబాలకు మేలు జరుగుతోందని. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
→పేద కుటుంబాలకు రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని వివరిం చారు.
→తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 'జగనన్న తోడు ఆరో విడత లబ్ధిని విడుదల చేశారు.
→3.35 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తిదా రులకు రూ.305 కోట్ల రుణాలతోపాటు గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీని బటన్ నొక్కి, లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
→ఈ సందర్భంగా సీఎం మాట్లా డుతూ... 'సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపా రుల కష్టాలు చూశాను.
→రూ. వెయ్యి అప్పులో ముందే 100 తీసుకుని నెల నాటికి మొత్తం కట్టించుకునే ఆధ్వాన పరిస్థితుల్లో సమాజం ఉండేది.
→ఆ బాధల నుంచి వ్యాపారులకు | శాశ్వత పరిష్కారం చూపాలనే తాపత్రయంతో ఈ పథకం తీసుకొచ్చాం. పేద వ్యాపారులకు ఇస్తున్న రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది' అని వెల్లడించారు.
→ఇప్పటివరకు చిరు వ్యాపారులకు రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాం.
→15.31 లక్షల మంది లబ్దిదారుల్లో 8.74 లక్షల మంది రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించి బేష్ అనిపించుకు న్నారు.
→దేశంలో ఇటువంటివి 39, 21 లక్షల రుణాలిస్తే.. ఏపీలోనే 21.06 లక్షబంధించాం.
→దేశంలో ఇదో రికార్డు. లబ్ది పొందిన వారిలో దాదాపు 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా 'రిటీలే' అని జగన్ పేర్కొన్నారు.
→ 'బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై చిరు వ్యాపారులు చెల్లిస్తున్న వడ్డీని ప్రభుత్వం ప్రతి ఆర్నెల్లకో సారి తిరిగి వెనక్కి ఇవ్వడమనేది వ్యవస్థలో గొప్ప మార్పు అర్హత ఉన్నా.. ఎవరైనా పేద కాన్ని అందుకోలేకపోతే వారు గ్రామ సచివాల యాల్లో సంప్రదించినా, వాలంటీర్లకు చెప్పినా, 1902 నంబరుకు ఫోన్ చేసినా సరే.. రుణా ఉండేలా ప్రభుత్వం సహకరిస్తుంది.
→ ఈ ఏడాది సకాలంలో అప్పు చెల్లిస్తే రూ. వెయ్యి పెంచి రూ.11వేలు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించాం.. ఇదీ పెంచి రూ. 12వేలు ఇప్పించేలా చూస్తాం'. అని సీఎం వివరించారు.

ఆర్ఆర్ఆర్ పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం

→ప్రపంచ సినిమా వేదికపై తెలుగు చిత్రసీమ జెండా రెపరెపలాడింది.
→'బాహుబలి' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నుంచి వచ్చిన మరో బ్లాక్బస్టర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్లోని 'నాటు నాటు' పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం గెలుచుకుంది.
→హుషారుగా ఎన్టీఆర్, రామ్ రణ్ స్టెప్పులేసిన ఈ పాట భారతీయుల్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా ప్రేక్షకులతో డ్యాన్స్ చేయించింది.
→ఇప్పుడు ఆ పాటి "ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (మోషన్ పిక్చర్) విభాగంలో ఆవార్డు అందుకుంది.
→ హిల్టన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో 'నాటు నాటు' పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పురస్కా రాన్ని అందుకున్నారు.
→చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభై రవ ఆలపించారు.
→ఆసియా ఖండంలో ఈ పురస్కారాన్ని దక్కించు కున్న తొలి పాట ఐడే బేలర్ స్విప్ట్, రిహానా, లేడీ గాగా లాంటి ప్రముఖ గాయకుల పాటలతో పోటీని ఎదుర్కొంటూ విశ్వ వేదికపై నాటు నాటు పాట విజయకేతనం ఎగురవేసింది.

ఉత్తమ చిత్రం ది ఫాబెల్మ్యాన్స్

→గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (డ్రామా)గా ది పాబెల్మ్యాన్స్),
→ఉత్తమ చిత్రం (మ్యూజికల్- కామెడీ) -ది ఐన్స్టీస్ ఆఫ్ ఇనిషి రిన్,
→ఉత్తమ చిత్రం (నాన్ ఇంగ్లిష్) - అర్జెం టినా, 1985 పురస్కారాలు దక్కించుకున్నాయి.
→ఉత్తమ నటిగా (డ్రామా) కేట్ బ్లాంచెట్ (టార్),
→ఉత్తమ నటుడిగా (డ్రామా అస్టిన్ బట్లర్ (ఎల్వీస్),
→ఉత్తమ దర్శకుడిగా (మోషన్ పిక్చర్) -స్టీవెన్ స్పీల్బెర్గ్ అవార్డులు అందుకున్నారు.

ఆస్కార్ నామినేషన్ల బరిలో 10 భారతీయ చిత్రాలు

→ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. విజే తలెవరో ఇంకొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.
→నిర్వాహకుల కమిటీ ది అకా డెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్ నామినేషన్ బరిలో నిలిచే చిత్రాల వివరాల్ని ప్రకటించింది.
→ఇందులో ఆఖరి మెట్టుపై 10 భారతీయ చిత్రాలు ఉండటం ఈ ఏడాది ప్రత్యేకత. 'ఆర్ఆర్ఆర్', 'గంగూభాయ్ కారియావాడి', 'ది కశ్మీర్ ఫైల్స్', 'కాంతార'లు షార్ట్ లిస్ట్ లో ఉన్నట్టు కమిటీ ప్రకటించింది.
→భారతీయ అధికారిక ఎంట్రీ చిత్రం చెల్లో షో'తోపాటు 'మీ వసం తెవు', 'తుజ్య సాథీ కహీ హై, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, 'విక్రాంత్ రోణ' 'ఇరవిన్ నిహల్' సైతం బరిలో ఉన్నాయి.
→ఈ బరిలో మొత్తం 301 చిత్రాలు పోటీపడుతున్నాయి. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్, 'బ్లాక్ పాంథర్: వాకాండ ఫరెవర్', 'టాప్ గన్: మావెరిక్ లాంటి చిత్రాలు ప్రధాన విభాగంలో ఉన్నాయి.
→జనవరి 12న ఓటింగ్ చేయడం మొదలు పెడతారు.

మూడు క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా

→ఉత్తర కొరియా శనివారం మూడు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను తన తూర్పు జలాల్లోకి ప్రయోగించింది.
→ఉత్తర ప్రాంతంపై అంతరిక్షం నుంచి నిఘా సామర్ధా ్యలను పెంపొందించు దక్షిణ కొరియా ఘన ఇంధన రాకెట్ను ప్రయోగిం చిన మర్నాడే ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిం చడం గమనార్హం.
→ఆ క్షిపణులు కొరియా ద్వీపం, జపాన్ మధ్య జలాల్లో 350 కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు సమాచారం.

ప్రాణాంతక రక్త క్యాన్సర్కు సమర్థ చికిత్స

→ దీర్ఘకాలం స్థిరంగా ఉండే వ్యాధి దశ నుంచి ప్రాణాంతక వ్యాధిగా రక్త క్యాన్సర్ మారడానికి కారణమవుతున్న డి. యు.ఎస్.పి6 రేణువును అడ్డుకుంటే వ్యాధి విజృంభణను నివారించ వచ్చని వాషింగ్టన్ విశ్వవిద్యా లయ వైద్య కళాశాల పరిశోధ కులు నిర్ధారించారు. ఎలుకల పైన, మానవుల నుంచి తీసిన క్యాన్సర్ కణితులపైన జరిపిన ప్రయోగాలు ఈ →నిర్ధారణకు దారితీశాయని విఖ్యాత నేచర్ - క్యాన్సర్ పత్రికలో ప్రచురితమైన అధ్య యనం తెలిపింది. శరీరంలో రక్తాన్ని జనిం పజేసే కణజాలానికి వచ్చే క్యాన్సర్ను క్రానిక్ లుకేమియా అంటారు. ఇది ఒక్కసా రిగా రోగిని కబళించకుండా చాలాకాలం కొనసాగుతుంది. కొందరిలో చికిత్స అవసర మైతే, చాలామందిలో లుకేమియా పురోగ తిపై నిఘా ఉంచితే సరిపోతుంది. నెమ్మ దిగా పురోగమించే లుకేమియా కొద్దిమం దిలో ఉన్నట్టుండి విజృంభిస్తుంది.
→దీన్ని నిరో ధించడానికి సమర్థ చికిత్సా విధానాలేవీ అందుబాటులో లేవు. ఈ దశకు చేరిన ప్రతి రోగి మరణించడం దాదాపు ఖాయం. క్రానిక్ లుకేమియా రోగుల చికిత్సకు జేఏకె 2 నిరో ధకాలను ఇస్తారు. ఆ మందులకూ లుకే మియా లొంగకపోతే ప్రాణాంతకంగా మారు తుంది. జేఎకె 2 ను డి. యు.ఎస్.పి6 రేణువు అడ్డుకొంటోందని పరిశోధనలో తేలింది. జన్యు చికిత్సతో దీనిని తొలగిస్తే ఎలుకల్లో క్రానిక్ లుకేమియా ప్రాణాంతకంగా మారడం. లేదని పరిశోధకులు గుర్తించారు.

మెదడు సంకేతాలతోనే వాంతులు!

→ కలుషిత లేదా విషపూరిత ఆహారం తిన్నప్పుడు వాంతులు ఎందుకవుతాయి? వాంతి చేసుకోవాలనే ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సందేహాలకు సమాధానాలను విశ్లేషించే క్రమంలో చైనా పరిశోధకులు పలు ఆశ్చర్యకర మైన విషయాలు తెలుసుకున్నారు.
→ మన శరీరా నికి సరిపడని ఆహారాన్ని తిన్నప్పుడు కడుపులో వికారం మొదలవుతుంది.
→ ఆ వెంటనే పేగుల నుంచి వెలువడే సంకేతాల ఆధారంగా మెదడు నిర్ణయం తీసుకుంటుందని, దాని ఆదేశాల ప్రకారం విషాహారాన్ని వాంతుల రూపంలో బయటకు నెట్టి వేయడం జరుగుతుందని చైనాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ శాస్త్రవే త్తలు తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పేగులు, మెదడుకు మధ్య ఉన్న పర మాణు వలయం కీలకపాత్ర వహిస్తున్నట్లు తెలు సుకున్నారు.
→ పరిశోధనలో భాగంగా ఎలుకలకు విషపూరిత ఆహారం ఇచ్చినప్పుడు.. మనుషుల్లో మాదిరిగానే వాటి కడుపులో వికారం మొదలైంది. ఆ వెంటనే జీవకణ సముదాయాల స్థాయిలో రక్షణాత్మక ప్రతిస్పందనలు ప్రారంభమై, మెదడుకు సంకేతాలు చేరాయని న్యూరాలజిస్ట్ పెంగ్ కావొ వెల్లడించారు.
→అనియంత్రిత కండరాలను ఉద్దీపిం పజేసే రక్తనాళికలు ఒక రసాయనిక ప్రక్రియను కలుగజేస్తాయని, పేగులు-మెదడు. ఆ సంకేతాలు ప్రసరిస్తాయని పరిశీల నలో గుర్తించారు.
→అయితే, వివిధ రక్షణాత్మక ప్రతిస్పందనలను మెదడు ఎలా సమన్వయం చేసుకుందన్న విషయాలు పూర్తిస్థాయిలో తెలుసుకో వాల్సి ఉందని పేర్కొన్నారు.

గౌరవ పోప్ బెనెడిక్ట్ అస్తమయం

→ పోప్ ఎమిరిటస్ (గౌరవ పోప్ బెనెడిక్ట్ (95) శనివారం కన్నుమూశారు.
→ ప్రపంచంలోని 120 కోట్లమంది కేథలిక్కులకు సారథ్యం వహించడానికి కావాల్సిన శక్తి తనలో క్షీణించిందంటూ 2013 ఫిబ్రవరి 11న పోప్ పద వికి రాజీనామా చేసి ప్రపంచాన్ని ఆయన నివ్వె రపరచారు.
→ ఒక పోప్ తన పదవికి రాజీనామా చేయడం 600 ఏళ్ల తరవాత అదే ప్రథమం.
→ బెనెడిక్ట్ తరువాత పోప్ గా పగ్గాలు చేపట్టిన ఫ్రాన్సిస్ ఆయన గౌరవ పోప్ గా కొనసాగడానికీ, వాటికన్లోనే నివసించడానికి ఏర్పాటు చేశారు.
→ బెనెడిక్ట్ అంత్యక్రియల సందర్భంగా నెయింట్ ఫ్రాన్సిస్ చౌకీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థన చేస్తారు. మాజీ పోప్ కోసం ఒక పోప్ ఇలా ప్రార్థనలు నిర్వహించడం ఇదే తొలిసారి.
→జర్మనీలోని బవేరి యాలో పుట్టిన పోప్ బెనెడిక్ట్ అసలు పేరు జోసెఫ్ రాట్టింగర్. 78 ఏళ్ల వయసులో ఆయన మతపరమైన కార్డినల్ పదవికి రాజీనామా చేసి తన జీవితంలో చివరి భాగాన్ని స్వస్థలమైన బవే రియాలో ప్రశాంతంగా గడపాలనుకున్నారు. కానీ అప్పటి పోప్.. రెండవ జాన్ పాల్ 2005లో ఆస్త మించడంతో పోప్ పదవిని బెనెడిక్ట్ చేపట్టాల్సి వచ్చింది. అమెరికాపై ఉగ్రదాడి తర్వాత అయి దేళ్లకు ఒక ప్రసంగంలో బెనెడిక్ట్ ముస్లింల పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. బెనెడిక్ట్ మృతికి భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు.

విశాఖలో బాహుబలి నౌక

→ వి శాఖ ఓడ రేవుకు బాహుబలి నౌక వచ్చింది.
→ 'ఎంవీ జీసీఎల్ సబర్మతి బేబీ కేప్' పేరున్న ఈ నౌక పొడవు 253.50 మీటర్లు. వెడల్పు 43 మీటర్లు.
→ ఒకేసారి 1,06,529 టన్నుల బరువైన సరకును తరలించే సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతం సున్నపురాయి లోడుతో ఇక్కడకొచ్చింది.
→ రేవులోని వెస్ట్ క్వే-1 బెర్త్ దీన్ని విజయవంతంగా నిలిపారు.
→విశాఖ ఓడ రేవులో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారని పోర్టు ట్రస్టు చైర్మన్ తెలిపారు.

భారత ఉత్తమ టెస్టు బ్యాటర్ గా రిషబ్ పంత్

→ వికెట్ కీపర్ రిషబ్ పంతున్ను 2022 సంవత్సరానికి భారత ఉత్తమ టెస్టు బ్యాటర్ గా బీసీసీఐ ఎంపిక చేసింది.
→ఆ ఏడాదిలో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ల జాబితాను బోర్డు శనివారం ప్రకటించింది.
→పంత్ 7 టెస్టుల్లో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 146.
→టెస్టుల్లో ఉత్తమ బౌలర్ బుమ్రా (5 మ్యాచ్ 22 వికెట్లు) ఎంపికయ్యాడు.
→వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ (17 మ్యాచ్లో 724 పరుగులు, 1 సెంచరీ, 6 అర్థ సెంచరీలు) ఉత్తమ బ్యాటర్, మహ్మద్ సిరాజ్ (15 మ్యాచ్ 24 వికెట్లు) ఉత్తమ బౌలర్ గా నిలిచారు.
→టీ20ల్లో సంచలన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ బ్యాటర్ గా ఎంపికయ్యాడు.
→టీ20 ప్రపంచకప్తో పాటు వివిధ ద్వైపాక్షిక సిరీస్లలో విధ్వంసక ఇన్నింగ్స్ తో అదరగొట్టిన అతడు 31 మ్యాచ్ల్లో 1164 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి.
→భువనేశ్వర్ కుమార్ (32 మ్యాచ్ 37 వికెట్లు) బెస్ట్ టీ20 బౌలర్.

ఈ ఏడాది జరగబోయే ముఖ్యమైన క్రీడా పోటీలు

→పురుషుల హాకీ ప్రపంచ కప్ (జనవరి 13-29, ఒడిషా)
→యుఎస్ ఓపెన్ (ఆగస్టు 28- సెప్టెంబర్ 10)
→ ఆండర్-19 అమ్మాయిల టీ20 ప్రపంచకప్ (జనవరి 14-29, దక్షిణాఫ్రికా)
→మహిళల టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 10-26, దక్షిణాఫ్రికా)
→మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ (మార్చి 15-31, దిల్లీ)
→పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ (మే 1-14, ఉజ్బెకిస్థాన్)
→మహిళల ఫిఫా ప్రపంచకప్ (జులై 20-ఆగస్టు 20, అస్ట్రేలియా/ న్యూజిలాండ్)
→ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ (ఆగస్టు 19-27, హంగేరీ)
→ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ (ఆగస్టు 21-27, డెన్మార్క్)
→ఆసియా క్రీడలు (సెప్టెంబర్ 23-అక్టోబర్ 8, చైనా)
→పురుషుల వన్డే ప్రపంచకప్ (అక్టోబర్-నవంబర్, భారత్)

రైల్వే బోర్డు చైర్మన్ గా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ

→ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓగా అనిల్ కుమార్ లహోటి ఆది వారం బాధ్యతలు స్వీకరిం చారు.
→ నూతన సంవత్సరం తొలిరోజు ఇక్కడి రైల్ భవ న్లోని ఛైర్మన్ కార్యాలయంలో ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు.
→ ఇప్పటివరకు రైల్వే బోర్డులో సభ్యుడి(మౌలిక వసతులు)గా కొనసా గిన ఆయనకు చైర్మన్, సీఈఓగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల కేంద్ర నియామక వ్యవహారాలు కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
→ ఇండి యన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ 1984వ బ్యాచ్ కు చెందిన ఆయన గ్వాలియర్ లోని మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు.
→ ఐఐటీ రూర్కీలో ఎంటెక్ పూర్తిచేశారు.

సూర్యుడి ప్రభావంతో చందమామపై నీరు

→ భగభగ మండే సూర్యుడి ప్రభావంతో చందమా మ పైకి నీరు వచ్చి చేరిందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
→జాబిల్లి ధూళిని విశ్లేషించి, ఈ మేరకు తేల్చారు. చందమామ చాలా పొడిగా, ధూళి గోళంలా కనిపిస్తుంది.
→అయితే ఊహిం చినదాని కన్నా అక్కడ ఎక్కువ పరిమాణంలోనే నీరు ఉండొ చ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.
→అది సరస్సులు, సాగరాల రూపంలో కాకుండా.. శాశ్వతంగా నీడలో ఉండే బిలాల్లో మంచుగడ్డ రూపంలో నిక్షిప్తమై ఉండొచ్చని వివరిస్తు న్నాయి.
→ఆ నీరు గ్రహశకలాలు, భూమి నుంచి వచ్చి ఉండొ చ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. సూర్యుడి నుంచి కూడా రవాణా అయ్యి ఉండొచ్చన్న వాదన ఉంది.
→నిజానికి భానుడిలో నీరు ఉండదు. అక్కడి నుంచి వచ్చే గాలిలో హైస్పీడ్ హైడ్రో జన్ అయాన్ల వల్ల చంద్రుడిపై నీరు ఏర్పడి ఉండొచ్చని శాస్త్ర వేత్తలు పేర్కొన్నారు.
→చైనాకు చెందిన చెంగేశ్ వ్యోమనౌక తీసుకొచ్చిన నమూనాలను తాజాగా విశ్లేషించినప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
→చంద్రుడి రేణువుల్లో హైడ్రోజన్, డ్యుటీరియంల నిష్పత్తిని శాస్త్రవేత్తలు పరిశీలిం చారు. అవి సౌరగాలుల నుంచి వచ్చినట్లు దీన్నిబట్టి నిర్ధారిం చారు.
→ఆ పవనాల ద్వారా చంద్రుడి మీదకు హైడ్రోజన్ ఆయాన్లు చేరి ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
→ఆ రేణువులు.. చంద్రుడి ఖనిజ ఆక్సైడ్లను తాకిన ప్పుడు వెలువడే ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరిచి ఉంటాయని వివరించారు.
→ఫలితంగా నీరు ఉత్ప త్తయి ఉంటుందని సిమ్యులేషన్ల ఆధారంగా విశ్లేషిం చారు. చంద్రుడి శీతల ప్రాంతాల్లో అది నిక్షిప్తమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మెదడులోనూ కరోనా వైరస్ పాగా

→కొవిడ్-19తో చనిపోయినవారి మృతదేహాలను పరిశీలించినప్పుడు విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
→ఈ వ్యాధి కారక సార్స్- కోవ్-2 వైరస్.. శరీరం మొత్తం వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడైంది. మెదడులోకి చేరుతున్నట్లు తేలింది.
→ఇన్ఫెక్షన్ సోకిన 8 నెలల తర్వాత కూడా వాటి ఆనవాళ్లు న కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ జరిగిన శవప లోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఎస్ఐహెచ్) పరిశోధకులు విశ్లేషించారు.
→మెదడు సహా నాడీ వ్యవస్థకు సంబంధించిన కణజాలాలూ ఆ నేత్రం రీక్షల్లో సేకరించిన నమూనాలను అమెరికా ఉన్నాయి.
→ఈ మృతులెవరూ కొవిడ్ టీకాను పొందలేదు. కరోనా వైరస్ తొలుత శ్వాస మార్గాలు, ఊపిరితిత్తుల కణజాలాల్లో ఇన్ఫెక్షన్ కలిగించి, వాటిని దెబ్బతీస్తున్నట్లు తేలింది.
→శరీరంలోని 84 విభిన్న ప్రదేశాలు, ద్రవాల్లో వైరస్ జాడను గుర్తించారు. రోగిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన 230 రోజుల తర్వాత కూడా వైరల్ ఆర్ఎస్ఏ దర్శనమిచ్చింది.
→ ఒక రోగి మెదడులోని హైపోథాలమస్, సెరిబెల్లమ్, మరో ఇద్దరు బాధితులు వెన్నుపూసలోనూ కనిపించింది. అయినా మెదడు కణజాలం పెద్దగా దెబ్బతినలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
→ గుండె, లింఫ్ నోడ్ లు, జీర్ణాశయం, అడ్రినల్ గ్రంధి, కంట్లోనూ వైరస్ జాడ ఉందని వివరించారు.

2023లో భారీ ప్రయోగాలు మంగళయాన్, చంద్రయాన్-3కి సన్నాహాలు

→ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాదిలో అతి పెద్ద రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది.
→ ఇందులో ఆదిత్య-ఎల్1 వంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్, మంగళయాన్, చంద్రయాన్- 3. మానవ రహిత గగన్ యాన్ ఉన్నాయి.
→ గత ఏడాది ఇస్రో.. పన్వెబ్కు చెందిన 38 ఉపగ్రహాలతోపాటు 5 కీలకమైన ప్రయోగాలు చేపట్టింది.
→ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆదిత్య-ఎల్1, జూన్ లో చంద్రయాన్-3 లక్ష్యంగా పెట్టుకుంది.
→ చంద్రయాన్-2 క్రాస్ ల్యాండింగ్ లోపాలను పరిష్కరిం చడానికి ఏజెన్సీ ల్యాండర్ సిస్టమ్లో అనేక మార్పులు చేసింది.
→ చంద్రుడిపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలిగితే ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.
→ 2029 చివరి త్రైమాసికంలో మానవ రహిత ప్రయోగ వాహనం, ఆర్బిటల్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్, రికవరీ కార్యకలాపాల పనితీరును ధ్రువీకరించడం లక్ష్యంగా గగనాన్ ప్రయోగాలు చేయనుంది.
→ దీని తర్వాత మరో మానవ రహిత ప్రయోగం చేపట్టి, మూడో ప్రయత్నంలో వచ్చే ఏడాది మానవ సహిత ప్రయోగం చేసేలా ప్రణాళికలు రచించింది.
→విదేశాలకు చెందిన ఇంజినీర్లకు బుల్లి ఉప్రగహాల తయారీపై ఇస్రో శిక్షణ ఇస్తోంది.
→పది కిలోల కన్నా తక్కువ బరువుండే వాటిని నానో ఉపగ్రహాలుగా పరిగణిస్తారు.
→అంతరిక్ష శాంతియుత ప్రయోజనాలే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్త్స్కో (యూనుసా) ఇస్రో చురుకైన అను బంధం కలిగి ఉంది.
→2018 జూన్లో వియన్నాలో జరిగిన సమావేశంలో భారత్ నానో శాటిలైట్ అభివృద్ధిపై కెపాసిటీ- బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రక టించింది.
→అందులో భాగంగా యునిస్పేస్ నానో ఉపగ్రహాల శిక్షణగా పిలిచే కార్యక్రమాన్ని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో ప్రధాన కార్యాలయంతోపాటు ఇస్రోలోని ఇతర విభాగాలు, నిపుణులు, శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహిస్తున్నారు.

పటిష్ఠ భద్రత మధ్య భీమా-కోరెగావ్ వేడుక

→ భీమా-కోరెగావ్ యుద్ధానికి 205 ఏళ్ళు పూర్త యిన సందర్భంగా మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఆది వారం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.
→భీమా- కోరెగావ్లోని జయస్తంభ స్మారక స్తూపం వద్ద దళిత సంఘాల ప్రతినిధులు సహా వేల మంది గుమికూడి అమర వీరులకు నివాళి అర్పించారు.
→2018 జనవరి 1న ఈ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో హింస చోటుచేసుకోవడం, కరోనా పరిస్థితుల తర్వాత మళ్లీ దీన్ని నిర్వహిస్తుండ టంతో ఈసారి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
→దళిత సంఘాల వాదన ప్రకారం.. 1818 జనవరి 1న అప్పటి పుణె పాలకుడైన పీష్వాతో జరిగిన యుద్ధంలో దళిత మహర్ సైన్యంతో కూడిన బ్రిటిష్ దళాలు విజయం సాధించాయి.
→ కుల వివక్షకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలపై సాధించిన గెలుపును గుర్తు చేసుకునేందుకు ఏటా ఇక్కడ వేడుకలు నిర్వహించుకుంటారు.

108వ సైన్స్ కాంగ్రెస్ను ఉద్దేశించి 3న ప్రధాని ప్రసంగం

→ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3వ తేదీన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) ను ఉద్దేశించి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ప్రసంగిస్తారని లయం (పీఎంఓ) ఆదివారం తెలిపింది.
→సుస్థిరాభివృద్ధి ద్వారా మహిళల సాధికా రిత సాధనలో సైన్స్, టెక్నాలజీ పాత్రపై ఈ ఏడాది ఐఎస్సీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
→బోధన, పరి శోధన, పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు మహిళలు చేరుకునేందుకు చేయాల్సిన కృషి పై ప్రతినిధులు చర్చిస్తారని పీఎంఓ తెలిపింది.

ఫోన్ వాడుతూ డ్రైవింగు.. 1,040 మంది దుర్మరణం

→ వాహనం నడుపుతున్న సమయంలో ఫోను వాడటం వల్ల 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 1,997 రోడ్డు ప్రమాదాల్లో 1,040 మంది మరణించారు.
→ 2021లో దేశంలో జరిగిన రోడ్డుప్రమాదాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
→ సిగ్నల్స్ వద్ద రెడ్లైట్ జంపింగు వల్ల 555 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ ప్రమాదాల్లో 222 మంది మృతిచెందారు.
→ అలాగే రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరిగి 1,484 మంది మృత్యువాత పడ్డారు.
→వీటి నివారణక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచే యాల్సి ఉందని సూచించింది.
→రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ 'ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ కేర్' అనే పలు దశల ప్రణాళికను రూపొందించినట్లు గుర్తు చేసింది.

క్షిపణి పరీక్షతో కొత్త సంవత్సరంలోకి..!

→ ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్.. నూతన సంవత్సరానికి తనదైన శైలిలో క్షిపణి పరీక్షతో స్వాగతం పలికారు.
→ ఈ ఏడాదిలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని కూడా స్పష్టం చేశారు.
→ 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా.. ఆదివారం కూడా తూర్పు జలాల్లోకి ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయో గించింది.
→ తద్వారా ఈ ఏడాది కూడా ఆయుధ పరీక్షలు భారీ ఎత్తున ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది.
→ మరోవైపు, కొత్త సంవత్సరం సందర్భంగా అధికార పార్టీ సమావేశంలో మాట్లాడిన కిమ్.. అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామన్నారు. మరింత శక్తిమంత మైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని ప్రక ంచారు.
→ అమెరికా సహా ఇతర ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ట పరుస్తా మన్నారు.
→ దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేం దుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
→ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
→ వేగవంతమైన కొత్త రకం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ పేర్కొంది.
→ అలాగే, తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని సైతం త్వరలో ప్రయోగించాలని కిమ్ యోచిస్తున్నట్లు తెలి పింది.
→ తాజా క్షిపణి పరీక్షను దక్షిణ కొరియా, అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా తీవ్ర కవ్వింపు చర్యలకు దిగుతోందని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి.

పీలే మరణం

→ ఫుట్బాల్ దిగ్గజం పీలే 2022, డిసెంబరు 29% మరణించారు. ఈయన అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో
→ పీలే 1940, అక్టోబరు 23న బ్రెజిల్లో జన్మించారు. ఈయన 13 ఏళ్లకే స్థానిక జూనియర్ జట్టుకు ఆడటం ప్రారంభించాడు. 37 ఏళ్ల వయసులో చివరి మ్యాచ్ ఆడాడు.
→ మూడు ఫుట్బాల్ ప్రపంచకప్ లు (1958, 1962, 1970) గెలిచిన ఏకైక ఆటగాడు పీలే.
→ బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో 77 గోల్స్ చేశాడు. 2022లో జరిగిన ప్రపంచకప్ వరకు ఇదే అత్యుత్తమం. (ఇప్పుడు నెయా మార్ 77 గోల్స్ పీలే సరసన చేరాడు
→ ఈయన బ్రెజిల్ క్రీడాశాఖ మంత్రిగానూ పనిచేశారు.

సవితశ్రీ - కాంస్య పతకం

→ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత్కు చెందిన 15 ఏళ్ల టీనేజర్ సవితశ్రీ కాంస్య పతకం సాధించింది.
→ ఈమె విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో పతకం నెగ్గిన మూడో భారత చెస్ క్రీడాకారిణి.
→తాజా టోర్నీ మహిళల టైటిల్ను చైనాకు చెందిన జోంగ్యి సొంతం చేసుకుంది. రెండో స్థానంలో దినారా (కజకిస్థాన్) నిలిచింది.
→7 తాజా టోర్నీలో ఓపెన్ విభాగంలో నార్వేకు చెందిన కార్డ్సన్ టైటిల్ గెలుచుకున్నాడు. విన్సెంట్ (జర్మనీ) రెండో స్థానంలో నిలిచాడు.

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం

→ సుఖోయ్ - 30 యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ క్షిపణిని 2022, డిసెంబరు 29న భారత వాయుసేన ఆధ్వర్యంలో బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించారు.
→ ఈ ఏడాది మేలో సూపర్ సోనిక్ మిస్సైల్ ఎక్స్టెండెడ్ వెర్షన్ను సుఖోయ్ యుద్ధ విమానం నుంచి తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు.
→ క్షిపణి పరిధిని తాజాగా 290 కిలోమీటర్ల స్థాయి నుంచి 400 కిలోమీటర్లకు పెంచారు.

ఆన్లైన్లో ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు

→ఈ-ఎస్సీఆర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీజేఐ
→ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది.
→ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్.. ఎలక్ట్రా నిక్ సుప్రీంకోర్టు నివేదికల (ఈ-ఎస్ సీఆర్) ప్రాజె క్టును ప్రారంభించారు.
→ ఈ కొత్త సాంకేతికతతో దాదాపు 34,000 తీర్పులకు సంబంధించిన డిజిటల్ ప్రతులు న్యాయవాదులకు, సామాన్య ప్రజలకు ఉచి తంగా అందుబాటులోకి రానున్నాయి.
→ "దేశవ్యా ప్తంగా లభించనున్న ఉచిత సేవ ఇది. ఇందులో సెర్చ్ ఇంజిన్ ను ఇంకా మెరుగుప రుస్తున్నాం. ముఖ్యమైన తీర్పులు కొన్ని వారాల్లోనే అందుబాటులోకి వస్తాయి.
→ ఇప్పటికైతే జనవరి 1, 2022 వరకు ఉన్న తీర్పులు ఇందులో ఉన్నాయి. ఫిబ్రవరి 15 లోపు 2022 తీర్పులు కూడా చూడొచ్చు" అని సీజేఐ తెలిపారు.

దక్షిణాసియా నుసి రేణువులతో టిబెట్లో మంచుకు గండి

→టిబెట్ పీఠభూమిలోని హిమానీన దాలకు నుసి రేణువులు (బ్లాక్ కార్బన్) విఘాతం కలిగిస్తున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.
→దక్షిణాసియా నుంచి వచ్చే ఈ రేణు వులు హిమాలయాల మీదుగా ప్రయాణించి, టిబెటన్ పీఠభూమిపైకి చేరుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇవి హిమంపై పేరుకుపోతున్నాయి.
→ఫలితంగా.. ఆ మంచు ఫలకాలపై పడే సూర్య కాంతి చాలా తక్కువగా ఆకాశంలోకి పరావ ర్తనం చెందుతుంది. దీనివల్ల హిమానీనదాలు, మంచు చాలా త్వరగా కరుగుతుంటాయి.
→దీని కితోడు దక్షిణాసియా నుసి రేణువులు.. టిబె టన్ పీఠభూమిలోని హిమానీనదాలపై కొత్తగా మంచు చేరకుండా పరోక్షంగా అడ్డుకుంటున్నా యని తాజాగా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
→ఈ నుసి రేణువులు మధ్య, ఎగువ వాతావరణాన్ని వేడె క్కిస్తాయని, తద్వారా ఉత్తర-దక్షిణ దిశలపరంగా ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాల్లో తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సూక్ష్మ ప్లాస్టిక్స్ ను వేగంగా వడకట్టే ఫిల్టర్

→ నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ లు, ఇతర కాలు ష్యకారకాలను వేగంగా వడకట్టే సరికొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ రసాయన పరి శ్రమలు వేగంగా వృద్ధి చెందడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోంది. దీన్ని పరిష్క రించేందుకు వివిధ రకాల శుద్ధి 'వృద్ధి చేశారు.
→ అవి కాలుష్యకార కాలను తెట్టుకట్టేలా (అడ్సార్ఫషన్) చేస్తాయి. అయితే ప్రస్తుతమున్న ఈ నేత్రం పరిజ్ఞానాలు, పదార్థాలను అభి తరహా విధానాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన డీజీఐఎస్జీటీ సంస్థ శాస్త్ర వేత్తలు తెలిపారు.
→దీన్ని అధిగమించేందుకు రంధ్రా లతో కూడిన ఒక పాలిమరు వారు అభివృద్ధి చేశారు.
→దీనికి అద్భుత స్థాయిలో ఆడ్సార్సషన్ సామర్థ్యం ఉంది. అది ఫినోలిక్ సూక్ష్మమైక్రోప్లాస్టి క్ల లు, వోలటైల్ ఆర్గానిక్ పదార్థాలను చాలా వేగంగా 99.99 శాతం మేర వడగడుతుందని శాస్త్ర వేత్తలు తెలిపారు.
→ఇది ప్రపంచంలోనే అత్యధిక స్థాయి అని వివరించారు.

ఒక్కో కణజాలంలో ఒక్కోలా రోగనిరోధక శక్తి!

→ మానవ రోగనిరోధక వ్యవస్థలో మెమోరీ టి-సెల్లు చాలా కీలకం. మనం ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు.. దాని తాలూకు ప్రభా వాలను అవి గుర్తుంచుకుంటాయి.
→ కొన్ని మెమోరీ టి-సెల్లు రక్తంలో ప్రవహిస్తూ శరీరమంతటికీ రక్షణ కల్పిస్తుంటాయి. మరికొన్ని మాత్రం నిర్దిష్ట అవయవాలు/కణజాలాలకు పరిమితమవుతుం టాయి.
→ వీటిని కణజాల నివాసిత టి-సెల్లు (టీఆర్ఎం కణాలు)గా పిలుస్తారు. ఈ టీఆర్ఎం కణాలను పెంపొందించేందుకు/వాటిని త్వరితగ తిన ఉత్తేజితం చేసేందుకు అవసరమైన చికిత్సలు/ టీకాలను ఉత్పత్తి చేయడంపై ప్రస్తుతం దృష్టిసా రించాల్సిన ఆవశ్యకతను అమెరికాలోని కాలి ఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనంలో నొక్కి చెప్పారు.
→పేగుల్లో ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ల వంటి ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొనేం దుకు టీఆర్ఎం కణాల ఆధారిత రోగ నిరోధక శక్తి మెరుగ్గా దోహదపడే అవ కాశాలున్నాయని వివరించారు.

నోట్ల రద్దు ప్రకటన నుంచి సుప్రీం తీర్పు వరకు

విచారణ సాగిందిలా:-
→నవంబరు 8, 2016 ప్రధాని మోదీ జాతినుద్దే శించి ప్రసంగిస్తూ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన
→నవంబరు 9, 2016: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
→డిసెంబరు 16, 2016: నోట్ల రద్దు నిర్ణయం చెల్లు బాటుతో పాటు ఇతర సవాళ్లపై విచారణను అయిదు గురి సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్ నేతృ త్వంలోని ధర్మాసనం వెల్లడి
→జులై 23, 2017: గత మూడేళ్లలో ఆదాయపన్ను శాఖ జరిపిన విస్తృత సోదాల్లో సుమారు రూ. 71941 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించినట్లు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
→ఆగస్టు 11, 2017: నోట్ల రద్దు సమయంలో అసా ధారణ డిపాజిట్లు జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ.
→2. 8లక్షల కోట్ల నుంచి రూ.4.3లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అదనంగా వచ్చి చేరినట్లు ప్రకటించింది.
→ఆగస్టు 25, 2017: రూ.50, రూ.200 విలువ గల కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది.
→సెప్టెంబరు 28, 2022: పెద్ద నోట్ల రద్దుపై దాఖ లైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. నోట్ల రద్దును సవాలు చేసే పిటి షన్లను క్రమంగా పరిశీలిస్తుందని తెలిపింది.
→డిసెంబరు 7, 2022: దీనిపై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం ధర్మాసనం.. నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందజేయా లంటూ కేంద్రంతో పాటు ఆర్బీఐని ఆదేశించింది.
→జనవరి 2, 2023: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజార్టీతో సమ ర్థిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఫలించని నోట్ల రద్దు అస్త్రం

2016 తర్వాత పట్టుబడిన నకిలీ కరెన్సీ రూ.245.33 కోట్లు:-
వెల్లడించిన ఎన్సీఆర్బీ నివేదిక:-
→దేశంలో నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతి, ఉగ్ర నిధులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన నోట్ల రద్దు పెద్దగా ఫలి తాన్ని ఇవ్వడంలేదు.
→ఇప్పటికీ నకిలీ నోట్ల బెడద ఏమాత్రం తగ్గలేదని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) పేర్కొంది.
→ఈ మేరకు భారతీయ నకిలీ కరెన్సీ నోట్ల(ఎఫ్ఎఐసీఎన్) చలామణీపై సోమ వారం ఓ నివేదికను విడుదల చేసింది.
→నోట్ల రద్దు దేశంలో నల్లధనం, నకిలి నోట్లు, అవినితి, ఉగ్ర నిధులకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన నోట్ల రద్దు పెద్దగా ఫలి తాన్ని ఇవ్వడంలేదు.
→ ఇప్పటికీ నకిలీ నోట్ల బెడద ఏమాత్రం తగ్గలేదని జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్టీఆర్) పేర్కొంది.
→ ఈ మేరకు భారతీయ నకిలీ కరెన్సీ నోట్ల(ఎఫ్ ఐసీఎన్) చలామణీపై సోమ వారం ఓ నివేదికను విడుదల చేసింది.
→ నోట్ల రద్దు తర్వాత నుంచి 2021 వరకూ దేశవ్యాప్తంగా రూ.245. 33 కోట్ల విలువైన నకిలీ నోట్లను వివిధ దర్యాప్త సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు అందులో పేర్కొంది.
→ గరిష్టంగా 2020లో రూ.92.17 కోట్లు, కనిష్ఠంగా 2016లో రూ.15.92 కోట్ల నకిలీ నోట్లు పట్టుబడినట్లు తెలిపింది.
→ 2017లో రూ. 55.71 కోట్లు, 2018లో రూ. 26.35 కోట్లు, 2019లో రూ. 3479 కోట్లు, 2021లో రూ. 20.39 కోట్ల నకిలీ కరెన్సీని దర్యాప్తు సంస్థలు జప్తు చేసి నట్లు వెల్లడించింది.
→ ఇదిలా ఉండగా 2022 మే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు గుర్తించిన నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 79,669 కాగా, నకిలీ రూ. 2 వేల నోట్లు 13,604, 2020-21తో పోలిస్తే నకిలీ రూ. 500 నోట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరగగా, నకిలీ రూ.2 వేల నోట్లు 54.6 శాతం ఎక్కువయ్యాయి.
→ 2020-21లో గుర్తించిన అన్ని రకాల నకిలీ నోట్ల సంఖ్య 2,08,625 కాగా, మరుసటి ఏడాది అవి 2,30,971కి పెరి గాయి.
→ 2019-20లో వాటి సంఖ్య 2,96,695.

ద.మ. రైల్వే అదనపు జీఎంగా ఉదయకుమార్ రెడ్డి

→ దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే అదనపు జనరల్ మేనేజర్(జీఎం) ఉదయ్కుమార్ రెడ్డి సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో బాధ్య తలు స్వీకరించారు.
→1986 ఐఆర్ఎస్ఎంఈ విభాగానికి చెందిన ఆయన ఇటీవలి వరకు చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా పనిచేశారు.

దేశీయంగా ముఖ్యమైన బ్యాంకులు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్సీ ఆర్బీఐ నివేదిక

→ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ఎఫ్సీ బ్యాంకులు దేశీయంగా వ్యవ స్థాపకంగా ప్రముఖ బ్యాంకులు (డీ-ఎస్ఐబీలు)గా కొనసాగుతున్నాయని ఆర్బీఐ తెలిపింది.
→ఎస్ఐబీ లను సాధారణంగా విఫలం చెందడానికి అవకాశం లేని పెద్ద బ్యాంకులు (టూ బిగ్ టు ఫెయిల్-టీబీ టీఎఫ్) గా పరిగణిస్తుంటారు.
→ఒక వేళ బ్యాంకులు ఒత్తిడిలోకి వెళితే, ప్రభుత్వం మద్దతు అందిస్తుంది.
→అందువల్ల ఈ బ్యాంకులు మార్కెట్లలో కొన్ని ప్రయోజనాలను పొందుతుంటాయి.
→ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లను డీ-ఎస్ఐబీలుగా 2015, 2016లలో ఆర్ బీఐ ప్రకటించింది.
→బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 2017 మార్చి 31న హెచీఎఫ్సీ బ్యాంకును సైతం డీ- ఎస్ఐబీగా వర్గీకరించారు.
→ 2022 మార్చి 31 నాటికి బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధా రంగా తాజా ప్రకటన చేశారు.
→2014 జులైలో డీ- ఎస్ఐబీలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఆయా బ్యాంకుల సిస్టమాటిక్ ఇంపార్టెన్స్ స్కోర్స్ ఆధారంగా 2015 నుంచి డీ-ఎస్ఐబీలను ప్రక టించడం మొదలు పెట్టారు.

ప్రపంచంలో మూడో వంతు మాంద్యంలోకి!

→ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు భాగం ఈ ఏడాది మాంద్యం లోకి జారొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) అధిపతి క్రిస్టాలినా జార్జివా హెచ్చరిస్తున్నారు.
→ అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), చైనాలకు గతేడా దితో పోలిస్తే 2023 మరింత క్లిష్టంగా మారొచ్చని.. ఆయా ఆర్థిక వ్యవస్థలు మందగమనం పాలు కావొచ్చని వార్తా సంస్థ 'సీబీఎస్' నిర్వహించిన కార్యక్ర మంలో పేర్కొన్నారు.
→ ఉక్రెయిన్ప రష్యా యుద్ధం 10 నెలలకు పైగా కొనసాగుతోంది. అది తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం లేదు.
→ అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది.. అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచు తున్నారు. చైనాలో మళ్లీ కొవిడ్ కేసులు భారీగా బయటపడుతున్నాయి.
→ ఈ పరిస్థితుల వల్లే ఈ ఏడాది ప్రపంచంలో మూడో వంతు మాంద్యంలోకి వెళ్లొచ్చు. ప్రస్తుతం మాంద్యంలో లేని దేశాల్లోనూ కోట్ల మంది ప్రజలు మాంద్యం లాంటి భావనను ఎదుర్కోవచ్చు.

2001 తర్వాత అత్యంత తక్కువ వృద్ధి: 2023 ప్రపంచ వృద్ధి అంచనాల్లో

→గతేడాది అక్టోబరులో ఐఎన్ఎఫ్ కోత వేసింది. 2021లో 6 శాతంగా నమో దైన అంతర్జాతీయ వృద్ధి 2022లో 3.2 శాతానికి, 2023లో 2.7 శాతానికి తగ్గుతూ పోవచ్చు.
→అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, తీవ్ర కరోనా పరిణా మాల సమయాన్ని మినహాయిస్తే.. 2001 తర్వాత ఇదే అత్యంత బలహీన వృద్ధి. వచ్చే కొద్ది నెలలూ చైనాకు మరింత సంక్లిష్టంగా మారొచ్చు.
→చైనా వృద్ధి ప్రతికూలంలోకి వెళ్తే, ప్రపంచ వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడు తుంది.
→ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పెరగడంతో, తన 'జీరో కొవిడ్ విధానానికి చైనా స్వస్తి చెప్పి, తన ఆర్థిక వ్యవస్థ తలుపులను బార్లా తెరు చిన విషయం తెలిసిందే.

అల్ నాసర్ క్లబ్ కు రొనాల్డో

→పోర్చుగల్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఐరోపా క్లబ్ల తరఫున ఇక ఆడకపోవచ్చు.
→అతడు సౌదీ అరేబియా క్లబ్ ఆల్ నాసర్ కు ఆడబోతున్నాడు.
→ ఈ విషయాన్ని వెల్లడించిన ఆ క్లబ్.. మంగళవారం రియాద్ లో జరిగిన వేడుకలో రొనాల్డో పరిచయ కార్యక్రమం నిర్వహించింది.
→మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యంతో విభేదాల నేపథ్యంలో ఈ ఐరోపా క్లబ్లో రొనాల్డో బంధాన్ని తెంచుకున్న సంగతి తెలిసిందే.
→ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యధికంగా 211 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1747 కోట్లు) అతను ఆల్ నాసర్తో ఒప్పందం చేసుకున్నాడు.

నెతన్యాహు కుటుంబ స్నేహితురాలికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం

→ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుటుంబానికి స్నేహితురాలైన ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్ పుష్కర్లను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపికచేసింది.
→ ప్రవాసీయులకు ఇచ్చే ఈ అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసినట్లు ప్రక టించారు.
→ ఆర్మీ కుటుంబంలో జన్మించిన రీనా తన భర్త వినోద్ తో కలిసి 1983లోనే ఇజ్రాయెల్కు వచ్చేశారు.
→ అప్పట్లోనే 'తందూరి' అనే రెస్టారెం ట్ను ఏర్పాటు చేసి, ఇక్కడి వారికి భారతీయ రుచులను పరిచయం చేశారు.
→ నెతన్యాహు తన కాబోయే భార్య సారాను మొదటిసారి ఈ రెస్టా రెంట్లో నే కలిశారు. అప్పటి నుంచి రీనాకు, నెత న్యాహు కుటుంబానికి మంచి స్నేహం ఏర్పడింది.
→ 2017లో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన పుడు ఆయనకు ఆహారాన్ని తయారుచేసే ఉన్నత స్థాయి బృందంలో ఒకరిగా రీనాను ఎంపికచేశారు.

108వ భారత సైన్స్ కాంగ్రెస్

→ శాస్త్రవేత్తలు దేశాన్ని స్వయం సమృద్ధం చేయా లని, ప్రజల రోజు వారీ జీవితంలో మార్పులు తేవ సారించాలని దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.
→108వ భారత సైన్స్ కాంగ్రెస్ ను ఆయన దిల్లీ నుంచి వీడియో సమావేశం విధానంలో ప్రారంభించారు.
→శాస్త్రీయ పద్ధతు లను బలోపేతం చేయాలని, క్వాంటమ్ టెక్నా లజీలు, డేటా సైన్స్, కొత్త టీకాల అభివృద్ధి, కొత్త వ్యాధులను గుర్తించడం లాంటి వాటిపై దృష్టి పెట్టడంతో పాటు యువతరాన్ని పరిశోధ నల దిశగా ప్రోత్సహించాలని తెలిపారు.
→అయిదు రోజుల పాటు కొనసాగే భారత సైన్స్ కాంగ్రెస్ను రాష్టసంత్ తుక్ డోజీ మహారాజ్ నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో ప్రధాని ప్రారం భించారు.
→పరిశోధనలు ప్రయోగశాల నుంచి బయటికొచ్చి నేలమీద కనపడాలని, వాటి ప్రభావం అంతర్జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి వచ్చినప్పుడే ఆ ప్రయత్నాలు గొప్ప లక్ష్యాలు సాధించినట్లు అవుతుందని ఈ సంద ర్భంగా ఆయన అన్నారు.
→భారతదేశం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లు, రసాయన శాస్త్రం, కమ్యూనికేషన్లు, సెన్సర్లు, క్రిప్టో గ్రఫీ వైపు వేగంగా వెళ్తేందని, యువ శాస్త్రవే త్తలు, పరిశోధకులు ఈ రంగంలో నైపుణ్యం సాధించి ఎదగాలని మోదీ ఆకాంక్షించారు.

భారత రాజ్యాంగం సజీవ పత్రం

→రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత రాజ్యాంగం సజీవ పత్రమని.. ప్రజల ఆశలు, ఆశయాలను ప్రతిబింబించే శక్తి దానికి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
→ రాజ్యాంగానికి ఇంతవరకు చేసిన 105 సవరణలే అందుకు సాక్ష్యమన్నారు.
→ రాజస్థాన్ రాజధాని జైపు ర్ లో స్మార్ట్ నగరాల పథకం కింద నిర్మించిన రాజ్యాంగ పార్కు (సంవిధాన్ ఉద్యాన్ )ను రాష్ట్రపతి మంగళవారం ప్రారంభించారు.
→ అనంతరం మాట్లా డుతూ.. భావి తరాల అవసరాలకు అనుగుణంగా తగు సవరణలు చేసుకోవడానికి రాజ్యాంగంలోనే వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు.
→ రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పార్కులో రాజ్యాంగ రచన మొదలుకొని అమలు వరకు వివిధ ఘట్టాలను శిల్పాలు, చిత్రాల రూపంలో ఇక్కడ ఏర్పాటుచేశారు.

గిడ్డంగుల నిర్వహణకు ప్రత్యేక డ్రోన్

→ గిడ్డంగుల నిర్వహణ, సైనిక అవసరాలు, శాంతి భద్రతల పరిరక్ష ణకు గువాహటి ఐఐటీ పరిశోధకులు విభిన్నరకాల డ్రోన్లను అభివృద్ధి చేశారు.
→ గాల్లోకి నిట్టనిలువున పైకి లేచే మానవరహిత విమానం 'రావెన్ ' నూ రూపొం దించారు. ఇరుకైన ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేక లోహవిహంగాన్ని తయా రుచేశారు.
→ ఆర్నిథోకాప్టర్ అనే ఈ డ్రోన్ రూపకల్పనకు పక్షుల డిజైన్ స్ఫూర్తిగా తీసుకున్నారు. లక్ష్యంపైకి గురితప్పకుండా కాల్పులు జరిపే డ్రోన్ న్నూ సిద్ధం చేశారు.
→ గోదాముల్లో వస్తువులను భిన్న ప్రదేశాలకు తరలిం చడం వంటి సంక్లిష్ట విధులు ఉంటాయని గువాహటి ఐఐటీ ప్రొఫెసర్ చివు కుల వాసుదేవ శాస్త్రి పేర్కొన్నారు.
→ ఈ కసరత్తులో ఏదైనా వైఫల్యం జరిగితే భారీ ఆర్థిక నష్టాలు తప్పవని చెప్పారు. దీన్ని అధిగమించడానికి తాము రూపొందించిన 'వేర్ హౌస్ డ్రోన్' ఉపయోగపడుతుందని వివరించారు.
→ దీనికి స్వల్ప మార్పులు చేసి పొలాల్లో నీటి ప్రవాహం గురించి అర్ధం చేసుకోవడా నికి, నగరాల్లో సరకు రవాణాకు ఉపయోగించొచ్చన్నారు.
→ భద్రతా దళాల కోసం రూపొందించిన గస్తీ డ్రోన్ 'రీపర్'.. వరదలు, భూకంపాల సమ యంలో విపత్తు నిర్వహణ బృందాలకు తోడ్పాటు అందించగలదని చెప్పారు.

చెన్నుపాటి జగదీశ్కు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం

→ ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది.
→ విదేశాల్లో విభిన్న రంగాల్లో అత్యుత్తుమ ప్రతిభ కనబర్చిన ప్రవాస భారతీయులకు ఇచ్చే ఈ అత్యున్నత మైన ఈ పురస్కారాలను 2023 సంవత్సరానికి గానూ 27 మందికి కేంద్రం ప్రకటించింది.
→ అందులో కృష్ణా జిల్లా వల్లూరుపాలేనికి చెందిన ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ ఒకరు.
→ ఆస్ట్రేలియాలో అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షునిగా ఉన్న జగదీశ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ/విద్యా విభాగంలో ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.
→ ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు మధ్య ప్రదేశ్లోని ఇండోర్ ప్రవాసీ భారతీయ సదస్సును నిర్వహించనున్నారు.
→ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.

హెచీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్ లతో భాగస్వామ్యం

→మైక్రోసాఫ్ట్ హెచ్ఎఫ్సీ బ్యాంక్ భాగ స్వామ్యం కుదుర్చుకుంది.
→మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అప్లికేషన్ పోర్ట్ పోలియో అభివృద్ధి చేయడంతో పాటు, డేటా వ్యవస్థను ఆధుని కీకరించడం, ఎంటర్ప్రైజ్ అంశాలకు భద్రత అందించడం ఇందులో భాగంగా ఉంటాయి.
→యెస్ బ్యాంక్ సైతం మైక్రోసాఫ్ట్ భాగసామ్యం కుదుర్చుకున్నట్లు యెస్ బ్యాంక్ ప్రకటించింది.
→తదుపరి తరం మొబైల్ అప్లికేషన్ను తీసుకువచ్చేందుకు ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని పేర్కొంది.

కాకినాడలో గ్రాన్యూల్స్ ఇండియా ఔషధ పరిశ్రమ

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా లిమి టెడ్, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఔషధ పరిశ్రమ నెలకొల్పనుంది.
మందుల తయారీకి అవసరమైన కేఎస్ఎం (టీ స్టార్టింగ్ మెటీరియల్స్), ఇంటర్మీడియెట్స్ ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్స్), ఫెర్మెంటేషన్ ఉత్పత్తుల కోసమే నూతన ప్లాంటును ఏర్పాటు చేయ నున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది.
దీనిపై వచ్చే అయిదేళ్లలో రూ.2000 కోట్లు పెట్టుబడిగా పెడ తారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా ఔషధ పరిశ్రమను విస్తరిస్తారు.
విద్యుత్తు, హరిత హైడ్రోజన్ కోసం గ్రీన్ తో గ్రూపుతో ఒప్పందం: ఈ ప్లాంటు కోసం గ్రీన్ కి గ్రూపుతో గ్రాన్యూల్స్ ఇండియా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చు కుంది.
దీని ప్రకారం గ్రాన్యూల్స్ ఇండియా పరిశ్రమకు అవసరమైన కర్బన రహిత విద్యుత్తును, హరిత హైడ్రోజ నన్ను గ్రీన్కి గ్రూపు సరఫరా చేస్తుంది.
డీసీడీఏ, పీఏ పారాసెట్మాల్, మెట్రో ఫామిన్, ఇతర ఏపీఐలు, ఇంటర్మీడి యెట్ల తయారీకి హరిత హైడ్రోజన్న గ్రాన్యూల్స్ ఇండియా వినియోగిస్తుంది.
కర్బన రహిత విద్యుత్తును వినియోగించి ఫెర్జెంటేషన్ ఉత్పత్తులు తీసుకువస్తుంది.
ఉద్గారాలు తగ్గించేలా, ఔషధాలను ఉత్పత్తి చేసే క్రమంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని, పర్యావరణా నికి మేలు చేసే విధానాలను అనుసరించాలనేది తమ లక్ష్యమని, అందుకు గ్రీన్కి గ్రూపుతో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్ అన్నారు.
వినూత్న భాగస్వామ్యాన్ని తాము వుదుర్చుకు న్నందున ఉత్పత్తి రంగానికి, పర్యావరణానికి మేలు జరు గుతుందని గ్రీన్ గ్రూపు సీఈఓ, ఎండీ అనిల్ కుమార్ చలమలశెట్టి తెలిపారు.
గ్రాన్యూల్స్ ఇండియా. గ్రీన్కి గ్రూపు మధ్య కుదిరిన ఒప్పందం ఫార్మాస్యూటికల్ పరిశ్ర మకు తలమానికంగా నిలుస్తుందని అన్నారు.
గ్రాన్యూల్స్ ఇండి యాకు మనదేశంతో పాటు అమెరికాలో ఔష దాలు ఉత్పత్తి చేసే యూనిట్లు ఉన్నాయి.
దాదాపు 90 దేశాలడు ఈ సంస్థ మందులు సర ఫరా చేస్తోంది. ముడి ఔషధాలతో పాటు ట్యాబ్లెట్లు విక్రయిస్తోంది. గ్రీస్ గ్రూపునకు 1.5 గావాట్ల సౌర, పవన జల విద్యుదుత్పత్తి సామ ర్థ్యం ఉంది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దీనికి విద్యుత్తు యూనిట్లు ఉన్నాయి. వినూత్నమైన సంస్థ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులను గ్రీనికో గ్రూపు చేపడుతోంది.

మొండి వైరస్ల గుట్టు.. ఇలా రట్టు

నాసికా స్రావాలలో ఉన్న రోగనిరోధక వ్యవస్థను జన్యుక్రమ విశ్లేషణతో పరిశీలిస్తే.. సాధారణ పరీక్షలలో బయటప డని వైరస్ల గుట్టు కూడా బహిర్గతమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ విషయాన్ని ద లాన్సెట్ మైక్రోబ్ జర్నల్లో తాజాగా ప్రచురితమైన పరిశోధన పత్రం వివరించింది. ప్రజారోగ్య వ్యవస్థలు గుర్తించేలోపే ప్రమాదకరమైన కొత్త వైరస్లు వ్యాపిస్తా యన్న విషయం కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో తెలిసింది.
ప్రమాదకరమైన కొత్త వైరస్ ను గుర్తించడమంటే.. పెద్ద గడ్డిమేటులో సూదిని వెతకడం లాంటిదని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఎలెన్ ఫాక్స్ మన్ అన్నారు.
ఇప్పుడు గడ్డిమేటు పరిమాణాన్ని తగ్గించే మార్గాన్ని కనుగొన్నామని తెలిపారు. 10-15 రకాల వైరస్లలను గుర్తించేందుకు నాసికా స్రావాలను పరిశీలిస్తారు.
వీటిలో చాలా పరీక్షలకు నెగెటివ్ ఫలితాలే వస్తాయి. కానీ, నెగెటివ్ వచ్చిన కొంతమందిలో యాంటీ వైరల్ రక్షణ వ్యవస్థ క్రియాశీలకం అయినట్లు ఫాక్స్మన్ బృందం గుర్తించింది.
అంటే, ఏదో వైరస్ ఉందన్నమాట. ఒకే యాంటీవై రల్ ప్రొటీన్ ఉన్న నమూనాలను సమగ్రంగా జన్యుక్రమ విశ్లేషణకు పంపగా అందులో ఇన్ఫ్లుయెంజా సి అనే వైరస్ ఉన్నట్లు గుర్తిం చారు.
దాంతో న్యూయార్క్ పరిసరాల్లో 2020 మార్చి మొదటి రెండు వారాల్లో కొవిడ్ నెగెటివ్ వచ్చిన నమూనాలనూ ఇదే తర హాలో విశ్లేషించారు. ఇలా వందల నమూనాలను పరిశీలించారు.
కొన్నింటిలో మాత్రం యాంటీవైరల్ రక్షణ వ్యవస్థ కనిపించింది. వాటిలో నాలుగు కేసుల్లో కొవిడ్-19 ఉందని, దాన్ని అప్పట్లో గుర్తిం చలేదని గమనించారు.
దాంతో.. మన శరీరం తయారుచేసే యాంటీవైరల్ ప్రొటీన్ ను పరీక్షిస్తే ఇప్పటివరకు తెలియని వైర స్లూ తెలుస్తాయని సూత్రీకరించారు.

భద్రతా మండలికి కొత్త సభ్యులు

→ భద్రతా మండలి అయిదు కొత్త సభ్య దేశాలకు స్వాగతం పలికింది. జపాన్, స్విట్జ ర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు మండ లిలో రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి.
→ భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాలు రెండేళ్ల సభ్యత్వ కాలం డిసెంబరు 31తో ముగిసినందున కొత్త సభ్యులు వాటి స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి.
→ భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్ ్సలకు వీటో అధికారం ఉంది.
→ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోని 193 సభ్య దేశాల నుంచి దఫాలవారీగా 10 దేశాలు రెండేళ్లపాటు తాత్కాలిక సభ్యత్వం పొందు తాయి.
→ ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వీటిని ఎంపిక చేస్తారు. చిన్న దేశాల వాణి కూడా సమితిలో ప్రతిఫలించేలా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అయినా 1946లో భద్రతా మండలి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు 60 దేశాలు సభ్యత్వానికి నోచుకో లేదు.
→ ఈసారి కొత్త సభ్యులైన అయిదు దేశాలు జూన్ లో పోటీ లేకుండా ఆ గౌరవం పొందాయి.
→ వీటిలో జపాన్ 12 సార్లు మండలి తాత్కాలిక సభ్యత్వం పొందగా, ఈక్వెడార్ నాలుగుసార్లు, మాల్టా రెండోసారి పొందాయి.
→ స్విట్జర్లాండ్, మొజాంబిక్ లు సభ్యత్వం పొందడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు శాంతి సేనలను భద్రతా మండలి పంపుతుంది.
→ కట్టు తప్పిన దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. ఉగ్రవాదం, ఆయుధ నియంత్రణపై కూడా గళమెత్తుతుంది. కొత్తగా ఎదురయ్యే సమస్యలనూ సభ్య దేశాలు మండలిలో ప్రస్తావిస్తాయి.

ఆకాశవాణి, దూరదర్శన్ విస్తరణకు రూ.2,539 కోట్లు

→ప్రభుత్వరంగ ప్రసార మాధ్యమాలైన ఆకాశవాణి, విస్తరణకు 2025-26 కల్లా రూ.2,549.61 కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ నిర్ణయించింది.
→మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు 8 లక్షల డీడీ డీటీహెచ్ టాప్ బాక్స్లను ఉచిత పంపిణీ చేయ డానికి ఆమోదముద్ర వేసింది.
→ఇందువల్ల సుదూ రంగా, గిరిజన ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు దూర దర్శన్ ప్రసారాలు విస్తరిస్తాయి.
→ప్రస్తుతం దూరద ర్మన్ 36 టీవీ ఛానళ్లను, ఆల్ ఇండియా రేడియో 500కి పైగా ప్రసార కేంద్రాలను నిర్వహిస్తున్నాయి.
→తాజా నిధులతో దేశంలోని 66% భూభాగం, 80% |జనాభాకు ఎఫ్ఎం కేంద్రాల సేవలు అందేలా ట్రాన్స్ మీటర్లు అమరుస్తారు.
→పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం 125 గిగావాట్ల మేర పెరుగుతుంది. ఫలితంగా ఏడాదికి 50 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
→2030 కల్లా ఈ రంగంలోకి మొత్తం రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల నూతన ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు.

హరిత హైడ్రోజన్ కు రూ.19,744 కోట్లు

→ దేశంలో హరిత హైడ్రోజన్ తయారీకి రూ.19,744 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది.
→ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం 'నేష నల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదముద్ర వేసింది..
→ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ ఖరారు చేస్తుంది.
→ వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడటానికి ఈ పథకం ఉప యోగ పడుతుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

ఇవీ లక్ష్యాలు:-
→ 2030 కల్లా, ఏడాదికి 50 లక్షల మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం
→ దీనిని దేశీయ వినియోగంతో పాటు ఎగుమతి చేయాలన్నదీ ప్రణాళిక.
→ ఇందుకోసం 60-100 గిగావాట్ల ఎల క్రోలైజర్ సామర్థ్యాన్ని అభివృద్ధిచేస్తారు. తక్కువ ఖర్చుతో హరిత హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తారు.
→ ఈ పథకం కింద తొలుత ఎలక్ట్రోలైజర్ తయారీ దారులకు 5 ఏళ్ళ వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు.
→ తర్వాత హరిత హైడ్రోజన్ ఉత్పత్తి దారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు.ఈ మొత్తం కలిపి 17,490 కోట్లు
→ హరిత హైడ్రోజన్ కేంద్రాల అభివృద్ధికి రూ.400 కోట్లు ఖర్చు చేస్తారు. పీఎంగతిశక్తి ప్లాట్ఫామ్ ద్వారా వీటిల్లో మౌలికవసతులు అభివృద్ధి చేస్తారు..
→ రిఫైనరీలు, ఉక్కు, షిప్పింగ్ లాంటి రంగాల్లో హరిత హైడ్రోజన్ వినియోగం కోసం ప్రయోగాత్మక ప్రాజెక్టు అమలుకు రూ.1,466 కోట్లు కేటాయిస్తారు.
→ ఈ మిషన్ ను సరైన దిశలో నడపడానికి సంబంధిత నిపుణులతో సాధికార బృందాన్ని ఏర్పాటు చేసి, సహకరిం చేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని నియమిస్తారు.
→ ఈ మిషన్ ను నడిపించడానికి పునరుత్పాదక ఇంధనశా ఖలో మిషన్ సెక్రెటేరియట్ ఏర్పాటుచేస్తారు. దాని డైరె క్టరుగా అత్యంత నైపుణ్యం గల వ్యక్తిని నియమిస్తారు.
→ దీనివల్ల 2030 కల్లా ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుంది.


2047 నాటికి దేశ జీడిపి 20 ట్రిలియన్ డాలర్లు

→ 2047 నాటికి భారత దేశ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) 20 ట్రిలియన్ డాల ర్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవాయ్ అన్నారు.
→ తలసరి ఆదాయం పదివేల డాలర్లకు చేరుతుందని, దీని వల్ల భారత్ సమాజ స్వభావం పూర్తిగా మారిపోతుందని ఆయన పేర్కొన్నారు.
→ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ (టీఐఈఎస్) 57వ వార్షిక సదస్సు నిర్వహిం చారు.
→ ఈ సదస్సుకు వివేక్ దేవాయ్ ఆన్లైన్లో హాజరై మాట్లాడారు... 2023-24లో వృద్ధి రేటు ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారన్నారు.
→ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఐరోపా, అమెరికాలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఫోరెక్స్ మార్కెట్లు, క్యాపిటల్ మార్కెట్ల అంశాల్లో భారత్ కొంత అస్థిరత ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
→ సరళతరమైన జీఎస్, డైరెక్ట్ ట్యాక్స్ విధానం భారత్కు అవసర మని, దీనిపై మరింతగా పరిశోధనలు జరగాలన్నారు.
→ భారత్ వృద్ధి రేటును 7 నుంచి 8 శాతానికి పెంచా లంటే రాష్ట్ర స్థాయిలో పరిశోధనలు జరగాలన్నారు.
→ టీఐఈఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. రామచంద్రన్, హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. జె. రావు తదితరులు పాల్గొన్నారు.


ఇస్రో- మైక్రోసాఫ్ట్ ఒప్పందం

→ అంతరిక్ష రంగంలో సాంకేతిక అంకురాలను ప్రోత్సహిస్తూ.. వాటి ప్రగతిని పర్యవేక్షించేందుకు భారతీయ అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో), ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదు ర్చుకున్నాయి.
→ ఈ సంస్థలు ఓ ప్రకటనలో సంయుక్తంగా వెల్ల డించిన వివరాల ప్రకారం.. దేశ అంతరిక్ష రంగంలో ప్రవేశించే ఔత్సాహి కులు ఆవిష్కరించే సాంకేతిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సదు పాయం కల్పించేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుంది.
→ ఇస్రో గుర్తిం చిన అంకురాలను మైక్రోసాఫ్ట్ ఫర్ ఫౌండర్స్ హబ్ ద్వారా ప్రోత్సహిస్తారు. అంకురాల ఆలోచనలకు మెంటరింగ్ సదుపాయాన్ని కల్పిస్తారు.
→ ఈ సంద ర్భంగా ఇస్రో అధ్యక్షుడు ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ ఒప్పందం ద్వారా ఉపగ్రహాల డేటా, ఆప్లికేషన్లు, కృత్రిమ మేధస్సు, మెషీన్, డీప్ లెర్నింగ్ సాంకేతికతల వినియోగం సులభమవుతుందని పేర్కొన్నారు.

సముద్రంలో 500 మీటర్ల లోతుకు ముగ్గురు ఆక్వానాట్లను పంపేందుకు భారత్ ఏర్పాట్లు

→ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజె క్టులో భాగంగా ఈ ఏడాది ముగ్గురు ఆక్వానా ట్లను సముద్రంలో 500 మీటర్ల లోతుకు భారత్ పంపనుంది.
→ ఇందుకోసం చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇంజినీర్లు ఓ స్టీల్ గోళాన్ని రూపొందించారు.
→మహారాష్ట్రలోని నాగుర్లో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన ఓ అధికారి 'పీటీఐ' వార్తాసంస్థతో ఈ మేరకు వివరాలు పంచుకున్నారు.
→సముద్రగర్భంలో 6 వేల మీటర్ల లోతుకు మనుషుల్ని పంపాలన్న లక్ష్యాన్ని అందు కోవడం ఆలస్యం కానుందని చెప్పారు.
→స్టీల్ చేసిన గోళం 500 మీటర్ల లోతుకు మించి వెళితే ఒత్తిడికి కుంచించుకుపోతుందని పేర్కొన్నారు.
→6 వేల మీటర్ల లోతుకు మనుషుల్ని పంపేందుకు టైటానియం లోహంతో తయారుచేసిన నౌకను వినియోగించాల్సి ఉంటుందని వివరించారు.
→ఉక్రె యిన్ యుద్ధం నేపథ్యంలో టైటానియం సమీక రణ కష్టంగా మారిందని తెలిపారు.

90 సెకన్లలో భూసార పరీక్ష

→ కేవలం 90 సెకన్లలో భూసార పరీక్ష ఫలి తాన్ని వెల్లడించగల ఓ సరళమైన పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ కెమి కల్ ఇంజినీరింగ్ విభా గానికి చెందిన ప్రొఫె సర్ జయంత్సింగ్ అభివృద్ధి చేశారు.
→ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను ఆగ్రినెస్ట్ అనే సంస్థకు బదిలీ చేయడంతో.. ప్రస్తుతం అది 'భూపరీక్షక్ పేరుతో సంబంధిత పరికరాన్ని విపణిలోకి తీసుకొస్తోందని జయంత్సింగ్ పేర్కొన్నారు.
→ 'భూపరీక్షక్' విలువ దాదాపు రూ.80 వేలు. ఆది మొబైల్ ఆధారిత యాప్ తో నడుస్తుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మొబైల్లో భూపరీక్షక్ యాప్ డౌన్లోడ్ చేసు కున్న అనంతరం ఈ పరికరం దాంతో బ్లూటూత్ ద్వారా అనుసంధానమవుతుంది.
→ఈ పరికరం అడుగుభాగాన ఉన్న కప్పులో 2 గ్రాముల పొడిమట్టిని వేస్తే 90 సెకన్లలో దాన్ని విశ్లేషించి.. విశ్లేషించి.. భూసారంతోపాటు అందులోని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఆర్గానిక్ కార్బన్ శాతాలను తెలియజేస్తుంది.
→ఏ ఎరువు లను వినియోగించాలో కూడా సూచిస్తుంది. ఆ వివరాలన్నీ మొబైల్ స్క్రీన్పై కనిపిస్తాయి. ఒక్కో పరికరంతో లక్షకుపైగా పరీక్షలు నిర్వహిం చవచ్చని ప్రొఫెసర్ జయంత్సింగ్ చెప్పారు.

ఎన్ఎల్సీ ఇండియా సీఎండీగా ప్రసన్నకుమార్ మోటుపల్లి

→ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్) చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగువారైన ప్రసన్నకుమార్ మోటుపల్లి నియమితులయ్యారు.
→ ఈ పదవికి ప్రస న్నకుమార్ను కేంద్ర ప్రభుత్వ నియామ కాల మంత్రివర్గ సంఘం ఎంపిక చేసింది.
→ ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్ బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజి నీరింగ్ చదివారు. 1988లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
→ ఆ సంస్థలోనే ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరే షన్ లిమిటెడు మేనేజింగ్ డైరెక్టర్ డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు.
→ తాజాగా ఆయనను ఎన్ఎల్సి ఇండియా సీఎండీ పదవి వరించింది. 2026 జూన్ 30న పదవీ విరమణ చేసే వరకు లేదా తదుపరి ఉత్త ర్వుల వరకు ఈ హోదాలో ఆయన కొనసాగుతారు.

అనాహత్ సింగ్ కు మరో టైటిల్ ( బ్రిటిష్ జూనియర్ ఓపెన్)

→ భారత టీనేజీ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ మరో అంతర్జా తీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది.
→ ప్రతిష్టాత్మక బ్రిటిష్ జూనియర్ ఓపెన్ బాలికల అండర్-15 విభాగంలో ఆమె ఛాంపియన్ గా నిలిచింది.
→ 14 ఏళ్ల అనాహత్ ఫైనల్లో 3-1 తేడాతో సొహైల (ఈజిప్టు) పై గెలిచింది. ప్రతి ఏడాది జనవరిలో జరిగే ఈ టోర్నీని కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత తిరిగి నిర్వహించారు. ఈ టోర్నీలో అనాహత్కు ఇది మూడో ఫైనల్.
→ 2019లో అండర్-11 టైటిల్ నెగ్గిన ఆమె.. తర్వాతి ఏడాది అండర్-13 విభాగంలో రన్నరప్ గా నిలిచింది.

యునైటెడ్ కప్ అమెరికా సొంతం

→ తొట్టతొలి యునైటెడ్ కప్ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్లో అమెరికా విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్లో అమెరికా 4-0తో ఇటలీని ఓడించింది.
→ మొదట మహిళల సింగిల్స్లో పెగులా 6-4 6-3తో ట్రెవిసాన్పై నెగ్గగా.. ఆ తర్వాత పురుషుల సింగిల్స్ లో టియాఫో 6-2తో ఆధిక్యంలో ఉన్న సమ యంలో అతడి ప్రత్యర్థి మునెటి గాయంతో తప్పుకున్నాడు.
→ మరో పురుషుల సింగిల్స్ ఫ్రిట్జ్ 7-6 (6-4), 7-6 (8-6)తో బెరిటినిపై గెలవడంతో అమెరికా 3-0తో తిరుగులేని ఆధి క్యంలో నిలిచింది. రెండో మహిళల సింగిల్స్ మాడిసన్ కీస్ 6-3, 6-2తో బ్రొంజెటిపై గెలిచి అమెరికా విజయాన్ని సంపూర్ణం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సదస్సు

→ వైద్యరం గంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, సేవల విష యంలో ఆపీ (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషి యన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్), రాష్ట్ర ప్రభుత్వం పర స్పర అవగాహనతో కలిసి పని చేయాలని వైద్య, ఆరో గ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు పేర్కొ న్నారు.
→ ఈ మేరకు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస వైద్య నిపుణులు ముందుకు రావాలని కోరారు. అవ సరమైతే అతిథి అధ్యాపకులుగా రాష్ట్రంలో సేవలందిం హెచ్, జీజీహెచ్ (గుంటూరు), కర్నూలు వైద్య కళాశాలల్లో సదుపాయాలు మెరుగుప ర్చేందుకు పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకురావడం అభినందనీయ మని పేర్కొన్నారు.
→ మూడు రోజులుగా విశాఖలో ఆఫీ ఆధ్వర్యంలో జరుగుతున్న 16వ ప్రపంచ ఆరోగ్య చలసాని ప్రసాద్కు అవార్డును అందజేస్తున్న రవిరాజు, కృష్ణబాబు, అధికంగా వస్తున్న శ్రీకాకుళం కుమార్ తదితరులు నవీన్ సదస్సు (జీహెచ్ఎస్) ఆదివారం మధ్యాహ్నం ముగి సింది.
→సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కృష్ణ బాబు మాట్లాడుతూ.. సదస్సులో వైద్య నిపుణుల సూచనలు, సలహాలను అమలు చేస్తాం. రాష్ట్రంలో నాన్ కమ్యూనబుల్ వ్యాధులపై సర్వేలు చేస్తున్నాం.
→30ఏళ్ల పైబడిన వారిలో అధిక శాతం బీపీ, మధుమేహంతో బాధ పడుతున్నట్లు వెల్లడైంది. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోగుల వివరాలను డిజిటలైజ్ చేస్తున్నాం. క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలందించేందుకు 7 చోట్ల ఆధునిక కేర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. తొలిదశలో విశాఖ, తిరుపతి, కర్నూలు ఆసుపత్రుల్లో ఇవి రాబోతున్నాయి. కిడ్నీ కేసులు జిల్లా ఉద్దానం, ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పరిశోధన కేంద్రాలతో కూడిన ఆసుపత్రులు రానున్నాయి. ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నా మహిళల్లో రక్తహీనత మాత్రం తగ్గడం లేదు' అని పేర్కొన్నారు.
→ఈ సంద ర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు చలసాని ప్రసాద్కు టి. రవిరాజు ఎక్స్ లెన్స్ అవార్డును అందజేశారు. ఆపీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు టి. రవిరాజు, అఫీ అధ్యక్షుడు కొల్లి రవి, డ్రగ్ కంట్రోలర్ శంకర్నారాయణ, ఆరోగ్యశాఖ కార్యదర్శి నవీను మార్, ఏఎంసీ ప్రిన్సిపల్ జి. బుచ్చిరాజు, సదస్సు నిర్వాహకులు టి. రాధ, విజయశేఖర్, నవీన్ తదిత రులు పాల్గొన్నారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు ఎండీ, సీఈఓగా సురిందర్ చావ్లా

→ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మేనే జింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సురిందర్ చావ్లాను నియ మించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది.
→ అయితే కొత్త వినియోగదార్లను చేర్చుకునే విషయంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆంక్షలను మాత్రం కొనసాగించింది.
→ సురిందర్ చావ్లా మూడేళ్ల పాటు ఎండీ, సీఈఓ బాధ్యతలను నిర్వహించనున్నారు. చావ్లా అంతకుముందు.. ఆర్బీఎల్ బ్యాంక్లో బ్రాంచ్ బ్యాంకింగ్ విభాగా నికి హెడ్గా బాధ్యతలు నిర్వహించారు.

ఉగ్రవాదుల సొరంగ మార్గాల గుర్తింపునకు రాడార్లతో కూడిన డ్రోన్లు

→ పాకిస్థాన్ సరిహద్దు వెంబడి జమ్మూలో ఉగ్రవాదులు భారత్లోకి చొచ్చుకు వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్న భూగర్భ సొరంగాలను గుర్తిం చేందుకు ప్రత్యేక డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వినియోగి స్తోంది. → రాడార్లతో కూడిన ఈ డ్రోన్లను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ రాడార్లు శక్తిమంతమైన రేడియో తరంగాలను భూగ ర్భంలోకి పంపి టన్నెళ్లను గుర్తిస్తాయి. →జమ్మూ ప్రాంతంలో గత మూడేళ్లలో మూడు సొరంగ మార్గాలను బీఎస్ఎఫ్ గుర్తించింది. వాటిని మాదక ద్రవ్యాల రవాణాకూ వినియోగిస్తున్నారు.

డీఎండీ వ్యాధికి పరిశోధనలు ముమ్మరం చేసిన భారత పరిశోధకులు

→అరుదైన, వైద్యానికి లొంగని జన్యురుగ్మత అయిన డుషెన్ మస్క్యులర్ డిస్ట్రోపీ (డీఎండీ)కి చౌకలో చికిత్స అభివృద్ధి చేయడానికి భారత శాస్త్రవే త్తలు కసరత్తు చేపట్టారు.
→ ఈ దిశగా కొంత పురోగతి సాధించారు. డిస్ట్రోఫిన్ అనే ప్రొటీన్లో లో మార్పు కార ణంగా డీఎండీ ఉత్పన్నమవుతుంటుంది.
→ఇది ఎక్కు వగా మగపిల్లల్లో కనిపిస్తుంటుంది. అరుదుగా అమ్మా యిల్లో ప్రభావం చూపుతుంటుంది. భారత్లో ఈ తరహా కేసులు 5 లక్షలకు పైగా ఉన్నాయి.
→ ప్రస్తుతం ఈ రుగ్మతకు గట్టి వైద్యం అందుబాటులో లేదు. ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.2-3 కోట్ల విలువైన మందులు వాడాల్సి ఉంటుంది.
→ఆ ఔషధాలను చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందువల్ల ఎక్కువమందికి అందుబాటులో ఉండటం లేదు.
→ ఈ నేపథ్యంలో జోధ్పూర్ లోని ఐఐటీ శాస్త్రవే త్తలు.. బెంగళూరులోని డిస్ట్రోఫీ ఎనైలేషన్ రీసెర్చ్ ట్రస్ట్ (డార్ట్), జోధ్పూర్ లోని ఎయిమ్స్ తో కలిసి ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాధికి చౌకలో మందులు అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
→ప్రతి 3500 మంది అబ్బాయిల్లో ఒకరికి డీఎండీ సమస్య తలెత్తుతుంటుంది. దీనివల్ల క్రమంగా కండర క్షీణించిపోతుంది. 12 ఏళ్ల వయసు వచ్చేస రికి బాధితులు చక్రాల కుర్చీకి పరిమితం కావాల్సి వస్తుంది. 20 ఏళ్ల వయసు కల్లా వెంటిలేటర్ ఆమ ర్చక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. ఆ తర్వాత మరణం చోటుచేసుకుంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదు. అయితే దీని పురోగతిని నెమ్మదింపచేసి, బాధితుల ఆయుష్షు పెంచే చికిత్సలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత శాస్త్రవేత్తలు యాంటిసెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్ (ఏవోఎన్) ఆధారిత వైద్యం సమర్ధ తను పెంచే విధానాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో డీఎన్ఏ లేదా ఆర్ఎస్ఏలోని ఎక్సాన్స్ అనే నిర్దిష్ట భాగాన్ని 'దాచాల్సి ఉంటుంది. మరోపక్క ఉట్రోఫిన్ మాడ్యులేటర్ అనే చికిత్స విధానంలో గణ నీయ పురోగతి సాధించారు.

లంకకు 75 బస్సులు అందజేసిన భారత్

→ఆర్థిక సంక్షోభంతో కునారిల్లుతున్న శ్రీలంకకు భారత్ మరోసారి ఆపన్న హస్తం అందించింది. ఇక్కడి ప్రజా రవాణా వ్యవస్థ మెరుగు పడేందుకు వీలుగా 75 బస్సులను ఆదివారం అందజేసింది.
→ మొత్తం 500 బస్సులను కేటాయించిన నేపథ్యంలో మిగిలిన 425 బస్సులను ఈ సంవత్సరాం తానికి ఇవ్వనున్నామని ఇక్కడి భారత హైకమిషనర్ కార్యాలయం పేర్కొంది.

తెలంగాణలో మరో విడత రైతుబంధు జమ

→ తెలంగాణలో రైతుబంధు పథకం కింద 1,87,847 మంది రైతులకు చెందిన 8,53,409.25 ఎకరాలకు వారి ఖాతాల్లో రూ.426. 69 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
→ వీరంతా నాలుగు నుంచి అయిదెకరాలలోపు భూమి ఉన్నవారు. మరింతమంది అయిదెకరాల లోపు ఉన్న రైతులకు సొమ్ములు జమ చేస్తామని వివరించారు.
→ ఇప్పటివ రకూ మొత్తం 56,58,484 మంది రైతుల ఖాతాల్లో రూ.4754. 64 కోట్లు వేసినట్లు వివరించారు.
→ పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామ న్నారు. కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
→ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 100 శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు.

108వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు

→108వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశా లను 2023, జనవరి 3 నుంచి 7 వరకు అయిదు రోజులపాటు నాగ్ పుర్ లోని రాష్ట్రం సంత్ తుక్ జీ మహరాజ్ నాగప్పర విశ్వ విద్యాలయంలో నిర్వహించారు.
→ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాలను ప్రారం భించి, ప్రసంగించారు.
→క్వాంటం టెక్నాలజీ, డేటా సైన్స్ తో పాటు కొత్త వ్యాక్సిన్ల అభివృ ద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ ఈ సందర్భంగా పరిశోధకులకు సూచించారు.
→'మహిళా సాధికారతతో సుస్థిరాభివృద్ధికి శాస్త్ర సాంకేతికతలు' (సైన్స్ అండ్ టెక్నా లజీ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్) అనే థీమ్ 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వ హించారు.
→ఈ సమావేశాల్లో వ్యవసాయం, అడవులు, ఇంజినీరింగ్, ఆవిష్కరణలు లాంటి పద్నాలుగు అంశాలపై శాస్త్రవేత్తలు చర్చించారు.
→నాగ్ పుర్ లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించడం ఇది అయిదోసారి.

పెద్దనోట్ల రద్దుపై సుప్రీం తీర్పు

→ రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ర్థించింది. అయిదుగురు న్యాయమూర్తు లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమమెజార్టీతో జనవరి 2 తీర్పు ఇచ్చింది.
→ నోట్ల రద్దును సవాలు న్లను సుప్రీంకోర్టు కొట్టేసి,చేస్తూ దాఖలైన 58 పిటీషన్ 382 పేజీల తీర్పు ఇచ్చింది.
→ జస్టిస్ ఎస్.ఎ. నజీర్, జస్టిస్ బి. ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ రామ సుబ్రమణియన్ నోట్ల రద్దును సమర్థించారు.
→ మెజార్టీ విభేదించిన జస్టిస్ బి. వి. నాగరత్న నోట్ల రద్దు నిర్ణయం చట్ట విరుద్ధ మని పేర్కొన్నారు.

భారత్లో పెరిగిన నిరుద్యోగ రేటు

→2022 డిసెంబరులో భారత్ లో నిరుద్యోగ రేటు 8.3 శాతానికి చేరినట్లు సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) తన నివేదికలో వెల్లడించింది.
→ గత 16 నెలల్లో ఇదే అత్యధిక నిరుద్యోగ రేటు
→ పట్టణాల్లో నిరుద్యోగ రేటు 10.99 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.44 శాతంగా నమోదైంది.
→ నిరుద్యోగం రేటు అత్యధికంగా హరియా ణాలో 37.4 శాతంగా ఉంది.

బ్రెజిల్ లో భగ్గుమన్న అల్లర్లు

→బ్రెజిల్ మాజీ అధ్య క్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశంలో అరాచకం సృష్టించారు.
→ఏకంగా రాజధాని బ్రసీలియా దేశ అధికార కేంద్రాలుగా భావించే నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవ నాలను ముట్టడించారు.
→ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని వారు నిరాకరిస్తున్నారు. దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా వారం రోజుల క్రితమే అధికారం చేప ట్టిన విషయం తెలిసిందే.
→దీనికి నిరసనగా అది వారం వేలమంది బోల్సొనారో మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని కీలక భవ నాల్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో భవ నాల్లో ఎవరూ లేరు. కొందరు ఆందోళనకా రులు అక్కడ కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. సైన్యం జోక్యం చేసుకుని బోల్సొనారోకు అధికారం కట్టబెట్టాలని లేదా లూలాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు వేల మందికిపైగా అల్లరి మూకలు వీటిల్లో పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. వారిని చెదరగొట్టడానికి సుప్రీం కోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్ల నుంచి టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. అల్లర్లను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులు. పోలీసులపైనా దుండగులు దాడులకు దిగారు. కొన్ని గంటల అనంతరం పోలీసులు 12 వందల మంది నిర సనకారులను అరెస్టుచేసి మూడు భవనాలను తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
→బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని నేషనల్ కాంగ్రెస్ భవనం పద్ద ఆందోళన చేస్తున్న జైర్ బోల్సొనారో మద్దతుదారులు కోర్టులు వ్యతిరేకంగా పనిచేశాయి.
→ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సెనారోకు 49. 1 శాతం వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీక రించడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు.
→దేశం లోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతి రేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.

'డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు' పథకం

→పొదలకూరు, న్యూస్ టుడే: విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తూ దేశంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
→శ్రీపొట్టి శ్రీరా ములు నెల్లూరు జిల్లా పొదలకూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 'డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు' పథ కాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
→కోల్గేట్ పామోలివ్ సంస్థతో కలిసి 'బ్రైట్ స్మైల్.. బ్రైట్ ఫ్యూచర్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
→ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లల్లో 43 శాతం మంది పుచ్చు పళ్లతో ఉన్నారని, వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.
→రాష్ట్రంలోని 2,600 ప్రభుత్వ పాఠశాలల్లో నోటి ఆరోగ్యంపై పరీక్షలు నిర్వహిస్తామని, విజయవాడ, కడప, విశాఖపట్నంలలో కేంద్రాలను ఏర్పాటు చేసి.. మొబైల్ దంత వాహనాల ద్వారా చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి సతీష్ రెడ్డి, సీఎస్ఆర్ ప్రత్యేక అధికారి పూనమ్ శర్మ, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతినిధులు, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్కు డ్వేన్ ప్రిటోరియస్ వీడ్కోలు

→దక్షిణా ఫ్రికా ఆల్రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలి కాడు.
→ టీ20ల మీద దృష్టి పెట్టే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు.
→ 2016లో ఆరంగేట్రం చేసిన 33 ఏళ్ల ప్రిటోరియస్ దక్షిణాఫ్రికాకు 30 టీ20లు, 27 వన్డేలు, 3 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 7, వన్డే, టీ20ల్లో 35 చొప్పున వికెట్లు పడగొట్టాడు.
→ 2021 టీ20 ప్రపంచకప్లో 9 వికెట్లు తీసిన ఈ పేసర్.. 160 పైన స్ట్రెక్తోట్తో 261 పరుగులు సాధించాడు.
→ టీ20ల్లో దక్షిణాఫ్రికా తరపున ఉత్తమ బౌలింగ్ గణాంకాలు (5/17) ప్రిటోరియస్ పేరిటే ఉన్నాయి.
→ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగుల్లో మాత్రం డ్వేన్ కొనసాగనున్నాడు.
→ ఐపీ ఎల్లో చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ద హండ్రెడ్ (వెల్ష్ ఫైర్), సీపీఎల్ (సెయింట్ కీట్స్), టీ20 (డర్బన్ సూపర్ జెయింట్స్) టోర్నీల్లోనూ ఆడుతున్నాడు.

'నాడు-నేడు'కు లారస్ ల్యాబ్స్ రూ.4కోట్ల విరాళం

→ప్రభుత్వం అమలు చేస్తున్న 'నాడు- నేడు' పథకానికి లారస్ ల్యాబ్స్ సంస్థ రూ.4 కోట్ల విరాళమిచ్చింది.
→లారస్ వ్యవస్థాపకుడు, సీఈఓ చావా సత్యనారాయణ సోమవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డిని కలిసి రూ.4 కోట్ల విరాళం అందించారు.
→అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో వార్డు నిర్మాణానికి రూ.5 కోట్లు అందిస్తామని చెప్పారు.
→రాష్ట్రంలో విద్యా రంగంలో మౌలిక సౌకర్యాలను పెంపొందించేందుకు 'నాడు- నేడు' కార్యక్రమా నికి ఇప్పటికే రెండు దఫాలుగా విరాళం అందించామని సంస్థ ప్రతినిధులు తెలి పారు.
→కార్యక్రమంలో సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ కృష్ణచైతన్య, సీనియర్ వైఎస్ ప్రెసి డెంట్ నరసింహారావు, సీఎస్ఆర్ హెడ్ సౌమ్య పాల్గొన్నారు.

ఎల్బీనగర్లో దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రి

→ రాజధానిలోని ఎల్బీనగర్లో నిర్మిస్తున్న టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దేశం లోనే ఎత్తయిన ప్రభుత్వ ఆసుపత్రిగా నిల వనుంది.
→ 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ఆసుప త్రిని 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తుల్లో నిర్మించనున్నారని తెలిసింది.
→ దేశంలో ప్రైవే టులోనూ ఇంత ఎత్తయిన ఆసుపత్రి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
→ రూ.668 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి టెండరును ఇటీవల ఎల్ అండ్ టీ దక్కించుకున్న విషయం విదితమే.
→ టిమ్స్ పేరుతో ఎల్బీనగర్ తో పాటు ఆల్వాల్, సనత్నగర్లో ఒక్కోటి వేయి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇది కాటన్ సంచుల ఏటీఎం

→ఇప్పటికే వరుసగా ఆరుసార్లు స్వచ్ఛనగరంగా నిలిచి సత్తా చాటిన మధ్యప్రదేశ్లోని ఇందౌర్.. ఇప్పుడు ప్లాస్టిక్ రహిత నగరంగా రికార్డుల్లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది.
→అందుకోసం అధి కారులు వినూత్నంగా ఆలోచించి పర్యావరణ హితమైన కాటన్ బ్యాగులు అందించే ఏటీఎం లను ఏర్పాటు చేశారు.
→ఇందౌర్ పాలిథిన్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. నగ రంలోని మార్కెట్లలో పాలిథిన్ కవర్లు వాడితే జరిమానా విధిస్తున్నారు.
→వాటి స్థానంలో పర్యావరణహి కాటన్ బ్యాగులు వాడా లని సూచిస్తున్నారు.
→అయిదు ప్రధాన కూడ ళ్లలో కాటన్ బ్యాగ్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. పది రూపాయల నోటు లేదా నాణేన్ని యంత్రంలో ఉంచితే, కొన్ని సెకన్లలో కాటన్ బ్యాగ్ బయటకు వస్తుంది.
→దీనికి యూపీఐ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

17వ ప్రవాస భారతీయ దివస్

→ స్వతంత్ర భారత దేశం వందేళ్ల ప్రస్థానానికి చేరుకునే క్రమంలో ఆరంభించిన (వచ్చే 25 ఏళ్ల) అమృత కాల యాత్రలో ప్రవాస భారతీయులు అత్యంత కీలకమైన పాత్రను నిర్వ హించనున్నారని ప్రధాని మోదీ తెలిపారు.
→ విదేశీ నేలపై వీరు మన ప్రచార దూతలని అభివర్ణిం చారు. మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ నగరంలో సోమ వారం 17వ ప్రవాస భారతీయ దివస్ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
→సురినామ్ రిపబ్లిక్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతో ప్రత్యేక అతిథిగా, గయానా అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ముఖ్యఅతిధిగా హాజర య్యారు. 'భారతీయ విశిష్టతలైన యోగ, ఆయు ర్వేదం, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, తృణధా న్యాలకు మీరే (ప్రవాస భారతీయులే) ప్రచార దూతలు.
→ మీ కృషి వైవిధ్యమైనది. మన దేశం. అమృత కాలంలోకి ప్రవేశించిన వేళ ఈ ప్రయా ణంలో మీ పాత్ర అద్వితీయమైనది.
→ భారత విశిష్ట విశ్వ దార్శనికతను ప్రపంచ సుస్థిరతలో మన దేశ పాత్రను బలోపేతం చేయగలిగేది మీరే'నని ప్రధాని మోదీ తెలిపారు.
→ 'సమర్ధత, నైపుణ్యం, నిజాయతీ కలిగిన భారత్ అత్యధిక సంఖ్యలో కలిగి ఉంది.
→ తమ ఘనత గురించి భావితరం ప్రవాస ఆసక్తితో ఉంటార ని పేర్కొన్నారు.
→ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లి స్థిరపడినప్పటికీ భారత సంతతి ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని ప్రశంసించారు.
→ అక్కడ వారు సాధించిన విజయాలను, పొందిన అనుభవాలను, జ్ఞాపకాలను సచిత్ర, శబ్ద, లిఖిత రూపంలో నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
→ జీ-20కి అధ్యక్షత వహించే అవకాశం దక్కడం, కరోనా వైరస్కు టీకాలను దేశీయంగా అభివృద్ధిపరిచి ఉత్పత్తిచేయడం, 220 కోట్ల టీకా డోసుల ఉచిత పంపిణీ తదితర విజ యాలతో పాటు ప్రాచీన భారత ఘనతలను మోదీ గుర్తు చేశారు.
→ ఇందౌర్ నగర విశేషాల గురించి కవితాత్మకంగా వర్ణించారు.

అమెరికాలో జడ్జిగా సిక్కు మహిళ

→ భారత సంతతి మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ అమెరికాలోని హారిస్ కౌంటీ జడ్జిగా నియమితులయ్యారు.
→ఓ సిక్కు మహిళ అగ్రరాజ్యంలో జడ్జి కావడం ఇదే తొలిసారి. శుక్ర వారం న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తూ.. "నేను హారిస్ నగరానికి ప్రాతినిధ్యం వహించబో తున్నాను. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది' అన్నారు.
→ ప్రమాణస్వీకారానికి నేతృత్వం వహిం గమనార్హం. భారతీయ-అమెరికన్ న్యాయమూర్తి రవి సంధిల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
→ మోనిక తండ్రి 1970లలో అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్ లో జన్మించిన మోనిక.. ప్రస్తుతం బెలై ర్ లో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు.
→ న్యాయవాదిగా 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. అనేక పౌర హక్కుల సంస్థలలో భాగ స్వామిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు.
→ హ్యూస్టన్ ప్రాంతంలోనే సుమారు 20 వేల మంది సిక్కులు నివసిస్తున్నారు.

సుఖోయ్ యుద్ధవిమానాల సత్తా పెంపు

→ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన బ్రహ్మోస్, అస్త్ర వంటి క్షిపణులను జోడించడం వల్ల భారత్ వద్ద ఉన్న సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమా నాలు శక్తిమంతమయ్యాయి.
→ సరిహద్దుల్లో చైనా, పాకి స్థాన్ కవ్వింపుల నేపథ్యంలో ఇవి మన వైమానిక దళా నికి వ్యూహాత్మక పై చేయిని అందిస్తున్నాయి.
→ ఈ రకం యుద్ధవిమానాలు డ్రాగన్ దేశం వద్ద కూడా ఉన్నప్ప టికీ.. వాటికన్నా మన జెట్లు అత్యుత్తమమైనవని భారత వాయుసేన ఉన్నతాధికారి గ్రూప్ కెప్టెన్ అర్చిత్ కాలా పేర్కొన్నారు.
→చైనా, రష్యా, అర్మేనియా, ఇండోనేసియా, అల్జీరియా సహా.. దాదాపు 15 దేశాల వద్ద సుఖోయ్-30 యుద్ధవి మానాలు ఉన్నాయి.
→భారత్ మాత్రమే ఈ లోహవిహం గాలకు దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాన్ని కల్పించింది. ఎప్పటి కప్పుడు ఆధునిక ఆయుధాలను జోడించింది.
→భారత వైమానిక దళం వద్ద ఇలాంటివి 272 యుద్ధవిమానాలు ఉన్నాయి.
→"మన సువోయ్ లో ప్రపంచవ్యాప్తంగా, స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆధునిక టెక్నాలజీలు, ఆయుధాలను అమర్చాం, గాల్లో నుంచి గాల్లోకి, నేలపైకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల వల్ల ఈ జెట్ మరింత శక్తిమంతంగా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాల్లో ఒకటి" అని అర్చిత్ పేర్కొన్నారు.
→భారతీయ సుబోయ్ లు 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలవు.
→దాన్ని 700 కిలోమీ టర్లకు పెంచనున్నారు. దీనివల్ల శత్రుదేశాల గగన తల రక్షణ వ్యవస్థలను సునాయాసంగా ధ్వంసం చేయవచ్చు.
→అగ్ర మార్క్-1 క్షిపణి.. 100 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను నేలకూల్చగలదు. 300 కిలోమీ టర్ల దూరంలోని శత్రు యుద్ధవిమానాలను ధ్వంసం చేసేలా ఈ క్షిపణిని మెరుగుపరుస్తున్నారు.
→కొత్తతరం యాంటీ రేడియేషన్ ఆస్ట్రాలనూ సులో య్ అమర్చనున్నారు. దీనివల్ల 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు రాడార్లను నేలమట్టం చేయవచ్చు.
→లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల స్పైస్-2000 బాంబులనూ భారత సుఖోయ్ లో అమర్చారు.
→ఈ అస్త్రాలకు తోడు భారతీయ పైలట్ల నైపుణ్యం కూడా అదనపు హంగుగా నిలిచింది.
→ఈ యుద్ధ విమానం అద్భుతమైన విన్యాసాలను చేయ గలదు. గగనతలంలో పలుమార్లు ఇంధనాన్ని నింపు కోవడం ద్వారా సుదీర్ఘ ప్రయాణం చేయగలదు.

జైపుర్ లో సభాపతుల సదస్సు

→ రాజస్థాన్ రాజధాని జైపుర్ లో 83వ అఖిల భారత సభాపతుల సదస్సు జరగనుంది.
→ ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్డ్ ప్రారంభించనున్నారు.
→ జైపుర్ లో ఈ సదస్సు జరగడం ఇది నాలుగోసారి. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించను న్నారు.
→ అందులో
→ 1. ప్రజాస్వామ్య మాతగా జీ-20 సదస్సుకు భారత్ నాయకత్వం వహించడం,
→ 2. పార్ల మెంటు, శాసన వ్యవస్థలను మరింత సమర్థంగా, జవా బుదారీగా, ఉత్పాదకంగా మార్చాల్సిన అవసరం,
→ 3. డిజిటల్ పార్లమెంటుతో రాష్ట్రాల శాసన సభలను అనుసంధానం చేయడం,
→ 4. రాజ్యాంగస్ఫూర్తిని అను సరించి శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి సంబంధించిన అంశాలు న్నాయి.
→ ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అన్ని రాష్ట్రాల సభాపతులు, మండలి చైర్మన్లు పాల్గొంటారు.

చైనా విదేశాంగ మంత్రిగా చిన్ గాంగ్

→చైనా నూతన విదేశాంగ మంత్రిగా చిన్ గాంగ్ బాధ్యతలు చేపట్టారు.
→ఇదివరకు ఆయన ఆమె రికాలో బీజింగ్ రాయబారిగా ఉన్నారు.
→మాజీ విదే శాంగ మంత్రి వాంగ్ యి స్థానంలో చిన్ గాంగ్ నియ మితులయ్యారు.
→మరోవైపు తమ విదేశాంగ శాఖ అధి కార ప్రతినిధి ఝావో లిజియాను కూడా చైనా బదిలీ చేసింది.
→ఆయనను సరిహద్దులు, సముద్ర వ్యవహారాల విభాగానికి పంపించింది. ఈ మార్పుపై అధికారిక ప్రక టన వెలువడలేదు.
→అయితే, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అధి కార ప్రతినిధుల జాబితా నుంచి ఝావో లిజియన్ను తొలగించి... సరిహద్దులు, సముద్ర వ్యవహారాల విభాగ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పేర్కొన్నారు.

భారత్ నుంచి 75 దేశాలకు ఆయుధాల ఎగుమతులు

→ భారత రక్షణ ఎగుమతులు గడిచిన ఐదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయని, ప్రస్తుతం భారత్ 75 దేశా లకు రక్షణకు సంబంధించిన ఎగుమతులు చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
→ 'సమష్టి కృషి, భాగస్వామ్యం' అన్న సహకార భావనే భారతన్ను.. రక్షణ రంగంలో ఇతర దేశాలతో పోల్చితే ప్రత్యేక స్థానంలో నిలుపుతోందని ఆయన వివరించారు.
→ 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా చేసే ప్రయత్నాలు కేవలం భారత్కు మాత్రమే ప్రయోజనం చేకూర్చాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు.
→బెంగళూరులో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు నిర్వహించనున్న 'ఏరో ఇండియా' 14వ ఎడిషన్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్కు సంబంధించిన ప్రతి నిధుల రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది.
→ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. భారత్లోని మానవ వనరులు, నైపుణ్య శక్తి, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక రంగంలో విస్తృత నవీన ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నాయన్నారు.
→ 20 మూడు అభివృద్ధి (డెవలప్మెంట్), ప్రజా స్వామ్యం(డెమోక్రసీ), వైవిధ్యం (డైవర్సిటీ) అనే మూడు 'డీ'లు ప్రపంచానికి భారత్ తెలియజేస్తుంది.

మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా వికాస్ పురోహిత్

→ సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్ మెటా తమ గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా వికాస్ పురోహిత్ను నియమించింది.
→ఈయన యాడ్స్ బిజినెస్ ఫర్ మెటా ఇన్ ఇండియా అధిపతి, డైరెక్టర్ అరుణ్ శ్రీని వాస్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
→దేశంలోని ప్రముఖ ప్రకటనదార్లు, ఏజెన్సీ భాగస్వాముల పై దృష్టి సారించిన చార్టర్ వ్యూహం, డెలివరీకి నాయకత్వం వహించాలని వికాస్ ను కంపెనీ కోరింది.
→'వికాస్ ను మా జట్టులోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నా. దేశంలో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్ను నిర్మించడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధికి మద్దతు అంది స్తామ'ని అరుణ్ శ్రీనివాస్ తెలిపారు.
→పురోహిత్ బెంగళూరు ఐఐఎం పూర్వ విద్యార్థి. టాటా క్లిక్, అమెజాన్, రిలయన్స్ బ్రాండ్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల్లో 20 ఏళ్లకు పైగా పని చేశారు.
→మెటాలో చేరడానికి ముందు ఈయన టాటా క్లిక్ సీఈఓగా పని చేస్తున్నారు.

కీలక ఆయుధ కొనుగోళ్లకు రక్షణశాఖ ఆమోదం

→ సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ మూడు కీలక ఆయుధ సమీక రణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.
→వీటి విలువ రూ.4,276 కోట్లు. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటి ప్రకారం...

→1 ట్యాంకు విధ్వంసక హెలీనా గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు సమ్మతి.
→ఈ అస్త్రాలు, లాంచర్లు, సంబంధిత ఇతర సాధన సంపత్తిని సైన్యంలోని అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్ హెచ్)కు అనుసంధానిస్తారు. దీనివల్ల భారత బలగాల దాడి సామర్థ్యం పెరుగుతుంది.

→చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల రక్షణ వ్యవస్థకు ఊతమివ్వడానికి 'వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్' (వీఎస్ హెచ్ఆర్ఎండీ) క్షిపణుల సమీకరణకు పచ్చ జెండా.
→వీటిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఈ వ్యవ స్థను సైనికుడు తన భుజం మీద మోసుకె ళ్లొచ్చు. అవసరమైన ప్రాంతాల్లో వేగంగా మోహరించొచ్చు.
→ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సమర్థ గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

→నౌకాదళంలోని శివాలిక్ తరగతి యుద్ధనౌ కలు, భవిష్యత్ తరం పోరాట నౌకలైన 'నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసెల్' (ఎన్ఐఎంవీ) కోసం బ్రహ్మోస్ లాంచర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల కొనుగోలుకూ డీఏసీ ఆమోదం తెలిపింది.
→వీటి వల్ల ఆ యుద్ధనౌకల పోరాట సామర్థ్యం రాటు లుతుంది.


నకిలీ వార్తల గుట్టురట్టు చేసే సరికొత్త విధానం

→ ఇంటర్నెట్లో హింసాత్మక ధోరణి, అతివాదం, నకిలీ వార్తలను వ్యాప్తిచేసే గ్రూప్లను బట్టబయలు చేసే సరి కొత్త విధానం సిద్ధమైంది.
→ ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయ సైబర్ పరిశోధకుడు మైఖేల్ ఫైర్ ఆధ్వర్యం లోని శాస్త్రవేత్తల బృందం దీన్ని రూపొందించింది.
→ తప్పుడు, నకిలీ గ్రూపులు పెద్ద బెడదగా మారాయి. ఇంటర్నెట్ ఉనికికే అవి శాపమయ్యాయి. ఇలాంటివి నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
→ ఈ గ్రూపుల నిజస్వరూపాన్ని బయట పెట్టే విధానాలను పెద్దగా ఎవరూ అభివృద్ధి చేయలేదని బెన్ గురియన్ విశ్వవిద్యాలయం పేర్కొంది.
→ "ఇలాంటి ముఠాలను వెలుగులోకి తీసుకురావడం సవాల్తో కూడుకున్న వ్యవహారం.
→ మేం రూపొందించిన కోమెంబర్షిప్ బేస్డ్ జెనిరిక్ అనామ లస్ కమ్యూనిటీస్ డిటెక్షన్ అల్గోరిథమ్ (సీఎంఎంఏసీ).. ఈ ఇబ్బందిని అధిగమిస్తుంది.
→ నకిలీ వివరాలతో గ్రూపు లను ఏర్పాటు చేసేవారిని ఇట్టే పసిగడుతుంది. మహ మ్మారుల సమయంలో హాట్స్పట్లను గుర్తించడంలోనూ సాయపడుతుంది" అని మేజేల్ పేర్కొన్నారు.
→ ఇది భిన్న కాల సామాజిక మాధ్యమాలపై పనిచేస్తుందన్నారు.

క్యాన్సర్కు క్యాన్సర్ కణాలతోనే అడ్డుకట్ట

→ క్యాన్సర్ కణాలను సమర్థ క్యాన్సర్ నిరోధక సాధనాలుగా మార్చి, వాటితో టీకాలను రూపొందించే సరి కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.
→ ఇది కణితులను చంపేయడం 'తో పాటు దీర్ఘకాల రోగనిరో ధక శక్తిని కలిగించి, క్యాన్సర్ పునరా వృతం కాకుండా చూస్తుందని వారు పేర్కొన్నారు.
→ఎలుకల్లో గ్లియోబ్లాస్టోమా అనే మెదడు క్యాన్సర్పై ఈ టీకాను పరీక్షించి చూశారు. క్యాన్సర్ టీకాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతు న్నాయి.
→బ్రిగ్ హామ్ అండ్ వుమెన్స్ హాస్పిట లక్కు చెందిన ఖలీద్ షా బృందం అనుసరిం చిన విధానం వినూత్నంగా ఉంది.
→టీకాల కోసం క్రియారహితం చేసిన కణితి కణాలకు బదులు సజీవ ట్యూమర్ కణాలను వీరు ఉపయోగించారు. వీటికి ఒక లక్షణం ఉంది.
→అవి మెదడులో చాలా దూరం ప్రయాణించి, కణితి కణాలున్న ప్రాంతాలకు చేరుకోగలవు. ఈ ప్రత్యేకతను శాస్త్రవేత్తలు చక్కగా ఉపయో గించుకున్నారు.
→క్రిస్చర్-కాస్9 జన్యు ఎడిటింగ్ విధానంతో ఈ కణాలకు మార్పులు చేశారు. క్యాన్సర్ కణాలను హత మార్చే మందును విడుదల చేసే సాధనాలుగా తీర్చిదిద్దారు.
→వీటిని థెరాస్టిక్ ట్యూమర్ సెల్స్ (టీహెచీటీసీ)గా పిలుస్తు న్నారు. ముందుజాగ్రత్తగా ఈ కణాల్లో రెండంచెల భద్రత 'స్విచ్'ను ఏర్పాటు చేశారు.
→దాన్ని క్రియాశీలం చేస్తే ఆ సెల్స్ అంతమవుతాయి. ఇవి సురక్షితమైనవని, సమర్థంగా పనిచేస్తాయని ప్రయోగాల్లో వెల్లడైంది.

75 ఏళ్లకు విద్యుత్తు.. కశ్మీరీ గ్రామస్థుల సంబరాలు

→జమ్మూ-కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా డోరూ బ్లాకులోని టెధన్ గ్రామ ప్రజలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్తు సౌక ర్యాన్ని పొందారు.
→ఇన్నేళ్లు కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తుల మధ్యే రాత్రిళ్లు గడిపిన ఆ పల్లెవా సులు తొలిసారిగా లైటు వెలగడం చూశారు.
→అధికారులు ఎంతో కష్టపడి కొండ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి 63 కేవీ ట్రాన్స్ఫార్మరుతో విద్యుత్తు సౌకర్యం కల్పించారు.
→గ్రామంలో మొత్తం 60 కుటుంబాలతో దాదాపుగా 200 మంది జనం ఉంటారు. కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య పథకం కింద గ్రామంలోని ఇంటింటికి విద్యుత్తును చేరవేసినట్లు అధికారులు తెలిపారు.
→గ్రామస్థులు విద్యుత్తు సిబ్బందిని పూలమాలలతో సత్కరిం చారు. మేళతాళాలతో వేడుక చేసుకున్నారు.

87 దేశాలు చుట్టేసిన అమ్మ

→ప్రపంచ దేశాల్లో పర్యటించడమంటే ముంబయికి చెందిన ట్రావె లర్ అనిందితా ఛటర్జీ (41)కి మహా సరదా.
→కుటుంబసభ్యులు ఆమె ఆసక్తిని గమనించి సహకరించారు. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి కూడా ఆమె విదేశీ పర్యటనలు కొనసాగించారు.
→ఈ క్రమంలో 2017లో ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించి తన పర్యటనల విశేషాలను అందులో పంచుకోవడం మొదలు పె ట్టారు.
→2020లో ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి పూర్తి సమ యాన్ని ట్రావెలింగుకే కేటాయించారు. తాను గర్భవతినని తెలి సేసరికి ఆమె మెక్సికోలో ఉన్నారు.
→కుటుంబసభ్యులు వెంటనే వెనక్కు వచ్చేయమని చెప్పినా.. వినలేదు. గర్భవతిగా నాలుగు దేశాల్లో పర్యటించారు అనిందిత.
→ కాన్పు అయ్యాక.. 45 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. పాపకు ఏడాది పూర్తయ్యేసరికి 14 దేశాల్లో పర్యటించి అక్కడి విశే షాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫాలోవర్లకు చేరవేశారు.
→ ట్రావెలింగు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 87 దేశాల్లో పర్యటించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 10 కిలోమీ టర్లు నడుస్తానని అనిందిత చెప్పారు.
→ పాప పుట్టిన తర్వాత వీలైంత వరకు పగటిపూట ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు.
→ మహిళలు చిన్న చిన్న కారణాలతో ఆత్మస్థయిర్యాన్ని కోల్పోవద్దని, కలలను నెర వేర్చుకునేందుకు శ్రమించాలని అనిందిత చెబుతున్నారు.

ఆహార సంక్షోభం అంచున పాక్

→ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిండుకుంటున్న విదేశీ మారక నిల్వలు పాకిస్థా న న్ను ఆహార సంక్షోభం అంచున నిలబెట్టాయి.
→ ఆఖరికి ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ పిండికీ దేశంలో తీవ్ర కొరత ఏర్ప ఉంది.
→ సబ్సిడీ అందిస్తున్న గోధుమ పిండి కోసం వేల మంది ప్రజలు గంటల కొద్దీ క్యూల్లో వేచి చూస్తున్నారు.
→ ఖైబర్ పబ్లూన్భ్వా, సింద్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో బారులు తీరి ఉన్న వరుసల్లో తొక్కిసలాటలూ, తోపులాటలూ నిత్యకృత్యమయ్యాయి.
→ సింధ్ ప్రావిన్స్లోని రేషన్ దుకాణం వద్ద తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. కొన్నిచోట్ల భద్రతా బల గాల పర్యవేక్షణలో పంపిణీ చేసే పరిస్థితి ఏర్ప డింది.
→ ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకు నేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తుండటంతో కేజీ గోధుమ పిండి ధర రూ.150కి పెరిగిపోయింది.
→ ఆకలి చావులు ఆపేందుకు తక్ష బలూచిస్థాన్ మే 4 లక్షల గోధుమ పిండి బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
→ పాక్ లో ఆహార సంక్షోభం. రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
→ గోధుమలను ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవాలో ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని స్థానిక పత్రిక పేర్కొంది.
చుక్కల్లో నిత్యావసరాల ధరలు :-
→2022లో వచ్చిన వరదలతో అప్పటికే బలహీ నంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.
→ ద్రవ్యోల్బణం పైపైకి వెళ్లిపోవ డంతో ప్రస్తుతం నిత్యావసరాలు కొనుగోలు చేయడమే గగనంగా మారింది.
→ 2022 జనవ రిలో రూ.36.7గా ఉన్న కేజీ ఉల్లిపాయల ధర 501 శాతం పెరిగి ఏకంగా రూ. 220, 48 చేరింది.
→ అరటిపళ్లు డజను రూ. 119, కేజీ చికెన్ రూ.384, లీటరు పాలు రూ.149.7.. ఇలా ప్రతి వస్తువూ సామాన్యులకు చుక్కలు చూపి స్తోంది.
→ పెట్రోల్ ధరలు 48 శాతం, డీజిల్ ధరలు 61 శాతం పెరిగాయి.
→ పాక్ విదేశీ మారక నిల్వలు 580 కోట్ల డాలర్లకు పడిపోయి ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరాయి. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తెలిపింది.

రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్ల అరంగేట్రం

→ వృందా , జనని నారాయణన్, గాయత్రి వేణుగోపా లన్ చరిత్ర సృష్టించారు.
→ రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లుగా ఆరంగేట్రం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. మంగళవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్ ల్లో ఈ ముగ్గురు అంపైర్లుగా బాధ్య తలు నిర్వర్తించారు.
→ జార్ఖండ్, చత్తీస్గఢ్ మధ్య మ్యాచ్లో గాయత్రి, రైల్వేస్, త్రిపుర పోరులో జనని, గోవా, పాండిచ్చేరి మ్యాచ్లో వృందా అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు.
→ ఐటీ ఉద్యోగం చేసే జననికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తాను అంపైర్ కావాలనుకుంటున్నట్లు తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ)కు పలు దఫాలు విజ్ఞప్తి చేసింది.
→ కొన్నేళ్ల తర్వాత టీఎన్సీఏ నియమావళిని మార్చి మహిళలకు అవ కాశమిచ్చింది. 2018లో బీసీసీఐ లెవెల్ -2 పరీక్ష పాసైన జనని.
→ 2021లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ అంపైర్గా విధులు నిర్వహించింది.
→ముంబయి మైదానాల్లో స్థానిక మ్యాచ్లకు స్కోరర్గా వ్యవహరించిన వృందా.. 2013 మహి కల ప్రపంచకప్లో బీసీసీఐ స్కోరర్ గా పనిచేసింది. అనం తరం అంపైరింగ్ కు మారింది.
→ క్రికెటర్ కావాలనుకున్న గాయత్రి భుజం గాయం కారణంగా నిర్ణయం మార్చుకుంది. 2019లో బీసీసీఐ అంపైర్ గా కెరీర్ మొదలుపెట్టింది.

సచిన్ సరసన కోహ్లి

→లంకపై మూడంకెల స్కోరు అందుకున్న విరాట్ కోహ్లి కొన్ని ఘనతలను కూడా ఖాతాలో వేసు కున్నాడు.
→వన్డేల్లో 45వ శతకం సాధించిన అతడికి స్వదేశంలో ఇది 20వ సెంచరీ. సచిన్ పేరిట ఉన్న స్వదేశంలో అత్యధిక వన్డే శతకాలు (20) ఘనతను కోహ్లి సమం చేశాడు.
→ఈ రికార్డు సాధించడానికి సచిన్ 160 ఇన్నింగ్స్ లు ఆడగా.. కోహ్లికి కేవలం 99 ఇన్నింగ్స్లోనే సాధించాడు.
→శ్రీలంకపై అత్యధిక సెంచ రీలు సాధించిన భారత ఆటగాడిగా సచిన్ (8) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (9) అధిగ మించాడు.

ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

→ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియ మించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
→ ప్రస్తుతం న్యాయాధికారులుగా పని చేస్తున్న పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపా లకృష్ణారావులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని మంగు ళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో సమా వేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో జనవరి 1వ తేదీ నాటికి 30 మంది సేవలంది. వస్తున్నారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
→ ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరు తుంది.
→ దేశంలోని మొత్తం 5 హైకోర్టులకు 9 మంది పేర్లను కౌలీజియం సిఫార్సు చేసింది.
→ ఇందులో కర్ణాటక హైకోర్టుకు ముగ్గురు, ఆంధ్ర ప్రదేశ్, మణిపుర్ హైకోర్టులకు ఇద్దరు చొప్పున, బాంబే, గువాహటి హైకోర్టు లకు ఒక్కొక్కరి చొప్పున పేర్లను ప్రతిపాదించింది.

వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ No.1

→ వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడింది.
→ ఈ పెట్టుబడులతో వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించి, రైతులకు మరిన్ని మౌలిక సదుపా యాలు ఒనగూరుతాయి.
→ భారత వ్యవసాయ రంగా నికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో 'వ్యవ సాయ గణాంకాలు-2021' నివేదికను కేంద్ర వ్యవసా యశాఖ తాజాగా విడుదల చేసింది.
→ అందులోని వివ రాల ప్రకారం... 2019 అక్టోబరు నుంచి 2021 సెప్టెం బరు మధ్యకాలంలో 17 రాష్ట్రాలకు 187.85 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
→ వీటిలో తెలంగాణకు అత్యధికంగా 49.44 మిలియన్ డాలర్లు, బిహార్ కు 39.5, గుజరాత్కు 30.49, తమిళనాడుకు 20.07 మిలియన్ డాలర్లు అందాయి.
→ చివరి మూడు స్థానాల్లో ఏపీ (0.12 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ (0. 11), ఒడిశా(0.01) నిలిచాయి. బిహార్, పశ్చిమబెం గాల్ వంటి రాష్ట్రాల వ్యవసాయరంగాలకు సైతం ఏపీకంటే ఎక్కువ పెట్టుబడులు రావడం గమనార్హం.

భారతీయ అమెరికన్ కు నాసాలో కీలక పదవి

→భారత సంతతికి చెందిన ఏరోస్పేస్ నిపుణుడు ఎ.సి. చారణియాను ప్రతిష్టాత్మక పదవి వరించింది.
→అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చీఫ్ టెక్నాలజిస్టుగా ఆయన నియమితులయ్యారు.
→సాంకే తిక విధానాలపై ఈ సంస్థ అధిపతి బిల్ నెల్సను ఆయన ముఖ్య సలహాదారుగా ఉంటారు.
→వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు.
→ఇప్పటివరకూ తాత్కాలికంగా ఆ పదవిలో ఉన్న భారత అమెరికన్ శాస్త్రవేత్త భవ్యా లాల్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
→ఈ హోదాలో.. నాసాలో సాంకే తిక పెట్టుబడులు, ఆరు మిషన్ డైరెక్టరేట్ల అవసరాలను చారణియా పర్య వేక్షిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ సంస్థలతో సాంకేతిక భాగస్వామ్యా లపై సలహాలిస్తారు.
→వేగంగా మార్పులకు లోనయ్యే సాంకేతిక రంగాల పర్యవేక్షణలో ఆయనకు మంచి అనుభవం ఉందని భవ్యా లాల్ పేర్కొ న్నారు.
→నాసాలో చేరడానికి ముందు ఆయన రిలయబుల్ రోబోటిక్స్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు.
→బ్లూ ఆరిజిన్, వర్జిన్ ఆర్బిట్, స్పేస్ వర్క్స్ ఎంటర్ప్రైజెస్ వంటి సంస్థల్లోనూ చారణియా పనిచేశారు.

దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ

→ జాతీయ రాజధాని దిల్లీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
→ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) 2022 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
→ ఇక్కడి గాలిలో సూక్ష్మధూళి కణ కాలుష్యం 2.5 పీఎం స్థాయులు సురక్షిత పరిమితి కంటే రెట్టింపు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
→ అయితే, గత నాలుగేళ్లలో దిల్లీ కాలుష్యం ఏడు శాతం మేర తగ్గటం గమనార్హం. 2019లో ఇది క్యూబిక్ మీటరుకు 108 మైక్రోగ్రాములు ఉండగా, 2022 నాటికి 99.71 మైక్రోగ్రాములకు తగ్గింది.
→ ఈ కాలుష్యాన్ని 2024 నాటికి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలని ఎన్సీఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.
→ దిల్లీ తర్వాత క్యూబిక్ మీటరుకు 95.64 మైక్రోగ్రాములతో హరియాణాలోని ఫరీదాబాద్ కాలుష్య నగరాల్లో ద్వితీయస్థానంలో ఉంది.
→ ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ 91.25 మైక్రోగ్రాములతో తృతీయ స్థానంలో నిలిచింది.
→ దేశవ్యాప్తంగా నగరాల్లో గాలి కాలుష్య స్థాయులు విశ్లేషిస్తే 2022 నాటికి గాలి నాణ్యతలో కొంత మెరుగుదల ఉన్నట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ ఆర్తీ భోస్లా తెలిపారు.
→దేశంలోని 102 నగరాల్లో గాలిలో కాలుష్యం తగ్గిం చడానికిగాను కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో 2019 జనవరి 10న ఎన్సీఏపీ ఏర్పాటు చేసింది.
→ఈ జాబి తాను తర్వాత సవరించి, కొన్ని నగరాల పేర్లు తొల గించి.. మరికొన్ని పేర్లను చేర్చారు.
→ప్రస్తుతం ఈ జాబి తాలో ఉన్న 131 నగరాలను లక్ష్యానికి దూరంగా ఉన్న నగరాలుగా పేర్కొం టున్నారు.
→జాతీయ గాలి నాణ్యత ప్రమా ణాలను ఈ నగరాలు సాధించాల్సి ఉంది.
→గతేడాది సెప్టెంబరులో కాలుష్య నియంత్రణ లక్ష్యాన్ని 40 శాతంగా సవరించిన ప్రభుత్వం 2026 నాటికి దీన్ని సాధించాలని గడువు విధించింది.

కెనడాలో యుకాన్ 10వ ప్రీమియర్గా భారత సంతతి వ్యక్తి రంజ్ పిళై

→కెనడాలోని యుకాన్ ప్రాంత ప్రభుత్వ 10వ పాలనాధిపతి (ప్రీమియర్)గా భారత సంతతికి చెందిన రంజ్ పిళ్లై ఈ నెల 14న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
→ప్రస్తుతం ఆయన కెనడా ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
→దేశం లోని ఓ ప్రాంతానికి పాలనాధిపతిగా భారత సంతతి వ్యక్తి ఎంపికవడం ఇది రెండోసారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది.
→కేరళ మూలాలు కలిగిన పిళ్లైను ఈ నెల 8న యుకాన్ లిబరల్ పార్టీ తమ అధి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
→పిళ్లైకు ముందు ఉజ్జల్ దోసంజ్ బ్రిటిష్ కొలంబియా రాష్ట్రానికి 2000-2001 మధ్య ప్రీమియర్ గా వ్యవహరించారు.

విశ్వాస పరీక్షలో నెగిన నేపాల్ ప్రధాని ప్రచండ

270 మంది సభ్యుల్లో 268 మంది మద్దతు
→ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ పార్లమెంటు విశ్వాస పరీక్షలో విజయం సాధిం చారు.
→ ఓటింగ్ లో ప్రతినిధుల సభలో పాల్గొన్న 270 మందికిగానూ అనూహ్యంగా 268 మంది ప్రచండకు మద్దతు ప్రకటించారు.
→ నేపాల్ చరి త్రలో ఏ ప్రధానికైనా ఇదే అత్యధికం. 275 మంది సభ్యులు ఉన్న నేపాల్ పార్లమెంటులో ప్రధానిగా ఉండా లంటే 198 మంది మద్దతు సరిపోతుంది.
→ నలుగురు సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ఒక్కొక్క సభ్యుడిని కలిగిఉన్న పీపుల్స్ ఫ్రంట్ నేపాల్, నేపాల్ వర్కర్స్ అండ్ పీసంట్స్ పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రచండను బలపరిచాయి.
→ ఎన్నికల్లో 89 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపాలీ కాంగ్రెస్ సైతం ప్రచండకు మద్దతు ఇవ్వడం విశేషం.

పృథ్వి-2 పరీక్ష విజయవంతం

→ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన బాలిస్టిక్ క్షిపణి పృద్వి-2 ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
→ ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు.
→ సైనిక దళాల శిక్షణ అభ్యాసంలో భాగంగా దీన్ని నిర్వహించినట్లు పేర్కొ న్నారు. తాజా ప్రయోగంలో క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలనూ పరిశీలించినట్లు వివరించారు.
→ ఈ క్షిపణికి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది.

దేశవ్యాప్తంగా ఇదీ ఆహార ధాన్యాల లభ్యత తీరు

→దేశ ప్రజలకు తలసరి ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతోంది. 1951లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి 144 కిలోలుంటే 2021 నాటికి 185.4కి పెరిగింది.
→అత్యధికంగా.. 1991లో తలసరి లభ్యత 188. 2 కిలోలుండగా ఇప్పుడు అంతకన్నా 800 గ్రాములు తగ్గడం గమనార్హం.
→వార్షిక తలసరి బియ్యం లభ్యత 1951లో 58 కిలోలు, పప్పులు 22.1 కిలో లుగా ఉంటే 2021లో బియ్యం 71.9, పప్పులు 16.4కి తగ్గాయి.
→పప్పుల వార్షిక తలసరి లభ్యత 1955లో 25.7 కిలోలుండగా ఇప్పుడు 16. 3 కిలోలు. పేదలకు పోషకాహారం అందాలంటే పప్పులు ముఖ్యం.
→అవి లేనందునే దేశ ప్రజల్లో పోషకాహార లేమి పెరుగుతోంది.
→వంట నూనెల తలసరి వినియోగం 1960-61లో 3.2 కిలోల నుంచి 2020- 21కు 19.7 కిలోలకు, ఇదే కాలవ్యవధిలో టీ పొడి వినియోగం 296 కిలోల నుంచి 863 కిలోలకు, కాపీ పొడి వినియోగం 80 గ్రాముల నుంచి 100 గ్రాములకు పెరిగింది.
→బియ్యం వినియోగం గ్రామాల్లో ఎక్కువగా ఉంది. 2011-12లో గ్రామాల్లో ఏడాదికి 74.56 కిలోల బియ్యం వినియోగమైతే పట్టణాల్లో 54.02 కిలో లుంది.
→అదే ఏడాది కూరగాయల వార్షిక తలసరి జాతీయ సగటు విని యోగం 52.61 కిలోలుగా ఉంది.
→ఆహార ధాన్యాలపై కేంద్రం ఇస్తున్న రాయితీ 2009-10లో రూ.58,200 కోట్లు ఉంటే 2021-22లో రూ.1,94,100 కోట్లకు పెరిగింది.