పుస్తకాలు

చేప వంటకాలతో కేంద్ర మత్స్యశాఖ పుస్తకం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పేరొందిన 75 రకాల చేప వంటకాలతో పుస్తకం విడుదల చేసింది. సముద్ర ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంతో పాటు, విభిన్న రాష్ట్రాల్లోని వంటలను అందరికీ పరిచయం చేయడంలో భాగంగా దీన్ని వెలువరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు, పులస పులుసు, చేపల వేపుడు వంటలకు స్థానం కల్పించింది. ఆ వంటలు తయారుచేసే విధానాన్ని కూడా ఇందులో వివరించింది.

‘మెట్రో’ నిర్మాణ కష్టాలకు అక్షరరూపం ‘మేఘపథం’

మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి రచించిన 58 దీర్ఘ కవితల సంకలనం ‘మేఘపథం.. మెట్రో కవితా ఝరి’ పుస్తకాన్ని జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్‌.గోపి ఆవిష్కరించారు. ఈ పుస్తకం మెట్రోరైలు నిర్మాణ సమయంలో ఎన్వీఎస్‌ రెడ్డి ఎదుర్కొన్న కష్టాలకు అక్షరరూపం.