దినోత్సవాలు



జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 13వ వ్యవస్థాపక దినోత్సవం

→ఉగ్రవాదం మానవ హక్కుల ఉల్లంఘనకు అతిపెద్ద రూపమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఉగ్రవాద నిరోధానికి తీసుకునే చర్యలు మానవ హక్కులకు విరుద్ధం కాదని చెప్పారు.
→దిల్లీలో నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 13వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు.
→జమ్మూ - కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు, సహకారం అందిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అమిత్‌ షా చెప్పారు.
→ఉగ్రవాదం సమాజానికి అతిపెద్ద శాపమని, ఉగ్రవాదాన్ని అత్యధికంగా భరించే దేశం భారత్‌ మాత్రమేనని పేర్కొన్నారు.

జాతీయ సివిల్‌ సర్వీసెస్‌ డే

→పాలనలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఐఏఎస్‌ అధికార్లకు దిశానిర్దేశం చేశారు.
→స్థానికంగా తీసుకొనే నిర్ణయాల్లోనూ దేశ ఐక్యత, సమగ్రతకే పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు.
→విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ డేలో మోదీ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన అధికారులకు అవార్డులు అందజేశారు.
→ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న అఖిల భారత సర్వీసు అధికారులను ఉద్దేశించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు.
→ విధులు నిర్వహించే అంశంలో వారికి ఎదురవుతున్న అడ్డంకులపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి ప్రతిభను గుర్తించేందుకు, పదోన్నతులకు పనితీరే గీటురాయిగా ఉండాలన్నారు.
→ఈ అంశంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.