కమిటీలు



వ్యవసాయ మండలికి అడహాక్‌ కమిటీ

→ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మండలికి అడ్‌హాక్‌ కమిటీని ప్రభుత్వం నియమించింది.
→అధ్యక్షుడిగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంత డీఆర్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చి) డాక్టరు ఎన్‌.త్రిమూర్తులు, ఉపాధ్యక్షుడిగా పశ్చిమగోదావరికి చెందిన విశ్రాంత ఏడీఏ కమలాకరశర్మతో పాటు 20 మంది సభ్యులు నియమితులయ్యారు.
→వ్యవసాయశాఖలో పనిచేసిన విశ్రాంత అధికారులతోపాటు పలువురు వ్యవసాయ అధికారులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పాటు వికాస ఎన్జీవో ఈడీ ఎస్‌.కిరణ్, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఉపాధ్యక్షుడు కె.సత్యనారాయణ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
→ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టరు టి.గిరిధర్‌ కృష్ణ, ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ కె.గోపాల్‌తోపాటు మరో ఏడుగురు వ్యవహరిస్తారు.
→సభ్యులుగా నియమితులైనవారిలో వ్యవసాయ మంత్రి కార్యాలయంలో పనిచేసిన ఓ విశ్రాంత అధికారితో పాటు గతంలో, ప్రస్తుతం యూనియన్ల బాధ్యతలు నిర్వహిస్తున్న వారూ ఉన్నారు.
→వీరి నియామకంపై వ్యవసాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్య మండలి తరహాలోనే వ్యవసాయ, ఉద్యాన పట్టభద్రుల గుర్తింపు వ్యవసాయ, ఉద్యానవిద్య అర్హతల గుర్తింపు అధికారం మండలికి ఉంటుంది. వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు తప్పనిసరిగా గుర్తింపు పొందాలి.
→వ్యవసాయ, ఉద్యాన పట్టభద్రులు మండలిలో నమోదు చేయించుకోవాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరహాలోనే వ్యవసాయ మండలి విధులు నిర్వహిస్తుంది.